చరిత్రలో ఈ నెల జూలై (1 - 6) 2017
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆహార ధాన్యాల ఉత్పత్తి 96.36 లక్షల టన్నులు
ఎప్పుడు : 2016-17లో
ఎక్కడ : తెలంగాణలో
తెలంగాణలో సినిమా టికెట్ల ధరల పెంపునకు బ్రేక్సినిమా టికెట్ల ధరల పెంపు ఉత్తర్వులను తాత్కాలికంగా నిలిపివేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు జీవోను వెంటనే నిలిపేయాలని హోం శాఖను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ ఆదేశించారు. రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరలను భారీగా పెంచుతూ ఈనెల 23న హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఏసీ థియేటర్లలో గరిష్టంగా రూ.70 ఉన్న ధరను రూ.120కి పెంచగా.. పెరిగిన ధరలను థియేటర్లు ఇప్పటికే అమల్లోకి తెచ్చాయి.
తెలంగాణలో వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్తెలంగాణలో 2018 నుంచి ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్ ప్రవేశ పెట్టాలని, ఈ రంగానికి భారీగా నిధులు పెంచాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ‘రైతు సంక్షేమం - వ్యవసాయాభివృద్ధి’పై జూలై 1న ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన ఆయన ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఐదువేల ఎకరాలకు ఒకటి చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 2,500 క్లస్టర్లను ఏర్పాటు చేస్తున్నామని, ప్రతీ క్లస్టర్‌లో రైతులు ఎప్పటికప్పుడు సమావేశం కావడానికి వీలుగా రైతు వేదికలు నిర్మిస్తామని సీఎం ప్రకటించారు. కల్తీ విత్తనాలు, ఎరువుల విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వ్యవసాయనికి ప్రత్యేక బడ్జెట్
ఎప్పుడు : 2018 నుంచి
ఎవరు : తెలంగాణ ప్రభుత్వం
ఏపీలో చెట్లు నాటేవారికి ‘వృక్షమిత్ర’ అవార్డులుఆంధ్రప్రదేశ్‌లో చెట్లు నాటే వారిని ప్రోత్సహించడంలో భాగంగా వృక్ష మిత్ర అవార్డులు ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. గుంటూరు రూరల్ మండలం ఓబులనాయుడుపాలెంలో జూలై 1న జరిగిన 68వ వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఆయన వనం - మనం కార్యక్రమంలో పాల్గొన్నారు. తొలుత మంత్రులతో కలిసి మొక్కలను నాటారు. అనంతరం మాట్లాడుతూ వనం-మనం అందరి జీవితంలో భాగం కావాలన్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన వనజీవి రామయ్యను ప్రోత్సహించడంలో భాగంగా రూ.10 వేలు పింఛను ఇచ్చామని చెప్పారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : చెట్లు నాటే వారికి వృక్షమిత్ర అవార్డులు
ఎప్పుడు : జూలై 1
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్‌లో
ఎవరు : సీఎం చంద్రబాబు
ఆర్థికంపాన్‌తో ఆధార్‌ను జతచేయడం తప్పనిసరి
జూలై 1 నుంచి పాన్ (పర్మినెంట్ అకౌంట్ నంబర్)తో ఆధార్ కార్డును తప్పనిసరిగా జతచేయాల్సిందేనంటూ కేంద్ర ప్రభుత్వం జూన్ 29న ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం పాన్ కార్డుకు దరఖాస్తు చేసే సమయంలో ఆధార్ నంబర్‌ను గానీ, లేదా ఆధార్‌లో నమోదు చేసుకున్నట్లు ఎన్‌రోల్‌మెంట్ నంబర్‌ను గానీ తప్పనిసరిగా అనుసంధానించాలి. ఆదాయపన్ను రిటర్ను దాఖలు చేసే సమయంలోగానీ, బ్యాంకు ఖాతాను ఓపెన్ చేసే సమయంలో గానీ పాన్, ఆధార్‌లు తప్పనిసరిగా అనుసంధానించాల్సిందే. వ్యక్తుల ఆర్థిక లావాదేవీలన్నీ పారదర్శకంగా ఉండేందుకు గాను ఈ ప్రక్రియను తప్పనిసరి చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పాన్‌తో ఆధార్ జతచేయడం తప్పనిసరి
ఎప్పుడు : జూలై 1
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎందుకు : ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకత కోసం
ఎయిరిండియాలో డిజిన్వెస్ట్‌మెంట్‌కు కేబినెట్ ఆమోదం భారీ అప్పుల్లో కూరుకుపోయిన ఎయిరిండియాలో వాటాల ఉపసంహరణ ప్రతిపాదనకు జూన్ 28న కేంద్ర కేబినెట్ సూత్రప్రాయ ఆమోదం తెలియజేసింది. ఎంత మేర వాటా విక్రయించాలి, విధి విధానాలు ఏంటన్నది ఖరారు చేసేందుకు మంత్రుల గ్రూపు ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది.
ప్రభుత్వ రంగంలోని ఎయిరిండియా రూ.52,000 కోట్లకు పైగా రుణ భారాన్ని మోస్తోంది. 2012లో యూపీఏ సర్కారు రూ.30,000 కోట్ల బెయిలవుట్ ప్యాకేజీతో దీన్ని తాత్కాలికంగా ఆదుకుంది. మరోవైపు ఎయిర్ ఇండియాను పూర్తిగా ప్రైవేటుపరం చేయాలని నీతి ఆయోగ్ ఇప్పటికే ప్రభుత్వానికి సూచించింది. క్విక్ రివ్యూ:ఏమిటి : ఎయిర్ ఇండియాలో పెట్టుబడుల ఉపసంహరణకు ఆమోదం
ఎప్పుడు : జూన్ 28
ఎవరు : కేంద్ర కేబినెట్
ఎందుకు : నష్టాల్లో ఉన్న సంస్థ నుంచి వాటాల ఉపసంహరణ కోసం
వస్తు, సేవల పన్ను విధానం ప్రారంభం ఒక దేశం ఒకే పన్ను నినాదంతో వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) ప్రారంభమైంది. దేశ చరిత్రలో అత్యంత కీలక సంస్కరణగా నిలిచిపోయే ఈ పన్నును జూన్ 30 అర్ధరాత్రి పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోదీ ఆవిష్కరించారు. ఇది ఏ ఒక్క పార్టీ, ఒక్క ప్రభుత్వం ఘనత కాదని, భవ్య భారతం కోసం సమష్టిగా చేసిన కృషి ఫలితమని ప్రధాని ఉద్ఘాటించారు. జీఎస్టీని ‘ఉత్తమమైన, సరళమైన పన్ను’గా అభివర్ణించారు. దేశ ప్రజాస్వామ్య పరిణతికి జీఎస్టీ ఓ సాధికార రూపమని రాష్ట్రపతి పేర్కొన్నారు.
ఎరువులపై 5 శాతం జీఎస్టీ
జీఎస్టీ అమలుకు కొద్ది గంటల ముందు జీఎస్టీ కౌన్సిల్ సమావేశమై రైతులకు సంబంధించిన రెండు అంశాలపై పన్నురేటును తగ్గించింది. గతంలో 12 శాతం పరిధిలో ఉన్న ఎరువులను 5 శాతం పరిధిలోకి.. 28 శాతంగా ఉన్న ట్రాక్టర్ల విడిభాగాలను 18 శాతంలోకి చేరుస్తూ నిర్ణయం తీసుకుంది.
18 సమావేశాలు..
2016 సెప్టెంబర్ 23న జీఎస్టీ కౌన్సిల్ తొలిసారి సమావేశమైంది. ఆనాటి నుంచి నేటి వరకు 18 సార్లు ఈ మండలి సమావేశమైంది. విసృ్తతమైన అంశాలపై కూలంకశంగా చర్చించి 5, 12, 18, 28 శాతం పన్ను పరిధిని నిర్ణయించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జీఎస్టీ అమలు ప్రారంభం
ఎప్పుడు : జూలై 1
ఎవరు : రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : పార్లమెంట్ సెంట్రల్ హాల్
ఎందుకు : దేశంలో ఏకీకృత పన్నుల కోసం
2018 నాటికి 10.2 శాతానికి ఎన్‌పీఏలు : ఆర్‌బీఐ 2017 మార్చి నాటికి 9.6 శాతంగా ఉన్న నిరర్థక ఆస్తులు(ఎన్‌పీఏలు) 2018 మార్చి నాటికి 10.2 శాతానికి చేరే అవకాశం ఉందని రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) అంచనా వేసింది. ఈ మేరకు ఆర్‌బీఐ జూన్ 30న తాజా ద్రవ్య స్థిరత్వ నివేదికను ఆవిష్కరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 7.3 శాతంగా ఉంటుందని నివేదికలో పేర్కొంది.
నివేదికలోని ముఖ్యాంశాలు..
అంతర్జాతీయం2019 ప్రపంచ పుస్తక రాజధానిగా షార్జా 2019 ప్రపంచ పుస్తక రాజధానిగా యూఏఈలోని షార్జా నగరం ఎంపికైంది. ఈ మేరకు జూన్ 29న యునెస్కో ఓ ప్రకటన విడుదల చేసింది. గల్ఫ్ కోపరేషన్ కౌన్సిల్(జీసీసీ)లో ఈ గుర్తింపు పొందిన తొలి నగరంగా షార్జా నిలిచింది.
2001 నుంచి యునెస్కో ఏటా ఓ నగరాన్ని ప్రపంచ పుస్తక రాజధానిగా గుర్తిస్తుంది. 2001లో స్పెయిన్‌లోని మేడ్రిడ్ నగరానికి తొలి గుర్తింపు లభించింది. 2017కి గాను రిపబ్లిక్ ఆఫ్ గునియాలోని కొనార్కీ నగరం, 2018కి గాను గ్రీస్‌లోని ఏథెన్స్ నగరం ఈ గుర్తింపు పొందాయి.
2003లో భారత్‌లోని న్యూఢిల్లీకి ప్రపంచ పుస్తక రాజధానిగా గుర్తింపు లభించింది. పుస్తక పఠనం, సాహిత్య అభివృద్ధి కోసం చేపట్టిన కార్యక్రమాల ఆధారంగా యునెస్కో ఈ నగరాలను ఎంపిక చేస్తుంది.
క్విక్ రివ్యూ:ఏమిటి : 2019 ప్రపంచ పుస్తక రాజధానిగా షార్జా ఎంపిక
ఎప్పుడు : జూన్ 29
ఎవరు : యునెస్కో
ఎందుకు : పుస్తక పఠనం, సాహిత్య అభివృద్ధి కోసం చేపట్టిన కార్యక్రమాల ఆధారంగా
టీఏజేకేపై నిషేధం విధించిన పాకిస్తాన్ ముంబై పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయీద్‌కు చెందిన జమాత్ ఉద్ దవా(జేయూడీ) ఫ్రంట్‌లో భాగమైన తెహ్రిక్-ఈ-ఆజాద్ జమ్మూ కశ్మీర్(టీఏజేకే)పై పాకిస్తాన్ నిషేధం విధించింది. ఉగ్రవాద నిర్మూలనకు ఇస్తున్న నిధులను నిలిపేస్తామంటూ అంతర్జాతీయంగా వస్తున్న ఒత్తిడుల కారణంగా పాక్ ఈ నిర్ణయం తీసుకుంది. గత ఫిబ్రవరి 5న కశ్మీర్ దినోత్సవం అంటూ.. స్వాతంత్య్రం కావాలంటూ ర్యాలీలు తీయడం లాంటి కార్యక్రమాలను జేయూడీ నిర్వహించింది. దీంతో సయీద్‌ను లాహోర్‌లో 90 రోజుల పాటు గృహ నిర్బంధంలో ఉంచారు. గతంలోనూ సయీద్‌ను పాక్ ప్రభుత్వం గృహ నిర్బంధంలో ఉంచింది.
క్విక్ రివ్యూ: ఏమిటి : తెహ్రిక్-ఈ-ఆజాద్ జమ్మూ కశ్మీర్‌పై నిషేధం
ఎప్పుడు : జూలై 1
ఎవరు : పాకిస్తాన్
డోకా లా కనుమ మాదంటూ మ్యాప్ విడుదల చేసిన చైనాసిక్కిం సెక్టార్‌లో ఉండే ‘డోకా లా’ కనుమను తమ దేశంలో భాగంగా చూపుతూ జూలై 1న చైనా ఓ మ్యాప్‌ను విడుదల చేసింది. భారత సైనికులు తమ భూభాగంలోకి అనుమతి లేకుండా ప్రవేశించారని చైనా ఆరోపించినప్పుడు భారత సైనికులు వెళ్లింది ఈ కనుమ వద్దకే. కొన్నిరోజుల క్రితం భారత్, చైనా సైనికులు కలబడిందీ ఇక్కడే. డోకా లాను చైనా డాంగ్లాంగ్ అని పిలుస్తుంది. వాస్తవానికి ఈ ప్రాంతం భారత్, చైనా, భూటాన్.. మూడు దేశాల సరిహద్దులో ఉంటుంది. కానీ 2012 నాటి ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ చైనా ఏకపక్షంగా దీనిని తమ భూభాగంగా ప్రకటించుకుని రోడ్డు నిర్మాణాన్ని చేపట్టింది. దీనిని భారత సైనికులు అడ్డుకోవడంతో సమస్య మొదలైంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : చైనాలో మ్యాపులో డోకా లా కనుమ
ఎప్పుడు : జూలై 1
ఎవరు : చైనా
ఎక్కడ : సిక్కిం సెక్టార్‌లో
హాంకాంగ్‌లో చైనా పాలనకు 20 ఏళ్లు బ్రిటిష్ పాలన నుంచి హాంకాంగ్ చైనా చేతుల్లోకి వెళ్లి 20 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ జూలై 1న హాంకాంగ్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిటిష్ ప్రభుత్వంతో ఒప్పందం ప్రకారం ఒక దేశం, రెండు వ్యవస్థలు విధానానికి హాంకాంగ్ ప్రజలు కట్టుబడి ఉండాలని పేర్కొన్నారు.
హాంకాంగ్ ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులను చైనా నిర్దేశిస్తుండటాన్ని వ్యతిరేకిస్తూ చాలాకాలంగా ఆందోళనలు నిర్వహిస్తున్న అక్కడి ప్రజలు.. జిన్‌పింగ్ పర్యటన సందర్భంగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు. దీనిపై జిన్‌పింగ్ మాట్లాడుతూ హాంకాంగ్ ప్రజలు ఇప్పుడున్నంత స్వేచ్ఛగా ఇంతకముందు ఎన్నడూ లేరన్నారు. ఆసియాకు ఆర్థిక కేంద్రంగా ఉన్న హాంకాంగ్ మరింత అభివృద్ధి చెందటంపై దృష్టి పెట్టాలని, ఆందోళనలు పురోగతని దెబ్బతీస్తాయని అన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : హాంకాంగ్‌లో చైనా పాలనకు 20 ఏళ్లు
ఎప్పుడు : జూలై 1
ఎవరు : చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్
ఎందుకు : బ్రిటిష్ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం ప్రకారం
ప్రపంచ మొదటి ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్‌కు 80 ఏళ్లు ప్రపంచంలోనే మొదటి ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ నంబర్ 999 జూలై 1తో 80 ఏళ్లు పూర్తి చేసుకుంది. దీంతో బ్రిటన్ పోలీసులు ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పోలీసులు, ఫైర్, అంబులెన్‌స, కోస్ట్‌గార్డ్ సిబ్బందులను అప్రమత్తం చేసి, వారి నుంచి సాయం పొందేందుకు బ్రిటన్‌లో ఇప్పటికీ ఈ నంబర్‌నే వినియోగిస్తున్నారు. ఈ హెల్ప్‌లైన్ సిబ్బంది 179 భాషలను అర్థం చేసుకుని, సహాయం అందించగలరు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రపంచ మొదటి ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ 999కు 80 ఏళ్లు
ఎప్పుడు : జూలై 1 నాటికి
ఎక్కడ : బ్రిటన్
జర్మనీలో స్వలింగ వివాహాలకు చట్టబద్ధతస్వలింగ వివాహ పద్ధతికి జర్మన్ పార్లమెంటు జూన్ 30న ఆమోదం తెలిపింది. దీనికి అనుగుణంగా ‘లింగ భేదంతో సంబంధం లేకుండా ఇద్దరు వ్యక్తులు వివాహం చేసుకునేందుకు వీలుగా చట్ట సవరణ చేసింది. ఈ చట్టం ప్రకారం 2001 నుంచి జర్మనీలో ఉంటున్న వారెవరైనా జంటగా మారితే వారు అన్ని రకాల వైవాహిక హక్కులను పొందుతారు.
జాతీయంఓటరు నమోదు కోసం ఫేస్‌బుక్‌తో ఈసీ జట్టు ఓటర్ల నమోదు కార్యక్రమం గురించి ప్రజలకు గుర్తు చేసేందుకు ఫేస్‌బుక్ భారత ఎన్నికల కమిషన్‌తో కలిసి పనిచేయనుంది. ఈ మేరకు తెలుగు, హిందీ, ఇంగ్లిష్, తమిళం తదితర 13 భారతీయ భాషల్లో జూలై 1 నుంచి 4 మధ్యలో భారత్‌లోని ఫేస్‌బుక్ యూజర్లకు రిమైండర్లు పంపనుంది. ఇందులోని రిజిస్టర్ నౌ బటన్‌ను .. నేషనల్ ఓటర్స్ సర్వీసెస్ పోర్టల్‌కు అనుసంధానం చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఫేస్‌బుక్-ఈసీ ఆధ్వర్యంలో ఓటరు నమోదు డ్రైవ్
ఎప్పుడు : జూలై 1 - 4
ఎక్కడ : భారత్‌లో
ఎందుకు : ఓటరు నమోదు కార్యక్రమం గురించి ప్రజలకు గుర్తు చేసేందుకు
స్విస్ బ్యాంకుల్లో తగ్గిన భారతీయుల డబ్బుస్విస్ బ్యాంకుల్లో భారతీయులు దాచుకున్న డబ్బు కనిష్ట స్థాయికి పడిపోయింది. 2015తో పోల్చితే 2016లో ఈ డబ్బు సగం తగ్గి, రూ.4,500 కోట్లుగా(676 మిలియన్ స్విస్ ఫ్రాంక్స్) నమోదయి్యంది. స్విస్ నేషనల్ బ్యాంక్ (ఎస్‌ఎన్‌బీ)తాజా గణాంకాల ప్రకారం.. భారతీయులకు స్విస్ బ్యాంకుల్లో ప్రత్యక్షంగా ఉన్న మొత్తం 664.8 మిలియన్ స్విస్ ఫ్రాంక్స్. ట్రస్టీల రూపంలో ఉన్న మొత్తం 11 మిలియన్ స్విస్ ఫ్రాంక్స్. వరుసగా మూడేళ్ల నుంచీ స్విస్ బ్యాంకుల్లో భారతీయుల డబ్బు తగ్గుతూ వస్తోంది.
1987 నుంచీ స్విస్ తన బ్యాంకుల్లో విదేశీయుల డబ్బు గణాంకాలను ప్రకటిస్తోంది. ఆ తర్వాత భారతీయుల డబ్బు ఇంత తక్కువ స్థాయిలో నమోదుకావడం ఇదే తొలిసారి. 2006లో ఇక్కడ బ్యాంకుల్లో భారతీయుల డబ్బు రికార్డు స్థాయి రూ.23,000 కోట్లుగా నమోదైంది. 2016లో ప్రపంచవ్యాప్తంగా స్విస్ బ్యాంకుల్లో విదేశీ క్లెయింట్ల డబ్బు రూ.96 లక్షల కోట్లకు(1.42 ట్రిలియన్ స్విస్ ఫ్రాంక్స్) చేరింది. 2015లో ఈ మొత్తం 1.41 ట్రిలియన్ స్విస్ ఫ్రాంక్స్.
క్విక్ రివ్యూ:
ఏమిటి : స్విస్ బ్యాంకుల్లో భారతీయుల డబ్బు 676 మిలియన్ స్విస్ ఫ్రాంక్స్
ఎప్పుడు : 2016
ఎవరు : స్విస్ నేషనల్ బ్యాంకు
ఎక్కడ : స్విట్జర్లాండ్
ఆగస్టు 5న ఉపరాష్ట్రపతి ఎన్నిక ఉప రాష్ట్రపతి ఎన్నికలకు భారత ఎన్నికల కమిషన్ జూన్ 29న షెడ్యూల్ జారీ చేసింది. జూలై 4న నోటిఫికేషన్ విడుదల చేస్తామని, 18 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని ప్రధాన ఎన్నికల కమిషనర్ నసీం జైదీ వెల్లడించారు. జూలై 19న నామినేషన్ల పరిశీలన జరుగుతుందని, ఉపసంహరణ గడువు 21తో ముగుస్తుందని తెలిపారు. ఒకటి కన్నా ఎక్కువ నామినేషన్లు దాఖలైతే ఆగస్టు 5న పోలింగ్ నిర్వహిస్తామని, అదే రోజు కౌంటింగ్ ఉంటుందని వెల్లడించారు. ప్రస్తుత ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ పదవీకాలం ఆగస్టు 10తో ముగుస్తుంది.
2016లో రాజ్యసభ ఎన్నికల సందర్భంగా హరియాణాలో చోటుచేసుకున్న గందరగోళం నేపథ్యంలో ఈసారి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పోలింగ్‌లో ప్రత్యేక పెన్నులు ఉపయోగించనున్నారు. ఓటర్లు ఈ పెన్నుతో మాత్రమే తమ అభ్యర్థికి మార్కింగ్ చేయాలి. వేరే ఏ పెన్ను వాడినా ఓట్లు చెల్లదు. రహస్య బ్యాలెట్ ద్వారా జరిగే ఈ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఎలాంటి విప్ జారీ చేయడానికి వీల్లేదనీ ఈసీ స్పష్టం చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఉపరాష్ట్రపతి ఎన్నిక షెడ్యూల్ విడుదల
ఎప్పుడు : ఆగస్టు 5
ఎవరు : భారత ఎన్నికల కమిషన్
ఎందుకు : ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ పదవీకాలం ఆగస్టు 10న ముగుస్తున్నందున
సౌని యోజన కింద అజి డ్యాంకు నీటి తరలింపు సౌని యోజన (Saurashtra-Narmada Avataran Irrigation Yojana) కింద గుజరాత్‌లోని రాజ్‌కోట్ వద్ద ఉన్న అజీ జలాశయాన్ని నర్మదా నది నీటితో నింపే కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ జూన్ 29న ప్రారంభించారు. ఈ పథకం కింద నర్మదా నదిలో అధిక ప్రవాహం ఉన్నప్పుడు సౌరాష్ట్ర పరిధిలోని 115 జలాశయాలకు నీటిని తరలిస్తారు. తద్వారా 10 లక్షల 22 వేల 589 ఎకరాలకు నీటిని అందిస్తారు.
క్విక్ రివ్యూ:ఏమిటి : అజి డ్యాంకు నీటి తరలింపు కార్యక్రమం ప్రారంభం
ఎప్పుడు : జూన్ 29
ఎవరు : నరేంద్రమోదీ
ఎక్కడ : గుజరాత్‌లోని రాజ్‌కోట్
నాథులా మార్గం ద్వారా మానస సరోవర యాత్ర రద్దుచైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో సిక్కిం నాథులా మార్గం ద్వారా ఏటా సాగే కైలాస మానస సరోవర యాత్రను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం జూన్ 30న నిర్ణయం తీసుకుంది. వివాదాస్పద చైనా-భారత్ సరిహద్దులో ఇరు దేశాల భద్రతా దళాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల క్రమంలో ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. అయితే ఉత్తరాఖండ్‌లోని లిపులేక్ నుంచి వెళ్లే యాత్ర షెడ్యూల్ ప్రకారమే కొనసాగనుంది.
15,160 అడుగుల ఎత్తులో ఉన్న కైలాస మానస సరోవర యాత్ర రెండు మార్గాల ద్వారా ఏటా జూన్ నుంచి సెప్టెంబర్ వరకు సాగుతుంది. హిందువులు, బౌద్ధులు, జైనులకు ఇది అత్యంత పవిత్రమైన యాత్రాస్థలం.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మానస సరోవర యాత్ర రద్దు
ఎప్పుడు : జూన్ 30
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎందుకు : చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో
పిల్లల చదువుకు సగటు ఖర్చు రూ. 12 లక్షలుభారత్‌లో తల్లిదండ్రులు తమ పిల్లల చదువు కోసం చేస్తున్న సగటు ఖర్చు రూ.12.22 లక్షలని హెచ్‌ఎస్‌బీసీ ‘ద వ్యాల్యూ ఎడ్యుకేషన్’ సిరీస్ ‘హయ్యర్ అండ్ హయ్యర్’ నివేదిక పేర్కొంది. ఇది.. ప్రాథమిక పాఠశాల నుంచి పన్నెండో తరగతి వరకు అవుతున్న వ్యయం. ప్రపంచ సగటు రూ.28.58 లక్షల (44,221 డాలర్లు)తో పోలిస్తే ఇది చాలా తక్కువ. ఇందులో ట్యూషన్ ఫీజులు, పుస్తకాలు, రవాణా, వసతి తదితర ఖర్చులన్నీ ఉన్నాయి. అలాగే 59% మంది భారత తల్లిదండ్రులు పిల్లల విద్య కోసం వేతనాల నుంచి ఖర్చు చేస్తుండగా, మరికొంతమంది సేవింగ్‌స, పెట్టుబడులు, ఇన్సూరెన్‌స ద్వారా నిధులు సమకూర్చుకుంటున్నట్లు నివేదిక పేర్కొంది.
ప్రపంచవ్యాప్తంగా చూస్తే... హాంకాంగ్ తల్లిదండ్రులు తమ పిల్లల చదువు కోసం అత్యధికంగా సగటున రూ.85.42 లక్షలు ఖర్చు పెడుతున్నారు. తరువాతి స్థానాల్లో యూఏఈ (రూ.64.23 లక్షలు), సింగపూర్ (రూ.45.85 లక్షలు) ఉన్నాయి. ఈ జాబితాలో భారత్ 13వ స్థానంలో ఉండగా... ఫ్రాన్‌స రూ.10.8 లక్షలతో అట్టడుగున ఉంది.
పీజీకే అధిక ప్రాధాన్యం
భారత్‌లోని ప్రతి పది మందిలో 9 మంది (94 శాతం) తల్లిదండ్రులు తమ పిల్లలతో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేయించాలని భావిస్తున్నారు. వీరిలో 79 శాతం మంది అందుకు తగిన నిధులు కూడా సమకూర్చుకుంటున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ద వ్యాల్యూ ఎడ్యుకేషన్ నివేదిక
ఎప్పుడు : జూలై 2
ఎవరు : హెచ్‌ఎస్‌బీసీ
ఎక్కడ : భారత్‌లో పిల్లల చదువు కోసం సగటు ఖర్చు రూ.12.22 లక్షలు
గుజరాత్‌లో టెక్స్‌టైల్ ఇండియా - 2017 సదస్సు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో టైక్స్‌టైల్ ఇండియా - 2017 ప్రదర్శన జరిగింది. జూన్ 30న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభమైన ఈ అంతర్జాతీయ ప్రదర్శన జూలై 2 వరకూ కొనసాగింది. కార్యక్రమంలో భాగంగా కేంద్ర జౌళి శాఖ - పలు దేశీయ, అంతర్జాతీయ సంస్థల మధ్య 65 ఒప్పందాలు కుదిరాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : టెక్స్‌టైల్ ఇండియా - 2017
ఎప్పుడు : జూన్ 30 - జూలై 2
ఎవరు : కేంద్ర జౌళి శాఖ
ఎక్కడ : అహ్మదాబాద్, గుజరాత్
ఇన్నోవేట్ ఇన్ ఇండియా ప్రారంభం బయో ఫార్మాసూటికల్స్ అభివృద్ధి కోసం కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖ ఇన్నోవేట్ ఇన్ ఇండియా - i3 కార్యక్రమాన్ని జూలై 1న ప్రారంభించింది. జాతీయ స్థాయిలో ఉన్న బయో ఫార్మాసూటికల్స్ పరిశ్రమలను విద్యా సంస్థలతో అనుసంధానం చేయడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. తద్వారా దేశీయ ఫార్మా తయారీ రంగాన్ని అభివృద్ధి చేయాలన్నది లక్ష్యం.
ప్రపంచ బ్యాంకు సహకారంతో చేపట్టిన ఈ కార్యక్రమం కోసం భారత్ 250 మిలియన్ డాలర్లు వెచ్చించనుంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ (డీబీటీ) ఆధ్వర్యంలోని బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ (బీఐఆర్‌ఏసీ) ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇన్నోవెట్ ఇండియా కార్యక్రమం ప్రారంభం
ఎప్పుడు : జూలై 1
ఎవరు : కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వశాఖ
ఎందుకు : బయో ఫార్మా కంపెనీలు - విద్యా సంస్థల అనుసంధానం కోసం
యువత కోసం ప్రధాని మోదీ పుస్తకం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ యువత కోసం ఓ పుస్తకం రాయాలని సంకల్పించారు. పరీక్షల ఒత్తిడిని అధిగమించడం, ఏకాగ్రత కోల్పోకుండా ఉండటం, మార్కుల కంటే విజ్ఞానం ఎందుకు ముఖ్యం, భవిష్యత్తు బాధ్యతను ఎలా స్వీకరించాలనే కీలక అంశాలను ఇందులో ప్రస్తావించనున్నారు. తద్వారా పదవిలో ఉండగా పుస్తకం రాస్తున్న తొలి ప్రధానిగా మోదీ చరిత్ర సృష్టించనున్నారు. పెంగ్విన్ రాండమ్ హౌస్ (పీఆర్‌హెచ్) ఇండియా ప్రచురిస్తున్న ఈ పుస్తకం డిసెంబర్‌లో పలు భాషల్లో మార్కెట్‌లోకి రానుంది. దీనికి స్వచ్ఛంద సేవాసంస్థ బ్లూక్రాఫ్ట్ డిజిటల్ ఫౌండేషన్ సాంకేతిక విజ్ఞాన భాగస్వామిగా వ్యవహరిస్తోంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : యువత కోసం ప్రత్యేక పుస్తకం
ఎప్పుడు : జూలై 3
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎందుకు : పది, పదకొండు తరగతుల విద్యార్థుల కోసం
పర్యాటక కేంద్రంగా మోదీ టీ స్టాల్ప్రధాని మోదీ చిన్నతనంలో టీ అమ్మిన దుకాణాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని కేంద్రం నిర్ణయించింది. గుజరాత్‌లోని మెహ్‌సన జిల్లా వడ్‌నగర్ రైల్వే స్టేషన్‌లో ఓ ప్లాట్‌ఫాంపై ఆ టీ స్టాల్ ఉంది. మోదీ జన్మస్థలాన్ని ప్రపంచ పర్యాటక పటంలో కనిపించేలా తీర్చిదిద్దే భారీ ప్రాజెక్టులో భాగంగా టీ స్టాల్‌ను పర్యాటక ప్రాంతంగా మార్పు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర సాంస్కృతిక, పర్యాటక మరియు పురావస్తు శాఖల అధికారులు వడ్‌నగర్ పట్టణాన్ని సందర్శించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పర్యాటక కేంద్రంగా మోదీ టీ స్టాల్
ఎప్పుడు : జూలై 3
ఎవరు : కేంద్ర పర్యాటక శాఖ
ఎక్కడ : వడ్‌నగర్ రైల్వే స్టేషన్, మెహ్‌సన జిల్లా, గుజరాత్
ఎందుకు : మోదీ జన్మస్థలాన్ని పర్యాటక కేంద్రంగా మార్చేందుకు
ప్రధాని ఇజ్రాయెల్ పర్యటనఇజ్రాయెల్, భారత్‌లు కలసికట్టుగా ముందుకు సాగితే మరిన్ని అద్భుతాలు సాధించగలవని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం జూలై 4న ఇజ్రాయెల్ చేరుకున్న మోదీకి అపూర్వ స్వాగతం లభించింది. ఇజ్రాయెల్ సైనిక బృందం ఇరు దేశాల జాతీయ గీతాల్ని ఆలపించి మోదీకి సైనిక వందనం సమర్పించింది. గత 70 ఏళ్లుగా భారత ప్రధాని రాక కోసం (70 ఏళ్లలో ఇజ్రాయెల్‌లో పర్యటిస్తున్న తొలి భారత ప్రధాని నరేంద్రమోదీ) వేచిచూస్తున్నామని.. భారత్‌కు చెందిన గొప్ప నేత, ప్రపంచంలో ప్రముఖ నేత మోదీ అంటూ నెతన్యాహూ ఉద్వేగంతో మాట్లాడారు. సంయుక్త మీడియా సమావేశాన్ని ఉద్దేశించి మోదీ, నెతన్యాహూలు ప్రకటన చేస్తూ.. రెండు దేశాలు ఒకే రకమైన ముప్పును, సవాళ్లను ఎదుర్కొంటున్నాయని వాటిపై కలసికట్టుగా ముందుకు సాగాలని అభిప్రాయపడ్డారు.
ఓ పువ్వుకు మోదీ పేరు..
మిష్మర్ హషివలోని డాంజిగర్ పూదోటను నెతన్యాహూతో కలసి మోదీ సందర్శించారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్‌లో వేగంగా పెరిగే ‘క్రిసెంతమన్’ పుష్పానికి ‘మోదీ’ పేరు పెట్టారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 70 ఏళ్ల తర్వాత ఇజ్రాయెల్‌లో పర్యటిస్తున్న ప్రధాని
ఎప్పుడు : జూలై 4 - 6
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎందుకు : ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం కోసం
రాష్ట్రీయంసింగపూర్ ఎంఓయూ అమలుకు కార్యాచరణ కమిటీ ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ)తో సింగపూర్ సంస్థ కుదుర్చుకున్న అవగాహనా ఒప్పందం అమలుకు ముఖ్యమంత్రి అధ్యక్షతన సంయుక్త కార్యాచరణ కమిటీ (జాయింట్ ఇంప్లిమెంటేషన్ స్టీరింగ్ కమిటీ) ఏర్పాటైంది. ఈ మేరకు సీఆర్‌డీఏ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్ జూన్ 28న ఉత్తర్వులు జారీ చేశారు.
2017 మే 15న సింగపూర్ ప్రభుత్వం సీఆర్‌డీఏ మాస్టర్ డెవలప్‌మెంట్‌కు ఎంఓయూ చేసుకుంది. దీని అమలుకు ఐదుగురు సభ్యులతో కమిటీని వేశారు. ముఖ్యమంత్రి చైర్మన్‌గా వ్యవహరించే ఈ కమిటీలో ఆర్థిక మంత్రి, పురపాలకశాఖ మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సభ్యులుగా ఉంటారు.
స్ట్టీరింగ్ కమిటీతో పాటు జాయింట్ ఇంప్లిమెంటేషన్ వర్కింగ్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ప్రతి రెండు నెలలకు ఒకసారి సమావేశమై స్టీరింగ్ కమిటీకి నివేదిక ఇస్తుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సింగపూర్ ఎంఓయూ అమలుకు సీఎం నేతృత్వంలో కమిటీ
ఎప్పుడు : జూన్ 28
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎందుకు : సీఆర్‌డీఏతో కుదుర్చుకున్న ఒప్పందాల అమలుకోసం
సృజనాత్మకతకు టీ-వర్క్స్సృజనాత్మక ఆలోచనతో వచ్చి ఉత్పత్తి (ప్రొడక్ట్)ని అభివృద్ధి చేసుకోవడానికి సదుపాయాలను కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ‘టీ-వర్క్స్’ పేరుతో నూతన సంస్థను ప్రారంభించింది. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రో-మెకానికల్, మెకానికల్ ఉత్పత్తుల అభివృద్ధి, తయారీ రంగాల్లో అనువైన వాతావరణాన్ని సృష్టించేందుకు దీనిని ఏర్పాటు చేసింది.
ఎలక్ట్రానిక్స్ రంగంలో పరిశ్రమలకు అనువైన వాతావరణం సృష్టించడం, హార్డ్‌వేర్ నమూనాల తయారీ సదుపాయం కల్పించడం, ఉత్పత్తుల అభివృద్ధి క్రమంలో అంకుర పరిశ్రమలను ప్రోత్సహించడం, ప్రస్తుత, భవిష్యత్తు అవసరాలకు తగినట్లు నిపుణులైన మానవ వనుల అభివృద్ధి కోసం ఈ సంస్థ పని చేయనుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సృజనాత్మకతకు టీ-వర్క్స్ ఏర్పాటు
ఎప్పుడు : జూన్ 29
ఎవరు : తెలంగాణ ప్రభుత్వం
ఎందుకు : అంకుర పరిశ్రమలను ప్రోత్సహించేందుకు
2016-17లో ఆహార ధాన్యాల ఉత్పత్తి 96 లక్షల టన్నులుతెలంగాణలో ఆహార ధాన్యాల ఉత్పత్తి రెట్టింపు స్థాయిలో పెరిగింది. 2015-16 వ్యవసాయ సీజన్‌లో 51.45 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి కాగా, 2016-17 సీజన్‌లో ఏకంగా 96.36 లక్షల టన్నులు ఉత్పత్తి అయ్యాయి. అందులో వరి 2015-16లో 30.47 లక్షల టన్నులు ఉత్పత్తి జరగ్గా.. 2016-17లో ఏకంగా రెట్టింపు స్థాయిని మించి 63.57 లక్షల టన్నులు ఉత్పత్తి అయింది. అలాగే.. 2016 ఖరీఫ్‌లో 29.18 లక్షల టన్నులు మాత్రమే వరి పంట చేతికి రాగా, రబీలో ఏకంగా 34.39 లక్షల టన్నులు పంట చేతికొచ్చింది. 2015-16లో 2.47 లక్షల టన్నుల పప్పుధాన్యాలు పండగా, 2016-17లో ఏకంగా 5.29 లక్షల టన్నులు ఉత్పత్తి జరిగింది.
వివిధ పంటల ఉత్పత్తి (లక్షల టన్నుల్లో)

పంట
|
2015-16
|
2016-17
|
వరి
|
30.47
|
63.57
|
మొక్కజొన్న
|
17.51
|
26.38
|
తృణధాన్యాలు
|
48.98
|
91.07
|
పప్పుధాన్యాలు
|
2.47
|
5.29
|
వేరుశనగ
|
2.06
|
3.32
|
సోయాబీన్
|
2.52
|
3.23
|
నూనె గింజలు
|
5.79
|
7.13
|
చెరుకు
|
24.05
|
21.55
|
పత్తి
|
37.33
|
29.34
|
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆహార ధాన్యాల ఉత్పత్తి 96.36 లక్షల టన్నులు
ఎప్పుడు : 2016-17లో
ఎక్కడ : తెలంగాణలో
తెలంగాణలో సినిమా టికెట్ల ధరల పెంపునకు బ్రేక్సినిమా టికెట్ల ధరల పెంపు ఉత్తర్వులను తాత్కాలికంగా నిలిపివేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు జీవోను వెంటనే నిలిపేయాలని హోం శాఖను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ ఆదేశించారు. రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరలను భారీగా పెంచుతూ ఈనెల 23న హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఏసీ థియేటర్లలో గరిష్టంగా రూ.70 ఉన్న ధరను రూ.120కి పెంచగా.. పెరిగిన ధరలను థియేటర్లు ఇప్పటికే అమల్లోకి తెచ్చాయి.
తెలంగాణలో వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్తెలంగాణలో 2018 నుంచి ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్ ప్రవేశ పెట్టాలని, ఈ రంగానికి భారీగా నిధులు పెంచాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ‘రైతు సంక్షేమం - వ్యవసాయాభివృద్ధి’పై జూలై 1న ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన ఆయన ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఐదువేల ఎకరాలకు ఒకటి చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 2,500 క్లస్టర్లను ఏర్పాటు చేస్తున్నామని, ప్రతీ క్లస్టర్‌లో రైతులు ఎప్పటికప్పుడు సమావేశం కావడానికి వీలుగా రైతు వేదికలు నిర్మిస్తామని సీఎం ప్రకటించారు. కల్తీ విత్తనాలు, ఎరువుల విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వ్యవసాయనికి ప్రత్యేక బడ్జెట్
ఎప్పుడు : 2018 నుంచి
ఎవరు : తెలంగాణ ప్రభుత్వం
ఏపీలో చెట్లు నాటేవారికి ‘వృక్షమిత్ర’ అవార్డులుఆంధ్రప్రదేశ్‌లో చెట్లు నాటే వారిని ప్రోత్సహించడంలో భాగంగా వృక్ష మిత్ర అవార్డులు ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. గుంటూరు రూరల్ మండలం ఓబులనాయుడుపాలెంలో జూలై 1న జరిగిన 68వ వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఆయన వనం - మనం కార్యక్రమంలో పాల్గొన్నారు. తొలుత మంత్రులతో కలిసి మొక్కలను నాటారు. అనంతరం మాట్లాడుతూ వనం-మనం అందరి జీవితంలో భాగం కావాలన్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన వనజీవి రామయ్యను ప్రోత్సహించడంలో భాగంగా రూ.10 వేలు పింఛను ఇచ్చామని చెప్పారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : చెట్లు నాటే వారికి వృక్షమిత్ర అవార్డులు
ఎప్పుడు : జూలై 1
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్‌లో
ఎవరు : సీఎం చంద్రబాబు
ఆర్థికంపాన్‌తో ఆధార్‌ను జతచేయడం తప్పనిసరి
జూలై 1 నుంచి పాన్ (పర్మినెంట్ అకౌంట్ నంబర్)తో ఆధార్ కార్డును తప్పనిసరిగా జతచేయాల్సిందేనంటూ కేంద్ర ప్రభుత్వం జూన్ 29న ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం పాన్ కార్డుకు దరఖాస్తు చేసే సమయంలో ఆధార్ నంబర్‌ను గానీ, లేదా ఆధార్‌లో నమోదు చేసుకున్నట్లు ఎన్‌రోల్‌మెంట్ నంబర్‌ను గానీ తప్పనిసరిగా అనుసంధానించాలి. ఆదాయపన్ను రిటర్ను దాఖలు చేసే సమయంలోగానీ, బ్యాంకు ఖాతాను ఓపెన్ చేసే సమయంలో గానీ పాన్, ఆధార్‌లు తప్పనిసరిగా అనుసంధానించాల్సిందే. వ్యక్తుల ఆర్థిక లావాదేవీలన్నీ పారదర్శకంగా ఉండేందుకు గాను ఈ ప్రక్రియను తప్పనిసరి చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పాన్‌తో ఆధార్ జతచేయడం తప్పనిసరి
ఎప్పుడు : జూలై 1
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎందుకు : ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకత కోసం
ఎయిరిండియాలో డిజిన్వెస్ట్‌మెంట్‌కు కేబినెట్ ఆమోదం భారీ అప్పుల్లో కూరుకుపోయిన ఎయిరిండియాలో వాటాల ఉపసంహరణ ప్రతిపాదనకు జూన్ 28న కేంద్ర కేబినెట్ సూత్రప్రాయ ఆమోదం తెలియజేసింది. ఎంత మేర వాటా విక్రయించాలి, విధి విధానాలు ఏంటన్నది ఖరారు చేసేందుకు మంత్రుల గ్రూపు ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది.
ప్రభుత్వ రంగంలోని ఎయిరిండియా రూ.52,000 కోట్లకు పైగా రుణ భారాన్ని మోస్తోంది. 2012లో యూపీఏ సర్కారు రూ.30,000 కోట్ల బెయిలవుట్ ప్యాకేజీతో దీన్ని తాత్కాలికంగా ఆదుకుంది. మరోవైపు ఎయిర్ ఇండియాను పూర్తిగా ప్రైవేటుపరం చేయాలని నీతి ఆయోగ్ ఇప్పటికే ప్రభుత్వానికి సూచించింది. క్విక్ రివ్యూ:ఏమిటి : ఎయిర్ ఇండియాలో పెట్టుబడుల ఉపసంహరణకు ఆమోదం
ఎప్పుడు : జూన్ 28
ఎవరు : కేంద్ర కేబినెట్
ఎందుకు : నష్టాల్లో ఉన్న సంస్థ నుంచి వాటాల ఉపసంహరణ కోసం
వస్తు, సేవల పన్ను విధానం ప్రారంభం ఒక దేశం ఒకే పన్ను నినాదంతో వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) ప్రారంభమైంది. దేశ చరిత్రలో అత్యంత కీలక సంస్కరణగా నిలిచిపోయే ఈ పన్నును జూన్ 30 అర్ధరాత్రి పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోదీ ఆవిష్కరించారు. ఇది ఏ ఒక్క పార్టీ, ఒక్క ప్రభుత్వం ఘనత కాదని, భవ్య భారతం కోసం సమష్టిగా చేసిన కృషి ఫలితమని ప్రధాని ఉద్ఘాటించారు. జీఎస్టీని ‘ఉత్తమమైన, సరళమైన పన్ను’గా అభివర్ణించారు. దేశ ప్రజాస్వామ్య పరిణతికి జీఎస్టీ ఓ సాధికార రూపమని రాష్ట్రపతి పేర్కొన్నారు.
ఎరువులపై 5 శాతం జీఎస్టీ
జీఎస్టీ అమలుకు కొద్ది గంటల ముందు జీఎస్టీ కౌన్సిల్ సమావేశమై రైతులకు సంబంధించిన రెండు అంశాలపై పన్నురేటును తగ్గించింది. గతంలో 12 శాతం పరిధిలో ఉన్న ఎరువులను 5 శాతం పరిధిలోకి.. 28 శాతంగా ఉన్న ట్రాక్టర్ల విడిభాగాలను 18 శాతంలోకి చేరుస్తూ నిర్ణయం తీసుకుంది.
18 సమావేశాలు..
2016 సెప్టెంబర్ 23న జీఎస్టీ కౌన్సిల్ తొలిసారి సమావేశమైంది. ఆనాటి నుంచి నేటి వరకు 18 సార్లు ఈ మండలి సమావేశమైంది. విసృ్తతమైన అంశాలపై కూలంకశంగా చర్చించి 5, 12, 18, 28 శాతం పన్ను పరిధిని నిర్ణయించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జీఎస్టీ అమలు ప్రారంభం
ఎప్పుడు : జూలై 1
ఎవరు : రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : పార్లమెంట్ సెంట్రల్ హాల్
ఎందుకు : దేశంలో ఏకీకృత పన్నుల కోసం
2018 నాటికి 10.2 శాతానికి ఎన్‌పీఏలు : ఆర్‌బీఐ 2017 మార్చి నాటికి 9.6 శాతంగా ఉన్న నిరర్థక ఆస్తులు(ఎన్‌పీఏలు) 2018 మార్చి నాటికి 10.2 శాతానికి చేరే అవకాశం ఉందని రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) అంచనా వేసింది. ఈ మేరకు ఆర్‌బీఐ జూన్ 30న తాజా ద్రవ్య స్థిరత్వ నివేదికను ఆవిష్కరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 7.3 శాతంగా ఉంటుందని నివేదికలో పేర్కొంది.
నివేదికలోని ముఖ్యాంశాలు..
- నికర మొండిబకాయిల (ఎన్‌ఎన్‌పీఏ) రేషియో 2016 సెప్టెంబర్‌లో 5.4 శాతం ఉంటే, 2017 మార్చినాటికి ఈ రేటు 5.5 శాతానికి పెరిగింది.
- ఒత్తిడిలో ఉన్న రుణ నిష్పత్తి (స్ట్రెస్డ్ అడ్వాన్సెస్ రేషియో) మాత్రం 12 శాతం నుంచి 12.3 శాతానికి ఎగసింది. వ్యవసాయం, సేవలు, రిటైల్ రంగాల్లో ఈ తరహా రుణ నిష్పత్తి తగ్గితే, పారిశ్రామిక రంగం విషయంలో మాత్రం 22.3 శాతం నుంచి 23 శాతానికి చేరింది.
- ప్రభుత్వ ఆదాయాలు-వ్యయాలకు మధ్య వ్యత్యాసం-ద్రవ్యలోటు 2016-17లో 3.5 శాతంగా ఉంటే, ఇది 2017-18లో 3.2 శాతానికి తగ్గుతుందని అంచనా.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 10.2 శాతానికి ఎన్‌పీఏలు
ఎప్పుడు : 2018 నాటికి
ఎవరు : ఆర్‌బీఐ
ఎక్కడ : భారత్‌లో
2016-17లో 55 శాతం పెరిగిన డిజిటల్ చెల్లింపులు
2016-17 ఆర్థిక సంవత్సరంలో డిజిటల్ చెల్లింపులు 55 శాతం పెరిగాయని నీతి ఆయోగ్ జూలై 3న వెల్లడించింది. రానున్న రోజుల్లో ఈ విధానం మరింత పురోగతి సాధించే అవకాశం ఉందని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం 2016 డిసెంబర్‌లో 500, 1000 రూపాయిల నోట్లు రద్దు చేయటంతో డిజిటల్ చెల్లింపులు బాగా పెరిగాయి.
2011-12 నుంచి 2015-16 మధ్య కాలంలో డిజిటల్ చెల్లింపులు ఏటా సగటున 28 శాతం మేర పురోగతి నమోదు చేశాయని నీతి ఆయోగ్ వెల్లడించింది.
క్విక్ రివ్యూ:ఏమిటి : 55 శాతం పెరిగిన డిజిటల్ చెల్లింపులు
ఎప్పుడు : 2016-17లో
ఎవరు : నీతి ఆయోగ్
ఎక్కడ : భారత్‌లో
సైన్స్ అండ్ టెక్నాలజీమెక్సికోలో కొత్త జాతి చిలుకల గుర్తింపు నీలిరంగులో ఉన్న అరుదైన చిలుక జాతిని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా శాస్త్రవేత్తలు మెక్సికోలోని అమెజాన్ ప్రాంతంలో గుర్తించారు. ఈ చిలుకలలో అనేక ప్రత్యేక లక్షణాలున్నాయని వారు వెల్లడించారు. మనదగ్గర ఉండే పచ్చని చిలుకల కంటే ఇవి పెద్దగా అరుస్తాయని.. అదికూడా ఒకే రకమైన శబ్దం చేస్తూ మళ్లీ మళ్లీ అరుస్తాయని తెలిపారు. వీటి మైటోకాండ్రియాలోని జన్యు క్రమాన్ని పరిశీలించిన శాస్త్రవేత్తలు సుమారు 1,20,000 సంవత్సరాల క్రితమే ఈ జాతి ఆవిర్భవించిందని గుర్తించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కొత్త జాతి చిలుకల గుర్తింపు
ఎప్పుడు : జూన్ 28
ఎక్కడ : మెక్సికోలో
ఎవరు : యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా శాస్త్రవేత్తలు
ప్రపంచ తొలి Co2 గ్రాహక ప్లాంట్ ప్రారంభం వాహనాలు, పరిశ్రమల నుంచి వాతావరణంలోకి విడుదలయ్యే కార్బైన్ డయాక్సైడ్ ను గ్రహించేందుకు స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్ నగరంలో ప్రత్యేక ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. ఈ తరహా వ్యవస్థల్లో ప్రపంచంలోనే మొదటిదిగా గుర్తింపు పొందిన ఈ ప్లాంట్‌ను క్లైమ్ వర్క్స్ అనే సంస్థ ఏర్పాటు చేసింది. ఇది ఏడాదికి 900 టన్నుల కార్బైన్ డయాక్సైడ్ ను గ్రహించగలదు. ఇలా గ్రహించిన మొత్తాన్ని పంటల సాగుకోసం విక్రయిస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రపంచంలో తొలి కార్బన్ డయాక్సైడ్ గ్రాహక ప్లాంట్
ఎప్పుడు : జూన్ 28
ఎవరు : క్లైమ్ వర్క్స్ సంస్థ
ఎక్కడ : జ్యూరిచ్, స్విట్జర్లాండ్
ఎందుకు : వాతావరణంలోని Co2 ను గ్రహించి సాగు అవసరాల కోసం వినియోగించేందుకు
సమాచార ఉపగ్రహం జీశాట్ - 17 ప్రయోగం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) జీశాట్-17 సమాచార ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది. జూన్ 29న ఫ్రెంచి గయానాలోని కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి ఏరియన్-5 వీఏ-238 వాహన నౌక ద్వారా నిర్వహించిన ఈ ప్రయోగం 39 నిమిషాల్లో పూర్తయింది. జీశాట్-17ను అపోజి (భూమికి దూరంగా) 35,975 కిలోమీటర్లు, పెరిజీ (భూమికి దగ్గరగా) 175 నుంచి 181 కిలోమీటర్ల ఎత్తులోని భూ బదిలీ కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. ప్రయోగం జరిగిన 30 నిమిషాలకు కర్ణాటకలోని హసన్‌లో ఉన్న ఉపగ్రహాల నియంత్రణ కేంద్రం.. జీశాట్-17ను స్వాధీనంలోకి తీసుకున్నామని ప్రకటించింది.
సమాచార వ్యవస్థ బలోపేతం కోసం..
ఈ ఉపగ్రహంలో 42 ట్రాన్‌సఫాండర్లను అమర్చారు. ఇందులో 24 సీ-బాండ్ ట్రాన్‌సఫాండర్లు, 2 లోయర్ సీ-బాండ్లు, 12 అప్పర్ సీ-బాండ్లు, 2 సీఎక్స్, 2 ఎస్‌ఎక్స్ ట్రాన్‌సఫాండర్లు ఉన్నాయి. జీశాట్-17 ఉపగ్రహం 15 సంవత్సరాలపాటు సేవలందిస్తుంది. భారతదేశ అవసరాలకు సుమారు 550 ట్రాన్‌సపాండర్లు అవసరం కాగా.. ప్రస్తుతం 250 అందుబాటులో వున్నాయి.
గయానా నుంచి 21 ఉపగ్రహాలు
ఫ్రెంచి గయానాలోని కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి ఇస్రో ఇప్పటి వరకు 21 ఉపగ్రహాలను ప్రయోగించింది. 1981లో మొట్టమొదటగా ఆఫిల్ అనే ఉపగ్రహాన్ని ప్రయోగించారు. ఎక్కువ బరువైన ఉపగ్రహాలను ప్రయోగించే సామర్థ్యం ఇంకా భారత్‌కు లేనందున ఫ్రెంచి గయానా మీద ఆధారపడుతున్నారు. దీనికి పరిష్కారంగా భారత్ ఇటీవలే ‘బాహుబలి’ రాకెట్ జీఎస్‌ఎల్వీ మార్క్-3 డీ1ను అభివృద్ధి చేసి ప్రయోగించడం తెలిసిందే. అత్యంత బరువైన ఉపగ్రహాలను కక్ష్యల్లోకి ప్రవేశపెట్టేందుకు వీలుగా దీనిని అభివృద్ధి చేసి శ్రీహరికోట నుంచే బరువైన ఉపగ్రహాలను పంపేందుకు ప్రయోగాలు చేస్తున్నారు.
జీశాట్ - 17 వివరాలు
బరువు: 3,477 కేజీలు
రాకెట్: ఏరియన్-5 వీఏ-238
లక్ష్యం: సమాచార సేవల మెరుగు
క్విక్ రివ్యూ:
ఏమిటి : జీశాట్ - 17 ప్రయోగం విజయవంతం
ఎప్పుడు : జూన్ 29
ఎవరు : ఇస్రో
ఎక్కడ : కౌరు అంతరిక్షణ కేంద్రం, గయానా - ఫ్రాన్స్
ఎందుకు : సమాచార వ్యవస్థల బలోపేతం కోసం
అంతరిక్షంలో చెత్త తొలగింపునకు కొత్త యంత్రం అంతరిక్షంలో చెత్తను తొలగించేందుకు అమెరికాలోని స్టాన్‌ఫర్డ్ వర్సిటీ శాస్త్రవేత్తలు ఉడుంపట్టు స్ఫూర్తిగా ఓ యంత్రాన్ని రూపొందించారు. ఇది ఓ రోబో. ఇందులో ఉడుము కాళ్లలో ఉండే పొలుసుల్లాంటి నిర్మాణాలు ఉంటాయి. ఉడుముల పాదాల్లోని పొలుసులు 200 నానోమీటర్ల పరిమాణంతో సూక్ష్మంగా ఉంటే.. ఈ రోబో గ్రిప్పర్ పొలుసుల సైజు 40 మైక్రోమీటర్ల వరకు ఉంటాయి.ఏదైనా వస్తువును తాకినప్పుడు ఈ పొలుసులకు, ఆ వస్తువుకు మధ్య ఏర్పడే వాండర్‌వాల్స్ బలాల కారణంగా రెండు గట్టిగా అతుక్కుపోతాయి. ఆ తర్వాత ఆ వస్తువును అతితక్కువ శక్తితో కావాల్సిన చోటికి తీసుకెళ్లొచ్చు. స్టాన్‌ఫర్డ్ శాస్త్రవేత్తలు ఇప్పటికే ఈ రోబోను నాసాకు చెందిన జెట్ ప్రొపల్షన్ లేబొరేటరీలో విజయవంతంగా పరీక్షించారు.
అంతరిక్షంలో పాడైన ఉపగ్రహాలు మొదలుకొని.. ప్రయోగ సమయంలో విడిపోయిన నట్లు, బోల్ట్‌లు వంటి అనేక పరికరాలు చెత్తగా పేరుకుపోయాయి. ఈ చెత్త గంటకు కొన్ని వేల కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంటుంది. ఇందులో ఏ ఒక్కటైనా పనిచేస్తున్న ఉపగ్రహాలను ఢీకొట్టినా.. తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అంతరిక్షంలో చెత్త తొలగింపునకు ఉడుంపట్టు యంత్రం
ఎప్పుడు : జూన్ 29
ఎవరు : స్టాన్‌ఫర్డ్ వర్సిటీ శాస్త్రవేత్తలు
ఎక్కడ : అమెరికాలో
పెట్యా వైరస్ దాడితో భారత్‌కు భారీ నష్టంయూరప్ సహా పలు దేశాలపై దాడి చేసిన పెట్యా ర్యాన్సమ్‌వేర్ కారణంగా భారత్‌కు కూడా తీవ్రనష్టం వాటిల్లిందని సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్ తయారీ సంస్థ సిమాంటెక్ వెల్లడించింది. దీనివల్ల తీవ్రంగా నష్టపోయిన దేశాల జాబితాలో భారత్ ఏడో స్థానంలో నిలిచింది. ముంబైలోని జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ కంప్యూటర్లు కూడా పెట్యా బారినపడ్డాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం అన్ని సంస్థలకు మార్గదర్శకాలు జారీ చేసింది. విండోస్ సాఫ్ట్‌వేర్‌ను ఆప్‌డేట్ చేసుకోవాలని సూచించింది.
ఈ దాడిలో ఉక్రెయిన్, అమెరికా, రష్యాలు అత్యధికంగా నష్టపోయాయి. ఫ్రాన్‌స, ఇంగ్లండ్, జర్మనీ, చైనా, జపాన్ దేశాల్లోనూ లక్షలాది కంప్యూటర్లు హ్యాక్ అయ్యాయి.
2017 మే నెలలో వనా క్రై ర్యాన్సమ్‌వేర్ దాడి వల్ల 100 దేశాల్లో కంప్యూటర్ వ్యవస్థలు స్తంభించాయి. కంప్యూటర్‌లోని ఫైల్స్‌ను తిరిగి పొందాలంటే 300 డాలర్లను బిట్‌కాయిన్ రూపంలో చెల్లించాలని హ్యాకర్లు డిమాండ్ చేస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పెట్యా దాడితో నష్టపోయిన దేశాల జాబితాలో 7వ స్థానంలో భారత్
ఎప్పుడు : జూన్ 29
ఎవరు : సిమాంటెక్
నూతన పంది రకాన్ని అభివృద్ధి చేసిన ఎస్‌వీవీయూతిరుపతిలోని శ్రీవేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ (ఎస్‌వీవీయూ) తిరుపతి వరాహ పేరుతో అభివృద్ధి చేసిన నూతన పంది రకానికి నేషనల్ బ్యూరో ఆఫ్ ఆనిమల్ జెనటిక్ రీసెర్చ్( ఎన్‌బీఏజీఆర్) గుర్తింపు లభించింది. ఈ మేరకు జూలై 1న తిరుపతిలో జరిగిన కార్యక్రమంలో ఎన్‌బీఏజీఆర్ ప్రతినిధులు ఈ రకాన్ని రిజిస్టర్ చేశారు.
తిరుపతి వెటర్నరీ కళాశాల పరిధిలో ఆలిండియా కోఆర్డినేటెడ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఆన్ పిగ్‌సలో 1971 నుంచి పరిశోధనలు జరుగుతున్నాయని.. 1971 నుంచి 80 వరకూ లార్జ్ యార్క్‌షైర్ పిగ్‌స (సీమ పందులు)పై, 1981 నుంచి 87 వరకూ దేశీయ పందుల (నాటు పందులు)పై పరిశోధనలు చేసినట్లు ఎస్‌వీవీయూ ప్రతినిధులు చెప్పారు. అనంతరం 1987 నుంచి 2007 వరకూ సీమ పందులు, నాటు పందులను సంకరీకరించి నూతన రకాన్ని అభివృద్ధి చేసినట్లు చెప్పారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తిరుపతి వరాహం
ఎప్పుడు : జూలై 1
ఎవరు : శ్రీవేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ
ఎక్కడ : తిరుపతి
డీఆర్‌డీవో క్షిపణి ప్రయోగం విజయవంతంఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను అత్యంత వేగంగా ఛేదించగల స్వల్ప శ్రేణి స్వదేశీ క్షిపణిని భారత రక్షణ శాఖ జూలై 3న విజయవంతంగా ప్రయోగించింది. ఒడిశాలోని చాందీపూర్‌లోగల ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) నుంచి ఈ క్షిపణి ప్రయోగాన్ని చేపట్టినట్లు డిఫెన్‌స రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్‌డీవో) వర్గాలు వెల్లడించాయి. ఈ క్షిపణి 25 నుంచి 30 కి.మీ. దూరంలోని వివిధ లక్ష్యాలను ఒకే సమయంలో అత్యంత వేగంగా ఛేదించగలదు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : స్వల్ప శ్రేణి స్వదేశీ క్షిపణి పరీక్ష విజయవంతం
ఎప్పుడు : జూలై 3
ఎవరు : భారత రక్షణ శాఖ
ఎక్కడ : చాందీపూర్, ఒడిశా
ఎందుకు : 25 నుంచి 30 కి.మీ. లక్ష్యాలను అత్యంత వేగంగా ఛేదించేందుకు
ఖండాంతర క్షిపణిని పరీక్షించిన ఉత్తర కొరియా ప్రపంచ దేశాల హెచ్చరికలను, ఆంక్షలను బేఖాతరు చేస్తూ ఉత్తర కొరియా తన తొలి ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి(ఐసీబీఎం)ని జూలై 4న విజయవంతంగా పరీక్షించింది. వాసోంగ్-14 క్షిపణి పరీక్షను దేశాధినేత కిమ్ జోంగ్ ఉన్ స్వయంగా పర్యవేక్షించారని ఉ.కొరియా టీవీ చానల్ పేర్కొంది. పూర్తి స్థాయి అణుశక్తి దేశమైన ఉత్తర కొరియా వద్ద ప్రపంచంలో ఎక్కడైనా దాడి చేయగల అత్యంత శక్తిమంతమైన ఐసీబీఎం ఉంది. కాగా.. ఉత్తర కొరియా క్షిపణి ఒకటి 2,802 కి.మీ ఎత్తుకు వెళ్లడం ఇదే తొలి సారి. ఐసీబీఎం 6,700 కి.మీ. వరకు దూసుకెళ్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వాసోంగ్ - క్షిపణి పరీక్ష
ఎప్పుడు : జూలై 4
ఎవరు : ఉత్తర కొరియా
క్రీడలుకోచ్‌గా ద్రవిడ్‌కు రెండేళ్లు పొడిగింపు భారత్ ‘ఎ’, అండర్-19 క్రికెట్ జట్ల కోచ్‌గా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలాన్ని బీసీసీఐ మరో రెండేళ్లకు పొడిగించింది. 2015లో ద్రవిడ్ తొలిసారిగా కోచ్‌గా బాధ్యతలు తీసుకున్నారు. ఆయన శిక్షణలో ఆటగాళ్లు అండర్-19 ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శనతో ఫైనల్‌కు వెళ్లి రన్నరప్‌గా నిలిచారు. అలాగే భారత్ ‘ఎ’ జట్టు నాలుగు దేశాల సిరీస్‌లో విజేతగా నిలిచింది.
రెండేళ్ల పూర్తి స్థాయి కోచింగ్ బాధ్యతలు తీసుకోనుండటంతో ద్రవిడ్ ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు మెంటార్ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కోచ్‌గా ద్రవిడ్‌కు 2 ఏళ్ల పొడిగింపు
ఎప్పుడు : జూన్ 30
ఎవరు : బీసీసీఐ
ఎందుకు : భారత్ - ఏ, అండర్ - 19 క్రికెట్ జట్టు కోచ్‌గా
అవార్డులుఆచార్య ఇనాక్‌కు రావూరి స్మారక పురస్కారంప్రఖ్యాత కథకుడు, భాషా పరిశోధకుడు ఆచార్య కొలకలూరి ఇనాక్ 2017 సంవత్సరానికి డాక్టర్ రావూరి భరద్వాజ స్మారక పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ మేరకు రావూరి భరద్వాజ, కాంతమ్మ ట్రస్ట్ నిర్వాహకులు రావూరి కోటేశ్వరరావు, సాయి సుమంత్ జూన్ 28న ఒక ప్రకటన విడుదల చేశారు. జీవీఆర్ ఫౌండేషన్ సహకారంతో జూలై 5వ తేదీన హైదరాబాద్ త్యాగరాజ గాన సభలో ఈ పురస్కారాన్ని ఇనాక్‌కు ప్రదానం చేస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రావూరి స్మారక పురస్కారం - 2017
ఎప్పుడు : జూన్ 28
ఎవరు : ఆచార్య కొలకలూరి ఇనాక్
భారతీయ అమెరికన్లకు గ్రేట్ ఇమ్మిగ్రంట్స్ అవార్డు ఇద్దరు భారతీయ అమెరికన్లకు 2017కిగాను గ్రేట్ ఇమ్మిగ్రంట్స్ అవార్డు వరించింది. అడోబ్ అధిపతి శంతను నారాయణ్, అమెరికా మాజీ సర్జన్ జనరల్ వివేక్ మూర్తిలు సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక రంగాల్లో దేశం ముందంజ వేయడానికి చేసిన సేవకుగాను ఈ గౌరవం దక్కింది.
బ్రిటన్‌లో జన్మించిన మూర్తిని 2014లో అమెరికా సర్జన్ జనరల్‌గా ఒబామా నియమించారు. ట్రంప్ అధ్యక్షుడు అయ్యాక మూర్తిని ఆ పదవి నుంచి తొలగించారు. నారాయణ్ హైదరాబాద్‌లో జన్మించారు. నారాయణ్ యూఎస్- ఇండియా బిజినెస్ కౌన్సిల్ మెంబర్‌గా పని చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : గ్రేట్ ఇమ్మిగ్రంట్స్ అవార్డు
ఎప్పుడు : జూలై 1
ఎవరు : శంతను నారాయణ్, వివేక్ మూర్తి
ఎక్కడ : అమెరికాలో
దశరథరామిరెడ్డికి ఔట్ స్టాండింగ్ సిటిజన్ అవార్డు వైద్య రంగంలో చేసిన సేవలకు గాను ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యుడు డాక్టర్ దశరథ రామిరెడ్డికి గ్లోబల్ స్ట్రాటజిక్ అలయన్స్ సంస్థ ఔట్ స్టాండింగ్ ఇండియన్ సిటిజన్ అవార్డును ప్రకటించింది. జూలై 1న న్యూఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డు అందుకున్నారు.
వాణిజ్య రంగంలో చేసిన సేవలకు గాను గుంటూరుకు చెందిన జాస్తి రమేశ్‌కు ఔట్ స్టాండింగ్ ఇండియన్ సిటిజన్ అవార్డును అందజేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : డాక్టర్ దశరథరామిరెడ్డికి ఔట్ స్టాండింగ్ సిటిజన్ అవార్డు
ఎప్పుడు : జూలై 1
ఎవరు : గ్లోబల్ స్ట్రాటజిక్ అలయన్స్
ఎక్కడ : న్యూఢి ల్లీలో
ఎందుకు : వైద్య రంగంలో అందించిన సేవలకు గాను వార్తల్లో వ్యక్తులు
వార్తల్లో వ్యక్తులు
ముంబై పేలుళ్ల దోషి ముస్తఫా మృతి1993 నాటి ముంబై వరుస పేలుళ్ల ప్రధాన సూత్రధారుల్లో ఒకరైన ముస్తఫా దోసా (60) జూన్ 28న ముంబై జైలులో మరణించాడు. దావూద్ ఇబ్రహీంకు దోసా అత్యంత సన్నిహితుడు. పేలుళ్ల కేసులో ముస్తఫాతోపాటు మరో నలుగురిని టాడా ప్రత్యేక కోర్టు ఈ నెల 16నే దోషులుగా తేల్చింది. శిక్షలు ఖరారు చేయాల్సి ఉంది. ముంబైలో మారణహోమం సృష్టించడానికి అవసరమైన ఆయుధాలు, పేలుడు పదార్థాలను దుబాయ్ నుంచి మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లా దిఘీకి, పాకిస్తాన్‌కు దోసా సరఫరా చేశాడు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ముస్తఫా దోసా మృతి
ఎప్పుడు : జూన్ 28
ఎవరు : 1993 ముంబై పేలుళ్ల దోషి
ఎక్కడ : ముంబైలో
ఇస్రో మాజీ డెరైక్టర్ చుక్కా వెంకటయ్య మృతిభారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మాజీ డెరైక్టర్ చుక్కా వెంకటయ్య(75)జూన్ 29న బెంగళూరులో మృతి చెందారు. ఆయన ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య సోదరుడు. వెంకటయ్య అంతరిక్ష పరిశోధన సంస్థలో డెరైక్టర్‌గా, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం బృందంలో శాస్త్రవేత్తగా సేవలందించారు.
చుక్కా వెంకటయ్య జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు గ్రామంలో 1937 జూన్ 30న జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసం గూడూరులో జరిగింది. రామయ్య సహకారంతో చదువులో బాగా రాణించారు. హైదరాబాద్‌లో పదో తరగతి చదివారు. వెంకటయ్య ఈ ప్రాంతం నుంచి ఐఐటీలో సీటు సాధించిన మొదటి వ్యక్తి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : చుక్కా వెంకటయ్య కన్నుమూత
ఎప్పుడు : జూన్ 29
ఎవరు : ఇస్రో మాజీ డెరైక్టర్
ఎక్కడ : బెంగళూరులో
ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీ- ఏ స్టేట్స్‌మన్ పుస్తకావిష్కరణ‘ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీ- ఏ స్టేట్స్‌మన్’ పేరుతో స్టేట్స్‌మన్ గ్రూప్ ప్రచురించిన పుస్తకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ జూలై 2న రాష్ట్రపతి భవన్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మోదీ.. ప్రధానిగా విధులు నిర్వహించడంలో ప్రణబ్ నుంచి సాయం అందుకునే అదృష్టం తనకు దక్కిందన్నారు. గత మూడేళ్లలో తమ మధ్య జరిగిన భేటీల్లో ఆయన తనను కొడుకులా ఆదరించారని పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీ- ఏ స్టేట్స్‌మన్ పుస్తకావిష్కరణ
ఎప్పుడు : జూలై 2
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : రాష్ట్రపతి భవన్‌లో
నూతన అటార్నీ జనరల్‌గా కేకే వేణుగోపాల్ నూతన అటార్నీ జనరల్(15వ)గా 86 ఏళ్ల సీనియర్ అడ్వకేట్ కేకే వేణుగోపాల్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వేణుగోపాల్ నియామకానికి జూన్ 30న ఆమోదం తెలిపారు. ఆయన ఈ పదవిలో మూడేళ్లు ఉంటారు. ఇంతకముందు అటార్నీ జనరల్‌గా ఉన్న ముకుల్ రోహత్గీ జూన్ 18న పదవీ విరమణ చేశారు. రాజ్యాంగ నిపుణుడైన వేణుగోపాల్ గతంలో పద్మవిభూషణ్, పద్మభూషణ్ పురస్కారాలు అందుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నూతన అటార్నీ జనరల్ నియామకం
ఎప్పుడు : జూన్ 30
ఎవరు : కేకే వేణుగోపాల్
ఎందుకు : ఇంతకముందు అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ పదవీకాలం జూన్ 18న ముగిసినందుకు
ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా అచల్ జ్యోతి21వ భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ)గా 1975 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అచల్‌కుమార్ జ్యోతిని కేంద్రం నియమించింది. ప్రధాని మోదీ సీఎంగా ఉన్న సమయంలో జ్యోతి గుజరాత్ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. సీఈసీగా నసీం జైదీ పదవీకాలం జూలై 6తో ముగియడంతో అచల్‌ను నియమిస్తూ న్యాయశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2018 జనవరి 17 వరకు ఆయన సీఈసీగా కొనసాగుతారు. సీఈసీ, ఈసీల పదవీ కాలం ఆరేళ్లు లేదా 65 ఏళ్ల వయసు. రెండిటిలో ఏది ముందు వస్తే దాన్నే పరిగణనలోకి తీసుకుంటారు.
గుజరాత్ సీఎస్‌గా రిటైర్ అయిన జోతి గుజరాత్ విజిలెన్‌స కమిషనర్‌గా, 1999- 2004 మధ్య కాలంలో కాండ్లా పోర్ట్ ట్రస్టు చైర్మన్‌గా, సర్దార్ సరోవర్ నర్మదా నిగమ్ లిమిటెడ్ (ఎస్‌ఎస్‌ఎన్‌ఎన్‌ఎల్) మేనేజింగ్ డెరైక్టర్‌గా పనిచేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్
ఎప్పుడు : జూలై 6
ఎవరు : అచల్ కుమార్ జ్యోతి
ఎందుకు : జూలై 6న పదవీ విరమణ చేసిన నసీం జైదీ
పెరూలో అమెరికా రాయబారిగా కృష్ణభారత సంతతికి చెందిన సీనియర్ దౌత్య అధికారి, తెలుగు తెలిసిన వ్యక్తి కృష్ణ ఆర్ ఆర్స్.. పెరూలో అమెరికా కొత్త రాయబారిగా నియమితులయ్యారు. ఆయనకు అమెరికా విదేశాంగ శాఖలో మూడు దశాబ్దాల అనుభవం ఉంది. 1986 నుంచి దౌత్య అధికారిగా వివిధ బాధ్యతల్లో పనిచేస్తున్నారు.
ఐటీబీపీ డెరైక్టర్ జనరల్‌గా పచ్‌నందఇండో టిబెటన్ సరిహద్దు భద్రతా దళం (ఐటీబీపీ) డెరైక్టర్ జనరల్‌గా ఐపీఎస్ అధికారి ఆర్.కె.పచ్‌నంద జూన్ 30న బాధ్యతలు చేపట్టారు. ఆయన 1983 బ్యాచ్ పశ్చిమబెంగాల్ కేడర్ అధికారి. పచ్‌నంద 2018 అక్టోబర్ వరకు ఈ పదవిలో కొనసాగుతారు.
చరిత్రలో ఈ నెల జూలై (7 - 13) 2017ఏమిటి : 10.2 శాతానికి ఎన్‌పీఏలు

అంతర్జాతీయంహాంబర్గ్‌లో 12వ జీ-20 సదస్సు ఉగ్రవాదంపై పోరు, వాతావరణ మార్పులు, స్వేచ్ఛా వాణిజ్య విస్తరణే లక్ష్యంగా జర్మనీలోని హాంబర్గ్‌లో జూలై 7, 8న జీ-20 దేశాల సదస్సు జరిగింది. మొత్తం 19 దేశాల అధినేతలతో పాటు యూరోపియన్ యూనియన్ ప్రతినిధులు సదస్సుకు హాజరయ్యారు. ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు చేయాలని, అదే సమయంలో ఉగ్రసాయానికి చెక్ పెట్టేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని జీ-20 సదస్సు తీర్మానించింది.
జూలై 7న జీ-20 దేశాలు ఉమ్మడి ప్రకటన విడుదల చేస్తూ.. ప్రపంచంలో ఉగ్రవాదుల సురక్షిత స్థావరాలన్నింటినీ అంతమొందించాలని నిర్ణయించాయి. ఉగ్రవాదుల్ని చట్టం ముందు నిలబెట్టాలని.. అందుకోసం భద్రత, ప్రయాణం, వలసలు, ఇంటర్‌పోల్ తదితర విభాగాల్లో ప్రస్తుతమున్న అంతర్జాతీయ సమాచార వ్యవస్థను మెరుగుపర్చాలని తెలిపాయి.
పారిస్ ఒప్పందంపై తీర్మానం గ్లోబల్ వార్మింగ్‌పై పోరుకు కట్టుబడి ఉన్నామని జీ20 సదస్సులో భారత్ సహా 18 సభ్య దేశాలు స్పష్టం చేశాయి. సదస్సు ముగింపు సందర్భంగా జూలై 9న అధికారిక ప్రకటనలో ‘పారిస్ వాతావరణ ఒప్పందం అమలులో ఎలాంటి మార్పు ఉండదని, అమెరికా మినహా అన్ని దేశాలు సంపూర్ణ మద్దతు తెలిపాయ’ని చెప్పాయి. పారిస్ ఒప్పందం నుంచి తప్పుకున్న అమెరికా ఈ సదస్సులో ఒంటరైంది.
ప్రకటనలో మరికొన్ని ముఖ్యాంశాలు
ప్రధాని మోదీ ప్రసంగం
జీ-20 సమావేశాల్లో ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ.. రాజకీయ లక్ష్యాలను సాధించేందుకు కొన్ని దేశాలు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నాయని విమర్శించారు. జీ-20 దేశాలు ఉగ్రవాదుల జాబితాను ఇచ్చిపుచ్చుకోవటం, ఉగ్రవాదులను న్యాయపరమైన విచారణకోసం సభ్యదేశాలకు అప్పగించటం, వారికి అందే నిధులు, ఆయుధాల సరఫరాపై ప్రత్యేక దృష్టిపెట్టి కఠినంగా వ్యవహరించటంలాంటి 11 సూత్రాల కార్యాచరణను సదస్సులో మోదీ సూచించారు. విస్ఫోటక కార్యాచరణ దళం (ఈఏటీఎఫ్) ఏర్పాటు చేసి ఉగ్రవాదులకు ఆయుధాలు చేరకుండా కట్టడి చేయవచ్చని ప్రధాని వెల్లడించారు. ఉగ్రవాదానికి మద్దతుగా నిలుస్తున్న దేశాల ప్రతినిధులకు జీ-20లో ప్రవేశాన్ని నిషేధించాలన్నారు.
పర్యావరణ మార్పులు, పారిస్ ఒప్పందం విషయంలో జీ-20 దేశాలన్నీ సంపూర్ణ సహకారంతో ఏకతాటిపై నడవాల్సిన అవసరం ఉందని మోదీ తెలిపారు.
జీ-20 గురించి..ప్రపంచ దేశాల మధ్య వాణిజ్య, ద్వైపాక్షిక సహకారం కోసం అంతర్జాతీయ వేదికగా జరిగే ముఖ్యమైన సదస్సుల్లో జీ-20 ఒకటి. 19 దేశాలు, యూరోపియన్ యూనియన్ కలిసి జీ-20 కూటమిని ఏర్పాటు చేశాయి. ఈ సదస్సులో ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, ద్రవ్య విధానం సహా పలు కీలకాంశాలపై సభ్య దేశాల అధినేతలు, రిజర్వ్ బ్యాంకు గవర్నర్లు చర్చలు జరుపుతారు.
జీ-20 సమావేశాలు
ఏమిటి : జీ-20 సమావేశం
ఎప్పుడు : జూలై 7-8
ఎక్కడ : హాంబర్గ్, జర్మనీ
ఎందుకు : ఉగ్రవాదంపై పోరు, వాతావరణ మార్పులు, స్వేచ్ఛా వాణిజ్య విస్తరణే లక్ష్యంగా
అణ్వాయుధ నిషేధ ఒప్పందానికి ఆమోదం అణ్వాయుధాల నిషేధం కోసం తొలి చట్టబద్ధ అంతర్జాతీయ ఒప్పందానికి ఐక్యరాజ్య సమితి భారీ మెజారిటీతో ఆమోదం తెలిపింది. జూలై 8న సంబంధిత తీర్మానంపై జరిగిన ఓటింగ్‌లో ఒప్పందానికి అనుకూలంగా 122 దేశాలు ఓటేయగా, నెదర్లాండ్‌స వ్యతిరేకంగా ఓటేసింది. సింగపూర్ గైర్హాజరైంది. అణ్వాయుధాల అభివృద్ధి, పరీక్షలు, తయారీ, సేకరణ, నిల్వ, వాడకం వంటి అన్ని కార్యక్రమాలను ఒప్పందం నిషేధించింది. ఈ ఆయుధాల పేరుతో బెదిరింపులకు కూడా పాల్పడకూడదని స్పష్టం చేసింది.
అణుశక్తి దేశాలైన భారత్, అమెరికా, బ్రిటన్, రష్యా, ఉత్తర కొరియా, ఇజ్రాయెల్, చైనా, పాకిస్తాన్ తదితరాలు ఈ ఒప్పందం కోసం ఈ ఏడాది మార్చిలో జరిగిన చర్చలను బహిష్కరించాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అణ్వాయుధాల నిషేధ ఒప్పందానికి ఆమోదం
ఎప్పుడు : జూలై 8
ఎవరు : ఐక్యరాజ్య సమితి
ఎక్కడ : న్యూయార్క్, అమెరికా
ఎందుకు : అణ్వాయుధాలపై నిషేధానికి
మలబార్ సైనిక విన్యాసాలు2017భారత్, అమెరికా, జపాన్ నౌకా దళాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మలబార్ సైనిక విన్యాసాలు జూలై 10న బంగాళాఖాతంలో ప్రారంభమయ్యాయి. ఐదు రోజులపాటు సాగే ఈ ప్రదర్శనల ద్వారా ప్రపంచానికి మనం గొప్ప ఉదాహరణగా నిలుస్తామని అమెరికా నౌకాదళ కమాండర్, రియర్ అడ్మిరల్ విలియం డీ బైర్న్ అన్నారు. ఈ ప్రదర్శనలో మొత్తం 95 విమానాలు, 16 ఓడలు, రెండు జలాంతర్గాములు పాల్గొంటున్నాయి.
అమెరికా, జపాన్, భారత్‌ల మధ్య సహకారం పెంపుదల కోసం ఏటా మలబార్ సైనిక్య విన్యాసాలు నిర్వహిస్తున్నారు. 1992లో భారత్, అమెరికా ఈ విన్యాసాలను ప్రారంభించాయి. జపాన్ 2015లో జపాన్ కూడా జతకలిసింది. చేరింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మలబార్ సైనిక విన్యాసాలు - 2017
ఎప్పుడు : జూలై 10-14
ఎవరు : భారత్, అమెరికా, జపాన్
ఎక్కడ : బంగాళాఖాతంలో
ఎందుకు : అమెరికా, జపాన్, భారత్‌ల మధ్య సహకారం పెంపు కోసం
ఐసిస్ చీఫ్ బాగ్దాదీ హతం: ఎస్‌ఓహెచ్‌ఆర్ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ చీఫ్ అబు బకర్ అల్ బాగ్దాదీ మరణించినట్లు సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ జూలై 11న వెల్లడించింది. సిరియాలోని డైర్ ఎజ్జార్‌లో ఉన్న ఐసిస్ కీలక నేతలు బాగ్దాదీ మరణాన్ని ధ్రువీకరించారని.. జూలై 11న ఈ విషయం తెలిసిందని పేర్కొంది. అయితే బాగ్దాదీ ఎక్కడ, ఎలా మరణించాడనేది తెలియదని సంస్థ డెరైక్టర్ రామి అబ్దుల్ రహ్మాన్ వివరించారు.
బాగ్దాదీ మరణంపై ఐసిస్ స్పందించలేదు. ఇరాక్, సిరియాలలో ఐసిస్‌తో పోరాడుతున్న అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ దళాలు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించలేదు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐసిస్ చీఫ్ బాగ్దాదీ హతం
ఎప్పుడు : జూలై 11
ఎవరు : సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్
ఎక్కడ : సిరియాలో
గ్రీన్ కార్డులకు 12 ఏళ్ల నిరీక్షణఅమెరికాలో నైపుణ్య ఉద్యోగులుగా శాశ్వత నివాసం కోసం గ్రీన్ కార్డుకు దరఖాస్తు చేసుకునే భారతీయుల ముందు 12 ఏళ్ల సుదీర్ఘ వెయిటింగ్ జాబితా ఉంది. అయితే ఏటా ఈ కార్డులు పొందుతున్న వారిలో భారతీయులే ఎక్కువ ఉన్నారు. 2015లో అమెరికాలో 36,318 మంది భారతీయులు తమ హోదాను శాశ్వత నివాసం హోదాకు సర్దుబాటు చేసుకున్నారు. కొత్తగా ప్రవేశించిన మరో 27,978 మంది గ్రీన్‌కార్డు రూపంలో చట్టబద్ధ శాశ్వత నివాసాన్ని పొందారు. ఈ మేరకు ప్యూ రీసెర్చ్ సంస్థ తన నివేదికలో తెలిపింది. ఒక ఉద్యోగ సంబంధ విభాగంలో భారతీయుల ముందు ప్రస్తుతం 12 ఏళ్ల జాబితా ఉందని, ప్రభుత్వం 2005 మేలో వచ్చిన దరఖాస్తులను ఇంకా పరిశీలిస్తోందని పేర్కొంది. 2015లో 5,42,315 మంది తమ నివాస హోదాను శాశ్వత నివాస హోదాకు మార్చుకున్నారని వెల్లడించింది. గ్రీన్‌కార్డు దారులు ఐదేళ్లు అమెరికాలో ఉంటే ఆ దేశ పౌర సత్వానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : గ్రీన్ కార్డు కోసం 12 ఏళ్ల నిరీక్షణ
ఎప్పుడు : జూలై 11
ఎవరు : ప్యూ రీసెర్చ్ సంస్థ
ఎక్కడ : అమెరికాలో
ఒకినోషిమా ద్వీపానికి యునెస్కో గుర్తింపుజపాన్‌లోని ఒకినోషిమా ద్వీపానికి యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రాంత హోదా దక్కింది. ఇక్కడి ద్వీప దేవతను సందర్శించుకునేందుకు ఏడాదికి 200 మందిని మాత్రమే అనుమతిస్తారు.అయితే మహిళలకు ప్రవేశం లేదు. సముద్రం ద్వారా ఇక్కడికి చేరుకోవడం ప్రమాదమనే కారణంతోనే స్త్రీలను ఇక్కడికి అనుమతించడం లేదని తెలుస్తోంది. యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో వెయ్యికి పైగా ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ప్రదేశాలున్నాయి. స్మారక స్థలాలు, ప్రదేశాలు, నగరాలు, నిర్మాణాలు ఈ జాబితాలో ఉన్నాయి.
జాతీయంభారత్ - ఇజ్రాయెల్ మధ్య 7 ఒప్పందాలు ఉగ్రవాదంతో పాటుగా వీరికి ఆశ్రయం కల్పిస్తున్న వారిపై కఠినంగా వ్యవహరించటంలో వ్యూహాత్మక భాగస్వామ్యంతో ముందుకెళ్లాలని భారత్, ఇజ్రాయెల్ నిర్ణయించాయి. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న తీవ్రవాద పరిస్థితులు, ఉగ్రవాదానికి ఆర్థికసాయం చేస్తున్న వారిపై సంయుక్తంగా పోరాటం చేయనున్నట్లు స్పష్టం చేశాయి. ఇజ్రాయెల్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనలో భాగంగా జూలై 5న ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూతో పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు. ఉగ్రవాదం, దీన్ని ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపైఇరువురు చర్చించారు. అంతర్జాతీయ ఉగ్రవాదంపై సమగ్ర సదస్సు (సీసీఐటీ)ను వీలైనంత త్వరగా అమల్లోకి తీసుకురావటంలోనూ కలిసి పనిచేయాలని నిర్ణయించారు. ఇరుదేశాల ప్రజల మధ్య సంబంధాలను పెంచేందుకు జెరూసలేంలో భారత సాంస్కృతిక కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు ఈ సందర్భంగా మోదీ ప్రకటించారు.
ఏడు ఒప్పందాలపై సంతకాలు

- ఐఎంఎఫ్ సంస్కరణల్ని పూర్తి స్థాయిలో అమలు చేయడంతో పాటు, 2019లోగా కొత్త సంస్కరణల్ని రూపొందించాలి.
- మార్కెట్‌కు నష్టం కలిగించే సబ్సిడీలకు స్వస్తిచెప్పాలి. పారిశ్రామిక రంగంలో అధికోత్పత్తి సమస్యను అధిగమించేందుకు అంతర్జాతీయంగా సహకరించుకోవాలి.
- రక్షణ రంగంలో ఆయుధాల చట్టబద్ధ వ్యాపారానికి జీ20 సదస్సు అంగీకారం.
- వాణిజ్యం, పెట్టుబడుల్ని ప్రోత్సహించేందుకు అనుకూల వాతావరణం కల్పించాలని, స్వేచ్ఛా వాణిజ్య విఫణికి కట్టుబడి ఉండాలని తీర్మానం.
ప్రధాని మోదీ ప్రసంగం
జీ-20 సమావేశాల్లో ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ.. రాజకీయ లక్ష్యాలను సాధించేందుకు కొన్ని దేశాలు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నాయని విమర్శించారు. జీ-20 దేశాలు ఉగ్రవాదుల జాబితాను ఇచ్చిపుచ్చుకోవటం, ఉగ్రవాదులను న్యాయపరమైన విచారణకోసం సభ్యదేశాలకు అప్పగించటం, వారికి అందే నిధులు, ఆయుధాల సరఫరాపై ప్రత్యేక దృష్టిపెట్టి కఠినంగా వ్యవహరించటంలాంటి 11 సూత్రాల కార్యాచరణను సదస్సులో మోదీ సూచించారు. విస్ఫోటక కార్యాచరణ దళం (ఈఏటీఎఫ్) ఏర్పాటు చేసి ఉగ్రవాదులకు ఆయుధాలు చేరకుండా కట్టడి చేయవచ్చని ప్రధాని వెల్లడించారు. ఉగ్రవాదానికి మద్దతుగా నిలుస్తున్న దేశాల ప్రతినిధులకు జీ-20లో ప్రవేశాన్ని నిషేధించాలన్నారు.
పర్యావరణ మార్పులు, పారిస్ ఒప్పందం విషయంలో జీ-20 దేశాలన్నీ సంపూర్ణ సహకారంతో ఏకతాటిపై నడవాల్సిన అవసరం ఉందని మోదీ తెలిపారు.
జీ-20 గురించి..ప్రపంచ దేశాల మధ్య వాణిజ్య, ద్వైపాక్షిక సహకారం కోసం అంతర్జాతీయ వేదికగా జరిగే ముఖ్యమైన సదస్సుల్లో జీ-20 ఒకటి. 19 దేశాలు, యూరోపియన్ యూనియన్ కలిసి జీ-20 కూటమిని ఏర్పాటు చేశాయి. ఈ సదస్సులో ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, ద్రవ్య విధానం సహా పలు కీలకాంశాలపై సభ్య దేశాల అధినేతలు, రిజర్వ్ బ్యాంకు గవర్నర్లు చర్చలు జరుపుతారు.
- ఆసియన్ ఆర్థిక సంక్షోభం తర్వాత అంతర్జాతీయ ద్రవ్య స్థిరీకరణకు అవలంబించాల్సిన విధానాల రూపకల్పన కోసం 1999లో జీ-20ని ఏర్పాటు చేశారు.
- అమెరికాలోని వాషింగ్టన్ డీసీ నగరంలో 2008లో జీ-20 తొలి సమావేశం జరిగింది.
- ప్రపంచ జీడీపీలో 80 శాతం జీ-20 దేశాలు కలిగి ఉంటాయి.
- మొత్తం ప్రపంచ వాణిజ్యంలో 75 శాతం జీ-20 దేశాల ద్వారానే జరుగుతుంది.
- ప్రపంచ జనాభాలో మూడింట రెండొంతులు జీ-20 దేశాల్లో ఉన్నారు.
ఈయూ
|
భారత్
|
చైనా
|
జపాన్
|
కెనడా
|
దక్షిణ కొరియా
|
యూకే
|
సౌదీ అరేబియా
|
అమెరికా
|
ఇండోనేషియా
|
మెక్సికో
|
బ్రెజిల్
|
ఫ్రాన్స్
|
దక్షిణాఫ్రికా
|
ఇటలీ
|
ఆస్ట్రేలియా
|
రష్యా
|
అర్జెంటీనా
|
టర్కీ
|
జర్మనీ
|
- 2008 - వాషింగ్టన్ డీసీ, అమెరికా
- 2009 - లండన్, యూకే
- 2009 - పిట్స్‌బర్గ్ , అమెరికా
- 2010 - టొరంటో, కెనడా
- 2010 - సియోల్, దక్షిణ కొరియా
- 2011 - కేన్స్, ఫ్రాన్స్
- 2012 - లాస్ కాబోస్, మెక్సికో
- 2013 - సెయింట్ పీటర్స్‌బర్గ్, రష్యా
- 2014 - బ్రిస్బేన్, ఆస్ట్రేలియా
- 2015 - అంటల్యా, టర్కీ
- 2016 - హాంగ్జౌ, చైనా
- 2017 - హాంబర్గ్, జర్మనీ
ఏమిటి : జీ-20 సమావేశం
ఎప్పుడు : జూలై 7-8
ఎక్కడ : హాంబర్గ్, జర్మనీ
ఎందుకు : ఉగ్రవాదంపై పోరు, వాతావరణ మార్పులు, స్వేచ్ఛా వాణిజ్య విస్తరణే లక్ష్యంగా
అణ్వాయుధ నిషేధ ఒప్పందానికి ఆమోదం అణ్వాయుధాల నిషేధం కోసం తొలి చట్టబద్ధ అంతర్జాతీయ ఒప్పందానికి ఐక్యరాజ్య సమితి భారీ మెజారిటీతో ఆమోదం తెలిపింది. జూలై 8న సంబంధిత తీర్మానంపై జరిగిన ఓటింగ్‌లో ఒప్పందానికి అనుకూలంగా 122 దేశాలు ఓటేయగా, నెదర్లాండ్‌స వ్యతిరేకంగా ఓటేసింది. సింగపూర్ గైర్హాజరైంది. అణ్వాయుధాల అభివృద్ధి, పరీక్షలు, తయారీ, సేకరణ, నిల్వ, వాడకం వంటి అన్ని కార్యక్రమాలను ఒప్పందం నిషేధించింది. ఈ ఆయుధాల పేరుతో బెదిరింపులకు కూడా పాల్పడకూడదని స్పష్టం చేసింది.
అణుశక్తి దేశాలైన భారత్, అమెరికా, బ్రిటన్, రష్యా, ఉత్తర కొరియా, ఇజ్రాయెల్, చైనా, పాకిస్తాన్ తదితరాలు ఈ ఒప్పందం కోసం ఈ ఏడాది మార్చిలో జరిగిన చర్చలను బహిష్కరించాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అణ్వాయుధాల నిషేధ ఒప్పందానికి ఆమోదం
ఎప్పుడు : జూలై 8
ఎవరు : ఐక్యరాజ్య సమితి
ఎక్కడ : న్యూయార్క్, అమెరికా
ఎందుకు : అణ్వాయుధాలపై నిషేధానికి
మలబార్ సైనిక విన్యాసాలు2017భారత్, అమెరికా, జపాన్ నౌకా దళాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మలబార్ సైనిక విన్యాసాలు జూలై 10న బంగాళాఖాతంలో ప్రారంభమయ్యాయి. ఐదు రోజులపాటు సాగే ఈ ప్రదర్శనల ద్వారా ప్రపంచానికి మనం గొప్ప ఉదాహరణగా నిలుస్తామని అమెరికా నౌకాదళ కమాండర్, రియర్ అడ్మిరల్ విలియం డీ బైర్న్ అన్నారు. ఈ ప్రదర్శనలో మొత్తం 95 విమానాలు, 16 ఓడలు, రెండు జలాంతర్గాములు పాల్గొంటున్నాయి.
అమెరికా, జపాన్, భారత్‌ల మధ్య సహకారం పెంపుదల కోసం ఏటా మలబార్ సైనిక్య విన్యాసాలు నిర్వహిస్తున్నారు. 1992లో భారత్, అమెరికా ఈ విన్యాసాలను ప్రారంభించాయి. జపాన్ 2015లో జపాన్ కూడా జతకలిసింది. చేరింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మలబార్ సైనిక విన్యాసాలు - 2017
ఎప్పుడు : జూలై 10-14
ఎవరు : భారత్, అమెరికా, జపాన్
ఎక్కడ : బంగాళాఖాతంలో
ఎందుకు : అమెరికా, జపాన్, భారత్‌ల మధ్య సహకారం పెంపు కోసం
ఐసిస్ చీఫ్ బాగ్దాదీ హతం: ఎస్‌ఓహెచ్‌ఆర్ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ చీఫ్ అబు బకర్ అల్ బాగ్దాదీ మరణించినట్లు సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ జూలై 11న వెల్లడించింది. సిరియాలోని డైర్ ఎజ్జార్‌లో ఉన్న ఐసిస్ కీలక నేతలు బాగ్దాదీ మరణాన్ని ధ్రువీకరించారని.. జూలై 11న ఈ విషయం తెలిసిందని పేర్కొంది. అయితే బాగ్దాదీ ఎక్కడ, ఎలా మరణించాడనేది తెలియదని సంస్థ డెరైక్టర్ రామి అబ్దుల్ రహ్మాన్ వివరించారు.
బాగ్దాదీ మరణంపై ఐసిస్ స్పందించలేదు. ఇరాక్, సిరియాలలో ఐసిస్‌తో పోరాడుతున్న అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ దళాలు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించలేదు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐసిస్ చీఫ్ బాగ్దాదీ హతం
ఎప్పుడు : జూలై 11
ఎవరు : సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్
ఎక్కడ : సిరియాలో
గ్రీన్ కార్డులకు 12 ఏళ్ల నిరీక్షణఅమెరికాలో నైపుణ్య ఉద్యోగులుగా శాశ్వత నివాసం కోసం గ్రీన్ కార్డుకు దరఖాస్తు చేసుకునే భారతీయుల ముందు 12 ఏళ్ల సుదీర్ఘ వెయిటింగ్ జాబితా ఉంది. అయితే ఏటా ఈ కార్డులు పొందుతున్న వారిలో భారతీయులే ఎక్కువ ఉన్నారు. 2015లో అమెరికాలో 36,318 మంది భారతీయులు తమ హోదాను శాశ్వత నివాసం హోదాకు సర్దుబాటు చేసుకున్నారు. కొత్తగా ప్రవేశించిన మరో 27,978 మంది గ్రీన్‌కార్డు రూపంలో చట్టబద్ధ శాశ్వత నివాసాన్ని పొందారు. ఈ మేరకు ప్యూ రీసెర్చ్ సంస్థ తన నివేదికలో తెలిపింది. ఒక ఉద్యోగ సంబంధ విభాగంలో భారతీయుల ముందు ప్రస్తుతం 12 ఏళ్ల జాబితా ఉందని, ప్రభుత్వం 2005 మేలో వచ్చిన దరఖాస్తులను ఇంకా పరిశీలిస్తోందని పేర్కొంది. 2015లో 5,42,315 మంది తమ నివాస హోదాను శాశ్వత నివాస హోదాకు మార్చుకున్నారని వెల్లడించింది. గ్రీన్‌కార్డు దారులు ఐదేళ్లు అమెరికాలో ఉంటే ఆ దేశ పౌర సత్వానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : గ్రీన్ కార్డు కోసం 12 ఏళ్ల నిరీక్షణ
ఎప్పుడు : జూలై 11
ఎవరు : ప్యూ రీసెర్చ్ సంస్థ
ఎక్కడ : అమెరికాలో
ఒకినోషిమా ద్వీపానికి యునెస్కో గుర్తింపుజపాన్‌లోని ఒకినోషిమా ద్వీపానికి యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రాంత హోదా దక్కింది. ఇక్కడి ద్వీప దేవతను సందర్శించుకునేందుకు ఏడాదికి 200 మందిని మాత్రమే అనుమతిస్తారు.అయితే మహిళలకు ప్రవేశం లేదు. సముద్రం ద్వారా ఇక్కడికి చేరుకోవడం ప్రమాదమనే కారణంతోనే స్త్రీలను ఇక్కడికి అనుమతించడం లేదని తెలుస్తోంది. యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో వెయ్యికి పైగా ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ప్రదేశాలున్నాయి. స్మారక స్థలాలు, ప్రదేశాలు, నగరాలు, నిర్మాణాలు ఈ జాబితాలో ఉన్నాయి.
జాతీయంభారత్ - ఇజ్రాయెల్ మధ్య 7 ఒప్పందాలు ఉగ్రవాదంతో పాటుగా వీరికి ఆశ్రయం కల్పిస్తున్న వారిపై కఠినంగా వ్యవహరించటంలో వ్యూహాత్మక భాగస్వామ్యంతో ముందుకెళ్లాలని భారత్, ఇజ్రాయెల్ నిర్ణయించాయి. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న తీవ్రవాద పరిస్థితులు, ఉగ్రవాదానికి ఆర్థికసాయం చేస్తున్న వారిపై సంయుక్తంగా పోరాటం చేయనున్నట్లు స్పష్టం చేశాయి. ఇజ్రాయెల్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనలో భాగంగా జూలై 5న ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూతో పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు. ఉగ్రవాదం, దీన్ని ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపైఇరువురు చర్చించారు. అంతర్జాతీయ ఉగ్రవాదంపై సమగ్ర సదస్సు (సీసీఐటీ)ను వీలైనంత త్వరగా అమల్లోకి తీసుకురావటంలోనూ కలిసి పనిచేయాలని నిర్ణయించారు. ఇరుదేశాల ప్రజల మధ్య సంబంధాలను పెంచేందుకు జెరూసలేంలో భారత సాంస్కృతిక కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు ఈ సందర్భంగా మోదీ ప్రకటించారు.
ఏడు ఒప్పందాలపై సంతకాలు
- ద్వైపాక్షిక బంధాలను బలోపేతం చేసుకోవటంతోపాటు ఉగ్రవాదంపై పోరాటంలోనూ పరస్పర సహకారం చేసుకోవాలని ఇరుదేశాలు నిర్ణయించాయి.
- అంతరిక్ష పరిశోధన, పారిశ్రామిక, వ్యవసాయం రంగాలతోపాటు నీటి పరిరక్షణ అంశంలో ఇరుదేశాల మధ్య ఏడు ఒప్పందాలు జరిగాయి.
- భారత్-ఇజ్రాయెల్ పారిశ్రామిక పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డీ), సాంకేతిక సృజనాత్మకత కోసం 40 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.259 కోట్లు) నిధిని ఏర్పాటు చేసేందుకు ఇరువురు ప్రధానులు అంగీకరించారు.
- నీటి సంరక్షణతో పాటుగా భారత్‌లో నీటి వినియోగ సంస్కరణలు తీసుకురావటంపై పరస్పర అంగీకారం.
- అణు గడియారాలు, చిన్న శాటిలైట్ల కోసం ఎలక్ట్రిక్ చోదక ఇంజన్‌లు, జియో-లియో (GEO&LEO) ఆప్టికల్ లింక్‌పైనా సహకారానికి ఇరుదేశాల మధ్య ఒప్పందం కుదిరింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్ - ఇజ్రాయెల్ మధ్య 7 ఒప్పందాలు
ఎప్పుడు : జూలై 5
ఎవరు : నరేంద్ర మోదీ - బెంజ్‌మెన్ నెతన్యాహూ
ఎక్కడ : ఇజ్రాయెల్‌లో
ఎందుకు : మోదీ ఇజ్రాయెల్ పర్యటనలో భాగంగా
రాజస్తాన్‌లో ఆవుల పోషణకు రోజుకి రూ. 70ఆవుల సంక్షేమం కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేసిన తొలి రాష్ట్రంగా గుర్తింపు పొందిన రాజస్తాన్ ఆవుల పోషణకు (ఒక్కో ఆవుకి) రోజుకు రూ.70 అందించనుంది. దూడ కూడా ఉంటే మరో రూ.35 అదనంగా ఇవ్వనుంది. సంరక్షణ లేక వేలాది ఆవులు చనిపోతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మొత్తాన్ని సమకూర్చుకోవడానికి వివిధ రకాల లావాదేవీలపై 10 శాతం చొప్పున ఆవు పన్ను విధించారు. ఈ మొత్తం సరిగ్గా వినియోగమవుతుందా లేదా అన్నది చూసేందుకు గోశాలలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు.
రాజస్తాన్‌లో సామాన్యులకు ఉద్దేశించిన సంక్షేమ పథకాల కోసం వెచ్చిస్తున్న మొత్తం ఒక్కొక్కరికి రూ.26.65. ఇక్కడ నగరాల్లో నివసిస్తూ రోజుకు రూ.28 కంటే తక్కువ సంపాదిస్తున్న వారిని దారిద్య్ర రేఖకు దిగువన(బీపీఎల్) ఉన్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. అలాగే గ్రామాల్లో రూ.25.16 కంటే తక్కువ ఆదాయం ఉన్న వారిని ఈ కేటగిరీలోకి చేర్చింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆవుల పోషణకు రోజుకి రూ. 70
ఎప్పుడు : జూలై 5
ఎవరు : రాజస్తాన్ ప్రభుత్వం
ఎక్కడ : రాజస్తాన్‌లో
ఎందుకు : ఆవుల సంరక్షణ కోసం
జీఎస్టీని ఆమోదించిన జమ్మూకశ్మీర్ అసెంబ్లీవస్తు, సేవల పన్ను(జీఎస్టీ) అమలుపై ప్రతిపాదించిన తీర్మానాన్ని జమ్మూకశ్మీర్ అసెంబ్లీ జూలై 5న ఆమోదించింది. రాష్ట్రపతి ఆదేశాల మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హసీబ్ డ్రాబు ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. నేషనల్ కాన్ఫరెన్‌స(ఎన్‌సీ), కాంగ్రెస్, సీపీఎం ఎమ్మెల్యేలు, ఇండిపెండెంట్ సభ్యుడు తీర్మానాన్ని వ్యతిరేకించారు. విపక్షాల అభ్యంతరాలపై మంత్రి సమాధానమిస్తూ 370 ఆర్టికల్ ద్వారా జమ్మూకశ్మీర్‌కు సంక్రమించిన ప్రత్యేక ప్రతిపత్తికి, ప్రత్యేక పన్నుల విధానానికి ఎలాంటి ఢోకా ఉండబోదని స్పష్టం చేశారు.
కశ్మీర్ అసెంబ్లీ తీర్మానంతో దేశంలోని అన్ని రాష్ట్రాలు జీఎస్టీ అమలుకు ఆమోదం తెలిపినట్లు అయింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జీఎస్టీకి ఆమోదం
ఎప్పుడు : జూలై 5
ఎవరు : జమ్మకశ్మీర్ రాష్ట్ర అసెంబ్లీ
కశ్మీర్‌లో అమల్లోకి వస్తు సేవల పన్ను వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) జూలై 6 అర్ధరాత్రి నుంచి జమ్మూకశ్మీర్‌లోనూ అమల్లోకి వచ్చింది. జమ్మూకశ్మీర్ జీఎస్టీ బిల్లు-2017ను మూజువాణి ఓటుతో అసెంబ్లీ ఆమోదించింది. ఈ బిల్లుతో రాష్ట్ర ప్రత్యేక హోదాకు విఘాతం కలుగుతుందని విపక్షాలు ఆరోపించగా.. జీఎస్టీ అమలుపై నెలకొన్న ఆందోళనలను పరిష్కారిస్తామని సీఎం మెహబూబా హామీ ఇచ్చారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జీఎస్టీ అమలు ప్రారంభం
ఎప్పుడు : జూలై 6
ఎవరు : జమ్ము కశ్మీర్ ప్రభుత్వం
ఎక్కడ : జమ్ముకశ్మీర్‌లో
సైబర్ భద్రతలో భారత్‌కు 23వ ర్యాంకుప్రపంచవ్యాప్తంగా సైబర్ భద్రతలో మొత్తం 165 దేశాల్లో భారత్ 23వ స్థానంలో నిలిచినట్లు ఇంటర్నేషనల్ టెలీకమ్యూనికేషన్ యూనియన్ (ఐటీయూ) తెలిపింది. ఈ మేరకు ప్రపంచ సైబర్ భద్రతా సూచీ(జీసీఐ) 2వ నివేదికను జూలై 6న విడుదల చేసింది. ఇందులో సింగపూర్ తొలిస్థానంలో నిలిచింది. అమెరికా, మలేసియా, ఒమన్, ఇస్తోనియా, మారిషస్, ఆస్ట్రేలియాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
ఈ జాబితాలోని 77 దేశాలు సైబర్ భద్రత కోసం ఇప్పటికే చర్యలు ప్రారంభించాయని ఐటీయూ తెలిపింది. గతేడాది పంపిన మొత్తం ఈ మెయిల్స్‌లో 1 శాతం సైబర్ దాడులకు ఉద్దేశించినవేనని ఐటీయూ తెలిపింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సైబర్ భద్రతలో భారత్‌కు 23వ ర్యాంకు
ఎప్పుడు : జూలై 6
ఎవరు : ఇంటర్నేషనల్ టెలీకమ్యూనికేషన్ యూనియన్
ఎక్కడ : ప్రపంచవ్యాప్తంగా
ఆధార్‌కు ఎఫ్‌ఎస్‌బీ ప్రశంసలుభారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆధార్ పథకం అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంది. బ్యాంకింగ్ సేవలను ప్రజలందరికీ చేరువ చేయడానికి, నగదు వ్యవహారాలను తగ్గించడానికి భారత్ ఆధార్‌ను వినియోగిస్తోందని ఫైనాన్షియల్ స్టెబిలిటీ బోర్డ్(ఎఫ్‌ఎస్‌బీ) అనే సంస్థ తన నివేదికలో పేర్కొంది. భారత్‌లో ఆధార్ వినియోగం వల్ల రెమిటెన్‌స చెల్లింపుల్లో ఎదురవుతున్న సమస్యలు తగ్గే అవకాశమున్నట్లు వెల్లడించింది. అంతర్జాతీయ స్థాయిలో ఆర్థిక విధానాలను సమర్థవంతంగా పర్యవేక్షించడానికి కరస్పాండెంట్ బ్యాంకింగ్ కోఆర్డినేషన్ గ్రూప్(సీబీసీజీ)ను ఎఫ్‌ఎస్‌బీ ఏర్పాటుచేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆధార్‌కు అంతర్జాతీయంగా ప్రశంసలు
ఎప్పుడు : జూలై 6
ఎవరు : ఫైనాన్షియల్ స్టెబిలిటీ బోర్డ్
మైనారిటీలకు 100 నైపుణ్యాభివృద్ధి కేంద్రాలుమైనారిటీ యువత సంక్షేమం కోసం రానున్న ఆరు నెలల్లో దేశవ్యాప్తంగా 100 జిల్లాల్లో గరీబ్ నవాజ్ పేరిట వృత్తి విద్యా నైపుణ్య శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు జూలై 6న ప్రభుత్వ రంగ సంస్థ మౌలానా ఆజాద్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ సమావేశంలో కేంద్ర మైనారిటీ శాఖ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ తెలిపారు. హైదరాబాద్‌తోపాటు నోయిడా, లక్నో, ముంబై, నాగపూర్, భోపాల్, పట్నా, రాంచీ తదితర జిల్లాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మైనారిటీలకు 100 నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు
ఎప్పుడు : జూలై 6
ఎవరు : మైనారిటీ శాఖ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ
ఎక్కడ : దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో
సూరత్‌లో పింక్ ఆటో సర్వీస్ మహిళా ప్రయాణికుల కోసం మహిళలే నడిపే ఆటో సేవలను గుజరాత్‌లోని సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ (ఎస్‌ఎంసీ) ప్రారంభించింది. ‘పింక్ ఆటో సర్వీస్’ పేరుతో జూలై 2న ఆరంభించిన ఈ కార్యక్రమం ద్వారా ఆర్థికంగా వెనుకబడ్డ మహిళలు గౌరవప్రదంగా జీవించేందుకు కార్పొరేషనే వారికి డ్రైవింగ్ నేర్పించి ఆటో కొనుక్కోవడానికి బ్యాంకు రుణాలను ఇప్పించింది. ఇందులో 25 శాతం మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఒక్కో లబ్ధిదారు నెలకు రూ.18 వేల వరకు సంపాదించగలుగుతుందని ఎస్‌ఎంసీ భావిస్తోంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పింక్ ఆటో సర్వీస్
ఎప్పుడు : జూలై 2
ఎవరు : సూరత్ మున్సిపల్ కార్పొరేషన్
ఎక్కడ : సూరత్, గుజరాత్
ఎందుకు : మహిళలకు స్వయం ఉపాధి కల్పించడానికి
ప్రపంచ వారసత్వ నగరంగా అహ్మదాబాద్గుజరాత్‌లో 600 ఏళ్ల చరిత్ర కలిగిన అహ్మదాబాద్‌ను యునెస్కో ప్రపంచ వారసత్వ నగరంగా గుర్తించింది. దీంతో అహ్మదాబాద్ పారిస్, వియన్నా, కైరా, బ్రసెల్స్, రోమ్ వంటి ప్రఖ్యాత నగరాల సరసన చేరింది. పోలండ్‌లోని క్రాకౌలో జరిగిన ప్రపంచ వారసత్వ కమిటీ సమావేశంలో ఢిల్లీ, ముంబై నగరాలను వెనక్కినెట్టి అహ్మదాబాద్ ఈ గౌరవాన్ని అందుకుంది. యునెస్కో నిర్ణయంతో భారత్ చాలా ఆనందంగా ఉందని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రపంచ వారసత్వ నగరంగా అహ్మదాబాద్
ఎప్పుడు : జూలై 9
ఎవరు : యునెస్కో
డిజిటల్‌లోకి మూడు విద్యా కార్యక్రమాలువిద్యారంగానికి సంబంధించిన మూడు డిజిటల్ కార్యక్రమాలను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జూలై 9న ప్రారంభించారు.
‘స్వయం’ ద్వారా విద్యార్థులు ఇంటర్నెట్ సదుపాయంతో ఆన్‌లైన్‌లో క్లాసులు వినొచ్చు.
‘స్వయం ప్రభ’ ద్వారా డీటీహెచ్ రూపంలో విద్యార్థులు వారి ఇంట్లోని టీవీల్లో వచ్చే 32 విద్యా చానళ్ల నుంచి పాఠాలు నేర్చుకోవచ్చు. ఈ సేవలు ఉచితం కాగా డీటీహెచ్ ఏర్పాటుకు మాత్రం రూ.1,500 ఖర్చవుతుంది.
అలాగే విద్యార్థులందరి ధ్రువపత్రాలను డిజిటల్ ఫార్మాట్‌లో భద్రపరచడం కోసం ‘నేషనల్ అకడమిక్ డిపాజిటరీ’ని కూడా ప్రణబ్ ప్రారంభించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : స్వయం, స్వయం ప్రభ, నేషనల్ అకడమిక్ డిపాజిటరీ కార్యక్రమాలు ప్రారంభం
ఎప్పుడు : జూలై 9
ఎవరు : రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ
ఎక్కడ : న్యూఢిల్లీలో
‘విద్య’లో ముస్లింల వెనుకబాటువిద్యాపరంగా మైనార్టీలలో ముస్లింలు అత్యంత వెనుకబడి ఉన్నారని కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా నడిచే ఓ సంస్థ ఏర్పాటు చేసిన ప్యానెల్ వెల్లడించింది. కేంద్ర పాఠశాలలు, కమ్యూనిటీ కాలేజీలు, జాతీయస్థాయి విద్యాసంస్థలు మూడంచల్లో విద్యా సంస్థలను ఏర్పాటు చేయడం ద్వారా ముస్లింలలో సాధికారత వస్తుందని సూచించింది. వారికోసం 211 పాఠశాలలు, 25 కమ్యూనిటీ కాలేజీలు, 5 జాతీయ స్థాయి విద్యా సంస్థలను నెలకొల్పాలని పేర్కొంది. పాఠశాలలను కేంద్రీయ విద్యాలయాలు లేదా నవోదయ విద్యాలయాల మాదిరిగా నడపాలని సూచించింది.
మైనార్టీల స్థితిగతులపై అధ్యయనం చేసేందుకు కేంద్ర నిధుల ద్వారా నడిచే మౌలానా ఆజాద్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ గతేడాది డిసెంబర్ 29న 11 మంది సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి కేంద్ర మాజీ కార్యదర్శి అఫ్జల్ అమానుల్లా కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ కమిటీ ఇటీవల తన నివేదికను విడుదల చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : విద్యలో ముస్లింల వెనుకబాటు
ఎప్పుడు : జూలై 9
ఎవరు : కేంద్ర నిధులతో నడిచే సంస్థ
ఎక్కడ : దేశవ్యాప్తంగా
సింథటిక్, నైలాన్ మాంజాలపై నిషేధంగాలిపటాలకు ఉపయోగించే నైలాన్, సింథటిక్ మాంజాల వినియోగంపై దేశవ్యాప్తంగా జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) నిషేధం విధించింది. ఇది తక్షణం అమల్లోకి వస్తుందని అన్ని రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాలకు జూలై 11న ఉత్తర్వులు జారీ చేసింది. పర్యావరణానికి హాని కలిగించే నైలాన్, సింథటిక్ మాంజాల తయారీ, క్రయ విక్రయాలపై కూడా ఎన్జీటీ నిషేధం విధించింది.
దేశంలో అనేక పండుగలకు గాలిపటాలను ఎగర వేయడం మన సంస్కృతిలో భాగమైపోయింది. అయితే, వీటికి నైలాన్, సింథటిక్, చైనా మాంజాలను ఉపయోగిస్తున్నారు. అవి మనతో పాటు, పక్షులకు, జంతువులకు పర్యావరణానికి హాని కలిగించడమే కాకుండా కొన్ని ప్రాణాంతక ప్రమాదాలకూ కారణమవుతున్నాయని ఎన్జీటీ చైర్‌పర్సన్ జస్టిస్ స్వతంతర్ కుమార్ నేతృత్వం లోని బెంచ్ వ్యాఖ్యానించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సింథటిక్, నైలాన్ మాంజాలపై నిషేధం
ఎప్పుడు : జూలై 11
ఎవరు : జాతీయ హరిత ట్రిబ్యునల్
ఎక్కడ : దేశవ్యాప్తంగా
ఎందుకు : పర్యావరణ, జంతు రక్షణలో భాగంగా
పశువుల విక్రయంపై ‘స్టే’ ఇక దేశవ్యాప్తంకబేళాల కోసం పశువుల క్రయవిక్రయాలను నిషేధిస్తూ కేంద్రం తెచ్చిన నోటిఫికేషన్‌పై మద్రాసు హైకోర్టు విధించిన స్టేను సుప్రీంకోర్టు జూలై 11న దేశానికంతటికీ వర్తింపజేసింది. స్టేను ఎత్తివేయాలని తాము కోరడం లేదనీ, సలహాలు, ఫిర్యాదులను స్వీకరించి సవరించిన నోటిఫి కేషన్‌ను త్వరలోనే తెస్తామని కేంద్రం తరఫున్యాయవాది కోర్టుకు చెప్పారు. కేంద్రం నుంచి ఏ అభ్యంతరం లేకపోవడంతో ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్, మరో న్యాయ మూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌ల ధర్మాసనం స్టేను దేశవ్యాప్తంగా అమలు చేసింది. అలాగే కొత్త నోటిఫికేషన్ వచ్చినప్పుడు కూడా దానిపై ఏమైనా అభ్యంతరాలుంటే.. అది అమల్లోకి రాకముందైనా సరే ఎవరైనా సుప్రీం తలుపు తట్టవచ్చని ధర్మాసనం పేర్కొంది. జంతు వధశాలల కోసం పశువులను రైతులు అమ్మకుండా, వ్యాపారులు కొనకుండా నిషేధం విధిస్తూ కేంద్రం మే 23న నోటిఫికేషన్ జారీ చేయడం తెలిసిందే. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పశువుల విక్రయంపై దేశవ్యాప్తంగా స్టే
ఎప్పుడు : జూలై 11
ఎవరు : సుప్రీం కోర్టు
వివాహాల తప్పనిసరి నమోదుకు లా కమిషన్ సిఫారసువివాహాలను తప్పనిసరిగా నమోదు చేయాలని సూచిస్తూ జస్టిస్ బీఎస్ చౌహాన్ నేతృత్వంలోని భారత లా కమిషన్ కేంద్రానికి సిఫారసు చేసింది. ఈ మేరకు తన నివేదికను జూలై 4న సమర్పించింది. ఈ నివేదికలో పలు సూచనలు చేసింది. వివాహాల నమోదుకు అందరికీ వర్తించేలా ఒక సంస్థ ఏర్పాటుచేయాలని పేర్కొంది. దీంతో ప్రజల హక్కులకు మరింత రక్షణ కల్పిచడంతోపాటు మరిన్ని కొత్త హక్కులు లభిస్తాయని పేర్కొంది. ఏ సంప్రదాయం, వ్యక్తిగత చట్టాల(పర్సనల్ లా) ప్రకారం వివాహాలు జరిగినా నమోదు తప్పనిసరి చేయాలని, ప్రస్తుతం అమల్లో ఉన్న జనన, మరణ నమోదు చట్టం-1969 కింద ఈ అవకాశం కల్పిస్తూ చట్ట సవరణ చేయాలని సూచించింది. జనన, మరణాల నమోదుకు బాధ్యులుగా ఉన్నవారికే ఈ బాధ్యతాఅప్పగించాలని పేర్కొంది. సరైన కారణం లేకుండా వివాహ నమోదులో జాప్యం చేస్తే రోజుకు రూ.5 చొప్పున జరిమానా వసూలు చేయాలని, నమోదును ఆధార్‌తో అనుసంధానం చేయాలని సూచించింది.
వివాహాల నమోదుపై ప్రజల్లో అవగాహన కల్పించాలని, సంక్షేమ పథకాలు, ఇతరత్ర ప్రయోజనాలకు దరఖాస్తు చేసుకున్నప్పుడు అందులో భార్య పేరు రాయడంతోపాటు వివాహ ధ్రువీకరణ పత్రం జతచేయడాన్ని తప్పనిసరి చేయాలని సూచించింది. వివాహం ఏ దేశ చట్ట ప్రకారం జరిగినా భార్యాభర్తల్లో కనీసం ఒకరు భారతీయులైతే వారి వివాహాన్ని నమోదు చేసుకునే అవకాశం కల్పించాలని నివేదించింది.
అమర్‌నాథ్ యాత్రపై ఉగ్రదాడిజమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో అమర్‌నాథ్ యాత్రపై జూలై 10న జరిగిన ఉగ్రదాడిలో ఏడుగురు యాత్రికులు మృతి చెందగా, 32 మంది గాయపడ్డారు. గుజరాత్‌కు చెందిన యాత్రికుల బృందం అమర్‌నాథ్ యాత్ర ముగించుకొని బస్సులో తిరిగి వస్తుండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.
రాష్ట్రీయంహైదరాబాద్‌లో దేశంలో తొలి రోబో పోలీస్ ప్రపంచంలోనే అరుదైన పోలీస్ రోబో డిజైన్‌ను జూలై 6న తెలంగాణ ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేశ్ రంజన్ ఆవిష్కరించారు. రోబోల తయారీలో నూతన ఒరవడి సృష్టిస్తున్న ‘హెచ్‌బోట్స్ రోబోటిక్స్’ వ్యవస్థాపకులు 2 నెలలు శ్రమించి పోలీస్ రోబో డిజైన్‌కు తుది రూపమిచ్చారు. 2017 డిసెంబర్ 31న జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ జంక్షన్‌లో పోలీస్ రోబోను ఏర్పాటు చేస్తామని హెచ్‌బోట్స్ రోబోటిక్స్ సీఈవో కిషన్ వెల్లడించారు. ప్రస్తుతం దుబాయ్‌లో మాత్రమే పోలీస్ రోబో ఉందని, ప్రపంచంలోనే రెండో పోలీస్ రోబోను హైదరాబాద్‌లో తామే అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం, పోలీసుల అనుమతితో పోలీస్ రోబోకు యూనిఫాం వేస్తారు. ఒకే చోట ఉంచేందుకు, అటు ఇటు కదిలేందుకు ఈ రోబోకు అవకాశం ఉంటుంది.
‘పోలీస్ రోబో’ ఏం చేస్తుందంటే..
జూబ్లీ చెక్‌పోస్ట్ పరిసరాల ఫొటోలు, వీడియోలు, మెస్సేజ్‌లను మెయిన్ సర్వర్‌కు పంపిస్తుంది. ఎవరైనా ఫిర్యాదులిస్తే స్వీకరించడంతో పాటు పరిసరాల్లో బాంబులు, అనుమానాస్పద వస్తువులు ఉంటే గుర్తిస్తుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : దేశంలో తొలి రోబో పోలీస్
ఎప్పుడు : 2017 డిసెంబర్
ఎవరు : హెచ్‌బోట్స్ రోబోటిక్స్
ఎక్కడ : హైదరాబాద్‌లో
పెనుగొండలో ఆర్‌పీఎఫ్ శిక్షణ కేంద్రం ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా పెనుగొండలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్) కమాండో శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. పెనుగొండలోని 244 ఎకరాల ప్రభుత్వ భూమిలో దీనిని స్థాపించనున్నట్టు రైల్వే శాఖ వర్గాలు తెలిపాయి. అలాగే విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లిలో ఉన్న 33 ఎకరాల వక్ఫ్ భూమిలో జాతీయ రైల్వే సెక్యూరిటీ అకాడమీతో పాటు ఆర్‌పీఎఫ్ బెటాలియన్ ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేయనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆర్‌పీఎఫ్ శిక్షణ కేంద్రం
ఎప్పుడు : జూలై 5
ఎవరు : రైల్వే శాఖ
ఎక్కడ : పెనుగొండ, అనంతపురం, ఆంధ్రప్రదేశ్
కృష్ణా జిల్లాలో ఎన్‌ఐడీఎం ‘దక్షిణ’ క్యాంపస్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ (ఎన్‌ఐడీఎం) దక్షిణ భారత క్యాంపస్ ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు కానుంది. కృష్ణా జిల్లా కొండపావులూరులో దీనిని నిర్మించనున్నారు. ప్రస్తుతం దేశం మొత్తానికి ఢిల్లీలో ఒక్కచోటే ఎన్‌ఐడీఎం ప్రధాన కార్యాలయం ఉంది. రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టం-2014 ప్రకారం ఎన్‌ఐడీఎం దక్షిణ భారత క్యాంపస్‌ను ఏపీలో ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 12 రాష్ట్రాల విపత్తు నిర్వహణ సంస్థలకు ఇది సేవలందించనుంది.
విపత్తులను ఎదుర్కోవడంపై శిక్షణ ఇవ్వడం, విపత్తులను ఎదుర్కొనే సామర్థ్యం పెంచడం ఈ సంస్థ ప్రధాన లక్ష్యాలు. మొదట దీనిని గుంటూరు జిల్లాలో ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. అయితే దీనికి కేటాయించిన భూమిని ప్రభుత్వం వెనక్కు తీసుకోవడంతో ఎన్‌ఐడీఎం ఏర్పాటులో జాప్యం అనివార్యమైంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా జిల్లా కొండపావులూరులో ఎన్‌ఐడీఎంకు స్థలం కేటాయించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎన్‌ఐడీఎం దక్షిణ క్యాంపస్
ఎప్పుడు : జూలై 5
ఎవరు : కేంద్ర విప్తత్తు నిర్వహణ శాఖ
ఎక్కడ : కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్
తెలంగాణలో హరిత సైన్యంమొక్కలను నాటడంతో పాటు వాటిని రక్షించేందుకు రాష్ట్రంలో ఎక్కడికక్కడ గ్రీన్ బ్రిగేడ్ (హరిత సైన్యం) ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు జూలై 5న ఆదేశించారు. మొక్కలు నాటడంతో వదిలేయకుండా వాటిని రక్షించడానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. హరితహారంపై జూలై 5న ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించిన ఆయన.. జూలై 12న ప్రారంభం కానున్న మూడో విడత హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మొక్కల రక్షణకు గ్రీన్ బ్రిగేడ్‌ల ఏర్పాటు
ఎప్పుడు : జూలై 5
ఎవరు : తెలంగాణ ప్రభుత్వం
ఎక్కడ : రాష్ట్రవ్యాప్తంగా
ఎందుకు : హరితహారంలో భాగంగా నాటిన మొక్కల రక్షణకు
దీన్‌దయాళ్ యోజన కింద విద్యుత్ కనెక్షన్లు తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సదుపాయానికి నోచుకోని పేదలకు రూ.125 కే కొత్త విద్యుత్ కనెక్షన్ ఇవ్వడంతోపాటు.. మీటరు, హౌజ్ వైరింగ్, రెండు ఎల్‌ఈడీ బల్బులు, సర్వీసు వైరును ఉచితంగా అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యుత్ సదుపాయం లేని ప్రాంతాలకు కొత్త విద్యుత్ స్తంభాలు, ట్రాన్‌సమిషన్ లైన్లు, సబ్‌స్టేషన్లను ఏర్పాటు చేయనుంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజన (డీడీయూజేవై)’ పథకం కింద డిస్కంలు ఈ కార్యక్రమాన్ని త్వరలో అమల్లోకి తీసుకురానున్నాయి.
పూర్తిస్థాయి విద్యుదీకరణలో భాగంగా..
ప్రస్తుతం కొత్త విద్యుత్ కనెక్షన్ కోసం రూ.1,200 చెల్లించాలి. దీంతోపాటు మీటరు, సర్వీసు వైరు, ఇంట్లో అవసరమైన వైర్లు, విద్యుత్ పరికరాలు వంటి వాటిని స్వయంగా కొనుక్కోవాలి. ఇది పేదలకు భారంగా ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ‘అందరికీ విద్యుత్ (పవర్ ఫర్ ఆల్)’ కార్యక్రమంలో భాగంగా ‘డీడీయూజేవై’ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా లబ్ధిదారులు కేవలం రూ.100 సెక్యూరిటీ డిపాజిట్, రూ.25 దరఖాస్తు రుసుము కలిపి మొత్తం రూ.125 చెల్లిస్తే కొత్త విద్యుత్ కనెక్షన్ జారీ చేస్తారు. రూ.3 వేలు విలువైన విద్యుత్ సామగ్రిని ఉచితంగా అందజేస్తారు. ఇందులో విద్యుత్ మీటర్, సర్వీస్ వైరుతో పాటు ఇంట్లో ఒక బల్బు, ఫ్యాన్, సాకెట్‌ను ఉపయోగించుకునేందుకు వీలుగా బోర్డుతో సహా హౌస్ వైరింగ్, రెండు ఎల్‌ఈడీ బల్బులు ఉంటాయి. మొత్తంగా ఏడాదిలోగా రాష్ట్రంలో విద్యుత్ సదుపాయం లేని పేదల ఇళ్లన్నింటికీ విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : డీడీయూజేవై కింద రూ.125కే విద్యుత్ కనెక్షన్లు
ఎప్పుడు : జూలై 5
ఎవరు : తెలంగాణ ప్రభుత్వం
ఎక్కడ : రాష్ట్రవ్యాప్తంగా
ఎందుకు : అందరికీ విద్యుత్ పథకంలో భాగంగా
ఆంధ్రప్రదేశ్‌కు ఇస్రో సేవలుభారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సం బంధించిన పలు రంగాల్లో సేవలందించనుంది. ఈ మేరకు విద్య, వ్యవసాయం వంటి పలు రంగాల్లో సేవలు పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం జూలై 5న ఇస్రోతో ఒప్పందం కుదుర్చుకుంది. సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పంద పత్రాలపై ఇస్రో సైంటిఫిక్ కార్యదర్శి డాక్టర్ దివాకర్, ఉన్నత విద్యా మండలి కార్యదర్శి వరదరా జన్ సంతకం చేశారు. ఈ ఒప్పందం ద్వారా ‘ఏపీ స్పేస్ ఇన్నోవేషన్‌స అండ్ ఇన్ఫర్మేషన్ సెంటర్’ను నెలకొల్పనున్నా రు. ఇస్రో, ఏపీ ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో దీని కార్యకలాపాలు కొనసాగుతాయి. వ్యవసాయ సలహాలు, వాతావరణ పరిస్థితులు, జలవనరులు, విపత్తుల నిర్వహణ, ఆయా ప్రాంతాల్లోని పరిస్థితులకు అనుగుణంగా సత్వర సేవలను ఇస్రో అందిస్తుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : విద్య, వ్యవసాయ రంగాల్లో ఇస్రో సేవలకు ఒప్పందం
ఎప్పుడు : జూలై 5
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్‌లో
మూడో విడత హరితహారం కార్యక్రమంతెలంగాణలో మూడో విడత హరితహారం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు జూలై 12న ప్రారంభించారు. ఈ మేరకు కరీంనగర్‌లోని లోయర్ మానేరు డ్యామ్ వద్ద మొక్క నాటిన కేసీఆర్.. కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సారి రాష్ట్రవ్యాప్తంగా 40 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యం నిర్దేశించుకున్నారు. ఇందుకోసం గ్రామ, మండల, జిల్లా స్థాయిలో గ్రీన్ బ్రిగేడ్‌లు ఏర్పాటు చేస్తారు. పర్యావరణ హితం కోసం ’ఫ్రెండ్‌స ఆఫ్ హరితహారం’పేరిట గ్రూపులను తయారు చేస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 3వ విడత హరితహారం ప్రారంభం
ఎప్పుడు : జూలై 12
ఎవరు : ముఖ్యమంత్రి కేసీఆర్
ఎక్కడ : లోయర్ మానేరు డ్యామ్, కరీంనగర్
ఆర్థికంరూ.2కే స్పైస్ జెట్‌ను దక్కించుకున్న అజయ్ సింగ్ రెండున్నరేళ్ల క్రితం మూసివేతకు సిద్ధంగా ఉన్న చౌక టికెట్ల విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌ను కంపెనీ వ్యవస్థాపకుడు అజయ్ సింగ్ మళ్లీ తన చేతుల్లోకి తీసుకొని అభివృద్ధి చేశాడు. అయితే... మారన్‌ల నుంచి కొనుగోలు చేసేందుకు అజయ్ సింగ్ చెల్లించింది కేవలం రెండు రూపాయలే. స్పైస్‌జెట్‌లో 58.46% వాటాలను ఆయన కేవలం రూ.2కే దక్కించుకున్నారు. దేశీ కార్పొరేట్ చరిత్రలో ఏ లిస్టెడ్ కంపెనీ కూడా ఇలాంటి ధరకు అమ్ముడవలేదు.
2015 జనవరిలో కేవలం 15 రోజుల్లోనే పూర్తయిపోయిన ఈ డీల్‌కు.. ఓపెన్ ఆఫర్ కూడా ప్రకటించాల్సిన అవసరం లేకుండా సింగ్‌కు వెసులుబాటు లభించింది. అప్పట్లో ఇది బయటకు కూడా రాలేదు. అప్పట్లో స్పైస్‌జెట్ షేరు ధర రూ. 21.8గా ఉండేది. దాని ప్రకారం చూస్తే ప్రమోటర్ మారన్ వాటా విలువ రూ.765 కోట్లు. కానీ దీన్ని సింగ్ అత్యంత చౌకగా రెండే రూపాయలకు దక్కించుకున్నారు. ప్రస్తుతం షేరు ధర రూ. 125కి చేరింది. అంటే స్పైస్‌జెట్‌లో సింగ్ వాటాల విలువ ప్రస్తుతం సుమారు రూ.4,400 కోట్ల మేర ఉంటుంది.
బయట పడిందిలా..
అప్పట్లో డీల్ విలువ గురించి ఇటు సింగ్, స్పైస్‌జెట్, అటు మారన్ ఎవరూ కూడా బైటపెట్టలేదు. లిస్టెడ్ కంపెనీలకు సంబంధించిన ప్రతి విషయమూ ఇన్వెస్టర్లకు తెలిసి తీరాల్సిందే అనే మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ సైతం ఈ వివరాలు వెల్లడించాలని ఆదేశించలేదు. ఆ విధంగా అసలు డీల్ విలువ ఎంతనేది ఎవ్వరికీ తెలియకుండా ఒక లిస్టెడ్ కంపెనీ చేతులు మారిపోయింది. ప్రస్తుతం డీల్ నిబంధనలను సింగ్ గౌరవించడం లేదంటూ మారన్ న్యాయపోరాటం సాగిస్తున్న నేపథ్యంలో ఈ సమాచారం బయటికొచ్చింది. ఈ వివరాల ప్రకారం స్పైస్‌జెట్ యాజమాన్య హక్కులు కేవలం 14 రోజుల్లో మారన్, కాల్ ఎయిర్‌వేస్ నుంచి సింగ్ చేతికి వచ్చాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రూ. 2కే స్పైస్ జెట్ కొనుగోలు
ఎప్పుడు : 2015లో
ఎవరు : అజయ్ సింగ్
జీఎస్‌టీ సందేహాల నివృత్తికి యాప్వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ) రేట్లపై వినియోగదారుల సందేహాల్ని నివృత్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ‘జీఎస్‌టీ రేట్స్ ఫైండర్’ (GST Rates Finder) పేరుతో సెంట్రల్ బోర్డు ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్(సీబీఈసీ) రూపొందించిన ఈ యాప్‌ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ జూలై 9న ప్రారంభించారు. దీని ద్వారా ఏయే వస్తువులపై ఎంత పన్ను విధిస్తున్నారన్న పూర్తి సమాచారాన్ని వినియోగదారులు తెలుసుకోవచ్చు. అలాగే సేవలపై పన్ను రేట్లు కూడా లభ్యమవుతాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : GST Rates Finder
ఎప్పుడు : జూలై 8
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎందుకు : జీఎస్‌టీపై సందేహాల నివృత్తికి
చేనేత కార్మికుల జనాభా సేకరణ ప్రారంభంచేనేత కార్మికుల వాస్తవ పరిస్థితిని తెలుసుకుని, వారి సంక్షేమం కోసం విధానాలు రూపొందించేందుకు ప్రభుత్వం నాలుగో జాతీయ చేనేత జనాభా లెక్కల సేకరణను జూలై 8న ప్రారంభించింది. చేనేత అనుబంధ కార్మికుల వివరాలను కూడా సేకరించనున్న ఈ ప్రక్రియలో కార్మికులకు ఫొటో గుర్తింపు కార్డులు అందజేస్తారు. సంక్షేమ పథకాల ప్రయోజనాలను పొందడానికి ఈ కార్డులు అర్హత కల్పిస్తాయి. ఈ ప్రక్రియ డిసెంబర్ నాటికి పూర్తికానుంది.
2009-10 జనాభా లెక్కల ప్రకారం దేశంలో 43.31 లక్షల మంది నేత కార్మికులు ఉన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : చేనేత కార్మికుల జనాభా సేకరణ ప్రారంభం
ఎప్పుడు : జూలై 8
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎక్కడ : దేశవ్యాప్తంగా
ఎందుకు : వాస్తవ పరిస్థితిని తెలుసుకుని, వారి సంక్షేమం కోసం విధానాలు రూపొందించేందుకు
2026 నాటికి పాల ఉత్పత్తిలో తొలి స్థానానికి భారత్ మరో దశాబ్ద కాలానికి భారత్ పాల ఉత్పత్తిలో తొలి స్థానానికి చేరుకుంటుందని అమెరికాకు చెందిన ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కోపరేషన్ అండ్ డెవలప్‌మెంట్(ఓఈసీడీ) నివేదిక వెల్లడించింది. 2026 నాటికి భారత్ పాల ఉత్పత్తిలో మిగతా దేశాలకంటే ముందు వరుసలో నిలుస్తుందని నివేదికలో పేర్కొంది. పదేళ్లలో ప్రపంచ జనాభా 730 నుంచి 820 కోట్లకు పెరుగుతుందని, భారత్, ఆఫ్రికా దేశాల్లో 56 శాతం జనాభావృద్ధి నమోదవుతుందని నివేదిక వెల్లడించింది. అంటే.. భారతదేశ జనాభా 130 కోట్ల నుంచి దాదాపు 150 కోట్లకు పెరగవచ్చని అంచనా వేసింది. చైనా జనాభాను మించి, ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరిస్తుందని పేర్కొంది. మానవ వనరులే పెట్టుబడిగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించే స్థాయిలో భారత్, మరికొన్ని ఆఫ్రికా దేశాలు ఆధిపత్యాన్ని చెలాయిస్తాని నివేదికలో అభిప్రాయపడింది. అంతేకాక ఆహార ఉత్పత్తులతోపాటు ఇతర అవసరాల కోసం ఈ దేశాల్లో డిమాండ్ బాగా పెరుగుతుందని, వీటిని నెరవేర్చేందుకు తీసుకునే చర్యల ఫలితంగా ఎన్నో రంగాల్లో ఈ దేశాలు ముందంజలో నిలుస్తాయని నివేదిక ద్వారా తెలిపింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 2026 నాటికి పాల ఉత్పత్తిలో తొలి స్థానానికి భారత్
ఎప్పుడు : జూలై 11
ఎవరు : ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కోపరేషన్ అండ్ డెవలప్‌మెంట్
ఎక్కడ : ప్రపంచవ్యాప్తంగా
సైన్స్ అండ్ టెక్నాలజీఅమెరికా-దక్షిణ కొరియా క్షిపణి ప్రదర్శన ఉత్తర కొరియా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి (ఐసీబీఎం)ని ప్రయోగించడానికి ప్రతిగా దక్షిణ కొరియా, అమెరికా సంయుక్తంగా జూలై 4న క్షిపణి ప్రదర్శన నిర్వహించాయి. ధిక్కార ధోరణిని అవలంభిస్తున్న ఉత్తర కొరియాకు తమ బలమేంటో చూపడానికి దక్షిణ కొరియా ప్రాదేశిక జలాల్లోకి క్షిపణులను ప్రయోగించినట్లు అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్‌లో ముఖ్య అధికార ప్రతినిధి డానా వైట్ చెప్పారు. ఆర్మీ టాక్టికల్ మిసైల్ సిస్టం(ఏటీఏసీఎంఎస్), దక్షిణ కొరియాకు చెందిన హ్యున్మూ మిసైల్ 2ను ఈ కసరత్తులో వినియోగించినట్లు దక్షిణ కొరియాలోని అమెరికా రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఉత్తర కొరియా నుంచి ముప్పు నేపథ్యంలో తమ మిత్ర దేశాలైన దక్షిణ కొరియా, జపాన్‌ల రక్షణకు కట్టుబడి ఉన్నామని అమెరికా తెలిపింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అమెరికా - దక్షిణ కొరియా క్షిపణుల ప్రదర్శన
ఎప్పుడు : జూలై 5
ఎక్కడ : దక్షిణ కొరియా ప్రాదేశిక జలాల్లో
ఎందుకు : ఉత్తర కొరియాకు దీటుగా సమాధానం ఇచ్చేందుకు
పీఏ సంస్థలో త్వరలో రోబో రిపోర్టర్లు యునెటైడ్ కింగ్‌డమ్, ఐర్లాండ్‌లలో ప్రఖ్యాతిగాంచిన ‘ప్రెస్ అసోసియేషన్ (పీఏ)’ వార్తాసంస్థ త్వరలో రోబో రిపోర్టర్లని ప్రవేశపెట్టనుంది. ఈ రోబో పాత్రికేయులు స్థానిక ప్రభుత్వ సంస్థల వద్ద ఉండే సమాచారాన్ని క్రోడీకరించి ఆ సమాచారాన్ని ప్రచురణకు అనుగుణంగా వార్తలుగా, గ్రాఫ్స్‌గా మారుస్తాయి. ‘రిపోర్టర్స్ అండ్ డాటా అండ్ రోబోట్స్(రాడార్)’గా పిలిచే ఈ ప్రాజెక్టు కోసం పీఏ సంస్థ ‘ఉర్బ్స్ మీడియా’తో చేతులు కలిపింది. డిజిటల్ పాత్రికేయరంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ అందిస్తున్న రూ.5.17కోట్ల గ్రాంటును సైతం ఈ ప్రాజెక్టు గెలుచుకుంది. 2018లో ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రోబో రిపోర్టర్లు
ఎప్పుడు : 2018
ఎవరు : ప్రెస్ అసోసియేషన్ సంస్థ
ఎక్కడ : యూకే, ఐర్లాండ్‌లో
ఫీచర్ ఫోన్లలోనూ జీపీఎస్ తప్పనిసరి: డాట్ఫీచర్ ఫోన్లలో ఖరీదైన జీపీఎస్ టెక్నాలజీకి బదులుగా ప్రత్యామ్నాయ టెక్నాలజీ ఉపయోగిస్తామన్న మొబైల్స్ తయారీ సంస్థల ప్రతిపాదనను టెలికం విభాగం (డాట్) తోసిపుచ్చింది. వినియోగదారులు.. ముఖ్యంగా మహిళల భద్రత దృష్ట్యా జీపీఎస్ తప్పనిసరని స్పష్టం చేసింది.
అత్యవసర పరిస్థితుల్లో మొబైల్ యూజర్లున్న ప్రాంతాన్ని సత్వరం కనిపెట్టగలిగేలా.. 2018 జనవరి 1 నుంచి దేశీయంగా విక్రయించే ఫీచర్ ఫోన్లు సహా అన్ని మొబైల్స్‌లోను జీపీఎస్ ఫీచర్‌ను పొందుపర్చాలని కేంద్రం గతంలోనే ఆదేశించింది. అయితే ఈ ఖరీదైన టెక్నాలజీ వల్ల ఫీచర్ ఫోన్‌స ధర 50 శాతం పైగా పెరుగుతుందని, కాబట్టి ప్రత్యామ్నాయ టెక్నాలజీని వాడేందుకు అనుమతించాలంటూ ఇండియన్ సెల్యులార్ అసోసియేషన్ (ఐసీఏ) చేసిన ప్రతిపాదనని డాట్ అనుమతించలేదు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఫీచర్ ఫోన్లలో జీపీఎస్ తప్పనిసరి
ఎప్పుడు : 2018 జనవరి 1 నుంచి
ఎవరు : డాట్
ఎక్కడ : భారత్‌లో
ఎందుకు : భద్రతా ప్రమాణాల కోసం
క్రీడలుఆసియా స్నూకర్ చాంపియన్ భారత్ ఆసియా స్నూకర్ టీమ్ చాంపియన్‌షిప్‌లో భారత్ ‘ఎ’ జట్టు విజేతగా నిలిచింది. పాకిస్తాన్ ‘బి’తో జూలై 5న జరిగిన ఫైనల్లో భారత్ ‘ఎ’ జట్టు 3-0తో విజయం సాధించింది. ఈ టోర్నీలో పంకజ్ అద్వానీ అజేయంగా నిలిచి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. పంకజ్ అద్వానీ, లక్ష్మణ్ రావత్, మల్కీత్ సింగ్‌లతో కూడిన భారత బృందానికి అశోక్ శాండిల్య కోచ్‌గా వ్యవహరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆసియా స్నూకర్ టీమ్ చాంపియన్‌షిప్
ఎప్పుడు : జూలై 5
ఎవరు : విజేత భారత్ ఏ జట్టు
ఎక్కడ : కి ర్గిస్తాన్
ఆసియా అథ్లెటిక్స్‌లో మన్‌ప్రీత్, లక్ష్మణన్‌కు స్వర్ణాలుఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో తొలి రోజు భారత అథ్లెట్లు 2 స్వర్ణాలు, ఒక రజతం, 4 కాంస్య (మొత్తం 7) పతకాలు సాధించారు. మన్‌ప్రీత్‌తో పాటు జి. లక్ష్మణన్ స్వర్ణాన్ని గెలుచుకున్నాడు. మహిళల షాట్‌పుట్ విభాగంలో మన్‌ప్రీత్ గుండును 18.28మీ. దూరం విసిరి విజేతగా నిలిచి పసిడి పతకం గెలుచుకుంది. పురుషుల 5000మీ. పరుగు ఈవెంట్‌ను గోవిందన్ లక్ష్మణన్ 14ని.54.48 సెకన్లలో పూర్తిచేసి స్వర్ణాన్ని దక్కించుకున్నాడు. దీంతో లండన్ వేదికగా ఆగస్టులో జరుగనున్న వరల్డ్ చాంపియన్‌షిప్‌కు అర్హత సాధించాడు. మన్‌ప్రీత్ ఇప్పటికే ప్రపంచ చాంపియన్‌షిప్‌కు అర్హత సాధించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్
ఎప్పుడు : జూలై 6
ఎవరు : మన్‌ప్రీత్, జి. లక్ష్మణన్‌కు స్వర్ణాలు
ఎక్కడ : భువనేశ్వర్, ఒడిశా
ఆసియా అథ్లెటిక్స్‌లో భారత్‌కు 4 స్వర్ణాలు ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో జరుగుతున్న ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ రెండో రోజు పోటీల్లో భారత అథ్లెట్లు 4 స్వర్ణాలు గెలుచుకున్నారు. పురుషుల, మహిళల 400 మీటర్ల విభాగాల్లో వరుసగా మొహమ్మద్ అనస్ (45.77 సెకన్లు), నిర్మలా షెరోన్ (52.01 సెకన్లు) స్వర్ణం గెలుచుకోగా.. 1500 (పురుషులు, మహిళలు) మీటర్ల విభాగాల్లో వరుసగా అజయ్ కుమార్ సరోజ్ (3ని:45.85 సెకన్లు), పీయూ చిత్రా (4ని:17.92 సెకన్లు) విజేతలుగా నిలిచి పసిడి పతకాలను గెల్చుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ - 2017
ఎప్పుడు : జూలై 7
ఎవరు : మొహమ్మద్ అనస్, నిర్మలా షెరోన్, అజయ్ కుమార్ సరోజ్, పియూ చిత్రాలకు స్వర్ణ్ణాలు
ఎక్కడ : భువనేశ్వర్, ఒడిశా
ఫెడరర్ అత్యధిక గ్రాండ్‌స్లామ్ మ్యాచ్‌ల రికార్డుగ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లలో అత్యధిక మ్యాచ్‌లు (317) గెలిచిన ఆటగాడిగా స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్ రికార్డును సృష్టించాడు. వింబుల్డన్‌లో భాగంగా జూలై 8న జరిగిన పురుషుల సింగిల్స్ మూడో రౌండ్ మ్యాచ్‌లో ఫెడరర్ 7-6 (7/3), 6-4, 6-4తో 27వ సీడ్ మిషా జ్వెరెవ్ (జర్మనీ)పై గెలిచాడు. తద్వారా అత్యధికంగా 317 గ్రాండ్‌స్లామ్ మ్యాచ్‌ల్లో విజయం సాధించిన ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. సెరెనా విలియమ్స్ (అమెరికా-316 విజయాలు) పేరిట ఉన్న రికార్డును ఫెడరర్ అధిగమించాడు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో అత్యధిక మ్యాచ్‌లు గెలిచిన ప్లేయర్
ఎప్పుడు : జూలై 8
ఎవరు : రోజర్ ఫెడరర్
ఎందుకు : సెరెనా విలియమ్స్ రికార్డుని అధిగమించిన ఫెడరర్
ఆసియా అథ్లెటిక్స్‌లో భారత్‌కు తొలిస్థానం ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత్ 12 స్వర్ణాలు, 5 రజతాలు, 12 కాంస్యాలలు కలిపి మొత్తం 29 పతకాలతో తొలిసారి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. 20 పతకాలతో చైనా (8 స్వర్ణాలు, 7 రజతాలు, 5 కాంస్యాలు) రెండో స్థానంలో నిలిచింది. 1985, 1989 ఆసియా చాంపియన్‌షిప్‌ల్లో భారత్ అత్యధికంగా 22 పతకాలు గెలిచింది.
చివరి రోజైన జులై 9న జరిగిన పోటీల్లో భారత్‌కు ఐదు స్వర్ణ పతకాలు లభించాయి. హెప్టాథ్లాన్‌లో స్వప్న బర్మన్ (5,942 పాయింట్లు)... 10 వేల మీటర్ల రేసులో లక్ష్మణన్ (29ని:55.87 సెకన్లు)... జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా (85.23 మీటర్లు) పసిడి పతకాలు గెలిచారు. పురుషుల, మహిళల 4×400 మీటర్లలో భారత రిలే జట్లు స్వర్ణాలు నెగ్గాయి. జూలై 8న జరిగిన పోటీల్లో మహిళల 3000 మీటర్ల రేసులో భారత అథ్లెట్ సుధా సింగ్ స్వర్ణం గెలుచుకుంది.

ఎవరు : 29 పతకాలతో తొలి స్థానంలో భారత్
ఎక్కడ : భువనేశ్వర్, ఒడిశా
కామన్వెల్త్ చెస్ చాంపియన్ అభిజిత్భారత్‌లో జరిగిన కామన్వెల్త్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ అభిజిత్ గుప్తా విజేతగా నిలిచాడు. నిర్ణీత తొమ్మిది రౌండ్‌లు ముగిశాక అభిజిత్ గుప్తా 7.5 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. వైభవ్ సూరి రెండో స్థానంలో, తేజస్ బాక్రే మూడో స్థానంలో నిలిచారు. తెలంగాణ ప్లేయర్ ఎరిగైసి అర్జున్ 6.5 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచాడు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కామన్వెల్త్ చెస్ చాంపియన్‌షిప్ - 2017
ఎప్పుడు : జూలై 10
ఎవరు : విజేత అభిజిత్ గుప్తా
ఎక్కడ : భారత్‌లో
శ్రీలంకపై తొలి వన్డే సిరీస్ గెలిచిన జింబాబ్వే శ్రీలంకతో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌ను జింబాబ్వే 3-2తో కైవసం చేసుకుంది. జూలై 10న జరిగిన ఐదో వన్డేలో జింబాబ్వే జట్టు 3 వికెట్ల తేడాతో లంకపై నెగ్గింది. తద్వారా 2009 తర్వాత విదేశాల్లో తొలి వన్డే సిరీస్ విజయాన్ని సొంతం చేసుకున్న ఆ జట్టు.. శ్రీలంకపై తొలి వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : శ్రీలంకపై తొలి వన్డే సిరీస్ కైవసం చేసుకున్న జింబాబ్వే
ఎప్పుడు : జూలై 10
ఎక్కడ : శ్రీలంకలో
ఎందుకు : ఐదు వన్డేల సీరీస్‌లో 3-2 తేడాతో జింబాబ్వే విజయం
భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా రవిశాస్త్రి భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా 55 ఏళ్ల రవిశంకర్ జయధ్రిత శాస్త్రిని నియమిస్తున్నట్లు బీసీసీఐ జూలై 11న ప్రకటించింది. అలాగే.. మాజీ పేసర్ జహీర్ ఖాన్ బౌలింగ్ కోచ్‌గా, విదేశీ పర్యటనల్లో బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా మాజీ కెప్టెన్, దిగ్గజ బ్యాట్స్‌మన్ రాహుల్ ద్రవిడ్‌ను నియమించింది. ఇప్పటికే భారత ‘ఎ’, అండర్-19 జట్లకు కోచ్‌గా ఉన్న ద్రవిడ్‌కు ఇది అదనపు బాధ్యత. జూలై 26 నుంచి శ్రీలంకతో జరిగే సిరీస్ నుంచి రవిశాస్త్రి పదవీకాలం ప్రారంభమవుతుంది. వచ్చే రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత క్రికెట్ హెడ్ కోచ్‌గా రవిశాస్త్రి
ఎప్పుడు : జూలై 11
ఎవరు : బీసీసీఐ
జోత్స్న చినప్పకు ప్రభుత్వ ఉద్యోగంప్రముఖ స్క్వాష్ క్రీడాకారిణి, జోత్స్న చినప్పకు తమిళనాడు ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాన్ని కల్పించింది. రాష్ట్ర విద్యుత్ శాఖకు చెందిన తమిళనాడు ఉత్పత్తి, పంపిణీ సంస్థ (టీఏఎన్‌జీఈడీసీఓ) సీనియర్ స్పోర్‌ట్స అధికారిణిగా నియమిస్తు జూలై 11న ఉత్తర్వులు జారీ చేసింది.
ఆసియా వ్యక్తిగత చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలవడంతోపాటు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో క్వార్టర్స్‌కు చేరిన చినప్ప మెరుగైన ప్రదర్శన కనబర్చింది. మరోవైపు కామన్వెల్త్ గేమ్స్ మహిళల డబుల్స్ విభాగంలో చినప్ప స్వర్ణపతకాన్ని సాధించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జోత్స్న చినప్పకు ప్రభుత్వ ఉద్యోగం
ఎప్పుడు : జూలై 11
ఎవరు : తమిళనాడు ప్రభుత్వం
ఎక్కడ : తమిళనాడు ఉత్పత్తి, పంపిణీ సంస్థలో
అవార్డులుమంగళంపల్లి పేరిట రూ. 10 లక్షల అవార్డు
ప్రముఖ సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ పేరుతో ఏటా ఆయన జయంతి రోజున ఒక ప్రముఖ సంగీత విద్వాంసుడికి రూ.10 లక్షల నగదు అవార్డును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున అందజేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్రప్రభుత్వ ఆధ్వర్యంలో విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బాలమురళీకృష్ణ 87వ జయంతి వేడుకలను జూలై 6న నిర్వహించారు. ఈ సందర్భంగా కళాక్షేత్రం ఆవరణలో ఏర్పాటు చేసిన బాలమురళీకృష్ణ కాంస్య విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ బాలమురళీకృష్ణ స్వస్థలమైన తూర్పుగోదావరి జిల్లా శంకరగుప్తంలో ఆయన పేరిట మ్యూజియం, సంగీత కళాశాల, మెమోరియల్ ట్రస్టులను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. బాలమురళీకృష్ణ జన్మించిన ప్రదేశాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు. గుంటూరు సంగీత కళాశాలకు ‘బాలమురళీకృష్ణ సంగీత కళాశాల’గా నామకరణం చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మంగళంపల్లి బాలమురళీకృష్ణ పేరిట అవార్డు
ఎప్పుడు : జూలై 6
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్‌లో
ఎందుకు : సంగీత విధ్వాంసులకి అందించేందుకు
మారుతి సుజుకీ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డులు స్పోర్‌ట్స ఇలస్ట్రేటెడ్ ఇండియా మేగజైన్ ఆధ్వర్యంలో మారుతి సుజుకీ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుల ప్రదానోత్సవం జూలై 7న ముంబైలో జరిగింది. ఒలింపిక్స్ రజత పతక విజేత, బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు ‘స్పోర్‌ట్స పర్సన్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు అందుకోగా భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ ‘కోచ్ ఆఫ్ ద ఇయర్’ అవార్డును అందుకున్నారు.
అవార్డు గ్రహీతలు
స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ : పీవీ సింధు
కోచ్ ఆఫ్ ది ఇయర్ : పుల్లెల గోపీచంద్
టీమ్ ఆఫ్ ది ఇయర్ : పురుషుల జూనియర్ హాకీ జట్టు
లివింగ్ లెజెండ్ : మిల్కా సింగ్
గేమ్ చేంజర్ ఆఫ్ ద ఇయర్ : లోకేశ్ రాహుల్
లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ : అభినవ్ బింద్రా
క్విక్ రివ్యూ:
ఏమిటి : మారుతీ సుజుకీ స్పోర్ట్స్ అవార్డ్స్ - 2017
ఎప్పుడు : జూలై 6
ఎవరు : స్పోర్ట్స్ ఇలస్ట్రేటెడ్ ఇండియా మేగజైన్
ఎక్కడ : ముంబైలో
టీఎస్‌ఆర్టీసీకి ‘ఇండియా బస్’ పురస్కారాలుఅశోక్ లేలాండ్, అభిబస్ సంస్థలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన ‘ఇండియా బస్’ అవార్డుల్లో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) మూడు పురస్కారాలను సొంతం చేసుకుంది. జూలై 9న హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ల చేతుల మీదుగా రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, ఆర్టీసీ ఈడీలు నాగరాజు, వేణులు ఈ పురస్కారాలను అందుకున్నారు. ఎక్సలెన్‌స ఇన్ బస్ ట్రాన్‌సపోర్టేషన్, ఎక్సలెన్‌స ఇన్ ఎంప్లాయీస్ వెల్ఫేర్, టాప్ బస్ డ్రైవర్ అనే అంశాల్లో ఆర్టీసీ ఈ పురస్కారాలను పొందింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇండియా బస్ పురస్కారాలు
ఎప్పుడు : జూలై 9
ఎవరు : టీఎస్‌ఆర్టీసీకి 3 పురస్కారాలు
ఎక్కడ : హైదరాబాద్‌లో
వార్తల్లో వ్యక్తులుఫ్యాప్సీ ప్రెసిడెంట్‌గా గౌర శ్రీనివాస్ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ (ఫ్యాప్సీ) నూతన ప్రెసిడెంట్‌గా 2017-18 సంవత్సరానికిగాను గౌర గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సీఎండీ గౌర శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రవీంద్ర మోదీ పదవీ కాలం ముగియడంతో ఆయన స్థానంలో ప్రెసిడెంట్‌గా గౌర శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు. ఆయన కెమికల్స్, పాలిమర్స్, మెటల్స్, కంప్యూటర్ సొల్యూషన్‌స, రియల్టీ, కన్‌స్ట్రక్షన్, ఫార్మా, ఎన్‌బీఎఫ్‌సీ, ఏరోస్పేస్ మాన్యుఫ్యాక్చరింగ్ తదితర రంగ సంస్థల్లో కీలక పదవులు చేపట్టారు. మార్కెటింగ్, ఫైనాన్స్ విభాగాల్లో 40 ఏళ్లకుపైగా అనుభవం ఆయన సొంతం. ఫ్యాప్సీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా చార్టర్డ్ అకౌంటెంట్ అరుణ్ లుహారుకా నియమితులయ్యారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఫ్యాప్సీ నూతన ప్రెసిడెంట్
ఎప్పుడు : జూలై 5
ఎవరు : గౌర శ్రీనివాస్
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్‌లో
మదర్ థెరిసా చీరకు మేధో హక్కుజీవితాంతం మదర్ థెరిసా ధరించిన నీలి అంచు తెల్ల చీరకు సంబంధించిన మేధో హక్కును మిషనరీస్ ఆఫ్ చారిటీస్ సొంతం చేసుకుంది. ఏడాది క్రితమే కేంద్ర ప్రభుత్వానికి చెందిన ‘ద ట్రేడ్ మార్క్స్ రిజిస్ట్రీ’ ఈ గుర్తింపును జారీ చేసిందని మేధో హక్కుల న్యాయవాది బిస్వజిత్ సర్కార్ జూలై 9న తెలిపారు. మదర్ థెరిసాను పునీతగా ప్రకటించిన 2016, సెప్టెంబర్ 4నే మిషనరీస్ ఆఫ్ చారిటీస్‌కు ఈ ఘనత దక్కిందని, ఆ సంస్థకు ప్రచారమంటే ఇష్టలేకపోవడంతో విషయం బయటకు రాలేదన్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఆ డిజైన్‌ను వ్యాపార ధోరణి కోసం వాడుతున్నారని, అలా చేయకుండా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ విషయం బయటపెడుతున్నామని సర్కార్ చెప్పారు. చీర ట్రేడ్‌మార్క్ ధ్రువీకరణ కోసం డిసెంబర్ 12, 2013న దరఖాస్తు చేసుకున్నారని, దాదాపు మూడేళ్ల పరిశీలన అనంతరం మేధో హక్కును కేటాయించారని తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మదర్ థెరిసా చీరకు మేధో హక్కు
ఎప్పుడు : 2016లో
ఎవరు : మిషనరీస్ ఆఫ్ చారిటీస్
ఎక్కడ : కోల్‌కత్తా
ఎందుకు : జీవితాంతం మదర్ థెరిసా ధరించిన నీలి అంచు తెల్ల చీరకు
జీఎస్టీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి కొత్త చీఫ్కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వస్తు, సేవా పన్ను(జీఎస్టీ) ఇంటెలిజెన్‌స ఏజెన్సీ కొత్త చీఫ్‌గా జాన్ జోసెఫ్ నియమితులయ్యారు. సీనియర్ అధికారి అయిన జోసెఫ్‌ను జీఎస్టీ ఇంటలిజెన్‌స డెరైక్టర్ జనరల్‌గా నియమిస్తూ ప్రభుత్వం జూలై 9న ఉత్తర్వులు జారీ చేసింది.
పన్ను ఎగవేత, పన్ను అమలు తదితర పర్యవేక్షణలను ఈ జీఎస్టీ ఇంటెలిజెన్‌స నిర్వహిస్తుంది. అలాగే.. 1985 బ్యాచ్‌కు చెందిన ఐఆర్‌ఎస్ అధికారి అయిన దాస్‌ను డెరైక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటి లిజెన్స్ (డీఆర్‌ఐ) డెరైక్టర్ జనరల్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జీఎస్టీ ఇంటెలిజెన్‌స ఏజెన్సీకి కొత్త అధిపతి
ఎప్పుడు : జూలై 9
ఎవరు : జాన్ జోసెఫ్
షరీఫ్‌పై అవినీతి కేసుల నమోదుకు జిట్ సిఫారసు పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్, ఆయన కుటుంబ సభ్యులపై అవినీతి కేసులు నమోదు చేయాలని సంయుక్త విచారణ బృందం (జిట్) సిఫారసు చేసింది. పనామాగేట్‌లో షరీఫ్ పేరు బయటకు రావడంతో 2016లో పాక్ సుప్రీంకోర్టు ఆరుగురు సభ్యులతో జిట్‌ను ఏర్పాటు చేసింది. షరీఫ్, కుటుంబ సభ్యుల పేర్లపై లెక్క చూపని విలువైన ఆస్తులు విదేశాల్లో ఉన్నాయని గుర్తించిన జిట్.. ఇందుకు సంబంధించిన నివేదికను జూలై 10న కోర్టుకు సమర్పించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నవాజ్ షరీఫ్‌పై అవినీతి కేసుల నమోదుకు సిఫారసు
ఎప్పుడు : జూలై 10
ఎవరు : సంయుక్త విచారణ బృందం
ఎక్కడ : పాకిస్తాన్‌లో
ఎందుకు : పనామాగేట్ వ్యవహారంలో
పాపకు జన్మనిచ్చిన బ్రిటన్ యువకుడుతాను గర్భం దాల్చానని 2017 జనవరిలో ప్రకటించిన బ్రిటన్‌కు చెందిన హెడన్ క్రాస్(21) జూన్ 16న గ్లోసెస్టర్ షైర్ రాయల్ ఆస్పత్రిలో ఆడబిడ్డకు జన్మనిచ్చాడు. తద్వారా లింగమార్పిడి చేయించుకొని ఓ పాపకు జన్మనిచ్చిన తొలి పురుషుడిగా హెడన్ రికార్డులకెక్కాడు. ఆ పాపకు పైగే అని పేరు పెట్టుకున్నాడు.
మహిళగా పుట్టిన హెడెన్ అనంతరం పురుషుడిలా మారాలన్న కోరికతో లింగమార్పిడి చికిత్స తీసుకున్నాడు. ప్రస్తుతం పూర్తి స్థాయిలో పురుషుడిగా మారేందుకు హార్మోన్ల మార్పిడి చికిత్స చేయించుకుంటున్నాడు. దీంతో భవిష్యత్తులో బిడ్డలను కనలేనని ముందుగానే బిడ్డను పొందాలని నిర్ణయించుని ఫేస్‌బుక్‌లో తనకు వీర్యం దానం చేయాల్సిందిగా పోస్ట్ చేశాడు. ఓ దాత ఇచ్చిన వీర్యంతో హెడెన్ గతేడాది గర్భం దాల్చాడు. అయితే 2008లోనే ప్రపంచంలోనే తొలిసారిగా గర్భం దాల్చిన వ్యక్తిగా అమెరికాకు చెందిన థామస్ బెయిటీ నిలిచాడు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పాపకు జన్మనిచ్చిన తొలి యువకుడు
ఎప్పుడు : జూన్ 16
ఎవరు : హెడన్ క్రాస్
ఎక్కడ : బ్రిటన్‌లో
విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి గోపాలకృష్ణ గాంధీ జాతిపిత మహాత్మాగాంధీ మనవడు, పశ్చిమబెంగాల్ మాజీ గవర్నర్ గోపాల కృష్ణ గాంధీని తమ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా 18 ప్రతిపక్ష పార్టీలు సంయుక్తంగా ప్రకటించాయి. సమావేశంలో ఒకేఒక్క పేరు చర్చకు వచ్చిందని, జేడీయూ సహా అన్ని ప్రతిపక్ష పార్టీల నాయకులు 71 ఏళ్ల గోపాల కృష్ణకు ఏకగ్రీవంగా మద్దతు తెలిపారని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ జూలై 11న చెప్పారు. సమావేశం అనంతరం గులాంనబీ ఆజాద్ (కాంగ్రెస్), సీతారాం ఏచూరి(సీపీఎం), డెరెక్ ఓబ్రెయిన్ (తృణమూల్) గోపాలకృష్ణకు ఫోన్ చేశారని, తమ అభ్యర్థిగా ఉండటానికి ఆయన అంగీకరించారని తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి
ఎప్పుడు : జూలై 11
ఎవరు : గోపాల కృష్ణ గాంధీ
మంగోలియా అధ్యక్షుడిగా ఖల్ట్‌మా బట్టుల్గా మంగోలియా 5వ అధ్యక్షుడిగా డెమోక్రాటిక్ పార్టీకి చెందిన ఖల్ట్‌మా బట్టుల్గా ఎన్నికయ్యారు. ఈ మేరకు జూలై 10న వెలువడిన ఎన్నికల ఫలితాల్లో 50.7 శాతం ఓట్లతో బట్టుల్గా విజయం సాధించారు. మంగోలియా 4వ అధ్యక్షుడిగా సఖియాజీన్ ఎల్బెగ్‌డార్జ్ వ్యవహరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మంగోలియా నూతన అధ్యక్షుడు
ఎప్పుడు : జూలై 10
ఎవరు : ఖల్ట్‌మా బట్టుల్గా
ఎక్కడ : మంగోలియా
వైవీ రెడ్డి పుస్తకం ‘అడ్వైజ్ అండ్ డిసెంట్’ ఆవిష్కరణరిజర్వు బ్యాంక్ మాజీ గవర్నర్ డాక్టర్ వైవీ రెడ్డి రాసిన ‘అడ్వైజ్ అండ్ డిసెంట్: మై లైఫ్ ఇన్ పబ్లిక్ సర్వీస్’ పుస్తకాన్ని జూలై 6న హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. అంతర్జాతీయ ఆర్థిక విధానాలను ఈ పుస్తకంలో ప్రముఖంగా ప్రస్తావించారు.

చరిత్రలో ఈ నెల జూలై (14 - 20) 2017
అంతర్జాతీయంచైనా ఆర్మీ పది లక్షలకు కుదింపుసైనిక బలగాలను భారీగా తగ్గించాలని చైనా వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా 23 లక్షలు ఉన్న సైన్యాన్ని విడతల వారీగా 10 లక్షల లోపునకు తగ్గించాలని భావిస్తోంది. ఈ మేరకు చైనా ఆర్మీ అధికార పత్రిక పీఎల్‌ఏ డైలీ కథనం ప్రచురించింది. ఇంతవరకూ చైనా సంప్రదాయ సైనిక వ్యూహాల ప్రకారం సైన్యాన్ని భూతల పోరాటాలకు ఎక్కువగా వినియోగించేది. సంస్కరణల నేప థ్యంలో మిలటరీ వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. తాజా ప్రణాళిక ప్రకారం నేవీ, స్ట్రాటజిక్ సపోర్ట్ ఫోర్స్, మిస్సైల్ ఫోర్స్‌ను పెంచనుంది. ఆధునిక పరిజ్ఞానం, యుద్ధ తంత్రాల అమలు, కీలక లక్ష్యాల దిశగా మార్పులు ఉండబోతున్నాయని ఆ కథనం పేర్కొంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పీఎల్‌ఏ సైన్యం పది లక్షలకు కుదింపు
ఎప్పుడు : జూలై 12
ఎవరు : చైనా
ఎందుకు : ప్రత్యామ్నాయ పరిజ్ఞానాన్ని పెంచుకోవడంలో భాగంగా
అమెరికా రక్షణ వ్యయాల బిల్లులో 3 సవరణలు పాకిస్తాన్‌కు సైనిక సాయం విషయంలో కఠినవైఖరి అవలంబించాలని అమెరికా చట్టసభ నిర్ణయించింది. ఆ మేరకు రక్షణ వ్యయాల బిల్లులో మూడు సవరణల్ని ప్రతినిధుల సభ ఆమోదించింది. ఉగ్రవాదంపై పాక్ పోరు సంతృప్తికరంగా ఉంటేనే నిధులు మంజూరు చేయాలని తాజా సవరణల్లో స్పష్టం చేశారు. 651 బిలియన్ డాలర్ల జాతీయ భద్రతా అధికార చట్టం (ఎన్‌డీఏఏ)- 2018 ఆమోదం సందర్భంగా ఈ సవరణల్ని ప్రతిపాదించారు. ఈ బిల్లును జూలై 15న ప్రతినిధుల సభ 344-81 ఓట్ల తేడాతో ఆమోదించింది. ఆ దేశ రక్షణ మంత్రి ధ్రువీకరణ అనంతరం ఎన్‌డీఏఏ యాక్ట్ 2017 అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తుంది.
తాజా సవరణల ప్రకారం ఉత్తర వజిరిస్థాన్‌లోని హక్కాని నెట్‌వర్క్‌పై పాక్ సైన్యం పోరాటం కొనసాగించకపోతే అమెరికా నుంచి వచ్చే 400 మిలియన్ డాలర్ల(దాదాపు రూ. 2,600 కోట్లు) సాయం నిలిపివేస్తారు. పాకిస్తాన్- అఫ్గాన్ సరిహద్దుల వెంబడి ఉగ్రవాదుల కదలికల నియంత్రణకు పాక్ కృషిచేయాలి. అక్టోబర్ 1, 2017- డిసెంబర్ 31, 2018 మధ్య కాలానికి ఈ సాయం వర్తిస్తుంది.
ఈ బిల్లు ద్వారా భారత్ - అమెరికాల మధ్య రక్షణ రంగ సంబంధాలు కూడా బలపడనున్నాయి. భారత్‌తో రక్షణ సంబంధాలు బలోపేతం కోసం భారత-అమెరికన్ కాంగ్రెస్ నేత అమీ బెరా ప్రతిపాదించిన సవరణను ప్రతినిధుల సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. ఈ సవరణను అమెరికా రక్షణ శాఖ మంత్రి ధ్రువీకరించాలి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రక్షణ వ్యయాల బిల్లులో సవరణలు
ఎప్పుడు : జూలై 15
ఎవరు : అమెరికా
ఎందుకు : పాక్‌కు సైనిక సాయం, భారత్ - అమెరికా రక్షణ బంధం బలోపేతానికి
చెన్నైలో అంతర్జాతీయ సైన్స్ ఫెస్టివల్
‘ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్ట్ - 2017’ చెన్నైలో జరగనుందని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ జూలై 15న తెలిపారు. సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అక్టోబర్ 13 నుంచి 16 వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. వివిధ దేశాల నుంచి దాదాపు 10 వేల మంది శాస్త్రవేత్తలు ఈ సైన్స్ ఫెస్టివల్‌లో పాల్గొంటారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అంతర్జాతీయ సైన్స్ ఫెస్టివల్
ఎప్పుడు : అక్టోబర్ 13-16, 2017
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎక్కడ : చెన్నై, తమిళనాడు
వృద్ధికి భారత్-శ్రీలంక మధ్య ఒప్పందం శ్రీలంక ఉత్తర మధ్య ప్రావిన్స్‌లో గల అనురాధాపూర్ జిల్లాలోని సోబిథా థెరో (ప్రముఖ బౌద్ధసన్యాసి సోబిథా థెరో పేరుపై ఏర్పడిన గ్రామం) అనే గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు భారత్-శ్రీలంక మధ్య జూలై 17న ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా రూ. 30 కోట్ల వ్యయంతో గ్రామంలో 153 కొత్త ఇళ్లను నిర్మిస్తారు. అలాగే బహుళార్థక సామాజిక భవనం, అంతర్గత నీటి సరఫరా వ్యవస్థ, గ్రంథాలయం నిర్మిస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సోబిథా థెరో గ్రామాభివృద్ధికి ఒప్పందం
ఎప్పుడు : జూలై 17
ఎవరు : భారత్-శ్రీలంక
ఎక్కడ : అనురాధాపూర్ జిల్లా, శ్రీలంక
ఖతార్‌తో అమెరికా ఉగ్ర వ్యతిరేక ఒప్పందంఖతార్‌తో అమెరికా జూలై 11న ఉగ్రవాద వ్యతిరేక ఒప్పందం కుదుర్చుకుంది. ఉగ్రవాదానికి మద్దతుగా నిలుస్తోందని ఆరోపిస్తూ నాలుగు అరబ్ దేశాలు ఖతార్‌తో సంబంధాలు తెంచుకున్నాయి. ఈ నేపథ్యంలో సంక్షోభాన్ని నివారించేందుకు అమెరికా తాజా ఒప్పందం కుదుర్చుకుంది.
మానవ అక్రమ రవాణాలో ముందున్న చైనాప్రపంచంలో అత్యధికంగా మానవుల అక్రమ రవాణా చైనాలో జరుగుతోందని అమెరికా పేర్కొంది. ఈ విషయంలో రష్యా, సిరియా, ఇరాన్‌లను చైనా మించిపోయిందని అమెరికా విదేశాంగ శాఖ ఒక నివేదికలో జూలై 10న వెల్లడించింది. కాగా, ప్రపంచవ్యాప్తంగా 2.10 కోట్ల మంది అక్రమ రవాణా అయ్యారని అంతర్జాతీయ కార్మిక కార్యాలయం తెలిపింది.
జాతీయంపారామిలటరీ వైద్యుల ‘రిటైర్మెంట్’ పెంపుకేంద్ర సాయుధ బలగాల్లో పనిచేస్తున్న వైద్యుల రిటైర్మెంట్ వయసును 60 నుంచి 65 ఏళ్లకు పెంచుతూ కేంద్ర కేబినెట్ జూలై 12న నిర్ణయం తీసుకుంది. సీఆర్పీఎఫ్, బీఎస్‌ఎఫ్, సీఐఎస్‌ఎఫ్ మొదలైన కేంద్ర బలగాలతోపాటుగా అస్సామ్ రైఫిల్స్‌లో పనిచేస్తున్న జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ల పదవీ విరమణ వయసును మరో ఐదేళ్లు పెంచాలంటూ చాలాకాలంగా ప్రతిపాదన ఉంది. ఈ మేరకు వీరితోపాటుగా స్పెషలిస్టు మెడికల్ ఆఫీసర్ల రిటైర్మెంట్ వయసునూ 60 నుంచి 65కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
అలాగే, ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరితోపాటుగా కల్యాణి (పశ్చిమబెంగాల్), నాగ్‌పూర్ (మహారాష్ట్ర) ఎయిమ్స్ ఆసుపత్రులకు ఒక్కో డెరైక్టర్ పోస్టును ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు కేబినెట్ అంగీకారం తెలిపింది.
క్విక్ రివ్యూ: ఏమిటి : పారామిలటరీ వైద్యుల పదవీకాలం 65 ఏళ్లకు పెంపు
ఎప్పుడు : జూలై 12
ఎవరు : కేంద్ర కేబినెట్
మహారాష్ట్రలో ఉచిత గర్భనిరోధక ఇంజెక్షన్లు దేశంలోనే తొలిసారిగా మహారాష్ట్ర ప్రభుత్వం ఉచిత గర్భ నిరోధక ఇంజెక్షన్ల కార్యక్రమాన్ని ప్రారంభించింది. "అంతర" పేరుతో ప్రారంభించిన ఈ కార్యక్రమం ద్వారా.. గర్భ నివారణకు మాత్రలు వాడే మహిళలకు ఉచితంగా గర్భ నిరోధక ఇంజెక్షన్లు ఇస్తారు. గర్భ నిరోధకానికి ఇది సురక్షితమైన పద్ధతని పేర్కొన్న ప్రభుత్వం... ఈ ఇంజెక్షన్ 3 నెలల పాటు పనిచేస్తుందని పేర్కొంది.
క్విక్ రివ్యూ: ఏమిటి : అంతర కార్యక్రమం ప్రారంభం
ఎప్పుడు : జూలై 12
ఎవరు : మహారాష్ట్ర ప్రభుత్వం
ఎక్కడ : మహారాష్ట్రలో
ఎందుకు : ఉచితంగా గర్భ నిరోధక ఇంజెక్షన్ల ఇచ్చేందుకు
‘సుస్థిర అభివృద్ధి’లో 116వ స్థానంలో భారత్సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను చేరుకునే దేశాల తాజా జాబితాలో భారత్‌కు 116వ స్థానం దక్కింది. మొత్తం 157 దేశాల్లో 17 అంతర్జాతీయ లక్ష్యాలను పరిశీలించి ఈ జాబితాను రూపొందించారు. ఇందులో 58.1 పాయింట్లు పొందిన భారత్.. నేపాల్, ఇరాన్, శ్రీలంక, భూటాన్, చైనా కన్నా వెనుకంజలో ఉంది. పాకిస్తాన్ 122వ స్థానంలో నిలిచింది.
నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధిస్తున్న దేశాలు ఆర్థికంగా బలమైన దేశాలేమీ కావని నివేదిక వెల్లడించింది. ఈ జాబితాలో స్వీడన్ మొదటి స్థానంలో ఉండగా డెన్మార్క్, ఫిన్‌లాండ్ దేశాలు తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
క్విక్ రివ్యూ: ఏమిటి : సుస్థిర అభివృద్ధిలో భారత్‌కు 116వ స్థానం
ఎప్పుడు : జూలై 13
ఎవరు : Sustainable Development Solutions Network
గంగా నది ప్రక్షాళనకు నూతన మార్గదర్శకాలు
కలుషితమవుతున్న గంగా నది ప్రక్షాళనకు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా పర్యావరణ సమస్య నేటికీ తీవ్రంగానే ఉందని జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్‌జీటీ) ప్రభుత్వాన్ని ఆక్షేపించింది. ఈ మేరకు నదిని పరిరక్షించేందుకు జూలై 13న మార్గదర్శకాలు జారీ చేసింది.
మార్గదర్శకాలు..
ఏమిటి : గంగా నది ప్రక్షాళనకు మార్గదర్శకాలు జారీ
ఎప్పుడు : జూలై 13
ఎవరు : జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్
గుజరాత్‌లో హైస్పీడ్ రైలు శిక్షణ కేంద్రం దేశంలో తొలి హైస్పీడ్ రైలు శిక్షణ కేంద్రం గుజరాత్ రాష్ట్రంలోని గాంధీనగర్‌లో ఏర్పాటు కానుంది. 2023 నాటికి దేశంలో తొలి హై స్పీడ్ రైలుని ప్రవేశపెట్టాలన్న ప్రణాళికలో భాగంగా దీనిని ఏర్పాటు చేస్తున్నారు. 2020 నాటికి ఈ కేంద్రం కార్యకలాపాలు ప్రారంభం అవుతాయి. హైస్పీడ్ రైలు వ్యవస్థలో ప్రపంచ వ్యాప్తంగా అమలవుతున్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంపై ఈ కేంద్రంలో శిక్షణ ఇస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : హైస్పీడ్ రైలు శిక్షణ కేంద్రం
ఎప్పుడు : జూలై 13
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎక్కడ : గాంధీనగర్, గుజరాత్
సహకార ఎన్నికల్లో పోటీకి కనీస అర్హత నిర్ణయించిన రాజస్తాన్ దేశంలోనే తొలిసారిగా రాజస్తాన్ ప్రభుత్వం సహకార సంఘాల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు కనీస విద్యార్హతలు నిర్ణయించింది. ఈ మేరకు వ్యవసాయ, చేనేత, డైరీ తదితర సొసైటీలకు జరిగే పాలకవర్గ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు 5 నుంచి 8వ తరగతి విద్యార్హతలు నిర్దేశిస్తూ జూలై 13న కొత్త నిబంధనలు జారీ చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సహకార ఎన్నికల్లో పోటీకి కనీస అర్హత
ఎప్పుడు : జూలై 13
ఎవరు : రాజస్తాన్ ప్రభుత్వం
ఎక్కడ : రాజస్తాన్‌లో
రైల్వేల్లో బహుళ సేవలకు ‘సార్థి’ యాప్బహుళ రైల్వే సేవలను ఒకేచోట పొందేందుకు వీలుగా రైల్వేశాఖ ‘రైల్ సార్థి’ అనే సరికొత్త యాప్‌ను ఆవిష్కరించింది. టికెట్ బుకింగ్, భోజనం ఆర్డర్ ఇవ్వడం, మహిళల రక్షణ తదితర అంశాలున్న ఈ యాప్‌ను రైల్వే మంత్రి సురేష్ ప్రభు జూలై 14న న్యూఢిల్లీలో ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ఈ యాప్ వల్ల ప్రయాణికులకు వేర్వేరు వెబ్‌సైట్లను వెతికే ఇబ్బంది తప్పుతుందన్నారు. రైల్వే సేవలన్నీ ఒకేచోట లభించడమే ఇందుకు కారణమన్నారు. సార్థి యాప్ ద్వారా విమానం టికెట్లను సైతం బుక్ చేసుకోవచ్చని ప్రభు తెలిపారు.
క్విక్ రివ్యూ: ఏమిటి : రైల్ సార్థి యాప్ ఆవిష్కరణ
ఎప్పుడు : జూలై 14
ఎవరు : రైల్వే మంత్రి సురేశ్ ప్రభు
ఎక్కడ : న్యూఢిల్లీలో
ఎందుకు : రైల్వే సేవలన్నీ ఒకేచోట పొందేందుకు వీలుగా
కరువు నిర్ధారణకు కొత్త మార్గదర్శకాలు
కరువు నిర్ధారణ మార్గదర్శకాల్లో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసింది. ప్రస్తుతం తీవ్ర కరువు, మధ్యస్థ కరువు, సాధారణ కరువు కేటగిరీలున్నాయి. వాటిల్లో మధ్యస్థ కరువు అనే కేటగిరీని ఎత్తివేస్తూ మార్గదర్శకాలు ఖరారు చేసింది. ఆ ప్రకారం ఇప్పుడు రెండు కేటగిరీలే ఉంటాయి. ఇక సాధారణ కరువు అంటే కరువు లేనట్లేనని ప్రకటించే అవకాశముంది. మధ్యస్థ కరువు ప్రాంతాలన్నీ కూడా సాధారణ కరువు కేటగిరీలోకి రానున్నాయని అధికారులు విశ్లేషిస్తున్నారు. అంటే తీవ్ర కరువుగా గుర్తిస్తే తప్ప ఆయా రాష్ట్రాల రైతులకు జాతీయ విపత్తు సహాయ నిధి (ఎన్‌డీఆర్‌ఎఫ్) నుంచి ఆర్థిక సాయం వచ్చే పరిస్థితి ఉండదని అంటున్నారు.
6 అంశాల ఆధారంగా కరువు నిర్ణయం
కేంద్ర నిబంధనల ప్రకారం ఆరు అంశాలను కరువు నిర్ధారణకు పరిగణనలోకి తీసుకుంటారు. అందులో
1) వర్షాభావ పరిస్థితులు
2) వర్షానికి వర్షానికి మధ్య అంతరం (డ్రెస్పైల్)
3) తేమ సమగ్ర సూచిక (ఎంఏఐ)
4) నార్మలైజ్డ్ డిఫరెన్స్ వెజిటేషన్ ఇండెక్స్ (ఎన్‌డీవీఐ), నార్మలైజ్డ్ డిఫరెన్స్ వాటర్ ఇండెక్స్ (ఎన్‌డీడబ్ల్యూఐ)
5) సాగు విస్తీర్ణం
6) దిగుబడుల లెక్క
ఏమిటి : కరువు నిర్ధారణ మార్గదర్శకాల్లో మార్పులు
ఎప్పుడు : జూలై 14
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎక్కడ : దేశవ్యాప్తంగా
ప్రజాదరణలో మోదీ సర్కారు టాప్ప్రపంచంలో అత్యధిక ప్రజాదరణ చూరగొన్న ప్రభుత్వాల జాబితాలో కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు అగ్రస్థానం దక్కించుకుంది. 2016 సంవత్సరానికి ‘ఆర్థిక సహకారం, అభివృద్ధి సంస్థ’(ఓఈసీడీ) నిర్వహించిన అంతర్జాతీయ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. 73 శాతం భారతీయులు ఎన్డీఏ ప్రభుత్వంపై విశ్వాసం వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సర్కారుకు కేవలం 30% అమెరికన్లు మాత్రమే మద్దతు పలికారు.
అత్యధిక ప్రజాదరణ పొందిన ప్రభుత్వాలు
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రజాదరణలో మొదటి స్థానంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం
ఎప్పుడు : జూలై 14
ఎవరు : ఓఈసీడీ
ఎక్కడ : ప్రపంచవ్యాప్తంగా
ఫేస్‌బుక్ యూజర్లలో భారత్ టాప్ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌కు ఎక్కువ యాక్టివ్ యూజర్లున్న అతిపెద్ద దేశంగా భారత్ అవతరించింది. మొత్తం 241 మిలియన్ మంది యాక్టివ్ యూజర్లతో భారత్ ఈ స్థానాన్ని దక్కించుకుంది. అమెరికాలో 240 మిలియన్ మందే యాక్టివ్ యూజర్లున్నారు. ఈ మేరకు ఫేస్‌బుక్‌లో ఎక్కువ యాక్టివ్ యూజర్లున్న దేశాల్లో అమెరికాను భారత్ అధిగమించిందని నెక్స్ట్‌వెబ్ సంస్థ జూలై 13న వెల్లడించింది. గత ఆరునెలల కాలంలోనే భారత్‌లో యాక్టివ్ యూజర్లు 27 శాతం పెరిగారు. ఇదే కాలంలో అమెరికాలో 12 శాతం వృద్ధి మాత్రమే కనిపించింది. మొత్తంగా 2 బిలియన్ యూజర్ల మార్కును దాటినట్లు ఫేస్‌బుక్ ఇటీవలే ప్రకటించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఫేస్‌బుక్ యూజర్లలో తొలిస్థానంలో భారత్
ఎప్పుడు : జూలై 13
ఎవరు : నెక్స్ట్‌వెబ్ సంస్థ
ఎక్కడ : ప్రపంచవ్యాప్తంగా
ఎందుకు : భారత్‌లో 241 మిలియన్ మంది యాక్టివ్ యూజర్లు
సీఎస్‌ఐ సర్వేలో రాయ్‌పూర్ విమానాశ్రయం టాప్ 2017 జనవరి - జూన్ మధ్య కాలానికి గాను వెల్లడించిన ప్రయాణికుల సంతృప్తి సూచీ (సీఎస్‌ఐ)లో ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ స్వామి వివేకానంద విమానాశ్రయం తొలి స్థానంలో నిలిచింది. ఓ స్వతంత్ర ఏజెన్సీ.. రవాణా, పార్కింగ్, ప్రయాణికుల సౌకర్యం, పరిశుభ్రత అంశాలను పరిగణలోకి తీసుకొని 49 విమానాశ్రయాలతో ఈ జాబితాను రూపొందించింది. ఇందులో మొత్తం 5 మార్కులకు గాను రాయ్‌పూర్ విమానాశ్రయం 4.84 మార్కులు సాధించి మొదటి స్థానాన్ని దక్కించుకుంది. ఉదయ్‌పూర్, అమృత్‌సర్, డెహ్రాడూన్ విమానాశ్రయాలు ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : విమానాశ్రయాలపై సీఎస్‌ఐ సర్వే
ఎప్పుడు : జూలై 14
ఎవరు : తొలి స్థానంలో రాయ్‌పూర్ విమానాశ్రయం
ఎక్కడ : దేశవ్యాప్తంగా
సౌరవిద్యుత్‌తో నడిచే తొలి రైలు ప్రారంభం
సౌరవిద్యుత్(1600 హెచ్‌పీ) వ్యవస్థతో కూడిన తొలి డీఈఎమ్‌యూ(డీజిల్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్) రైలుని కేంద్ర మంత్రి సురేశ్ ప్రభు జూలై 14న సఫ్దర్‌జంగ్(న్యూఢిల్లీ) రైల్వేస్టేషన్‌లో ప్రారంభించారు. ఈ రైలు ఢిల్లీలోని సరై రోహిల్లా - హర్యానాలోని ఫరూక్‌నగర్ మధ్య నడుస్తుంది. రైలులోని చివరి ఆరు భోగీల్లో సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఒక్కో భోగీలో 16 సోలార్ పలకలను అమర్చారు. భోగీల్లోని లైట్లు, ఫ్యాన్లకు వీటి ద్వారా విద్యుత్ సరఫరా అవుతుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సౌరవిద్యుత్‌తో కూడిన డీఈఎమ్‌యూ రైలు ప్రారంభం
ఎప్పుడు : జూలై 14
ఎవరు : భారతీయ రైల్వే
ఎక్కడ : న్యూఢిల్లీ
కేరళలో ఆటజిం ఇనిస్టిట్యూట్ ఆటిజం వ్యాధి(మెదడు అభివృద్ధిలో లోపాలు)తో బాధపడే చిన్నారులకు అత్యాధునిక వైద్య సేవలు అందించేందుకు కేరళలో Center for Autism and other Disabilities Rehabilitation Research and Education (CADRRE) ఏర్పాటు కానుంది. 2017 సెప్టంబర్‌లో ఈ కేంద్రాన్ని ప్రారంభించనున్నారు.
National Institute of Speech and Hearing (NISH) ఫౌండర్ డెరైక్టర్ జి.విజయరాఘవన్ ఈ కేంద్రం నిర్వహణ బాధ్యతలు చేపడతారు.
క్విక్ రివ్యూ: ఏమిటి : ఆటజిం ఇనిస్టిట్యూట్
ఎప్పుడు : 2017 సెప్టెంబర్‌లో
ఎవరు : ఎన్‌ఐఎస్‌హెచ్
ఎక్కడ : కే రళలో
రాష్ట్రపతి ఎన్నికలో 99 శాతం పోలింగ్భారత 15వ రాష్ట్రపతి ఎన్నిక జూలై 17న ప్రశాంతంగా జరిగింది. దేశవ్యాప్తంగా 99 శాతం పోలింగ్ జరగగా.. అరుణాచల్‌ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, అస్సాం, గుజరాత్, బిహార్, హరియాణా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, నాగాలాండ్, ఉత్తరాఖండ్, పుదుచ్చేరిల్లో వందశాతం పోలింగ్ నమోదైంది. ఢిల్లీలోని పార్లమెంటు భవన్‌లో 99 శాతం ఓటింగ్ జరిగింది. ఇప్పటివరకు జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో ఇదే అత్యధిక శాతం పోలింగ్.
ఢిల్లీలో ఓటేయాల్సిన 717 మంది ఎంపీల్లో 714 మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఎన్డీఏ అభ్యర్థిగా రామ్‌నాథ్ కోవింద్ పోటీ చేయగా.. యూపీఏ అభ్యర్థిగా మీరా కుమార్ పోటీ చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రాష్ట్రపతి ఎన్నికల్లో 99 శాతం పోలింగ్
ఎప్పుడు : జూలై 17
ఎవరు : భారత ఎన్నికల సంఘం
ఎక్కడ : దేశవ్యాప్తంగా
మహిళా సిబ్బందితో నడిచే తొలి రైల్వే స్టేషన్ దేశంలో తొలిసారిగా పూర్తిగా మహిళా సిబ్బందితో నడిచే మొదటి రైల్వే స్టేషన్‌గా ముంబైలోని మతుంగా సబర్బన్ రైల్వే స్టేషన్ గుర్తింపు పొందింది. టికెట్ బుకింగ్ క్లర్క్, టీటీ, రైల్వే పోలీస్ తదితర హోదాల్లో ఈ స్టేషన్‌లో మొత్తం 30 మంది మహిళా సిబ్బంది పనిచేస్తున్నారు. ఈ స్టేషన్‌కు మేనేజర్‌గా ఉన్న మమతా కులకర్ణి.. సెంట్రల్ రైల్వేలో ఈ హోదా పొందిన తొలి మహిళా అధికారిగా గుర్తింపు పొందారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పూర్తిగా మహిళా సిబ్బందితో నడిచే తొలి రైల్వేస్టేషన్
ఎప్పుడు : జూలై 17
ఎక్కడ : మతుంగ రైల్వే స్టేషన్, ముంబై
గోప్యత హక్కుపై 9 మంది సభ్యుల ధర్మాసనంభారత రాజ్యాంగం ప్రకారం వ్యక్తిగత వివరాల గోప్యతను ప్రాథమిక హక్కుగా ప్రకటించవచ్చా లేదా అనే విషయాన్ని తేల్చేందుకు 9 మంది సభ్యుల ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు జూలై 18న నిర్ణయించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్.ఖేహర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. గోప్యత హక్కుకు సంబంధించి 1950 నాటి ఎం.పీ.శర్మ కేసు, 1960 నాటి ఖరక్ సింగ్ కేసుల్లో ఇచ్చిన తీర్పుల్లో కూడా తప్పులున్నాయేమో సరిచూస్తామంది. గోప్యత ప్రాథమిక హక్కు కాదని ఈ కేసుల్లో సుప్రీంకోర్టు అప్పట్లో తీర్పునిచ్చింది.
9 మంది సభ్యుల ధర్మాసనం జూలై 19 నుంచే విచారణ ప్రారంభించి.. రాజ్యాంగంలోని మూడవ భాగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కుల కిందకు గోప్యత వస్తుందా లేదా అనే విషయాన్ని తేలుస్తుందని కోర్టు స్పష్టం చేసింది. ఆధార్ పథకం వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తోందంటూ వచ్చిన కొన్ని పిటిషన్లను విచారిస్తూ కోర్టుపై ఆదేశాలిచ్చింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : గోప్యత హక్కుపై 9 మంది సభ్యుల ధర్మాసనం
ఎప్పుడు : జూలై 18
ఎవరు : సుప్రీంకోర్టు
ఎందుకు : వ్యక్తిగత వివరాల గోప్యతను ప్రాథమిక హక్కుగా ప్రకటించవచ్చా లేదా అనే విషయాన్ని తేల్చేందుకు
కర్ణాటకకు ప్రత్యేక జెండాకు కమిటీ ఏర్పాటు రాష్ట్రానికి ప్రత్యేక జెండా ఏర్పాటు చేయాలని నిర్ణయించిన కర్ణాటక ప్రభుత్వం.. జెండా రూపకల్పనకు 9 మంది సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. కాగా.. ప్రత్యేక జెండా ఏర్పాటు రాజ్యాంగ విరుద్ధమేమీ కాదని సీఎం సిద్ధరామయ్య తన చర్యను సమర్థించుకున్నారు.
దేశానికంతటికీ త్రివర్ణ పతాకం ఒక్కటే ఉంటుందని.. ఏ రాష్ట్రమైనా ప్రత్యేక జెండా ఏర్పాటు చేసుకునే అవకాశం రాజ్యాంగం ఇవ్వలేదని కేంద్రం కర్ణాటకకు స్పష్టం చేసింది. గతంలో డీవీ సదానంద గౌడ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం చేసిన ప్రత్యేక జెండా ప్రతిపాదనలను ఆ రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. రాష్ట్రానికి ప్రత్యేక జెండా అనేది జాతీయ సమగ్రతను, ఐక్యత స్ఫూర్తి దెబ్బతీసేవిధంగా ఉంటుందని హైకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.
కర్ణాటకకు ప్రత్యేక జెండా వచ్చినట్లయితే జమ్మూ కశ్మీర్ తర్వాత ప్రత్యేక జెండా కలిగిన రెండో రాష్ట్రంగా చరిత్రలో నిలవనుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రాష్ట్రానికి ప్రత్యేక జెండా కోసం కమిటీ
ఎప్పుడు : జూలై 18
ఎవరు : కర్ణాటక సీఎం సిద్ధారామయ్య
ఎక్కడ : కర్ణాటక
రాష్ట్రీయం
టీఎస్ ఏజీ రామకృష్ణారెడ్డి రాజీనామారాష్ట్ర అడ్వకేట్ జనరల్ (ఏజీ) పదవికి కొండం రామకృష్ణారెడ్డి జూలై 12న రాజీనామా చేశారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ ద్వారా ఆయన తన రాజీనామా లేఖను గవర్నర్‌కు పంపారు. తెలంగాణ రాష్ట్ర మొదటి ఏజీగా రామకృష్ణారెడ్డి 2014 జూన్ 21న నియమితులయ్యారు. పలు కీలక కేసుల్లో ప్రభుత్వం తరఫున ఆయన ఉమ్మడి హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో వాదనలు వినిపించారు. కొత్త అడ్వకేట్ జనరల్‌గా దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి నియమితులయ్యే అవకాశాలున్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తెలంగాణ ఏజీ రాజీనామా
ఎప్పుడు : జూలై 12
ఎవరు : కొండం రామకృష్ణారెడ్డి
జపాన్ - ఏపీ సంయుక్త సహకార ప్రకటన
అమరావతి నుంచి నేరుగా జపాన్ రాజధాని టోక్యోకు, టోక్యో నుంచి అమరావతికి త్వరలో విమాన సర్వీసులను ప్రవేశపెడతామని సీఎం చంద్రబాబు తెలిపారు. జపాన్ ఆర్థిక, వాణిజ్య, పారిశ్రామిక శాఖ మంత్రి యొసుకె తకాగి ఆధ్వర్యంలోని ప్రభుత్వ, పారిశ్రామిక ప్రతినిధుల బృందంతో విజయవాడలోని ఒక హోటల్‌లో సీఎం జూలై 12న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జపాన్ ఆర్థిక, వాణిజ్య, పారిశ్రామిక మంత్రిత్వశాఖ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు అంశాల్లో అవగాహనకు వచ్చి సంయుక్త ప్రకటన విడుదల చేశాయి.
జపాన్-ఏపీ సంయుక్త సహకార ప్రకటన
ఏమిటి : జపాన్ - ఏపీ సంయుక్త సహకార ప్రకటన
ఎప్పుడు : జూలై 12
ఎక్కడ : అమరావతిలో
ఎందుకు : రాజధాని అభివృద్ధిలో భాగంగా
తెలంగాణ సాహిత్య అకాడమీ లోగోల ఆవిష్కరణ
తెలంగాణ సాహిత్య అకాడమీ, ప్రపంచ తొలి తెలుగు మహాసభల లోగోలను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు జూలై 11న ఆవిష్కరించారు. తెలుగు మహాసభల లోగోను చేర్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు రవిశంకర్ రూపొందించగా.. సాహిత్య అకాడమీ లోగోను సిద్దిపేటకు చెందిన ప్రముఖ చిత్రకారుడు, శిల్పి ఎం.వి.రమణారెడ్డి రూపొందించారు.
ప్రపంచ తొలి తెలుగు మహాసభల లోగోలో.. కాకతీయ తోరణం, మధ్యలో తెలంగాణ చిత్రపటం, కాకతీయ సామ్రాజ్య చిహ్నాలైన గజరాజులను నకాశీ చిత్రరీతిలో పొందుపరిచారు. లోగో పై భాగంలో తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్టలను చిత్రించారు. మన తెలంగాణము తెలుగు మాగాణము అనే వాక్యం కనిపిస్తుంది.
సాహిత్య అకాడమీ లోగో మధ్యలో ఫిలిగ్రీ శైలిలో హంసను చిత్రించారు. హంస ముక్కు స్థానంలో పాళి కనిపిస్తుంది. హంస కింద పుస్తకం పుటలను నీటి అలలుగా చిత్రించారు. లోగో పై భాగంలో తెలంగాణ మ్యాపులో సాహిత్య వృక్షం శాఖోపశాఖలు విస్తరిస్తున్నట్లు ప్రతీకాత్మకంగా పొందుపరిచారు. లోగో మధ్యలో పాల్కూరి సోమనాథుడి పద్యభాగం ‘సరసమై బరగిన జాను తెనుగు’ అనే పద్యపాదాన్ని ప్రముఖంగా చేర్చారు.
క్విక్ రివ్యూ: ఏమిటి : తెలంగాణ సాహిత్య అకాడమీ లోగోల ఆవిష్కరణ
ఎప్పుడు : జూలై 11
ఎవరు : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు
హైదరాబాద్, విశాఖ జోన్ జీఎస్‌టీ చీఫ్ కమిషనర్‌గా అగర్వాల్జీఎస్‌టీ కస్టమ్స్ హైదరాబాద్ జోన్ (తెలంగాణ) చీఫ్ కమిషనర్‌గా, విశాఖపట్నం జోన్(ఆంధ్రప్రదేశ్) ఇన్‌చార్జి ఛీఫ్ కమిషనర్‌గా సీనియర్ ఐఆర్‌ఎస్ అధికారి బన్కే బెహారి అగర్వాల్ జూలై 13న బాధ్యతలు స్వీకరించారు. 1985 బ్యాచ్ ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్‌కు చెందిన ఆయన దేశంలోని పలు ప్రాంతాల్లో పనిచేశారు. జీఎస్‌టీ చట్టంలోని అప్పీళ్లు, సమీక్షలకు సంబంధించిన పలు కీలక అంశాలను ఆయన రూపొందించారు. గత ఏడాది జీఎస్‌టీపై దేశంలోని 60వేల మంది అధికారులకు శిక్షణ ఇవ్వడంలోనూ కీలక పాత్ర పోషించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : హైదరాబాద్, విశాఖ జోన్ జీఎస్‌టీ కమిషనర్
ఎప్పుడు : జూలై 13
ఎవరు : బన్కే బెహారి అగర్వాల్
ఎక్కడ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్
ఏపీ మీదుగా హమ్ సఫర్ ఎక్స్‌ప్రెస్ఆంధ్రప్రదేశ్ మీదుగా నడిచే నూతన హమ్ సఫర్ ఎక్స్‌ప్రెస్ (నెంబరు 22833, 22834)ను కేంద్ర రైల్వేమంత్రి సురేష్ ప్రభు జూలై 13న ప్రారంభించారు. ఒడిషాలోని భువనేశ్వర్ నుంచి కర్ణాటకలోని కృష్ణరాజపురం వరకు ఈ రైలు నడవనుంది. వారానికి ఒకరోజు మాత్రమే నడిచే ఈ రైలు సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు భువనేశ్వర్‌లో బయల్దేరి మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంటకు కృష్ణరాజపురం చేరుకుంటుంది. మంగళవారం సాయంత్రం 4.05గంటలకు కృష్ణరాజ పురంలో బయలుదేరి బుధవారం సాయంత్రం 5.45 గంటలకు చేరుకుంటుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : హమ్ సఫర్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం
ఎప్పుడు : జూలై 13
ఎవరు : కేంద్ర రైల్వే మంత్రి సురేశ్ ప్రభు
ఎక్కడ : ఏపీ మీదుగా
శ్రీలంకలో ఏపీ ఇండస్ట్రియల్ పార్కు: చంద్రబాబు
ఫార్మా, టూరిజం, హార్టికల్చర్ రంగాల్లో కలిసి పనిచేయాలని శ్రీలంక, ఏపీ నిర్ణయించాయి. తమ దేశంలో పెట్టుబడులు పెట్టడానికి 600 ఎకరాల్లో ఏపీ కోసం ప్రత్యేకంగా పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేయనున్నట్లు శ్రీలంక ప్రకటించింది. శ్రీలంక నుంచి వచ్చిన పారిశ్రామిక ప్రతినిధుల బృందం జూలై 17న తాత్కాలిక సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ఈ పార్కులో ఫార్మా, టూరిజం, హార్టికల్చర్ ప్రాజెక్టులను అభివృద్ధి చేయాలని ప్రాధమికంగా నిర్ణయించామని, ఇందుకోసం త్వరలోనే ఒక ప్రతినిధి బృందాన్ని శ్రీలంకకు పంపనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు.
క్విక్ రివ్యూ: ఏమిటి : శ్రీలంకలో ఏపీ ఇండస్ట్రియల్ పార్కు
ఎప్పుడు : జూలై 17
ఎవరు : ఏపీ సీఎం చంద్రబాబు
ఎందుకు : ఫార్మా, టూరిజం, హార్టికల్చర్ రంగాల్లో కలిసి పనిచేయాలన్న నిర్ణయంలో భాగంగా
ఆర్థికంఉడాన్ సేవలు ప్రారంభించనున్న మరో రెండు ఎయిర్‌లైన్స్
ఉడాన్ (ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్) స్కీము కింద త్వరలో మరో రెండు సంస్థలు ప్రాంతీయ విమానయాన సేవలు (ఆర్‌సీఎస్) ప్రారంభించనున్నాయి. ఇందుకోసం విమానాలను సమకూర్చుకున్నట్లు ఎయిర్ ఒడిషా, ఎయిర్ డెక్కన్.. కేంద్రానికి తెలియజేశాయి. సెప్టెంబర్ ఆఖరు నుంచి సర్వీసులు ప్రారంభించే అవకాశాలున్నట్లు ఈ సంస్థలు తెలిపాయని కేంద్ర పౌర విమానయాన శాఖ వర్గాలు తెలిపాయి.
ఆర్‌సీఎస్ కింద మొత్తం 128 రూట్లు గుర్తించిన కేంద్రం విమానయాన సేవలకు అయిదు సంస్థలను ఎంపిక చేసింది. అలయన్స్ ఎయిర్, స్పైస్‌జెట్, టర్బోమేఘా ఇప్పటికే కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. కొత్తగా రాబోయే ఎయిర్ ఒడిషాకి 50 రూట్లు, ఎయిర్ డెక్కన్‌కి 34 రూట్లు దక్కాయి. రెండు సంస్థలు 19 సీట్ల సామర్థ్యం ఉండే ఆరు బీచ్‌క్రాఫ్ట్ బీ-1900డి విమానాలను సమకూర్చుకున్నాయి.
ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలకు కూడా విమాన సేవలను విస్తరించేలా.. కేంద్రం గంట పాటు ప్రయాణం ఉండే రూట్లలో టికెట్ చార్జీలు గరిష్టంగా రూ. 2,500కి పరిమితం చేసింది. విమానయాన సంస్థలు తమ విమానాల సీటింగ్ సామర్థ్యంలో 50 శాతం ఈ స్కీము కింద కేటాయించాల్సి ఉంటుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఉడాన్ సేవలు ప్రారంభించనున్న మరో రెండు ఎయిర్‌లైన్స్
ఎప్పుడు : జూలై 12
ఎవరు : ఎయిర్ ఒడిషా, ఎయిర్ డెక్కన్
జాతీయ మలేరియా నిర్మూలన ప్రణాళిక 2017-22జాతీయ మలేరియా నిర్మూలన ప్రణాళిక 2017-22ను కేంద్ర వైద్య శాఖ మంత్రి జేపీ నడ్డా జూలై 12న ఆవిష్కరించారు. 2027 నాటికి భారత్‌ను మలేరియా రహితంగా మార్చేందుకు కేంద్రం కృషి చేస్తుందని ఈ సందర్భంగా నడ్డా ప్రకటించారు. ఈ సారి ప్రణాళికల అమలులో భాగంగా జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రాలపై అధిక దృష్టి కేంద్రీకరిస్తామని చెప్పారు.
2030 నాటికి భారత్‌ను మలేరియా రహితంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఫ్రేమ్‌వర్క్ ఫర్ మలేరియా ఎలిమినేషన్ (NFME)ని 2016లో ప్రారంభించింది.
2017-22 ప్రణాళికలు
రాజ్యసభ సభ్యత్వానికి మాయావతి రాజీనామాబీఎస్పీ అధినేత్రి మాయావతి తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. జూలై 18న రాజ్యసభలో సహరాన్‌పూర్ అల్లర్లపై తన ప్రసంగాన్ని అడ్డుకోవటంతో మనస్తాపం చెందిన మాయావతి ఈ నిర్ణయం తీసుకున్నారు. రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీకి తన రాజీనామా లేఖను సమర్పించారు. ఆమెకు 2018 ఏప్రిల్ వరకు పదవీకాలం ఉంది.
క్విక్ రివ్యూ: ఏమిటి : రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా
ఎప్పుడు : జూలై 18
ఎవరు : మాయావతి
ఎందుకు : రాజ్యసభలో సహరాన్‌పూర్ అల్లర్లపై తన ప్రసంగాన్ని అడ్డుకోవటంతో
గణిత మేధావి మిర్జాఖానీ మృతిగణితశాస్త్ర ప్రావీణ్యురాలు, ఇరాన్ సంతతికి చెందిన మరియమ్ మిర్జాఖానీ(40).. కేన్సర్‌తో బాధపడుతూ జూలై 14న అమెరికాలో మరణించారు. కాలిఫోర్నియాలోని స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆమె గణితంలో నోబెల్ బహుమతిగా పరిగణించే ఫీల్డ్స్ మెడల్ అందుకున్న తొలి మహిళగా గుర్తింపు పొందారు.
సిక్కిం మాజీ సీఎం నార్ బహదూర్ భండారి మృతిసిక్కిం మాజీ సీఎం నార్ బహదూర్ భండారి (77) జూలై 15న ఢిల్లీలో మరణించారు. ఆయన తొలిసారి 1979లో, తర్వాత 1984, 1989లో సిక్కిం సీఎంగా ఎన్నికయ్యారు.
అవార్డులుఐఫా అవార్డులు - 201718వ ఐఫా (ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ)-2017 అవార్డుల ప్రదానోత్సవం జూలై 16న అమెరికాలోని న్యూయార్క్‌లో జరిగింది. ఇందులో ఉత్తమ చిత్రంగా ‘నీర్జా’ నిలిచింది. పింక్ సినిమాకుగాను అనిరుధ్ రాయ్ చౌదరీకి ఉత్తమ దర్శకుడి అవార్డు దక్కింది. సంగీత దర్శకుడిగా పాతికేళ్లు పూర్తిచేసుకున్న ఏఆర్ రెహమాన్‌ను ప్రత్యేక అవార్డుతో సత్కరించారు.
అవార్డులు
ఏమిటి : ఐఫా అవార్డులు - 2017
ఎప్పుడు : జూలై 15
ఎవరు : ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ

- ‘అభివృద్ధి రహిత ప్రాంతం’(నో డెవలప్‌మెంట్ జోన్)గా హరిద్వార్- ఉన్నావోల మధ్య గంగా నది తీర ప్రాంతం. ఈ ప్రాంతంలో తీరం నుంచి 100 మీటర్ల వరకు ఎలాంటి నిర్మాణాలూ చేపట్టవద్దు.
- నదికి 500 మీటర్ల పరిధిలో వ్యర్థాలను డంప్ చేయరాదు.
- నిబంధనలకు విరుద్ధంగా నదిలో చెత్త డంప్ చేసినవారు పర్యావరణ పరిహారం కింద రూ.50 వేల జరిమానా.
- నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా (ఎన్‌ఎంజీసీ) కింద చేపట్టిన ప్రక్షాళన పనులను రెండేళ్లలో పూర్తి చేయాలి.
ఏమిటి : గంగా నది ప్రక్షాళనకు మార్గదర్శకాలు జారీ
ఎప్పుడు : జూలై 13
ఎవరు : జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్
గుజరాత్‌లో హైస్పీడ్ రైలు శిక్షణ కేంద్రం దేశంలో తొలి హైస్పీడ్ రైలు శిక్షణ కేంద్రం గుజరాత్ రాష్ట్రంలోని గాంధీనగర్‌లో ఏర్పాటు కానుంది. 2023 నాటికి దేశంలో తొలి హై స్పీడ్ రైలుని ప్రవేశపెట్టాలన్న ప్రణాళికలో భాగంగా దీనిని ఏర్పాటు చేస్తున్నారు. 2020 నాటికి ఈ కేంద్రం కార్యకలాపాలు ప్రారంభం అవుతాయి. హైస్పీడ్ రైలు వ్యవస్థలో ప్రపంచ వ్యాప్తంగా అమలవుతున్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంపై ఈ కేంద్రంలో శిక్షణ ఇస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : హైస్పీడ్ రైలు శిక్షణ కేంద్రం
ఎప్పుడు : జూలై 13
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎక్కడ : గాంధీనగర్, గుజరాత్
సహకార ఎన్నికల్లో పోటీకి కనీస అర్హత నిర్ణయించిన రాజస్తాన్ దేశంలోనే తొలిసారిగా రాజస్తాన్ ప్రభుత్వం సహకార సంఘాల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు కనీస విద్యార్హతలు నిర్ణయించింది. ఈ మేరకు వ్యవసాయ, చేనేత, డైరీ తదితర సొసైటీలకు జరిగే పాలకవర్గ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు 5 నుంచి 8వ తరగతి విద్యార్హతలు నిర్దేశిస్తూ జూలై 13న కొత్త నిబంధనలు జారీ చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సహకార ఎన్నికల్లో పోటీకి కనీస అర్హత
ఎప్పుడు : జూలై 13
ఎవరు : రాజస్తాన్ ప్రభుత్వం
ఎక్కడ : రాజస్తాన్‌లో
రైల్వేల్లో బహుళ సేవలకు ‘సార్థి’ యాప్బహుళ రైల్వే సేవలను ఒకేచోట పొందేందుకు వీలుగా రైల్వేశాఖ ‘రైల్ సార్థి’ అనే సరికొత్త యాప్‌ను ఆవిష్కరించింది. టికెట్ బుకింగ్, భోజనం ఆర్డర్ ఇవ్వడం, మహిళల రక్షణ తదితర అంశాలున్న ఈ యాప్‌ను రైల్వే మంత్రి సురేష్ ప్రభు జూలై 14న న్యూఢిల్లీలో ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ఈ యాప్ వల్ల ప్రయాణికులకు వేర్వేరు వెబ్‌సైట్లను వెతికే ఇబ్బంది తప్పుతుందన్నారు. రైల్వే సేవలన్నీ ఒకేచోట లభించడమే ఇందుకు కారణమన్నారు. సార్థి యాప్ ద్వారా విమానం టికెట్లను సైతం బుక్ చేసుకోవచ్చని ప్రభు తెలిపారు.
క్విక్ రివ్యూ: ఏమిటి : రైల్ సార్థి యాప్ ఆవిష్కరణ
ఎప్పుడు : జూలై 14
ఎవరు : రైల్వే మంత్రి సురేశ్ ప్రభు
ఎక్కడ : న్యూఢిల్లీలో
ఎందుకు : రైల్వే సేవలన్నీ ఒకేచోట పొందేందుకు వీలుగా
కరువు నిర్ధారణకు కొత్త మార్గదర్శకాలు
కరువు నిర్ధారణ మార్గదర్శకాల్లో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసింది. ప్రస్తుతం తీవ్ర కరువు, మధ్యస్థ కరువు, సాధారణ కరువు కేటగిరీలున్నాయి. వాటిల్లో మధ్యస్థ కరువు అనే కేటగిరీని ఎత్తివేస్తూ మార్గదర్శకాలు ఖరారు చేసింది. ఆ ప్రకారం ఇప్పుడు రెండు కేటగిరీలే ఉంటాయి. ఇక సాధారణ కరువు అంటే కరువు లేనట్లేనని ప్రకటించే అవకాశముంది. మధ్యస్థ కరువు ప్రాంతాలన్నీ కూడా సాధారణ కరువు కేటగిరీలోకి రానున్నాయని అధికారులు విశ్లేషిస్తున్నారు. అంటే తీవ్ర కరువుగా గుర్తిస్తే తప్ప ఆయా రాష్ట్రాల రైతులకు జాతీయ విపత్తు సహాయ నిధి (ఎన్‌డీఆర్‌ఎఫ్) నుంచి ఆర్థిక సాయం వచ్చే పరిస్థితి ఉండదని అంటున్నారు.
6 అంశాల ఆధారంగా కరువు నిర్ణయం
కేంద్ర నిబంధనల ప్రకారం ఆరు అంశాలను కరువు నిర్ధారణకు పరిగణనలోకి తీసుకుంటారు. అందులో
1) వర్షాభావ పరిస్థితులు
2) వర్షానికి వర్షానికి మధ్య అంతరం (డ్రెస్పైల్)
3) తేమ సమగ్ర సూచిక (ఎంఏఐ)
4) నార్మలైజ్డ్ డిఫరెన్స్ వెజిటేషన్ ఇండెక్స్ (ఎన్‌డీవీఐ), నార్మలైజ్డ్ డిఫరెన్స్ వాటర్ ఇండెక్స్ (ఎన్‌డీడబ్ల్యూఐ)
5) సాగు విస్తీర్ణం
6) దిగుబడుల లెక్క
- వీటిలో ఐదు అంశాలు అనుకూలంగా ఉంటే కరువుగా ప్రకటిస్తారు. ఒక్కోసారి సడలింపులు ఇస్తారు. అప్పుడు నాలుగింటిని గీటురాయిగా తీసుకుంటారు.
- వర్షపాతం విషయానికి వస్తే 50 శాతానికి తక్కువగా ఉండాలి. వర్షానికి వర్షానికి మధ్య 21 రోజులకు మించి అంతరం ఉండాలి.
- సాగు విస్తీర్ణాన్నీ లెక్కిస్తారు. పంటల దిగుబడి 50 శాతానికి పడిపోవాలి. పశుగ్రాసానికి కొరత ఏర్పడాలి. అందులో ఇప్పటివరకు మధ్యస్థ, తీవ్ర కరువు ఉన్నప్పుడు కరువు మండలాలు ప్రకటించారు. ఆ ప్రకారం కేంద్రం సాయం ప్రకటించేది. ఇకనుంచి కరువు సాధారణంగా ఉంటే ఆయా మండలాలను లెక్కలోకి తీసుకోరని అధికారులు అంటున్నారు. మధ్యస్థ కరువు అనే కేటగిరీని ఎత్తివేయడం వల్ల కరువు మండ లాలు తగ్గే అవకాశముందని అంటున్నారు. మొత్తంగా తీవ్ర కరువు పరిస్థితులను ఈ ఆరు అంశాల తీవ్రతను బట్టి నిర్ణయిస్తారని తెలుస్తోంది.
ఏమిటి : కరువు నిర్ధారణ మార్గదర్శకాల్లో మార్పులు
ఎప్పుడు : జూలై 14
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎక్కడ : దేశవ్యాప్తంగా
ప్రజాదరణలో మోదీ సర్కారు టాప్ప్రపంచంలో అత్యధిక ప్రజాదరణ చూరగొన్న ప్రభుత్వాల జాబితాలో కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు అగ్రస్థానం దక్కించుకుంది. 2016 సంవత్సరానికి ‘ఆర్థిక సహకారం, అభివృద్ధి సంస్థ’(ఓఈసీడీ) నిర్వహించిన అంతర్జాతీయ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. 73 శాతం భారతీయులు ఎన్డీఏ ప్రభుత్వంపై విశ్వాసం వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సర్కారుకు కేవలం 30% అమెరికన్లు మాత్రమే మద్దతు పలికారు.
అత్యధిక ప్రజాదరణ పొందిన ప్రభుత్వాలు
స్థానం | దేశం | ప్రజాదరణ శాతం |
1 | భారత్ | 73 % |
2 | కెనడా | 62 % |
3 | టర్కీ | 58 % |
4 | రష్యా | 58 % |
5 | జర్మనీ | 55 % |
6 | దక్షిణాఫ్రికా | 48 % |
7 | ఆస్ట్రేలియా | 45 % |
8 | యూకే | 41 % |
9 | జపాన్ | 36 % |
10 | అమెరికా | 30 % |
ఏమిటి : ప్రజాదరణలో మొదటి స్థానంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం
ఎప్పుడు : జూలై 14
ఎవరు : ఓఈసీడీ
ఎక్కడ : ప్రపంచవ్యాప్తంగా
ఫేస్‌బుక్ యూజర్లలో భారత్ టాప్ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌కు ఎక్కువ యాక్టివ్ యూజర్లున్న అతిపెద్ద దేశంగా భారత్ అవతరించింది. మొత్తం 241 మిలియన్ మంది యాక్టివ్ యూజర్లతో భారత్ ఈ స్థానాన్ని దక్కించుకుంది. అమెరికాలో 240 మిలియన్ మందే యాక్టివ్ యూజర్లున్నారు. ఈ మేరకు ఫేస్‌బుక్‌లో ఎక్కువ యాక్టివ్ యూజర్లున్న దేశాల్లో అమెరికాను భారత్ అధిగమించిందని నెక్స్ట్‌వెబ్ సంస్థ జూలై 13న వెల్లడించింది. గత ఆరునెలల కాలంలోనే భారత్‌లో యాక్టివ్ యూజర్లు 27 శాతం పెరిగారు. ఇదే కాలంలో అమెరికాలో 12 శాతం వృద్ధి మాత్రమే కనిపించింది. మొత్తంగా 2 బిలియన్ యూజర్ల మార్కును దాటినట్లు ఫేస్‌బుక్ ఇటీవలే ప్రకటించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఫేస్‌బుక్ యూజర్లలో తొలిస్థానంలో భారత్
ఎప్పుడు : జూలై 13
ఎవరు : నెక్స్ట్‌వెబ్ సంస్థ
ఎక్కడ : ప్రపంచవ్యాప్తంగా
ఎందుకు : భారత్‌లో 241 మిలియన్ మంది యాక్టివ్ యూజర్లు
సీఎస్‌ఐ సర్వేలో రాయ్‌పూర్ విమానాశ్రయం టాప్ 2017 జనవరి - జూన్ మధ్య కాలానికి గాను వెల్లడించిన ప్రయాణికుల సంతృప్తి సూచీ (సీఎస్‌ఐ)లో ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ స్వామి వివేకానంద విమానాశ్రయం తొలి స్థానంలో నిలిచింది. ఓ స్వతంత్ర ఏజెన్సీ.. రవాణా, పార్కింగ్, ప్రయాణికుల సౌకర్యం, పరిశుభ్రత అంశాలను పరిగణలోకి తీసుకొని 49 విమానాశ్రయాలతో ఈ జాబితాను రూపొందించింది. ఇందులో మొత్తం 5 మార్కులకు గాను రాయ్‌పూర్ విమానాశ్రయం 4.84 మార్కులు సాధించి మొదటి స్థానాన్ని దక్కించుకుంది. ఉదయ్‌పూర్, అమృత్‌సర్, డెహ్రాడూన్ విమానాశ్రయాలు ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : విమానాశ్రయాలపై సీఎస్‌ఐ సర్వే
ఎప్పుడు : జూలై 14
ఎవరు : తొలి స్థానంలో రాయ్‌పూర్ విమానాశ్రయం
ఎక్కడ : దేశవ్యాప్తంగా
సౌరవిద్యుత్‌తో నడిచే తొలి రైలు ప్రారంభం
సౌరవిద్యుత్(1600 హెచ్‌పీ) వ్యవస్థతో కూడిన తొలి డీఈఎమ్‌యూ(డీజిల్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్) రైలుని కేంద్ర మంత్రి సురేశ్ ప్రభు జూలై 14న సఫ్దర్‌జంగ్(న్యూఢిల్లీ) రైల్వేస్టేషన్‌లో ప్రారంభించారు. ఈ రైలు ఢిల్లీలోని సరై రోహిల్లా - హర్యానాలోని ఫరూక్‌నగర్ మధ్య నడుస్తుంది. రైలులోని చివరి ఆరు భోగీల్లో సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఒక్కో భోగీలో 16 సోలార్ పలకలను అమర్చారు. భోగీల్లోని లైట్లు, ఫ్యాన్లకు వీటి ద్వారా విద్యుత్ సరఫరా అవుతుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సౌరవిద్యుత్‌తో కూడిన డీఈఎమ్‌యూ రైలు ప్రారంభం
ఎప్పుడు : జూలై 14
ఎవరు : భారతీయ రైల్వే
ఎక్కడ : న్యూఢిల్లీ
కేరళలో ఆటజిం ఇనిస్టిట్యూట్ ఆటిజం వ్యాధి(మెదడు అభివృద్ధిలో లోపాలు)తో బాధపడే చిన్నారులకు అత్యాధునిక వైద్య సేవలు అందించేందుకు కేరళలో Center for Autism and other Disabilities Rehabilitation Research and Education (CADRRE) ఏర్పాటు కానుంది. 2017 సెప్టంబర్‌లో ఈ కేంద్రాన్ని ప్రారంభించనున్నారు.
National Institute of Speech and Hearing (NISH) ఫౌండర్ డెరైక్టర్ జి.విజయరాఘవన్ ఈ కేంద్రం నిర్వహణ బాధ్యతలు చేపడతారు.
క్విక్ రివ్యూ: ఏమిటి : ఆటజిం ఇనిస్టిట్యూట్
ఎప్పుడు : 2017 సెప్టెంబర్‌లో
ఎవరు : ఎన్‌ఐఎస్‌హెచ్
ఎక్కడ : కే రళలో
రాష్ట్రపతి ఎన్నికలో 99 శాతం పోలింగ్భారత 15వ రాష్ట్రపతి ఎన్నిక జూలై 17న ప్రశాంతంగా జరిగింది. దేశవ్యాప్తంగా 99 శాతం పోలింగ్ జరగగా.. అరుణాచల్‌ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, అస్సాం, గుజరాత్, బిహార్, హరియాణా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, నాగాలాండ్, ఉత్తరాఖండ్, పుదుచ్చేరిల్లో వందశాతం పోలింగ్ నమోదైంది. ఢిల్లీలోని పార్లమెంటు భవన్‌లో 99 శాతం ఓటింగ్ జరిగింది. ఇప్పటివరకు జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో ఇదే అత్యధిక శాతం పోలింగ్.
ఢిల్లీలో ఓటేయాల్సిన 717 మంది ఎంపీల్లో 714 మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఎన్డీఏ అభ్యర్థిగా రామ్‌నాథ్ కోవింద్ పోటీ చేయగా.. యూపీఏ అభ్యర్థిగా మీరా కుమార్ పోటీ చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రాష్ట్రపతి ఎన్నికల్లో 99 శాతం పోలింగ్
ఎప్పుడు : జూలై 17
ఎవరు : భారత ఎన్నికల సంఘం
ఎక్కడ : దేశవ్యాప్తంగా
మహిళా సిబ్బందితో నడిచే తొలి రైల్వే స్టేషన్ దేశంలో తొలిసారిగా పూర్తిగా మహిళా సిబ్బందితో నడిచే మొదటి రైల్వే స్టేషన్‌గా ముంబైలోని మతుంగా సబర్బన్ రైల్వే స్టేషన్ గుర్తింపు పొందింది. టికెట్ బుకింగ్ క్లర్క్, టీటీ, రైల్వే పోలీస్ తదితర హోదాల్లో ఈ స్టేషన్‌లో మొత్తం 30 మంది మహిళా సిబ్బంది పనిచేస్తున్నారు. ఈ స్టేషన్‌కు మేనేజర్‌గా ఉన్న మమతా కులకర్ణి.. సెంట్రల్ రైల్వేలో ఈ హోదా పొందిన తొలి మహిళా అధికారిగా గుర్తింపు పొందారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పూర్తిగా మహిళా సిబ్బందితో నడిచే తొలి రైల్వేస్టేషన్
ఎప్పుడు : జూలై 17
ఎక్కడ : మతుంగ రైల్వే స్టేషన్, ముంబై
గోప్యత హక్కుపై 9 మంది సభ్యుల ధర్మాసనంభారత రాజ్యాంగం ప్రకారం వ్యక్తిగత వివరాల గోప్యతను ప్రాథమిక హక్కుగా ప్రకటించవచ్చా లేదా అనే విషయాన్ని తేల్చేందుకు 9 మంది సభ్యుల ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు జూలై 18న నిర్ణయించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్.ఖేహర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. గోప్యత హక్కుకు సంబంధించి 1950 నాటి ఎం.పీ.శర్మ కేసు, 1960 నాటి ఖరక్ సింగ్ కేసుల్లో ఇచ్చిన తీర్పుల్లో కూడా తప్పులున్నాయేమో సరిచూస్తామంది. గోప్యత ప్రాథమిక హక్కు కాదని ఈ కేసుల్లో సుప్రీంకోర్టు అప్పట్లో తీర్పునిచ్చింది.
9 మంది సభ్యుల ధర్మాసనం జూలై 19 నుంచే విచారణ ప్రారంభించి.. రాజ్యాంగంలోని మూడవ భాగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కుల కిందకు గోప్యత వస్తుందా లేదా అనే విషయాన్ని తేలుస్తుందని కోర్టు స్పష్టం చేసింది. ఆధార్ పథకం వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తోందంటూ వచ్చిన కొన్ని పిటిషన్లను విచారిస్తూ కోర్టుపై ఆదేశాలిచ్చింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : గోప్యత హక్కుపై 9 మంది సభ్యుల ధర్మాసనం
ఎప్పుడు : జూలై 18
ఎవరు : సుప్రీంకోర్టు
ఎందుకు : వ్యక్తిగత వివరాల గోప్యతను ప్రాథమిక హక్కుగా ప్రకటించవచ్చా లేదా అనే విషయాన్ని తేల్చేందుకు
కర్ణాటకకు ప్రత్యేక జెండాకు కమిటీ ఏర్పాటు రాష్ట్రానికి ప్రత్యేక జెండా ఏర్పాటు చేయాలని నిర్ణయించిన కర్ణాటక ప్రభుత్వం.. జెండా రూపకల్పనకు 9 మంది సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. కాగా.. ప్రత్యేక జెండా ఏర్పాటు రాజ్యాంగ విరుద్ధమేమీ కాదని సీఎం సిద్ధరామయ్య తన చర్యను సమర్థించుకున్నారు.
దేశానికంతటికీ త్రివర్ణ పతాకం ఒక్కటే ఉంటుందని.. ఏ రాష్ట్రమైనా ప్రత్యేక జెండా ఏర్పాటు చేసుకునే అవకాశం రాజ్యాంగం ఇవ్వలేదని కేంద్రం కర్ణాటకకు స్పష్టం చేసింది. గతంలో డీవీ సదానంద గౌడ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం చేసిన ప్రత్యేక జెండా ప్రతిపాదనలను ఆ రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. రాష్ట్రానికి ప్రత్యేక జెండా అనేది జాతీయ సమగ్రతను, ఐక్యత స్ఫూర్తి దెబ్బతీసేవిధంగా ఉంటుందని హైకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.
కర్ణాటకకు ప్రత్యేక జెండా వచ్చినట్లయితే జమ్మూ కశ్మీర్ తర్వాత ప్రత్యేక జెండా కలిగిన రెండో రాష్ట్రంగా చరిత్రలో నిలవనుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రాష్ట్రానికి ప్రత్యేక జెండా కోసం కమిటీ
ఎప్పుడు : జూలై 18
ఎవరు : కర్ణాటక సీఎం సిద్ధారామయ్య
ఎక్కడ : కర్ణాటక
రాష్ట్రీయం
టీఎస్ ఏజీ రామకృష్ణారెడ్డి రాజీనామారాష్ట్ర అడ్వకేట్ జనరల్ (ఏజీ) పదవికి కొండం రామకృష్ణారెడ్డి జూలై 12న రాజీనామా చేశారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ ద్వారా ఆయన తన రాజీనామా లేఖను గవర్నర్‌కు పంపారు. తెలంగాణ రాష్ట్ర మొదటి ఏజీగా రామకృష్ణారెడ్డి 2014 జూన్ 21న నియమితులయ్యారు. పలు కీలక కేసుల్లో ప్రభుత్వం తరఫున ఆయన ఉమ్మడి హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో వాదనలు వినిపించారు. కొత్త అడ్వకేట్ జనరల్‌గా దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి నియమితులయ్యే అవకాశాలున్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తెలంగాణ ఏజీ రాజీనామా
ఎప్పుడు : జూలై 12
ఎవరు : కొండం రామకృష్ణారెడ్డి
జపాన్ - ఏపీ సంయుక్త సహకార ప్రకటన
అమరావతి నుంచి నేరుగా జపాన్ రాజధాని టోక్యోకు, టోక్యో నుంచి అమరావతికి త్వరలో విమాన సర్వీసులను ప్రవేశపెడతామని సీఎం చంద్రబాబు తెలిపారు. జపాన్ ఆర్థిక, వాణిజ్య, పారిశ్రామిక శాఖ మంత్రి యొసుకె తకాగి ఆధ్వర్యంలోని ప్రభుత్వ, పారిశ్రామిక ప్రతినిధుల బృందంతో విజయవాడలోని ఒక హోటల్‌లో సీఎం జూలై 12న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జపాన్ ఆర్థిక, వాణిజ్య, పారిశ్రామిక మంత్రిత్వశాఖ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు అంశాల్లో అవగాహనకు వచ్చి సంయుక్త ప్రకటన విడుదల చేశాయి.
జపాన్-ఏపీ సంయుక్త సహకార ప్రకటన
- విద్యుత్ రంగంలో భారీ పెట్టుబడలకు సుముఖత. రియల్ టైమ్ స్మార్ట్ రీడింగ్ మీటర్ల అమర్చడానికి ముందుకొచ్చిన పుజి ఎలక్ట్రానిక్స్.
- చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్‌ను కాకినాడలో ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన జపాన్ సంస్థ. రాష్ట్రంలో ఇలాంటివి మొత్తం 12 ప్లాంట్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటన.
- అమరావతిలో డాటా సెంటర్, క్లౌడ్ కంప్యూటింగ్ ఫ్లాట్‌ఫాం, విపత్తుల నిరోధం, ట్రాఫిక్ వ్యవస్థ, నీటి సరఫరా, మురుగునీటి శుద్ధి విధానం రంగాల్లో జపాన్ తన స్మార్ట్ సాంకేతిక సహకారం అందిస్తుంది. ఇక్కడ క్రీడానగరం, ఎలక్ట్రానిక్ నగరాల అభివృద్ధికి తగ్గ మాస్టర్ ప్రణాళికను రూపొందిస్తుంది.
- ఫుడ్ వాల్యూ చైన్ అభివృద్ధి చేయడానికి ఏపీ, జపాన్ ప్రభుత్వాల అంగీకారం.
- మానవ వనరుల అభివృద్ధి, నైపుణ్యాల అభివృద్ధికి సంబంధించి అమరావతిలోని ఎన్‌బీకే ఆర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో జపాన్‌కు చెందిన మీడెన్‌షా సంస్థ " జపాన్ ఎండౌడ్ కోర్స్" ప్రారంభిస్తుంది.
ఏమిటి : జపాన్ - ఏపీ సంయుక్త సహకార ప్రకటన
ఎప్పుడు : జూలై 12
ఎక్కడ : అమరావతిలో
ఎందుకు : రాజధాని అభివృద్ధిలో భాగంగా
తెలంగాణ సాహిత్య అకాడమీ లోగోల ఆవిష్కరణ
తెలంగాణ సాహిత్య అకాడమీ, ప్రపంచ తొలి తెలుగు మహాసభల లోగోలను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు జూలై 11న ఆవిష్కరించారు. తెలుగు మహాసభల లోగోను చేర్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు రవిశంకర్ రూపొందించగా.. సాహిత్య అకాడమీ లోగోను సిద్దిపేటకు చెందిన ప్రముఖ చిత్రకారుడు, శిల్పి ఎం.వి.రమణారెడ్డి రూపొందించారు.
ప్రపంచ తొలి తెలుగు మహాసభల లోగోలో.. కాకతీయ తోరణం, మధ్యలో తెలంగాణ చిత్రపటం, కాకతీయ సామ్రాజ్య చిహ్నాలైన గజరాజులను నకాశీ చిత్రరీతిలో పొందుపరిచారు. లోగో పై భాగంలో తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్టలను చిత్రించారు. మన తెలంగాణము తెలుగు మాగాణము అనే వాక్యం కనిపిస్తుంది.
సాహిత్య అకాడమీ లోగో మధ్యలో ఫిలిగ్రీ శైలిలో హంసను చిత్రించారు. హంస ముక్కు స్థానంలో పాళి కనిపిస్తుంది. హంస కింద పుస్తకం పుటలను నీటి అలలుగా చిత్రించారు. లోగో పై భాగంలో తెలంగాణ మ్యాపులో సాహిత్య వృక్షం శాఖోపశాఖలు విస్తరిస్తున్నట్లు ప్రతీకాత్మకంగా పొందుపరిచారు. లోగో మధ్యలో పాల్కూరి సోమనాథుడి పద్యభాగం ‘సరసమై బరగిన జాను తెనుగు’ అనే పద్యపాదాన్ని ప్రముఖంగా చేర్చారు.
క్విక్ రివ్యూ: ఏమిటి : తెలంగాణ సాహిత్య అకాడమీ లోగోల ఆవిష్కరణ
ఎప్పుడు : జూలై 11
ఎవరు : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు
హైదరాబాద్, విశాఖ జోన్ జీఎస్‌టీ చీఫ్ కమిషనర్‌గా అగర్వాల్జీఎస్‌టీ కస్టమ్స్ హైదరాబాద్ జోన్ (తెలంగాణ) చీఫ్ కమిషనర్‌గా, విశాఖపట్నం జోన్(ఆంధ్రప్రదేశ్) ఇన్‌చార్జి ఛీఫ్ కమిషనర్‌గా సీనియర్ ఐఆర్‌ఎస్ అధికారి బన్కే బెహారి అగర్వాల్ జూలై 13న బాధ్యతలు స్వీకరించారు. 1985 బ్యాచ్ ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్‌కు చెందిన ఆయన దేశంలోని పలు ప్రాంతాల్లో పనిచేశారు. జీఎస్‌టీ చట్టంలోని అప్పీళ్లు, సమీక్షలకు సంబంధించిన పలు కీలక అంశాలను ఆయన రూపొందించారు. గత ఏడాది జీఎస్‌టీపై దేశంలోని 60వేల మంది అధికారులకు శిక్షణ ఇవ్వడంలోనూ కీలక పాత్ర పోషించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : హైదరాబాద్, విశాఖ జోన్ జీఎస్‌టీ కమిషనర్
ఎప్పుడు : జూలై 13
ఎవరు : బన్కే బెహారి అగర్వాల్
ఎక్కడ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్
ఏపీ మీదుగా హమ్ సఫర్ ఎక్స్‌ప్రెస్ఆంధ్రప్రదేశ్ మీదుగా నడిచే నూతన హమ్ సఫర్ ఎక్స్‌ప్రెస్ (నెంబరు 22833, 22834)ను కేంద్ర రైల్వేమంత్రి సురేష్ ప్రభు జూలై 13న ప్రారంభించారు. ఒడిషాలోని భువనేశ్వర్ నుంచి కర్ణాటకలోని కృష్ణరాజపురం వరకు ఈ రైలు నడవనుంది. వారానికి ఒకరోజు మాత్రమే నడిచే ఈ రైలు సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు భువనేశ్వర్‌లో బయల్దేరి మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంటకు కృష్ణరాజపురం చేరుకుంటుంది. మంగళవారం సాయంత్రం 4.05గంటలకు కృష్ణరాజ పురంలో బయలుదేరి బుధవారం సాయంత్రం 5.45 గంటలకు చేరుకుంటుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : హమ్ సఫర్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం
ఎప్పుడు : జూలై 13
ఎవరు : కేంద్ర రైల్వే మంత్రి సురేశ్ ప్రభు
ఎక్కడ : ఏపీ మీదుగా
శ్రీలంకలో ఏపీ ఇండస్ట్రియల్ పార్కు: చంద్రబాబు
ఫార్మా, టూరిజం, హార్టికల్చర్ రంగాల్లో కలిసి పనిచేయాలని శ్రీలంక, ఏపీ నిర్ణయించాయి. తమ దేశంలో పెట్టుబడులు పెట్టడానికి 600 ఎకరాల్లో ఏపీ కోసం ప్రత్యేకంగా పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేయనున్నట్లు శ్రీలంక ప్రకటించింది. శ్రీలంక నుంచి వచ్చిన పారిశ్రామిక ప్రతినిధుల బృందం జూలై 17న తాత్కాలిక సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ఈ పార్కులో ఫార్మా, టూరిజం, హార్టికల్చర్ ప్రాజెక్టులను అభివృద్ధి చేయాలని ప్రాధమికంగా నిర్ణయించామని, ఇందుకోసం త్వరలోనే ఒక ప్రతినిధి బృందాన్ని శ్రీలంకకు పంపనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు.
క్విక్ రివ్యూ: ఏమిటి : శ్రీలంకలో ఏపీ ఇండస్ట్రియల్ పార్కు
ఎప్పుడు : జూలై 17
ఎవరు : ఏపీ సీఎం చంద్రబాబు
ఎందుకు : ఫార్మా, టూరిజం, హార్టికల్చర్ రంగాల్లో కలిసి పనిచేయాలన్న నిర్ణయంలో భాగంగా
ఆర్థికంఉడాన్ సేవలు ప్రారంభించనున్న మరో రెండు ఎయిర్‌లైన్స్
ఉడాన్ (ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్) స్కీము కింద త్వరలో మరో రెండు సంస్థలు ప్రాంతీయ విమానయాన సేవలు (ఆర్‌సీఎస్) ప్రారంభించనున్నాయి. ఇందుకోసం విమానాలను సమకూర్చుకున్నట్లు ఎయిర్ ఒడిషా, ఎయిర్ డెక్కన్.. కేంద్రానికి తెలియజేశాయి. సెప్టెంబర్ ఆఖరు నుంచి సర్వీసులు ప్రారంభించే అవకాశాలున్నట్లు ఈ సంస్థలు తెలిపాయని కేంద్ర పౌర విమానయాన శాఖ వర్గాలు తెలిపాయి.
ఆర్‌సీఎస్ కింద మొత్తం 128 రూట్లు గుర్తించిన కేంద్రం విమానయాన సేవలకు అయిదు సంస్థలను ఎంపిక చేసింది. అలయన్స్ ఎయిర్, స్పైస్‌జెట్, టర్బోమేఘా ఇప్పటికే కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. కొత్తగా రాబోయే ఎయిర్ ఒడిషాకి 50 రూట్లు, ఎయిర్ డెక్కన్‌కి 34 రూట్లు దక్కాయి. రెండు సంస్థలు 19 సీట్ల సామర్థ్యం ఉండే ఆరు బీచ్‌క్రాఫ్ట్ బీ-1900డి విమానాలను సమకూర్చుకున్నాయి.
ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలకు కూడా విమాన సేవలను విస్తరించేలా.. కేంద్రం గంట పాటు ప్రయాణం ఉండే రూట్లలో టికెట్ చార్జీలు గరిష్టంగా రూ. 2,500కి పరిమితం చేసింది. విమానయాన సంస్థలు తమ విమానాల సీటింగ్ సామర్థ్యంలో 50 శాతం ఈ స్కీము కింద కేటాయించాల్సి ఉంటుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఉడాన్ సేవలు ప్రారంభించనున్న మరో రెండు ఎయిర్‌లైన్స్
ఎప్పుడు : జూలై 12
ఎవరు : ఎయిర్ ఒడిషా, ఎయిర్ డెక్కన్
జాతీయ మలేరియా నిర్మూలన ప్రణాళిక 2017-22జాతీయ మలేరియా నిర్మూలన ప్రణాళిక 2017-22ను కేంద్ర వైద్య శాఖ మంత్రి జేపీ నడ్డా జూలై 12న ఆవిష్కరించారు. 2027 నాటికి భారత్‌ను మలేరియా రహితంగా మార్చేందుకు కేంద్రం కృషి చేస్తుందని ఈ సందర్భంగా నడ్డా ప్రకటించారు. ఈ సారి ప్రణాళికల అమలులో భాగంగా జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రాలపై అధిక దృష్టి కేంద్రీకరిస్తామని చెప్పారు.
2030 నాటికి భారత్‌ను మలేరియా రహితంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఫ్రేమ్‌వర్క్ ఫర్ మలేరియా ఎలిమినేషన్ (NFME)ని 2016లో ప్రారంభించింది.
2017-22 ప్రణాళికలు
- మలేరియా వ్యాప్తిని గుర్తించే వ్యవస్థల బలోపేతం
- మలేరియా వేగంగా వ్యాప్తి చెందకుండా గుర్తించిన వెంటనే నిర్మూలించే వ్యవస్థల ఏర్పాటు
- Long Lasting Impregnated Nets ద్వారా మలేరియా నివారణపై అవగాహన
- దోమల నివారణకు వ్యవస్థల బలోపేతం
క్విక్ రివ్యూ:
ఏమిటి : జాతీయ మలేరియా నిర్మూలన ప్రణాళిక 2017-22
ఎప్పుడు : జూలై 12
ఎవరు : కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వశాఖ
ఎందుకు : మలేరియా నిర్మూలన కోసం
ఆరోగ్య ఖర్చులపై ఐసీఆర్‌డబ్ల్యూ సర్వే దేశంలో రానున్న ఏడేళ్లలో బాల్య వివాహాలు, కౌమార దశలోనే ప్రసవాలకు అడ్డుకట్టవేస్తే ఆరోగ్య సంబంధిత వ్యయాల్లో రూ.33,500 కోట్లు ఆదా అవుతాయని ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ పరిశోధక సంస్థ ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఉమెన్ (ఐసీఆర్‌డబ్ల్యూ) సర్వే వెల్లడించింది. ఈ మొత్తం 2017-18 కేంద్ర బడ్జెట్‌లో ఉన్నత విద్యకు కేటాయించిన నిధుల(రూ.33,329 కోట్లు)తో సమానం. అలాగే... 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 18 దేశాల్లో బాల్య వివాహాలు, కౌమార దశలోనే ప్రసవాలను నియంత్రించడం వల్ల రూ.1.14 లక్షల కోట్లు ఆదా అవుతాయని తెలిపింది. ఇందులో భారత్ నుంచి ఆదా అయ్యే మొత్తం సుమారు రూ.65,000 కోట్లు(62 శాతం) అని పేర్కొంది.
మొత్తంగా 106 దేశాల్లో బాల్య వివాహాలను తగ్గించడం వల్ల 2030 నాటికి ఏటా రూ.37 లక్షల కోట్లు ఆదా అవుతాయని వెల్లడించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : దేశంలో ఆరోగ్య ఖర్చులపై సర్వే
ఎప్పుడు : జూలై 15
ఎవరు : ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఉమెన్
2.5 కోట్లకు చేరిన ఉజ్వల లబ్ధిదారులుపేద మహిళలకు ఉచిత వంటగ్యాస్ అందించే ఉద్దేశంతో 2016 మేలో కేంద్రం ప్రారంభించిన ఉజ్వల ఎల్‌పీజీ పథకం 2.5 కోట్ల మందికి చేరువైంది. బెంగాల్‌కు చెందిన ఓ మహిళకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జూలై 15న ఇచ్చిన కనెక్షన్‌తో లబ్ధిదారుల సంఖ్య రెండున్నర కోట్లకు చేరింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఉజ్వల లబ్ధ్దిదారులు 2.5 కోట్లు
ఎప్పుడు : జూలై 15
ఎవరు : కేంద్ర పెట్రోలియం మంత్రిత్వశాఖ
ఎక్కడ : దేశవ్యాప్తంగా
జూన్‌లో 0.90 శాతంగా నమోదైనటోకు ద్రవ్యోల్బణంకూరగాయలు, ఆహార ఉత్పత్తుల ధరలు తగ్గడంతో టోకు ధరల సూచీ(డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 8 నెలల కనిష్టానికి చేరింది. జూన్‌లో డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం 0.90 శాతంగా నమోదైంది.
సైన్స్ అండ్ టెక్నాలజీ
అంటార్కిటికా నుంచి విడివడిన భారీ మంచు ఫలకం
అంటార్కిటికా ఖండం నుంచి ట్రిలియన్ (లక్ష కోట్ల) టన్నుల బరువైన మంచు ఫలకం విడివడిందని శాస్త్రవేత్తలు జూలై 12న వెల్లడించారు. దీంతో దక్షిణ ధ్రువం, పరిసర ప్రాంతాల్లో ప్రయాణిస్తున్న ఓడలు పెను ముప్పును ఎదుర్కొనే అవకాశం ఉందని హెచ్చరించారు. 5,800 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణం కలిగిన ఈ మంచుగడ్డ ఇప్పటి వరకు అంటార్కిటికా నుంచి వేరైన వాటిలో అతిపెద్దది.
జూలై 10 తర్వాత ఏదో ఓ సమయంలో ఇది లార్సెన్-సీ హిమపర్వతం నుంచి వేరుపడిందనీ, తత్ఫలితంగా లార్సన్-సీ విస్తీర్ణం 12 శాతం తగ్గిందని శాస్త్రవేత్తలు చెప్పారు. మంచుఫలకానికి ఏ68 అని పేరు పెట్టే అవకాశం ఉందనీ, అంటార్కిటికా ద్వీపకల్ప రూపురేఖలనే ఇది మార్చేసిందని వారు పేర్కొన్నారు. చిన్నచిన్న మంచుగడ్డలు అంటార్కిటికా నుంచి విడిపోవడం మామూలుగా జరిగేదే. అయితే ఇది భారీ మంచు ఫలకం కాబట్టి ఓడలకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంటుంది.
నాసా పరికరాలతో గుర్తింపు
మంచుగడ్డ విడిపోవడాన్ని నాసాకు చెందిన ఆక్వా మోడిస్ ఉపగ్రహ పరికరం ద్వారా గుర్తించిన శాస్త్రజ్ఞులు, సువోమి వీఐఐఆర్‌ఎస్ పరికరంతో నిర్ధారించారు. గత ఏడాది కాలంగా లార్సెన్-సీపై వస్తున్న పగుళ్లను యూరోపియన్ అంతరిక్ష సంస్థకు చెందిన ఉపగ్రహాల ద్వారా పరిశీలించారు. ఈ మంచుగడ్డ హిమకొండ నుంచి విడిపోతుందని శాస్త్రవేత్తలు అప్పుడే గుర్తించారు.
లార్సెన్-బీ మంచుకొండలో కూడా 1995లో పగుళ్లు ఏర్పడి మంచుగడ్డలు విడివడి 2002 నాటికి చాలా చిన్నదైపోయిందనీ, ఇప్పుడు లార్సెన్-సీ కూడా అలాగే అవ్వొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అంటార్కిటికా నుంచి విడివడిన భారీ మంచు ఫలకం
ఎప్పుడు : జూలై 10
ఎవరు : నాసా
ఎక్కడ : అంటార్కిటికా
గెలాక్సీల మహా సమూహం గుర్తించిన శాస్త్రవేత్తలుభారత ఖగోళ శాస్త్రవేత్తలు గెలాక్సీల మహా సమూహాన్ని గుర్తించారు. సుమారు 20 మిలియన్ బిలియన్ సూర్యుళ్లకు సమానమైన దీనికి సరస్వతిగా నామకరణం చేసినట్లు పుణేలోని ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆో్టన్రమీ అండ్ ఆో్టఫ్రిజిక్స్ వెల్లడించింది. సమీప విశ్వాంతరాళంలో మనకు తెలిసిన అతిపెద్ద గెలాక్సీల్లో ఇదీ ఒకటని, 10 బిలియన్ ఏళ్ల వయసున్న ఈ సమూహం భూమికి 4 వేల మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నట్లు పేర్కొంది. ఇది సుమారు 600 మిలియన్ కాంతి సంవత్సరాల పరిధిలో విస్తరించినట్లు వెల్లడించింది. గోడలాగా కనిపించే ఈ సమూహాన్ని స్లోవాన్ డిజిటల్ స్కై సర్వే ద్వారా చూడొచ్చు. ఇదే సంస్థకు చెందిన పరిశోధకులు గతేడాది గురుత్వాకర్షణ తరంగాలను కనుగొనడంలోనూ ముఖ్య పాత్ర పోషించారు. ఒక సమూహంలో 1000- 10 వేల దాకా గెలాక్సీలుంటాయి. మహా సమూహంలో అయితే అలాంటి సమూహాలు దాదాపు 43 ఉంటాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మహా గెలాక్సీల సమూహం గుర్తింపు
ఎప్పుడు : జూలై 13
ఎవరు : ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆో్టన్రమీ అండ్ ఆో్టఫ్రిజిక్స్
ఎక్కడ : పూణె
ఉలవ పంటలకు 4 వేల ఏళ్లుదక్షిణ భారతదేశంలో క్రీస్తుశకం రెండు వేల సంవత్సరాల నుంచి ఉలవ పంటల సాగు ఉండేదని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ శాస్త్రవేత్తలు గుర్తించారు. హై రెజల్యూషన్ ఎక్స్‌రే కంప్యూటెడ్ టోమోగ్రఫీ పద్ధతి ద్వారా పురాతనమైన ఉలవ విత్తనాలను పరిశీలించి ఈ అంచనాకు వచ్చినట్లు ఈ పరిశోధనల్లో పాలుపంచుకున్న శాస్త్రవేత్త డోరియన్ ఫుల్లర్ తెలిపారు. పంటల సాగుకు ముందు విత్తనాల్లోని ఒక పొర చాలా మందంగా ఉంటే.. మానవులు సాగు మొదలు పెట్టిన తర్వాత అది పలచబడుతూ ఉంటుంది. నీళ్లు పోయగానే.. తొందరగా మొలకెత్తుతుంది కాబట్టి విత్తన పొర మందం తగ్గుతూ వస్తుంది. ఈ అంశం ఆధారంగా శాస్త్రవేత్తలు ఉలవ విత్తనాలపై పరిశోధనలు జరిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఉలవ పంటకు 4 వేల ఏళ్లు
ఎప్పుడు : జూలై 14
ఎవరు : యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్
ఎందుకు : 4వేల ఏళ్ల కిందటి నుంచి ఉలవ సాగు ఉందని గుర్తింపు
సూర్యుడు ఉన్నంతకాలం జీవించే టార్డిగ్రేడ్ సూర్యుడు ఉన్నంతకాలం జీవించే ఎనిమిది కాళ్ల టార్డిగ్రేడ్ అనే సూక్ష్మ జంతువు ఒకటుందని బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు గుర్తించారు. ఇది సూర్యుడు మరణించే వరకు జీవించి ఉండగలదని, ప్రపంచంలోనే నాశనం కాని జీవుల్లో ఇది ఒకటని పరిశోధకులు తెలిపారు. ఖగోళ విపత్తులను సైతం ఎదుర్కొని సుమారు పది బిలియన్ సంవత్సరాలు బతుకుతుందని అంతేకాకుండా 30 ఏళ్ల పాటు నీరు, ఆహారం లేకుండా, 150 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద కూడా ఇది జీవించగలదని, అలాగే ఇతర గ్రహాలపై కూడా జీవించే అవకాశం ఉందని తెలిపారు. నీటి ఎలుగుబంటిగా పిలిచే ఈ జంతువు పరిమాణం కేవలం 0.5 మిల్లిమీటర్ మాత్రమేనని, మైక్రోస్కోప్‌లో దీన్ని స్పష్టంగా చూడవచ్చని వివరించారు.
క్విక్ రివ్యూ: ఏమిటి : సూర్యుడు ఉన్నంత కాలం జీవించే జీవి - టార్డిగ్రేడ్
ఎప్పుడు : జూలై 15
ఎవరు : ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు
ఎక్కడ : బ్రిటన్
కజకిస్థాన్‌లో యురేనియం బ్యాంక్కజకిస్థాన్‌లోని ఒస్కెమెన్ నగరంలో యురేనియం బ్యాంకును ఏర్పాటు చేయాలని ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ(ఐఏఈఏ) జూలై 10న నిర్ణయించింది. అణు రియాక్టర్లలో వాడే యురేనియంను సోవియట్ యూనియన్ కాలం నాటి కర్మాగారంలో భద్రపరచనున్నారు. ఈ బ్యాంకు నుంచి ఐఏఈఏ సభ్యదేశాలు మార్కెట్ ధరకు యురేనియంను పొందవచ్చు. అసాధారణ పరిస్థితుల్లో తమ అణుకర్మాగారాలకు ఇంధన సరఫరా ఆగిపోయినప్పుడు ఆయా దేశాలకు ఇది ఉపయోగపడుతుందని ఐఏఈఏ పేర్కొంది.
క్రీడలు
మహిళల వన్డే క్రికెట్‌లో మిథాలీ అత్యధిక పరుగుల రికార్డు భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా రికార్డు సాధించింది. 183 వన్డేల్లో ఆమె 6,028 పరుగులు సాధించింది. చార్లోటి ఎడ్వర్డ్స్ (ఇంగ్లండ్) పేరిట ఇంత కాలం ఉన్న 5,992 పరుగుల రికార్డును మిథాలీ అధిగమించింది. ఎడ్వర్డ్స్ 180 ఇన్నింగ్‌సలలో ఈ రికార్డు సాధించగా, మిథాలీకి 164 ఇన్నింగ్‌సలు మాత్రమే సరిపోయాయి. ఈ క్రమంలో మహిళల వన్డేల్లో 6 వేల పరుగులు చేసిన తొలి క్రీడాకారిణిగా కూడా మిథాలీ గుర్తింపు తెచ్చుకుంది.
35 ఏళ్ల మిథాలీ రాజ్ 1999 జూన్ 26న ఐర్లాండ్‌తో తొలి వన్డే మ్యాచ్ ఆడింది. 106 మ్యాచ్‌లలో ఆమె జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడం విశేషం. వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ భారత్‌కే చెందిన జులన్ గోస్వామి (189) పేరిట రికార్డు ఉండగా, ఇప్పుడు బ్యాట్స్‌మన్ జాబితాలో కూడా భారతీయురాలే అగ్రస్థానానికి చేరింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మహిళల వన్డే క్రికెట్ అత్యధిక పరుగుల రికార్డు
ఎప్పుడు : జూలై 12
ఎవరు : మిథాలీ రాజ్
జావెలిన్ త్రోలో సుందర్ సింగ్‌కు స్వర్ణంలండన్‌లో జరిగిన ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పురుషుల ఎఫ్-46 జావెలిన్ త్రో ఈవెంట్‌లో సుందర్ సింగ్ గుర్జర్ స్వర్ణం గెలుచుకున్నాడు. జూలై 15న జరిగిన ఈవెంట్‌లో సుందర్ ఈటెను 60.36 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు.
క్విక్ రివ్యూ: ఏమిటి : పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్
ఎప్పుడు : జూలై 15
ఎవరు : జావెలిన్‌త్రోలో సుందర్‌సింగ్ కు స్వర్ణం
ఎక్కడ : లండన్
విక్టోరియా ఓపెన్ టోర్నీ విజేత హరీందర్ఆస్ట్రేలియాలో జరిగిన విక్టోరియా ఓపెన్ టోర్నీ టైటిల్‌ను భారత స్క్వాష్ ప్లేయర్ హరీందర్ పాల్ సంధూ కైవసం చేసుకున్నాడు. జూలై 16న జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో మూడో సీడ్ సంధూ 12-14, 11-3, 11-4, 11-7తో టాప్ సీడ్, స్థానిక ప్లేయర్, రెక్స్ హెండ్రిక్స్‌పై విజయం సాధించి టైటిల్‌ను గెలుచుకున్నాడు. గతవారం సౌత్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను సంధూ నెగ్గాడు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : విక్టోరియా స్క్వాష్ ఓపెన్ టోర్నమెంట్
ఎప్పుడు : జూలై 16
ఎవరు : విజేత హరీందర్ పాల్ సంధూ
ఎక్కడ : ఆస్ట్రేలియా
వింబుల్డన్ మహిళల సింగిల్స్ విజేత ముగురుజా వింబుల్డన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను స్పెయిన్ స్టార్ గార్బిన్ ముగురుజా దక్కించుకుంది. జూలై 15న జరిగిన ఫైనల్లో అమెరికాకు చెందిన వీనస్ విలియమ్స్‌ను ఓడించి టైటిల్ సొంతం చేసుకుంది. విజేతగా నిలిచిన ముగురుజాకు 22 లక్షల పౌండ్లు (రూ. 18 కోట్ల 53 లక్షలు), రన్నరప్ వీనస్‌కు 11 లక్షల పౌండ్లు (రూ. 9 కోట్ల 26 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వింబుల్డన్ - 2017
ఎప్పుడు : జూలై 15
ఎవరు : మహిళల సింగిల్స్ విజేత ముగురుజా
వింబుల్డన్ పురుషుల సింగిల్స్ విజేత ఫెడరర్ వింబుల్డన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను స్విట్జర్లాండ్‌కు చెందిన రోజర్ ఫెడరర్ సొంతం చేసుకున్నాడు. జూలై 16న జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంకర్, మూడోసీడ్ ఫెడరర్ 6-3, 6-1, 6-4తో ప్రపంచ ఆరో ర్యాంకర్, ఏడోసీడ్ మారిన్ సిలిచ్ (క్రొయేషియా)పై విజయం సాధించాడు. తద్వారా ఓపెన్ శకంలో వింబుల్డన్‌ను అత్యధికంగా ఎనిమిది సార్లు నెగ్గిన ప్లేయర్‌గా రికార్డులకెక్కాడు.
క్విక్ రివ్యూ: ఏమిటి : వింబుల్డన్ - 2017
ఎప్పుడు : జూలై 16
ఎవరు : పురుషుల సింగిల్స్ విజేత - ఫెడరర్
జాతీయ అథ్లెటిక్స్‌లో ఓవరాల్ చాంప్ కేరళ ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో జరిగిన జాతీయ సీనియర్ అంతర్ రాష్ట్ర అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో కేరళ జట్టు ఓవరాల్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. కేరళ 159 పాయింట్లతో తొలి స్థానంలో నిలవగా.. 110 పాయింట్లతో తమిళనాడు రెండో స్థానంలో, 101.500 పాయింట్లతో హరియాణా మూడో స్థానంలో నిలిచాయి. ఒక స్వర్ణం, మూడు రజతాలు గెలిచిన ఆతిథ్య ఆంధ్రప్రదేశ్ జట్టు 42.500 పాయింట్లతో తొమ్మిదో స్థానంతో, ఒక కాంస్య పతకం సాధించిన తెలంగాణ ఐదు పాయింట్లతో 20వ స్థానంతో సరిపెట్టుకున్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జాతీయ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ - 2017
ఎప్పుడు : జూలై 18
ఎవరు : ఓవరాల్ చాంపియన్ కేరళ
ఎక్కడ : గుంటూరు, ఆంధ్రప్రదేశ్
భారత్ క్రికెట్ జట్టు బౌలింగ్ కోచ్‌గా భరత్ అరుణ్ భారత క్రికెట్ జట్టు బౌలింగ్ కోచ్‌గా భరత్ అరుణ్ ఎంపికయ్యారు. ఇప్పటి వరకు బ్యాటింగ్ కోచ్‌గా పని చేస్తున్న సంజయ్ బంగర్‌కు అసిస్టెంట్ కోచ్ హోదా దక్కగా.. ఆర్. శ్రీధర్ ఫీల్డింగ్ కోచ్‌గా కొనసాగుతారు. జూలై 18న బీసీసీఐ ఈ ఎంపికను ప్రకటించింది. హెడ్ కోచ్ రవిశాస్త్రితో పాటు ఈ ముగ్గురి పదవీ కాలం కూడా 2019 వన్డే వరల్డ్ కప్ వరకు ఉంటుంది. గతంలో రవిశాస్త్రి డెరైక్టర్‌గా ఉన్న సమయంలో కూడా ఈ ముగ్గురే ఆయనతో కలిసి పని చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్ క్రికెట్ జట్టు హెడ్ కోచ్ సహాయక సిబ్బంది
ఎప్పుడు : జూలై 18
ఎవరు : బౌలింగ్ కోచ్ - భరత్ అరుణ్, అసిస్టెంట్ కోచ్ - సంజయ్ బంగర్, ఫీల్డింగ్ కోచ్- ఆర్.శ్రీధర్
బ్రిటిష్ గ్రాండ్ ప్రి టైటిల్ నెగ్గిన హామిల్టన్
ఫార్ములావన్ బ్రిటిష్ గ్రాండ్ ప్రి టైటిల్‌ను లూయిస్ హామిల్టన్ వరుసగా నాలుగోసారి సొంతం చేసుకున్నాడు. సిల్వర్‌స్టోన్(బ్రిటన్) లో జూలై 16న జరిగిన రేసులో హామిల్టన్ మొదటి స్థానంలో నిలవగా, వాల్టేరి బొట్టాస్ రెండో స్థానం సాధించాడు.
వార్తల్లో వ్యక్తులు
ముస్లిం రిజర్వేషన్లపై షబ్బీర్ అలీ పుస్తకం ముస్లిం రిజర్వేషన్లపై తెలంగాణ శాసనమండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ రచించిన ‘ముస్లిం తహఫుజాహత్ జిద్దొ జెహాత్’ పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ ఆవిష్కరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ముస్లిం మైనారిటీలకు రిజర్వేషన్లు అమలు చేయడంవల్ల కలిగిన ప్రయోజనాలను షబ్బీర్ అలీ ఈ పుస్తకంలో పొందుపరిచారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ముస్లిం తహఫుజాహత్ జిద్దొ జెహాత్ పుస్తకం
ఎప్పుడు : జూలై 12
ఎవరు : షబ్బీర్ అలీ
ఎక్కడ : న్యూఢిల్లీలో
ఎందుకు : ముస్లిం రిజర్వేషన్లపై
నోబెల్ గ్రహీత లియు జియావోబో కన్నుమూతచైనా ప్రభుత్వ నిర్బంధంలో ఉన్న నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, మానవ హక్కుల కార్యకర్త లియు జియావోబో(61) జూలై 13న మృతి చెందారు. ఆయన కొంత కాలంగా కాలేయ కేన్సర్‌తో బాధపడుతున్నారు. నెల క్రితమే ఆయన్ని జైలు నుంచి ఆసుపత్రికి తరలించారు. విదేశాల్లో వైద్యం పొందేందుకు లియుని విడుదల చేయాలన్న అంతర్జాతీయ సమాజం విన్నపాలను చైనా తిరస్కరిస్తూ వచ్చింది.
మానవ హక్కులను పరిరక్షించాలని, చైనా రాజకీయ వ్యవస్థలో సంస్కరణలు కోరుతూ ‘చార్టర్ 8’ని రచించినందుకు ఆయన్ని 2008లో అరెస్ట్ చేశారు. 2009లో 11 ఏళ్ల జైలు శిక్షను ఖరారు చేశారు. 1989లో తియనాన్మెన్ స్క్వేర్ నిరసనల్లో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు. 2010లో నోబెల్ ప్రదానోత్సవ కార్యక్రమానికీ లియుని హాజరు కానీయలేదు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నోబెల్ గ్రహీత లియు జియావోబో కన్నుమూత
ఎప్పుడు : జూలై 13
ఎక్కడ : చైనాలో
యూనిసెఫ్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా లిల్లీ సింగ్యునిసెఫ్ గ్లోబల్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా యూట్యూబ్ స్టార్, సూపర్ ఉమన్‌గా పేరు పొందిన భారత సంతతికి చెందిన కెనడా యువతి లిల్లీ సింగ్ (28) నియమితులయ్యారు. ‘గర్ల్ లవ్’ పేరుతో లిల్లీ సింగ్ బాలల హక్కులపై అనేక రకాల వీడియోలను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసి లక్షలాది మందికి చేరువయ్యారు. యునిసెఫ్ ‘యూత్ ఫర్ చేంజ్’ కార్యక్రమంలో భాగంగా బాల కార్మిక వ్యవస్థ, లింగ సమానత్వం వంటి సమస్యలపై ఆమె అవగాహన కల్పించనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : యునిసెఫ్ అంబాసిడర్
ఎప్పుడు : జూలై 15
ఎవరు : లిల్లీ సింగ్
ఎందుకు : యూత్ ఫర్ చేంజ్ కార్యక్రమం ద్వారా అవగాహన కల్పించేందుకు
ఎన్‌డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యనాయుడు ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఎం.వెంకయ్యనాయుడు(68) పోటీ చేయనున్నారు. ఈ మేరకు ఆయనను తమ అభ్యర్థిగా నిర్ధారిస్తూ జూలై 17న బీజేపీ పార్లమెంటరీ పార్టీ నిర్ణయం తీసుకుంది. విపక్షాల అభ్యర్థి గోపాలకృష్ణ గాంధీని ఎదుర్కొనేందుకు రాజకీయ, పరిపాలన రంగాల్లో విశేష అనుభవమున్న వెంకయ్యే సరైన వ్యక్తి అని పార్టీ భావించినట్లు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వెల్లడించారు.
ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ వేసే ముందే వెంకయ్య కేంద్ర ప్రభుత్వ పదవులు, పార్టీకి రాజీనామా చేశారు. ఆయన ఎన్డీఏ ప్రభుత్వంలో సమాచార, ప్రసారశాఖతోపాటు గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎన్‌డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి
ఎప్పుడు : జూలై 17
ఎవరు : ఎం. వెంకయ్యనాయుడు
టీఎస్ అడ్వొకేట్ జనరల్‌గా దేశాయ్ ప్రకాశ్‌రెడ్డితెలంగాణ రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ)గా దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి నియమితులయ్యారు. ఆయన నియామకానికి గవర్నర్ నరసింహన్ ఆమోదముద్ర వేయడంతో న్యాయశాఖ జూలై 17న ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ విశ్వాసం ఉన్నంత వరకు ఆయన ఏజీగా కొనసాగుతారు. ప్రకాశ్‌రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి రెండవ అడ్వకేట్ జనరల్. రాష్ట్ర మొదటి ఏజీగా రామకృష్ణారెడ్డి సేవలు అందించారు.
ప్రకాశ్‌రెడ్డి వనపర్తి జిల్లా అమరచింత గ్రామంలో 1955 డిసెంబర్ 31న మురళీధర్‌రెడ్డి, అనసూయాదేవి దంపతులకు జన్మించారు. 1977లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి లా పట్టా పొందారు. 1998 వరకు సుప్రీం కోర్టులో ప్రాక్టీస్ చేసి తర్వాత తిరిగి హైకోర్టుకు వచ్చారు. 1998లో ఉమ్మడి రాష్ట్రంలో అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ)గా నియమితులయ్యారు. 2004 మే వరకు ఆ పోస్టులో కొనసాగారు. 2000 సంవత్సరంలో హైకోర్టు ఆయనకు సీనియర్ హోదా ఇచ్చింది. అలాగే హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడిగా కూడా ఆయన పనిచేశారు. తెలంగాణ ఉద్యమంలోనూ ప్రకాశ్‌రెడ్డి కీలకపాత్ర పోషించారు.
క్విక్ రివ్యూ: ఏమిటి : రాష్ట్రానికి నూతన ఏజీ
ఎప్పుడు : జూలై 17
ఎవరు : దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి
ఎక్కడ : తెలంగాణలో
అతితక్కువ ప్రజాదరణ పొందిన ట్రంప్మొదటి 6 నెలల పాలనలో అతి తక్కువ ప్రజాదరణ పొందిన అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రికార్డు సృష్టించారు. ‘వాషింగ్టన్ పోస్ట్-ఏబీసీ న్యూస్’ నిర్వహించిన సర్వేలో ట్రంప్‌కు కేవలం 36 శాతం అమెరికన్లే మద్దతు తెలిపారు. గత 70 ఏళ్లలో ఇదే అతి తక్కువని ఏబీసీ న్యూస్ పేర్కొంది.
ట్రంప్ 100 రోజుల పాలనపై ‘వాషింగ్టన్ పోస్ట్-ఏబీసీ న్యూస్’ నిర్వహించిన సర్వేలో 42 శాతం ప్రజాదరణ దక్కగా 80 రోజుల వ్యవధిలో అది 6 శాతం తగ్గింది. దాదాపు 48 శాతం అమెరికన్లు ట్రంప్ నిర్ణయాల్ని తీవ్రంగా తప్పుపట్టారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : డొనాల్డ్ ట్రంప్‌కు అతి తక్కువ ప్రజాదరణ
ఎప్పుడు : జూలై 17
ఎవరు : వాషింగ్టన్ - ఏబీసీ న్యూస్
ఎక్కడ : అమెరికాలో
ఐటీబీపీ డీజీగా ఆర్‌కే పచ్‌నంద ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ) 29వ డెరైక్టర్ జనరల్‌గా 1983 బ్యాచ్ ఐపీఎస్ అధికారి ఆర్‌కే పచ్‌నంద జూలై 17న బాధ్యతలు చేపట్టారు. తద్వారా అన్ని కేంద్ర బలగాల్లో పనిచేసిన అధికారిగా ఆయన గుర్తింపు పొందారు. ఆయన ఇంతకముందు బీఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్, సీఐఎస్‌ఎఫ్, ఎస్‌పీజీ, ఎన్‌డీఆర్‌ఎఫ్, సీబీఐ సంస్థల్లో పనిచేశారు. పచ్‌నంద కన్నా ముందు కృష్ణ చౌదరి ఐటీబీపీ డీజీగా పనిచేశారు.
పచ్‌నంద రచించిన "Terrorism and Response to Terrorist Threat" పుస్తకం 2001లో అత్యధికంగా అమ్ముడైన పుస్తకాల్లో ఒకటిగా నిలిచింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐటీబీపీకి నూతన డీజీ
ఎప్పుడు : జూలై 17
ఎవరు : ఆర్‌కే పచ్‌నంద

- ఉత్తమ నటుడు: షాహిద్ కపూర్ (ఉడ్తా పంజాబ్)
- ఉత్తమ నటి: అలియా భట్(ఉడ్తా పంజాబ్)
- ఉత్తమ చిత్రం: నీర్జా
- ఉత్తమ నటుడు(కామిక్): వరుణ్ ధావన్(డిష్యూం)
- ఉత్తమ ప్రతినాయకుడు: జిమ్ సర్బ్(నీర్జా)
- ఉత్తమ నటి(తొలి పరిచయం): దిశా పటానీ(ఎం.ఎస్. ధోని)
- ఉత్తమ నటుడు (తొలి పరిచయం): దిల్జిత్ దొసాంజ్
- ఉత్తమ సహాయనటి: షబానా అజ్మీ(నీర్జా)
- ఉత్తమ సహాయనటుడు: అనుపమ్ ఖేర్(ఎం.ఎస్. ధోని)
- ఉత్తమ దర్శకుడు: అనిరుధ్ రాయ్ చౌదరి(పింక్)
- ఉత్తమ సంగీత దర్శకుడు: ప్రీతమ్(యే దిల్‌హై ముష్కిల్)
- ఉత్తమ గేయరచయిత: అమితాబ్ భట్టాచార్య
- ఉత్తమ గాయకుడు: అమిత్ మిశ్రా
- ఉత్తమ గాయని: తులసీ కుమార్
- స్టైల్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్: అలియా భట్
- ఉమన్ ఆఫ్ ది ఇయర్: తాప్సి
ఏమిటి : ఐఫా అవార్డులు - 2017
ఎప్పుడు : జూలై 15
ఎవరు : ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ
ఎక్కడ : న్యూయార్క్, అమెరికా
చరిత్రలో ఈ నెల జూలై 2017
అంతర్జాతీయంఉగ్ర ఆశ్రయ దేశాల జాబితాలో పాకిస్తాన్ పాకిస్తాన్‌ను ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న దేశాలు, ప్రాంతాల జాబితాలో అమెరికా చేర్చింది. జాబితాలో అఫ్ఘానిస్తాన్, సోమాలియా, ఈజిప్టు, లెబనాన్, దక్షిణ ఫిలిప్పీన్‌స, కొలంబియా, వెనిజులా తదితర దేశాలు కూడా ఉన్నాయి.
పాక్‌లో 2016 నుంచి లష్కరే తోయిబా, జైషే మహ్మద్ వంటి సంస్థలు ఉగ్ర కార్యకలాపాలు, శిక్షణ, నిధుల సేకరణ కొనసాగిస్తున్నా పాకిస్తాన్ గట్టి చర్యలు తీసుకోలేదని ఉగ్రవాదంపై అమెరికా విదేశాంగ శాఖ రూపొందించిన వార్షిక నివేదిక ఆక్షేపించింది. పాక్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాదులతోపాటు మావోయిస్టుల నుంచి కూడా భారత్ దాడులు ఎదుర్కొంటోందని ఈ నివేదిక పేర్కొంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఉగ్రవాద ఆశ్రయ దేశాల్లో పాకిస్తాన్‌ను చేర్చడం
ఎప్పుడు : జూలై 19
ఎవరు : అమెరికా
ఎందుకు : అఫ్ఘాన్ తాలిబాన్, హక్కానీ, లష్కరే, జైషే వంటిఉగ్రసంస్థలపై గట్టి చర్యలు తీసుకోనందుకు
పాక్‌కు సాయంలో కోతపెట్టిన అమెరికా హక్కానీ నెట్‌వర్క్‌పై సమర్థవంతంగా పోరాడలేదని ఆరోపిస్తూ సంకీర్ణ సాయం కింద పాకిస్తాన్‌కు అందిస్తున్న 90కోట్ల డాలర్లలో 35కోట్ల డాలర్లకు అమెరికా కోతపెట్టింది. హక్కానీ ఉగ్రవాదులను నిర్మూలించడానికి పాక్ తీసుకున్న చర్యలపై తాను సంతృప్తిగా లేనని అమెరికా రక్షణ కార్యదర్శి జేమ్స్ మాటిస్ కాంగ్రెస్ డిఫెన్‌స కమిటీకి తెలపడంతో పెంటగాన్ ఈ నిర్ణయం తీసుకుంది. అఫ్గానిస్తాన్, పాక్‌ల విషయంలో అమెరికా విదేశాంగ విధానాన్ని ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ సమీక్షించనున్న తరుణంలో సాయాన్ని నిలిపివేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పాక్‌కు సాయంలో కోత
ఎప్పుడు : జూలై 21
ఎవరు : అమెరికా
ఎందుకు : హక్కానీ నెట్‌వర్క్‌పై సమర్థవంతంగా పోరాడలేదని ఆరోపిస్తూ
అంతర్జాతీయ సోలార్ కూటమిలో చేరిన ఆస్ట్రేలియా అంతర్జాతీయ సోలార్ కూటమి(ఐఎస్‌ఏ)లో సభ్యదేశంగా ఆస్ట్రేలియా చేరింది. తద్వారా ఈ కూటమిలో చేరిన 35వ దేశంగా ఆస్ట్రేలియా గుర్తింపు పొందింది. అన్ని రంగాల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తి, నిల్వ కోసం 2030 నాటికి వెయ్యి బిలియన్ డాలర్ల నిధుల సమీకరణే లక్ష్యంగా ఐఎస్‌ఏ ఏర్పాటైంది. భారత్, ఫ్రాన్స్ ఈ కూటమిగా నేతృత్వం వహిస్తున్నాయి.
2015 నవంబర్‌లో పారిస్‌లో జరిగిన 21వ కాప్ సదస్సులో పాల్గొన్న ప్రధాని నరేంద్రమోదీ ఐఎస్‌ఏను ప్రారంభించారు. భారత్ ఈ నిధికి 1 మిలియన్ డాలర్లు ఇస్తుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐఎస్‌ఏలో చేరిన 35వ దేశం
ఎప్పుడు : జూలై 21
ఎవరు : ఆస్ట్రేలియా
ఎందుకు : సోలార్ విద్యుత్ ఉత్పత్తికి నిధుల సమీకరణ కోసం
జాతీయందేశంలో రెండు టైమ్‌జోన్ల అమలు పరిశీలనదేశంలో రెండు వేర్వేరు టైమ్‌జోన్ల అమలు అంశాన్ని పరిశీలిస్తున్నట్లు కేంద్రం జులై 19న లోక్‌సభలో తెలిపింది. తూర్పు, పశ్చిమ ప్రాంతాల్లో సూర్యోదయమయ్యే సమయాల్లో సుమారు 2 గంటల వ్యత్యాసం ఉంది. కాబట్టి రెండు భిన్న టైమ్ జోన్లు అమలుచేస్తే 2.7 బిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా అవుతుందని, కార్యాలయాల పనితీరు మెరుగుపడుతుందని బీజేడీ సభ్యుడు బి.మెహతబ్ లేవనెత్తిన అంశంపై ఈ మేరకు వివరణ ఇచ్చింది. ప్రస్తుతం దేశ ప్రామాణిక సమయాన్ని నిర్వచిస్తున్న 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని అరగంట ముందుకు జరిపితే అస్సాం-పశ్చిమ బెంగాల్ సరిహద్దు సమీపంలోని 90 డిగ్రీల తూర్పు రేఖాంశం ప్రామాణికం కానుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : దేశంలో రెండు టైం జోన్ల అమలు పరిశీలన
ఎప్పుడు : జూలై 19
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎందుకు : బీజేడీ సభ్యుడు బి.మెహతబ్ లేవనెత్తిన అంశంపై
‘ఆహార భద్రత’కు సుప్రీం కోర్టు ఆదేశాలుజాతీయ ఆహార భద్రతా చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి సుప్రీం కోర్టు కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. ఆగస్టు 31లోగా వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ కార్యదర్శి.. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సంబంధిత కార్యదర్శులతో కనీసం ఒకసారైనా సమావేశమై చట్టం అమలవుతున్న తీరును సమీక్షించాలని పేర్కొంది. ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటుచేసేలా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఒప్పించాలని సూచించింది. ఆహార కమిషన్‌లను ఏడాదిలోగా ఏర్పాటు చేసేలా అన్ని రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించాలని కోరింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆహార భద్రత అమలుకు ఆదేశాలు
ఎప్పుడు : జూలై 21
ఎవరు : సుప్రీంకోర్టు
భారత్‌కు ‘మిగ్-35’ యుద్ధ విమానాలు భారత్‌కు మిగ్-35 యుద్ధ విమానాలు అమ్మేందుకు ఆసక్తిగా ఉన్నామని రష్యా ప్రకటించింది. ఈ అంశంపై భారత్‌తో చర్చలు కొనసాగిస్తున్నామని, భారత్ కూడా ఆసక్తిగా ఉందని మిగ్ కార్పొరేషన్ చీఫ్ ఇల్యా టారసెంకో తెలిపారు. రష్యా రూపొందించిన అత్యాధునిక 4++ జనరేషన్ యుద్ధ విమానాలే మిగ్ 35. దాదాపు 50 ఏళ్లుగా భారత్ రష్యాకు చెందిన మిగ్ విమానాల్ని వినియోగిస్తోంది.
మిగ్ -35 ప్రత్యేకతలు
ఏమిటి : భారత్‌కు మిగ్-35 యుద్ధ విమానాల సరఫరా
ఎప్పుడు : జూలై 23
ఎవరు : రష్యా
ప్రతి పదినిమిషాలకో సైబర్ నేరం: సెర్ట్ ఇన్భారత్‌లో సగటున ప్రతి పది నిమిషాలకు ఒక సైబర్ నేరం నమోదైనట్లు కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్‌స టీమ్ (సీఈఆర్‌టీ-ఇన్) తెలిపింది. 2016లో సగటున ప్రతి 12 నిమిషాలకు ఒక నేరం జరిగేదని ప్రస్తుతం ఆ సంఖ్య పెరిగిందని సెర్ట్ నివేదిక పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం 2017 జనవరి నుంచి జూన్ మధ్య ఫిషింగ్, నెట్‌వర్క్ స్కానింగ్, సైట్లలోకి చొరబాటు, వైరస్, ర్యాన్సమ్‌వేర్ వంటి తదితర మొత్తం 27,482 సైబర్ కేసులు నమోదయ్యాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సైబర్ కేసుల్లో పెరుగుదల
ఎప్పుడు : 2017 ప్రథమార్థంలో
ఎవరు : సెర్ట్-ఇన్
ఎక్కడ : భారత్‌లో
మహిళా ఉద్యోగుల కోసం షీ బాక్సుకేంద్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగుల రక్షణ కోసం కేంద్రం షీ బాక్స్ (సెక్సువల్ హరాస్‌మెంట్ ఎలక్ట్రానిక్ బాక్సు) పేరుతో ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫాం ప్రారంభించింది. కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ వెబ్‌సైట్‌లో ఉండే ఈ బాక్స్ ద్వారా పనిచేసే ప్రాంతాల్లో మహిళలు ఎదుర్కొనే లైంగిక వేధింపులపై ఫిర్యాదులు చేయవచ్చు. మొదట దీన్ని ప్రభుత్వరంగ సంస్థలకు మాత్రమే వర్తింపచేస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కేంద్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగుల కోసం షీ బాక్స్
ఎప్పుడు : జూలై 24
ఎక్కడ : ఆన్‌లైన్‌లో
ఎందుకు : పనిచేసే ప్రాంతాల్లో లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు
వందేమాతరం తప్పనిసరి : మద్రాస్ హైకోర్టు తమిళనాడులోని పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ సంస్థలు, పరిశ్రమలలో తప్పనిసరిగా వందేమాతర గేయాన్ని ఆలపించాలని మద్రాస్ హైకోర్టు తీర్పు వెలువరించింది. పాఠశాలల్లో సోమ, శుక్రవారం అలాగే కార్యాలయాల్లో నెలకు ఒకసారి తప్పనిసరిగా పాడాలని న్యాయమూర్తి ఎంవీ మురళీధరన్ తీర్పులో స్పష్టం చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు తమ విద్యార్థులతో వారానికి రెండుసార్లు జాతీయ గేయాన్ని ఆలపించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంతేకాదు ఇతర ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు కూడా నెలకు ఒకసారైనా వినిపించాలని అన్నారు. బెంగాలీ, సంస్కృతంలో పాడటం కష్టంగా ఉంటే దాన్ని తమిళంలోకి తర్జుమా చేయాలన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వందేమాతరం తప్పనిసరిగా ఆలపించాలి
ఎప్పుడు : జూలై 25
ఎవరు : మద్రాస్ హైకోర్టు
ఎక్కడ : పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు సంస్థలు, పరిశ్రమలు
పెట్టుబడులకు అనువైన రాష్ట్రంగా గుజరాత్పెట్టుబడులు పెట్టేందుకు అనువైన రాష్ట్రాల జాబితాను నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకన మిక్ రీసెర్చ్ (ఎన్‌సీఏఈఆర్) జూలై 18న ప్రకటించింది. మొత్తం 20 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం(ఢిల్లీ)తో రూపొందిం చిన ఈ జాబితాలో గుజరాత్‌కు మొదటి స్థానం దక్కింది. ఢిల్లీ రెండో స్థానంలో నిల వగా; ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు మూడు, ఐదు స్థానాలు లభించాయి. వీటితో పాటు హరియాణా(4), తమిళనాడు(6), కేరళ(7), కర్ణాటక(9), మధ్యప్రదేశ్(10).. టాప్ 10లో నిలిచాయి. ఆయా రాష్ట్రాల్లో లభించే కార్మిక శక్తి, మౌలిక వసతులు, ఆర్థిక వాతావరణం, పాలన-రాజకీయ స్థిరత్వం, అవగాహన, భూములు వంటి ఆరు ముఖ్యాంశాలు, 51 ఉప అంశాలను బేరీజు వేసి ర్యాంకులను నిర్ణయించారు. 2016 జాబితాతో పోలిస్తే గుజరాత్, ఢిల్లీలు తిరిగి తమ స్థానాలను నిలబెట్టుకోగా.. హరియాణా, తెలంగాణ వేగంగా టాప్-5లోకి అడుగుపెట్టాయి. ఆర్థిక వాతావరణానికి సంబంధించి గుజరాత్ అగ్రస్థానంలో నిలవగా..మౌలిక సదుపాయాల కల్పనలో ఢిల్లీ తొలి ర్యాంకు సాధించింది. కార్మిక సమస్యలను తీర్చడంలో తమిళనాడు, భూముల విషయంలో మధ్యప్రదేశ్ ముందువరుసలో ఉన్నాయి.
నదుల అనుసంధానానికి 30 లింకుల గుర్తింపుదేశంలో నదుల అనుసంధానానికి 30 లింకుల్ని గుర్తించినట్లు కేంద్ర జలవనరుల శాఖ సహాయమంత్రి సంజీవ్ కుమార్ బల్యాన్ లోక్‌సభలో తెలిపారు. ఇందులో ఎనిమిది లింకులు ఆంధ్రా, తెలంగాణ పరిధిలో ఉన్నట్లు వెల్లడించారు. జాతీయ జల వనరుల అభివృద్ధి సంస్థ నదుల అనుసంధానం కోసం గుర్తించిన 30 లింకుల్లో 16 నైరుతి రాష్ట్రాల్లో, 14 హిమాలయ ప్రాంతాల్లో ఉన్నట్లు వెల్లడించారు. వీటిపై సర్వే, పరిశోధన అనంతరం నైరుతి రాష్ట్రాల్లోని 14 లింకుల్ని, హిమాలయ ప్రాంతంలోని 2 లింకుల్ని పూర్తి చేసేందుకు గల అవకాశాలపై నివేదిక రూపొందించినట్లు వెల్లడించారు. వీటికి డీపీఆర్‌లు రూపొందించేటప్పుడు పర్యావరణ, సామాజిక ఆర్థిక ప్రభావాలపై అధ్యయనం చేస్తామన్నారు.
ఆంధ్ర, తెలంగాణల్లో గుర్తించినవిమహానది(మణిభద్ర)-గోదావరి(ధవళేశ్వరం)
గోదావరి(ఇచ్ఛంపల్లి)-కృష్ణా(పులిచింతల)
గోదావరి(ఇచ్ఛంపల్లి)-కృష్ణా(నాగార్జునసాగర్)
గోదావరి(పోలవరం)-కృష్ణా(విజయవాడ)
కృష్ణా (ఆల్మట్టి)-పెన్నా
కృష్ణా (శ్రీశైలం)-పెన్నా
కృష్ణా (నాగార్జునసాగర్)-పెన్నా(సోమశిల)
పెన్నా(సోమశిల)- కావేరి (గ్రాండ్ ఆనికట్)
రాష్ట్రీయంసింగరేణికి కాస్ట్ మేనేజ్‌మెంట్ పురస్కారం సింగరేణి కాలరీస్ కంపెనీకి ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ‘ఎక్స్‌లెన్‌స ఇన్ కాస్ట్ మేనేజ్‌మెంట్- 2016 అవార్డు’ లభించింది. ఈ మేరకు జూలై 18న ఢిల్లీలో జరిగిన 14వ జాతీయ స్థాయి అవార్డుల ఉత్సవంలో కేంద్ర విద్యుత్, బొగ్గు గనుల శాఖ మంత్రి పీయూష్ గోయల్ నుంచి సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ అవార్డును స్వీకరించారు. దేశంలోని పరిశ్రమలు, సంస్థలు వ్యయ (కాస్ట్) వ్యవహారాలు నిర్వహించుకోవడానికి ఐసీఏఐ రూపొందించిన నిర్దిష్టమైన సూచనలు, నిబంధనలను పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నందుకు సింగరేణికి ఈ పురస్కారం లభించింది. సింగరేణికి 2015లో కూడా ఈ అవార్డు దక్కడం విశేషం.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సింగరేణికి ఎక్స్‌లెన్స్ ఇన్ కాస్ట్ మేనేజ్‌మెంట్-2016 అవార్డు
ఎప్పుడు : జూలై 18
ఎవరు : ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా
ఎందుకు : నిర్ధిష్టమైన కాస్ట్ వ్యవహారాలు పాటించినందుకు
ఆచార్య ఎన్.గోపికి దాశరథి పురస్కారంతెలంగాణ ప్రభుత్వం ఇచ్చే డాక్టర్ దాశరథి పురస్కారానికి ప్రముఖ కవి ఆచార్య ఎన్.గోపి ఎంపికయ్యారు. దాశరథి కృష్ణమాచార్య జయంతి సందర్భంగా జూలై 22న ఆయనకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. అవార్డులో భాగంగా లక్షా వేయి నూట పదహార్ల నగదు, జ్ఞాపిక, ప్రశంసా పత్రం, శాలువాతో సత్కరిస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : దాశరథి కృష్ణమాచార్య అవార్డు
ఎప్పుడు : జూలై 19
ఎవరు : ఆచార్య ఎన్.గోపి
శ్రీకాకుళంలో కిడ్నీ జబ్బుల పరిశోధన కేంద్రంశ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ బాధితుల తీవ్రత నేపథ్యంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్)తో కలసి రాష్ట్ర ప్రభుత్వం పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్య జూలై 20న ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్దానం ప్రాంతంలోనే ఎందుకు కిడ్నీ జబ్బులు వస్తాయన్న దానిపై ఐసీఎంఆర్ బృందం పరిశోధన చేసి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదిక ఇస్తుందన్నారు. పరిశోధన కేంద్రానికి ఏటా రూ.5 కోట్లు వ్యయం అవుతుందని ఐసీఎంఆర్ అంచనా వేసిందన్నారు. ఈ సొమ్మును 50 శాతం ఐసీఎంఆర్, మిగతా 50 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందన్నారు. దీనిపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పరిశోధన కేంద్రం ఏర్పాట్లపై ఆదేశాలిచ్చినట్టు పేర్కొన్నారు. కాగా, ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ బాధితులకు నెలనెలా పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు పూనం మాలకొండయ్య తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : శ్రీకాకుళంలో కిడ్నీ పరిశోధన కేంద్రం
ఎప్పుడు : జూలై 20
ఎవరు : ఐసీఎంఆర్, ఏపీ ప్రభుత్వం
ఎక్కడ : ఉద్దానం
తెలంగాణ మానవాభివృద్ధి నివేదిక-2017విద్య, వైద్యంతో పాటు తలసరి ఆదాయంలో పెరుగుదలతో హైదరాబాద్ అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. తెలంగాణ రాష్ట్ర మానవాభివృద్ధి నివేదిక-2017 ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం హైదరాబాద్‌లో తలసరి ఆదాయం ఏడాదికి రూ.1.04 లక్షలు. పక్కా భవనాలు, మరుగుదొడ్డి సౌకర్యం ఉన్నవారు రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో పోలిస్తే నగరంలోనే అధికశాతం.
తలసరి ఆదాయంతెలంగాణలో ఇతర జిల్లాలతో పోలిస్తే హైదరాబాద్ తలసరి ఆదాయంలో అగ్రస్థానంలో నిలిచింది. నగరవాసుల తలసరి ఆదాయం ఏడాదికి రూ.1,04,587 ఉన్నట్టు నివేదిక పేర్కొంది. అయితే మహిళల తలసరి ఆదాయం రూ.69,081 మాత్రమే. రంగారెడ్డి జిల్లాలో పురుషులు రూ.89,973, మహిళలు రూ.55,317 తలసరి ఆదాయం కలిగి ఉన్నట్లు నివేదిక వెల్లడించింది.
ఆరోగ్య, విద్య సూచీఆరోగ్యం, విద్య సూచీల్లో హైదరాబాద్ నగరం అగ్రభాగాన నిలిచింది. ఆరోగ్యం విషయంలో 0.888 పాయింట్లు సాధించి తెలంగాణ జిల్లాల్లో టాప్‌లో నిలిచింది. రంగారెడ్డి జిల్లా 0.733 పాయింట్లతో ద్వితీయస్థానంలో ఉంది. ఇక విద్యాసూచీలో 0.774 పాయింట్లతో హైదరాబాద్ ప్రథమ స్థానాన్ని దక్కించుకోగా.. 0.546 పాయింట్లతో రంగారెడ్డి జిల్లా రెండోస్థానంలో ఉంది.
అక్షరాస్యతలో..అక్షరాస్యత విషయంలోనూ హైదరాబాద్ అగ్రస్థానంలో ఉంది. జిల్లాలో 83.3 శాతం మంది అక్షరాస్యులున్నారు. ద్వితీయ స్థానంలో నిలిచిన రంగారెడ్డి జిల్లాలో 75.9 శాతం అక్షరాస్యత నమోదైంది.
హైదరాబాద్‌లో ప్రైవేటు బడులూ అధికమేహైదరాబాద్ జిల్లాలో తెలంగాణలోనే అత్యధికంగా 71.6 శాతం ప్రైవేటు పాఠశాలలున్నాయి. రెండో స్థానంలో ఉన్న రంగారెడ్డి జిల్లాలో ఈ శాతం 47 మాత్రమే.
ఆస్పత్రుల్లో ప్రసవాలుఆస్పత్రుల్లో సురక్షిత పరిసరాల్లో ప్రసవాల విషయంలో హైదరాబాద్ నగరం అగ్రభాగాన నిలిచింది. నగరంలో 97.2 శాతం ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రసవాలు జరుగుతున్నాయి. రంగారెడ్డి జిల్లాలో ఈ శాతం 95.3.
పాఠశాలలూ ఎక్కువేప్రతి 10 చదరపు మీటర్ల పరిధిలో హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా 209.40 పాఠశాలలున్నాయి. రంగారెడ్డి జిల్లాలో 51.11 పాఠశాలలతో రెండో స్థానంలో ఉంది.
పాఠశాలకు హాజరులో రంగారెడ్డి టాప్అత్యధికంగా 99.1 శాతం మంది విద్యార్థులు రంగారెడ్డి జిల్లాలో పాఠశాలలకు హాజరవుతుండగా, హైదరాబాద్ 97.4 శాతంతో, నిజామాబాద్ జిల్లా తరువాత మూడో స్థానంలో ఉంది.
సేవారంగ ఆదాయమూ అధికమేనగరంలో సేవారంగం ద్వారా ఆదాయం అధికంగా ఉన్నట్లు నివేదికలో తేలింది. ఐటీ, బీపీఓ, కేపీఓ రంగాలకు నిలయమైన భాగ్యనగరంలో సేవారంగం శరవేగంగా పురోగమిస్తోంది. ఈ రంగంలో 2011-12 అంచనాల ప్రకారం రూ.78,755 కోట్ల ఆదాయం వస్తోంది. పరిశ్రమల ద్వారా రూ.14,898 కోట్లు, వ్యవసాయంలో రూ.1,055 కోట్లే లభిస్తోంది. రంగారెడ్డిలో సేవారంగంలో రూ.36,266 కోట్లు, పరిశ్రమల రంగంలో రూ.26,064 కోట్లు, వ్యవసా యంలో రూ.4,515 కోట్లు ఆదాయం వస్తోంది.
కలవరపరుస్తున్న మాతా, శిశు మరణాలునగరంలో ప్రతి వెయ్యి మంది శిశు జననాలకు 20 మంది.. రంగారెడ్డి జిల్లాలో 33 మంది పురుట్లోనే మృత్యువాతపడుతుండడం కలచివేస్తోంది. హైదరాబాద్‌లో ప్రతి లక్షమంది గర్భిణుల్లో ప్రసవ సమయంలో 71 మంది... రంగారెడ్డిలో 78 మంది మృత్యువాత పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
పక్కాభవనాలు (కాంక్రీటు భవంతులు) విషయంలో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచింది. గ్యాస్ కనెక్షన్ ఉన్నవారు నగరంలో 67.3 శాతం, రంగారెడ్డిలో 62.4 శాతం ఉన్నారు.
తెలంగాణలో ప్రజాఫిర్యాదుల కోసం జనహిత ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణ, సంక్షేమ పథకాల దరఖాస్తు కోసం తెలంగాణ ప్రభుత్వం జనహిత పేరుతో ప్రత్యేక వ్యవస్థను ప్రారంభించింది. మొదట ప్రయోగాత్మకంగా సూర్యాపేట జిల్లాలో ప్రారంభించిన ఈ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు తదితర అంశాలపై ఫిర్యాదులు, అభ్యర్థనలను ప్రత్యేక వెబ్ పోర్టల్, వాట్సాప్, మెయిల్ ఐడీ ద్వారా సంబంధిత అధికారులకు పంపవచ్చు. దరఖాస్తుల స్థితిని కూడా తెలుసుకోవచ్చు. ఫిర్యాదులపై నిర్ణీత సమయంలోగా స్పందించని అధికారులకు నెగటివ్ మార్కులు ఇస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జనహిత ప్రారంభం
ఎప్పుడు : జూలై 19
ఎవరు : తెలంగాణ ప్రభుత్వం
ఎక్కడ : సూర్యాపేట జిల్లాలో
ఎందుకు : ఫిర్యాదులు, సంక్షేమ పథకాల దరఖాస్తుల స్వీకరణకు
గ్రేడ్-2 మునిసిపాలిటీగా నారాయణ్‌పేట్మహబూబ్‌నగర్ జిల్లాలోని నారాయణ్‌పేట్ మునిసిపాలిటీ స్థాయిని గ్రేడ్-3 నుంచి గ్రేడ్-2కి పెంచుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జూలై 24న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మునిసిపాలిటీ 2015-16 సంవత్సరంలో రూ.11.47 కోట్ల ఆదాయాన్ని పొంది గ్రేడ్-2 స్థాయి పొందేందుకు అర్హత సాధించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నారయణ్‌పేట్‌కు గ్రేడ్-2 మునిసిపాలిటీ గుర్తింపు
ఎప్పుడు : జూలై 24
ఎవరు : తెలంగాణ ప్రభుత్వం
ఆర్థికంబ్యాంకులకు 2.4 లక్షల కోట్ల హెయిర్ కట్: క్రిసిల్భారీగా పేరుకుపోయిన 50 మొండి బకాయిలను పరిష్కరించుకునేందుకు బ్యాంకులు సుమారు రూ.2.4 లక్షల కోట్లు (60 శాతం) వదులుకోవాల్సి (హెయిర్‌కట్) రావొచ్చని రేటింగ్ సంస్థ క్రిసిల్ అంచనా వేసింది. మెటల్స్, నిర్మాణ, విద్యుత్ రంగాలకు చెందిన ఈ బకాయిలు బ్యాంకింగ్ వ్యవస్థలో పేరుకున్న మొత్తం రూ.8 లక్షల కోట్ల నిరర్థక ఆస్తుల్లో దాదాపు సగం. రిజర్వు బ్యాంకు సూచనల మేరకు అప్పులిచ్చిన బ్యాంకులు ఆయా సంస్థల ఆస్తుల్ని విక్రయించుకున్నా వాటికి 40% మొత్తమే దక్కుతుందని తెలిపింది.
2017లో భారత్ వృద్ధి రేటు 7.4 శాతం: ఏడీబీ గతంలో అంచనా వేసిన 7.4% వృద్ధి రేటు సాధన దిశగా భారత్ ముందుకెళుతోందని ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ) వెల్లడించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి అదే రేటును యథాతథంగా కొనసాగిస్తున్నట్లు వివరించింది. అటు ఆసియా ప్రాంత వృద్ధి రేటు అంచనాలను మాత్రం గతంలో ప్రకటించిన 5.7% నుంచి 5.9%కి పెంచుతున్నట్లు తెలిపింది. ఏషియన్ డెవలప్‌మెంట్ అవుట్‌లుక్ (ఏడీవో) 2017 నివేదికకు అనుబంధ నివేదికలో వర్ధమాన ఆసియా దేశాలకు సంబంధించి అంచనాలను ఈ మేరకు సవరించింది.
2018లో వర్ధమాన ఆసియా వృద్ధిని 5.7% నుంచి 5.8%కి పెంచింది. ఇక 2017-18లో భారత వృద్ధి 7.4% ఉండగలదని, 2018-19లో 7.6%కి పెరగగలదని ఏడీబీ తెలిపింది. మధ్యకాలికంగా చూస్తే వ్యాపారాల నిర్వహణ సులభతరం కావడానికి, వృద్ధికి ఊతమివ్వడానికి వస్తు, సేవల పన్నుల విధానం (జీఎస్‌టీ) దోహదపడగలదని అంచనా వేస్తున్నట్లు పేర్కొంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 2017-18లో భారత్ వృద్ధి రేటు 7.4 శాతం
ఎప్పుడు : జూలై 20
ఎవరు : ఏడీబీ
ఏటీఎంలో ఐసీఐసీఐ పర్సనల్ లోన్స్ఐసీఐసీఐ బ్యాంకు రుణ మంజూరు ప్రక్రియను సరళతరం చేస్తూ ఏటీఎంల ద్వారా రూ.15 లక్షల వరకు వ్యక్తిగత రుణాలను తక్షణం అందించే విధానాన్ని ప్రారంభించింది. వేతన అకౌంట్ కలిగి ఉన్న వారికి ఈ అవకాశం కల్పించింది. క్రెడిట్ ఇన్‌ఫర్మేషన్ కంపెనీలు అందించే సిబిల్ స్కోర్ సమాచారం ఆధారంగా ఐసీఐసీఐ బ్యాంక్ పర్సనల్ లోన్‌కు అర్హులైన వారిని ఎంపిక చేస్తుంది. వీరికి ఏటీఎంలో లావాదేవీ నిర్వహించిన తర్వాత స్క్రీన్‌పై రుణ అర్హతకు సంబంధించిన ఒక మేసేజ్ కనిపిస్తుంది. రుణం తీసుకోవాలని భావిస్తే ఐదేళ్ల కాలపరిమితితో రూ.15 లక్షల వరకు మొత్తాన్ని పొందొచ్చు. ఇది కస్టమర్ బ్యాంక్ ఖాతాలో జమవుతుంది. ఏటీఎం స్క్రీన్‌పై రుణ వడ్డీ రేటు, ఈఎంఐ, ప్రాసెసింగ్ ఫీజు వంటి వివరాలన్నీ అందుబాటులో ఉంటాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఏటీఎంలో పర్సనల్ లోన్స్
ఎప్పుడు : జూలై 20
ఎవరు : ఐసీఐసీఐ బ్యాంకు
ఎక్కడ : దేశవ్యాప్తంగా
ఎందుకు : వేతన ఖాతాదారుల కోసం
రిలయన్స్ జియో నుంచి ఉచితంగా 4జీ ఫీచర్ ఫోన్ రిలయన్స్ జియో నుంచి ఉచితంగా 4జీ ఫీచర్ ఫోన్ అందిస్తామని ఆ సంస్థ అధినేత ముకేశ్ అంబానీ ప్రకటించారు. జూలై 22న ముంబైలో జరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ 40వ ఏజీఎం సమావేశంలో ఈ మేరకు ప్రకటన చేశారు.
జియో ఫోన్‌ను ముకేశ్ అంబానీ ‘ఇంటెలిజెంట్ ఫోన్’గా అభివర్ణించారు. అంతేకాదు ‘ఇండియా కా స్మార్ట్‌ఫోన్’ అనేది జియో ఫోన్ నినాదం. ఈ ఫోన్ పొందేందుకు వన్‌టైమ్ సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.1,500 చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని మూడేళ్ల తర్వాత(36 నెలలు) తిరిగి ఇస్తారు. జీవిత కాలం పాటు వాయిస్ కాలింగ్ ఉచితం. నెలకు రూ.153 చొప్పున టారిఫ్‌ను చెల్లిస్తే... అపరిమిత డేటా సేవలను పొందొచ్చు. ఆగస్ట్ 15న ప్రయోగాత్మకంగా ఈ ఫోన్‌లను ప్రవేశపెడతామని ముకేశ్ ప్రకటించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఉచితంగా జియో 4జీ ఫీచర్ ఫోన్
ఎప్పుడు : జూలై 21
ఎవరు : రిలయన్స్ ఇండస్ట్రీస్
ఎక్కడ : దేశవ్యాప్తంగా
2016లో 18 లక్షల హెచ్‌ఐవీ కేసులు నమోదు ప్రపంచవ్యాప్తంగా ఎయిడ్‌స వ్యాధితో మరణించేవారి సంఖ్య తగ్గుతున్నట్లు ఐక్యరాజ్యసమితికి చెందిన ‘యూఎన్ ఎయిడ్స్’ విభాగం తెలిపింది. 2005లో దాదాపు 19 లక్షల మంది ఈ వ్యాధితో మరణించగా.. 2016 నాటికి ఈ సంఖ్య 10 లక్షలకు తగ్గిందని తన నివేదికలో వెల్లడించింది. చాలామంది వ్యాధిగ్రస్తులకు చికిత్స అందుబాటులోకి రావడమే ఇందుకు కారణమని తెలిపింది. గతేడాది కొత్తగా 18 లక్షల హెచ్‌ఐవీ ఇన్ఫెక్షన్ కేసులు నమోదయినట్లు పేర్కొంది.
ఒక్క 2016లోనే 1.95 కోట్ల మందికి యాంటీ రెట్రోవైరల్ చికిత్సను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు యూఎన్ ఎయిడ్స్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ మైఖేల్ సిడిబే తెలిపారు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 7.61 కోట్ల మందికి హెచ్‌ఐవీ ఇన్ఫెక్షన్ సోకగా.. దాదాపు 3.5 కోట్ల మంది మృతి చెందినట్లు వెల్లడించారు. ఆఫ్రికాలోని దక్షిణ, తూర్పు ప్రాంతాలు ఇన్ఫెక్షన్ అదుపులో గణనీయమైన పురోగతి సాధించినట్లు వివరించారు. 2010 నుంచి ఈ ప్రాంతంలో ఎయిడ్స్ మరణాలు 42 శాతం తగ్గిపోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
కాగా 2016లో ప్రపంచ వ్యాప్తంగా కొత్తగా నమోదైన 95 శాతం హెచ్‌ఐవీ కేసులు ఆసియా, పసిఫిక్ ప్రాంతాల్లోని 10 దేశాల నుంచే ఉన్నాయని ఈ నివేదిక వెల్లడించింది. ఈ పది దేశాల్లో భారత్, చైనా, పాకిస్తాన్ ఉన్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : యూఎన్ ఎయిడ్‌స రిపోర్ట్ - 2017
ఎప్పుడు : జూలై 19
ఎవరు : ఐక్యరాజ్య సమితి
ఎక్కడ : ప్రపంచవ్యాప్తంగా
వయ వందన యోజన పథకం ప్రారంభం వయోవృద్ధుల కోసం కేంద్ర ప్రభుత్వం ‘ప్రధానమంత్రి వయ వందన యోజన’ (పీఎంవీవీవై) పేరుతో ఎల్‌ఐసీ పథకాన్ని ప్రారంభించింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ జూలై 21న ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో దీన్ని తీసుకోవచ్చు. 60 ఏళ్లకు పైబడిన సీనియర్ సిటిజన్లకు వర్తించే ఈ పథకంలో 10 ఏళ్ల పాటు 8 శాతం వార్షిక రిటర్నులు లభిస్తాయి. వడ్డీ ఆదాయాన్ని ప్రతి నెల, లేదా 3 నెలలు, ఆరు నెలలు, ఏడాదికోసారి పొందే వీలుంటుంది. ఈ సంవత్సరం మే 4న ప్రారంభమైన ఈ పెన్షన్ పథకంలో 2018 మే 3వ తేదీ వరకు చేరవచ్చు. ఈ పథకానికి జీఎస్టీ వర్తించదు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వయ వందన యోజన పథకం ప్రారంభం
ఎప్పుడు : జూలై 21
ఎవరు : కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ
ఎక్కడ : న్యూఢిల్లీలో
ఎందుకు : వయో వృద్ధుల కోసం
భారత వృద్ధి అంచనా యథాతథంఅంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2017-18)లో భారత వృద్ధి రేటు అంచనాను యథాతథంగా(7.2 శాతంగా) కొనసాగించింది. ఇది 2018-19లో 7.7 శాతానికి చేరుతుందని జూలై 24న విడుదల చేసిన వరల్డ్ ఎకనమిక్ అవుట్‌లుక్ (డబ్ల్యూఈవో) అప్‌డేట్ నివేదికలో పేర్కొంది. ఐఎంఎఫ్ అంచనాల ప్రకారం ఈ రెండేళ్లు భారత వృద్ధిరేటు చైనా కంటే అధికంగానే ఉండనుంది. చైనా వృద్ధి 2017లో 6.7 శాతంగా, 2018లో 6.4 శాతంగా ఉంటుందని ఐఎంఎఫ్ గతంలో ప్రకటించింది. గతంలో ప్రకటించిన అంచనాలను తాజా నివేదికలో ఐఎంఎఫ్ స్వల్పంగా పెంచింది. అయితే భారత వృద్ధిరేటు అంచనాలను యథాతథంగా ఉంచినప్పటికీ.. చైనాను మించగలదని తెలిపింది. పెద్ద నోట్ల రద్దు ప్రభావాలతో గత ఆర్థిక సంవత్సరం భారత వృద్ధి 7.1 శాతానికే పరిమితమైంది. అయితే ఇది ఊహించిన దానికంటే అధికమని ఐఎంఎఫ్ పేర్కొంది.
సైన్స్ అండ్ టెక్నాలజీచంద్రుడి పై భారీ నీటి నిల్వలు భూగర్భంలో ఉన్నట్లుగానే చంద్రుడి లోపలి పొరల్లో కూడా పెద్ద మొత్తంలో నీటి నిల్వలు ఉండే అవకాశముందని అమెరికాలోని బ్రౌన్ యూనివవర్సిటీ శాస్త్రవేత్తలు వెల్లడించారు. భవిష్యత్తులో చంద్రుడిపైకి వెళ్లే వ్యోమగాములు, అక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకునేవారు, పరిశోధనలు చేసే శాస్త్రవేత్తలు ఈ జలవనరులను ఉపయోగించుకోవచ్చని వివరించారు. శాటిలైట్ డాటాను సేకరించిన తర్వాత చంద్రుడి పైపొరల కింద నీటి జాడలున్నాయనే నిర్ధారణకు వచ్చారు. భూమిపై అగ్నిపర్వతాలు పేలి, వాటిలోని లావా ఏరులై పారినట్లుగానే చంద్రుడిపై కూడా అగ్నిపర్వాతాలు వెదజల్లిన లావా విస్తరించిన ఆనవాళ్లున్నాయని, దీనివల్ల చంద్రుడి ఉపరితలంపై ఉన్న నీరంతా కింది పొరల్లోకి చేరి ఉంటుందని అంచనా వేస్తున్నారు. భూకేంద్రంలో అత్యధిక వేడి ఉండడం కారణంగా అక్కడ నీటి జాడలేదనే విషయం మనకు తెలిసిందే. అయితే చంద్రుడిలో అలా కాకుండా చంద్ర కేంద్రకం వరకు కూడా వివిధ స్థాయిలో నీటి జాడలు ఉండే అవకాశముందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 2008లోనే చంద్రుడి పొరల్లో దాగి ఉన్న నీటిని అపోలో 15, 17 వాహక నౌక భూమికి తీసుకొచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. పెద్దమొత్తంలో నీటి నిల్వలున్నాయని చెప్పేందుకు ఇవే ఆధారమన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : చంద్రుడి పై భారీ నీటి నిల్వలు
ఎప్పుడు : జూలై 25
ఎవరు : బ్రౌన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు, అమెరికా
క్రీడలుజూడోలో భారత్‌కు నాలుగు పతకాలుకామన్వెల్త్ యూత్ గేమ్స్‌లో తొలిరోజు భారత జట్టు నాలుగు పతకాలు గెలుచుకుంది. బహమాస్‌లోని నసావూ నగరంలో జరిగిన జూడో క్రీడాంశంలో భారత్‌కు ఒక స్వర్ణం, 3 కాంస్య పతకాలు లభించాయి. బాలుర 73 కేజీల విభాగంలో హరియాణాకు చెందిన సోని 10-0తో ఉరోస్ (ఆస్ట్రేలియా)పై గెలిచి విజేతగా నిలిచాడు. కాగా ఆశిష్ (60 కేజీలు), బాలికల విభాగంలో చానమ్ రెబీనా దేవి (57 కేజీలు), అంతిమ్ యాదవ్ (48 కేజీలు) కాంస్య పతకాలను సాధించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జూడోలో భారత్‌కు నాలుగు పతకాలు
ఎప్పుడు : జూలై 19
ఎవరు : సోని, ఆశిష్, చానమ్ రెబీనా దేవి, అంతిమ్ యాదవ్
ఎక్కడ : కామన్వెల్త్ యూత్ గేమ్స్, బహమాస్
మహిళల వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ మహిళల వన్డే వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో భారత జట్టు ఫైనల్‌కు చేరింది. జూలై 20న ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో భారత్ 36 పరుగుల తేడాతో విజయం సాధించింది. హర్మన్ ప్రీత్ కౌర్ 115 బంతుల్లో 171 పరుగుల మెరుపు ఇన్నింగ్స్‌తో అజేయంగా నిలిచింది. జూలై 23న లార్డ్స్ మైదానంలో జరిగే ఫైనల్లో ఇంగ్లండ్ జట్టుతో భారత్ తలపడుతుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మహిళల వన్డే వరల్డ్ కప్ ఫైనల్స్‌లో భారత్
ఎప్పుడు : జూలై 20
ఎవరు : భారత మహిళల క్రికెట్ జట్టు
ఎక్కడ : ఇంగ్లండ్‌లో
ఎందుకు : సెమీస్‌లో ఆస్ట్రేలియాపై విజయంతో
డోపింగ్‌లో పట్టుబడ్డ మన్‌ప్రీత్ కౌర్భారత మేటి అథ్లెట్ మన్‌ప్రీత్ కౌర్ జూలై 19న డోపింగ్‌లో పట్టుబడింది. ఇటీవల భువనేశ్వర్‌లో జరిగిన ఆసియా చాంపియన్‌షిప్‌లో షాట్‌పుట్‌లో స్వర్ణం నెగ్గిన ఆమె ఆగస్టులో లండన్‌లో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్‌కు అర్హత సాధించింది. తాజాగా డోపింగ్‌లో దొరకడంతో ఇప్పుడు స్వర్ణం, బెర్త్ రెండూ కోల్పోనుంది. ఆమె నుంచి సేకరించిన నమూనాలను పరీక్షించగా ‘ఎ’ శాంపిల్‌లో నిషిద్ధ డిమిథైల్‌బుటిలమైన్ ఉత్ప్రేరకాన్ని తీసుకున్నట్లు తేలింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : డోపింగ్‌లో దొరికిన భారత అథ్లెట్
ఎప్పుడు : జూలై 19
ఎవరు : మన్‌ప్రీత్ కౌర్
ఎందుకు : నిషిద్ధ డిమిథైల్‌బుటిలమైన్ ఉత్ప్రేరకం వాడినందుకు
మహిళల ప్రపంచకప్ విజేత ఇంగ్లండ్తొలిసారి వన్డే ప్రపంచ కప్ విజేతగా నిలవాలని భావించిన భారత మహిళల జట్టుకు నిరాశే మిగిలింది. జూలై 23న లార్డ్స్‌లో జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్ 9 పరుగుల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు అన్య షబ్‌స్రోల్ (6/46) కు దక్కగా అత్యధిక పరుగులు చేసిన బీమాంట్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’ అవార్డు దక్కింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మహిళల ప్రపంచ కప్ విజేత
ఎప్పుడు : జూలై 23
ఎవరు : ఇంగ్లండ్
ఎక్కడ : లార్డ్స్, లండన్
పారా అథ్లెటిక్స్‌లో శరద్‌కు రజతంప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారులు రెండు పతకాలు గెల్చుకున్నారు. జూలై 23న జరిగిన పురుషుల హైజంప్ టి-42 ఈవెంట్‌లో శరద్ కుమార్ రజతం... వరుణ్ భాటి కాంస్య పతకం సొంతం చేసుకున్నారు. బిహార్‌కు చెందిన శరద్ 1.84 మీటర్ల ఎత్తు ఎగిరి రెండో స్థానాన్ని పొందగా... ఉత్తరప్రదేశ్‌కు చెందిన వరుణ్ భాటి 1.77 మీటర్ల ఎత్తుకు ఎగిరి మూడో స్థానాన్ని సాధించాడు. సామ్ గ్రెవీ (అమెరికా-1.86 మీటర్లు) స్వర్ణ పతకాన్ని కై వసం చేసుకున్నాడు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పారా అథ్లెటిక్స్ హైజంప్ లో భారత్‌కు పతకాలు
ఎప్పుడు : జూలై 23
ఎవరు : శరద్ కుమార్, వరుణ్ భాటి
పారా అథ్లెటిక్స్‌లో కరమ్‌జ్యోతికి కాంస్యంప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు చెందిన కరమ్‌జ్యోతి దలాల్‌కు కాంస్య పతకం లభించింది. మహిళల ఎఫ్-55 డిస్కస్ త్రో ఈవెంట్‌లో ఆమె డిస్క్‌ను 19.02 మీటర్ల దూరం విసిరి మూడో స్థానాన్ని దక్కించుకుంది. ఇంతకుముందు జావెలిన్ త్రోలో సుందర్ సింగ్ గుర్జర్ స్వర్ణం, క్లబ్ త్రోలో అమిత్ సరోహా రజతం సాధించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు కాంస్య పతకం
ఎప్పుడు : జూలై 21
ఎవరు : కరమ్‌జ్యోతి దలాల్
విష్ణు జోడీకి ప్రెసిడెంట్స్ కప్ టైటిల్హైదరాబాద్‌కు చెందిన విష్ణువర్ధన్ ప్రెసిడెంట్స్ కప్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్‌లో పురుషుల డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. కజకిస్తాన్‌లోని అస్తానా నగరంలో జూలై 22న జరిగిన ఫైనల్లో విష్ణువర్ధన్ (భారత్)-తొషిహిదె మత్సుయ్ (జపాన్) జోడీ ‘సూపర్ టైబ్రేక్’లో ఎవ్‌గెని కర్లోవ్‌స్కీ-తుర్నెవ్ (రష్యా) జంటపై గెలిచింది. జూన్‌లో భారత్‌కే చెందిన శ్రీరామ్ బాలాజీతో కలిసి విష్ణు ఫెర్గానా ఓపెన్ టైటిల్‌ను గెలిచాడు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రెసిడెంట్స్ కప్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్ డబుల్స్ విజేత
ఎప్పుడు : జూలై 22
ఎవరు : విష్ణువర్ధన్ (భారత్)-తొషిహిదె మత్సుయ్ (జపాన్)
ఎక్కడ : అస్తానా, కజకిస్తాన్
ప్రణయ్‌కు యూఎస్ ఓపెన్ గ్రాండ్‌ప్రి టైటిల్భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ ప్లేయర్ హెచ్‌ఎస్ ప్రణయ్ యూఎస్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నమెంట్‌లో చాంపియన్‌గా నిలిచాడు. జూలై 24న జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో భారత్‌కే చెందిన పారుపల్లి కశ్యప్‌ను ఓడించి విజేతగా నిలిచాడు. ప్రణయ్‌కి ఇది నాలుగో అంతర్జాతీయ సింగిల్స్ టైటిల్. గతంలో వియత్నాం ఓపెన్ గ్రాండ్‌ప్రి, ఇండోనేసియా మాస్టర్స్ గ్రాండ్‌ప్రి గోల్డ్ (2014లో), స్విస్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ (2016లో) టోర్నీలలో టైటిల్స్ సాధించాడు. విజేతగా నిలిచిన ప్రణయ్‌కు 9,000 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 5 లక్షల 79 వేలు)తోపాటు 7,000 ర్యాంకింగ్ పాయింట్లు... రన్నరప్ కశ్యప్‌కు 4,560 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 2 లక్షల 93 వేలు)తోపాటు 5,950 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : యూఎస్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నమెంట్ విజేత
ఎప్పుడు : జూలై 24
ఎవరు : హెచ్‌ఎస్ ప్రణయ్
కామన్వెల్త్ యూత్ గేమ్స్‌లో జీల్, సచిన్‌కు స్వర్ణాలుబహమాస్‌లో జూలై 24న ముగిసిన కామన్వెల్త్ యూత్ గేమ్స్‌లో భారత్ ఓవరాల్‌గా నాలుగు స్వర్ణాలు, ఒక రజతం, ఆరు కాంస్య పతకాలను సాధించి మొత్తం 11 పతకాలతో ఏడో స్థానంలో నిలిచింది. చివరిరోజు టెన్నిస్‌లో జీల్ దేశాయ్ బాలికల సింగిల్స్ విభాగంలో స్వర్ణం సాధించగా... బాక్సింగ్‌లో సచిన్ స్వర్ణం సాధించాడు. బాలుర సింగిల్స్‌లో సిద్ధాంత్ బంతియా కాంస్య పతకాన్ని గెలిచాడు. మిక్స్‌డ్ డబుల్స్ ఈవెంట్‌లో జీల్ దేశాయ్-సిద్ధాంత్ ద్వయం బంగారు పతకాన్ని సొంతం చేసుకుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కామన్వెల్త్ యూత్ గేమ్స్‌లో భారత్‌కు రెండు స్వర్ణాలు
ఎప్పుడు : జూలై 24
ఎవరు : జీల్ దేశాయ్ - సిద్ధాంత్ బంతియా (బాలికల సింగిల్స్, డబుల్స్)
ఐదేళ్ల తర్వాత భారత్‌లో డబ్ల్యూటీఏ టోర్నీఐదేళ్ల తర్వాత డబ్ల్యూటీఏ టెన్నిస్ టోర్నమెంట్‌కు భారత్ వేదికైంది. ముంబై ఓపెన్ పేరుతో 2017 నవంబర్‌లో డబ్ల్యూటీఏ టోర్నమెంట్ జరగనుంది. 2012లో చివరిసారిగా పుణేలో డబ్ల్యూటీఏ టోర్నీ జరిగింది. దీని వల్ల ప్రపంచ టాప్-50 క్రీడాకారిణులతో తలపడే అవకాశం భారత అమ్మాయిలకు లభిస్తుంది. మెయిన్ డ్రా, క్వాలిఫయింగ్‌లో చెరో నాలుగు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఇస్తారు. చెన్నై ఓపెన్ ఏటీపీ టోర్నీ కూడా ఈ సారి మహారాష్ట్రకు తరలింది. ఇప్పుడిది ‘మహారాష్ట్ర ఓపెన్’ పేరుతో పుణేలో జరగనుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 5 ఏళ్ల తర్వాత భారత్‌లో డబ్ల్యూటీఏ టోర్నమెంట్
ఎప్పుడు : నవంబర్ 2017
ఎవరు : డబ్ల్యూటీఏ
ఎక్కడ : ముంబై
భారత్‌లో ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్ప్రపంచ పురుషుల బాక్సింగ్ తొలి చాంపియన్‌షిప్‌కు భారత్ ఆతిథ్యమివ్వనుంది. ఈ మేరకు మాస్కోలో జరిగిన ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో అంతర్జాతీయ బాక్సింగ్ అసోసియేషన్ (ఐబా)ఆతిథ్య వేదికల్ని ఖరారు చేసింది. 2019 టోర్నీకి సోచి, 2021 ఈవెంట్‌కు భారత్ ఆతిథ్యమిస్తాయని ఐబా అధ్యక్షుడు చింగ్ కూవు తెలిపారు. ఇప్పటికే వచ్చే ఏడాది మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్ భారత్‌లో ఖరారైంది. 1990లో ప్రపంచకప్ ముంబైలో, 2010లో కామన్వెల్త్ గేమ్స్ న్యూఢిల్లీలో జరిగాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్
ఎప్పుడు : 2021
ఎవరు : ఐబా
ఎక్కడ : భారత్‌లో
అవార్డులుగ్లోబల్ రోబోట్ ఒలింపియాడ్‌లో భారత్‌కు 2 అవార్డులుఅమెరికాలో నిర్వహించిన మొదటి గ్లోబల్ రోబోట్ ఒలింపియాడ్‌లో భారత విద్యార్థుల బృందం రెండు అవార్డులు గెలుచుకుంది. వాషింగ్టన్‌లో జూలై 19న ముగిసిన మూడు రోజుల అంతర్జాతీయ పోటీల్లో 157 దేశాల విద్యార్థులు పాల్గొన్నారు. ముంబైకి చెందిన 15 ఏళ్ల రాకేశ్ నేతృత్వంలోని బృందం అభివృద్ధి చేసిన ఝంగ్ హెంగ్ ఇంజనీరింగ్ డిజైన్‌కు బంగారు పతకం, గ్లోబల్ చాలెంజ్ మ్యాచ్ డిజైన్‌కు కాంస్య పతకం దక్కాయి.
వార్తల్లో వ్యక్తులుభారత 14వ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ భారతదేశ 14వ రాష్ట్రపతిగా ఎన్డీయే పక్షాల అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్ భారీ మెజార్టీతో గెలుపొందారు. విపక్షాల అభ్యర్థి మీరా కుమార్‌పై ఆయన 65.6శాతం ఓట్లతో విజయం సాధించారు. తద్వారా రాష్ట్రపతి భవన్‌లో అడుగుపెట్టబోతున్న తొలి బీజేపీ నాయకుడుగా రామ్‌నాథ్ కోవింద్ రికార్డు సృష్టించారు.
జూలై 17న జరిగిన రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ జూలై 20న జరిగింది. మొత్తం ఎనిమిది రౌండ్లలో చేపట్టిన ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియలో రామ్‌నాథ్‌కు 2,930 ఓట్లు పోలవ్వగా (వాటి విలువ 7,02,044), విపక్ష అభ్యర్థి మీరా కుమార్‌కు 1,844 ఓట్లు (వాటి విలువ 3,67,314) పోలైనట్టు అధికారులు వెల్లడించారు. ఈ ఎన్నికలో 77 ఓట్లు చెల్లలేదని తెలిపారు. భారత 14వ రాష్ట్రపతిగా రామ్‌నాథ్ ఎన్నికై నట్టు లోక్‌సభ సెక్రటరీ జనరల్ అనూప్ మిశ్రా మీడియాకు అధికారికంగా వెల్లడించారు.
23న ప్రణబ్‌కు వీడ్కోలు ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీకాలం జులై 24తో ముగియనుంది. జూలై 23న ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఘనంగా వీడ్కోలు పలికేందుకు లోక్‌సభ సమావేశాన్ని ఏర్పాటుచేసింది. పార్లమెంట్‌లోని సెంట్రల్ హాలులో నిర్వహించే ఈ కార్యక్రమంలో అధికార, విపక్ష నేతలంతా పాల్గొంటారు.
25న కోవింద్ ప్రమాణస్వీకారం జూలై 25న రామ్‌నాథ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జేఎస్ ఖేహర్ కోవింద్‌తో రాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేయిస్తారు. ఈ వేడుకకు అన్ని రాష్ట్రల గవర్నర్‌లు, ముఖ్యమంత్రులతోపాటు పలు దేశాలకు చెందిన ప్రముఖులకు హాజరవుతారు.
పారాంఖ్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకు...
ఏమిటి : భారత దేశ 14వ రాష్ట్రపతి
ఎప్పుడు : జూలై 20
ఎవరు : రామ్‌నాథ్ కోవింద్
ఎందుకు : రాష్ట్రపతి ఎన్నికల్లో విజయం సాధించిన కోవింద్
నాగాలాండ్ సీఎంగా జెలియాంగ్ ప్రమాణంఈశాన్య రాష్ట్రం నాగాలాండ్ ముఖ్యమంత్రిగా జెలియాంగ్ తిరిగి ప్రమాణ స్వీకారం చేశారు. జులై 19న అసెంబ్లీలో షుర్హోజెలీ లీజిత్సు బలనిరూపణ పరీక్షను ఎదుర్కోవాల్సి ఉండగా ఆయన హాజరుకాలేదు. దీంతో నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్‌పీఎఫ్) నేత టీఆర్ జెలియాంగ్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ పీబీ ఆచార్య ఆహ్వానించారు. ఈ మేరకు జెలియాంగ్‌తో ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్ జులై 22లోగా బలనిరూపణ చేసుకోవాలని తెలిపారు.
దీంతో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరో పిస్తూ ఆయనను పార్టీ నుంచి ఎన్‌పీఎఫ్ బహిష్కరించింది. పురపాలక ఎన్నికల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించడంపై ఆం దోళనలు చెలరేగడంతో ఫిబ్రవరిలో సీఎం పదవికి జెలియాంగ్ రాజీనామా చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నాగాలాండ్ కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం
ఎప్పుడు : జూలై 19
ఎవరు : టీఆర్ జెలియాంగ్
ఎందుకు : బలనిరూపణ పరీక్షకు షుర్హోజెలీ లీజిత్సు హాజరు కానందుకు
‘తమిళ్ తలైవాస్’ అంబాసిడర్‌గా కమల్ హాసన్ప్రొ కబడ్డీ లీగ్‌లో తొలిసారి పాల్గొంటున్న ‘తమిళ్ తలైవాస్’ జట్టుకు ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారు. ఈ మేరకు ‘తమిళ్ తలైవాస్’ జట్టు తమ జెర్సీని జులై 20న చెన్నైలో ఆవిష్కరించి బ్రాండ్ అంబాసిడర్‌ను ప్రకటించింది. ఈ జట్టుకు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సహ యజమానిగా ఉన్నారు. ప్రొ కబడ్డీ లీగ్ సీజన్ 5 జూలై 28న హైదరాబాద్‌లో ప్రారంభమవుతుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ‘తమిళ్ తలైవాస్’ బ్రాండ్ అంబాసిడర్
ఎప్పుడు : జూలై 19
ఎవరు : కమల్‌హాసన్
మిస్‌వరల్డ్ కెనడా ఫైనల్‌లో ‘శ్రావ్య’ప్రతిష్టాత్మకమైన ‘మిస్ వరల్డ్ కెనడా-2017’పోటీల్లో ఖమ్మం జిల్లా వైరా మండలానికి చెందిన కల్యాణపు శ్రావ్య ఫైనల్‌కు అర్హత సాధించింది. కెనడాలోని టొరంటోలో జరుగుతున్న ఈ పోటీల్లో ప్రతిభ కనబరచి ఫైనల్ పోటీకి ఎంపికైంది. వైరాకు చెందిన అగ్రికల్చర్ ఆఫీసర్ రవికుమార్ కూతురైన శ్రావ్య స్థానికంగా ఏడో తరగతి వరకు చదివింది. ఉన్నత విద్యను ఆదిలాబాద్‌లో పూర్తి చేసుకుని.. ప్రస్తుతం కెనడాలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది.
ఇప్పటికే ఈ ఏడాది మార్చిలో ‘మిస్ నార్తర్న్ ఆల్బర్టా వరల్డ్- 2017’కిరీటాన్ని దక్కించుకుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మిస్‌వరల్డ్ కెనడా ఫైనల్‌లో తెలుగు అమ్మాయి
ఎప్పుడు : జూలై 20
ఎవరు : కల్యాణపు శ్రావ్య
ఎక్కడ : కెనడా
బలపరీక్షలో నెగ్గిన జెలియాంగ్నాగాలాండ్ సీఎం టీఆర్ జెలియాంగ్ అసెంబ్లీ బలపరీక్షలో నెగ్గారు. అసెంబ్లీలో మొత్తం 59 మంది సభ్యులుండగా.. జెలియాంగ్‌కు అనుకూలంగా 47 మంది ఓటేశారు. వీరిలో నాగా పీపుల్స్ ఫ్రంట్ ఎమ్మెల్యేలు 36 మందితో పాటు నలుగురు బీజేపీ సభ్యులు, ఏడుగురు స్వతంత్రులు ఉన్నారు. మాజీ సీఎం లీజిట్సుకు 11 ఓట్లు పడగా.. వారిలో 10 మంది ఎన్పీఎఫ్, ఒక స్వతంత్ర సభ్యుడు ఉన్నారు. 2018లో నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బలపరీక్ష నెగ్గిన సీఎం జెలియాంగ్
ఎప్పుడు : జూలై 21
ఎక్కడ : నాగాలాండ్
బ్రిటన్ సుప్రీంకోర్టు అధ్యక్షురాలిగా బ్రెండా మజోరి బ్రిటన్ సుప్రీంకోర్టు తొలి మహిళా అధ్యక్షురాలిగా సీనియర్ న్యాయమూర్తి బ్రెండా మజోరి నియమితులయ్యారు. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న లార్డ్ న్యూబర్గర్ 2017లో సెప్టెంబర్‌లో పదవీ విరమణ చేయనున్నారు. ఆ తర్వాత బ్రెండా అధ్యక్ష బాధ్యతలు చేపడతారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బ్రిటన్ సుప్రీంకోర్టు తొలి మహిళా అధ్యక్షురాలు
ఎప్పుడు : జూలై 21
ఎవరు : బ్రెండా మజోరి
ఎక్కడ : బ్రిటన్
వయొలిన్ విద్వాంసుడు కొమండూరి కన్నుమూతప్రముఖ వయొలిన్ విద్వాంసుడు కొమండూరి కృష్ణమాచార్యులు జూలై 22న కన్నుమూశారు. కొమండూరి 1936లో పశ్చిమ గోదావరి జిల్లా ఐ.భీమవరంలో జన్మించారు. ద్వారం నరసింహనాయుడు వద్ద వయొలిన్ నేర్చుకున్నారు. విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో క్యాజువల్ ఆర్టిస్టుగా కొంతకాలం పనిచేసిన ఆయన 1974లో విశాఖపట్నం ఆకాశవాణి కేంద్రంలో నిలయ విద్వాంసుడిగా చేరి 1994 వరకు ఇక్కడే పనిచేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వయొలిన్ విద్వాంసుడు కొమండూరి కృష్ణమాచార్యులు కన్నుమూత
ఎప్పుడు : జూలై 22
ఎక్కడ : హైదరాబాద్
రాష్ట్రపతి కార్యదర్శిగా సంజయ్ కొఠారీభారత కొత్త రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు కార్యదర్శిగా పబ్లిక్ ఎంటర్‌ప్రెజైస్ సెలెక్షన్ బోర్డు (పీఈఎస్‌బీ) చైర్మన్ సంజయ్ కొఠారీని కేంద్రం నియమించింది. ప్రెస్ కార్యదర్శిగా సీనియర్ పాత్రికేయుడు అశోక్ మాలిక్, సంయుక్త కార్యదర్శిగా గుజరాత్ కేడర్‌కు చెందిన సీనియర్ అటవీ శాఖ అధికారి భరత్ లాల్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీరు రెండేళ్లపాటు పదవిలో కొనసాగుతారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రాష్ట్రపతి కొత్త కార్యదర్శి నియామకం
ఎప్పుడు : జూలై 22
ఎవరు : సంజయ్ కొఠారీ
రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ చివరి ప్రసంగంభారత 13వ రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ చివరిసారిగా ప్రసంగించారు. ఈ మేరకు జూలై 24న పదవీ విరమణ చేసిన ప్రణబ్ రాష్ట్రపతి భవన్‌లో జాతినుద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా తన 50 ఏళ్ల రాజకీయ జీవితంలో భారత రాజ్యాంగాన్ని పవిత్ర గ్రంథంగా, పార్లమెంట్‌ను ఆలయంగా భావించానన్నారు. భారతదేశం అంటే కేవలం ఒక భౌగోళిక ప్రాంతమే కాదు ఇది ఉన్నత ఆలోచనలు, తత్త్వజ్ఞానం, వివేకం, పారిశ్రామిక మేధస్సు, ఆవిష్కరణలు, ఎన్నో అనుభవాల సమాహారం అని పేర్కొన్నారు. ప్రపంచ ప్రమాణాల స్థాయికి చేరేలా దేశంలోని ఉన్నత విద్యా సంస్థల్ని తీర్చి దిద్దాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రణబ్ జీవిత చరిత్రప్రణబ్ ముఖర్జీ 1935 డిసెంబర్ 11న పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని బీర్బూమ్ జిల్లాలో ఉన్న మిరాఠి గ్రామంలో జన్మించారు. ఎంఏ(చరిత్ర), ఎంఏ(రాజనీతిశాస్త్రం), ఎల్‌ఎల్‌బీ, డీ.లిట్ (విద్యాసాగర్ కాలేజీ) వంటి విద్యార్హతలు సంపాదించారు. చదువు పూర్తయిన అనంతరం కొంతకాలం టీచర్, జర్నలిస్టుగా పనిచేశారు.
రాజకీయ జీవితం

- ఒకరు లేదా ఇద్దరు పైలట్లు నడపొచ్చు. టేకాఫ్ సమయంలో గరిష్ట బరువు 29,700 కిలోలు
- ఎత్తులో ఉన్నప్పుడు గరిష్ట వేగం గంటకు 2,400 కి.మీ. సముద్రమట్టంలో వేగం 1450 కి.మీ.
- 1000 కి.మీ. పరిధిలో యుద్ధ విన్యాసాలు చేయగలదు.
- గన్స్: జీఎస్‌హెచ్-301 ఆటోకేనన్ (150 రౌండ్స్)
- రాకెట్‌లు : ఐదు
- క్షిపణులు: గగనతలం నుంచి గగనతలం(రెండు), గగనతలం నుంచి భూఉపరితలంపైకి(ఒకటి), యాంటీ రేడియేషన్ మిస్సైల్, యాంటీ షిఫ్ మిస్సైల్
- బాంబులు: కేఎబీ-500కేఆర్, కేఏబీ-500ఎల్, కేఏబీ-500ఎస్

- రామ్‌నాథ్ కోవింద్ ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్ జిల్లా, దేహాత్ జిల్లా, దేరాపూర్ తాలూకా పారాంఖ్ గ్రామంలో 1945 అక్టోబర్ 1న దళిత(ఎస్సీ) కోలీ కుటుంబంలో జన్మించారు.
- కాన్పూర్ వర్సిటీ నుంచి బీకాం, ఎల్‌ఎల్‌బీ పట్టాలు పొందారు. 1971లో న్యాయవాదిగా స్థిరపడ్డారు.
- రైతు కుటుంబంలో పుట్టిన కోవింద్‌కు 1974 మే 30న సవితతో పెళ్లయింది. వారి సంతానం ప్రశాంత కుమార్, స్వాతి.
- సివిల్ సర్వీస్ పరీక్షల్లో మూడో యత్నంలో ఉత్తీర్ణుడైన ఆయన ఐఏఎస్ రాకపోవడంతో న్యాయవాద వృత్తికే అంకితమయ్యారు.
- ఢిల్లీ హైకోర్టులోనూ, సుప్రీంకోర్టులోనూ న్యాయవాదిగా, 1980 నుంచి 1993 వరకు సుప్రీంకోర్టులో స్టాండింగ్ కౌన్సెల్‌గా ఉన్నారు.
- 1977 నుంచి కొంతకాలం అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్‌కి ఆర్థిక శాఖకు సంబంధించి వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశారు.
- బీజేపీలో చేరాక యూపీలో కల్యాణ్‌సింగ్, రాజ్‌నాథ్‌సింగ్ ప్రభుత్వాలకు అనధికార న్యాయసలహాదారుగా వ్యవహరించారు.
- 1986లో డిప్రెస్డ్ క్లాసెస్ లీగల్ ఎయిడ్ బ్యూరో సెక్రటరీగా పనిచేశారు.
- 1994 నుంచి 2006 వరకూ రెండుసార్లు యూపీ నుంచి రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు.
- బీజేపీ దళిత మోర్చా అధ్యక్షుడిగానూ అఖిల భారత కోలీ సమాజ్ అధ్యక్షుడి గానూ సేవలందించారు.
- వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ రామ్‌నాథ్ ప్రసంగించారు.
- 2016 ఆగస్టు 16 నుంచి 2017 జూన్ 20 వరకు బిహార్ గవర్నర్‌గా పనిచేశారు.
ఏమిటి : భారత దేశ 14వ రాష్ట్రపతి
ఎప్పుడు : జూలై 20
ఎవరు : రామ్‌నాథ్ కోవింద్
ఎందుకు : రాష్ట్రపతి ఎన్నికల్లో విజయం సాధించిన కోవింద్
నాగాలాండ్ సీఎంగా జెలియాంగ్ ప్రమాణంఈశాన్య రాష్ట్రం నాగాలాండ్ ముఖ్యమంత్రిగా జెలియాంగ్ తిరిగి ప్రమాణ స్వీకారం చేశారు. జులై 19న అసెంబ్లీలో షుర్హోజెలీ లీజిత్సు బలనిరూపణ పరీక్షను ఎదుర్కోవాల్సి ఉండగా ఆయన హాజరుకాలేదు. దీంతో నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్‌పీఎఫ్) నేత టీఆర్ జెలియాంగ్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ పీబీ ఆచార్య ఆహ్వానించారు. ఈ మేరకు జెలియాంగ్‌తో ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్ జులై 22లోగా బలనిరూపణ చేసుకోవాలని తెలిపారు.
దీంతో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరో పిస్తూ ఆయనను పార్టీ నుంచి ఎన్‌పీఎఫ్ బహిష్కరించింది. పురపాలక ఎన్నికల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించడంపై ఆం దోళనలు చెలరేగడంతో ఫిబ్రవరిలో సీఎం పదవికి జెలియాంగ్ రాజీనామా చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నాగాలాండ్ కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం
ఎప్పుడు : జూలై 19
ఎవరు : టీఆర్ జెలియాంగ్
ఎందుకు : బలనిరూపణ పరీక్షకు షుర్హోజెలీ లీజిత్సు హాజరు కానందుకు
‘తమిళ్ తలైవాస్’ అంబాసిడర్‌గా కమల్ హాసన్ప్రొ కబడ్డీ లీగ్‌లో తొలిసారి పాల్గొంటున్న ‘తమిళ్ తలైవాస్’ జట్టుకు ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారు. ఈ మేరకు ‘తమిళ్ తలైవాస్’ జట్టు తమ జెర్సీని జులై 20న చెన్నైలో ఆవిష్కరించి బ్రాండ్ అంబాసిడర్‌ను ప్రకటించింది. ఈ జట్టుకు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సహ యజమానిగా ఉన్నారు. ప్రొ కబడ్డీ లీగ్ సీజన్ 5 జూలై 28న హైదరాబాద్‌లో ప్రారంభమవుతుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ‘తమిళ్ తలైవాస్’ బ్రాండ్ అంబాసిడర్
ఎప్పుడు : జూలై 19
ఎవరు : కమల్‌హాసన్
మిస్‌వరల్డ్ కెనడా ఫైనల్‌లో ‘శ్రావ్య’ప్రతిష్టాత్మకమైన ‘మిస్ వరల్డ్ కెనడా-2017’పోటీల్లో ఖమ్మం జిల్లా వైరా మండలానికి చెందిన కల్యాణపు శ్రావ్య ఫైనల్‌కు అర్హత సాధించింది. కెనడాలోని టొరంటోలో జరుగుతున్న ఈ పోటీల్లో ప్రతిభ కనబరచి ఫైనల్ పోటీకి ఎంపికైంది. వైరాకు చెందిన అగ్రికల్చర్ ఆఫీసర్ రవికుమార్ కూతురైన శ్రావ్య స్థానికంగా ఏడో తరగతి వరకు చదివింది. ఉన్నత విద్యను ఆదిలాబాద్‌లో పూర్తి చేసుకుని.. ప్రస్తుతం కెనడాలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది.
ఇప్పటికే ఈ ఏడాది మార్చిలో ‘మిస్ నార్తర్న్ ఆల్బర్టా వరల్డ్- 2017’కిరీటాన్ని దక్కించుకుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మిస్‌వరల్డ్ కెనడా ఫైనల్‌లో తెలుగు అమ్మాయి
ఎప్పుడు : జూలై 20
ఎవరు : కల్యాణపు శ్రావ్య
ఎక్కడ : కెనడా
బలపరీక్షలో నెగ్గిన జెలియాంగ్నాగాలాండ్ సీఎం టీఆర్ జెలియాంగ్ అసెంబ్లీ బలపరీక్షలో నెగ్గారు. అసెంబ్లీలో మొత్తం 59 మంది సభ్యులుండగా.. జెలియాంగ్‌కు అనుకూలంగా 47 మంది ఓటేశారు. వీరిలో నాగా పీపుల్స్ ఫ్రంట్ ఎమ్మెల్యేలు 36 మందితో పాటు నలుగురు బీజేపీ సభ్యులు, ఏడుగురు స్వతంత్రులు ఉన్నారు. మాజీ సీఎం లీజిట్సుకు 11 ఓట్లు పడగా.. వారిలో 10 మంది ఎన్పీఎఫ్, ఒక స్వతంత్ర సభ్యుడు ఉన్నారు. 2018లో నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బలపరీక్ష నెగ్గిన సీఎం జెలియాంగ్
ఎప్పుడు : జూలై 21
ఎక్కడ : నాగాలాండ్
బ్రిటన్ సుప్రీంకోర్టు అధ్యక్షురాలిగా బ్రెండా మజోరి బ్రిటన్ సుప్రీంకోర్టు తొలి మహిళా అధ్యక్షురాలిగా సీనియర్ న్యాయమూర్తి బ్రెండా మజోరి నియమితులయ్యారు. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న లార్డ్ న్యూబర్గర్ 2017లో సెప్టెంబర్‌లో పదవీ విరమణ చేయనున్నారు. ఆ తర్వాత బ్రెండా అధ్యక్ష బాధ్యతలు చేపడతారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బ్రిటన్ సుప్రీంకోర్టు తొలి మహిళా అధ్యక్షురాలు
ఎప్పుడు : జూలై 21
ఎవరు : బ్రెండా మజోరి
ఎక్కడ : బ్రిటన్
వయొలిన్ విద్వాంసుడు కొమండూరి కన్నుమూతప్రముఖ వయొలిన్ విద్వాంసుడు కొమండూరి కృష్ణమాచార్యులు జూలై 22న కన్నుమూశారు. కొమండూరి 1936లో పశ్చిమ గోదావరి జిల్లా ఐ.భీమవరంలో జన్మించారు. ద్వారం నరసింహనాయుడు వద్ద వయొలిన్ నేర్చుకున్నారు. విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో క్యాజువల్ ఆర్టిస్టుగా కొంతకాలం పనిచేసిన ఆయన 1974లో విశాఖపట్నం ఆకాశవాణి కేంద్రంలో నిలయ విద్వాంసుడిగా చేరి 1994 వరకు ఇక్కడే పనిచేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వయొలిన్ విద్వాంసుడు కొమండూరి కృష్ణమాచార్యులు కన్నుమూత
ఎప్పుడు : జూలై 22
ఎక్కడ : హైదరాబాద్
రాష్ట్రపతి కార్యదర్శిగా సంజయ్ కొఠారీభారత కొత్త రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు కార్యదర్శిగా పబ్లిక్ ఎంటర్‌ప్రెజైస్ సెలెక్షన్ బోర్డు (పీఈఎస్‌బీ) చైర్మన్ సంజయ్ కొఠారీని కేంద్రం నియమించింది. ప్రెస్ కార్యదర్శిగా సీనియర్ పాత్రికేయుడు అశోక్ మాలిక్, సంయుక్త కార్యదర్శిగా గుజరాత్ కేడర్‌కు చెందిన సీనియర్ అటవీ శాఖ అధికారి భరత్ లాల్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీరు రెండేళ్లపాటు పదవిలో కొనసాగుతారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రాష్ట్రపతి కొత్త కార్యదర్శి నియామకం
ఎప్పుడు : జూలై 22
ఎవరు : సంజయ్ కొఠారీ
రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ చివరి ప్రసంగంభారత 13వ రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ చివరిసారిగా ప్రసంగించారు. ఈ మేరకు జూలై 24న పదవీ విరమణ చేసిన ప్రణబ్ రాష్ట్రపతి భవన్‌లో జాతినుద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా తన 50 ఏళ్ల రాజకీయ జీవితంలో భారత రాజ్యాంగాన్ని పవిత్ర గ్రంథంగా, పార్లమెంట్‌ను ఆలయంగా భావించానన్నారు. భారతదేశం అంటే కేవలం ఒక భౌగోళిక ప్రాంతమే కాదు ఇది ఉన్నత ఆలోచనలు, తత్త్వజ్ఞానం, వివేకం, పారిశ్రామిక మేధస్సు, ఆవిష్కరణలు, ఎన్నో అనుభవాల సమాహారం అని పేర్కొన్నారు. ప్రపంచ ప్రమాణాల స్థాయికి చేరేలా దేశంలోని ఉన్నత విద్యా సంస్థల్ని తీర్చి దిద్దాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రణబ్ జీవిత చరిత్రప్రణబ్ ముఖర్జీ 1935 డిసెంబర్ 11న పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని బీర్బూమ్ జిల్లాలో ఉన్న మిరాఠి గ్రామంలో జన్మించారు. ఎంఏ(చరిత్ర), ఎంఏ(రాజనీతిశాస్త్రం), ఎల్‌ఎల్‌బీ, డీ.లిట్ (విద్యాసాగర్ కాలేజీ) వంటి విద్యార్హతలు సంపాదించారు. చదువు పూర్తయిన అనంతరం కొంతకాలం టీచర్, జర్నలిస్టుగా పనిచేశారు.
రాజకీయ జీవితం
- 1969లో తొలిసారిగా రాజ్యసభకు ఎన్నిక
- 1975, 81, 93, 1999లోనూ రాజ్యసభకు ఎన్నిక.
- 1980-85 వరకు రాజ్యసభలో అధికారపక్ష నేత
- 1973-74 కాలంలో పారిశ్రామికాభివృద్ధి శాఖ ఉపమంత్రిగా
- 1974లో కొన్నినెలలు రవాణా, నౌకాయాన ఉపమంత్రిగా...
- 1974-75లో ఆర్థికశాఖ ఉపమంత్రిగా..
- 1975-77లో రెవిన్యూ, బ్యాంకింగ్ సహాయమంత్రిగా..
- 1980-82లో వాణిజ్యం, గనుల కేబినెట్ మంత్రిగా..
- 1982-84లో ఆర్థికమంత్రిగా..
- 1991-96లో ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడిగా..
- 1993-95లో వాణిజ్యశాఖ మంత్రిగా..
- 1995-96లో విదేశాంగమంత్రిగా.. విధులు నిర్వర్తించారు.
- జంగీపూర్ నుంచి 2004లో లోక్‌సభకు ఎన్నిక
- 2004-06లో రక్షణశాఖ మంత్రిగా..
- 2006-09లో విదేశాంగమంత్రిగా..
- 2009-2012లో ఆర్థికమంత్రిగా పనిచేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ చివరి ప్రసంగం
ఎప్పుడు : జూలై 24
ఎక్కడ : రాష్ట్రపతి భవన్, న్యూఢిల్లీ
ఎందుకు : పదవీకాలం ముగిసినందున
ఇస్రో మాజీ చైర్మన్ యూఆర్ రావు కన్నుమూతఇస్రో మాజీ చైర్మన్, తొలి ఉపగ్రహం ‘ఆర్యభట్ట’ సూత్రధారి ఉడిపి రామచంద్ర రావు జూలై 24న బెంగళూరులో కన్నుమూశారు.
రావు 1932 మార్చి 10న కర్ణాటక ఉడిపి జిల్లాలోని అడమూరు గ్రామంలో జన్మించారు. బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఎంఎస్సీ పూర్తి చేసిన రావు అహ్మదాబాద్‌లోని ఫిజికల్ రీసెర్చ్ లేబొరేటరీలో భారత అంతరిక్ష పితామహుడు విక్రమ్ సారాభాయ్ మార్గదర్శకత్వంలో పీహెచ్‌డీ చేశారు. కాస్మిక్ రే (విశ్వకిరణ) శాస్త్రవేత్తగా కెరీర్‌ను ప్రారంభించి కొన్నాళ్లు అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, టెక్సాస్ వర్సిటీల్లో అధ్యాపకుడిగా చేశారు. 1966లో సారాభాయ్‌తో పాటు భారత్‌కు తిరిగివచ్చి ఫిజికల్ రీసెర్చ్ లేబొరేటరీలో ప్రొఫెసర్‌గా చేరారు. 1972లో ఇండియన్ సైంటిఫిక్ శాటిలైట్ ప్రాజెక్టులో డెరైక్టర్‌గా చేరారు. 1984లో భారత అంతరిక్ష కమిషన్ చైర్మన్‌గా, అంతరిక్ష విభాగ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన రావు రాకెట్ సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధికి కృషి చేశారు.
కాస్మిక్ రేస్, ఖగోళ భౌతికశాస్త్రం, ఉపగ్రహాలు తదితర అంశాలపై 350 పరిశోధన పత్రాలు సమర్పించిన రావు పలు పుస్తకాలు రాశారు. 25 వర్సిటీల నుంచి గౌరవ డాక్టరేట్లు అందుకున్నారు. ప్రభుత్వం ఆయనను 1976లో పద్మభూషణ్, 2017లో పద్మవిభూషణ్ పురస్కారాలతో సత్కరించింది. వాషింగ్టన్‌లోని ప్రఖ్యాత ‘శాటిలైట్ హాల్ ఆఫ్ ఫేమ్’ తోపాటు మెక్సికోలోని ఐఏఎఫ్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో సభ్యత్వం పొందిన తొలి భారత అంతరిక్ష శాస్త్రవేత్తగా కూడా రావు రికార్డు సృష్టించారు.
రావు ప్రస్తుతం అహ్మదాబాద్‌లోని ఫిజికల్ రీసెర్చ్ లేబొరేటరీ పాలకమండలి చైర్మన్, తిరువనంతపురంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్‌స అండ్ టెక్నాలజీ చాన్‌సలర్ పదవుల్లో కొనసాగుతున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత అంతరిక్ష శాస్త్రవేత్త యూఆర్ రావు కన్నుమూత
ఎప్పుడు : జూలై 24
ఎక్కడ : బెంగళూరు
రాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేసిన రామ్‌నాథ్ కోవింద్ దేశ 14వ రాష్ట్రపతిగా రామ్‌నాథ్ కోవింద్ (71) ప్రమాణ స్వీకారోత్సవం సంప్రదాయబద్ధంగా, అట్టహాసంగా జరిగింది. పార్లమెంట్ సెంట్రల్ హాలులో జూలై 25న నిర్వహించిన కార్యక్రమంలో కోవింద్‌తో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్ ప్రమాణం చేయించారు. న్యాయవాదిగా వృత్తి జీవితం ప్రారంభించి, రాజకీయ నాయకుడిగా ఎదిగిన కోవింద్.. రాష్ట్రపతి భవన్‌లో అడుగుపెట్టిన మొదటి బీజేపీ నేతగా, రెండో దళిత వ్యక్తిగా నిలిచారు.
మధ్యాహ్నం 12.15 గంటలకు..
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జూలై 25న మధ్యాహ్నం 12 గంటల సమయంలో కోవింద్‌ను అధికారిక వాహనంలో రాష్ట్రపతి భవన్ నుంచి పార్లమెంట్‌కు తీసుకొచ్చారు. వాహన శ్రేణితో పాటు అశ్వదళం వెంటరాగా దారి పొడవునా త్రివిధ దళాలకు చెందిన జవాన్లు సైనిక వందనం సమర్పించారు. జాతీయ గీతాలాపన తర్వాత ప్రమాణస్వీకార కార్యక్రమం ప్రారంభమైంది. రాష్ట్రపతి ఎన్నికల్లో కోవింద్ గెలుపొందినట్లు ఈసీ విడుదల చేసిన ప్రకటనను కేంద్ర హోం శాఖ కార్యదర్శి రాజీవ్ మెహ్‌రిషి చదివి వినిపించారు. అనంతరం రాష్ట్రపతిగా ఎన్నికై న కోవింద్‌తో మధ్యాహ్నం 12.15 గంటలకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్ ప్రమాణస్వీకారం చేయించారు.
కోవింద్‌కు కొత్త ట్వీటర్ అకౌంట్, వెబ్‌సైట్
నూతన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు కేటాయించిన కొత్త ట్వీటర్ అకౌంట్ @RashtrapatiBhvn పనిచేయడం ప్రారంభించింది. ప్రమాణ స్వీకారోత్సవం తరువాత ఆయన చేసిన ప్రసంగం విషయాలను ఆ ట్వీటర్ హ్యాండిల్‌లో చూడొచ్చు. పదవీ విరమణ చేసిన ప్రణబ్ ముఖర్జీ వినియోగించిన అధికార ట్వీటర్ చరిత్రను @ POI13 అనే హ్యాండిల్ పేరిట రికార్డుల్లో భద్రపరిచారు. రాష్ట్రపతి భవన్ అధికారిక వెబ్‌సైట్‌ను కూడా పునర్వ్యవస్థీకరించి అందుబాటులోకి తెచ్చారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రమాణస్వీకారం చేసిన దేశ 14వ రాష్ట్రపతి
ఎప్పుడు : జూలై 25
ఎవరు : రామ్‌నాథ్ కోవింద్
ఎక్కడ : పార్లమెంట్ సెంట్రల్ హాల్, న్యూఢిల్లీ
విద్యావేత్త యశ్‌పాల్ కన్నుమూతఅంతర్జాతీయంగా పేరుగాంచిన ప్రముఖ విద్యావేత్త, భౌతిక శాస్త్రవేత్త ప్రొఫెసర్ యశ్‌పాల్ సింగ్ (90) జూలై 24న కన్నుమూశారు.
ప్రస్తుత పాకిస్తాన్‌లోని పంజాబ్‌లో 1926లో జన్మించిన యశ్‌పాల్ టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (టీఐఎఫ్‌ఆర్)లో తన కెరీర్‌ను ప్రారంభించారు. అనంతరం అమెరికా వెళ్లి మసాచూసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో పీహెచ్‌డీ పూర్తి చేశారు. తిరిగి భారత్‌కు వచ్చిన ఆయన టీఐఎఫ్‌ఆర్‌లో తన ఉద్యోగాన్ని కొనసాగించారు. 1986-91 మధ్య యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్‌గాను యశ్‌పాల్ పనిచేశారు. విశ్వకిరణాల (కాస్మిక్ రేస్)పై అధ్యయనంలో యశ్‌పాల్ కీలక పాత్ర వహించారు. భారతీయ విద్యావిధానంలో పలు సంస్కరణలకు ఆయన ఆద్యుడిగా నిలిచారు. ప్రభుత్వం ఆయనను పద్మ విభూషణ్, పద్మ భూషణ్ పురస్కారాలతో గౌరవించింది.
విద్యా విధానం రూపకల్పనలోనూ యశ్‌పాల్ విశేష కృషి చేశారు. జాతీయ విద్యా విధానంపై.. జాతీయ విద్యా పరిశోధన, శిక్షణా మండలి (ఎన్‌సీఈఆర్‌టీ) ఏర్పాటు చేసిన కమిటీకి యశ్‌పాల్ నేతృత్వం వహించారు. 2009లో మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఉన్నత విద్యలో తీసుకురావాల్సిన సంస్కరణలపై యశ్‌పాల్ సారథ్యంలో ఓ కమిటీని నియమించింది. ఇది యశ్‌పాల్ కమిటీగా పేరుగాంచింది. సైన్సుకు ప్రాచుర్యం కల్పించినందుకుగాను ఐక్యరాజ్యసమితి విద్య, వైజ్ఞానిక, సాంస్కృతిక సంస్థ (యునెస్కో) ఆయనకు ‘కళింగ ప్రైజ్’ను ప్రదానం చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : విద్యావేత్త యశ్‌పాల్ కన్నుమూత
ఎప్పుడు : జూలై 24
ఎవరు : విద్యావేత్త, భౌతిక శాస్త్రవేత
ఎక్కడ : నోయిడా, న్యూఢిల్లీ
ఆల్ఫాబెట్ బోర్డ్‌కు ఎంపికైన సుందర్ పిచాయ్ భారత సంతతికి చెందిన టెక్ నిపుణుడు, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్(45) గూగుల్ పేరెంటల్ కంపెనీ, గ్లోబల్ టెక్ దిగ్గజం అల్పాబెట్ బోర్డ్ ఆఫ్ డెరైక్టర్స్‌కు ఎంపికయ్యారు. యూ ట్యూబ్, గూగుల్ యాజమాన్య సంస్థ అయిన ఆల్ఫాబెట్ బోర్డుకు పిచాయ్ నియమితులయ్యారు. గూగుల్ సీఈవోగా సుందర్ మంచి కృషిని కొనసాగిస్తున్నారని, భాగస్వామ్యాలు, అద్భుతమైన నూతన ఆవిష్కరణలతో బలమైన అభివృద్ధిని నమోదు చేస్తున్నారని ఆల్ఫాబెట్ ఒక ప్రకటనలో తెలిపింది. ఆల్ఫాబెట్ ఇంక్ జూలై 24న ప్రకటించిన త్రైమాసిక ఫలితాల్లో ఆదాయంలో 21 శాతం పెరుగుదలను నమోదు చేసింది.
సుందర్ పిచాయ్ 2004లో గూగుల్ చేరారు. 2015 ఆగస్టులో గూగుల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నియమితులయ్యారు.
క్విక్ రివ్యూ:ఏమిటి : ఆల్ఫాబెట్ బోర్డుకు ఎంపికైన సుందర్ పిచాయ్
ఎప్పుడు : జూలై 25
ఎవరు : గూగుల్ సీఈవో

No comments:
Post a Comment