వార్తల్లో వ్యక్తులు అక్టోబరు 2017
పాక్ మాజీ ప్రధాని షరీఫ్‌పై అరెస్టు వారంట్అవినీతి ఆరోపణల్లో చిక్కుకున్న పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌పై అరెస్టు వారంట్ జారీ అయ్యింది. పనామా పేపర్ల కుంభకోణంతో పదవి కోల్పోయిన షరీఫ్‌ను అవినీతి ఆరోపణలపై అక్కడి అకౌంటబిలిటీ కోర్టు విచారణ చేస్తోంది. కోర్టు విచారణకు షరీష్ పలుమార్లు హాజరు కాకపోవడంతో అక్టోబర్ 26న ఆయనపై న్యాయస్థానం బెయిలబుల్ అరెస్టు వారంట్‌ను జారీచేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నవాజ్ షరీఫ్‌పై అరెస్టు వారంట్ జారీ
ఎప్పుడు : అక్టోబర్ 26
ఎందుకు : పనామా పేపర్ల కుంభకోణం కేసు విచారణకు హాజరు కానందుకు
మిస్ వర్జీనియాగా హిమాన్వి భారత సంతతికి చెందిన పనిదెపు హిమాన్వి(17)ని మిస్ వర్జీనియా టీన్ యూఎస్‌ఏ 2018 టైటిల్ వరించింది. ఈ కిరీటాన్ని దక్కించుకున్న మొదటి ఇండియన్ అమెరికన్‌గా హిమాన్వి నిలిచింది. క్లిఫ్టన్లోని సెంట్రెవిల్లె హైస్కూల్లో చదువుకుంటున్న హిమాన్వి... 39 మంది యువతులతో పోటీపడి ఈ అందాల కిరీటాన్ని చేజిక్కించుకుంది. డౌన్ టౌన్ నార్ఫోక్‌లోని టైడ్ వాటర్ కమ్యూనిటీ కాలేజీలోని రోపర్ థియేటర్‌లో మిస్ వర్జీనియా టీన్ యూఎస్‌ఏ 2018 టైటిల్‌ను హిమాన్వికి బహూకరించారు. మానసిక ఆరోగ్యం, డ్రగ్‌స, ఆల్కహాల్‌లపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు హిమాన్వి తనవంతుగా కృషి చేస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మిస్ వర్జీనియా టీన్ యూఎస్‌ఏ - 2018
ఎప్పుడు : అక్టోబర్ 27
ఎవరు : పనిదెపు హిమాన్వి
బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్‌లో జెఫ్ బెజోస్‌కు అగ్రస్థానంఅంతర్జాతీయ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ చీఫ్ జెఫ్ బేజోస్ బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ మేరకు సవరించిన జాబితాను బ్లూమ్‌బర్గ్ అక్టోబర్ 29న ప్రకటించింది. జాబితాలో బేజోస్ 9,380 కోట్ల డాలర్ల ఆస్తితో మొదటి స్థానంలో నిలవగా, 8,870 కోట్ల డాలర్ల సంపదతో బిల్‌గేట్స్ రెండో స్థానంలో ఉన్నారు. బిల్‌గేట్స్ కంటే బేజోస్ ఆస్తి 510 కోట్ల డాలర్లు అధికం. ఈ జాబితాలో 2013 సంవత్సరం నుంచి బిల్‌గేట్స్ మొదటి స్థానంలో కొనసాగుతున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్‌లో అగ్రస్థానం
ఎప్పుడు : అక్టోబర్ 29
ఎవరు : జెఫ్ బెజోస్
బీసీసీఐ మాజీ జీఎం ఎంవీ శ్రీధర్ మృతిభారత క్రికెట్ నియంత్రణ మండలి మాజీ జనరల్ మేనేజర్ (క్రికెట్ ఆపరేషన్‌స), హైదరాబాద్ రంజీ జట్టు మాజీ కెప్టెన్ మాటూరి వెంకట శ్రీధర్ మృతి చెందారు. అక్టోబర్ 30న గుండెనొప్పితో హైదరాబాద్‌లోని తన నివాసంలో కన్ను మూశారు.
1966 ఆగస్టు 2న విజయవాడలో జన్మించిన ఎంవీ శ్రీధర్ హైదరాబాద్‌లోని ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. 1988లో హైదరాబాద్ రంజీ జట్టు తరఫున తొలిసారి ఆడారు. 2000లో క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. కెరీర్‌లో 97 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన శ్రీధర్ 21 సెంచరీలు, 27 అర్ధ సెంచరీలతో మొత్తం 6,701 పరుగులు సాధించారు.
2000 నుంచి 2006 వరకు హెచ్‌సీఏ సంయుక్త కార్యదర్శిగా, 2010 నుంచి 2012 వరకు ఉపాధ్యక్షుడిగా, 2012 నుంచి 2014 వరకు కార్యదర్శిగా పనిచేశారు. 2010-2011 సీజన్‌లో హైదరాబాద్ రంజీ జట్టు తాత్కాలిక కోచ్‌గా వ్యవహరించారు. 2013లో బీసీసీఐ క్రికెట్ ఆపరేషన్‌స జనరల్ మేనేజర్ (జీఎం)గా నియమితులై 2017 సెప్టెంబర్ 27 వరకు కొనసాగారు.
క్విక్ రివ్యూ:ఏమిటి : బీసీసీఐ మాజీ జీఎం, హైదరాబాద్ రంజీ మాజీ కెప్టెన్ మృతి
ఎప్పుడు : అక్టోబర్ 30
ఎవరు : మాటూరి వెంకట శ్రీధర్
ఎక్కడ : హైదరాబాద్
ఎన్‌ఐఏ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన మోదీజాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) డెరైక్టర్ జనరల్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి యోగేశ్ చందర్ మోదీ అక్టోబర్ 30న బాధ్యతలు చేపట్టారు. ఈ పదవిలో కొనసాగిన శరద్‌కుమార్ పదవీకాలం ముగియడంతో కేంద్ర ప్రభుత్వం మోదీని నియమించింది. ఆయన 2021 మే 31 వరకు పదవిలో కొనసాగుతారు.
క్విక్ రివ్యూ:ఏమిటి : ఎన్‌ఐఏ చీఫ్ బాధ్యతల స్వీకరణ
ఎప్పుడు : అక్టోబర్ 30
ఎవరు : యోగేశ్ చందర్ మోదీ
ఎందుకు : శరద్‌కుమార్ పదవీకాలం ముగియడంతో
న్యూజిలాండ్ ప్రధానిగా జసిండా ఆర్డెర్న్న్యూజిలాండ్ ప్రధానిగా జసిండా ఆర్డెర్న్ అక్టోబర్ 26న వెల్లింగ్టన్‌లో ప్రమాణస్వీకారం చేశారు. ఈమె న్యూజిలాండ్‌కు మూడో మహిళా ప్రధాని కాగా, గత 150 ఏళ్లలో ప్రధానైన అతి పిన్న వయస్కురాలు.
కశ్మీర్ చర్చల దూతగా దినేశ్వర్ శర్మకశ్మీర్ సమస్యకు చర్చల ద్వారా శాశ్వత పరిష్కారం కనుగొనే దిశగా ప్రభుత్వ దూతగా ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ దినేశ్వర్ శర్మను నియమించినట్లు కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అక్టోబర్ 24న ప్రకటించారు.
సొలిసిటర్ జనరల్ రంజిత్ రాజీనామా సొలిసిటర్ జనరల్ రంజిత్ కుమార్ అక్టోబర్ 20న తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. రంజిత్ తన రాజీనామా లేఖను న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కార్యాలయానికి పంపారు. 2014లో కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పదవి చేపట్టిన రంజిత్ మూడేళ్ల పాటు పలు కీలక కేసుల్లో ప్రభుత్వం తరఫున వాదించారు. వాటిలో నోట్లరద్దు, కాలుష్యం పెరుగుదలకు సంబంధించిన కేసులున్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సొలిసిటర్ జనరల్ రంజిత్ కుమార్ రాజీనామా
ఎప్పుడు : అక్టోబర్ 20
ఎందుకు : వ్యక్తిగత కారణాలతో
సీబీఐ ప్రత్యేక డెరైక్టర్‌గా రాకేశ్ ఆస్థానా నిఘా, భద్రత, దర్యాప్తు విభాగాల్లో అధికారులకు పదోన్నతులు కల్పించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 22న కీలక మార్పులు చేసింది. ఐపీఎస్ అధికారులు రాకేశ్ ఆస్థానాను సీబీఐ ప్రత్యేక డెరైక్టర్‌గా, గుర్బాచన్ సింగ్‌ను ఇంటెలిజెన్‌స బ్యూరో ప్రత్యేక డెరైక్టర్‌గా, సుదీప్ లఖ్తాకియాను సీఆర్‌పీఎఫ్ ప్రత్యేక డెరైక్టర్ జనరల్‌గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. రాజేశ్ రంజన్, ఏపీ మహేశ్వరిలకు బీఎస్‌ఎఫ్‌లో ప్రత్యేక డెరైక్టర్ జనరళ్లుగా ప్రభుత్వం పదోన్నతి కల్పించింది.
కశ్మీర్‌పై చర్చలకు మధ్యవర్తిగా ఐబీ మాజీ డెరైక్టర్ జమ్మూ కశ్మీర్‌లో శాంతి స్థాపనలో భాగంగా.. కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఆ రాష్ట్రంలోని అన్ని భాగస్వామ్య పక్షాలతో చర్చల ప్రక్రియను పునరుద్ధరించాలని నిర్ణయించింది. ఆ బాధ్యతలను ఇంటెలిజెన్‌స బ్యూరో(ఐబీ) మాజీ డెరైక్టర్ దినేశ్వర్ శర్మకు అప్పగించింది. ఈ మేరకు అక్టోబర్ 23న హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వివరాలు వెల్లడించారు.
1979 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన దినేశ్వర్ శర్మ 2014 నుంచి 2016 వరకూ ఇంటెలిజెన్‌స బ్యూరో డెరైక్టర్‌గా పనిచేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కశ్మీర్‌లో శాంతి స్థాపన చర్చల మధ్యవర్తిగా ఐబీ మాజీ డెరైక్టర్ దినేశ్వర్ శర్మ
ఎప్పుడు : అక్టోబర్ 23
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
పోస్టల్ బ్యాంక్ సీఈఓగా సురేష్ సేథీఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు (ఐపీపీబీ)కు కొత్త సీఈవోగా సురేష్ సేథీ నియమితులయ్యారు. ప్రస్తుత సంవత్సరం జనవరి నుంచి సీఈవోగా పనిచేస్తున్న ఏపీ సింగ్ స్థానంలో సేథీ నియమితులయ్యారు. సేథీ వోడాఫోన్ ఎం- పెసాకు ఎండీ, సీఈవోగా బాధ్యతలు నిర్వర్తించారు. సురేష్ సేథీకి బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సేవల్లో 27 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పోస్టల్ బ్యాంక్ సీఈఓగా సురేష్ సేథీ
ఎప్పుడు : అక్టోబర్ 23
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
చైనా మోస్ట్ పాపులర్ నేతగా జిన్‌పింగ్ఆధునిక చైనా వ్యవస్థాపకుడు మావో జెడాంగ్ తర్వాత చైనాలో అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడిగా ప్రస్తుత చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌కు అరుదైన గౌరవం దక్కింది. జిన్‌పింగ్‌కు దిగ్గజ గౌరవాన్ని కల్పిస్తూ అధికార కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా(సీపీసీ) అక్టోబర్ 24న తీర్మానం చేసింది. జిన్‌పింగ్ పేరును, ఆయన సిద్ధాంతాలను సీపీసీ రాజ్యాంగంలో చేరుస్తూ చారిత్రక నిర్ణయం తీసుకుంది. తాజాగా సెంట్రల్ కమిటీకి ఎన్నికవడంతో రెండోసారి చైనా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం జిన్‌పింగ్‌కు లాంఛనమే. అయితే మావో తరహాలో మూడోసారి కూడా అధ్యక్ష పదవి చేపట్టేలా ఆయన అధికారాన్ని సుస్థిరం చేసుకుంటున్నారు.
కాంగ్రెస్ సమావేశాల చివరి రోజున జిన్‌పింగ్ సిద్ధాంతాలను రాజ్యాంగంలో చేరుస్తూ సీపీసీ ఆమోదం తెలిపింది. జిన్‌పింగ్‌కు ముఖ్యనేత(కోర్ లీడర్) స్థాయిని ప్రకటించింది. దీంతో ఇకపై పార్టీలోని నేతలందరికంటే అత్యున్నత స్థాయిలో జిన్‌పింగ్ ఉంటారు. ఇప్పటి వరకూ మావోతో పాటు మాజీ అధ్యక్షుడు డెంగ్ జియావోపింగ్ ఆలోచనలకు మాత్రమే కమ్యూనిస్ట్ పార్టీ రాజ్యాంగంలో చోటు దక్కింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మావో తర్వాత చైనా మోస్ట్ పాపులర్ లీడర్
ఎప్పుడు : అక్టోబర్ 24
ఎవరు : జిన్‌పింగ్
ఎక్కడ : చైనా కమ్యూనిస్ట్ కాంగ్రెస్ సమావేశాల్లో తీర్మానం
ప్రముఖ గాయని గిరిజా దేవి మృతి ప్రముఖ శాస్త్రీయ సంగీత గాయని గిరిజా దేవి (88) అక్టోబర్ 24న కోల్‌కతాలో కన్నుమూశారు. ‘క్వీన్ ఆఫ్ తుమ్రీ’గా ఆమె ప్రసిద్ధికెక్కారు. బనారస్ ఘరానాకు చెందిన ఈ గాయనికి 1972లో పద్మశ్రీ, 1989లో పద్మభూషణ్, 2016లో పద్మ విభూషణ్ పురస్కారాలు లభించాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రముఖ శాస్త్రీయ సంగీత గాయని గిరిజా దేవి మృతి
ఎప్పుడు : అక్టోబర్ 24
ఎవరు : క్వీన్ ఆఫ్ తుమ్రీగా ప్రసిద్ధికెక్కిన గిరిజా దేవి
మాల్టా పాత్రికేయురాలు గలిజియా హత్యపనామా పత్రాలతోపాటు పలు పరిశోధనాత్మక కథనాలతో మాల్టాలో ప్రకంపనలు సృష్టించిన ప్రముఖ పాత్రికేయురాలు డాఫ్నే కరువానా గలిజియా(53) దారుణ హత్యకు గురయ్యారు. మాల్టాలోని బిద్నిజా ప్రాంతంలో ఆమె ప్రయాణిస్తున్న కారు బాంబుదాడికి గురైంది. ఈ ఘటనను ఆ దేశ ప్రధాని జోసెఫ్ మస్కట్ తీవ్రంగా ఖండించారు.
కృష్ణా బోర్డు కొత్త సభ్య కార్యదర్శిగా ఎ.పరమేశం సమీర్ చటర్జీ స్థానంలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కొత్త సభ్య కార్యదర్శిగా పోలవరం ప్రాజెక్టు ప్లానింగ్ అండ్ డిజైనింగ్ చీఫ్ ఇంజినీర్ ఎ.పరమేశం నియమితులయ్యారు. బోర్డు పక్షపాత ధోరణిని నిరసిస్తూ తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు చేసిన ఫిర్యాదుపై స్పందించిన కేంద్ర జలవనరుల శాఖ బోర్డు సభ్య కార్యదర్శి పదవి నుంచి సమీర్ చటర్జీని తొలగించింది. ఆయన స్థానంలో ఎ.పరమేశంను నియమించింది. అలాగే బోర్డులో కొత్తగా హరికేశ్ మీనాను సభ్యుడిగా నియమించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కృష్ణా బోర్డుకి కొత్త సభ్య కార్యదర్శి నియామకం
ఎప్పుడు : అక్టోబర్ 11
ఎవరు : ఎం.పరమేశం
ఎందుకు : తెలంగాణ ఫిర్యాదుతో సమీర్ చటర్జీని తొలగించిన కేంద్రం
లోకాయుక్త జస్టిస్ బి.సుభాషణ్‌రెడ్డి పదవీ విరమణ తెలంగాణ, ఏపీలకు లోకాయుక్తగా వ్యవహరిస్తున్న విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి.సుభాషణ్ రెడ్డి అక్టోబర్ 11న పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా లోకాయుక్త కార్యాలయ ప్రాంగణంలో ఆయనకు సన్మానం చేశారు. జస్టిస్ సుభాషణ్‌రెడ్డి పదవీ విరమణ చేసిన నేపథ్యంలో కొత్త లోకాయుక్త నియామకానికి ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. అప్పటి వరకు ఉప లోకాయుక్త గంగిరెడ్డి లోకాయుక్తగా బాధ్యతలు నిర్వర్తిస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తెలంగాణ, ఏపీ లోకాయుక్త పదవీ విర మణ
ఎప్పుడు : అక్టోబర్ 11
ఎవరు : జస్టిస్ బి.సుభాషణ్‌రెడ్డి
ఎఫ్‌టీఐఐ చైర్మన్‌గా అనుపమ్ ఖేర్ ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్(62) పుణేలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎఫ్‌టీఐఐ) చైర్మన్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార శాఖ అక్టోబర్ 11న ప్రకటించింది.
ఎఫ్‌టీఐఐ చైర్మన్‌గా పనిచేసిన గజేంద్ర చౌహాన్ పదవీకాలం ముగిసిన 7 నెలల అనంతరం కేంద్రం అనుపమ్ ఖేర్‌ను చైర్మన్‌గా నియమించింది. ఖేర్ ఢిల్లీలోని నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా(ఎన్‌ఎస్‌డీ)లో డిగ్రీ పొందారు. 500 పైచిలుకు చిత్రాల్లో నటించారు. సినిమా, కళల రంగానికి అందించిన సేవలకు గానూ 2004లో పద్మశ్రీ, 2016లో పద్మవిభూషణ్ పురస్కారాలను అందుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎఫ్‌టీఐఐ చైర్మన్‌గా అనుపమ్ ఖేర్
ఎప్పుడు : అక్టోబర్ 11
ఎవరు : కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ
యూఎస్‌ఐబీసీ అధ్యక్షురాలిగా నిషా దేశాయ్ బిస్వాల్ యూఎస్-ఇండియా బిజినెస్ కౌన్సిల్ - USIBC అధ్యక్షురాలిగా భారత సంతతికి చెందిన అమెరికన్ నిషా దేశాయ్ బిస్వాల్ నియమితులయ్యారు. ఈ మేరకు యూస్ చాంబర్ ఆఫ్ కామర్స్ అక్టోబర్ 11న ప్రకటించింది. నిషా బిస్వాల్.. 2013-2017 వరకు అమెరికా ప్రభుత్వంలో దక్షిణ, మధ్య ఆసియా సహాయ కార్యదర్శిగా పనిచేశారు. ఈ సమయంలోనే భారత్ - అమెరికా మధ్య సంబంధాలు బలోపేతం కోసం ఆమె విశేషంగా కృషి చేశారు. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక, వ్యాపార చర్చల్లో కీలక పాత్ర పోషించారు.
భారత్, అమెరికా మధ్య వ్యాపార, వాణిజ్య సంబంధాల బలోపేతం కోసం యూస్ - ఇండియా బిజినెస్ కౌన్సిల్‌ను 1975లో ఏర్పాటు చేశారు. ఇందులో భారత్, అమెరికాలోని 350కిపైగా అత్యుత్తమ కంపెనీలు సభ్యత్వం కలిగి ఉంటాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : యూఎస్‌ఐబీసీకి అధ్యక్షురాలిగా నిషా దేశాయ్ బిస్వాల్
ఎప్పుడు : అక్టోబర్ 11
ఎవరు : యూఎస్ చాంబర్ ఆఫ్ కామర్స్
ఆరుషి తల్లిదండ్రులను నిర్దోషులుగా తేల్చిన న్యాయస్థానం తొమ్మిదేళ్ల క్రితం సంచలన రేపిన ఆరుషి తల్వార్, పనిమనిషి హేమ్‌రాజ్ హత్య కేసుల్లో అలహాబాద్ హైకోర్టు అక్టోబర్ 12న కీలక తీర్పు చెప్పింది. ఈ కేసులో కింది కోర్టు దోషులుగా తేల్చిన ఆరుషి తల్లిదండ్రులు నుపుర్, రాజేశ్ తల్వార్‌లను హైకోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. సమర్పించిన ఆధారాలు వారిద్దరిని దోషులుగా నిర్ధారించేందుకు సరిపోవని తేల్చింది.
ఆరుషి, హేమ్‌రాజ్ హత్యకేసుల్లో 2013లో ఘజియాబాద్ సీబీఐ కోర్టు నుపుర్, రాజేశ్‌లకు జీవిత ఖైదు విధించింది.
ప్రణబ్ పుస్తకం ‘కొలిషన్ ఇయర్స్’ ఆవిష్కరణ మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాసిన ‘కొలిషన్ ఈయర్స్(సంకీర్ణ సంవత్సరాలు) 1996-2012’ పుస్తకావిష్కరణ అక్టోబర్ 13న జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్.. 2004లో ప్రధాని అయ్యేందుకు తనకన్నా, నాటి తన మంత్రివర్గ సహచరుడు ప్రణబ్ ముఖర్జీకే ఎక్కువ అర్హతలు ఉన్నాయని వ్యాఖ్యానించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కొలిషన్ ఇయర్స్ పుస్తకావిష్కరణ
ఎప్పుడు : అక్టోబర్ 13
ఎవరు : రచయిత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ
భారత తొలి ఒలింపియన్ స్విమ్మర్ షంషేర్ ఖాన్ మృతి ఒలింపిక్స్ క్రీడల స్విమ్మింగ్ ఈవెంట్‌లో భారత్ తరఫున బరిలోకి దిగిన తొలి స్విమ్మర్ మెహబూబ్ షంషేర్ ఖాన్ అక్టోబర్ 15న గుంటూరులో కన్నుమూశారు. 87 ఏళ్ల షంషేర్ ఖాన్‌కు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. గుంటూరు జిల్లా రేపల్లె మండలం కైతేపల్లి గ్రామానికి చెందిన షంషేర్ ఖాన్ 1956 మెల్‌బోర్న్ ఒలింపిక్స్‌లో 200 మీటర్ల బ్రెస్ట్‌ో్టక్ ్ర(హీట్స్‌లో ఐదో స్థానం), 200 మీటర్ల బటర్‌ఫ్లయ్ (హీట్స్‌లో ఆరో స్థానం) ఈవెంట్స్‌లో పాల్గొన్నారు.
మరిన్ని వివరాలు...
భారత్‌లో టాప్-10 ధనవంతులు
ఫోర్బ్స్ వంద మంది బిలియనీర్లలో ఏడుగురు మహిళలు స్థానం దక్కించుకున్నారు. వీరిలో ఒ.పి.జిందాల్ గ్రూప్ చైర్‌పర్సన్ సావిత్రి జిందాల్ 7.5 బిలియన్ డాలర్ల సంపదతో 16వ స్థానంలో ఉన్నారు.
టాప్-100 లో మహిళా బిలియనీర్లు
సత్యపాల్ మాలిక్: బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా, బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షుడిగా పనిచేశారు. 1990 ఏప్రిల్ 21 నుంచి 1990 నవంబర్ 10 వరకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. రామ్‌నాథ్ కోవింద్ రాజీనామాతో ఖాళీ అయిన బిహార్ గవర్నర్ పదవి ఈయనకు వరించింది.
గంగా ప్రసాద్: 1994లో బిహార్ ఎమ్మెల్సీగా తొలిసారి ఎన్నికయ్యారు. 18 ఏళ్లపాటు ఎమ్మెల్సీగా ఉన్నారు. శాసన మండలిలో విపక్ష నేతగా పని చేశారు.
జగదీశ్‌ముఖి: ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్. ఎమర్జెన్సీ సమయంలో క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు. ఢిల్లీలోని జనక్‌పురి అసెంబ్లీ స్థానం నుంచి 7 సార్లు ఎన్నికయ్యారు. మంత్రిగా, అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా పని చేశారు.
దేవేంద్ర కుమార్ జోషి: 1974 ఏప్రిల్ 1న ఇండియన్ నేవీ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్‌లో చేరారు. నేషనల్ డిఫెన్‌స అకాడమీ పూర్వ విద్యార్థి. 2012 ఆగస్టు నుంచి 2014 ఫిబ్రవరి 26 వరకు నేవల్ స్టాఫ్ చీఫ్‌గా చేశారు. ఐఎన్‌ఎస్ సింధురత్నలో అగ్ని ప్రమాదం జరగడంతో దానికి నైతిక బాధ్యతగా రాజీనామా చేశారు. పరమ విశిష్ట సేవా పతకం, అతి విశిష్ట సేవా పతకం, యుద్ధ సేవా పతకం అందుకున్నారు.
బీడీ మిశ్రా: ఎన్‌ఎస్‌జీ (బ్లాక్ కాట్ కమాండోస్) కౌంటర్ హైజాక్ టాస్క్ ఫోర్స్ కమాండర్‌గా పనిచేశారు. 1993లో భారత విమానం హైజాక్ అయిన సమయంలో చేపట్టిన సహాయక చర్యల్లో పాలుపంచుకున్నారు. రిటైర్ అయిన తర్వాత కూడా కార్గిల్ యుద్ధంలో పాల్గొనేందుకు వలంటీర్‌గా ముందుకొచ్చారు. కౌంటర్ టైస్ట్ ఆపరేషన్‌సలో చురుకైన పాత్ర పోషించి ప్రశంసలు అందుకున్నారు.
డబ్ల్యూహెచ్‌వో డిప్యూటీ డెరైక్టర్‌గా సౌమ్య ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్ స్వామినాథన్ కూతురు సౌమ్య స్వామినాథన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) కార్యక్రమాల అమలు విభాగానికి డిప్యూటీ డెరైక్టర్ జనరల్ (డీడీపీ-డిప్యూటీ డెరైక్టర్ జనరల్ ఆఫ్ ప్రోగ్రామ్స్)గా నియమితులయ్యారు. ఈ పదవి డబ్ల్యూహెచ్‌వోలో రెండో అత్యున్నతమైనది కావడం విశేషం. ప్రస్తుతం ఆమె ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్)కు డెరైక్టర్ జనరల్‌గా వ్యవహరిస్తున్నారు. చిన్న పిల్లల వైద్య నిపుణురాలు అయిన సౌమ్య క్షయ నిర్మూలనపై చేసిన పరిశోధనలతో గుర్తింపు పొందారు. గతంలో ఆమె చెన్నైలోని జాతీయ క్షయ పరిశోధనా సంస్థలో డెరైక్టర్‌గా పనిచేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : డబ్ల్యూహెచ్‌వో డిప్యూటీ డెరైక్టర్‌గా భారతీయ శాస్త్రవేత్త
ఎప్పుడు : అక్టోబర్ 3
ఎవరు : సౌమ్య స్వామినాథన్
మధుకోడాపై ఈసీ మూడేళ్ల నిషేధంజార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధుకోడాపై ఎన్నికల సంఘం సెప్టెంబర్ 27న అనర్హత వేటు వేసింది. మూడేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించింది. ఎన్నికల ఖర్చులపై సరైన వివరాలు ఇవ్వని కారణంగా ఈ చర్యలు తీసుకుంది. మధుకోడా జార్ఖండ్ సీఎంగా 2006 నుంచి 2008 వరకు పనిచేశారు.
జానపద కళాకారుడు తండ భిక్షంకన్నుమూతపాచీన కళారూపమైన తెర చీరల పండితుడు, జానపద కళాకారుడు తండ భిక్షం (101) అక్టోబర్ 1న మరణించారు. ఆయన.. కృష్ణ జననం, గంగతర్క సంవాదం, కాటమరాజు కథలు చెప్పడంలో దిట్ట. పలు తాళపత్ర గ్రంథాలు రాశారు. తెర చీరల ప్రదర్శనకు పేరు తెచ్చారు.
బాలీవుడ్ నటుడు టామ్ ఆల్టర్ కన్నుమూతప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటుడు టామ్ ఆల్టర్ (67).. సెప్టెంబర్ 29న ముంబైలో కన్నుమూశారు. అమెరికా సంతతికి చెందిన ఆయన ఇండియా షోబిజ్ అనే టీవీ ప్రోగ్రామ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. 2008లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు.
సూకీ నుంచి ఫ్రీడమ్ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్ హోదా ఉపసంహరణ మయన్మార్ నేత అంగ్ సాన్ సూకీకి గతంలో ప్రదానం చేసిన ఫ్రీడమ్ ఆఫ్ ఆక్సఫర్డ్ హోదాను వెనక్కి తీసుకుంటున్నట్లు ఆక్సఫర్డ్ సిటీ కౌన్సిల్ అక్టోబర్ 2న ప్రకటించింది. మయన్మార్‌లో రోహింగ్యా ముస్లింలపై జరుగుతున్న దాడుల పట్ల ఆమె స్పందన సరిగ్గా లేదని పేర్కొన్న సంస్థ.. ఈ మేరకు గౌరవ హోదాను ఉపసంహరిస్తున్నట్లు వెల్లడించింది.
మయన్మార్‌లో ప్రజాస్వామ్యం కోసం అంగ్‌సాన్ సూకీ చేసిన పోరాటానికి గుర్తింపుగా ఆక్సఫర్డ్ సిటీ కౌన్సిల్ ఆమెకు 1997లో ఫ్రీడమ్ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్ హోదాను ప్రదానం చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అంగ్‌సాన్ సూకీ నుంచి ఫ్రీడమ్ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్ హోదా ఉపసంహరణ
ఎప్పుడు : అక్టోబర్ 2
ఎవరు : ఆక్స్‌ఫర్డ్ సిటీ కౌన్సిల్

- 1930 ఆగస్టు 2వ తేదీన జన్మించిన షంషేర్ ఖాన్ ఎలాంటి కోచ్‌లు, సదుపాయాలు లేకుండానే కృష్ణానదిలో ఈత నేర్చుకున్నారు.
- 16 సంవత్సరాల వయస్సులో 1946లో బెంగళూరులోని సదరన్ కమాండ్‌లో ఆర్మీలో చేరారు. అక్కడే స్విమ్మింగ్ పూల్ ఉండటంతో ఈతలో మరిన్ని మెళకువలు నేర్చుకున్నారు.
- 1954 నుంచి వరుసగా మూడుసార్లు సీనియర్ నేషనల్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో చాంపియన్‌గా నిలిచారు.
- మెల్‌బోర్న్ ఒలింపిక్స్‌కు వెళ్లి వచ్చిన తర్వాత ఆర్మీలో రకరకాల విధుల కారణంగా స్విమ్మింగ్‌కు దూరం కావాల్సి వచ్చింది. 1962లో ఆయన అసోంకు బదిలీ అయ్యారు. అక్కడ చైనా బోర్డర్ వరకు రోడ్డు వేసే పనిలో పాల్గొన్నారు. ఆ తర్వాత 1971లో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో పాల్గొన్నారు. 1973లో సుబేదార్ హోదాలో ఆర్మీ నుంచి రిటైర్ అయ్యాక కొన్నేళ్ల పాటు సికింద్రాబాద్ ఆర్మీ క్యాంటీన్‌లో పనిచేసి స్వగ్రామానికి వచ్చారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్‌లో తొలి ఒలింపిక్ స్విమ్మర్ మృతి
ఎప్పుడు : అక్టోబర్ 15
ఎవరు : షంషేర్ ఖాన్
ఎక్కడ : గుంటూరు
అంతర్జాతీయ విత్తన సలహామండలి అధ్యక్షునిగా కేశవులు అంతర్జాతీయ విత్తన సలహా మండలి అధ్యక్షునిగా తెలంగాణ రాష్ట్ర విత్తన, సేంద్రియ ధ్రువీకరణ సంస్థ సంచాలకుడు డాక్టర్ కె.కేశవులు ఎంపికయ్యారు. ఈ సలహామండలిలో 8 మంది ఓఈసీడీ, ఇస్టా, ఐఎస్‌ఎఫ్ వంటి అంతర్జాతీయ విత్తన సంస్థల అధికారులు, విత్తన పరిశ్రమల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. ఈ సలహా మండలి విత్తన పరిశ్రమ అవసరాలు, పరిశోధన అంశాలు, జాతీయ, అంతర్జాతీయ విత్తన నాణ్యత, అంతర్జాతీయ ఎగుమతి, దిగుమతులు, నియమ నిబంధనల రూపకల్పన తదితర విషయాలలో కీలక పాత్ర పోషించనుంది. డాక్టర్ కేశవులు నియామకంతో దేశీయంగా విత్తన పరీక్షా కేంద్రాలను బలోపేతం చేయడం, విత్తన రంగంలో జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాల మధ్య సమతుల్యత సాధించడం సులభతరమవుతుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అంతర్జాతీయ విత్తన సలహామండలి అధ్యక్షునిగా కేశవులు
ఎప్పుడు : అక్టోబర్ 16
ఎవరు : తెలంగాణ రాష్ట్ర విత్తన, సేంద్రియ ధ్రువీకరణ సంస్థ సంచాలకుడు
శ్రీశాంత్‌పై నిషేధం కొనసాగుతుందన్న కేరళ హైకోర్టు స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడిన పేస్ బౌలర్ శ్రీశాంత్‌పై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) విధించిన నిషేధం కొనసాగుతుందని కేరళ హైకోర్టు తీర్పు ఇచ్చింది. 2013-ఐపీఎల్‌లో స్పాట్ ఫిక్సింగ్ ఉదంతంలో నిందితుడైన 34 ఏళ్ల శ్రీశాంత్ బోర్డు నిషేధాన్ని కోర్టులో సవాలు చేశాడు. ఆగస్టు 7న సింగిల్ జడ్జి బెంచ్ అతడిని నిర్దోషిగా తేల్చింది. అయితే దీనిపై బీసీసీఐ హైకోర్టుకు వెళ్లింది. అక్టోబర్ 17న ఈ కేసును చీఫ్ జస్టిస్ నవనీతి ప్రసాద్ సింగ్, జస్టిస్ రాజా విజయరాఘవన్‌లతో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది. సింగిల్ జడ్జి తీర్పును కొట్టివేసి, నిషేధాన్ని కొనసాగిస్తూ బీసీసీఐకి అనుకూలంగా తీర్పునిచ్చింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : శ్రీశాంత్‌పై నిషేధం కొనసాగుతుందని తీర్పు
ఎప్పుడు : అక్టోబర్ 17
ఎవరు : కేరళ హైకోర్టు
ఎందుకు : స్పాట్ ఫిక్సింగ్ కేసులో
పాక్ క్రికెటర్ ఖలీద్ లతీఫ్‌పై ఐదేళ్ల నిషేధం
స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలో పాకిస్తాన్ బ్యాట్స్‌మన్ ఖలీద్ లతీఫ్‌పై ఆ దేశ క్రికెట్ బోర్డు ఐదేళ్ల నిషేధం విధించింది. దీంతో పాటు రూ. 1 మిలియన్ (పాక్ కరెన్సీ) జరిమానా కూడా విధించారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కు చెందిన అవినీతి వ్యతిరేక కోడ్‌లోని ఆరు నిబంధనలను లతీఫ్ అతిక్రమించినట్టు యాంటీ కరప్షన్ ట్రైబ్యునల్ తేల్చి చెప్పింది. దీంతో లతీఫ్‌పై పీసీబీ ఈ మేరకు చర్య తీసుకుంది. ఫిబ్రవరిలో జరిగిన పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్)లో లతీఫ్ స్పాట్ ఫిక్సంగ్‌కు పాల్పడినట్టు పీసీబీ విచారణకు ఆదేశించింది. అయితే ఈ నిషేధంపై అప్పీల్ చేసుకునేందుకు లతీఫ్‌కు 14 రోజుల గడువునిచ్చారు. ఇదే ఆరోపణలతో ఇంతకుముందే టెస్టు ఓపెనర్ షర్జీల్ ఖాన్‌పై కూడా ఐదేళ్ల నిషేధం విధించినా ఆ తర్వాత దాంట్లో సగం కాలాన్ని సస్పెండ్ చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పాకిస్తాన్ బ్యాట్స్‌మెన్ ఖలీద్ లతీఫ్‌పై 5 ఏళ్ల నిషేధం
ఎప్పుడు : అక్టోబర్ 17
ఎవరు : పాకిస్తాన్ క్రికెట్ బోర్డు
ఎందుకు : స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో
ఎస్‌బీఐ కొత్త చైర్మన్ రజనీష్ కుమార్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త చైర్మన్‌గా రజనీష్ కుమార్ (59) అక్టోబర్ 4న నియమితులయ్యారు. ఆక్టోబర్ 7న బాధ్యతలు స్వీకరించనున్న ఆయన ఈ పదవిలో మూడేళ్లు కొనసాగుతారు. ప్రస్తుత చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో ఆ స్థానంలో రజనీష్‌ని నియమిస్తూ క్యాబినెట్ నియామకాల కమిటీ నిర్ణయం తీసుకుంది.
రజనీష్ 2015 మే 26న ఎస్‌బీఐ బోర్డులో చేరారు. ప్రస్తుతం ఎస్‌బీఐ ఎండీగా ఉన్నారు. అంతకు ముందు ఎస్‌బీఐ క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్ సీఈవో, ఎండీ, బ్యాంకు చీఫ్ జనరల్ మేనేజర్ (ప్రాజెక్ట్ ఫైనాన్‌స అండ్ లీజింగ్ స్ట్రాటెజిక్ బిజినెస్ యూనిట్)గా, బ్రిటన్, కెనడా విభాగాల్లోనూ పలు కీలక హోదాల్లో పనిచేశారు.
అరుంధతీ భట్టాచార్య తొలిసారిగా 2013లో బాధ్యతలు చేపట్టారు. తద్వారా ఈ హోదా దక్కించుకున్న తొలి మహిళగా రికార్డులకెక్కారు. ఎస్‌బీఐలో అనుబంధ బ్యాంకుల విలీనం జరుగుతున్న నేపథ్యంలో 2016 అక్టోబర్‌లో ఆమె పదవీకాలాన్ని ఏడాది పాటు పొడిగించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎస్‌బీఐ కొత్త చైర్మన్ నియామకం
ఎప్పుడు : అక్టోబర్ 4
ఎవరు : రజనీష్ కుమార్
ఎందుకు : ప్రస్తుత చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య పదవీకాలం ముగియడంతో
ఎస్పీ అధ్యక్షుడిగా అఖిలేశ్ యాదవ్సమాజ్‌వాదీ పార్టీ జాతీయాధ్యక్షుడిగా అఖిలేశ్ యాదవ్ తిరిగి ఎన్నికయ్యారు. అక్టోబర్ 5న ఆగ్రాలో జరిగిన పార్టీ జాతీయ సమావేశంలో అఖిలేశ్‌ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో పార్టీ అధ్యక్షుడి పదవీకాలాన్ని 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలకు పెంచుతూ ఎస్పీ రాజ్యాంగాన్ని సవరించారు. దీంతో అఖిలేష్ ఈ పదవిలో ఐదేళ్లు కొనసాగుతారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడి ఎన్నిక
ఎప్పుడు : అక్టోబర్ 5
ఎక్కడ : ఆగ్రా (ఉత్తరప్రదేశ్)
ఎవరు : అఖిలేష్ యాదవ్
భారత్‌లో అత్యంత సంపన్నుడు ముకేష్ అంబానీఫోర్బ్స్ విడుదల చేసిన ‘ఇండియాలోని వంద మంది బిలియనీర్ల జాబితా-2017’లో రిలయన్‌స ఇండస్ట్రీస్ చీఫ్ ముకేష్ అంబానీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు. దాదాపు రూ.2.5 లక్షల కోట్ల (38 బిలియన్ డాలర్లు) నికర సంపద విలువతో వరుసగా పదోసారి మొదటిస్థానంలో నిలిచాడు. దీంతో ఆయన ఆసియాలోని టాప్-5 కుబేరుల్లో కూడా ఒకరిగా నిలిచారు. తాజా జాబితాలో ఉన్నవారి మొత్తం సంపద విలువ 26 శాతం వృద్ధితో రూ.31 లక్షల కోట్లకుపైగా (479 బిలియన్ డాలర్లు) పెరిగిందని ఫోర్బ్స్ వెల్లడించింది.
నివేదిక ముఖ్యాంశాలు

- గతేడాది రెండో స్థానంలో ఉన్న దిలీప్ సంఘ్వీ (సన్ ఫార్మా) ఈ సారి తొమ్మిదో స్థానానికి పడిపోయారు. ఆయన సంపద విలువ 12.1 బిలియన్ డాలర్లు.
- ముకేశ్ సోదరుడు అనిల్ అంబానీకి 3.15 బిలియన్ డాలర్లతో 45వ స్థానం.
- అదానీ గ్రూప్ అధిపతి గౌతమ్ అదానీకి 11 బి. డాలర్లతో పదో స్థానం.
- ఆచార్య బాలకృష్ణకు (పతంజలి ఆయుర్వేద్) రూ.43,000 కోట్ల (6.55 బిలియన్ డాలర్లు)తో 48వ స్థానం
- నుస్లీ వాడియాకి (జాబితాలో కొత్తగా స్థానం పొందారు) 5.6 బిలియన్ డాలర్ల సంపదతో 25వ స్థానం
- వెటరన్ ఇన్వెస్టర్ రాధాకిషన్ దమానీకి 9.3 బిలియన్ డాలర్ల సంపదతో 12వ స్థానం
- ఫ్యూచర్ గ్రూప్ కిశోర్ బియానీకి 2.75 బిలియన్ డాలర్లతో 55వ స్థానం
- ఫోర్బ్స్ వంద మంది బిలియనీర్లలో ఏడుగురు మహిళలకు స్థానం
భారత్‌లో టాప్-10 ధనవంతులు
స్థానం
|
పేరు
|
సంపద
| |
బిలియన్ డాలర్లు
|
రూపాయలు (కోట్లు)
| ||
1.
|
ముకేశ్ అంబానీ
|
38
|
2,48,102
|
2.
|
అజీమ్ ప్రేమ్ జీ
|
19
|
1,24,051
|
3.
|
హిందుజా సోదరులు
|
18.4
|
1,20,133
|
4.
|
లక్ష్మీ మిట్టల్
|
16.5
|
1,07,728
|
5.
|
పల్లోంజి మిస్త్రీ
|
16
|
1,04,464
|
6.
|
గోద్రేజ్ కుటుంబం
|
14.2
|
92,711
|
7.
|
శివ్ నాడార్
|
13.6
|
88,794
|
8.
|
కుమార బిర్లా
|
12. 6
|
82,265
|
9.
|
దిలీప్ సంఘ్వీ
|
12.1
|
79,000
|
10.
|
గౌతమ్ అదానీ
|
11
|
71,819
|
ఫోర్బ్స్ వంద మంది బిలియనీర్లలో ఏడుగురు మహిళలు స్థానం దక్కించుకున్నారు. వీరిలో ఒ.పి.జిందాల్ గ్రూప్ చైర్‌పర్సన్ సావిత్రి జిందాల్ 7.5 బిలియన్ డాలర్ల సంపదతో 16వ స్థానంలో ఉన్నారు.
టాప్-100 లో మహిళా బిలియనీర్లు
స్థానం
|
పేరు
|
సంపద (బిలియన్ డాలర్లలో)
|
16
|
సావిత్రి జిందాల్
|
7.5
|
40
|
గుప్తా కుటుంబం
|
3.45
|
48
|
వినోద్&అనిల్ రాయ్ గుప్తా
|
3.11
|
51
|
జైన్ కుటుంబం
|
3
|
63
|
అమాల్గమేషన్‌స గ్రూప్
|
2.5
|
71
|
లీనా తివారీ
|
2.19
|
72
|
కిరణ్ మజుందార్ షా
|
2.16
|
క్విక్ రివ్యూ:ఏమిటి : ఫోర్బ్స్ వంద మంది బిలియనీర్ల జాబితా 2017
ఎప్పుడు : అక్టోబర్ 5
ఎక్కడ : భారత్
ఎవరు : ముకేశ్ అంబానీకే అగ్రస్థానం (వరుసగా పదోసారి)
ఎందుకు : రూ.2.5 లక్షల కోట్ల నికర సంపద విలువ కలిగినందుకు
అరుంధతీ భట్టాచార్య పదవీ విరమణఎస్‌బీఐ చరిత్రలో తొలి మహిళా చైర్‌పర్సన్ అయిన అరుంధతీ భట్టాచార్య అక్టోబర్ 6న పదవీ విరమణ చేశారు. ఆమె 2013లో ఎస్‌బీఐ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టారు. ఎస్‌బీఐలో అనుబంధ బ్యాంకుల విలీనం జరుగుతున్న నేపథ్యంలో 2016 అక్టోబర్‌లో ఆమె పదవీకాలాన్ని ఏడాది పాటు పొడిగించారు.
క్విక్ రివ్యూ:ఏమిటి : ఎస్‌బీఐ చైర్‌పర్సన్ పదవీ విరమణ
ఎప్పుడు : అక్టోబర్ 6
ఎవరు : అరుంధతీ భట్టాచార్య
తమిళ హీరో జై డ్రైవింగ్ లెసైన్స్‌రద్దు తమిళ సినీ నటుడు జై డ్రైవింగ్ లెసైన్స్‌ను చెన్నైలోని సైదాపేట కోర్టు 6 నెలల పాటు రద్దు చేసింది. సెప్టెంబర్ 21న మద్యం సేవించి డ్రైవ్ చేస్తూ అడయారు ఫ్లైఓవర్ బ్రిడ్జి సమీపంలో గోడను ఢీకొన్న కేసులో ట్రాఫిక్ పోలీసులు జైపై చార్జిషీట్ దాఖలు చేశారు. అక్టోబర్ 3న కోర్టులో చార్జిషీట్ నకలును పొందిన జై ఆ తరువాత విచారణకు హాజరు కాకపోవడంతో మేజిస్ట్రేట్ అతనిపై అరెస్ట్ వారెంట్ జారీచేశారు. మద్యం మత్తులో కారు నడిపినట్లు జై కోర్టులో అంగీకరించారు. సినిమాల్లోలా ప్రవర్తించరాదని జైకి హితవు పలికి రూ.5,200 అపరాధ రుసుము విధించిన కోర్టు ఆరు నెలల పాటు ఆయన డ్రైవింగ్ లెసైన్‌సను రద్దుచేసింది.
బీబీసీ శక్తిమంతమైన మహిళల్లో మిథాలీ రాజ్ భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ ‘బీబీసీ’ రూపొందించిన అత్యంత శక్తిమంతమైన భారత మహిళల జాబితాలో నిలిచింది. బీబీసీ విడుదల చేసిన ఈ టాప్-100 ప్రభావవంతమైన మహిళల్లో ఆమె స్థానం సంపాదించింది. భారత్‌కే చెందిన రచయిత్రి, యోగా గురువు ఐరా త్రీవేదీ, తీహార్ జైళ్లో పిల్లలకు పాఠాలు బోధిస్తున్న తులికా కిరణ్, ఎంబైబ్ సంస్థ సీఈవో అదితి అవస్థి, బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ తల్లి మెహ్రూనిసా సిద్ధిఖీ, మహిళా ఉద్యమకారిణి డాక్టర్ ఊర్వసి సాహ్ని, బిజినెస్ ఎనలిస్ట్ నిత్యా తుమ్మలచెట్టి ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు.
అక్టోబర్‌లో ‘బీబీసీ 100 విమెన్ చాలెంజ్’ పేరుతో భారత్‌లోని వివిధ నగరాల్లో అవగాహన కార్యక్రమాలు జరుగనున్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బీబీసీ శక్తిమంతమైన మహిళల జాబితా
ఎప్పుడు : సెప్టెంబర్ 27
ఎవరు : జాబితాలో చోటు సంపాదించిన ఏడుగురు భారతీయ మహిళలు
ఫోర్బ్స్ అత్యధిక సంపాదకుల జాబితాలో ప్రియాంకప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా సంపాదిస్తున్న టీవీ తారల్లో బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా స్థానం దక్కించుకున్నారు. రూ.65.52కోట్ల పారితోషికం తీసుకుంటూ ఫోర్బ్స్ తాజాగా విడుదల చేసిన టాప్-10 జాబితాలో ప్రియాంకా ఎనిమిదో స్థానంలో నిలిచారు. ‘క్వాంటికో’ టీవీ షోతో పశ్చిమదేశాల్లో వినోద రంగంలోకి అడుగుపెట్టిన ప్రియాంకా.. ‘బేవాచ్’ సినిమాతో హాలీవుడ్‌లో గుర్తింపు పొందారు.
రూ.271.85కోట్ల ఆర్జనతో కొలంబియా నటి సోఫియా వెర్గారా వరుసగా ఆరో ఏడాదీ టాప్-10లో నంబర్‌వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ‘ది బిగ్ బ్యాంగ్ థియరీ’ నటి కేలీ కుకో రూ.170.39 కోట్ల సంపాదనతో రెండో స్థానంలో నిలిచారు. గ్రేస్ అనాటమీ నటీమణి ఎలెన్ పోంపియో రూ.85 కోట్ల సంపాదనతో మూడో స్థానం దక్కించుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అత్యధికంగా సంపాదిస్తున్న టీవీ నటుల జాబితాలో ప్రియాంకకు 8వ స్థానం
ఎప్పుడు : సెప్టెంబర్ 27
ఎవరు : ఫోర్బ్స్ మ్యాగజైన్
‘ప్లేబాయ్’ వ్యవస్థాపకుడు హెఫ్నర్ కన్నుమూతప్రముఖ మ్యాగజైన్ ‘ప్లేబాయ్’ వ్యవస్థాపకుడు హ్యూ హెఫ్నర్ మృతి చెందారు. సెప్టెంబర్ 28న స్వగృహంలో హెఫ్నర్ కన్నుమూసినట్లు ప్లేబాయ్ కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. 1926 ఏప్రిల్ 9న షికాగోలో జన్మించిన హెఫ్నర్.. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో (1944-1946 మధ్య) అమెరికా ఆర్మీకి సంబంధించిన పత్రికలో పనిచేశారు. ప్రత్యేకంగా పురుషుల కోసం ఉన్నతస్థాయిలో మ్యాగజైన్ ఉండాలన్న సంకల్పంతో 1953లో ప్లేబాయ్ మ్యాగజైన్‌ను ప్రారంభించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్లేబాయ్ మ్యాగజైన్ వ్యవస్థాపకుడు హ్యూ పెఫ్నర్ కన్నుమూత
ఎప్పుడు : సెప్టెంబర్ 28
ఎక్కడ : షికాగో
5 రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం ఐదు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి కొత్త గవర్నర్లు నియమితుల య్యారు. తమిళనాడు, బిహార్, అసోం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయా, అండమాన్ నికోబార్ దీవులకు కొత్త గవర్నర్లను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అక్టోబర్ 1న నియమించారు.

- ప్రస్తుతం అసోం గవర్నర్‌గా ఉన్న బన్వారీలాల్ పురోహిత్‌ను తమిళనాడు గవర్నర్‌గా నియమించారు.
- అండమాన్, నికోబార్ దీవుల లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గా ఉన్న జగదీశ్ ముఖిని పురోహిత్ స్థానంలో అసోం గవర్నర్‌గా నియమించారు.
- బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సత్యపాల్ మాలిక్‌ను బిహార్ గవర్నర్‌గా నియమించారు.
- బిహార్‌కు చెందిన మాజీ ఎమ్మెల్సీ గంగా ప్రసాద్.. మేఘాలయ గవర్నర్‌గా, ఎన్‌ఎస్‌జీలో పని చేసిన రిటైర్డ్ బ్రిగేడియర్ బీడీ మిశ్రా.. అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా, నేవీ స్టాఫ్ అడ్మైరల్ మాజీ చీఫ్ దేవేంద్ర కుమార్ జోషి.. అండమాన్, నికోబార్ దీవులకు లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమితులయ్యారు.
సత్యపాల్ మాలిక్: బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా, బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షుడిగా పనిచేశారు. 1990 ఏప్రిల్ 21 నుంచి 1990 నవంబర్ 10 వరకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. రామ్‌నాథ్ కోవింద్ రాజీనామాతో ఖాళీ అయిన బిహార్ గవర్నర్ పదవి ఈయనకు వరించింది.
గంగా ప్రసాద్: 1994లో బిహార్ ఎమ్మెల్సీగా తొలిసారి ఎన్నికయ్యారు. 18 ఏళ్లపాటు ఎమ్మెల్సీగా ఉన్నారు. శాసన మండలిలో విపక్ష నేతగా పని చేశారు.
జగదీశ్‌ముఖి: ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్. ఎమర్జెన్సీ సమయంలో క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు. ఢిల్లీలోని జనక్‌పురి అసెంబ్లీ స్థానం నుంచి 7 సార్లు ఎన్నికయ్యారు. మంత్రిగా, అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా పని చేశారు.
దేవేంద్ర కుమార్ జోషి: 1974 ఏప్రిల్ 1న ఇండియన్ నేవీ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్‌లో చేరారు. నేషనల్ డిఫెన్‌స అకాడమీ పూర్వ విద్యార్థి. 2012 ఆగస్టు నుంచి 2014 ఫిబ్రవరి 26 వరకు నేవల్ స్టాఫ్ చీఫ్‌గా చేశారు. ఐఎన్‌ఎస్ సింధురత్నలో అగ్ని ప్రమాదం జరగడంతో దానికి నైతిక బాధ్యతగా రాజీనామా చేశారు. పరమ విశిష్ట సేవా పతకం, అతి విశిష్ట సేవా పతకం, యుద్ధ సేవా పతకం అందుకున్నారు.
బీడీ మిశ్రా: ఎన్‌ఎస్‌జీ (బ్లాక్ కాట్ కమాండోస్) కౌంటర్ హైజాక్ టాస్క్ ఫోర్స్ కమాండర్‌గా పనిచేశారు. 1993లో భారత విమానం హైజాక్ అయిన సమయంలో చేపట్టిన సహాయక చర్యల్లో పాలుపంచుకున్నారు. రిటైర్ అయిన తర్వాత కూడా కార్గిల్ యుద్ధంలో పాల్గొనేందుకు వలంటీర్‌గా ముందుకొచ్చారు. కౌంటర్ టైస్ట్ ఆపరేషన్‌సలో చురుకైన పాత్ర పోషించి ప్రశంసలు అందుకున్నారు.
డబ్ల్యూహెచ్‌వో డిప్యూటీ డెరైక్టర్‌గా సౌమ్య ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్ స్వామినాథన్ కూతురు సౌమ్య స్వామినాథన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) కార్యక్రమాల అమలు విభాగానికి డిప్యూటీ డెరైక్టర్ జనరల్ (డీడీపీ-డిప్యూటీ డెరైక్టర్ జనరల్ ఆఫ్ ప్రోగ్రామ్స్)గా నియమితులయ్యారు. ఈ పదవి డబ్ల్యూహెచ్‌వోలో రెండో అత్యున్నతమైనది కావడం విశేషం. ప్రస్తుతం ఆమె ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్)కు డెరైక్టర్ జనరల్‌గా వ్యవహరిస్తున్నారు. చిన్న పిల్లల వైద్య నిపుణురాలు అయిన సౌమ్య క్షయ నిర్మూలనపై చేసిన పరిశోధనలతో గుర్తింపు పొందారు. గతంలో ఆమె చెన్నైలోని జాతీయ క్షయ పరిశోధనా సంస్థలో డెరైక్టర్‌గా పనిచేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : డబ్ల్యూహెచ్‌వో డిప్యూటీ డెరైక్టర్‌గా భారతీయ శాస్త్రవేత్త
ఎప్పుడు : అక్టోబర్ 3
ఎవరు : సౌమ్య స్వామినాథన్
మధుకోడాపై ఈసీ మూడేళ్ల నిషేధంజార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధుకోడాపై ఎన్నికల సంఘం సెప్టెంబర్ 27న అనర్హత వేటు వేసింది. మూడేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించింది. ఎన్నికల ఖర్చులపై సరైన వివరాలు ఇవ్వని కారణంగా ఈ చర్యలు తీసుకుంది. మధుకోడా జార్ఖండ్ సీఎంగా 2006 నుంచి 2008 వరకు పనిచేశారు.
జానపద కళాకారుడు తండ భిక్షంకన్నుమూతపాచీన కళారూపమైన తెర చీరల పండితుడు, జానపద కళాకారుడు తండ భిక్షం (101) అక్టోబర్ 1న మరణించారు. ఆయన.. కృష్ణ జననం, గంగతర్క సంవాదం, కాటమరాజు కథలు చెప్పడంలో దిట్ట. పలు తాళపత్ర గ్రంథాలు రాశారు. తెర చీరల ప్రదర్శనకు పేరు తెచ్చారు.
బాలీవుడ్ నటుడు టామ్ ఆల్టర్ కన్నుమూతప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటుడు టామ్ ఆల్టర్ (67).. సెప్టెంబర్ 29న ముంబైలో కన్నుమూశారు. అమెరికా సంతతికి చెందిన ఆయన ఇండియా షోబిజ్ అనే టీవీ ప్రోగ్రామ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. 2008లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు.
సూకీ నుంచి ఫ్రీడమ్ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్ హోదా ఉపసంహరణ మయన్మార్ నేత అంగ్ సాన్ సూకీకి గతంలో ప్రదానం చేసిన ఫ్రీడమ్ ఆఫ్ ఆక్సఫర్డ్ హోదాను వెనక్కి తీసుకుంటున్నట్లు ఆక్సఫర్డ్ సిటీ కౌన్సిల్ అక్టోబర్ 2న ప్రకటించింది. మయన్మార్‌లో రోహింగ్యా ముస్లింలపై జరుగుతున్న దాడుల పట్ల ఆమె స్పందన సరిగ్గా లేదని పేర్కొన్న సంస్థ.. ఈ మేరకు గౌరవ హోదాను ఉపసంహరిస్తున్నట్లు వెల్లడించింది.
మయన్మార్‌లో ప్రజాస్వామ్యం కోసం అంగ్‌సాన్ సూకీ చేసిన పోరాటానికి గుర్తింపుగా ఆక్సఫర్డ్ సిటీ కౌన్సిల్ ఆమెకు 1997లో ఫ్రీడమ్ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్ హోదాను ప్రదానం చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అంగ్‌సాన్ సూకీ నుంచి ఫ్రీడమ్ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్ హోదా ఉపసంహరణ
ఎప్పుడు : అక్టోబర్ 2
ఎవరు : ఆక్స్‌ఫర్డ్ సిటీ కౌన్సిల్
No comments:
Post a Comment