AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Sunday 26 November 2017

క్రీడలు అక్టోబరు 2016

క్రీడలు అక్టోబరు 2016
భారత్‌కు ఆసియా చాంపియన్‌‌స హాకీ ట్రోఫీ
ఆసియా చాంపియన్‌‌స హాకీ టోర్నమెంట్‌లో భారత జట్టు వరుసగా రెండోసారి విజేతగా నిలిచింది. అక్టోబర్ 30న జరిగిన ఫైనల్లో పాకిస్తాన్‌ను 3-2తో ఓడించి ట్రోఫీని కైవసం చేసుకుంది. 2011లో జరిగిన ప్రారంభ టోర్నమెంట్ ఫైనల్లోనూ భారత జట్టు పాకిస్తాన్‌నే ఓడించి తొలి చాంపియన్‌గా నిలిచింది. ఆతిథ్య మలేసియా జట్టు వరుసగా నాలుగోసారి కాంస్యం దక్కించుకుంది. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో మలేసియా 3-1 తేడాతో పెనాల్టీ షూటవుట్‌లో కొరియాపై నెగ్గింది.
భారత్‌కు వన్డే సిరీస్
న్యూజిలాండ్‌తో జరుగుతున్న 5 వన్డేల సిరీస్‌ను భారత్ 3-2తో సొంతం చేసుకుంది. అక్టోబర్ 29న విశాఖపట్నంలోని వైఎస్‌ఆర్ ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరిగిన చివరి వన్డేలో భారత్ 190 పరుగుల భారీ తేడాతో కివీస్‌పై విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకుంది. 18 పరుగులకే 5 వికెట్లు పడగొట్టిన అమిత్ మిశ్రా ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు అందుకోవడంతో పాటు మొత్తం 15 వికెట్లతో ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’గా కూడా నిలిచాడు.
సౌజన్యకు ఐటీఎఫ్ సింగిల్స్ టైటిల్
అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నమెంట్‌లో సింగిల్స్ టైటిల్‌ను హైదరాబాద్‌కు చెందిన 22 ఏళ్ల సౌజన్య భవిశెట్టి గెలుచుకుంది. పుణేలో అక్టోబర్ 29న జరిగిన ఫైనల్లో సౌజన్య 7-5, 6-2తో భారత్‌కే చెందిన మిహికా యాదవ్‌ను ఓడించింది. సౌజన్యకిది మూడో ఐటీఎఫ్ సింగిల్స్ టైటిల్. 2013లో షర్మ్ ఎల్ షేక్ (ఈజిప్టు), 2014లో ఔరంగాబాద్‌లో జరిగిన ఐటీఎఫ్ టోర్నీలలో సౌజన్య విజేతగా నిలిచింది.
హామిల్టన్‌కు ‘మెక్సికన్’ గ్రాండ్‌ప్రి టైటిల్
మెక్సికన్ గ్రాండ్ ప్రి టైటిల్‌ను మెర్సిడెస్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ గెలుచుకున్నాడు. 71 ల్యాప్‌ల రేసును 1 గంట 40 నిమిషాల 31.042 సెకన్లలో పూర్తి చేసి హామిల్టన్ అగ్రస్థానంలో నిలిచాడు. మెర్సిడెస్ మరో డ్రైవర్ రోస్‌బర్గ్ రెండు, రెడ్‌బుల్ డ్రైవర్ రికియార్డో మూడో స్థానంలో నిలిచారు. హామిల్టన్ కు ఇది ఈ సీజన్‌లో ఎనిమిదో విజయం కాగా, కెరీర్‌లో 51వ గెలుపు.
బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం కార్లోస్ మృతి
బ్రెజిల్ దిగ్గజ ఫుట్‌బాలర్, మాజీ కెప్టెన్ కార్లోస్ అల్బర్టో టోరెస్ (72) అక్టోబర్ 26న మృతి చెందాడు. 1970లో ఫిఫా ప్రపంచకప్ నెగ్గిన బ్రెజిల్ జట్టుకు కెప్టెన్‌గా వ్యహరించిన కార్లోస్ 53 మ్యాచ్‌ల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించాడు. 1966-74 మధ్య కాలంలో ప్లేయర్‌గా కొనసాగిన అల్బర్టో ఆ తర్వాత కోచ్‌గా మారాడు.

కబడ్డీ ప్రపంచకప్ చాంపియన్ భారత్
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో అక్టోబర్ 22న జరిగిన 2016 కబడ్డీ ప్రపంచకప్‌లో భారత్ చాంపియన్‌గా అవతరించింది. ఇరాన్‌తో జరిగిన ఫైనల్‌లో భారత్ 38-29 పాయింట్ల తేడాతో గెలిచి వరుసగా మూడోసారి టోర్నీని కైవసం చేసుకుంది. 2004, 2007 ప్రపంచకప్ టోర్నీల్లో భారత్ చాంపియన్‌గా నిలువగా ఆ రెండు టోర్నీ ఫైనల్స్‌లోనూ ఇరాన్ రన్నరప్‌గా నిలిచింది. హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన 30 ఏళ్ల స్టార్ రైడర్ అజయ్ ఠాకూర్ టోర్నీలో 64 పారుుంట్లు సాధించి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ‘ఎమర్జింగ్ టీమ్ ఆఫ్ ది టోర్నీ’ అవార్డు కెన్యా జట్టుకు దక్కగా, అత్యంత విలువైన క్రీడాకారుడు పురస్కారం జాంగ్ కున్ లీ (దక్షిణ కొరియా)కు లభించింది. 
సాకర్ ప్రపంచకప్ మస్కట్‌గా ‘తోడేలు’
2018 సాకర్ ప్రపంచకప్ టోర్నీ మస్కట్‌గా ‘తోడేలు’ (వూల్ఫ్) ఎంపికైంది. ఈ మేరకు ప్రపంచకప్‌కు ఆతిథ్యమిస్తున్న రష్యా ‘జబివక’ (గోల్ చేసే వ్యక్తి అని అర్థం)ను అక్టోబర్ 22న ఆవిష్కరించింది. మస్కట్ ఎంపికలో పిల్లి, అంతరిక్ష దుస్తులు ధరించిన పులి, తోడేలు మధ్య నిర్వహించిన ఓటింగ్‌లో పది లక్షల మంది జబివకకు ఓటేశారు. 2018 జూన్ 14 నుంచి జులై 15 వరకు మాస్కో, సెరుుంట్ పీటర్స్‌బర్గ్, సోచి వంటి 11 నగరాల్లో పుట్‌బాల్ మ్యాచ్‌లు జరగనున్నాయి.
కుజనెత్సోవాకు క్రెమ్లిన్ కప్ టైటిల్
క్రెమ్లిన్ కప్ మహిళల సింగిల్స్ టెన్నిస్ టైటిల్‌ను కుజనెత్సోవా (రష్యా) నిలబెట్టుకుంది. మాస్కోలో అక్టోబర్ 22న జరిగిన ఫైనల్లో గావ్రిలివో (ఆస్ట్రేలియా)పై గెలిచింది.
హామిల్టన్‌కు యూఎస్ గ్రాండ్ ప్రి 
మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ యూఎస్ గ్రాండ్‌ప్రి రేసులో విజేతగా నిలిచాడు. అక్టోబర్ 23న జరిగిన రేసులో నిర్ణీత 56 ల్యాప్‌లను హామిల్టన్ గంటా 38 నిమిషాల 12.618 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని అందుకున్నాడు. మెర్సిడెస్ జట్టుకే చెందిన నికో రోస్‌బర్గ్ రెండో స్థానంలో నిలువగా రికియార్డో (రెడ్‌బుల్) మూడో స్థానాన్ని పొందాడు. ఈ సీజన్‌లో హామిల్టన్‌కిది ఏడో విజయం కాగా కెరీర్‌లో 50వ టైటిల్. దీంతో ఫార్ములావన్ చరిత్రలో అత్యధిక టైటిల్స్ నెగ్గిన డ్రైవర్స్ జాబితాలో హామిల్టన్ మూడో స్థానానికి చేరుకున్నాడు. షుమాకర్ (91), ప్రాస్ట్ (51) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.

న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్‌ను గెలుచుకున్న భారత్
న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను భారత్ గెలుచుకుంది. అక్టోబర్ 12న ముగిసిన మూడో టెస్ట్‌ను గెలుచుకోవడంతో సిరీస్ 3-0 తేడాతో భారత్‌కు దక్కింది. అశ్విన్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు. దీంతో భారత్ మూడు అంతకంటే ఎక్కువ టెస్టు సిరీస్‌ల్లో క్లీన్ స్వీప్ చేయడం ఇది నాలుగోసారి. గతంలో 1993లో ఇంగ్లండ్‌పై 3-0, 1994లో శ్రీలంకపై 3-0తో, 2013లో ఆస్ట్రేలియాపై 4-0తో భారత్ సిరీస్‌లు గెలుచుకుంది.
రంజీల్లో 594 పరుగులతో రికార్డు నెలకొల్పిన గుగలే, బావ్నే
ముంబై వాంఖడే మైదానంలో ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో మహారాష్ర్ట బ్యాట్స్‌మెన్స్.. స్వప్నిల్ గుగలే, అంకిత బావ్నే జోడీ.. 594 పరుగుల భాగస్వామ్యంతో రికార్డు సృష్టించారు. రంజీల్లో ఏ వికెట్‌కైనా ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం. అయితే శ్రీలంకకు చెందిన మహేలా జయవర్థనే, కుమార సంగక్కర దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో (2006) మూడో వికెట్‌కు చేసిన 624 పరుగుల రికార్డును వీరు అధిగమించలేకపోయారు.
సౌరభ్ వర్మకు చైనీస్ తైపీ గ్రాండ్‌ప్రి టైటిల్
భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ సౌరభ్ వర్మ చైనీస్ తైపీ గ్రాండ్‌ప్రి టోర్నమెంట్‌లో విజేతగా నిలిచాడు. అక్టోబర్ 16న జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో సౌరభ్ వర్మ 12-10, 12-10, 3-3తో డారెన్ లూ (మలేసియా)పై గెలిచాడు. విజేతగా నిలిచిన సౌరభ్ వర్మకు 4,125 డాలర్ల (రూ. 2 లక్షల 75 వేలు) ప్రైజ్‌మనీతో పాటు 5,500 ర్యాంకింగ్ పాయింట్లు లభించారుు. 
అథ్లెట్స్ కమిషన్‌లో సభ్యురాలిగా సైనా
బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ను అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అథ్లెట్స్ కమిషన్‌లో సభ్యురాలిగా నియమించింది. ఈ మేరకు ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాచ్ నుంచి అక్టోబర్ 18న సైనాకు అధికారిక నియామక పత్రం అందింది. ఐఓసీ అథ్లెట్స్ కమిషన్‌కు అమెరికా ఐస్ హాకీ క్రీడాకారిణి ఎంజెలో రుజియెరో అధ్యక్షురాలుగా ఉన్నారు. దీనిలో తొమ్మిది మంది ఉపాధ్యక్షులు, 10 మంది సభ్యులు ఉన్నారు.

విష్ణువర్థన్‌కు ఫెనెస్టా ఓపెన్ టెన్నిస్ టైటిల్
ఫెనెస్టా ఓపెన్ జాతీయ చాంపియన్‌షిప్ టెన్నిస్ టైటిల్‌ను విష్ణువర్థన్ గెలుచుకున్నాడు. న్యూఢిల్లీలో అక్టోబర్ 8న జరిగిన ఫైనల్లో సిద్ధార్ధ్ విశ్వకర్మ (ఉత్తర ప్రదేశ్)ను ఓడించాడు.
షూటింగ్ భవిష్యత్ కోసం బింద్రా కమిటీ సూచనలు
భారత షూటింగ్ భవిష్యత్ కోసం ప్రతిభ మీదనే కాక నైపుణ్యాభివృద్ధిపై కూడా ఆధారపడాలని అభినవ్ బింద్రా సారథ్యంలో ఏర్పాటైన రివ్యూ కమిటీ అభిప్రాయపడింది. 2016 రియో ఒలింపిక్స్‌లో భారత్ నుంచి 12 మంది షూటర్లు పాల్గొన్నా ఒక్కరు కూడా పతకం సాధించకపోవడంతో భారత జాతీయ రైఫిల్ సంఘం (ఎన్‌ఆర్‌ఏఐ) బింద్రా నేతృత్వంలో నలుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. జాతీయ రైఫిల్ సంఘం కొత్త విధానాలు ప్రవేశపెట్టాలని, ప్రతిభ ఉన్న వారికే అవకాశం ఇవ్వాలని సూచించింది.
రుత్విక, సిక్కి రెడ్డిలకు రష్యా ఓపెన్ టైటిల్స్
హైదరాబాద్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణులు గద్దె రుత్విక శివాని, సిక్కి రెడ్డి రష్యా ఓపెన్ గ్రాండ్‌ప్రి టోర్నమెంట్‌లో టైటిల్స్‌ను సొంతం చేసుకున్నారు. రష్యాలోని వ్లాదివోస్తోక్ నగరంలో అక్టోబర్ 9న ముగిసిన ఈ టోర్నమెంట్‌లో రుత్విక శివాని మహిళల సింగిల్స్ విభాగంలో, సిక్కి రెడ్డి మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో విజేతలుగా నిలిచారు. మహిళల సింగిల్స్ ఫైనల్లో రుత్విక 21-10, 21-13తో ఎవగెనియా కొసెట్‌స్కాయ (రష్యా)పై గెలుపొందగా, మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్లో సిక్కి రెడ్డి-ప్రణవ్ చోప్రా ద్వయం 21-17, 21-19తో వ్లాదిమిర్ ఇవనోవ్-వలెరియా సొరోకినా (రష్యా) జంటను ఓడించింది. 
రోస్‌బర్గ్‌కు జపాన్ గ్రాండ్‌ప్రి టైటిల్
మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్‌బర్గ్ తొలిసారి జపాన్ గ్రాండ్‌ప్రి టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ సీజన్‌లో రోస్‌బర్గ్‌కు ఇది తొమ్మిదో విజయం కాగా కెరీర్‌లో 23వది. అక్టోబర్ 9న ముగిసిన ఈ రేసులో రోస్‌బర్గ్ గంటా 26 నిమిషాల 43.333 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. వెర్‌స్టాపెన్ (రెడ్‌బుల్) రెండో స్థానంలో నిలువగా, గత ఏడాది విజేత హామిల్టన్ (మెర్సిడెస్) మూడో స్థానంలో నిలిచాడు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా డ్రైవర్లు సెర్గియో పెరెజ్, హుల్కెన్‌బర్గ్ వరుసగా ఏడు, ఎనిమిది స్థానాల్లో నిలిచారు. 
ఐల్ ఆఫ్ మ్యాన్‌లో హారికకు అగ్రస్థానం
ఐల్ ఆఫ్ మ్యాన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక మహిళల విభాగంలో విజేతగా నిలిచింది. నినో బత్సియాష్‌విలి (జార్జియా) రెండో స్థానంలో, అనా ఉషెనినా (ఉక్రెయిన్) మూడో స్థానంలో నిలిచారు. ఇంగ్లండ్‌లో అక్టోబర్ 9న ముగిసిన టోర్నీలో హారిక నాలుగు గేముల్లో గెలిచి, మూడింటిని ‘డ్రా’ చేసుకుంది. తెలుగు క్రీడాకారులు ఎం.ఆర్. లలిత్ బాబు 5.5 పాయింట్లతో 28వ స్థానంలో, హర్ష భరతకోటి 4 పాయింట్లతో 79వ స్థానంలో, కోటిపల్లి సాయి నిరుపమ 3.5 పాయింట్లతో 110వ స్థానంలో నిలిచారు. 
జీతూ రాయ్‌కు చాంపియన్‌‌స ట్రోఫీ
భారత షూటర్ జీతూ రాయ్ అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్‌ఎస్‌ఎఫ్) చాంపియన్‌‌స ట్రోఫీని సొంతం చేసుకున్నాడు. ఇటలీలోని బొలోగ్నాలో అక్టోబర్ 9న ముగిసిన ఈ టోర్నమెంట్‌లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ ఫైనల్లో జీతూ రాయ్ 29.6 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలిచాడు. దామిర్ మికెక్ (సెర్బియా) 28.3 పారుుంట్లతో రన్నరప్‌గా నిలిచాడు.

రికియార్డోకు మలేసియా గ్రాండ్ ప్రి టైటిల్
రెడ్‌బుల్ డ్రైవర్ డానియల్ రికియార్డో మలేసియా గ్రాండ్‌ప్రి టైటిల్‌ను గెలుచుకున్నాడు. అతనికి ఈ సీజన్‌లో ఇది తొలి టైటిల్. 56 ల్యాప్‌ల రేసును రికియార్డో గంటా 37 నిమిషాల 12.776 సెకన్లలో ముగించాడు. మాక్స్ వెర్‌స్టాపెన్‌కు రెండో స్థానం దక్కింది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 16 రేసులు జరిగాయి. అందులో 14 రేసుల్లో మెర్సిడెస్ డ్రైవర్లు (రోస్‌బర్గ్ 8, హామిల్టన్ 6) విజేతలుగా నిలిచారు. మిగతా రెండింటిలో రెడ్‌బుల్ డ్రైవర్లు (వెర్‌స్టాపెన్, రికియార్డో) టైటిల్స్ నెగ్గారు. 

ఆసియా బీచ్ క్రీడల్లో భారత్‌కు 16వ స్థానం
 
ఆసియా బీచ్ క్రీడల్లో భారత్ 16వ స్థానంలో నిలిచింది. అక్టోబర్ 2న ముగిసిన ఈ క్రీడల్లో భారత్ మొత్తం 24 పతకాలు సాధించింది. ఇందులో రెండు స్వర్ణాలతోపాటు నాలుగు రజతాలు, 18 కాంస్య పతకాలున్నారుు. ఆతిథ్య వియత్నాం 139 పతకాలతో అగ్రస్థానంలో నిలిచింది.

250వ టెస్టులో భారత్ విజయంన్యూజిలాండ్‌తో ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన చరిత్రాత్మక 250వ (స్వదేశంలో) టెస్టులో భారత్ విజయం సాధించింది. దీంతో 2-0తో సిరీస్ కైవసం చేసుకోవడంతో పాటు టెస్టుల్లో నంబర్‌వన్‌గా ఉన్న పాకిస్తాన్‌ను అధిగమించి అగ్రస్థానానికి చేరింది. రెండు ఇన్నింగ్‌‌సలలోనూ కీలక పరుగులు చేసిన సాహాకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. 2003లో ఐసీసీ ర్యాంకింగ్‌‌సను ప్రారంభించిన తర్వాత భారత్ అగ్రస్థానానికి చేరుకోవడం ఇది నాలుగో సారి.

No comments:

Post a Comment