AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Sunday, 26 November 2017

క్రీడలు డిసెంబరు 2016

క్రీడలు డిసెంబరు 2016
ఐసీసీ మేటి క్రికెటర్‌గా రవిచంద్రన్ అశ్విన్2016 సంవత్సరానికి ఉత్తమ క్రికెటర్స్ అవార్డులను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) డిసెంబర్ 22న దుబాయ్‌లో ప్రకటించింది. ఇందులో రవిచంద్రన్ అశ్విన్ ఒకే ఏడాది ఐసీసీ మేటి క్రికెటర్, ఐసీసీ మేటి టెస్ట్ క్రికెటర్ అవార్డులను దక్కించుకున్నాడు. రాహుల్ ద్రవిడ్ (2004) తర్వాత ఈ ఘనత సాధించిన క్రికెటర్‌గా అశ్విన్ నిలిచాడు
ఐసీసీ అవార్డులు - విజేతలు
మేటి క్రికెటర్‌కు ఇచ్చే సర్ గ్యారీఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ:
 రవిచంద్రన్ అశ్విన్. గతంలో భారత్ నుంచి రాహుల్ ద్రావిడ్ (2004), సచిన్ (2010) మాత్రమే ఈ ట్రోఫీని అందుకున్నారు.
ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్: రవిచంద్రన్ అశ్విన్
వన్డే క్రికెటర్: క్వింటన్ డికాక్ (దక్షిణాఫ్రికా)
మహిళల వన్డే క్రికెటర్: సుజీ బేట్స్ (న్యూజిలాండ్)
మహిళల టీ20 క్రికెటర్: సుజీ బేట్స్ (న్యూజిలాండ్)
టీ20 ఉత్తమ ప్రదర్శన: కార్లోస్ బ్రాత్‌వెట్ (10 బంతుల్లో 34 నాటౌట్)
వర్ధమాన క్రికెటర్: ముస్తాఫిజుర్ రెహ్మాన్ (బంగ్లాదేశ్)
అంపైర్: మరాయిస్ ఎరాస్మస్ (దక్షిణాఫ్రికా).

డేవిస్ కప్ జట్టు నాన్ ప్లేయింగ్ కెప్టెన్‌గా భూపతిభారత టెన్నిస్ స్టార్ మహేశ్ భూపతి 2017లో భారత డేవిస్ కప్ జట్టు నాన్ ప్లేయింగ్ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నాడు. 42 ఏళ్ల మహేశ్ భూపతి 1995లో క్రొయేషియాతో జరిగిన మ్యాచ్‌లో అరంగేట్రం చేశాడు. ప్రొఫెషనల్ ప్లేయర్‌గా మిక్స్‌డ్ డబుల్స్‌లో ఎనిమిది, పురుషుల డబుల్స్‌లో నాలుగు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించాడు. 

పంకజ్ అద్వానీకి 6-రెడ్ స్నూకర్ టైటిల్ భారత క్యూ స్పోర్‌‌ట్స (స్నూకర్, బిలియర్డ్స్) స్టార్ పంకజ్ అద్వానీ 6-రెడ్ స్నూకర్ జాతీయ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. డిసెంబర్ 23న జరిగిన ఫైనల్లో పంకజ్ కర్ణాటకకే చెందిన ఇష్‌ప్రీత్ చద్దాపై గెలుపొందాడు. ఈ విజయంతో రాష్ట్ర, జాతీయ, ప్రపంచ స్థాయిలో 6-రెడ్ స్నూకర్ టైటిల్స్ నెగ్గిన ఏకైక ప్లేయర్‌గా పంకజ్ గుర్తింపు పొందాడు. పంకజ్ ఇప్పటికే పలు ఫార్మాట్‌లలో 16 సార్లు విజయం సాధించి ప్రపంచ చాంపియన్‌గా నిలిచాడు.

శివ కేశవన్‌కు ఆసియా ల్యూజ్ చాంపియన్‌షిప్ టైటిల్భారత్‌కు చెందిన వింటర్ ఒలింపియన్ శివ కేశవన్ ఆసియా ల్యూజ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నాడు. గంటకు 130.4 కి.మీ. వేగంతో ఒక నిమిషం 39.962 సెకన్లలో గమ్యానికి చేరుకొని అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. తనాకా షోహీ (జపాన్-1ని:44.874 సెకన్లు) రజత పతకాన్ని సాధించగా, లియెన్ తె ఆన్ (చైనీస్ తైపీ-1ని:45.120 సెకన్లు) కాంస్య పతకాన్ని సాధించాడు. 35 ఏళ్ల శివ కేశవన్ ఇప్పటివరకు వరుసగా ఐదు వింటర్ ఒలింపిక్స్ క్రీడల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు.

ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో ప్రపంచ రికార్డు సృష్టించిన సమిత్ గోహెల్ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో గుజరాత్ ఆటగాడు సమిత్ గోహెల్ అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఒడిషాతో డిసెంబర్ 27న జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో సమిత్ 359 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. 1899లో సోమర్సెట్‌తో జరిగిన మ్యాచ్‌లో సర్రే ఆటగాడు బాబీ అబెల్ అజేయంగా సాధించిన 357 పరుగులు రికార్డును అధిగమించాడు. దీని కోసం సమిత్ మొత్తం 723 బంతులు ఎదుర్కొన్నాడు.

రంజీ ట్రోఫీలో నాలుగో అత్యధిక స్కోరు సాధించిన ఆటగాడిగా సమిత్ మహారాష్ర్టకు చెందిన విజయ్ మర్చంట్ సరసన నిలిచాడు. బీబీ నింబాల్కర్ (మహారాష్ట్ర-443 నాటౌట్), సంజయ్ మంజ్రేకర్ (ముంబై-377), ఎంవీ శ్రీధర్ (హైదరాబాద్-366), విజయ్ మర్చంట్ (మహారాష్ట్ర-359 నాటౌట్) మొదటి నాలుగు స్థానాల్లో ఉన్నారు.

ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించినవారు
Score
Batsman
Opponent
Venue
Season
359*
Samit Gohel (Gujarat)
Odisha
Jaipur
2016-17
357*
Bobby Abel (Surrey)
Somerset
The Oval
1899
318*
WG Grace (Gloucestershire)
Yorkshire
Cheltenham
1876
305*
Bill Ashdown (Kent)
Derbyshire
Dover
1935
270*
Chesney Hughes (Derbyshire)
Yorkshire
Leeds
2013
265*
Upul Tharanga (Ruhuna)
Basnahira South
Colombo
2008-09
260*
Dheeraj Jadhav (India A)
Kenya
Nairobi
2004-05

సీఏ వన్డే జట్టు కెప్టెన్‌గా విరాట్ కోహ్లిక్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ప్రకటించిన అత్యుత్తమ ఆటగాళ్ల జట్టుకు విరాట్ కోహ్లి కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈ జట్టులోకి భారత పేస్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా కూడా ఎంపికయ్యాడు. ఇటీవల కోహ్లి ఐసీసీ వన్డే జట్టుకు కెప్టెన్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే. కోహ్లి 2016లో ఆడిన 10 వన్డేలలో ఎనిమిది సార్లు 45 అంతకుంటే ఎక్కువ పరుగులు సాధించాడు. ఇందులో వరుసగా రెండు సెంచరీలున్నాయి. బుమ్రా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుట్టిన మొదటి ఏడాదే ఎనిమిది వన్డేల్లో 17 వికెట్లు తీశాడు.

సీఏ వన్డే జట్టు: కోహ్లి (కెప్టెన్), బుమ్రా (భారత్), స్మిత్, వార్నర్, మిషెల్ మార్ష్, హేస్టింగ్‌‌స, స్టార్క్ (ఆస్ట్రేలియా), డి కాక్ (కీపర్), తాహిర్ (దక్షిణాఫ్రికా), బట్లర్ (ఇంగ్లండ్), బాబర్ ఆజమ్ (పాకిస్తాన్). 

భారత్‌కు అండర్-19 ఆసియా కప్ఆసియా కప్ అండర్-19 క్రికెట్ టోర్నమెంట్‌లో భారత జట్టు వరుసగా మూడోసారి విజేతగా నిలి చింది. డిసెంబర్ 23న శ్రీలంకలోని ప్రేమదాస స్టేడియంలో జరిగిన ఫైనల్లో భారత్ 34 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించింది. 

భారత కెప్టెన్ అభిషేక్ శర్మ (4/37) ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలవగా, టోర్నీలో 5 మ్యాచ్‌లలో కలిపి 283 పరుగులు చేసిన హిమాన్షు రాణా ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డును గెలుచుకున్నాడు.
మహిళల టీమ్ ఆఫ్ ది ఇయర్‌లో స్మృతి మందన
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) డిసెంబర్ 14న ప్రకటించిన ‘మహిళల టీమ్ ఆఫ్ ద ఇయర్’లో భారత్ నుంచి స్మృతి మందనకు చోటు లభించింది. 2015 సెప్టెంబర్ నుంచి 16 సెప్టెంబర్ వరకు చూపిన ప్రదర్శన ఆధారంగా ఐసీసీ మహిళల జట్టును ఎంపిక చేశారు. మహారాష్ట్రకు చెందిన స్మృతి ఈ కాలంలో ఐదు వన్డేలు ఆడి 264 పరుగులు చేయడంతో పాటు 10 టి-20 మ్యాచ్‌ల్లో 183 పరుగులు చేసింది. ఈ జట్టుకు విండీస్ క్రికెటర్ స్టెఫానీ టేలర్ కెప్టెన్‌గా ఎంపికైంది.
ఐసీసీ టీమ్ ఆఫ్ ది ఇయర్: స్టెఫానీ టేలర్ (కెప్టెన్), డియాండ్ర డాటిన్ (వెస్టిండీస్), స్మృతి మంధన (భారత్), సుజీ బేట్స్, రాచెల్ ప్రీస్ట్ (వికెట్ కీపర్), లీ కాస్పెరెక్ (న్యూజిలాండ్), మెగ్ లానింగ్, ఎలిస్ పెర్రీ (ఆస్ట్రేలియా), హీదెర్ నైట్, అన్య షబ్స్రోల్ (ఇంగ్లండ్), సూన్ లూస్ (దక్షిణాఫ్రికా), 12వ ప్లేయర్: కిమ్ గార్త్ (ఐర్లాండ్).
ప్రొ రెజ్లింగ్ వేలంలో భజరంగ్‌కు రూ.38 లక్షలు
ప్రొ రెజ్లింగ్ లీగ్ (పీడబ్ల్యూఎల్) రెండో సీజన్‌లో భారత ఆటగాడు భజరంగ్ పూనియాను రూ.38 లక్షలకు ఢిల్లీ జట్టు కోనుగోలు చేసింది. డిసెంబర్ 16న జరిగిన ఈ వేలంలో రియో ఒలింపిక్ చాంపియన్ వ్లాదిమిర్ ఖించెగష్‌విలీ (జార్జియా)కు అత్యధికంగా రేటు (రూ.48 లక్షలు) పలికింది. ఇతనితోపాటు లండన్ ఒలింపిక్ చాంపియన్ తొగ్రుల్ అస్గరోవ్ (అజర్‌బైజాన్)ను రూ.35 లక్షలు వెచ్చించి పంజాబ్ జట్టు కోనుగోలు చేసింది.
కోల్‌కతాకు ఇండియన్ సూపర్ లీగ్ టైటిల్
ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) మూడో సీజన్ టైటిల్‌ను అట్లెటికో డి కోల్‌కతా రెండోసారి దక్కించుకుంది. డిసెంబర్ 18న కొచ్చిలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన ఫైనల్లో కేరళ బ్లాస్టర్స్ ఎఫ్‌సీపై 4-3 తేడాతో పెనాల్టీ షూటౌట్ ద్వారా నెగ్గింది. చాంపియన్‌గా నిలిచిన కోల్‌కతాకు రూ.8 కోట్లు, రన్నరప్ కేరళకు రూ.4 కోట్లు ప్రైజ్‌మనీ దక్కింది.
భారత్‌కు జూనియర్ హాకీ ప్రపంచకప్ టైటిల్
జూనియర్ అండర్-21 హాకీ ప్రపంచకప్ టైటిల్‌ను భారత్ సొంతం చేసుకుంది. డిసెంబర్ 18న లక్నోలోని మేజర్ ధ్యాన్‌చంద్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో భారత్ 2-1 గోల్స్ తేడాతో బెల్జియంపై గెలిచింది. 37 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఈవెంట్‌లో భారత జట్టు తొలిసారి 2001లో జూనియర్ ప్రపంచకప్‌ను సాధించింది. తాజా విజయంతో జర్మనీ తర్వాత ఈ టైటిల్‌ను రెండుసార్లు గెలిచిన జట్టుగా భారత్ నిలిచింది. 
ట్రిపుల్ సెంచరీతో కరుణ్ నాయర్ రికార్డు
ఇంగ్లండ్‌తో జరుగుతున్న చివరి టెస్టులో భారత యువ క్రికెటర్ కరుణ్ నాయర్ ట్రిపుల్ సెంచరీసాధించాడు. చెన్నైలో డిసెంబర్ 19న జరిగిన టెస్టులో నాయర్ 381 బంతుల్లో 303 పరుగులు చేసి (32 ఫోర్లు, 4 సిక్సర్లు) నాటౌట్‌గా నిలిచాడు. తద్వారా అతిపిన్న వయస్సులో ట్రిపుల్ సెంచరీ చేసిన భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అంతేకాకుండా తొలి సెంచరీనే ట్రిపుల్ సెంచరీగా మలుచుకున్న తొలి భారత ఆటగాడు కూడా నాయరే. భారత్ నుంచి ట్రిపుల్ సెంచరీ చేసిన మొదటి ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్. సెహ్వాగ్ రెండుసార్లు ట్రిపుల్ సెంచరీ చేశాడు. 
ముర్రేకు బీబీసీ స్పోర్ట్స్‌ పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు
బ్రిటన్ టెన్నిస్ స్టార్ అండీ ముర్రే 2016కు గాను బీబీసీ ఉత్తమ క్రీడాకారుడు (స్పోర్ట్స్‌ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్) అవార్డును గెలుచుకున్నాడు. ముర్రే 2016లో మొదటి ర్యాంక్‌ను అందుకోవడమే కాకుండా ఒలింపిక్ స్వర్ణం కూడా సాధించాడు. 2013, 15లో కూడా అవార్డును పొందిన ముర్రే మూడోసారి దీనిని అందుకున్నాడు. ఈ అవార్డుల్లో స్విమ్మర్ మైకేల్ ఫెల్ఫ్స్‌కు జీవితకాల సాఫల్య పురస్కారం, అమెరికా జిమ్నాస్ట్ సైమన్ బైల్స్‌కు విదేశీ ఉత్తమ క్రీడాకారిణి అవార్డులు లభించారుు. 
ప్రొఫెషనల్ బాక్సర్‌గా మారిన సరితా దేవి
రెండుసార్లు ఆసియా చాంపియన్‌గా నిలిచిన మహిళా బాక్సర్ సరితా దేవి ప్రొఫెషనల్ బాక్సర్‌గా మారిన తొలి భారతీయురాలిగా గుర్తింపు పొందింది. ఈ మేరకు భారత్‌లో ప్రొఫెషనల్ బాక్సింగ్‌కు లెసైన్స్ కలిగిన భారత బాక్సింగ్ కౌన్సిల్ (ఐబీసీ)తో ఆమె రెండేళ్ల కాలానికి ఒప్పందం చేసుకుంది.

కెప్టెన్‌గా అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన కోహ్లి
భారత టెస్ట్ క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి టీమిండియా కెప్టెన్‌గా అత్యధిక వ్యక్తిగత పరుగులు (235) చేసిన ఆటగాడిగా రికార్డుకెక్కాడు. తాజాగా ముంబైలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులో ఈ ఘనత సాధించాడు. అంతకు ముందు ధోనీ ఆస్ట్రేలియాపై 2013లో 224 పరుగులు, 1999లో సచిన్ న్యూజిలాండ్‌పై 217 పరుగులు, 1978లో సునీల్ గవాస్కర్ వెస్టిండీస్‌పై 205 పరుగులు చేశారు.
సింగపూర్ స్లామర్స్‌కు ప్రీమియర్ టెన్నిస్ లీగ్ టైటిల్
అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ 2016 టైటిల్ విజేతగా సింగపూర్ స్లామర్స్ నిలిచింది. డిసెంబర్ 11న హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో సింగపూర్ స్లామర్స్ జట్టు 30-14తో ఇండియన్ ఏసెస్‌ను ఓడించి చాంపియన్‌గా నిలిచింది. గతేడాది కూడా ఇండియన్ ఏసెస్ జట్టుపైనే స్లామర్స్ విజయం సాధించింది. దీంతో సింగపూర్ స్లామర్స్ వరుసగా రెండు టైటిల్స్ నెగ్గగా ఇండియన్ ఏసెస్ రెండు సార్లు రన్నరప్‌గా నిలిచింది. 
పురుషుల లెజెండ్‌‌స సింగిల్స్ మ్యాచ్‌లో కార్లోస్ మోయా 6-4 తో ఫిలిప్పోసిస్‌ను ఓడించి స్లామర్స్‌కు విజయం అందించాడు. మహిళల సింగిల్స్‌లో సానియా మీర్జా ను కికి బెర్‌టెన్‌‌స 6-3తో ఓడించింది.
టెస్టు సిరీస్ భారత్ కైవసం
ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్‌ను టీమిండియా 3-0తో కైవసం చేసుకుంది. డిసెంబర్ 12న ముగిసిన నాలుగో టెస్టులో ఇన్నింగ్‌‌స తేడాతో ఇంగ్లండ్ జట్టును ఓడించింది. ఈ విజయంతో 2012లో కోల్పోయిన ఆంథోనీ డి మెల్లో ట్రోఫీని భారత్ తిరిగి కై వసం చేసుకుంది. అశ్విన్ తన కెరీర్‌లో 24సార్లు ఇన్నింగ్‌‌సలో ఐదు వికెట్ల ఫీట్‌ను పూర్తి చేశాడు.
పంకజ్‌కు 16వ ప్రపంచ టైటిల్
భారత స్టార్ ప్లేయర్ పంకజ్ అద్వానీ క్యూ స్పోర్‌‌ట్స (బిలియర్డ్స్, స్నూకర్)లో 16వ ప్రపంచ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. బెంగళూరులో డిసెంబర్ 12న జరిగిన ప్రపంచ బిలియర్డ్స్ 150 అప్ ఫార్మాట్ ఫైనల్లో పీటర్ గిల్‌క్రిస్ట్ (సింగపూర్)ను ఓడించాడు. గతంలో పంకజ్ బిలియర్డ్స్ టైమ్ ఫార్మాట్‌లో ఏడుసార్లు, పాయింట్స్ ఫార్మాట్‌లో మూడుసార్లు, టీమ్ ఫార్మాట్‌లో ఒకసారి, స్నూకర్‌లో రెండుసార్లు, సిక్స్ రెడ్ స్నూకర్‌లో రెండుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచాడు. 
సింధుకు మోస్ట్ ఇంప్రూవ్డ్ ప్లేయర్ అవార్డు
2016లో నిలకడగా రాణించినందుకు గాను పి.వి.సింధుకు ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) ‘మోస్ట్ ఇంప్రూవ్‌‌డ ప్లేయర్’ (చాలా మెరుగైన క్రీడాకారిణి) అవార్డు లభించింది. దుబాయ్‌లో డిసెంబర్ 13న జరిగిన కార్యక్రమంలో యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడు దావూద్ అల్ హజ్రి చేతుల మీదుగా సింధు ఈ అవార్డును అందుకుంది. 
రోనాల్డోకు ఉత్తమ ఫుట్‌బాలర్ అవార్డు
పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో 2016 ఉత్తమ ఫుట్‌బాలర్ అవార్డును సొంతం చేసుకున్నాడు. తద్వారా నాలుగోసారి ఉత్తమ ఫుట్‌బాల్ అవార్డు (బాలన్ డీ ఓర్ అవార్డును) ను పొందాడు.
ఫిఫా 1991 నుంచి ఉత్తమ ఫుట్‌బాలర్ అవార్డులను ప్రకటిస్తోంది. అయితే 2010లో ఫ్రాన్‌‌స ఫుట్‌బాల్ సంఘం ప్రకటించే ‘బాలన్ డీ ఓర్’, ఫిఫా ఉత్తమ ఫుట్‌బాలర్ అవార్డులను కలిపి కేవలం బాలన్ డీ ఓర్ ట్రోఫీని మాత్రమే ఇస్తున్నారు. 2008, 13, 14, 16ల్లో (నాలుగు సార్లు) రొనాల్డో 2009, 10, 11, 12, 15లో (ఐదుసార్లు) మెస్సీ ఉత్తమ ఫుట్‌బాలర్స్ అవార్డులను అందుకున్నారు.


భారత మహిళల జట్టుకు ఆసియా టి-20 కప్
ఆసియా కప్ మహిళల టి-20 టోర్నమెంట్‌లో భారత్ వరుసగా ఆరోసారి చాంపియన్‌గా నిలిచింది. బ్యాంకాక్‌లో డిసెంబర్ 4న జరిగిన ఫైనల్లో భారత్ 17 పరుగుల తేడాతో పాకిస్తాన్‌పై విజయం సాధించింది. 2004లో టోర్నీ ప్రారంభమైనప్పటి నుంచి అన్నిసార్లు భారతే విజేతగా నిలిచింది. టోర్నీ మొత్తం నిలకడగా రాణించిన మిథాలీ రాజ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ పురస్కారాలు దక్కాయి. 

ముకేశ్‌కుమార్‌కు గోల్ఫ్ ఆసియా టూర్ టైటిల్పానాసోనిక్ ఓపెన్ గోల్ఫ్ ఆసియా టూర్ టైటిల్‌ను భారత్‌కు చెందిన ముకేశ్ కుమార్ న్యూఢిల్లీలో డిసెంబర్ 4న గెలుచుకున్నాడు.దీంతో టైటిల్ గెలిచిన పెద్ద వయస్కుడి (51 ఏళ్లు)గా గుర్తింపు పొందాడు. భారత్‌కే చెందిన జ్యోతి రణధావా, రషీద్‌ఖాన్ రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.

2016 ఉత్తమ అథ్లెట్లు బోల్ట్, అయానా వరుసగా మూడు ఒలింపిక్స్‌లోనూ మూడేసి స్వర్ణాలు సాధించిన జమైకా స్టార్ ఉసేన్ బోల్ట్ ఆరోసారీ ‘ప్రపంచ ఉత్తమ అథ్లెట్’ అవార్డు అందుకున్నాడు. 30 ఏళ్ల బోల్ట్ ఈ అవార్డును గతంలో 2008, 2009, 2011, 2012, 2013లలో అందుకున్నాడు. బీజింగ్, లండన్, రియో ఒలింపిక్స్‌లో మూడు విభాగాల్లో (100, 200, 4×100 మీటర్ల రిలే) స్వర్ణ పతకాలు నెగ్గాడు.

రియో ఒలింపిక్స్‌లో 10 వేల మీటర్ల విభాగంలో ప్రపంచ రికార్డు సృష్టించిన అయానా అల్మాజ్ (ఇథియోపియా) మహిళల విభాగంలో ప్రపంచ ఉత్తమ అథ్లెట్ అవార్డునందుకుంది. 

కార్ల్‌సెన్‌కు చెస్ చాంపియన్‌షిప్ప్రపంచ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్‌సెన్ (నార్వే) 2016 సంవత్సరానికి గాను ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్నాడు. దీంతో వరుసగా మూడు సార్లు చాంపియన్‌షిప్‌ను నెగ్గిన క్రీడాకారుడిగా రికార్డు సృష్టించాడు.

డిసెంబర్ 1న జరిగిన పోరులో కార్ల్‌సెన్, రష్యాకు చెందిన సెర్గీ కర్జాకిన్‌పై ‘టైబ్రేకర్’లో విజయం సాధించాడు. కార్ల్‌సెన్ 2013, 2014లలో విశ్వనాథన్ ఆనంద్‌ను ఓడించి ప్రపంచ చాంపియన్‌గా నిలిచాడు. 

13 ఏళ్ల 4 నెలల వయసులో గ్రాండ్‌మాస్టర్‌గా మారిన కార్ల్‌సన్ 2010లో తొలి సారి 19 ఏళ్ల వయసులోనే వరల్డ్ నంబర్‌వన్‌గా నిలిచాడు. 2013లో ప్రముఖ కాస్మోపాలిటన్ మ్యాగజైన్ కార్ల్‌సన్‌ను ‘సెక్సీయెస్ట్ మెన్’లలో ఒకరిగా గుర్తించింది.

సచిన్ ఆత్మకథ ‘ప్లేయింగ్ ఇట్ మై వే’ కు అవార్డుభారత మాజీ క్రికెటర్ సచిన్ ఆత్మకథ ‘ప్లేయింగ్ ఇట్ మై వే’ కు రేమండ్ క్రాస్‌వర్డ్ పాపులర్ అవార్డు దక్కింది. అత్యధిక అమ్మకాలతో 2016లో ‘లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు దక్కించుకున్న ఈ పుస్తకం తాజాగా పాపులర్ అవార్డుకు ఎంపికైంది.

ఐటా చీఫ్‌గా ప్రవీణ్ మహాజన్అఖిల భారత టెన్నిస్ సంఘం (AITA) చీఫ్‌గా సీనియర్ ఐఆర్‌ఎస్ అధికారిణి ప్రవీణ్ మహాజన్ నియమితులయ్యారు. ఐటా చరిత్రలో ప్రవీణ్ తొలి మహిళా అధ్యక్షురాలు. 2012లో అక్రమ పద్ధతిలో అనిల్ ఖన్నా ఐటా చీఫ్‌గా ఎన్నికయ్యారని నిర్ధారించిన కేంద్ర క్రీడా శాఖ ఆయనను ఆ పదవి నుంచి తొలగించింది. 

రిటైర్‌మెంట్ ప్రకటించిన రోస్‌బర్గ్ఫార్ములావన్ (ఎఫ్-1) ప్రపంచ చాంపియన్, జర్మనీకి చెందిన నికో రోస్‌బర్గ్ డిసెంబర్ 2న రిటైర్‌మెంట్ ప్రకటించాడు. 2016 నవంబర్ 27న తొలిసారి ఎఫ్-1 ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన 31 ఏళ్ల రోస్‌బర్గ్ మెర్సిడెస్ జట్టు తరుఫున బరిలోకి దిగాడు. 2006లో ఎఫ్-1 కెరీర్‌ను ప్రారంభించిన రోస్‌బర్గ్ 206 రేసుల్లో పాల్గొని 23 రేసుల్లో విజేతగా నిలిచాడు. తొలిసారి 2012లో చైనా గ్రాండ్‌ప్రి టైటిల్ సొంతం చేసుకున్నాడు.

No comments:

Post a Comment