AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Sunday 26 November 2017

వార్తల్లో వ్యక్తులు అక్టోబరు 2016

వార్తల్లో వ్యక్తులు అక్టోబరు 2016
లెబనాన్ అధ్యక్షుడిగా మైఖేల్ ఆన్ లెబనాన్ అధ్యక్షుడిగా మైఖేల్ ఆన్ ఎన్నికయ్యారు. అధ్యక్ష పదవి 2014, మే నుంచి ఖాళీగా ఉంది. ఆ దేశ పార్లమెంట్ అక్టోబర్ 31న మాజీ ఆర్మీ కమాండర్ అయిన 80 ఏళ్ల మైఖేల్ ఆన్‌ను అధ్యక్షునిగా ఎన్నుకుంది.

జమ్మూకశ్మీర్ గాయని రాజ్ బేగం మృతిజమ్మూకశ్మీర్‌కు చెందిన ప్రఖ్యాత గాయని రాజ్ బేగం (89) అక్టోబర్ 26న శ్రీనగర్‌లో మరణించారు. ఆమె తన పాటలతో ఏడు దశాబ్దాలకు పైగా లక్షలాది అభిమానులను మంత్రముగ్ధులను చేశారు. ఆమెను నైటింగేల్ ఆఫ్ కశ్మీర్‌గా, ఆశా భోంస్లే ఆఫ్ కశ్మీర్‌గా పిలుస్తారు.

ఈడీ డెరైక్టర్‌గా కర్ణాల్ సింగ్ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్(ఈడీ) చీఫ్‌గా ఐపీఎస్ అధికారి కర్ణాల్ సింగ్ అక్టోబర్ 26న నియమితులయ్యారు. ఆయన 2017 ఆగస్టు 31 వరకు పదవిలో కొనసాగుతారు. 1984 బ్యాచ్‌కు చెందిన సింగ్, 2015 ఆగస్టు నుంచి ఈడీ ప్రత్యేక డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 

జపాన్ రాజు మికాసా మృతిమీజి రాజవంశంలో సుదీర్ఘకాలం జీవించిన జపాన్ రాజు మికాసా అక్టోబర్ 27న మృతిచెందారు. అఖితో సామ్రాజ్య చక్రవర్తి థైషో, థెయిమీ దంపతుల చివరి సంతానం అయిన మికాసా 1915, డిసెంబర్ 2న టోక్యోలోని రాయల్ ప్యాలెస్‌లో జన్మించాడు. రాజ కుటుంబంలో డ్రైవింగ్ లెసైన్‌‌స పొందిన మొదటి వ్యక్తి కూడా మికాసానే. ఈయన ఆర్మీ అధికారిగా కూడా పని చేశారు.

‘స్వచ్ఛ రైల్’ ప్రచారకర్తగా బిందేశ్వర్రైల్వే శాఖ ప్రారంభించింన స్వచ్ఛ రైల్ కార్యక్రమానికి ప్రముఖ పర్యావరణ సంస్థ సులభ్ ఇంటర్నేషనల్ స్థాపకుడు బిందేశ్వర్ పాఠక్ ప్రచారకర్తగా నియమితులయ్యారు. రైల్వే పరిసరాలను శుభ్రంగా ఉంచేందుకు ‘స్వచ్ఛరైల్ మిషన్’ రైల్వేశాఖ ప్రారంభించింది. 

మిస్‌ఎర్త్ 2016 గా కేథరీన్ ఎస్పీన్మనీలాలో అక్టోబర్ 29న జరిగిన పోటీల్లో ఈక్వెడార్‌కు చెందిన కేథరీన్ ఎస్పీన్(23) మిస్ ఎర్త్ 2016 విజేతగా నిలిచింది. మొదటి రన్నరప్‌గా మిషెలీ గోమెజ్(కొలంబియా), రెండో రన్నరప్‌గా స్టెఫానీ డీ జోర్జీ (వెనిజులా) నిలిచారు.

మిస్‌ఎర్త్ అనేది ఫిలిప్పీన్స్ కేంద్రంగా ఏటా జరిగే అంతర్జాతీయ అందాల పోటీ. దీనిలో విజేతలుగా నిలిచిన వారు where the beauty meets environment పేరుతో జరిగే ప్రచార కార్యక్రమంలో పర్యావరణ పరిరక్షణ గురించి ప్రజల్లో అవగాహన కల్పిస్తారు.

మిస్ ఎర్త్ 2016 విజేతలు
విస్ ఎర్త్
: కేథరీన్ ఎస్పీన్
మిస్ ఎర్త్ ఎయిర్
: మిషెలీ గోమెజ్ (మొదటి రన్నరప్)
మిస్ ఎర్త్ వాటర్
: స్టెఫానీ డీ జోర్జీ (రెండో రన్నరప్)
మిస్ ఎర్త్ ఫైయర్
: బ్రూనా జనార్డో (బ్రెజిల్)

సైరస్ మిస్త్రీకి టాటా గ్రూప్ ఉద్వాసన
టాటా గ్రూపు తన చైర్మన్ సైరస్ మిస్త్రీని తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 24న జరిగిన టాటా సన్స్ డెరైక్టర్ల బోర్డు సమావేశంలో మిస్త్రీని చైర్మన్ పదవి నుంచి తక్షణం తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆయన స్థానంలో తాత్కాలిక చైర్మన్‌గా మళ్లీ 78 ఏళ్ల రతన్ టాటానే కొనసాగనున్నారు. కొత్త చైర్మన్‌ను ఎంపిక చేయటానికి ఐదుగురు సభ్యులతో కూడిన అన్వేషణ కమిటీని ఏర్పాటు చేశారు. రతన్ టాటా కూడా సభ్యుడిగా ఉండే ఈ కమిటీ నాలుగు నెలల లోపు కొత్త చైర్మన్‌ను ఎంపిక చేస్తుంది.
షాపూర్‌జీ పల్లోంజీ గ్రూప్ అధినేత పల్లోంజీ మిస్త్రీ కుమారుడు సైరస్ మిస్త్రీ 2012 డిసెంబర్‌లో టాటా గ్రూపు సారథ్య బాధ్యతలు స్వీకరించాడు. తొలగింపు నిర్ణయం తీసుకున్న బోర్డు సమావేశంలోనూ మిస్త్రీ కూడా పాల్గొన్నారు. ఆరుగురు సభ్యులు వేటు వేసేందుకు అనుకూలంగా ఓటేయగా మిస్త్రీ ప్రతిఘటించారు.


థాయ్‌లాండ్ రాజు అదుల్య కన్నుమూత
థాయ్‌లాండ్ రాజు భూమిబల్ అదుల్యాడెజ్ (88) అనారోగ్యం కారణంగా అక్టోబర్ 13న కన్నుమూశారు. ప్రపంచంలోనే సుదీర్ఘకాలం (70 ఏళ్లు) పాలించిన రాజుగా ఘనత సాధించిన భూమిబల్‌ను రామా-9గా కూడా వ్యవహరిస్తారు. 1946లో ఆయన సోదరుడి మరణానంతరం రాజ పదవిని అధిష్టించిన భూమిబల్ దేశాన్ని పలు సంక్షోభాల నుంచి గట్టెక్కించారు. భూమిబల్ మరణం నేపథ్యంలో 63 ఏళ్ల యువరాజు మహా వజీర లాంగ్‌కార్న్ రాజు స్థానాన్ని అధిష్టిస్తారు.

ఐరాస సెక్రటరీ జనరల్‌గా ఆంటోనియో ఐక్యరాజ్యసమితి కొత్త సెక్రటరీ జనరల్‌గా పోర్చుగల్ మాజీ ప్రధానమంత్రి ఆంటోనియో గుటెరెస్ (67) ఎన్నికయ్యాడు. గుటెరస్‌ను 9వ సెక్రటరీ జనరల్‌గా 15 మంది సభ్యుల భద్రతా మండలి (Security Council) ఎన్నుకొని సర్వసభ్య సభ (General Assembly) కు సిఫారసు చేసింది. ఈ నియామకానికి సంబంధించిన తీర్మానాన్ని మొత్తం 193 దేశాలు అక్టోబర్ 13న ఏకగ్రీవంగా ఆమోదించాయి. గుటెరెస్ 1995 నుంచి 2002 వరకూ పోర్చుగల్ ప్రధానమంత్రిగా పనిచేశారు. 2005 జూన్ నుంచి 2015 డిసెంబర్ వరకు శరణార్థులకు ఐరాస హైకమిషనర్‌గా ఉన్నారు.

ప్రస్తుత సెక్రటరీ జనరల్ బాన్ కి-మూన్ పదవీ కాలం 2016 డిసెంబర్ 31వ తేదీతో ముగియనుంది. 2017 జనవరి 1వ తేదీన గుటెరస్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయన పదవీ కాలం ఐదేళ్ల పాటు ఉంటుంది. ఆ తర్వాత సభ్య దేశాలు ఆయన పదవీ కాలాన్ని మరో ఐదేళ్ల పాటు పొడిగించవచ్చు. 

‘అత్యధిక కాలం రాణి’ గా ఎలిజబెత్ రికార్డురాజ్యాంగబద్ధమైన రాచరిక వ్యవస్థలో అత్యధిక కాలం నుంచి రాణి లేదా రాజుగా కొనసాగుతున్న వారిగా బ్రిటన్ రాణి రెండో ఎలిజబెత్(90) నిలిచారు. థాయ్‌లాండ్ రాజు భూమిబల్ అదుల్యదెజ్ అక్టోబర్ 13న మరణించడంతో ఆయన పేరు మీదనున్న రికార్డు రెండో ఎలిజబెత్‌కు దక్కింది.

1946లో సింహాసనాన్ని అధిష్టించిన భూమిబల్ 70 ఏళ్ల 4 నెలలు రాజుగా ఉన్నారు. ఎలిజబెత్ 1952లో 25 సంవత్సరాల వయస్సులో సింహాసనాన్ని అధిష్టించారు. గత 64 ఏళ్ల 8 నెలల నుంచి రాణిగా కొనసాగుతున్నారు. 1982లో చనిపోయిన స్వాజీలాండ్‌కు చెందిన రెండో సోభుజా 4 నెలల వయసులోనే రాజు అయి రాచరిక వ్యవస్థలో 82 ఏళ్ల 253 రోజులపాటు రాజుగా ఉండి అత్యధిక కాలం సింహాసనంపై ఉన్నవారిగా ఘనత సాధించారు.

17వ శతాబ్దం నుంచి సుదీర్ఘకాలం పాలన సాగించినవారు
రాజు పేరు
పాలించిన కాలం
పాలించిన సంవత్సరాలు
దేశం
వయసు
సోభుజా-II
1899 - 1982
82
స్వాజిలాండ్
83*
లూయీ-14
1643-1715
72
ఫ్రాన్స్
76*
భూమిబల్ అదుల్యదేజ్
1946-2016
70
థాయ్‌లాండ్
88*
ఫ్రాంజ్ జోసెఫ్
1848-1916
67
ఆస్ట్రియా -హంగేరి
86*
ఎలిజబెత్-2
1952 ఫిబ్రవరి 8 నుంచి..
64
యూకే
90
రాణి విక్టోరియా
1837-1901
63
బ్రిటిష్ సామ్రాజ్యం
81*
కింగ్ హిరోహితో
1926-1989
62
జపాన్
87*
సుల్తాన్ హసానా బోల్కియా
1957 అక్టోబర్ నుంచి..
49
బ్రూనై
70
సుల్తాన్ కాబూస్
1970 జూలై 23 నుంచి..
46
ఓమన్
75
మార్గరేట్-2
1972 జనవరి 14 నుంచి..
44
డెన్మార్క్
76
కార్ల్ 16 గస్టాఫ్
1973 సెప్టెంబర్ నుంచి..
43
స్వీడన్
70
(నోట్: 2016 అక్టోబర్ 20 నాటికి..) (* - మరణించినప్పటి వయసు)

జస్టిస్ చలమేశ్వర్ డేగా అక్టోబర్ 14అమెరికాలోని ఇల్లినాయిస్ రాష్ట్రంలో ఉన్న నేపర్‌విల్‌లో అక్టోబర్ 14ను సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ చలమేశ్వర్ డేగా ప్రకటించారు.

చలమేశ్వర్ సమాచార సాంకేతిక చట్టంలోని 66ఏ అధికరణను కొట్టివేయడం ద్వారా సామాజిక మాధ్యమాల్లో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు వెసులుబాటు కల్పించడం, ప్రధాన న్యాయమూర్తుల నియామకాల్లో కొలీజియం విధానాల లొసుగులను, లోటుపాట్లను నిష్కర్షగా విమర్శించడం, ప్రజలకు ప్రభుత్వ సేవలను అందించేందుకు ఆధార్ కార్డు ఒక్కటే ప్రామాణికమనే చట్టానికి స్వస్తి పలకడంలాంటి చరిత్రాత్మక తీర్పులను వెలువరించినందుకు ఆక్టోబర్ 14ను ‘జస్టిస్ జాస్తి చలమేశ్వర్ డే’గా ప్రకటించినట్టు నేపర్‌విల్ నగర మేయర్ స్టీవ్ చిరికో తెలిపారు. 

ఇరోం షర్మిల కొత్త పార్టీమణిపూర్ ఉక్కు మహిళ ఇరోం చాను షర్మిల ‘పీపుల్స్ రిసర్జెన్స్ అండ్ జస్టిస్ అలయన్స్’ పేరుతో కొత్త రాజకీయ పార్టీని అక్టోబర్ 18న ప్రారంభించారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని, తాను తౌబల్, కురాయి అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తానని షర్మిల వెల్లడించారు. సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం (AFSPA) రద్దుకు 16 ఏళ్ల నుంచి చేస్తున్న దీక్ష ఫలితం ఇవ్వకపోవడంతో ఆగస్టులో దీక్ష విరమించి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్లు ఆమె ప్రకటించారు.
పుతిన్‌కు చావెజ్ శాంతి పురస్కారం
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు అక్టోబర్ 7న హ్యూగో చావెజ్ శాంతి పురస్కారం లభించింది. వెనెజువెలా మాజీ అధ్యక్షుడు దివంగత హ్యూగో చావెజ్ పేరిట ఆ దేశ ప్రభుత్వం దీన్ని ఏర్పాటు చేసింది. 
ఐరాస ప్రధాన కార్యదర్శిగా ఆంటోనియా గుటెరస్
ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శిగా పోర్చుగల్ మాజీ ప్రధానమంత్రి ఆంటోనియో గుటెరస్ అక్టోబర్ 6న ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ పదవీకాలం ఈ ఏడాది డిసెంబర్ 31తో ముగియనుంది. గుటెరస్ యూఎన్‌వో 9వ ప్రధాన కార్యదర్శిగా 2017 జనవరి 1 నుంచి 2022 డిసెంబర్ 31 వరకు ఐదేళ్లపాటు ఉంటారు.
స్వచ్ఛంద మరణానికి టుటు అభ్యర్థన
నోబెల్ శాంతి బహుమతి విజేత, దక్షిణాఫ్రికా విశ్రాంత క్రైస్తవ బోధకుడు డెస్మండ్ టుటు తన స్వచ్ఛంద మరణానికి సహకరించాలని ప్రభుత్వాన్ని కోరారు. అక్టోబర్ 7న 85వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన టుటు.. జీవితకాలం ముగియనుండటంతో చివరి రోజుల్లో జీవచ్ఛవంలా బ్రతకలేనని, డాక్టర్ల సహాయంతో మరణించే అవకాశం కల్పించాలని వాషింగ్టన్ పోస్ట్‌కు రాసిన ఒక వ్యాసంలో టుటు పేర్కొన్నారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో వైద్యుల సాయంతో చనిపోవడం నిషిద్ధం.
ప్రసార భారతి సీఈవో జవహర్ సర్కార్ రాజీనామా
ప్రసార భారతి ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈవో) జవహర్ సర్కార్ అక్టోబర్ 3న రాజీనామా చేశారు. ఆయన పదవీకాలం వచ్చే ఏడాది (2017) ఫిబ్రవరి వరకు ఉంది. కేంద్ర సాంస్కృతిక శాఖ కార్యదర్శిగా పదవీ విరమణ చేసిన ఆయన 2012లో ప్రసార భారతి సీఈవోగా నియమితులయ్యారు.
బాక్సింగ్ దిగ్గజం ప్రైయర్ కన్నుమూత
ప్రముఖ బాక్సింగ్ దిగ్గజం, జూనియర్ వాల్టర్‌వెయిట్ మాజీ చాంపియన్ ఆరోన్ ప్రైయర్ (60) అమెరికాలోని సిన్సినాటి నగరంలో మృతిచెందారు. ‘ద హాక్’ పేరుతో ప్రఖ్యాతి గాంచిన ఆరోన్ ఓవరాల్‌గా 40 మ్యాచ్‌లు ఆడి వాటిలో 35 నాకౌట్ విజయాలు సాధించాడు. సహచరుడు నికరాగన్ అలెక్సిక్ అర్గ్యూల్లోపై సాధించిన విజయాలతో ఆరోన్ పాపులర్ అయ్యాడు. 1990లో రిటైర్‌మెంట్ ప్రకటించిన అరోన్ 2016 అక్టోబర్ 10న మృతి చెందాడు.

యప్ టీవీ ప్రచారకర్తగా మహేష్ బాబు
 
ఇంటర్నెట్ ఆధారిత లైవ్ టీవీ, ఆన్ డిమాండ్ సేవలు అందిస్తున్న యప్ టీవీ నూతన ప్రచార కర్తగా టాలీవుడ్ హీరో మహేష్ బాబు నియమితులయ్యారు. ఈయన రెండేళ్లపాటు కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తారు. 2017లో ‘పే పర్ వ్యూ’ సేవలను భారత్‌లో పరిచయం చేస్తున్నట్లు యప్ టీవీ ఫౌండర్ ఉదయ్ రెడ్డి తెలిపారు. దీని ద్వారా విడుదలైన నాల్గవ వారం తర్వాత కొత్త సినిమాలను యప్ టీవీలో వీక్షించొచ్చు. ఈ సంస్థ 12 భాషల్లో 200లకు పైగా టీవీ చానెళ్లను అందిస్తోంది.

రాజ్యసభకు రూపా గంగూలీప్రముఖ టీవీ నటి, పశ్చిమ బెంగాల్ బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు రూపా గంగూలీ(49) రాజ్యసభకు నామినేట్ అయ్యారు. నవజ్యోత్ సింగ్ సిద్ధూ రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి కేంద్ర ప్రభుత్వం ఆమెను నామినేట్ చేయగా రాష్ట్రపతి అక్టోబర్ 4న ఉత్తర్వులు జారీ చేశారు. పలు హిందీ, బెంగాలీ చిత్రాల్లో నటించిన రూపా గంగూలీ 2015లో బీజేపీలో చేరారు. ఇటీవలి పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు.

No comments:

Post a Comment