AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Sunday 26 November 2017

వార్తల్లో వ్యక్తులు జూన్ 2014

వార్తల్లో వ్యక్తులు జూన్ 2014
సింగపూర్ అటార్నీ జనరల్‌గా జస్టిస్ వీకే రజా
సింగపూర్ అటార్నీ జనరల్‌గా భారత సంతతి న్యాయమూర్తి జస్టిస్ వీకే రజా (57) జూన్ 25న నియమితులైనట్లు ఆ దేశ అధ్యక్ష కార్యాలయం ప్రకటించింది.
కర్ణాటక ఇన్‌ఛార్జ్ గవర్నర్‌గా రోశయ్య 
తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య జూన్ 29న కర్ణాటక ఇన్‌ఛార్జ్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు స్వీకరించారు. కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీహెచ్ వాఘేలా రోశయ్యతో ప్రమాణం చేయించారు. హెచ్‌ఆర్ భరద్వాజ్ పదవీ కాలం జూన్ 28 నాటికి ముగియడంతో కేంద్రం రోశయ్యకు బాధ్యతలు అప్పగించింది. 
నాగాలాండ్ గవర్నర్ రాజీనామా
నాగాలాండ్ గవర్నర్ అశ్వనీకుమార్ జూన్ 25న తన పదవికి రాజీనామా చేశారు. ఇటీవల ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల గవర్నర్లు బీఎల్‌జోషీ, శేఖర్‌దత్‌లు రాజీనామా చేశారు. ఈ ముగ్గురూ సివిల్ సర్వీస్ మాజీ అధికారులే కావడం విశేషం. 
భారత చరిత్ర పరిశోధన మండలి చైర్మన్‌గా యల్లాప్రగడ
కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖకు చెందిన భారతీయ చరిత్ర పరిశోధన మండలి చైర్మన్‌గా యల్లాప్రగడ సుదర్శనరావు జూన్ 24న నియమితులయ్యారు. దక్షిణ భారతదేశం నుంచి గత 30 ఏళ్లలో జాతీయ విశ్వవిద్యాలయం చరిత్ర విభాగంలో ఈ మండలికి చైర్మన్‌గా నియమితులైన మూడో వ్యక్తి యల్లాప్రగడ. ఆయన స్వస్థలం తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్. ఆయన గతంలో కాకతీయ యూనివర్సిటీ చరిత్ర విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. 
సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా మిశ్రా, గోయల్, నారిమన్
కలకత్తా, ఒడిశా హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు అరుణ్‌మిశ్రా, ఆదర్శ్ గోయల్‌తోపాటు ప్రఖ్యాత న్యాయవాది రోహిన్‌టన్ నారీమన్‌లను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు గా నియామకానికి రాష్ట్రపతి జూన్ 26న ఆమోదం తెలిపారు. కాగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నేరుగా ఎన్నికైనవారిలో నారీమన్ ఐదోవారు. ఈయన ఏడేళ్లపాటు సుప్రీం న్యాయమూర్తిగా కొనసాగుతారు. 
ఇక్రిశాట్ కొత్త డెరైక్టర్ జనరల్‌గా బెర్గ్ విన్సన్
హైదరాబాద్‌లోని అంతర్జాతీయ మెట్ట పంటల వ్యవసాయ పరిశోధన సంస్థ (ఇక్రిశాట్) కొత్త డెరైక్టర్ జనరల్‌గా డాక్టర్ డేవిడ్ బెర్గ్ విన్సన్‌ను నియమిస్తున్నట్లు ఆ సంస్థ పాలకమండలి జూన్ 27న ప్రకటించింది. బెర్గ్‌విన్సన్ ఐదేళ్ల పాటు డెరైక్టర్ హోదాలో కొనసాగుతారు.

నూతన ఏజీ ముకుల్ రోహత్గీ 
నూతన అటార్నీ జనరల్ (ఏజీ)గా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ జూన్ 12న నియమితులయ్యూరు. ఆయన మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. ఈ మేరకు న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. జి.ఇ.వాహనవతి స్థానంలో భారత 14వ ఏజీగా రోహత్గీ బాధ్యతలు స్వీకరిస్తారు. 
భారత శాస్త్రవేత్తకు అత్యున్నత పురస్కారం
బ్రిటన్‌లో భారత సంతతికి చెందిన భౌతిక శాస్త్రవేత్త తేజిందర్ విర్దీకి బ్రిటన్ రాణి ఎలిజబెత్ -2 అత్యున్నతమైన ‘నైట్‌హుడ్’ పురస్కారాన్ని ప్రకటించారు. లార్జ్ హాడ్రన్ కొలైడర్ (దైవకణం) పరిశోధనలో చూపిన ప్రతిభకు ఈ పురస్కారం దక్కింది. లండన్‌లోని ఇంపీరియల్ కాలేజిలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న తేజిందర్ శాస్త్రరంగానికి విశేష సేవలు అందించారు.
ఒబామా కొలువులో మరో భారతీయ శాస్త్రవేత్త
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కొలువులో మరో భారతీయుడికి గౌరవం దక్కింది. భారత-అమెరికన్ శాస్త్రవేత్త సేతురామన్ పంచనాథన్ అమెరికా జాతీయ సైన్స్ ఫౌండేషన్‌లో కీలక స్థానానికి ఎంపికయ్యారు. ఆయన్ను ప్రఖ్యాత జాతీయ సైన్స్ బోర్డు సభ్యుడిగా నియమించారు. సేతురామన్ మద్రాస్ యూనివర్సిటీ వివేకానంద కాలేజీ నుంచి 1981లో భౌతికశాస్త్రంలో పట్టా పొందారు. ఐఐటీలో ఎంటెక్ చేసి చెన్నైలోని ఇంటర్నేషనల్ సాఫ్ట్‌వేర్ ఇండియా లిమిటెడ్ కంపెనీలో డేటా కమ్యూనికేషన్ ఇంజనీర్‌గా పనిచేశారు. 
కేంద్ర రెవెన్యూశాఖ కార్యదర్శిగా శక్తికాంత్ దాస్
కేంద్ర రెవెన్యూశాఖ కార్యదర్శిగా రాజీవ్ ఠాక్రు స్థానంలో 1980 బ్యాచ్ ఐఏఎస్ అధికారి శక్తికాంత్ దాస్(57)ను ప్రభుత్వం నియమించింది. దాస్ ప్రస్తుతం ఎరువుల శాఖ కార్యదర్శిగా ఉన్నారు.

ఐరిష్ రచయిత్రి మాక్‌బ్రైడ్‌కు బెయ్‌లీస్ ఉమెన్‌‌స ప్రైజ్
2014 బెయ్‌లీస్ ఉమెన్‌‌స ప్రైజ్ (కాల్పనిక రచన) ఐరిష్ రచయిత్రి ఇమీర్ మాక్‌బ్రైడ్‌కు లభించింది. ఈ బహుమతిని జూన్ 5న లండన్‌లో ప్రదానం చేశారు. ఆమె రాసిన ‘ఎ గర్‌‌ల ఈజ్ ఎ హాఫ్ ఫార్మడ్ థింగ్’ నవలకు ఈ బహుమతి దక్కింది. భారత సంతతికి చెందిన అమెరికన్ రచయిత్రి జుంపా లహరి ‘ది లో ల్యాండ్’ రచనతో ఈ నవల పోటీ పడింది. ఈ బహుమతిని ప్రతి సంవత్సరం మహిళా రచయితలు రాసిన కాల్పనిక రచనలకు ప్రదానం చేస్తారు. బహుమతి కింద 30,000 పౌండ్లు అందజేస్తారు. గతంలో ఈ బహుమతిని ఆరంజ్ ప్రైజ్‌గా పిలిచేవారు.

ఐరాస మండేలా పురస్కారం జాతివివక్ష వ్యతిరేక పోరాటయోధుడు, నల్ల సూరీడు నెల్సన్‌మండేలా గౌరవార్థం ఐక్యరాజ్యసమితి ఆయన పేరుతో ఒక అవార్డును నెలకొల్పింది. జూన్ 7న జరిగిన సర్వసభ్య సభ సమావేశం ‘ఐక్యరాజ్యసమితి నెల్సన్ రోలిహ్లాహ్లా మండేలా పురస్కారా’న్ని నెలకొల్పుతూ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది. మండేలా అందించిన జ్యోతిని ముందుకు తీసుకెళ్లటమే ఆయనకు అర్పించే నిజమైన నివాళి అని సమితి సెక్రటరీ జనరల్ బాన్ కి-మూన్ సర్వసభ్య సభ సమావేశంలో పేర్కొన్నారు. 

ఐరాస నిపుణుల బృందంలో భారతీయుడికి చోటుఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ నిపుణుల బృందంలో భారత్‌కు చెందిన విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్ అభిజిత్ గుహా నియమితులయ్యారు. ఈ బృందంలో మొత్తం ఐదుగురు సభ్యులు ఉంటారు. ఐక్యరాజ్యసమితి చేపట్టే శాంతి పరిరక్షణ కార్యకలాపాల్లో ఉపయోగించాల్సిన సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం అంశాలపై ఈ బృందం సలహాలు, సూచనలు ఇస్తుంది.

కేంద్రమంత్రి గోపీనాథ్ ముండే మృతికేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గోపీనాథ్ ముండే (64) న్యూఢిల్లీలో జూన్ 3న జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ముండే మహారాష్ట్రకు చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు. ఆ రాష్ట్రంలోని బీడ్ పార్లమెంట్ సభ్యుడు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంత్రివర్గంలో మే 26న తొలిసారి కేంద్రమంత్రిగా చేరారు. 1995-99లో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. ముండే పూర్తిపేరు గోపీనాథ్ పాండురంగ్ ముండే. 1949 డిసెంబర్ 12న మహారాష్ట్రలోని బీడ్ జిల్లా నత్రాలో జన్మించారు.

నూతన సొలిసిటర్ జనరల్ రంజిత్ కుమార్సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది రంజిత్ కుమార్‌ను నూతన సొలిసిటర్ జనరల్(ఎస్‌జీ)గా ప్రభుత్వం నియమించింది. రంజిత్‌కుమార్‌ను ఎస్‌జీగా నియమిస్తూ జూన్ 7న న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. సీనియర్ న్యాయవాదులు మనిందర్ సింగ్, తుషార్ మెహతా, ఎల్ నాగేశ్వరరావు, పీఎస్ పత్వాలియా, నీరజ్ కిషన్ కౌల్, పీఎస్ నరసింహలను అదనపు సొలిసిటర్ జనరల్ పదవుల్లో నియమించింది.

తెలంగాణ శాసనసభ స్పీకర్‌గా మధుసూదనాచారితెలంగాణ రాష్ట్ర తొలి శాసనసభ స్పీకర్‌గా వరంగల్ జిల్లా భూపాలపల్లి ఎమ్మెల్యే సిరికొండ మధుసూదనాచారి (టీఆర్‌ఎస్) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జూన్ 10న ఆయన బాధ్యతలు స్వీకరించారు.

నదీ బోర్డుల ఏర్పాటుకృష్ణా, గోదావరి యాజమాన్య బోర్డులను కేంద్రప్రభుత్వం ఏర్పాటు చేసింది. తెలంగాణ ఆవిర్భావ తేదీ జూన్ 2 తర్వాత 60 రోజుల్లోగా రెండు బోర్డులను ఏర్పాటు చేయాలన్న పునర్విభజన బిల్లు సూచన మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు చైర్మన్‌గా కేంద్ర జలసంఘం చైర్మన్‌గా వ్యవహరిస్తున్న ఎ.బి. పాండ్యాను, గోదావరి నదీ యాజమాన్య బోర్డు చైర్మన్‌గా కేంద్ర జలసంఘంలోని సభ్యుడైన మహేంద్రన్‌ను కేంద్రం నియమించింది. పునర్విభజన చట్టం ప్రకారం గోదావరి బోర్డును తెలంగాణలోనూ, కృష్ణా బోర్డును ఆంధ్రప్రదేశ్‌లోనూ ఏర్పాటు చేయాల్సి ఉంది. 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణంఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్. చంద్రబాబు నాయుడు జూన్ 8న ప్రమాణస్వీకారం చేశారు. చంద్రబాబుతో రాష్ట్ర గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించారు. తర్వాత 19 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు.

No comments:

Post a Comment