క్రీడలు జూన్ 2017
ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ విజేత శ్రీకాంత్ ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను భారత బ్యాడ్మింటన్ స్టార్ కిడాంబి శ్రీకాంత్ కైవసం చేసుకున్నాడు. జూన్ 25న జరిగిన ఫైనల్లో ప్రపంచ 11వ ర్యాంకర్ శ్రీకాంత్ 22-20, 21-16తో ప్రస్తుత ప్రపంచ చాంపియన్, రియో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత చెన్ లాంగ్ (చైనా)పై విజయం సాధించాడు. తద్వారా 56,250 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 36 లక్షల 28 వేలు)తోపాటు 9200 ర్యాంకింగ్ పాయింట్లను శ్రీకాంత్‌కు దక్కాయి.
జూన్ 18న శ్రీకాంత్ ఇండోనేసియా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టైటిల్‌ను నెగ్గాడు. ఓవరాల్‌గా శ్రీకాంత్ కెరీర్‌లో ఇది నాలుగో సూపర్ సిరీస్ టైటిల్. 2014లో చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నీలో, 2015లో ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలో శ్రీకాంత్ చాంపియన్‌గా నిలిచాడు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సీరీస్
ఎప్పుడు : జూన్ 25
ఎవరు: పురుషుల సింగిల్స్ విజేత కిడాంబి శ్రీకాంత్
ఎక్కడ : సిడ్నీలో
గెర్రీ వెబెర్ హాల్ ఓపెన్ టైటిల్ విజేత ఫెడరర్ గెర్రీ వెబెర్ హాల్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ తొమ్మిదోసారి గెలుచుకున్నాడు. జూన్ 25న జరిగిన ఫైనల్లో ఫెడరర్ 6-1, 6-3తో అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)పై గెలిచాడు. తద్వారా కెరీర్‌లో 92వ సింగిల్స్ టైటిల్ సాధించిన ఫెడరర్... ఓపెన్ శకంలో (1968 తర్వాత) ఒకే టోర్నమెంట్‌ను అత్యధికసార్లు గెలిచిన క్రీడాకారుల జాబితాలో రెండో స్థానానికి చేరాడు. ఈ రికార్డు స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్ (ఫ్రెంచ్ ఓపెన్, బార్సిలోనా ఓపెన్, మోంటెకార్లో ఓపెన్-10 సార్లు చొప్పున) పేరిట ఉంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : గెర్రీ వెబెర్ హాల్ ఓపెన్ టైటిల్
ఎప్పుడు : జూన్ 25
ఎవరు: పురుషుల సింగిల్స్ విజేత రోజర్ ఫెడరర్
ఎక్కడ : జర్మనీ
అజర్‌బైజాన్ గ్రాండ్ ప్రీ విజేత రికియార్డోరెడ్‌బుల్ జట్టు డ్రైవర్ డానియల్ రికియార్డో అజర్‌బైజాన్ గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ రేసులో విజేతగా నిలిచాడు. 51 ల్యాప్‌ల ఈ రేసును రికియార్డో రెండు గంటల 3 నిమిషాల 55.570 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును ప్రారంభించిన హామిల్టన్ (మెర్సిడెస్) ఐదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. బొటాస్ (మెర్సిడెస్), స్ట్రాల్ (విలియమ్స్) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. ఫోర్స్ ఇండియా డ్రైవర్ ఒకాన్ ఆరో స్థానాన్ని పొందాడు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అజర్ బైజాన్ గ్రాండ్ ప్రీ - 2017
ఎప్పుడు : జూన్ 25
ఎవరు: విజేత డానియల్ రికియార్డో
‘స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్’గా సింధుభారత స్పోర్‌ట్స జర్నలిస్ట్ సమాఖ్య (ఎస్‌జేఎఫ్‌ఐ) వార్షిక అవార్డుల్లో భాగంగా అందించే ‘స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్’ పురస్కారానికి భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ఎంపికైంది. జూన్ 25న జరిగిన ఎస్‌జేఎఫ్‌ఐ వార్షిక సాధారణ సర్వసభ్య సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.
2016 డిసెంబర్‌లో లక్నోలో జరిగిన జూనియర్ హాకీ వరల్డ్ కప్‌ను నెగ్గిన భారత హాకీ జట్టు ‘బెస్ట్ టీమ్ ఆఫ్ ద ఇయర్’ అవార్డును గెలుచుకుంది. గతేడాది జూలై నుంచి ఇప్పటివరకు క్రీడాకారుల ప్రదర్శనను పరిగణలోకి తీసుకొని అవార్డులను ప్రకటించినట్లు ఎస్‌జేఎఫ్‌ఐ పేర్కొంది. ఈ అవార్డులను సెప్టెంబర్‌లో అందజేయనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పీవీ సింధుకు స్పోర్‌ట్స పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు
ఎప్పుడు : జూన్ 25
ఎవరు: ఎస్‌జేఎఫ్‌ఐ
పేస్ జంటకు ఎగాన్ ఏటీపీ చాలెంజర్ టైటిల్ఎగాన్ ఏటీపీ చాలెంజర్ టోర్నమెంట్ డబుల్స్ టైటిల్‌ను లియాండర్ పేస్, ఆదిల్ షమస్దీన్(కెనడా) జంట కైవసం చేసుకుంది. బ్రిటన్‌లో జూన్ 25న జరిగిన ఫైనల్లో పేస్-షమస్దీన్ ద్వయం 2-6, 6-2, 10-8తో ‘సూపర్ టైబ్రేక్’లో బ్రిడాన్ క్లియెన్-జోసాలిస్‌బరీ (బ్రిటన్) జోడీపై గెలిచింది.
45 ఏళ్ల పేస్ ఈ సీజన్‌లో తలాసీ, లియోన్ ఏటీపీ చాలెంజర్ టోర్నీల్లోనూ టైటిల్స్ సాధించాడు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎగాన్ ఏటీపీ చాలెంజర్ టోర్నమెంట్ - 2017
ఎప్పుడు : జూన్ 25
ఎవరు: డబుల్స్ టైటిల్ విజేత లియాండర్ పేస్-ఆదిల్ షమస్దీన్
ఎక్కడ : బ్రిటన్
లోధా సంస్కరణల అమలుకు ప్రత్యేక కమిటీ లోధా ప్యానెల్ సూచించిన సంస్కరణల అమలు కోసం ఏడుగురు సభ్యులతో బీసీసీఐ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. జూన్ 26న జరిగిన బోర్డు ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్‌జీఎం)లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కమిటీకి రాజీవ్ శుక్లా చైర్మన్‌గా... బోర్డు కార్యదర్శి అమితాబ్ చౌదరి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ సభ్యుడిగా ఉంటారు. మిగతా సభ్యుల్లో టీసీ మ్యాథ్యూ (కేరళ క్రికెట్ సంఘం మాజీ అధ్యక్షులు), నబా భట్టాచార్జీ (మేఘాలయ క్రికెట్ సంఘం కార్యదర్శి), జయ్ షా (బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కుమారుడు, గుజరాత్ క్రికెట్ సంఘం కార్యదర్శి), బీసీసీఐ కోశాధికారి అనిరుధ్ చౌదరి ఉన్నారు.
ఈ కమిటీ లోధా సంస్కరణల అమల్లో ఎదురవుతున్న ఇబ్బందులపై నివేదిక ఇవ్వనుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : లోధా సంస్కరణల అమలుకు ప్రత్యేక కమిటీ
ఎప్పుడు : జూన్ 26
ఎవరు: బీసీసీఐ
ఎందుకు : లోధా సంస్కరణల అమల్లో ఎదురవుతున్న ఇబ్బందులపై అధ్యయనం కోసం
ప్రపంచ త్రోబాల్ గేమ్స్‌లో భారత్‌కు 2 స్వర్ణాలుఖట్మండ్‌లో జరిగిన ప్రపంచ త్రోబాల్ గేమ్‌లో భారత్‌కు చెందిన మహిళ, పురుష జట్లు చెరో బంగారు పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించాయి. మహిళా జట్టు 15-13, 12-12లతో పాకిస్థాన్‌పై విజయం సాధించింది. ఇక పురుషుల జట్టు.. బంగ్లాదేశ్‌పై 15-13, 15-12లతో విజయకేతనం ఎగరవేసింది. భారత్ ఈ పోటీల్లో పాల్గొనడం ఇదే తొలిసారి.
జూన్ 15 నుంచి 18 వరకు జరిగిన ఈ పోటీలను ఇంటర్నేషనల్ స్పోర్‌ట్స కౌన్సిల్ (కెనడా) నిర్వహించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఖట్మండ్ త్రోబాల్ గేమ్‌లో భారత్‌కు 2 పసిడి పతకాలు
ఎప్పుడు : జూన్ 15 - 18
ఎవరు: భారత పురుషుల, మహిళల జట్లకు పతకాలు
వన్డేల్లో 8 వేల పరుగులు చేసిన కోహ్లీఅంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో వేగంగా 8 వేల పరుగులు మైలు రాయిని దాటిన క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన సెమీఫైనల్‌లో మ్యాచ్‌లో కోహ్లీ 78 బంతుల్లో 96 పరుగులు సాధించాడు. తద్వారా ఇప్పటి వరకూ దక్షి ణాఫ్రికా ప్లేయర్ ఏబీ డెవిలియర్స్ పేరిట ఉన్న (182 ఇన్నింగ్స్ ) రికార్డును కోహ్లీ తన 175వ ఇన్నింగ్స్‌లోనే అధిగమించాడు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వన్డేల్లో 8 వేల పరుగుల మైలురాయి
ఎప్పుడు : జూన్ 15
ఎవరు : విరాట్ కోహ్లీ
ఎక్కడ : చాంపియన్స్ ట్రోఫీ 2017 (బంగ్లాదేశ్‌పై)
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ విజేత పాకిస్తాన్ 2017 చాంపియన్‌స ట్రోఫీని పాకిస్తాన్ కైవసం చేసుకుంది. జూన్ 18న లండన్‌లోని ఓవల్ మైదానంలో జరిగిన ఫైనల్‌లో పాక్ 180 పరుగుల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. తద్వారా తొలిసారి చాంపియన్స్ ట్రోఫీని అందుకున్న పాకిస్తాన్.. ఐసీసీ మూడు టోర్నీలూ (వన్డే వరల్డ్ కప్, టీ20 ప్రపంచ కప్, చాంపియన్స్ ట్రోఫీ) గెలుచుకున్న మూడో జట్టుగా గుర్తింపు పొందింది. పాక్ కంటే ముందు భారత్, వెస్టిండీస్ ఈ మూడో టోర్నీలను గెలుపొందాయి.
టోర్నీలో అత్యధిక పరుగులు (338) చేసిన శిఖర్ ధావన్‌కు ‘గోల్డెన్ బ్యాట్’ అవార్డు దక్కగా, అత్యధిక వికెట్లు (13) తీసిన పాక్ పేసర్ హసన్ అలీ ‘గోల్డెన్ బాల్’తో పాటు ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్’ అవార్డు అందుకున్నాడు.
క్విక్ రివ్యూ: ఏమిటి : ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ - 2017
ఎప్పుడు : జూన్ 18
ఎవరు : విజేత పాకిస్తాన్
ఎక్కడ : లండన్
ఇండోనేసియా ఓపెన్ సూపర్ సిరీస్ విజేత శ్రీకాంత్ఇండోనేసియా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను భారత ఆటగాడు కిడాంబి శ్రీకాంత్ గెలుచుకున్నాడు. జూన్ 18న జరిగిన ఫైనల్లో ప్రపంచ 22వ ర్యాంకర్ శ్రీకాంత్ కేవలం 37 నిమిషాల్లోనే 21-11, 21-19తో ప్రపంచ 47వ ర్యాంకర్ కజుమాసా సకాయ్ (జపాన్)పై గెలిచాడు. తద్వారా పురుషుల సింగిల్స్‌లో ఈ టైటిల్ నెగ్గిన తొలి భారతీయుడుగా గుర్తింపు పొందాడు. ఈ విజయంతో రూ. 75 వేల డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 48 లక్షలు 33 వేలు) సొంతం చేసుకున్నాడు.
ఓవరాల్‌గా శ్రీకాంత్ కెరీర్‌లో ఇది మూడో సూపర్ సిరీస్ టైటిల్. 2014లో చైనా ఓపెన్ సూపర్ సిరీస్, 2015 ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలో శ్రీకాంత్ చాంపియన్‌గా నిలిచాడు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇండోనేషియా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నమెంట్
ఎప్పుడు : జూన్ 18
ఎవరు : పురుషుల సింగిల్స్ విజేత కిడాంబి శ్రీకాంత్
ఎక్కడ : ఇండోనేషియా
జూనియర్ చెస్ మీట్‌లో భారత బాలికకు కాంస్యంబ్రిటన్‌లో జరుగుతున్న జూనియర్ ఓపెన్ రాపిడ్ చెస్ టోర్నీలో ముంబైకి చెందిన అహనా షా కాంస్యాన్ని దక్కించుకుంది. అండర్-7 విభాగంలో పోటీపడిన షా.. ఐదింటికి నాలుగు పాయింట్లు సాధించింది. ఈ టోర్నీలో ఎలాంటి రేటింగ్ లేకుండా పాల్గొన్న ఏడేళ్ల షాకు కాంస్యం దక్కగా రిత్విక్, డెసైన్‌లకు స్వర్ణ, రజత పతకాలు దక్కాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జూనియర్ చెస్ మీట్‌లో భారత బాలికకు కాంస్యం
ఎప్పుడు : జూన్ 20
ఎవరు : ముంబైకి చెందిన అహనా షా
ఎక్కడ : బ్రిటన్
కోచ్ పదవికి కుంబ్లే రాజీనామాభారత జట్టు హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే తన పదవి నుంచి తప్పుకుంటున్నట్లు జూన్ 20న ప్రకటించారు. కాంట్రాక్ట్ ప్రకారం ఆయన పదవీ కాలం జూన్ 20నే ముగియనున్నందున రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. గత కొంతకాలంగా భారత జట్టు కెప్టెన్ కోహ్లీ, ఆటగాళ్లు, కుంబ్లేకు మధ్య వివాదం నడుస్తుందని జోరుగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అయితే కుంబ్లే ఒప్పుకుంటే ఆయన విండీస్ పర్యటనకు వెళతారని ఇటీవలే సీఓఏ చీఫ్ వినోద్ రాయ్ వెల్లడించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత జట్టు హెడ్ కోచ్ పదవికి రాజీనామా
ఎప్పుడు : జూన్ 20
ఎవరు : అనిల్ కుంబ్లే
ఎందుకు : జూన్ 20న పదవీకాలం ముగియడం, భారత జట్టు సభ్యులతో వివాదాల నేపథ్యంలో
కాపాబ్లాంకా స్మారక చెస్ టోర్నీ విజేత శశికిరణ్ప్రపంచ మాజీ చాంపియన్ జోస్ రౌల్ కాపాబ్లాంకా (క్యూబా) స్మారకార్థం నిర్వహించిన అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ కృష్ణన్ శశికిరణ్ విజేతగా నిలిచాడు. క్యూబాలోని వారాడెరోలో జరిగిన ఈ టోర్నీలో శశికిరణ్ మూడు గేముల్లో గెలిచి, ఏడింటిని ‘డ్రా’ చేసుకొని అజేయంగా నిలిచాడు. తద్వారా 1962 నుంచి జరుగుతోన్న కాపాబ్లాంకా చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన తొలి భారతీయ క్రీడాకారుడిగా శశికిరణ్ గుర్తింపు పొందాడు.
క్విక్ రివ్యూ: ఏమిటి : కాపాబ్లాంకా స్మారక చెస్ టోర్నీ
ఎప్పుడు : జూన్ 6
ఎక్కడ : క్యూబా
ఎవరు : విజేత కృష్ణన్ శశికిరణ్
ఫ్రెంచ్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ విజేత బోపన్న, దబ్రౌస్కీ
ఫ్రెంచ్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్‌ను భారత డబుల్స్ స్టార్ రోహన్ బోపన్న, గాబ్రియేలా దబ్రౌస్కీ (కెనడా) కైవసం చేసుకున్నారు. ఈ మేరకు జూన్ 8న జరిగిన మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్లో ఏడో సీడ్ బోపన్న-దబ్రౌస్కీ జోడీ 2-6, 6-2, 12-10తో ‘సూపర్ టైబ్రేక్’లో అన్‌సీడెడ్ ద్వయం అనాలెనా గ్రోన్‌ఫెల్డ్ (జర్మనీ)-రాబర్ట్ ఫరా (కొలంబియా)పై గెలిచింది. విజేతగా నిలిచిన బోపన్న జోడీకి 1,18,000 యూరోలు (రూ. 85 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.
తొమ్మిదేళ్ల కెరీర్‌లో బోపన్నకు ఇది తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్. అలాగే ఈ విజయంతో గ్రాండ్‌స్లామ్ టోర్నీలో డబుల్స్ విభాగంలో టైటిల్ నెగ్గిన నాలుగో భారత ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. గతంలో మహేశ్ భూపతి, లియాండర్ పేస్, సానియా మీర్జా డబుల్స్ విభాగాల్లో గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌ను సాధించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఫ్రెంచ్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ - 2017
ఎప్పుడు : జూన్ 8
ఎక్కడ : ఫ్రాన్స్
ఎవరు : రోహన్ బోపన్న, గాబ్రియేలా దబ్రౌస్కీ
విదేశాల్లో ఎంఎస్ ధోని సిక్సర్ల రికార్డు భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని విదేశాల్లో అత్యధిక అంతర్జాతీయ సిక్సర్లు కొట్టిన భారత ఆటగాడిగా రికార్డు నమోదు చేశాడు. చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా జూన్ 8న శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్‌లో ధోని 52 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 63 పరుగులు చేశాడు. తద్వారా ఇప్పటి వరకు భారత మాజీ ఆటగాడు సౌరవ్ గంగూలీ పేరిట ఉన్న ఈ రికార్డును ధోని అధిగమించాడు. 296 విదేశీ అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో గంగూలీ 159 సిక్సర్లు కొట్టగా, ఆ రికార్డును 281 మ్యాచ్‌ల్లో 161 సిక్సర్లతో ధోని అధిగమించాడు.
క్విక్ రివ్యూ: ఏమిటి : విదేశాల్లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత ప్లేయర్
ఎప్పుడు : జూన్ 8
ఎక్కడ : ఇంగ్లండ్
ఎవరు : మహేంద్ర సింగ్ ధోని
ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ విజేత ఒస్టాపెంకోఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను లాత్వియా క్రీడాకారిణి 20 ఏళ్ల జెలెనా ఒస్టాపెంకో కైవసం చేసుకుంది. పారిస్‌లోని రొలాండ్ గారోస్‌లో జూన్ 10న గంటా 59 నిమిషాలపాటు జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో అన్‌సీడెడ్ ఒస్టాపెంకో 4-6, 6-4, 6-3తో మూడో సీడ్ సిమోనా హలెప్ (రొమేనియా)పై గెలిచి కెరీర్‌లో తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను అందుకుంది. అలాగే 21 లక్షల యూరోలు (రూ. 15 కోట్ల 10 లక్షలు) ప్రైజ్‌మనీని పొందింది.
ఒస్టాపెంకో విజయం విశేషాలు
ఏమిటి : ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ - 2017
ఎప్పుడు : జూన్ 10
ఎక్కడ : పారిస్‌లో
ఎవరు : విజేత జెలెనా ఒస్టాపెంకో
ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేత నాదల్
ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను స్పెయిన్ దిగ్గజం రాఫెల్ నాదల్ సొంతం చేసుకున్నాడు. పారిస్‌లోని రొలాండ్ గారోస్‌లో జూన్ 11న జరిగిన ఫైనల్లో నాలుగో సీడ్ నాదల్ 6-2, 6-3, 6-1తో మూడో సీడ్ వావ్రింకా (స్విట్జర్లాండ్)ను ఓడించాడు. తద్వారా కెరీర్‌లో పదోసారి ఫ్రెంచ్ ఓపెన్‌ను నెగ్గిన నాదల్.. ఒకే గ్రాండ్‌స్లామ్‌ను పదిసార్లు గెలిచిన ఏకై క ప్లేయర్‌గా రికార్డు నమోదు చేశాడు. దీంతో నాదల్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సంఖ్య 15కు (రెండో స్థానం) చేరుకుంది. 18 టైటిల్స్‌తో ఫెడరర్ అగ్రస్థానంలో ఉన్నాడు. 14 టైటిల్స్‌తో పీట్ సంప్రాస్ మూడో స్థానంలో ఉన్నాడు.
ఓవరాల్‌గా నాదల్ కెరీర్‌లో ఇది 73వ సింగిల్స్ టైటిల్ కాగా క్లే కోర్టులపై 53వది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ - 2017
ఎప్పుడు : జూన్ 11
ఎక్కడ : పారిస్‌లో
ఎవరు : విజేత రాఫెల్ నాదల్
ఫిఫా అండర్-20 ప్రపంచకప్ చాంపియన్ ఇంగ్లండ్దక్షిణకొరియాలో జరిగిన ఫిఫా అండర్-20 ప్రపంచకప్‌ను ఇంగ్లండ్ కైవసం చేసుకుంది. జూన్ 11న జరిగిన ఫైనల్లో 1-0తో వెనిజులాపై విజయం సాధించడం ద్వారా ఇంగ్లిష్ జట్టు 51 ఏళ్ల తర్వాత ప్రపంచ స్థాయి టైటిల్‌ను దక్కించుకుంది.
టోర్నీలో అత్యుత్తమంగా రాణించిన ఇంగ్లండ్ ప్లేయర్ డొమినిక్ సొలంకి గోల్డెన్ బాల్ పురస్కారం అందుకున్నాడు. బెస్ట్ గోల్ కీపర్‌కి ఇచ్చే గోల్డెన్ గ్లోవ్ అవార్డు ఇంగ్లండ్ జట్టుకే చెందిన ఉడ్‌మెన్‌కు దక్కింది.
క్విక్ రివ్యూ: ఏమిటి : ఫిఫా అండర్ - 20 చాంపియన్‌షిప్
ఎప్పుడు : జూన్ 11
ఎక్కడ : దక్షిణ కొరియా
ఎవరు : విజేత ఇంగ్లండ్
కెనడా గ్రాండ్ ప్రీ విజేత లూయిస్ హామిల్టన్ మాంట్రియాల్‌లో జరిగిన కెనడా గ్రాండ్ ప్రీ టైటిల్‌ను మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ సొంతం చేసుకున్నాడు. జూన్ 12న జరిగిన ఫార్ములావన్ రేసులో విజేతగా నిలిచిన హామిల్టన్ వరుసగా మూడోసారి ఈ టైటిల్‌ను దక్కించుకున్నాడు. 2015, 2016లోనూ ఈ రేసులో హామిల్టన్ గెలిచాడు.
ఈ రేసులో మెర్సిడెస్ జట్టుకే చెందిన వాల్తెరీ బొటాస్ రెండో స్థానంలో నిలువగా... రికియార్డో (రెడ్‌బుల్), వెటెల్ (ఫెరారీ) వరుసగా మూడు, నాలుగు స్థానాలను సంపాదించారు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా జట్టు డ్రైవర్లు సెర్గియో పెరెజ్, ఎస్టాబెన్ ఒకాన్ వరుసగా ఐదు, ఆరు స్థానాల్లో నిలిచారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కెనడా గ్రాండ్ ప్రీ - 2017 విజేత
ఎప్పుడు : జూన్ 12
ఎక్కడ : మాంట్రియాల్
ఎవరు : లూయిస్ హామిల్టన్
ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచకప్‌లో జీతూ-హీనాకు స్వర్ణం
అజర్‌బైజాన్‌లో జరిగిన ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచకప్‌లో భారత షూటర్ల జీతూ రాయ్-హీనా సిద్ధు పసిడి పతకాన్ని కైవసం చేసుకున్నారు. 10 మీ. ఏయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్ విభాగంలో జరిగిన ఫైనల్లో జీతూ జంట 7-6తో రష్యా జోడీపై గెలుపొంది స్వర్ణం గెలుచుకుంది. మరోవైపు ఇరాన్‌ను ఓడించిన ఫ్రాన్స్ కాంస్య పతకాన్ని నెగ్గింది. ఓవరాల్‌గా ఈ టోర్నీలో మొత్తం ఆరు పతకాల (మూడు స్వర్ణాలు)తో చైనా తొలిస్థానంలో నిలిచింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచకప్ - 2017
ఎప్పుడు : జూన్ 12
ఎక్కడ : అజర్‌బైజాన్
ఎవరు : జీతూ-హీనాకు స్వర్ణం
ఐసీసీ టోర్నీల్లో ధావన్ పరుగుల రికార్డు భారత ఓపెనర్ శిఖర్ ధావన్ ఐసీసీ టోర్నీల్లో వేగంగా వెయి్య పరుగుల్ని సాధించిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. ఈ క్రమంలో భారత మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న ఈ రికార్డును అధిగమించాడు. చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా జూన్ 11న దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డేలో ఈ ఘనతను నమోదు చేశాడు.
ఐసీసీ టోర్నీల్లో వేగవంతమైన వెయి్య పరుగుల్ని సాధించడానికి సచిన్ కు 18 ఇన్నింగ్‌స లు అవసరమైతే, ధావన్ 16 ఇన్నింగ్‌సల్లోనే పూర్తిచేశాడు.
క్విక్ రివ్యూ: ఏమిటి : ఐసీసీ టోర్నీల్లో వేగంగా వెయ్యి పరుగులు పూర్తి
ఎప్పుడు : జూన్ 11
ఎక్కడ : ఇంగ్లండ్‌లో
ఎవరు : శిఖర్ ధావన్
జాతీయ క్రికెట్ కోచ్‌ల పదవీకాలం రెండేళ్లుభారత క్రికెట్ జట్లకు సంబంధించిన కోచ్‌ల పదవీ కాలం రెండేళ్లపాటు ఉండాలని బీసీసీఐ పరిపాలక కమిటీ (సీఓఏ) నిర్ణయించింది. జూన్ 12 ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు అనుగుణంగా ఇక నుంచి అన్ని ఒప్పందాలు రెండేళ్ల పాటు ఉంటాయని సీఓఏ చైర్మన్ వినోద్ రాయ్ చెప్పారు. దీంతో జాతీయ జట్టు నుంచి అండర్-19 వరకు ఉండే కోచ్‌లు రెండు నెలల పాటు ఐపీఎల్‌లో పనిచేసే అవకాశం కోల్పోనున్నారు.
క్విక్ రివ్యూ: ఏమిటి : జాతీయ క్రికెట్ కోచ్‌లకు రెండేళ్ల పదవీకాలం
ఎప్పుడు : జూన్ 12
ఎవరు : బీసీసీఐ పరిపాలక కమిటీ
బీసీసీఐ పరిపాలకుల కమిటీకి రామచంద్ర గుహ రాజీనామా
ప్రముఖ చరిత్రకారుడు, రచయిత రామచంద్ర గుహ వ్యక్తిగత కారణాల పేరుతో బీసీసీఐ పరిపాలకుల కమిటీ (సీఓఏ)కి రాజీనామా చేశారు. కమిటీ నలుగురు సభ్యుల్లో ఒకరైన గుహ బీసీసీఐ, పరిపాలక కమిటీ పనితీరుపై పలు విమర్శలు చేస్తూ చైర్మన్ వినోద్ రాయ్‌కి లేఖ రాశారు. లోధా కమిటీ ఫిపార్సులను అమలు చేయడంలో అలసత్వం ప్రదర్శించిన అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, కార్యదర్శి అజయ్ షిర్కేలను తొలగిస్తూ సుప్రీం కోర్టు జనవరిలో నలుగురు సభ్యులతో బీసీసీఐకి పరిపాలకుల కమిటీని ఏర్పాటు చేసింది.
గుహ చేసిన విమర్శలు
- భారత జట్టుకు కోచ్‌లుగా పని చేసేవారు ఐపీఎల్ జట్లకూ కోచ్‌గా వ్యవహరించడం సరికాదు. రాహుల్ ద్రవిడ్, ఆర్.శ్రీధర్, సంజయ్ బంగర్, భరత్ అరుణ్‌లకు ఈ విషయంలో బోర్డు అపరిమిత స్వేచ్ఛ ఇచ్చింది. ఇదే విషయాన్ని సీఓఏ సమావేశాల్లో పలుసార్లు ప్రస్తావించారు.
- బీసీసీఐ కామెంటరీ టీమ్‌లో సభ్యుడిగా ఉన్న సునీల్ గావస్కర్ పీఎంజీ అనే ప్లేయర్ మేనేజ్‌మెంట్ కంపెనీకి యజమాని. ఇది శిఖర్ ధావన్, రిషభ్ పంత్ వ్యవహారాలను పర్యవేక్షిస్తుంది. ఆయన రెండింటిలో ఏదో ఒకదానికే పరిమితం కావాలి.
- సౌరవ్ గంగూలీ ఒక క్రికెట్ సంఘానికి అధ్యక్షుడిగా ఉంటూ కామెంటరీ కూడా చేయడం సరికాదు.
- రంజీ ట్రోఫీ మ్యాచ్‌లు ఆడే ఆటగాళ్లకు చెల్లింపులు ఒక క్రమపద్ధతిలో ఉండాలి.
- సుప్రీం కోర్టు మార్గదర్శకాల ప్రకారం అనర్హులైన అనేక మంది బోర్డు, రాష్ట్ర సంఘాల ఆఫీస్ బేరర్లు స్వేచ్ఛగా సమావేశాలకు హాజరయ్యారు. ఈ విషయంలో సీవోఏ సరిగా వ్యవహరించలేదు.
- సీవోఏలో ఒక పురుష క్రికెటర్ లేకపోవడం వల్ల కూడా అనేక సమస్యలు వచ్చాయి. కాబట్టి పురుష క్రికెటర్ తప్పనిసరిగా ఉండాలి.
- సూపర్ స్టార్ సంస్కృతి వల్ల కోచ్‌పై తమకు ప్రత్యేక అధికారం ఉందని సీనియర్ ఆటగాళ్లు భావిస్తున్నారు. ఎక్కడా లేని విధంగా కోచ్‌లు, కామెంటేటర్ల ఎంపిక విషయంలో ఆటగాళ్లు జోక్యం చేసుకోవడం తగదు.
- టెస్టులు ఆడలేనంటూ స్వయంగా రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కూడా ధోనీకి ‘ఎ’ గ్రేడ్ కాంట్రాక్ట్ ఇవ్వడం సరికాదు.
క్విక్ రివ్యూ:ఏమిటి : బీసీసీఐ పరిపాలక కమిటీ సభ్యుడిగా రాజీనామా
ఎప్పుడు : జూన్ 2
ఎవరు : రామచంద్ర గుహ
ఎందుకు : బీసీసీఐ, సీవోఏ పనితీరు నచ్చక
థాయ్‌లాండ్ ఓపెన్ గ్రాండ్‌ప్రి విజేత సాయిప్రణీత్
థాయ్‌లాండ్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నమెంట్‌లో భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ భమిడిపాటి సాయిప్రణీత్ చాంపియన్‌గా నిలిచాడు. జూన్ 4న 71 నిమిషాలపాటు హోరాహోరీగా సాగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో మూడో సీడ్ సాయిప్రణీత్ 17-21, 21-18, 21-19తో నాలుగో సీడ్ జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా)పై విజయం సాధించాడు. ఈ విజయంతో సాయిప్రణీత్‌కు 9,000 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 5 లక్షల 80 వేలు)తోపాటు 7,000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. భారత బ్యాడ్మింటన్ సంఘం రూ. 3 లక్షలు నజరానా ప్రకటించింది.
ఏప్రిల్ నెలలో సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ నెగ్గిన సాయిప్రణీత్ కెరీర్‌లో ఇది తొలి గ్రాండ్‌ప్రి గోల్డ్ టైటిల్.
క్విక్ రివ్యూ:ఏమిటి : థాయ్‌లాండ్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నమెంట్
ఎప్పుడు : జూన్ 4
ఎక్కడ : బ్యాంకాక్
ఎవరు : విజేత సాయి ప్రణీత్

- 1933లో మార్గరెట్ స్క్రివెన్ వివియన్ (బ్రిటన్) తర్వాత ఫ్రెంచ్ ఓపెన్‌లో విజేతగా నిలిచిన తొలి అన్‌సీడెడ్ క్రీడాకారిణిగా గుర్తింపు.
- కెరీర్‌లో తొలి ప్రొఫెషనల్ టైటిల్‌గా గ్రాండ్‌స్లామ్ టోర్నీని గెలుచుకున్న మూడో ప్లేయర్. మహిళల విభాగంలో బార్బరా జోర్డాన్ (1979 ఆస్ట్రేలియన్ ఓపెన్) ముందుగా ఈ రికార్డు నెలకొల్పగా... 1997 జూన్ 8న గుస్తావో కుయెర్టన్ (బ్రెజిల్) కూడా దానిని సాధించాడు. అదే రోజు పుట్టిన ఒస్టాపెంకో 20 ఏళ్ల తర్వాత మళ్లీ అలాంటి విజయాన్ని అందుకుంది.
- కేవలం 20 లక్షల జనాభా ఉన్న యూరోపియన్ దేశం లాత్వియా నుంచి గ్రాండ్‌స్లామ్ చాంపియన్‌గా అవతరించిన తొలి ప్లేయర్‌గా గుర్తింపు.

No comments:
Post a Comment