AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Sunday 26 November 2017

వార్తల్లో వ్యక్తులు నవంబరు 2016

వార్తల్లో వ్యక్తులు నవంబరు 2016
ఇస్రో మాజీ చైర్మన్ ఎంజీకే మీనన్ మృతి
ఇస్రో మాజీ చైర్మన్ ఎంజీకే మీనన్ (88) న్యూఢిల్లీలో నవంబర్ 22న కన్నుమూశారు. ఆయన ఐదు దశాబ్దాలకుపైగా శాస్త్ర, సాంకేతిక రంగాల్లో విశిష్ట సేవలందించారు. మీనన్ 1972లో ఇస్రో చైర్మన్‌గా ఎంపికయ్యారు. వీపీ సింగ్ ప్రభుత్వ హయాంలో శాస్త్ర, సాంకేతిక శాఖకు సహాయ మంత్రిగా పనిచేశారు. ఆయన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్‌తో సత్కరించింది.
ఐరాసలో అమెరికా రాయబారిగా నిక్కీ
 భారతీయ-అమెరికన్ నిక్కీహేలీ ఐక్యరాజ్య సమితి(ఐరాస)లో అమెరికా నూతన రాయబారిగా ఎన్నిక కానుంది. ఈ మేరకు కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమెను నామినేట్ చేశారు. నిక్కీ నియామకాన్ని సెనేట్ అమోదిస్తే అమెరికా పరిపాలనలో కేబినెట్ స్థాయి పదవి లభించిన తొలి భారత సంతతి వ్యక్తిగా రికార్డు సృష్టిస్తారు.

దక్షిణ కరోలినాకు వలస వెళ్లిన అజిత్‌సింగ్ రణ్‌ధావా, రాజ్‌కౌర్‌కి 1972లో నిమ్రత (నిక్కీ హేలీ) జన్మించారు. దక్షిణ కరోలినా రాష్ట్రానికి తొలి మహిళా గవర్నరుగా, మైనారిటీల నుంచి ఎన్నికై న తొలి గవర్నర్‌గా, గవర్నర్ పదవికి ఎన్నికైన తొలి భారత సంతతి మహిళగా నిక్కీ రికార్డు సృష్టించారు.
పాక్ ఆర్మీ కొత్త చీఫ్‌గా జావేద్ బాజ్వా
పాకిస్తాన్ ఆర్మీ కొత్త అధిపతిగా లెఫ్టినెంట్ జనరల్ కమర్ జావేద్ బాజ్వా నవంబర్ 26న నియమితులయ్యారు. నవంబర్ 29న పదవీ విరమణ చేయనున్న జనరల్ రహీల్ షరీఫ్ స్థానంలో బాజ్వాను నియమించారు. బాజ్వా ప్రస్తుతం ట్రైనింగ్, ఎవాల్యుయేషన్ ఐజీగా ఉన్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే), ఉత్తరాది ప్రాంత వ్యవహారాల్లో ఆయనకు విశేష అనుభవం ఉంది. కాంగోలో ఐక్యరాజ్యసమితి మిషన్‌లో భాగంగా భారత మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ బిక్రమ్ సింగ్‌తో కలసి బ్రిగేడ్ కమాండర్‌గానూ విధులు నిర్వహించారు. 
ప్రముఖ పాత్రికేయుడు పడ్గావ్‌కర్ మృతి
ప్రముఖ పాత్రికేయుడు దిలీప్ పడ్గావ్‌కర్ (72) నవంబర్ 25న మరణించారు. ఆయన గతంలో ది టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికకు ఎడిటర్‌గా పనిచేశారు. 2008లో జమ్మూకశ్మీర్‌లో శాంతి చర్చల కోసం ప్రభుత్వం నియమించిన త్రిసభ్య బృందంలో సభ్యుడిగా వ్యవహరించారు.
యూఎస్‌లో మరో భారత సంతతి మహిళకు ఉన్నత పదవి
భారతీయ-అమెరికన్ వైద్యురాలు సీమా వర్మ అమెరికా ఆరోగ్య విభాగంలోని ‘సెంటర్స్ ఫర్ మెడికేర్ అండ్ మెడికై డ్ సర్వీసెస్’కు ఇన్‌చార్జ్‌గా నామినేట్ అయ్యారు. సీమ ఎస్‌వీసీ అనే జాతీయ ఆరోగ్య విధానం సలహా సంస్థను స్థాపించి ప్రస్తుతం సీఈవోగా కొనసాగుతున్నారు. ఇప్పటికే భారతీయ-అమెరికన్ మహిళ నిక్కీ హేలీని ఐక్యరాజ్య సమితిలో అమెరికా రాయబారిగా ట్రంప్ నామినేట్ చేశారు.

మంగళంపల్లి బాలమురళీకృష్ణ అస్తమయం
 కర్ణాటక సంగీత వాగ్గేయకారుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ (86) నవంబర్ 22న మరణించారు. వృద్ధాప్యం వల్ల వచ్చే అస్వస్థతతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. మాతృభాష తెలుగులోనే కాకుండా కన్నడం, సంస్కృతం, తమిళం, మళయాళం, హిందీ, బెంగాలీ, పంజాబీతో పాటు ఫ్రెంచ్ భాషలో కూడా మంగళంపల్లి గానం చేశారు. అమెరికా, కెనడా, బ్రిటన్, ఇటలీ, ఫ్రాన్‌‌స, రష్యా, సింగపూర్ సహా ప్రపంచవ్యాప్తంగా 25,000 కచేరీలు చేశారు. 6వ తరగతి ఫెయిలైనా వివిధ విశ్వవిద్యాలయాల నుంచి 12 డాక్టరేట్లు పొందారు.
జుగల్ బందీ తరహా కచేరీల రూపకల్పనకు బాలమురళీకృష్ణ ఆద్యుడు. కంజీర, వయోలిన్, వయోలా, వీణ, మృదంగం తదితర సంగీత వాయిద్యాల్లోనూ ఎంతో ప్రావీణ్యం కలిగిన మంగళంపల్లి మహతి, సుముఖం, సర్వశ్రీ, ప్రతి మధ్యమావతి, గణపతి, సిద్ధి అనే కొత్త రాగాలను కూడా ఆవిష్కరించారు. టీటీడీ, శృంగేరీ పీఠాలకు ఆస్థాన విద్వాంసుడుగా ఉన్నారు.
మంగళంపల్లి పొందిన అవార్డులుపద్మశ్రీ - 1971
పద్మవిభూషణ్ - 1991
ఇందిరా ప్రియదర్శిని అవార్డు-1998
కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు
ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ అవార్డు
కేంద్ర సంగీత నాటక అకాడమీ గోల్డెన్ జూబ్లీ అవార్డు 
గాంధీ మెమోరియల్ మెడల్, యునెస్కో 
ఉత్తమ నేపథ్య గాయకుడు, ఉత్తమ సంగీత దర్శకుడు- జాతీయ అవార్డు 
జాతీయ కళాకారుడు, భారత ప్రభుత్వ అవార్డు-2004 
సంగీత కళానిధి- జాతీయ సంగీత అకాడమీ
షెవాలియర్ ఆఫ్ ఆర్ర్‌డే దెస్ ఆర్ట్స్ ఎట్ దెస్ లెటర్స్ అవార్డు (ఫ్రాన్స్)
పుట్టంరాజుకండ్రిగను సందర్శించిన సచిన్
సచిన్ టెండూల్కర్ తాను దత్తత తీసుకున్న నెల్లూరు జిల్లా పుట్టంరాజుకండ్రిగలో నవంబర్ 16న పర్యటించారు. సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన కింద సచిన్ తన ఎంపీ నిధులతో గ్రామంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు.
పీఐబీ డెరైక్టర్‌గా విజయకుమార్‌రెడ్డి
విజయవాడ పత్రికా సమాచార కార్యాలయం (పీఐబీ) తొలి సంచాలకులుగా ఇండియన్ ఇన్‌ఫర్మేషన్ సర్వీస్ (1990 బ్యాచ్)కు చెందిన తుమ్మ విజయకుమార్‌రెడ్డి నవంబర్ 21న బాధ్యతలు స్వీకరించారు. విజయకుమార్‌రెడ్డి హైదరాబాద్ ప్రాంతీయ సెన్సార్ బోర్డు అధికారిగా, ఫీల్డ్ పబ్లిసిటీ విభాగం ఏపీ, తెలంగాణ సంచాలకులుగా, పీఐబీ హైదరాబాద్ సంచాలకులుగా పనిచేశారు. ఆయన 25 ఏళ్లుగా సమాచార, ప్రసార మంత్రిత్వశాఖలో పనిచేస్తున్నారు.
బీబీసీ ప్రభావవంతమైన మహిళల జాబితా 2016
‘2016లో వంద మంది అత్యంత ప్రభావవంతమైన మహిళలు’ పేరుతో బీబీసీ రూపొందించిన జాబితాలో ఐదుగురు భారతీయ మహిళలకు స్థానం లభించింది. వీరిలో నటి సన్నీలియోన్‌తో పాటు గౌరీ చిందార్కర్, మల్లికా శ్రీనివాసన్, నేహా సింగ్, సాలుమరద తిమ్మక్క ఉన్నారు.
కర్ణాటకకు చెందిన 105 ఏళ్ల తిమ్మక్క 80 ఏళ్లలో 8 వేల చెట్లను నాటారు. ‘చెన్నైకు చెందిన మల్లికా శ్రీనివాసన్ (ట్రాక్టర్స్ క్వీన్ ఆఫ్ ఇండియా) ‘ట్రాక్టర్స్ అండ్ ఫామ్ ఎక్విప్‌మెంట్ లిమిటెడ్’ కంపెనీ సీఈవో. మహారాష్ట్రకు చెందిన గౌరి (20) ‘స్కూల్ ఇన్ ద క్లౌడ్’ విద్యా విధానాన్ని పొందిన కొద్ది మంది పిల్లల్లో ఒకరు. ముంబైకు చెందిన నేహ (34) నటి-రచయిత, సామాజిక కార్యకర్త. వ్యాపారం, క్రీడలు, ఫ్యాషన్, కళలు, ఇంజినీరింగ్ తదితర రంగాల్లోని మహిళలతో కూడిన జాబితాను బీబీసీ విడుదల చేసింది.
యూపీ మాజీ ముఖ్యమంత్రి రామ్‌నరేశ్ యాదవ్ మృతి
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, మధ్యప్రదేశ్ మాజీ గవర్నర్ రామ్‌నరేశ్ యాదవ్ (90) నవంబర్ 22న మృతి చెందారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన లక్నోలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
1977లో ఉత్తరప్రదేశ్‌లో జనతాదళ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2011లో యూపీఏ హయాంలో మధ్యప్రదేశ్ గవర్నర్‌గా వ్యవహరించారు. దేశాన్ని కుదిపేసిన వ్యాపం కుంభకోణంలో రామ్‌నరేశ్ పేరు కూడా ప్రముఖంగా వినిపించింది.


ప్రఖ్యాత గాయకుడు కోహెన్ కన్నుమూత
కెనడాకు చెందిన ప్రఖ్యాత గాయకుడు, పాటల రచయిత లియోనార్డ్ కోహెన్ (82) నవంబర్ 7న మాంట్రియల్‌లో మరణించారు. ఆరు దశాబ్దాల పాటు శ్రోతలను ఉర్రూతలూగించిన కోహెన్ ఆఖరి ఆల్బమ్ ఈ ఏడాది అక్టోబర్‌లో విడుదలైంది. ఆయనకు 2008లో రాక్ అండ్ రోల్ హాల్ ఆఫ్ ఫేమ్, 2010లో గ్రామీ జాతీయ అకాడమీ జీవిత సాఫల్య పురస్కారాలు దక్కాయి. 
చైనా తొలి మహిళా జెట్ పైలట్ మృతి
చైనా తొలి మహిళా పైలట్ యూ క్సూ (30) ప్రమాదవశాత్తు మరణించినట్లు చైనా మీడియా నవంబర్ 13న తెలిపింది. యూ క్సూ.. జే-10 ఫైటర్ జెట్ నడిపేందుకు శిక్షణ తీసుకుంది. శిక్షణలో భాగంగా ఆమె వెళ్లిన ఫైటర్ జెట్ అనూహ్యంగా హెబీ ప్రావిన్స్‌లో కుప్పకూలింది. మొత్తం 16 మంది పైలట్లతో మొదలైన చైనా మహిళా జెట్ పైలట్ విభాగంలో యూ క్సూ ఒకరు.
అంతర్జాతీయ హాకీ సమాఖ్య అధ్యక్షుడిగా నరీందర్ బాత్రా
అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) అధ్యక్షుడిగా హాకీ ఇండియా (హెచ్‌ఐ) ప్రస్తుత అధ్యక్షుడు నరీందర్ బాత్రా ఎంపికయ్యాడు. దీంతో 12వ ఎఫ్‌ఐహెచ్ చీఫ్‌గా ఎన్నికై న బాత్రా ఈ పదవి చేపట్టిన తొలి ఆసియా వ్యక్తిగా, తొలి భారతీయుడిగా, తొలి యూరోపేతర వ్యక్తిగా రికార్డు సృష్టించారు. ఆయన నాలుగేళ్లు ఈ పదవిలో కొనసాగుతారు. 45వ ఎఫ్‌ఐహెచ్ కాంగ్రెస్‌కు నవంబర్ 12న జరిగిన ఓటింగ్‌లో బాత్రాకు మద్దతుగా 68 ఓట్లు దక్కాయి. ఆయన ప్రత్యర్థులు డేవిడ్ బల్బిర్నీ (ఐర్లాండ్)కి 29, కెన్ రీడ్ (ఆస్ట్రేలియా)కు 13 ఓట్లు వచ్చాయి లియాండ్రో నెగ్రే (స్పెయిన్) 2008 నుంచి ఎఫ్‌ఐహెచ్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.

కనూభాయ్ గాంధీ కన్నుమూత
 మహాత్మా గాంధీ మనవడు కనూభాయ్ రామ్‌దాస్ గాంధీ(87) నవంబర్ 7న సూరత్‌లో మరణించారు. గాంధీజీ మూడో కుమారుడైన రాందాస్ గాంధీ పుత్రుడే కానూ రాందాస్ గాంధీ. ఈయన అమెరికా అంతరిక్ష సంస్థ నాసాలో శాస్త్రవేత్తగా చాలా కాలం పనిచేసి 2014లో భారత్‌కు తిరిగొచ్చారు. 1930, మార్చి-ఏప్రిల్‌లో జరిగిన ఉప్పు సత్యాగ్రహంలో భాగంగా గుజరాత్‌లోని దండి గ్రామంలో మహాత్మాగాంధీ కర్రను ఒక చివర పట్టుకొని నడిచిన సంఘటనతో కానూ రాందాస్ గాంధీ ప్రజలకు గుర్తుండిపోయారు.

సీబీడీటీ చైర్మన్‌గా సుశీల్ చంద్రసెంట్రల్ బోర్డ్ ఆఫ్ డెరైక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) చైర్మన్‌గా సుశీల్ చంద్ర నవంబర్ 1న బాధ్యతలు చేపట్టారు. ఆయన ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ 1980వ బ్యాచ్‌కు చెందిన సీనియర్ అధికారి.

ఈసీఐఎల్ సీఎండీ గా దేబశిష్ దాస్కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎలక్టాన్రిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) నూతన సీఎండీ గా దేబశిష్ దాస్ నవంబర్ 2న బాధ్యతలు చేపట్టారు. బాబా అటామిక్ రిసెర్చ్ సెంటర్ (బార్క్) అసోసియేట్ డైరక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన ఈసీఐఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరక్టర్‌గా నియమితులయ్యారు. మైసూర్ యూనివర్సీటీలో ఎలక్టాన్రిక్స్ ఇంజనీరింగ్‌లో బీటెక్ పూర్తి చేసిన దాస్ 1983లో బార్క్‌లో న్యూక్లియర్ సైంటిస్టుగా చేరారు. బార్క్ ఎలక్టాన్రిక్స్ విభాగానికి అధిపతిగా కూడా పనిచేశారు.

అంతర్జాతీయ న్యాయకమిషన్ సభ్యుడిగా అనిరుద్ధఅంతర్జాతీయ న్యాయకమిషన్ సభ్యుడిగా భారత్‌కు చెందిన అనిరుద్ధ రాజ్‌పుత్ ఎన్నికయ్యారు. కమీషన్‌కు జరిగిన ఎన్నికల్లో మొత్తం 34 మంది ఎన్నికయ్యారు. ఈయన పదవీకాలం ఐదు సంవత్సరాలు. ఈ కమిషన్‌కు ఎన్నికై న వారిలో రాజ్‌పుత్ పిన్న వయస్కుడు. భారత సుప్రీంకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ కూడా చేశారు. 

ప్రపంచ ఎక్స్ఛేంజీల చైర్‌పర్సన్‌గా చిత్రా రామకృష్ణవరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ఎక్స్చేంజ్ (డబ్ల్యూఎఫ్‌ఈ) కొత్త చైర్‌పర్సన్‌గా నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఎండీ, సీఈఓ చిత్రా రామకృష్ణ నియమితులయ్యారు. తద్వార డబ్ల్యూఎఫ్‌ఈ కి నియమితులైన మొదటి మహిళా చైర్మన్‌గా రికార్డు సృష్టించారు. సిక్స్ గ్రూప్ సీఈవో ఉర్స్ రుగ్‌సెగర్ డబ్ల్యూఎఫ్‌ఈ వైస్ చైర్మన్‌గా, షికాగో బోర్డు ఆప్షన్‌‌స ఎక్స్చేంజ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ విలియన్ బ్రాడ్‌స్కై వర్కింగ్ గ్రూప్ కమిటీ చైర్మన్‌గా ఎంపికయ్యారు.

లండన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోన్న డబ్ల్యూఎఫ్‌ఈలో 200 మార్కెట్ ఇన్‌ఫ్రాస్టక్చ్రర్ ప్రొవైడర్లు, దాదాపు 45,000 లిస్టెడ్ కంపెనీలు సభ్యత్వం కలిగి ఉన్నాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎక్స్చేంజ్‌లు, మార్కెట్ పార్టిసిపెంట్స్ ప్రమాణాలను మెరుగుపరచడానికి వివిధ రెగ్యులేటర్స్‌తో, పాలసీ తయారీదారులతో కలిసి పనిచేస్తూ ఉంటుంది.

No comments:

Post a Comment