AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Sunday 26 November 2017

క్రీడలు అక్టోబరు 2017

క్రీడలు అక్టోబరు 2017
టెన్నిస్‌కు మార్టినా హింగిస్ వీడ్కోలు  స్విట్జర్లాండ్ దిగ్గజం, ప్రపంచ మాజీ నంబర్‌వన్ మార్టినా హింగిస్ టెన్నిస్‌కు వీడ్కోలు పలికింది. సింగపూర్‌లో ప్రస్తుతం జరుగుతోన్న డబ్ల్యూటీఏ ఫైనల్స్ తన ఆఖరి టోర్నీ అని 37 ఏళ్ల హింగిస్ అక్టోబర్ 26న ప్రకటించింది. 23 ఏళ్ల క్రితం ప్రొఫెషనల్‌గా మారిన హింగిస్ తన కెరీర్‌లో 5 సింగిల్స్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సహా మొత్తం 25 గ్రాండ్‌స్లామ్‌లు సాధించింది. 17 ఏళ్ల వయసులో అతి పిన్న వయసులో సింగిల్స్ నంబర్‌వన్ ర్యాంక్ సాధించిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించిన హింగిస్... ప్రస్తుతం డబుల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్‌గా కొనసాగుతోంది. గతంలో వేర్వేరు కారణాలతో రెండు సార్లు పదేళ్ల పాటు ఆటకు దూరమైన హింగిస్ 2013 నుంచి రెగ్యులర్‌గా డబుల్స్ ఆడుతోంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : టెన్నిస్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన మాజీ ప్రపంచ నవంబర్ వన్ 
ఎప్పుడు : అక్టోబర్ 26
ఎవరు : మార్టినా హింగిస్ 

అమెరికాలో గావస్కర్ గ్రౌండ్భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ పేరిట అమెరికాలో ఓ క్రికెట్ గ్రౌండ్ రూపుదిద్దుకుంది. కెంటకీ రాష్ట్రంలోని లూయిస్ విల్లేలో కొత్తగా నిర్మించిన ఈ మైదానాన్ని స్వయంగా గావస్కరే ప్రారంభించారు. ఇటీవలే జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో లూయిస్ విల్లే మేయర్ గ్రెగ్ ఫిష్చెర్ పాల్గొన్నారు. 42 జట్లు తలపడే ‘మిడ్‌వెస్ట్ క్రికెట్ లీగ్’లో ఈ మైదానం లూయిస్ విల్లే క్రికెట్ క్లబ్‌కు హోమ్ గ్రౌండ్‌గా ఉపయోగపడుతుంది.

షూటింగ్ ఫైనల్స్‌లో సంగ్రామ్, అమన్‌లకు పతకాలు సీజన్ ముగింపు టోర్నమెంట్ వరల్డ్ కప్ షూటింగ్ ఫైనల్స్‌లో సంగ్రామ్ దహియా, అమన్‌ప్రీత్ సింగ్ గురికి భారత్ ఖాతాలో రెండు పతకాలు చేరాయి. పురుషుల ‘డబుల్ ట్రాప్’ ఈవెంట్‌లో సంగ్రామ్ రజత పతకం సాధించగా... పురుషుల 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో అమన్‌ప్రీత్ సింగ్ కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు. 
ఆరుగురు పాల్గొన్న డబుల్ ట్రాప్ ఫైనల్లో సంగ్రామ్ 76 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంలో నిలువగా.. హు బిన్‌యువాన్ (చైనా-79 పాయింట్లు) ప్రపంచ రికార్డు సృష్టించడంతోపాటు స్వర్ణ పతకాన్ని కై వసం చేసుకున్నాడు. గాస్‌పరానీ దవీ (ఇటలీ-56 పాయింట్లు) కాంస్య పతకాన్ని సంపాదించాడు. భారత్‌కే చెందిన ప్రపంచ నంబర్‌వన్ అంకుర్ మిట్టల్ 45 పాయింట్లతో నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్ ఫైనల్లో అమన్‌ప్రీత్ సింగ్ 202.2 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచాడు. 

శ్రీకాంత్కు ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్‌ను భారత బ్యాడ్మింటన్ స్టార్ కిడాంబి శ్రీకాంత్ కైవసం చేసుకున్నాడు. పారిస్‌లో అక్టోబర్ 29న జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ నాలుగో ర్యాంకర్ శ్రీకాంత్ 21-14, 21-13తో 40వ ర్యాంకర్, క్వాలిఫయర్ కెంటా నిషిమోటో (జపాన్)పై గెలిచాడు. తద్వారా లిన్ డాన్ (చైనా), లీ చోంగ్ వీ (మలేసియా), చెన్ లాంగ్ (చైనా) తర్వాత ఒకే ఏడాది కనీసం నాలుగు సూపర్ సిరీస్ టైటిల్స్ నెగ్గిన నాలుగో ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. దీంతోపాటు ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ నెగ్గిన తొలి భారతీయ క్రీడాకారుడిగా గుర్తింపు పొందాడు. 
శ్రీకాంత్ 2017లో ఆస్ట్రేలియన్ ఓపెన్, ఇండోనేసియా ఓపెన్, డెన్మార్క్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్స్ నెగ్గాడు. సింగపూర్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచాడు. ఓవరాల్‌గా శ్రీకాంత్ కెరీర్‌లో ఇది ఆరో సూపర్ సిరీస్ టైటిల్. విజేతకు 24,375 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 15 లక్షల 85 వేలు)తోపాటు 9,200 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ విజేత
ఎప్పుడు : అక్టోబర్ 29
ఎవరు : కిడాంబి శ్రీకాంత్
ఎక్కడ : పారిస్

బోపన్న జంటకు ఎర్‌స్టీ ఓపెన్ ఏటీపీ టైటిల్ఎర్‌స్టీ ఓపెన్ ఏటీపీ-500 టెన్నిస్ టోర్నమెంట్‌లో భారత డబుల్స్ నంబర్‌వన్ ప్లేయర్ రోహన్ బోపన్న టైటిల్ సాధించాడు. ఆస్ట్రియా రాజధాని వియన్నాలో అక్టోబర్ 29న జరిగిన ఫైనల్లో బోపన్న-పాబ్లో క్యువాస్ (ఉరుగ్వే) ద్వయం మార్సెలో డెమోలైనర్ (బ్రెజిల్)-సామ్ క్వెరీ (అమెరికా) జంటపై గెలిచింది.
బోపన్నకు ఈ ఏడాది ఇది మూడో డబుల్స్ టైటిల్ కాగా ఓవరాల్‌గా 16వ టైటిల్. విజేతకు 1,32,030 యూరోల (రూ. 9 లక్షల 96 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 500 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఎర్‌స్టీ ఓపెన్ ఏటీపీ-500 టెన్నిస్ టోర్నమెంట్ విజేత
ఎప్పుడు : అక్టోబర్ 29
ఎవరు : బోపన్న-పాబ్లో క్యువాస్
ఎక్కడ : ఆస్ట్రియా రాజధాని వియన్నా

వియత్నాం ఓపెన్ టైటిల్ విజేత సాకేత్ మైనేనిఆంధ్రప్రదేశ్ టెన్నిస్ ప్లేయర్ సాకేత్ మైనేని వియత్నాం ఓపెన్ టోర్నమెంట్‌లో డబుల్స్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. అక్టోబర్ 29న హో చి మిన్ సిటీలో జరిగిన ఈ టోర్నీలో సాకేత్-విజయ్ సుందర్ ప్రశాంత్ (భారత్) ద్వయం గో సొయెదా-బెన్ మెక్లాచ్లాన్ (జపాన్) జంటపై విజయం సాధించింది. సాకేత్ కెరీర్‌లో ఇది ఏడో ఏటీపీ చాలెంజర్ డబుల్స్ టైటిల్. విజేతకు 3,100 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 2 లక్షలు)తోపాటు 80 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : వియత్నాం ఓపెన్ డబుల్స్ టైటిల్ విజేత
ఎప్పుడు : అక్టోబర్ 29
ఎవరు : సాకేత్ మైనేని-విజయ్ సుందర్ ప్రశాంత్
ఎక్కడ : హో చి మిన్ సిటీ, వియత్నాం

టీ20ల్లో మిల్లర్ వేగవంతమైన సెంచరీదక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్ డేవిడ్ మిల్లర్ బంగ్లాదేశ్‌పై జరిగిన మ్యాచ్‌లో 35 బంతుల్లో వంద పరుగులు చేసి అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగవంతమైన సెంచరీ నమోదు చేశాడు. దీంతో దక్షిణాఫ్రికాకే చెందిన రిచర్డ్ లెవీ (న్యూజిలాండ్‌పై 45 బంతుల్లో 100) పేరిట ఉన్న రికార్డును తిరగ రాశాడు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : టీ20ల్లో వేగవంతమైన సెంచరీ
ఎప్పుడు : అక్టోబర్ 29
ఎవరు : డేవిడ్ మిల్లర్ (దక్షిణాఫ్రికా)

న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ భారత్ కైవసంన్యూజిలాండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను భారత్ కైవసం చేసుకుంది. అక్టోబర్ 29న జరిగిన చివరి వన్డేలో న్యూజిలాండ్‌పై 6 పరుగుల తేడాతో గెలిచింది. రోహిత్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’, కోహ్లికి ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కాయి. 
ఇదే మ్యాచ్‌లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ 9000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. తద్వారా అతి తక్కువ కాలంలో (9 ఏళ్ల 72 రోజులు) 9 వేల పరుగులు చేసిన తొలి బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించాడు. ఈ మైలురాయిని చేరుకోవడానికి ద్రవిడ్‌కు 9 ఏళ్ల 322 రోజులు, డివిలియర్స్ (దక్షిణాఫ్రికా)కు 12 ఏళ్లు పట్టాయి.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ విజేత
ఎప్పుడు : అక్టోబర్ 29
ఎవరు : భారత్

అండర్-17 ఫుట్‌బాల్ ప్రపంచకప్ విజేత ఇంగ్లండ్భారతదేశంలో తొలిసారి నిర్వహించిన ‘ఫిఫా’ అండర్-17 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ విజేతగా నిలిచింది. అక్టోబర్ 28న కోల్‌కతాలోని సాల్ట్‌లేక్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్ 5-2 తేడాతో స్పెయిన్‌ను ఓడించింది. టోర్నీలో నాలుగోసారి ఫైనల్‌కు చేరిన స్పెయిన్ మళ్లీ రన్నరప్‌గా నిలిచింది. ఫాడెన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ టోర్నమెంట్’ అవార్డు దక్కింది. ఇంగ్లండ్ 2017లోనే అండర్-20 ప్రపంచకప్‌ను కూడా గెలుచుకుంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : అండర్-17 ఫుట్‌బాల్ ప్రపంచకప్ విజేత 
ఎప్పుడు : అక్టోబర్ 28
ఎవరు : ఇంగ్లండ్
ఎక్కడ : కోల్‌కతా

ప్రొ కబడ్డీ లీగ్ విజేత పట్నా పైరేట్స్ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) సీజన్-5 విజేతగా పట్నా పైరేట్స్ నిలిచింది. అక్టోబర్ 28న చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఫైనల్‌లో 55-38 స్కోరుతో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్‌ను ఓడించింది. తద్వారా వరుసగా మూడోసారి పీకేల్ టైటిల్‌ను కైవసం చేసుకుంది.
ఈ టోర్నీలో ప్రదీప్ నర్వాల్‌ను పర్‌ఫెక్ట్ రైడర్ (రూ. 50 వేలు), బెస్ట్ డూ ఆర్ డై రైడర్ (రూ.50 వేలు), స్టార్ స్పోర్‌‌ట్స మూమెంట్ ఆఫ్ ద మ్యాచ్ (రూ. 50 వేలు), ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ (రూ. 50 వేలు), లీగ్ టాప్ స్కోరర్ (రూ.10 లక్షలు), రైడర్ ఆఫ్ ద టోర్నీ (రూ. 10 లక్షలు), మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ (రూ. 15 లక్షలు) అవార్డులు వరించాయి. ఉత్తమ అరంగేట్ర ఆటగాడు అవార్డు సచిన్ (గుజరాత్; రూ. 10 లక్షలు), డిఫెండర్ ఆఫ్ ద టోర్నీ అవార్డు సురేందర్ నాడా (హరియాణా; రూ. 10 లక్షలు)కు లభించాయి.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ప్రొ కబడ్డీ లీగ్ సీజన్-5 విజేత 
ఎప్పుడు : అక్టోబర్ 28
ఎవరు : పట్నా పైరేట్స్
ఎక్కడ : చెన్నై

హామిల్టన్‌కు ఫార్ములావన్ ప్రపంచ టైటిల్బ్రిటన్‌కు చెందిన మెర్సిడెస్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ నాలుగోసారి ఫార్ములావన్ ప్రంపంచ టైటిల్‌ను చేజిక్కించుకున్నాడు. టైటిల్ కోసం సెబాస్టియన్ వెటెల్‌తో నెలకొన్న మెక్సికో గ్రాండ్ ప్రి పోటీలో రెడ్‌బుల్ డ్రైవర్ వెర్‌స్టాపెన్ టైటిల్ గెలిచాడు. దీంతో వెటెల్ (ఫెరారీ టీమ్) మిగిలి ఉన్న రెండు గ్రాండ్‌ప్రి (బ్రెజిలియన్, అబుదాబి)లను గెలిచినా హామిల్టన్‌ను చేరుకోలేడు. తద్వారా 2017 ప్రపంచ టైటిల్ హామిల్టన్ వశమైంది.
తొలి సారి 2008లో మెక్‌లారెన్ తరఫున టైటిల్ గెలిచిన హామిల్టన్ తర్వాత మెర్సిడెస్‌తో చేరాడు. 2014, 2015 సంవత్సరాల్లో వరుసగా రెండుసార్లు డ్రైవర్స్ చాంపియన్‌షిప్ గెలిచాడు. ఈ సీజన్‌లో అతను 9 రేసుల్లో గెలిచి 333 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. వెటెల్ 277 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.
క్విక్ రివ్యూ:ఏమిటి : ఫార్ములావన్ ప్రపంచ టైటిల్ విజేత
ఎప్పుడు : అక్టోబర్ 29 
ఎవరు : లూయిస్ హామిల్టన్

ఐసీసీ ర్యాంకుల్లో కోహ్లి, మిథాలీ రాజ్ టాప్భారత క్రికెట్ కెప్టెన్లు విరాట్ కోహ్లి, మిథాలీ రాజ్ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్‌‌సలో అగ్రస్థానంలో ఉన్నారు.
అక్టోబర్‌లో న్యూజిలాండ్‌తో ముగిసిన వన్డే సిరీస్‌లో 263 పరుగులు చేసిన కోహ్లి 889 రేటింగ్ పాయింట్లతో ఐసీసీ వన్డే బ్యాట్స్‌మన్ ర్యాంకింగ్‌‌సలో అగ్రస్థానంలో నిలిచాడు. తద్వారా 1998లో సచిన్ పేరిట ఉన్న 887 రేటింగ్ పాయింట్ల రికార్డును అధిగమించాడు. 
తాజా వన్డే బ్యాట్స్‌ఉమెన్ ర్యాంకింగ్‌‌సలో మిథాలీ ఒక స్థానాన్ని మెరుగుపర్చుకొని 753 రేటింగ్ పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో నిలిచింది. తదుపరి రెండు, మూడు ర్యాంకుల్లో ఎలైస్ పెర్రీ (ఆస్ట్రేలియా; 725), అమి శాటెర్త్‌వైట్ (న్యూజిలాండ్; 720) నిలిచారు.
న్యూజిలాండ్‌పై గెలిచినప్పటికీ భారత్ (119) 2 పాయింట్ల లోటుతో రెండో స్థానంలోనే ఉంది. దక్షిణాఫ్రికా (121) అగ్రస్థానంలో ఉంది.
క్విక్ రివ్యూ:ఏమిటి : ఐసీసీ వన్డే ర్యాంకింగ్‌‌సలో అగ్రస్థానం
ఎప్పుడు : అక్టోబర్ 30 
ఎవరు : విరాట్ కోహ్లీ

సీనియర్ బాక్సింగ్ టోర్నమెంట్‌లో మనోజ్‌కు స్వర్ణంవిశాఖపట్నంలో ముగిసిన జాతీయ సీనియర్ ఎలైట్ పురుషుల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో మనోజ్ కుమార్ స్వర్ణపతకం గెలుచుకున్నాడు. అక్టోబర్ 30న జరిగిన 69 కేజీల విభాగం ఫైనల్లో మనోజ్ 4-1తో దుర్యోధన్‌సింగ్‌పై విజయం సాధించాడు.
60 కేజీల విభాగంలో శివ థాపా మనీశ్ చేతిలో ఓడిపోయి రజతం గెలుచుకున్నాడు. ఈ టోర్నీలో మనోజ్ ‘బెస్ట్ బాక్సర్’గా నిలవగా.. మనీశ్ ‘మోస్ట్ ప్రామిసింగ్ బాక్సర్’ ఘనత దక్కించుకున్నాడు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కాకర శ్యామ్ కుమార్ 49 కేజీల విభాగంలో ఎన్టీ లాల్‌బియాకిమా (మిజోరం)పై 3-2తో గెలిచి స్వర్ణపతకం సాధించాడు.
క్విక్ రివ్యూ:ఏమిటి : సీనియర్ బాక్సింగ్ టోర్నమెంట్ విజేత
ఎప్పుడు : అక్టోబర్ 30
ఎవరు : మనోజ్ కుమార్
ఎక్కడ : విశాఖపట్నం

కామన్వెల్త్ షూటింగ్‌లో హీనాకు స్వర్ణంకామన్వెల్త్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్ హీనా సిద్ధూ స్వర్ణం సాధించింది. అక్టోబర్ 31న ప్రారంభమైన మహిళల 10 మీ. ఎయిర్ రైఫిల్ ఈవెంట్ ఫైనల్లో హీనా 240.8 పాయింట్లు స్కోర్ చేసి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఆస్ట్రేలియాకు చెందిన ఎలీనా గాలియాబొవిచ్ (238.2), క్రిస్టీ గిల్‌మెన్ (213.7) వరుసగా రజత, కాంస్య పతకాలు గెలుచుకున్నారు. హీనా ఇటీవలే ఢిల్లీలో జరిగిన వరల్డ్‌కప్ ఫైనల్స్ షూటింగ్ టోర్నీ మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలోనూ పసిడి పతకాన్ని సాధించింది. 
క్విక్ రివ్యూ:ఏమిటి : కామన్వెల్త్ షూటింగ్ చాంపియన్‌షిప్ - 2017 
ఎప్పుడు : అక్టోబర్ 31
ఎవరు : భారత షూటర్ హీనా సిద్ధూకు స్వర్ణం
ఎక్కడ : బ్రిస్బేన్, ఆస్ట్రేలియా 
ఎందుకు : 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో

డెన్మార్క్ ఓపెన్ చాంపియన్ కిడాంబి శ్రీకాంత్ డెన్మార్క్ ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ కైవసం చేసుకున్నాడు. అక్టోబర్ 22న జరిగిన ఫైనల్లో ప్రపంచ 8వ ర్యాంకర్ శ్రీకాంత్ 21-10, 21-5తో ప్రపంచ 22వ ర్యాంకర్ లీ హున్ ఇల్ (దక్షిణ కొరియా)ను ఓడించి.. కెరీర్‌లో మూడో సూపర్ సిరీస్ టైటిల్‌ను దక్కించుకున్నాడు. విజేతగా నిలిచిన శ్రీకాంత్‌కు 56,250 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 36 లక్షల 58 వేలు)తోపాటు 11,000 ర్యాంకింగ్ పాయింట్లు... రన్నరప్ లీ హున్ ఇల్‌కు 28,500 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 18 లక్షల 53 వేలు)తోపాటు 9,350 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. 
డెన్మార్క్ ఓపెన్‌లో పురుషుల సింగిల్స్ టైటిల్ భారత ప్లేయర్‌కు లభించడం 37 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. 1980లో ప్రకాశ్ పదుకొనె ఈ టైటిల్‌ను సాధించగా... ఇపుడు శ్రీకాంత్ ఆయన సరసన నిలిచాడు. మహిళల సింగిల్‌లో మాత్రం 2012లో సైనా నెహ్వాల్ ఈ టైటిల్‌ను సాధించింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : డెన్మార్క్ ఓపెన్ సూపర్ సీరీస్ ప్రీమియర్ టైటిల్ - 2017
ఎప్పుడు : అక్టోబర్ 22
ఎవరు : పురుషుల సింగిల్స్ విజేత కిడాంబి శ్రీకాంత్ 

హాకీ ఆసియా కప్ విజేత భారత్ సీనియర్ పురుషుల హాకీ ఆసియా కప్‌ని భారత్ గెలుచుకుంది. బంగ్లాదేశ్‌లోని ఢాకా వేదికగా అక్టోబర్ 22న జరిగిన ఫైనల్లో మన్‌ప్రీత్ సింగ్ నాయకత్వంలోని భారత్ 2-1 గోల్స్ తేడాతో మలేసియాను ఓడించింది. తద్వారా పదేళ్ల తర్వాత కప్‌ను కైవసం చేసుకుంది. మొత్తంగా ఎనిమిదోసారి ఆసియా కప్‌లో ఫైనల్‌కు చేరిన భారత్ 2003, 2007, 2017లలో విజేతగా నిలిచి... 1982, 1985, 1989, 1994, 2013లలో రన్నరప్‌గా నిలిచింది. 
టోర్నీ అవార్డులు 
మ్యాన్ ఆఫ్ ద ఫైనల్: ఆకాశ్‌దీప్ సింగ్ (భారత్) 
గోల్ ఆఫ్ ద ఫైనల్: లలిత్ ఉపాధ్యాయ్ (భారత్) 
టోర్నీ బెస్ట్ గోల్: హర్మన్‌ప్రీత్ సింగ్ (భారత్) 
ప్రామిసింగ్ ప్లేయర్: అర్షద్ హుస్సేన్ (బంగ్లాదేశ్) 
బెస్ట్ గోల్‌కీపర్: ఆకాశ్ చిక్టే (భారత్) 
టాప్ స్కోరర్స్: హర్మన్‌ప్రీత్ సింగ్ (భారత్-7 గోల్స్), ఫైజల్ సారి (మలేసియా-7 గోల్స్) 
బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ: ఫైజల్ సారి (మలేసియా) 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : హాకీ ఆసియా కప్ - 2017 
ఎప్పుడు : అక్టోబర్ 22
ఎవరు : విజేత భారత్ 
ఎక్కడ : ఢాకా, బంగ్లాదేశ్ 

హామిల్టన్‌కు అమెరికా గ్రాండ్ ప్రీ టైటిల్ ఫార్ములావన్ సీజన్‌లో భాగంగా జరిగిన అమెరికా గ్రాండ్‌ప్రి రేసులో బ్రిటన్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ విజేతగా నిలిచాడు. అక్టోబర్ 23న జరిగిన ఈ రేసులో హామిల్టన్ నిర్ణీత 56 ల్యాప్‌లను గంటా 33 నిమిషాల 50.991 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. వెటెల్ (ఫెరారీ), రైకోనెన్ (ఫెరారీ), వెర్‌స్టాపెన్ (రెడ్‌బుల్), బొటాస్ (మెర్సిడెస్) వరుసగా రెండు నుంచి నాలుగు స్థానాల్లో నిలిచారు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా డ్రైవర్లు ఒకాన్, పెరెజ్ వరుసగా ఆరు, ఎనిమిది స్థానాలను సంపాదించారు. ఈ సీజన్‌లో హామిల్టన్‌కిది తొమ్మిదో విజయం. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : అమెరికా గ్రాండ్ ప్రీ - 2017
ఎప్పుడు : అక్టోబర్ 23
ఎవరు : విజేత లూయిస్ హామిల్టన్ 

యూరోపియన్ ఓపెన్‌లో దివిజ్ జంటకు టైటిల్ భారత డబుల్స్ టెన్నిస్ ప్లేయర్ దివిజ్ శరణ్ తన కెరీర్‌లో మూడో ఏటీపీ టూర్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. యూరోపియన్ ఓపెన్ ట్రోఫీ టోర్నీలో తన భాగస్వామి స్కాట్ లిప్‌స్కీ (అమెరికా)తో కలిసి దివిజ్ శరణ్ డబుల్స్ విభాగంలో విజేతగా నిలిచాడు. ఫైనల్లో దివిజ్ శరణ్-స్కాట్ లిప్‌స్కీ ద్వయం 6-4, 2-6, 10-5తో ‘సూపర్ టైబ్రేక్’లో శాంటియాగో గొంజాలెజ్ (మెక్సికో)-జూలియో పెరాల్టా (చిలీ) జోడీపై విజయం సాధించింది. విజేతగా నిలిచిన దివిజ్-లిప్‌స్కీ జంటకు 31,910 యూరోల (రూ. 24 లక్షల 38 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 250 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : యూరోపియన్ ఓపెన్ ట్రోఫీ టోర్నమెంట్ - 2017
ఎప్పుడు : అక్టోబర్ 23
ఎవరు : దివిజ్ శరణ్-స్కాట్ లిప్‌స్కీకి డబుల్స్ టైటిల్ 
ఎక్కడ : బెల్జియం 

వరల్డ్ కప్ ఫైనల్స్ షూటింగ్‌లో జీతూ-హీనాకు స్వర్ణం ప్రతిష్టాత్మక వరల్డ్ కప్ ఫైనల్స్ షూటింగ్ టోర్నమెంట్‌లో భారత స్టార్ షూటర్స్ జీతూ రాయ్ - హీనా సిద్ధూ ద్వయం పసిడి పతకాన్ని గెలుచుకుంది. అక్టోబర్ 24న జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ ఈవెంట్ ఫైనల్లో జీతూ-హీనా జంట 483.4 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలిచింది. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో తొలిసారి 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగాన్ని మెడల్ ఈవెంట్‌గా ప్రవేశపెట్టనున్నారు. గొబెర్‌విల్లీ-ఫౌకెట్ (ఫ్రాన్‌‌స-481.1 పాయింట్లు) జంట రజతం నెగ్గగా... యాంగ్ వీ-కాయ్ జియోజుయ్ (చైనా-418.2 పాయింట్లు) జోడీ కాంస్యం సాధించింది. మొత్తంగా ఈ ఏడాది 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ ఈవెంట్‌లో భారత్‌కు లభించిన మూడో స్వర్ణమిది. న్యూఢిల్లీ, గబాలాలలో జరిగిన ప్రపంచకప్ టోర్నీల్లో జీతూ-హీనా జంట పసిడి పతకాలు గెలిచింది.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : వరల్డ్ కప్ షూటింగ్ ఫైనల్స్ 
ఎప్పుడు : అక్టోబర్ 24
ఎవరు : 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ ఈవెంట్ ఫైనల్లో జీతూ - హీనాకు స్వర్ణం 
ఎక్కడ : న్యూఢిల్లీలో 

ప్రపంచ ఉత్తమ ఫుట్‌బాల్ ప్లేయర్‌గా రొనాల్డో పోర్చుగల్ జట్టు కెప్టెన్, రియల్ మాడ్రిడ్ క్లబ్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో 2017 సంవత్సరానికి గాను ప్రపంచ ఉత్తమ ఫుట్‌బాల్ ప్లేయర్ పురస్కారాన్ని గెల్చుకున్నాడు. ఈ క్యాలెండర్ సంవత్సరంలో రొనాల్డో 48 మ్యాచ్‌లు ఆడి 44 గోల్స్ చేశాడు. అంతేకాకుండా రియల్ మాడ్రిడ్ జట్టుకు లా లీగా (స్పానిష్ లీగ్), చాంపియన్‌‌స లీగ్ టైటిల్స్‌ను అందించాడు. తన అద్భుత ప్రతిభతో వచ్చే ఏడాది రష్యాలో జరిగే ప్రపంచకప్‌కు పోర్చుగల్ అర్హత సాధించడంలో రొనాల్డో కీలకపాత్ర పోషించాడు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ప్రపంచ ఉత్తమ ఫుట్‌బాల్ ప్లేయర్ - 2017
ఎప్పుడు : అక్టోబర్ 24
ఎవరు : క్రిస్టియానో రొనాల్డో 

గగన్‌జీత్‌కు మకావ్ ఓపెన్ గోల్ఫ్ టైటిల్మకావ్ ఓపెన్ గోల్ఫ్ టైటిల్‌ను గగన్‌జీత్ భుల్లర్(భారత్) గెలుచుకున్నాడు. మకావ్‌లో అక్టోబర్ 22న ముగిసిన ట్రోఫీలో ఈ టైటిల్ సాధించాడు. భుల్లర్ ఈ టైటిల్ సాధించడం ఇది రెండోసారి. అజితేష్ సందూ (భారత్), అంగెలో క్యూయి(ఫిలిప్పీన్స్) సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు.

ఫుట్‌బాల్ ఆసియా కప్-2019కు భారత్ అర్హత 
 ప్రతిష్టాత్మక ఆసియా కప్ 2019 ఫుట్‌బాల్ టోర్నమెంట్‌కు భారత్ అర్హత సాధించింది. మకావుతో బెంగళూరులో అక్టోబర్ 11న జరిగిన మ్యాచ్‌లో భారత్ 4-1తో గెలిచింది. భారత్ తరఫున రౌలిన్ బోర్జెస్, కెప్టెన్ సునీల్ చెత్రి, జెజె లాల్‌పెకులువా ఒక్కో గోల్ చేశారు. 70వ నిమిషంలో మకావు ఆటగాడు లామ్ కా సెంగ్ సెల్ఫ్ గోల్ సాధించగా... 37వ నిమిషంలో నికొలస్ తరావు మకావుకు తొలి గోల్ అందించాడు. 2019 ఆసియా కప్ యూఏఈలో జరుగుతుంది. 2011 తర్వాత ఈ మెగా ఈవెంట్‌కు భారత్ మరోసారి అర్హత పొందింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఫుట్‌బాల్ ఆసియా కప్-2019కు భారత్ అర్హత 
ఎప్పుడు : అక్టోబర్ 11
ఎక్కడ : యూఏఈలో జరగనున్న టోర్నీ

ఢిల్లీ హాఫ్ మారథాన్ ప్రచారకర్తగా ఎర్విన్ ఢిల్లీ హాఫ్ మారథాన్ పదో ఎడిషన్ ప్రచారకర్తగా నాలుగుసార్లు ఒలింపిక్ పతక విజేత, అమెరికా దిగ్గజ స్విమ్మర్ ఆంటోనీ ఎర్విన్ నియమితులయ్యారు. ఒలింపిక్స్‌లో 50 మీ. ఫ్రీస్టైల్ ఈవెంట్‌లో పతకం సాధించిన అత్యంత యువ ఆటగాడితోపాటు పెద్దవయస్కుడైన ఆటగాడిగా ఎర్విన్ ఘనత సాధించాడు. తొలుత 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో పతకం సాధించిన ఎర్విన్ తాజాగా ముగిసిన రియో ఒలింపిక్స్ (2016)లోనూ పతకం దక్కించుకున్నాడు. ఈక్రమంలో 36 ఏళ్ల వయసులో బంగారు పతకం సాధించిన ఆటగాడిగా ఎర్విన్.. సహచరుడు మైకేల్ ఫెల్‌‌ఫ్స రికార్డును సవరించాడు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఢిల్లీ హాఫ్ మారథాన్ ప్రచారకర్తగా ఎర్విన్ 
ఎప్పుడు : అక్టోబర్ 11
ఎవరు : ఎర్విన్ అమెరికా దిగ్గజ స్విమ్మర్

టెస్టు చాంపియన్‌షిప్ నిర్వహణకు ఐసీసీ నిర్ణయం అంతర్జాతీయ క్రికెట్‌లో తొమ్మిది దేశాలతో టెస్టు చాంపియన్‌షిప్ నిర్వహించాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి - ఐసీసీ అధికారికంగా నిర్ణయించింది. దీంతో పాటు కొత్తగా అంతర్జాతీయ వన్డే లీగ్‌ను కూడా జరుపుతామని ప్రకటించింది. ఇందులో 13 దేశాలు పాల్గొంటాయి. అయితే ఈ రెండు లీగ్‌లకు సంబంధించిన షెడ్యూల్, పాయింట్ల పద్ధతి, వేదికలను తర్వాత ప్రకటించనున్నారు. అక్టోబర్ 13న ఆక్లాండ్‌లో జరిగిన ఐసీసీ బోర్డు సమావేశంలో ఈ మేరకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 
కీలక నిర్ణయాలు.. 
  • టెస్టు లీగ్‌లో మొత్తం తొమ్మిది జట్లు పాల్గొంటాయి. 2019 నుంచి రెండేళ్ల పాటు ఆరు సిరీస్‌లు ఆడతాయి. ఇందులో ఒక్కో జట్టు మూడు సిరీస్‌లు స్వదేశంలో... మూడింటిని విదేశాల్లో ఆడాల్సి ఉంటుంది. అన్ని మ్యాచ్‌లు ఐదు రోజుల పాటు జరుగుతాయి.
  • ప్రతీ జట్టు కనీసం రెండు టెస్టులు... గరిష్టంగా ఐదు టెస్టులు ఆడాల్సి ఉంటుంది. చివరగా రెండు జట్లు ప్రపంచ టెస్టు లీగ్ ఫైనల్లో తలపడతాయి.
  • 2020-2021లో జరిగే వన్డే లీగ్‌లో మొత్తం 13 దేశాలు పాల్గొంటాయి. ఇందులో 12 శాశ్వత సభ్య దేశాలు కాగా ఐసీసీ వరల్డ్ క్రికెట్ లీగ్ చాంపియన్‌షిప్‌లో విజేత మరో జట్టుగా ఉంటుంది.
  • 2019లో జరిగే వన్డే ప్రపంచకప్ వరకు టాప్-10 సభ్య దేశాలు పరస్పర అంగీకారం మేరకు నాలుగు రోజుల టెస్టులను ప్రయోగాత్మకంగా జరుపుకోవచ్చు. జింబాబ్వే, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగే బాక్సింగ్ డే టెస్టు తొలిసారిగా ఇందుకు వేదికయ్యే అవకాశాలున్నాయి.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : టెస్ట్ చాంపియన్‌షిప్ నిర్వహణకు నిర్ణయం 
ఎప్పుడు : అక్టోబర్ 13 
ఎవరు : ఐసీసీ 

ఫెడరర్‌కు షాంఘై మాస్టర్స్ సిరీస్ టైటిల్ షాంఘై ఓపెన్ ఏటీపీ మాస్టర్స్ సిరీస్ టోర్నమెంట్‌లో 36 ఏళ్ల స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ చాంపియన్‌గా నిలిచాడు. ఈ మేరకు తన చిరకాల ప్రత్యర్థి, ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ రాఫెల్ నాదల్ (స్పెయిన్)తో అక్టోబర్ 15న జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఫెడరర్ 6-4, 6-3తో విజయం సాధించాడు. తద్వారా సీజన్‌లో ఆరో టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఓవరాల్‌గా ఫెడరర్ కెరీర్‌లో ఇది 94వ టైటిల్. 
ఈ విజయంతో అత్యధిక సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన క్రీడాకారుల జాబితాలో ఇవాన్ లెండిల్ (94) సరసన ఫెడరర్ సంయుక్తంగా రెండో స్థానానికి చేరుకున్నాడు. అమెరికా స్టార్ జిమ్మీ కానర్స్ (109 టైటిల్స్) అగ్రస్థానంలో ఉన్నాడు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : షాంఘై ఓపెన్ ఏటీపీ మాస్టర్స్ సీరీస్ టోర్నమెంట్ - 2017 
ఎప్పుడు : అక్టోబర్ 15 
ఎవరు : పురుషుల సింగిల్స్ విజేత రోజర్ ఫెడరర్ 
ఎక్కడ : చైనాలో 

హారిక జట్టుకు ‘యూరోపియన్’ టైటిల్ భారత గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక సభ్యురాలిగా ఉన్న బతూమి చెస్ క్లబ్ నోనా జట్టు ప్రతిష్టాత్మక యూరోపియన్ చెస్ క్లబ్ కప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. 12 క్లబ్ జట్ల మధ్య జరిగిన ఈ టోర్నీలో హారిక బృందం 17.5 పాయింట్లతో అగ్రస్థానాన్ని సంపాదించింది. హారిక జట్టులో నానా జాగ్‌నిద్జె, నినో బతియాష్‌విలి, బేలా ఖొటెనాష్‌విలి, మెలియా సలోమి (జార్జియా) మిగతా సభ్యులుగా ఉన్నారు. ఈ టోర్నీలో హారిక తాను ఆడిన ఆరు గేమ్‌లను ‘డ్రా’గా ముగించింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : బతూమి చెస్ క్లబ్ నోనా జట్టుకి యూరోపియన్ చెస్ క్లబ్ టైటిల్ 
ఎప్పుడు : అక్టోబర్ 15 
ఎవరు : జట్టులో సభ్యురాలిగా భారత గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక 

తియాన్‌జిన్ ఓపెన్ మహిళల సింగిల్స్ విజేత షరపోవా రష్యా టెన్నిస్ స్టార్ మరియా షరపోవా రెండున్నరేళ్ల తర్వాత తొలి టైటిల్‌ను సొంతం చేసుకుంది. చైనాలో అక్టోబర్ 15న జరిగిన తియాన్‌జిన్ ఓపెన్ మహిళల సింగిల్స్‌లో షరపోవా విజేతగా నిలిచింది. ఫైనల్లో 7-5, 7-6 (8/6)తో అర్యానా సబలెంకా (బెలారస్)పై విజయం సాధించింది. గతేడాది డోపింగ్‌లో పట్టుబడి 15 నెలల నిషేధం ఎదుర్కొన్న షరపోవా ఈ ఏడాది ఏప్రిల్‌లో పునరాగమనం చేసింది. చివరిసారి షరపోవా 2015 మేలో రోమ్ ఓపెన్‌లో టైటిల్ గెలిచింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : తియాన్‌జిన్ ఓపెన్ సూపర్ సీరీస్ టోర్నమెంట్ - 2017 
ఎప్పుడు : అక్టోబర్ 15 
ఎవరు : మారియా షరపోవా 
ఎక్కడ : చైనాలో

భారత్‌లో వరల్డ్ రెజ్లింగ్ పోటీలు వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ (WWE) పోటీలు 2017లో భారత్‌లో జరగనున్నాయి. డిసెంబర్ 8, 9 తేదీల్లో న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో డబ్ల్యూడబ్ల్యూఈ పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ పోటీల్లో భారత సంతతికి చెందిన కెనడా జాతీయుడు, ‘ద మాడర్న్ డే ఆఫ్ మహారాజా’గా ప్రసిద్ధి చెందిన జిందర్ మహల్ ప్రధాన ఆకర్షణగా నిలువనున్నాడు. పంజాబ్‌కు చెందిన యువరాజ్ సింగ్ దేశీ.. 2011లో జిందర్ మహల్ పేరుతో డబ్ల్యూడబ్ల్యూఈలో ప్రఖ్యాతి గాంచాడు. డబ్ల్యూడబ్ల్యూఈ చరిత్రలో జిందాల్ 50వ చాంపియన్ కాగా ఈ ఘనత సాధించిన తొలి భారతీయ ప్లేయర్.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : భారత్‌లో వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ పోటీలు
ఎప్పుడు : డిసెంబర్ 8, 9
ఎక్కడ : న్యూఢిల్లీ

అండర్-19 ప్రపంచకప్ ప్రచారకర్తగా అండర్సన్ఐసీసీ 2018 అండర్-19 ప్రపంచకప్ ప్రచారకర్త (Ambassador)గా న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ కోరీ అండర్సన్ అక్టోబర్ 5న నియమితుడయ్యాడు. ఈ టోర్నీని 2018 జనవరి 13-ఫిబ్రవరి 3 మధ్య న్యూజిలాండ్‌లో నిర్వహించనున్నారు. ఇప్పటివరకు భారత్, ఆసీస్‌లు మూడుసార్లు కప్ నెగ్గగా.. పాక్ రెండుసార్లు, విండీస్, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌లు ఒక్కోసారి గెలిచాయి. మొత్తం 17 దేశాలు టోర్నమెంటులో పాల్గొననున్నాయి.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఐసీసీ 2018 అండర్-19 ప్రపంచకప్ ప్రచారకర్త
ఎప్పుడు : అక్టోబర్ 5
ఎక్కడ : న్యూజిలాండ్
ఎవరు : కోరీ అండర్సన్ (న్యూజిలాండ్)

గురు సాయిదత్‌కు బల్గేరియన్ ఇంటర్నేషనల్ టైటిల్బల్గేరియన్ ఇంటర్నేషనల్ ఫ్యూచర్ సిరీస్ టోర్నమెంట్‌లో పురుషుల సింగిల్స్ టైటిల్‌ను హైదరాబాద్ అగ్రశ్రేణి క్రీడాకారుడు గురుసాయిదత్ గెలుచుకున్నాడు. అక్టోబర్ 8న జరిగిన ఫైనల్లో గురు 21-17, 21-16తో ముహమ్మద్ అలీ కర్ట్‌ను 35 నిమిషాల్లో ఓడించి టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : బల్గేరియన్ ఇంటర్నేషనల్ ఫ్యూచర్ సీరీస్ - 2017
ఎప్పుడు : అక్టోబర్ 8
ఎవరు : పురుషుల సింగిల్స్ విజేత గురుసాయి దత్ 

చైనా ఓపెన్ విజేత నాదల్ చైనా ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను స్పెయిన్ టెన్నిస్ దిగ్గజం రాఫెల్ నాదల్ గెలుచుకున్నాడు. అక్టోబర్ 8న జరిగిన ఫైనల్లో నాదల్ 6-2, 6-1 తేడాతో నిక్ కిర్గియోస్‌ను ఓడించాడు. మొత్తంగా నాదల్ కెరీర్‌లో ఇది 75వ టైటిల్ కాగా ఈ సీజన్‌లో ఆరవది.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : చైనా ఓపెన్ - 2017 
ఎప్పుడు : అక్టోబర్ 8
ఎవరు : పురుషుల సింగిల్స్ విజేత రాఫెల్ నాదల్ 

హామిల్టన్‌కు జపాన్ గ్రాండ్ ప్రీ టైటిల్జపాన్ గ్రాండ్ ప్రి రేసులో బ్రిటన్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ విజేతగా నిలిచాడు. ‘పోల్’ పొజిషన్‌తో ప్రధాన రేసును ఆరంభించిన హామిల్టన్ అందరికంటే వేగంగా 53 ల్యాపులను 1 గంటా 27ని.31.194 సెకన్లలో పూర్తిచేశాడు. ఈ సీజన్‌లో అతనికిది ఎనిమిదో టైటిల్ కాగా డ్రైవర్స్ చాంపియన్‌షిప్‌లో హామిల్టన్ (306)... వెటెల్ (247) కంటే 59 పాయింట్ల తేడాతో ముందంజలో ఉన్నాడు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : జపాన్ గ్రాండ్ ప్రీ రేసు - 2017 
ఎప్పుడు : అక్టోబర్ 8
ఎవరు : విజేత లూయిస్ హామిల్టన్ 

ఆసియా జూనియర్ చాంపియన్ సామియామయన్మార్‌లో జరిగిన ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్‌కు చెందిన సామియా ఇమాద్ ఫారుఖీ చాంపియన్‌గా నిలిచింది. అక్టోబర్ 8న జరిగిన అండర్-15 మహిళల సింగిల్స్ ఫైనల్లో మూడో సీడ్ సామియా (భారత్) 15-21, 21-17, 21-19తో విడ్జజా స్టెఫాని (ఇండోనేసియా)పై నెగ్గి పసిడి పతకాన్ని కై వసం చేసుకుంది. ఓవరాల్‌గా ఈ టోర్నీలో భారత్ స్వర్ణంతో పాటు 3 కాంస్య పతకాలను సాధించింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఆసియా జూనియర్ చాంపియన్‌షిప్ - 2017
ఎప్పుడు : అక్టోబర్ 8
ఎవరు : అండర్ - 15 మహిళల సింగిల్స్ విజేత సామియా ఇమాద్ ఫారుఖి
ఎక్కడ : మయన్మార్‌లో

ప్రపంచ ఆర్చరీ యూత్ టోర్నీలో భారత జోడీకి స్వర్ణం ప్రపంచ ఆర్చరీ యూత్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు చెందిన మిక్స్‌డ్ జోడి జెమ్సన్ సింగ్-అంకిత భకట్ రికర్వ్ ఈవెంట్‌లో విజేతగా నిలిచింది. తొమ్మిదో సీడ్‌గా బరిలోకి దిగిన ఈ జోడి ఫైనల్లో 6-2తో ఎర్డెమ్ ఇర్దినీవ్-స్వెత్లానా గొంబొయెవా (రష్యా) జంటపై గెలిచింది. ప్రపంచ ఆర్చరీ చరిత్రలో భారత మిక్స్‌డ్ టీమ్ సాధించిన నాలుగో స్వర్ణం ఇది. గతంలో దీపిక 2009, 2011లో సాధించింది. 2006లో పల్టొన్ హన్‌‌సడా కూడా టైటిల్ గెలిచింది. పురుషుల టీమ్ ఈవెంట్‌లో జెమ్సన్ సింగ్ మరో పతకం గెలిచాడు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ప్రపంచ ఆర్చరీ యూత్ చాంపియన్‌షిప్ - 2017 
ఎప్పుడు : అక్టోబర్ 9
ఎవరు : రికర్వ్ ఈవెంట్‌లో భారత మిక్స్‌డ్ జోడి జెమ్సన్ సింగ్ - అంకిత భకట్‌కు స్వర్ణం 
ఎక్కడ : అర్జెంటీనా

పీబీఎల్ మూడో సీజన్ వేలం ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) మూడో సీజన్ వేలం అక్టోబర్ 9న జరిగింది. ఇందులో కొత్త ఫ్రాంచైజీ అహ్మదాబాద్ స్మాష్ మాస్టర్స్ హెచ్‌ఎస్ ప్రణయ్‌ను అత్యధికంగా రూ. 62 లక్షలకు సొంతం చేసుకుంది. గత సీజన్‌లో ప్రణయ్‌కు రూ. 25 లక్షలు మాత్రమే లభించాయి. ‘రైట్ టు మ్యాచ్’ ద్వారా గత ఏడాది చెల్లించిన మొత్తానికి అదనంగా 25 శాతం ఇస్తూ స్టార్ ఆటగాళ్లను వివిధ జట్లు అట్టి పెట్టుకున్నాయి. 
డిఫెండింగ్ చాంపియన్ చెన్నై స్మాషర్స్ రూ. 48.75 లక్షలకు సింధును, అవధ్ వారియర్స్ రూ. 41.25 లక్షలకు సైనా నెహ్వాల్‌ను కొనసాగించగా...పురుషుల టాప్ ఆటగాడు కిడాంబి శ్రీకాంత్ కోసం అవధ్ రూ. 56.10 లక్షలు వెచ్చించింది. రియో ఒలింపిక్స్ చాంపియన్ కరోలినా మారిన్ కోసం రూ. 50 లక్షలు ఖర్చు చేసి హైదరాబాద్ హంటర్స్ తమతోనే ఉంచుకుంది. పురుషుల విభాగంలో వరల్డ్ నంబర్‌వన్ విక్టర్ అక్సెల్సన్‌ను అతని పాత జట్టు బెంగళూరు బ్లాస్టర్స్ రూ. 50 లక్షలతో కొనసాగించగా...లీగ్‌లోకి తొలిసారి అడుగు పెట్టిన మహిళల వరల్డ్ నంబర్‌వన్ తై జు యింగ్ కోసం కూడా కొత్త టీమ్ అహ్మదాబాద్ రూ. 52 లక్షలు చెల్లించింది. 
పీబీఎల్ జట్లు
అవధ్
ముంబై
బెంగళూరు
హైదరాబాద్
అహ్మదాబాద్
ఢిల్లీ
నార్త్ ఈస్టర్న్
చెన్నై

అమల్లోకి ఐసీసీ కొత్త నిబంధనలు 
 అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) రూపొందించిన కొత్త నిబంధనలు సెప్టెంబర్ 28 నుంచి అమల్లోకి వచ్చాయి. 2000 నుంచి ఇప్పటి వరకు అవసరాన్ని బట్టి ఐసీసీ క్రికెట్ నిబంధనల్లో ఆరు సార్లు మార్పుచేర్పులు చేసింది. 
కొత్త నిబంధనలు 
  • ఇప్పటి వరకు బ్యాట్స్‌మన్ ఒక్కసారి మైదానం వీడితే అతడిని వెనక్కి పిలవడానికి లేదు. అయితే అతను నాటౌట్‌గా తేలితే ఇకపై తర్వాతి బంతి వేసే లోపు మళ్లీ వెనక్కి పిలుచుకోవచ్చు. ‘హ్యాండిల్డ్ ద బాల్’ (వికెట్ల వైపు వెళ్లే బంతిని చేతితో ఆపడం) నిబంధనను పూర్తిగా తొలగించి దానిని ‘అబ్‌స్ట్రక్టింగ్ ద ఫీల్డ్’లోకి కలిపేశారు.
  • బ్యాట్ పొడవు, వెడల్పులో ఎలాంటి పరిమితులు లేకపోయినా... బ్యాట్ మందం 67 మిల్లీ మీటర్లకు మించరాదు. అనుమానం వస్తే అంపైర్లు బ్యాట్ మందాన్ని పరికరంతో పరీక్షిస్తారు. ఇప్పటి వరకు వార్నర్ తదితరులు ఎక్కువ మందం కలిగిన భారీ బ్యాట్‌లు వాడుతున్నారు.
  • ఐసీసీ లెవల్ 4 నిబంధన ప్రకారం మైదానంలో ఆటగాడు హద్దు మీరి దురుసుగా ప్రవర్తిస్తే అంపైర్ అతడిని మొత్తం మ్యాచ్‌లో ఆడకుండా తప్పించవచ్చు. ఉద్దేశపూర్వకంగా నోబాల్ వేసినప్పుడు, బ్యాట్స్‌మన్ క్రీజ్ దాటి చాలా ముందుకు వచ్చి గార్డ్ తీసుకున్నప్పుడు చర్యలు తీసుకునే అధికారాన్ని అంపైర్లకు అప్పజెప్పారు.
  • బౌండరీ వద్ద గాల్లోకి ఎగిరి ఫీల్డర్లు పట్టే క్యాచ్‌లు ఇటీవల తరచుగా కనిపిస్తున్నాయి. బౌండరీ దాటి గాల్లోనే దాన్ని లోపలికి తోసి మళ్లీ వాటిని అందుకుంటున్నారు. అయితే ఇందులో మార్పు చేశారు. ఇకపై ఫీల్డర్ బంతిని తాకే సమయంలో కూడా అతను బౌండరీ లోపలే ఉండాలి. లేదంటే బౌండరీగా పరిగణిస్తారు.
  • బౌలర్ బంతిని విసిరిన తర్వాత క్రీజులోకి చేరేలోపు రెండు సార్లు నేలను తాకితే దానిని నోబాల్‌గా పరిగణిస్తారు. పిచ్‌కు దూరంగా బంతి పడినా దానిని నోబాల్‌గానే ప్రకటిస్తారు. నోబాల్ కీపర్‌కు అందకుండా వెళ్లి బౌండరీని తాకితే బౌలర్ నోబాల్ మాత్రమే వేసినట్లు. బైస్‌ను అతని ఖాతాలో కలపరు.
  • బ్యాట్స్‌మన్ షాట్ కొట్టిన తర్వాత బంతి ఫీల్డర్ లేదా వికెట్ కీపర్ హెల్మెట్‌కు తగిలి వచ్చినా సరే... ఫీల్డర్ క్యాచ్ పడితే దానిని అవుట్‌గా పరిగణిస్తారు. ఇప్పటి వరకు అలా వస్తే అది నాటౌట్‌గా ఉండేది.
  • బ్యాట్స్‌మన్ పరుగు పూర్తి చేసే సమయంలో ఫీల్డర్/కీపర్ వికెట్లు పడగొట్టడానికి ముందే అతని బ్యాట్‌గానీ, అతనుగానీ క్రీజులో చేరి... ఆ తర్వాత బ్యాట్ గాల్లోకి ఎగరడం లేదా బ్యాట్స్‌మన్ నియంత్రణ కోల్పోయినా అతను సురక్షితంగా క్రీజులో అడుగు పెట్టినట్లే లెక్క. దానిని రనౌట్‌గా పరిగణించరు.
  • అంతర్జాతీయ టి20ల్లో కూడా అంపైర్ నిర్ణయ సమీక్ష పద్ధతి (డీఆర్‌ఎస్)ను అమలు చేస్తారు. ఒక ఇన్నింగ్‌‌సలో ఒక రివ్యూకు అవకాశం ఉంటుంది. టెస్టుల్లో రివ్యూ చేసిన సమయంలో ‘అంపైర్ నిర్ణయం’ సరైనదిగా డీఆర్‌ఎస్ చూపించినప్పుడు జట్టు ఒక రివ్యూను కోల్పోదు. దీని వల్ల ఇకపై ఇన్నింగ్‌‌సకు 2 రివ్యూలు మాత్రమే ఉంటాయి. 80 ఓవర్ల తర్వాత అదనంగా మరో 2 రివ్యూలు చేరడం ఉండదు.

అండర్-14 ప్రపంచ చెస్ చాంపియన్ ధనుమూరి జిషిత ఉరుగ్వే రాజధాని మాంటివీడియోలో జరిగిన ప్రపంచ యూత్ చెస్ చాంపియన్‌షిప్ అండర్-14 బాలికల విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ధనుమూరి జిషిత టైటిల్‌ను దక్కించుకుంది. నిర్ణీత 11 రౌండ్లకుగాను జిషిత తొమ్మిది పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. ఈ విజయంతో జిషిత ఆంధ్రప్రదేశ్ నుంచి అండర్-14 బాలికల విభాగంలో విశ్వవిజేతగా నిలిచిన మూడో క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. గతంలో కోనేరు హంపి (2000లో స్పెయిన్‌లో), ద్రోణవల్లి హారిక (2004లో గ్రీస్‌లో) ఈ ఘనత సాధించారు. ఓవరాల్‌గా భారత్ నుంచి ఈ విభాగంలో ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన ఆరో క్రీడాకారిణి జిషిత. హంపి, హారికలతోపాటు పద్మిని రౌత్ (2008లో), మహాలక్ష్మి (2012లో), వైశాలి (2015లో) కూడా టైటిల్స్‌ను సాధించారు. 
రన్నరప్‌గా అర్జున్ 
అండర్-14 ఓపెన్ విభాగంలో వరంగల్ జిల్లాకు చెందిన ఎరిగైసి అర్జున్ రన్నరప్‌గా నిలిచాడు. నిర్ణీత 11 రౌండ్లు పూర్తయ్యాక అర్జున్ 9 పాయింట్లతో రెండో స్థానాన్ని పొందాడు. అండర్-18 బాలికల విభాగంలో మహారాష్ట్రకు చెందిన సాక్షి చిత్లాంగె ఎనిమిది పాయింట్లతో రన్నరప్‌గా నిలిచి రజత పతకాన్ని సాధించింది.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ప్రపంచ యూత్ చెస్ చాంపియన్‌షిప్ - 2017
ఎప్పుడు : సెప్టంబర్ 27
ఎవరు : అండర్-14 బాలికల విజేత ధనుమూరి జిషిత
ఎక్కడ : మాంటివీడియో, ఉరుగ్వే

ఆసియా ఇండోర్ క్రీడల్లో 11వ స్థానంలో భారత్ తుర్క్‌మెనిస్తాన్‌లోని అష్గబాత్‌లో జరిగిన ఆసియా ఇండోర్ క్రీడల్లో భారత్ 9 స్వర్ణాలు, 12 రజతాలు, 19 కాంస్యాలతో కలిపి మొత్తం 40 పతకాలతో 11వ స్థానంలో నిలిచింది. 245 పతకాల(89 స్వర్ణాలు, 70 రజతాలు, 86 కాంస్యాల)తో తుర్క్‌మెనిస్తాన్ తొలి స్థానంలో నిలవగా.. 42 స్వర్ణాలు, 32 రజతాలు, 23 కాంస్యాలతో కలిపి మొత్తం 97 పతకాలతో చైనా రెండో స్థానంలో నిలిచింది. ఐరాన్ 118 పతకాలతో మూడో స్థానంలో ఉంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఆసియా ఇండోర్ క్రీడలు - 2017
ఎప్పుడు : సెప్టెంబర్ 27
ఎవరు : 40 పతకాలతో 11వ స్థానంలో భారత్ 
ఎక్కడ : తుర్క్‌మెనిస్తాన్ 

ప్రపంచ బ్యాడ్మింటిన్ సమాఖ్య ర్యాంకింగ్స్ ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) సెప్టెంబర్ 28న ప్రకటించిన పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్‌‌సలో భారత్ నుంచి తొలిసారి ఐదుగురు క్రీడాకారులు టాప్-20లో నిలిచారు. కిడాంబి శ్రీకాంత్ 9వ స్థానంలో, హెచ్‌ఎస్ ప్రణయ్ 15వ స్థానంలో, సాయిప్రణీత్ 17వ స్థానంలో, సమీర్ వర్మ 19వ స్థానంలో, అజయ్ జయరామ్ 20వ స్థానంలో ఉన్నారు. మహిళల సింగిల్స్ ర్యాంకింగ్‌‌సలో పీవీ సింధు రెండో స్థానంలో, సైనా నెహ్వాల్ 12వ స్థానంలో కొనసాగుతున్నారు.

దులీప్ ట్రోఫీ విజేత ఇండియా ‘రెడ్’ 
దేశవాళీ క్రికెట్ సీజన్‌లో తొలి టోర్నమెంట్ దులీప్ ట్రోఫీలో ఇండియా ‘రెడ్’ జట్టు విజేతగా నిలిచింది. ఇండియా ‘బ్లూ’తో జరిగిన ఫైనల్లో ఇండియా ‘రెడ్’ 163 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసిన వాషింగ్టన్ సుందర్‌కు (130 పరుగులు; 11 వికెట్లు) ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ పురస్కారం లభించింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : దులీప్ ట్రోఫీ - 2017
ఎప్పుడు : సెప్టెంబర్ 28
ఎవరు : విజేత ఇండియా రెడ్

మలేసియా గ్రాండ్ ప్రి విజేత వెర్‌స్టాపెన్మలేసియా గ్రాండ్‌ప్రి రేసులో రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్‌స్టాపెన్(20) విజేతగా నిలిచాడు. నెదర్లాండ్‌‌సకు చెందిన ఈ డ్రైవర్ నిర్ణీత 56 ల్యాప్‌లను అందరికంటే వేగంగా గంటా 30 నిమిషాల 01.290 సెకన్లలో ముగించి టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును మొదలుపెట్టిన మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. రికియార్డో (రెడ్‌బుల్) మూడో స్థానంలో, వెటెల్ (ఫెరారీ) నాలుగో స్థానంలో, బొటాస్ (మెర్సిడెస్) ఐదో స్థానంలో నిలిచారు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా డ్రైవర్లు సెర్గియో పెరెజ్ ఆరో స్థానాన్ని సంపాదించగా... ఒకాన్ పదో స్థానాన్ని పొందాడు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : మలేసియా గ్రాండ్ ప్రీ - 2017
ఎప్పుడు : అక్టోబర్ 1 
ఎవరు : విజేత మాక్స్ వెర్‌స్టాపెన్

ఆసీస్‌తో వన్డే సీరీస్‌ను గెలుచుకున్న భారత్ ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌ను భారత్ 4-1తో గెలుచుకుంది. అక్టోబర్ 1న జరిగిన చివరి మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. సిరీస్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసిన హార్దిక్ పాండ్యాకు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కింది. 

చైనా, రష్యాపై ఐడబ్ల్యూఎఫ్ ఏడాది నిషేధంబీజింగ్ (2008), లండన్ (2012) ఒలింపిక్స్‌లో చైనా, రష్యా వెయిట్‌లిఫ్టర్లకు నిర్వహించిన డోప్ టెస్టులను మళ్లీ పరీక్షించగా... కనీసం మూడు పాజిటివ్ ఫలితాలు వచ్చాయి. దాంతో ఈ రెండు దేశాలపై అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్య (ఐడబ్ల్యూఎఫ్) ఏడాదిపాటు నిషేధం విధించింది. ఫలితంగా ఏడాదిపాటు నిషేధం ఎదుర్కొంటున్న దేశాలు అర్మేనియా, అజర్‌బైజాన్, బెలారస్, మాల్డొవా, కజకిస్తాన్, టర్కీ, ఉక్రెయిన్ సరసన చైనా, రష్యా కూడా చేరాయి. ఈ తొమ్మిది దేశాలు ఈ ఏడాది డిసెంబర్‌లో అమెరికాలో జరిగే ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌కు దూరమయ్యాయి. వచ్చే ఏడాది జరిగే ఆసియా క్రీడలకు కూడా చైనా లిఫ్టర్లు దూరం కానున్నారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : చైనా, రష్యా వెయిట్ లిఫ్టింగ్ అథ్లెట్లపై ఏడాది నిషేధం
ఎప్పుడు : అక్టోబర్ 1
ఎవరు : ఐడబ్ల్యూఎఫ్ 
ఎందుకు : డోప్ టెస్టుల్లో పాజిటివ్ ఫలితాలు వచ్చినందుకు గాను

No comments:

Post a Comment