AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Sunday 26 November 2017

క్రీడలు ఆగష్టు 2016

క్రీడలు ఆగష్టు 2016
టెస్ట్ సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్
భారత్, వెస్టిండీస్‌ల మధ్య జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌ను 2-0 తేడాతో భారత్ గెలుచుకుంది. సిరీస్‌లో భాగంగా పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో జరిగిన నాలుగో టెస్ట్ డ్రాగా ముగిసింది. మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌గా ఆర్.అశ్విన్ ఎంపికయ్యాడు.
రోస్‌బర్గ్‌కు బెల్జియం గ్రాండ్ ప్రీ టైటిల్
మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్‌బర్గ్ ఆగస్టు 28న జరిగిన బెల్జియం గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ రేసులో విజేతగా నిలిచాడు. 44 ల్యాప్‌ల ఈ రేసును రోస్‌బర్గ్ గంటా 44 నిమిషాల 51.058 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని అందుకున్నాడు. ఇది రోస్‌బర్గ్ కెరీర్‌లో తొలి బెల్జియం గ్రాండ్ ప్రీ. ప్రస్తుత ప్రపంచ చాంపియన్ లూయిస్ హామిల్టన్ (మెర్సిడెస్) మూడో స్థానాన్ని పొందగా, రికియార్డో (రెడ్‌బుల్) రెండో స్థానంలో నిలిచాడు. 
సానియా జోడీకి కనెక్టికట్ ఓపెన్ టైటిల్
సానియా మీర్జా (భారత్), మోనికా నికెలెస్కూ (రొమేనియా)తో కలిసి కనెక్టికట్ డబ్ల్యూటీఏ ఓపెన్ టోర్నమెంట్ మహిళల డబుల్స్ టైటిల్ గెలుచుకుంది. అమెరికాలోని న్యూ హవెన్‌లో ఆగస్టు 27న జరిగిన ఫైనల్లో కాటరీనా బొండారెంకో (ఉక్రెయిన్)-చువాంగ్ చియా జంగ్ (చైనీస్ తైపీ) జోడీపై విజయం సాధించారు.
ఐరోపా ఉత్తమ ఫుట్‌బాలర్ రొనాల్డో
పోర్చుగల్ సూపర్‌స్టార్ క్రిస్టియానో రొనాల్డో.. రెండోసారి కూడా యూఈఎఫ్‌ఏ (ఐరోపా దేశాల ఫుట్‌బాల్ సంఘం) ఉత్తమ యూరప్ ప్లేయర్‌గా నిలిచాడు. రియల్ మాడ్రిడ్‌ను చాంపియన్‌‌స లీగ్ విజేతగా నిలిపడంతోపాటు ఈ ఏడాది పోర్చుగల్‌కు యూరోకప్‌ను అందించడంలో ముఖ్యపాత్ర పోషించినందుకుగాను రొనాల్డోకు ఈ అవార్డు దక్కింది. నార్వే క్రీడాకారిణి అదా హెగెర్‌బర్గ్‌కు మహిళల విభాగంలో అవార్డు దక్కింది.
రాష్ట్రపతి భవన్‌లో ‘స్పోర్‌‌ట్స డే’ వేడుకలు
హాకీ దిగ్గజం ధ్యాన్‌చంద్ జయంతి, జాతీయ క్రీడా దినోత్సవం అయిన ఆగస్టు 29న క్రీడా పురస్కారాల వేడుక రాష్ట్రపతి భవన్‌లో ఘనంగా జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకే ఏడాది నలుగురు క్రీడాకారులకు రాజీవ్ ఖేల్త్న్ర అవార్డు దక్కింది.

పి.వి. సింధుతో పాటు రెజ్లర్ సాక్షి మలిక్, జిమ్నాస్ట్ దీపా కర్మాకర్, షూటర్ జీతూరాయ్ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ఈ అవార్డు అందుకున్నారు. అలాగే 15 మందికి అర్జున అవార్డు, ఆరుగురు కోచ్‌లకు ద్రోణాచార్య అవార్డు ప్రదానం చేశారు.

క్రీడాకారులకు ఉద్యోగావకాశాలు కల్పించడంతో పాటు ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేయడం వల్ల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ‘రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్’ దక్కింది.
సీఆర్‌పీఎఫ్ కమాండెంట్‌గా సింధు
ఒలింపిక్స్‌లో రజత పతకం నెగ్గిన పీవీ సింధుకు దేశంలోని అతిపెద్ద పారామిలిటరీ దళం సెంట్రల్ రిజర్వుడ్ ప్రొటెక్షన్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) కమాండెంట్ పదవిని ఇవ్వడంతో పాటు ఆమెను సీఆర్‌పీఎఫ్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది. సీఆర్‌పీఎఫ్‌లో కమాండెంట్ అంటే పోలీసు శాఖలో సుపరింటిండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ)ర్యాంక్ కి సమానం. ఒక కమాండెంట్ కింద వెరుు్య మంది పని చేస్తుంటారు. గతంలో భారత టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లిని బీఎస్‌ఎఫ్ (బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్) తమ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది.
యోగేశ్వర్ దత్‌కు పతక ప్రమోషన్
2012 లండన్ ఒలింపిక్స్‌లో రెజ్లర్ యోగేశ్వర్ దత్ సాధించిన కాంస్యంను నాలుగేళ్ల తర్వాత రజతంగా అప్‌గ్రేడ్ చేస్తూ ఒలింపిక్స్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఆ గేమ్స్‌లో రజతం సాధించిన రష్యా రెజ్లర్ కుదుఖోవ్ అంతర్జాతీయ డోపింగ్ వ్యతిరేక సంస్థ (వాడా) నిర్వహించిన డోపింగ్ పరీక్షలో నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినట్లు రుజువు కావడంతో యోగేశ్వర్‌కు రజతం దక్కింది.

పురుషుల 60 కేజీల ఫ్రీస్టయిల్ విభాగం ప్రి కార్టర్ ఫైనల్లో బెసిక్ కుదుఖోవ్ చేతిలో యోగేశ్వర్ ఓడిపోయాడు అయితే కుదుఖోవ్ ఫైనల్‌కు చేరడంతో వచ్చిన రేప్‌చేజ్ అవకాశంతో యోగేశ్వర్ కాంస్య పతకం సాధించాడు. నాలుగుసార్లు ప్రపంచ చాంపియన్, బీజింగ్ గేమ్స్‌లో కాంస్యం సాధించిన కుదుఖోవ్ 2013లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు.


రియోలో భారత్‌కు తొలి పతకం అందించిన సాక్షి
 భారత మహిళా రెజ్లర్ సాక్షి మలిక్ మహిళల ఫ్రీ స్టయిల్ 58 కేజీల విభాగంలో కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. తుది పోరులో సాక్షి 8-5 పాయింట్ల తేడాతో ఐసులు తినిబెకోవా (కిర్గిజిస్తాన్)పై విజయం సాధించింది.

తొలిమ్యాచ్‌లో స్వీడన్‌కు చెందిన జోహన్నాపై, తర్వాతి మ్యాచ్‌లో మారియా చర్దివరా (మాల్డోవా)పై నెగ్గి క్వార్టర్స్‌కు చేరిన సాక్షి.. వలెరియా కొబ్లోవా చేతిలో ఓడింది. అయితే తనపై నెగ్గిన వలెరియా ఫైనల్స్‌కు చేరుకోవడంతో సాక్షికి రెప్‌చేజ్ ఆడే అవకాశం లభించింది. 

ఒలింపిక్స్ చరిత్రలో భారత రెజ్లర్లు నెగ్గిన పతకాలు
ఆటగాడు
సంవత్సరం
ప్రదేశం
పతకం
ఖాషాబా జాదవ్
1952
హెల్సింకి
కాంస్యం
సుశీల్ కుమార్
2008
బీజింగ్
కాంస్యం
సుశీల్ కుమార్
2012
లండన్
కాంస్యం
యోగేశ్వర్ దత్
2012
లండన్
రజతం
సాక్షి మలిక్
2016
రియో
కాంస్యం

సానియా జంటకు సిన్సినాటి ఓపెన్ టైటిల్కొత్త భాగస్వామి బార్బరా స్ట్రికోవా (చెక్ రిపబ్లిక్)తో బరిలోకి దిగిన తొలి టోర్నమెంట్‌లో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా టైటిల్‌ను సాధించింది. సిన్సినాటి ఓపెన్ డబ్ల్యూటీఏ టోర్నీ ఫైనల్లో సానియా-స్ట్రికోవా ద్వయం 7-5, 6-4తో మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)-కోకో వాండెవెగె (అమెరికా) జోడీపై విజయం సాధించింది. సానియా కెరీర్‌లో ఇది 38వ డబుల్స్ టైటిల్. ఈ విజయంతో సానియా డబుల్స్ ర్యాంకింగ్స్‌లో ఒంటరిగా అగ్రస్థానానికి చేరుకుంది. ఈ టోర్నీకి ముందు సానియా, ఆమె మాజీ భాగస్వామి హింగిస్ సంయుక్తంగా టాప్ ర్యాంక్‌లో ఉన్నారు. 

రియోఒలింపిక్స్లో సింధుకు రజతంఆగస్టు 19న రియోలో జరిగిన మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ ఫైనల్లో పోరాడి ఓడిన సింధు రజత పతకం దక్కించుకుంది. ప్రపంచ పదో ర్యాంకర్ సింధు టాప్ సీడ్, ప్రపంచ నం.1 కరోలినా మారిన్ (స్పెయిన్) చేతిలో 21-19, 12-21, 15-21తో ఓడిపోయింంది. దీంతో ఒలింపిక్ రజత పకాన్ని గెలిచిన తొలి భారత మహిళగా సింధు చరిత్ర సృష్టించింది.

సింధూ విజయాలుజూనియర్ స్థాయిలో...2009 కొలంబో సబ్-జూనియర్ ఏషియన్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ (కొలంబో)లో కాంస్యం
2010 ఫజ్ర్ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ చాలెంజ్ (ఇరాన్) లో రజతం

సీనియర్‌గా విజయాలు2011లో ఇండోనేషియన్ ఇంటర్నేషనల్ టైటిల్
2012లో ఏషియా యూత్ అండర్-19 చాంపియన్‌షిప్
2013 మలేషియా మాస్టర్స్‌లో బంగారు పతకం (తొలి గ్రాండ్ ప్రి)
2013, 2014, 2015 మకావు ఓపెన్ టైటిల్స్
2013, 2014 వరల్డ్ చాంపియన్‌షిప్‌లో కాంస్యాలు
2015 వరల్డ్ చాంపియన్‌షిప్‌లో క్వార్టర్ ఫైనల్స్
2016 మలేసియా మాస్టర్స్
2016 రియో ఒలింపిక్స్‌లో రజతం

నర్సింగ్ యాదవ్‌పై నాలుగేళ్ల నిషేధండోపింగ్ ఆరోపణలు ఎదుర్కొన్న భారత రెజ్లర్ నర్సింగ్ యాదవ్‌పై నాలుగేళ్ల నిషేధం విధిస్తున్నట్టు క్రీడా మధ్యవర్తిత్వ కోర్టు (Court of Arbitration for Sport) ప్రకటించింది. ఎవరో కుట్రపూరితంగా వ్యవహరించి డోపింగ్‌లో ఇరికించారనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని సీఏఎస్ తేల్చింది.

జూన్ 25, జూలై 5న నర్సింగ్ ఇచ్చిన డోపింగ్ శాంపిల్‌లో నిషేధిత ఉత్ప్రేరకం మెథడనోన్ ఆనవాళ్లు ఉన్నట్టు తేలింది. అయితే ఉద్దేశపూర్వకంగానే అతడు తీసుకునే ఆహారం, పానీయాల్లో ఎవరైనా డ్రగ్స్ కలిపి ఉంటారనే అనుమానంతో జాతీయ డోపింగ్ వ్యతిరేక సంస్థ (నాడా) క్లీన్‌చిట్ ఇచ్చింది.

ఈ నిర్ణయాన్ని ప్రపంచ డోపింగ్ వ్యతిరేక సంస్థ (వాడా) సీఏఎస్ అడ్ హక్ డివిజన్‌లో అప్పీల్ చేసింది. దీనిని విచారించిన సీఏఎస్ నర్సింగ్‌కు వ్యతిరేకంగా తీర్పునివ్వడంతో అతడు ఒలింపిక్స్ నుంచి వైదొలిగాడు.

200 మీ. పరుగులో థాంప్సన్‌కు స్వర్ణంజమైకా పరుగుల రాణి, ఎలెనీ థాంప్సన్ 200 మీ. పరుగులోనూ ఒలింపిక్ పసిడి సాధించింది. ఇప్పటికే ఆమె 100 మీ. పరుగులో స్వర్ణం సాధించి ప్రపంచ రికార్డు సృష్టించింది. ఆగస్టు 18న జరిగిన 200 మీ. ఫైనల్ రేసును థాంప్సన్ 21.78 సె.లో ముగించింది. డఫ్నె స్చిప్పర్స్ (నెదర్లాండ్స్) 21.88 సె.లో రేసును ముగించి రజతం గెలవగా అమెరికాకు చెందిన టోరీ బోవీ 22.15 సె.లో ముగించి కాంస్యం అందుకుంది. 

మో ఫరా ‘డబుల్’ డబుల్బ్రిటన్ అథ్లెట్ మో ఫరా రియో ఒలింపిక్స్ 5 వేల మీటర్లలోనూ పసిడి పతకంతో ఒలింపిక్స్‌లోడబుల్ సాధించాడు. ఇప్పటికే 10 వేల మీటర్ల రేసులో స్వర్ణం గెలిచిన మో ఫరా 2012 లండన్ ఒలింపిక్స్‌లోనూ రెండు విభాగాల్లో స్వర్ణాలు సాధించాడు. దీంతో 1976లో లాసీ వీరెన్ (ఫిన్‌లాండ్) తర్వాత ఒలింపిక్స్‌లో ఈ రెండు విభాగాల్లో టైటిల్ నిలబెట్టుకున్న అథ్లెట్‌గా మో ఫరా గుర్తింపు పొందాడు. కిప్కెమోయ్ పాల్ (అమెరికా - 13ని:03.90 సెకన్లు) రజతం, హగోస్ జెబ్రివెట్ (ఇథియోపియా - 13ని:04.35 సెకన్లు) కాంస్యం గెలిచారు.

బోల్ట్ ఖాతాలో ‘ట్రిపుల్ ట్రిపుల్’జమైకా ‘స్ప్రింట్ కింగ్’ ఉసేన్ బోల్ట్ వరుసగా మూడు ఒలింపిక్స్‌లో మూడు విభాగాల్లో స్వర్ణాలు (ట్రిపుల్ ట్రిపుల్) సాధించి ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఆగస్టు 20న జరిగిన పురుషుల 4ఁ100 మీటర్ల రిలేలో బోల్ట్ సభ్యుడిగా ఉన్న జమైకా బృందం స్వర్ణ పతకాన్ని సాధించింది. అసాఫా పావెల్, యోహాన్ బ్లేక్, నికెల్ యాష్మెడ్, బోల్ట్‌లతో కూడిన జమైకా జట్టు 37.27 సెకన్లలో పోటీని ముగించి అగ్రస్థానంలో నిలిచింది. జపాన్ జట్టు (37.60 సెకన్లు) రజతం సొంతం చేసుకోగా... కెనడా జట్టు (37.64 సెకన్లు) ఖాతాలో కాంస్యం చేరింది. 

బోల్ట్ ‘ట్రిపుల్-ట్రిపుల్’
ఒలింపిక్స్
బీజింగ్ (2008)
లండన్ (2012)
రియో (2016)
100 మీ
9.69 సె. (వరల్డ్ రికార్డు)
9.63 సె. (ఒలింపిక్ రికార్డు)
9.81 సె.
200 మీ.
19.30 సె. (వరల్డ్ రికార్డు)
19.32 సె.
19.78 సె.
4x100 మీ.రిలే
37.1 సె. (వరల్డ్ రికార్డు)
36.84 సె. (వరల్డ్ రికార్డు)
37.27 సె.

బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ విజేత చెన్ లాంగ్ఆగస్టు 20న జరిగిన బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో చెన్ లాంగ్ 21-18, 21-18తో లీ చోంగ్ వీని ఓడించి తన కెరీర్‌లో తొలిసారి ఒలింపిక్ స్వర్ణ పతకాన్ని (లండన్‌లో కాంస్యం) కైవసం చేసుకున్నాడు. 

దీంతో వరుసగా మూడు ఒలింపిక్స్‌లో ఫైనల్ చేరిన మలేసియా బ్యాడ్మింటన్ స్టార్ లీ చోంగ్ వీ రజత పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. బీజింగ్, లండన్ ఒలింపిక్స్ ఫైనల్స్‌లో లిన్ డాన్ (చైనా) చేతిలో ఓడిన లీ చోంగ్ వీ... రియోలో చైనాకే చెందిన చెన్ లాంగ్ చేతిలో పరాజయం పాలయ్యాడు. 

ఒలింపిక్స్ ఫుట్‌బాల్‌లో బ్రెజిల్‌కు స్వర్ణంసొంతగడ్డపై జరిగిన రియో ఒలింపిక్స్‌లో 24 ఏళ్ల నెమార్ సారథ్యంలో బ్రెజిల్ ఫుట్‌బాల్ జట్టు స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. 116 ఏళ్ల ఒలింపిక్స్ ఫుట్‌బాల్ చరిత్రలో బ్రెజిల్ పురుషుల జట్టు పసిడి పతకాన్ని సాధించడం ఇదే తొలిసారి. 1984 లాస్ ఏంజిల్స్, 1988 సియోల్, 2012 లండన్ ఒలింపిక్స్‌లో బ్రెజిల్ జట్టు ఫైనల్‌కు చేరుకున్నా చివరకు రజత పతకంతో సరిపెట్టుకుంది. జర్మనీ జట్టుతో జరిగిన ఫైనల్లో బ్రెజిల్ ‘పెనాల్టీ షూటౌట్’లో 5-4తో విజయం సాధించింది.

ముగిసిన ఒలింపిక్స్ బ్రెజిల్‌లోని రియోడిజనీరోలో ఆగస్టు 5 నుంచి ఆగస్టు 21 వరకు జరిగిన ఒలింపిక్స్ -2016 ముగింపు వేడుకల్లో రెజ్లింగ్‌లో కాంస్యం సాధించిన సాక్షి మాలిక్ భారత పతాకధారిగా వ్యవహరించింది. 31వ ఒలింపిక్ క్రీడలు ఆగస్టు 5న ప్రారంభమయ్యాయి. మొత్తం 206 దేశాలు ఈ క్రీడల్లో పాల్గొన్నాయి. 32వ ఒలింపిక్ క్రీడలు 2020లో జపాన్ రాజధాని టోక్యోలో జరుగుతాయి.

పతకాల పట్టిక
దేశం
స్వర్ణం
రజతం
కాంస్యం
మొత్తం
అమెరికా
46
37
38
121
బ్రిటన్
27
23
17
67
చైనా
26
18
26
70
రష్యా
19
18
19
56
జర్మనీ
17
10
15
42
జపాన్
12
8
21
41
ఫ్రాన్స్
10
18
14
42
కొరియా
9
3
9
21
ఇటలీ
8
12
8
28
ఆస్ట్రేలియా
8
11
10
29
భారత్
0
1
1
2
(భారత్ స్థానం 67)

మ్యూనిక్ క్లబ్‌కు 11 ఏళ్ల ఒడిశా కుర్రాడు
భువనేశ్వర్‌లోని సబర్ షాహీ మురికివాడలో ఉండే చందన్ నాయక్ జర్మన్ జాతీయ చాంపియన్స్ బాయెర్న్ మ్యూనిక్‌లో రెండు నెలలపాటు శిక్షణ పొందే అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నాడు. 14 నుంచి 16 ఏళ్లలోపు వారిని పరీక్షించి ఈ శిక్షణ కార్యక్రమానికి ఎంపిక చేస్తారు. కోచ్ మహాపాత్ర కోరిక మేరకు చందన్‌ను పరీక్షించిన నిర్వాహకులు శిక్షణలో పాల్గొనే అవకాశం ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా 200 మందికి అన్ని వసతులు కల్పించి ప్రపంచ స్థాయి కోచ్‌లతో ఈ క్లబ్‌లో శిక్షణ ఇస్తారు.
దీపికా పల్లికల్‌కు స్క్వాష్ ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ భారత స్క్వాష్ క్రీడాకారిణి దీపికా పల్లికల్ ఆస్ట్రేలియా ఓపెన్ స్క్వాష్ టైటిల్‌ను గెలుచుకుంది. మెల్‌బోర్న్‌లో ఆగస్టు 12న జరిగిన ఫైనల్లో మయర్ హనీ(ఈజిప్ట్)పై పల్లికల్ విజయం సాధించింది.

పాక్ మాజీ క్రికెటర్ హనీఫ్ మహ్మద్ మృతిపాకిస్తాన్ క్రికెట్ టీం మాజీ కెప్టెన్ హనీఫ్ మహ్మద్ (81) ఆగస్టు 10న కరాచీలో మరణించాడు. 55 టెస్టులు ఆడిన హనీఫ్ 3915 పరుగులు చేశాడు. ఇందులో 12 సెంచరీలున్నాయి. 1954లో విండీస్‌పై 337 పరుగుల ఇన్నింగ్స్ టెస్టు చరిత్రలోనే సుదీర్ఘమైంది (970 నిమిషాలు)గా నిలిచింది.

10 వేల మీటర్ల మహిళల పరుగులో అయానాకు స్వర్ణంరియో ఒలింపిక్స్ అథ్లెటిక్స్ మహిళల 10 వేల మీటర్ల రేసులో ప్రపంచ రికార్డు బద్దలైంది. ఆగస్టు 12న జరిగిన రేసులో ఇథియోపియా అథ్లెట్ అల్మాజ్ అయానా 29 నిమిషాల 17.45 సెకన్లలో గమ్యానికి చేరుకొని స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. దీంతో 1993లో 29 నిమిషాల 31.78 సెకన్లతో వాంగ్ జున్‌జియా (చైనా) నెలకొల్పిన ప్రపంచ రికార్డును తిరగరాసింది. 

ఇదే విభాగంలో ప్రపంచ చాంపియన్ వివియన్ చెరియోట్ (కెన్యా-29ని:32.53 సెకన్లు) రజతం దక్కించుకోగా... డిఫెండింగ్ చాంపియన్ తిరునిష్ దిబాబా (ఇథియోపియా-29ని:42.56 సెకన్లు) కాంస్యపతకం దక్కింది.

10 వేల మీటర్ల పురుషుల పరుగులో ఫరాకు స్వర్ణం10 వేల మీటర్ల పురుషుల పరుగు పోటీల్లో 27 నిమిషాల 5.17 సెకన్లలో లక్ష్యం చేరి మొహమ్మద్ ఫరా స్వర్ణ పతకం సొంతం చేసుకున్నాడు. 33 ఏళ్ల ఫరా 2012 లండన్ ఒలింపిక్స్‌లో కూడా ఇదే ఈవెంట్‌లో పసిడి సాధించాడు. పాల్ తనుయ్ (కెన్యా-27 ని. 5.64 సె.) రజతం గెలుచుకోగా, తమీరత్ తోలా (ఇథియోపియా-27 ని. 6.26 సె.)కు కాంస్యం దక్కింది. 

ప్రపంచంలో వేగవంతమైన మహిళగా థాంప్సన్ప్రపంచంలో ఫాస్టెస్ట్ మహిళా అథ్లెట్‌గా జమైకాకు చెందిన ఎలైన్ థాంప్సన్ అవతరించింది. ఆగస్టు 14న జరిగిన 100 మీటర్ల పరుగులో 10.71 సెకన్లలో గమ్యాన్ని చేరుకొని స్వర్ణం సొంతం చేసుకుంది. 2008, 2012 ఒలింపిక్స్‌లో ఇదే ఈవెంట్‌లో స్వర్ణం గెలిచిన ఫ్రేజర్ (10.86 సె.) కాంస్యంతో సరి పెట్టుకోగా... టోరీ బోవీ (అమెరికా-10.83 సె.) రజత పతకం సాధించింది.

జిమ్నాస్ట్ దీపా కర్మాకర్‌కు నాలుగో స్థానంరియో ఒలింపిక్స్‌లో ఆగస్టు 14న జరిగిన మహిళల ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ వాల్ట్ ఫైనల్ ఈవెంట్‌లో దీపా కర్మాకర్ నాలుగో స్థానంలో నిలిచింది. సిమోన్ బైల్స్ (అమెరికా-15.966 పాయింట్లు) స్వర్ణం సొంతం చేసుకోగా... మరియా పాసెకా (రష్యా-15.253 పాయింట్లు) రజతం... గిలియా స్టింగ్‌రూబెర్ (స్విట్జర్లాండ్-15.216 పాయింట్లు) కాంస్య పతకం గెలిచారు. దీపా కర్మాకర్ 15.066 పాయింట్లతో నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది.

రిటైర్‌మెంట్ ప్రకటించిన ఫెల్ప్స్దిగ్గజ స్విమ్మర్ మైకెల్ ఫెల్ప్స్ తన కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. ఆగస్టు 14న జరిగిన 4ఁ100 మీటర్ల మెడ్లే రిలేలో మొదటి స్థానంలో నిలిచి స్వర్ణ పతకం సాధించాడు. దీంతో మొత్తం 23 ఒలింపిక్స్ స్వర్ణాలతో రికార్డు నెలకొల్పిన వెంటనే రిటైర్‌మెంట్ ప్రకటించాడు. 

పురుషుల డబుల్స్‌లో నాదల్ జోడీకి స్వర్ణంరియో ఒలింపిక్స్ టెన్నిస్‌లో రఫెల్ నాదల్ మార్క్ లోపేజ్‌తో కలిసి పురుషుల డబుల్స్ టైటిల్ సొంతం చేసుకున్నాడు. రొమేనియా జోడి మెర్జియా, హోరియాలతో జరిగిన ఫైనల్లో 2-6, 6-3, 6-4 తేడాతో విజయం సాధించారు. ఈ విజయంతో.. ఒలింపిక్స్‌లో సింగిల్స్, డబుల్స్ గెలిచిన నాలుగో టెన్నిస్ స్టార్‌గా (సెరెనా, వీనస్, నికోలస్ మస్సు) నిలిచాడు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో నాదల్ సింగిల్స్‌లో స్వర్ణం అందుకున్నాడు.

100 మీ. పరుగులో ఉసేన్ బోల్ట్ హ్యాట్రిక్ప్రపంచలోనే అత్యంత వేగవంతమైన మనిషి.. జమైకాకు చెందిన 29 ఏళ్ల ఉసేన్ బోల్ట్ ఒలింపిక్స్‌లో హ్యాట్రిక్ సాధించాడు. 100 మీ. పరుగులో 9.81 సెకన్లలో గమ్యాన్ని చేరడంతో వరుసగా మూడు ఒలింపిక్స్‌లో ఈ విభాగంలో బంగారం నెగ్గిన ఏకైక అథ్లెట్‌గా రికార్డు సృష్టించాడు. అమెరికా అథ్లెట్ జస్టిన్ గాట్లిన్ (9.89 సె.) రెండో స్థానంలో నిలవగా కెనడా అథ్లెట్ అండ్రీ డీ గ్రాసే (9.91 సె.) కాంస్యం సాధించాడు.

బోల్ట్ రికార్డులు
  • 2008, 2012లో 100 మీ. స్వర్ణాలు సాధించిన బోల్ట్ ఆ ఒలింపిక్స్‌లో 200 మీ. 4x100 మీ. రిలేలో కూడా బంగారు పతకాలు సాధించాడు.
  • 100 మీ., 200 మీ. పరుగు పందేల్లో ఇప్పటికీ ప్రపంచ రికార్డు బోల్ట్ (2009లో నెలకొల్పాడు) పేరిటే ఉంది.
  • 2008 నుంచి ఇప్పటివరకు జరిగిన ప్రతి ఒలింపిక్స్, ప్రతి ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనూ 100 మీ., 200 మీ. పరుగులో విజేత బోల్టే. (2011 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 100 మీ. మినహా).

గోల్ఫ్ విజేత రోస్..112 ఏళ్ల తర్వాత తొలిసారి ఒలింపిక్స్‌లో చోటు సంపాదించిన గోల్ఫ్ క్రీడాంశంలో బ్రిటన్‌కు చెందిన జస్టిన్ రోస్ విజేతగా నిలిచాడు. హెన్రిక్ స్టెన్సన్ (స్వీడన్), మాట్ కుచర్ (అమెరికా) వరుసగా రజతం, కాంస్యం సాధించారు. భారత ఆటగాళ్లు శివ్ చౌరాసియా 50వ స్థానం, అనిర్బన్ లాహిరి 57వ స్థానానికే పరిమితమయ్యారు. 

పురుషుల 400 మీటర్లలో నికెర్క్ ప్రపంచ రికార్డుపురుషుల 400 మీటర్ల పరుగు పందెంలో దక్షిణాఫ్రికా అథ్లెట్ వేడ్ వాన్ నికెర్క్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. 43.03 సెకన్లలో గమ్యానికి చేరుకున్న నికెర్క్... 1999లో మైకేల్ జాన్సన్ (అమెరికా-43.18 సెకన్లు) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. డిఫెండింగ్ చాంపియన్ కిరానీ జేమ్స్ (43.76 సెకన్లు) రజతంతో సరిపెట్టుకోగా... మాజీ విజేత లాషాన్ మెరిట్ (43.85 సెకన్లు) కాంస్యాన్ని దక్కించుకున్నాడు.

800 మీటర్ల పరుగులో రెండోసారి స్వర్ణం నెగ్గిన రుడిషాకెన్యా స్టార్ అథ్లెట్ డేవిడ్ రుడిషా రియో ఒలింపిక్స్ పురుషుల 800 మీటర్ల విభాగంలో వరుసగా రెండోసారి స్వర్ణం సాదించాడు. ఆగస్టు 16న జరిగిన ఫైనల్ రేసులో రుడిషా ఒక నిమిషం 42.15 సెకన్లలో గమ్యానికి చేరుకొని అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ క్రమంలో 1964లో పీటర్ స్నెల్ (న్యూజిలాండ్) తర్వాత వరుసగా రెండు ఒలింపిక్స్ క్రీడల్లో 800 మీటర్ల విభాగంలో స్వర్ణాలు నెగ్గిన తొలి అథ్లెట్‌గా రుడిషా గుర్తింపు పొందాడు. 

2012 లండన్ ఒలింపిక్స్ 1.40.91 నిమిషాల్లో రేసు పూర్తి చేసి రుడిషా ప్రపంచ రికార్డు సృష్టించాడు. కెరీర్‌లో ఏడుసార్లు ఈ పరుగును 1.42 నిమిషాల్లో పూర్తి చేసిన ఒకే ఒక్క అథ్లెట్ రుడిషా.

రియో డి జనీరోలో ప్రారంభమైన ఒలింపిక్స్బ్రెజిల్‌లోని రియో డి జనీరోలో ఆగస్టు 6న 31వ ఒలింపిక్ క్రీడలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 2004 ఏథెన్స్ ఒలింపిక్స్ మారథాన్‌లో కాంస్యం సాధించిన వాండర్లీ డి లిమా ఒలింపిక్స్ జ్యోతిని వెలిగించగా, బ్రెజిల్ తాత్కాలిక అధ్యక్షుడు మైకేల్ టెమెర్ పోటీలు ప్రారంభమవుతున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అధ్యక్షుడు థామస్ బాచ్, ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్ కి మూన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన మార్చ్‌లో పాల్గొన్న భారత క్రీడా బృందానికి షూటర్ అభినవ్ బింద్రా నేతృత్వం వహించాడు. ఈ క్రీడల్లో 206 దేశాలకు చెందిన 10,500 మంది క్రీడాకారులు 42 క్రీడాంశాల్లో 2,499 పతకాల కోసం పోటీ పడుతున్నారు. భారత్ నుంచి 118 మంది పాల్గొంటున్నారు. అమెరికాకు చెందిన వర్జీనియా థ్రాషెర్ తొలి స్వర్ణ పతకాన్ని సాధించింది.

ఆర్చరీలో కిమ్ వూజిన్ ప్రపంచ రికార్డురియో ఒలింపిక్స్ ఆర్చరీలో పురుషుల రికర్వ్ వ్యక్తిగత ర్యాంకింగ్ రౌండ్‌లో ప్రపంచ నంబర్‌వన్ కిమ్ వూజిన్ (దక్షిణ కొరియా) ప్రపంచ, ఒలింపిక్ రికార్డు నెలకొల్పాడు. అందుబాటులో ఉన్న 720 పాయింట్లకు కిమ్ వూజిన్ 700 పాయింట్లు సాధించి కొత్త ప్రపంచ, ఒలింపిక్ రికార్డును సృష్టించాడు. దీంతో 2012 లండన్ ఒలింపిక్స్‌లో 699 పాయింట్లతో ఇమ్ డాంగ్ హున్ (కొరియా) నెలకొల్పిన ప్రపంచ రికార్డు బద్దలైంది.

హంగేరి స్విమ్మర్ కటింకా హోసజు ప్రపంచ రికార్డు రియో ఒలిపింక్స్‌లో హంగేరి మహిళా స్విమ్మర్ కటింకా హోసజు స్వర్ణ పతకాన్ని సాధించింది. ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో తొమ్మిది స్వర్ణాలు గెలిచిన కటింకా గత మూడు ఒలింపిక్స్‌లలో బరిలోకి దిగినా పతకాలేమీ సాధించలేదు. అయితే నాలుగో ఒలింపిక్స్‌లో మాత్రం ఆమె ప్రపంచ రికార్డు సృష్టించడంతోపాటు పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. 400 మీటర్ల వ్యక్తిగత మెడ్లే విభాగంలో కటింకా 4 నిమిషాల 26.36 సెకన్లలో లక్ష్యానికి చేరి... 4 నిమిషాల 28.43 సెకన్లతో యి షివెన్ (చైనా) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది.

అభిజిత్, తానియాలకు కామన్వెల్త్ టైటిల్స్కామన్వెల్త్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారులు ఓపెన్, మహిళా విభాగాల్లో స్వర్ణ, రజత, కాంస్య పతకాలను గెలుచుకున్నారు. కొలంబోలో ఆగస్టు 7న ముగిసిన టోర్నమెంట్‌లో ఓపెన్ కేటగిరీలో అభిజిత్ గుప్తా విజేతగా నిలవగా, ఎస్.ఎల్.నారాయణ్, దీపన్ చక్రవర్తిలు వరుసగా రజత, కాంస్య పతకాలను సాధించారు. మహిళా విభాగంలో తానియా సచ్‌దేవ్ అగ్రస్థానంలో నిలిచి తొలిసారి స్వర్ణం సాధించగా, మెరీ ఆన్ గోమ్స్ రజతం, కిరణ్ మనీషా మొహంతి కాంస్య పతకాలను దక్కించుకున్నారు.

No comments:

Post a Comment