AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Sunday 26 November 2017

వార్తల్లో వ్యక్తులు మార్చి 2017

వార్తల్లో వ్యక్తులు మార్చి 2017
డేవిడ్ రాక్‌ఫెల్లర్ కన్నుమూతభారీ విరాళాలు ప్రకటించే వితరణశీలి, అమెరికా వ్యాపారవేత్త డేవిడ్ రాక్‌ఫెల్లర్ (101) మార్చి 20న న్యూయార్క్‌లో మరణించారు. పర్యావరణ పరిరక్షణ నుంచి కళల వరకు అనేక అంశాల్లో రాక్‌ఫెల్లర్ కుటుంబం పెద్ద ఎత్తున విరాళాలు అందిస్తోంది. ఆయన సుమారు రూ.13 వేల కోట్ల మొత్తాన్ని విరాళంగా అందించారు. 

డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డికి ధన్వంతరి అవార్డ్వైద్య రంగంలో చేసిన కృషికిగానూ హైదరాబాద్‌లోని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డికి ధన్వంతరి అవార్డు లభించింది. ఈ అవార్డును మార్చి 26న ముంబైలో మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగరరావు ప్రదానం చేశారు. వైద్య రంగంలో విశేష కృషి చేసిన వ్యక్తులకు ధన్వంతరి మెడికల్ ఫౌండేషన్ ఈ అవార్డును అందిస్తోంది.

శాసనసభ్యుడిగా 50 ఏళ్లు కొనసాగిన కె. ఎం. మణి కేరళ కాంగ్రెస్(ఎం) అధిపతి కె.ఎం. మణి (83) శాసనసభ్యుడిగా నిర్విరామంగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. దేశంలో వేరెవరూ ఈ ప్రత్యేకతను సాధించలేదు. కొట్టాయం జిల్లాలో 1965లో పాలా నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఆ స్థానానికి ఆయనే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీర్ఘకాలం పనిచేసిన మంత్రిగా కూడా ఆయన ఘనత సాధించారు. శాసనసభలో మణి 13 బడ్జెట్లను ప్రవేశపెట్టారు.

ఎంపీ గైక్వాడ్‌పై విమానయాన సంస్థల నిషేధం ఎయిరిండియా ఉద్యోగిని చెప్పుతో కొట్టిన శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ తమ విమానాల్లో ప్రయాణించకుండా విమానయాన సంస్థలు ఆంక్షలు విధించాయి. ఈ మేరకు ఎయిరిండియా, జెట్ ఎయిర్‌వేస్, ఇండిగో, స్పైస్‌జెట్, గోఎయిర్, ఎయిర్‌ఏషియా, విస్తారా సంస్థలు మార్చి 24న నిర్ణయం తీసుకున్నాయి. ఘటనను తీవ్రంగా పరిగణించిన ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎయిర్‌లైన్‌‌స (ఎఫ్‌ఐఏ) తమ నెట్‌వర్క్ పరిధిలోని విమానాల్లో గైక్వాడ్ ప్రయాణించకుండా నిషేధం విధించింది. 
క్విక్ రివ్యూ:ఏమిటి : శివసేన ఎంపీ గైక్వాడ్‌పై విమానయాన సంస్థల నిషేధం 
ఎప్పుడు : మార్చి 24 
ఎవరు : ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎయిర్‌లైన్స్ 
ఎందుకు : ఎయిరిండియా ఉద్యోగిని చెప్పుతో కొట్టినందుకు 

స్వచ్ఛభారత్ మిషన్ డెరైక్టర్‌గా చంద్రకళ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛభారత్ మిషన్ డెరైక్టర్‌గా ఐఏఎస్ చంద్రకళ నియమితులయ్యారు. ఈ మేరకు మార్చి 24న కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. దీంతోపాటు మినిస్ట్రీ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ శాఖలోనూ ఆమెకు ఉప కార్యదర్శి బాధ్యతలు అప్పగించారు. 
తెలంగాణలోని కరీంనగర్ జిల్లాకు చెందిన చంద్రకళ ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.
క్విక్ రివ్యూ:ఏమిటి : స్వచ్ఛభారత్ మిషన్‌కు డెరైక్టర్ నియామకం
ఎప్పుడు : మార్చి 24
ఎవరు : ఐఏఎస్ చంద్రకళ (యూపీ క్యాడర్) 

కేరళ క్రైస్తవ సన్యాసి రాణి మరియా బీటిఫికేషన్‌కు అనుమతికేరళ క్రైస్తవ సన్యాసిని రాణి మరియాను పునీతగా ప్రకటించే ప్రక్రియలో భాగంగా బీటిఫికేషన్ (పరలోకం చేరారని నమ్మడం)కు వాటికన్ సిటీ ఆమోదం తెలిపింది. ఈ మేరకు బీటిఫికేషన్‌కు అనుమతిస్తూ పోప్ ఫ్రాన్సిస్ మార్చి 23న నిర్ణయం తీసుకున్నారు. దీనిపై మత పెద్దలు కూడా అధికారికంగా అంగీకారం తెలిపారు. 1995 ఫిబ్రవరి 25న బస్సులో ప్రయాణిస్తున్న 41 ఏళ్ల రాణి మరియాను సమందర్ సింగ్ అనే వ్యక్తి 54 సార్లు కత్తితో పొడిచి హత్య చేశాడు. గ్రామాల్లో ఆమె సామాజిక కార్యక్రమాలు చేస్తున్న నేపథ్యంలో వడ్డీ వ్యాపారుల ఆదేశాలతోనే ఈ హత్య జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. 
క్విక్ రివ్యూ:ఏమిటి : కేరళ క్రైస్తవ సన్యాసి రాణి మరియా బీటిఫికేషన్‌కు అనుమతి 
ఎప్పుడు : మార్చి 23
ఎవరు : పోప్ ఫ్రాన్సిస్ 
ఎందుకు : పరలోకం చేరారని నమ్మేందుకు 

బీఎస్‌ఎఫ్‌లో తొలి మహిళా అధికారిగా తనుశ్రీ పరీక్ సరిహద్దు భద్రతా దళం-బీఎస్‌ఎఫ్‌లో తొలి మహిళా అధికారి (Combat officer)గా తనుశ్రీ పరీక్ నియమితులయ్యారు. ఈ మేరకు పంజాబ్‌లోని భారత్-పాకిస్తాన్ సరిహద్దు వెంట ఉన్న బీఎస్‌ఎఫ్ యూనిట్‌లో మార్చి 25న ఆమెకు పోస్టింగ్ ఇచ్చారు. రాజస్తాన్‌లోని బికనీర్‌కు చెందిన తనుశ్రీ 2014 యూపీఎస్సీలో ఉత్తీర్ణత సాధించి ఆఫీసర్ ర్యాంకులో బీఎస్‌ఎఫ్‌లో చేరారు. 
క్విక్ రివ్యూ:ఏమిటి : బీఎస్‌ఎఫ్‌లో తొలి మహిళా అధికారి
ఎప్పుడు : మార్చి 25
ఎవరు : తనుశ్రీ పరీక్ 
ఎక్కడ : భారత్-పాకిస్తాన్ సరిహద్దులో

వర్ణ వివక్ష పోరాట యోధుడు అహ్మద్ కత్రాడా కన్నుమూతవర్ణవివక్షపై పోరాడిన భారతీయ ఆఫ్రికన్ అహ్మద్ కత్రాడా(87) మార్చి 28న దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్‌బర్గ్‌లో కన్నుమూశారు. 1929లో దక్షిణాఫ్రికాలో నివసించిన ప్రవాస భారతీయ దంపతులకు జన్మించిన ఆయన చిన్న వయస్సు నుంచే వర్ణవివక్షపై పోరాటాల్లో పాల్గొన్నారు. నల్లజాతి సూరీడు నెల్సన్ మండేలాకు సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. కత్రాడా మొత్తం 26 సంవత్సరాల మూడు నెలలు జైలు శిక్ష అనుభవించారు ( 18 సంవత్సరాలు రోబెన్ దీవిలో కఠిన కారాగార శిక్ష). 
భారత ప్రభుత్వం 2005లో ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డుతో కత్రాడాను గౌరవించింది. 
క్విక్ రివ్యూ:ఏమిటి : అహద్ కత్రాడా కన్నుమూత
ఎప్పుడు : మార్చి 28 
ఎవరు : వర్ణ వివక్ష పోరాట యోధుడు
ఎక్కడ : జోహన్నస్‌బర్గ్, దక్షిణాఫ్రికా

పంజాబ్ ముఖ్యమంత్రిగా అమరీందర్ ప్రమాణం  పంజాబ్ 26వ ముఖ్యమంత్రిగా కెప్టెన్ అమరీందర్ సింగ్ మార్చి 16న ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మేరకు అమరీందర్‌తో పాటు తొమ్మిది మంది మంత్రులతో గవర్నర్ వీపీ సింగ్ బద్నూర్ ప్రమాణం చేయించారు. పంజాబ్ సీఎంగా అమరీందర్ బాధ్యతలు చేపట్టడం ఇది రెండోసారి. కేబినెట్‌లో చోటు దక్కించుకున్న మాజీ క్రికెటర్ నవజ్యోత్‌సింగ్ సిద్ధూకు స్థానిక ప్రభుత్వ వ్యవహారాల శాఖతో పాటు పర్యాటక, సాంస్కృతిక శాఖలు అప్పగించారు. పంజాబ్ కేబినెట్‌లో గరిష్ట మంత్రుల సంఖ్య 18. 
క్విక్ రివ్యూ:ఏమిటి : పంజాబ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు
ఎప్పుడు : మార్చి 16
ఎవరు : ముఖ్యమంత్రిగా అమరీందర్ సింగ్ ప్రమాణం 

యంగ్ గ్లోబల్ లీడర్స్‌లో ఐదుగురు భారతీయులువరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) మార్చి 17న విడుదల చేసిన వంద మంది యంగ్ గ్లోబల్ లీడర్స్ జాబితా-2017లో ఐదుగురు భారతీయులు స్థానం దక్కించుకున్నారు. పేటీఎం వ్యవస్థాపకుడు, సీఈవో విజయ్ శేఖర్ శర్మ, హాస్పిటాలిటీ బ్రాండ్ తమర కూర్జ్ డెరైక్టర్ శ్రుతి శిబులాల్, బ్లిప్పర్ వ్యవస్థాపకుడు అంబరిశ్ మిత్రా, ఫార్చూన్ ఇండియా ఎడిటర్ హిందోల్ సేన్‌గుప్తా, స్వానిటి ఫౌండేషన్ సీఈవో రిత్విక భట్టాచార్య ఈ జాబితాలో ఉన్నారు. వినూత్నమైన ఆవిష్కరణలతో ప్రపంచంలోని క్లిష్టమైన సవాళ్లకు పరిష్కారం చూపిన 40 ఏళ్ల లోపు వయసున్న 100 మందితో డబ్ల్యూఈఎఫ్ ఏటా ఈ జాబితా తయారు చేస్తుంది. 
క్విక్ రివ్యూ:ఏమిటి : యంగ్ గ్లోబల్ లీడర్స్ జాబితాలో ఐదుగురు భారతీయులు 
ఎప్పుడు : మార్చి 17
ఎవరు : వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్)
ఎందుకు : వినూత్నమైన ఆవిష్కరణలు చేసినందుకు 

ఆస్సీ 10 పీక్ చాలెంజ్ పూర్తి చేసిన ఎస్పీ రాధిక ఎస్పీ జీఆర్ రాధిక ఆస్ట్రేలియాలో ఆస్సీ 10 పీక్ చాలెంజ్‌ని విజయవంతంగా పూర్తి చేశారు. తద్వారా భారత్‌లో ఈ రికార్డు సాధించిన తొలి పోలీసు అధికారిగా ఆమె గుర్తింపు పొందారు. ఆస్ట్రేలియాలో ఉన్న 10 ఎత్తై పర్వత శ్రేణుల్ని ఏకబిగిన అధిరోహించడాన్ని ‘ఆస్సీ 10 పీక్ చాలెంజ్’ అంటారు. మార్చి 17న ఆరు పర్వతాలని అధిరోహించిన ఆమె మార్చి 18న మరో నాలుగింటిని ఎక్కారు. 2016 మేలో ఎవరెస్ట్‌ను అధిరోహించి ఆ ఘనత సాధించిన తొలి మహిళా పోలీసు అధికారిణిగా రికార్డు సృష్టించారు.
జీఆర్ రాధిక ప్రస్తుతం హైదరాబాద్ అంబర్‌పేట్‌లోని పోలీస్ ట్రైనింగ్ కాలేజీ అదనపు ఎస్పీగా పనిచేస్తున్నారు. 
క్విక్ రివ్యూ:ఏమిటి : ఆస్సీ 10 పీక్ చాలెంజ్ 
ఎప్పుడు : మార్చి 18
ఎవరు : ఎస్పీ జీఆర్ రాధిక 
ఎక్కడ : ఆస్ట్రేలియా 

ఉత్తరాఖండ్ సీఎంగా త్రివేంద్ర ప్రమాణం ఉత్తరాఖండ్ 9వ ముఖ్యమంత్రిగా త్రివేంద్ర సింగ్ రావత్ మార్చి 18న ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు 9 మంది మంత్రులతో గవర్నర్ కృష్ణ కాంత్ పాల్ ప్రమాణం చేయించారు. ఇటీవల జరిగిన ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 70 సీట్లకు గాను భాజపా 57 స్థానాల్లో గెలుపొందింది.
క్విక్ రివ్యూ:ఏమిటి : ఉత్తరాఖండ్‌లో ఏర్పాటైన బీజేపీ ప్రభుత్వం 
ఎప్పుడు : మార్చి 18
ఎవరు : సీఎంగా త్రివేంద్ర సింగ్ రావత్ ప్రమాణం 

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణం ఉత్తరప్రదేశ్ 21వ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ మార్చి 19న ప్రమాణం స్వీకారం చేశారు. ఆయనతో పాటు 47 మంది మంత్రులతో గవర్నర్ రాంనాయక్ ప్రమాణం చేయించారు. బీజేపీ యూపీ అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ మౌర్య, పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు దినేశ్ శర్మలకు ఉప ముఖ్యమంత్రి పదవులు లభించాయి. 
యోగి ఆదిత్యనాథ్ ప్రస్థానం 
  • 1972-జూన్ 5న పారీ గడ్వాల్ జిల్లాలో (ఇప్పుడు ఉత్తరాఖండ్‌లో ఉంది) జననం. అసలు పేరు అజయ్ సింగ్ బిస్త్.
  • 1992-గడ్వాల్ వర్సిటీ నుంచి బీఎస్సీ (మ్యాథ్స్) పట్టా.
  • 1994-గోరఖ్‌నాథ్ మఠాధిపతి మహంత్ అవైద్యనాథ్ శిష్యుడిగా దీక్ష, యోగి ఆదిత్యనాథ్‌గా పేరు మార్పు.
  • 1998లో 26 ఏళ్లకే గోరఖ్‌పూర్ నుంచి ఎంపీగా గెలుపు. మొత్తం ఐదు సార్లు ఎంపీగా గోరఖ్‌పూర్‌కు ప్రాతినిధ్యం.
  • 2014- గురువు మహంత్ అవైద్యనాథ్ మరణించడంతో సెప్టెంబరులో గోరఖ్‌పూర్ మఠాధిపతిగా బాధ్యతల స్వీకారం.
  • 2017, మార్చి 19న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం.
క్విక్ రివ్యూ:ఏమిటి : యూపీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు 
ఎప్పుడు : మార్చి 19
ఎవరు : ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణం 

ఐరాస సూపర్‌బగ్ హైపవర్ కమిటీలో సౌమ్యా స్వామినాథన్‌కు చోటు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) డెరైక్టర్ సౌమ్యా స్వామినాథన్ ఐరాస ఆధ్వర్యంలో పనిచేసే సూపర్‌బగ్ హైపవర్ కమిటీలో చోటు సంపాదించారు. ఈ మేరకు ఆమెను ఈ కమిటీలో చేరుస్తూ ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియా గ్యుటరస్ మార్చి 19న నిర్ణయం తీసుకున్నారు. మందులకు లొంగని సూపర్‌బగ్‌లపై పరిశోధనలకు హైపవర్ కమిటీ సలహాలు అందిస్తుంది. సౌమ్య ప్రస్తుతం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ హెల్త్ రీసెర్చ్ విభాగంలో కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. ఆమె భారత హరిత విప్లవ పితామహుడు స్వామినాథన్ కూతురు. 
క్విక్ రివ్యూ:ఏమిటి : ఐరాస సూపర్‌బగ్ హైపవర్ కమిటీలో సౌమ్యా స్వామినాథన్‌కు చోటు
ఎప్పుడు : మార్చి 19
ఎవరు : ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియా గ్యుటరస్ 
ఎందుకు : సూపర్‌బగ్‌లపై పరిశోధనలకు సలహాలు ఇచ్చేందుకు 

లిటిల్ గెలాక్సీ మిస్‌వరల్డ్‌గా మున్నీలిటిల్ గెలాక్సీ మిస్ వరల్డ్-2017గా ఒడిశాలోని గంజాం జిల్లా హింజిలికాట్‌కు చెందిన ఐదేళ్ల మైరా మున్నీ ఎంపికైంది. యూరప్‌లోని బల్గేరియాలో మార్చి 19న జరిగిన ప్రపంచ లిటిల్ గెలాక్సీ మిస్-2017 పోటీల్లో ఈ చిన్నారి విజేతగా నిలిచింది. దీంతో పాటు ‘మిస్ గెలాక్సీ ఫ్యాషన్ స్టార్’, ‘బెస్ట్ నేషనల్ కాస్ట్యూమ్స్’ అవార్డులను మున్నీ గెలుచుకుంది.
2013 నుంచి నిర్వహిస్తోన్న ఈ పోటీల్లో 11 ఏళ్ల లోపు వయసున్న బాలికలు పాల్గొంటారు. 
క్విక్ రివ్యూ:ఏమిటి : లిటిల్ గెలాక్సీ మిస్ వరల్డ్-2017
ఎప్పుడు : మార్చి 19
ఎవరు : మైరా మున్నీ
ఎక్కడ : యూరప్‌లో 

యూఎస్‌లోని అత్యున్నత జ్యుడిషియల్ పదవిలో భారతీయుడు అమెరికాలో అత్యంత శక్తివంతమైన అప్పీల్ కోర్టులో కీలక జ్యుడిషియల్ పదవికి భారతీయ- అమెరికన్ అముల్ థాపర్(47) నామినేట్ అయ్యారు. ఈ మేరకు మార్చి 21న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నియామకాన్ని సెనేట్ ధ్రువీకరిస్తే శక్తివంతమైన అమెరికా 6వ సర్క్యూట్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్‌లో థాపర్ భాగస్వామి అవుతారు. కెంటకీ, టెన్నెసీ, ఓహియో, మిచిగాన్ రాష్ట్రాల నుంచి వచ్చే అపీళ్లను ఈ కోర్టు విచారిస్తుంది. 
క్విక్ రివ్యూ:ఏమిటి : అప్పీల్ కోర్టులో జ్యుడిషియల్ పదవికి ఎంపికైన అముల్ థాపర్
ఎప్పుడు : మార్చి 21
ఎక్కడ : అమెరికా
ఎవరు : నామినేట్ చేసిన యూఎస్ అధ్యక్షుడు ట్రంప్

ఎన్‌బీసీఎఫ్‌డీసీ స్వతంత్ర డెరైక్టర్‌గా హన్మాండ్లు జాతీయ వెనుకబడిన తరగతుల ఆర్థిక, అభివృద్ధి కార్పొరేషన్ (ఎన్‌బీసీఎఫ్‌డీసీ) స్వతంత్ర డెరైక్టర్‌గా నిజామాబాద్‌కు చెందిన చార్టెడ్ అకౌంటెంట్ హన్మాండ్లు నియమితులయ్యారు. ఈ మేరకు మార్చి 8న కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఈ కార్పొరేషన్‌కు ఆయన మూడేళ్లపాటు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. 
క్విక్ రివ్యూ:ఏమిటి : ఎన్‌బీసీఎఫ్‌డీసీ స్వతంత్ర డెరైక్టర్‌గా హన్మాండ్లు 
ఎప్పుడు : మార్చి 8
ఎవరు : కేంద్ర ప్రభుత్వం 

ముంబై మేయర్‌గా విశ్వనాథ్ మహదేశ్వర్శివసేన కార్పొరేటర్ విశ్వనాథ్ మహదేశ్వర్ బృహన్ ముంబై కార్పొరేషన్(బీఎంసీ) మేయర్‌గా మార్చి 8న ఎన్నికయ్యారు. బీజేపీ మద్దతుతో మేయర్ అభ్యర్థిగా పోటీలో నిలిచిన ఆయన 171-31 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి విఠల్ లోకారేను ఓడించారు. శివసేనకే చెందిన హేమంగి వోర్లికర్ ఉప మేయర్‌గా ఎన్నికయ్యారు. 
క్విక్ రివ్యూ:ఏమిటి : ముంబై కార్పొరేషన్(బీఎంసీ) మేయర్ ఎన్నిక
ఎప్పుడు : మార్చి 8
ఎవరు :విశ్వనాథ్ మహదేశ్వర్

సీఐఐ తెలంగాణ చైర్మన్‌గా రాజన్నసీఐఐ తెలంగాణ శాఖ చైర్మన్‌గా 2017-18 సంవత్సరానికిగాను టీసీఎస్ వైస్ ప్రెసిడెంట్ వి.రాజన్న మార్చి 8న నియమితులయ్యారు. ఇప్పటి వరకు సీఐఐ తెలంగాణ వైస్ చైర్మన్‌గా ఉన్న ఆయన ఏపీఆన్‌లైన్, టీఎస్‌ఆన్‌లైన్, ఎంపీఆన్‌లైన్‌కు డెరైక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. సీఐఐ తెలంగాణ శాఖ వైస్ చైర్మన్‌గా ఐటీసీ పేపర్ బోర్డ్స్, స్పెషాలిటీ పేపర్స్ విభాగం డివిజినల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సంజయ్ సింగ్ ఎన్నికయ్యారు. 
క్విక్ రివ్యూ:ఏమిటి : సీఐఐ తెలంగాణ ఛైర్మన్ నియామకం 
ఎప్పుడు : మార్చి 8
ఎవరు : వి.రాజన్న

ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా కారెం శివాజీఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా కారెం శివాజీని ప్రభుత్వం తిరిగి నియమించింది. ఈ మేరకు మార్చి 9న ఉత్తర్వులు జారీ చేసింది. విశిష్ట వ్యక్తులు, ఎస్సీ, ఎస్టీల కోసం కృషి చేసిన వారే కమిషన్ చైర్మన్ హోదాకు అర్హులని గతంలో కోర్టు ఆదేశాలివ్వడంతో చైర్మన్ పదవిని ప్రభుత్వం రద్దు చేసింది. ఆ తరువాత ప్రభుత్వం, శివాజీ వేరు వేరుగా కోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్‌లను తిరస్కరించిన కోర్టు కమిషన్ చైర్మన్‌గా అన్ని అర్హతలు ఉన్న వ్యక్తి అవునో కాదో తేల్చుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. దీంతో కారెం శివాజీని విశిష్ట వ్యక్తిగానే భావించి కమిషన్ చైర్మన్‌గా నియమిస్టున్నట్లు తాజాగా జారీ చేసిన జీవోలో ప్రభుత్వం పేర్కొంది. అలాగే కమిషన్ సభ్యులుగా డాక్టర్ కర్రా రాజారావు, కె నరహరి వరప్రసాద్, బద్దెపూడి రవీంద్ర, ఎన్ సుధారాణి, సివేరి సోమను నియమించారు.
క్విక్ రివ్యూ:ఏమిటి : ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా కారెం శివాజీ
ఎప్పుడు : మార్చి 9
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 

జస్టిస్ కర్ణన్‌పై అరెస్టు వారెంట్ జారీ చేసిన సుప్రీంకోర్టుకోర్టు ధిక్కార కేసులో కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీఎస్ కర్ణన్‌కు సుప్రీంకోర్టు మార్చి 10న అరెస్ట్ వారంట్ జారీ చేసింది. ఈ మేరకు మార్చి 31న కర్ణన్‌ను కోర్టు ముందు హాజరుపరచాలని పశ్చిమబెంగాల్ డీజీపీని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్ నేతృత్వంలోని ఏడుగురు జడ్జీల ధర్మాసనం ఆదేశించింది. రూ.10 వేల పూచీకత్తుపై ఆయన బెయిల్ తీసుకోవచ్చని తెలిపింది. సర్వీసులో ఉన్న హైకోర్టు న్యాయమూర్తికి అరెస్టు వారెంటు ఇవ్వడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. కాగా ఈ ఆదేశాలు జారీ చేసిన ధర్మాసనంలోని న్యాయమూర్తులపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం-1989 ప్రకారం కేసు నమోదు చేసి, విచారణ జరపాల్సిందిగా జస్టిస్ కర్ణన్ సీబీఐని ఆదేశించారు. దర్యాప్తు నివేదికను సీబీఐ కోర్టు ముందుంచాలన్నారు. 
కొందరు న్యాయమూర్తులు, విశ్రాంత న్యాయమూర్తులు అవినీతికి పాల్పడ్డారంటూ ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఇతరులకు లేఖలు రాయటంతో కర్ణన్‌పై కోర్టు ధిక్కార కేసు నమోదైంది. ఫిబ్రవరి 8న న్యాయస్థానం ముందు హాజరై, వివరణ ఇవ్వాల్సిందిగా సుప్రీం కోర్టు నోటీసు లిచ్చింది. ఆయన హాజరు కాకపోవడంతో ఫిబ్రవరి 13న హాజరు కావాలంటూ మరో నోటీసిచ్చింది. ఈ ఆదేశాలనూ జస్టిస్ కర్ణన్ బేఖాతరు చేయడాన్ని కోర్టు తీవ్రంగా పరిగణించింది. 
క్విక్ రివ్యూ:ఏమిటి : జస్టిస్ కర్ణన్‌పై అరెస్టు వారెంట్ జారీ
ఎప్పుడు : మార్చి 10 
ఎవరు :సుప్రీం కోర్టు 
ఎందుకు : న్యాయస్థానం ఆదేశించినా విచారణకు హాజరుకానందుకు

డీఎమ్‌తో సచిన్ భాగస్వామ్యంక్యాన్సర్, గుండె సంబంధ వ్యాధులతో బాధపడుతున్న యువతకు సాయమందించేందుకు ఆస్టర్ డీఎమ్ ఫౌండేషన్ మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ మేరకు మార్చి 13న ఆ సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. డీఎమ్ ఫౌండేషన్ కింద ప్రతి సంవత్సరం 18 ఏళ్లలోపు 50 మంది రోగులకు వైద్య ఖర్చులకు సాయం అందిస్తారు. కొద్ది మొత్తం రోగి కుటుంబం భరించాల్సి ఉంటుంది. తొలిదశలో ఈ పథకాన్ని నాలుగేళ్ల పాటు కొనసాగిస్తారు. 
క్విక్ రివ్యూ:ఏమిటి : ఆస్టర్ డీఎమ్ ఫౌండేషన్‌తో సచిన్ భాగస్వామ్యం 
ఎప్పుడు : మార్చి 13
ఎందుకు : క్యాన్సర్, గుండె సంబంధ వ్యాధులతో బాధపడుతున్న యువతకు వైద్య సాయం అందించేందుకు 

గోవా ముఖ్యమంత్రిగా మనోహర్ పరీకర్ గోవా నూతన ముఖ్యమంత్రిగా మనోహర్ పరీకర్ మార్చి 14న ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు 9 మంది మంత్రులతో గవర్నర్ మృదులా సిన్హా ప్రమాణం చేయించారు. ఈ బాధ్యతలు చేపట్టేందుకు కేంద్ర రక్షణ మంత్రి పదవికి పరీకర్ రాజీనామా చేశారు. బాంబే ఐఐటీలో చదివిన ఆయన గోవా సీఎం కావడం ఇది నాలుగోసారి.
40 స్థానాలున్న గోవా అసెంబ్లీలో కాంగ్రెస్ 17 సీట్లు గెలిచి అతిపెద్ద పార్టీగా, 13 సీట్లతో బీజేపీ రెండో అతిపెద్ద పార్టీగా నిలిచాయి. మిగతా పార్టీల మద్దతుతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. పరీకర్ ప్రమాణంపై స్టే విధించాలన్న కాంగ్రెస్ పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. మార్చి 16న ఆ రాష్ట్ర అసెంబ్లీలో పరీకర్ బల నిరూపణ ఎదుర్కోనున్నారు. 
క్విక్ రివ్యూ:ఏమిటి : గోవాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ
ఎవరు : ముఖ్యమంత్రిగా మనోహర్ పరీకర్ ప్రమాణం 
ఎప్పుడు : మార్చి 14

రక్షణ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన జైట్లీకేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ మార్చి 14న రక్షణ మంత్రిగా అదనపు బాధ్యతలు చేపట్టారు. మనోహర్ పరీకర్ గోవా ముఖ్యమంత్రి పదవి చేప్టేటందుకు రక్షణ మంత్రి పదవికి రాజీనామా చేయటంతో జైట్లీ ఆ బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వంలో జైట్లీ రక్షణ శాఖను చేపట్టడం ఇది రెండోసారి. 2014లో మే నుంచి నవంబర్ వరకు రక్షణ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 
క్విక్ రివ్యూ:ఏమిటి : రక్షణ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన జైట్లీ
ఎప్పుడు : మార్చి 14
ఎందుకు : మనోహర్ పరీకర్ రాజీనామా చేయడంతో 

మణిపూర్ ముఖ్యమంత్రిగా బీరేన్ ప్రమాణం మణిపూర్‌లో తొలి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ మేరకు మార్చి 15న నాంగ్‌తోంబం బీరేన్ సింగ్, మంత్రులుగా మరో ఎనిమిదితో గవర్నర్ నజ్మా హెప్తుల్లా ప్రమాణ స్వీకారం చేయించారు. బీజేపీకి మద్దతు ఇచ్చిన నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పీపీ)కి చెందిన నలుగురు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు లభించాయి. 
మణిపూర్ శాసనసభలో మొత్తం 60 సీట్లు ఉండగా ఇటీవల వెలువడిన ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి 21, కాంగ్రెస్‌కు 28 సీట్లు వచ్చాయి. ఇతర పార్టీల మద్దతుతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 
క్విక్ రివ్యూ:ఏమిటి : కొలువు దీరిన మణిపూర్ నూతన ప్రభుత్వం
ఎప్పుడు : మార్చి 15న
ఎవరు : ముఖ్యమంత్రిగా బీరేన్ ప్రమాణం 

ఐసీసీ ఛైర్మన్ పదవికి శశాంక్ మనోహర్ రాజీనామా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్ పదవికి శశాంక్ మనోహర్ రాజీనామా చేశారు. ఈ మేరకు మార్చి 15న ఐసీసీ సీఈఓ డేవ్ రిచర్డ్‌సన్‌కు ఈ-మెయిల్ ద్వారా రాజీనామా లేఖను పంపారు. వాస్తవానికి 2018 వరకూ పదవిలో ఉండాల్సిన ఆయన ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన 8 నెలలకే నిష్క్రమించారు. 
క్విక్ రివ్యూ:ఏమిటి : ఐసీసీ ఛైర్మన్ పదవికి శశాంక్ మనోహర్ రాజీనామా 
ఎప్పుడు : మార్చి 15

ఐఓసీ చైర్మన్‌గా సంజీవ్ సింగ్ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) చైర్మన్‌గా సంజీవ్ సింగ్ ఫిబ్రవరి 28న నియమితులయ్యారు. ఆయన నియామకాన్ని కేంద్ర మంత్రివర్గ నియామకాల కమిటీ ఆమోదించింది. సంజీవ్ ఐదేళ్లపాటు ఐఓసీ చైర్మన్‌గా కొనసాగనున్నారు.

డబ్యూటీఓలో భారత రాయబారి దీపక్ప్రపంచ వాణిజ్య సంస్థ(WTO-World Trade Organisation)లో భారత రాయబారి (భారత శాశ్వత ప్రతినిధి)గా టెలికం కార్యదర్శి జె.ఎస్. దీపక్ నియమితులయ్యారు. ఈ మేరకు మార్చి 1న కేంద్ర ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. 1982 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన దీపక్ ఉత్తరప్రదేశ్‌కు చెందినవారు. 2010 స్పెక్ట్రమ్ ఈ-వేలం ద్వారా ప్రభుత్వానికి రూ.1.06 లక్షల కోట్లు విజయవంతంగా రావడంలో ఈయన కీలక పాత్ర పోషించారు. ఐఐఎం అహ్మదాబాద్‌లో ఎంబీఏ చదివిన ఆయన వాషింగ్టన్ డీసీకి చెందిన పాలసీ ప్రాజెక్ట్‌కు కన్సల్టెంట్‌గా పనిచేశారు. 

సెబీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన అజయ్ త్యాగి  సెబీ (Securities and Exchange Board Of India) 9వ చైర్మన్‌గా అజయ్ త్యాగి మార్చి 1న బాధ్యతలు చేపట్టారు. ఆయన మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. హిమాచల్ ప్రదేశ్ క్యాడర్, 1984 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అయిన త్యాగి ఆర్థిక మంత్రిత్వ శాఖలో క్యాపిటల్ మార్కెట్ విభాగంతో పాటు కేంద్రంలో పలు కీలక బాధ్యతలు నిర్వర్తించారు.

సెబీ మాజీ చైర్మన్ యూకే సిన్హా ఆరేళ్ల పాటు పదవిలో ఉన్నారు. ఈ సంస్థకు అధిక కాలం చైర్మన్‌గా వ్యవహరించిన వారిలో సిన్హా రెండో వ్యక్తి. గతంలో డి. ఆర్. మెహతా1995 నుంచి 2002 వరకూ ఏడేళ్ల పాటు సెబీ చైర్మన్‌గా వ్యవహరించారు. 

ఐరాస డిప్యూటీ సెక్రటరీ జనరల్‌గా బాధ్యతలు చేపట్టిన అమీనాఐక్య రాజ్యసమితి డిప్యూటీ సెక్రటరీ జనరల్‌గా అమీనా మహ్మద్ ఫిబ్రవరి 28న బాధ్యతలు చేపట్టారు. నైజీరియాకు చెందిన ఆమె గతంలో ఆ దేశ పర్యావరణ శాఖ మంత్రిగా పనిచేశారు. అంతకుముందు స్వీడన్‌కు చెందిన జాన్ ఎలీయాసన్ 2012 నుంచి 2016 వరకూ ఐరాస డిప్యూటీ జనరల్‌గా పనిచేశారు. ఐక్యరాజ్య సమితి ప్రస్తుత సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటై 

శతావధాని సీవీ సుబ్బన్న కన్నుమూతప్రముఖ శతావధాని డాక్టర్ కడప వెంకట సుబ్బన్న(88) మార్చి 5న హైదరాబాద్‌లో కన్నుమూశారు. కడప రంగమ్మ, చెన్నప్ప దంపతులకు 1929 నవంబర్ 12న జన్మించిన ఆయన దేశ విదేశాల్లో 600కు పైగా అవధానాలు చేశారు. 25 ప్రబంధాలు, నాలుగు లఘుకృతులు తీసుకొచ్చారు. కనకాభిషేకం, హస్తకంకణం, కవి గండపెండేరంతో పదిసార్లు గౌరవం పొందారు. ఆయన చేసిన అవధానాలను శతావధాన గ్రంథం ‘త్రికుఠి’ పేరుతో ముద్రించారు. 
క్విక్ రివ్యూ:ఏమిటి : శతావధాని సీవీ సుబ్బన్న(88) కన్నుమూత
ఎప్పుడు : మార్చి 5 
ఎక్కడ :హైదరాబాద్

సరోగసీ ద్వారా కరణ్ జోహార్‌కు కవలలు ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ సరోగసీ ద్వారా కవలలకు తండ్రి (సింగిల్ ఫాదర్) అయ్యారు. ఈ విషయాన్ని మార్చి 5న ఆయన వెల్లడించారు. తన తల్లిదండ్రుల పేర్లు కలసివచ్చేట్లుగా కూతురుకు రూహి, కొడుకుకు యష్ పేర్లు పెట్టారు. సరోగసీలో శిశువులకు జన్మనిచ్చిన మహిళకు కరణ్ కృతజ్ఞతలు తెలిపారు.
క్విక్ రివ్యూ:ఏమిటి : సరోగసీ ద్వారా కరణ్ జోహార్‌కు కవలలు
ఎప్పుడు : మార్చి 5
ఎవరు :కరణ్ జోహార్ ప్రముఖ బాలీవుడ్ దర్శక, నిర్మాత 

కుట్టులేని ప్యాంటు, షర్ట్ తయారు చేసిన విజయ్ కుమార్ తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన నల్ల విజయ్ కుమార్ కుట్టు లేని ప్యాంటు, షర్టు తయారు చేశారు. 45 రోజుల పాటు శ్రమించి చేనేత మగ్గంపై పట్టు పోగులతో వీటిని రూపొందించారు. ఈ వస్త్రాల బరువు కేవలం 120 గ్రాములు. 2012 నుంచి చేనేత మగ్గంతో ప్రయోగాలు చేస్తున్న విజయ్ గతంలో అగ్గిపెట్టెలో ఇమిడే పట్టుచీర, ఉంగరం, దబ్బనంలో దూరే చీరలు తయారు చేశారు. కుట్టులేకుండా చేనేత మగ్గంపై జాతీయ పతకాన్ని నేశారు. ఇందుకు గాను తెలంగాణ రికార్డుల బుక్‌లో చోటు సంపాదించారు. 

విజయ్‌కుమార్ తండ్రి నల్ల పరంధాములు 1990లో అగ్గిపెట్టెలో ఇమిడే చీర, కుట్టులేని జాకెట్ తయారు చేశారు. మగ్గంపై కుట్టులేకుండా ఆయన నేసిన భారతీయ త్రివర్ణ పతాకాన్ని 1996లో అట్లాంటాలో జరిగిన ఒలింపిక్ క్రీడోత్సవాల్లో ప్రదర్శించారు. 
క్విక్ రివ్యూ:ఏమిటి : కుట్టులేని ప్యాంటు, షర్ట్ తయారీ 
ఎక్కడ : రాజన్న సిరిసిల్ల జిల్లా, తెలంగాణ 
ఎవరు :నల్ల విజయకుమార్ 

లోక్‌సభ మాజీ స్పీకర్ రబీరే కన్నుమూత లోక్‌సభ మాజీ స్పీకర్ రబీరే (91) మార్చి 6న ఒడిశాలో కన్నుమూశారు. జనతాదళ్ పార్టీకి చెందిన ఆయన 1989 నుంచి 1991 వరకూ లోక్‌సభకు 9వ స్పీకర్‌గా పనిచేశారు. రబీరే హయాంలోనే లోక్‌సభ కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారాలు ప్రారంభమయ్యాయి. 
క్విక్ రివ్యూ:ఏమిటి : లోక్‌సభ మాజీ స్పీకర్ రబీరే కన్నుమూత 
ఎప్పుడు : మార్చి 6
ఎక్కడ :కటక్ (ఒడిశా)

No comments:

Post a Comment