AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Sunday, 26 November 2017

క్రీడలు జనవరి 2017

క్రీడలు జనవరి 2017
రెస్టాఫ్ ఇండియాకు ఇరానీ కప్ 
2016-17 ఇరానీ కప్‌ను రెస్టాఫ్ ఇండియా గెలుచుకుంది. జనవరి 24న ముంబైలో జరిగిన మ్యాచ్‌లో రంజీ ఛాంపియన్ గుజరాత్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించి వరుసగా రెండోసారి కప్‌ను కైవసం చేసుకుంది. 2016లోనూ అప్పటి రంజీ ఛాంపియన్ ముంబయిని ఓడించింది. 

టాప్ కమిటీ చైర్మన్‌గా అభినవ్ బింద్రాటార్గెట్ ఒలింపిక్ పోడియం-టాప్ చైర్మన్‌గా ప్రఖ్యాత షూటర్ అభినవ్ బింద్రా నియమితులయ్యారు. ఈ మేరకు పది మంది సభ్యులతో కూడిన కమిటీని జనవరి 27న కేంద్ర క్రీడల మంత్రిత్వశాఖ పునర్ వ్యవస్థీకరించింది. మాజీ అథ్లెట్ పీటీ ఉష, బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొనె, కరణం మల్లీశ్వరి, అంజలి భగవత్ ఆటగాళ్ల తరఫున సభ్యులుగా ఎంపికయ్యారు. 2020, 2024 ఒలింపిక్స్ కోసం దేశం తరపున ఆటగాళ్లను గుర్తించడంతో పాటు వారికి అవసరమైన ఆర్థిక సహాయం, ప్రపంచ స్థాయి ఆధునిక సదుపాయాలను అందించడం ‘టాప్’ ఉద్దేశం.

ఆస్ట్రేలియా ఓపెన్ మహిళల విజేత సెరెనా 
2017 ఆస్ట్రేలియా ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ కైవసం చేసుకుంది. జనవరి 28న మెల్‌బోర్న్‌లో జరిగిన ఫైనల్‌లో 6-4, 6-4తో 13వ సీడ్, తన సోదరి వీనస్ విలియమ్స్‌ను ఓడించింది. ఈ విజయంతో గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సంఖ్యను 23కు పెంచుకున్న సెరెనా 22 టైటిల్స్‌తో స్టెఫీ గ్రాఫ్ (జర్మనీ) పేరిట ఉన్న రికార్డును అధిగమించింది. అలాగే ప్రపంచ నంబర్‌వన్ ర్యాంకును మళ్లీ సొంతం చేసుకుంది. 

సెరెనా గ్రాండ్‌స్లామ్ టైటిల్స్
ఆస్ట్రేలియన్ ఓపెన్(7): 2003, 2005, 2007, 2009, 2010, 2015, 2017
ఫ్రెంచ్ ఓపెన్ (3): 2002, 2013, 2015
వింబుల్డన్ (7): 2002, 2003, 2009, 2010, 2012, 2015, 2016
యూఎస్ ఓపెన్ (6): 1999, 2002, 2008, 2012, 2013, 2014
మొత్తం(23)

రోజర్ ఫెడరర్‌కు ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్ దక్కించుకున్నాడు. జనవరి 29న జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో రఫెల్ నాదల్(స్పెయిన్)పై 6-4, 3-6, 6-1, 3-6, 6-3తో విజయం సాధించి రూ. 19 కోట్ల ప్రైజ్ మనీ సొంతం చేసుకున్నాడు. ఈ విజయంతో ఫెడరర్ గ్రాండ్ స్లామ్ టైటిళ్ల సంఖ్య 18కి చేరింది. 2012 తర్వాత ఫెడరర్ గెలిచిన తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ ఇదే. ఓపెన్ శకంలో అత్యధిక గ్రాండ్ స్లామ్‌లు నెగ్గిన పురుష క్రీడాకారుడి రికార్డు కూడా అతడి పేరిటే ఉంది.

ఫెడరర్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్
ఆస్ట్రేలియన్ ఓపెన్ (5): 2004, 2006, 2007, 2010, 2017
ఫ్రెంచ్ ఓపెన్ (1): 2009
వింబుల్డన్ (7): 2003, 2004, 2005, 2006, 2007, 2009, 2012
యూఎస్ ఓపెన్ (5): 2004, 2005, 2006, 2007, 2008
మొత్తం(18)
మిక్స్‌డ్ డబుల్స్: అబిగెయిల్ స్పియర్స్ (అమెరికా), యువాన్ సెబాస్టియన్ కాబల్ (కొలంబియా)ల జోడీ దక్కించుకుంది.
మహిళల డబుల్స్: బెతానే మాథెక్ సాండ్స్ (అమెరికా), లూసీ సఫరోవా (చెక్)ల జోడీ సాధించింది. 
పురుషుల డబుల్స్: జాన్ పీర్స్ (ఆస్ట్రేలియా),హెన్రీ కొంతినెన్(ఫిన్‌లాండ్)లు గెలుచుకున్నారు.

పి.వి. సింధుకు సయ్యద్ మోదీ కప్
సయ్యద్ మోదీ గ్రాండ్ ప్రీ గోల్డ్ ట్రోఫీని హైదరాబాద్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు తొలిసారి గెలుచుకుంది. జనవరి 29న లక్నోలో జరిగిన ఫైనల్‌లో ఇండోనేసియాకు చెందిన గ్రెగోరినా మర్సికాపై 21-13, 21-14తో విజయం సాధించింది.
పురుషుల విభాగంలో జాతీయ ఛాంపియన్ సమీర్ వర్మ విజేగా నిలిచాడు. ఫైనల్‌లో బీ సాయి ప్రణీత్ (భారత్)పై 21-19, 21-16తో సమీర్ విజయం సాధించాడు. మిక్స్‌డ్ డబుల్స్‌లో ప్రణవ్ జెర్రీ-సిక్కి రెడ్డి(భారత్) జోడీ 22-20, 21-10తో అశ్వనీ పొన్నప్ప-బీ సుమీత్ రెడ్డి(భారత్) జంటపై విజయం సాధించింది. 

బీసీసీఐకి కొత్త పాలకవర్గం
భారత క్రికెట్ బోర్డు-BCCI కొత్త పాలక వర్గం ఏర్పాటైంది. మాజీ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వినోద్ రాయ్ నేతృత్వంలో నలుగురు సభ్యుల కమిటీని జనవరి 30న సుప్రీం కోర్టు నియమించింది. క్రికెట్ చరిత్రకారుడు రామచంద్ర గుహ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కంపెనీ ఎండీ విక్రమ్ లిమయే, భారత మహిళా క్రికెట్ మాజీ కెప్టెన్ డయానా ఎడుల్జీ సభ్యులుగా నియమితులయ్యారు. జస్టిస్ ఆర్‌ఎం లోధా ప్యానెల్ సూచించిన ప్రతిపాదనల అమలునూ ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది. 

ఒలింపిక్స్ టాస్క్‌ఫోర్స్‌లో బింద్రా, గోపీచంద్
ఒలింపిక్స్ పతక విజేతల కోసం ఏర్పాటైన టాస్క్‌ఫోర్స్‌లో బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్, ఒలింపిక్ స్వర్ణ పతక విజేత అభినవ్ బింద్రాలకు చోటుదక్కింది. తదుపరి మూడు ఒలింపిక్స్ (2020, 2024, 2028)ల కోసం కేంద్ర క్రీడాశాఖ చేపట్టిన యాక్షన్ ప్లాన్‌లో భాగంగా ఈ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటైంది. 8 మంది సభ్యులతో కూడిన ఈ కమిటీ ఒలింపిక్స్‌లో సత్తా చాటేందుకు ఆటగాళ్లకు అవసరమైన స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక శిక్షణలపై సూచనలు ఇస్తుంది.
వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్
ఇంగ్లండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో గెలుచుకుంది. కోల్‌కతాలో జనవరి 22న జరిగిన మూడో వన్డేను ఇంగ్లండ్ గెలుచుకోగా, తొలి రెండు వన్డేల్లో భారత్ గెలుపొందింది. కేదార్ జాదవ్‌కు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు దక్కింది.
మలేసియా గ్రాండ్ ప్రి టైటిల్ గెలిచిన సైనా
మలేసియా మాస్టర్స్ గ్రాండ్ ప్రి గోల్డ్ టైటిల్‌ను భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ గెలుచుకుంది. మలేసియాలో జనవరి 22న జరిగిన ఫైనల్‌లో పోర్న్‌పవీ చోచువోంగ్ (థాయిలాండ్)పై సైనా గెలుపొందింది. సైనా కెరీర్‌లో ఇది తొమ్మిదో గ్రాండ్ ప్రి గోల్డ్ టైటిల్ కాగా, మొత్తంగా 23వ టైటిల్. విజేతగా నిలిచిన సైనాకు 9,000 డాలర్ల ప్రైజ్‌మనీ దక్కింది.
షూటింగ్‌లో నిర్మల్ యాదవ్ రికార్డు 
ఢిల్లీకి చెందిన 65 ఏళ్ల నిర్మల్ యాదవ్ జాతీయ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో రికార్డు సృష్టించింది. జనవరి 18న జరిగిన జాతీయ షూటింగ్ పోటీల్లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ( వెటరన్ విభాగం )లో మొత్తం 400 పాయింట్లకు 341 పాయింట్లు సాధించి స్వర్ణం గెలుచుకుంది. ఇటీవల జైపూర్‌లో జరిగిన కర్నిసింగ్ స్మారక షూటింగ్ చాంపియన్‌షిప్‌లో కూడా ఆమె స్వర్ణం నెగ్గింది. 
బెర్లిన్‌లో 2018 ఇండోర్ హాకీ ప్రపంచకప్
2018 ఇండోర్ హాకీ ప్రపంచకప్‌ను బెర్లిన్‌లో నిర్వహిస్తున్నట్లు అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) జనవరి 18న ప్రకటించింది. బెర్లిన్‌లోని మ్యాక్స్ ష్మెలింగ్ హలే స్టేడియంలో ఫిబ్రవరి 7 నుంచి 11వ తేదీ వరకు ఈ మ్యాచ్‌లు జరుగుతాయి. 24 జట్లు ఇందులో పాల్గొంటాయి. జర్మనీ దేశం ఆతిథ్యమివ్వనున్న మూడో ఇండోర్ హాకీ ప్రపంచకప్ ఇది. 2003, 2015లో లెయిప్‌జిగ్‌లో రెండుసార్లు ఈ టోర్నీ నిర్వహించారు.
ప్రో రెజ్లింగ్ లీగ్-2 విజేత పంజాబ్ రాయల్స్ 
ప్రో రెజ్లింగ్ లీగ్-2 విజేతగా పంజాబ్ రాయల్స్ నిలిచింది. జనవరి 19న జరిగిన ఫైనల్లో హరియాణా హ్యామర్స్‌పై 5-4 తో విజయాన్ని సాధించింది. ఛాంపియన్‌గా నిలిచిన పంజాబ్‌కు రూ. కోటి 90 లక్షల ప్రైజ్ మనీ లభించింది. 
ఐటీఎఫ్ జూనియర్స్ చాంప్ సునీశ్
కోల్‌కతాలో జరిగిన ఐటీఎఫ్ జూనియర్స్ బాలుర టైటిల్‌ను భారత ప్లేయర్ ధ్రువ్ సునీశ్ కైవసం చేసుకున్నాడు. జనవరి 20న జరిగిన ఫైనల్లో సునీశ్ 6-2, 6-3తో దోస్తాన్‌బెక్ తాష్‌బులతోవ్ (కజకిస్తాన్)ను ఓడించాడు.

ఫిఫా ఉత్తమ ప్లేయర్‌గా రొనాల్డో
అంతర్జాతీయ స్థాయిలో అద్వితీయ ప్రదర్శనతో ప్రాతినిధ్యం వహించిన జట్లకు గొప్ప విజయాలను అందించిన ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో 2016 సంవత్సరానికిగానూ ప్రపంచ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) ఉత్తమ ప్లేయర్‌గా ఎంపికయ్యాడు. ఈ మేరకు ఫిఫా.. రొనాల్డో పేరును జనవరి 10న ప్రకటించింది. మహిళల విభాగంలో అమెరికా మిడ్‌ఫీల్డర్ కార్లీ లాయిడ్ రెండోసారి ఉత్తమ క్రీడాకారిణి పురస్కారం గెలుచుకుంది. 31 ఏళ్ల రొనాల్డో సారథ్యంలో గతేడాది పోర్చుగల్ జట్టు తొలిసారి యూరో చాంపియన్‌గా నిలిచింది. గతేడాది రొనాల్డో మొత్తం 61 మ్యాచ్‌లు ఆడి 60 గోల్స్ చేశాడు. 20 సార్లు గోల్స్ చేసేందుకు సహకరించాడు.
100వ టెస్టు ఆడిన హషీమ్ ఆమ్లా
దక్షిణాఫ్రికా క్రికెటర్ హషీమ్ ఆమ్లా జనవరి 12న తన టెస్టు కెరీర్‌లో వందో టెస్టును ఆడాడు. తద్వారా ‘ప్రొటీస్’ (దక్షిణాఫ్రికా జాతీయ క్రికెట్ టీమ్) టీమ్ తరఫున ఈ ఘనత సాధించిన ఎనిమిదో ఆటగాడిగా ఆమ్లా నిలిచాడు. 2004 డిసెంబర్‌లో కోల్‌కతాలో భారత్‌తో తన తొలి టెస్టు మ్యాచ్ ఆడిన హషీం, 99 మ్యాచ్‌లలో 49.45 సగటుతో 7665 పరుగులు సాధించాడు. ఇందులో 25 సెంచరీలు, 31 అర్ధ సెంచరీలు ఉన్నాయి. దక్షిణాఫ్రికా జట్టు తరపున ట్రిపుల్ సెంచరీ సాధించిన ఏకైక బ్యాట్స్‌మన్ ఆమ్లా.
తొలిసారి రంజీ ట్రోఫీ నెగ్గిన గుజరాత్
80 ఏళ్ల రంజీ చరిత్రలో గుజరాత్ జట్టు తొలిసారిగా చాంపియన్‌గా నిలిచింది. జనవరి 15న ముంబైతో జరిగిన ఫైనల్లో గుజరాత్ ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. దీంతో 42వ సారి రంజీ ట్రోఫీని గెలవాలన్న ముంబై ఆశలకు బ్రేక్ పడింది. ఈ విజయంతో దేశవాళీలో జరిగే మూడు ఫార్మాట్‌ల టోర్నీలు (రంజీ ట్రోఫీ, విజయ్ హజారే వన్డే, సయ్యద్ ముస్తాక్ అలీ టి-20) నెగ్గిన నాలుగో జట్టుగా గుజరాత్ గుర్తింపు పొందింది. గతంలో ఉత్తరప్రదేశ్, తమిళనాడు, బెంగాల్ జట్లు మాత్రమే ఈ ఘనత సాధించాయి.
పీబీఎల్ చాంపియన్స్ చెన్నై స్మాషర్స్
ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్-2)లో పి.వి. సింధు ప్రాతినిధ్యం వహించిన చెన్నై స్మాషర్స్ విజేతగా నిలిచింది. న్యూఢిల్లీలో జనవరి 14న ముంబై రాకెట్స్‌తో జరిగిన ఫైనల్లో చెన్నై స్మాషర్స్ 4-3 పాయింట్ల తేడాతో విజయం సాధించి తొలిసారి ఈ టైటిల్‌ను సొంతం చేసుకుంది. చెన్నై జట్టుకు రూ. 3 కోట్లు ముంబై జట్టుకు రూ. కోటిన్నర ప్రైజ్‌మనీ లభించింది.
ఎఫ్‌ఐహెచ్ అథ్లెట్ల కమిటీలో శ్రీజేశ్
భారత హాకీ జట్టు కెప్టెన్, గోల్‌కీపర్ పీఆర్ శ్రీజేశ్ అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) అథ్లెట్స్ కమిటీలో సభ్యుడిగా ఎంపికయ్యాడు. మొత్తం 8 మంది సభ్యులుండే ఈ కమిటీలో ప్రస్తుత, మాజీ ఆటగాళ్లు కలిసి ఉంటారు. ఎఫ్‌హెచ్‌ఐ ఈవెంట్లపై ఫీడ్‌బ్యాక్ తీసుకోవడం, జాతీయ జట్లతో సమావేశాలు నిర్వహించడం, ఆటగాళ్లతో నిరంతరం మాట్లాడుతూ వారిని మెరుగుపర్చడం ఈ కమిటీ బాధ్యతలు.

వన్డే, టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్న ధోనీ
వన్డే, టీ 20 కెప్టెన్సీ నుంచి వైదొలుగుతున్నట్లు మహేంద్రసింగ్ ధోని జనవరి 4న ప్రకటించాడు. ధోని 2014లోనే టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. కెరీర్‌లో 283 వన్డేలాడిన ధోని..9110 పరుగులు చేశాడు. ఇందులో 9 సెంచరీలు, 61 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 73 టీ20 మ్యాచ్‌లు ఆడిన ధోని 1112 పరుగులు సాధించాడు. వికెట్ కీపర్‌గా వన్డేల్లో 267 క్యాచ్‌లు, 92 స్టంపింగ్‌లు; టీ 20ల్లో 41 క్యాచ్‌లు, 22 స్టంపింగ్‌లు ధోని ఖాతాలో ఉన్నాయి. 
అగట్‌కు చెన్నై ఓపెన్ సింగిల్స్ టైటిల్
చెన్నై ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను రాబర్టో బౌటిస్టా అగట్ (స్పెయిన్) గెలుచుకున్నాడు. జనవరి 8న జరిగిన ఫైనల్లో డానిల్ మెద్వెదెవ్ (రష్యా)ను ఓడించాడు. పురుషుల డబుల్స్ టైటిల్‌ను రోహన్ బోపన్న, జీవన్ నెదుంచెజియన్ జోడీ గెలుచుకుంది.
బోపన్న-జీవన్‌లకు చెన్నై ఓపెన్ డబుల్స్ టైటిల్
భారత్‌లో జరిగే ఏకై క ఏటీపీ టెన్నిస్ టోర్నమెంట్ చెన్నై ఓపెన్ పురుషుల డబుల్స్ విభాగంలో రోహన్ బోపన్న - జీవన్ నెడుంజెళియన్ టైటిల్ సొంతం చేసుకున్నారు. బోపన్న-జీవన్ ద్వయం 6-3, 6-4తో భారత్‌కే చెందిన పురవ్ రాజా-దివిజ్ శరణ్ జంటపై విజయం సాధించింది. 
పంకజ్‌కు కోల్‌కతా ఓపెన్ స్నూకర్ టైటిల్
భారత క్యూ స్పోర్ట్స్ స్టార్ ప్లేయర్ పంకజ్ అద్వానీ కోల్‌కతా ఓపెన్ జాతీయ ఇన్విటేషనల్ స్నూకర్ చాంపియన్‌షిప్ విజేతగా నిలిచాడు. కోల్‌కతాలో జనవరి 9న జరిగిన ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ ఆదిత్య మెహతాపై పంకజ్ విజయం సాధించాడు.
ఫ్రాన్స్‌కు హోప్‌మన్ కప్
హోప్‌మన్ కప్ టెన్నిస్ మిక్స్‌డ్ టీం టైటిల్‌ను ఫ్రాన్స్ గెలుచుకుంది. జనవరి 7న పెర్త్‌లో జరిగిన ఫైనల్లో అమెరికాను ఓడించింది.
భారత్‌కు శాఫ్ ఫుట్‌బాల్ టైటిల్
దక్షిణాసియా ఫుట్‌బాల్ సమాఖ్య (శాఫ్) టైటిల్‌ను భారత మహిళల జట్టు వరుసగా నాలుగోసారి సొంతం చేసుకుంది. బంగ్లాదేశ్‌తో జనవరి 4న జరిగిన ఫైనల్లో భారత్ 3-1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. భారత్ 2010, 2012, 2014లలో ఈ టోర్నీలో విజేతగా నిలిచింది.
సానియా - బెథానీ జంటకు బ్రిస్బేన్ ఓపెన్ టైటిల్
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, బెథానీ మాటెక్ సాండ్‌‌స (అమెరికా)తో కలసి బ్రిస్బేన్ ఓపెన్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. జనవరి 7న జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో సానియా-బెథానీ ద్వయం 6-2, 6-3తో ఎకతెరీనా మకరోవా-ఎలీనా వెస్నినా (రష్యా) జంటను ఓడించింది. బ్రిస్బేన్ ఓపెన్ టైటిల్ నెగ్గడం సానియాకిది మూడోసారి కాగా కెరీర్‌లో 41వ డబుల్స్ టైటిల్. బెథానీతో 2013లో, హింగిస్‌తో 2016లో కలసి సానియా ఈ టైటిల్‌ను గెలిచింది. 
జొకోవిచ్‌కు ఖతర్ ఓపెన్ టైటిల్
సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ ఖతర్ ఓపెన్ టైటిల్ సాధించాడు. ప్రస్తుత నంబర్‌వన్ ఆండీ ముర్రే (బ్రిటన్)తో జరిగిన ఫైనల్‌లో జొకోవిచ్ 6-3, 5-7, 6-4తో విజయం సాధించాడు. విజేతగా నిలిచిన జొకోవిచ్‌కు 2,09,665 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. కోటీ 42 లక్షలు) లభించింది.

మేఘాలయలో 2022 జాతీయ క్రీడలు
2022 జాతీయ క్రీడలను ఈశాన్య రాష్ట్రం మేఘాలయ నిర్వహించనుంది. ఈ మేరకు డిసెంబర్ 29న భారతీయ ఒలింపిక్ సంఘం నిర్వహించిన వేలంలో మేఘాలయ రూ.5 కోట్లతో క్రీడల నిర్వహణ బాధ్యతను దక్కించుకుంది. దీని కోసం ఆంధ్రప్రదేశ్, చత్తీస్‌ఘడ్, గోవా, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు పోటీ పడ్డాయి. మణిపూర్, అస్సాం తర్వాత జాతీయ క్రీడలను నిర్వహిస్తున్న మూడో ఈశాన్య రాష్ట్రం మేఘాలయ. 2017 జాతీయ క్రీడలు గోవాలో జరగనున్నాయి.

బీసీసీఐ అధ్యక్ష, కార్యదర్శులపై సుప్రీం కోర్టు వేటులోధా కమిటీ సిఫారసులను అమలు చేయనందుకు బీసీసీఐ అధ్యక్షుడు, కార్యదర్శిలపై సుప్రీం కోర్టు వేటు వేసింది. ఈ మేరకు బోర్డు అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, కార్యదర్శి అజయ్ షిర్కేలను పదవులనుంచి తొలగిస్తూ జనవరి 2న ఆదేశాలు జారీ చేసింది. తీర్పు సందర్భంగా లోధా కమిటీ ప్రతిపాదించిన అన్ని అంశాలను బోర్డు, దాని అనుబంధ సంఘాలు పాటించాల్సిందేనని స్పష్టం చేసింది.

బోర్డులో ప్రస్తుతం సీనియర్ ఉపాధ్యక్షుడు అరుున వ్యక్తి అధ్యక్షుడిగా, సంయుక్త కార్యదర్శి అమితాబ్ చౌదరి కార్యదర్శిగా తాత్కాలిక బాధ్యతలు నిర్వహిస్తారు. 2013 ఐపీఎల్‌లో జరిగిన స్పాట్ ఫిక్సింగ్‌లో దోషులకు శిక్షలు ఖరారు చేసే విషయంలో జనవరి 2015లో జస్టిస్ ఆర్‌ఎం లోధా కమిటీ ఏర్పాటైంది. దీంతో పాటు బీసీసీఐ మరింత సమర్థంగా పని చేసేలా మార్పులు సూచించే బాధ్యత కూడా సుప్రీం కోర్టు ఈ కమిటీకే అప్పగించింది.

ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో ఆర్థర్ మోరిస్ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆర్థర్ మోరిస్‌కు మరణానంతరం అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో చోటు దక్కింది. హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్న 82వ ఆటగాడు మోరిస్. 46 టెస్టు మ్యాచ్‌ల్లో 3,533 పరుగులు చేసిన మోరిస్ 12 సెంచరీలు చేశాడు.

No comments:

Post a Comment