AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Sunday 26 November 2017

చరిత్రలో ఈ నెల జూన్ 2017

చరిత్రలో ఈ నెల జూన్ (2 - 8) 2017 
అంతర్జాతీయంకాబూల్ ఆత్మాహుతి దాడిలో 90 మంది మృతి అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్‌లో మే 31న జరిగిన ఉగ్రదాడిలో చిన్నారులు, మహిళలు సహా 90 మంది మృతి చెందారు. మరో 400 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. భారీ పేలుడు పదార్థాలతో నింపిన ట్రక్కుతో ఓ ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. భారత రాయబార కార్యాలయానికి వంద మీటర్ల దూరంలోనే ఈ దాడి జరగటంతో ఎంబసీ భవనం స్వల్పంగా దెబ్బతింది. ఈ దాడిలో బీబీసీ చానల్‌కు చెందిన డ్రైవర్ మృతిచెందగా.. నలుగురు జర్నలిస్టులకు స్వల్ప గాయాలయ్యాయి.
క్విక్ రివ్యూ:ఏమిటి : ఆత్మాహుతి దాడిలో 90 మంది మృతి 
ఎప్పుడు : మే 31
ఎక్కడ : కాబూల్, అఫ్గనిస్తాన్ 

పోలండ్‌లో 2018 వాతావరణ సదస్సు2018లో వాతావరణ మార్పు సదస్సును (యూఎన్‌సీసీసీ) పోలండ్‌లోని కతావీజ్ నగరంలో నిర్వహిస్తామని ఐక్యరాజ్యసమితి తెలిపింది. కతావీజ్ నగరం బొగ్గును అధికంగా ఉత్పత్తి చేస్తూ.. యూరోప్‌లోనే అత్యంత కలుషిత ప్రాంతంగా పేరుగాంచింది. ఐరాస నిర్ణయం వల్ల ఇక్కడ పునరుత్పాదక ఇంధనాల వాడకం పెరుగుతుందని పర్యావరణ వేత్తలు ఆశాభావం వ్యకం చేశారు. పోలండ్‌లో ఇంతకుముందు 2008లో పోజ్నన్, 2013లో వార్సా నగరాల్లో ఈ సదస్సులు నిర్వహించారు. 
క్విక్ రివ్యూ:
ఏమిటి :
 2018 వాతావరణ సదస్సు 
ఎక్కడ : పోలాండ్‌లో 
ఎవరు : ఐరాస 

పారిస్ ఒప్పందం నుంచి వైదొలగిన అమెరికా
గ్లోబల్ వార్మింగ్ ముప్పు నుంచి భూగోళాన్ని రక్షించే ఉద్దేశంతో కుదుర్చుకున్న పారిస్ పర్యావరణ ఒప్పందం 2015 నుంచి వైదొలగుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ ఒప్పందం భారత్, చైనాలకు అనుకూలంగా ఉందని, అమెరికా ప్రయోజనాలకు తీవ్ర నష్టం కలిగిస్తుందని ఆరోపిస్తూ ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. దీని ప్రకారం చైనా.. 13 ఏళ్ల పాటు కర్బన ఉద్గారాల్ని విడుదల చేయవచ్చని.. అమెరికాకు ఆ మినహాయింపు లేదని ఒప్పందాన్ని తప్పుపట్టారు. ఈ నేపథ్యంలో ఒప్పందాన్ని కొనసాగిస్తామని చైనా ప్రధాని లీ కెకియాంగ్, ఒప్పందానికి భారత్ కట్టుబడి ఉందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. అమెరికాలోని పలు నగరాలు, రాష్ట్రాల ప్రతినిధులు పారిస్ ఒప్పందానికి కట్టుబడి ఉండేందుకు ‘యునెటైడ్ స్టేట్స్ క్లైమేట్ అలయన్స్‌ను ఏర్పాటు చేసి ఐక్యరాజ్యసమితిని సంప్రదించనున్నారు.
పారిస్ ఒప్పందం అంటే?పెట్రోన్స్‌లు, డీజిల్ వంటి ఇంధనాల అధిక వాడకం, పారిశ్రామికీకరణతో భూగోళం వేడెక్కుతోంది. ఫలితంగా కార్బన్‌డయాకై ్సడ్ వంటి గ్రీన్‌హౌస్ వాయువుల మోతాదు పెరిగి అకాల వర్షాలు, వరదలు, కరువు వంటి అనేక పరిణామాలు కలగనున్నాయి. దీనిని నివారించేందుకు ఈ శతాబ్దం చివరికి భూమి సగటు ఉష్ణోగ్రత పెరుగుదలను 2 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేయాలన్న లక్ష్యంతో 2015లో ఏర్పాటు చేసుకున్న ఒప్పందమే పారిస్ ఒప్పందం. దీనిపై 195 దేశాలు సంతకాలు చేశాయి. సంప్రదాయేతర ఇంధన వనరుల వాడకం, కర్బన ఉద్గారాల తగ్గింపు వంటి చర్యలతో దీన్ని సాధించాలన్నది ఒప్పంద సంకల్పం.
ఒప్పదంలో భాగంగా అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా 2025 నాటికి కర్బన ఉద్గారాలను 26 నుంచి 28 శాతం (200 కోట్ల టన్నులు) తగ్గిస్తామని ప్రకటించారు. ప్రపంచ దేశాలన్నీ భాగస్వాములుగా ఉన్న యునెటైడ్ నేషన్స్‌ గ్రీన్ కై ్లమెట్ ఫండ్‌కు ఏటా రూ. 6.5 లక్షల కోట్లు జమ చేయాలన్న లక్ష్యానికి అనుగుణంగా ఒబామా అమెరికా తరఫున వంద కోట్ల డాలర్లు అందజేశారు. ఇప్పుడు అమెరికా వైదొలిగితే పారిస్ ఒప్పంద లక్ష్యాన్ని చేరుకోవడం కష్టమే. దీని వల్ల మిగిలిన దేశాలపై భారం పడనుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
 పారిస్ ఒప్పందం నుంచి వైదొలగనున్న అమెరికా
ఎప్పుడు : జూన్ 2
ఎవరు : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన
ఎందుకు : ఒప్పందం అమెరికా ప్రయోజనాలకు ప్రతికూలంగా ఉందని

కాసినోపై కాల్పుల్లో 37 మంది మృతి
ఫిలిప్పీన్స్‌ రాజధాని మనీలాలోని ఓ కాసినోపై జరిపిన కాల్పుల్లో 37 మంది మృతి చెందారు. 14 కోట్ల విలువజేసే కాసినో చిప్స్(ఆట కోసం వాడే కాయిన్స్‌) దోపిడీ కోసం గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపాడు. కాసినోలో ఏర్పాటు చేసిన పెద్ద టీవీ తెరపై కాల్పులు జరపడంతో అది పేలీ దట్టమైన పొగలు వ్యాపించాయి. దీంతో అక్కడ జరిగిన తొక్కిసలాటలో 37 మృతి చెందటంతో పాటు పదుల సంఖ్యలో గాయపడ్డారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
 కాసినోపై జరిపిన కాల్పుల్లో 37 మంది మృతి
ఎప్పుడు : జూన్ 2
ఎవరు : గుర్తు తెలియని వ్యక్తి
ఎందుకు : కాసినో చిప్స్ దోపిడీ కోసం

ఖతర్‌తో సంబంధాలు తెంచుకున్న 5 అరబ్ దేశాలు ఖతర్ ఉగ్రవాదానికి ఊతమిస్తోందంటూ ఆ దేశంతో సౌదీ అరేబియా సహా ఐదు అరబ్ దేశాలు దౌత్యసంబంధాలను తెగతెంపులు చేసుకున్నాయి. దక్షిణాసియా ద్వీపదేశం మాల్దీవులు కూడా ఖతర్‌ను వెలేసింది. ఈ మేరకు ఖతర్‌తో సంబంధాలను తెంచుకుంటున్నామని లిబియాలోని సమాంతర ప్రభుత్వాల్లో ఒకటైన తూర్పు లిబియాలోని ప్రభుత్వం జూన్ 5న తెలిపింది. 
చుట్టుపక్కల ప్రాంతాన్ని అస్థిరపరిచేందుకు ఖతర్ పలు ఉగ్రవాద గ్రూపులకు మద్దతిస్తోందని సౌదీ, యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ), బహ్రెయిన్, యెమన్, ఈజిప్టు జూన్ 5న ఆరోపించాయి. ఖతర్‌తో రవాణా మార్గాలను మూసేస్తున్నామని, తమ దేశంలోని ఖతర్ పౌరులు రెండువారాల్లోగా వెళ్లిపోవాలని ఆదేశించాయి. 
తమ పౌరులు ఖతర్‌కు వెళ్లొద్దని, తమ దేశాల్లోని ఖతర్ పౌరులు 14 రోజుల్లోగా వెళ్లిపోవాలని అరబ్ దేశాలు ఆదేశించాయి. ఖతర్‌తో ఉన్న సరిహద్దులను మూసేస్తున్నట్లు సౌదీ తెలిపింది. జూన్ 6 నుంచి ఖతర్‌కు తమ సర్వీసులను నిలిపేస్తున్నట్లు ఎమిరేట్స్, ఇతిహాద్, ఫ్లైదుబాయ్, ఎయిర్ అరేబియా, సౌదీ అరేబియా ప్రకటించాయి. సౌదీకి తమ సర్వీసులను తక్షణం మూసేస్తున్నట్లు ఖతర్ కూడా ప్రకటించింది. ఖతర్‌కు విమాన సర్వీసులను నిలిపేస్తున్నట్లు ఈజిప్టు తెలిపింది. యెమన్‌లో ఇరాన్ మద్దతున్న రెబల్స్‌పై పోరాడుతున్న సౌదీ నేతృత్వంలోని కూటమి తమ గ్రూపు నుంచి ఖతర్‌ను బహిష్కరిస్తున్నట్లు తెలిపింది. ఇంధన వనరులు పుష్కలంగా ఉన్న ఖతర్‌తో పొరుగు దేశాల తెగతెంపుల నిర్ణయం పశ్చిమాసియాలోనే కాకుండా పాశ్చాత్య దేశాల ప్రయోజనాలపైనా తీవ్ర ప్రభావం చూపనుంది. ఐసిస్, తదితర ఉగ్ర సంస్థలపై పోరులో కీలకమైన అమెరికా ఎయిర్‌బేస్ ఖతర్‌లో ఉంది. 2022లో ఫుట్‌బాల్ వరల్డ్ కప్ క్రీడలు ఖతర్‌లోనే జరగనున్నాయి. 
క్విక్ రివ్యూ: ఏమిటి : ఖతర్‌తో దౌత్యసంబంధాలు తెంచుకున్న 5 అరబ్ దేశాలు 
ఎప్పుడు : జూన్ 5 
ఎవరు : సౌదీ, యూఏఈ, బహ్రెయిన్, యెమన్, ఈజిప్టు 

చైనా, నేపాల్ మధ్య జలవిద్యుత్ ప్రాజెక్టు ఒప్పందం 
నేపాల్, చైనా సరిహద్దులో నిర్మించనున్న బుధిగందకి జలవిద్యుత్ ప్రాజెక్టు కోసం రెండు దేశాల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ మేరకు నేపాల్ రాజధాని కాట్మాండులో జూన్ 6న ఒప్పందంపై రెండు దేశాల ప్రతినిధులు సంతకాలు చేశారు. ఇంజినీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కన్‌స్ట్రక్షన్, ఫైనాన్స్ (ఈపీసీఎఫ్) మోడల్‌లో ప్రాజెక్టు నిర్మాణం జరగనుంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి :
 నేపాల్, చైనా మధ్య ఒప్పందం 
ఎప్పుడు : జూన్ 6 
ఎక్కడ : కాట్మాండులో 
ఎందుకు : బుధిగందకి జలవిద్యుత్ ప్రాజెక్టు నిర్మాణం కోసం

జాతీయంనేతాజీ 1945లో చనిపోయారు: క్రేంద్ర హోంశాఖనేతాజీ సుభాష్ చంద్రబోస్ 1945లోనే విమాన ప్రమాదంలో చనిపోయారని కేంద్ర ప్రభుత్వం మే 31న స్పష్టం చేసింది. నేతాజీ మృతిపై కోల్‌కతాకు చెందిన ఓ వ్యక్తి కేంద్ర హోం శాఖకు సమాచార హక్కు కింద గతంలో దరఖాస్తు చేశారు. షానవాజ్ కమిటీ, జస్టిస్ జీడీ ఖోస్లా కమిషన్, జస్టిస్ ముఖర్జీ కమిషన్‌ల నివేదికల్లోని సమాచారాన్ని విశ్లేషించిన అనంతరం నేతాజీ చనిపోయారనే నిర్ధారణకు వచ్చామని హోం శాఖ తెలిపింది. నేతాజీ కొన్ని రోజులపాటు గుమ్నమి బాబాగా మారువేషంలో జీవించారనే వాదనననూ అధికారులు కొట్టిపారేశారు. 
క్విక్ రివ్యూ:
ఏమిటి :
 నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1945లో చనిపోయారని స్పష్టీకరణ 
ఎప్పుడు : మే 31
ఎవరు : కేంద్ర హోంశాఖ 

ఐరాస సాధారణ అసెంబ్లీ చీఫ్‌గా లాజ్‌కాక్
స్లోవేకియా విదేశాంగ మంత్రి మిరోస్లావ్ లాజ్‌కాక్(54) ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీ తదుపరి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఫిజి దౌత్యవేత్త పీటర్ థాంప్సన్ స్థానంలో ఆయన ఈ బాధ్యతలు చేపట్టనున్నారు. సెప్టెంబర్‌లో మొదలయ్యే యూఎన్ 72వ సాధారణ అసెంబ్లీ సెషన్‌కు లాజ్‌కాక్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. గతేడాది యూఎన్ ప్రధాన కార్యదర్శి పదవికి పోటీపడ్డ వారిలో లాక్‌జాక్ ఒకరు. 
క్విక్ రివ్యూ:
ఏమిటి :
 ఐరాస సాధారణ అసెంబ్లీకి నూతన చీఫ్ 
ఎప్పుడు : మే 31 
ఎవరు : మిరోస్లావ్ లాజ్‌కాక్

భారత్ - స్పెయిన్ మధ్య 7 ఒప్పందాలు 
 
ఉగ్రవాదంపై పోరాటంతో పాటు వివిధ రంగాల్లో భారత్ - స్పెయిన్ పరస్పర సహకారంతో ముందుకెళ్లనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఆ దేశ పర్యటనలో భాగంగా మే 31న స్పెయిన్ అధ్యక్షుడు మారియానో రజోయ్‌తో ప్రధాని మోదీ విస్తృత చర్చలు జరిపారు. అనంతరం రెండు దేశాల మధ్య 7 ద్వైపాక్షిక ఒప్పందాలు జరిగాయి. 
శిక్షపడ్డ ఖైదీల పరస్పర మార్పిడి, దౌత్యపరమైన పాస్‌పోర్ట్ ఉన్నవారికి వీసా రద్దు, అవయవ మార్పిడి, సైబర్ సెక్యూరిటీ, పునరుత్పాదక శక్తి, పౌర విమానయాన, దౌత్య సేవల రంగాల్లో ఈ ఒప్పందాలు కుదిరాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి
 : భారత్ స్పెయిన్ మధ్య 7 ఒప్పందాలు 
ఎప్పుడు : మే 31
ఎక్కడ : మాడ్రిడ్, స్పెయిన్ 
ఎవరు : భారత ప్రధాని మోదీ, స్పెయిన్ ప్రధాని మారియానో రజోయ్

గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలన్న రాజస్థాన్ హైకోర్టుగోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని రాజస్థాన్ హైకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి మే 31న సూచించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంతో సమన్వయంగా పనిచేయాలని పేర్కొంది. జైపూర్‌లోని ప్రభుత్వ గోశాలలో గతేడాది వందకుపైగా ఆవులు మృత్యువాతపడటంపై దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా జస్టిస్ మహేశ్ చంద్ శర్మ (ఏక సభ్య ధర్మాసనం) తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

ఐఎండీ పోటీతత్వ జాబితాలో 45వ స్థానంలో భారత్ 
అంతర్జాతీయంగా పోటీతత్వంతో కూడిన దేశాల్లో భారత్ గతేడాదితో పోల్చుకుంటే నాలుగు స్థానాలు పడిపోయి 45వ స్థానంలో నిలిచింది. ఈ మేరకు ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ మేనేజ్‌మెంట్ డెవలప్‌మెంట్స్ (ఐఎండీ) 63 దేశాల ర్యాంకులను వెల్లడిస్తూ జూన్ 3న జాబితాను విడుదల చేసింది. చైనా ఏడు స్థానాలు ముందుకు జరిగి 18వ స్థానం సంపాదించుకుంది. 
ఈ జాబితాలో హాంగ్‌కాంగ్ మొదటి స్థానంలో నిలవగా, స్విట్జర్లాండ్, సింగపూర్ రెండు, మూడో స్థానాల్లో ఉన్నాయి.
క్విక్ రివ్యూ:ఏమిటి : ఐఎండీ పోటీతత్వ జాబితా - 2017 
ఎప్పుడు : జూన్ 4 
ఎక్కడ : 45వ స్థానంలో భారత్ 
ఎవరు : ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ మేనేజ్‌మెంట్ డెవలప్‌మెంట్స్

యుద్ధరంగంలోకి మహిళలను అనుమతించనున్న భారత్ ఆర్మీ 
భారత సైన్యం భారీ మార్పులకు శ్రీకారం చుడుతోంది. లింగపరమైన అడ్డంకులను అధిగమిస్తూ యుద్ధరంగంలోకి మహిళ లను అనుమతించనుంది. ఇప్పటి వరకు యుద్ధ క్షేత్రంలో పోరాటంలో పురుషులు మాత్రమే కనిపించగా.. ఇక ముందు మహిళలు సైతం పాలుపంచుకోనున్నారు. ఈ మేరకు మహిళలను యుద్ధంలో అడుగుపెట్టేందుకు అనుమతిస్తామని, దీనికి సంబంధించిన మార్పులకు రంగం సిద్ధం చేశామని భారత ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ జూన్ 4న వెల్లడించారు. పురుషులకు మాత్రమే పరిమితమైన ఈ హోదాలోకి ఇకపై మహిళలను అనుమతి స్తామన్నారు. ప్రస్తుతం ఈ ప్రక్రియ వేగంగా సాగుతోందని, తొలుతగా మహిళలను మిలిటరీ పోలీసులుగా రిక్రూట్‌మెంట్ చేసుకుంటామని చెప్పారు. 
ప్రస్తుతం మిలిటరీ విభాగానికి అనుసంధానంగా ఉండే మెడికల్, లీగల్, ఎడ్యుకేషనల్, సిగ్నల్స్, ఇంజనీరింగ్ విభాగాల్లో ఇప్పటికే మహిళకు అవకాశం కల్పిస్తున్నారు. 
ప్రస్తుతం జర్మనీ, ఆస్ట్రేలియా, కెనడా, అమెరికా, బ్రిటన్, డెన్మార్క్, ఫిన్లాండ్, ఫ్రాన్స్‌, నార్వే, స్వీడన్, ఇజ్రాయెల్ తదితర దేశాలు మాత్రమే యుద్ధరంగంలోకి మహిళలను అనుమతిస్తున్నాయి.

యూపీలో గోవధపై జాతీయ భద్రత చట్టంగోవధ, పశువుల అక్రమ రవాణాకు పాల్పడే వారిపై జాతీయ భద్రత చట్టం(ఎన్‌ఎస్‌ఏ), గ్యాంగ్‌స్టర్స్ చట్టం కింద కేసులు నమోదు చేస్తామని ఉత్తరప్రదేశ్ పోలీసులు ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ సుల్కన్ సింగ్ అన్ని పోలీస్ స్టేషన్లకు జూన్ 6న ఆదేశాలు జారీ చేశారు. గోరక్షక్ పేరుతో దాడులకు పాల్పడే వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీలను ఆదేశించారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి :
 గోవధపై జాతీయ భద్రత చట్టం 
ఎప్పుడు : జూన్ 6
ఎక్కడ : ఉత్తరప్రదేశ్‌లో 

పెండింగ్ కేసుల పరిష్కారానికి "న్యాయమిత్ర"దేశంలోని కిందిస్థాయి న్యాయస్థానాల్లో పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం న్యాయమిత్రలను నియమించనుంది. జూన్ 6న అలహాబాద్ హైకోర్టులో కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా టెలీ లా సర్వీస్ అందించే విధానాన్ని ప్రారంభించిన కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్.. ఈ విషయాన్ని వెల్లడించారు. విశ్రాంత న్యాయమూర్తులను న్యాయమిత్రలుగా నియమిస్తామని ప్రకటించారు. దేశవ్యాప్తంగా కోర్టుల్లో 7.50 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.
క్విక్ రివ్యూ: ఏమిటి : న్యాయమిత్రలుగా విశ్రాంత న్యాయమూర్తులు 
ఎప్పుడు : జూన్ 6 
ఎక్కడ : దేశవ్యాప్తంగా 
ఎవరు : కేంద్రన్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ 
ఎందుకు : పెండింగ్ కేసుల పరిష్కారానికి 

ప్రధాని మోదీ విదేశీ పర్యటనలుభారత ప్రధాని నరేంద్ర మోదీ.. ఫ్రాన్స్ పర్యటనలో ఆ దేశ నూతన అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మెక్రాన్‌తో జూన్ 3న సమావేశమయ్యారు. అనంతరం మోదీ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు భారత్ కట్టుబడి ఉందని, పారిస్ ఒప్పందానికి మించి కృషి చేస్తుందని తెలిపారు. మెక్రాన్ మాట్లాడుతూ భూ తాపానికి వ్యతిరేకంగా పోరాడేందుకు కట్టుబడి ఉన్నట్లు పునరుద్ఘాటించారు. రక్షణ సహకారం, సముద్ర జలాల భద్రత, ఉగ్రవాదంపై పోరుకు భారత్‌తో కలసి పని చేస్తామని తెలిపారు. 
రష్యా పర్యటన: మోదీ.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో జూన్ 1న భేటీ అయ్యారు. ఈ ఏడాదితో భారత్-రష్యా సంబంధాలకు ఏడు దశాబ్దాలు పూర్తయ్యాయి. తమిళనాడులోని కూడంకుళం అణు విద్యుదుత్పత్తి కేంద్రంలోని 5వ, 6వ యూనిట్‌ల నిర్మాణానికి రష్యా అంగీకరించింది. అణుశక్తి, రక్షణ, ఉగ్రవాదంపై పోరు, వాణిజ్యంతోపాటు పలు రంగాల్లో ఐదు ఒప్పందాలు కుదిరాయి. ఇంద్ర-2017 పేరిట త్రివిధ దళాల విన్యాసాలు నిర్వహించాలని ఇరువురు నేతలు నిర్ణయించారు. 
స్పెయిన్ పర్యటన: మోదీ.. స్పెయిన్ అధ్యక్షుడు మారియానో రజోయ్‌తో మే 31న సమావేశమయ్యారు. భారత్‌లో విస్తరించేందుకు స్పెయిన్ కంపెనీలకు అపార అవకాశాలు ఉన్నాయని, పెట్టుబడులతో రావాలని కోరారు. ఇరు దేశాల మధ్య ఖైదీల పరస్పర మార్పిడి, దౌత్యపరమైన పాస్‌పోర్టు ఉన్నవారికి వీసా రద్దు, అవయవ మార్పిడి, సైబర్ సెక్యూరిటీ, పునరుత్పాదక శక్తి, పౌర విమానయాన, దౌత్య సేవల రంగాల్లో ఏడు ఒప్పందాలు కుదిరాయి. 
జర్మనీ పర్యటన: మోదీ.. జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్‌తో మే 30న భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య 12 ఒప్పందాలు కుదిరాయి. వీటిలో.. సైబర్ పాలసీ, అభివృద్ధి పథకాలు, సుస్థిర పట్టణాభివృద్ధి, క్లస్టర్ మేనేజర్స్ అభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి, డిజిటలైజేషన్, రైల్వే భద్రత, ఒకేషనల్ శిక్షణ ప్రోత్సాహం తదితర రంగాలు ఉన్నాయి.

రాష్ట్రీయం
తెలంగాణరాష్ట్రావతరణ పురస్కారాలు - 2017
జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం రాష్ట్ర స్థాయి పురస్కారాలను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలందించిన 52 మందికి అవార్డులు ప్రకటించింది. ఈ పురస్కారం కింద ఒక్కొక్కరికి రూ.1,00,116 చొప్పున పారితోషకంతో పాటు శాలువా, జ్ఞాపికను అందించి సత్కరిస్తారు. 
పురస్కార గ్రహీతలు 1. సాహిత్యం - వెలపాటి రమారెడ్డి, అశారాజు, జుపాక సుభద్ర, అస్లాం ఫర్షోరి(ఉర్దూ)
2. శాస్త్రీయ నృత్యం - రాఘవరాజ్ భట్-మంగళా భట్, బి. సుదీర్ రావు
3. పేరిణి - పేరిణి కుమార్
4. జానపదం - దురిశెట్టి రామయ్య, కేతావత్ సోమ్లాల్, గడ్డమ్ సమ్మయ్య
5. సంగీతం - ఎం. రాజోల్కర్, వార్సి సోదరులు
6. సామాజిక సేవ - వందేమాతరం ఫౌండేషన్, యాకుబ్ బీ
7. జర్నలిజం - పీవీ శ్రీనివాస్, ఏ రమణకుమార్, బిత్తిరి సత్తి- సావిత్రి (రవి - శివజ్యోతి) ఎలక్ట్రానిక్ మీడియా, వి.సతీష్, మహ్మద్ మునీర్
8. ఫొటో జర్నలిజం - అనిల్ కుమార్
9. సినిమా జర్నలిజం - హెచ్. రమేశ్ బాబు
10. వైద్య రంగం - డాక్టర్ బిరప్ప, నిమ్స్, డాక్టర్ చారి (వెంకటాచారి), సిద్ధా మెడికల్ ఆఫీసర్
11. టీచర్స్ - డాక్టర్ ఏ వేణుగోపాల్ రెడ్డి, టీఎస్‌ఎం అండ్ జీ జూనియర్ కాలేజీ, వీణవంక, కరీంనగర్
12. అంగన్‌వాడీ టీచర్ - ఎం బిక్షపమ్మ
13. ఉద్యమ గానం- కోడారి శ్రీను, వొళ్లాల వాణి, అవునూరి కోమల, అభినయ శ్రీనివాస్
14. పెయింటింగ్ - తోట వైకుంఠం
15. శిల్పకళలు - శ్రీనివాస్ రెడ్డి
16. శాస్త్రవేత్త - డా. ఎస్ చంద్రశేఖర్, ఐఐసీటీ డెరైక్టర్
17. కామెంటరీ/ యాంకరింగ్ - మడిపల్లి దక్షిణామూర్తి
18. అర్చకుడు - పురాణం నాగయ్య స్వామి, కొక్కెర కిష్టయ్య (మేడారం)
19. ఆధ్యాత్మికవేత్త - ఎం సంగ్రామ్ మహరాజ్, ఉమాపతి పద్మనాభ శర్మ, మహ్మద్ ఖాజా షరీఫ్ షేక్ ఉల్ హదీస్ (మౌల్వీ), ప్రొఫెసర్ పెనుమాళ్ల ప్రవీణ్ ప్రబు సుధీర్ (బిషప్/ ఫాదర్)
20. థియేటర్ - దెంచనాల శ్రీనివాస్, వల్లంపట్ల నాగేశ్వర్ రావు
21. క్రీడలు - తెలంగాణ స్పోర్‌‌ట్స స్కూల్ - హకీంపేట్, ఎండల సౌందర్య (హాకీ)
క్విక్ రివ్యూ:ఏమిటి : రాష్ట్రావతరణ పురస్కారాలు - 2017 
ఎప్పుడు : జూన్ 2 
ఎవరు : తెలంగాణప్రభుత్వం 

మిషన్ అంత్యోదయకు ఏపీ నుంచి 2,584 గ్రామాలు 
కేంద్రం ప్రకటించిన మిషన్ అంత్యోదయ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 2,584 గ్రామాలు ఎంపిక కానున్నాయి. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని మండలాల నుంచి 4 - 5 గ్రామాల చొప్పున ఎంపిక చేసి, 2019 అక్టోబర్ 2వ తేదీ నాటికి ఆయా గ్రామాల్లో పేదరిక నిర్మూలనకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టేందుకు రాష్ట్రంలో మిషన్ అంత్యోదయ కార్యక్రమ అమలు విధి విధానాలను ఖరారు చేస్తూ ప్రభుత్వం మే 31న ఉత్తర్వులు జారీ చేసింది. నేరాలు తక్కువగా ఉండే గ్రామాలతో పాటు ఇప్పటికే ప్రతి ఇంటికి మరుగుదొడ్డి వసతి ఉన్న గ్రామాలను ఈ కార్యక్రమానికి ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించింది. 
జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతి నాటికి దేశవ్యాప్తంగా కనీసం 50 వేల గ్రామాల్లో పేదరిక నిర్మూలనే లక్ష్యంగా కేంద్రం మిషన్ అంత్యోదయ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. 
మిషన్ అంత్యోదయ లక్ష్యాలు - ఎంపికైన ప్రతి ఇంటికి పది వేల రూపాయల ఆదాయం కల్పించడం 
- ప్రతి ఇంట్లో కనీసం ఒక్కరికైనా ఏదైనా ఉపాధి రంగంలో నైపుణ్య శిక్షణ ఇప్పించడం. 
- జీవనోపాధికి గ్రామంలో ప్రతి ఇంటికి బ్యాంకు రుణం కల్పించడం
- గ్రామానికి మెరుగైన రోడ్డు వసతి కల్పించడం 
- ఎంపిక చేసిన గ్రామంలో ప్రతి ఒక్కరికీ విద్య, ఆరోగ్య సౌకర్యం అందుబాటులో ఉంచడం. 
క్విక్ రివ్యూ:ఏమిటి : 2,584 గ్రామాల్లో మిషన్ అంత్యోదయ 
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్‌లో 
ఎవరు : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 

వైద్యుల పదవీ విరమణ వయసు 63 ఏళ్లకు పెంపు
వైద్యులకు 60 ఏళ్లుగా ఉన్న పదవీ విరమణ వయసును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 63 ఏళ్లకు పెంచింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య మే 31న ఉత్తర్వులు జారీ చేశారు. వైద్య విద్యా సంచాలకులు, వైద్య విధాన పరిషత్, ప్రజారోగ్య శాఖలో పనిచేస్తున్న పీజీ వైద్యులు, పీజీ డిప్లొమో వైద్యులందరికీ ఈ పెంపు వర్తిస్తుంది. 2014లో రాష్ట్రం విడిపోకముందు వరకు పదవీ విరమణ వయసు 58 ఏళ్లుగా ఉండేది. ఆ తర్వాత దీన్ని 60 ఏళ్లకు పెంచారు. తాజాగా 63 ఏళ్లకు పెంచారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేసే వైద్యుల పదవీ విరమణ వయసు 62 ఏళ్లుగా ఉంది. 
ఎంబీబీఎస్ అర్హతతో మాత్రమే పనిచేసే వైద్యులకు ఈ పెంపు వర్తించదు. 
క్విక్ రివ్యూ:ఏమిటి : వైద్యుల పదవీ విరమణ వయసు 63 ఏళ్లకు పెంపు
ఎప్పుడు : మే 31
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్‌లో 
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 

సుధీర్ చంద్రారెడ్డికి గోపాలరత్న అవార్డు
తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లికి చెందిన వెదిరె సుధీర్ చంద్రారెడ్డి గోపాలరత్న పురస్కారానికి ఎంపికయ్యారు. మే 31న ప్రపంచ పాలదినోత్సవం సందర్భంగా ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డు అందుకున్నారు. పురస్కారం కింద రూ.3 లక్షల నగదు బహుమతి కూడా పొందారు. పాడి పరిశ్రమలో మెరుగైన ఫలితాలు సాధించిన వారికి ఏటా గోపాలరత్న జాతీయ అవార్డులను అందజేస్తారు. 
క్విక్ రివ్యూ:ఏమిటి : గోపాలరత్న అవార్డు - 2017
ఎప్పుడు : మే 31 
ఎక్కడ : న్యూఢిల్లీలో 
ఎవరు : సుధీర్ చంద్రారెడ్డి 
ఎందుకు : పాడి పరిశ్రమలో మెరుగైన ఫలితాలు సాధించినందుకు 

తెలంగాణ పోలీసులకు సీఎం సర్వోన్నత పతకాలురాష్ట్ర పోలీసు శాఖతో పాటు అగ్నిమాపక శాఖ, విజిలెన్స్‌, ఎస్పీఎఫ్ విభాగాల్లో ప్రతిభ కనబర్చిన అధికారులు, సిబ్బందికి రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం పతకాలు ప్రకటించింది. అత్యున్నతమైన ముఖ్యమంత్రి సర్వోన్నత పోలీసు పతకంతో పాటు మరో ఐదు విభాగాల్లో పతకాలకు ఎంపికైన వారి జాబితాను జూన్ 1న విడుదల చేశారు. ముగ్గురికి సీఎం సర్వోన్నత పోలీసు పతకం, 20 మందికి శౌర్య పతకాలు, ఐదుగురికి రాష్ట్ర మహోన్నత సేవా పతకాలు, 43 మందికి ఉత్తమ సేవా పతకాలు, 197 మందికి పోలీసు సేవా పతకాలు, 31 మందికి కఠిన సేవా పతకాలు దక్కాయి. 
ముఖ్యమంత్రి సర్వోన్నత పోలీసు పతకం
ఎన్.మల్లారెడ్డి, ఏసీబీ డిప్యూటీ డెరైక్టర్
పి.రాధాకిషన్‌రావు, అదనపు ఎస్పీ, ఇంటెలిజెన్స్‌
పి.జగదీశ్వర్, ఇన్‌స్పెక్టర్, మైలార్ దేవులపల్లి
క్విక్ రివ్యూ:ఏమిటి : తెలంగాణ పోలీసులకు పతకాలు 
ఎప్పుడు : జూన్ 2 
ఎవరు : తెలంగాణ ప్రభుత్వం 
ఎందుకు : రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో భాగంగా 

తెలంగాణ ఐటీ రంగం పురోగతి నివేదిక 2016-172022 నాటికి రాష్ట్ర ఐటీ ఉత్పత్తుల ఎగుమతులను రూ.1.20 లక్షల కోట్లకు పెంచడంతో పాటు 8 లక్షల కొత్త ఐటీ కొలువులు సృష్టిస్తామని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె. తారకరామారావు ప్రకటించారు. జూన్ 1న హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ రంగ పురోగతి వార్షిక నివేదికను ఆయన విడుదల చేశారు. 
నివేదికలోని ముఖ్యాంశాలు- 2016- 17లో తెలంగాణ ఐటీ ఉత్పత్తుల ఎగుమతులు రూ.85,470 కోట్లకు పెరిగి, 13.85 శాతం వృద్ధి సాధించాయి. ఇది జాతీయ సగటు కంటే 4% అధికం. 
- రాష్ట్రంలో 2016లో కొత్తగా 24,506 మందికి ఐటీ కొలువులు లభించాయి. దీంతో రాష్ట్రంలో ఐటీ ఉద్యోగుల సంఖ్య 4,31,891కు పెరిగింది. 
- త్వరలో ఖమ్మంలో ఐటీ పార్కు ప్రారంభం. 
‘టీ-వాలెట్’ ప్రారంభం 
నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ‘టీ-వాలెట్’ మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ- గవర్నెన్స్‌, ఎం- గవర్నెన్స్‌ (మొబైల్- గవర్నెన్స్‌)ను ప్రోత్సహిం చేందుకు ఈ యాప్‌ను ప్రవేశపెట్టారు.
క్విక్ రివ్యూ:ఏమిటి : తెలంగాణ ఐటీ పురోగతి నివేదిక 
ఎప్పుడు : 2016-17 
ఎక్కడ : హైదరాబాద్‌లో 
ఎవరు : ఐటీ మంత్రి కె.తారకరామారావు 

విశాఖలో బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జూన్ 1న సమావేశమైన రాష్ట్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. విశాఖ జిల్లా అచ్చుతాపురంలో బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు, సాగునీటి సంఘాలకు ఐదేళ్లకు ఓసారి ఎన్నికలు నిర్వహించడం, రేషన్ షాపుల్లో చక్కెర పంపిణీ ఆపాలని నిర్ణయం తీసుకున్నారు.
మంత్రివర్గ నిర్ణయాలు- విశాఖ జిల్లా అచ్యుతాపురంలో బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం అచ్చుతాపురం, రాంబిల్లి మండలాల్లో సుమారు 2,884.66 ఎకరాల భూమిని కేటాయిస్తూ మంత్రిమండలి తీర్మానం. 
- విజయవాడ మెట్రోకార్పోరేషన్‌కు రుణ పరిమితిని రూ.1859కోట్లనుంచి రూ.2,175 కోట్లకు పెంచుతూ నిర్ణయం. ఈ రుణాన్ని మెట్రో కార్పోరేషన్ హడ్కో నుంచి తీసుకోనుంది.
క్విక్ రివ్యూ:ఏమిటి : విశాఖలో బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్
ఎప్పుడు : జూన్ 1
ఎవరు : ఆంధ్రప్రదేశ్ కేబినెట్ 

లాంఫాంలో జియో స్పేషియల్ సెంటర్ ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు సమీపంలో ఉన్న లాంఫాం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో ఏర్పాటు చేసిన భౌగోళిక సాంకేతిక పరిజ్ఞాన కేంద్రం (జియో స్పేషియల్ టెక్నాలజీ సెంటర్) జూన్ 1న ప్రారంభమైంది. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, నేషనల్ రిమోట్ సెన్సింగ్ కేంద్రం, వ్యవసాయ శాఖ సంయుక్తంగా ఈ సెంటర్‌ను ఏర్పాటు చేశాయి. ఈ సెంటర్ ద్వారా వ్యవసాయం, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రపంచ నలుమూలల నుంచి తెలుసుకునేందుకు వీలుంటుంది. 
క్విక్ రివ్యూ:ఏమిటి : జియో స్పేషియల్ సెంటర్ ప్రారంభం 
ఎప్పుడు : జూన్ 1
ఎక్కడ : లాంఫాం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం, గుంటూరు

ఏపీలో బసవతారకం మదర్ కిట్లు
్రపభుత్వాసుపత్రుల్లో ప్రసవం చేయించుకున్న వారికి జులై 1 నుంచి బసవతారకం మదర్ కిట్లు పంపిణీ చేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. ఈ కిట్‌లో మఫ్లర్స్, రెండు ఫీడింగ్ గౌన్లు, ఫ్లాస్కు, బ్లాంకెట్ ఉంటాయి. జూన్ 20 నుంచి ప్రభుత్వాసుపత్రుల్లో మరణించిన వారిని ఇళ్లకు చేర్చేందుకు మహాప్రస్థానం కార్యక్రమం ప్రారంభించనున్నారు.
క్విక్ రివ్యూ:ఏమిటి : బసవతారకం మదర్ కిట్స్
ఎప్పుడు : జులై 1
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎందుకు : ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించడానికి

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలుతెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జూన్ 2న హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసు దళాల వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా వచ్చే యాసంగి (రబీ) నుంచే వ్యవసాయానికి 24 గంటల పాటు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తామని ప్రకటించారు. మాతాశిశు సంరక్షణకు ఉద్దేశించిన రూ.15 వేల విలువైన ‘కేసీఆర్ కిట్’ పథకం జూన్ 3 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపారు.
ఇటీవల కాగ్ వెల్లడించిన నివేదిక ప్రకారం 2016-17 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ 17.82 శాతం ఆదాయ వృద్ధిరేటుతో దేశంలోనే అగ్రస్థానంలో నిలవడం గర్వకారణమని కొనియాడారు.
క్విక్ రివ్యూ:ఏమిటి : రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు
ఎప్పుడు : జూన్ 2
ఎవరు : తెలంగాణ ప్రభుత్వం


కేసీఆర్ కిట్ పథకం ప్రారంభంప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించడం, సిజేరియన్ల సంఖ్యను తగ్గించేందుకు ఉద్దేశించిన కేసీఆర్ కిట్ పథకంను ముఖ్యమంత్రి కేసీఆర్ జూన్ 3న హైదరాబాద్‌లో ప్రారంభించారు. రెండు కాన్పులకు వర్తించే ఈ పథకంలో ఒక్కో కాన్పునకు రూ.2 వేల విలువైన కేసీఆర్ కిట్‌ను అందజేస్తారు. ఆడబిడ్డ పుడితే రూ.13 వేలు, మగబిడ్డ పుడితే రూ.12 వేలు అందిస్తారు. రాష్ట్రంలోని 9 బోధన, ఆరు జిల్లా ఆసుపత్రులతో సహా మొత్తం 841 ఆసుపత్రుల్లో ఈ పథకాన్ని అమలు చేస్తారు.
కిట్‌లో అందించే వస్తువులు..
శిశువు కోసం..దోమతెర బేబీ బెడ్, దుస్తులు 
రెండు టవల్స్ బేబీ న్యాప్కిన్స్‌
బేబీ పౌడర్ బేబీ షాంపూ
బేబీ ఆయిల్ బేబీ సబ్బు
బేబీ సోప్‌బాక్స్ ఆట వస్తువులు
తల్లి కోసం
రెండు చీరలు రెండు సబ్బులు
కిట్ బ్యాగ్ ప్లాస్టిక్ బకెట్
క్విక్ రివ్యూ:
ఏమిటి :
 కేసీఆర్ కిట్ పథకం ప్రారంభం
ఎప్పుడు : జూన్ 3
ఎవరు : తెలంగాణ ప్రభుత్వం
ఎందుకు : ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించడం

తెలంగాణ ఇంటి పార్టీ ఆవిర్భావంసామాజిక తెలంగాణ సాధనే ధ్యేయంగా ‘తెలంగాణ ఇంటి పార్టీ’ని స్థాపిస్తున్నట్లు తెలంగాణ ఉద్యమ నాయకుడు చెరుకు సుధాకర్ అన్నారు. ఈ మేరకు జూన్ 2న హైదరాబాద్‌లో జరిగిన ఆవిర్భావ సభలో పార్టీ ఏర్పాటును ప్రకటించారు. మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క, పలువురు మలిదశ తెలంగాణ ఉద్యమకారులతో ఈ పార్టీ ప్రారంభమైంది.
క్విక్ రివ్యూ:ఏమిటి : తెలంగాణ ఇంటి పార్టీ ప్రారంభం
ఎప్పుడు : జూన్ 2
ఎవరు : చెరుకు సుధాకర్
ఎందుకు : సామాజిక తెలంగాణ సాధనకు

ఏపీలో సర్పంచ్ పదవికి టెన్త్ తప్పనిసరి
ఆంధ్రప్రదేశ్‌లో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ తదితర పదవుల పోటీకి టెన్త్ విద్యార్హతను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. గ్రామ సర్పంచులకు చెక్‌పవర్ ఉండడం స్థానికంగా గెలిచిన వారి స్థానంలో వేరొకరు పెత్తనం చెలాయించడం వంటి కారణాలతో కేంద్రం ఈ నిబంధనను ప్రతిపాదించింది. హర్యానా తదితర రాష్ట్రాల్లో కనీస విద్యార్హత ఉండడం వల్ల.. స్థానిక పాలన మెరుగ్గా ఉందని అధ్యయనం చేసిన లోక్‌సభ అంచనాల కమిటీ.. స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి దేశవ్యాప్తంగా కనీస విద్యార్హత ఉండాలని ప్రతిపాదిస్తూ కేంద్రానికి నివేదిక అందజేసింది.
క్విక్ రివ్యూ:ఏమిటి : స్థానిక సంస్థల పదవుల పోటీకి టెన్త్ తప్పనిసరి
ఎప్పుడు : త్వరలో
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎందుకు : అధికార దుర్వినియోగంను నివారించడానికి

ఉత్తమ ‘డిజిటల్ సేవకుడు’బెజ్జంకి రవితెలంగాణలోని సిద్ధిపేట జిల్లా బెజ్జంకిలోని కామన్ సర్వీస్ సెంటర్‌లో డిజిటల్ సేవకుడిగా పనిచేస్తున్న మానాల రవి ప్రతిష్టాత్మకమైన స్కోచ్ సీఎస్‌సీ పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ నెల 20న ముంబైలో ప్రధాని నరేంద్రమోదీ, మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్, కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ నుంచి రవి ఈ అవార్డును అందుకోనున్నారు.
క్విక్ రివ్యూ: 
ఏమిటి :
 స్కోచ్ సీఎస్‌సీ అవార్డు - 2017
ఎప్పుడు : జూన్ 5 
ఎవరు : మానాల రవి

మెడికల్, టూరిజం హబ్‌గా అరకు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ జిల్లా అరకును మెడికల్, టూరిజం హబ్‌గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ మేరకు జూన్ 6న రాజధాని అమరావతి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అరకులో నవనిర్మాణ దీక్ష, ఇంటింట దీపం పథకాలని ఆయన ప్రారంభించారు. రాష్ట్రంలోని అర్హులైన అన్ని పేద కుటుంబాలకు 2018 నాటికి దీపం పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్లు ఇచ్చి పొగరహిత రాష్ట్రంగా చేయాలని సంకల్పిస్తున్నామని చెప్పిన సీఎం... త్వరలో విశాఖ జిల్లాను సంపూర్ణ పొగరహిత జిల్లాగా చేయనున్నట్టు తెలిపారు. 
రాష్ట్రంలో గిరిజనుల ఆరోగ్యం, అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ‘ట్రై’(టీఆర్‌వై) అనే పథకాన్ని ప్రవేశపెడుతున్నామని, ఇందులోకి అన్ని శాఖల్ని తీసుకొచ్చి మూడు నెలలకొకసారి ప్రగతిని సమీక్షిస్తానని సీఎం చెప్పారు. వచ్చే ఆరునెలల్లో విశాఖ జిల్లాలోని అన్ని గిరిజన ప్రాంతాల్లో ఫైబర్ నెట్ సదుపాయాన్ని కల్పిస్తామన్నారు. అనంతరం ఆ ప్రాంతాల్లోని పాఠశాలలకు డిజిటల్ క్లాసులు ప్రారంభిస్తామని వెల్లడించారు. 
క్విక్ రివ్యూ: ఏమిటి : ఏపీలో తొలి పొగ రహిత జిల్లా
ఎప్పుడు : జూన్ 6
ఎవరు : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు 

ఆర్థికం
2016-17లో భారత్ వృద్ధి 7.1 శాతం
2016-17 ఆర్థిక సంవత్సరంలో భారత స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) మూడేళ్ల కనిష్ఠ స్థాయి 7.1 శాతంగా నమోదయింది. జీడీపీలో దాదాపు 60 శాతం వాటా ఉన్న సేవల రంగం, అలాగే 15 శాతం వాటా ఉన్న తయారీ రంగం పేలవ పనితనాన్ని కనబరిచాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం దేశ ఆర్థిక గణాంకాలను మే 31న విడుదల చేసింది. 
కేంద్ర గణాంకాల్లో ముఖ్యాంశాలు - 2015-16లో జీడీపీ వృద్ధి రేటు 8 శాతం. 2014-15లో 7.5 శాతం. 
- 2016-17లో వ్యవసాయ రంగం మాత్రం గణనీయమైన వృద్ధిని సాధించింది. 0.7 శాతం క్షీణత నుంచి 4.9 శాతం వృద్ధి బాటకు ఈ రంగం మళ్లింది. నాల్గవ త్రైమాసికంలో కూడా వ్యవసాయ రంగం వృద్ధి 1.5% నుంచి 5.2%కి చేరింది. 
- స్థూల విలువ ఆధారిత (జీవీఏ) వృద్ధి రేటు నాల్గవ త్రైమాసికంలో భారీగా 5.6 శాతానికి పడిపోయింది. ఈ రేటు 2015 జనవరి-మార్చిలో 8.7 శాతంగా ఉంది. 
- డీమోనిటైజేషన్ కాలంలో నిర్మాణ రంగం తీవ్రంగా దెబ్బతింది. మార్చి త్రైమాసికంలో ఈ రంగంలో వృద్ధిలేకపోగా -3.7%కి క్షీణించింది. 2015-16 ఇదే కాలంలో దీని వృద్ధి రేటు 6%. 
- తయారీ రంగంలో వృద్ధి రేటు 10.8 శాతం నంచి 7.9 శాతానికి పడిపోయింది. 
- మైనింగ్, క్వారీయింగ్ రంగంలో క్షీణత - 10.5 శాతం నుంచి -1.8 శాతానికి చేరింది. 
- పెట్టుబడులకు సూచికగా ఉన్న స్థూల స్థిర మూలధన కల్పన రూ.40.03 లక్షల కోట్ల నుంచి రూ.41.18 లక్షల కోట్లకు చేరింది. 
నెరవేరిన ద్రవ్యలోటు లక్ష్యం..2016-17 ఆర్థిక సంవత్సరం కేంద్రం ద్రవ్యలోటు (వచ్చే ఆదాయం- చేసే వ్యయం మధ్య వ్యత్యాసం) లక్ష్యాన్ని సాధించింది. జీడీపీలో 3.5 శాతం ద్రవ్యోలోటును కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. విలువ రూపంలో ఇది రూ.5.35 లక్షల కోట్లు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటును జీడీపీలో 3.2 శాతానికి కట్టడి చేయాలన్నది లక్ష్యం. 
తలసరి ఆదాయం 9.7 % వృద్ధి2015-16తో పోల్చిచూస్తే, 2016-17లో తలసరి ఆదాయం 9.7% పెరిగింది. ఈ విలువ రూ.94,130 నుంచి రూ.1,03,219 కి చేరింది. 
క్విక్ రివ్యూ:ఏమిటి : 7.1 శాతంగా నమోదైన భారత వృద్ధి రేటు 
ఎప్పుడు : 2016-17లో 
ఎవరు : కేంద్ర ప్రభుత్వం 

గరీబ్ కల్యాణ్ యోజన డిపాజిట్లు 5 వేల కోట్లు 
ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన (పీఎంజీకేవై) కింద దాదాపు రూ.5 వేల కోట్ల విలువైన డిపాజిట్లు మాత్రమే వచ్చాయని కేంద్ర రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అథియా జూన్ 1న ప్రకటించారు.
నల్లధనం వెల్లడికి అవకాశమిస్తూ ప్రభుత్వం 2017 డిసెంబరు 17న ఈ పథకాన్ని ప్రారంభించింది. లెక్కల్లోకి రాని ఆదాయంను ఈ పథకం కింద ప్రకటించి, ఆ డబ్బును ప్రభుత్వం వద్ద జమ చేయాలి. అందులో 50 శాతాన్ని ప్రభుత్వం పన్ను, సర్‌చార్జీ, జరిమానా కింద వసూలు చేస్తుంది. మరో 25 శాతం ధనాన్ని వడ్డీ లేకుండా ప్రభుత్వం వద్ద కచ్చితంగా నాలుగేళ్లపాటు జమ చేయాలి. ఈ పథకం కింద అక్రమాదాయ వెల్లడికి గడువు 2017 మార్చి 31తో ముగిసింది. 
క్విక్ రివ్యూ:ఏమిటి : గరీబ్ కల్యాణ్ యోజన డిపాజిట్లు రూ. 5 వేల కోట్లు 
ఎప్పుడు : జూన్ 1 నాటికి 
ఎవరు : కేంద్ర రెవెన్యూ శాఖ 

వస్తు, సేవల పన్నురేట్లు ఖరారు జీఎస్టీ (వస్తు సేవల పన్ను) పరిధిలోకి రానున్న మరికొన్ని వస్తువులు, సేవలను పన్ను శ్లాబులను జూన్ 3న జీఎస్టీ మండలి ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ నేతృత్వంలో ఢిల్లీలో సమావేశమైన జీఎస్టీ కౌన్సిల్ బంగారంపై 3శాతం పన్నును ఖరారు చేసింది. ప్రస్తుతం ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా (2 నుంచి 2.5 శాతం) పన్నువసూలు చేస్తున్నారు. సానబెట్టని వజ్రాలపై 0.25 శాతం పన్ను విధించింది.
తగ్గనున్న బిస్కెట్లు, పాదరక్షల ధరరూ.1000 లోపలున్న దుస్తులు, బిస్కట్లు, చెప్పులు మొదలైనవాటి ధర స్వల్పంగా తగ్గనుంది. ప్రస్తుతానికి కిలో వందరూపాలయకు తక్కువగా ఉన్న బిస్కెట్లపై 20.6 శాతం, అంతకన్నా ఎక్కువ ధర ఉన్న వాటిపై 23.11 శాతం పన్నుభారం పడుతుండగా.. జీఎస్టీలో అన్ని రకాల బిస్కెట్లపై పన్నును 18 శాతం పరిధిలోకి తీసుకొచ్చారు. 9.5శాతం పన్ను ఉన్న రూ.500లోపు పాదరక్షలపై 5 శాతం, అంతకన్నా ఎక్కువ ధర కలిగిన పాదరక్షలపై 23.1 నుంచి 29.58 శాతం ఉన్న పన్నును 18 శాతంగా నిర్ణయించారు. 
తునికాకును 18 శాతం, బీడీలను 28 శాతం పన్ను పరిధిలోకి తీసుకొచ్చారు. సిల్క్, జనపనార వస్త్రాలకు పన్నునుంచి పూర్తి మినహాయింపునివ్వగా.. కాటన్, ఇతర రకాల దారాలపై 5 శాతం పన్ను విధించనున్నారు. అయితే చేతితో నేసిన దారాలు, పోగులు మాత్రం 18 శాతం పరిధిలోకి రానున్నాయి. సౌర పానెళ్ల పరికరాలపై 5 శాతం పన్ను విధించాలని నిర్ణయించారు. వ్యవసాయ పరికరాలను జీఎస్టీ మండలి 5, 12 శాతం పన్ను శ్లాబుల్లోకి చేర్చింది. 
ఏ వస్తువుకు ఎంత పన్ను?పన్నులేనివి: 
ఖాదీ దారం, గాంధీ టోపీ, భారత జాతీయ పతాకం, జనపనార, తాజా మాంసం, చేపలు, చికెన్, గుడ్లు, పాలు, మజ్జిగ, పెరుగు, తేనె, తాజా పళ్లు, తాజా కూరగాయలు, గోధుమపిండి, శెనగ పిండి, బ్రెడ్, ప్రసాదం, ఉప్పు, బొట్టు బిళ్లలు, సింధూరం, స్టాంపులు, జ్యుడిషియల్ పేపర్స్, వార్తాపత్రికలు, గాజులు, చేనేత, రూ.వెయి్యకన్నా తక్కువ చార్జీ ఉన్న లాడ్జీలు, విభూతి, రుద్రాక్షలు వంటి పూజా సామగ్రి.
5 శాతం పరిధిలోకి: 
ముక్కలుగా కోసిన చేపలు, రూ. 1000 కన్నా తక్కువ ధర, దుస్తులు, శీతలీకరించిన కూరగాయలు, పిజ్జా బ్రెడ్, రస్క్, సగ్గుబియ్యం, లైఫ్‌బోట్లు, రైల్వే, విమాన రవాణా సేవలు, చిన్న రెస్టారెంట్లు. బ్లాంకెట్లు, ప్రయాణపు దుప్పట్లు, కర్టెన్లు, పరుపు కవర్లకు వాడే లినెన్, టాయిలెట్, వంటగదుల్లో వాడే లినెన్, నాప్కిన్లు, దోమతెరలు, సంచులు, బ్యాగులు, లైఫ్ జాకెట్ల ధర రూ. వెయి్య లోపు ఉంటే 5 శాతం పన్ను. రూ. వెయి్య దాటితే 12 శాతం పన్ను. అగ్గిపెట్టెలు, ప్యాక్ చేసిన సేంద్రియ ఎరువులపై 5 శాతం.
12 శాతం పరిధిలోకి:
రూ.1000 కన్నా ఎక్కువ ధర గల దుస్తులు, శీతలీకరించిన మాంస ఉత్పత్తులు, వెన్న, చీజ్, జంతువుల కొవ్వు, భుటియా, నమ్‌కీన్, కలరింగ్-చిత్రాల పుస్తకాలు, గొడుగులు, కుట్టు మిషన్లు, నాన్-ఏసీ హోటళ్లు, బిజినెస్ క్లాస్ విమానం టికెట్లు, ఎరువులు, వర్క్ కాంట్రాక్టులు
18 శాతం పరిధిలోకి:
పాస్తా, కార్న్‌ఫ్లేక్స్, పేస్ట్రీలు, కేకులు, నిల్వఉంచిన కూరగాయలు, జామ్, సాస్‌లు, సూప్‌లు, ఇన్‌స్టంట్ ఫుడ్ మిక్స్‌లు, ఎన్వలప్‌లు, ప్రింటెడ్ సర్క్యూట్‌లు, కెమెరాలు, స్పీకర్లు, మానిటర్లు , మద్యం సరఫరా చేసే ఏసీ హోటళ్లు, టెలికాం సేవలు, ఐటీ సేవలు, ఆర్థిక సేవలు
28 శాతం పరిధిలోకి:మొలాసిస్, కోకోవా లేని చాక్‌లేట్స్, చాకలేట్ పూతపూసిన వేఫర్స్, ఆఫ్టర్ షేవ్ లోషన్, వాల్‌పేపర్, సెరామిక్ టైల్స్, వాటర్ హీటర్, డిష్‌వాషర్, త్రాసు, వ్యాక్యూమ్ క్లీనర్, షేవర్స్, వ్యక్తిగత అవసరాల కోసం విమాన సేవలు, 5-స్టార్ హోటళ్లు, రేస్‌క్లబ్ బెట్టింగుల, సినిమాలు మొదలైనవి. 
ఐజీఎస్టీ నుంచి మినహాయింపు
రాష్ట్రాల మధ్య రవాణా అయ్యే వస్తు, సేవలపై కేంద్రం విధించే సమీకృత జీఎస్టీ(ఐజీఎస్టీ) నుంచి మినహాయిపు ఉన్న వివరా లను పన్ను శాఖ తన వెబ్‌సైట్లో వెల్లడించింది. ధార్మిక సంస్థలు పేదలకు పంచడానికి విదేశాల నుంచి అందుకునే ఆహారం, ఔషధాలు, వస్త్రాలు, దుప్పట్లపై పన్ను ఉండదు. బాధితుల కోసం రెడ్ క్రాస్ సొసైటీ దిగుమతి చేసుకునే మందులు, భోపాల్ లీక్ గ్యాస్ బాధితుల చికిత్సకు అవసరమయ్యే వైద్య పరికరాలపై పన్ను వేయరు. ప్రజానిధులతో నడిచే పరిశోధన సంస్థలు, వర్సిటీలు, ఐఐటీలు, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లేబొరేటరీలు, ప్రాంతీయ కేన్సర్ సెంటర్లు తదితర సంస్థలు వాడే పరిశోధన పరికరాలపైనా పన్ను ఉండదు. 
2019కి జీడీపీలో 2 శాతానికి రుణమాఫీ2019 సార్వత్రిక ఎన్నికల సమయానికి దేశంలో రైతు రుణమాఫీలు స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో రెండు శాతానికి చేరుకుంటాయని ‘బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్’ నివేదిక వెల్లడించింది. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌ల మాదిరే అన్ని రాష్ట్రాలూ రైతుల రుణాలను మాఫీ చేస్తాయనీ, ఐదు ఎకరాలలోపు పొలం ఉన్న రైతులు తీసుకున్న అప్పుల విలువ 2019 నాటికి 40 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.2,60,000 కోట్లు) ఉండొచ్చని అంచనా వేస్తున్నట్లు నివేదిక తెలిపింది. మార్కెట్‌పై ప్రభావాన్ని పరిమితం చేస్తూనే రుణమాఫీకి నిధులు సమకూర్చుకునేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ‘ఉదయ్’ తరహా బాండ్లను జారీ చేయాల్సి ఉంటుందని సూచించింది. 
మహారాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్యనే రూ.30 వేల కోట్ల విలువైన (జీడీపీలో 0.2 శాతం) రైతు రుణాలను, ఈ ఏడాది ఏప్రిల్‌లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రూ.36 వేల కోట్ల విలువైన (జీడీపీలో 0.3%) రుణాలను మాఫీ చేశాయి. 
క్విక్ రివ్యూ: ఏమిటి : 2019కి జీడీపీలో 2 శాతానికి రుణమాఫీ
ఎక్కడ : భారత్‌లో 
ఎవరు : బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్ 

2017లో భారత్ వృద్ధి 7.2 శాతం : ప్రపంచబ్యాంకు 
2017లో భారత్ వృద్ధి 7.2 శాతానికి చేరుతుందని ప్రపంచ బ్యాంకు విశ్లేషించింది. 2016లో మాదిరిగానే 2017లో కూడా వృద్ధి 6.8 శాతంగానే ఉంటుందని ఈ ఏడాది జనవరిలో అంచనా వేసిన ప్రపంచ బ్యాంకు.. తాజాగా వెలువరించిన ‘గ్లోబల్ ఎకనమిక్ ప్రాస్పెక్ట్స్’లో అంచనాలని సవరించింది. అలాగే డీమోనిటైజేషన్ ప్రభావం నుంచి భారత్ బయటపడుతోందని.. ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ కొనసాతుందని తాము భావిస్తున్నట్లు ప్రకటించింది. 2018లో 7.5 శాతం, 2019లో 7.7 శాతం మేర భారత్ వృద్ధి నమోదవుతుందని పేర్కొంది. 
క్విక్ రివ్యూ: ఏమిటి : 2017లో భారత్ వృద్ధి 7.2 శాతం
ఎప్పుడు : జూన్ 5
ఎవరు : ప్రపంచ బ్యాంకు

ఎయిర్‌టెల్-టెలీనార్ విలీనానికి సీసీఐ ఓకేభారతీ ఎయిర్‌టెల్, టెలీనార్ ఇండియా విలీనానికి కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) జూన్ 5న అనుమతి ఇచ్చింది. విలీనంపై ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎయిర్‌టెల్, టెలీనార్ ఒప్పందానికి వచ్చాయి. ఇందులో భాగంగా టెలీనార్ ఇండియాకు చెందిన ఏపీ, బిహార్, మహారాష్ట్ర, గుజరాత్, యూపీ (తూర్పు,పశ్చిమ) సర్కిళ్లలోని కార్యకలాపాలు, ఆస్తులన్నీ ఎయిర్‌టెల్ సొంతం అవుతాయి. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఎయిర్‌టెల్ - టెలీనార్ విలీనానికి అనుమతి 
ఎప్పుడు : జూన్ 5
ఎక్కడ : కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా 

సైన్స్ అండ్ టెక్నాలజీ
జీఎస్‌ఎల్‌వీ మార్క్ -3డీ1 ప్రయోగం విజయవంతం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) బాహుబలిగా అభివర్ణిస్తున్న జీఎస్‌ఎల్‌వీ మార్క్-3డీ1 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలోగల సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధన కేంద్రం(షార్) నుంచి జూన్ 5 సాయంత్రం 5:28 గంటలకు ఈ ప్రయోగం జరిగింది. దీనిద్వారా 3,136 కిలోల భారీ ఉపగ్రహం జీశాట్-19ని రోదసీలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. 

ప్రయోగం సాగిందిలా.. 
43.43 మీటర్ల పొడవు, 640 టన్నుల బరువున్న జీఎస్‌ఎల్‌వీ మార్క్-3డీ1ను 16 నిమిషాల 20 సెకన్ల వ్యవధిలో మూడు దశ ప్రయాణంతో కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.
మొదటిదశ: కౌంట్‌డౌన్ ముగిసిన వెంటనే మొదటిదశలో రెండు వైపులున్న 200 టన్నుల ఘన ఇంధన బూస్టర్ల(ఎస్-200)ను మండించటంతో రాకెట్ ప్రయాణం ప్రారంభమైంది. 
రెండోదశ: 1.54 నిమిషాలకు రెండో దశలోని 110 టన్నుల ద్రవ ఇంధనాన్ని (ఎల్-110) మండించి రాకెట్ ప్రయాణ స్పీడ్‌ను పెంచారు. 2.20 నిమిషాలకు ఎస్-200 రెండు బూస్టర్లు విడిపోయాయి. 5.20 నిమిషాలకు రెండో దశ పూర్తయింది.
మూడోదశ: 25 టన్నుల క్రయోజనిక్ ఇంధనంతో మూడోదశను ప్రారంభించి 16.20 నిమిషాలకు రాకెట్‌కు శిఖర భాగంలో అమర్చిన 3,136 కిలోల బరువైన జీశాట్-19 సమాచార ఉపగ్రహాన్ని భూమికి దగ్గరగా(పెరిజీ) 170 కి.మీ. భూమికి దూరంగా(అపోజి) 35,975 కి.మీ. ఎత్తులోని జియో ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్(భూ బదిలీ కక్ష్య)లో ప్రవేశపెట్టారు.
స్థిరకక్ష్యలోకి..: ఆ తర్వాత బెంగళూరు హసన్‌లోని ఉపగ్రహాల నియంత్రణ కేంద్రం ఉపగ్రహాన్ని అదుపులోకి తీసుకుని.. ఉపగ్రహంలో నింపిన అపోజీ మోటార్లను మండించి భూమికి 36 కిలోమీటర్ల ఎత్తులోని భూస్థిర కక్ష్యలో ఉపగ్రహాన్ని స్థిరపర్చారు. 

జీశాట్-19 ఉపగ్రహంతో ఉపయోగాలివీ..
- దేశంలో టెలివిజన్ ప్రసారాలు, టెలికాం రంగంలో విసృ్తత సేవలు, ఇంటర్నెట్ వేగవంతం అవడమే కాకుండా అత్యంత అధునాతనమైన కమ్యూనికేషన్ వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది. 
- ప్రపంచవ్యాప్తంగా ఆండ్రాయిడ్ మొబైల్స్‌లో ఇంటర్నెట్‌ను వేగవంతం చేయడానికి ఎంతో ఉపకరిస్తుంది. 
- ఉపగ్రహంలో కేయూ బ్యాండ్ హైయర్ ఫ్రీక్వెన్సీ ట్రాన్స్‌పాండర్స్‌తో పాటు జియో స్టేషనరీ రేడియేషన్ స్పెక్ట్రోమీటర్ అనే పేలోడ్‌‌స అమర్చి పంపారు. ఇప్పటికే ఇస్రోకు చెందిన 14 సమాచార ఉపగ్రహాలు అంతరిక్ష కక్ష్యలో పనిచేస్తూ 275 ట్రాన్స్‌పాండర్లతో దేశవాళి డీటీహెచ్ ప్రసారాలు, టెలికాం సేవలు అందిస్తున్నాయి. అయితే దేశంలో 400 ట్రాన్స్‌పాండర్లు దాకా డిమాండ్ ఉంది. తాజా విజయంతో రాబోయే రెండుమూడేళ్లలో జీఎస్‌ఎల్వీ రాకెట్ల ద్వారా 450 టాన్స్‌పాండర్లను అందుబాటులోకి తేవాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది. 
- దేశంలో 850 టీవీ చానళ్లు ఉంటే అందులో 650 చానళ్లను ప్రభుత్వం గుర్తించింది. ఇందులో 300 చానళ్లకు మాత్రమే వీశాట్ లింక్‌ను ఉపయోగించుకుంటున్నారు. ఇస్రో అంతర్గతంగా వాణిజ్యపరంగా 120 ట్రాన్స్‌పాండర్లను ఉపయోగించుకుంటోంది. జీశాట్-19 ఉపగ్రహంతో సమాచార వ్యవస్థలో అత్యంత అధునాతమైన సాంకేతిక వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది. ఈ ఉపగ్రహం సుమారు 10 ఏళ్ల పాటు సేవలు అందిస్తుంది. 

పదిహేడేళ్ల శ్రమ ఫలితమిది
భారీ ఉపగ్రహాలను నింగి లోకి తీసుకెళ్లగల జీఎస్‌ఎల్‌వీ మార్క్-3 రాకెట్ అభివృద్ధి, విజయం వెనుక ఇస్రో పదిహేడేళ్లు కఠోర శ్రమ, నిరంతర కృషి దాగుంది. సుమారు 3 నుంచి 5 టన్నుల బరువైన సమాచార ఉపగ్రహాలను ప్రయోగించేందుకు.. మనుషులను అంత రిక్షంలోకి తీసుకెళ్లేందుకు.. చంద్రుడు, అంగారకుడి మీద పరిశోధనల కోసం రోవర్లను పంపేందుకు భారీ రాకెట్లు అవసరం. ఇస్రో 2000లో దీనిపై ప్రతిపాదన చేయగా కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దాంతో మార్క్-3 తరహా భారీ రాకెట్ అభివృద్ధిపై శాస్త్రవేత్తలు దృష్టి పెట్టారు. 2003లో ఈ ప్రాజెక్టుకు రూ.3 వేల కోట్లు నిధులు మంజూరు చేశారు. ఆ నిధుల్లో రూ.700 కోట్లతో షార్‌లో ప్రయోగానికి అవసరమైన ఏర్పాట్లు ప్రారంభించారు.
అన్ని దశలూ భారీగానే 
పీఎస్‌ఎల్‌వీ, సాధారణ జీఎస్‌ఎల్‌వీ రాకెట్లలోని మొదటి దశలో సుమారు 138, 142 టన్నుల ఘన ఇంధనాన్ని వాడతారు. అయితే భారీ రాకెట్ రూపకల్పనలో భాగంగా మార్క్3 ప్రయోగం మొదటి దశలో 200 టన్నుల చొప్పున ఘన ఇంధనాన్ని నింపిన రెండు స్ట్రాపాన్ (ఎస్-200) బూస్టర్లు అవసరమని గుర్తించారు. వీటిని షార్‌లోని ఘన ఇంధనం తయారీ విభాగం(స్ప్రాబ్)లోనే తయారు చేశారు. 2010 జనవరి 24న ఈఎస్-200 స్ట్రాపాన్ బూస్టర్లకు భూస్థిర పరీక్షలు నిర్వహించి విజయం సాధించారు. 
రెండో దశలో సాధారణంగా 40 టన్నుల ద్రవ ఇంధనాన్ని వినియోగిస్తుండగా.. మార్క్ 3 తరహా కోసం 110 టన్నుల ఇంధనాన్ని నింపిన బూస్టర్ల(ఎల్-110) ను వినియోగించారు. వీటిని తమిళనాడులోని మహేంద్రగిరిలో ఉన్న లిక్విడ్ ప్రొపెల్లెంట్ స్పేస్ సెంటర్‌లో తయారు చేశారు. 
మూడోదశలో అత్యంత శక్తివంత మైన క్రయోజనిక్ ఇంజన్లను వినియోగిస్తారు. సాధారణ జీఎస్‌ఎల్‌వీలో ఈ దశలో 12.5 టన్నుల ఇంధనాన్ని వినియోగించగా.. మార్క్3 కోసం 25 టన్నులు వినియోగించాల్సి వచ్చింది. 12.5 టన్నుల క్రయోజనిక్ దశ రూపకల్పన కోసమే అప్పట్లో ఇస్రో శాస్త్రవేత్తలు తీవ్రంగా కష్టపడ్డారు. తాజాగా 25 టన్నుల క్రయోదశ (సీ-25) అభివృద్ధి కోసం రెండేళ్లు పట్టింది. అయితే మొత్తంగా పూర్తిస్థాయిలో క్రయోజనిక్ దశ అభివృద్ధిలో ఇస్రో విజయం సాధించింది.
ప్రపంచదేశాల్లో తిరుగులేని శక్తిగా..తాజా ప్రయోగంతో ప్రపంచ దేశాల్లో భారత్ తిరుగులేని శక్తిగా అవతరించింది. పదిహేడేళ్లుగా ఇస్రో ఎస్-200 ఘన ఇంధన బూస్టర్లు, ఎల్-100 ద్రవ ఇంధన దశ, సీ-25 క్రయోజనిక్ ఇంజిన్లను అభివృద్ధి చేసుకోవడానికి ఎన్నో పరిశోధనలు చేసింది. 2014 డిసెంబర్ 14న జీఎస్‌ఎల్‌వీ మార్క్-3డీ1 రాకెట్‌ను ప్రయోగాత్మకంగా ప్రయోగించి ఎస్-200, ఎల్-110 సామర్థ్యాన్ని నిర్ధారించుకున్నారు. ఆ ప్రయోగంలో సీ-25 లేకుండా డమ్మీని ఉపయోగించారు. తాజాగా సీ-25కు అనేక రకాల భూస్థిర పరీక్షలు నిర్వహించి పూర్తిస్థాయిలో ప్రయోగించారు.
59 ప్రయోగాలు.. విజయాలు 51 జీఎస్‌ఎల్‌వీ మార్క్-3డీ1 ప్రయోగంతో ఇస్రో 59 ప్రయోగాలు పూర్తి చేసుకుంది. ఇందులో 51 ప్రయోగాలు విజయవంతమయ్యాయి. వీటిల్లో ఇప్పటివరకు ఎక్కువగా పీఎస్‌ఎల్‌వీ ప్రయోగాలే విజయవంతంకాగా.. తాజాగా జీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లోనూ వరుస విజయాలు ప్రారంభమయ్యాయి. క్రయోజనిక్ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంతో జీఎస్‌ఎల్‌వీ డీ5, డీ6, మార్క్-3 ప్రయోగాత్మక ప్రయోగం, ఎఫ్-09 ప్రయోగాలతో పాటు తాజాగా మార్క్-3డీ1 ప్రయోగం కూడా వరుసగా విజయవంతమైంది. 
అగ్రదేశాల సరసన- జీఎస్‌ఎల్‌వీ-మార్క్3ని ప్రయోగించడం ద్వారా భారత్ భారీ ఉపగ్రహాలను ప్రయోగించే సామర్థ్యం కలిగిన ఆరో దేశంగా గుర్తింపు పొందింది. ఇప్పటిదాకా భారీ ఉపగ్రహాలను ప్రయోగించే సామర్థ్యం అమెరికా, రష్యా, చైనా, జపాన్, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీలకు మాత్రమే ఉంది.
- 3 వేల కిలోల బరువు దాటితే దాన్ని భారీ ఉపగ్రహంగా పరిగణిస్తారు.
- పాతతరం ఉపగ్రహాలతో పోలిస్తే జీశాట్-19 సామర్థ్యం చాలా ఎక్కువ. ఇది ఆరేడు పాత ఉపగ్రహాలకు సమానం.
- ఇతర దేశాలతో పోలిస్తే భారీ ఉపగ్రహ ప్రయోగానికి భారత్‌కు అయ్యే ఖర్చు చాలా తక్కువ. మిగతా వాళ్లకంటే 60 నుంచి 70 శాతం తక్కువ ఖర్చుతో ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టగలదు.
- సమాచార ఉపగ్రహ ప్రయోగ మార్కెట్‌లో సింహభాగం వాటా ప్రైవేటు సంస్థలు స్పేస్ ఎక్స్, అరియేన్‌లదే. 10 టన్నుల ఉపగ్రహాలను కూడా మోసుకెళ్లగల రాకెట్లు వీటి వద్ద ఉన్నాయి.
- 5 టన్నుల దాకా బరువుండే ఉపగ్రహాన్ని ప్రయోగించడానికి స్పేస్ ఎక్స్ సంస్థ తమ ఫాల్కన్-9 రాకెట్‌ను వాడుతుంది. దీనికి రూ.400 కోట్లు ఛార్జి చేస్తుంది.
- భారత్ ఇప్పటిదాకా 21 దేశాలకు చెందిన 79 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. అయితే అంతర్జాతీయ విపణిలో భారత్ వాటా 0.6 శాతం మాత్రమే.
- భవిష్యత్తులో మనుషులను అంతరిక్షంలోకి పంపడానికి ఇస్రో సిద్ధమవుతోంది. ఇందుకోసం రూ.12,500 కోట్లు కావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఒకవేళ ప్రభుత్వం అనుమతిస్తే ఈ మిషన్‌లో జీఎస్‌ఎల్‌వీ- మార్క్3 రాకెట్ కీలకం కానుంది. అంతరిక్షంలోకి వ్యోమగాములను పంపగల సామర్థ్యం ప్రస్తుతం అమెరికా, రష్యా, చైనాలకే ఉంది. 
కూడంకుళం 5, 6 యూనిట్లకు రష్యా అంగీకారం
తమిళనాడు కూడంకుళం అణు విద్యుదుత్పత్తి కేంద్రంలోని 5, 6 యూనిట్ల నిర్మాణానికి (ఒక్కో యూనిట్ సామర్థ్యం వెయ్యి మెగావాట్లు) రష్యా అంగీకరించింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటనలో భాగంగా జూన్ 1న ఇరు దేశాల మధ్య ఐదు ఒప్పందాలు జరిగాయి. అణుశక్తి, రక్షణ, ఉగ్రవాదం, వాణిజ్యంతోపాటు పలు రంగాల్లో ఈ ఒప్పందాలు కుదిరాయి. 
ఈ ద్వైపాక్షిక వార్షిక సదస్సులో ఉగ్రవాదంపై పోరాటంలో పరస్పర సహకారంతో ముందుకెళ్లాలని మోదీ-రష్యా అధ్యక్షుడు పుతిన్ నిర్ణయించారు. అనంతరం పలు అంశాలపై ఇరుదేశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ‘21వ శతాబ్దపు దార్శనికత’ పేరుతో విజన్ డాక్యుమెంటును విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎన్‌ఎస్‌జీ, భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం విషయంలో భారత్‌కు సంపూర్ణ మద్దతుంటుందని పుతిన్ స్పష్టం చేశారు. 
ఢిల్లీలో వీధికి రష్యా రాయబారి పేరు 
భారత్‌లో రష్యా రాయబారిగా పనిచేసిన అలెగ్జాండర్ కడికన్ పేరుని ఢిల్లీలోని ఓ వీధికి పెడుతున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. ఇటీవల మరణించిన కడికన్ ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాల పటిష్టతకు విశేషంగా కృషి చేశారని మోదీ పేర్కొన్నారు. 
భారత్ - రష్యా సంయుక్తంగా ఈ సంవత్సరం ఇంద్ర-2017 పేరుతో త్రివిధ దళాల విన్యాసాలు నిర్వహించనున్నాయి. 
క్విక్ రివ్యూ:ఏమిటి : భారత్ - రష్యా మధ్య 5 ఒప్పందాలు 
ఎప్పుడు : జూన్ 1
ఎక్కడ : సెయింట్ పీటర్స్‌బర్గ్ 
ఎవరు : ప్రధాని మోదీ - రష్యా అధ్యక్షుడు పుతిన్ 

ఫృథ్వీ-2 పరీక్ష విజయవంతంస్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన అణ్వాయుధాలను ప్రయోగించగల పృథ్వీ-2 క్షిపణి పరీక్ష విజయవంతమైంది. చాందీపూర్ సమీపంలోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి జూన్ 2న భారత సైన్యం దీన్ని ప్రయోగించింది. భూ ఉపరితలం నుంచి ఉపరితలంపైకి ప్రయోగించే ఈ క్షిపణి 350 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. 500 నుంచి 1,000 కేజీల పేలుడు పదార్థాలను మోసుకెళ్లగలదు.
క్విక్ రివ్యూ:ఏమిటి : పృథ్వీ-2 పరీక్ష విజయవంతం
ఎప్పుడు : జూన్ 2
ఎవరు : భారత సైన్యం

కేరళ వాసికి రెండో గుండె అమర్చిన వైద్యులుకోయంబత్తూరులోని ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు కేరళ వాసికి విజయవంతంగా రెండో గుండెను అమర్చారు. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న 45 ఏళ్ల వ్యక్తికి బ్రెయిన్‌డెడ్‌కు గురైన మహిళ గుండెను కుడివైపున అమర్చారు. ప్రస్తుతం అతని శరీరంలోని రెండు గుండెలు సహజరీతిలో పనిచేస్తున్నాయని వైద్యులు తెలిపారు.
క్విక్ రివ్యూ:ఏమిటి : కేరళ వాసికి రెండో గుండె అమర్చిన వైద్యులు
ఎప్పుడు : జూన్ 2
ఎవరు : కోయంబత్తూర్‌లోని ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు

క్రీడలుబీసీసీఐ పరిపాలకుల కమిటీకి రామచంద్ర గుహ రాజీనామా
ప్రముఖ చరిత్రకారుడు, రచయిత రామచంద్ర గుహ వ్యక్తిగత కారణాల పేరుతో బీసీసీఐ పరిపాలకుల కమిటీ (సీఓఏ)కి రాజీనామా చేశారు. కమిటీ నలుగురు సభ్యుల్లో ఒకరైన గుహ బీసీసీఐ, పరిపాలక కమిటీ పనితీరుపై పలు విమర్శలు చేస్తూ చైర్మన్ వినోద్ రాయ్‌కి లేఖ రాశారు. లోధా కమిటీ ఫిపార్సులను అమలు చేయడంలో అలసత్వం ప్రదర్శించిన అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, కార్యదర్శి అజయ్ షిర్కేలను తొలగిస్తూ సుప్రీం కోర్టు జనవరిలో నలుగురు సభ్యులతో బీసీసీఐకి పరిపాలకుల కమిటీని ఏర్పాటు చేసింది.
గుహ చేసిన విమర్శలు
- భారత జట్టుకు కోచ్‌లుగా పని చేసేవారు ఐపీఎల్ జట్లకూ కోచ్‌గా వ్యవహరించడం సరికాదు. రాహుల్ ద్రవిడ్, ఆర్.శ్రీధర్, సంజయ్ బంగర్, భరత్ అరుణ్‌లకు ఈ విషయంలో బోర్డు అపరిమిత స్వేచ్ఛ ఇచ్చింది. ఇదే విషయాన్ని సీఓఏ సమావేశాల్లో పలుసార్లు ప్రస్తావించారు.
- బీసీసీఐ కామెంటరీ టీమ్‌లో సభ్యుడిగా ఉన్న సునీల్ గావస్కర్ పీఎంజీ అనే ప్లేయర్ మేనేజ్‌మెంట్ కంపెనీకి యజమాని. ఇది శిఖర్ ధావన్, రిషభ్ పంత్ వ్యవహారాలను పర్యవేక్షిస్తుంది. ఆయన రెండింటిలో ఏదో ఒకదానికే పరిమితం కావాలి.
- సౌరవ్ గంగూలీ ఒక క్రికెట్ సంఘానికి అధ్యక్షుడిగా ఉంటూ కామెంటరీ కూడా చేయడం సరికాదు. 
- రంజీ ట్రోఫీ మ్యాచ్‌లు ఆడే ఆటగాళ్లకు చెల్లింపులు ఒక క్రమపద్ధతిలో ఉండాలి.
- సుప్రీం కోర్టు మార్గదర్శకాల ప్రకారం అనర్హులైన అనేక మంది బోర్డు, రాష్ట్ర సంఘాల ఆఫీస్ బేరర్లు స్వేచ్ఛగా సమావేశాలకు హాజరయ్యారు. ఈ విషయంలో సీవోఏ సరిగా వ్యవహరించలేదు.
- సీవోఏలో ఒక పురుష క్రికెటర్ లేకపోవడం వల్ల కూడా అనేక సమస్యలు వచ్చాయి. కాబట్టి పురుష క్రికెటర్ తప్పనిసరిగా ఉండాలి.
- సూపర్ స్టార్ సంస్కృతి వల్ల కోచ్‌పై తమకు ప్రత్యేక అధికారం ఉందని సీనియర్ ఆటగాళ్లు భావిస్తున్నారు. ఎక్కడా లేని విధంగా కోచ్‌లు, కామెంటేటర్ల ఎంపిక విషయంలో ఆటగాళ్లు జోక్యం చేసుకోవడం తగదు.
- టెస్టులు ఆడలేనంటూ స్వయంగా రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కూడా ధోనీకి ‘ఎ’ గ్రేడ్ కాంట్రాక్ట్ ఇవ్వడం సరికాదు.
క్విక్ రివ్యూ:ఏమిటి : బీసీసీఐ పరిపాలక కమిటీ సభ్యుడిగా రాజీనామా
ఎప్పుడు : జూన్ 2
ఎవరు : రామచంద్ర గుహ
ఎందుకు : బీసీసీఐ, సీవోఏ పనితీరు నచ్చక

థాయ్‌లాండ్ ఓపెన్ గ్రాండ్‌ప్రి విజేత సాయిప్రణీత్ 
థాయ్‌లాండ్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నమెంట్‌లో భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ భమిడిపాటి సాయిప్రణీత్ చాంపియన్‌గా నిలిచాడు. జూన్ 4న 71 నిమిషాలపాటు హోరాహోరీగా సాగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో మూడో సీడ్ సాయిప్రణీత్ 17-21, 21-18, 21-19తో నాలుగో సీడ్ జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా)పై విజయం సాధించాడు. ఈ విజయంతో సాయిప్రణీత్‌కు 9,000 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 5 లక్షల 80 వేలు)తోపాటు 7,000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. భారత బ్యాడ్మింటన్ సంఘం రూ. 3 లక్షలు నజరానా ప్రకటించింది. 
ఏప్రిల్ నెలలో సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ నెగ్గిన సాయిప్రణీత్ కెరీర్‌లో ఇది తొలి గ్రాండ్‌ప్రి గోల్డ్ టైటిల్. 
క్విక్ రివ్యూ:ఏమిటి : థాయ్‌లాండ్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నమెంట్ 
ఎప్పుడు : జూన్ 4 
ఎక్కడ : బ్యాంకాక్ 
ఎవరు : విజేత సాయి ప్రణీత్ 

వార్తల్లో వ్యక్తులు
సివిల్స్ - 2016 టాపర్ కేఆర్ నందిని 
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) మే 31న విడుదల చేసిన సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2016 ఫలితాల్లో కర్ణాటకకు చెందిన కేఆర్ నందిని తొలి ర్యాంకు కైవసంచేసుకున్నారు. కన్నడ సాహిత్యం ఆప్షనల్‌గా ఎంచుకున్న ఆమె నాలుగో ప్రయత్నంలో ఐఏఎస్ సాధించారు. నందిని ప్రస్తుతం ఐఆర్‌ఎస్ అధికారిగా శిక్షణ పొందుతున్నారు. 
పంజాబ్‌కు చెందిన అన్మోల్ షేర్ సింగ్ బేడీ రెండో ర్యాంకును దక్కించుకోగా ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాకు చెందిన రోణంకి గోపాల కృష్ణ మూడో స్థానంలో నిలిచాడు. విజయవాడకు చెందిన కొత్తమాసు దినేశ్‌కుమార్ (వరంగల్ ఎన్‌ఐటీలో చదివారు) ఆరో ర్యాంకు సాధించారు. 
మొత్తంగా సివిల్స్‌కు ఎంపికైన 1099 మందిలో తెలుగు రాష్ట్రాల నుంచి 90 మందికిపైగా ఎంపికయ్యారు. 
క్విక్ రివ్యూ:
ఏమిటి
 : సివిల్ సర్వీసెస్ - 2016 ఫలితాలు 
ఎప్పుడు : మే 31
ఎవరు : తొలి ర్యాంకర్ కేఆర్ నందిని

ఐవోసీ చైర్మన్‌గా సంజీవ్ సింగ్
దేశీ దిగ్గజ ఫ్యూయెల్ రిటైలర్ ‘ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్’ (ఐవోసీ) చైర్మన్‌గా సంజీవ్ సింగ్ నియమితులయ్యారు. ప్రస్తుత చైర్మన్ బి.అశోక్ మే 31న పదవీ విరమణ చేయటంతో ఆయన స్థానంలో సంజీవ్ నియమితులయ్యారు. 
సంజీవ్ సింగ్ చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ (సీపీసీఎల్), హిందుస్తాన్ ఉర్వరక్ అండ్ రసాయన్ (హెచ్‌యూఆర్‌ఎల్) కంపెనీలకు కూడా చైర్మన్‌గా కూడా కొనసాగుతారని కంపెనీ పేర్కొంది.
క్విక్ రివ్యూ:ఏమిటి : ఐవోసీకి నూతన చైర్మన్ 
ఎప్పుడు : జూన్ 1
ఎవరు : సంజీవ్ సింగ్ 

ప్రసారభారతి సీఈవోగా శశిశేఖర్ వెంపటిప్రసారభారతి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సీఈవో)గా వెంపటి శశిశేఖర్‌ను నియమిస్తున్నట్లు ఉపరాష్ట్రపతి అన్సారీ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ జూన్ 2న తెలిపింది. శేఖర్ ప్రస్తుతం ప్రసారభారతిలో పార్ట్ టైమ్ సభ్యుడిగా ఉన్నారు. ఐఐటీ- ముంబైలో చదువుకున్న శేఖర్ కార్పోరేట్ మేనేజ్‌మెంట్, టెక్నాలజీ కన్సల్టింగ్, డిజిటల్ మీడియాలో అనుభవజ్ఞుడు. 
క్విక్ రివ్యూ:ఏమిటి : ప్రసార భారతి కొత్త సీఈవో నియామకం
ఎప్పుడు : జూన్ 2
ఎవరు : వెంపటి శశిశేఖర్

అంతర్జాతీయ ఎకనమిక్ ఫోరం వేదికలో పాల్గొన్న మోదీవిశ్వమానవాళికి ప్రమాదకరంగా మారిన ఉగ్రవాదానికి నిధులు, ఆయుధాల సరఫరాపై కఠినంగా వ్యవహరించాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. జూన్ 2న రష్యా పర్యటనలో భాగంగా సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో జరిగిన అంతర్జాతీయ ఎకనమిక్ ఫోరం వేదికగా ప్రసంగించారు. ఓ భారత ప్రధాని అంతర్జాతీయ ఎకనమిక్ ఫోరంలో పాల్గొనటం ఇదే తొలిసారి.
అనంతరం భారత్-రష్యా మధ్య విమానాలు, అటోమొబైల్స్ తదితర 19 రంగాల్లో సంయుక్తంగా ముందుకెళ్లడానికి ఒప్పందాలు కుదిరాయి. భారత్‌కు ఎస్-400 మిసైల్ వ్యవస్థను సరఫరా చేసేందుకు రష్యా అంగీకరించింది. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని దస్తాన్ గుంజ్‌చోయ్‌నీ బౌద్ధాలయాన్ని సందర్శించిన మోదీ అక్కడి పూజారి జంపా డోనార్‌కు టిబెట్ బౌద్ధగ్రంథాలైన ‘ఉర్గా కంజూర్’లోని 100 సంపుటాలను బహూకరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి
 : అంతర్జాతీయ ఎకనమిక్ ఫోరం వేదికలో ప్రసంగం
ఎప్పుడు : జూన్ 2
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ

ఐర్లండ్ ప్రధానిగా భారత సంతతి నేత
ఐర్లండ్ తదుపరి ప్రధానిగా భారత సంతతికి చెందిన లియో వారడ్కర్ (38) ఎంపికయ్యారు. తద్వారా ఐర్లండ్‌కు అత్యంత పిన్న వయస్కుడైన, తొలి మైనార్టీ ప్రధానిగా నిలిచారు. తొలి స్వలింగ సంపర్క (గే) ప్రధానిగానూ రికార్డులకెక్కారు. అవినీతి ఆరోపణలతో ప్రస్తుత ప్రధాని ఎండా కెన్నీ రాజీనామాతో జరిగిన అధికార ఫైన్ గేల్ పార్టీ అంతర్గత ఎన్నికలో ఆయనకు 60 శాతం ఓట్లు వచ్చాయి. 
ముంబై నుంచి వచ్చి స్థిరపడిన హిందూ, మహారాష్ట్రీయుడైన డాక్టర్ అశోక్ వారడ్కర్, ఐరిష్ నర్స్ మీరియమ్ మూడో సంతానమే లియో. వారడ్కర్ 2007లో డబ్లిన్ వెస్ట్ స్థానం నుంచి ఐర్లండ్ దిగువసభకు ఎన్నికై, మంత్రిగా పని చేశారు. 
క్విక్ రివ్యూ:ఏమిటి : ఐర్లండ్ ప్రధానిగా భారత సంతతి వ్యక్తి
ఎప్పుడు : జూన్ 2
ఎవరు : లియో వారడ్కర్

యూఎస్ స్పెల్ బీ విజేత అనన్య వినయ్
అమెరికాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ ఫైనల్ పోటీల్లో భారత సంతతికి చెందిన బాలిక అనన్య వినయ్(12) విజేతగా నిలిచింది. 90వ పదంగా మారోకైన్‌కు స్పెల్లింగ్ చెప్పి రూ.26 లక్షల బహుమతి అందుకుంది. అనన్య విజయంతో వరుసగా 13వ సారి ఇండో అమెరికన్ సంతతికి చెందిన వారే ఈ టైటిల్‌ను గెలుచుకున్నటై్లంది.
క్విక్ రివ్యూ:ఏమిటి : యూఎస్ స్పెల్ బీ పోటీలు
ఎప్పుడు : జూన్ 2 
ఎవరు : అనన్య వినయ్

ఆక్సిజన్ లేకుండా ఎవరెస్టు అధిరోహణ 
భారత ఆర్మీకి చెందిన నలుగురు సభ్యులు ఆక్సిజన్ సిలిండర్లను వినియోగించకుండా విజయవంతంగా ఎవరెస్టును అధిరోహించిన తొలి బృందంగా రికార్డు సృష్టించారు. ఎవరెస్టును అధిరోహించిన బృందంలో కున్‌చోక్ టెండా, కెల్సాంగ్ డోర్జీ భూటియా, కాల్డెన్ పంజ ర్, సోనమ్ ఫంత్సోక్‌లు ఉన్నారు. మొత్తం 14 మంది సభ్యులుగల బృందంలో ఆక్సిజన్ లేకుండా అధిరోహించిన వారు ఈ నలుగురు కాగా, మిగిలిన వారిలో అర్జీన్ తోప్‌గే, గ్వాంగ్ గెల్‌క్, కర్మ జోపాలు ఆక్సిజన్ సిలిండర్లను వినియోగిస్తూ ఎవరెస్టును అధిరోహించగలిగారు. 
క్విక్ రివ్యూ:ఏమిటి : ఆక్సిజన్ లేకుండా ఎవరెస్ట్ అధిరోహణ 
ఎప్పుడు : జూన్ 3 
ఎవరు : భారత ఆర్మీకి చెందిన నలుగురు సభ్యులు

అటార్నీ జనరల్ పదవీకాలం పొడిగింపు
అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ, సొలిసిటర్ జనరల్ రంజిత్ కుమార్, మరో ఐదుగురు సీనియర్ న్యాయాధికారుల పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ(డీవోపీటీ) తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు వారు తమ పదవుల్లో కొనసాగుతారని కేబినెట్ నియామకాల కమిటీ వెల్లడించింది. పదవీకాలం పొడిగించినవారిలో అదనపు సొలిసిటర్ జనరల్స్ పింకీ ఆనంద్, మనిందర్ సింగ్, పీఎస్ పత్వాలియా, తుషార్ మెహతా, పీఎస్ నర్సింహ ఉన్నారని పేర్కొంది. 
ఎవరెస్ట్‌ను రెండోసారి అధిరోహించిన నీరుడి ప్రవీణ్తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం తుర్కపల్లి గ్రామానికి చెందిన నీరుడి ప్రవీణ్ కుమార్ ఎవరెస్ట్ శిఖరాన్ని రెండోసారి అధిరోహించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 3న సాయంత్రం ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాడు. 2016లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున ప్రవీణ్ తొలిసారి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. 
క్విక్ రివ్యూ:ఏమిటి : రెండోసారి ఎవరెస్టు అధిరోహణ
ఎప్పుడు : జూన్ 3
ఎవరు : నీరుడి ప్రణీత్ 

జియోనీ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రభాస్
మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ కంపెనీ ‘జియోనీ ఇండియా’కి బ్రాండ్ అంబాసిడర్‌గా టాలీవుడ్ హీరో ప్రభాస్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభాస్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సంస్థ ప్రకటించింది. జియోనీ ఇప్పటికే క్రికెటర్ విరాట్ కోహ్లి, బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్, ప్రముఖ కథానాయిక శృతిహాసన్, దుల్కర్ సల్మాన్, దిల్జిత్ దోశాంజ్ వంటి వారితో భాగస్వామ్యం కుదుర్చుకుంది. 
క్విక్ రివ్యూ: ఏమిటి : జియోనీ బ్రాండ్ అంబాసిడర్ 
ఎప్పుడు : జూన్ 5 
ఎవరు : టాలీవుడ్ నటుడు ప్రభాస్ 

సంస్కృత విద్యాపీఠం తొలి వీసీ కన్నుమూతతిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠానికి తొలి ఉపకులపతిగా పనిచేసిన రామానుజ తాతాచార్యులు(90) జూన్ 5న ముంబైలో కన్నుమూశారు. విద్యాపీఠం ఏర్పాటైనప్పటి నుంచి ఐదేళ్లపాటు ఆయన వీసీగా విధులు నిర్వర్తించారు. సంస్కృత భాష అభివృద్ధికోసం ఎంతో పాటుపడ్డారు. ఆయన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం గతేడాది పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. తాతాచార్యులు సంస్కృతంలో రాష్ట్రపతి అవార్డుతో పాటు ఫ్రాన్స్‌ ప్రభుత్వం నుంచి కెవిలియర్ అవార్డును సొంతం చేసుకున్నారు. ఈయనకు ఐదుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి :
 రామానుజ తాతాచార్యులు కన్నుమూత
ఎప్పుడు : జూన్ 5 
ఎక్కడ : ముంబైలో 
ఎవరు : సంస్కృత విద్యాపీఠం తొలి వీసీ 

డబ్ల్యూటీఐ ప్రచారకర్తగా దియా మీర్జా బాలీవుడ్ నటి దియా మీర్జా వైల్డ్‌లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూటీఐ )కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికయ్యారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జూన్ 5న డబ్ల్యూటీఐ అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. ఇప్పటికే ఆమె పర్యావరణ పరిరక్షణ, మానవత విలువలను కాపాడే పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అంతేగాక గత ఏడాది స్వచ్ఛభారత్ కార్యక్రమానికి కూడా ప్రచారకర్తగా తనవంతు బాధ్యతను నిర్వర్తించారు.
డబ్ల్యూటీఐ ఆగస్టులో ఏనుగులపై అవగాహన కల్పించేందుకు గజయాత్రను 13 రాష్ట్రాలలో 18 నెలల పాటు ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించనుంది. 
క్విక్ రివ్యూ: ఏమిటి : డబ్ల్యూటీఐ ప్రచారకర్తగా దియామీర్జా 
ఎప్పుడు : జూన్ 5 
ఎక్కడ : భారత్‌లో 
ఎవరు : వైల్డ్‌లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా


చరిత్రలో ఈ నెల జూన్ (9 - 18) 2017
అంతర్జాతీయం
ఇరాన్ పార్లమెంటుపై ఐసిస్ దాడి ఇరాన్ పార్లమెంటు, ఆ దేశ విప్లవనాయకుడు ఆయతుల్లా ఖోమేని స్మారక భవనం వద్ద ఐసీసీ ఉగ్రవాదులు ఆయుధాలు, ఆత్మాహుతి దాడి చేశారు. జూన్ 7న జరిగిన ఈ దాడిలో 12 మంది ప్రాణాలు కోల్పోగా 40 మందికి పైగా తీవ్రగాయాలయ్యాయి. 
ఇరాన్ భద్రతా బలగాలు ఐదుగంటల పోరాటం తర్వాత అందరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. ఇరాక్, సిరియాల్లో ఐసిస్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న దాడుల్లో ఇరాన్ చాలా క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో కొంతకాలంగా హెచ్చరికలు చేస్తున్న ఐసిస్ తాజాగా విధ్వంసానికి దిగింది. 
మరోవైపు దాడి సమయంలోనూ పార్లమెంటు సమావేశాలు యధావిధిగా కొనసాగాయి. ఉగ్రదాడి విషయం తెలిసినా లోపలున్న ఎంపీలు ఏమాత్రం చెదిరిపోలేదు. తమ భద్రత విషయంలో ప్రత్యేక బలగాలపై పూర్తి నమ్మకంతో రోజూవారీ కార్యక్రమాలను కొనసాగించారు. కొందరు నిశ్శబ్దంగా ఉన్న తమ సెల్ఫీలను పోస్టు చేశారు.
క్విక్ రివ్యూ: ఏమిటి : ఇరాన్ పార్లమెంట్‌పై ఉగ్రవాదుల దాడి 
ఎప్పుడు : జూన్ 6 
ఎక్కడ : పార్లమెంట్, ఖోమేని స్మారక భవనం వద్ద
ఎవరు : ఐసీస్ 

మయన్మార్‌లో విమానం గల్లంతు 100 మందికి పైగా ప్రయాణిస్తున్న మయన్మార్ సైన్యానికి చెందిన వై-8ఎఫ్-200 విమానం జూన్ 7న గల్లంతైంది. ఆ తరువాత అండమాన్ సముద్రంలో దాని శకలాలను గుర్తించినట్లు ఎయిర్స్‌ఫోర్స్ అధికారులు వెల్లడించారు. చైనాలో తయారైన వై-8ఎఫ్-200 అనే సరకు రవాణా విమానం ఈ ప్రమాదానికి గురైంది. మైయెక్ పట్టణం నుంచి యాంగాన్ వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. 
విమానంలో సైనికులు, వారి కుటుంబీకులు, సిబ్బంది మొత్తం కలిసి 120 దాకా ఉంటారని కమాండర్ ఇన్ చీఫ్ కార్యాలయం తెలిపింది. 
క్విక్ రివ్యూ: ఏమిటి : మయన్మార్ విమానం వై-8ఎఫ్-200 గల్లంతు
ఎప్పుడు : జూన్ 6 
ఎక్కడ : అండమాన్ సముద్రంలో

పన్ను ఎగవేతలపై బహుళపక్ష ఒప్పందం
 
చట్టాల్లో లొసుగులు ఉపయోగించుకుని పన్నులు ఎగవేసే సంస్థలకు చెక్ చెప్పే దిశగా భారత్‌తో పాటు 67 దేశాలు చేతులు కలిపాయి. పారిస్‌లో జరిగిన ఆర్థిక సహకార, అభివృద్ధి సంస్థ (ఓఈసీడీ) సమావేశంలో ఇందుకు సంబంధించిన బహుళపక్ష ఒప్పందంపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ జూన్ 8న సంతకం చేశారు. దీంతో వివిధ దేశాలు కుదుర్చుకున్న 1,100 పైగా పన్ను ఒప్పంద నిబంధనల్లో తగు మార్పులు, చేర్పులు జరగనున్నాయి. 
ద్వంద్వ పన్నుల నివారణ కోసం భారత్‌కు ప్రస్తుతం సైప్రస్, మారిషస్, సింగపూర్ తదితర దేశాలతో ఒప్పందాలు(డీటీఏఏ) ఉన్నాయి. వీటిని ఊతంగా తీసుకుని పలు బహుళజాతి సంస్థలు పన్నుప్రయోజనాలు అత్యధికంగా ఉండే దేశాలకు ప్రధాన కార్యాలయాలను మళ్లించి, ఇతర దేశాల్లో ఆర్జించే లాభాలపై పన్నులను ఎగవేస్తున్నాయి. ఇది గుర్తించిన భారత్ ఇటీవలే కొన్ని దేశాలతో డీటీఏఏ ఒప్పందాలను సవరించింది. ప్రధాన కార్యాలయమున్న దేశంలో కాకుండా కార్పొరేట్లు ఆదాయం ఆర్జించే దేశాల్లోనే పన్నులు కట్టే విధంగా మార్పులు చేసింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి :
 పన్ను ఎగవేతలపై బహుళపక్ష ఒప్పందం
ఎప్పుడు : జూన్ 8
ఎక్కడ : పారిస్‌లో 
ఎవరు : కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 

ఎస్‌సీవోలో భారత్, పాకిస్తాన్‌లకు సభ్యత్వం షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో)లో భారత్, పాకిస్తాన్‌లకు సభ్యత్వం లభించింది. కజకిస్తాన్‌లోని ఆస్తానాలో జూన్ 8-9 వరకు జరిగిన వార్షిక సదస్సులో ఈ మేరకు రెండు దేశాలకు సభ్యత్వం ఇచ్చారు. అలాగే సభ్య దేశాలు ఆస్తానా డిక్లరేషన్‌తో పాటు 10 ఇతర ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ఉగ్రవాదంపై సంయుక్తంగా పోరు చేసే అంశం ఇందులో ప్రధానమైంది. 
ఎస్‌సీవో సదస్సులో ప్రధాని మోదీ..
ఈ సదస్సులో పాల్గొన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ .. ఉగ్రవాదంపై పోరులో ఎస్‌సీవో సహకారం చాలా కీలకమని అన్నారు. ఎస్‌సీవోలోని సభ్య దేశాలన్నీ తోటి సభ్య దేశాల సార్వభౌమత్వం, భౌగోళిక సమగ్రతను గౌరవించుకుంటూ అనుసంధానత పెంచుకోవాలని అభిప్రాయపడ్డారు. ఉగ్రవాదం, ఉగ్ర సంస్థల్లో నియామకాలు, శిక్షణ, నిధుల సమీకరణ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టి దీన్ని అంతం చేసేందుకు సభ్య దేశాలన్నీ ఏకతాటిపై నడవాలని మోదీ కోరారు. 
ఎస్‌సీవో సదస్సుకు ముందు ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పరస్పరం ఇరుదేశాలు కీలక సమస్యలను గౌరవిస్తూనే.. ఆ వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని జిన్‌పింగ్‌తో మోదీ తెలిపారు. అంతర్జాతీయ వ్యవహారాల్లో సమాచారం, పరస్పర సహకారంతో ముందుకెళ్లాలన్నారు. రక్షణ, వాణిజ్యం, పెట్టుబడులతోపాటు పలు కీలక ద్వైపాక్షిక అంశాలపై వీరిద్దరు చర్చించారు. 
ఎస్‌సీవోలో సభ్య దేశాలు (8)చైనా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, రష్యా, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, భారత్, పాకిస్తాన్ 
క్విక్ రివ్యూ: ఏమిటి : ఎస్‌సీవో వార్షిక సదస్సు 
ఎప్పుడు : జూన్ 8-9
ఎక్కడ : కజకిస్తాన్‌లోని ఆస్తానా 
ఎవరు : భారత్, పాకిస్తాన్‌లకు సభ్యత్వం

బ్రిటన్‌లో హంగ్ పార్లమెంట్బ్రెగ్జిట్ చర్చల కోసం పార్లమెంట్‌లో బలం పెంచుకునేందుకు బ్రిటన్ ప్రధాని థెరెసా మే 3 ఏళ్ల ముందుగానే నిర్వహించిన ఎన్నికల్లో ఆమె నేతృత్వం వహిస్తోన్న కన్జర్వేటివ్ పార్టీకి పూర్తి మెజారిటీ దక్కలేదు. ఈ మేరకు జూన్ 9న వెలువడిన ఫలితాల్లో కన్జర్వేటివ్ పార్టీ 318 స్థానాలు గెలుపొందింది. లేబర్ పార్టీ 261, స్కాటిష్ నేషనలిస్ట్ పార్టీ 35, లిబరల్ డెమొక్రటిక్ పార్టీ 12, డెమొక్రటిక్ యూనియనిస్ట్ పార్టీ(డీయూపీ)10 స్థానాల్లో గెలుపొందాయి. బ్రిటన్ పార్లమెంట్ దిగువ సభ హౌస్ ఆఫ్ కామన్స్‌లో మొత్తం 650 స్థానాలు ఉండగా ప్రభుత్వ ఏర్పాటు కావాల్సిన మెజారిటీ 326 స్థానాలు. 
డీయూపీతో కలసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు థెరెసా మే ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని జూన్ 9న విజ్ఞప్తి చేశారు. 
ఎంపీగా సిక్కు మహిళ రికార్డు
బ్రిటన్ ఎన్నికల్లో తొలిసారిగా ఓ సిక్కు మహిళ పార్లమెంటుకు ఎన్నికయ్యారు. లేబర్ పార్టీకి చెందిన ప్రీత్‌కౌర్ గ్రిల్ బర్మింగ్‌హామ్ ఎడ్‌‌జబాస్టన్ నుంచి కన్జర్వేటివ్ అభ్యర్థిపై 6,917 ఓట్ల తేడాతో గెలుపొందారు. లేబర్ పార్టీకే చెందిన మరో సిక్కు అభ్యర్థి తన్‌మన్‌జీత్ సింగ్ దేశి కూడా స్లోగ్ సీటు నుంచి గెలిచారు. ఈ ఫలితాలతో బ్రిటన్‌లో భారత సంతతి ఎంపీల సంఖ్య 12కి పెరిగింది. 
బ్రెగ్జిట్ భవితవ్యంపై నీలినీడలు
భారీ మెజార్టీ కోసం ముందస్తు ఎన్నికలకు వెళ్లిన బ్రిటన్ ప్రధాని థె రిసా మే వ్యూహం బెడిసికొట్టింది. ప్రస్తుత మెజార్టీ కూడా కోల్పోవడంతో ఆమె భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఎన్నికలకు కారణమైన బ్రెగ్జిట్ సంక్షోభంలో పడింది. దీంతో బ్రెగ్జిట్ సంప్రదింపులు అనుకున్నట్టే ఈ నెల 19న మొదలవుతాయా? ఒకవేళ లేబర్ నేత కార్బిన్ ప్రధానైతే ఏం చేస్తారు? అనే ప్రశ్నలు ఆసక్తికరంగా మారాయి. 
బ్రెగ్జిట్ గుదిబండేనా?
ఈయూ నుంచి బయటపడేందుకు అవసరమైన చర్చలు ఆలస్యమైతే బ్రిటన్ నష్టపోతుంది. బ్రెగ్జిట్‌పై బ్రిటన్ గతేడాది మార్చిలో 50వ అధికరణను అమలులోకి తెచ్చింది. దాని ప్రకారం సకాలంలో చర్చలు జరిపి ఈయూతో ఒప్పందానికి రావాలి. ఒప్పందం చేసుకున్నా లేకున్నా ఆ అధికరణంతో 2019 మార్చి చివరినాటికి ఈయూ నుంచి బ్రిటన్ బయపడాలి. చర్చలు జరిపి ఆలోగా ఒప్పందం చేసుకుంటే బ్రిటన్ కొంతమేర లాభపడుతుంది. లేదంటే ఎలాంటి ప్రయోజనాలు పొందకుండానే ఈయూ నుంచి తప్పుకోవాలి. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి :
 హంగ్ పార్లమెంటు ఏర్పడే సూచనలు
ఎక్కడ : బ్రిటన్
ఎందుకు : కన్జర్వేటివ్ పార్టీకి పూర్తి మెజారిటీ దక్కనందుకు

బ్రిటన్‌లో కొలువుదీరిన థెరిసా ప్రభుత్వం బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన కన్జర్వేటివ్ పార్టీ అధ్యక్షురాలు థెరిసా మే ప్రధానిగా జూన్ 12న ప్రభుత్వం ఏర్పాటయింది. 650 స్థానాలున్న బ్రిటన్ పార్లమెంట్‌కు జరిగిన ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ 318, ప్రతిపక్ష లేబర్ పార్టీ 261 స్థానాలు గెలుచుకుంది. ప్రభుత్వ ఏర్పాటుకు 326 స్థానాలు అవసరం కాగా పది స్థానాలు గెలుచుకున్న డెమెక్రాటిక్ యూనియనిస్ట్ పార్టీ (డీయూపీ)తో కలిసి థెరిసా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 
భారత సంతతికి చెందిన ప్రీతి పటేల్‌కు కేబినెట్‌లో చోటు కల్పించిన థెరిసా డమియన్ గ్రీన్‌ను ఉప-ప్రధానిగా నియమించారు. ఐదుగురు సీనియర్ మంత్రులు ఫిలిప్ హమ్మండ్, అంబర్ రుడ్, బోరిస్ జాన్సన్, డేవిడ్ డేవిస్, మైఖేల్ పాలన్‌లను కొనసాగిస్తున్నట్టు ప్రకటించారు. 
క్విక్ రివ్యూ: ఏమిటి : బ్రిటన్‌లో ఏర్పాటైన ప్రభుత్వం 
ఎప్పుడు : జూన్ 12
ఎవరు : థెరిసా మే 

కొండచరియలు విరిగిపడి బంగ్లాదేశ్‌లో 105 మంది మృతి బంగ్లాదేశ్‌లో భారీ వర్షాల కారణంగా వివిధ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటంతో 105 మంది మృతి చెందారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా బంగ్లాదేశ్‌లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో భారీ వరదలు సంభవించి పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. రంగమతి జిల్లాలో అత్యధికంగా 76 మంది మరణించారు. ఇందులో నలుగురు మిలిటరీ సిబ్బంది కూడా ఉన్నారు. మరో 100 మంది తీవ్రంగా గాయపడ్డారు.
క్విక్ రివ్యూ: ఏమిటి : బంగ్లాదేశ్‌లో 105 మంది మృతి 
ఎప్పుడు : జూన్ 13
ఎందుకు : భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడటంతో 

జెనీవాలో 106వ అంతర్జాతీయ కార్మిక సమావేశం స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) 106వ సమావేశం జూన్ 5-17 వరకు జరిగింది. ఈ సమావేశాల్లో భారత ప్రతినిధిగా కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాల కార్మికుల నిర్మూలనకు అంతర్జాతీయ కార్మిక సంస్థ కన్వెన్షన్- 138, ప్రమాదకర పరిశ్రమల్లో 14 ఏళ్లలోపు బాలల నిషేధానికి నిర్దేశించిన కన్వెన్షన్-182 చట్టాలను భారత్ ఆమోదించిందని దత్తాత్రేయ తెలిపారు. దీనికి సంబంధించి రాష్ట్రపతి సంతకం చేసిన ఉత్తర్వులను ఐఎల్‌వోకు సమర్పించారు. భారతదేశంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన చట్టం అమలు కోసం ఫిర్యాదుల పరిష్కారానికి ‘పెన్సిల్’ పేరుతో డిజిటల్ వేదికను రూపొందించామని దత్తాత్రేయ తెలిపారు. 
క్విక్ రివ్యూ: ఏమిటి : అంతర్జాతీయ కార్మిక సంస్థ 106వ సమావేశం 
ఎప్పుడు : జూన్ 5 -17
ఎవరు : ఐఎల్ ఓ
ఎక్కడ : జెనీవా, స్విట్జర్లాండ్ 

వడ్డీ రేట్లను పావు శాతం పెంచిన ఫెడ్అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పావుశాతం పెంచింది. జూన్ 13-14 వరకు జరిగిన ఫెడ్ కమిటీ సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్యాంకు ఓ ప్రకటన విడుదల చేసింది. దీంతో ఫెడ్ ఫండ్‌‌స రేటు 1-1.25 శాతానికి చేరుతుంది. వాణిజ్య బ్యాంకులకు ఇచ్చే రుణాలపై వసూలు చేసే రేటును ఫెడ్ ఫండ్‌‌స రేటుగా వ్యవహరిస్తారు. కాగా ఈ ఏడాది ఇది రెండో పెంపు. జీరో వడ్డీరేట్ల వ్యవస్థ నుంచి 2015 డిసెంబర్‌లో పెంపు ప్రక్రియను ఫెడ్ మొదలుపెట్టింది. అప్పటినుంచి తాజా పెంపు నాల్గవది. 
క్విక్ రివ్యూ: ఏమిటి : వడ్డీ రేట్లు పావు శాతం పెంపు 
ఎప్పుడు : జూన్ 13 
ఎవరు : అమెరికా ఫెడ్ 

జాతీయం
జూలై 17న రాష్ట్రపతి ఎన్నిక
భారత 15వ రాష్ట్రపతి ఎన్నిక కోసం ఎన్నికల సంఘం(ఈసీ) జూన్ 7న షెడ్యూలు జారీ చేసింది. జూలై 17న పోలింగ్, 20న కౌంటింగ్ నిర్వహించనున్నామని ప్రకటించింది. ఈ నెల 14న నోటిఫికేషన్ జారీచేసి ఆ రోజు నుంచే నామినేషన్లను స్వీకరిస్తారు. 
ఉపరాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్‌ను త్వరలో జారీ చేస్తామని ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) నసీం జైదీ వెల్లడించారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న 13 అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు ఎన్నికలను రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ ముగిశాకే జరుపుతామని తెలిపారు. ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీ కాలం 2017, జులై 24తో ముగియనుంది. కాగా, సీఈసీ జైదీ వచ్చే నెల 7న పదవీ విరమణ చేయనున్నారు. దీంతో ఎన్నికల ఫలితాన్ని నోటిఫై చేసేనాటికి ఆయన పదవిలో ఉండరు. 
ఎన్నికల షెడ్యూలు

నోటిఫికేషన్14.06.2017
నామినేషన్లకు గడువు28.06.2017
నామినేషన్ల పరిశీలన29.06.2017
అభ్యర్థిత్వాల
ఉపసంహరణ గడువు01.07.2017
పోలింగ్17.07.2017
ఓట్ల లెక్కింపు20.07.2017
ఎన్నికల్లో ఎవరి బలమెంత?
ఎన్డీయేలోని మిత్రపక్షాలు, మద్దతునిస్తున్న ఇతర చిన్నాచితక పార్టీలతో కలుపుకొంటే అధికార బీజేపీకి ఇప్పుడు ఎలక్టోరల్ కాలేజీలో 48.64 శాతం ఓట్లున్నాయి. యూపీఏ, బీజేపీ వ్యతిరేక పార్టీలను కలుపుకొని ఉమ్మడి అభ్యర్థిని నిలబెడితే వీరికి 35.47 శాతం ఓట్లున్నాయి. మరో ఆరు ప్రాంతీయపార్టీలైన అన్నాడీఎంకే, బీజేడీ, టీఆర్‌ఎస్, వైఎస్సార్‌సీపీ, ఆప్, ఐఎన్‌ఎల్‌డీలు తమ రాష్ట్ర రాజకీయ అవసరాల దృష్ట్యా బీజేపీ, కాంగ్రెస్‌లకు సమదూరం పాటిస్తూ తటస్థంగా వ్యవహరిస్తున్నాయి. 
ఎన్డీయే పక్షాల బలం
పార్టీ
మొత్తం ఓట్ల విలువ
ఎలక్టోరల్‌లో ఓట్ల శాతం
బీజేపీ4,42,11740.03
టీడీపీ31,1162.82
శివసేన25,8932.34
- మిగిలిన ఎన్డీయే పార్టీల బలాన్ని కలుపుకుంటే ఎన్డీయే బలం ( ఓట్ల విలువ- 5,37,683, ఓట్ల శాతం - 48.64)
యూపీఏ పక్షాల ఓట్ల శాతం

పార్టీ
మొత్తం ఓట్ల విలువ
ఎలక్టోరల్‌లో ఓట్ల శాతం
కాంగ్రెస్1,61,47814.62
తృణమూల్63,8475.78
సమాజ్‌వాదీ26,0602.36
సీపీఎం27,0692.45
- మిగిలిన యూపీఏ పార్టీల బలాన్ని కలుపుకుంటే మొత్తం ( ఓట్ల విలువ - 3,91,739, ఓట్ల శాతం -35.47)
తటస్థ పార్టీలు

పార్టీమొత్తం ఓట్ల విలువఎలక్టోరల్‌లో ఓట్ల శాతం
అన్నాడీఎంకే59,2245.36
బీజేడీ32,8922.98
టీఆర్‌ఎస్22,0481.99
వైఎస్సార్‌సీపీ16,8481.53
మొత్తం1,44,30213.06
ఎవరు ఎన్ను కుంటారు?రాష్ట్రపతిని ఎలక్టోరల్ కాలేజీ ఎన్నుకుంటుంది. ఇందులో ఎన్నికై న లోక్‌సభ సభ్యులు(543), ఎన్నికై న రాజ్యసభ సభ్యులు(233), ఎన్నికై న రాష్ట్ర శాసనసభల సభ్యులు(ఢిల్లీ, పుదుచ్చేరి సహా) ఉంటారు. మొత్తం 4,896 మంది ఓటేయడానికి అర్హులు. వీరిలో 776 మంది ఎంపీలు, 4120 మంది ఎమ్మెల్యేలు. నామినేటెడ్ సభ్యులకు, రాష్ట్రాల శాసన మండళ్ల సభ్యులకు ఓటు హక్కు ఉండదు. 
పోలింగ్ ఎలా..?
ఓటింగ్‌ను దామాషా ప్రాతినిధ్య విధానంలో రహస్య బ్యాలెట్ ద్వారా నిర్వహిస్తారు. కనుక పార్టీలు తమ ఎంపీలు, ఎమ్మెల్యేలకు విప్ జారీ చేయడానికి వీల్లేదు. ఓటర్లు.. అభ్యర్థులకు తమ ప్రాధాన్యత క్రమంలో ఓటేస్తారు. అభ్యర్థుల పేర్ల ఎదురుగా 1, 2, 3... ఇలా అంకెలు రాస్తారు. ఓటు చెల్లాలంటే మొదటి ప్రాధాన్యత నమోదు తప్పనిసరి. ఇతర ప్రాధాన్యతల నమోదు ఐచ్ఛికం. 
ఓట్ల లెక్కింపు ఎలా?రాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్‌ను 50 మంది ఎలక్టోరల్ సభ్యులు ప్రతిపాదించాలి. మరో 50 మంది ద్వితీయ ప్రతిపాదకులుగా ఉండాలి. అభ్యర్థి గెలవాలంటే మొత్తం ఓట్లలో 50 శాతం + 1 తొలి ప్రాధాన్యత ఓట్లు పొందాలి. ఏ అభ్యర్థికీ ఈ కోటా రాకపోతే.. తొలి ప్రాధాన్యత ఓట్లు అతి తక్కువగా వచ్చిన అభ్యర్థిని పోటీ నుంచి తొలగిస్తారు. ఆ అభ్యర్థికి వచ్చి తొలి ప్రాధాన్యత ఓట్లను.. ఆయా ఓట్లలో నమోదైన రెండో ప్రాధాన్యత ఓట్ల ప్రకారం మిగిలిన అభ్యర్థులకు పంచుతారు. ఒక అభ్యర్థికి అవసరమైన కోటా లభించేదాకా ఇలా తక్కువ ప్రాధాన్యత ఓట్లు 
వచ్చిన అభ్యర్థిని తొలగించి, సదరు ఓట్లను రెండో ప్రాధాన్యత ప్రకారం పంచుతారు. అప్పటికీ ఎవరికీ అవసరమైన కోటా రాకపోతే 
చివరికి పోటీలో మిగిలిన అభ్యర్థినే విజేతగా ప్రకటిస్తారు. 
ఓట్లకు విలువ ఇలా: ఎంపీల ఓట్లకు ఒక విలువ, ఎమ్మెల్యేల ఓట్లకు వేర్వేరు విలువలు ఉంటాయి. దేశాధినేత.. దేశ ప్రజలందరికీ దామాషా పద్ధతి ప్రకారం ప్రాతినిధ్యం వహించేలా, కేంద్ర, రాష్ట్రాలకు సమాన ఓటు హక్కు ఉండేలా ఈ సూత్రాన్ని పాటిస్తున్నారు. ఎలక్టోరల్ కాలేజీ సభ్యుల ఓట్ల విలువను ఇలా లెక్కిస్తారు.. 
ఒక ఎమ్మెల్యే ఓటు విలువ: 1971 జనాభా లెక్కల ప్రకారం ఆ రాష్ట్ర మొత్తం జనాభా / ఆ రాష్ట్ర శాసనసభకు ఎన్నికై న మొత్తం సభ్యుల సంఖ్య × 1000 
రాష్ట్ర శాసనసభ సభ్యులందరి ఓట్ల మొత్తం విలువ: ఒక ఎమ్మెల్యే ఓటు విలువ × మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 
మొత్తం 31 రాష్ట్రాల్లోని (ఢిల్లీ పుదుచ్చేరి సహా) శాసనసభ్యుల ఓట్ల మొత్తం విలువ: మొత్తం 31 రాష్ట్రాల్లోని అందరు ఎమ్మెల్యేల ఓట్ల విలువ మొత్తం = 5,49,474 
ఎంపీ ఓటు విలువ: అందరు ఎమ్మెల్యేల ఓట్ల మొత్తం విలువ (5,49,474) / మొత్తం పార్లమెంటు సభ్యుల సంఖ్య (776) = 708 
అందరు ఎంపీల ఓట్ల మొత్తం విలువ: ఒక ఎంపీ ఓటు విలువ × మొత్తం ఎంపీల సంఖ్య = 5,49,408 
ఎలక్టోరల్ కాలేజీ ఓట్ల మొత్తం విలువ: అందరు శాసనసభ్యుల ఓట్ల మొత్తం విలువ + అందరు ఎంపీల ఓట్ల మొత్తం విలువ = 5,49,474 + 5,49,408 = 10,98,882

రాష్ట్రపతి ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల ఎమ్మెల్యేల ఓటు విలువ

రాష్ట్రంఅసెంబ్లీ స్థానాలుఒక్కో ఎమ్మెల్యే ఓటు విలువమొత్తం ఎమ్మెల్యేల ఓటు విలువ
ఆంధ్రప్రదేశ్17515927,825
తెలంగాణ11913215,708
గమనిక: గత రాష్ట్రపతి ఎన్నికలో ఉమ్మడి ఏపీలోని ఒక్కో ఎమ్మెల్యే ఓటు విలువ 148 కాగా ఈసారి ఏపీకి చెందిన ఒక్కో ఎమ్మెల్యే ఓటు విలువ 159కి పెరిగింది. తెలంగాణలో 132కు తగ్గింది. 1971 జనాభా లెక్కల ఆధారంగా కేంద్ర ఎన్నికల సంఘం ఈ విలువలను ఖరారు చేసింది.
క్విక్ రివ్యూ: 
ఏమిటి :
 రాష్ట్రపతి ఎన్నిక విధానం 
ఎప్పుడు : జులై 17 
ఎవరు : ఎన్నికల సంఘం 

పెట్రోల్, డీజిల్ ధరల్లో రోజూ వారి మార్పులు
దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వరంగ చమురు సంస్థలకు చెందిన 58 వేల పెట్రోల్ బంకుల్లో జూన్ 16 నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు రోజూ మారనున్నాయి. ఈ మేరకు ధరలను రోజూ సమీక్షించాలని ప్రభుత్వరంగ సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ నిర్ణయించాయి. దీంతో పెట్రోల్ ధరలు రోజూ మారుతూ... ఒకే రోజులో కూడా మూడు కంపెనీల బంకుల్లో మూడు రకాలుగా ఉండనున్నాయి. 
ధరలను ఏరోజుకారోజు దినపత్రికల్లో ముద్రించడంతో పాటు మొబైల్ యాప్‌లు, ఎస్‌ఎంఎస్‌ల ద్వారా కూడా తెలియపరుస్తారు. 
క్విక్ రివ్యూ: ఏమిటి : పెట్రోల్, డీజిల్ ధరల్లో రోజూవారీ మార్పులు 
ఎప్పుడు : జూన్ 16 నుంచి 
ఎక్కడ : దేశవ్యాప్తంగా 
ఎవరు : ఐవోసీ, బీపీ, హెచ్‌పీ 

‘టాప్ 200’లో భారత విద్యాసంస్థలకు చోటు ప్రపంచ వ్యాప్తంగా 200 అగ్రశ్రేణి విద్యాసంస్థల్లో తొలిసారిగా మూడు భారతీయ ఉన్నత విద్యాసంస్థలు చోటు దక్కించుకున్నాయి. ఈ మేరకు బ్రిటన్‌కు చెందిన క్యూఎస్ వరల్డ్ సంస్థ ‘టాప్ 200 గ్లోబల్ యూనివర్సిటీస్’ పేరుతో విడుదల చేసిన జాబితాలో బెంగళూరులోని ఐఐఎస్సీ, ఢిల్లీ, బొంబాయి ఐఐటీలు ర్యాంకులు దక్కించుకున్నాయి. బెంగళూరు ఐఐఎస్‌సీ ర్యాంకు గత ఏడాది 190 కాగా, ఈసారి 152కు చేరింది. ఢిల్లీ ఐఐటీ ర్యాంకు 185 నుంచి 179కి, బొంబాయి ఐఐటీ ర్యాంకు 219 నుంచి 179కి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 26 వేల యూనివర్సిటీల నుంచి 200 అగ్రశ్రేణి విద్యాసంస్థలను క్యూఎస్ వరల్డ్ ఎంపిక చేసింది. 
క్విక్ రివ్యూ: ఏమిటి : టాప్ 200 గ్లోబల్ యూనివర్సిటీస్ 
ఎప్పుడు : జూన్ 8 
ఎవరు : క్యూఎస్ వరల్డ్ 

పాన్, ఆధార్ అనుసంధానంపై సుప్రీంకోర్టు పాక్షిక స్టే 
పాన్ కార్డు, ఐటీ రిటర్న్స్‌కు ఆధార్ కార్డు అనుసంధానాన్ని తప్పనిసరి చేయడాన్ని సుప్రీం కోర్టు సమర్థించింది. అయితే ఇప్పటివరకు ఆధార్ లేనివారికి, దాని కోసం దరఖాస్తు చేసుకున్నవారికి ఆ కార్డు పొందేవరకు మినహాయింపునిస్తూ పాక్షిక స్టే ఇచ్చింది. వ్యక్తిగత గోప్యత అంశంపై (21వ అధికరణ) రాజ్యాంగ ధర్మాసనం నిర్ణయం తీసుకునేవరకు ఈ మినహాయింపు ఉంటుందని జూన్ 9న వెలువరించిన తీర్పులో పేర్కొంది. ఇంతవరకు ఆధార్ లేనివారు ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయవచ్చని.. అయితే ఇప్పటికే ఆధార్ ఉన్నవారు మాత్రం పాన్ (పర్మనెంట్ అకౌంట్ నంబర్)కు అనుసంధానం చేసుకోవాలని చెప్పింది. 
పాన్ జారీ, ఆదాయపన్ను రిటర్న్స్ దాఖలుకు ఆధార్ లింకును ఈ ఏడాది జూలై 1 నుంచి తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఆదాయ పన్ను(ఐటీ) చట్టంలో సెక్షన్ 139ఏఏను తీసుకొచ్చింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి :
 పాన్‌తో ఆధార్ అనుసంధానంపై పాక్షిక స్టే 
ఎప్పుడు : జూన్ 8 
ఎవరు : సుప్రీం కోర్టు 

మహారాష్ట్రలో రైతుకు రుణ మాఫీమహారాష్ట్ర ప్రభుత్వం రైతులకు రుణ మాఫీ చేస్తామని జూన్ 11న ప్రకటించింది. ఇందుకోసం ఓ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రైతు సమస్యల పరిష్కారానికి నియమించిన ఉన్నత స్థాయి కమిటీ, రైతు నాయకుల మధ్య చర్చల్లో ఆ మేరకు అంగీకారం కుదిరింది. దీంతో జూన్ 1 నుంచి రైతులు ప్రారంభించిన ఆందోళనను విరమించారు. 
ప్రభుత్వ నిర్ణయం వల్ల 1.07 కోట్ల మంది రైతులకు లాభం కలుగుతుంది. చిన్న, మధ్య తరహా రైతులకు సంబంధించిన సుమారు రూ. 30 వేల కోట్ల రుణాలు రద్దవుతాయి. 
క్విక్ రివ్యూ: ఏమిటి : రూ. 30 వేల కోట్ల రైతు రుణాల మాఫీ 
ఎప్పుడు : జూన్ 11
ఎక్కడ : మహారాష్ట్రలో 
ఎవరు : మహారాష్ట్ర ప్రభుత్వం

భారత్-మయన్మార్ సరిహద్దు పరిశీలనకు కమిటీ భారత్ - మయన్మార్‌ల సరిహద్దు ద్వారా జరుగుతోన్న స్వేచ్ఛాయుత రాకపోకల పరిశీలనకు కేంద్రం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి ప్రస్తుతం కేంద్ర అంతర్గత భద్రత శాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న రీనా మిత్రాను చైర్మన్‌గా నియమించింది. 
మయన్మార్‌తో భారత్‌కు 1,643 కిలో మీటర్ల సరిహద్దు ఉంది. ఆ దేశంతో ఉన్న సత్సంబంధాల నేపథ్యంలో సరిహద్దు వెంట రాకపోకలపై ఎలాంటి ఆంక్షలు విధించలేదు. అయితే ఈ స్వేచ్ఛాయుత నిబంధనలను కొందరు పౌరులు ఉల్లంఘిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ప్రస్తుత నియమ నిబంధనలను మరోసారి పరిశీలించేందుకు కేంద్రం ఈ కమిటీని ఏర్పాటు చేసింది. 
ఇదే అంశానికి సంబంధించి 2015లో ఆర్. ఎన్. రవి నేతృత్వంలో ఏర్పాటు చేసిన జాయింట్ ఇంటలిజెన్స్ కమిటీ.. మయన్మార్ వెంట ఉన్న సరిహద్దు నిబంధనల్లో మార్పులు చేయాలని ప్రతిపాదించింది. మొత్తం సరిహద్దు వెంట కాకుండా కేవలం కొన్ని గ్రామాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసి పోలీసుల పర్యవేక్షణలో రాకపోకలను అనుమతించాలని పేర్కొంది. 
క్విక్ రివ్యూ: ఏమిటి : రీనా మిత్రా కమిటీ ఏర్పాటు 
ఎప్పుడు : జూన్ 12
ఎవరు : కేంద్ర హోంశాఖ 
ఎందుకు : భారత్ - మయన్మార్ సరిహద్దు అధ్యయనానికి

మహారాష్ట్రలో అత్యధిక బాల్యవివాహాలు దేశంలోని 10 నుంచి 17 ఏళ్ల వయసు కలిగిన ప్రతి ఐదుగురు బాలికల్లో ఒకరికి నిర్ణీత వయసుకంటే ముందే వివాహం జరుగుతుంది. ఇది గ్రామాల కంటే పట్టణాల్లోనే ఎక్కువగా ఉందని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎన్‌సీపీసీఆర్), యంగ్ లివ్స్‌ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థల సంయుక్త అధ్యయనం వెల్లడించింది. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఈ అధ్యయనం చేశారు.
2011కి ముందు దశాబ్ద కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే.. దేశవ్యాప్తంగా బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్న టాప్ 70 జిల్లాల్లో 16 మహారాష్ట్రలోనే ఉన్నాయి. మహారాష్ట్రలోని 16 జిల్లాల్లో అబ్బాయిలతో పోలిస్తే.. అమ్మాయిల బాల్య వివాహాల సంఖ్య ఐదు రెట్లు పెరిగింది. రాజస్థాన్‌లో అబ్బాయిలు 8.6 శాతం, అమ్మాయిలు 8.3 శాతం మందికి నిర్ణీత వయసులోగానే వివాహం అవుతుంది. మొత్తంగా 13 రాష్ట్రాల్లోని(ఉమ్మడి ఏపీతో కలిపి) 70 జిల్లాల్లో 21.1 శాతం బాలికల వివాహాలు జరగగా.. 22.5 శాతం అబ్బాయిల వివాహాలు జరిగాయి.
దేశంలో బాలికల వివాహాల శాతం

సంవత్సరంగ్రామాల్లోపట్టణాల్లోమొత్తం
20012.75 %1.78%2.51%
20112.43%2.45%2.44%
క్విక్ రివ్యూ: 
ఏమిటి :
 దేశంలో బాల్య వివాహాలపై సర్వే 
ఎప్పుడు : 2001-2011 మధ్య కాలంలో 
ఎవరు : జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎన్‌సీపీసీఆర్), యంగ్ లివ్స్‌ ఇండియా
ఎక్కడ : దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లోని 70 జిల్లాల్లో 

సియోల్‌లో 5వ భారత్- కొరియా ఆర్థిక సదస్సు మౌలిక సదుపాయాల అభివృద్ధి, ద్వైపాక్షిక వాణిజ్య బలోపేతానికి సంబంధించి భారత్, దక్షిణ కొరియాల మధ్య కీలక ఒప్పందాలు కుదిరాయి. ఈ మేరకు కొరియా రాజధాని సియోల్‌లో జరిగిన భారత్-కొరియా 5వ ఆర్థిక సదస్సులో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, దక్షిణ కొరియా ఉప ప్రధాన మంత్రి, ఆర్థిక మంత్రి కిమ్ డాంగ్-యెన్‌ల సమక్షంలో ఈ ఒప్పందాలు జరిగాయి. ఈ ఒప్పందం ప్రకారం భారత్‌లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల అభివృద్ధికి 1 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయంతో పాటు 9 బిలియన్ డాలర్ల రాయితీతో కూడిన రుణాలను కొరియా అందించనుంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి :
 భారత్-కొరియా 5వ ఆర్థిక సదస్సు
ఎప్పుడు : జూన్ 14
ఎక్కడ : సియోల్, కొరియా 
ఎందుకు : భారత్‌కు 10 బిలియన్ డాలర్ల కొరియా సాయంపై ఒప్పందం 

సోమాలియాతో ఖైదీల బదిలీ ఒప్పందానికి ఆమోదం
భారత్, సోమాలియా మధ్య జరిగిన శిక్ష పడ్డ ఖైదీల పరస్పర మార్పిడి ఒప్పందానికి కేంద్ర కేబినెట్ జూన్ 7న ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం ఖైదీల పరస్పర బదిలీ ఒప్పందానికి అంగీకారం తెలపడంతోపాటు ద్వైపాక్షిక ఆమోదానికి తగిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.
క్విక్ రివ్యూ: ఏమిటి : ఖైదీల బదిలీ ఒప్పందం
ఎప్పుడు : జూన్ 7 
ఎవరు : భారత్, సోమాలియా 

రాష్ట్రీయం
తెలంగాణ సెర్ప్‌కు జాతీయ పురస్కారం

యువతకు ఉపాధి కల్పించడంలో విశేష కృషి చేసిన తెలంగాణ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్)కు జాతీయ పురస్కారం దక్కింది. బ్యాంకుల సహకారంతో గ్రామీణ స్వయం ఉపాధిశిక్షణ సంస్థల ద్వారా యువతకు ఉపాధి కల్పించడంలో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచినందుకు రాష్ట్రానికి ఈ అవార్డు లభించింది. ఈ మేరకు జూన్ 7న ఢిల్లీలో జరిగిన గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ 4వ జాతీయ దివస్‌లో కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ చేతుల మీదుగా సెర్ప్ డెరైక్టర్ బాలయ్య ఈ అవార్డు అందుకున్నారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి :
 తెలంగాణ సెర్ప్‌కు జాతీయ పురస్కారం 
ఎప్పుడు : జూన్ 6 
ఎక్కడ : ఢిల్లీలో 

ఆన్‌లైన్‌లోనే వాహన యజమాని పేరు మార్పుఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా ఆన్‌లైన్‌లోనే వాహన యజమాని పేరు మార్చే ప్రక్రియను విశాఖపట్నం జిల్లా రవాణా శాఖలో ప్రవేశపెట్టారు. వాహన క్రయ, విక్రయాల సమయంలో యజమాని రవాణా కార్యాలయానికి రావాల్సిన అవసరం లేకుండా జూన్ 7 నుంచి ఈ సేవలను అందుబాటులోకి తెచ్చారు. వాహన పత్రాలు తదితర వాటిని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయడంతో సులభంగా పేరు మార్పిడికి అవకాశం ఏర్పడింది. 
మొట్టమొదటిగా 2016 మార్చి నుంచి కొత్త వాహనాల ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌ను విశాఖ జిల్లాలోనే ప్రారంభించారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి :
 ఆన్‌లైన్‌లోనే వాహన యజమాని పేరు మార్చే విధానం ప్రారంభం
ఎప్పుడు : జూన్ 6 
ఎక్కడ : విశాఖపట్నం ఆర్టీఏలో 

కాకినాడలో మహాసంకల్ప దీక్ష జూన్ 2న కృష్ణా జిల్లా విజయవాడ బెంజ్ సర్కిల్‌లో ప్రారంభించిన నవ నిర్మాణ దీక్షను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జూన్ 8న తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ముగించారు. ఈ సభకు హాజరైన జనంతో మహా సంకల్ప దీక్ష పేరుతో సీఎం ప్రతిజ్ఞ చేయించారు. అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్‌ను పొగరహిత వంట ఇంధన వినియోగ రాష్ట్రంగా ప్రకటించారు. 
ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం.. 2022 నాటికి దేశంలోని మూడు రాష్ట్రాల్లో ఏపీని ఒకటిగా చేసి తలసరి ఆదాయాన్ని మూడు లక్షలకు పెంచుతానన్నారు. 2029 నాటికి దేశంలో నంబర్ వన్ రాష్ట్రంగా చేసి తలసరి ఆదాయాన్ని రూ.10 లక్షలకు తీసుకు వెళతానని.. 2050 నాటికి కోటి ఏడు లక్షల తలసరి ఆదాయంతో రాష్ట్రాన్ని ప్రపంచంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దుతామన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా చేపట్టిన కాఫర్ డ్యామ్ పనులను 2018 నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. 
అమ్మకు వందనం పథకం..
అ అంటే అమ్మ, ఆమెను ఎంతో గౌరవించాలనే ఉద్దేశంతో తల్లులకు పాదాభివందనం చేసేలా ‘అమ్మకు వందనం’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు సీఎం ప్రకటించారు. ఈ పథకం ద్వారా అమ్మకు బడి పిల్లలతో వందనం చేయించే ప్రక్రియ చేపడుతున్నామని చెప్పారు. 
క్విక్ రివ్యూ: ఏమిటి : మహాసంకల్ప దీక్ష
ఎప్పుడు : జూన్ 8
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ
ఎవరు : సీఎం చంద్రబాబు 

ఎంపీ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కన్నుమూతకాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి (80) జూన్ 9న కన్నుమూశారు. పార్లమెంటు స్టాండింగ్ కమిటీ సమావేశంలో పాల్గొనడానికి సహచర ఎంపీలతో కలసి హిమాచల్‌ప్రదేశ్‌లోని కులూకు వెళ్లిన ఆయన.. అక్కడ తీవ్ర గుండెపోటుకు గురయ్యారు. తెలంగాణలోని నల్గొండ జిల్లా చండూరు మండలంలోని ఇడికుడ పాల్వాయి స్వగ్రామం. ముక్కుసూటి స్వభావమున్న నేతగా పేరుపొందిన పాల్వాయిది ఐదున్నర దశాబ్దాల రాజకీయ జీవితం. నెహ్రూ హయాంలో కాంగ్రెస్‌లో చేరిన ఆయన.. 1967లోనే తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. రెండుసార్లు మంత్రిగా, ఎమ్మెల్సీగా, రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. తొలి తెలంగాణ ఉద్యమ సమయంలో కీలకంగా పోరాడి.. జైలుకు వెళ్లారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి :
 కాంగ్రెస్ ఎంపీ పాల్వాయి గోవర్దన్‌రెడ్డి కన్నుమూత 
ఎప్పుడు : జూన్ 9 
ఎక్కడ : హిమాచల్ ప్రదేశ్‌లో 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పండుగగా ఏరువాక పౌర్ణమిఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం 74 ఉడేగోళం గ్రామంలో జూన్ 9న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏరువాక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కాడెద్దులు తోలి వేరుశనగ విత్తనం వేశారు. ఆపై ట్రాక్టర్‌తో దుక్కి దున్నారు. అనంతరం బహిరంగసభలో మాట్లాడిన ఆయన.. రాబోయే రోజుల్లో ఏరువాకను రాష్ట్ర పండుగగా ప్రకటిస్తామని చెప్పారు.
క్విక్ రివ్యూ: 
ఏమిటి :
 ఏపీలో ఏరువాక ప్రారంభం 
ఎప్పుడు : జూన్ 9
ఎక్కడ : 74 ఉడేగోళం, రాయదుర్గం, అనంతపురం 
ఎవరు : సీఎం చంద్రబాబు 

ఏపీలో ఫిజికల్ లిటరసీ పాలసీ ఖరారు ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం (2017-18) నుంచి ఫిజికల్ లిటరసీని ప్రవేశపెట్టనున్నారు. ఇందుకు సంబంధించి 8 అంశాలతో కూడిన పాలసీని రాష్ట్ర ప్రభుత్వం జూన్ 9న ఖరారు చేసింది. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ జీఓ 35ని విడుదల చేశారు. విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం పెంపు, శారీరక దారుఢ్యం, నైపుణ్యాలు పెంపొందించడంతోపాటు క్రమశిక్షణ అలవడేందుకు ఫిజికల్ లిటరసీ దోహదపడుతుందని జీవోలో పేర్కొన్నారు. 
వ్యాయామ విద్యలు 
యోగనిద్ర, ప్రాణాయామం, ధ్యానం, తాయ్‌చీ (మార్షల్ ఆర్‌‌ట్స), సంగీతం, రన్నింగ్, జంపింగ్, థ్రోయింగ్, కినేస్తిటిక్. గ్లయిడింగ్, కేచింగ్, కికింగ్, స్ట్రయికింగ్, కోలాటం, డప్పు, కర్రసాము, ఏరోబిక్ తరగతులు, ట్రెక్కింగ్, వాటర్, స్నోలాండ్, సర్ఫింగ్ రివర్ రాఫ్టింగ్, వేవ్ బోర్డింగ్, డైవింగ్, క్రికెట్, ఫుట్‌బాల్, బాస్కెట్‌బాల్, వాలీబాల్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్, తొక్కుడు బిళ్ల, బిళ్లంగోడు, ఖోఖో, కబడ్డీ, కూచిపూడి, భరతనాట్యం. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి :
 ఫిజికల్ లిటరసీ పాలసీ 
ఎప్పుడు : జూన్ 9
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో 
ఎవరు : ఏపీ విద్యాశాఖ

ఏపీలో కృష్ణా నదిపై ఆరు లేన్ల వంతెనఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ముఖద్వారంగా కృష్ణా నదిపై ఆరు లేన్ల ఐకానిక్ వంతెన నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఈ మేరకు రూ.800 కోట్ల వ్యయంతో వేలాడే వంతెన (హ్యాంగింగ్ బ్రిడ్జి) నిర్మించనున్నారు. ఇక్కడి చరిత్ర, సంస్కృతి ప్రతిబింబించేలా కూచిపూడి ముద్ర, కూచిపూడి నాట్య భంగిమ ఇమిడి ఉండేలా రెండు అంతస్తుల్లో ఈ వంతెనను నిర్మించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 
కృష్ణానదిపై ఇబ్రహీంపట్నం మండలంలోని పవిత్ర సంగమం నుంచి తుళ్లూరు మండలంలోని లింగాయపాలెం వరకు సుమారు ఐదు కిలోమీటర్ల మేర ఈ వంతెన నిర్మాణానికి అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏడీసీ) త్వరలో టెండర్లు పిలవనుంది. ఈ వంతెనకు సంబంధించి ఇప్పటికే ఎల్ అండ్ టీ ఆరు కాన్సెప్ట్ డిజైన్లను ప్రభుత్వానికి సమర్పించింది. 
క్విక్ రివ్యూ: ఏమిటి : కృష్ణా నదిపై ఆరు లేన్ల వంతెన 
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో 
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 
ఎందుకు : అమరావతికి ముఖద్వారంగా

ఏపీ ట్రెజరీలో "ఈ కుభేర్" ద్వారా చెల్లింపులు ట్రెజరీల్లో జరుగుతున్న ఆన్‌లైన్ మోసాలు, అవినీతిని అరికట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిజర్వు బ్యాంకు పర్యవేక్షణలో నిర్వహించే ‘ఈ కుభేర్’ పథకాన్ని ప్రవేశపెట్టనుంది. ఈ పథకం వల్ల ట్రెజరీల్లో కుంభకోణాలు జరిగే అవకాశం లేకుండా కాంప్రహెన్సివ్ ఫైనాన్సియల్ మానిటరింగ్ సిస్టం (సీఎఫ్‌ఎమ్‌ఎస్)ను ప్రభుత్వం అమలు చేయనుంది. ఇందుకు సంబంధించిన రాష్ట్ర విభాగాన్ని విజయవాడకు సమీపంలోని ఇబ్రహీంపట్నంలో ఉన్న డెరైక్టరేట్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్‌లో ఏర్పాటు చేస్తున్నారు. 
ప్రస్తుతం బ్యాంకుల వారు ట్రెజరీలకు పంపిస్తున్న ఈ చెక్‌ను ఆయా ఖాతాలకు జనరేట్ చేసే సందర్భంలో నిధులు స్వాహా అవుతున్నందున ఈ విధానాన్ని సమగ్రంగా పరిశీలించి ప్రక్షాళన చేసేందుకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే సీఎఫ్‌ఎమ్‌ఎస్ సిస్టం అమలు చేసేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. 
క్విక్ రివ్యూ: ఏమిటి : ఈ కుభేర్ ద్వారా ట్రెజరీ చెల్లింపులు 
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్‌లో 
ఎవరు : ఆర్థిక శాఖ 
ఎందుకు : అవినీతికి తావులేకుండా 

ప్రముఖ రచయిత సి. నారాయణరెడ్డి కన్నుమూత
 
ప్రముఖ కవి, సాహితీ వేత్త సింగిరెడ్డి నారాయణరెడ్డి(86) జూన్ 12న కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని తన ఇంట్లో తుదిశ్వాస విడిచారు. సినారెకు నలుగురు కుమార్తెలు గంగ, యమున, సరస్వతి, క్రిష్ణవేణి ఉన్నారు. 
సినారె అసలు పేరు సింగిరెడ్డి నారాయణరెడ్డి. ఆయన 1931 జూలై 29న రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం హన్మాజీపేటలో సింగిరెడ్డి మల్లారెడ్డి, బుచ్చమ్మ రైతు దంపతులకు జన్మించారు. కవిగా, రచయితగా, విమర్శకుడిగా, సినీ గేయ రచయితగా, మహా వక్తగా, గజల్ కవిగా, గాయకుడిగా, సాహిత్య బోధకుడిగా, పరిశోధకుడిగా ప్రసిద్ధి చెందారు.

  • 1952-54లో ఉస్మానియా యూనివర్సిటీలోనే ఎంఏ తెలుగు పూర్తి చేశారు.
  • సినారెది బాల్య వివాహం. భార్య పేరు సుశీల. 30 ఏళ్ల క్రితమే మరణించిన ఆమె పేరు మీద ‘సుశీల నారాయణరెడ్డి సాహిత్య పురస్కారాన్ని ప్రారంభించారు.
  • చిన్నప్పట్నుంచే కవిత్వం పట్ల ఆసక్తిని, ఇష్టాన్ని ఏర్పర్చుకున్న సినారె ఆరేడు తరగతుల వయస్సులోనే కవితలు రాశారు. 1953లో వచ్చిన ‘నవ్వని పువ్వు’సినారె తొలి రచన.
  • ఎంఏ పూర్తయ్యాక కొంతకాలం సికింద్రాబాద్ ఆర్‌‌ట్స అండ్ సైన్స్ కాలేజీలో పార్ట్‌టైమ్ లెక్చరర్‌గా సినారె పనిచేశారు.
  • 1955లో ఆంధ్రోపన్యాసకుడిగా, 1958లో నిజాం కాలేజీలో ఉపన్యాసకుడిగా చేరారు.
  • ఆ సమయంలోనే దేవులపల్లి కృష్ణశాస్త్రి సూచన మేరకు ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం పర్యవేక్షణలో ‘ఆధునికాంధ్ర కవిత్వం -సంప్రదాయములు, ప్రయోగములు’అంశంపై పరిశోధన చేశారు. 1962లో పీహెచ్‌డీ పట్టా పొందారు.
  • అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా 1981 నుంచి 1985 వరకు పని చేశారు. 1985 నుంచి 1989 వరకు అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ ఉపాధ్యక్షులుగా బాధ్యతలు నిర్వర్తించారు.
  • భాషా సాంస్కృతిక సలహాదారుడిగా కొంతకాలం, రాష్ట్ర సాంస్కృతిక మండలి చైర్మన్‌గా 1987 నుంచి 2004 వరకు విధులు నిర్వహించారు.
  • 1997లో రాజ్యసభ సభ్యుడిగా సినారెకు అవకాశం లభించింది. ఆరేళ్లు ఆ పదవిలో కొనసాగారు.
  • సినారె రాసిన గ్రంథాలు, రచనలు ఇంగ్లిషు, ఫ్రెంచ్, సంస్కృతం, హిందీ, మలయాళం, ఉర్దూ, కన్నడ మొదలైన భాషల్లోకి అనువాదమయ్యాయి. మొత్తం 18 రకాల సాహిత్య ప్రక్రియల్లో 90కి పైగా గ్రంథాలు రాశారు.
  • ‘కర్పూర వసంతరాయలు’, ‘నాగార్జున సాగరం’, ‘తెలుగు గజళ్లు’, ‘కావ్యగానాలు’ప్రముఖమైనవి.
  • ‘విశ్వనాథ నాయకుడు’, ‘రుతుచక్రం’పేరు ప్రఖ్యాతులను తెచ్చిపెట్టాయి.
  • 1990లో యుగోస్లేవియాలో జరిగిన అంతర్జాతీయ కవి సమ్మేళనంలో భారతీయ భాషల ప్రతినిధిగా పాల్గొన్నారు.
  • ‘విశ్వంభర’వచన కావ్యానికి 1988లో జ్ఞానపీఠ్ అవార్డు వరించింది. ‘ఋతుచక్రం’కావ్యానికి సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.
  • 1977లో పద్మశ్రీ పురస్కారం, 1992లో పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు.
సినారె అందుకున్న అవార్డులు
  • జ్ఞానపీఠ్ అవార్డు
  • పద్మశ్రీ, పద్మవిభూషణ్
  • కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు
  • ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ అవార్డు
  • రాజాలక్ష్మీ పురస్కారం
  • సోవియట్-నెహ్రూ పురస్కారం
  • ఉస్మానియా నుంచి తెలుగు సాహిత్యంలో డాక్టరేట్
  • కళాప్రపూర్ణ, సినీకవిగా నంది పురస్కారాలు
  • పలు యూనివర్సిటీల నుంచి గౌరవ డాక్టరేట్లు
  • 2014లో సాక్షి ‘జీవన సాఫల్య పురస్కారం’
క్విక్ రివ్యూ: 
ఏమిటి :
 ప్రముఖ సాహితీవేత్త సినారె మృతి 
ఎప్పుడు : జూన్ 12 
ఎక్కడ : హైదరాబాద్
ఎందుకు : గుండెపోటు రావడంతో

తెలంగాణ వాణిజ్య శాఖ పురోగతి నివేదిక 2016-17 తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక విధానం ‘టీఎస్ ఐపాస్’ ప్రారంభించిన నాటి నుంచి రూ.73 వేల కోట్ల పెట్టుబడులతో 3,828 కొత్త పరిశ్రమలు వచ్చాయని ఐటీ శాఖ మంత్రి కె. తారకరామారావు తెలిపారు. దీంతో 2.46 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధితో పాటు 10 లక్షల వరకు పరోక్ష ఉపాధి అవకాశాలు సాధించగలిగామని చెప్పారు. ఈ మేరకు టీఎస్ ఐపాస్ ప్రారంభించి రెండేళ్లయిన సందర్భంగా రూపొందించిన తెలంగాణ వాణిజ్య శాఖ పురోగతి నివేదిక 2016-17ను జూన్ 12న విడుదల చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ లోగోను ఆవిష్కరించారు.
క్విక్ రివ్యూ: 
ఏమిటి :
 వాణిజ్య శాఖ పురోగతి నివేదిక 2016-17
ఎప్పుడు : జూన్ 12
ఎక్కడ : తెలంగాణలో
ఎవరు : ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ 

ఏపీలో కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాలు పెంపు కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాలను 50% మేర పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ 12న ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో ఉద్యోగికి నెలకు రూ.12వేలు తగ్గకుండా వేతనం ఉండాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. పెంచిన వేతనాలు ఏప్రిల్ 1వ తేదీ నుంచి వర్తింపచేయనున్నారు. 
అదే సమయంలో వేతనాల పెంపు వర్తింపునకు ప్రభుత్వం కొన్ని షరతులను విధించింది. మంజూరైన రెగ్యులర్ ఖాళీ పోస్టుల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు, ఆర్థిక శాఖ అనుమతితో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు మాత్రమే పెంపుదల వర్తింప చేస్తారు. ఎలాంటి అలవెన్సులు, ఇంక్రిమెంట్లు ఉండవని పేర్కొన్నారు. ప్రభుత్వ శాఖల్లో పనిచేసే కన్సల్టెంట్లకు, సలహాదారులకు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఈ ఉత్తర్వులు వర్తించవని పేర్కొన్నారు. 
క్విక్ రివ్యూ: ఏమిటి : కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలు 50 శాతం పెంపు 
ఎప్పుడు : జూన్ 12
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్‌లో 
ఎవరు : ఏపీ ప్రభుత్వం 

అమరావతిలో ప్రకృతి వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో రూ.100 కోట్ల వ్యయంతో వంద ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఇందుకు సహకరించాలని ప్రముఖ ప్రకృతి సేద్యరంగ నిపుణుడు సుభాష్ పాలేకర్‌ను ఆహ్వానించిన సీఎం ప్రకృతి సాగుకి రాష్ట్ర ప్రభుత్వ సలహదారుగా ఆయన్ను నియమించారు. ఈ మేరకు పాలేకర్ జూన్ 14న ఉండవల్లిలో సీఎం చంద్రబాబుని కలిసి రాష్ట్రంలో పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ స్థితిగతుల గురించి చర్చించారు. 
పెట్టుబడి లేని వ్యవసాయ విజ్ఞానాన్ని రాష్ట్రం నలుదిశలా వ్యాప్తి చేసేందుకు త్వరలో పాలేకర్‌తో రైతులకు పాఠాలు చెప్పిస్తామని, వీడియో కాన్ఫరెన్స్‌లతో రైతుల సందేహాలను నివృత్తి చేస్తామని ఈ సందర్భంగా చంద్రబాబు ప్రకటించారు. పాలేకర్ సూచన మేరకు రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో బయోగ్యాస్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడంతో పాటు నీటి సంరక్షణ విధానాలను నీరు-ప్రగతిలో చేర్చాలని అధికారులకు సూచించారు. 
క్విక్ రివ్యూ: ఏమిటి : వంద ఎకరాల్లో ప్రకృతి విశ్వవిద్యాలయం 
ఎప్పుడు : జూన్ 14
ఎవరు : ముఖ్యమంత్రి చంద్రబాబు 
ఎక్కడ : అమరావతిలో 

ఆర్థికం
జీఎంఆర్ చేతికి గ్రీస్ ఎయిర్‌పోర్ట్
గ్రీస్‌లోని క్రీతి నగరంలో ఉన్న హిరాక్లియో విమానాశ్రయం అభివృద్ధి, నిర్వహణ ప్రాజెక్టును జీఎంఆర్ గ్రూప్ కంపెనీ జీఎంఆర్ ఎయిర్‌పోర్‌‌ట్స దక్కించుకుంది. ఇన్‌ఫ్రా దిగ్గజం టెర్నా భాగస్వామ్యంతో ప్రాజెక్టును చేపట్టనున్నట్లు సంస్థ ప్రకటించింది. నిర్మాణం పూర్తయ్యాక ఎయిర్‌పోర్ట్ నిర్వహణ బాధ్యతలను జీఎంఆర్ చేపడుతుంది. కన్సెషన్ పీరియడ్ 35 ఏళ్లు. హిరాక్లియో గ్రీస్‌లో రెండో అతిపెద్ద విమాశ్రయం. 
క్విక్ రివ్యూ: ఏమిటి : హిరాక్లియో విమానాశ్రయం కాంట్రాక్ట్ 
ఎప్పుడు : జూన్ 6 
ఎక్కడ : గ్రీస్‌లో 
ఎవరు : జీఎంఆర్ 

ఐడీబీఐ ఎన్‌పీఏల విక్రయ లక్ష్యం 5 వేల కోట్లు 
భారీగా ఎన్‌పీఏల్లో కూరుకుపోయిన ఐడీబీఐ బ్యాంక్.. 2017-18 ఆర్థిక సంవత్సరంలో రూ.5,000 కోట్ల ఎన్‌పీఏలను (నికర నిరర్ధక ఆస్తుల) విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం ప్రత్యేకంగా ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ఆధ్వర్యంలో 150 మంది ఉద్యోగులతో కలిసి నిరర్ధక ఆస్తుల నిర్వహణ, పర్యవేక్షణ బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది. కార్పొరేట్, రిటైల్ విభాగాల్లో ప్రతి ఎన్‌పీఏను క్షుణ్ణంగా అధ్యయనం చేయడం వీరి బాధ్యత. 
2017 మార్చి నాటికి ఐడీబీఐ బ్యాంక్ స్థూల ఎన్‌పీఏలు రూ.44 వేల కోట్లు కాగా.. ఇందులో నికర ఎన్‌పీఏల విలువ రూ.28 వేల కోట్లు. 
క్విక్ రివ్యూ: ఏమిటి : ఎన్‌పీఏల విక్రయ లక్ష్యం రూ. 5 వేల కోట్లు 
ఎప్పుడు : జూన్ 8 
ఎవరు : ఐడీబీఐ 

జూలై 1 నుంచి ఐటీ రిటర్న్స్‌కు ఆధార్ తప్పనిసరిజూలై 1 నుంచి ఆదాయపన్ను రిటర్న్స్ దాఖలు చేసేందుకు ఆధార్ తప్పనిసరి అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కొత్తగా శాశ్వత ఖాతా సంఖ్య(పాన్) కార్డు కోసం దరఖాస్తు చేసే వారు ఆధార్‌ను సమర్పించాలని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) పేర్కొంది. పాన్ కార్డుకు, ఐటీ రిటర్న్స్‌కు ఆధార్ అనుసంధానాన్ని తప్పనిసరి చేయడాన్ని సుప్రీంకోర్టు సమర్థించిన నేపథ్యంలో సందేహాల నివృత్తికి ‘తీర్పు ప్రభావం’ పేరిట మూడు అంశాలతో కూడిన ప్రకటనను సీబీడీటీ జూన్ 10న విడుదల చేసింది. ఇప్పటి వరకు ఆధార్ లేనివారికి, దాని కోసం దరఖాస్తు చేసుకున్నవారికి మాత్రమే సుప్రీం తాత్కాలిక మినహాయింపునిచ్చిందని, వారి పాన్‌కార్డుల్ని రద్దుచేయమని స్పష్టం చేసింది. 
క్విక్ రివ్యూ: ఏమిటి : జూలై 1 నుంచి ఐటీ రిటర్న్స్‌కు ఆధార్ తప్పనిసరి
ఎప్పుడు : జూన్ 10
ఎవరు : కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు 

66 వస్తువులపై జీఎస్టీ పన్ను తగ్గింపుసామాన్యులపై వస్తుసేవల పన్ను (జీఎస్టీ) ప్రభావం పడకుండా 66 వస్తువులపై జీఎస్టీ మండలి పన్నుకోత విధించింది. జీఎస్టీ శ్లాబుల వర్గీకరణపై 133 పరిశ్రమలతోపాటు సమాజంలోని వివిధ వర్గాలనుంచి వచ్చిన డిమాండ్లు, వినతులకు అనుగుణంగా రేట్ల విధానంలో మార్పు చేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో జూన్ 11న సమావేశమైన జీఎస్టీ మండలి చిరువ్యాపారులకు మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకుంది.
జూలై 1 నుంచి జీఎస్టీ అమల్లోకి రానున్న నేపథ్యంలో బ్యాంకింగ్, బీమా, వస్త్ర, ఎగుమతులు, సమాచార సాంకేతికత, రవాణా, చమురు, గ్యాస్ వంటి రంగాల్లో సమస్యలను పరిష్కరించేందుకు 18 రంగాల గ్రూపులను కేంద్రం ఏర్పాటు చేసింది. 
చిన్న, మధ్య తరహా వ్యాపారులకు మేలు

  • రూ.100 రూగపాయల్లోపల సినిమా టికెట్ల ధరలను గతంలో ఉన్న 28 శాతం నుంచి తొలగించి 18 శాతం శ్లాబులోకి చేర్చారు. రూ.100 పైనున్న టికెట్లపై ధరలు ఇటీవల నిర్ణయించిన రేటు (28 శాతం)తోనే కొనసాగనున్నాయి.
  • పచ్చళ్లు, ఆవాలు, మురబ్బా వంటి వాటిని 12 శాతం (గతంలో 18 శాతంలో ఉండేవి)లోకి చేర్చగా.. జీడిపప్పును 12 నుంచి 5 శాతం పరిధిలోకి తీసుకొచ్చారు.
  • ఏడాదికి 75 లక్షల టర్నోవర్ ఉన్న వ్యాపారులు, తయారీదారులు, రెస్టారెంట్ యజమానులు (గత పరిమితి రూ.50 లక్షల టర్నోవర్) కాంపోజిషన్ పథకాన్ని ఎంచుకుని వరుసగా 1, 2, 5 శాతం రేట్లతో పన్ను చెల్లించాలని నిర్ణయించారు.
తగ్గనున్న ఇన్సులిన్, స్కూలు బ్యాగులు
  • చిన్న పిల్లల డ్రాయింగ్ పుస్తకాలను 12 శాతం నుంచి పన్నురహిత వస్తువుల్లోకి చేర్చగా.. స్కూలు బ్యాగులు 18 శాతంలోకి వచ్చాయి.
  • కంప్యూటర్ ప్రింటర్లు గతంలో ఉన్న 28 శాతం నుంచి 18 శాతంలోకి వచ్చాయి.
  • ఇన్సులిన్, అగర్‌బత్తీలు ఐదుశాతంలోకి.. కాటుక 28 నుంచి 18 శాతంలోకి వచ్చాయి.
  • వజ్రాలు, తోలు, వస్త్ర, ఆభరణ, ప్రింటింగ్ పరిశ్రమలపై పన్నురేటును 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గింపు.
  • ట్రాక్టర్ విడిభాగాలు, ప్లాస్టిక్ టార్పలిన్‌లపై పన్ను 18 శాతానికి తగ్గింపు.
  • జూన్ 18న జరిగే తదుపరి జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో లాటరీ పన్నులు, ఈ-వే బిల్లులపై నిర్ణయం తీసుకోనున్నారు. హైబ్రిడ్ కార్లపై జీఎస్టీ సమీక్ష విషయంలో రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నాక స్పందించాలని మండలి నిర్ణయించింది.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : 
66 వస్తువులపై జీఎస్టీ తగ్గింపు 
ఎప్పుడు : జూన్ 11 
ఎవరు : జీఎస్టీ మండలి 

త్వరలో కొత్త రూ.500 నోట్లుమహాత్మా గాంధీ సిరీస్‌లోనే ముద్రించిన కొత్తరకం 500 నోట్లను త్వరలో విడుదల చేయనున్నట్లు ఆర్‌బీఐ జూన్ 13న ప్రకటించింది. వీటిలో ‘రెండు నంబర్ ప్యానెళ్లలో ‘ఏ’ అక్షరం, ఆర్‌బీఐ గవర్నర్ ఉర్జీత్ పటేల్ సంతకం, వెనక వైపు ముద్రిత సంవత్సరం ‘2017’ ఉంటాయి. ఈ నోట్లు ప్రస్తుతం చెలామణిలో ఉన్న రూ.500 నోట్ల మాదిరిగానే ఉండనున్నాయి.
క్విక్ రివ్యూ: 
ఏమిటి :
 కొత్త సిరీస్‌తో రూ.500 నోట్లు 
ఎప్పుడు : త్వరలో 
ఎక్కడ : దేశవ్యాప్తంగా 
ఎవరు : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 

మొండి బకాయిలపై దివాలా చట్టం కింద చర్యలుమొండి బకాయిలపై దివాలా చట్టం కింద చర్యలు తీసుకోనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది. కింగ్‌ఫిషర్ గ్రూపు అధినేత విజయ్ మాల్యాపై ఇప్పటికే బ్యాంకులు చట్టపరమైన చర్యలు ప్రారంభించిన నేపథ్యంలో దాదాపు లక్షల కోట్లు ఎగ్గొట్టిన మరో 12 మందిపై దివాలా కోడ్ ప్రకారం చర్యలు ప్రారంభించాల్సిందిగా జూన్ 13న బ్యాంకుల్ని ఆదేశించింది. 
దేశవ్యాప్తంగా మొత్తం బ్యాంకులిచ్చిన బకాయిల్లో దాదాపు రూ.8 లక్షల కోట్లు మొండి బకాయిలుగా మారగా.. అందులో 25 శాతం, అంటే దాదాపు రూ.2 లక్షల కోట్లను ఎగవేసింది కేవలం ఈ 12 మందే. అయితే ఈ 12 మంది పేర్లు మాత్రం ఆర్‌బీఐ వెల్లడించలేదు. నిరర్ధక ఆస్తులుగా మారిన రూ.8 లక్షల కోట్లలో 75 శాతం, అంటే రూ. 6 లక్షల కోట్లు ప్రభుత్వ రంగ బ్యాంకులిచ్చినవే. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి :
 12 ఎన్‌పీఏలపై దివాలా చట్టం కింద చర్యలు 
ఎప్పుడు : జూన్ 13 
ఎవరు : రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా 
ఎందుకు : రుణాలు ఎగవేసినందుకు 

కస్టమర్ సర్వీసులో 12 బ్యాంకులే ఉత్తమం దేశంలోని 51 బ్యాంకుల్లో కేవలం 12 బ్యాంకులు మాత్రమే కస్టమర్లకు ఉత్తమమైన సేవలను అందిస్తున్నాయి. బ్యాంకింగ్ కోడ్‌‌స అండ్ స్టాండర్డ్స్ బోర్డు ఆఫ్ ఇండియా (బీసీఎస్‌బీఐ) జూన్ 13న విడుదల చేసిన 2016-17 వార్షిక నివేదికలో ఈ 12 బ్యాంకులు హై రేటింగ్‌ను పొందాయి. ఇందులో ఉన్న ఒకే ఒక ప్రభుత్వ బ్యాంక్ ‘ఐడీబీఐ’ కాగా మిగతావన్నీ ప్రైవేట్, విదేశీ బ్యాంకులే. 2016-17 ఆర్థిక సంవత్సరంలో అన్ని బ్యాంకుల స్కోర్ సగటున 77గా ఉంది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఈ స్కోర్ 78గా నమోదయి్యంది. 
బీసీఎస్‌బీఐ అనేది ఆర్‌బీఐ ఏర్పాటు చేసిన ఒక స్వతంత్ర సంస్థ. మంచి బ్యాంకింగ్ విధానాలను ప్రోత్సహించడం, పారదర్శకత పెంపొందించడం, కార్యాచరణ ప్రమాణాల మెరుగుదల వంటి పలు అంశాల సాధనే బీసీఎస్‌బీఐ ప్రధాన లక్ష్యం. 
‘హై’ రేటింగ్ పొందిన బ్యాంకులు

ఆర్‌బీఎల్ బ్యాంక్యాక్సిస్ బ్యాంక్
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్డీసీబీ బ్యాంక్
ఇండస్‌ఇండ్ బ్యాంక్కొటక్ మహీంద్రా బ్యాంక్
ఐసీఐసీఐ బ్యాంక్యస్ బ్యాంక్
స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్హెచ్‌ఎస్‌బీసీ బ్యాంకు
సిటీ బ్యాంక్‌
క్విక్ రివ్యూ: 
ఏమిటి :
 బీసీఎస్‌బీఐ కస్టమర్ సర్వీస్ రిపోర్ట్ 
ఎప్పుడు : 2016-17
ఎక్కడ : దేశవ్యాప్తంగా 
ఎవరు : హై రేటింగ్ పొందిన 12 బ్యాంకులు 
ఎందుకు : ఖాతాదారులకు అందించే సేవలకు గాను 

2017-18కి మారనున్న జీడీపీ బేస్ ఇయర్స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)కి సంబంధించిన బేస్ ఇయర్ ప్రస్తుత 2011-12 నుంచి త్వరలో 2017-18కి మారనుంది. ఈ మేరకు కేంద్ర గణాంకాల శాఖ మంత్రి డీవీ సదానంద గౌడ జూన్ 13న వెల్లడించారు. ప్రస్తుతం జరుగుతున్న గృహ వినియోగ వ్యయంపై సర్వే, దేశంలో కార్మిక శక్తికి సంబంధించి గణాంకాల సేకరణ 2018తో పూర్తవుతాయని.. అటు తర్వాత జీడీపీకి సంబంధించి బేస్ ఇయర్ మారుతుందని చెప్పారు. 
గణాంకాల మంత్రిత్వశాఖ నేతృత్వంలోని కేంద్ర గణాంకాల కార్యాలయం 2015 మొదట్లోనే జీడీపీ బేస్ ఇయర్‌ను 2004-05 నుంచి 2011-12కు మార్చింది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ), టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం గణాంకాల బేస్ ఇయర్‌ను 2017 మే నెలలో 2004-05 నుంచి 2011-12కు మార్చారు. 
క్విక్ రివ్యూ: ఏమిటి : మారనున్న జీడీపీ బేస్ ఇయర్ 
ఎప్పుడు : 2011-12 నుంచి 2017-18కి 
ఎవరు : కేంద్ర గణాంకాల శాఖ

రైతులకు కేంద్రం వడ్డీ రాయితీ కొనసాగింపుస్వల్పకాలిక రుణాలు తీసుకునే రైతులకు వడ్డీ రాయితీ పథకాన్ని కొనసాగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రూ.3 లక్షల వరకు రైతులు తీసుకునే స్వల్పకాలిక రుణానికి 7 శాతం వడ్డీ కాగా.. ఈ రుణాన్ని సకాలంలో చెల్లించే రైతులు 4 శాతం (3 శాతం సబ్సిడీ) వడ్డీ చెల్లించే పథకాన్ని పొడిగించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రధాని మోదీ అధ్యక్షతన జూన్ 14న జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ పథకం కోసం రూ.20,339 కోట్లను కేటా యిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రకృతి వైపరీత్యాల బారిన పడి నష్టపోయిన రైతులు సకాలంలో రుణాన్ని చెల్లించలేకపోతే.. వారికి మొదటి ఏడాది వడ్డీపై 2 శాతం సబ్సిడీ అందించనున్నారు. అలాగే పంటను నిల్వ ఉంచుకునేందుకు ఆరు నెలల కాలానికి తీసుకునే రుణాలను 7 శాతానికే అందజేయనున్నారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి :
 రైతులకు స్వల్పకాలిక రుణాలపై వడ్డీ రాయితీ కొనసాగింపు
ఎప్పుడు : జూన్ 14 
ఎవరు : కేంద్ర కేబినెట్ 
ఎందుకు : సకాలంలో రుణాలు చే ల్లిస్తే 3 శాతం వడ్డీ రాయితీ 

మధ్యప్రదేశ్ రైతు కుటుంబాలకు రూ. కోటి పరిహారంమధ్యప్రదేశ్‌లోని మంద్‌సౌర్ జిల్లాలో ఇటీవల రైతులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో మరణించిన రైతుల కుటుంబాలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహన్ ఒక్కో కుటుంబానికి రూ.కోటి పరిహారం అందించారు. పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించడంతోపాటు రైతుల రుణాన్ని మాఫీ చేయాలని కోరుతూ జూన్ 6న మంద్ సౌర్ జిల్లాలోని రైతులు చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారడంతో వారిపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆరుగురు రైతులు మరణించారు. 
క్విక్ రివ్యూ: ఏమిటి : పోలీసు కాల్పుల్లో చనిపోయిన రైతు కుటుంబాలకు రూ. కోటి పరిహారం 
ఎప్పుడు : జూన్ 14
ఎవరు : ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ 
ఎక్కడ : మధ్యప్రదేశ్ 

వడ్డీ రేట్లు యథాతథం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ).. 2017-18 రెండో ద్వైమాసిక పరపతి సమీక్ష నిర్ణయాలను జూన్ 8న ప్రకటించింది. ఆర్‌బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలోని పరపతి విధాన కమిటీ రెపో రేటును వరుసగా నాలుగో సారి యథాతథం(6.25 శాతం)గా ఉంచింది. రివర్స్ రెపో రేటును 6 శాతంగా కొనసాగించింది. సీపీఐ ద్రవ్యోల్బణ మధ్య కాలిక లక్ష్య సాధనకే వడ్డీ రేట్లను మార్చలేదని స్పష్టం చేసింది.
క్విక్ రివ్యూ: 
ఏమిటి :
 పరపతి సమీక్షలో వడ్డీరేట్లు యథాతథం 
ఎప్పుడు : జూన్ 8 
ఎవరు : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 

సైన్స్ అండ్ టెక్నాలజీ
ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలు
ఐక్యరాజ్య సమితి విధించిన ఆంక్షలను ధిక్కరించి ఉత్తర కొరియా మరో సారి క్షిపణి పరీక్షలు నిర్వహించింది. గ్యాంగ్‌వాన్ ప్రావిన్స్లోని వాన్‌సాన్‌లో జూన్ 8న కొన్ని క్షిపణులను ఉత్తరకొరియా ప్రయోగించిందని దక్షిణ కొరియా రక్షణ శాఖ పేర్కొంది. ఇవి భూ ఉపరితలం నుంచి ఓడలపై దాడులు చేసే తరహా క్షిపణులు అయి్య ఉండవచ్చని తెలిపింది. గడిచిన ఐదు వారాల్లోనే ఉత్తర కొరియా నాలుగుసార్లు క్షిపణి పరీక్షలు నిర్వహించింది. 
ఈ బాలిస్టిక్ క్షిపణి పరీక్షల నేపథ్యంలో ఉత్తర కొరియాకు చెందిన అధికారులు, సంస్థలపై ఆంక్షలు విధించాలంటూ అమెరికా ప్రతిపాదించిన ముసాయిదాను ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి జూన్ 2న ఏకగ్రీవంగా తీర్మానించింది. 
క్విక్ రివ్యూ: ఏమిటి : మరోసారి క్షిపణి పరీక్షలు 
ఎప్పుడు : జూన్ 8
ఎవరు : ఉత్తర కొరియా 

జీశాట్-19 కక్ష్య దూరం పెంచిన ఇస్రోభారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) జీఎస్‌ఎల్‌వీ మార్క్3డీ1 రాకెట్ ద్వారా ప్రయోగించిన జీశాట్- 19 ఉపగ్రహం కక్ష్య దూరాన్ని జూన్ 8న రెండు సార్లు విజయవంతంగా పెంచింది. 170 కిలోమీటర్ల పెరిజీని (భూమికి దగ్గరగా) 10,287 కిలోమీటర్ల ఎత్తుకు పెంచుతూ, అపోజీని (భూమికి దూరంగా) 35,873 కిలోమీటర్లకు తగ్గించారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి :
 జీశాట్ - 19 కక్ష్య దూరం పెంపు 
ఎప్పుడు : జూన్ 8 
ఎవరు : ఇస్రో 

పాలపుంతలోని ఓ గ్రహానికి బెంగళూరు బాలిక పేరు బెంగళూరులో జరిగిన ఇన్‌టెల్ ఇంటర్నేషనల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఫెయిర్(ఐఎస్‌ఈఎఫ్)లో అదే నగరానికి చెందిన సాహితి పింగళి తొలి స్థానంలో నిలిచింది. బెంగళూరులో మలినాలతో నిండిన సరస్సుల డేటాతో సాహితి రూపొందించిన యాప్‌కు గాను ఆమెకు ఈ గుర్తింపు లభించింది. దాంతో మాసాచూసెట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎమ్‌ఐటీ) ఆమె పేరును పాలపుంతలో ఒక గ్రహానికి పెట్టాలని నిర్ణయించింది. 
క్విక్ రివ్యూ: ఏమిటి : పాలపుంతలో ఓ గ్రహానికి సాహితి పింగళి పేరు 
ఎప్పుడు : జూన్ 8 
ఎవరు : మాసాచూసెట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ

క్రీడలు
కాపాబ్లాంకా స్మారక చెస్ టోర్నీ విజేత శశికిరణ్
ప్రపంచ మాజీ చాంపియన్ జోస్ రౌల్ కాపాబ్లాంకా (క్యూబా) స్మారకార్థం నిర్వహించిన అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ కృష్ణన్ శశికిరణ్ విజేతగా నిలిచాడు. క్యూబాలోని వారాడెరోలో జరిగిన ఈ టోర్నీలో శశికిరణ్ మూడు గేముల్లో గెలిచి, ఏడింటిని ‘డ్రా’ చేసుకొని అజేయంగా నిలిచాడు. తద్వారా 1962 నుంచి జరుగుతోన్న కాపాబ్లాంకా చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన తొలి భారతీయ క్రీడాకారుడిగా శశికిరణ్ గుర్తింపు పొందాడు. 
క్విక్ రివ్యూ: ఏమిటి : కాపాబ్లాంకా స్మారక చెస్ టోర్నీ 
ఎప్పుడు : జూన్ 6
ఎక్కడ : క్యూబా
ఎవరు : విజేత కృష్ణన్ శశికిరణ్ 

ఫ్రెంచ్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ విజేత బోపన్న, దబ్రౌస్కీ 
ఫ్రెంచ్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్‌ను భారత డబుల్స్ స్టార్ రోహన్ బోపన్న, గాబ్రియేలా దబ్రౌస్కీ (కెనడా) కైవసం చేసుకున్నారు. ఈ మేరకు జూన్ 8న జరిగిన మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్లో ఏడో సీడ్ బోపన్న-దబ్రౌస్కీ జోడీ 2-6, 6-2, 12-10తో ‘సూపర్ టైబ్రేక్’లో అన్‌సీడెడ్ ద్వయం అనాలెనా గ్రోన్‌ఫెల్డ్ (జర్మనీ)-రాబర్ట్ ఫరా (కొలంబియా)పై గెలిచింది. విజేతగా నిలిచిన బోపన్న జోడీకి 1,18,000 యూరోలు (రూ. 85 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. 
తొమ్మిదేళ్ల కెరీర్‌లో బోపన్నకు ఇది తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్. అలాగే ఈ విజయంతో గ్రాండ్‌స్లామ్ టోర్నీలో డబుల్స్ విభాగంలో టైటిల్ నెగ్గిన నాలుగో భారత ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. గతంలో మహేశ్ భూపతి, లియాండర్ పేస్, సానియా మీర్జా డబుల్స్ విభాగాల్లో గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌ను సాధించారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి :
 ఫ్రెంచ్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ - 2017
ఎప్పుడు : జూన్ 8 
ఎక్కడ : ఫ్రాన్స్ 
ఎవరు : రోహన్ బోపన్న, గాబ్రియేలా దబ్రౌస్కీ 

విదేశాల్లో ఎంఎస్ ధోని సిక్సర్ల రికార్డు భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని విదేశాల్లో అత్యధిక అంతర్జాతీయ సిక్సర్లు కొట్టిన భారత ఆటగాడిగా రికార్డు నమోదు చేశాడు. చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా జూన్ 8న శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్‌లో ధోని 52 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 63 పరుగులు చేశాడు. తద్వారా ఇప్పటి వరకు భారత మాజీ ఆటగాడు సౌరవ్ గంగూలీ పేరిట ఉన్న ఈ రికార్డును ధోని అధిగమించాడు. 296 విదేశీ అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో గంగూలీ 159 సిక్సర్లు కొట్టగా, ఆ రికార్డును 281 మ్యాచ్‌ల్లో 161 సిక్సర్లతో ధోని అధిగమించాడు. 
క్విక్ రివ్యూ: ఏమిటి : విదేశాల్లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత ప్లేయర్ 
ఎప్పుడు : జూన్ 8
ఎక్కడ : ఇంగ్లండ్ 
ఎవరు : మహేంద్ర సింగ్ ధోని

ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ విజేత ఒస్టాపెంకోఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను లాత్వియా క్రీడాకారిణి 20 ఏళ్ల జెలెనా ఒస్టాపెంకో కైవసం చేసుకుంది. పారిస్‌లోని రొలాండ్ గారోస్‌లో జూన్ 10న గంటా 59 నిమిషాలపాటు జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో అన్‌సీడెడ్ ఒస్టాపెంకో 4-6, 6-4, 6-3తో మూడో సీడ్ సిమోనా హలెప్ (రొమేనియా)పై గెలిచి కెరీర్‌లో తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను అందుకుంది. అలాగే 21 లక్షల యూరోలు (రూ. 15 కోట్ల 10 లక్షలు) ప్రైజ్‌మనీని పొందింది. 
ఒస్టాపెంకో విజయం విశేషాలు

  • 1933లో మార్గరెట్ స్క్రివెన్ వివియన్ (బ్రిటన్) తర్వాత ఫ్రెంచ్ ఓపెన్‌లో విజేతగా నిలిచిన తొలి అన్‌సీడెడ్ క్రీడాకారిణిగా గుర్తింపు.
  • కెరీర్‌లో తొలి ప్రొఫెషనల్ టైటిల్‌గా గ్రాండ్‌స్లామ్ టోర్నీని గెలుచుకున్న మూడో ప్లేయర్. మహిళల విభాగంలో బార్బరా జోర్డాన్ (1979 ఆస్ట్రేలియన్ ఓపెన్) ముందుగా ఈ రికార్డు నెలకొల్పగా... 1997 జూన్ 8న గుస్తావో కుయెర్టన్ (బ్రెజిల్) కూడా దానిని సాధించాడు. అదే రోజు పుట్టిన ఒస్టాపెంకో 20 ఏళ్ల తర్వాత మళ్లీ అలాంటి విజయాన్ని అందుకుంది.
  • కేవలం 20 లక్షల జనాభా ఉన్న యూరోపియన్ దేశం లాత్వియా నుంచి గ్రాండ్‌స్లామ్ చాంపియన్‌గా అవతరించిన తొలి ప్లేయర్‌గా గుర్తింపు.
క్విక్ రివ్యూ: 
ఏమిటి :
 ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ - 2017
ఎప్పుడు : జూన్ 10
ఎక్కడ : పారిస్‌లో 
ఎవరు : విజేత జెలెనా ఒస్టాపెంకో 

ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేత నాదల్ 
ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను స్పెయిన్ దిగ్గజం రాఫెల్ నాదల్ సొంతం చేసుకున్నాడు. పారిస్‌లోని రొలాండ్ గారోస్‌లో జూన్ 11న జరిగిన ఫైనల్లో నాలుగో సీడ్ నాదల్ 6-2, 6-3, 6-1తో మూడో సీడ్ వావ్రింకా (స్విట్జర్లాండ్)ను ఓడించాడు. తద్వారా కెరీర్‌లో పదోసారి ఫ్రెంచ్ ఓపెన్‌ను నెగ్గిన నాదల్.. ఒకే గ్రాండ్‌స్లామ్‌ను పదిసార్లు గెలిచిన ఏకై క ప్లేయర్‌గా రికార్డు నమోదు చేశాడు. దీంతో నాదల్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సంఖ్య 15కు (రెండో స్థానం) చేరుకుంది. 18 టైటిల్స్‌తో ఫెడరర్ అగ్రస్థానంలో ఉన్నాడు. 14 టైటిల్స్‌తో పీట్ సంప్రాస్ మూడో స్థానంలో ఉన్నాడు. 
ఓవరాల్‌గా నాదల్ కెరీర్‌లో ఇది 73వ సింగిల్స్ టైటిల్ కాగా క్లే కోర్టులపై 53వది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి :
 ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ - 2017
ఎప్పుడు : జూన్ 11
ఎక్కడ : పారిస్‌లో 
ఎవరు : విజేత రాఫెల్ నాదల్ 

ఫిఫా అండర్-20 ప్రపంచకప్ చాంపియన్ ఇంగ్లండ్దక్షిణకొరియాలో జరిగిన ఫిఫా అండర్-20 ప్రపంచకప్‌ను ఇంగ్లండ్ కైవసం చేసుకుంది. జూన్ 11న జరిగిన ఫైనల్లో 1-0తో వెనిజులాపై విజయం సాధించడం ద్వారా ఇంగ్లిష్ జట్టు 51 ఏళ్ల తర్వాత ప్రపంచ స్థాయి టైటిల్‌ను దక్కించుకుంది. 
టోర్నీలో అత్యుత్తమంగా రాణించిన ఇంగ్లండ్ ప్లేయర్ డొమినిక్ సొలంకి గోల్డెన్ బాల్ పురస్కారం అందుకున్నాడు. బెస్ట్ గోల్ కీపర్‌కి ఇచ్చే గోల్డెన్ గ్లోవ్ అవార్డు ఇంగ్లండ్ జట్టుకే చెందిన ఉడ్‌మెన్‌కు దక్కింది. 
క్విక్ రివ్యూ: ఏమిటి : ఫిఫా అండర్ - 20 చాంపియన్‌షిప్ 
ఎప్పుడు : జూన్ 11
ఎక్కడ : దక్షిణ కొరియా 
ఎవరు : విజేత ఇంగ్లండ్ 

కెనడా గ్రాండ్ ప్రీ విజేత లూయిస్ హామిల్టన్ మాంట్రియాల్‌లో జరిగిన కెనడా గ్రాండ్ ప్రీ టైటిల్‌ను మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ సొంతం చేసుకున్నాడు. జూన్ 12న జరిగిన ఫార్ములావన్ రేసులో విజేతగా నిలిచిన హామిల్టన్ వరుసగా మూడోసారి ఈ టైటిల్‌ను దక్కించుకున్నాడు. 2015, 2016లోనూ ఈ రేసులో హామిల్టన్ గెలిచాడు. 
ఈ రేసులో మెర్సిడెస్ జట్టుకే చెందిన వాల్తెరీ బొటాస్ రెండో స్థానంలో నిలువగా... రికియార్డో (రెడ్‌బుల్), వెటెల్ (ఫెరారీ) వరుసగా మూడు, నాలుగు స్థానాలను సంపాదించారు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా జట్టు డ్రైవర్లు సెర్గియో పెరెజ్, ఎస్టాబెన్ ఒకాన్ వరుసగా ఐదు, ఆరు స్థానాల్లో నిలిచారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి :
 కెనడా గ్రాండ్ ప్రీ - 2017 విజేత
ఎప్పుడు : జూన్ 12
ఎక్కడ : మాంట్రియాల్ 
ఎవరు : లూయిస్ హామిల్టన్ 

ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచకప్‌లో జీతూ-హీనాకు స్వర్ణం
అజర్‌బైజాన్‌లో జరిగిన ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచకప్‌లో భారత షూటర్ల జీతూ రాయ్-హీనా సిద్ధు పసిడి పతకాన్ని కైవసం చేసుకున్నారు. 10 మీ. ఏయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్ విభాగంలో జరిగిన ఫైనల్లో జీతూ జంట 7-6తో రష్యా జోడీపై గెలుపొంది స్వర్ణం గెలుచుకుంది. మరోవైపు ఇరాన్‌ను ఓడించిన ఫ్రాన్స్ కాంస్య పతకాన్ని నెగ్గింది. ఓవరాల్‌గా ఈ టోర్నీలో మొత్తం ఆరు పతకాల (మూడు స్వర్ణాలు)తో చైనా తొలిస్థానంలో నిలిచింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి :
 ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచకప్ - 2017 
ఎప్పుడు : జూన్ 12
ఎక్కడ : అజర్‌బైజాన్ 
ఎవరు : జీతూ-హీనాకు స్వర్ణం

ఐసీసీ టోర్నీల్లో ధావన్ పరుగుల రికార్డు భారత ఓపెనర్ శిఖర్ ధావన్ ఐసీసీ టోర్నీల్లో వేగంగా వెయి్య పరుగుల్ని సాధించిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. ఈ క్రమంలో భారత మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న ఈ రికార్డును అధిగమించాడు. చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా జూన్ 11న దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డేలో ఈ ఘనతను నమోదు చేశాడు. 
ఐసీసీ టోర్నీల్లో వేగవంతమైన వెయి్య పరుగుల్ని సాధించడానికి సచిన్ కు 18 ఇన్నింగ్‌‌స లు అవసరమైతే, ధావన్ 16 ఇన్నింగ్‌‌సల్లోనే పూర్తిచేశాడు.
క్విక్ రివ్యూ: ఏమిటి : ఐసీసీ టోర్నీల్లో వేగంగా వెయ్యి పరుగులు పూర్తి
ఎప్పుడు : జూన్ 11 
ఎక్కడ : ఇంగ్లండ్‌లో 
ఎవరు : శిఖర్ ధావన్

జాతీయ క్రికెట్ కోచ్‌ల పదవీకాలం రెండేళ్లుభారత క్రికెట్ జట్లకు సంబంధించిన కోచ్‌ల పదవీ కాలం రెండేళ్లపాటు ఉండాలని బీసీసీఐ పరిపాలక కమిటీ (సీఓఏ) నిర్ణయించింది. జూన్ 12 ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు అనుగుణంగా ఇక నుంచి అన్ని ఒప్పందాలు రెండేళ్ల పాటు ఉంటాయని సీఓఏ చైర్మన్ వినోద్ రాయ్ చెప్పారు. దీంతో జాతీయ జట్టు నుంచి అండర్-19 వరకు ఉండే కోచ్‌లు రెండు నెలల పాటు ఐపీఎల్‌లో పనిచేసే అవకాశం కోల్పోనున్నారు. 
క్విక్ రివ్యూ: ఏమిటి : జాతీయ క్రికెట్ కోచ్‌లకు రెండేళ్ల పదవీకాలం 
ఎప్పుడు : జూన్ 12
ఎవరు : బీసీసీఐ పరిపాలక కమిటీ

వార్తల్లో వ్యక్తులు
ఎఫ్‌బీఐ నూతన డెరైక్టర్‌గా క్రిస్టఫర్
అమెరికాలోని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్‌బీఐ)కు తదుపరి డెరైక్టర్‌గా మాజీ అటార్నీ జనరల్ క్రిస్టఫర్ రే(50) నియమితులయ్యారు. ఈ పదవికి ఆయనని నామినేట్ చేస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జూన్ 6న తెలిపారు. సెనేట్ ఆమోదం పొందిన వెంటనే ప్రస్తుతం ఎఫ్‌బీఐ తాత్కాలిక డెరైక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ఆండ్రూ మెక్‌కేబ్ నుంచి క్రిస్టఫర్ బాధ్యతలు స్వీకరిస్తారు. న్యాయశాఖలో 2003-05 కాలంలో అసిస్టెంట్ అటార్నీ జనరల్‌గా పనిచేసిన క్రిస్టఫర్.. ఎన్‌రాన్ కుంభకోణంతో పాటు సెప్టెంబర్ 11 ఉగ్రదాడుల విచారణలో కీలకంగా వ్యవహరించారు. 
క్విక్ రివ్యూ: ఏమిటి : ఎఫ్‌బీఐ నూతన డెరైక్టర్ 
ఎప్పుడు : జూన్ 6 
ఎక్కడ : అమెరికాలో 
ఎవరు : క్రిస్టఫర్ రే

నాసా వ్యోమగాముల్లో భారత సంతతి వ్యక్తినాసా చేపట్టనున్న అంతరిక్ష ప్రయోగానికి ఎంపికైన 12 మంది వ్యోమగాముల్లో భారత సంతతికి చెందిన యూఎస్ ఎయిర్ ఫోర్స్‌లో లెఫ్టినెంట్ కల్నల్‌గా పనిచేస్తున్న రాజాచారి (39) చోటు దక్కించుకున్నారు. ప్రస్తుతం అయోవా రాష్ట్రంలోని వాటర్లూ నగరంలో నివసిస్తున్న రాజాచారీ మసాచూసెట్స్ ఇన్‌స్టిట్యూట్ నుంచి ఎరోనాటిక్స్ అండ్ ఆో్టన్రాటిక్స్‌లో మాస్టర్ డిగ్రీ, అమెరికాలోని నావెల్ టెస్ట్ పైలట్ స్కూల్ నుంచి డిగ్రీ పట్టా అందుకున్నారు. ప్రస్తుతం ఆయన 461 ఫ్లైట్ టెస్ట్ స్క్వాడ్రన్‌లో కమాండర్‌గా, కాలిఫోర్నియాలోని ఎడ్వర్డ్స్ ఎయిర్‌ఫోర్స్ బేస్‌లో ఉన్న ఎఫ్-35 ఇంటిగ్రేటెడ్ టెస్ట్ ఫోర్స్‌కు డెరైక్టర్‌గా ఉన్నారు.
క్విక్ రివ్యూ: ఏమిటి : నాసా వ్యోమగామిగా ఎంపికైన భారత సంతతి వ్యక్తి 
ఎప్పుడు : జూన్ 8 
ఎవరు : రాజాచారి 

ఫోర్బ్స్ టాప్-100లో కోహ్లికి చోటు ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ఆదాయాన్ని ఆర్జిస్తున్న 100 మంది క్రీడాకారుల జాబితాలో 22 మిలియన్ డాలర్లతో (రూ.141 కోట్లు) కోహ్లి 89వ స్థానాన్ని దక్కించుకున్నాడు. ఫోర్బ్స్ పత్రిక జూన్ 8న ప్రకటించిన ఈ జాబితాలో భారత్ నుంచి కోహ్లి ఒక్కడే చోటు దక్కించుకున్నాడు. కోహ్లి ఆర్జనలో 3 మిలియన్ డాలర్లు మ్యాచ్ ఫీజుల ద్వారా అందుకోగా, 19 మిలియన్ డాలర్లు ఎండార్స్‌మెంట్‌ల ద్వారా పొందాడు. 
ఈ జాబితాలో క్రిస్టియానో రొనాల్డో 93 మిలియన్ డాలర్లతో (రూ.636 కోట్లు) అగ్రస్థానంలో ఉండగా జాబితాలో చోటుదక్కించుకున్న ఏకైక మహిళా క్రీడాకారిణి సెరెనా విలియమ్స్. 2016 జూన్ నుంచి 2017 జూన్ మధ్య ఆదాయాన్ని పరిగణలోకి తీసుకొని ఫోర్బ్స్ ఈ జాబితాను రూపొందించింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి :
 ఫోర్బ్స్ - 100 క్రీడాకారుల జాబితా 
ఎప్పుడు : జూన్ 8
ఎవరు : 89వ స్థానంలో కోహ్లీ

ఎన్‌ఎస్‌ఈ చీఫ్‌గా లిమాయే నియామకానికి ఆమోదం
ఎన్‌ఎస్‌ఈ( నేషనల్ స్టాక్ ఎక్సేంజ్) కొత్త చీఫ్‌గా విక్రమ్ లిమాయే నియామకానికి మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ జూన్ 9న


చరిత్రలో ఈ నెల జూన్ (16 - 22) 2017
అంతర్జాతీయంఎండ్ ఆఫ్ చైల్డ్‌హుడ్ రిపోర్ట్ - 2017 వయసుకు తగ్గ ఎదుగుదల లేని చిన్నారుల సంఖ్యలో భారత్ ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ప్రస్తుతం దేశంలో ఇలాంటి చిన్నారుల సంఖ్య 4.82 కోట్లు. అలాగే దేశంలో 3.1 కోట్ల మంది చిన్నారులు బాల కార్మికులుగా మారుతున్నారు. ఇది కూడా ప్రపంచంలోనే అతి ఎక్కువ సంఖ్య. సేవ్ ద చిల్డ్రన్ అనే అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ ఎండ్ ఆఫ్ చైల్డ్‌హుడ్ రిపోర్ట్ - 2017 పేరుతో జూన్ 1న విడుదల చేసిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 
ఐదేళ్లలోపు చిన్నారుల మరణాలు, పిల్లల ఎదుగుదలపై ప్రభావం చూపే పోషకాహార లోపం, విద్య అందకపోవడం, బాల కార్మికులు, బాల్య వివాహాలు, నెలలు నిండకుండానే జననాలు, శిశు భ్రూణహత్యలు మొదలైన వాటిని పరిగణనలోకి తీసుకుని ఈ సర్వే నిర్వహించారు. ఇందులో ప్రపంచవ్యాప్తంగా 70 కోట్ల మంది చిన్నారులు వివిధ కారణాల వల్ల ముందుగానే తమ బాల్యాన్ని కోల్పోతున్నారు. సరైన ఎదుగుదల లేని పిల్లలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవడంతో పాటు విద్య, ఉద్యోగ అవకాశాలను కోల్పోయి త్వరగా అనారోగ్యం, వ్యాధుల బారిన పడి మరణిస్తున్నారని ఈ నివేదిక స్పష్టం చేసింది. 
దేశంలో ప్రాథమిక, మాధ్యమిక స్థాయి చిన్నారులు 18.6%, అప్పర్ సెకండరీ వయసు కలిగిన 4.7 కోట్ల మంది పాఠశాలకు వెళ్లడం లేదు. 4-14 ఏళ్ల వయసు పిల్లల్లో 11.8 శాతం మంది (3.1 కోట్లు) బాల కార్మికులుగా మారి చదువు, విశ్రాంతి, ఆటలు, వినోదాన్ని కోల్పోతున్నారు.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఎండ్ ఆఫ్ చైల్డ్‌హుడ్ రిపోర్ట్ - 2017 
ఎప్పుడు : జూన్ 1
ఎవరు : సేవ్ ది చిల్డ్రన్ సంస్థ (భారత్)
ఎక్కడ : ప్రపంచవ్యాప్తంగా 

యూఎన్‌సీసీటీ ఏర్పాటుకు ఐరాస ఆమోదం సభ్య దేశాల్లో తీవ్రవాద అణచివేత చర్యలకు చేయూత అందించేందుకు ఉద్దేశించిన యూఎన్ తీవ్రవాద వ్యతిరేక కేంద్రం (UNCCT) ఏర్పాటుకు ఐరాస సాధారణ అసెంబ్లీ జూన్ 16న ఆమోదం తెలిపింది. ఈ సంస్థ ఏర్పాటుతో ఇప్పటి వరకు యూఎన్ డీపార్ట్‌మెంట్ ఆఫ్ పొలిటకల్ అఫైర్స్(డీపీఏ) ఆధ్వర్యంలో నడుస్తోన్న ఈ కార్యకలాపాలు యూఎన్‌సీసీటికి బదలీ అవుతాయి.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : యూఎన్‌సీసీటీ ఏర్పాటుకు ఆమోదం
ఎప్పుడు : జూన్ 16
ఎవరు : ఐరాస 
ఎందుకు : సభ్య దేశాల్లో తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపాల సహాయానికి 

ఏఐఐబీలో అర్జెంటీనా, మడగాస్కర్, టోంగాకు చోటు చైనా నేతృత్వంలోని ఆసియాన్ మౌలిక పెట్టుబడుల బ్యాంకు (ఏఐఐబీ)లో అర్జెంటీనా, మడగాస్కర్, టోంగా దేశాలకు సభ్యత్వం లభించింది. దక్షిణ కొరియాలోని జిజులో జరిగిన ఏఐఐబీ 2వ వార్షిక సమావేశంలో ఈ మూడు దేశాలకు సభ్యత్వం కల్పిస్తూ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ తీర్మానం చేశారు. 
ఏఐఐబీ మొదటి వార్షిక సమావేశం 2016లో చైనాలోని బీజింగ్‌లో జరిగింది. 2016 జనవరి 11న భారత్‌కు ఏఐఐబీలో సభ్యత్వం లభించింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఏఐఐబీలో కొత్తగా 3 దేశాలకు సభ్యత్వం 
ఎప్పుడు : జూన్ 16
ఎవరు : అర్జెంటీనా, మడగాస్కర్, టోంగా

యూన్ ఆర్థిక, సామాజిక కౌన్సిల్‌కు మళ్లీ ఎన్నికైన భారత్ ఐరాస ఆధ్వర్యంలోని ఆర్థిక, సామాజిక కౌన్సిల్ (ECOSOC)కు భారత్ మళ్లీ ఎన్నికైంది. ఈ మేరకు జూన్ 15న జరిగిన ఓటింగ్‌లో భారత్‌కు 183 ఓట్లు వచ్చాయి. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో జపాన్ తర్వాత భారత్‌కు అత్యధిక ఓట్లు లభించాయి. ఈ ఎన్నికలో భారత్‌తో కలిపి మొత్తం 18 దేశాలు ఎన్నికయ్యాయి. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఈసీఓఎస్‌ఓసీకు ఎన్నికైన 18 దేశాలు
ఎప్పుడు : జూన్ 15
ఎవరు : మరోసారి ఎన్నికైన భారత్ 
ఎక్కడ : ఐరాస అనుబంధ సంస్థ 

క్యూబాతో మైత్రి ఒప్పందాన్ని రద్దు చేసిన అమెరికా బరాక్ ఒబామా హయాంలో క్యూబాతో కుదిరిన మైత్రి ఒప్పందాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జూన్ 16న రద్దు చేశారు. ఒబామా క్యూబాతో చేసుకున్న ఒప్పందం ఏకపక్షంగా ఉందని, రౌల్ క్యాో్ట్ర సైనిక ఆధిపత్యానికి బలం చేకూర్చడానికి అమెరికా డాలర్లను సాయంగా అందించము అని ఈ సందర్భంగా ట్రంప్ ప్రకటించారు. ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు నూతన విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. 
కాగా ట్రంప్ నిర్ణయాన్ని క్యూబా విమర్శించింది. ఈ విషయంలో అమెరికాతో సంప్రదింపులు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొంది. క్యూబా అధ్యక్షుడు రౌల్ క్యాో్టత్రో కలిసి ఇరు దేశాల సంబంధాలను పునరుద్ధరిస్తున్నట్లు ఒబామా 2014 డిసెంబర్‌లో ప్రకటించారు.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : క్యూబాతో మైత్రి ఒప్పందం రద్దు 
ఎప్పుడు : జూన్ 16
ఎవరు : అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 
ఎందుకు : ఒప్పందం ఏకపక్షంగా ఉందంటూ 

ఐరాసపై యోగా వెలుగులుజూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయ భవంతిని ‘యోగా’ వెలుగులతో నింపేశారు. ఓ మహిళ యోగా చేస్తున్నట్లుగా, ‘యోగా’ ఆంగ్ల అక్షరాలు కనిపించేలా ఐరాస భవంతిపై లైట్లు వేశారు. ఈ కార్యక్రమాన్ని బాలీవుడ్ ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ జూన్ 19న ప్రారంభించారు. యోగా దినోత్సవం కోసం ఇలా ప్రత్యేకంగా లైట్లు ఏర్పాటు చేయడం వరసగా ఇది రెండోసారి. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఐరాసపై యోగా వెలుగులు 
ఎప్పుడు : జూన్ 19
ఎవరు : ప్రారంభించిన అనుపమ్ ఖేర్ 
ఎక్కడ : న్యూయార్క్, అమెరికా 
ఎందుకు : అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని 

టాప్ - 500 కంప్యూటర్లలో చైనా ఫస్ట్ అమెరికా, జర్మనీ సంయుక్తంగా జూన్ 19న విడుదల చేసిన టాప్ 500 కంప్యూటర్లలో మొదటి స్థానాన్ని చైనా కంప్యూటర్లు దక్కించుకున్నాయి. సన్‌వే కంపెనీకి చెందిన థాయులైట్, తియాన్హే-2 కంప్యూటర్లు మొదటి, రెండు స్థానాలను కైవసం చేసుకున్నాయి. స్విస్ నేషనల్ సూపర్ కంప్యూటింగ్ సెంటర్‌కు చెందిన పిజ్ డైంట్ కంప్యూటర్ మూడోస్థానంలో, అమెరికాకు చెందిన టైటాన్ నాల్గోస్థానంలో నిలిచాయి. కాగా 24 సంవత్సరాల చరిత్రలో అమెరికా మొదటి మూడుస్థానాల్లో నిలవకపోవడం ఇది రెండోసారి. 1996లో ఒకసారి జపాన్‌కు చెందిన కంప్యూటర్లు మొదటి మూడుస్థానాల్లో నిలిచాయి. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : టాప్ - 500 కంప్యూటర్స్ 
ఎప్పుడు : జూన్ 19
ఎవరు : మొదటి స్థానంలో థాయులైట్, తియాన్హే-2 కంప్యూటర్లు 
ఎక్కడ : చైనా 

జాతీయంకాండ్లాలో తొలి స్మార్ట్ పోర్ట్ సిటీ  దేశంలోని తొలి స్మార్ట్ ఇండస్ట్రియల్ పోర్ట్ సిటీ (ఎస్‌ఐపీసీ) గుజరాత్ రాష్ట్రం గాంధీధామ్ సమీపంలోని కాండ్లాలో ఏర్పాటు కానుంది. కాండ్లా పోర్ట్ ట్రస్ట్ (కేపీటీ) ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న ఈ పారిశ్రామిక కారిడార్ రూ. 10 వేల కోట్లపైగా పెట్టుబడులను ఆకర్షించనుంది. ఇందులో వంట నూనెలు, ఫర్నిచర్, ఉప్పు ఆధారిత తదితర పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి.
1,425 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న ఎస్‌ఐపీసీలో 580 ఎకరాల్లో స్మార్ట్ అర్బన్ టౌన్‌షిప్, 845 ఎకరాల్లో ఆధునిక పారిశ్రామిక కారిడార్‌ను ఏర్పాటు చేస్తారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : భారత తొలి స్మార్ట్ పోర్ట్‌సిటీ 
ఎప్పుడు : జూన్ 15 
ఎవరు : కాండ్లా పోర్ట్‌ట్రస్ట్
ఎక్కడ : గుజరాత్ రాష్ట్రం గాంధీధామ్ సమీపంలోని కాండ్లాలో 

యూపీలో సున్నీ, షియా వక్ఫ్ బోర్డులు రద్దుఉత్తరప్రదేశ్‌లోని సున్నీ, షియా వక్ఫ్ బోర్డులను రద్దు చేస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జూన్ 15న నిర్ణయం తీసుకున్నారు. వక్ఫ్ బోర్డుల ఆస్తుల విషయంలో తీవ్ర అవినీతి ఆరోపణలు రావడంతోనే ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూపీ వక్ఫ్ మంత్రి మొహసీన్ రజా తెలిపారు. బోర్డుల రద్దుకు ముందు అన్ని న్యాయపరమైన అంశాలను పరిశీలించినట్లు వెల్లడించారు. వక్ఫ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూసీఐ) జరిపిన విచారణలో కూడా ఈ రెండు బోర్డుల్లో తీవ్ర అవకతవకలు చోటుచేసుకున్నట్లు తేలిందని రజా పేర్కొన్నారు. ఈ అవినీతిలో ఎస్పీ సీనియర్ నేత, యూపీ మాజీ మంత్రి అజాం ఖాన్‌తో పాటు షియా బోర్డు చైర్మన్ వసీమ్ రజ్వీల పాత్ర ఉన్నట్లు డబ్ల్యూసీఐ నిర్ధారించిందని వెల్లడించారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : సున్నీ, షియా వక్ఫ్ బోర్డులు రద్దు
ఎప్పుడు : జూన్ 15
ఎవరు : యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 
ఎందుకు : బోర్డులపై అవినీతి ఆరోపణలతో 

గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో 60వ స్థానంలో భారత్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ (జీఐఐ)-2017లో భారత్ 6 స్థానాలు మెరుగుపరచుకుని 60వ స్థానంలో నిలిచింది. దీంతో మధ్య, దక్షిణాసియా ప్రాంతంలో అత్యున్నత ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంగా అవతరించడంతో ఆసియా ప్రాంతపు వర్ధమాన ఇన్నోవేషన్ సెంటర్‌గా గుర్తింపు దక్కించుకుంది. 
కార్నెల్ యూనివర్సిటీ, ఇన్‌సీడ్, వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ సంయుక్తంగా 130 దేశాలతో ఈ జాబితాను రూపొందించాయి. ఇందులో స్విట్జర్లాండ్, స్వీడన్, నెదర్లాండ్‌‌స, అమెరికా, యూకే దేశాలు వరుసగా అగ్ర స్థానాల్లో ఉన్నాయి. చైనా 22వ స్థానంలో ఉండగా శ్రీలంక 90, నేపాల్ 109, పాకిస్తాన్ 113, బంగ్లాదేశ్ 114వ స్థానాల్లో ఉన్నాయి. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ - 2017
ఎప్పుడు : జూన్ 15
ఎవరు : కార్నెల్ యూనివర్సిటీ, ఇన్‌సీడ్, వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ 
ఎక్కడ : 60వ స్థానంలో భారత్ 

పోలీసుల కాల్పుల్లో వారానికి ఇద్దరు మృతి గడిచిన ఏడేళ్లలో పోలీసు కాల్పుల్లో సగటున వారానికి ఇద్దరు పౌరులు మరణించారని నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో వెల్లడించింది. 2009 నుంచి 2015 మధ్య దేశంలో 4,747 పోలీసుల కాల్పుల ఘనటలు నమోదు కాగా ఈ కాల్పుల్లో 796 మంది చనిపోయారు. ఇందులో ఎక్కువ భాగం జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఘటనలే. రాష్ట్రాలవారీగా చూస్తే 2015లో రాజస్థాన్‌లో అత్యధికంగా 35 పోలీసు కాల్పుల ఘటనలు నమోదు కాగా మహారాష్ట్రలో 33, ఉత్తరప్రదేశ్‌లో 29 రికార్డయ్యాయి. అల్లర్లు, దోపిడీ వ్యతిరేక కార్యకలాపాలు, ఉగ్రవాదులు, తీవ్రవాదుల వ్యతిరేక చర్యలు.. మొదలైన సమయాల్లో పోలీసు కాల్పులను ఈ సందర్భంగా పరిగణనలోకి తీసుకున్నారు. అలాగే 2009 నుంచి 2015 మధ్య జరిగిన కాల్పుల్లో 471 మంది పోలీసు సిబ్బంది కూడా మరణించారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : పోలీస్ కాల్పుల్లో వారానికి ఇద్దరు మృతి 
ఎప్పుడు : 2009 - 2015 మధ్య 
ఎవరు : ఎన్‌సీఆర్‌బీ
ఎక్కడ : దేశవ్యాప్తంగా 

జవాన్ల శాశ్వత వైకల్యానికి రూ.20 లక్షలువిధి నిర్వహణలో 100 శాతం అంగవైకల్యం పొందిన జవాన్లకు ఇస్తున్న నష్టపరిహారాన్ని రూ.9 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచుతూ కేంద్ర హోంశాఖ జూన్ 17న నిర్ణయం తీసుకుంది. 2016 జనవరి 1 తర్వాత వైకల్యం పొందినవారికే ఈ పెంపు వర్తిస్తుందని వెల్లడించింది. వీరితో పాటు విధి నిర్వహణలో గాయపడ్డ జవాన్లకు వైకల్య స్థాయిని బట్టి నష్టపరిహారాన్ని అందిస్తామని పేర్కొంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : విధి నిర్వహణలో వైకల్యం పొందిన జవాన్లకు పరిహారం 20 లక్షలకు పెంపు 
ఎప్పుడు : జూన్ 18
ఎవరు : కేంద్ర హోంశాఖ

ముంబై పేలుళ్ల కేసులో అబూసలేంను దోషిగా తేల్చిన టాడాకోర్టు1993 నాటి ముంబై పేలుళ్ల కేసులో సూత్రధారి ముస్తఫా దోసా, గ్యాంగ్‌స్టర్ అబూ సలేం సహా ఆరుగురిని టాడా ప్రత్యేక కోర్టు జూన్ 16న దోషులుగా నిర్ధారించింది. అబ్దుల్ ఖయ్యూం అనే మరో నిందితుడిని సరైన ఆధారాల్లేనందున నిర్దోషిగా ప్రకటించింది. 
అబూసలేం, ముస్తఫా , కరీముల్లా ఖాన్, ఫిరోజ్, అబ్దుల్ రషీద్ ఖాన్, తాహిర్ మర్చంట్‌లను నేరపూరిత కుట్ర, భారత శిక్షాస్మృతి, టాడా కింద హత్యానేరం, విధ్వంసక సామాగ్రి, ఆయుధాలు కలిగి ఉండటం, ప్రజల ఆస్తుల విధ్వంసం వంటి కేసుల్లో దోషులుగా తేల్చగా, సిద్దిఖీని అబూసలేం, ఇతరులకు ఆయుధాలు సరఫరా చేయటంలో సహకరించిన నేరంలో టాడా చట్టాల కింద దోషిగా తేల్చారు. 
24 ఏళ్ల క్రితం ముంబైలో జరిగిన బాంబు పేలుళ్లలో 257 మంది చనిపోయారు. ఈ ఘటనకు సంబంధించి రెండో విడత విచారణలో భాగంగా టాడా కోర్టు తాజా తీర్పునిచ్చింది. 2007 నాటి తొలి విడత విచారణలో కోర్టు 100 మందిని దోషులుగా, 23 మందిని నిర్దోషులుగా ప్రకటించింది. బాబ్రీ మసీదు విధ్వంసానికి ప్రతీకారంగా మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం నేతృత్వంలో టైగర్ మెమన్, యాకూబ్ మెమన్, మహ్మద్ దోసా, ముస్తఫా దోసాతో సహా పలువురు ఈ దాడులకు కుట్ర పన్నారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ముంబై పేలుళ్ల కేసులో దోషుల నిర్ధారణ 
ఎప్పుడు : జూన్ 16
ఎవరు : టాడా కోర్టు 
ఎందుకు : 1993 ముంబయిలో బాంబు పేలుళ్లకు పాల్పడినందుకు 

బ్యాంకు ఖాతాకు ఆధార్ తప్పనిసరికొత్త బ్యాంకు ఖాతాకు ఆధార్‌ను తప్పనిసరి చేస్తూ కేంద్రప్రభుత్వం నూతన మార్గదర్శకాలు జారీచేసింది. ఈ మేరకు కేంద్ర రెవిన్యూ శాఖ జూన్ 16న నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ప్రకారం బ్యాంకులో కొత్త ఖాతా తెరవాలంటే ఇకపై ఖచ్చితంగా ఆధార్ నంబర్‌ను తెలపాలి. అంతేకాకుండా రూ.50,000 అంతకు మించిన మొత్తాల లావాదేవీలకు సైతం ఆధార్ నంబర్‌ను తప్పనిసరిగా ఇవ్వాలి. 
ఇప్పటికే బ్యాంకు ఖాతా ఉన్న వినియోగదారులు ఈ ఏడాది డిసెంబర్ 31లోగా తమ ఆధార్ నంబర్‌ను తెలపాల్సి ఉంటుంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : బ్యాంకు ఖాతాకు ఆధార్ తప్పనిసరి 
ఎప్పుడు : జూన్ 16
ఎవరు : కేంద్ర ప్రభుత్వం 
ఎందుకు : బ్యాంకు లావాదేవీలపై పూర్తి సమాచారం కోసం 

నల్లధనం వెల్లడికి స్విట్జర్లాండ్ ఆమోదంనల్లధనం వివరాల్ని భారత్‌తో పంచుకునేలా ఆటోమెటిక్ సమాచార మార్పిడి ఒప్పందాన్ని (Automatic Exchange Financial Account) జూన్ 16న స్విట్జర్లాండ్ ఖరారు చేసింది. ఈ ఒప్పందంతో ఎటువంటి వివరాలనైనా భారత్ సులువుగా పొందనుంది. 2018 నుంచి ఈ ఒప్పందం అమల్లోకి రానుండగా తొలి దశ వివరాల్ని 2019లో భారత్‌తో పంచుకునే అవకాశం ఉంది. దీంతో.. స్విస్ ఖాతాల్లో నల్లధనం దాచుకున్న అక్రమార్కుల వివరాలు బహిర్గతం కానున్నాయి. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఏఈఓఐ ఒప్పందానికి ఆమోదం 
ఎప్పుడు : జూన్ 16
ఎవరు : స్విట్జర్లాండ్ 
ఎందుకు : నల్లధనం వివరాలను భారత్‌తో పంచుకునేందుకు 

పంజాబ్‌లో రైతు రుణమాఫీఎన్నికల హామీ మేరకు పంజాబ్ రైతులకు రుణమాఫీ చేస్తున్నట్లు ఆ రాష్ట్ర సీఎం అమరీందర్ సింగ్ ప్రకటించారు. రుణమాఫీలో భాగంగా సన్న, చిన్నకారు రైతులకు(5 ఎకరాల్లోపు భూమి ఉన్న రైతులు) రూ. 2 లక్షల వరకూ రుణమాఫీ చేస్తారు. ఆత్మహత్య చేసుకున్న రైతులు తీసుకున్న రుణాల్ని కూడా ప్రభుత్వమే చెల్లించడంతో పాటు.. వారి కుటుంబాలకు నష్టపరిహారాన్ని రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచారు. ఈ మేరకు జూన్ 19న అసెంబ్లీలో అమరీందర్ ప్రకటన చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో 10.25 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుందని, ఇందులో 5 ఎకరాల్లోపు వ్యవసాయ భూములున్న రైతులు 8.75 లక్షలు ఉన్నారని చెప్పారు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర ప్రకటించిన రుణమాఫీ కంటే రెండింతలు మాఫీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రముఖ ఆర్థిక వేత్త టీ హక్యూ నేతృత్వంలోని నిపుణుల కమిటీ ఇచ్చిన మధ్యంతర నివేదిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : పంజాబ్‌లో రైతు రుణమాఫీ 
ఎప్పుడు : జూన్ 19
ఎవరు : సీఎం అమిరీందర్ సింగ్ 
ఎందుకు : ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 

జూలై 1 నుంచి డిపార్చర్ కార్డ్స్ విధానం రద్దువిదేశాలకు వెళ్లే భారతీయులకు వచ్చే నెల నుంచి విమానాశ్రయాల వద్ద ప్రయాణానికి ముందు ‘డిపార్చర్ కార్డ్స్’ పూర్తి చేయాల్సిన అవసరం లేదని కేంద్ర హోం శాఖ పేర్కొంది. అయితే రైలు, ఓడరేవులు, భూమార్గం ద్వారా విదేశాలకు వెళ్లేవారు మాత్రం ఈ ప్రయాణ పత్రాల్ని పూర్తి చేయాలని ఒక ఉత్తర్వులో వెల్లడించింది. జూలై 1, 2017 నుంచి ఈ విధానం అమల్లోకి వస్తుందని తెలిపింది. విదేశాలకు వెళ్లే ప్రయాణికులకు ఎలాంటి అవాంతరాలు కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అందులో పేర్కొంది. ప్రస్తుతం ప్రయాణానికి ముందు పేరు, జన్మదినం, పాస్‌పోర్ట్ నెంబరు, చిరునామా, విమానం నెంబర్, ప్రయాణ తేదీ తదితర వివరాలు డిపార్చర్ కార్డ్‌లో పూరించాలి. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : డిపార్చర్ విధానం రద్దు 
ఎప్పుడు : జూలై 1 నుంచి 
ఎవరు : భారత ప్రభుత్వం 
ఎక్కడ : విమానాశ్రయాల్లో 
ఎందుకు : ప్రయాణ అవాంతరాలు లేకుండా చేసేందుకు 

రాష్ట్రీయంఏపీలో విద్యకు నీతిఆయోగ్ ‘సాత్’ దేశవ్యాప్తంగా విద్య, వైద్య రంగాల్లో సంస్కరణలు ప్రవేశపెట్టి నాణ్యమైన మానవ వనరులు అభివృద్ధి చేసేందుకు నీతి ఆయోగ్ ‘సాత్’ (సస్టెయినబుల్ యాక్షన్ ఫర్ ట్రాన్‌‌సఫార్మింగ్ హ్యూమన్ కేపిటల్- ఎస్‌ఏటీహెచ్) పేరుతో కార్యాచరణ చేపట్టింది. ఈ కార్యకమ్రాన్ని అంతర్జాతీయ బిడ్డింగ్ ద్వారా ఎంపిక చేసిన మెకన్సీ అండ్ కంపెనీ, ఐపీఈ గ్లోబల్ కన్సార్టియంలతో కలసి నీతి ఆయోగ్ అమలు చేస్తుంది. రాష్ట్రాలకు సాంకేతికపరమైన మద్దతు ఇచ్చేందుకు కార్యక్రమం అమలు దశ నుంచే అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తారు. ఇందుకుగానూ మార్గదర్శక రాష్ట్రాలుగా తయారు చేసేందుకు వివిధ రాష్ట్రాల ప్రజంటేషన్లను నీతి ఆయోగ్ పరిశీలించింది. ఇందులో విద్యా రంగంలో మార్గదర్శక రాష్ట్రాలుగా తీర్చిదిద్దేందుకు ఆంధ్రప్రదేశ్‌తోపాటు మధ్యప్రదేశ్, ఒడిషా, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాలను ఎంపిక చేసింది. ఈ ఐదు రాష్ట్రాల్లో మూడింటిని ఎంపిక చేసి కార్యాచరణ అమలు చేస్తారు. అలాగే వైద్యరంగంలో యూపీ, బిహార్, అస్సాం, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాలను షార్ట్‌లిస్ట్ చేసింది. జూలైలో తుది ఎంపిక జరిగి రాష్ట్రాలతో ఒప్పందాలు కుదుర్చుకొని ‘సాత్’ అమలు చేపడతామని నీతి ఆయోగ్ వెల్లడించింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : సాత్ కార్యాచరణ 
ఎప్పుడు : జూన్ 15
ఎవరు : నీతి ఆయోగ్ 
ఎందుకు : విద్యా, వైద్య రంగంలో సంస్కరణలో ప్రవేశపెట్టేందుకు 

సింగపూర్ కన్సార్టియంకు అమరావతి స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో స్టార్టప్ ఏరియా ప్రాజెక్టును సింగపూర్ కన్సార్షియంకు అప్పగించే ఒప్పందానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జూన్ 15న సమావేశమైన కేబినెట్ పలు నిర్ణయాలు తీసుకుంది. 
కేబినెట్ నిర్ణయాలు 
  • ఏపీ రైల్వే మౌలిక వసతుల కార్పొరేషన్ లిమిటెడ్ స్థాపన. రైల్వే ప్రాజెక్టులు త్వరిత గతిన పనిచేసేందుకు ఈ సంస్థ పనిచేస్తుంది.
  • ఏపీ ఫైబర్ నెట్ లిమిటెడ్‌కు రూ.969 కోట్లతో క్లౌడ్ ఆధారిత సీసీ టీవీ విధానం అమలుకు నిర్ణయం.
  • ఆంధ్రప్రదేశ్ ఇనిస్టిట్యూట్ అండ్ ఎకనామిక్ డెవలప్‌మెంట్, అమరావతి స్టార్టప్ అభివృద్ధికి సింగపూర్‌తో చేసుకున్న ఒప్పందానికి ఆమోదం.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : సింగపూర్ కంపెనీలకు రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు 
ఎప్పుడు : జూన్ 15
ఎవరు : ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం 
ఎక్కడ : అమరావతిలో 

‘అక్షయపాత్ర’కు మధ్యాహ్న భోజన కాంట్రాక్టుకుప్పం నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ స్కూళ్లలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేసే బాధ్యతను ‘అక్షయపాత్ర’ ఫౌండేషన్‌కు అప్పగిస్తూ విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ జూన్ 15న ఉత్తర్వులు జారీచేశారు. ఇందుకోసం రూ. 7.99 కోట్లను ఆ సంస్థకు అడ్వాన్సుగా విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో ఫౌండేషన్ కేంద్రీకృత వంటశాల ఏర్పాటు చేసి నియోజకవర్గంలోని 412 స్కూళ్లకు మధ్యాహ్న భోజనాన్ని అందించనుంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : మధ్యహ్నా భోజన నిర్వహణ అక్షయపాత్ర చేతికి 
ఎప్పుడు : జూన్ 15
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎక్కడ : కుప్పం నియోజకవర్గంలో 

విజయరాయిలో మొక్కజొన్న పరిశోధనా కేంద్రంపశ్చిమ గోదావరి జిల్లా విజయరాయిలో మొక్కజొన్న పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయాలని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పాలక మండలి జూన్ 15న నిర్ణయించింది. హైదరాబాద్‌లోని రాజేంద్ర నగర్‌లో ఏర్పాటయిన మొక్కజొన్న పరిశోధన కేంద్రం తెలంగాణకు వెళ్లిపోయింది. దీంతో ఏపీలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి విజయరాయిని ఎంపిక చేశారు. కేంద్రం ఏర్పాటుతో పాటు అవసరమైన శాస్త్రవేత్తలను నియమించాలని సమావేశంలో తీర్మానించారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఆంధ్రప్రదేశ్‌లో మొక్కజొన్న పరిశోధన కేంద్రం 
ఎప్పుడు : జూన్ 15 
ఎవరు : ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 
ఎక్కడ : విజయరాయి, పశ్చిమ గోదావరి జిల్లా

తెలంగాణ, ఏపీలకు ఆకాశవాణి అవార్డులుఆకాశవాణి 2014-15 వార్షిక అవార్డుల్లో తెలంగాణ, ఏపీలోని కేంద్రాలకు వివిధ విభాగాల్లో అవార్డు దక్కాయి. గ్రామీణ ప్రాంత ప్రజల జీవితాల్లో మూగజీవాలు ఏ విధంగా మమేకమై ఉంటాయన్న దానిపై నిర్మాత మురళీ కృష్ణ, రచయిత దుర్గయ్య, సహ రచయిత శివప్రసాద్‌లు చేసిన ‘గంగి రెద్దు’ కార్యక్రమానికి రేడియే ప్లే విభాగంలో (హైదరాబాద్ కేంద్రం) మొదటి బహుమతి దక్కింది. ‘విశ్వగురు’కార్యక్రమానికి ఇన్నోవేటివ్ అవార్డు దక్కింది. మహిళా సాధికారతపై నిర్మాత కె.కామేశ్వర్‌రావు, రచయిత వి.ప్రతిమ తీసిన ‘గంగ జాతర’కు ఉత్తమ మహిళా కార్యక్రమం విభాగంలో (విశాఖపట్నం కేంద్రం) అవార్డు దక్కింది. పారిశుధ్యంపై విజయవాడ కేంద్రంలో ప్రసారమైన ‘బాపు బాటలో’కార్యక్రమానికి మరో అవార్డు దక్కింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఏపీ తెలంగాణకు ఆకాశవాణి అవార్డులు 
ఎప్పుడు : జూన్ 16
ఎవరు : ఆకాశవాణి

తెలంగాణలో మెడికల్ డి వెజైస్ పార్కు ప్రారంభం తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం సుల్తాన్‌పూర్ గ్రామంలో 250 ఎకరాల్లో ఏర్పాటు చేసిన మెడికల్ డివెజైస్ పార్కును మంత్రులు హరీశ్‌రావు, కె.తారకరామారావు జూన్ 17న ప్రారంభించారు. రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్‌ఐఐసీ) ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ పార్కు దేశంలోనే అతి పెద్దది. దీని ద్వారా 4 వేల మందికి ప్రత్యక్షంగా.. 8 వేల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రస్తుతం మనదేశం 75 శాతం వైద్య పరికరాలను దిగుమతి చేసుకుంటోందని ఈ పార్కుతో రానున్న రోజుల్లో పూర్తిస్థాయి వైద్య పరికరాలు ఇక్కడే తయారవుతాయని, చికిత్స ఖర్చులు చాలావరకు తగ్గుతాయన్నారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : మెడికల్ డివెజైస్ పార్కు ప్రారంభం 
ఎప్పుడు : జూన్ 17
ఎవరు : మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు 
ఎక్కడ : సుల్తాన్‌పూర్, సిద్ధిపేట్ జిల్లా, తెలంగాణ 
ఎందుకు : వైద్య పరికరాల తయారీ కోసం 

తెలుగు రాష్ట్రాల్లో పోస్టాఫీస్ పాస్‌పోర్టు సేవా కేంద్రాలుతెలంగాణలో 5, ఆంధ్రప్రదేశ్‌లో 7 పోస్టాఫీస్ పాస్‌పోర్టు సేవా కేంద్రాలను ప్రారంభించాలని విదేశాంగ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణలో ఆదిలాబాద్, మెదక్, ఖమ్మం, సిద్దిపేట, నల్లగొండ, ఆంధ్రప్రదేశ్‌లో చిత్తూరు, గుంటూరు, కృష్ణా, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళంలలో ఈ కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. 
దేశంలోని హెడ్ పోస్టాఫీసుల్లో పాస్‌పోర్టు సంబంధిత సేవలను అందించడానికి అనువుగా డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్ భాగస్వామ్యంతో 149 కొత్త కేంద్రాలను ప్రారంభించాలని నిర్ణయించింది. దీంతో దేశవ్యాప్తంగా ఆ సంఖ్య 235కు చేరుతుంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : తెలంగాణ, ఏపీలో పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు
ఎప్పుడు : జూన్ 17
ఎవరు : కేంద్ర విదేశాంగ శాఖ
ఎక్కడ : తెలంగాణలో 5, ఏపీలో 7 

జోనల్ వ్యవస్థ రద్దుకు టీఎస్ కేబినెట్ నిర్ణయంతెలంగాణలో జోనల్ విధానాన్ని రద్దు చేయాలని నిర్ణయించిన రాష్ట్ర మంత్రివర్గం.. దీనిపై రాష్ట్రపతి అనుమతి కోరనుంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జూన్ 17న సమావేశమైన కేబినెట్ ఈ మేరకు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 
కేబినెట్ నిర్ణయాలు 
భూముల అక్రమ రిజిస్ట్రేషన్ల కుంభకోణం నేపథ్యంలో రిజిస్ట్రార్ల విచక్షణాధికారాలు రద్దు చేస్తూ తీసుకువస్తున్న ఆర్డినెన్‌‌సకు ఆమోదం. 
కల్తీకి పాల్పడితే పీడీ యాక్ట్
ప్రస్తుతం అమల్లో ఉన్న పీడీ యాక్టులోకి మరో పది అంశాలను చేరుస్తూ ఆర్డినెన్‌‌స జారీకి అంగీకారం తెలిపింది. ఆయా మోసాలకు పాల్పడేవారిని కూడా పీడీ యాక్టు కింద అదుపులోకి తీసుకోవచ్చని స్పష్టం చేసింది. ఆ పది అంశాలు..

  • కల్తీ విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల విక్రేతలు
  • పాలు, నూనె, పప్పు, కారం తదితర ఆహార కల్తీకి పాల్పడేవారు
  • నకిలీ డాక్యుమెంట్లు, సర్టిఫికెట్లు తయారుచేసేవారు
  • రేషన్ బియ్యం అక్రమార్కులు
  • అడవుల నరికివేత
  • దురాక్రమణదారులు
  • స్మగ్లర్లు, ఆయుధాలు, మందుగుండు సరఫరా చేసేవారు
  • లైంగిక దాడులకు పాల్పడేవారు
  • సైబర్ నేరాలు, వైట్ కాలర్ నేరాలు
  • గేమింగ్ అండ్ గ్యాంబ్లింగ్‌కు పాల్పడే వారు

ఆన్‌లైన్ పేకాటపై నిషేధంప్రభుత్వం పేకాట క్లబ్బులను మూసివేసినా ఆన్‌లైన్‌లో గేమింగ్, గ్యాంబ్లింగ్ జరుగుతున్న నేపథ్యంలో... రాష్ట్రంలో ఆన్‌లైన్‌లో రమ్మీ, పేకాట ఆడటంపై నిషేధం. ఈ మేరకు గ్యాంబ్లింగ్, గేమింగ్ చట్టానికి సవరణ చేస్తూ ఆర్డినెన్‌‌స తేనుంది. 
క్విక్ రివ్యూ: ఏమిటి : తెలంగాణలో జోనల్ వ్యవస్థ రద్దుకు ఆమోదం 
ఎప్పుడు : జూన్ 17
ఎవరు : తెలంగాణ కేబినెట్ 
ఎందుకు : జిల్లా, రాష్ట్ర స్థాయి కేడర్ల ఏర్పాటుకోసం 

ఏపీలో డ్వాక్రా మహిళ ఆదాయం నెలకు రూ.4 వేలేరాష్ట్రంలో డ్వాక్రా మహిళలు మొత్తం 89 లక్షల మంది ఉంటే సగం మంది డ్వాక్రా మహిళల కుటుంబాల్లో కుటుంబ సభ్యులందరీ, అన్ని రకాల ఆదాయం కలిపినా కూడా రూ.నాలుగు వేలకు మించడం లేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పల్స్ సర్వేలో వెల్లడైంది. ఈ సర్వే ప్రకారం రాష్ట్రంలో 8,97,184 డ్వాక్రా సంఘాల్లో మొత్తం 89,12,339 మంది మహిళలు సభ్యులుగా ఉంటే అందులో కేవలం ఐదు లక్షల మంది మహిళల కుటుంబాలు మాత్రమే నెలకు రూ. పది వేల ఆదాయం పొందుతున్నాయి. మహిళల కుటుంబానికి వారసత్వంగా వచ్చిన వ్యవసాయ భూమిపై వచ్చే ఆదాయంతోపాటు మహిళ భర్తకు సంబంధించిన ఇతర ఆదాయాలన్నీ కలిపితేనే ఈ రూ.పది వేలు అవుతున్నాయి. డ్వాక్రా మహిళల కుటుంబంలో వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పింఛనుదారులుంటే వారికి ప్రభుత్వం ప్రతి నెలా ఇచ్చే పింఛన్ డబ్బులను కూడా కుటుంబ ఆదాయంలో లెక్కగట్టారు. 
క్విక్ రివ్యూ: ఏమిటి : డ్వాక్రా మహిళల ఆదాయం రూ. 4 వేలే 
ఎప్పుడు : జూన్ 19
ఎవరు : ఏపీ పల్స్ సర్వే 
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్‌లో 

గొర్రెల పంపిణీ పథకం ప్రారంభంతెలంగాణలో గొల్ల, కురుమలకు గొర్రెలు పంపిణీ చేసే పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపాకలో జూన్ 20న ప్రారంభించారు. పథకంలో భాగంగా 825 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 20 గొర్రెలు, ఒక పొట్టేలు పంపిణీ చేశారు. నాలుగు లక్షల కుటుంబాలకు గొర్రెలు పంపిణీ చేయాలని పథకంలో నిర్ణయించగా 7.61 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 7.18 లక్షల మందికి రెండున్నరేళ్లలో కోటిన్నర గొర్రెలు పంపిణీ చేస్తారు. 18 సంవత్సరాలు పైబడినవారు దీనికి అర్హులు. గొర్రెలకు ఏదైనా రోగం వస్తే 1962 నంబర్‌కు ఫోన్ చేస్తే అర్ధగంటలోపే డాక్టర్లు వచ్చి చికిత్స అందిస్తారు. 
క్విక్ రివ్యూ: ఏమిటి : గొర్రెల పంపిణీ పథకం ప్రారంభం 
ఎప్పుడు : జూన్ 21
ఎవరు : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్
ఎక్కడ : సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపాకలో
ఎందుకు : గొల్ల, కురుమల ఆదాయం పెంచి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్టపరచడానికి

బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్‌గా కృష్ణారావు తొలగింపుసోషల్ మీడియాలో ప్రభుత్వ వ్యతిరేక సమాచారాన్ని పంచుకున్నారన్న ఆరోపణతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్, అర్చక సంక్షేమ సంఘం చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావును తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సోషల్ మీడియాలో పెట్టిన పోస్టింగ్‌లు, షేరింగ్‌లపై ప్రభుత్వం ఎలాంటి వివరణ అడగకుండా తనను పదవి నుంచి తొలగించిందని కృష్ణారావు ఆరోపించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్)గా పదవీ విరమణ చేసిన కృష్ణారావును ఏపీ ప్రభుత్వం 2016లో బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్‌గా నియమించిన సంగతి తెలిసిందే. 
క్విక్ రివ్యూ: ఏమిటి : ఏపీ బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్ తొలగింపు 
ఎప్పుడు : జూన్ 20
ఎవరు : ఏపీ ప్రభుత్వం
ఎందుకు : సోషల్ మీడియాలో ప్రభుత్వ వ్యతిరేక సమాచారం పంచుకున్నందుకు

తెలంగాణ వ్యవసాయ ప్రణాళిక విడుదల పంటల సాగు, దిగుబడుల లక్ష్యాలను వివరిస్తూ 2017-18 వ్యవసాయ కార్యాచరణ ప్రణాళికను తెలంగాణ ప్రభుత్వం జూన్ 13న విడుదల చేసింది. దీని ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వానాకాలం(ఖరీఫ్), యాసంగి(రబీ) సీజన్లలో కలిపి 90.89 లక్షల టన్నుల ఆహార ధాన్యాల దిగుబడిని లక్ష్యంగా పెట్టుకుంది. దిగుబడి లక్ష్యాన్ని గతేడాది (93.57 లక్షల టన్నులు) కంటే తగ్గించారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : వ్యవసాయ ప్రణాళిక విడుదల 
ఎప్పుడు : జూన్ 13
ఎవరు : తెలంగాణ ప్రభుత్వం
ఎందుకు : ఖరీఫ్, రబీ పంటల దిగుబడి లక్ష్యాలను వివరించడానికి

ఆర్థికం2016-17లో కరెంట్ అకౌంట్ లోటు 0.7 శాతం 
కరెంట్ అకౌంట్ లోటు (సీఏడీ) 2016-17 ఆర్థిక సంవత్సరంలో తగ్గింది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)తో పోలిస్తే క్యాడ్ 0.7 శాతంగా నమోదయి్యంది. 2015-16లో ఈ రేటు 1.1 శాతంగా ఉంది. విలువ రూపంలో ఇది 130 బిలియన్ డాలర్ల నుంచి 112 బిలియన్ డాలర్లకు తగ్గింది. ఎఫ్‌ఐఐ, ఎఫ్‌డీఏ, ఈసీబీ మినహా ఒక నిర్దిష్ట ఆర్థిక సంవత్సరంలో దేశంలోకి వచ్చీ-పోయే విదేశీ మారకనిల్వల మధ్య నికర వ్యత్యాసమే క్యాడ్. జీడీపీతో పోల్చిచూసి, ఎంత తక్కువ ఉంటే, ఆర్థిక వ్యవస్థకు అంత సానుకూలమైనదిగా దీనిని పరిగణిస్తారు. భారత్ ఎగుమతులు-దిగుమతుల విలువ మధ్య నికర వ్యత్యాసమైన వాణిజ్య లోటు తగ్గడం- మొత్తంగా 2016-17లో క్యాడ్ తగ్గడానికి కారణమని ఆర్‌బీఐ జూన్ 15న విడుదల చేసిన గణాంకాలు పేర్కొన్నాయి. కాగా గడచిన ఆర్థిక సంవత్సరం 4వ త్రైమాసికంలో మాత్రం క్యాడ్ 0.6% పెరిగింది. 
క్విక్ రివ్యూ: ఏమిటి : కరెంట్ అకౌంట్ లోటు 0.7 శాతం
ఎప్పుడు : 2016-17లో 
ఎవరు : రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా 

గ్రామీణ డిజిటల్ అక్షరాస్యతకు ‘కోడ్ ఉన్నతి’యువత, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల్లో డిజిటల్ అక్షరాస్యతను పెంపొందించడానికి ఎస్‌ఏపీ ఇండియా, ఎల్‌అండ్‌టీ, ఐటీసీ సంయుక్తంగా ‘కోడ్ ఉన్నతి’ పేరుతో ఒక కొత్త సామాజిక బాధ్యత ప్రాజెక్టును ప్రారంభించాయి. ఇందులో భాగంగా గ్రామీణ ప్రాంత ప్రజలకు, యువతలో ఉద్యోగ నైపుణ్యానికి అవసరమైన కంప్యూటర్ విద్యపై శిక్షణ ఇవ్వనున్నాయి. దీని కోసం ఎస్‌ఏపీ సాఫ్ట్‌వేర్‌తోపాటు నిపుణులను అందిస్తే.. ఎల్‌అండ్‌టీ, ఐటీసీ చారిటబుల్ ట్రస్ట్‌లు మారుమూల గ్రామలకు వెళ్లి కోడ్ ఉన్నతి కేంద్రాలను ఏర్పాటు చేసి శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తాయి. 
కార్యక్రమంలో భాగంగా వివిధ రాష్ట్రాల్లో 100 శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని, ఇప్పటికే రాజస్తాన్‌లో 33, మహారాష్ట్రలో 3 కేంద్రాలు ప్రారంభించామని, 2018లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా పలురాష్ట్రాల్లో ప్రారంభించనున్నట్టు ఎస్‌ఏపీ ఇండియా తెలిపింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : కోడ్ ఉన్నతి కార్యక్రమం 
ఎప్పుడు : జూన్ 15
ఎవరు : ఎస్‌ఏపీ ఇండియా, ఎల్‌అండ్‌టీ, ఐటీసీ
ఎందుకు : యువతలో, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల్లో డిజిటల్ అక్షరాస్యతను పెంపొందించడానికి

ఐసీటీ సర్వీసుల ఎగుమతుల్లో భారత్ టాప్ఇన్‌ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ) సర్వీసుల ఎగుమతుల్లో భారత్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఐక్యరాజ్యసమితి (యూఎన్) తాజా నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. దీని ప్రకారం.. భారత్ చాలా అంశాల్లో మెరుగైన ప్రదర్శన కనబరచింది. అలాగే మరికొన్ని వాటిల్లో అంత మంచి ర్యాంక్‌లను సాధించలేకపోయింది. 
వివిధ కేటగిరీల్లో భారత్ ర్యాంకులు 

కేటగిరీర్యాంకు
గాడ్యుయేట్స్ ఇన్ సైన్‌‌స అండ్ ఇంజినీరింగ్10
ఇ-పార్టిసిపేషన్‌లో27
గ్లోబల్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కంపెనీస్14
గవర్నమెంట్ ఆన్‌లైన్ సర్వీసెస్33
జనరల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్32
సృజనాత్మక వస్తువుల ఎగుమతులు18
ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ పేమెంట్స్29
రాజకీయ స్థిరత్వం, భద్రత106
వ్యాపార పరిస్థితుల్లో121
ఎడ్యుకేషన్114
క్విక్ రివ్యూ: ఏమిటి : ఐసీటీ ఎగుమతుల ర్యాంకింగ్స్‌లో భారత్ టాప్
ఎప్పుడు : జూన్ 16
ఎవరు : ఐక్యరాజ్య సమితి 

భారత్‌లో ఎఫ్-16 జెట్స్ తయారీ ఒప్పందం అత్యాధునిక ఎఫ్-16 యుద్ధ విమానాలను సంయుక్తంగా భారత్‌లో తయారు చేసేందుకు టాటా అడ్వాన్‌‌సడ్ సిస్టమ్స్(టీఏఎస్‌ఎల్), అమెరికన్ ఏరోస్పేస్ దిగ్గజం లాక్‌హీడ్ మార్టిన్ సంస్థలు జూన్ 19న ఒప్పందం కుదుర్చుకున్నాయి. పారిస్ ఎయిర్‌షో సందర్భంగా కంపెనీలు ఈ విషయాన్ని వెల్లడించాయి. భారత ప్రభుత్వ మేకిన్ ఇండియా నినాదానికి ఊతమిచ్చే ఈ డీల్ ప్రకారం లాక్‌హీడ్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం ఫోర్ట్ వర్త్‌లో ఉన్న ప్లాంటు కార్యకలాపాలను భారత్‌కు తరలించనుంది. టీఏఎస్‌ఎల్ ఇప్పటికే లాక్‌హీడ్‌కి చెందిన సీ-130 జే ఎయిర్‌లిఫ్టర్, ఎస్ - 92 హెలికాప్టర్‌లకు ఎయిర్‌ఫ్రేమ్ విడిభాగాలు అందజేస్తుంది. 
క్విక్ రివ్యూ: ఏమిటి : టీఏఎస్‌ఎల్, లాక్‌హీడ్ మార్టిన్ సంస్థల ఒప్పందం
ఎప్పుడు : జూన్ 19
ఎక్కడ : పారిస్ ఎయిర్‌షోలో 
ఎందుకు : భారత్‌లో ఎఫ్-16 జెట్స్ తయారీ కోసం 

జూన్ 30న పార్లమెంట్‌లో జీఎస్టీ ప్రారంభ కార్యక్రమం ప్రతిష్టాత్మక జీఎస్టీ చట్టం అమలును అందరికీ గుర్తుండేలా అట్టహాసంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దాదాపు రూ. 130 లక్షల కోట్లుగా ఉన్న దేశ ఆర్థికవ్యవస్థ రూపురేఖల్ని మార్చేసే ఈ కొత్త పన్ను వ్యవస్థ ప్రారంభోత్సవం కోసం పార్లమెంట్ సెంట్రల్ హాలును వేదికగా ఎంచుకుంది. జీఎస్టీ అమల్లోకి రానున్న జూన్ 30 అర్ధరాత్రి సెంట్రల్ హాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన వేళ 1947, ఆగస్టు 15 అర్ధరాత్రి ‘ట్రైస్ట్ విత్ డెస్టినీ’ పేరిట సెంట్రల్ హాల్లో అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ చేసిన ప్రసంగాన్ని గుర్తుచేసేలా ఈ కార్యక్రమం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. 
జూన్ 30 రాత్రి 11 గంటలకు ప్రారంభమయ్యే కార్యక్రమం.. అర్ధరాత్రి జీఎస్టీ అమల్లోకి వచ్చే వరకూ కొనసాగుతుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. 12 గంటలు కాగానే పెద్ద గంటను మోగించి జీఎస్టీ అమలును ప్రకటిస్తారు. 
క్విక్ రివ్యూ: ఏమిటి : జీఎస్టీ ప్రారంభ కార్యక్రమం
ఎప్పుడు : జూన్ 30
ఎక్కడ : పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో 
ఎందుకు : జీఎస్టీ చట్టం అమలు అందరికీ గుర్తుండేలా

2017 ఖరీఫ్ కు మద్దతు ధర పెంపు2017 ఖరీఫ్ సీజన్‌లో 18 రకాల పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)ను కేంద్ర ప్రభుత్వం జూన్ 20న పెంచింది. వరి క్వింటాలుకు రూ.80 లు, ఇతర పప్పు ధాన్యాల పంటలకు క్వింటాలుకు రూ. 400 వరకు పెంచింది. దీంతో కామన్ గ్రేడ్ రకం వరికి రూ.1,550, ఏ గ్రేడ్ రకం వరికి రూ.1,590 లు కనీస మద్దతు ధరగా ఉన్నాయి. పప్పు దాన్యాల మద్దతు ధర క్వింటాలుకు రూ.5,050 నుంచి రూ.5,450కు పెరిగింది. 
పెరిగిన మద్ధతు ధరలు (రూ.లలో) 

ధాన్యం2016-172017 ఖరీఫ్పెంపు
వరి (కామన్ గ్రేడ్)1470155080
వరి (ఎ గ్రేడ్)1510159080
పప్పుధాన్యాలు50505450400
మినప్పప్పు50005400400
పెసరపప్పు52255575350
పత్తి38604020160
సోయాబీన్27753050275
వేరుశనగ42204450230
ద్దుతిరుగుడు39504100150
సజ్జ1330142595
జొన్న1650172575
రాగి17251900175
క్విక్ రివ్యూ: ఏమిటి : 2017 ఖరీఫ్ పంటలకు మద్దతు ధర పెంపు
ఎప్పుడు : జూన్ 20
ఎవరు : కేంద్ర ప్రభుత్వం

సైన్స్ అండ్ టెక్నాలజీచంద్రుడిపై సాగుకు చైనా తొలి ప్రయత్నం బంగాళాదుంప విత్తనాలు మొలకెత్తేలా, పట్టుపురుగు గుడ్లు లార్వాలుగా మారేలా ఓ ఎకోసిస్టమ్‌ను రూపొందించి, దానిని చంద్రుడిపైకి పంపేందుకు చైనా ఏర్పాట్లు చేస్తుంది. చందమామపై వాతావరణంలో ఇవి ఎలా మార్పు చెందుతాయో తెలుసుకునేందుకు ఓ ప్రయోగం చేపడుతోంది. మొత్తం మూడు కిలోల బరువున్న ఈ ఎకోసిస్టమ్‌ను చాంగ్‌క్వింగ్ యూనివర్సిటీ సిద్ధం చేయగా, చాంగ్ ఈ4 వాహకనౌక ద్వారా అంతరిక్షంలోకి పంపేందుకు సిద్ధమవుతోంది. ఈ ప్రయోగం ద్వారా జాబిల్లిపై మానవులు జీవించడం సాధ్యమేనా అనే విషయాన్ని పరిశీలించాలని చైనా భావిస్తోంది. 
క్విక్ రివ్యూ: ఏమిటి : చంద్రుడిపై సాగుకు తొలి ప్రయత్నం
ఎవరు : చైనా
ఎందుకు : ఎకోసిస్టమ్ ద్వారా చంద్రుడిపై వాతావరణ మార్పులు తెలుసుకునేందుకు 

వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న మామ్ ఉపగ్రహం అతి తక్కువ ఖర్చుతో తయారు చేసిన మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్)అరుణగ్రహం కక్ష్యలో తిరుగుతూ విజయవంతంగా వెయి్య రోజులు పూర్తి చేసుకుంది. 6 నెలల వ్యవధి కోసం రూపొందించిన ఈ అంతరిక్ష నౌక లక్ష్యాన్ని అధిగమించి తన కక్ష్యలో 1000 రోజులు (భూమిపై 1000 రోజులు కాగా, అరుణ గ్రహంపై 973.24 రోజులు) విజయవంతంగా పూర్తి చేసుకుంది. 388 సార్లు తన కక్ష్యలో తిరిగింది. 
2014 సెప్టెంబర్ 24న మామ్‌ను అరుణగ్రహం కక్ష్యలోకి ఇస్రో మొదటి ప్రయత్నంలోనే విజయవంతంగా ప్రవేశపెట్టింది. స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన పీఎస్‌ఎల్వీ రాకెట్ సాయంతో శ్రీహరికోట నుంచి 2013 నవంబర్ 5న ఈ నౌకను ప్రయోగించారు. అరుణగ్రహం ఉపరితలంపై ఖనిజాల జాడ వెతికేందుకు, అక్కడి వాతావరణాన్ని అధ్యయనం చేసి జీవం ఉందని సూచించే మీథేన్‌ను కనిపెట్టేందుకు రూ.450 కోట్లతో తయారుచేసిన ఈ మామ్‌ను అక్కడికి పంపించారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న మామ్ ఉపగ్రహం 
ఎప్పుడు : జూన్ 19 నాటికి 
ఎవరు : ఇస్రో 
ఎందుకు : అరుణగ్రహం ఉపరితలంపై ఖనిజాల జాడ, వాతావరణం అధ్యయనం కోసం 

యుగో ఇంపోర్ట్‌తో రిలయన్స్ డిఫెన్‌‌స ఒప్పందంసెర్బియాకు చెందిన యుగో ఇంపోర్ట్‌తో అనిల్ అంబానీకి చెందిన ‘రిలయన్స్ డిఫెన్స్ అమ్యూనిషన్’ వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది. మందుగుండు సామగ్రి సహా ఇతర అంశాల్లో రెండు కంపెనీలు కలసి పనిచేయడంతోపాటు వచ్చే పదేళ్లలో రూ. 20,000 కోట్ల వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకోవడం ఈ ఒప్పందంలో భాగమని రిలయన్స్ డిఫెన్స్ తెలిపింది. అనిల్ అంబానీ సెర్బియా ప్రెసిడెంట్ అలెగ్జాండర్ వుసిక్‌తో భేటీ అయిన మరుసటి రోజే ఈ ఒప్పందం కుదిరింది. 
మందుగుండు తయారీలో మార్కెట్ లీడర్‌గా ఉన్న యుగోఇంపోర్ట్ సెర్బియా ప్రభుత్వ రంగ సంస్థ. ప్రస్తుతం మన దేశ మందుగుండు అవసరాల్లో రూ. 10,000 కోట్ల (50 శాతం) మేర దిగుమతి అవుతున్నదే. 
క్విక్ రివ్యూ: ఏమిటి : యుగో ఇంపోర్ట్‌తో రిలయన్‌‌స డిఫెన్‌‌స ఒప్పందం
ఎప్పుడు : జూన్ 20
ఎవరు : సెర్బియాకు చెందిన యుగోఇంపోర్ట్ మరియు రిలయన్స్ డిఫెన్స్ 
ఎందుకు : మందుగుండు సామగ్రి తయారీకి

గురు గ్రహం.. అతిపురాతనంసౌర వ్యవస్థలోని గ్రహాల్లోకెల్ల్లా గురు గ్రహం అత్యంత పురాతనమైందని ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. సూర్యుడు ఏర్పడిన 40 లక్షల ఏళ్లకు గురు గ్రహం ఆవిర్భవించిందని అమెరికాలోని లారెన్స్ లివర్‌మోర్ నేషనల్ లేబొరేటరీ జూన్ 12న తెలిపింది. గురు గ్రహం ఉపరితలంపై ఉన్న ఉల్క శకలాల్లోని ఐసోటోప్ సిగ్నేచర్ నమూనాలను పరిశీలించి ఈ అంచనాకు వచ్చినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. 

క్రీడలువన్డేల్లో 8 వేల పరుగులు చేసిన కోహ్లీఅంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో వేగంగా 8 వేల పరుగులు మైలు రాయిని దాటిన క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన సెమీఫైనల్‌లో మ్యాచ్‌లో కోహ్లీ 78 బంతుల్లో 96 పరుగులు సాధించాడు. తద్వారా ఇప్పటి వరకూ దక్షి ణాఫ్రికా ప్లేయర్ ఏబీ డెవిలియర్స్ పేరిట ఉన్న (182 ఇన్నింగ్స్ ) రికార్డును కోహ్లీ తన 175వ ఇన్నింగ్స్‌లోనే అధిగమించాడు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : వన్డేల్లో 8 వేల పరుగుల మైలురాయి 
ఎప్పుడు : జూన్ 15 
ఎవరు : విరాట్ కోహ్లీ 
ఎక్కడ : చాంపియన్స్ ట్రోఫీ 2017 (బంగ్లాదేశ్‌పై) 

ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ విజేత పాకిస్తాన్ 2017 చాంపియన్‌‌స ట్రోఫీని పాకిస్తాన్ కైవసం చేసుకుంది. జూన్ 18న లండన్‌లోని ఓవల్ మైదానంలో జరిగిన ఫైనల్‌లో పాక్ 180 పరుగుల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. తద్వారా తొలిసారి చాంపియన్స్ ట్రోఫీని అందుకున్న పాకిస్తాన్.. ఐసీసీ మూడు టోర్నీలూ (వన్డే వరల్డ్ కప్, టీ20 ప్రపంచ కప్, చాంపియన్స్ ట్రోఫీ) గెలుచుకున్న మూడో జట్టుగా గుర్తింపు పొందింది. పాక్ కంటే ముందు భారత్, వెస్టిండీస్ ఈ మూడో టోర్నీలను గెలుపొందాయి. 
టోర్నీలో అత్యధిక పరుగులు (338) చేసిన శిఖర్ ధావన్‌కు ‘గోల్డెన్ బ్యాట్’ అవార్డు దక్కగా, అత్యధిక వికెట్లు (13) తీసిన పాక్ పేసర్ హసన్ అలీ ‘గోల్డెన్ బాల్’తో పాటు ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్’ అవార్డు అందుకున్నాడు. 
క్విక్ రివ్యూ: ఏమిటి : ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ - 2017 
ఎప్పుడు : జూన్ 18
ఎవరు : విజేత పాకిస్తాన్ 
ఎక్కడ : లండన్ 

ఇండోనేసియా ఓపెన్ సూపర్ సిరీస్ విజేత శ్రీకాంత్ఇండోనేసియా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను భారత ఆటగాడు కిడాంబి శ్రీకాంత్ గెలుచుకున్నాడు. జూన్ 18న జరిగిన ఫైనల్లో ప్రపంచ 22వ ర్యాంకర్ శ్రీకాంత్ కేవలం 37 నిమిషాల్లోనే 21-11, 21-19తో ప్రపంచ 47వ ర్యాంకర్ కజుమాసా సకాయ్ (జపాన్)పై గెలిచాడు. తద్వారా పురుషుల సింగిల్స్‌లో ఈ టైటిల్ నెగ్గిన తొలి భారతీయుడుగా గుర్తింపు పొందాడు. ఈ విజయంతో రూ. 75 వేల డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 48 లక్షలు 33 వేలు) సొంతం చేసుకున్నాడు. 
ఓవరాల్‌గా శ్రీకాంత్ కెరీర్‌లో ఇది మూడో సూపర్ సిరీస్ టైటిల్. 2014లో చైనా ఓపెన్ సూపర్ సిరీస్, 2015 ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలో శ్రీకాంత్ చాంపియన్‌గా నిలిచాడు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఇండోనేషియా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నమెంట్
ఎప్పుడు : జూన్ 18
ఎవరు : పురుషుల సింగిల్స్ విజేత కిడాంబి శ్రీకాంత్ 
ఎక్కడ : ఇండోనేషియా 

జూనియర్ చెస్ మీట్‌లో భారత బాలికకు కాంస్యంబ్రిటన్‌లో జరుగుతున్న జూనియర్ ఓపెన్ రాపిడ్ చెస్ టోర్నీలో ముంబైకి చెందిన అహనా షా కాంస్యాన్ని దక్కించుకుంది. అండర్-7 విభాగంలో పోటీపడిన షా.. ఐదింటికి నాలుగు పాయింట్లు సాధించింది. ఈ టోర్నీలో ఎలాంటి రేటింగ్ లేకుండా పాల్గొన్న ఏడేళ్ల షాకు కాంస్యం దక్కగా రిత్విక్, డెసైన్‌లకు స్వర్ణ, రజత పతకాలు దక్కాయి. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : జూనియర్ చెస్ మీట్‌లో భారత బాలికకు కాంస్యం
ఎప్పుడు : జూన్ 20
ఎవరు : ముంబైకి చెందిన అహనా షా 
ఎక్కడ : బ్రిటన్

కోచ్ పదవికి కుంబ్లే రాజీనామాభారత జట్టు హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే తన పదవి నుంచి తప్పుకుంటున్నట్లు జూన్ 20న ప్రకటించారు. కాంట్రాక్ట్ ప్రకారం ఆయన పదవీ కాలం జూన్ 20నే ముగియనున్నందున రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. గత కొంతకాలంగా భారత జట్టు కెప్టెన్ కోహ్లీ, ఆటగాళ్లు, కుంబ్లేకు మధ్య వివాదం నడుస్తుందని జోరుగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అయితే కుంబ్లే ఒప్పుకుంటే ఆయన విండీస్ పర్యటనకు వెళతారని ఇటీవలే సీఓఏ చీఫ్ వినోద్ రాయ్ వెల్లడించారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : భారత జట్టు హెడ్ కోచ్ పదవికి రాజీనామా
ఎప్పుడు : జూన్ 20
ఎవరు : అనిల్ కుంబ్లే 
ఎందుకు : జూన్ 20న పదవీకాలం ముగియడం, భారత జట్టు సభ్యులతో వివాదాల నేపథ్యంలో

అవార్డులుడేవిడ్ గ్రాస్‌మన్‌కు మ్యాన్‌బుకర్ ప్రైజ్ బ్రిటన్ అందించే ప్రతిష్టాత్మక మ్యాన్ బుకర్ ప్రైజ్‌ను 2017 ఏడాదికి ఇజ్రాయెల్‌కు చెందిన రచయిత డేవిడ్ గ్రాస్‌మన్ గెలుచుకున్నారు. ‘ఎ హార్స్ వాక్స్ ఇన్‌టు ఎ బార్’ అనే నవలకుగాను ఆయనకు ఈ పురస్కారం దక్కింది. ప్రైజ్‌మనీ మొత్తం 50 వేల పౌండ్లు (దాదాపు రూ.41.2 లక్షలు) కాగా డేవిడ్ నవలను ఇంగ్లిష్‌లోకి అనువాదం చేసిన జెస్సికా కొహెన్‌కు కూడా ప్రైజ్‌మనీలో సగం ఇవ్వనున్నారు. 
మ్యాన్ బుకర్ ప్రైజ్‌ని మ్యాన్ గ్రూప్ పీఎల్‌సీ సంస్థ 1969లో ప్రారంభించింది. బ్రిటన్‌లో పబ్లిష్ అయిన ఆంగ్ల నవలకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : మ్యాన్‌బుకర్ ప్రైజ్ - 2017
ఎప్పుడు : జూన్ 15
ఎవరు : డేవిడ్ గ్రాస్‌మన్ (ఇజ్రాయెల్) 
ఎందుకు : ‘ఎ హార్స్ వాక్స్ ఇన్‌టు ఎ బార్ నవలకు గాను 

భారతీ శర్మకు ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారంసామాజిక కార్యకర్త డాక్టర్ భారతీ శర్మకు ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం లీజియన్ ఆఫ్ హానర్(చావలియర్ డి ఆర్డ్రే నేషనల్ డి లా లీజియన్ డి హానర్) లభించింది. బాలల రక్షణ, మహిళా సాధికారతకు ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా ఫ్రాన్స్ ఈ అవార్డును అందించింది. భారత్‌లోని ఫ్రాన్స్ రాయబారి అలెగ్జాండర్ జిగ్లర్ నివాసంలో జూన్ 15న జరిగిన కార్యక్రమంలో ఆమెకు అవార్డును ప్రదానం చేశారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : చావలియర్ డి ఆర్డ్రే నేషనల్ డి లా లీజియన్ డి హానర్
ఎప్పుడు : జూన్ 15
ఎవరు : సామాజిక కార్యకర్త డాక్టర్ భారతీ శర్మ
ఎందుకు : బాలల రక్షణ, మహిళా సాధికారతకు ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా

వార్తల్లో వ్యక్తులుజస్టిస్ పీఎన్ భగవతి కన్నుమూతభారత న్యాయ వ్యవస్థలో ‘ప్రజా ప్రయోజన వ్యాజ్యం’(పిల్)కు ఆద్యుడిగా భావించే న్యాయ కోవిదుడు, మాజీ సీజేఐ జస్టిస్ పీఎన్ భగవతి (95) జూన్ 15న న్యూఢిల్లీలో కన్నుముశారు. పీఎన్ భగవతి 1985 జూలై నుంచి 1986 డిసెంబర్ వరకు సుప్రీంకోర్టుకు 17వ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. అంతకు ముందు గుజరాత్ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన ఆయన 1973 జూలైలో సుప్రీంకోర్టులో జడ్జిగా చేరారు. 
భగవతి సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్న సమయంలో పిల్, భారత న్యాయ వ్యవస్థలో సంపూర్ణ జవాబుదారీతనం వంటి భావనలను ప్రవేశపెట్టారు. ఖైదీలు కూడా ప్రాథమిక హక్కులకు అర్హులే అని ఆయన ఓ సందర్భంలో తీర్పునిచ్చారు. 1978లో ప్రస్తుత కేంద్ర మంత్రి మేనకా గాంధీ పాస్‌పోర్టు స్వాధీన కేసులో ఆయన ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకమైనది. పౌరుల కదలికలను నియంత్రించకూడదని, పాస్‌పోర్టులను తమ వద్దే ఉంచుకునే హక్కు ప్రతిఒక్కరికి ఉందని భగవతి ఆ సందర్భంగా అన్నారు. 
క్విక్ రివ్యూ: ఏమిటి : జస్టిస్ పీఎన్ భగవతి కన్నుమూత
ఎప్పుడు : జూన్ 15
ఎక్కడ : న్యూఢిల్లీలో 
ఎవరు : ప్రజా ప్రయోజన వ్యాజ్యానికి ఆద్యుడు

ఐరాసలో జడ్జిగా భారత మహిళ ఐక్యరాజ్య సమితిలోని సముద్ర జలాల వివాదాలను పరిష్కరించే ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ ఫర్ ది లా ఆఫ్ ది సీ(ఐటీఎల్‌ఓఎస్)కు భారత్‌కు చెందిన న్యాయ నిపుణురాలు నీరు చాధా ఎన్నికయ్యారు. జూన్ 14న జరిగిన ఓటింగ్‌లో చాధాకు ఆసియా పసిఫిక్ గ్రూప్‌లో అత్యధికంగా 120 ఓట్లు రావడంతో అమె తొలి రౌండ్‌లోనే గెలుపొందారు. తద్వారా ఈ ట్రిబ్యునల్‌కు జడ్జిగా నియమితులైన తొలి భారత మహిళగా ఆమె గుర్తింపు పొందారు. చాధా ఈ పదవిలో 9 ఏళ్లు ఉంటారు. ఈ ట్రిబ్యునల్‌లో మొత్తం 21 మంది సభ్యులుంటారు. 
ప్రముఖ న్యాయవాది చాధా విదేశాంగ శాఖలో ముఖ్య న్యాయ సలహాదారుగా పనిచేసిన తొలి మహిళగా పేరుగాంచారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఐటీఎల్‌ఓఎస్ న్యాయమూర్తిగా భారత మహిళ
ఎప్పుడు : జూన్ 15 
ఎవరు : నీరు చాధా 

జర్మనీ ఏకీకరణ ఆద్యుడు కోల్ కన్నుమూతజర్మనీ పునరేకీకరణకు ఆద్యుడిగా పేరుపొందిన ఆ దేశ మాజీ చాన్స్‌లర్ హెల్మట్ కోల్(87) జూన్ 16న బెర్లిన్‌లో కన్నుమూశారు. రెండో ప్రపంచ యుద్ధం అనంతరం రెండు ముక్కలైన జర్మనీని ఏకం చేసేందుకు ఆయన కృషిచేశారు. 1982లో పశ్చిమ జర్మనీ చాన్స్‌లర్‌గా ఎన్నికైన ఆయన 1989లో బెర్లిన్ గోడ కూల్చివేతతో తూర్పు, పశ్చిమ జర్మనీల్ని ఒకటి చేశారు. అనంతరం 1998 వరకు ఉమ్మడి జర్మనీకి చాన్స్‌లర్‌గా కొనసాగారు. 1945లోజర్మనీ రెండుగా చీలిపోగా.. 1989 వరకు పెట్టుబడిదారుల చేతుల్లో పశ్చిమ జర్మనీ, కమ్యూనిస్టుల పాలనలో తూర్పు జర్మనీ కొనసాగాయి. 
క్విక్ రివ్యూ: ఏమిటి : హెల్మట్ కోల్ కన్నుమూత 
ఎప్పుడు : జూన్ 16
ఎవరు : జర్మనీ ఏకీకరణ ఆద్యుడు 
ఎక్కడ : బెర్లిన్‌లో 

అటల్ ఇన్నోవేషన్ మిషన్ డెరైక్టర్‌గా రామనాథన్ రామనన్నీతి ఆయోగ్ ఆధ్వర్యంలోని అటల్ ఇన్నోవేషన్ మిషన్ డెరైక్టర్‌గా రామనాథన్ రామనన్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర నియామకాల కమిటీ అదనపు కార్యదర్శి హోదాలో ఆయన నియామకానికి జూన్ 16న ఆమోదం తెలిపింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సంస్థలో ఎగ్జిక్యూటివ్ గా ఉన్న రామనన్.. తాత్కాలిక బదిలీపై ఈ బాధ్యతలు చేపడతారు. ఆయన ఈ పదవిలో రెండేళ్ల పాటు ఉంటారు. 
క్విక్ రివ్యూ: ఏమిటి : అటల్ ఇన్నోవేషన్ మిషన్‌కు డెరైక్టర్ నియామకం 
ఎప్పుడు : జూన్ 16
ఎవరు : రామనాథన్ రామనన్ 

ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్‌నాథ్ కోవింద్ ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా దళితనేత రామ్‌నాథ్ కోవింద్ (71) పేరుని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా జూన్ 19న ప్రకటించారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన రామ్‌నాథ్ ప్రస్తుతం బిహార్ గవర్నర్‌గా ఉన్నారు. ఆయనికి రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన అనుభవం ఉంది. సుప్రీంకోర్టు న్యాయవాదిగా రాజ్యాంగంపైనా అవగాహన ఉంది. జూన్ 23న రామ్‌నాథ్ కోవింద్ రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. 
క్విక్ రివ్యూ: ఏమిటి : ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి 
ఎప్పుడు : జూన్ 19
ఎవరు : రామ్‌నాథ్ కోవింద్ 

జీఎస్టీ ప్రచారకర్తగా అమితాబ్ బచ్చన్జీఎస్టీ ప్రచారకర్తగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌ను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ఇప్పటికే 40 సెకన్ల్ల నిడివున్న వీడియోను కేంద్ర ప్రత్యక్ష పన్నుల విభాగం(సీబీడీటీ) అమితాబ్‌పై చిత్రీకరించి ప్రసారం ప్రారంభించింది. ‘జీఎస్టీ- ఏకీకృత జాతీయ విపణి ఏర్పాటు కోసం తొలి అడుగు’ పేరిట ఈ వీడియో ప్రసారం అవుతుంది. ఇంతకుముందు బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు జీఎస్టీ అంబాసిడర్‌గా పనిచేశారు. 
క్విక్ రివ్యూ: ఏమిటి : జీఎస్టీ ప్రచారకర్త ఎంపిక 
ఎప్పుడు : జూన్ 19
ఎవరు : అమితాబ్ బచ్చన్
ఎందుకు : జీఎస్టీపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడానికి

జస్టిస్ సీఎస్ కర్ణన్ అరెస్ట్కోర్టు ధిక్కార కేసులో ఆర్నెల్ల జైలు శిక్షను ఎదుర్కొని తప్పించుకు తిరుగుతున్న కోల్‌కతా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సీఎస్ కర్ణన్ అరెస్టయ్యారు. అజ్ఞాతంలో ఉన్న ఆయనను జూన్ 20న కోయంబత్తూరు దగ్గర్లోని మలుమిచ్చంపట్టి గ్రామంలో పశ్చిమబెంగాల్ సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. 
కోర్టు ధిక్కార కేసులో సీజేఐ జస్టిస్ ఖేహర్ నేతృత్వంలోని బెంచ్.. కర్ణన్‌కు ఆర్నెల్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. దీంతో జైలు శిక్ష విధింపబడిన మొదటి న్యాయమూర్తిగా కర్ణన్ న్యాయ చరిత్రలో నిలిచిపోయారు. 1983లో తమిళనాడులో న్యాయవాదిగా వృత్తిజీవితం ప్రారంభించిన కర్ణన్ 2009లో మద్రాసు హైకోర్టులో న్యాయమూర్తిగా నియమితులవగా.. 2016 మార్చి 11న కోల్‌కతా హైకోర్టుకు బదిలీ అయ్యారు. తాజాగా వివాదాల నేపథ్యంలోనే జూన్ 12న పదవీ విరమణ కూడా పొందారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : జస్టిస్ సీఎస్ కర్ణన్ అరెస్టు 
ఎప్పుడు : జూన్ 20
ఎవరు : పశ్చిమ బెంగాల్ సీఐడీ అధికారులు
ఎక్కడ : కోయంబత్తూరు దగ్గర్లోని మలుమిచ్చంపట్టి గ్రామం
ఎందుకు : కోర్టు ధిక్కార కేసులో ఆర్నెళ్ల జైలు శిక్ష అమలు చేయడానికి

ఐసీజేకి తిరిగి నామినేట్ అయిన జస్టిస్ భండారీఅంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) జడ్జి పదవికి భారత్ తన అభ్యర్థిగా మరోసారి జిస్టిస్ దల్వీర్ భండారీని నామినేట్ చేసింది. ఈ మేరకు ఐరాస ప్రధాన కార్యదర్శి గ్యుటెరస్ వద్ద భారత్ నామినేషన్ దాఖలు చేసింది. 2012లో జరిగిన ఓటింగ్‌లో భండారీ ఈ పదవికి ఎన్నికయ్యారు. తదుపరి ఎన్నికలు 2017 నవంబర్‌లో జరగనున్నాయి. 
క్విక్ రివ్యూ: ఏమిటి : ఐసీజేకి రెండోసారి నామినేట్ అవడం 
ఎప్పుడు : జూన్ 20
ఎవరు : జస్టిస్ దల్వీర్ భండారీ

యూనిసెఫ్ ప్రచారకర్తగా శరణార్థి బాలికఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ యూనిసెఫ్.. తమ కార్యక్రమాల ప్రచారకర్తగా సిరియా శరణార్థి బాలిక ముజూన్ అల్మెల్లెహాన్‌ను నియమించింది. తద్వారా శరణార్థిగా ఉంటూ యూనిసెఫ్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా నియమితురాలైన తొలి వ్యక్తిగా ముజూన్ నిలిచింది. జోర్డాన్‌లోని జాటారీ శరణార్థి శిబిరంలో ఆశ్రయం పొందుతున్నప్పుడు యూనిసెఫ్ నిర్వహించిన ఎన్నో కార్యక్రమాల్లో ముజూన్ చురుగ్గా పాల్గొంది. 
క్విక్ రివ్యూ: ఏమిటి : యూనిసెఫ్ గుడ్‌విల్ అంబాసిడర్
ఎప్పుడు : జూన్ 20
ఎవరు : ముజూన్ అల్మెల్లెహాన్
ఎందుకు : యూనిసెఫ్ నిర్వహించిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నందుకు


చరిత్రలో ఈ నెల జూన్ (23 - 29) 2017
అంతర్జాతీయంప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా డే
 
ప్రపంచ వ్యాప్తంగా మూడవ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా జరిగింది. లక్నోలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న కార్యక్రమంలో 51 వేల మంది యోగాలో పాల్గొన్నారు. యోగాను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని ఈ సందర్భంగా మోదీ పిలుపునిచ్చారు. అహ్మదాబాద్‌లో యోగా గురు రాందేవ్ బాబా, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఆధ్యర్యంలో 54 వేల మందికి పైగా పాల్గొని గిన్నీస్ రికార్డు సృష్టించారు. లండన్ ఐ, ఐఫిల్ టవర్‌ల వద్ద కూడా భారీగా జనం ఆసనాలు వేశారు. న్యూయార్క్‌లో జరిగిన కార్యక్రమంలో ఐక్యరాజ్యసమితి యోగాపై ప్రత్యేక స్టాంపును విడుదల చేసింది.
ఐక్యరాజ్య సమితి 2014 డిసెంబర్ 11న ఏటా జూన్ 21న యోగా దినోత్సవం నిర్వహించాలని తీర్మానించింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : అంతర్జాతీయ యోగా దినోత్సవం 
ఎప్పుడు : జూన్ 21
ఎక్కడ : ప్రపంచవ్యాప్తంగా 
ఎవరు: యోగా ప్రత్యేక స్టాంప్ విడుదల చేసిన ఐరాస

సౌదీ యువరాజుగా బిన్ సల్మాన్ సౌదీ అరేబియా రాజు మహమ్మద్ సల్మాన్ తన కొడుకు, డిప్యూటీ క్రౌన్ ప్రిన్స్ అయిన మహ్మద్ బిన్ సల్మాన్(31)ను యువరాజు(క్రౌన్ ప్రిన్స్)గా నియమించారు. దీంతో తన తరువాత సింహాసనాన్ని చేపట్టే అవకాశాన్ని కొడుకుకు కల్పించినట్లయింది. ఇప్పటిదాకా యువరాజు స్థానంలో ఉన్న సోదరుడి కుమారుడు మహ్మద్ బిన్ నయేఫ్(51)ను తప్పించడంతో పాటు ఆయన్ని డిప్యూటీ ప్రధాని, అంతర్గత భద్రత మంత్రిగా కూడా తొలగించారు. యువరాజుగా ఎంపికై న మహ్మద్ బిన్ సల్మాన్ ఇప్పటికే రక్షణ శాఖ మంత్రిగా, ఆర్థిక మండలి అధిపతిగా వ్యవహరిస్తున్నారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : సౌదీకి కొత్త యువరాజు 
ఎప్పుడు : జూన్ 21 
ఎవరు: బిన్ సల్మాన్ 
ఎక్కడ : సౌదీ అరేబియా 
ఎందుకు : మహ్మద్ బిన్ నయేఫ్ స్థానంలో

అమెరికాలో టాప్ ఎంప్లాయర్‌గా టీసీఎస్దేశీ దిగ్గజ ఐటీ కంపెనీ ‘టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్’ (టీసీఎస్) అమెరికాలో టాప్ ఎంప్లాయర్‌గా అవతరించింది. ఈ మేరకు కేంబ్రిడ్‌‌జ గ్రూప్ వెలువరించిన నివేదికలో ఐటీ సర్వీసెస్ రంగానికి సంబంధించి ఉపాధి కల్పనలో అగ్రస్థానాన్ని టీసీఎస్ కైవసం చేసుకుంది. 
టీసీఎస్ గత ఐదేళ్లలో (2012-2016) 12,500 మందికి పైగా అమెరికన్లకు ఉపాధి కల్పించింది. ఇదే సమయంలో అమెరికా ఉద్యోగి వృద్ధిలో 57 శాతం వాటాతో టాప్‌లో దూసుకెళ్తోంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : అమెరికాలో టాప్ ఎంప్లాయర్ 
ఎప్పుడు : జూన్ 23
ఎవరు: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 
ఎందుకు : ఐటీ సర్వీసెస్ రంగానికి సంబంధించిన ఉపాధి కల్పనలో 

అమెరికా ‘ట్రావెల్ బ్యాన్’కు అనుమతిఆరు ముస్లిం ఆధిక్య దేశాల నుంచి పౌరుల రాకపై అమెరికా ప్రభుత్వం విధించిన పాక్షిక నిషేధాన్ని ఆ దేశ సుప్రీంకోర్టు అనుమతించింది. ఈ ఏడాది జనవరిలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జారీ చేసిన ఈ నిషేధ ఉత్తర్వుల్ని కింది కోర్టులు నిలుపుదల చేయగా.. అమెరికా సుప్రీంకోర్టు జూన్ 26న పునరుద్ధరించింది. ఈ సందర్భంగా అమెరికాలోకి ప్రవేశించేందుకు ఎవరు అర్హులన్న విషయంలో కొన్ని మార్గదర్శకాల్ని నిర్దేశించింది. అమెరికాలో నివసిస్తున్న వ్యక్తులు లేదా సంస్థలతో చట్టబద్దమైన సంబంధాలుంటే వారు దేశంలో ప్రవేశించేందుకు అర్హులని స్పష్టం చేసింది. అలాగే చెల్లుబాటయ్యే వీసా ఉన్న వారిని కూడా అనుమతించాల్సిందేనని పేర్కొంది. అక్టోబర్‌లో కేసు పూర్తి స్థాయి విచారణ వరకూ ఈ ఉత్తర్వులు కొనసాగుతాయి.
సుప్రీం తీర్పు నేపథ్యంలో ఇరాన్, లిబియా, సోమాలియా, సూడాన్, సిరియా, యెమెన్ దేశాల నుంచి అమెరికాకు వచ్చే పౌరుల్ని 90 రోజుల పాటు రాకుండా అడ్డుకోవచ్చు. అలాగే 120 రోజుల పాటు శరణార్థులు అమెరికాలో ప్రవేశించడానికి వీలుండదు. సిరియన్ శరణార్థులపై నిరవధికంగా నిషేధం కొనసాగుతుంది.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : అమెరికా ట్రావెల్ బ్యాన్‌కు అనుమతి 
ఎప్పుడు : జూన్ 26
ఎవరు: అమెరికా సుప్రీంకోర్టు 
ఎందుకు : ఇరాన్, లిబియా, సోమాలియా, సూడాన్, సిరియా, యెమెన్ దేశాల నుంచి అమెరికాకు వచ్చే పౌరుల్ని అడ్డుకునేందుకు 

గూగుల్‌కు ఈయూ 2.4 బిలియన్ యూరోల జరిమానా ఆన్‌లైన్ సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్‌కు యూరోపియన్ యూనియన్ (ఈయూ) 2.4 బిలియన్ యూరో (దాదాపు రూ.17 వేల కోట్లు)ల భారీ జరిమానా విధించింది. వ్యాపార చట్టాలను ఉల్లంఘించినందుకు గాను ఈ మొత్తం చెల్లించాల్సిందిగా ఈయూ కాంపిటీషన్ చీఫ్ వెస్టగర్ జూన్ 27న ఆదేశించారు. 
గూగుల్ తమ సొంత ఉత్పత్తులను అమ్ముకోవడానికి ఇతర కంపెనీల ఉత్పత్తులను తన సెర్చ్ ఇంజన్‌లో తక్కువగా చూపించిందని.. వినియోగదారునికి పోటీ కంపెనీల వస్తువులను ఎంపిక చేసుకునే అవకాశం ఇవ్వలేదని ఈయూ పేర్కొంది. ఇది ఈయూ వ్యాపార విధానాలకు పూర్తిగా విరుద్ధమని స్పష్టం చేసింది. గూగుల్ తమ సంస్థల ఉత్పత్తులను సరిగా ప్రచారం చేయడంలేదని ఆరోపిస్తూ అమెరికాకు చెందిన స్టార్‌బర్క్స్, ఆపిల్, అమెజాన్, మెక్‌డొనాల్డ్ తదితర సంస్థలు 2010లో ఈయూను ఆశ్రయించాయి. దీనిపై విచారణ జరిపిన ఈయూ తాజాగా ఈ ఆదేశాలు జారీ చేసింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : గూగుల్‌కు 2.4 బిలియన్ యూరోల జరిమానా 
ఎప్పుడు : జూన్ 27
ఎవరు: యూరోపియన్ యూనియన్ 
ఎందుకు : ఈయూ వ్యాపార చట్టాలను ఉల్లంఘించినందుకు గాను 

ఉగ్రవాదంపై ఐటీ, సోషల్ మీడియా సంస్థల ఉమ్మడిపోరుఇంటర్నెట్‌లో ఉగ్రవాద సమాచార వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రముఖ టెక్నాలజీ, సోషల్ మీడియా సంస్థలు చేతులు కలిపాయి. ఆ మేరకు ఫేస్‌బుక్, మైక్రోసాఫ్ట్, ట్విటర్, యూట్యూబ్‌లు ‘గ్లోబల్ ఇంటర్నెట్ ఫోరం టు కౌంటర్ టైజం’ పేరిట ఒక విభాగాన్ని ఏర్పాటు చేశాయి. ఉగ్ర సమాచారంపై పోరులో ప్రస్తుతం, భవిష్యత్తులో సహకరించుకోవాల్సిన విభాగాల్ని గుర్తించడంతో పాటు, చిన్న టెక్నాలజీ కంపెనీలు, పౌర సంఘాల విభాగాలు, విద్యావేత్తలు, ప్రభుత్వాలు, ఈయూ, ఐరాస వంటి అంతర్జాతీయ విభాగాలతో కలిసి సాగేందుకు ఈ విభాగం కృషిచేస్తుంది.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : గ్లోబల్ ఇంటర్నెట్ ఫోరం టు కౌంటర్ టైజం ఏర్పాటు
ఎప్పుడు : జూన్ 27
ఎవరు: ఫేస్‌బుక్, మైక్రోసాఫ్ట్, ట్విటర్, యూట్యూబ్
ఎందుకు : ఇంటర్నెట్‌లో ఉగ్రవాద సమాచార వ్యాప్తిని అడ్డుకునేందుకు 

2100 నాటికి 200 కోట్ల శరణార్థులు వాతావరణ మార్పుల కారణంగా సముద్రమట్టాల పెరిగి 2100 నాటికి ప్రపంచ జనాభాలో 5వ వంతు అంటే దాదాపు 200 కోట్ల మంది వారి ఆవాసాలు కోల్పోనున్నారు. దీంతో వీరంతా శరణార్థులుగా మారనున్నారని ‘ల్యాండ్ యూజ్ పాలసీ’జర్నల్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనం వెల్లడించింది. సముద్ర మట్టాలు పెరిగితే తీర ప్రాంతాలు నీట మునుగుతాయని, దీంతో అక్కడ నివసిస్తున్న వారంతా ఎత్తైన ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ చార్లెస్ గీస్లర్ హెచ్చరించారు.
2100 నాటికి 1100 కోట్ల జనాభాఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం 2050 నాటికి ప్రపంచ జనాభా దాదాపు 900 కోట్లకు చేరనుంది. అదే 2100 నాటికి దాదాపు 1100 కోట్లకు చేరుకోనుంది. అయితే అంత జనాభాకు ఆహారం అందించాలంటే సారవంతమైన భూమి అవసరం. సముద్రమట్టాలు పెరిగి సారవంతమైన తీరప్రాంత భూములు, నదీ డెల్టా ప్రాంత భూములు మునిగిపోనున్నాయి. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : 2100 నాటికి 200 కోట్ల శరణార్థులు 
ఎప్పుడు : జూన్ 27
ఎవరు: ల్యాండ్ యూజ్ పాలసీ జర్నల్ 
ఎక్కడ : ప్రపంచవ్యాప్తంగా 
ఎందుకు : వాతావరణ మార్పులతో సముద్రమట్టాలు పెరగడం వల్ల

ప్రపంచంలోనే తొలి ఏటీఎంకు బంగారు సొబగులు ప్రపంచంలోనే తొలి ఏటీఎంగా గుర్తింపు పొందిన ఉత్తర లండన్‌లోని బార్క్‌లే బ్యాంక్ వద్దగల ఏటీఎం.. ప్రపంచ తొలి బంగారు ఏటీఎంగా రూపాంతరం చెంది మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఈ ఏటీఎం మిషన్ ఆవిర్భవించి అయిదు దశాబ్దాలు పూర్తి కావస్తున్న సందర్భంగా ప్రపంచంలో తొలి బంగారు ఏటీఎంగా దీన్ని మార్చివేశారు. దీంతోపాటు ఓ స్మారక ఫలకాన్ని జోడించి, వినియోగదారులకోసం రెడ్ కార్పెట్‌ను కూడా పరిచారు. 
1967, జూన్ 27న షెపెర్డ్-బారన్ మొదటి ఎటిఎమ్ (ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్) రూపొందించారు. అనంతరం ఉత్తర లండన్‌లోని బార్క్‌లే బ్యాంక్ తన మొదటి ఏటీఏం కేంద్రాన్ని ప్రారంభించింది. బ్యాంకు ఆరంభించిన ఆరింటిలో ఇది మొదటిది. బ్రిటిష్ టీవీ కామెడీ షో ‘ఆన్ ది బసెస్’లో నటించిన హాలీవుడ్ నటి రెగ్ వార్నీ ఈ ఏటీఎం నుంచి తొలిసారిగా నగదును ఉపసంహరించుకున్న వ్యక్తిగా నిలిచారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : బంగారు ఏటీఎంగా ప్రపంచంలోనే తొలి ఏటీఎం 
ఎప్పుడు : జూన్ 27
ఎక్కడ : లండన్
ఎవరు: బార్క్‌లే బ్యాంకు 
ఎందుకు : ఏటీఎం మిషన్ ఆవిర్భవించి 50 ఏళ్లు పూర్తి కావస్తున్న సందర్భంగా

యెమెన్‌లో కలరాతో 1300 మంది మృతియెమెన్‌లో కలరా అనుమానిత కేసులు రెండు లక్షలు దాటాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ, యునిసెఫ్ జూన్ 24న ప్రకటించాయి. కలరా వల్ల ఇప్పటికే 1300 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో నాలుగో వంతు మంది పిల్లలే కావడం గమనార్హం.

‘ఛాగోస్’పై మారిషస్‌కు భారత్ మద్దతుఛాగోస్ ఆర్చిపెలాగో ద్వీపంపై మారిషస్-బ్రిటన్ మధ్య ఏర్పడిన వివాదాన్ని అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) దృష్టికి తీసుకెళ్లాలనే నిర్ణయానికి భారత్ అనుకూలంగా ఓటేసింది. దీనిపై ఐరాస సర్వప్రతినిధుల సభలో జూన్ 22న ప్రవేశపెట్టిన తీర్మానం 94-15 ఓట్ల తేడాతో ఆమోదం పొందింది.

9.8 బిలియన్లకు చేరనున్న ప్రపంచ జనాభా2050 నాటికి ప్రపంచ జనాభా 9.8 బిలియన్లకు చేరుకుంటుందని ఐక్యరాజ్య సమితి జూన్ 21న విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. ప్రస్తుతం ప్రపంచ జనాభా 7.6 బిలియన్లు. వచ్చే ఏడేళ్లలో చైనా జనాభాను భారత్ అధిగమిస్తుందని నివేదిక తెలిపింది.

చైనాలో అత్యంత వేగవంతమైన బుల్లెట్ రైలుదేశీయ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన అత్యంత వేగవంతమైన బుల్లెట్ రైలు‘ఫక్సింగ్’ను చైనా జూన్ 26న ప్రారంభించింది. ఈ అత్యాధునిక రైలు గంటకు 400 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఇది బీజింగ్-షాంఘై మార్గంలో నడుస్తుంది.

జాతీయంకర్ణాటకలో రైతు రుణమాఫీ ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్‌ల కోవలో కర్ణాటక ప్రభుత్వం కూడా రైతు రుణాలను మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది. రూ.50 వేల లోపు ఉండి సహకార బ్యాంకులు, సంఘాల్లో తీసుకున్న రుణాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. జాతీయ, గ్రామీణ, ప్రైవేటు బ్యాంకుల్లో అప్పులు పొందిన రైతులకు రుణమాఫీ వర్తించదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అసెంబ్లీలో స్పష్టం చేశారు. రుణాలను రద్దు చేయడం వల్ల ఖజానాపై రూ.8,165 కోట్ల భారం పడనుంది. ఈ నెల 20 వరకు వ్యవసాయ రుణాలు తీసుకున్న 22,27,506 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : రైతు రుణాలను మాఫీ చేసిన మరో రాష్ట్రం 
ఎప్పుడు : జూన్ 21
ఎవరు: కర్ణాటక ప్రభుత్వం 
ఎందుకు : రూ. 50 వేల లోపు రుణాలకే వర్తింపు 

స్మార్ట్ సిటీల మూడో జాబితాలో 30 నగరాలు స్మార్ట్ సిటీ మిషన్‌లో భాగంగా అభివృద్ధి చేసే నగరాల 3వ జాబితాను కేంద్రం జూన్ 23న విడుదల చేసింది. పట్టణ పరివర్తన అంశంపై ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో భాగంగా కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మొత్తం 30 నగరాలతో కూడిన జాబితాను వెల్లడించింది. దీంతో ఇప్పటి దాకా ప్రకటించిన స్మార్ట్ సిటీల సంఖ్య 90కి చేరింది. తదుపరి దఫాలో 20 పట్టణాల నుంచి 10 స్మార్ట్ సిటీలను ఎంపికచేస్తామని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు తెలిపారు.
ఈ జాబితాలో కేరళ రాజధాని తిరువనంతపురం తొలిస్థానంలో, ఆ తరువాత వరుసగా ఛత్తీస్‌గఢ్‌లోని నయారాయ్‌పూర్, గుజరాత్‌లోని రాజ్‌కోట్ ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి కరీంనగర్ (తెలంగాణ), ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నగరాలకు చోటు దక్కింది. స్మార్ట్ సిటీ మిషన్ కింద ఎంపికైన నగరాలకు రూ.వెయ్యి కోట్ల అభివృద్ధి నిధులు అందుతాయి. ఇందులో కేంద్రం వాటా రూ. 500 కోట్లు కాగా రాష్ట్రం వాటా రూ.500 కోట్లు.
తాజా జాబితాలోని ఇతర పట్టణాలుపట్నా, ముజఫర్‌పూర్, పుదుచ్చేరి, గాంధీనగర్, శ్రీనగర్, సాగర్, కర్నల్, సాత్నా, బెంగళూరు, షిమ్లా, డెహ్రాడూన్, తిరుప్తూపర్, పింప్రిచించ్వాడ్, బిలాస్‌పూర్, పాసీఘా ట్, జమ్మూ, దాహోద్, తిరునల్వేలి, తూతుక్కుడి, తిరుచిరాపల్లి, ఝాన్సీ, ఐజ్వాల్, అలహాబాద్, అలీగఢ్, గ్యాంగ్‌టక్.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : స్మార్ట్ సిటీల 3వ జాబితా విడుదల
ఎప్పుడు : జూన్ 23 
ఎవరు: కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ 

భారత్ - పోర్చుగల్ మధ్య 11 ఒప్పందాలు మూడు దేశాల(పోర్చుగల్, అమెరికా, నెదర్లాండ్స్)పర్యటనలో భాగంగా జూన్ 24న పోర్చుగల్ చేరుకున్న భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. ఆ దేశ ప్రధాని ఆంటోనియో కోస్టాతో అంతరిక్షం, పర్యావరణంతో పాటుగా ఉగ్రవాద వ్యతిరేక అంశాలపై విసృ్తతంగా చర్చలు జరిపారు. అనంతరం శాస్త్ర, సాంకేతిక రంగంలో పరిశోధనలు జరిపేందుకు 4 మిలియన్ యూరోల (దాదాపు రూ.28.8 కోట్లు)తో సంయుక్త నిధిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీంతో పాటుగా ఇరుదేశాల మధ్య 11 ద్వైపాక్షిక ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ఐరాసలో భారత శాశ్వత సభ్యత్వానికి సంపూర్ణ మద్దతుంటుందని ఆంటోనియో వెల్లడించారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : భారత్ - పోర్చుగల్ మధ్య 11 ఒప్పందాలు 
ఎప్పుడు : జూన్ 24
ఎవరు: మోదీ - ఆంటోనియో కోస్టా
ఎక్కడ : పోర్చుగల్
ఎందుకు : మోదీ పోర్చుగల్ పర్యటనలో భాగంగా 

ఉగ్రవాదంపై అమెరికా-భారత్ సంయుక్త పోరాటం అమెరికా పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో జూన్ 26న ద్వైపాక్షిక చర్చలు జరిపారు. మానవాళికి సవాలుగా మారిన ఉగ్రవాదాన్ని అంతం చేయటంతోపాటు పలు ద్వైపాక్షిక అంశాల్లో మరింత పరస్పర సహకారంతో ముందుకెళ్లాలని ఇరువురు నేతలు నిర్ణయించారు. అనంతరం ఇద్దరు నేతలు సంయుక్త ప్రకటన చేశారు. 
ఉగ్రవాదంపై పోరులో..ముంబై దాడులు, పఠాన్‌కోట్ ఘటనలో దోషులపై పాకిస్తాన్ కఠినంగా వ్యవహరించాలని, ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వటాన్ని మానుకోవాలని ఈ ప్రకటన ద్వారా హెచ్చరించారు. దీంతో పాటుగా వాణిజ్యం,ఆర్థికాభివృద్ధితోపాటు రక్షణ, భద్రత రంగాల్లో వ్యూహాత్మక ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వంతోపాటు ఎన్‌ఎస్‌జీ, వాసెనార్, ఆస్ట్రేలియా గ్రూపుల్లో భారత సభ్యత్వానికి తమ సంపూర్ణ మద్దతుంటుందని ట్రంప్ స్పష్టం చేశారు.
అఫ్గానిస్తాన్‌లో శాంతిస్థాపనకై ఉగ్రవాదం వల్ల అఫ్గానిస్తాన్‌లో నెలకొన్న అస్థిరతపైనా మోదీ, ట్రంప్ చర్చించారు. ఆ దేశంలో శాంతి, స్థిరత్వం వచ్చేందుకు కలిసి కృషి చేయాలని నిర్ణయించారు. అఫ్గాన్‌లో ప్రజాస్వామ్యం, స్థిరత్వం, భద్రతను పరిరక్షించేందుకు భారత్ తీసుకుంటున్న చొరవనూ ట్రంప్ ప్రశంసించారు. భారత ‘థింక్ వెస్ట్’ విధానానికి అనుగుణంగా మధ్యప్రాచ్యంలో దౌత్యపరమైన చర్చలు జరిపి ఆయా దేశాల మధ్య ఉన్న సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలని కూడా నిర్ణయించారు. ఇటీవల ఉత్తరకొరియా చేపడుతున్న విధ్వంసక క్షిపణుల ప్రయోగాలు సవాలుగా మారాయని ట్రంప్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉ.కొరియాపై ఆంక్షలు విధించే విషయంలో అమెరికాకు మద్దతు తెలిపిన భారత్‌కు ట్రంప్ కృతజ్ఞతలు తెలిపారు.
వ్యూహాత్మక భాగస్వామ్యాలుభారత్‌కు అమెరికా ప్రధాన రక్షణ భాగస్వామిగా గుర్తింపు దిశగా మరింత సహకారం అందించుకోవాలని నిర్ణయించారు. అత్యాధునిక రక్షణ పరికరాలు, సాంకేతికతను అందిపుచ్చుకోవటంలో అమెరికాకు అత్యంత సన్నిహితంగా ఉన్న దేశాలతో కలిసి పనిచేయనున్నారు. ఇందులో భాగంగానే సముద్రనిఘా కోసం 20 మానవరహిత వాయు భద్రత వ్యవస్థ (గార్డియన్ డ్రోన్‌‌స) ను భారత్‌కు అమ్మాలని నిర్ణయించింది. సముద్రతీరంలో భద్రత కోసం ‘వైట్ షిప్పింగ్’డేటాను మార్పిడి చేసుకోవాలని కూడా మోదీ-ట్రంప్ నిర్ణయించారు. దీని ద్వారా సముద్రతీరంలో సంయుక్తంగా భద్రతను పర్యవేక్షించేందుకు వీలుంటుంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ప్రధాని మోదీ చర్చలు 
ఎప్పుడు : జూన్ 26
ఎక్కడ : వాషింగ్టన్
ఎందుకు : ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో భాగంగా

భారత్ - నెదర్లాండ్స్ మధ్య 3 ఒప్పందాలు అమెరికా పర్యటన తర్వాత జూన్ 27న ఐరోపా దేశం నెదర్లాండ్స్ చేరుకున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ.. ఆ దేశ ప్రధాని మార్క్ రూట్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సామాజిక భద్రత, నీటి సహకారం, సంస్కృతీ సహకారాలకు సంబంధించిన 3 అవగాహనా ఒప్పందాలపై ఇరువురు సంతకాలు చేశారు. భారత్‌కు క్షిపణి సాంకేతిక నియంత్రణ వ్యవస్థ(ఎంటీసీఆర్)లో సభ్యత్వం దక్కడంలో మద్దతు ఇచ్చినందుకు నెదర్లాండ్‌‌సకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. తర్వాత మోదీ డచ్ కంపెనీల సీఈవోలతో సమావేశమై తమ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలతో భారత్‌లో వ్యాపారం చేయడం సులభమైందన్నారు. భారత్‌లో వాణిజ్య ప్రమాణాలు ప్రపంచ దేశాలతో సమానంగా ఉన్నాయన్నారు.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : భారత్ - నెదర్లాండ్స్ మధ్య 3 ఒప్పందాలు 
ఎప్పుడు : జూన్ 27
ఎవరు: ప్రధాని మోదీ - నెదర్లాండ్స్ ప్రధాని మార్క్ రూట్
ఎక్కడ : నెదర్లాండ్స్ 

మహారాష్ట్రలో 34 వేల కోట్ల రుణమాఫీకరువు, పంటలకు గిట్టుబాటు ధరలేక అల్లాడుతున్న మహారాష్ట్ర రైతుల కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం రూ.34,020 కోట్ల భారీ రైతు రుణమాఫీ పథకాన్ని ప్రకటించింది. దీనివల్ల 89 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. రూ.1.5 లక్షల వరకు ఉన్న రుణాలు రద్దు కానున్నాయి. ‘ఛత్రపతి శివాజీ మహరాజ్ కృషి సమ్మాన్ యోజన’గా నామకరణం చేసిన ఈ పథకాన్ని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ జూన్ 24న ప్రకటించారు. పథకంతో 40 లక్షల మంది రైతులకు అప్పుల నుంచి పూర్తి విముక్తి, మరో 49 లక్షల మందికి కొంత ఉపశమనం కలగనుంది. దేశంలో ఒక రాష్ట్రం ఇంత పెద్ద రైతు రుణమాఫీ పథకాన్ని ప్రకటించడం ఇదే తొలిసారి అని ఫడ్నవిస్ తెలిపారు. దీని కోసం రాష్ట్రంలోని అధికార బీజేపీ మంత్రులు, ఎమ్మెల్యేలందరూ ఒక నెల జీతాన్ని అందిస్తారని వెల్లడించారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : మహారాష్ట్రలో రూ.34 వేల కోట్ల రుణమాఫీ
ఎప్పుడు : జూన్ 25
ఎవరు: సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ 
ఎందుకు : రైతులను ఆదుకునేందుకు 

మన్‌కీబాత్‌లో విజయనగరం జిల్లాకు ప్రధాని ప్రశంసలు మన్‌కీబాత్ కార్యక్రమంలో జూన్ 24న రేడియోలో ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ.. ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛభారత్ కార్యక్రమం ఇప్పుడు ఓ ప్రజా ఉద్యమంలా మారిందని సంతోషం వ్యక్తం చేశారు. ఇందుకు ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాను ఉదహరించారు. స్థానిక ప్రజల భాగస్వామ్యంతో అధికారులు జిల్లాలోని 71 గ్రామాల్లో 100 గంటలు నిర్విరామంగా శ్రమించి 10 వేల మరుగు దొడ్లను నిర్మించారని ప్రశంసించారు. వీటి నిర్మాణం వల్ల 71 గ్రామాలు బహిరంగ మలవిసర్జన రహితంగా మారాయన్నారు. అలాగే.. ముస్లింల ప్రాబల్యం ఉన్న ఉత్తరప్రదేశ్ బిజనౌర్ జిల్లాలో 3,500 కుటుంబాలున్న ముబారక్‌పూర్ గ్రామ ప్రజలంతా కలసి రంజాన్ సందర్భంగా మరుగుదొడ్డి నిర్మించారని మోదీ కొనియాడారు. 
మదురై మహిళ సాధికారత..‘గవర్నమెంట్ ఈ-మార్కెట్‌ప్లేస్’ ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా వస్తువులు అమ్ముతున్నానంటూ తమిళనాడు మదురైకి చెందిన ఓ మహిళ రాసిన ఉత్తరాన్ని ప్రధాని ప్రస్తావించారు. మహిళా సాధికారతకు ఇది నిదర్శనమని, ఆమె నుంచి ప్రధాని కార్యాలయం కూడా రెండు వస్తువులు కొనుగోలు చేసిందని మోదీ చెప్పారు.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : మన్‌కీబాత్
ఎప్పుడు : జూన్ 25
ఎవరు: ప్రధాని నరేంద్ర మోదీ 
ఎందుకు : స్వచ్ఛభారత్ అమలులో విజయనగరం జిల్లాకు ప్రశంస

జాతీయ విద్యా విధానంపై కమిటీజాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ)పై కసరత్తు చేసేందుకు అంతరిక్ష శాస్త్రవేత్త, ఇస్రో మాజీ చీఫ్ కృష్ణస్వామి కస్తూరి రంగన్ నేతృత్వంలో తొమ్మిది మందితో కూడిన కమిటీని కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది. భారత విద్యా విధానానికి కొత్తరూపు తీసుకొచ్చే నిర్ణయంలో భాగంగా ప్రముఖ విద్యావేత్తలు, నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసినట్లు హెచ్‌ఆర్డీ మంత్రిత్వ శాఖ జూన్ 26న ప్రకటించింది. 
జాతీయ విద్యా విధానంపై కొన్నేళ్ల కిందట టీఎస్‌ఆర్ సుబ్రమణియన్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ 2016లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : కృష్ణస్వామి కస్తూరిరంగన్ నేతృత్వంలో జాతీయ విద్యా విధానంపై కమిటీ 
ఎప్పుడు : జూన్ 26
ఎవరు: కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ
ఎందుకు : విద్యా విధానంలో చేపట్టాల్సిన మార్పులపై అధ్యయనం కోసం

దేశీయ తేలియాడే డాక్ ప్రారంభంనౌకా దళం కోసం తొలిసారిగా దేశీయంగా నిర్మించిన తేలియాడే డాక్ (ఎఫ్‌డీఎన్-2)ను జూన్ 20న చెన్నైలో ప్రారంభించారు. ఎల్ అండ్ టీ సంస్థనిర్మించిన ఈ డాక్ పొడవు 185 మీటర్లు కాగా, వెడల్పు 40 మీటర్లు. ఇది అన్ని రకాల నౌకల మరమ్మతులకు అనుకూలంగా ఉంటుంది. దీన్ని అండమాన్ నికోబార్‌లో ఉంచనున్నారు. ఇప్పటికే ఇలాంటిదొకటి చెన్నైలో ఉంది. 

ఉదయ్ ర్యాంకింగ్స్‌లో గుజరాత్ టాప్ ఉజ్వల్ డిస్కం అష్యూరెన్స్ యోజన (ఉదయ్) పథకం సంస్కరణల అమల్లో గుజరాత్ మొదటి స్థానంలో నిలిచింది. కర్ణాటక, మహారాష్ట్ర, పుదుచ్చేరి తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

వజ్ర విధానం ప్రారంభంఅంతర్జాతీయ స్థాయి శాస్త్రవేత్తలను ఆకర్షించేందుకు కేంద్ర ప్రభుత్వం జూన్ 22న వజ్ర(విజిటింగ్ అడ్వాన్స్‌డ్ జాయింట్ రీసెర్చ్) అనే కొత్త విధానాన్ని ప్రారంభించింది. కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి హర్షవర్ధన్ దీనికి సంబంధించిన వెబ్‌పోర్టల్‌ను ఆవిష్కరించారు.

రాష్ట్రీయంతెలంగాణ పోలీస్‌కు ‘పాస్‌పోర్టు’ పురస్కారం పాస్‌పోర్టు వెరిఫికేషన్‌లో పాటిస్తున్న ప్రక్రియకుగాను తెలంగాణ పోలీస్ శాఖ పాస్‌పోర్ట్ సేవాదివాస్ పురస్కారానికి ఎంపికైంది. ఈ మేరకు జూన్ 24న పాస్‌పోర్టు దివాస్‌ను పురస్కరించుకొని ఢిల్లీలో జూన్ 23న నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర పోలీస్ శాఖ తరపున హైదరాబాద్ కమిషనర్ మహేందర్‌రెడ్డి ఈ పురస్కారాన్ని అందుకున్నారు. 
2016లో ఫిక్కీ సైతం పాస్‌పోర్టు వెరిఫికేషన్‌లో హైదరాబాద్ పోలీసులు తీసుకొచ్చిన వెరిఫాస్ట్ అప్లికేషన్‌కు అవార్డు ప్రదానం చేసింది. పాస్‌పోర్టు దరఖాస్తులను పోలీసులు వారం రోజుల్లోనే వెరిఫికేషన్ చేస్తున్నట్టు డీజీపీ కార్యాలయం తెలిపింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : తెలంగాణ పోలీసు శాఖకు పాస్‌పోర్టు పురస్కారం 
ఎప్పుడు : జూన్ 23
ఎవరు: కేంద్ర ప్రభుత్వం 
ఎక్కడ : న్యూఢిల్లీలో 
ఎందుకు : పాస్‌పోర్ట్ వెరిఫికేషన్‌లో నూతన పద్ధతులు అవలంబిస్తున్నందుకు 

ఏపీ పోలీస్‌కు పాస్‌పోర్ట్ అవార్డుపాస్‌పోర్ట్ వెరిఫికేషన్ సేవల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే తొలి స్థానంలో నిలిచింది. జూన్ 23న ఢిల్లీలో జరిగిన పాస్‌పోర్ట్ దివస్ కార్యక్రమంలో కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ చేతుల మీదుగా రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఏడీజీ ఏబీ వెంకటేశ్వరరావు ఈ అవార్డు అందుకున్నారు. పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ ప్రక్రియను ఆన్‌లైన్ ద్వారా చేపట్టి త్వరగా పూర్తి చేస్తున్నందుకు గాను రాష్ట్రానికి ఈ అవార్డు దక్కింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ సేవల్లో ఏపీకి తొలిస్థానం 
ఎప్పుడు : జూన్ 23 
ఎవరు: కేంద్ర విదేశాంగ శాఖ
ఎక్కడ : ఢిల్లీలో 
ఎందుకు : ఆన్‌లైన్ ద్వారా పాస్‌పోర్ట్ వెరిఫికేషన్‌ను త్వరగా పూర్తి చేస్తున్నందుకు 

నేతన్నకు చేయూత పథకం ప్రారంభంచేనేత కార్మికులకు ఆర్థిక, సామాజిక భరోసా కల్పించడానికి త్రిఫ్ట్ ఫండ్ పథకాన్ని (పొదుపు నిధి) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ మేరకు జూన్ 24న యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో జరిగిన కార్యక్రమంలో ‘నేతన్నకు చేయూత’ కొత్త పథకాన్ని మంత్రి కె.తారక రామారావు ప్రారంభించారు. పథకం వల్ల రాష్ట్రంలో 30 వేల మంది చేనేత కార్మికులకు ప్రయోజనం కలగనుంది. 50 శాతం సబ్సిడీపై నూలు, రంగులు, రసాయనాలు అందజేస్తారు. 18 ఏళ్లు నిండి చేనేత వృత్తిపై ఆధారపడిన ఎవరైనా పథకంలో చేరవచ్చు. కార్మికుడు వేతనంలో 8 శాతం చెల్లిస్తే ప్రభుత్వం 16 శాతాన్ని మ్యాచింగ్ గ్రాంటుగా అతడి ఖాతాకు జమ చేస్తుంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : నేతన్నకు చేయూత పథకం ప్రారంభం
ఎప్పుడు : జూన్ 24
ఎవరు: తెలంగాణ ప్రభుత్వం
ఎక్కడ : భూదాన్ పోచంపల్లి, యాదాద్రి జిల్లా
ఎందుకు : చేనేత కార్మికులకు ఆర్థిక, సామాజిక భరోసా కల్పించేందుకు 

తెలంగాణ సారస్వత పరిషత్ అధ్యక్షుడిగా శివారెడ్డితెలంగాణ సారస్వత పరిషత్ అధ్యక్షుడిగా తెలుగు విశ్వవిద్యాలయం మాజీ వైస్ చాన్‌‌సలర్, ప్రముఖ సాహితీవేత్త ఆచార్య ఎల్లూరి శివారెడ్డి ఎన్నికయ్యారు. 24 ఏళ్లుగా పరిషత్‌కు అధ్యక్షుడిగా వ్యవహరించిన జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత డాక్టర్ సి.నారాయణరెడ్డి ఇటీవల మరణించడంతో ఆయన స్థానంలో శివారెడ్డి ఎన్నికయ్యారు. ఇప్పటివరకు పరిషత్ ట్రస్టు కార్యదర్శిగా కొనసాగిన శివారెడ్డి ఆ స్థానానికి రాజీనామా చేశారు. ప్రస్తుతం పరిషత్ ప్రధాన కార్యదర్శిగా ఉన్న డాక్టర్ జె.చెన్నయ్య ట్రస్టు కార్యదర్శిగా కూడా కొనసాగేలా నిర్ణయం తీసుకున్నారు.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : సారస్వత పరిషత్‌కు నూతన అధ్యక్షుడు
ఎప్పుడు : జూన్ 24
ఎవరు: ఎల్లూరి శివారెడ్డి
ఎక్కడ : తెలంగాణ 

వాసాల నర్సయ్యకు కేంద్ర బాలసాహిత్య అవార్డుతెలంగాణకు చెందిన ప్రముఖ బాలసాహితీవేత్త వాసాల నర్సయ్య కేంద్ర సాహిత్య అకాడమీ అందించే బాలసాహిత్య పురస్కారానికి ఎంపికయ్యారు. 45 ఏళ్లుగా బాలసాహిత్యంలో నర్సయ్య చూపుతున్న ప్రతిభను గుర్తించి 2017 సంవత్సరానికిగాను ఆయనను ఎంపిక చేసినట్లు కేంద్ర సాహిత్య అకాడమీ జూన్ 22న ప్రకటించింది. నర్సయ్య జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం చౌలమద్దికి చెందినవాడు. అలాగే నల్లగొండకు చెందిన మెర్సీ మార్గరెట్ రచించిన ‘మాటల మడుగు’ కవిత్వం యువ పురస్కార్‌కు ఎంపికై ంది. వీరికి నవంబర్ 14 బాలల దినోత్సవం రోజున న్యూఢిల్లీలో జరిగే కార్యక్రమంలో పురస్కారంతోపాటు రూ.50 వేల నగదు అందజేయనున్నారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : కేంద్ర బాలసాహిత్య అవార్డు - 2017
ఎప్పుడు : జూన్ 22
ఎవరు: వాసాల నర్సయ్య 
ఎందుకు : బాలసాహిత్యంలో చూపుతున్న ప్రతిభకుగాను 

గన్నవరం ఎయిర్‌పోర్ట్ అంతర్జాతీయ హోదాకు నోటిఫికేషన్ విజయవాడ గన్నవరం విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా గుర్తించిన కేంద్రం జూన్ 22న అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. గతంలోనే కేంద్ర క్యాబినెట్ గన్నవరం విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా కల్పించేందుకు ఆమోదం తెలిపింది. ఇప్పుడు అధికారికంగా గెజిట్ విడుదల చేసిన ప్రభుత్వం ఆగస్టు 8వ తేదీ నుంచి అంతర్జాతీయ సేవలు ప్రారంభమవుతాయని పేర్కొంది. అలాగే తిరుపతి విమానాశ్రయానికి కూడా అంతర్జాతీయ హోదా కల్పిస్తూ అధికారికంగా గెజిట్ వెలువరించింది.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : గన్నవరం, తిరుపతి విమానాశ్రయాలకు అంతర్జాతీయ హోదా 
ఎప్పుడు : జూన్ 22 
ఎవరు: కేంద్ర ప్రభుత్వం 
ఎందుకు : హోదా ఇస్తూ గెజిట్ జారీ 

సీసీఎంబీలో అటల్ ఇన్నోవేషన్ సెంటర్సృజనాత్మకతను ప్రోత్సాహించే లక్ష్యంతో నీతి ఆయోగ్ ఏర్పాటు చేస్తున్న అటల్ ఇన్నోవేషన్ సెంటర్‌గా హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) ఎంపికైంది. సంస్థ డెరైక్టర్ డాక్టర్ రాకేశ్ కుమార్ మిశ్రా జూన్ 22న ఈ విషయాన్ని తెలిపారు. వినూత్నమైన ఆలోచనలతో ముందుకొచ్చే ఔత్సాహికులకు సీసీఎంబీలో సౌకర్యాలన్నీ అందుబాటులోకి తేవడం, తద్వారా సామాజిక ప్రయోజనాలున్న ఉత్పత్తి లేదా సేవగా అభివృద్ధి చేసేందుకు ఈ కేంద్రం ప్రయత్నిస్తుందని ఆయన వివరించారు. 
ప్రభుత్వ, ప్రైవేట్ రంగానికి చెందిన దాదాపు 3,780 సంస్థలు ఈ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తు చేయగా నీతి ఆయోగ్ పదింటిని ఎంపిక చేసింది. ఇందులో సీసీఎంబీ ఒకటి. ఈ కేంద్రంలో బయోటెక్నాలజీ ఆధారిత స్టార్టప్‌లకు అవకాశం కల్పిస్తారు. దీని కోసం నీతి ఆయోగ్ ఏడాదికి గరిష్టంగా రూ.పది కోట్ల వంతున ఐదేళ్లపాటు నిధులు అందిస్తుంది. ఆ తరువాత సంస్థ తనంతట తానే మనుగడ సాగించాలి. కాగా సీసీఎంబీలో ఇప్పటికే ఇలాంటి ఇన్‌క్యుబేషన్ కేంద్రం ఒకటి పనిచేస్తోంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : అటల్ ఇన్నోవేషన్ సెంటర్ 
ఎప్పుడు : జూన్ 22
ఎవరు: కేంద్ర ప్రభుత్వం 
ఎక్కడ : ీససీఎంబీ, హైదరాబాద్ 
ఎందుకు : బయోటెక్నాలజీ ఆధారిత స్టార్టప్‌లకు అవకాశం కల్పించేందుకు 

తెలంగాణ రుణ ప్రణాళిక రూ. 1.14 లక్షల కోట్లు2017-18లో పలు రంగాలకు రూ.1,14,353 కోట్ల మేర రుణాలివ్వాలని తెలంగాణ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) నిర్ణయించింది. ఈ మేరకు జూన్ 23న ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో మంత్రులు ఈటల రాజేందర్, పోచారం శ్రీనివాసరెడ్డి వార్షిక ప్రణాళికను విడుదల చేశారు. ఇందులో సగం, అంటే రూ.54,198 కోట్లు వ్యవసాయ రుణాలే. 
ఖరీఫ్, రబీ సీజన్లలో రూ.39,752 కోట్ల పంట రుణాలివ్వాలని ఎస్‌ఎల్‌బీసీ లక్ష్యంగా పేర్కొనగా ఇందులో ఖరీఫ్‌కు రూ.23,851 కోట్లు, రబీకి రూ.15,901 కోట్లివ్వనున్నారు. దీర్ఘకాలిక వ్యవసాయ రుణాలు రూ.14,446 కోట్లు కాగా చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రూ.16,465 కోట్లు, విద్యా రుణాలు రూ.1,663 కోట్లు, గృహ రుణాలకు రూ.3,885 కోట్లు కేటాయించారు.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : తెలంగాణ రుణ ప్రణాళిక రూ. 1,14,353 కోట్లు
ఎప్పుడు : 2017-18కి
ఎవరు: ఎస్‌ఎల్‌బీసీ 
ఎక్కడ : తెలంగాణలో 
ఎందుకు : వ్యవసాయ, పారిశ్రామిక, విద్య రుణాల కోసం

పట్టణ సంస్కరణలో ఏపీకి తొలిస్థానం 2016-17 పట్టణ సంస్కరణల్లో ఆంధ్రప్రదేశ్ తొలి స్థానంలో నిలిచింది. జూన్ 23న ఢిల్లీలో జరిగిన పట్టణ పరివర్తన జాతీయ సదస్సులో భాగంగా పట్టణ సంస్కరణలు చేపట్టిన 16 రాష్ట్రాలకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ప్రోత్సాహకాలు అందించింది. అమృత్ పథకంలో భాగంగా ఈ-గవర్నెన్‌‌స, ఆడిటింగ్, ఇంధన, నీటి ఆడిట్, తదితర అంశాలను పరిశీలించి రాష్ట్రాలకు మార్కులు ఇచ్చింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ అత్యధిక మార్కులు సాధించింది. తెలంగాణ ఆరో స్థానంలో నిలిచింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : పట్టణ సంస్కరణల్లో ఆంధ్రప్రదేశ్‌కు తొలిస్థానం 
ఎప్పుడు : జూన్ 23
ఎవరు: కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ
ఎందుకు : అమృత్ పథకంలో భాగంగా 

ఏపీ మెట్రో రైలుకు బీఓఐ 500 కోట్ల రుణం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్(ఏఎంఆర్‌సీ)కు రూ.500 కోట్ల రుణం ఇచ్చేందుకు బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీఓఐ) అంగీకారం తెలిపింది. మెట్రో ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ.1,859 కోట్లు భరించాల్సి ఉంది. అయితే ఈ సొమ్మును బ్యాంకుల నుంచి రుణాలుగా తీసుకోవాలని గతంలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అధికారులు పలు బ్యాంకులతో చర్చలు జరపగా బ్యాంక్ ఆఫ్ ఇండియా రుణం ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : అమరావతి మెట్రోకు రూ. 500 కోట్ల రుణం 
ఎప్పుడు : జూన్ 25
ఎవరు: బ్యాంక్ ఆఫ్ ఇండియా 
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్‌లో 

తెలంగాణలో సినిమా టికెట్ల ధరల పెంపు సినిమా థియేటర్లలో టికెట్ ధరలను పెంచుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జూన్ 26న ఉత్తర్వులు జారీ చేసింది. కనిష్టంగా రూ.10 నుంచి రూ.20 వరకు ధరలు పెంచింది. 

  • జీహెచ్‌ఎంసీ పరిధిలో ఏసీ సినిమా థియేటర్‌లో బాల్కనీ టికెట్ ధర రూ.120. కింది క్లాసు రూ.40. నాన్ ఏసీ బాల్కనీ రూ.60, లోయర్ క్లాస్ రూ.20.
  • మున్సిపాలిటీల్లో ఏసీ థియేటర్లలో బాల్కనీ రూ.80. లోయర్ క్లాసు రూ.30. నాన్ ఏసీలో బాల్కనీ రూ.60. లోయర్ క్లాస్ రూ.20.
  • గ్రామ పంచాయతీల్లోని ఏసీ థియేటర్‌లో బాల్కనీ ధర రూ.70. లోయర్ క్లాస్ రూ.20.
  • థియేటర్ల ఆధునీకరణ ఖర్చులకు రూ.2 నుంచి రూ.7 పెంచుకునే అవకాశం.

మహిళా ఖైదీల పెట్రోల్ బంకు ప్రారంభందేశంలోనే తొలిసారిగా మహిళా ఖైదీలు నిర్వహించే పెట్రోల్ బంకును హైదరాబాద్‌లోని చంచల్‌గూడ సెంట్రల్ జైల్ ప్రాంగణంలో జూన్ 23న ప్రారంభించారు. మహా పరివర్తన పేరుతో జైళ్లల్లో అమలుచేస్తున్న సంస్కరణల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఈ బంకును ప్రారంభించింది.

ఆర్థికంఅంతర్జాతీయ బానిసత్వ సూచీ - 2016 2016 నాటికి భారత్‌లో ‘ఆధునిక బానిసత్వం’లో మగ్గుతున్న వారి సంఖ్య 1.83 కోట్లని వాక్ ఫ్రీ ఫౌండేషన్ అనే సంస్థ రూపొందించిన అంతర్జాతీయ బానిసత్వ సూచీ - 2016 వెల్లడించింది. 2014 నుంచి ఈ సంఖ్య 41 లక్షలు పెరిగిందని.. గత రెండేళ్లలో ప్రతి రోజూ 5,616 మంది భారతీయులు బానిసలుగా మారారని తెలిపింది.
నివేదిక ముఖ్యాంశాలు

  • 2014 నాటికి బానిసత్వ పరిస్థితుల్లో జీవిస్తున్న ప్రజల సంఖ్య విషయంలో భారత్ ప్రపంచంలోనే నాలుగో స్థానంలో ఉంది. ఉత్తరకొరియా, ఉజ్‌బెకిస్థాన్, కాంబోడియా మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి.
  • ఆధునిక బానిసత్వం విషయంలో భారత్ ఐదో స్థానంలో ఉంది. ఆసియా పసిఫిక్ రీజియన్‌లోనే అతి ఎక్కువ మంది ప్రజలు ఈ మోడరన్ స్లేవరీలో మగ్గుతున్నారు.
  • ఆసియా పసిఫిక్ ప్రాంతంలోనే 46 శాతం మానవ అక్రమ రవాణా కేసులు నమోదు అవుతున్నాయి. ఇందులో 83 శాతం మంది మగవారు కాగా, 17 శాతం మంది ఆడవారు.
  • బలవంతపు లేదా బాల్య వివాహాలు భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్, ఇండోనేసియాలోనే అత్యధికం.
  • దేశంలో సగటున ప్రతి వంద మందిలో 51 మంది వెట్టి కార్మికులుగా, బలవంతపు బిచ్చగాళ్లుగా, బలవంతపు పెళ్లిళ్లు, కమర్షియల్ సెక్స్ వర్కర్లుగా మారుతున్నారు.

స్కిల్ ఇండియాకు ప్రపంచ బ్యాంకు రుణంయువతలో నైపుణ్యాభివృద్ధిని పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్కిల్ ఇండియా పథకానికి రూ.1,600 (250 మిలియన్ డాలర్లు) కోట్ల రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకు అంగీకరించింది. రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయిలోనూ స్వల్పకాలిక స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్ (3-12 నెలలు లేదా 600 గంటలు)కు ప్రోత్సాహం అందించేందుకు ఈ సాయం ఉపయోగపడుతుందని ప్రపంచ బ్యాంకు పేర్కొంది. ఆరేళ్ల కాలపరిమితి కలిగిన ఈ కార్యక్రమం పూర్తయ్యే నాటికి 88 లక్షల మంది యువత నైపుణ్య శిక్షణ పూర్తి చేసుకుని.. మెరుగైన అవకాశాలను.. మెరుగైన వేతనాన్ని పొందుతారని అంచనా వేసింది. 
కాగా, 2022 నాటికి దేశంలోని 24 కీలక రంగాల్లో 10.9 కోట్ల మంది నైపుణ్యం కలిగిన కార్మికుల అవసరం ఉంటుందని అధికార గణాంకాలు అంచనా వేస్తున్నాయి.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : స్కిల్ ఇండియాకు రూ.1,600 కోట్ల రుణం 
ఎప్పుడు : జూన్ 26
ఎవరు: ప్రపంచ బ్యాంకు 
ఎక్కడ : భారత్‌లో 
ఎందుకు : యువతకు నైపుణ్య శిక్షణ కార్యక్రమాల అమలుకు 

అమెరికా మహిళల క్రికెట్ జట్టులో తెలంగాణ అమ్మాయిఅమెరికా మహిళల క్రికెట్ జట్టులో తెలంగాణ రాష్ట్రానికి చెందిన సింధూజ రెడ్డి చోటు దక్కించుకుంది. ఇటీవలే ఐసీసీ గుర్తింపు పొందిన ఈ జట్టులో సింధూజ వికెట్ కీపర్‌గా వ్యవహరించనుంది. ఆగస్టులో స్కాట్లాండ్‌లో జరిగే 2020 ప్రపంచకప్ టి20 క్వాలిఫయింగ్ టోర్నమెంట్‌లో ఆమె అమెరికా జట్టుకు ప్రాతినిధ్యం వహించనుంది. గతంలో సింధూజ హైదరాబాద్ మహిళల అండర్-19 జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించింది. ఇటీవలే వివాహం చేసుకున్న ఆమె అమెరికాలో నివసిస్తోంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : అమెరికా మహిళల క్రికెట్ జట్టులో తెలంగాణ అమ్మాయి 
ఎప్పుడు : జూన్ 27
ఎవరు: సింధూజ రెడ్డి 

ఏపీలో వంద కోట్లతో ఎంఎస్‌ఎంఈ కార్పొరేషన్ఆంధ్రప్రదేశ్‌లో వంద కోట్ల రూపాయల నిధితో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. జూన్ 27న ప్రపంచ ఎంఎస్‌ఎంఈ దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. కార్పొరేషన్ లోగోను ఆవిష్కరించారు. అమరావతిలో ఎంఎస్‌ఎంఈ కార్పొరేట్ భవన నిర్మాణానికి 15 ఎకరాలు కేటాయిస్తామని.. పరిశ్రమలకు విద్యుత్ ఛార్జీలు ఇక పెంచబోమని, అవసరమైతే తగ్గిస్తామని చెప్పారు.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : రూ. వంద కోట్లతో ఎంఎస్‌ఎంఈ కార్పొరేషన్ 
ఎప్పుడు : జూన్ 27
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్‌లో 
ఎవరు: ఏపీ సీఎం చంద్రబాబు 
ఎందుకు : సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి కోసం 

సైన్స్ అండ్ టెక్నాలజీకార్టోశాట్ - 2ఈని కక్ష్యలో ప్రవేశపెట్టిన ఇస్రో  ఒకే ప్రయోగంలో బహుళ ఉపగ్రహాలను అంతరిక్షంలో ప్రవేశపెట్టే ప్రక్రియను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరోసారి విజయంవంతంగా పూర్తి చేసింది. ఈ మేరకు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి జూన్ 23న పీఎస్‌ఎల్‌వీ సీ38 ద్వారా మొత్తం 31 ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఇందులో రెండు మనదేశానికి చెందినవి. వీటిలో ఒకటి 712 కిలోల బరువు కలిగిన కార్టోశాట్-2ఈ ఉపగ్రహం కాగా మరొకటి తమిళనాడు కన్యాకుమారిలోని నూరుల్ ఇస్లాం యూనివర్సిటీ (ఎన్‌ఐయూఎస్‌ఏటీ)కి చెందిన విద్యార్థులు అభివృద్ధి చేసిన చిన్న ఉపగ్రహం.
మిగిలిన 29 ఉపగ్రహాలు 14 దేశాలకు చెందినవి.పీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో ఇది 40వ ప్రయోగం కాగా, ఎక్సెల్ స్ట్రాపాన్ బూస్టర్ల ప్రయోగంలో 17వ ప్రయోగం. మొత్తంగా ఇస్రో ప్రయోగాల్లో ఇది రెండో అతిపెద్ద ప్రయోగం. 2017 ఫిబ్రవరి 15 పీఎస్‌ఎల్‌వీ సీ37 ద్వారా ఇస్రో 104 ఉపగ్రహాలను అంతరిక్షంలో విజయవంతంగా ప్రవేశపెట్టింది. 
పీఎస్‌ఎల్‌వీ సీ38 పేలోడ్స్: వాహకనౌక పేలోడ్ - 955 కేజీలు.
మొత్తం ఉపగ్రహాలు:
 31
భారత ఉపగ్రహాలు 

  1. కార్టోశాట్ - 2ఈ. బరువు - 712 కేజీలు.
  2. ఎన్‌ఐయూఎస్‌ఏటీ తయారు చేసిన చిన్న ఉపగ్రహం. బరువు - 15 కేజీలు
విదేశీ ఉపగ్రహాలు - 29. ఇందులో 10 అమెరికావి. 3 చొప్పున ఉపగ్రహాలు బెల్జియం, ఇటలీ, యూకేకి చెందినవి. ఆస్ట్రియా, చిలీ, చెక్ రిపబ్లిక్, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, లాత్వియా, లుతియానియా, స్లోవెకియాకు చెందిన ఒక్కో ఉపగ్రహం. వీటన్నింటి బరువు - 228 కేజీలు. 
దేశీయ అవసరాల కోసం కార్టోశాట్-2దేశీయ అవసరాల కోసం ఇస్రో కార్టోశాట్ సిరీస్ ప్రయోగాలను వరుసగా నిర్వహిస్తోంది. భౌగోళిక సమాచారం కోసం కార్టోశాట్ ఉపగ్రహాల సిరీస్‌ను 2005లోనే రూపొందించారు. ప్రస్తుతం నింగిలోకి పంపిన కార్టోశాట్ 2ఈ ఉపగ్రహం 6వది. 
కార్టోశాట్ ఉపగ్రహ వ్యవస్థ సూర్యానువర్తన ధృవ కక్ష్యలో వివిధ దశల్లో పరిభ్రమిస్తూ భౌగోళికపరమైన సమాచారాన్ని అందిస్తుంది. దీనిలో అమర్చిన ఫ్రాంక్రోమాటిక్ మల్టీస్పెక్ట్రల్ కెమెరా భూమిని పరిశోధిస్తూ అత్యంత నాణ్యమైన ఛాయాచిత్రాలను అందిస్తుంది. పట్టణ, గ్రామీణాభివృద్ధి ప్రణాళికలు, సముద్ర తీరప్రాంతాల నిర్వహణ, రహదారుల పర్యవేక్షణ, నీటి పంపిణీ, భూవినియోగంపై మ్యాప్‌ల తయారీ, విపత్తులను విసృ్తతంగా అంచనా వేసే పరిజ్ఞానం, వ్యవసాయ సమాచారం అందుబాటులోకి వస్తుంది. ఈ ఉపగ్రహం ఐదేళ్లపాటు సేవలు అందిస్తుంది.
కార్టోశాట్ సిరీస్

  1. కార్టోశాట్-2, పీఎస్‌ఎల్‌వీ సీ7 - 2007 జనవరి 10
  2. కార్టోశాట్-2ఏ, పీఎస్‌ఎల్‌వీ సీ9 - 2008 ఏప్రిల్ 28
  3. కార్టోశాట్-2బీ, పీఎస్‌ఎల్‌వీ సీ15 - 2010 జూలై 12
  4. కార్టోశాట్-2సీ, పీఎస్‌ఎల్‌వీ సీ34 - 2016 జూన్ 22
  5. కార్టోశాట్-2డీ, పీఎస్‌ఎల్‌వీ సీ37 - 2017 ఫిబ్రవరి 15
  6. కార్టోశాట్-2ఈ, పీఎస్‌ఎల్‌వీ సీ38 - 2017 జూన్ 23
క్విక్ రివ్యూ: 
ఏమిటి : పీఎస్‌ఎల్‌వీ సీ38 ప్రయోగం
ఎప్పుడు : జూన్ 23
ఎవరు: ఇస్రో
ఎక్కడ : శ్రీహరికోట, ఏపీ 
ఎందుకు : 31 ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టిన వాహకనౌక 

విశ్వంలో భూమిని పోలిన మరో పది గ్రహాలు సౌర వ్యవస్థ వెలుపల రాతి ఉపరితలంతో భూమిని పోలిన పది చిన్న గ్రహాలను కెప్లర్ అంతరిక్ష టెలిస్కోప్ గుర్తించింది. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని టెలిస్కోప్ నుంచి అందుకున్న శాస్త్రవేత్తలు.. వీటిపై జీవానికి అనువైన పరిస్థితులు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. 
భూమిని పోలి ఉన్న గ్రహాలు విశ్వంలో ఎక్కువగానే ఉన్నాయా, లేదా అని తెలుసుకోవడానికి కెప్లర్ టెలిస్కోప్‌ను నాసా 2009లో ప్రయోగించింది. తొలి నాలుగేళ్ల కార్యక్రమంలో సౌర వ్యవస్థ వెలుపల గుర్తించిన గ్రహాలను పోలిన 219 ఖగోళ వస్తువులపై అధ్యయాన్ని ఇటీవల విడుదల చేసింది. ఇవి నక్షత్రాల చుట్టూ పరిభ్రమిస్తున్న గ్రహాలే కావచ్చని శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : విశ్వంలో భూమిని పోలిన మరో 10 గ్రహాల గుర్తింపు 
ఎప్పుడు : జూన్ 20
ఎవరు: నాసా (కెప్లర్ టెలిస్కోప్)

రైలు గేట్ల ప్రమాదాల నివారణకు ఇస్రో చిప్కాపలా లేని రైల్వే గేట్ల వద్ద జరుగుతున్న ప్రమాదాలను అరికట్టేందుకు రైల్వే శాఖ.. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సహకారం తీసుకుంది. ఈ మేరకు ఇస్రో తయారు చేసిన ఉపగ్రహ సంబంధిత ఇంటిగ్రేటెడ్ చిప్‌లను రైలు ఇంజన్‌లలో అధికారులు అమర్చారు. వీటి ద్వారా గేటు సమీపంలోకి రైలు రాగానే ఒక సైరన్ మోగేలా ఏర్పాట్లు చేశారు. ఈ పద్ధతిని తొలుత ముంబై, గువాహటి రాజధాని రైళ్లలో ప్రయోగాత్మకంగా పరిశీలించనున్నారు. 
కాపలా లేని రైల్వే గేటుకు 500 మీటర్ల దూరంలోకి రైలు రాగానే ఈ చిప్ ద్వారా సిగ్నల్స్ యాక్టివేట్ అయి సైరన్ మోగుతుంది. దీంతో ప్రజలు అప్రమత్తమవుతారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : రైల్వే గేట్ల వద్ద ప్రమాదాల నివారణకు ఇస్రో సహకారం 
ఎప్పుడు : జూన్ 25
ఎక్కడ : ముంబై, గువాహటి రాజధాని రైళ్లలో
ఎందుకు : రైలు రాకపై ప్రజలను అప్రమత్తం చేసేందుకు 

క్రీడలుఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ విజేత శ్రీకాంత్  ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను భారత బ్యాడ్మింటన్ స్టార్ కిడాంబి శ్రీకాంత్ కైవసం చేసుకున్నాడు. జూన్ 25న జరిగిన ఫైనల్లో ప్రపంచ 11వ ర్యాంకర్ శ్రీకాంత్ 22-20, 21-16తో ప్రస్తుత ప్రపంచ చాంపియన్, రియో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత చెన్ లాంగ్ (చైనా)పై విజయం సాధించాడు. తద్వారా 56,250 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 36 లక్షల 28 వేలు)తోపాటు 9200 ర్యాంకింగ్ పాయింట్లను శ్రీకాంత్‌కు దక్కాయి. 
జూన్ 18న శ్రీకాంత్ ఇండోనేసియా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టైటిల్‌ను నెగ్గాడు. ఓవరాల్‌గా శ్రీకాంత్ కెరీర్‌లో ఇది నాలుగో సూపర్ సిరీస్ టైటిల్. 2014లో చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నీలో, 2015లో ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలో శ్రీకాంత్ చాంపియన్‌గా నిలిచాడు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సీరీస్ 
ఎప్పుడు : జూన్ 25
ఎవరు: పురుషుల సింగిల్స్ విజేత కిడాంబి శ్రీకాంత్ 
ఎక్కడ : సిడ్నీలో 

గెర్రీ వెబెర్ హాల్ ఓపెన్ టైటిల్ విజేత ఫెడరర్ గెర్రీ వెబెర్ హాల్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ తొమ్మిదోసారి గెలుచుకున్నాడు. జూన్ 25న జరిగిన ఫైనల్లో ఫెడరర్ 6-1, 6-3తో అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)పై గెలిచాడు. తద్వారా కెరీర్‌లో 92వ సింగిల్స్ టైటిల్ సాధించిన ఫెడరర్... ఓపెన్ శకంలో (1968 తర్వాత) ఒకే టోర్నమెంట్‌ను అత్యధికసార్లు గెలిచిన క్రీడాకారుల జాబితాలో రెండో స్థానానికి చేరాడు. ఈ రికార్డు స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్ (ఫ్రెంచ్ ఓపెన్, బార్సిలోనా ఓపెన్, మోంటెకార్లో ఓపెన్-10 సార్లు చొప్పున) పేరిట ఉంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : గెర్రీ వెబెర్ హాల్ ఓపెన్ టైటిల్ 
ఎప్పుడు : జూన్ 25
ఎవరు: పురుషుల సింగిల్స్ విజేత రోజర్ ఫెడరర్ 
ఎక్కడ : జర్మనీ

అజర్‌బైజాన్ గ్రాండ్ ప్రీ విజేత రికియార్డోరెడ్‌బుల్ జట్టు డ్రైవర్ డానియల్ రికియార్డో అజర్‌బైజాన్ గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ రేసులో విజేతగా నిలిచాడు. 51 ల్యాప్‌ల ఈ రేసును రికియార్డో రెండు గంటల 3 నిమిషాల 55.570 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును ప్రారంభించిన హామిల్టన్ (మెర్సిడెస్) ఐదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. బొటాస్ (మెర్సిడెస్), స్ట్రాల్ (విలియమ్స్) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. ఫోర్స్ ఇండియా డ్రైవర్ ఒకాన్ ఆరో స్థానాన్ని పొందాడు.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : అజర్ బైజాన్ గ్రాండ్ ప్రీ - 2017 
ఎప్పుడు : జూన్ 25
ఎవరు: విజేత డానియల్ రికియార్డో

‘స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్’గా సింధుభారత స్పోర్‌‌ట్స జర్నలిస్ట్ సమాఖ్య (ఎస్‌జేఎఫ్‌ఐ) వార్షిక అవార్డుల్లో భాగంగా అందించే ‘స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్’ పురస్కారానికి భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ఎంపికైంది. జూన్ 25న జరిగిన ఎస్‌జేఎఫ్‌ఐ వార్షిక సాధారణ సర్వసభ్య సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. 
2016 డిసెంబర్‌లో లక్నోలో జరిగిన జూనియర్ హాకీ వరల్డ్ కప్‌ను నెగ్గిన భారత హాకీ జట్టు ‘బెస్ట్ టీమ్ ఆఫ్ ద ఇయర్’ అవార్డును గెలుచుకుంది. గతేడాది జూలై నుంచి ఇప్పటివరకు క్రీడాకారుల ప్రదర్శనను పరిగణలోకి తీసుకొని అవార్డులను ప్రకటించినట్లు ఎస్‌జేఎఫ్‌ఐ పేర్కొంది. ఈ అవార్డులను సెప్టెంబర్‌లో అందజేయనున్నారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : పీవీ సింధుకు స్పోర్‌‌ట్స పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు
ఎప్పుడు : జూన్ 25
ఎవరు: ఎస్‌జేఎఫ్‌ఐ

పేస్ జంటకు ఎగాన్ ఏటీపీ చాలెంజర్ టైటిల్ఎగాన్ ఏటీపీ చాలెంజర్ టోర్నమెంట్ డబుల్స్ టైటిల్‌ను లియాండర్ పేస్, ఆదిల్ షమస్దీన్(కెనడా) జంట కైవసం చేసుకుంది. బ్రిటన్‌లో జూన్ 25న జరిగిన ఫైనల్లో పేస్-షమస్దీన్ ద్వయం 2-6, 6-2, 10-8తో ‘సూపర్ టైబ్రేక్’లో బ్రిడాన్ క్లియెన్-జోసాలిస్‌బరీ (బ్రిటన్) జోడీపై గెలిచింది. 
45 ఏళ్ల పేస్ ఈ సీజన్‌లో తలాసీ, లియోన్ ఏటీపీ చాలెంజర్ టోర్నీల్లోనూ టైటిల్స్ సాధించాడు.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఎగాన్ ఏటీపీ చాలెంజర్ టోర్నమెంట్ - 2017
ఎప్పుడు : జూన్ 25
ఎవరు: డబుల్స్ టైటిల్ విజేత లియాండర్ పేస్-ఆదిల్ షమస్దీన్
ఎక్కడ : బ్రిటన్ 

లోధా సంస్కరణల అమలుకు ప్రత్యేక కమిటీ లోధా ప్యానెల్ సూచించిన సంస్కరణల అమలు కోసం ఏడుగురు సభ్యులతో బీసీసీఐ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. జూన్ 26న జరిగిన బోర్డు ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్‌జీఎం)లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కమిటీకి రాజీవ్ శుక్లా చైర్మన్‌గా... బోర్డు కార్యదర్శి అమితాబ్ చౌదరి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ సభ్యుడిగా ఉంటారు. మిగతా సభ్యుల్లో టీసీ మ్యాథ్యూ (కేరళ క్రికెట్ సంఘం మాజీ అధ్యక్షులు), నబా భట్టాచార్జీ (మేఘాలయ క్రికెట్ సంఘం కార్యదర్శి), జయ్ షా (బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కుమారుడు, గుజరాత్ క్రికెట్ సంఘం కార్యదర్శి), బీసీసీఐ కోశాధికారి అనిరుధ్ చౌదరి ఉన్నారు. 
ఈ కమిటీ లోధా సంస్కరణల అమల్లో ఎదురవుతున్న ఇబ్బందులపై నివేదిక ఇవ్వనుంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : లోధా సంస్కరణల అమలుకు ప్రత్యేక కమిటీ 
ఎప్పుడు : జూన్ 26
ఎవరు: బీసీసీఐ 
ఎందుకు : లోధా సంస్కరణల అమల్లో ఎదురవుతున్న ఇబ్బందులపై అధ్యయనం కోసం 

ప్రపంచ త్రోబాల్ గేమ్స్‌లో భారత్‌కు 2 స్వర్ణాలుఖట్మండ్‌లో జరిగిన ప్రపంచ త్రోబాల్ గేమ్‌లో భారత్‌కు చెందిన మహిళ, పురుష జట్లు చెరో బంగారు పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించాయి. మహిళా జట్టు 15-13, 12-12లతో పాకిస్థాన్‌పై విజయం సాధించింది. ఇక పురుషుల జట్టు.. బంగ్లాదేశ్‌పై 15-13, 15-12లతో విజయకేతనం ఎగరవేసింది. భారత్ ఈ పోటీల్లో పాల్గొనడం ఇదే తొలిసారి. 
జూన్ 15 నుంచి 18 వరకు జరిగిన ఈ పోటీలను ఇంటర్నేషనల్ స్పోర్‌‌ట్స కౌన్సిల్ (కెనడా) నిర్వహించింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఖట్మండ్ త్రోబాల్ గేమ్‌లో భారత్‌కు 2 పసిడి పతకాలు
ఎప్పుడు : జూన్ 15 - 18
ఎవరు: భారత పురుషుల, మహిళల జట్లకు పతకాలు 

అవార్డులుఅజిమ్ ప్రేమ్‌జీకి కార్నెగీ పురస్కారం  భారత్‌లో పాఠశాల వ్యవస్థ అభివృద్ధి కోసం చూపుతున్న దాతృత్వానికిగాను ప్రముఖ పారిశ్రామకవేత్త, విప్రో చైర్మన్ అజిమ్ ప్రేమ్‌జీ ప్రతిష్టాత్మక కార్నెగీ అవార్డుకు ఎంపికయ్యారు. దాతృత్వ విభాగంలో అమెరికాలో అందజేసే అత్యంత ప్రతిష్టాత్మక అవార్డు ఇది. 
అజిమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ ద్వారా ఎందరో పేద పిల్లలకు విద్యనందిస్తున్నారు. ప్రస్తుతం ఏడు రాష్ట్రాల్లో దాదాపు 3 లక్షల మంది పిల్లలు ఈ ఫౌండేషన్ ద్వారా చదువుకుంటున్నారు. ఈ సేవలకు గానూ.. ప్రేమ్‌జీ కార్నెగీ అవార్డును అందుకోనున్నారు. 
నిస్వార్థభావంతో సేవలు చేసేవారిని ప్రోత్సహించేందుకుగాను అమెరికాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త ఆండ్రూ కార్నెగీ పేరు మీదుగా 2001 నుంచి రెండేళ్లకోసారి ఈ అవార్డులు అందజేస్తున్నారు. 2017 సంవత్సరానికి గానూ 9 మంది ఈ అవార్డుకు ఎంపికకాగా అందులో ప్రేమ్‌జీ ఒకరు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : కార్నెగీ పురస్కారం - 2017
ఎప్పుడు : జూన్ 23
ఎవరు: అజీమ్ ప్రేమ్‌జీ 
ఎందుకు : భారత్‌లో పాఠశాల వ్యవస్థ అభివృద్ధి కోసం చూపుతున్న దాతృత్వానికిగాను

ధన్‌రాజ్ పిళ్లైకి భారత్ గౌరవ్ పురస్కారం భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్ ధన్‌రాజ్ పిళ్లై అత్యంత ప్రతిష్టాత్మకమైన భారత్ గౌరవ్ పురస్కారానికి ఎంపికయ్యారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఫుట్‌బాల్ క్లబ్ ప్రదానం చేసే ఈ పురస్కారాన్ని.. క్లబ్ వ్యవస్థాపక దినమైన ఆగస్టు 1వ తేదీన ప్రదానం చేయనున్నారు. భారత హాకీ జట్టుకు అందించిన అపారమైన సేవలకు గుర్తింపుగా 2017 సంవత్సరానికిగాను పిళ్లైని ఈ పురస్కారానికి ఎంపిక చేశామని జూన్ 27న ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి కళ్యాణ్ మజుందార్ వెల్లడించారు. క్లబ్ మాజీ ఫుట్‌బాల్ క్రీడాకారులు సయ్యద్ నయీముద్దీన్, శుభాష్ బౌమిక్‌లకు లైఫ్‌టైమ్ ఎచీవ్‌మెంట్ అవార్డును అందజేయనున్నట్లు చెప్పారు. 
ఆధునిక భారతీయ హాకీ జట్టులో అతిపెద్ద స్టార్‌గా నిలిచిన పిళ్లై... తన 15 ఏళ్ల క్రీడా జీవితంలో అనేక అంతర్జాతీయ వేదికలపై ఒలిపిక్స్‌తోపాటు ప్రపంచ టోర్నీలు, చాంపియన్ ట్రోఫీలు, ఏషియన్ గేమ్స్‌లలో ఆడారు. మొత్తం 339 మ్యాచ్‌ల్లో 170 గోల్స్ సాధించి, అరుదైన గుర్తింపును దక్కించుకున్నారు. 
క్విక్ రివ్యూ:ఏమిటి : దన్‌రాజ్ పిళ్లైకి భారత్ గౌరవ్ పురస్కారం 
ఎప్పుడు : జూన్ 27
ఎవరు: పశ్చిమ బెంగాల్ ఫుట్‌బాల్ క్లబ్
ఎందుకు : భారత హాకీకి అందించిన సేవలకు గాను 

పశ్చిమ బెంగాల్‌కు ఐరాస పురస్కారం
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రతిష్టాత్మక ప్రజా సేవ పురస్కారాన్ని గెలుచుకుంది. బాలికల విద్యను ప్రోత్సహించేందుకు ఆ రాష్ర్టం ప్రవేశపెట్టిన కన్యశ్రీ ప్రకల్ప పథకానికి ఈ పురస్కారం దక్కింది. ఈ అవార్డుకు 62 దేశాల నుంచి 552 ప్రాజెక్టులు పోటీ పడగా కన్యశ్రీ ప్రకల్పకు తొలి స్థానం దక్కింది.

వార్తల్లో వ్యక్తులువిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి మీరాకుమార్ రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ పోటీ చేయనున్నారు. ఈ మేరకు పార్లమెంట్ లైబ్రరీ హాల్లో జూన్ 22న భేటీ అయిన 17 ప్రతిపక్ష పార్టీలు తమ రాష్ట్రపతి అభ్యర్థిగా బిహార్‌కు చెందిన దళిత నాయకురాలు మీరాకుమార్‌ను ఎంపిక చేశాయి. ఆమె భారత మాజీ ఉప ప్రధాని, ప్రముఖ దళిత నాయకుడు బాబు జగ్జీవన్‌రామ్ కుమార్తె. 
ఎన్డీఏ అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్ కూడా దళితవర్గానికి చెందిన వారే కావటంతో ఈ సారి రాష్ట్రపతి ఎన్నికలు ఇద్దరు దళిత నేతల మధ్య జరగనున్నాయి. రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ జూలై 17న జరుగుతుంది. ఫలితాలు అదే నెల 20వ తేదీన వెలువడతాయి. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి
ఎప్పుడు : జూన్ 22
ఎవరు: మీరాకుమార్ 

మధ్యప్రదేశ్ మంత్రి నరోత్తమ్‌పై ఈసీ వేటుమధ్యప్రదేశ్ సీనియర్ మంత్రి నరోత్తమ్ మిశ్రాపై ఎన్నికల సంఘం (ఈసీ) అనర్హత వేటు వేసింది. పెయిడ్ న్యూస్ అభియోగాలు, ఎన్నికల ఖర్చులకు సంబంధించి తప్పుడు లెక్కలను చూపించారని పేర్కొంటూ ఆయనపై ఈ చర్యలు తీసుకుంది. మధ్యప్రదేశ్‌లోని దటియా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన ఎన్నికకూడా చెల్లదని స్పష్టం చేసింది. 2017 జూన్ 24 నుంచి మూడేళ్లపాటు మిశ్రాను అనర్హుడిగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రధాన ఎన్నికల అధికారి నసీమ్ జైదీ, ఎన్నికల కమిషనర్లు ఏకే జోటీ, ఓపీ రావత్‌లతో కూడిన ఎన్నికల సంఘం ధర్మాసనం.. 69 పేజీలతో కూడిన ఉత్తర్వులు జారీ చేసింది. 
ఈసీ నిర్ణయంతో మిశ్రా మూడేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులు. 2008 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తన ఎన్నికల ఖర్చులకు సంబంధించిన పూర్తి వివరాలను ఈసీ ముందుంచలేదని ఆరోపిస్తూ 2009లో కాంగ్రెస్ నేత రాజేంద్ర భారతి చేసిన ఫిర్యాదుపై స్పందించిన ఈసీ విచారణ అనంతరం తన తీర్పు వెలువరించింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : మధ్యప్రదేశ్ మంత్రి నరోత్తమ్ మిశ్రాపై అనర్హత వేటు 
ఎప్పుడు : జూన్ 25
ఎవరు: భారత ఎన్నికల సంఘం 
ఎందుకు : ఎన్నికల ఖర్చుపై తప్పుడు లెక్కలు చూపినందుకు గాను 

స్కిల్ ఇండియా ప్రచారకర్తగా ప్రియాంక చోప్రా కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న పథకం ‘స్కిల్ ఇండియా’కు బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ప్రచారకర్తగా వ్యవహరించనున్నారు. ఇందుకోసం జాతీయ నైపుణ్య శిక్షణాభివృద్ధి సంస్థ(ఎన్‌ఎస్‌డీసీ) ప్రియాంకతో ఒప్పందం కుదుర్చుకోనుంది. 
గతంలో క్రికెటర్ విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా, షబానా ఆజ్మీ, సింగర్ మోహిత్ చౌహాన్ తదితరులు స్కిల్ ఇండియా కార్యక్రమానికి ప్రచారకర్తలుగా వ్యవహరించారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : స్కిల్ ఇండియా ప్రచారకర్త
ఎప్పుడు : జూన్ 25
ఎవరు: బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా 

సలావుద్దీన్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించిన అమెరికాకశ్మీరీ ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ సయ్యద్ సలావుద్దీన్‌ను అమెరికా విదేశాంగ శాఖ జూన్ 26న అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. అమెరికాలో పర్యటిస్తున్న నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సమావేశానికి కొద్ది గంటలముందే ఈ నిర్ణయాన్ని వెలువరించింది. దీంతో సలావుద్దీన్‌తో అమెరికన్లు ఎవరూ ఎలాంటి లావాదేవీలు జరపటం, సంబంధాలు నెరపటం పూర్తిగా నిషేధం. అమెరికా అధికార పరిధిలోని ప్రాంతాల్లో ఉన్న సలావుద్దీన్ ఆస్తులను కూడా జప్తుచేస్తారు. సలావుద్దీన్ నేతృత్వంలో హిజ్బుల్ (పాక్ కేంద్రంగా) ఉగ్రవాదులు జమ్మూకశ్మీర్‌లో విధ్వంసాలకు పాల్పడ్డారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : సయ్యద్ సలావుద్దీన్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటన
ఎప్పుడు : జూన్ 26
ఎవరు: అమెరికా ప్రభుత్వం 
ఎందుకు : హిజ్బుల్ ముజాహిదీన్ సంస్థ నెలకొల్పి ఉగ్రదాడులకు పాల్పడుతున్నందుకు

మిస్ ఇండియా-2017గా మానుషి చిల్లర్ఫెమినా మిస్ ఇండియా-2017 కిరీటాన్ని హరియాణాకు చెందిన మానుషి చిల్లర్ కైవసం చేసుకుంది. ముంబైలోని యశ్‌రాజ్ ఫిల్మ్ స్టూడియోలో జూన్ 25న జరిగిన పోటీలో విజేతగా నిలిచిన ఆమె మిస్ ఇండియా టైటిల్ గెలుచుకుంది. మొత్తం 30 మంది పోటీ పడగా.. టాప్ 6లో మానుషి చిల్లర్, షెఫాలీ సూద్, సనా దువా, ప్రియాంక కుమారి, ఐశ్వర్య దేవన్, అనుక్రితి గుసైన్‌లు నిలిచారు. మొదటి రన్నరప్‌గా సనా దువా(జమ్మూ కశ్మీర్), రెండో రన్నరప్‌గా ప్రియాంక కుమారి(బిహార్) ఎంపికయ్యారు. 
బాలీవుడ్ నటులు అర్జున్ రాంపాల్, ఇలియానా, బిపాసా బసు, అభిషేక్ కపూర్, విద్యుత్ జమాల్, ఫ్యాషన్ డిజైనర్ మనీశ్ మల్హోత్రలు ఈ పోటీల్లో న్యాయమూర్తులుగా వ్యవహరించారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : మిస్ ఇండియా - 2017
ఎప్పుడు : జూన్ 25 
ఎవరు: మానుషి చిల్లర్ (హర్యాణా)
ఎక్కడ : ముంబైలో 

ఐఎఫ్‌పీఆర్‌ఐ ఉపాధ్యక్షునిగా మహేంద్రదేవ్గుంటూరు జిల్లా తుమ్మపూడికి చెందిన ప్రొఫెసర్ మహేంద్ర దేవ్ అమెరికా రాజధాని వాషింగ్టన్ కేంద్రంగా నడిచే అంతర్జాతీయ ఆహార విధాన పరిశోధనా సంస్థ (ఐఎఫ్‌పీఆర్‌ఐ) ట్రస్టీ బోర్డు ఉపాధ్యక్షులుగా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన ఆర్‌బీఐ నిర్వహించే ఇందిరాగాంధీ అభివృద్ధి పరిశోధనా సంస్థ వైస్ చాన్స్‌లర్‌గా ఉన్నారు. 
మహేంద్రదేవ్ గతంలో హైదరాబాద్ కేంద్రంగా నిర్వహించే సెస్‌కు తొమ్మిదేళ్ల పాటు డెరైక్టర్‌గా, కనీస మద్దతు ధరల నిర్ణాయక సంఘం చైర్మన్‌గానూ పని చేశారు. ఐఎఫ్‌పీఆర్‌ఐ ఉపాధ్యక్ష హోదాలో ఆయన రెండేళ్ల పాటు కొనసాగుతారు. ఈ సంస్థ 42 ఏళ్ల చరిత్రలో అధ్యక్ష/ఉపాధ్యక్ష పదవిని చేపట్టిన రెండో భారతీయుడు మహేంద్ర దేవ్. గతంలో డాక్టర్ ఐషర్ జడ్‌‌జ అహ్లూవాలియా ఈ పోస్టును అలంకరించారు. 
ప్రపంచంలో ఆకలి, దారిద్య్రం, పౌష్టికాహార లోపాన్ని తగ్గించేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలను, పరిష్కార మార్గాలను సూచించేందుకు 1975లో ఐఎఫ్‌పీఆర్‌ఐ ఏర్పాటయింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఐఎఫ్‌పీఆర్‌ఐ ఉపాధ్యక్షునిగా భారతీయుడు 
ఎప్పుడు : జూన్ 26
ఎవరు: ప్రొఫెసర్ మహేంద్ర దేవ్
ఎక్కడ : వాషింగ్టన్, అమెరికా 

శాస్త్రవేత్త పీకే కావ్ కన్నుమూతఅంతర్జాతీయ గుర్తింపు పొందిన ప్లాస్మా శాస్త్రవేత్త ప్రిధిమాన్ క్రిషన్ కావ్ (69) జూన్ 19న అహ్మదాబాద్‌లో మరణించారు. ఆయన తన అసాధారణ ప్రతిభతో 18 ఏళ్ల వయసులోనే ఢిల్లీ ఐఐటీ నుంచి పీహెచ్‌డీ పూర్తి చేశారు. గాంధీనగర్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఫర్ ప్లాస్మా రీసెర్చ్ (ఐపీఆర్) వ్యవస్థాపక సంచాలకుడి (1986-12)గా పనిచేశారు. ఆయనకు 1985లో పద్మశ్రీ పురస్కారం లభించింది.

No comments:

Post a Comment