AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Sunday, 26 November 2017

వార్తల్లో వ్యక్తులు నవంబరు 2012

వార్తల్లో వ్యక్తులు నవంబరు 2012
శక్తిమంతమైన మహిళ చందా కొచర్భారతదేశపు అత్యంత శక్తిమంతమైన మహిళా వ్యాపారవేత్తగా ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ, సీఈవో చందా కొచర్ నిలిచారు. ఫార్చూన్ మ్యాగజైన్ రూపొందించిన ఈ జాబితాలో వరుసగా రెండో ఏడాది కూడా ఆమెకు మొదటి స్థానం దక్కింది. ‘టాఫే’కు చెందిన మల్లిక శ్రీనివాసన్ రెండు, క్యాప్‌జెమినీకి చెందిన అరుణ జయంతి మూడో స్థానాల్లో నిలిచారు. ఫార్చూన్ మ్యాగజైన్ 50 మందితో రూపొందించిన ఈ జాబితాలో ఈ ఏడాది ఆరుగురు కొత్త వారికి చోటు దక్కింది. అత్యధిక వార్షిక వేతనం పొందుతున్న భారత మహిళా వ్యాపారవేత్తగా సన్ టీవీ నెట్‌వర్‌‌కగ్రూప్ ఈడీ కావేరి కళానిధి (కళానిధి మారన్ భార్య) నిలిచారు. పెనిన్సులా ల్యాండ్ చైర్‌పర్సన్ ఉర్వి ఏ పిరమళ్ రెండో స్థానంలో, అపోలో హాస్పిటల్ ఎంటర్‌ప్రైజెస్ ఎండీ ప్రీతా రెడ్డి మూడో స్థానంలో ఉన్నారు.

ఆంగ్‌సాన్ సూచీ భారత పర్యటనమయన్మార్ విపక్ష నాయకురాలు, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఆంగ్‌సాన్ సూచీ నవంబర్ 13 నుంచి ఆరు రోజుల పాటు భారత్‌లో పర్యటించారు. నాలుగు దశాబ్దాల తర్వాత యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆహ్వానంపై ఆమె భారత పర్యటనకు వచ్చారు. నవంబర్ 14న ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌తో భేటీ అయ్యారు. అంతర్జాతీయ అవగాహనకు ఇచ్చే జవహర్‌లాల్ నెహ్రూ అవార్డును సూచీ ఈ పర్యటనలో స్వీకరించారు. ఈ పురస్కారానికి సూచీని 1995లోనే ఎంపిక చేసినా.. గృహనిర్బంధంలో ఉండటంతో అప్పట్లో ఆమె ఈ అవార్డును అందుకోలేకపోయారు. బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ), ఇన్ఫోసిస్ క్యాంపస్‌లను కూడా సందర్శించారు. నవంబర్ 17న అనంతపురం జిల్లా పాపసానిపల్లి గ్రామాన్ని సందర్శించి.. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పరిశీలించారు. ఆంగ్‌సాన్ సూచీకి భారత్‌తో చిరకాల అనుబంధం ఉంది. ఆమె తండ్రి జనరల్ ఆంగ్‌సాన్‌కు భారత తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూతో స్నేహం ఉండేది. సూచీ తల్లి ఖిన్‌కీ భారత్‌లో బర్మా రాయబారిగా పనిచేశారు. అప్పట్లో సూచీ ఢిల్లీలోని కాన్వెంట్ ఆఫ్ జీసస్ అండ్ మేరీ స్కూల్, లేడీ శ్రీరామ్ కాలేజీల్లో చదువుకున్నారు. కాగా, సిమ్లాలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీస్ సూచీని 1990లో గౌరవ పరిశోధకురాలిగా ఎంపిక చేసింది. 

బాల్ ఠాక్రే కన్నుమూతశివసేన వ్యవస్థాపకుడు బాలా సాహెబ్ కేశవ్ ఠాక్రే (86) నవంబర్ 17న ముంబైలో అనారోగ్యంతో మరణించారు. మహారాష్ట్ర ప్రజల హక్కుల సాధనకు 1966, జూన్ 19 ఠాక్రే శివసేన పార్టీని స్థాపించారు. 1989లో శివసేన పార్టీ పత్రిక సామ్నాను ప్రారంభించారు. రాజకీయాల్లోకి రాకముందు ఆయన ఫ్రీ ప్రెస్ జర్నల్, టైమ్స్ ఆఫ్ ఇండియాలోనూ కార్టూనిస్ట్‌గా పని చేశారు. తర్వాత సొంతంగా ‘మార్మిక్’ అనే రాజకీయ వీక్లీని ప్రారంభించారు. ఠాక్రే 1926, జనవరి 23న పుణే లో జన్మించారు.అమీ బెరా గెలుపుఅమెరికా అధ్యక్ష ఎన్నికలతోపాటు ప్రతినిధుల సభకు జరిగిన ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరఫున ఏడో కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ (ప్రతినిధుల సభ నియోజకవర్గం)నుంచి బరిలో దిగిన భారత సంతతి అభ్యర్థి డాక్టర్ అమీ బెరా విజయం సాధించారు. తద్వారా అమెరికా ప్రతినిధుల సభలో అడుగు పెట్టనున్న భారత సంతతికి చెందిన మూడో వ్యక్తిగా బెరా ఘనత సాధించారు. ఇప్పటి వరకు భారత సంతతికి చెందిన మరో ఇద్దరు మాత్రమే ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు. వారు.. దలీప్ సింగ్ సౌంద్, బాబీ జిందాల్. దలీప్ సింగ్ సౌంద్ 1950లో తొలిసారి ఎన్నిక కాగా, బాబీ జిందాల్ 2005 నుంచి 2008 వరకు ప్రతినిధుల సభకు ప్రాతినిథ్యం వహించారు. లూసియానా రాష్ట్ర గవర్నర్‌గా కూడా పని చేశారు. ఈ ఎన్నికల్లోనే అమెరికా ప్రతినిధుల సభకు తొలిసారిగా ఎన్నికైన హిందూ అమెరికన్‌గా తులసి గ బార్డ్ రికార్డు సృష్టించారు. హవాయిలోని రెండో కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి ఆమె ఎన్నికైన తులసి ఇరాక్ యుద్ధంలో పాల్గొన్నారు. తద్వారా యుద్ధంలో పాల్గొని ప్రతినిధుల సభకు ఎన్నికైన తొలి మహిళగా కూడా ఆమె చరిత్రకెక్కారు. తులసి 2002లో 21 ఏళ్ల పిన్న వయసులోనే హవాయి రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యారు.

కన్సాస్ అసెంబ్లీకి గాంధీ మునిమనవడి ఎన్నికఅధ్యక్ష ఎన్నికలతోపాటు అమెరికాలోని కన్సాస్ రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో మహాత్మాగాంధీ మునిమనవడు శాంతి గాంధీ విజయం సాధించారు. ఈయన కన్సాస్ 52వ అసెంబ్లీ డిస్ట్రిక్ట్ నుంచి ఎన్నికయ్యా రు. కన్సాస్‌లో టొపేకా నగరంలోని స్టోర్మాంట్-వయిల్ ఆస్పత్రిలో హృద్రోగ నిపుణుడిగా పనిచేసిన శాంతి గాంధీ, 2010లో ఉద్యోగ విరమణ చేశాక రాజకీయాల్లోకి వచ్చారు. మహాత్మాగాంధీ మనవడు కాంతిలాల్ గాంధీ కుమారుడైన శాంతి గాంధీ బాంబే వర్సిటీలో వైద్యవిద్య పూర్తి చేసుకున్న తర్వాత 1967లో అమెరికాకు వలస వెళ్లారు.
 
కేంద్ర మాజీ మంత్రి ఎర్రన్నాయుడు మృతి 
కేంద్ర మాజీ మంత్రి ఎర్రన్నాయుడు (55) నవంబర్ 2న శ్రీకాకుళం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈయన 1998-99లో ఎన్‌డీఏ ప్రభుత్వంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి, ఉపాధి శాఖల మంత్రిగా పని చేశారు. 1983లో శ్రీకాకుళం జిల్లా హరిశ్చంద్రాపురం నుంచి తొలిసారి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. తర్వాత 1985, 89, 94లో కూడా ఎమ్మెల్యేగా కొనసాగారు. 1996, 98, 99, 2004లో వరుసగా శ్రీకాకుళం నుంచి లోక్‌సభకు ప్రాతినిథ్యం వహించారు. 

పాత్రికేయుడు సీతారామ్ మృతిఒకనాటి ప్రముఖ పాత్రికేయుడు, యునెటైడ్ న్యూస్ ఆఫ్ ఇండియా (యూఎన్‌ఐ) మాజీ బ్యూరోచీఫ్ డి. సీతారామ్ (87) నవంబర్ 5న హైదరాబాద్‌లో మరణించారు. ది స్టేట్స్‌మెన్, ఎకనామిక్ టైమ్స్, ది పోట్రెయిట్, దక్కన్ క్రానికల్ వంటి పత్రికల్లో ఆయన పనిచేశారు. 

షర్మిలా చాను దీక్షకు 12 ఏళ్లుపౌర హక్కుల కార్యకర్త ఐయోమ్ షర్మిలా చాను(41) చేపట్టిన దీక్షకు నవంబర్ 5, 2012 నాటికి 12 ఏళ్లు పూర్తయ్యాయి. మణిపూర్‌లో సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం (ఏఎఫ్‌ఎస్‌పీఏ) రద్దు డిమాండ్‌తో ఆమె 2000 సంవత్సరం నుంచి మొక్కవోని పట్టుదలతో నిరాహార దీక్ష చేస్తున్నారు. ఇంఫాల్ లోయలోని మలోమ్ వద్ద 2000, నవంబరు 2న అస్సాం రైఫిల్స్ జవాన్లు చేసిన ఎన్‌కౌంటర్‌లో 10 మంది ప్రజలు మృతిచెందారు. సంచలనం సృష్టించిన ఈ ఉదంతంపై గళమెత్తిన షర్మిల అమానుషమైన ఆ చట్టాన్ని రద్దుచేయాలంటూ నిరాహార దీక్ష చేపట్టి ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఆమెకు బలవంతంగా ముక్కుద్వారా ద్రవాహారాన్ని ఇస్తున్నారు.

No comments:

Post a Comment