AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Sunday 26 November 2017

వార్తల్లో వ్యక్తులు మే 2013

వార్తల్లో వ్యక్తులు మే 2013
నూతన కాగ్ శశికాంత్ శర్మదేశ నూతన కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)గా రక్షణ శాఖ కార్యదర్శి, బీహార్ కేడర్‌కు చెందిన 1976 బ్యాచ్ ఐఏఎస్ అధికారి శశికాంత్ శర్మ (61) మే 23న పదవీబాధ్యతలు చేపట్టారు. 
ఐదున్నరేళ్లపాటు కాగ్‌గా వ్యవహరించిన వినోద్‌రాయ్ మే 22న పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో శర్మ నియమితులయ్యారు. గతంలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో కార్యదర్శిగా, పదేళ్లపాటు రక్షణశాఖలో వివిధ హోదా ల్లో శర్మ పనిచేశారు. కాగ్‌ను ఆరేళ్ల పదవీకాలానికి లేదా ఈ పదవి చేపట్టే అధికారికి 65 ఏళ్లు నిండేవరకు వీటిలో ఏది ముందు పూర్తవుతుందో ఆ ప్రాతిపదికన నియమిస్తారు. శర్మ 2017 సెప్టెంబర్ 24వరకు పదవిలో కొనసాగుతారు.

నేషనల్ జియోగ్రఫిక్ బీ విజేతగా సాత్విక్ కర్ణిక్భౌగోళిక అంశాలపై అమెరికాలో నిర్వహించిన ప్రతిష్టాత్మక ‘నేషనల్ జియోగ్రఫిక్ బీ’ క్విజ్ పోటీలో సాత్విక్ కర్ణిక్ (12) అనే భారత సంతతి బాలుడు విజయకేతనం ఎగురవేశాడు. బహుమతి కింద సాత్విక్‌కు సుమారు రూ.14 లక్షలు కాలేజ్ స్కాలర్‌షిప్ అందనుంది. మే 22న వాషింగ్టన్‌లో నిర్వహించిన ఫైనల్ పోటీకి 10 మంది ఎంపికకాగా వారిలో 8 మంది భారతీయ అమెరికన్‌లే ఉండటం విశేషం. సాత్విక్ ఫైనల్ పోటీలో ఐదు ప్రశ్నలకూ సరైన సమాధానాలిచ్చాడు. భూ కేంద్రానికి దూరంగా ఉన్న ప్రాంతమేది? అనే చివరి ప్రశ్నకు ఈక్వెడార్‌లోని చింబొరాజో పర్వతం అని సరైన జవాబు చెప్పి విజేతగా నిలిచాడు. 

అమెరికా ఫెడరల్ కోర్టు జడ్జిగా శ్రీకాంత్ శ్రీనివాసన్ప్రవాస భారతీయుడు శ్రీకాంత్ శ్రీనివాసన్ (46) డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియాలోని అమెరికా ఫెడరల్ అప్పీళ్ల కోర్టుకు జడ్జిగా ఎన్నికయ్యారు. మే 23న అమెరికన్ సెనేట్ 97-0 ఓట్లతో శ్రీనివాస్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ఈ కోర్టు అమెరికా సుప్రీంకోర్టు తర్వాత అత్యున్నత కోర్టు. ఈ పదవికి ఎంపికైన తొలి దక్షిణాసియా వ్యక్తి శ్రీనివాసన్. ఈయన చండీగఢ్‌లో జన్మించారు. ప్రస్తుతం అమెరికాలో ప్రిన్సిపల్ డిప్యూటీ సొలిసిటర్ జనరల్‌గా ఉన్నారు.

గాయకుడు టి.ఎం. సౌందరరాజన్ మృతిప్రముఖ గాయకుడు టి.ఎం.సౌందర్‌రాజ్ (91) మే25న చెన్నైలో మరణించారు. తమిళం, తెలుగు తదితర భాషల్లో 10 వేలకు పైగా పాటలు పాడారు. 2003లో ఆయనకు పద్మశ్రీ అవార్డు లభించింది. తమిళనాడు ప్రభుత్వం కలైమామాణి అవార్డుతో ఆయనను సత్కరించింది.

కృత్రిమ కాలుతో ఎవరెస్ట్ ఎక్కిన అరుణిమప్రపంచంలోనే అత్యంత ఎతైతన ఎవరెస్ట్‌ను కృత్రిమ కాలుతో అధిరోహించిన తొలి భారతీయ వనితగా వాలీబాల్ మాజీ క్రీడాకారిణి అరుణిమ సిన్హా (25)రికార్డు సృష్టించింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన అరుణిమ మే 22న ఎవరెస్ట్ శిఖరాగ్రానికి చేరుకుంది. ఆమె ఉత్తర కాశీలోని టాటా స్టీల్ అడ్వెంచర్ ఫౌండేషన్‌లో బచేంద్రిపాల్ వద్ద శిక్షణ పొందారు. రాష్ట్ర మైనార్టీ కమిషన్ చైర్మన్‌గా రసూల్‌ఖాన్ఆంధ్రప్రదేశ్ మైనార్టీ కమిషన్ చైర్మన్‌గా హైదరాబాద్‌కు చెంది న అబిద్ రసూల్‌ఖాన్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. వైస్ చైర్మన్‌గా డాక్టర్ పెరుమాళ్లపల్లి నేతాజీ సుభాష్ చంద్రబోస్ (గుంటూరు) నియమితులయ్యారు. సభ్యులుగా సయ్యద్ మఖ్బూల్ హుస్సేన్ బాషా (వైఎస్సార్ జిల్లా), డాక్టర్ హసన్ ఖురాతులేన్ (హైదరాబాద్), ప్రభా ఎలిజబెత్ జోసెఫ్ (తూర్పుగోదావరి), సర్దార్ సర్జీత్‌సింగ్ (రంగారెడ్డి), గౌతమ్‌జైన్ (హైదరాబాద్)లను నియమించినట్లు మే 16న ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. ఈ కమిషన్ మూడేళ్లపాటు పనిచేస్తుంది.

అరుణాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా నిర్భయ్‌శర్మఅరుణాచల్‌ప్రదేశ్ నూతన గవర్నర్‌గా రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ నిర్భయ్‌శర్మ మే 16న నియమితులయ్యారు. ఈ నియామకాన్ని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఆమోదించారు. 65 ఏళ్ల నిర్భయ్‌శర్మ భారత సైన్యంలో వివిధ కీలక హోదాల్లో 40 ఏళ్లపాటు సేవలందించారు.
డబ్ల్యూటీవో డెరైక్టర్ జనరల్‌గా రాబెర్టో అజెవెడో
బ్రెజిల్‌కు చెందిన రాబెర్టో అజెవెడో ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) డెరైక్టర్ జనరల్‌గా మే 8న నియమితులయ్యారు. అజెవెడో 2008 నుంచి డబ్ల్యూటీవోలో బ్రెజిల్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుత డెరైక్టర్ జనరల్ పాస్కల్ లామీ (ఫ్రాన్స్) స్థానంలో అజెవెడో బాధ్యతలు చేపడతారు. డబ్ల్యూటీవో 1995, జనవరి 1న ఏర్పడింది. స్విట్జర్లాండ్‌లోని జెనీవా కేంద్రంగా పనిచేస్తోంది. ఇందులో 159 దేశాలకు సభ్యత్వముంది. 

కెనడాలో సాంస్కతిక రాయబారిగా యార్లగడ్డకెనడాలో భారత సాంస్కతిక రాయబారిగా రాష్ట్రానికి చెందిన ప్రముఖ సాహితీవేత్త, రాష్ట్ర హిందీ అకాడమీ ఛైర్మన్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ వ్యవహరించనున్నారు. కెనడా భారత రాయబార కార్యాలయంలో అంతర్భాగంగా పనిచేసే సాంస్కతిక కేంద్రానికి డెరైక్టర్‌గా యార్లగడ్డ వ్యవహరిస్తారు. ఆయనకు విదేశీవ్యవహారాల శాఖ నియమావళికి అనుగుణంగా దౌత్య ప్రతిపత్తి హోదాను కల్పిస్తారు. యార్లగడ్డ మూడేళ్లపాటు పదవిలో కొనసాగుతారు. 

టాప్-100 వైద్య నిపుణుల్లో ఎంఎస్ గౌడ్
ప్రపంచంలో టాప్-100 ప్రతిభావంతులైన వైద్య నిపుణుల జాబితాలో రాష్ట్రానికి చెందిన ప్రముఖ దంత వైద్యుడు ఎంఎస్ గౌడ్‌కు చోటు లభించింది. భారత్ నుంచి జాబితాలో ఆయన ఒక్కరికే స్థానం దక్కింది. ఇంగ్లండ్‌లోని ‘కేంబ్రిడ్జ్ ఇంటర్నేషనల్ బయోగ్రఫికల్ సెంటర్’ ఏటా ఈ జాబితాను విడుదల చేస్తుంది. మెదక్ పట్టణానికి చెందిన ఎంఎస్ గౌడ్ దాదాపు 40 ఏళ్లుగా దంత వైద్య సేవలు అందిస్తున్నారు. ఆర్మీ వైద్య కళాశాలకు ప్రిన్సిపల్‌గా కూడా పనిచేశారు. దంత వైద్యానికి సంబంధించి రాష్ట్రంలో కాస్మెటిక్ చికిత్స వంటి అత్యాధునిక విధానాలను తొలిసారిగా ప్రవేశపెట్టింది ఆయనే. 

ప్రధాన కార్యదర్శిగా పి.కె. మహంతి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా మిన్నీ మాథ్యూ స్థానంలో 1979 బ్యాచ్ ఐఏఎస్ అధికారి ప్రసన్న కుమార్ మహంతి ఏప్రిల్ 30న బాధ్యతలు స్వీకరించారు. 2014 ఫిబ్రవరి వరకు ఆయన ఈ పదవిలో ఉంటారు. ప్రస్తుతం ఆయన భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఎ)గా ఉన్నారు.

ఆర్‌సీఐ డెరైక్టర్‌గా సతీష్ రెడ్డిరీసెర్‌‌చ సెంటర్ ఇమారత్ (ఆర్‌సీఐ) డెరైక్టర్‌గా జి. సతీష్‌రెడ్డి మే 4న బాధ్యతలు చేపట్టారు. రక్షణ పరిశోధన, అభివద్ధి సంస్థ (డీఆర్‌డీఓ)కు చెందిన ప్రధాన మిసైల్ లేబొరేటరీ ఆర్‌సీఐ. నావిగేషన్ సైంటిస్ట్ సతీష్‌రెడ్డి 1986లో డీఆర్‌డీఓలో చేరారు. ఆర్‌సీఐను ఏర్పాటు చేసినప్పటి నుంచి సతీష్ అందులో పనిచేస్తున్నారు.

No comments:

Post a Comment