AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Sunday, 26 November 2017

వార్తల్లో వ్యక్తులు డిసెంబరు 2013

వార్తల్లో వ్యక్తులు డిసెంబరు 2013
ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం
ఢిల్లీ ఏడవ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ (45) 2013 డిసెంబర్ 28న ప్రమాణ స్వీకారం చేసారు. ఆయనతోపాటు ఆరుగురు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసారు. డిసెంబర్‌లో ఢిల్లీ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో కేజ్రీవాల్ కన్వీనర్‌గా వ్యవహరిస్తున్న ఆమ్‌ఆద్మీ పార్టీ 70 స్థానాలకుగానూ 28 స్థానాలు గెలుచుకుంది. 31 స్థానాలు గెలుచుకొని బీజెపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీజెపీకి పూర్తి మెజారిటీ రాకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటుకు నిరాకరించింది. దీంతో కాంగ్రెస్ పార్టీ బయట నుంచి మద్దతు తెలపడంతో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

జాజ్ కళాకారుడు యూసఫ్ లతీఫ్ మృతి 
ప్రముఖ జాజ్ కళాకారుడు, గ్రామీ అవార్డు గ్రహీత యూసఫ్ లతీఫ్ (93) మసాచుసెట్స్‌లో 2013 డిసెంబర్ 23న మరణించారు. ఆయన భారతీయ రాగాలకు అమెరికన్ జాజ్ స్వరాలను మేళవించి అద్భుత సంగీతాన్ని అందించారు. ఆయన రూపొందించిన ‘లిటిల్ సింఫనీ’కి 1987లో గ్రామీ అవార్డు లభించింది.

కొత్తగా సీఒఎస్‌సీగా బిక్రమ్‌సింగ్
చీఫ్స్ ఆఫ్ స్టాఫ కమిటీ(సీఒఎస్‌సీ) చైర్మన్‌గా సైనిక దళాధిపతి జనరల్ బిక్రమ్ సింగ్ 2013 డిసెంబర్ 30న బాధ్యతలు స్వీకరించారు. డిసెంబర్ 31న పదవీ విరమణ చేస్తున్న వైమానిక దళాధిపతి ఎన్‌ఎకె బ్రౌన్ స్థానంలో బిక్రమ్‌సింగ్ నియమితులయ్యారు. దీంతో జనరల్ సింగ్ 13.1 లక్షల భారత సైన్యంలో అత్యంత సీనియర్ అధికారిగా కొనసాగుతారు.

బాలీవుడ్ నటుడు ఫరూక్‌షేక్ మృతి
ప్రముఖ బాలీవుడ్ నటుడు ఫరూక్‌షేక్ (65) 2013 డిసెంబర్ 28న ముంబైలో గుండెపోటుతో మరణించారు. 1973లో ‘గరమ్ హవా’ చిత్రంతో ఆయన చిత్రరంగ ప్రవేశం చేశారు. షత్రంజ్ కె ఖిలాడి, ఉమ్రావ్ జాన్, కిసీ సే నా కెహనా, బజార్ వంటి చిత్రాలు ఆయనకు మంచిపేరు తెచ్చిపెట్టాయి.

ప్రముఖ జర్నలిస్టు ప్రాణ్ చోప్రా మృతిప్రముఖ పాత్రికేయుడు, ద స్టేట్స్‌మన్ తొలి ఎడిటర్ ప్రాణ్ చోప్రా (92) డిసెంబర్ 22న కన్నుమూశారు. 1921లో లాహోర్‌లో జన్మించిన ఆయన 1941లో పాత్రికేయ వత్తిలోకి ప్రవేశించారు. చైనా, వియత్నాంలలో 1940లలో ఆల్ ఇండియా రేడియోకు ప్రతినిధిగా పనిచేశారు. పాకిస్థాన్ మాజీ ప్రధాని జుల్ఫీకర్ అలీ భుట్టో రాసిన ‘ఇఫ్ అయామ్ అసాసినేటెడ్ (నేను హత్యకు గురైతే)’ పుస్తకానికి ప్రాణ్ ముందుమాట రాశారు. ప్రాణ్ రాసిన పలు పుస్తకాలు కూడా ప్రసిద్ధి పొందాయి. 

మణిపూర్ గవర్నర్‌గా వీకే దుగ్గల్కేంద్ర హోం శాఖ మాజీ కార్యదర్శి వీకే దుగ్గల్(68) డిసెంబర్ 23న మణిపూర్ గవర్నర్‌గా నియమితులయ్యారు. ఈ ఏడాది జూలైలో ఖాళీ అయిన మణిపూర్ గవర్నర్ స్థానంలో దుగ్గల్‌ను నియమిస్తూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నిర్ణయం తీసుకున్నారు. ఇంతకుముందు దుగ్గల్ ఢిల్లీ మునిసిపల్ కమిషనర్‌గా, కేంద్ర జలవనరుల శాఖలో కార్యదర్శిగా, పలు కమిషన్లలో సభ్యుడిగా విశేష సేవలందించారు. తెలంగాణపై ఏర్పాటైన జస్టిస్ శ్రీకృష్ణ కమిటీలో దుగ్గల్ సభ్య కార్యదర్శిగా ప్రముఖ పాత్ర పోషించారు. 

మూడోసారి జర్మనీ చాన్సలర్‌గా మెర్కెల్జర్మనీ చాన్సలర్‌గా ఏంజెలా మెర్కెల్ డిసెంబర్ 17న ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె చాన్సలర్‌గా ఎన్నికవడం ఇది మూడోసారి. ఆమె నాలుగేళ్లపాటు ఈ పదవిలో ఉంటారు. సెప్టెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో మెర్కెల్‌కు చెందిన సంప్రదాయ క్రిస్టియన్ డెమోక్రాట్స్ యూనియున్ (సీడీయూ) పూర్తి మెజారిటీ సాధించలేకపోవడంతో రాజకీయ అనిశ్చితి నెలకొంది. దీంతో ప్రతిపక్ష సోషల్ డెమోక్రటిక్ పార్టీ (ఎస్‌పీడీ)తో కలిసి ఒప్పందం చేసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

సీఐసీగా బాధ్యతలు స్వీకరించిన సుష్మాసింగ్కేంద్ర నూతన ప్రధాన సమాచార కమిషనర్ (సీఐసీ)గా మాజీ ఐఏఎస్ అధికారి సుష్మాసింగ్ బాధ్యతలు చేపట్టారు. డిసెంబర్ 19న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రస్తుత సీఐసీ దీపక్ సంధూ పదవీ కాలం ముగియడంతో ఆమె స్థానంలో సుష్మా సింగ్‌ను ప్రధానమంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కేంద్ర న్యాయ శాఖ మంత్రితో కూడిన ప్యానెల్ ఎంపిక చేసింది. సుష్మాసింగ్ 2009, సెప్టెంబర్ 23 నుంచి కేంద్ర సమాచార కమిషనర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆమె అంతకుముందు కేంద్ర ప్రభుత్వంలో పంచాయతీరాజ్, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల్లో కార్యదర్శిగా పనిచేశారు. ఆమె కాకుండా మరో ఎనిమిదిమంది సమాచార కమిషనర్లు ఉన్నారు. సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) కింద వచ్చే అప్పీళ్లు, ఫిర్యాదులను సీఐసీ పరిష్కరిస్తారు. ప్రభుత్వ శాఖలు, ఇతర ప్రభుత్వ సంస్థలకు సంబంధించి ప్రజలు కోరిన సమాచారంపై ఈ అప్పీళ్లు, ఫిర్యాదులు ఉంటాయి.

గార్డియన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా స్నోడెన్లండన్‌కు చెందిన ది గార్డియన్ పత్రిక ఎడ్వర్డ్ స్నోడెన్‌ను 2013 సంవత్సరానికి పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపిక చేసింది. అమెరికా నిఘా సంస్థ సేకరించిన వర్గీకత రహస్య సమాచారాన్ని స్నోడెన్ బహిర్గతం చేశాడు.

టైమ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా పోప్ ఫ్రాన్సిస్
2013 సంవత్సరానికి పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా పోప్ ఫ్రాన్సిస్‌ను టైమ్ పత్రిక ప్రకటించింది. పోప్‌గా బాధ్యతలు చేపట్టిన తొమ్మిది నెలల్లోనే కేథలిక్ చర్చి దృక్పథాన్ని అసాధారణ రీతిలో మార్చారని టైమ్ పత్రిక పేర్కొంది. ఈ ఏడాది మేటి వ్యక్తుల్లో రెండో స్థానంలో అమెరికా రహస్యాలను బయటపెట్టిన సీఐఏ మాజీ ఉద్యోగి ఎడ్వర్డ్ స్నోడెన్ నిలిచాడు. టైమ్ పత్రిక ఎంపిక చేసిన టాప్-10 జాబితాలో అమెరికా అధ్యక్షుడు ఒబామా, సిరియా అధ్యక్షుడు బసర్ అసద్ తదితరులు ఉన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీకి 42వ స్థానం దక్కింది.

హాలీవుడ్ నటి ఎలీనర్ పార్కర్ మృతి
ప్రముఖ హాలీవుడ్ నటి ఎలీనర్ పార్కర్ (91) అమెరికాలోని కాలిఫోర్నియాలో డిసెంబర్ 10న మరణించారు. 1966 నాటి ‘ది సౌండ్ ఆఫ్ మ్యూజిక్’లో బారోనెస్ పాత్ర ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది. ఆమె చివరిసారిగా 1991లో ‘డెడ్ ఆన్ ద మనీ’లో నటించారు.

మైసూర్ రాజవంశీయుడు ఒడెయార్ మృతి
మైసూర్ మహారాజ వంశీయుడు శ్రీకంఠదత్త నరసింహరాజ ఒడెయార్ (60) బెంగళూరులో డిసెంబర్ 10న మరణించారు. ఆయన మైసూరు లోక్‌సభ స్థానం నుంచి నాలుగుసార్లు గెలిచారు. 1399 నుంచి 1950 వరకు మైసూరును పాలించిన రాజ వంశీయుల్లో ఒడెయార్ చివరివారు. మైసూరు చివరి మహారాజు జయచామరాజేంద్ర ఒడెయార్ కుమారుడు శ్రీకంఠదత్త. 1974, సెప్టెంబర్‌లో మైసూరు సంస్థాన బాధ్యతలు చేపట్టారు.

కేంద్రమంత్రి శీష్‌రాం మృతి
కేంద్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు శీష్‌రాం ఓలా (86) డిసెంబర్ 15న అనారోగ్యంతో న్యూఢిల్లీలో మరణించారు. రాజస్థాన్‌కు చెందిన ఓలా 
1996లో తొలిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. బాలికల విద్య కోసం కషి చేసిన ఆయనకు 
1968లో పద్మశ్రీ పురస్కారం లభించింది. ఆయన రాజస్థాన్ ప్రభుత్వంలో కూడా మంత్రిగా పనిచేశారు.

ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిగా రమణ్‌సింగ్
ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిగా రమణ్‌సింగ్ డిసెంబర్ 12న ప్రమాణస్వీకారం చేశారు. ఆయన ముఖ్యమంత్రిగా ఎన్నికవడం ఇది వరుసగా మూడోసారి. నవంబర్‌లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మొత్తం 90 స్థానాలకుగాను రమణ్‌సింగ్ నాయకత్వంలోని బీజేపీ 49 సీట్లు సాధించి అధికారంలోకి వచ్చింది.

మిజోరం ముఖ్యమంత్రిగా లాల్ తన్వాహ్లా
మిజోరం సీఎంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లాల్ తన్వాహ్లా (71) డిసెంబర్ 14న ప్రమాణ స్వీకారం చేశారు. తొలిసారి 1984లో ముఖ్యమంత్రి అయిన ఆయన తర్వాత 1989, 1993, 2008లో ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు.

రాజస్థాన్ ముఖ్యమంత్రిగా వసుంధర రాజే ప్రమాణ స్వీకారం
రాజస్థాన్ ముఖ్యమంత్రిగా వసుంధర రాజే డిసెంబర్ 12న ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె ముఖ్యమంత్రిగా ఎన్నికవడం ఇది రెండోసారి. నవంబర్‌లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఆమె నాయకత్వంలోని బీజేపీ 200 స్థానాలకుగాను 163 స్థానాలు గెలుచుకుంది. ఆమె 2003 నుంచి 2008 వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు.

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా శివరాజ్‌సింగ్ చౌహాన్
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా శివరాజ్‌సింగ్ చౌహాన్ వరుసగా మూడోసారి ప్రమాణస్వీకారం చేశారు. మొత్తం 230 స్థానాల మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 165 సీట్లు దక్కించుకుంది.

నాబార్‌‌డ చైర్మన్‌గా హర్షకుమార్ భన్వాలా నియామకం
జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్‌‌డ) చైర్మన్‌గా డిసెంబర్ 15న హర్షకుమార్ భన్వాలా నియమితులయ్యారు. సెప్టెంబర్‌లో పదవీ విరమణ చేసిన ప్రకాశ్ భక్షీ స్థానంలో హర్షకుమార్ బాధ్యతలు చేపడతారు. ఆయన ఇంతవరకూ ప్రభుత్వరంగ సంస్థ ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్‌‌స కంపెనీ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా పనిచేశారు.

పురావస్తు శాస్త్రవేత్త ఐ.కె.శర్మ మృతిప్రముఖ పురావస్తు శాస్త్రవేత్త, భారత పురావస్తు శాఖ మాజీ డెరైక్టర్ ఐ.కె. శర్మ (ఇంగువ కార్తికేయ శర్మ) (76) హైదరాబాద్‌లో నవంబర్ 28న మరణించారు. ఆయన పురావస్తు శాస్త్రంలోనే కాకుండా కళలు, ఆర్కిటెక్చర్, ప్రాచీన కట్టడాల పరిరక్షణ వంటి విషయాల్లో కూడా పేరొందారు. ఆంధ్రప్రదేశ్‌లోని నాగార్జున కొండ, గుడిమల్లామ్, అమరావతి, గుంటుపల్లి, పెదవేగి, రాజస్థాన్‌లోని కాలీభంగం, తమిళనాడులోని పైయాంపల్లి, మహారాష్ట్రలోని పుణే, గుజరాత్‌లోని సుర్‌కోడ్తా ప్రాంతాల్లో చేపట్టిన తవ్వకాల్లో ప్రధాన పాత్ర పోషించారు. అనేక పుస్తకాలు ప్రచురించారు.

విప్లవకవి మండే సత్యం మృతివిప్లవ కవి మండే సత్యనారాయణ (80) హైదరాబాద్‌లో నవంబర్ 27న మరణించారు. ఆయన పీపుల్స్‌వార్ ఉద్యమ నేపథ్యంలో 100కు పైగా విప్లవ గీతాలు రాశారు. ఎర్ర సైన్యం, చీమల దండు సినిమాలకు పాటలు రాశారు.

పాకిస్థాన్ సైన్యాధిపతిగా రహీల్ షరీఫ్పాకిస్థాన్ సైన్యాధిపతిగా లెఫ్టినెంట్ జనరల్ రహీల్ షరీఫ్ (57) నియమితులయ్యారు. పదవీ విరమణ చేసిన జనరల్ అష్పాక్ పర్వేజ్ కయానీ స్థానంలో షరీఫ్ నవంబర్ 29న బాధ్యతలు చేపట్టారు.

No comments:

Post a Comment