వార్తల్లో వ్యక్తులు ఆగష్టు 2013
సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ అధ్యక్షుడిగా మైకేల్ జొతోడియాతిరుగుబాటు నాయకుడు మైకేల్ జొతోడియా సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ (సీఏఆర్) కొత్త అధ్యక్షుడిగా ఆగస్టు 18న ప్రమాణ స్వీకారం చేశారు. ‘సెలెకా’ తిరుగుబాటు సంకీర్ణానికి ఆయన నాయకుడు. సుదీర్ఘకాలం పాలన సాగిస్తున్న ప్రాంకోసిస్ బూజీజెను మార్చిలో అధికారం నుంచి తొలగించి తనకు తానే అధ్యక్షుడిగా జొతొడియా ప్రకటించుకున్నాడు.
ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎన్.వి.రమణ పేరు సిఫారసుఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎన్.వి.రమణ పేరును భారత ప్రధాన న్యాయమూర్తి పి.సదాశివం నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. ఆయన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు. రెండువారాల్లోగా నియామకం జరగవచ్చని కేంద్ర న్యాయశాఖ వర్గాలు వెల్లడించాయి. జస్టిస్ రమణ
1957 ఆగస్టు 27న కృష్ణా జిల్లా పొన్నవరం గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. హైకోర్టుతో పాటు కేంద్ర, రాష్ట్ర పరిపాలనా ట్రిబ్యునళ్లలో ప్రాక్టీస్ చేశారు. సుప్రీంకోర్టులో కూడా కేసులు వాదించారు. రాజ్యాంగపరమైన, క్రిమినల్, సర్వీస్, అంతరాష్ట్ర నదీ జలాల సంబంధిత కేసుల వాదన ఆయన ప్రత్యేకత. 2000, జూన్ 27న హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు.
అమీర్ఖాన్కు ఉర్దూ యూనివర్సిటీ డాక్టరేట్హైదరాబాద్లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ ప్రముఖ బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్కు డాక్టరేట్ ప్రదానం చేయాలని నిర్ణయించింది. ఈ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకునేవారిలో అమీర్ఖాన్తోపాటు సచార్ కమిటీ చైర్మన్ జస్టిస్ రాజేంద్ర సచార్ కూడా ఉన్నారు. యూనివర్సిటీ ఐదో స్నాతకోత్సవం సందర్భంగా ఆగస్టు 24న వీరికి డాక్టరేట్లు ప్రదానం చేస్తారు.ఎన్‌ఐఏ కొత్త చీఫ్‌గా శరద్ కుమార్
జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) నూతన చీఫ్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి శరద్ కుమార్ నియమితులయ్యారు. ప్రస్తుత చీఫ్ ఎన్.ఆర్.వాసన్ నుంచి కుమార్ బాధ్యతలు స్వీకరించనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. హర్యానా కేడర్ 1979 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన కుమార్ ప్రస్తుతం హర్యానా జైళ్ల శాఖ డీజీగా ఉన్నారు.
రిజర్‌వ బ్యాంక్ గవర్నర్‌గా రఘురామ్ రాజన్రిజర్‌వ బ్యాంక్ 23వ గవర్నర్‌గా ప్రముఖ ఆర్థిక నిపుణుడు రఘురామ్ రాజన్ నియమితులయ్యారు. ప్రస్తుత గవర్నర్ దువ్వూరి సుబ్బారావు స్థానంలో సెప్టెంబర్ 4న ఆయన బాధ్యతలు చేపడతారు. ప్రస్తుతం రఘురామ్ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కి గౌరవ ఆర్థిక సలహాదారుగా వ్యవహరిస్తున్నారు.
సంగీత దర్శకుడు దక్షిణామూర్తి కన్నుమూతదక్షిణ భారత భాషా సినిమాలకు అద్భుతమైన పాటలను అందించిన ప్రముఖ సంగీత దర్శకుడు వి.దక్షిణామూర్తి (94) ఆగస్టు 2న చెన్నైలో కన్నుమూశారు. 70 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో వందలాది మలయాళం, తమిళం, ఇతర భాషా చిత్రాలకు సంగీతం అందించారు. స్వయంగా కర్ణాటక సంగీత గాయకుడైన ఆయన మలయాళ సినీ సంగీతంపై తనదైన సొంత ముద్ర వేశారు. ఆయన చివరిగా 2008లో ‘మిజికల్ సాక్షి’ అనే మలయాళ చిత్రానికి సంగీతం అందించారు.

No comments:
Post a Comment