AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Sunday, 26 November 2017

వార్తల్లో వ్యక్తులు సెప్టెంబరు 2013

వార్తల్లో వ్యక్తులు సెప్టెంబరు 2013
మిస్ వరల్డ్‌గా మెగాన్ యంగ్ 
ఫిలిప్పీన్స్ సుందరి మెగాన్ యంగ్ (23) మిస్ వరల్డ్-2013గా ఎంపికైంది. ఇండోనేసియాలోని బాలి దీవిలో సెప్టెంబర్ 28న జరిగిన 63వ మిస్ వర్డల్ పోటీల ఫైనల్‌లో ఆమె విజేతగా నిలిచింది. ఈ పోటీలో ఫ్రాన్స్‌కు చెందిన మేరీన్ లోర్ఫెలిన్ రెండో స్థానంలో, ఘనాకు చెందిన నా ఒకాయిలే షూటర్ మూడో స్థానంలో నిలిచారు. భారత్ తరఫున మిస్ ఇండియా వరల్డ్ నవనీత్ కౌర్ థిల్లాన్ ఈ పోటీలో పాల్గొన్నా, తొలి పది స్థానాల్లో చోటు దక్కించుకోలేకపోయింది. కౌర్‌కు మిస్ మల్టీమీడియా పతకం దక్కింది.
కొలంబియా సర్క్యూట్ కోర్టు జడ్జిగా శ్రీనివాసన్
అమెరికాలోని కొలంబియా సర్క్యూట్ కోర్టు న్యాయమూర్తిగా భారత సంతతికి చెందిన శ్రీనివాసన్ (46) సెప్టెంబర్ 27న బాధ్యతలు స్వీకరించారు. తద్వారా అమెరికాలో రెండో అత్యున్నత న్యాయస్థానంగా భావించే సర్క్యూట్ కోర్టు జడ్జిగా నియమితులైన తొలి భారతీయ అమెరికన్‌గా చరిత్ర సష్టించారు. శ్రీనివాసన్ గతంలో యునెటైడ్ స్టేట్స్ ప్రిన్సిపల్ డిప్యూటీ సొలిసిటర్ జనరల్‌గా పనిచేశారు. శ్రీనివాసన్ చంఢీగఢ్‌లో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు 1970లో అమెరికాకు వలస వెళ్లారు.
నాగేశ్వర రెడ్డికి మాస్టర్ ఆఫ్ వరల్డ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అవార్డు
హైదరాబాద్‌లో ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ చైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వర్‌రెడ్డికి మాస్టర్ ఆఫ్ వరల్డ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అవార్డు లభించింది. చైనాలోని షాంఘైలో సెప్టెంబర్ 23న జరిగిన ప్రపంచ గ్యాస్ట్రో ఎంట్రాలజీ సదస్సులో ఆ సంఘం అధ్యక్షుడు ప్రొఫెసర్ హెన్రీ కోహెన్ బహూకరించారు. ఈ అంతర్జాతీయ అవార్డును ప్రతి నాలుగేళ్లకొకసారి ప్రదానం చేస్తారు. ఈ అవార్డు అందుకున్న తొలి భారతీయుడు నాగేశ్వర్‌రెడ్డి.
దాణా కుంభకోణంలో దోషిగా లాలూప్రసాద్ 
బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌ను పశు దాణా కుంభకోణంలో సీబీఐ ప్రత్యేక కోర్టు దోషిగా పేర్కొంది. సెప్టెంబర్ 30న ఇచ్చిన తీర్పులో లాలూతోపాటు మరో 44 మందిని దోషులుగా తేల్చింది. వారిలో మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రాతోపాటు ప్రస్తుత ఎంపీ జగదీశ్ శర్మ, నలుగురు ఐఏఎస్ అధికారులున్నారు. 1996 నాటి దాణా కుంభకోణంలో 37.7 కోట్ల రూపాయల మేరకు అవినీతికి పాల్పడ్డారని వారిపై అభియోగం. వీరికి శిక్ష ను ఖరారు చేయాల్సి ఉంది.


ఏబీసీ చైర్మన్‌గా రవీంద్ర పిషారోడీ
ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్స్ (ఏబీసీ) నూతన చైర్మన్‌గా టాటా మోటార్స్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ రవీంద్ర పిషారోడీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా హెచ్‌టీ మీడియాకు చెందిన ఎం.వెంకటేశ్ కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
నార్తన్ డిస్ట్రిక్ట్ జడ్జిగా మనీష్ షా 
భారతీయ అమెరికన్ మనీష్ ఎం. షా అమెరికాలోని నార్తన్ డిస్ట్రిక్ట్ జడ్జి పదవికి ఆ దేశాధ్యక్షుడు బరాక్ ఒబామా సెప్టెంబర్ 20న నామినేట్ చేశారు. ఈ జిల్లా ఒబామా సొంత రాష్ట్రం ఇల్లినాయిస్‌లో ఉంది. ప్రస్తుతం షా చీఫ్ ఆఫ్ క్రిమినల్ డివిజన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
అమెరికా మేధావుల వేదికలో రతన్
అమెరికా మేధావుల వేదిక, కార్నేగీ ఎండోమెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ పీస్‌లో భారత పారిశ్రామికవేత్త రతన్ టాటాకు చోటు దక్కింది. ఈ విషయాన్ని కార్నేగీ ఎండోమెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ పీస్ చైర్మన్ హార్వే వి. ఫెనేబర్గ్ సెప్టెంబర్ 18న వెల్లడించారు. ప్రధాన కార్యాలయం వాషింగ్టన్‌లో ఉంది. 
మలాలాకు అమ్నెస్టీ అవార్డు
పాకిస్థాన్ సాహస బాలిక మలాలా యూసుఫ్‌జాయ్‌కు అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌కు చెందిన ‘అంబాసిడర్ ఆఫ్ కాన్సెన్స్ అవార్డు-2013’ దక్కింది. అమెరికన్ గాయనీ, సామాజిక కార్యకర్త హార్రీ బెలాఫాంటే కూడా ఈ పుర స్కారానికి ఎంపికైంది. మానవ హక్కుల విభాగంలో విశేష కషి చేస్తున్న వారికి ఈ అవార్డును అందజేస్తారు. మానవ హక్కుల కోసం పని చేస్తున్న అంతర్జాతీయ సంస్థ అమ్నెస్టీ ఇంటర్నేషనల్. 
బీసీ కమిషన్ చైర్మన్‌గా ఈశ్వరయ్య
జాతీయ వెనుకబడిన తరగతుల (బీసీ) కమిషన్ చైర్మన్‌గా జస్టిస్ ఈశ్వరయ్య సెప్టెంబర్ 19న బాధ్యతలు స్వీకరించారు. ఈయన మూడేళ్లపాటు పదవిలో ఉంటారు. రాష్ట్ర హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఈశ్వరయ్య రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించారు.
భారత శాస్త్రవేత్తకు చాంపియన్ ఆఫ్ ది ఎర్త్ అవార్డు
ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం (యూఎన్‌పీఏ) అందజేసే ‘2013 చాంపియన్ ఆఫ్ ది ఎర్త్’ అవార్డుకు భారతీయ అమెరికన్ శాస్త్రవేత్త వీరభద్రన్ రామనాథన్ ఎంపికయ్యారు. బ్లాక్ కార్బన్ ఉద్గారాల తగ్గుదల కారణంగా వాతావరణ మార్పులపై ఉండే ప్రభావం గురించి వివరించినందుకుగాను రామనాథన్‌కు ఈ పురస్కారం దక్కింది. ప్రస్తుతం రామనాథన్ కాలిఫోర్నియాలోని స్క్రిప్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషియనోగ్రఫీలో పని చేస్తున్నారు.
ఏపీఈఆర్‌సీ చైర్మన్‌గా భాస్కర్
ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్ర మండలి (ఏపీఈఆర్‌సీ) చైర్మన్‌గా 1981 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి వి. భాస్కర్ సెప్టెంబర్ 19న బాధ్యతలు స్వీకరించారు. ఈయన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖలో ప్రిన్సిపల్ సెక్రటరీగా పని చేస్తూ స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు.

రే డాల్బీ కన్నుమూత
అమెరికాకు చెందిన శాస్త్రవేత్త, డాల్బీ లేబొరేటరీస్ వ్యవస్థాపకుడు రే డాల్బీ (80) శాన్‌ఫ్రాన్సిస్కోలో సెప్టెంబర్ 12న మరణించారు. ఆయన డాల్బీ వాయిస్ రిడక్షన్ విధానాన్ని రూపొందించి రికార్డింగ్ పరిశ్రమలో విప్లవం తీసుకొచ్చారు. డాల్బీ డిజిటల్ సరౌండ్ సౌండ్‌ను అభివృద్ధి చేసి సినిమా, హోం ఎంటర్‌టైన్‌మెంట్‌లో సరికొత్త ఆవిష్కరణలకు కారణమయ్యారు. 

తమ్మారెడ్డి కృష్ణమూర్తి కన్నుమూతకమ్యూనిస్టు పార్టీ నాయకుడు, చిత్ర నిర్మాత తమ్మారెడ్డి కృష్ణమూర్తి (94) హైదరాబాద్‌లో సెప్టెంబర్ 16న మరణించారు. వామపక్ష ఉద్యమంలో, ప్రజా నాట్యమండలి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. తెలుగు, తమిళ భాషల్లో 13 చిత్రాలు నిర్మించారు. కృష్ణమూర్తికి 2007లో రాష్ట్ర ప్రభుత్వం అందించే రఘుపతి వెంకయ్య అవార్డు లభించింది.

విద్యావేత్త వినోద్ రైనా మృతిప్రముఖ విద్యావేత్త వినోద్ రైనా సెప్టెంబర్ 12న న్యూఢిల్లీలో మరణించారు. ‘ఉచిత, నిర్భంధ విద్యాహక్కు చట్టం-2009’ రూపకల్పనలో ఆయన ప్రధానపాత్ర పోషించారు. పిల్లల హక్కుల పరిరక్షణ నేషనల్ కమిషన్ ఏర్పాటు చేసిన ‘పిల్లల విద్యాహక్కు పర్యవేక్షణ’ నిపుణుల బృందంలో ఆయన సభ్యుడిగా పనిచేశారు. సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఫర్ ఎడ్యుకేషన్ (సీఏబీఈ)లో సభ్యుడిగా ఆయన కొనసాగుతున్నారు. ‘భారత్ జ్ఞాన్ విజ్ఞాన్ సమితి’ అనే స్వచ్ఛంద సంస్థ సహ స్థాపకుల్లో రైనా ఒకరు.

నీనా దావులూరికి మిస్ అమెరికా కిరీటంతెలుగు అమ్మాయి నీనా దావులూరి (24) మిస్ అమెరికాగా ఎంపికైంది. న్యూజెర్సీలోని అట్లాంటిక్ సిటీలో సెప్టెంబర్ 16న ముగిసిన పోటీలో నీనా విజేతగా నిలిచింది. 53 రాష్ట్రాల నుంచి 53 మంది పాల్గొన్న ఈ పోటీల్లో నీనా మిస్ న్యూయార్క్‌గా పోటీ పడింది. ఈ కిరీటం గెలిచిన తొలి భారతీయ సంతతి యువతి నీనా. ఆమె కుటుంబం కృష్ణా జిల్లా నుంచి అమెరికాకు వలస వెళ్లింది. ఈ గెలుపుతో నీనాకు 50,000 డాలర్లు (భారత కరెన్సీలో 35 లక్షల రూపాయలు) స్కాలర్‌షిప్ రూపంలో అందనున్నాయి.

డబ్ల్యుహెచ్‌ఓ ఎస్‌ఈఏఆర్‌ఓ రీజినల్ డెరైక్టర్‌గా పూనమ్ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) ఆగ్నేయాసియా ప్రాంతీయ సంస్థ (ఎస్‌ఈఏఆర్‌ఓ) రీజినల్ డెరైక్టర్‌గా భారత ప్రతినిథి, మాజీ ఐఏఎస్ అధికారి డా.పూనమ్ ఖేత్రపాల్ సింగ్ సెప్టెంబర్ 12న ఎన్నికయ్యారు. ఆమె ఐదేళ్లపాటు ఈ పదవిలో ఉంటారు. 44 ఏళ్ల తర్వాత భారత్‌కు ఈ పదవి దక్కింది. 

బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోడీగుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ (63)ని ప్రధానమంత్రి అభ్యర్థిగా భారతీయ జనతాపార్టీ (బీజేపీ) ప్రకటించింది. న్యూఢిల్లీలో సెప్టెంబర్ 13న సమావేశమైన బీజేపీ పార్లమెంటరీ బోర్డు నరేంద్ర మోడీ అభ్యర్థిత్వాన్ని నిర్ణయించింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో మోడీ ప్రధాని అభ్యర్థిగా ప్రజల ముందుకు వెళ్తారు.ఆర్‌బీఐ కొత్త గవర్నర్‌గా రఘురామ్ రాజన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్‌గా ప్రముఖ ఆర్థిక వేత్త, కేంద్ర ఆర్థిక శాఖ ముఖ్య సలహాదారుగా ఉన్న రఘురామ్ రాజన్ సెప్టెంబర్ 4న బాధ్యతలు స్వీకరించారు. పదవీ విరమణ చేసిన దువ్వూరి సుబ్బారావు స్థానంలో ఆర్‌బీఐ 23వ గవర్నర్‌గా రాజన్ నియమితులయ్యారు.

ప్రధాన సమాచార కమిషనర్‌గా దీపక్ సంధుప్రధాన సమాచార కమిషనర్ (సీఐసీ)గా దీపక్ సంధు సెప్టెంబర్ 5న ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. సంధు దేశ తొలి మహిళా ప్రధాన సమాచార కమిషనర్. ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్‌కు చెందిన మాజీ అధికారి అయిన సంధు 2009 నుంచి సమాచార కమిషనర్‌గా వ్యవహరిస్తున్నారు. 64 ఏళ్ల సంధూ 1971 బ్యాచ్‌కు చెందిన ఐఐఎస్ అధికారిణి. 

లీగల్ సర్వీస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్సన్‌గా జస్టిస్ రోహిణిఆంధ్రప్రదేశ్ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్సన్‌గా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జి.రోహిణి సెప్టెంబర్ 6న నియమితులయ్యారు. ఆమె రెండేళ్లపాటు ఈ పదవిలో ఉంటారు. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ ఎన్.వి. రమణ స్థానంలో జస్టిస్ రోహిణి బాధ్యతలు చేపట్టారు.

జుబిన్ మెహతాకు టాగూర్ అవార్డు ప్రదానంపాశ్చాత్య సంగీత విద్వాంసుడు జుబిన్ మెహతాకు 2013 టాగూర్ సాంస్కతిక సామరస్య అవార్డును రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ న్యూఢిల్లీలో సెప్టెంబర్ 6న ప్రదానం చేశారు. ఆయన పాశ్చాత్య సంప్రదాయ సంగీతంలో పేరుగాంచిన భారతీయుడు. ముంబైలో జన్మించిన మెహతా 1954లో వియన్నాకు వెళ్లి అక్కడ హాన్స్ స్వరోస్కీలో పాశ్చాత్య సంప్రదాయ సంగీతాన్ని ఆలపిస్తూ వచ్చారు. ఈ అవార్డు కింద కోటి రూపాయల నగదు, జ్ఞాపిక అందజేస్తారు. తొలి అవార్డును 2012లో సితార్ విద్వాంసుడు పండిట్ రవిశంకర్‌కు బహూకరించారు.

భారతీయ రచయిత్రి సుస్మితా బెనర్జీ హత్యప్రఖ్యాత భారతీయ రచయిత్రి సుస్మితా బెనర్జీ (43)ని అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ ఉగ్రవాదులు సెప్టెంబర్ 6న కాల్చి చంపారు. అఫ్గానిస్థాన్‌లో ఆరోగ్య కార్యకర్తగా ఆమె సేవలందిస్తుంది. సుస్మిత స్థానిక మహిళల జీవితాలను కెమెరాతో చిత్రీకరించినందుకు ఆమెను హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు. మతం మార్చుకోవాలని వేధించిన తాలిబన్లు ఆమెను 1989లో అపహరించారు. 1993లో ఆమె తాలిబన్ల చెర నుంచి తప్పించుకున్న వైనంపై ‘ఏ కాబులీవాలాస్ బెంగాలీ వైఫ్’ పుస్తకం రాశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ఈ నవలపై 2003లో హిందీలో ‘ఎస్కేప్ ఫ్రం తాలిబాన్’ అనే చిత్రం కూడా రూపొందింది.

ఆస్ట్రేలియా ప్రధానిగా టోనీ అబోట్ ఎన్నికఆస్ట్రేలియా ప్రధానమంత్రిగా టోనీ అబోట్ అధికారం చేపట్టనున్నారు. అబోట్ నాయకత్వంలోని లిబరల్/నేషనల్ సంకీర్ణం హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్‌లో 150 స్థానాలకు గాను 90 స్థానాలు గెలుచుకున్నట్లు ఆస్ట్రేలియా ఎలక్టోరల్ కమిషన్ సెప్టెంబర్ 7న ప్రకటించింది. అధికారంలోని లేబర్ పార్టీకి 55 స్థానాలు లభించాయి. దీంతో ఆరేళ్లు ప్రధానిగా కొనసాగుతున్న కెవిన్‌రుడ్ పాలన ముగిసింది. 

పాక్ అధ్యక్షుడిగా ఐదేళ్లు కొనసాగిన జర్దారీపాకిస్థాన్ అధ్యక్షుడిగా అసిఫ్ అలీ జర్దారీ ఐదేళ్ల పూర్తికాలం కొనసాగారు. సెప్టెంబర్ 8తో ఆయన పదవీకాలం పూరై్తంది. పాకిస్థాన్‌లో ప్రజాస్వామ్యబద్ధంగా అధ్యక్షుడిగా ఎన్నికై పూర్తి పదవీకాలం కొనసాగిన తొలి అధ్యక్షుడిగా జర్దారీ నిలిచారు. జర్దారీ స్థానంలో తదుపరి అధ్యక్షుడిగా మమ్మూన్ హుస్సేన్ సెప్టెంబర్ 10న ప్రమాణ స్వీకారం చేశారు. ఐరిష్ కవి సీమస్ హీనీ మృతిప్రసిద్ధ ఐరిష్ కవి, నాటక రచయిత, నోబెల్ అవార్డు గ్రహీత సీమస్ హీనీ (74) డబ్లిన్‌లో ఆగస్టు 30న మరణించారు. 1995లో సాహిత్యంలో ఆయనకు నోబెల్ బహుమతి లభించింది. ఆయన రాసిన ‘డెత్ ఆఫ్ ఏ నేచురలిస్టు’ మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆయన ఆక్స్‌ఫర్డ్, హార్వర్డ్, కాలిఫోర్నియా యూనివర్సిటీల్లో కొంతకాలం అధ్యాపకుడిగా కూడా పనిచేశారు.

బ్రిటిష్ బ్రాడ్‌కాస్టర్ డేవిస్ ఫ్రోస్ట్ మృతిఒకనాటి ప్రముఖ బ్రిటిష్ బ్రాడ్‌కాస్టర్, జర్నలిస్ట్ డేవిడ్ ఫ్రోస్ట్ (74) లండన్‌లో ఆగస్టు 31న మరణించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్‌తో ఆయన జరిపిన ఇంటర్వ్యూ సిరీస్‌తో ఫ్రోస్ట్ బాగా ప్రాచుర్యం పొందారు. ఆయన ఆరుగురు బ్రిటిష్ ప్రధానమంత్రులను (1964-2007), ఏడుగురు అమెరికా అధ్యక్షులను (1969-2008) ఇంటర్వ్యూ చేసిన వ్యక్తిగా గుర్తింపు పొందారు.

నిరాయుధీకరణ, అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక విధాన దూతగా రాకేశ్ సూద్ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నిరాయుధీకరణ, అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక విధానంపై తన ప్రత్యేక దూతగా మాజీ రాయబారి రాకేశ్ సూద్‌ను సెప్టెంబర్ 1న నియమించారు. సూద్ గతంలో నేపాల్, అప్ఘానిస్థాన్, ఫ్రాన్స్‌లో భారత రాయబారిగా పనిచేశారు. జెనీవాలో జరిగిన నిరాయుధీకరణ చర్చల్లో భారత రాయబారిగా వ్యవహరించారు. భద్రత, అణ్వస్త్ర వ్యాప్తి నిరోధం, నిరాయుధీకరణ వంటి అంశాలకు సంబంధించి ఆయన దేశ విధానానికి తోడ్పడతారు.

ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే)గా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జస్టిస్ నూతలపాటి వెంకట రమణ(56) సెప్టెంబర్ 2న ప్రమాణస్వీకారం చేశారు. ఇప్పటి వరకు జస్టిస్ రమణ ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు. ఈ కోర్టుకే ఆయన కొంతకాలం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా కూడా వ్యవహరించారు.

No comments:

Post a Comment