AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Sunday, 26 November 2017

వార్తల్లో వ్యక్తులు ఫిబ్రవరి 2013

వార్తల్లో వ్యక్తులు ఫిబ్రవరి 2013
ఐఆర్‌డీఏ చైర్మన్‌గా విజయన్జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) మాజీ చీఫ్ టీఎస్ విజయన్ ఫిబ్రవరి 21న ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఐఆర్‌డీఏ) చైర్మన్‌గా జె.హరినారాయణ స్థానంలో బాధ్యతలు స్వీకరించారు. ఈయన ఐఆర్‌డీఏకి మూడో చైర్మన్ (ఐఆర్‌డీఏ చైర్మన్ పదవీ కాలం ఐదేళ్లు లేదా 65 ఏళ్ల వయసు వరకు పదవిలో కొనసాగవచ్చు). 
ఈక్వెడార్ అధ్యక్షుడిగా రఫెల్ కొర్రియా ఈక్వెడార్ అధ్యక్షుడిగా రఫెల్ కొర్రియా తిరిగి ఎన్నికయ్యారు. ఫిబ్రవరి 17న జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఆయనకు 57 శాతం ఓట్లు లభించాయి. కొర్రియా ప్రత్యర్థి గ్వులెర్మో లాస్సోకు 23.8 శాతం ఓట్లు వచ్చాయి. కొర్రియా తొలిసారి 2007లో అధికారం చేపట్టారు.

రాజీనామా ప్రకటించిన పోప్ బెనడిక్ట్-16రోమన్ కేథలిక్ మతాధిప తి పోప్ బెనడిక్ట్- 16 తన పదవికి ఫిబ్రవరి 28న రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. 85 ఏళ్ల బెనడిక్ట్ వద్ధాప్యం వల్ల రాజీనామా చేస్తున్నట్లు వాటికన్‌లో ఫిబ్రవరి 11న తెలిపారు. గత 600 ఏళ్లలో పోప్ తన పదవికి రాజీనామా చేయడం ఇదే తొలిసారి. పోప్ అసలుపేరు జోసెఫ్ రాజింగర్. 1927లో జర్మనీలో జన్మించారు. ఇంతకుముందు 1415లో పోప్ గ్రెగరీ- 12 రాజీనామా చేశారు.

అమెరికా ఇంజనీరింగ్ అకాడెమీలో రతన్ టాటాకు సభ్యత్వంఅమెరికా ‘నేషనల్ అకాడెమీ ఆఫ్ ఇంజనీరింగ్‌లో టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటాకు సభ్యత్వం దక్కింది. ప్రతిష్టాత్మకమైన ఈ అకాడెమీలో విదేశీ సభ్యుడిగా ఆయనను ఎంపిక చేసినట్లు ఫిభ్రవరి 9న ప్రకటించారు. ఇంజనీరింగ్‌లో అత్యున్నత స్థాయిలో కషి చేసిన వారికి ఈ సభ్యత్వం కల్పిస్తారు. ఈ అకాడెమీకి కొత్తగా 69 మందిని ఎంపిక చేయగా అందులో 8 మంది భారతీయ అమెరికన్‌లు ఉన్నారు.

సొలిసిటర్ జనరల్‌గా మోహన్ పరాశరన్కొత్త సొలిసిటర్ జనరల్‌గా మోహన్ పరాశరన్ ఫిబ్రవరి 8న నియమితులయ్యారు. ఈయన ప్రస్తుతం అదనపు సొలిసిటర్ జనరల్‌గా ఉన్నారు. ఈ పదవిలో ఉన్న రోహింటన్ నారిమన్ ఫిబ్రవరి 3న రాజీనామా చేశారు. ‘సొలిసిటర్ జనరల్’ దేశంలో రెండో అత్యున్నత న్యాయాధికారి పదవి. దేశంలో అతి పెద్ద, రాజ్యాంగబద్ధమైన న్యాయాధికారి పదవి అటార్నీ జనరల్. ఈ పదవిలో గులాబ్ జి.ఇ. వాహన్‌వతి కొనసాగుతున్నారు.

No comments:

Post a Comment