క్రీడలు మార్చి 2017
ఆటగాళ్ల వార్షిక ఫీజుని రెట్టింపు చేసిన బీసీసీఐ 2016-17 సీజన్‌కు సంబంధించిన కొత్త కాంట్రాక్ట్‌లో భారత క్రికెట్ ఆటగాళ్ల వార్షిక ఫీజులని రెట్టింపు చేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 32 మంది ఆటగాళ్లతో కూడిన కాంట్రాక్ట్ జాబితాను మార్చి 22న వెల్లడించింది. దీంతో పాటు మ్యాచ్ ఫీజులను కూడా పెంచింది. ఇకపై ఒక టెస్టు మ్యాచ్ ఆడితే ఒక్కో ఆటగాడికి రూ. 15 లక్షలు లభిస్తాయి. టెస్టుల్లో రిజర్వ్ ఆటగాడికి రూ. 7 లక్షలు దక్కుతాయి. ఒక్కో వన్డేకు రూ. 6 లక్షలు, ఒక్కో టి-20 మ్యాచ్‌కు రూ.3 లక్షలు అందజేస్తారు. పెంచిన ఫీజులు 2016, అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయి.
కొత్త కాంట్రాక్ట్‌ల జాబితాగ్రేడ్ ‘ఎ’ (రూ. 2 కోట్లు): విరాట్ కోహ్లి, ధోని, అశ్విన్, అజింక్య రహానే, చతేశ్వర్ పుజారా, మురళీ విజయ్, రవీంద్ర జడేజా.
గ్రేడ్ ‘బి’ (రూ. 1 కోటి): రోహిత్ శర్మ, భువనేశ్వర్, మొహమ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, యువరాజ్ సింగ్, కేఎల్ రాహుల్ (ప్రమోషన్), వృద్ధిమాన్ సాహా (ప్రమోషన్).
గ్రేడ్ ‘సి’ (రూ. 50 లక్షలు): శిఖర్ ధావన్ (దిగువకు), అంబటి తిరుపతి రాయుడు (దిగువకు), అమిత్ మిశ్రా, మనీశ్ పాండే, అక్షర్ పటేల్, కరుణ్ నాయర్, హార్దిక్ పాండ్యా, ఆశిష్ నెహ్రా, కేదార్ జాదవ్, యజువేంద్ర చహల్, పార్థివ్ పటేల్, జయంత్ యాదవ్, మన్‌దీప్ సింగ్, ధావల్ కులకర్ణి, శార్దుల్ ఠాకూర్, రిషభ్ పంత్ (వీరిలో మిశ్రా, అక్షర్, ధావల్ గత ఏడాది కూడా ‘సి’లోనే ఉండగా మిగతా 11 మందికి తొలిసారి కాంట్రాక్ట్ లభించింది)
స్థానం కోల్పోయినవారు: సురేశ్ రైనా, హర్భజన్ సింగ్, స్టువర్ట్ బిన్నీ, మోహిత్ శర్మ, వరుణ్ ఆరోన్, కరణ్ శర్మ, శ్రీనాథ్ అరవింద్.
క్విక్ రివ్యూ:ఏమిటి : బీసీసీఐ వార్షిక కాంట్రాక్ట్ 2016-17
ఎప్పుడు : మార్చి 22
ఎవరు : భారత క్రికెట్ నియంత్రణ మండలి
ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచకప్‌లో అంకుర్ మిట్టల్‌కు స్వర్ణం మెక్సికోలో జరుగుతున్న ఐఎస్‌ఎస్‌ఎఫ్ షాట్‌గన్ ప్రపంచకప్‌లో అంకుర్ మిట్టల్ స్వర్ణం సాధించాడు. ఈ మేరకు మార్చి 23న జరిగిన డబుల్ ట్రాప్ ఈవెంట్ ఫైనల్లో 80 పాయింట్లకు గాను 75 పాయింట్ల సాధించి చాంపియన్‌గా నిలిచాడు. ఇటీవల భారత్‌లో జరిగిన ప్రపంచకప్‌లో రన్నరప్‌గా నిలిచిన అంకుర్ రజత పతకాన్ని పొందాడు.
క్విక్ రివ్యూ:ఏమిటి : ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచకప్‌లో భారత్‌కు స్వర్ణం
ఎప్పుడు : మార్చి 23
ఎవరు : అంకుర్ మిట్టల్
ఎక్కడ : మెక్సికో
మహిళల ప్రొఫెషనల్స్ గోల్ఫ్ టూర్ విజేత వాణి కపూర్ హీరో వుమెన్స్ ప్రొఫెషనల్స్ గోల్ఫ్ టూర్ టైటిల్‌ను ఢిల్లీకి చెందిన వాణి కపూర్ సొంతం చేసుకున్నారు. ఈ మేరకు పుణెలో మార్చి 25న జరిగిన చివరి రోజు పోటీల్లో ఆమె విజేతగా నిలిచారు. గోల్ఫ్ టూర్స్‌లో ఇది ఆమెకు రెండో టైటిల్. సమాన్ స్కోర్లతో గౌరికా బిషోణి, అమన్‌దీప్ డ్రాల్ రెండో స్థానంలో నిలిచారు.
క్విక్ రివ్యూ:ఏమిటి : మహిళల ప్రొఫెషనల్స్ గోల్ఫ్ టూర్
ఎప్పుడు : మార్చి 25
ఎవరు : వాణి కపూర్
ఎక్కడ : పుణె
2017 ఫార్ములావన్ సీజన్ తొలిరేసు విజేత వెటెల్ 2017 ఫార్ములావన్ సీజన్ తొలి రేసు ఆస్ట్రేలియన్ గ్రాండ్‌ప్రిలో ఫెరారీ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన సెబేస్టియన్ వెటెల్ విజేతగా నిలిచాడు. మార్చి 26న జరిగిన 57 ల్యాప్‌ల ఈ రేసులో వెటెల్ గంటా 24 నిమిషాల 11.670 సెకన్లలో గమ్యానికి చేరి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. 2015 సెప్టెంబరులో సింగపూర్ గ్రాండ్‌ప్రిలో విజేతగా నిలిచిన తర్వాత వెటెల్ ఖాతాలో చేరిన తొలి టైటిల్ ఇదే. ఓవరాల్‌గా వెటెల్ కెరీర్‌లో ఇది 43వ టైటిల్.
క్విక్ రివ్యూ:ఏమిటి : ఆస్ట్రేలియన్ గ్రాండ్‌ప్రి టైటిల్ - 2017
ఎప్పుడు : మార్చి 26
ఎవరు : సెబేస్టియన్ వెటెల్
ఎక్కడ : ఆస్ట్రేలియా
బోర్డర్ గావస్కర్ టెస్ట్ సీరీస్ విజేత భారత్ ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గావస్కర్ టెస్ట్ సీరీస్‌ను భారత్ 2-1 తేడాతో సొంతం చేసుకుంది. ధర్మశాలలో జరిగిన నాల్గొవ టెస్టులో విజయం సాధించడం ద్వారా మూడేళ్ల తర్వాత ఈ సీరీస్‌ను భారత్ కైవసం చేసుకుంది. రవీంద్ర జడేజా మ్యాన్ ఆఫ్ ద సీరీస్ అవార్డు అందుకున్నాడు.
ఈ విజయంతో టెస్టుల్లో నెంబర్ 1 స్థానాన్ని పటిష్ట పరుచుకున్న టీమిండియా ఐసీసీ నుంచి టెస్టు గదతో పాటు పది లక్షల డాలర్ల నగదు బహుమతి అందుకుంది. కాగా సొంతగడ్డపై భారత్‌కు ఇది వరుసగా ఏడవ టెస్టు సిరీస్ విజయం.
క్విక్ రివ్యూ:ఏమిటి : బోర్డర్ గావస్కర్ టెస్ట్ సీరీస్ - 2017
ఎప్పుడు : మార్చి 28
ఎవరు : భారత్

ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్ విజేత ఫెడరర్
స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. అమెరికాలోని కాలిఫోర్నియాలో మార్చి 20న జరిగిన ఫైనల్లో ఫెడరర్ 6-4, 7-5తో స్టానిస్లాస్ వావ్రింకాపై విజయం సాధించాడు. ఈ విజయంతో ఇండియన్ వెల్స్ టోర్నీని అత్యధికంగా ఐదుసార్లు నెగ్గిన నొవాక్ జకోవిచ్ (సెర్బియా) రికార్డును ఫెడరర్ సమం చేశాడు. ఓవరాల్‌గా ఫెడరర్ కెరీర్‌లో ఇది 90వ సింగిల్స్ టైటిల్‌కాగా 25వ మాస్టర్స్ సిరీస్ టైటిల్.
మహిళల సింగిల్స్ విభాగంలో ఎలీనా వెస్నినా (రష్యా) స్వెత్లానా కుజ్‌నెత్సోవా (రష్యా)పై గెలిచి టైటిల్‌ను దక్కించుకుంది.
క్విక్ రివ్యూ:ఏమిటి : ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్ 2017
ఎప్పుడు : మార్చి 20
ఎవరు : రోజర్ ఫెడరర్
ఎక్కడ : కాలిఫోర్నియా, అమెరికా
గ్యాటోరెడ్ అంబాసిడర్‌గా పీవీ సింధు అమెరికాకు చెందిన ప్రఖ్యాత స్పోర్‌ట్స డ్రింక్ ‘గ్యాటోరెడ్’కు భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ప్రచారకర్తగా వ్యవహరించనుంది. ఈ మేరకు ఆ సంస్థ మార్చి 20న సింధుతో ఒప్పందం కుదుర్చుకుంది. పెప్సికో సంస్థ ఈ పానీయాన్ని ఉత్పత్తి చేస్తుంది. గతంలో స్టార్ ప్లేయర్స్ ఉసేన్ బోల్ట్ (అథ్లెటిక్స్), సెరెనా విలియమ్స్ (టెన్నిస్), మెస్సీ (ఫుట్‌బాల్) తదితరులు గ్యాటోరెడ్‌కు ప్రచారకర్తలుగా వ్యవహరించారు.
క్విక్ రివ్యూ:ఏమిటి : గ్యాటోరెడ్ అంబాసిడర్‌గా పీవీ సింధు
ఎప్పుడు : మార్చి 20
ఎందుకు : స్పోర్‌ట్స డ్రింక్ ప్రమోషన్ కోసం
విజయ్ హజారే ట్రోఫీ విజేత తమిళనాడు విజయ్ హజారే ట్రోఫీ దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నమెంట్‌లో తమిళనాడు జట్టు విజేతగా నిలిచింది. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో మార్చి 20న జరిగిన ఫైనల్లో బెంగాల్ జట్టుపై 37 పరుగుల తేడాతో గెలుపొందింది.
2002లో విజయ్ హజారే టోర్నీలో లీగ్ కమ్ నాకౌట్ పద్ధతి మొదలయ్యాక తమిళనాడు టైటిల్ నెగ్గడం ఇది ఐదోసారి. మరోవైపు బెంగాల్ జట్టు ఫైనల్‌కు చేరుకున్న నాలుగుసార్లూ రన్నరప్‌తోనే సరిపెట్టుకుంది.
క్విక్ రివ్యూ:ఏమిటి : విజయ్ హజారే ట్రోఫీ 2017
ఎప్పుడు : మార్చి 20
ఎవరు : తమిళనాడు
ఎక్కడ : న్యూఢిల్లీ
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ 2017లో ఇంగ్లండ్‌లో జరగనున్న ఐసీసీ మహిళా వన్డే ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంట్ షెడ్యూల్ విడుదలైంది. జూన్ 24 నుంచి జూలై 23 వరకు ఈ టోర్నీ జరుగుతుంది. భారత జట్టు జూన్ 24న జరిగే తమ తొలి మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్ జట్టుతో ఆడనుంది. తొలి సెమీఫైనల్ జూలై 18న, రెండో సెమీఫైనల్ జూలై 20న జరుగుతాయి. ఫైనల్ మ్యాచ్‌ను జూలై 23న లార్డ్స్ మైదానంలో నిర్వహిస్తారు. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ను ఈ టోర్నీకి బ్రాండ్ అంబాసిడర్‌గా ఐసీసీ నియమించింది.
భారత్ మ్యాచ్‌ల షెడ్యూల్ జూన్ 24 : ఇంగ్లండ్‌తో
జూన్ 29 : వెస్టిండీస్‌తో
జూలై 2 : పాకిస్తాన్‌తో
జూలై 5 : శ్రీలంకతో
జూలై 8 : దక్షిణాఫ్రికాతో
జూలై 12: ఆస్ట్రేలియాతో
జూలై 15: న్యూజిలాండ్‌తో
క్విక్ రివ్యూ:ఏమిటి : ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ షెడ్యూల్
ఎప్పుడు : జూన్ 24 నుంచి జూలై 23
ఎక్కడ :ఇంగ్లండ్
ఎవరు : అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)
అత్యధిక వికెట్లు తీసిన లెఫ్టార్మ్ స్పిన్నర్‌గా హెరాత్ రికార్డు ప్రపంచ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు (366) తీసిన ఎడమ చేతివాటం స్పిన్నర్‌గా శ్రీలంక ప్లేయర్ రంగన హెరాత్ రికార్డు సృష్టించాడు. మార్చి 12న బంగ్లాదేశ్‌తో ముగిసిన టెస్ట్ మ్యాచ్‌లో శ్రీలంక కెప్టెన్ హెరాత్ 9 వికెట్లు తీశాడు. తద్వారా ఇప్పటి వరకూ న్యూజిలాండ్ క్రికెటర్ వెటోరి పేరిట ఉన్న 362 వికెట్ల రికార్డును అధిగమించాడు. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ పై శ్రీలంక విజయం సాధించింది.
క్విక్ రివ్యూ:ఏమిటి : అత్యధిక వికెట్లు తీసిన లెఫ్టార్మ్ స్పిన్నర్
ఎప్పుడు : మార్చి 12
ఎవరు : శ్రీలంక క్రికెటర్ రంగన హెరాత్ (366 వికెట్లు)
అంధుల క్రికెట్ జట్టుకు రూ.కోటి నజరానా ఇటీవల అంధుల టి-20 ప్రపంచకప్‌ను గెలుచుకున్న భారత జట్టుకు బీసీసీఐ రూ.కోటి నజరానా ప్రకటించింది. గత నెల 25న సమావేశమైన బోర్డు నూతన పరిపాలన కమిటీ (సీఓఏ) ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 12న బెంగళూరులో జరిగిన ఫైనల్లో పాకిస్తాన్‌ను తొమ్మిది వికెట్ల తేడాతో చిత్తు చేసి భారత్ టైటిల్‌ను నిలబెట్టుకుంది.
క్విక్ రివ్యూ:ఏమిటి : భారత అంధుల క్రికెట్ జట్టుకు రూ.కోటి నజరానా
ఎప్పుడు : ఫిబ్రవరి 25
ఎవరు : బీసీసీఐ
ఎందుకు : అంధుల టి-20 ప్రపంచకప్ సాధించినందుకు
లీ చోంగ్ వీకి ఆల్ ఇంగ్లండ్ టైటిల్ ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ చాంపియన్‌షిప్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను మలేషియాకు చెందిన లీ చోంగ్ వీ దక్కించుకున్నాడు. మార్చి 12న జరిగిన ఫైనల్స్‌లో షియూచి (చైనా)పై గెలుపొంది నాలుగోసారి ఈ టైటిల్‌ను అందుకున్నాడు. గతంలో 2010, 2011, 2014లోనూ చోంగ్ టైటిల్ విజేతగా నిలిచాడు.
మహిళల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్ వన్ తై జు యింగ్ (చైనా) ఇంతనోన్ రచనోక్ (థాయిలాండ్)పై గెలుపొంది టైటిల్ సొంతం చేసుకుంది.
ఇండియన్ ఓపెన్ గోల్ఫ్ టోర్నీ విజేత చౌరాసియా భారత గోల్ఫర్ ఎస్‌ఎస్‌పీ చౌరాసియా ఇండియా ఓపెన్ గోల్ఫ్ టోర్నమెంట్ విజేతగా నిలిచాడు. మార్చి 12న గుర్గావ్‌లోని డీఎల్‌ఎఫ్ గోల్ఫ్ అండ్ కంట్రీ క్లబ్‌లో జరిగిన పోటీలో ప్రథమ స్థానంలో నిలవటం ద్వారా వరుసగా రెండోసారి చాంపియన్‌షిప్‌ను దక్కించుకున్నాడు. విజేతకు రూ.2 కోట్ల ప్రైజ్ మనీ అందజేశారు.
క్విక్ రివ్యూ:ఏమిటి : ఇండియన్ ఓపెన్ గోల్ఫ్ టోర్నమెంట్
ఎప్పుడు : మార్చి 12
ఎక్కడ : హరియాణాలోని గుర్గావ్
ఎవరు : ఎస్‌ఎస్‌పీ చౌరాసియా
క్రికెట్‌లో తండ్రీ కొడుకుల రికార్డువెస్టిండీస్ క్రికెటర్ శివ్‌నారాయణ్ చందర్‌పాల్, ఆయన కుమారుడు త్యాగి నారాయణ్ చందర్‌పాల్ ఒకే మ్యాచ్‌లో కలిసి బ్యాటింగ్ చేసి రికార్డు సృష్టించారు. కింగ్‌స్టన్‌లోని సబీనా పార్కులో జరుగుతోన్న ప్రాంతీయ టోర్నీలో భాగంగా మార్చి 13న జమైకా, గయానా జట్ల మధ్య ఫస్టక్లాస్ మ్యాచ్ జరిగింది. ఇందులో గయానా తరపున ఆడిన వీరిద్దరూ ఆర్ధ శతకాలు సాధించారు. టెస్టు క్రికెట్‌లో 11,867 పరుగులు చేసిన శివ్‌నారాయణ్ బ్రయాన్ లారా తర్వాత విండీస్ రెండో అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు పొందాడు.
క్విక్ రివ్యూ:ఏమిటి : ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో కలిసి ఆడిన తండ్రీ కొడుకులు
ఎప్పుడు : మార్చి 13
ఎవరు : శివ్‌నారాయాణ్ చందర్‌పాల్, కుమారుడు త్యాగి నారాయణ్
ఎక్కడ : కింగ్‌స్టన్, వెస్టిండీస్
ప్రపంచకప్ షూటింగ్‌లో జీతూ రాయ్‌కి స్వర్ణం న్యూఢిల్లీలో జరిగిన ప్రపంచ షూటింగ్ టోర్నీలో జీతూ రాయ్(భారత్) స్వర్ణం సాధించాడు. మార్చి 1న జరిగిన 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్ ఫైనల్లో 230.1 పాయింట్లతో కొత్త ప్రపంచ రికార్డ్ నమోదు చేశాడు. ఈ టోర్నీలో భారత్‌కు ఇది తొలి స్వర్ణం. 226.9 పాయింట్లతో అమన్‌ప్రీత్ సింగ్ (భారత్) రజతం సాధించగా 208 పాయింట్లు స్కోరు చేసిన ఇరాన్ షూటర్ వహీద్ గోల్‌ఖాందన్ కాంస్యం గెలుచుకున్నాడు.
మహిళల స్కీట్ ఈవెంట్ ఫైనల్లో కింబర్లీ రోడ్ (అమెరికా) 56 పాయింట్లు సాధించి కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పడంతోపాటు స్వర్ణ పతకాన్ని దక్కించుకుంది. ఈ టోర్నీలో ఇప్పటివరకు భారత్ ఒక స్వర్ణం, రెండు రజతాలు, రెండు కాంస్యాలు సాధించి 5 పతకాలతో నాలుగో స్థానంలో ఉంది.
ప్రపంచకప్ షూటింగ్ టోర్నీలో భారత్‌కు 5వ స్థానంస్వదేశంలో తొలిసారి జరిగిన ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్‌లో భారత్ ఐదవ స్థానంలో నిలిచింది. ఫిబ్రవరి 22 నుంచి మార్చి 4 వరకూ జరిగిన ఈ టోర్నీలో భారత్‌కు మొత్తం ఐదు పతకాలు దక్కాయి. ఇందులో ఓ స్వర్ణం, రెండు రజతాలు, రెండు కాంస్యాలున్నాయి.
పురుషుల 50 మీ. పిస్టల్ ఈవెంట్‌లో జీతూ రాయ్ స్వర్ణం సాధించాడు. పతకాల పట్టికలో చైనా, ఇటలీ, ఆస్ట్రేలియా, జపాన్ మొదటి నాలుగు స్థానాల్లో నిలిచాయి.
క్విక్ రివ్యూ:ఏమిటి : ప్రపంచకప్ షూటింగ్ టోర్నీ - 5వ స్థానంలో భారత్
ఎప్పుడు : ఫిబ్రవరి 22 - మార్చి 4
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎవరు : ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్-ISSF
ప్రపంచ మహిళల చెస్ చాంపియన్ తాన్ జోంగి ఇరాన్‌లోని టెహరాన్‌లో జరిగిన ప్రపంచ మహిళల చెస్ చాంపియన్ షిప్-2017 టైటిల్‌ను చైనా మహిళా గ్రాండ్ మాస్టర్ (WGM) తాన్ జోంగి గెలుచుకుంది. మార్చి 3న జరిగిన ఫైనల్లో తాన్ జోంగి అనా ముజిచుక్ (ఉక్రెయిన్)ను 3.5-2.5 పాయింట్ల తేడాతో ఓడించి చాంపియన్‌గా నిలిచింది. ఈ టైటిల్‌తో తాన్ జోంగికి గ్రాండ్ మాస్టర్ (GM) హోదా లభించింది. సెమీఫైనల్స్‌లో ఓడిన ద్రోణవల్లి హారిక (భారత్), అలెగ్జాండ్రా కోస్టెనిక్ (రష్యా)లకు కాంస్య పతకాలు దక్కాయి. విజేతగా నిలిచిన తాన్ జోంగికి 60 వేల డాలర్లు (రూ. 40 లక్షలు), రన్నరప్ అనా ముజిచుక్‌కు 30 వేల డాలర్లు (రూ. 20 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.
క్విక్ రివ్యూ:ఏమిటి : ప్రపంచ మహిళా చెస్ చాంపియన్‌షిప్ - 2017
ఎప్పుడు : ఫిబ్రవరి 10 - మార్చి 3
ఎవరు : టైటిల్ విజేత తాన్ జోంగి (చైనా)
విష్ణువర్ధన్-శ్రీరామ్‌లకు ఐటీఎఫ్ ఫ్యూచర్స్-3 డబుల్స్ టైటిల్ అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య-ITF ఫ్యూచర్స్-3 టోర్నమెంట్‌లో పురుషుల డబుల్స్ టైటిల్‌ను విష్ణువర్ధన్-శ్రీరామా బాలాజీ దక్కించుకున్నారు. గువహటిలో మార్చి 3న జరిగిన ఫైనల్స్‌లో వీరు శశికుమార్ ముకుంద్ (భారత్)-తిముర్ ఖాబిబులిన్ (కజకిస్తాన్) జోడీపై గెలిచారు. ఈ విజయంతో విష్ణువర్ధన్ డబుల్స్ టైటిల్స్ సంఖ్య 31కి చేరింది.
క్విక్ రివ్యూ:ఏమిటి : ఐటీఎఫ్ ఫ్యూచర్స్-3 టోర్నమెంట్ - 2017
ఎప్పుడు : మార్చి 3
ఎవరు : విష్ణువర్ధన్-శ్రీరామ్‌లకు డబుల్స్ టైటిల్
ముర్రేకు దుబాయ్ ఓపెన్ టైటిల్దుబాయ్ టెన్నిస్ చాంపియన్‌షిప్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను ఆండీ ముర్రే (బ్రిటన్) గెలుచుకున్నాడు. దుబాయ్‌లో మార్చి 4న జరిగిన ఫైనల్లో ఫెర్నాండో వెర్దాస్కో (స్పెయిన్)పై విజయం సాధించాడు.
టీమిండియా కొత్త స్పాన్సరర్‌గా ఒప్పోటీమిండియా కొత్త స్పాన్సరర్‌గా ప్రముఖ మొబైల్ కంపెనీ ఒప్పో వ్యవహరించనుంది. ఈ మేరకు ఆ సంస్థ, బీసీసీఐ మధ్య మార్చి 7న ఒప్పందం కుదురింది. 2017 ఏప్రిల్ 1 నుంచి అమలయ్యే 5 ఏళ్ల ఒప్పందానికి ఒప్పో కంపెనీ బీసీసీఐకి రూ.1,079 కోట్లు చెల్లించనుంది. ఒప్పందంలో భాగంగా ఇకపై భారత క్రికెటర్లు ధరించే జెర్సీలపై ఒప్పో లోగో ఉంటుంది. అంతకుముందు స్టార్ ఇండియా భారత్ క్రికెట్ స్పాన్సరర్‌గా వ్యవహరించింది.
క్విక్ రివ్యూ:ఏమిటి : బీసీసీఐ, ఒప్పో మధ్య ఒప్పందం
ఎప్పుడు : మార్చి 7
ఎందుకు : టీమిండియా స్పాన్సరర్‌గా వ్వవహరించేందుకు

No comments:
Post a Comment