AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Sunday 26 November 2017

వార్తల్లో వ్యక్తులు ఏప్రిల్ 2014

వార్తల్లో వ్యక్తులు ఏప్రిల్ 2014
సుప్రీం కోర్టు 41వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లోధాభారత సుప్రీంకోర్టు 41వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రాజేంద్ర మల్ లోధాతో ఏప్రిల్ 27న రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ ప్రమాణ స్వీకారం చేయించారు. ఏప్రిల్ 26న పదవీ విరమణ చేసిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి. సదాశివం స్థానంలో జస్టిస్ లోధా నియమితులయ్యారు. జస్టిస్ లోధా ఐదు నెలల పాటు ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగి 2014 సెప్టెంబరు 27న పదవీ విరమణ చేస్తారు. రాజస్థాన్‌కు చెందిన జస్టిస్ లోధా 1994 జనవరిలో రాజస్థాన్ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2008 మే 13న పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బాధ్యతలు చేపట్టారు. 2008 డిసెంబరు 17 నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కొనసాగుతున్నారు.

దక్షిణ కొరియా ప్రధాని చుంగ్ హాంగ్ వాన్ రాజీనామాప్రయాణికుల నౌక మునిగిపోయిన దుర్ఘటనతో కలత చెందిన దక్షిణ కొరియా ప్రధానమంత్రి చుంగ్ హాంగ్ వాన్ ఏప్రిల్ 27న పదవికి రాజీనామా చేశారు. ప్రయాణికులను రక్షించడంలో ప్రభుత్వం సరిగా స్పందించలేదని ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తమైంది. సహాయ చర్యలు సమర్థంగా నిర్వహించలేకపోయామని ప్రధాని అంగీకరించారు. దక్షిణకొరియా దక్షిణ తీరంలో ఏప్రిల్ 16న నౌక మునిగిపోయి 300 మంది గల్లంతయ్యారు. మొత్తం 459 మంది నౌకలో ప్రయాణిస్తున్నారు. అందులోని వారంతా విహారయాత్రకు వెళ్లిన విద్యార్థులు.

ప్రభావితం చేయగల వ్యక్తుల్లో మోడీ, కేజ్రీవాల్, అరుంధతి రాయ్‌కి స్థానం2014 సంవత్సరానికి ప్రపంచంలో అత్యంత ప్రభావితం చేయగల 100 మంది జాబితాను టైమ్ మ్యాగజీన్ ఏప్రిల్ 25వ సంచికలో ప్రచురించింది. ఈ 100 మందిలో భారత్ నుంచి నరేంద్ర మోడీ, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్, నవలాకారిణి అరుంధతీ రాయ్‌లకు చోటు దక్కింది. వీరితో పాటు కొయంబత్తూర్‌కు చెందిన ఆరోగ్య ప్రచారకర్త అరుణాచలమ్ మురుగనాథమ్ కూడా ఈ జాబితాలో ఉన్నారు.టైమ్ మ్యాగజీన్ జాబితాలో అమెరికా అధ్యక్షుడు ఒబామా, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, ముఖచిత్రంగా ప్రచురితమైన గాయకురాలు బియోన్‌‌స, అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ, అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్, పాకిస్తాన్ బాలికల విద్య ప్రచార కార్యకర్త మలాలా యూసఫ్ జాయ్, విజిల్ బ్లోయర్ ఎడ్వర్‌‌డ స్నోడన్, జపాన్ ప్రధానమంత్రి షింజో అబె ఉన్నారు.
ఎన్‌ఎండీసీ సీఎండీగా నరేంద్ర కొఠారి
ప్రభుత్వరంగ సంస్థ ఎన్‌ఎండీసీ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్‌గా నరేంద్ర కొఠారి ఏప్రిల్ 21న బాధ్యతలు స్వీకరించారు. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్) లో పలు హోదాల్లో ఈయన పనిచేశారు. 
బీఈఎంఎల్‌కు కొత్త డెరైక్టర్
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ బెమెల్ డెరైక్టర్ (రైల్ అండ్ మెట్రో)గా అనిరుధ్ కుమార్ ఏప్రిల్ 21న బాధ్యతలు చేపట్టారు. ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ సిస్టమ్‌లో ఎం.టెక్ చేసిన ఆయనకు ప్రణాళిక, ఉత్పత్తి విభాగాల్లో మూడు దశాబ్దాలకు పైగా పని చేసిన అనుభవం ఉంది.
మయన్మార్ ప్రజాస్వామ్య పోరాట యోధుడు విన్‌టిన్ మృతి
మయన్మార్ ప్రజాస్వామ్య పోరాట ఉద్యమ స్థాపకుల్లో ఒకరైన విన్‌టిన్ (84) యాంగూన్‌లో ఏప్రిల్ 21న మరణించారు. ఈయన అత్యధిక కాలం బందీగా ఉన్న రాజకీయ ఖైదీ. సైనిక పాలన నుంచి దేశానికి స్వేచ్ఛ కల్పించేందుకు దశాబ్దాల పాటు పోరాడారు. రెండు దశాబ్దాల జైలు జీవితం గడిపారు. 1988లో అంగ్‌సాన్ సూకీతో కలసి నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ (ఎన్‌ఎల్‌డీ) ని స్థాపించారు.
నోబెల్ అవార్డు గ్రహీత, రచయిత గార్షియా మార్క్వెజ్ మృతి
నోబెల్ అవార్డు గ్రహీత, ప్రముఖ లాటిన్ అమెరికన్ రచయిత గాబ్రియెల్ గార్షియా మార్క్వెజ్ (87) మెక్సికో సిటీలో ఏప్రిల్ 17న మరణించారు. ప్రేమ, కుటుంబం, నియంతత్వం వంటి అంశాలపై ఆయన చేసిన రచనలు విశేష ఆదరణ పొందాయి. ప్రపంచ సాహిత్యంలో మార్క్వెజ్ గాబోగా సుపరిచితులు. వన్ హండ్రెడ్ ఇయర్‌‌స ఆఫ్ సాలిట్యూడ్, ఇన్ ఈవిల్ అవర్, లవ్ ఇన్ ది టైమ్ ఆఫ్ కలరా వంటి రచనలతో ఖ్యాతి పొందారు. సాహిత్యంలో 1982లో ఆయనకు నోబెల్ బహుమతి లభించింది.

విజ్డ్డన్ ముఖచిత్రంపై సచిన్
విజ్డన్ క్రికెటర్స్ అల్మనాక్-2014 పుస్తకం 151వ సంచిక ముఖచిత్రంపై భారత మాజీ క్రికెటర్ సచిన్‌టెండూల్కర్ చిత్రాన్ని ప్రచురించింది. తద్వారా ఈ అల్మనాక్ పుస్తకంపై ముఖచిత్రంగా ప్రచురితమైన తొలి భారత క్రికెటర్‌గా సచిన్ నిలిచాడు. ఈ పుస్తకం ఏప్రిల్ 10న లండన్‌లో విడుదలైంది. 
ఢిల్లీ హైకోర్టు తొలి మహిళా సీజేగా జస్టిస్ రోహిణి 
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సీనియర్ న్యాయమూర్తిగా కొనసాగుతున్న జస్టిస్ రోహిణి ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఈ హోదాలో నియమితులైన తొలి మహిళగా జస్టిస్ రోహిణి చరిత్రకెక్కారు. ఈ నియామకంతో రాష్ట్రానికి చెందిన మహిళా న్యాయమూర్తికి దేశ రాజధానిలో అరుదైన గౌరవం దక్కినట్లయింది. ఢిల్లీ హైకోర్టు సీజేగా జస్టిస్ రోహిణికి పదోన్నతి కల్పిస్తూ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఏప్రిల్ 11న ఆమోదముద్ర వేశారు. 
సుప్రీం ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లోథా 
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రాజేంద్ర మాల్ లోథా (64) నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ నియమించినట్లు న్యాయ మంత్రిత్వ శాఖ ఏప్రిల్ 11న అధికారికంగా ప్రకటించింది. ఏప్రిల్ 27న ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి పి.సదాశివం తరువాత సుప్రీంకోర్టులో జస్టిస్ ఆర్.ఎం.లోథాయే అత్యంత సీనియర్ న్యాయమూర్తి. వయో పరిమితి రీత్యా లోథా సెప్టెంబర్ 27న పదవీ విరమణ చేయనుండటంతో ఐదు నెలల కాలమే ఈ పదవిలో కొనసాగనున్నారు. జోధ్‌పూర్‌లో జన్మించిన లోథా రాజస్థాన్, బాంబే హైకోర్టుల్లో న్యాయమూర్తిగా పాట్నా హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. 2008 డిసెంబర్ 27న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. బొగ్గు గనుల కుంభకోణం కేసును పర్యవేక్షిస్తున్న సుప్రీం కోర్టు బృందానికి లోథాయే నేతృత్వం వహిస్తున్నారు. ఔషధ పరీక్షలకు సంబంధించిన కేసులనూ ఆయన నేతృత్వంలో ధర్మాసనమే విచారించింది. అలాగే మైనారిటీ పాఠశాలల్లో విద్యా విధానాలను పరిశీలించేందుకు ఏర్పాటైన రాజ్యాంగ ధర్మాసనంలోనూ లోథా ఉన్నారు.
నాస్కామ్ చైర్మన్‌గా ఆర్.చంద్రశేఖరన్ 
కాగ్నిజెంట్ ఇండియా ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ ఆర్. చంద్రశేఖరన్ 2014-15 సంవత్సరానికి నాస్కామ్ (ది నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్) చైర్మన్‌గా ఏప్రిల్ 9న నియమితులయ్యారు. ఇన్ఫోటెక్ ఎంటర్ ప్రై జెస్ వ్యవస్థాపకుడు, ఛీఫ్‌మేనేజింగ్ డెరైక్టర్ అయిన బీవీఆర్ మోహన్‌రెడ్డి నాస్కామ్ వైస్ చైర్మన్‌గా ఎంపికయ్యారు.

మిస్ ఇండియాగా కోయల్‌రాణా 
మిస్ ఇండియా -2014 కిరీటాన్ని ఢిల్లీ యువతి కోయల్‌రాణా కైవసం చేసుకుంది. ముంబైలో ఏప్రిల్ 5న జరిగిన పోటీలో ఆమె విజేతగా నిలిచింది. దీంతో ఈ ఏడాది జరగబోయే మిస్ వరల్డ్ పోటీల్లో కోయల్ భారత్‌కు ప్రాతినిధ్యం వహించ నుంది.

అమెరికా రాయబారి నాన్సీ పావెల్ రాజీనామాభారత్‌లో అమెరికా రాయబారి నాన్సీపావెల్ మార్చి 31న రాజీనామా చేశారు. 2012 ఏప్రిల్‌లో పావెల్ భారత్‌లో అమెరికా రాయబారిగా నియమితులయ్యారు. 

బీడీఎల్ కొత్త అధ్యక్షుడిగా ఎన్.బి. సింగ్భారత డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) సాంకేతిక విభాగానికి కొత్త డెరైక్టర్‌గా ఎయిర్‌వైస్ మార్షల్ ఎన్.బి. సింగ్ ఏప్రిల్ 2న బాధ్యతలు చేపట్టారు. ఇంతకుముందు ఆయన భారత వైమానిక దళంలో కమ్యూనికేషన్ విభాగంలో అసిస్టెంట్ ఛీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ బాధ్యతలు నిర్వహించారు. 

బీఎస్‌ఎఫ్ అధిపతిగా డి.కె.పాఠక్బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కొత్త డెరైక్టర్ జనరల్‌గా సీనియర్ ఐ.పి.ఎస్ అధికారి డి.కె.పాఠక్ ఏప్రిల్ 2న నియమితులయ్యారు. 1979 బ్యాచ్‌కు చెందిన పాఠక్ అస్సాం-మేఘాలయ క్యాడర్‌కు చెందిన అధికారి. ప్రస్తుతం ఆయన బీఎస్‌ఎఫ్ ప్రత్యేక డెరైక్టర్ జనరల్‌గా ఉన్నారు. 

ఆసియాప్రభావవంతుల జాబితాఆసియాన్ అవార్డ్స్ లిమిటెడ్ సంస్థ ఆసియాలోని వందమంది అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాను ఏప్రిల్ 6న ప్రకటించింది. ఇందులో తొలి 5 స్థానాల్లో ముగ్గురు భారతీయులు ఉండడం విశేషం. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అగ్రస్థానంలో నిలిచారు. ఆ తర్వాతి స్థానంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, మూడో స్థానంలో చైనా ప్రధానమంత్రి లీ కెకియాంగ్ ఉన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ నాలుగో స్థానంలోనూ, కాంగ్రెస్‌నేత రాహుల్‌గాంధీ, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌లు వరుసగా ఐదు, ఆరు స్థానాల్లో నిలిచారు.

ఆర్‌బీఐ డిప్యూటీ గనర్నర్‌గా ఆర్.గాంధీభారత రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్‌గా ఆర్. గాంధీని కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 3న నియమించింది. జనవరిలో పదవీ విరమణ చేసిన ఆనంద్ సిన్హా స్థానంలో నియమితులైన గాంధీ మూడేళ్లపాటు ఈ హోదాలో కొనసాగుతారు. గాంధీ ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా ఉన్నారు.

No comments:

Post a Comment