AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Sunday 26 November 2017

వార్తల్లో వ్యక్తులు ఆగష్టు 2015

వార్తల్లో వ్యక్తులు ఆగష్టు 2015
‘మిస్ టీన్ కెనడా’గా భారత సంతతి యువతి
‘మిస్ టీన్ కెనడా పెటైట్ గ్లోబ్-2015’గా భారత సంతతికి చెందిన అర్ష్‌ప్రీత్ చహల్ ఎంపికైంది. ఆగస్టు 22న టొరంటోలోని రిచ్‌మండ్ హిల్ సెంటర్ ఆఫ్ పెర్‌ఫామింగ్ ఆర్ట్స్‌లో జరిగిన ఈ అందాల పోటీ ఫైనల్లో చహల్ విజేతగా నిలిచింది. 70 మంది యువతులు ఈ పోటీలో పాల్గొన్నారు.

హోంశాఖ నూతన కార్యదర్శిగా రాజీవ్ మహర్షి కేంద్ర హోంశాఖ నూతన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి రాజీవ్ మహర్షి బాధ్యతలు చేపట్టారు. ముందస్తు పదవీ విరమణ చేసిన ఎల్‌సీ గోయల్ స్థానంలో రాజీవ్ బాధ్యతలు స్వీకరించారు. ఆయన రెండేళ్లపాటు పదవిలో కొనసాగుతారు. గతంలో ఈయన ఆర్థిక వ్యవహారాల శాఖలో కార్యదర్శిగా పనిచేశారు. కాగా, భారత వాణిజ్య ప్రోత్సాహక మండలి(ఐటీపీవో) కొత్త చైర్మన్, ఎండీగా ఎల్‌సీ గోయల్‌ను నియమిస్తూ కేంద్రం ఆగస్టు 31న ఉత్తర్యులు జారీచేసింది.

కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శిగా రతన్కేంద్ర ఆర్థిక శాఖ నూతన కార్యదర్శిగా రతన్ పి. వాతాల్ ఆగస్టు 31న నియమితులయ్యారు. 1978 బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కి చెందిన ఐఏఎస్ అధికారి రతన్... ఆర్థిక శాఖలో అత్యంత సీనియర్. ఆర్థిక శాఖలో అత్యంత సీనియర్ కార్యదర్శికే ఫైనాన్స్ సెక్రటరీ హోదా దక్కుతుంది. మరోవైపు, శక్తికాంత దాస్‌ను ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శిగాను, హస్‌ముఖ్ అధియాను రెవెన్యూ కార్యదర్శిగాను కేంద్రం నియమించింది.


శ్రీలంక ప్రధానిగా రణిల్ విక్రమ సింఘే
శ్రీలంక ప్రధానమంత్రిగా రణిల్ విక్రమ సింఘే ఆగస్టు 21న ప్రమాణస్వీకారం చేశారు. ఆయన ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయడం ఇది నాలుగోసారి. ఆగస్టు 17న జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ప్రధాని రణిల్ విక్రమ సింఘే నేతృత్వంలోని యునెటైడ్ నేషనల్ పార్టీ (యూఎన్‌పీ) విజయం సాధించింది. పార్లమెంటులోని 225 స్థానాలకు యూఎన్‌పీ 106 స్థానాలు గెలుచుకుంది. ఈ పార్టీకి పార్లమెంటులో మెజార్టీకి మరో ఏడు స్థానాలు కావాల్సి ఉంది. సిరిసేన నేతృత్వంలోని ఫ్రీడం పార్టీతో కలిసి విక్రమ సింఘే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
ఎయిరిండియా చీఫ్‌గా అశ్వని లొహానీ
ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా సీఎండీగా తొలిసారిగా ఒక రైల్వే శాఖకు చెందిన అధికారి నియమితులయ్యారు. 1980 బ్యాచ్ రైల్వే సర్వీస్ ఆఫ్ మెకానికల్ ఇంజనీర్స్ (ఐఆర్‌ఎస్‌ఎంఈ) ఆఫీసర్ అయిన అశ్వని లొహానీ ఎయిర్‌ఇండియా చీఫ్‌గా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎంపీటీడీసీ) ఎండీగా పనిచేస్తున్నారు. ఎయిరిండియా సీఎండీగా ఆయన పదవీ కాలం మూడేళ్ల పాటు ఉంటుంది. లొహానీ నియామకానికి క్యాబినెట్ నియామకాల కమిటీ ఆమోదముద్ర వేసింది. ప్రస్తుతం ఎయిరిండియా సీఎండీగా 1982 బ్యాచ్ ఉత్తర ప్రదేశ్ క్యాడర్ ఐఏఎస్ అధికారి రోహిత్ నందన్ విధులు నిర్వర్తిస్తున్నారు. నందన్ పదవీకాలం ఆగస్టుతో ముగిసిపోనుంది.
ఆస్ట్రేలియా ఎడ్యుకేషన్ అంబాసిడర్ ‘గిల్‌క్రిస్ట్’
భారత్‌తో విద్యా సంబధాలను మరింత మెరుగుపర్చేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. అందులో భాగంగా భారత్‌లో ఆ దేశ ఎడ్యుకేషన్ అంబాసిడర్‌గా దిగ్గజ క్రికెటర్ అడమ్ గిల్‌క్రిస్ట్‌ను నియమించింది. ఈ విషయాన్ని ఆ దేశ విద్యా మంత్రి క్రిస్టోఫర్ పైన్ తెలిపారు. భారత్‌లో ‘ఆస్ట్రేలియాలో విద్య’కు సంబంధించి తొలి అంబాసిడర్ గిల్‌క్రిస్టే. 
అత్యంత వృద్ధుడిగా జపాన్ వ్యక్తి గిన్నిస్ రికార్డు
ప్రపంచంలో అత్యంత వృద్ధుడిగా జపాన్‌కు చెందిన యసుటరో కొయిడే గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం పొందారు. ఆయన వయసు 112 సంవత్సరాలు. ఆగస్టు 21, 2015వ తేదీన గిన్నిస్ బుక్ ప్రతినిధులు జపాన్‌లోని నగోయా నగరంలో యసుటరోకు గిన్నిస్ సర్టిఫికెట్‌ను అందజేశారు. కొయిడే మార్చి 13, 1903న జన్మించారు. గతంలో అత్యంత వృద్ధుడిగా రికార్డులకెక్కిన టోక్యోకు చెందిన సకారి మొమొయి (112) ఇటీవల మృతిచెందడంతో ఆ స్థానంలో కొయిడే గిన్నిస్ బుక్‌లోకి ఎక్కారు.
రైలు ప్రమాదంలో కర్ణాటక ఎమ్మెల్యే మృతి
అనంతపురం జిల్లా పెనుకొండ సమీపంలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో కర్ణాటకలోని దేవదుర్గం ఎమ్మెల్యే ఎ. వెంకటేశ్‌నాయక్(79) దుర్మరణం చెందారు. బెంగళూరు నుంచి నాందేడ్‌కు వెళ్తున్న నాందేడ్ ఎక్స్‌ప్రెస్ రైలును పెనుకొండ-మడకశిర రోడ్డులోని రైల్వేక్రాసింగ్ వద్ద గ్రానైట్ లోడుతో వెళుతున్న లారీ అదుపుతప్పి ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఎమ్మెల్యేతో సహా ఐదుగురు మృతిచెందగా, ముగ్గురు గాయపడ్డారు.
తెలంగాణ పీఏసీ చైర్మన్ కిష్టారెడ్డి మృతి
తెలంగాణ ప్రజా పద్దుల కమిటీ చైర్మన్, కాంగ్రెస్ సీనియర్ శాసనసభ్యుడు పట్లోళ్ల కిష్టారెడ్డి(73) ఆగస్టు 25, 2015వ తేదీన హైదరాబాద్‌లో కన్నుమూశారు. 1942 అక్టోబరు 2న జన్మించిన కిష్టారెడ్డి ఉస్మానియా నుంచి న్యాయవిద్యలో డిగ్రీ పొందారు. 1970 నుంచి 1980 దాకా పంచగామ సర్పంచ్‌గా, 1981 నుంచి 1986 దాకా పంచాయతీ సమితి అధ్యక్షునిగా పనిచేశారు. 1989, 1999, 2009, 2014ల్లో నారాయణఖేడ్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1999-2004 మధ్య రెండుసార్లు పీఏసీ చైర్మన్‌గా చేశారు. ఆర్నెల్ల క్రితమే మూడోసారి పీఏసీ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. 
‘శ్రీ రాజాలక్ష్మి ఫౌండేషన్’ రమణయ్య రాజా కన్నుమూత
శ్రీ రాజాలక్ష్మి ఫౌండేషన్ అవార్డు ప్రదాత పీవీ రమణయ్య రాజా(87) ఆగస్టు 26, 2015వ తేదీన చెన్నైలో కన్నుమూశారు. విశాఖ జిల్లా భీమునిపట్నంలో జన్మించిన రమణయ్య రాజా 1960లో చెన్నైకి వచ్చి స్థిరపడ్డారు. 

ప్రతిష్టాత్మక అవార్డు: సంగీత, సాహిత్య, నృత్య, వైద్య తదితర రంగాల్లోని నిష్ణాతులకు బహుకరించే ‘శ్రీ రాజాలక్ష్మి ఫౌండేషన్’ అవార్డు ఎంతో ప్రతిష్టాత్మకమైనది. 1979లో స్థాపించిన ఈ సంస్థ ద్వారా తొలి అవార్డును అదే ఏడాది మహాకవి శ్రీశ్రీ అందుకున్నారు. మలి సంవత్సరం మంగళంపల్లి బాలమురళీకృష్ణ స్వీకరించారు. 2009 వరకు అవార్డుల ప్రదాన కార్యక్రమం సాగింది. 1994లో లక్ష్మి-రాజా వైదిక పురస్కార్‌ను ప్రారంభించారు. భార్య మహలక్ష్మి జన్మదినమైన ఆగస్టు 15వ తేదీన పురస్కార గ్రహీతల పేర్లను ప్రకటించడం, తన జన్మదినమైన నవంబర్ 19వ తేదీన పురస్కారాలను ప్రదానం చేయడం రమణయ్య రాజా ఆనవాయితీగా పెట్టుకున్నారు.
సోనియాపై పిటిషన్‌ను కొట్టేసిన అమెరికా కోర్టు 
ఎందరో సిక్కుల మరణాలకు కారణమైన 1984 నాటి ఊచకోత కేసులో మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీపై సిక్కుల సంస్థ దాఖలుచేసిన పిటిషన్‌ను అమెరికా కోర్టు కొట్టివేసింది. పిటిషన్‌కు విచారణార్హత లేదంటూ 2015, జూన్‌లో జిల్లా జడ్జి ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ అప్పీళ్ల కోర్టు ఆగస్టు 25న ఉత్తర్వులు జారీచేసింది. సోనియాకు వ్యతిరేకంగా ఆధారాలు సమర్పించడంలో సిక్ ఫర్ జస్టిస్ (ఎస్‌ఎఫ్‌జే) విఫలమైందని సెకండ్ సర్క్యూట్‌కు చెందిన అప్పీళ్ల కోర్టు త్రిసభ్య ప్యానెల్ పేర్కొంది.

ఎవరెస్ట్‌ను అధిరోహించిన చిన్నారులు
భారత్‌కు చెందిన కందర్ప్ శర్మ (5), రిత్విక (8) ఆగస్టు రెండో వారంలో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించారు. వీరు మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన అక్కాతమ్ముళ్లు. అతి తక్కువ వయసులో 8,848 మీటర్ల ఎత్తయిన ఎవరెస్టును అధిరోహించిన వీరు రికార్డు నెలకొల్పారు. ఇప్పటి వరకు ఈ రికార్డు హర్షిత్ (5 సంవత్సరాల 11 నెలలు) పేరున ఉంది.
హీరో సైకిల్స్ చైర్మన్ కన్నుమూత
హీరో గ్రూప్ సహ వ్యవస్థాపకులు, హీరో సైకిల్స్ చైర్మన్ ఓపీ ముంజల్(87) కన్నుమూశారు. గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ముంజల్ ఆగస్టు 13న డీఎంసీ హీరో హార్ట్ సెంటర్‌లో చికిత్స పొందుతూ మరణించారు. ముంజల్ 1928లో కమాలియాలో (ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉంది) జన్మించారు. ముంజల్ తన ముగ్గురు సోదరులతో కలిసి 1944లో అమృత్‌సర్‌లో సైకిల్ విడిభాగాల వ్యాపారాన్ని ప్రారంభించారు. తర్వాత వీరు 1956లో లూధియానా కేంద్రంగా ‘హీరో’ పేరుతో తొలి సైకిల్ తయారీ కంపెనీ స్థాపించారు. రోజుకు 25 సైకిళ్ల తయారీ సామర్థ్యంతో ప్రారంభమైన ఈ కంపెనీ ప్రస్తుతం రోజుకు 19,500 సైకిళ్లను తయారు చేసే స్థాయికి ఎదిగింది. దేశంలోని సైకిల్ మార్కెట్‌లో 40 శాతం వాటా హీరో సైకిల్స్‌దే. హీరో సైకిల్స్ 1986లో ప్రపంచంలోనే అతిపెద్ద సైకిల్ తయారీ కంపెనీగా గిన్నిస్ బుక్‌లో స్థానం సాధించింది. ముంజల్ అఖిల భారత సైకిల్ తయారీదారుల సంఘానికి అధ్యక్షులుగా పనిచేశారు. రాక్‌మన్ సైకిల్ ఇండస్ట్రీస్, హైవే సైకిల్ ఇండస్ట్రీస్, సన్‌బీమ్ క్యాస్టింగ్, గుజరాత్ సైకిల్స్ లిమిటెడ్ వంటి కంపెనీల డైరె క్టర్‌గా వ్యవహరించారు. ఆయనను ఉద్యోగ్ పత్ర, పంజాబ్ రతన్, సాహీర్ వంటి అవార్డులు వరించాయి. 
ఎన్నికల కమిషనర్‌గా ప్రకాశ్ రావత్
కేంద్ర ఎన్నికల సంఘంలో ఖాళీగా ఉన్న కమిషనర్ పదవికి మాజీ ఐఏఎస్ అధికారి ఓం ప్రకాశ్ రావత్ నియమితులయ్యారు. ఈయన మధ్యప్రదేశ్‌కు చెందిన 1977 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఆయన 2018 డిసెంబరు వరకు పదవిలో కొనసాగుతారు. రావత్ కేంద్ర ప్రభుత్వంలో కార్యదర్శిగా పనిచేసి, 2013 డిసెంబరులో పదవీవిరమణ పొందారు. ముగ్గురు సభ్యుల కేంద్ర ఎన్నికల సంఘంలో నసీం జైదీ ప్రధాన ఎన్నికల కమిషనర్ కాగా, అచల్ కుమార్ జ్యోతి ఎన్నికల కమిషనర్‌గా కొనసాగుతున్నారు.
ట్విట్టర్ అకౌంట్ పొందిన తాజ్‌మహల్
తాజ్‌మహల్ ఆగస్టు 15న ట్విట్టర్ అకౌంట్‌లో చేరింది. దీంతో ఇది ప్రపంచంలో ట్విట్టర్ అకౌంట్‌లో చేరిన తొలి చారిత్రక కట్టడంగా గుర్తింపు పొందింది. ఈ మొఘల్ కట్టడం తాజ్‌మహల్ అకౌంట్‌ను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ప్రారంభించారు.
పాక్‌లో ఆత్మాహుతిదాడిలో పంజాబ్ రాష్ట్ర హోం మంత్రి మృతి
పాకిస్తాన్‌లోని పంజాబ్ రాష్ట్రంలో షాదిఖాన్ గ్రామంలో ఉగ్రవాదులు ఆగస్టు 16న జరిపిన ఆత్మాహుతి దాడిలో ఆ రాష్ట్ర హోం మంత్రి షుజా ఖాంజాదా (71)తోపాటు మరో 19 మంది మృతిచెందారు. మాజీ సైన్యాధికారి అయిన ఖాంజాదా 2014 అక్టోబరు నుంచి మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఉగ్రవాద శిబిరాలపై దాడులు జరిపి వారిపై కఠినంగా వ్యవహరించడంతో ఉగ్రవాదుల చేతిలో హతమయ్యారు.
నాస్తికోద్యమనేత లవణం మృతి
నాస్తికోద్యమ నేత, సంఘ సంస్కర్త గోపరాజు లవణం(86) విజయవాడలో ఆగస్టు 14న మరణించారు. ఆయన ప్రముఖ సంఘసంస్కర్త గోపరాజు రామచంద్రరావు (గోరా) కుమారుడు. ఉప్పు సత్యాగ్రహం కాలంలో జన్మించడంతో ఆయనకు లవణం అని పేరు పెట్టారు. లవణం అస్పృశ్యత, మూఢనమ్మకాలు, జోగిని నిర్మూలన వంటి సంస్కరణల కోసం పోరాడారు. భూదాన, సర్వోదయ ఉద్యమాల్లో పాల్గొన్నారు. అనేక దేశాల్లో నాస్తికోద్యమాన్ని ప్రచారం చేశారు.
ప్రముఖ ఉర్దూ రచయిత హమీదా సలీం కన్నుమూత
ప్రముఖ ఉర్దూ రచయిత హమీదా సలీం కన్నుమూశారు. ఆగస్టు 16న న్యూ ఢిల్లీలోని స్వగృహంలో ఆమె తుదిశ్వాస విడిచారు. అలీగర్ ముస్లిం యూనివర్శిటీ (ఏఎంయూ) నుంచి గ్రాడ్యుయేట్ పట్టా పొందిన తొలి మహిళగా హమీదా గుర్తింపు పొందారు. ‘షోరిస్ ఇ-దారన్’, ‘హమ్ సాత్ తే’, ‘పర్చియోన్ కే ఉజాలే’, ‘హర్దాన్ రవాన్ హై జిందగీ’ తదితర పుస్తకాలను ఆమె రచించారు. 
యాంఫి సీఈవోగా రాజేంద్రన్
భారత మ్యూచువల్ ఫండ్ సమాఖ్య ఏఎంఎఫ్‌ఐ(యాంఫి) సీఈవోగా ఆంధ్రా బ్యాంక్ మాజీ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ సి.వి.ఆర్. రాజేంద్రన్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఏఎంఎఫ్‌ఐ సీఈవోగా వ్యవహరిస్తున్న హెచ్.ఎన్.సినార్ పదవీ కాలం సెప్టెంబర్‌లో ముగుస్తుంది. సినార్ పదవీ విరమణ చేసిన తర్వాత ఆయన స్థానంలో రాజేంద్రన్ సీఈవోగా నియమితులవుతారు. రాజేంద్రన్ గతంలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఈడీగా పనిచేశారు. 
రాష్ట్రపతి ప్రణబ్‌కు సతీవియోగం
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి సతీవియోగం కలిగింది. ఆయన సతీమణి, ప్రముఖ రవీంద్ర సంగీత గాయని శుభ్రా ముఖర్జీ(74) ఆగస్టు 18న న్యూ ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్‌అండ్ రిఫరల్ ఆస్పత్రిలో అనారోగ్యంతో కన్నుమూశారు. 11 రోజుల కిందట శ్వాస సంబంధమైన తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఆమెకు ఐసీయూలో చికిత్స అందించారు. శుభ్రా పరమపదించినట్లు ఎంతో దుఃఖంతో తెలుపుతున్నామని రాష్ట్రపతి భవన్ పేర్కొంది. దేశ చరిత్రలో రాష్ట్రపతి పదవిలో ఉండగా ప్రథమ పౌరురాలు కన్నుమూయడం ఇదే తొలిసారి.

శ్రీలంకలో యూఎస్ రాయబారిగా ఇండియన్ అమెరికన్
శ్రీలంక, మాల్దీవులలో అమెరికా రాయబారిగా ఇండియన్ అమెరికన్ అతుల్ కేశప్ ఖరారయ్యారు. ఈ రీజియన్‌కు రిచర్డ్ రాహుల్ వర్మ తర్వాత భారతీయ సంతతికి చెందిన రెండో రాయబారి అతుల్. గతంలో భారత్‌లోని యూఎస్ ఎంబసీలో అధికారిగా పనిచేసిన అతుల్ కేశప్ (44)కు అమెరికా సెనేట్ ఆగస్టు 5న రాయబారి పదవిని ఖరారు చేసింది. ఆయన ప్రస్తుతం సౌత్ సెంట్రల్ ఆసియన్ అఫైర్స్ బ్యూరో ఆఫ్ స్టేట్‌లో డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. ఆయన తండ్రి కేశప్ చందర్ సేన్ పంజాబ్ రాష్ట్రానికి చెందినవారు.
బిహార్, హిమాచల్‌ప్రదేశ్‌కు కొత్త గవర్నర్లు
త్వరలో ఎన్నికలు జరగనున్న బిహార్, హిమాచల్‌ప్రదేశ్‌కు ఆగస్టు 8న కొత్త గవర్నర్లను నియమించారు. బీజేపీ సీనియర్ నేత రామ్‌నాథ్ కోవింద్‌ను బిహార్‌కు, ఆచార్య దేవ్ వ్రత్‌ను హిమాచల్‌కు గవర్నర్లుగా నియమించారు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన 69 ఏళ్ల కోవింద్ రెండుస్లారు (1994, 2006లో) రాజ్యసభ ఎంపీగా పనిచేశారు. న్యాయవాది అయిన కోవింద్ బీజేపీ ఎస్సీ మోర్చా చీఫ్‌గానూ బాధ్యతలు నిర్వర్తించారు. కాగా, 56 ఏళ్ల వ్రత్ హరియాణాలోని కురుక్షేత్రలో ఆర్య ప్రతినిధి సభ గురుకుల్ ద్వారా ఆధునిక, సంప్రదాయ విద్యను అందిస్తున్నారు. 
గూగుల్ సీఈవోగా సుందర్ పిచాయ్
సెర్చ్ ఇంజన్ కంపెనీ గూగుల్‌కి భారతీయుడైన సుందర్ పిచాయ్ (43) సీఈవోగా నియమితులయ్యారు. ఇప్పటిదాకా ఆయన గూగుల్ ఇంటర్నెట్ వ్యాపారాలకు సంబంధించిన ప్రోడక్ట్ అండ్ ఇంజనీరింగ్ విభాగానికి ఇంచార్జిగా ఉన్నారు. ప్రధాన ఆదాయ వనరులైన సెర్చి, అడ్వర్టైజింగ్, మ్యాప్స్, యూట్యూబ్, మొబైల్ ఆపరేటింగ్ సిస్టం ఆండ్రాయిడ్ మొదలైనవన్నీ సుందర్ సారథ్యంలోని గూగుల్ కిందే ఉంటాయి. కొత్తగా ఏర్పాటైన మాతృసంస్థ ఆల్ఫాబెట్‌లో గూగుల్ సహా నెస్ట్, ఫైబర్, కాలికో వంటివి స్వతంత్ర సంస్థలుగా కొనసాగుతాయి. ప్రస్తుతం గూగుల్‌లో సుందర్ ఏడాదికి రూ. 310 కోట్ల జీత భత్యాలు పొందుతున్నారు. 66 బిలియన్ డాలర్ల ఆదాయం, 16 బిలియన్ డాలర్ల లాభాలతో టాప్ టెక్నాలజీ కంపెనీల్లో ఒకటిగా గూగుల్ వెలుగొందుతోంది.
ప్రముఖ నాట్య కళాకారుడు బాలచంద్ర పెండార్కర్ కన్నుమూత
ప్రముఖ నాట్య కళాకారుడు బాలచంద్ర వెంకటేశ్ పెండార్కర్ (94) కన్నుమూశారు. కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో ముంబైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆగస్టు 11న తుది శ్వాస విడిచారు. 1921 నవంబరు 25న హైదరాబాద్‌లో జన్మించిన ఆయన అనేక నాటకాలు వేశారు. ప్రతిష్టాత్మకమైన విష్ణుదాస్ భావే పురస్కారం, బాలగంధర్వ పురస్కారాం, కేశవ్‌రావ్ బోస్లే పురస్కారం, తన్వీర్ సన్మాన్ పురస్కారం, చతురంగ్ ప్రతిష్టాన్‌కు చెందిన జీవన సాఫల్య పురస్కారంలాంటి ఎన్నో అవార్డులను ఆయన అందుకున్నారు. ఆయన పేరు బాలచంద్ర పెండార్కర్ అయినప్పటి కీ ‘అన్నా’ పేరుతో అందరికీ సుపరిచితుడు. నటనతోపాటు దర్శకుడిగా, గాయకుడిగా, కొరియోగ్రాఫర్‌గా, నిర్మాతగా కళారంగానికి విశేష సేవలు చేశారు. ‘లలిత కళదర్శ్’ అనే నాట్య సంస్థను స్థాపించారు. ఆయన నటించిన మొదటి నాటకం ‘సత్తేచే గులాం’ ఎంతో ప్రజాదరణ పొందింది. 2008లో మహారాష్ట్ర ప్రభుత్వం ఆయనను జీవన సాఫల్య పురస్కారంతో గౌరవించింది.
ఎవరెస్టు బేస్ క్యాంప్‌పై భారత చిన్నారులు
ఇద్దరు భారత చిన్నారులు అరుదైన రికార్డు నెలకొల్పారు. పిన్న వయసులో ఎవరెస్టు శిఖరం బేస్ క్యాంప్‌ను అధిరోహించిన వారిగా రికార్డుల కెక్కారు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన కందర్ప్ శర్మ, రిత్మికా 5380 మీటర్ల ఎత్తులో ఉన్న ఎవరెస్టు శిఖరం బేస్‌క్యాంపు వద్దకు ఆగస్టు 10న చేరుకున్నారు. పిన్న వ యసులో శిఖరం అధిరోహించిన వారు, అలాగే తక్కువ చిన్న వయసులో అధిరోహించిన అక్కా, తమ్ముళ్లుగా కూడా రికార్డు నెలకొల్పారు. అరుణ్ ట్రెక్ సంస్థకు చెందిన షెర్పా తుప్‌డెన్ ఆధ్వర్యంలో ఈ సాహసం చేశారు. గ్వాలియర్‌లోని లిటిల్ ఎంజెల్ హైస్కూల్‌లో వీరు విద్యనభ్యసిస్తున్నారు. కందర్ప్ వయసు ఐదేళ్ల 10 నెలలు, రిత్వికా వయసు 8 ఏళ్ల 11 నెలలు. ఆగస్టు 2న వీరు ప్రయాణం మొదలుపెట్టారు.
ప్రపంచ టాప్-20 టెక్ బిలియనీర్లలో ప్రేమ్‌జీ, శివనాడార్
ప్రపంచ టాప్-20 టెక్ బిలియనీర్లలో భారత్ నుంచి విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ, హెచ్‌సీఎల్ టెక్ వ్యవస్థాపకుడు శివ నాడార్ ఉన్నారు. ఫోర్బ్స్ ‘టెక్నాలజీ రంగం టాప్-100 సంపన్నులు’ జాబితాలో మెక్రోసాఫ్ట్ సహ వ్యవ స్థాపకుడు బిల్ గేట్స్ (79.6 బిలియన్ డాలర్లు) అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. తర్వాతి స్థానాల్లో ఎలిసన్ (50 బిలియన్ డాలర్లు), జెఫ్ బిజోస్ ఉన్నారు. ప్రేమ్‌జీ 13వ స్థానంలో, నాడార్ 14వ స్థానంలో కొనసాగుతున్నారు. ప్రేమ్‌జీ సంపద విలువ 17.4 బిలియన్ డాలర్లుగా, నాడార్ సంపద విలువ 14.4 బిలియన్ డాలర్లుగా ఉంది. ప్రేమ్‌జీ, నాడార్‌తో పాటు ఈ జాబితాలో మరో ఇద్దరు భారతీయులకు స్థానం దక్కింది. వారిలో సింఫనీ టెక్నాలజీ గ్రూప్ చైర్మన్ రమేశ్ వాద్వాని 2.8 బిలియన్ డాలర్ల సంపదతో 73వ స్థానంలో, భారత్ దేశాయ్ 2.5 బిలియన్ డాలర్ల సంపదతో 82వ స్థానంలో ఉన్నారు.

ఫ్యాప్సీ వైస్ ప్రెసిడెంట్‌గా గౌర శ్రీనివాస్
ఫ్యాప్సీ వైస్ ప్రెసిడెంట్‌గా 2015-16 సంవత్సరానికిగాను గౌర గ్రూప్ ఎండీ గౌర శ్రీనివాస్ నియమితులయ్యారు. ఫ్యాప్సీతో ఆయనకు 10 ఏళ్లకుపైగా అనుబంధం ఉంది. అర్బన్ ఇన్‌ఫ్రా, టూరిజం, బ్యాంకింగ్, ఫైనాన్స్ తదితర కమిటీలకు చైర్మన్, కో-చైర్మన్‌గా వ్యవహరించారు. వైస్ ప్రెసిడెంట్‌ను తదుపరి సంవత్సరానికి సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా, ఆ తర్వాతి ఏడాదికి ప్రెసిడెంట్‌గా నియమించడం ఫ్యాప్సీలో ఆనవాయితీగా వస్తోంది.

ఐఎమ్‌ఏ కమాండెంట్‌గా బల్వంత్ సింగ్ నేగిప్రఖ్యాత భారత సైనిక అకాడమీ(ఐఎమ్‌ఏ) కమాండెంట్‌గా లెఫ్టినెంట్ జనరల్ బల్వంత్ సింగ్ నేగి ఆగస్టు 3న బాధ్యతలు చేపట్టారు. ఇంతకుముందు ఈ పదవిలో పని చేసిన మన్వీందర్ సింగ్ రిటైరవడంతో గత మే నుంచి ఆ పదవి ఖాళీగా ఉంది. దాదాపు 37 ఏళ్ల పాటు సైన్యంలో విధులు నిర్వహస్తున్న నేగి ఆర్మీకి చెందిన 14 కార్‌‌ప్స ప్రధాన అధికారిగా పనిచేశారు.

కేంద్ర హోం శాఖ సెక్రెటరీగా అశోక్ ప్రసాద్ సీనియర్ ఐపీఎస్ అధికారి అశోక్ ప్రసాద్‌ను హోం శాఖలో అంతర్గత భద్రతా విభాగానికి కార్యదర్శిగా నియమిస్తూ కేబినెట్ నియామకాల కమిటీ నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ క్యాడర్ 1979 బ్యాచ్‌కి చెందిన అశోక్ ప్రసాద్ అంతకు ముందు హోంశాఖలో అంతర్గత భద్రతా విభాగానికి స్పెషల్ సెక్రెటరీగా పనిచేశారు.

ఏబీఏ ప్రతినిధిగా హైదరాబాదీఅమెరికన్ బార్ అసోసియేషన్(ఏబీఏ)కు బార్ కౌన్సెల్ ఆఫ్ ఇండియా ప్రతినిధిగా హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది జేఎల్‌ఎన్ మూర్తి నియమితులయ్యారు. ప్రస్తుతం మూర్తి ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆల్టర్‌నేటివ్ డిస్‌ప్యూట్ రిజల్యూషన్ (ఐసీఏడీఆర్) ప్రాంతీయ కేంద్రం ఇన్‌చార్జిగా కొనసాగుతున్నారు. కార్పొరేట్ చట్టాల్లో నిష్ణాతుడైన మూర్తి అనేక కంపెనీలకు సలహాదారుగా ఉన్నారు. ఏబీఏలో 90 దేశాల నుంచి 4.13 లక్షల మంది సభ్యులుగా ఉన్నారు.

ఫోర్బ్స్ జాబితాలో బాలీవుడ్ హీరోలుప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఆర్జిస్తున్న సినీనటుల జాబితాలో ముగ్గురు బాలీవుడ్ సూపర్‌స్టార్లు టాప్-10లో చోటు దక్కించుకున్నారు. ప్రముఖ మేగజైన్ ఫోర్బ్స్ మొదటిసారిగా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మొత్తంలో ఆర్జిస్తున్న సినీనటుల జాబితాను విడుదల చేసింది. 2015 ఏడాదికి గాను రూపొందించిన ఈ జాబితాలో బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, సల్మాన్‌ఖాన్, అక్షయ్‌కుమార్‌లు టాప్-10లో నిలిచారు. 34 మంది గ్లోబర్ స్టార్స్‌తో కూడిన ఈ జాబితాలో షారుఖ్ ఖాన్, రణ్‌బీర్ కపూర్‌లూ చోటు ద క్కించుకున్నారు. అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్ సంయుక్తంగా 7వ స్థానంలో, అక్షయ్ కుమార్ 9వ స్థానంలో, షారుక్ ఖాన్ 18వ స్థానంలో, రణబీర్ కపూర్ 30వ స్థానంలో నిలిచారు. హాలీవుడ్ యాక్టర్ రాబర్ట్ డౌనీ జూనియర్ అగ్రస్థానంలో ఉన్నాడు.

No comments:

Post a Comment