AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Sunday, 26 November 2017

వార్తల్లో వ్యక్తులు సెప్టెంబరు 2016

వార్తల్లో వ్యక్తులు సెప్టెంబరు 2016
ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్‌గా జిమ్ యాంగ్ కిమ్
ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్‌గా జిమ్ యాంగ్ కిమ్ రెండోసారీ నియమితుల య్యారు. ఈయన పదవీ కాలం 2017 జూలై 1 నుంచి ప్రారంమై ఐదేళ్లు ఉంటుంది. కిమ్ 2012లో బ్యాంక్ ప్రెసిడెంట్‌గా నియమితులైనప్పుడు 2030 నాటికి పేదరికాన్ని నిర్మూలించడం, వర్ధమాన దేశాల్లోని వ్యక్తుల ఆదాయాన్ని పెంచడం అనే రెండు లక్ష్యాలను బ్యాంకుకు నిర్దేశించారు.
ఎస్‌బీఐ చీఫ్ పదవీకాలం పొడిగింపు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) చీఫ్‌గా అరుంధతీ భట్టాచార్య పదవీకాలాన్ని మరో ఏడాది పొడిగించారు. ఆమె మూడేళ్ల పదవీకాలం సెప్టెంబర్ 30తో ముగిసింది. కానీ భారతీయ మహిళా బ్యాంక్ సహా 5 ఎస్‌బీఐ అనుబంధ బ్యాంకుల విలీనం 2017 మార్చితో ముగియాలన్న లక్ష్యం నేపథ్యంలో పదవీకాలం పొడిగించారు.

అమెరికాలో భారత రాయబారిగా నవతేజ్ 
 సీనియర్ ఐఎఫ్‌ఎస్ అధికారి నవతేజ్ సర్నా(59) అమెరికాలో భారత రాయబారిగా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన యూకేలో హైకమిషనర్‌గా పనిచేస్తున్నారు. 1980 బ్యాచ్ ఐఎఫ్‌ఎస్ అధికారైన సర్నా గతంలో విదేశాంగ శాఖలో కార్యదర్శిగా చేశారు. త్వరలో విరమణ పొందనున్న అరుణ్ సింగ్ స్థానంలో సర్నా బాధ్యతలు చేపడతారు. 

ఎన్‌ఎస్‌జీ డెరైక్టర్ జనరల్‌గా సుధీర్ ప్రతాప్ సింగ్ జాతీయ భద్రతా దళం (ఎన్‌ఎస్‌జీ) డెరైక్టర్ జనరల్‌గా సుధీర్ ప్రతాప్ సింగ్ సెప్టెంబర్ 23న నియమితులయ్యారు. ఈయన రాజస్థాన్ కేడర్‌కు చెందిన 1983 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. 

సీఐఎస్‌ఎఫ్ డెరైక్టర్ జనరల్‌గా ఓపీ సింగ్ కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్‌ఎఫ్) డెరైక్టర్ జనరల్‌గా ఓపీ సింగ్ సెప్టెంబర్ 23న నియమితులయ్యారు. ఈయన యూపీకి చెందిన 1983 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. 

‘ఫోర్బ్స్’ కుబేరుల్లో ముకేశ్ టాప్ అమెరికా బిజినెస్ మ్యాగజైన్ ఫోర్బ్స్ తాజాగా రూపొందించిన ‘భారత్‌లోని వంద మంది అత్యంత ధనవంతుల జాబితా’లో ముకేశ్ అంబానీ వరుసగా తొమ్మిదాసారి అగ్ర స్థానంలో నిలిచారు. ఈయన సంపద 18.9 బిలియన్ డాలర్ల నుంచి 22.7 బిలియన్ డాలర్లకి చేరింది. రెండో స్థానంలో సన్‌ఫార్మా అధినేత దిలీప్ సంఘ్వీ ఉన్నారు. ఈయన సంపద విలువ 16.9 బిలియన్ డాలర్లు. హిందుజా సోదరులు 15.2 బిలియన్ డాలర్ల సంపదతో మూడో స్థానంలో నిలిచారు. గతేడాది 29వ స్థానంలో నిలిచిన అనిల్ అంబానీ తాజా జాబితాలో 32వ స్థానానికి పడిపోయాడు. 

పతంజలి ఆయుర్వేద్ మేనేజింగ్ డెరైక్టర్, ప్రధాన వాటాదారు ఆచార్య బాల్‌కృష్ణ తొలిసారి ఈ జాబితాలో స్థానం పొందారు. ఈయన 2.5 బిలియన్ డాలర్ల సంపదతో 48వ స్థానంలో నిలిచారు. జాబితాలోని మొత్తం వంద మంది సంపన్నుల సంపద 381 బిలియన్ డాలర్లుగా (దాదాపు రూ.25.5 లక్షల కోట్లు) ఉంది. 

టాప్ 5 సంపన్నులు 
పేరు
సంపద (బిలియన్ డాలర్లు)
ముకేశ్ అంబానీ
22.7
దిలీప్ సంఘ్వీ
16.9
హిందుజా కుటుంబం
15.2
అజిమ్ ప్రేమ్‌జీ
15
పల్లోంజి మిస్త్రీ
13.9

‘గాకర్స్’ గ్రూపు సీఈవోగా రాజు నరిశెట్టిసీనియర్ జర్నలిస్టు, తెలుగువాడైన రాజు నరిశెట్టి గాకర్స్ మీడియా గ్రూపు సీఈవోగా నియమితులయ్యారు. దశాబ్దం క్రితం ఈ గ్రూపును ప్రారంభించిన నిక్ డెన్టన్ స్థానంలో నరిశెట్టి బాధ్యతలు స్వీకరించనున్నారు. నరిశెట్టి ప్రస్తుతం ముర్దోక్ కుటుంబానికి చెందిన ‘న్యూస్ కార్ప్’ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు.

ఏబీసీ చైర్మన్‌గా ఐ.వెంకట్2016-17 సంవత్సరానికిగాను ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్స్(ఏబీసీ) చైర్మన్‌గా ఈనాడు డెరైక్టర్ ఐ.వెంకట్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏబీసీ డిప్యూటీ చైర్మన్‌గా దేబబ్రత ముఖర్జీ ఎన్నికయ్యారు. గతంలో అడ్వర్‌టైజింగ్ స్టాండర్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఏఎస్‌సీఐ)కి చైర్మన్‌గా పనిచేసిన వెంకట్ ప్రస్తుతం మీడియా రీసెర్చ్ యూజర్స్ కౌన్సిల్(ఎంఆర్‌యూసీ)కు చైర్మన్‌గా, ఇండియన్ బ్రాడ్‌కాస్టింగ్ ఫౌండేషన్(ఐబీఎఫ్), ఇంటర్నేషనల్ న్యూస్ మీడియా అసోసియేషన్(ఐఎన్‌ఎంఏ), బ్రాడ్‌కాస్ట్ ఆడి యన్స్ రీసెర్చ్ కౌన్సిల్(బీఏఆర్‌కే)లో బోర్డు సభ్యుడిగా కొనసాగుతున్నారు. దేబబ్రత ముఖర్జీ కోకాకోలా కంపెనీలో ఇండియా-సౌత్‌వెస్ట్ ఆసియా మార్కెటింగ్, కమర్షియల్ విభాగానికి వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు.

గోల్ఫ్ దిగ్గజం పామర్ కన్నుమూతగోల్ఫ్ దిగ్గజం ఆర్నాల్డ్ పామర్ (87) గుండె సంబంధిత వ్యాధితో సెప్టెంబర్ 25న కన్నుమూశారు. ఆర్నాల్డ్ గోల్ఫ్ క్రీడకు అత్యుత్తమ అంబాసిడర్. తన ఆటతీరుతో ఎంతోమందిని ఈ గేమ్ వైపు ఆకర్షించగలిగారు. 1954లో ప్రొఫెషనల్‌గా మారిన ఆర్నాల్డ్ 2006లో రిటైర్ అయ్యారు. పామర్‌ను అభిమానులు ‘కింగ్’ అని పిలుస్తారు.

పర్మాకల్చర్ పితామహుడు మోలిసన్ కన్నుమూతశాశ్వత వ్యవసాయోద్యమ పితామహుడు బిల్ మోలిసన్ (88) ఆస్ట్రేలియాలోని హోబర్ట్‌లో కన్నుమూశారు. టాస్మేనియాలోని స్టాన్లీలో 1928లో జన్మించిన మోలిసన్ 15 ఏళ్ల వయసులోనే వ్యవసాయంపై మక్కువ పెంచుకున్నాడు. అనంతరం ఉద్యానవన నిపుణుడిగా ఎదిగిన బిల్ 1970లో డేవిడ్ హోమ్‌గ్రెన్‌తో కలసి పర్యావరణానికి, జంతుజాలానికి హాని కలగని రీతిలో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఆహారోత్పత్తి చేసే పర్మాకల్చర్ (పర్మినెంట్ + అగ్రికల్చర్ = పర్మాకల్చర్) వ్యవసాయ పద్ధతులకు రూపకల్పన చేశారు.

యూపీఎస్సీ చైర్మన్‌గా అల్కా సిరోహి
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) నూతన చైర్మన్‌గా మాజీ ఐఏఎస్ అల్కా సిరోహి నియమితులయ్యారు. ప్రస్తుత చైర్మన్ దీపక్ గుప్తా పదవీ కాలం పూర్తవడంతో ఆయన స్థానంలో మధ్యప్రదేశ్ కేడర్‌కు చెందిన అల్కాను నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. అక్టోబర్ 21 నుంచి 2017 జనవరి 3 వరకు ఆమె చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. 2012 నుంచి అల్కా కమిషన్ సభ్యురాలిగా ఉన్నారు. 
ఆర్‌సీఐ డెరైక్టర్‌గా నారాయణ మూర్తి
ప్రముఖ శాస్త్రవేత్త బీహెచ్‌వీఎస్ నారాయణమూర్తి సెప్టెంబర్ 14న డీఆర్‌డీవోలోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (ఆర్‌సీఐ) డెరైక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు.
ఇస్రో, కత్రినా, జుహీలకు ప్రియదర్శిని గ్లోబల్ అవార్డు
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో), బాలీవుడ్ నటీమణులు కత్రినా కైఫ్, జూహీచావ్లాలకు 2016 సంవత్సరానికిగాను ప్రియదర్శిని గ్లోబల్ అవార్డు దక్కింది. అంతరిక్ష పరిశోధనల్లో అసాధారణ విజయాలు సాధిస్తున్నందుకుగాను ఇస్రోను ఈ అవార్డు వరించింది. బాలీవుడ్ చిత్రాల్లో అద్భుతమైన నటనకుగాను కత్రినా కైఫ్‌కు, సామాజిక సమస్యల ప్రచారంలో చురుకుగా పాల్గొంటూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నందుకుగాను జూహీచావ్లాకు ఈ అవార్డు దక్కింది. సామాజిక, సాంస్కృతిక, విద్యాసంస్థ అరుున ప్రియదర్శిని అకాడమీ వివిధ రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వ్యక్తులు, సంస్థలకు ఏటా ఈ అవార్డులను అందజేస్తోంది.
ఎల్‌ఐసీ చైర్మన్‌గా వీకే శర్మ
ఎల్‌ఐసీ ఎండీగా ఉన్న వీకే శర్మ చైర్మన్‌గా అదనపు బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత ఎల్‌ఐసీ చైర్మన్ ఎస్‌కే రాయ్ మరో రెండేళ్లు సర్వీసు ఉన్నప్పటికీ ఈ ఏడాది జూన్‌లో రాజీనామా సమర్పించారు. దీంతో చైర్మన్ బాధ్యతల నుంచి సెప్టెంబర్ 16న రాయ్ తప్పుకోగా, వీకే శర్మ స్వీకరించారు. 
ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జీగా భారత సంతతి మహిళ 
అమెరికాలోని ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టు ఫెడరల్ జడ్జీగా భారత సంతతి మహిళ గుజరాతీని నియమిస్తూ ఒబామా ఆదేశాలు జారీ చేశారు. 1995లో యాలే లా స్కూల్ నుంచి జేడీ పట్టా తీసుకున్న గుజరాతీ.. ఫెడరల్ ప్రాసిక్యూటర్‌గా 1999లో తన కెరీర్‌ను ప్రారంభించారు. 2006-2008 వరకు డిప్యూటీ చీఫ్ అప్పీల్స్‌గా, 2012 వరకు క్రిమినల్ డివిజన్ డిప్యూటీ చీఫ్‌గా పనిచేశారు.

ప్రస్తుతం యూఎస్ మిలిటరీ అకాడమీలో ఆర్థికశాస్త్రంలో ప్రొఫెసర్‌గా సేవలందిస్తున్న యం.దామోదర్ కూతురు గుజరాతీ.
ఫోర్బ్స్ జాబితాలో ప్రియాంక
‘ఫోర్బ్స్’ మేగజీన్ విడుదల చేసిన ‘ప్రపంచంలో అత్యధిక సంపాదన కలిగిన టీవీ నటీమణుల జాబితా’ లో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా 8వ స్థానంలో నిలిచింది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ నటి ప్రియాంక. అమెరికా టీవీ షో క్వాంటికో ద్వారా 2015లో అంతర్జాతీయ వేదికపై అడుగుపెట్టిన ప్రియాంక దాదాపు రూ.73.72 కోట్లు (11 మిలియన్ డాలర్లు) సంపాదించినట్టు ఫోర్బ్స్ వెల్లడించింది.

సూపర్ హిట్ టీవీ షో... మోడరన్ ఫ్యామిలీలో నటిస్తున్న అమెరికా నటి సోఫియా వెర్గారా రూ.288.18 కోట్ల (43 మిలియన్ డాలర్లు)తో వరుసగా ఐదోసారీ తొలిస్థానంలో నిలిచింది. రూ.160.84 కోట్ల ఆదాయంతో కాలె కువాకో, రూ.100.53 కోట్లతో మిన్డీ కాలింగ్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.
ప్రపంచ బ్యాంక్ ఇండియన్ డెరైక్టర్‌గా జునైద్
ప్రపంచ బ్యాంక్ ఇండియన్ డెరైక్టర్‌గా జునైద్ అహ్మద్ నియమితులయ్యారు. ఒన్నో రుహల్ నాలుగేళ్ల పదవీ కాలం ముగియడంతో అతని స్థానంలో బంగ్లాదేశ్ జాతీయుడు అయిన అహ్మద్‌ను నియమించారు. 1991లో ప్రపంచ బ్యాంకులో చేరిన అహ్మద్ పలు కీలక విభాగాల్లో పని చేశారు.

అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ తొలగింపు
అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ జ్యోతి ప్రసాద్ రాజ్‌ఖోవాను కేంద్రం సెప్టెంబర్ 12న పదవి నుంచి తొలగించింది.కేంద్రం రాజ్‌ఖోవాను ఆరోగ్య కారణాల రీత్యా రాజీనామా చేయాల్సిందిగా కోరింది. అయితే ఇందుకు నిరాకరించిన ఆయనను తొలగిస్తూ రాష్ట్రపతి భవన్ ఆదేశాలు జారీ చేసింది. కొత్త గవర్నర్‌ను నియమించేంతవరకు అరుణాచల్ గవర్నర్ బాధ్యతలను మేఘాలయ గవర్నర్ షణ్ముగనాథన్‌కు అప్పగించారు.

పదమ్‌సీ చిత్రానికి రూ.19 కోట్లు
భారతీయ చిత్రకారుడు అక్బర్ పదమ్‌సీ గీచిన చిత్రానికి శాఫ్రాన్ ఆర్ట్స్ సంస్థ నిర్వహించిన వేలంలో రూ.19 కోట్ల రికార్డు ధర పలికింది. ‘గ్రీక్ ల్యాండ్ స్కేప్’ పేరిట 1960లో పదమ్‌సీ గీచిన ఈ చిత్రం భారీ ధరతో రికార్డు సృష్టించింది.‘‘2011లో సోత్‌బై సంస్థ వేలంలో రూ.9.3 కోట్లకు అమ్ముడుపోయిన ‘రీక్లైనింగ్ న్యూడ్’ చిత్రమే ఇప్పటివరకూ ప్రపంచ రికార్డు. 

ఫార్చ్యూన్ శక్తివంతమైన మహిళగా మేరీ బర్రా
ఫార్చ్యూన్ తాజాగా రూపొందించిన ‘ప్రపంచపు 51 అతి శక్తివంతమైన మహిళల’ జాబితాలో జనరల్ మోటార్స్ సీఈవో, చైర్మన్ మేరీ బర్రా అగ్రస్థానంలో నిలిచారు. పెప్సికో సీఈవో చైర్మన్ ఇంద్రా నూయి రెండవ స్థానాన్ని దక్కించుకున్నారు. ఈ జాబితాలో భారత్ నుంచి స్థానం పొందిన ఒకే ఒక మహిళ ఇంద్రా నూయి. ఈమె 2015లో కూడా రెండవ స్థానంలోనే ఉన్నారు.

తర్వాతి స్థానాల్లో లాక్‌హీడ్ మార్టిన్ సీఈవో మెరిల్లిన్ హ్యూసన్(3వ స్థానం), ఐబీఎం సీఈవో గిన్ని రొమెట్టీ (4), ఫెడిలిటీ ఇన్వెస్ట్‌మెంట్స్ సీఈవో అబిగెయిల్ (5), ఫేస్‌బుక్ సీవోవో షెరిల్ శాండ్‌బర్గ్ (6), హ్యూలెట్ పకార్డ్ ఎంటర్‌ప్రైస్ సీఈవో మెగ్ విత్‌మన్ (7), జనరల్ డైనమిక్స్ సీఈవో ఫెబె నొవాకొవిక్ (8), మాండలిజ్ ఇంటర్నేషనల్ సీఈవో ఐరెన్ రోసెన్‌ఫీల్డ్ (9), ఒరాకిల్ కో-సీఈవో సఫ్రా కాట్జ్ (10వ స్థానం) ఉన్నారు.

మిస్ దివా 2016 గా రోష్మిత
‘మిస్ దివా యూనివర్స్ ఇండియా-2016’ విజేతగా బెంగళూరుకు చెందిన 22 ఏళ్ల రోష్మిత హరిమూర్తి నిలిచింది. తద్వారా 2017లో జరిగే మిస్ యూనివర్స్ అందాల పోటీల్లో భారత్ తరఫున పొల్గొంటుంది. సెప్టెంబర్ 11న ముంబైలో జరిగిన ఈ పోటీల్లో ఫస్ట్ రన్నరప్‌గా శ్రీనిధి శెట్టి సెకండ్ రన్నరప్‌గా ఆరాధన నిలిచారు. అలాగే యమహా ఫ్యాసినో మిస్ దివా సూపర్‌నేషనల్ 2016ను మొదటి రన్నరప్ శ్రీనిధి గెల్చుకుంది.

‘టైమ్‌స్క్వేర్’ ఫోటో నర్సు మృతి
ఫొటోగ్రఫీలో విశిష్టమైన ‘న్యూయార్క్ టైమ్‌స్క్వేర్ ఫొటో’ లోని నర్సు గ్రెటా ఫ్రైడ్‌మన్(92) మరణించారు. 1945లో రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్‌పై గెలిచిన ఆనందంలో రోడ్డుపై వెళ్తున్న గ్రెటాను, అమెరికా సైనికుడు కౌగిలించుకుని ముద్దుపెట్టుకున్నాడు. ఈ దృశ్యాన్ని ఫొటోగ్రాఫర్ ఐసెన్‌స్టాడ్ట్ తీశాడు. 1980లో ఫొటోలోని వ్యక్తి ఆస్ట్రియాలో జన్మించిన ఫ్రైడ్‌మన్ అని గుర్తించారు.

యంగ్ ప్రొఫెషనల్ ఆఫ్ ద ఇయర్ గా భారత సంతతి వ్యక్తులు

భారత సంతతికి చెందిన నలుగురు పారిశ్రామికవేత్తలకు ఈ ఏడాదికిగాను ‘యంగ్ ప్రొఫెషనల్ ఆఫ్ ద ఇయర్’ పురస్కారం దక్కింది. భారత్-అమెరికాల మధ్య బంధాలను బలోపేతం చేయడంలో తమవంతు పాత్ర పోషించినందుకు, పారిశ్రామిక రంగంలో విశేష ప్రతిభ కనబర్చినందుకు మలిషా పటేల్, రేవతి పింకు, భావేశ్ పటేల్, అబ్జార్ ఎస్ తయాబ్‌జీలకు ఈ పురస్కారం దక్కింది. వీరితో పాటు మార్విన్ ఓడమ్, రిచర్డ్ హబ్నర్, డాక్టర్ జాన్ మెండెల్సన్‌లకు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ పురస్కారం దక్కింది.

ఫార్చ్యూన్ శక్తివంతమైన మహిళలు.. భట్టాచార్య, కొచర్, శిఖా శర్మ
ఫార్చ్యూన్ తాజాగా రూపొందించిన ‘అమెరికాకు వెలుపల అత్యంత శక్తివంతమైన 50 మంది మహిళల’ జాబితాలో అరుంధతీ భట్టాచార్య, చందా కొచర్, శిఖా శర్మ స్థానం పొందారు. ఎస్‌బీఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య జాబితాలో రెండో స్థానాన్ని కైవసం చేసుకోగా, ఐసీఐసీఐ బ్యాంక్ హెడ్ చందా కొచర్ 5వ స్థానంలో నిలిచారు. యాక్సిస్ బ్యాంక్ సీఈవో శిఖా శర్మ 19వ స్థానంలో ఉన్నారు. మార్కెట్ విలువ పరంగా యూరోజోన్‌లోనే అతిపెద్ద బ్యాంక్ అయిన బ్యాంకో శాన్‌టండర్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అన బాటిన్ ఈ జాబితాలో మొదటి స్థానంలో నిలిచారు.

మదర్ థెరిసాకు సెయింట్ హోదామానవ సేవకు తన జీవితాన్ని అంకితం చేసి, క్రీస్తు ప్రేమ సందేశాన్ని లోకానికి చాటిచెప్పిన మానవతామూర్తి మదర్ థెరిసాకు పోప్ ఫ్రాన్సిస్ సెప్టెంబర్ 4న రోమ్‌లోని వాటికన్ సిటీలో సెయింట్ హుడ్ హోదా ప్రకటించారు.
1910 ఆగస్ట్ 26న మేసిడోనియాలోని స్కోప్జేలో జన్మించిన థెరిసా నన్‌గా మారి ఎందరో అనాథలు, రోగ గ్రస్థులకు సేవలు చేసింది. 1979లో నోబెల్ శాంతి బహుమతి అందుకుంది. 19వ వర్ధంతి సందర్భంగా రోమన్ కేథలిక్ చర్చి ఆమెను సెయింట్‌హుడ్ హోదాతో గౌరవించింది.

‘ఆధార్’ తాత్కాలిక చీఫ్‌గా ఏపీ మాజీ ఐఏఎస్
కేంద్ర ప్రభుత్వ అధీనంలోని ఆధార్(భారత విశిష్ట గుర్తింపు సంస్థ) తాత్కాలిక చైర్మన్‌గా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మాజీ ఐఏఎస్ జె. సత్యనారాయణ నియమితులయ్యారు. 2014లో నందన్ నీలేకని రాజీనామా తర్వాత ఈ పదవి ఖాళీగానే ఉంది. తాజాగా 1977 బ్యాచ్‌కు చెందిన సత్యనారాయణ నియామకానికి కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది.

పాక్ పైలట్ సిస్టర్స్ రికార్డు

పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎరుుర్‌లైన్‌‌స(పీఐఏ)లో పైలట్‌లుగా పనిచేస్తున్న మరియమ్ మసూద్, ఎరుమ్ మసూద్ అనే అక్కాచెల్లెళ్లు చరిత్ర సృష్టించారు. వీరు ఒకే సమయంలో బోరుుంగ్-777 విమానంలో కో పైలట్‌లుగా విధులు నిర్వహించడంతో ప్రపంచంలో ఈ ఘనత సాధించిన తొలిజోడీ (పైలట్ సిస్టర్స్) గా రికార్డు సృష్టింంచారు. మరియమ్ ఇంతకుముందే బోరుుంగ్-777 విమానాన్ని నడపగా, ఎరుమ్‌కు ఇటీవల ప్రమోషన్ రావడంతో ఈ రికార్డు సృష్టించారు.

అత్యంత స్ఫూర్తిదాయక మహిళగా దీపshaadi.com నిర్వహించిన దేశవ్యాప్త సర్వేలో జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ అత్యంత స్ఫూర్తిదాయక భారత మహిళగా పేరు తెచ్చుకుంది. ‘ఇటీవలి కాలంలో మీలో స్ఫూర్తి పెంచిన భారత మహిళ ఎవరు’ అనే ప్రశ్నకు 33.7 శాతం మంది దీపకు ఓటేశారు. 27.4 శాతంతో సాక్షి మలిక్ రెండో స్థానంలో ఉంది. బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకి కేవలం 6.2 శాతం మంది మాత్రమే ఓటేశారు.
సోషల్ మీడియాలో ఎక్కువగా ఆకర్షిస్తున్న మహిళగా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ (36.3 శాతం) మొదటి స్థానంలో నిలిచారు. నటి ప్రియాంక చోప్రా (31.2), టెన్నిస్ స్టార్ సానియా మీర్జా (17.4) ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు.

No comments:

Post a Comment