వార్తల్లో వ్యక్తులు ఫిబ్రవరి 2014
ఏడీబీ ట్రిబ్యునల్ ప్రెసిడెంట్‌గా లక్ష్మీ స్వామినాథన్ఫిలిప్పీన్స్‌లోని ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ) ట్రిబ్యునల్ ప్రెసిడెంట్‌గా భారత్‌కు చెందిన లక్ష్మీ స్వామినాథన్ ఫిబ్రవరి 21న ఎంపికయ్యారు. ఈమె మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు. ఏడీబీ ట్రిబ్యునల్‌కు ఈమె ఏడో అధ్యక్షురాలు. 1992లో ఏడీబీ ట్రిబ్యునల్ ఏర్పాటైన తర్వాత ఈ పదవి భారత్‌కు దక్కడం ఇదే తొలిసారి. 2010లో ట్రిబ్యునల్‌లో సభ్యులుగా నియమితులైన లక్ష్మీ స్వామినాథన్ 2013 ఆగస్టు నుంచి తాత్కాలిక అధ్యక్షురాలిగా వ్యవ హ రిస్తున్నారు.
దర్శకుడు బాలు మహేంద్ర మృతిప్రముఖ ఛాయాగ్రాహకుడు, దర్శకుడు బాలు మహేంద్ర(75) చెన్నైలో 2014 ఫిబ్రవరి 13న మరణించారు. నెల్లు అనే మలయాళ చిత్రం ద్వారా 1974లో ఛాయాగ్రాహకుడిగా పరిచయమమ్యారు. 27 చిత్రాలకు ఫొటోగ్రఫీ అందించారు. కన్నడ చిత్రం కోకిల ద్వారా దర్శకుడయ్యారు. 22 చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌గా మనవూరి పాండవులు, నిరీక్షణ చిత్రాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నంది అవార్డు అందుకున్నారు.
అమెరికా సదస్సుకు ఒడిశా మహిళా సర్పంచ్ ఒడిశా రాష్ట్రానికి చెందిన మహిళా సర్పంచ్ ఆరతీదేవీ (28) కి అమెరికాలో జరిగే ఓ ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ నాయకత్వ సదస్సులో దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కింది. ఇల్లినాయీ రాష్ట్రం స్ప్రింగ్‌ఫీల్డ్‌లో ఫిబ్రవరిలో మూడు వారాల పాటు నిర్వహించే ఇంటర్నేషనల్ విజిటర్స్ లీడర్‌షిప్ ప్రోగ్రాం (ఐవీఎల్‌పీ)కి భారత్ నుంచి ఆరతీదేవి ఒక్కరే ఎంపికవడం విశేషం. ఈ సదస్సులో రాష్ట్ర ప్రభుత్వ పనితీరు, పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం తదితరాలపై ఆమె మాట్లాడతారు. గంజాం జిల్లాలోని ధుంకపరా అనే మారుమూల గ్రామ సర్పంచ్ అయిన ఆరతి, ఎంబీఏలో పట్టభద్రురాలు. సర్పంచ్‌గా ఎన్నికవడం కోసం ఐడీబీఐలో ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ ఉద్యోగాన్ని వదులుకోవడం విశేషం. ఇప్పటిదాకా ఈ సదస్సుకు మన దేశం నుంచి మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ, అటల్‌బీహారీ వాజ్‌పేయి, మాజీ రాష్ట్రపతులు కేఆర్ నారాయణన్, ప్రతిభాపాటిల్ మాత్రమే గతంలో పాల్గొన్నారు.
ఉత్తరాఖండ్ సీఎంగా హరీష్‌రావత్ఉత్తరాఖండ్ నూతన ముఖ్యమంత్రిగా హరీష్‌రావత్ ఫిబ్రవరి 1న ప్రమాణ స్వీకారం చేశారు. ఉత్తరాఖండ్ ఏర్పడ్డాక రావత్‌ఎనిమిదో ముఖ్యమంత్రి. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన విజయ్ బహుగుణ జనవరి 30న తన పదవికీ రాజీనామా చేశారు. గతేడాది ఉత్తరాఖండ్‌కు వరదలు వచ్చినప్పుడు బహుగుణ పనితీరుపై సొంతపార్టీలోనే విమర్శలు తలెత్తడంతో బహుగుణ రాజీనామా చేశారు.
టునీషియా కొత్త ప్రధాని మెహ్‌దీ జోమా టునీషియాలో మెహ్‌దీజోమా ప్రధానమంత్రిగా కొత్త ప్రభుత్వం జనవరి 29న కొలువు దీరింది. రాజకీయ అనిశ్చితి తొలగించేందుకు కుదిరిన ఒప్పందం ప్రకారం ఇస్లామిస్టుల నాయకత్వాన గల ప్రభుత్వ స్థానంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. 2014 చివరి నాటికి పార్లమెంట్ అధ్యక్ష ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది.
జీవ వైవిధ్యమండలి చైర్మన్‌గా హంపయ్యరాష్ట్ర జీవ వైవిధ్య మండలి చైర్మన్‌గా డాక్టర్ హంపయ్య మరో ఏడాది కొనసాగనున్నారు. ఆయన పదవీ కాలాన్ని మరో ఏడాది పొడిగిస్తూ జనవరి 30న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
నాసా డెరైక్టర్‌గా మైఖల్ రోజర్స్అమెరికా నేషనల్ సెక్యూరిటీ ఏజన్సీ (నాసా) డెరైక్టర్‌గా మైఖల్ రోజర్స్‌ను అధ్యక్షుడు బరాక్ ఒబామా జనవరి 30న నియమించారు. వైస్ అడ్మిరల్ రోజర్స్ నౌకారంగం సైబర్-వార్‌ఫేర్ నిపుణుడు. మార్చిలో పదవీవిరమణ చేస్తున్న ప్రస్తుత డెరైక్టర్ కీత్ అలెగ్జాండర్ స్థానంలో రోజర్స్ నాసా బాధ్యతలు చేపడతారు.
ఐరాసలో ప్రత్యేక సలహాదారుగా వివేక్‌లాల్ఐక్యరాజ్యసమితి ప్రత్యేక సలహాదారుడిగా ప్రముఖ ఏరోస్పేస్, సైబర్ సెక్యూరిటీ నిపుణుడు వివేక్‌లాల్ జనవరి 30న నియమితులయ్యారు. ఈయన ఐక్యరాజ్యసమితికి బ్రాడ్ బాండ్, ఇతర సైబర్ భద్రత అంశాలకు సంబంధించి విధాన రూపక ల్పన, అమలులో తోడ్పడతారు.

No comments:
Post a Comment