AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Sunday 26 November 2017

క్రీడలు మే 2016

క్రీడలు మే 2016
ఐపీఎల్-9 చాంపియన్‌గా సన్‌రైజర్స్ హైదరాబాద్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-9 చాంపియన్‌గా సన్‌రైజర్స్ హైదరాబాద్ నిలిచింది. మే 29న బెంగళూరులో జరిగిన ఫైనల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరును ఎనిమిది పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓడించింది. నిర్ణీత 20 ఓవర్లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ 208 పరుగులు చేయగా, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 200 పరుగులు చేసింది. 39 పరుగులు చేయడంతో పాటు రెండు వికెట్లు తీసిన బెన్ క టింగ్ (సన్‌రైజర్స్) మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. గెలిచిన జట్టుకు రూ.15 కోట్లు, రన్నరప్‌కు రూ.10 కోట్లు ప్రైజ్‌మనీ లభించింది.
ఆరెంజ్ క్యాప్ (అత్యధిక పరుగులు): విరాట్ కోహ్లి (973)
పర్పుల్ క్యాప్ (అత్యధిక వికెట్లు): భువనేశ్వర్ కుమార్ (23)
అత్యధిక సిక్సర్లు: విరాట్ కోహ్లి (38)
మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్: విరాట్ కోహ్లి
ఎమర్జింగ్ ప్లేయర్: ముస్తాఫిజర్ రహ్మాన్ (17 వికెట్లు)
ఫెయిర్ ప్లే అవార్డు: సన్‌రైజర్స్ హైదరాబాద్.


ప్రపంచ బ్యాడ్మింటన్ టీం చాంపియన్‌షిప్ 
ప్రపంచ మహిళల బ్యాడ్మింటన్ టీం చాంపియన్‌షిప్ (ఉబెర్ కప్)ను చైనా గెలుచుకొంది. చైనాలో మే 21న జరిగిన పోటీలో దక్షిణ కొరియాను ఓడించింది. పురుషుల ప్రపంచ బ్యాడ్మింటన్ టీం చాంపియన్‌షిప్ (థామస్ కప్)ను డెన్మార్క్ గెలుచుకుంది. చైనాలోని కున్‌షాన్‌లో మే 22న జరిగిన ఫైనల్లో ఇండోనేసియాను ఓడించింది.
బీసీసీఐ అధ్యక్షుడిగా అనురాగ్ ఠాకూర్ ఎన్నిక
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) 34వ అధ్యక్షుడిగా అనురాగ్ ఠాకూర్ ఎన్నికయ్యారు. మే 22న ముంబైలో జరిగిన ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్‌జీఎం)లో ఆయన ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. సెప్టెంబర్ 2017 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. ఇప్పటి వరకు బీసీసీఐ కార్యదర్శిగా ఉన్న 41 ఏళ్ల ఠాకూర్ బోర్డు అధ్యక్ష పదవిని అధిరోహించిన రెండో పిన్న వయస్కుడు. గతంలో 1963-66 మధ్య ఫతేసింగ్ రావ్ గైక్వాడ్ 33 ఏళ్ల వయసులో అధ్యక్షుడిగా పని చేశారు. మహారాష్ట్ర క్రికెట్ సంఘం అధ్యక్షుడు అజయ్ షిర్కే కార్యదర్శిగా ఎన్నికయ్యారు.
ఆసియా 6 రెడ్ స్నూకర్ విజేత పంకజ్ అద్వానీ
భారత స్టార్ క్యూయిస్ట్ పంకజ్ అద్వానీ తన ఖాతాలో మరో అంతర్జాతీయ టైటిల్‌ను వేసుకున్నాడు. అబుదాబిలో మే 22న ముగిసిన ఆసియా 6 రెడ్ స్నూకర్ చాంపియన్‌షిప్‌లో పంకజ్ అద్వానీ చాంపియన్‌గా నిలిచాడు. బెంగళూరుకు చెందిన 30 ఏళ్ల పంకజ్ ఫైనల్లో కీన్ హూ మో (మలేసియా)పై విజయం సాధించాడు. ఇప్పటికే 15 సార్లు వివిధ విభాగాల్లో ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్స్ నెగ్గిన పంకజ్‌కు ఆసియా టైటిల్ దక్కడం ఇది ఆరోసారి.
రియో పతకం సాధిస్తే ఖేల్త్న్ర
ప్రతిష్టాత్మక రియో ఒలింపిక్స్ 2016లో పతకం సాధించిన వారికి వెంటనే ప్రభుత్వం నుంచి గుర్తింపు దక్కనుంది. వీరి పేర్లను 2016 రాజీవ్ గాంధీ ఖేల్త్న్ర, అర్జున అవార్డుల కోసం పరిగణనలోకి తీసుకుంటారు. ఈమేరకు కేంద్ర క్రీడాశాఖ నిర్ణయం తీసుకుంది. వ్యక్తిగత విభాగంలో పతకం నెగ్గినవారికి ఖేల్త్న్ర దక్కనుంది. అయితే అంతకుముందు వీరు ఈ అవార్డును తీసుకుని ఉండకూడదు. అలాగే టీమ్ ఈవెంట్స్‌లో తమ ప్రతిభతో జట్టును గెలిపించిన వారికి అర్జున అవార్డును అందిస్తారు. వాస్తవానికి ఖేల్త్న్ర, అర్జున పురస్కారాలు దక్కాలంటే ఆటగాళ్లు గత నాలుగేళ్లలో చేసిన అద్భుత ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుంటారు.

ఆండీ ముర్రే, సెరెనా విలియమ్స్‌లకు రోమ్ మాస్టర్స్ టైటిల్స్
రోమ్ మాస్టర్స్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను ఆండీ ముర్రే గెలుచుకున్నాడు. రోమ్‌లో మే 15న జరిగిన ఫైనల్లో నొవాక్ జకోవిచ్‌ను ముర్రే ఓడించాడు. మహిళల సింగిల్స్ ఫైనల్లో మాడిసన్ కీస్‌ను ఓడించి సెరెనా విలియమ్స్ టైటిల్ దక్కించుకుంది. మహిళల డబుల్స్ టైటిల్‌ను సానియా మీర్జా, మార్టినా హింగిస్‌ల జోడీ గెలుచుకుంది.
మాక్స్ వెర్ స్టాపెన్‌కు స్పెయిన్ గ్రాండ్ ప్రి
ఫార్ములావన్ స్పెయిన్ గ్రాండ్ ప్రి టైటిల్‌ను రెడ్‌బుల్ జట్టుకు చెందిన పద్దెనిమిదేళ్ల మాక్స్ వెర్‌స్టాపెన్ గెలుచుకున్నాడు. దీంతో చిన్న వయసులో ఫార్ములావన్ టైటిల్ నెగ్గిన డ్రైవర్‌గా రికార్డులకెక్కాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు గతంలో ఇటలీ గ్రాండ్ ప్రి నెగ్గిన వెటల్ (21 సం.) పేరుపై ఉండేది. బార్సిలోనాలో మే 15న జరిగిన రేసులో వెర్‌స్టాపెన్ మొదటి స్థానాన్ని దక్కించుకోగా, రైకోనెన్, వెటల్‌లు వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.
ఐసీసీ స్వతంత్ర చైర్మన్‌గా శశాంక్ మనోహర్
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తొలి స్వతంత్ర చైర్మన్‌గా శశాంక్ మనోహర్ మే 12న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఈ పదవిలో రెండేళ్ల పాటు కొనసాగనున్నారు. దేశ క్రికెట్ బోర్డ్‌తో సంబంధం లేకుండా ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఎన్నికైన మొదటి వ్యక్తిగా శశాంక్ మనోహర్ నిలిచారు. భారత్‌లో ప్రముఖ న్యాయవాదిగా పేరుగాంచిన శశాంక్ మనోహర్ 2008 నుంచి 2011 వరకు బీసీసీఐ అధ్యక్షుడిగా పని చేశారు. ఆ తర్వాత బోర్డుకు దూరమైనా... జగ్‌మోహన్ దాల్మియా ఆకస్మిక మరణంతో 2015 అక్టోబర్‌లో మరోసారి బీసీసీఐ సారథిగా పగ్గాలు చేపట్టారు. కానీ 2016, మే 10న బోర్డు పదవికి రాజీనామా సమర్పించారు.
ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్‌గా మళ్లీ కుంబ్లే
ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్‌గా భారత మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే మరోసారి నియమితులయ్యారు. 2012లో తొలిసారిగా ఆయన ఈ బాధ్యతలు చేపట్టారు. తాజా నియామకంతో మరో మూడేళ్ల పాటు (2018 వరకు) ప్యానెల్ కు చీఫ్‌గా వ్యవహరించనున్నారు. ఇక కమిటీలో సభ్యులుగా రాహుల్ ద్రవిడ్‌కు చోటు లభించింది. తాజా ఆటగాళ్ల ప్రతినిధిగా ద్రవిడ్‌తో పాటు ఆసీస్ మాజీ స్పిన్నర్ టిమ్ మే నియమితులయ్యారు. మాజీ ఆటగాళ్ల ప్రతినిధిగా శ్రీలంక మాజీ క్రికెటర్ మహేళ జయవర్ధనే, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఆండ్రూ స్ట్రాస్‌ను నియమించారు. వీరంతా మూడేళ్ల పాటు పదవిలో కొనసాగుతారు. మీడియా ప్రతినిధిగా కామెంటేటర్ రవిశాస్త్రి, అంపైర్ల ప్రతినిధిగా రిచర్డ్ కెటిల్‌బరో... ఎక్స్ అఫీషియో చైర్మన్లుగా శశాంక్ మనోహర్, డేవ్ రిచర్డ్‌సన్ వ్యవహరిస్తారు.
ఐపీఎల్‌లో కోహ్లి సెంచరీల రికార్డు
భారత స్టార్ ఆటగాడు, టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి.. ఐపీఎల్‌లో సరికొత్త రికార్డును నెలకొల్పాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఒకే సీజన్‌లో మూడు, అంతకన్నా ఎక్కువ సెంచరీలు చేసిన ఆటగాడిగా కోహ్లి నిలిచాడు. మే 19 నాటికి 2016 సీజన్‌లో కోహ్లి మొత్తం నాలుగు సెంచరీలు బాదాడు. ఈ సీజన్‌లో గుజరాత్ లయన్స్ జట్టుపై రెండు, పుణే జట్టుపై ఒకటి, పంజాబ్‌పై ఒక సెంచరీ సాధించాడు.
4×100 మీ. రిలేలో జాతీయ రికార్డు
బీజింగ్ వరల్డ్ చాలెంజ్ అథ్లెటిక్స్ మీట్‌లో భారత రిలే మహిళల జట్టు 4×100 మీటర్ల విభాగంలో జాతీయ రికార్డును నెలకొల్పింది. చైనాలోని బీజింగ్‌లో మే 18న జరిగిన ఈ మీట్‌లో ద్యుతీచంద్, శ్రాబని నంద, హెచ్‌ఎం జ్యోతి, మెర్లిన్ జోసెఫ్‌లతో కూడిన భారత బృందం 44.03 సెకన్లలో గమ్యానికి చేరుకొని నాలుగో స్థానాన్ని సంపాదించింది. ఈ క్రమంలో ద్యుతీచంద్ జట్టు 1998లో సరస్వతి, రచిత మిస్త్రీ, షైలా, పీటీ ఉష బృందం 44.43 సెకన్లతో నెలకొల్పిన జాతీయ రికార్డును బద్దలు కొట్టింది. జాతీయ రికార్డు నెలకొల్పిన మహిళల రిలే జట్టుకు తెలంగాణకు చెందిన నాగపురి రమేశ్ కోచ్‌గా వ్యవహరించారు.

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత్‌కు 4వ స్థానం
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వార్షిక వన్డే ర్యాంకింగ్స్‌లో భారత్ నాలుగో స్థానానికి పడిపోయింది. మే 4న విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా మొదటి స్థానంలో నిలవగా, న్యూజిలాండ్ రెండో స్థానంలో, దక్షిణాఫ్రికా మూడో స్థానంలో ఉన్నాయి. టీ-20 ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్ మొదటి స్థానాన్ని దక్కించుకోగా, భారత్ రెండో స్థానంలో నిలిచింది.
జకోవిచ్‌కు మాడ్రిడ్ మాస్టర్స్ టైటిల్
మాడ్రిడ్ టెన్నిస్ మాస్టర్స్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను నొవాక్ జకోవిచ్ (సెర్బియా) గెలుచుకున్నాడు. మాడ్రిడ్‌లో మే 9న జరిగిన ఫైనల్లో ఆండీ ముర్రే(బ్రిటన్)పై జకోవిచ్ గెలుపొందాడు. 
లియాండర్ పేస్ జోడీకి ఏటీపీ ఛాలెంజర్ టోర్నీ టైటిల్
ఏటీపీ ఛాలెంజర్ టోర్నమెంట్ పురుషుల డబుల్స్ టైటిల్ ను లియాండర్ (భారత్), సామ్ గ్రోత్ (ఆస్ట్రేలియా) జోడీ గెలుచుకుంది. బుసాన్‌లో మే 8న జరిగిన ఫైనల్లో సంచాయ్, సొంచాట్ రటివటనా (థాయిలాండ్)లను ఈ జోడీ ఓడించింది. పేస్‌కు ఇది 12వ ఛాలెంజర్ టైటిల్.
ఎంసీసీ అధ్యక్షుడిగా మాథ్యూ ఫ్లెమింగ్
మాజీ ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ మాథ్యూ ఫ్లెమింగ్ ప్రఖ్యాత మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) అధ్యక్ష పదవిని చేపట్టనున్నారు. 2016 అక్టోబర్ 1న ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. బుధవారం లార్డ్స్‌లో జరిగిన ఎంసీసీ వార్షిక సర్వసభ్య సమావేశంలో ప్రస్తుత అధ్యక్షుడు రోజర్ నైట్ ఈ పదవికి 51 ఏళ్ల ఫ్లెమింగ్ పేరును నామినేట్ చేశారు. ఇంగ్లండ్ తరఫున ఈ మాజీ ఆటగాడు 11 వన్డేలు ఆడారు. ఎంసీసీ ఫౌండేషన్ పేరిట అఫ్ఘానిస్తాన్‌లో క్రికెట్ అభివృద్ధికి ఫ్లెమింగ్ కీలక పాత్ర పోషించారు.
బీసీసీఐ అధ్యక్ష పదవికి శశాంక్ మనోహర్ రాజీనామా 
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్ష పదవికి శశాంక్ మనోహర్ రాజీనామా చేశారు. జగ్మోహన్ దాల్మియా ఆకస్మిక మరణం తర్వాత 2015 అక్టోబరులో మనోహర్ ఏకగ్రీవంగా ఎంపికయ్యారు.బోర్డు నిబంధనల ప్రకారం 15 రోజుల్లోగా ప్రత్యేక సర్వసభ్య సమావేశం నిర్వహించి అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సి ఉంటుంది.

రోస్‌బర్గ్‌కు రష్యా గ్రాండ్ ప్రి టైటిల్
మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్‌బర్గ్ ఫార్ములావన్ రష్యా గ్రాండ్ ప్రి టైటిల్ గెలుచుకున్నాడు. సోచి(రష్యా)లో మే1న జరిగిన రేసులో లూయిస్ హామిల్టన్ రెండో స్థానంలో నిలిచాడు.

రైల్వేస్‌కు పురుషుల హాకీ చాంపియన్‌షిప్జాతీయ పురుషుల 6వ హాకీ చాంపియన్‌షి ప్‌ను రైల్వేస్ నిలబెట్టుకుంది. మే 1న సైఫైలో జరిగిన ఫైనల్స్‌లో పంజాబ్‌ను ఓడించింది. 

ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో పురుషుల సింగిల్స్‌ను లీ చోంగ్ వీ (మలేషియా) గెలుచుకున్నాడు. మహిళల సింగిల్స్ టైటిల్‌ను వాంగ్ యిహాన్ (చైనా) గెలుచుకుంది. ఫైనల్స్‌లో లీ గ్జురాయ్ (చైనా)ను ఓడించింది. 

టి20ల్లో 21 బంతుల్లోనే సెంచరీవెస్టిండీస్‌లోని ట్రినిడాడ్ అండ్ టొబాగో బ్యాట్స్‌మన్ ఇరాఖ్ థామస్ విధ్వంసకర బ్యాటింగ్‌తో 21 బంతుల్లోనే శతకం నమోదు చేశాడు. టి20 క్రికెట్‌లో ఇదే అత్యంత వేగవంతమైన సెంచరీ. టొబాగో క్రికెట్ సంఘం నిర్వహించిన టోర్నీలో స్కార్‌బారో తరఫున బరిలోకి దిగిన అతను, స్పీ సైడ్ టీమ్‌పై ఈ ఘనత సాధించాడు. మ్యాచ్ ముగిసేసరికి 23 ఏళ్ల ఇరాఖ్ 31 బంతుల్లోనే 15 సిక్సర్లు, 5 ఫోర్లతో 131 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. గతంలో ట్రినిడాడ్ జట్టులో అండర్-13 స్థాయిలో ప్రాతినిధ్యం వహించిన అతను, జాతీయ అండర్-19 ప్రాబబుల్స్‌లో కూడా ఉన్నాడు. 2013 ఐపీఎల్‌లో పుణేపై క్రిస్ గేల్ 30 బంతుల్లో సెంచరీ చేసిన రికార్డు ఇప్పుడు తెరమరుగైంది. 

ఈపీఎల్ చాంపియన్‌గా లీసెస్టర్ సిటీ క్లబ్ఏమాత్రం అంచనాలు లేని లీసెస్టర్ సిటీ ఫుట్‌బాల్ క్లబ్.. ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ (ఈపీఎల్) 2015-2016 సీజన్ చాంపియన్‌గా నిలిచింది. 132 ఏళ్ల చరిత్ర ఉన్న లీసెస్టర్ సిటీ క్లబ్ చరిత్రలో ఆ జట్టు ఈపీఎల్ టైటిల్ గెలవడం ఇదే మొదటిసారి. 24 ఏళ్ల క్రితం మొదలైన ఈ ప్రతిష్టాత్మక చాంపియన్‌షిప్‌లో ఇప్పటివరకు విఖ్యాత ఆటగాళ్లు సభ్యులుగా ఉన్న ప్రముఖ జట్లే విజేతలుగా అవతరించాయి. ఈసారి ప్రీమియర్ లీగ్‌లో మరో రెండు రౌండ్‌లు మిగిలి ఉండగానే... ఇతర సమీకరణాలతో సంబంధం లేకుండా లీసెస్టర్ సిటీకి టైటిల్ ఖాయమైంది. ప్రస్తుతం 36 మ్యాచ్‌లు ఆడిన లీసెస్టర్ సిటీ 77 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. టొటెన్‌హమ్ 70 పాయింట్లతో రెండో స్థానంలో, అర్సెనల్ 67 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాయి. 

‘ఖేల్త్న్ర’కు కోహ్లి పేరు సిఫారసు భారత టెస్టు క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి పేరును దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘రాజీవ్ గాంధీ ఖేల్త్న్ర’కు బీసీసీఐ ప్రతిపాదించింది. అలాగే అర్జున అవార్డు కోసం అజింక్యా రహానే పేరును కూడా క్రీడా శాఖకు సిఫారసు చేసింది. ఒకవేళ ఖేల్త్న్ర కోహ్లిని వరిస్తే ఈ అవార్డును దక్కించుకున్న మూడో క్రికెటర్‌గా నిలుస్తాడు. గతంలో సచిన్, ధోని అందుకున్నారు. ఖేల్త్న్రకు రూ.7.5 లక్షలు, అర్జునకు రూ.5 లక్షలు బహుమతిగా అందిస్తారు. ఈ పురస్కారం విషయంలో కోహ్లికి స్క్వాష్ చాంపియన్ దీపికా పళ్లికాల్, గోల్ఫర్ అనిర్బాన్ లాహిరి, ఆసియా గేమ్స్ స్వర్ణ పతక విజేత షూటర్ జితూ రాయ్, రన్నర్ టింటూ లూకాలతో పోటీ ఎదురుకానుంది.

ఐసీసీ వార్షిక టీం ర్యాంకులుఅంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వార్షిక వన్డే ర్యాంకింగ్స్‌లో భారత్ నాలుగో స్థానానికి పడిపోయింది. ఆస్ట్రేలియా (124) అగ్రస్థానంలో కొనసాగుతుండగా, న్యూజిలాండ్ (113), దక్షిణాఫ్రికా (112) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 2013-14 ఏడాదిలో ఫలితాలను పక్కనబెట్టి 2014-15లో జట్లు సాధించిన విజయాల్లో 50 శాతాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ వార్షిక ర్యాంక్‌లను కేటాయించారు. టి20 ర్యాంకింగ్స్‌లో భారత్, న్యూజిలాండ్ సమాన పాయింట్ల (132)తో నిలిచినా... దశాంశమానం (+0.21) తేడాతో టీమిండియా రెండో ర్యాంక్‌కు పడిపోయింది. 2016 టి20 చాంపియన్ వెస్టిండీస్ (122) మూడు రేటింగ్ పాయింట్లు కోల్పోయి మూడో స్థానానికి పరిమితమైంది. దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, శ్రీలంక, అఫ్ఘానిస్తాన్, బంగ్లాదేశ్ టాప్-10లో ఉన్నాయి.

No comments:

Post a Comment