వార్తల్లో వ్యక్తులు ఏప్రిల్ 2012
19- 25 ఏప్రిల్ 2012 వార్తల్లో వ్యక్తులు
టైమ్ ప్రభావశీలుర జాబితాలో మమతప్రముఖ ఆంగ్ల పత్రిక టైమ్ ప్రచురించిన 2012 సంవత్సరపు 100 మంది ప్రభావశీలుర జాబితాలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి చోటు దక్కింది. ఏప్రిల్ 18న విడుదల చేసిన ఈ జాబితాలో మమతతోపాటు భారత్ నుంచి ప్రముఖ న్యాయవాది అంజలీ గోపాలన్(స్వలింగ సంపర్కుల హక్కుల కోసం కృషి చేస్తున్నారు, నాజ్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు)కు కూడా చోటు దక్కింది. బాస్కెట్ బాల్ క్రీడాకారుడు జెరిమిలిన్ (అమెరికా), అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, అపర కుబేరుడు వారన్ బఫెట్, పాకిస్థాన్‌కు చెందిన ఆస్కార్ విజేత షర్మీన్ ఒబెయిద్ చినాయ్, అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్, న్యూయార్క్‌లో స్థిరపడ్డ భారత సంతతి ప్రాసిక్యూటర్ ప్రీత్ భరారా, ఆపిల్ కంపెనీ సీఈవో టిమ్ కుక్, మయన్మార్ అధ్యక్షుడు యు థియన్‌సీన్, అమెరికా రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి మిట్ రోమ్నిలు ఈ జాబితాలోని ఇతర ప్రముఖులు.
భారత శాస్త్రవేత్తలకు రాయల్ ఫెలోషిప్బ్రిటన్‌లోని ప్రతిష్టాత్మక రాయల్ సొసైటీ 2012 ఫెలోషిప్‌నకు ఆరుగురు భారత సంతతి శాస్త్రవేత్తలు ఎంపికయ్యారు. మొత్తం మీద ఏడాదికి 44 మందికి ఈ గౌరవం దక్కింది.
ఫెలోషిప్ కోసం ఎంపికైన భారతీయులు.. తేజీందర్ సింగ్ వర్దీ (విశ్వ ఆవిర్భావం నాటి పరిస్థితులను కృత్రిమంగా సృష్టించేందుకు చేపట్టిన మహా ప్రయోగం లార్జ్ హ్యాడ్రన్ కొల్లాయిడర్ డిజైనింగ్‌లో పాలు పంచుకున్న ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ ఫిజిక్స్ ప్రొఫెసర్); కృష్ణ స్వామి విజయరాఘవన్ (బెంగళూరులోని నేషనల్ సెంటర్ ఫర్ బయాలజికల్ సెన్సైస్ డెరైక్టర్); చంద్రశేఖర్ బాల్ చంద్ర ఖరే (గణితం, కాలిఫోర్నియా యూనివర్సిటీ); శంకర్ బాల సుబ్రహ్మణ్యం (న్యూక్లిక్ యాసిడ్స్‌పై పరిశోధన, కేంబ్రిడ్జ్ ప్రొఫెసర్); వీరిందర్ కుమార్ అగర్వాల్ (వైలిడ్ కెమిస్ట్రీ, బ్రిస్టల్ యూనివర్సిటీ); ప్రొఫెసర్ మత్తుకుమల్లి విద్యాసాగర్ (యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్).

విజ్ఞాన శాస్త్ర రంగంలో విశేష కృషి చేసిన శాస్త్రవేత్తలను గుర్తించి, ప్రోత్సహించే ఉద్దేశంతో 1660లో రాయల్ సొసైటీని స్థాపించగా, ఇప్పటిదాకా 1,500 మంది ఫెలోషిప్‌లు పొందారు. వీరిలో ఆల్బర్ట్ ఐన్‌స్టీన్,స్టీఫెన్ హాకింగ్, ఐజాక్ న్యూటన్, టిమ్ బెర్నర్స్ లీ వంటి ప్రఖ్యాత శాస్త్రవేత్తలు,80మందికి పైగా నోబెల్ విజేతలు ఉండడం విశేషం.
వెంకట్రామన్ పేరిట పోస్టల్ స్టాంప్ విడుదలభారత రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ఏప్రిల్ 18న న్యూఢిల్లీలో.. మాజీ రాష్ట్రపతి దివంగత ఆర్. వెంకట్రామన్ గౌరవార్థం పోస్టల్ స్టాంపును విడుదల చేశారు. ఎనిమిదో రాష్ట్రపతిగా వెంకట్రామన్ 1987-92 మధ్య బాధ్యతలు నిర్వహించారు. ఈ సమయంలో నలుగురు ప్రధానమంత్రులతో కలిసి పని చేశారు.
ఐరాస ప్రత్యేక రాయబారిగా ఏంజెలీనాఐక్యరాజ్యసమితి శరణార్థుల హైకమిషన్ (యుఎన్‌హెచ్‌సీఆర్) ప్రత్యేక రాయబారిగా హాలీవుడ్ ప్రముఖ నటి ఏంజెలీనా జోలీ నియమితులయ్యారు. యుఎన్‌హెచ్‌సీఆర్‌కు ప్రత్యేక రాయబారిని నియమించడం ఇదే తొలిసారి.
No comments:
Post a Comment