వార్తల్లో వ్యక్తులు మార్చి 2013
పినాకపాణి మృతిప్రముఖ సంగీత విద్వాంసులు. ప్రముఖ వైద్యులు శ్రీపాద పినాకపాణి (101) మార్చి 11న కర్నూలులో మరణించారు. ఈయన 1913 ఆగస్టు 3న ప్రియాగ్రహారం (శ్రీకాకుళం జిల్లా)లో జన్మించారు. 1977లో సంగీత నాటక అకాడమీ అవార్డు, 1984లో పద్మ భూషణ్ పురస్కారాలు ఆయనకు లభించాయి. 2012లో తిరుమల తిరుపతి దేవస్థానం ‘గాన విద్యా వారధి’ బిరుదుతో సత్కరించింది. పాణినీయం, ప్రపత్తి, స్వరరామమ్, అభ్యాసమ్, నా సంగీత యాత్ర ఆయన రచనలు. నూకల చిన సత్యనారాయణ, నేదునూరి కష్ణమూర్తి, శ్రీరంగం గోపాల రత్నం, మల్లాది సూరిబాబు, నేతి శ్రీరామ శర్మ పినాకపాణి శిష్యులు.
రష్యా విద్యావేత్త మృతి
రష్యా విద్యావేత్త, భారత్ -రష్యా సైన్స్ అండ్ టెక్నాలజీ సహకార కార్యక్రమ రూపకర్త గురీ మార్చుక్(87) మాస్కోలో 2013 మార్చి 25న మరణించారు. మార్చుక్ రష్యా ప్రముఖ భౌతిక, గణిత శాస్త్రవేత్త. మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీ, సోవియట్ నాయకుడు మిఖయిల్ గోర్బచేవ్ చొరవతో 1987లో భారత్, రష్యాల మధ్య సైన్స్ అండ్ టెక్నాలజీలో సమగ్ర దీర్ఘకాలిక కార్యక్రమం (ఐఎల్‌టీపీ) రూపకల్పనలో మార్చుక్ కషి చేశారు.
ఎన్‌ఎస్‌ఈ ఎండీగా చిత్రా రామకష్ణనేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్(ఎన్‌ఎస్‌ఈ) నూతన ఎండీ, సీఈవోగా చిత్రా రామకష్ణ 2013 ఏప్రిల్ 1న బాధ్యతలు స్వీకరించారు. 20 ఏళ్ల చరిత్రగల ఎన్‌ఎస్‌ఈకి ఆమె మూడో ఎండీ. రవీ నారాయణ్ స్థానంలో చిత్రా నియమితులయ్యారు.
శాటిలైట్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో యు. ఆర్. రావుభారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) మాజీ చైర్మన్ ప్రొఫెసర్ యు.ఆర్.రావు కు అంతర్జాతీయ ఉపగ్రహ నిపుణుల సొసైటీ ‘శాటిలైట్ హాల్ ఆఫ్ ఫేమ్’లో స్థానం లభించింది. వాషింగ్టన్‌లో 2013 మార్చి 19న ఆయనకు ఈ గౌరవం కల్పించారు. అర్థర్ సి. క్లార్క్‌తో పాటు మరో 49 మంది సరసన రావుకు స్థానం లభించింది. డాక్టర్ రావు స్పేస్ డిపార్ట్‌మెంట్ సెక్రటరీగా, పదేళ్లు ఇస్రో చైర్మన్‌గా (1984-94) పనిచేశారు. 1975లో చేపట్టిన భారత తొలి ఉపగ్రహం ఆర్యభట్ట మొదలుకొని 20కిపైగా ఉపగ్రహాల రూపకల్పన, ప్రయోగాలు ఆయన మార్గదర్శకత్వంలోనే జరిగాయి.
మేఘాలయ ప్రధాన న్యాయమూర్తిగా మీనా కుమారినూతనంగా ఏర్పాటు చేసిన మేఘాలయ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ టి. మీనాకుమారి మార్చి 23న బాధ్యతలు స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మీనాకుమారి 2001లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. తర్వాత పాట్నా హైకోర్టు న్యాయమూర్తిగా వ్యవహరించారు. ఇటీవల మేఘాలయతోపాటు, త్రిపుర, మణిపూర్‌లలో కొత్తగా హైకోర్టులను ఏర్పాటు చేశారు.
బంగ్లాదేశ్ అధ్యక్షుడు రెహ్మాన్ మృతిబంగ్లాదేశ్ అధ్యక్షుడు మహమ్మద్ జిల్లూర్ రెహ్మాన్ (85) అనారోగ్యంతో మార్చి 20న సింగపూర్‌లోని ఆస్పత్రిలో మరణించారు. 2008లో ‘అవామీ లీగ్’ గెలుపొందడంతో 2009లో జిల్లూర్ రెహ్మాన్ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈయన 1929లో అవిభక్త భారత్‌లోని బ్రహ్మణ్‌బరియా (అసోం)లో జన్మించారు.
రెడ్డీస్ ల్యాబ్స్ అధినేత అంజి రెడ్డి మృతిభారతీయ ఫార్మా రంగానికి అంతర్జాతీయంగా ఎనలేని గుర్తింపు తెచ్చిన ఔషధ రంగ దిగ్గజం, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ అధినేత కల్లం అంజిరెడ్డి(72) క్యాన్సర్ వ్యాధి తో మార్చి 15న హైదరాబాద్‌లో కన్నుమూశారు. అంజిరెడ్డి 1984లో హైదరాబాద్‌లో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్‌ను ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం ఆయన్ను పద్మ శ్రీ (2001), పద్మభూషణ్ (2011) అవార్డులతో సత్కరించింది. గుంటూరు జిల్లా తాడేపల్లిలో 1941 మే 27న అంజిరెడ్డి జన్మించారు.

No comments:
Post a Comment