AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Sunday 26 November 2017

వార్తల్లో వ్యక్తులు జనవరి 2017

వార్తల్లో వ్యక్తులు జనవరి 2017
ఐరాసకు అమెరికా రాయబారిగా నిక్కీ హేలీ ఐక్యరాజ్యసమితికి అమెరికా రాయబారిగా భారత సంతతికి చెందిన రిపబ్లికన్ నేత నిక్కీ హేలీ జనవరి 25న ప్రమాణ స్వీకారం చేశారు. కేబినెట్ హోదా ఉన్న ఈ పదవిని చేపట్టిన తొలి భారతీయ అమెరికన్‌గా రికార్డుకెక్కిన ఆమె ట్రంప్ కేబినెట్‌లో చేరిన తొలి మహిళగానూ గుర్తింపు పొందారు. ఇది వరకూ హేలీ దక్షిణ కరోలినా గవర్నర్‌గా ఉన్నారు. 

భారత్‌లో రష్యా రాయబారి కడకిన్ మృతి 
భారత్‌లో రష్యా రాయబారి అలెగ్జాండర్ కడకిన్ (67) జనవరి 26న అనారోగ్యంతో కన్నుమూశారు. 2009 నుంచి ఆయన రష్యా రాయబారిగా విధులు నిర్వర్తిస్తున్నారు. 1997- 2004 మధ్య దౌత్యాధికారిగా పనిచేశారు. 

ట్రంప్‌ సలహాదారుగా ఉత్తమ్ ధిలాన్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కి ప్రత్యేక సలహాదారుగా భారత సంతతికి చెందిన న్యాయవాది ఉత్తమ్ ధిలాన్ నియమితులయ్యారు. ఈ మేరకు డొనాల్డ్ ఎఫ్ మెక్‌గాన్ నేతృత్వంలోని వైట్ హౌస్ కమిటీలో స్థానం పొందిన ఉత్తమ్ న్యాయం, నైతికతకు సంబంధించిన విషయాల్లో అమెరికా అధ్యక్షుడికి సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు.

కర్ణాటక లోకాయుక్తగా జస్టిస్ పి. విశ్వనాథ్ శెట్టి
మాజీ జస్టిస్ పి.విశ్వనాథ్ శెట్టి కర్ణాటక లోకాయుక్తగా నియమితులయ్యారు. ఈ మేరకు జనవరి 28న ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు. కుటుంబీకులపై వచ్చిన అవినీతి ఆరోపణలతో అంతకుముందు లోకాయుక్తగా ఉన్న జస్టిస్ భాస్కర్‌రావు పదవికి రాజీనామా చేశారు. దీంతో 2015 నుంచి కర్ణాటక లోకాయుక్త స్థానం ఖాళీగా ఉంది.
సీబీఐ డెరైక్టర్‌గా అలోక్ కుమార్ వర్మ
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) డెరైక్టర్‌గా ఢిల్లీ పోలీస్ కమిషనర్ అలోక్ కుమార్ వర్మను కేంద్ర ప్రభుత్వం జనవరి 19న నియమించింది. వర్మ నియామకానికి ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జేఎస్ ఖేహర్, లోక్‌సభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేలతో కూడిన త్రిసభ్య ఎంపిక కమిటీ అనుమతి ఇచ్చింది.

1979 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన వర్మ వివిధ రాష్ట్రాలతో పాటు ఇంటెలిజెన్‌‌స బ్యూరోలో పనిచేశారు. తీహార్ జైలు డీజీగా వ్యవహరించిన అలోక్ ఫిబ్రవరి 29, 2016 నుంచి ఢిల్లీ పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిసెంబర్ 2న అనిల్ సిన్హా పదవీ విరమణ చేయడంతో అప్పటి నుంచి ఆ స్థానం ఖాళీగా ఉంది.
ఆలిండియా సర్వీస్ నుంచి ముగ్గురి తొలగింపు
విధులు సరిగా నిర్వహించని, అవినీతి ఆరోపణలున్న ముగ్గురు అఖిల భారత స్థాయి అధికారులను కేంద్ర ప్రభుత్వం జనవరి 18న ఉద్యోగాల నుంచి తొలగించింది. వీరిలో ఒక ఐఏఎస్, ఇద్దరు ఐపీఎస్ అధికారులున్నారు. 1991 బ్యాచ్ ఏజీఎంయూటీ (అరుణాచల్‌ప్రదేశ్, గోవా, మిజోరాం, కేంద్ర పాలిత ప్రాంతాల) కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి నరసింహను నియామకాల కేబినెట్ కమిటీ ఆమోదం ద్వారా తొలగించారు. దీంతోపాటు ఇదేకేడర్‌కు చెందిన 1998 బ్యాచ్ ఐపీఎస్ అధికారి మయాంక్ చౌహాన్, 1992 బ్యాచ్ ఛత్తీస్‌గఢ్ కేడర్‌కు చెందిన రాజ్‌కుమార్ దేవాంగన్‌లను కేంద్ర హోం శాఖ తొలగించింది.
మారిషస్ ప్రధానిగా ప్రవింద్ జగన్నాథ్
భారత సంతతికి చెందిన మారిషస్ ప్రధాని అనిరుధ్ జగన్నాథ్ తన పదవికి జనవరి 23న రాజీనామా చేసి.. తన కుమారుడు, ఆర్థిక మంత్రి ప్రవింద్ జగన్నాథ్‌కు బాధ్యతలు అప్పగించారు.
సోషల్ మీడియా ‘లీడర్’ మోదీ 
సామాజిక మాధ్యమాల్లో ప్రపంచంలోనే ఎక్కువ మంది అనుసరిస్తున్న రాజకీయ ప్రముఖునిగా ప్రధాని నరేంద్ర మోదీ నిలిచారు. జనవరి 20న ఒబామా అధ్యక్ష పదవి నుంచి దిగిపోవడంతో రెండో స్థానంలో ఉన్న మోదీ అత్యధిక ఫాలోవర్లు ఉన్న నేతగా నిలిచారు. మోదీకి ట్వీటర్‌లో 2.6 కోట్లు, ఫేస్‌బుక్‌లో 3.92 కోట్లు, గూగుల్ ప్లస్‌లో 30 లక్షలు, లింక్డ్‌ఇన్‌లో 20 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. అలాగే ప్రధాని యాప్ కోటి డౌన్‌లోడ్‌లతో ఎక్కువ మంది వాడుతున్న రాజకీయ నాయకుడి యాప్‌గా గుర్తింపు పొందింది.

అమెరికా ఉపాధ్యక్షుడు బిడెన్‌కు అత్యున్నత పురస్కారం
అమెరికా ఉపాధ్యక్షుడు జో బిడెన్‌కు అమెరికా అత్యున్నత పురస్కారం ‘ది ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ప్రీడమ్’ లభించింది. ఆయన ఈ పురస్కారాన్ని జనవరి 12న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నుంచి అందుకున్నారు. ఈ సందర్భంగా ఒబామా మాట్లాడుతూ అమెరికా చరిత్రలో బిడెన్ ఉత్తమ ఉపాధ్యక్షుడని కొనియాడారు.
మాజీ గవర్నర్ బర్నాలా కన్నుమూత
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు గవర్నర్‌గా సేవలందించిన శిరోమణి అకాలీదళ్ పార్టీ నాయకుడు సుర్జిత్‌సింగ్ బర్నాలా (91) జనవరి 14న మరణించారు. 

ప్రస్తుత హరియాణాలోని అటేలి గ్రామంలో జన్మించిన బర్నాలా 1946లో లక్నో వర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టభద్రులయ్యారు. 2003-04లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు, తమిళనాడుకు రెండు పర్యాయాలు (1990-91; 2004-2011) గవర్నర్‌గా పనిచేశారు. 1977లో లోక్‌సభకు ఎన్నికై కేంద్రంలో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. 1985 నుంచి 1987 వరకు పంజాబ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు.
భారతీయ అమెరికన్ శాస్త్రవేత్తలకు అమెరికా అధ్యక్ష అవార్డులు
నలుగురు భారతీయ అమెరికన్ శాస్త్రవేత్తలకు ప్రతిష్టాత్మక అమెరికా అధ్యక్ష అవార్డులు దక్కాయి. శాస్త్ర, సాంకేతిక విభాగంలోని వివిధ అంశాలకు సంబంధించి తొలి దశ పరిశోధనలు కొనసాగిస్తున్న నిపుణులకు ఈ అత్యున్నత పురస్కారాలను అందిస్తారు. ఈ ఏడాది 102 మందికి అవార్డులను అందించనున్నారు. వీరిలో మోంట్‌క్లైర్ స్టేట్ వర్సిటీకి చెందిన పంకజ్‌లాల్, నార్త్ ఈస్ట్రన్ వర్సిటీ నిపుణులు కౌశిక్ చౌధురి, ఐకాన్ స్కూల్ ఆఫ్ మెడిసన్‌కు చెందిన మనీశ్ అరోరా, కాలిఫోర్నియా వర్సిటీకి చెందిన ఆరాధనా త్రిపాఠీలు ఉన్నారు.
టాటా గ్రూప్ ఛైర్మన్‌గా చంద్రశేఖరన్
 ప్రపంచ వ్యాప్తంగా వివిధ రంగాల్లో వ్యాపారాలు నిర్వహిస్తోన్న టాటా గ్రూప్ సంస్థల ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా 54 ఏళ్ల నటరాజన్ చంద్రశేఖరన్ నియమితులయ్యారు. జనవరి 12న సమావేశమైన బోర్డ్ ఎంపిక కమిటీ సిఫార్సు మేరకు చంద్రశేఖరన్ పేరుని ఖరారు చేసింది. 2009 నుంచి ఇప్పటి వరకూ టీసీఎస్ సీఈవో, ఎండిగా వ్యవహరించిన ఆయన, ఫిబ్రవరి 21న కొత్త బాధ్యతలు చేపట్టనున్నారు.

తమిళనాడులోని తిరుచ్చి రీజినల్ ఇంజనీరింగ్ కళాశాల నుంచి కంప్యూటర్ అప్లికేషన్‌‌సలో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత టీసీఎస్‌లో చేరారు. ఇప్పటివరకూ టాటాల కుటుంబీకులు లేదా వాటాదారులు మాత్రమే టాటా సన్‌‌స పగ్గాలు దక్కించుకోగా తొలిసారి ఓ ఉద్యోగి ఆ పదవిని అందుకున్నాడు. అంతకముందు ఛైర్మన్‌గా ఉన్న ైసైరస్ మిస్త్రీని అక్టోబర్ 24న పదవి నుంచి తప్పించారు.


బాలీవుడ్ నటుడు ఓంపురి కన్నుమూత
ప్రముఖ బాలీవుడ్ నటుడు ఓంపురి(66) జనవరి 6న ముంబైలో కన్ను మూశారు. 1976లో ‘ఘాసీరామ్ కొత్వాల్’ అనే మరాఠీ సినిమాతో తెరంగేట్రం చేసిన ఓం పురి ‘అర్ధ్ సత్య,’ ‘ఆక్రోశ్’, ‘మిర్చ్ మసాలా’, ‘సద్గతి’, ‘దిశ’, ‘భూమిక’ ‘గాంధీ’, ‘సిటీ ఆఫ్ జాయ్’, ‘ఊల్ఫ్’, ‘ఈస్ట్ ఈజ్ ఈస్ట్’ వంటి పాపులర్ చిత్రాల్లో నటించారు. బాలీవుడ్, హాలీవుడ్, పాకిస్థానీ చిత్రాలతో కలపి 300కుపైగా చిత్రాల్లో చేశారు.

హరియాణాలోని అంబాలాలో జన్మించిన ఓంపురి జాతీయ ఉత్తమ నటుడు, పద్మశ్రీ, ఎనిమిదిసార్లు ఫిల్మ్‌ఫేర్ వంటి అవార్డులు పొందటంతో పాటు బ్రిటిష్ సినీ పరిశ్రమకు చేసిన సేవలకు గాను అక్కడి ప్రభుత్వం ఆయనను ‘హానరరీ ఆఫీసర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్’ పురస్కారంతో సత్కరించింది. ఓంపురి చలనచిత్ర పరిశ్రమాభివృద్ధి సంస్థ చైర్మన్‌గానూ పనిచేశారు. ‘ఓం పురి: అన్‌లైక్లీ హీరో’(2009) పేరుతో నందిత ఆయన జీవిత చరిత్రను రాశారు.
సీజేఐగా జస్టిస్ ఖేహర్ ప్రమాణ స్వీకారం
సుప్రీంకోర్టు 44వ ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా జస్టిస్ జగదీష్ సింగ్ ఖేహర్ జనవరి 4న ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్‌లో ఆయనతో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. ఆయన 2017 ఆగస్టు 28న పదవీ విరమణ చేయనున్నారు.

జాతీయ జ్యుడీషియల్ నియామకాల కమిషన్ (ఎన్‌జేఏసీ)ను రద్దు చేయడం, న్యాయమూర్తుల నియామకం కోసం కొలీజియం వ్యవస్థను పునరుద్ధరిస్తూ తీర్పు చెప్పిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి జస్టిస్ ఖేహర్ నేతృత్వం వహించాడు.
బుకర్‌ప్రైజ్ పురస్కార గ్రహీత జాన్ బెర్గర్ కన్నుమూత
ఆంగ్ల నవలా రచయిత, కళా విమర్శకులు, బుకర్‌ప్రైజ్ పురస్కార గ్రహీత జాన్ బెర్గెర్ (90) జనవరి 2న పారిస్‌లో మరణించారు. ఆయనకు మార్కిస్ట్ మేధావిగా పేరుంది. ఆయన బీబీసీలో వేస్ ఆఫ్ సీయింగ్ సిరీస్ ద్వారా విశేష గుర్తింపు పొందారు. 
రాక్‌ఫెల్లర్ అధ్యక్షుడిగా భారత సంతతి వ్యక్తి
ప్రఖ్యాత దాతృత్వ సంస్థ రాక్‌ఫెల్లర్‌కు అధ్యక్షుడిగా భారత సంతతికి చెందిన 43 ఏళ్ల రాజీవ్ షా జనవరి 4న నియమితులయ్యారు. దీంతో ఈ ప్రతిష్టాత్మక పదవిని దక్కించుకున్న పిన్న వయస్కుడిగా, తొలి భారతీయ అమెరికన్‌గా గుర్తింపు పొందారు. రాజీవ్ షా మార్చి 1 నుంచి బాధ్యతలు చేపట్టనున్నట్లు రాక్‌ఫెల్లర్ సంస్థ ప్రకటించింది. 1913లో చమురు వ్యాపార దిగ్గజం జాన్ డి రాక్‌ఫెల్లర్ స్థాపించిన ఈ సంస్థ.. అమెరికాలోనే అతిపెద్ద దాతృత్వ సంస్థల్లో ఒకటిగా ఎదిగింది.
ఇరాన్ మాజీ అధ్యక్షుడు రఫ్సంజానీ మృతి
ఇరాన్ మాజీ అధ్యక్షుడు అక్బర్ హషేమీ రఫ్సంజానీ (82) జనవరి 8న మరణించారు. ఆయన 1979 లో జరిగిన ఇస్లామిక్ విప్లవానికి ముందు.. ఆ తర్వాత ఇరాన్ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించారు.
ది అన్‌టోల్డ్ వాజ్‌పేయి పుస్తకం ఆవిష్కరణ
ప్రముఖ జర్నలిస్ట్ రచయిత, రాజకీయ వ్యాఖ్యాత అయిన ఎన్‌పీ ఉల్లేఖ్ మాజీ ప్రధానమంత్రి వాజ్‌పేయి జీవిత చరిత్రపై రాసిన ‘ది అన్‌టోల్డ్ వాజ్‌పేయి: పొలిటీషియన్ అండ్ పారడాక్స్’ అనే పుస్తకంను జనవరి 5న ఆవిష్కరించారు. ఉపప్రధానిగా అడ్వాణీ నుంచి తనకు పదవీగండం ఉందని భావించడం, గుజరాత్ అల్లర్ల సమయంలో నాటి గుజరాత్ సీఎం మోదీ పదవి నుంచి దిగిపోవాలని వాజ్‌పేయి బలంగా కోరుకోవడం వంటి విషయాలు ఇందులో ఉన్నాయి.
వై.వీ.రెడ్డి ఆత్మకథ ‘నా జ్ఞాపకాలు’ పుస్తకం ఆవిష్కరణ
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ యాగా వేణుగోపాల్‌రెడ్డి ఆత్మకథ ‘నా జ్ఞాపకాలు’ పుస్తకాన్ని కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి జనవరి 6న ఆవిష్కరించారు. వై.వీ.రెడ్డి ఆర్థికాభివృద్ధిని సాధిస్తూనే ద్రవ్యోల్బణాన్ని అదుపులో పెట్టడంలో విజయం సాధించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లాలోని ఒక మారుమూల గ్రామం నుంచి ఆర్‌బీఐ గవర్నర్‌గా ఎదిగిన క్రమాన్ని ఇందులో ప్రస్తావించారు. కొత్త తరం ఆర్థిక వేత్తలకు ఈ పుస్తకం ఒక మార్గదర్శిని లాగా పనిచేస్తుందని తెలిపారు.
జియోని బ్రాండ్ అంబాసిడర్‌గా విరాట్ కోహ్లి
జియోని బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లి ఎంపికయ్యారు. ఈ మేరకు కోహ్లితో జియోని ఒక ఒప్పందం కుదుర్చుకుంది ప్రస్తుతం ఈ సంస్థకు హిందీ సినిమా నటి అలియాభట్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తుంది.
‘ఐసీఆర్‌ఐ’ జాతీయ కార్యదర్శిగా వరప్రసాద్
ఇండియన్ కాలేజ్ ఆఫ్ రేడియాలజీ ఇమేజింగ్ అసోసియేషన్ (ఐసీఆర్‌ఐ) జాతీయ కార్యదర్శిగా విజయవాడకు చెందిన రేడియాలజిస్ట్ డాక్టర్ వి.ఎన్.వరప్రసాద్ నియమితులయ్యారు. జైపూర్‌లో జనవరి 6, 7, 8 తేదీల్లో జరిగిన ఇండియన్ రేడియాలజికల్ అండ్ ఇమేజింగ్ అసోసియేషన్ (ఐఆర్‌ఐఏ) 70వ వార్షిక సమావేశంలో ఆయనను ఎన్నుకున్నారు.

మధ్యప్రదేశ్ మాజీ సీఎం సుందర్‌లాల్ పట్వా మృతి
మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి సుందర్‌లాల్ పట్వా (92) డిసెంబర్ 27న భోపాల్‌లో మరణించారు. ఆయన మధ్యప్రదేశ్‌కు రెండుసార్లు సీఎంగా పనిచేశారు. 

ఢిల్లీ కొత్త ఎల్జీగా అనిల్ బైజల్ఢిల్లీకి కొత్త లెఫ్టినెంట్ గవర్నర్‌గా మాజీ ఐఏఎస్ అధికారి అనిల్ బైజల్ (70) డిసెంబర్ 28న నియమితులయ్యారు. నజీబ్ జంగ్ రాజీనామాతో ఆయన స్థానంలో అనిల్ బైజల్ (ఢిల్లీ 21వ ఎల్జీగా) బాధ్యతలు స్వీకరించనున్నారు. 1969 ఐఏఎస్ బ్యాచ్ అధికారైన అనిల్ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేరుు హయాంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా, ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ వైస్‌చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు.

ఆర్‌బీఐ కొత్త డిప్యూటీ గవర్నర్ విరాళ్ ఆచార్యప్రముఖ ఆర్థికవేత్త విరాళ్ ఆచార్య (42) రిజర్వ్ బ్యాంక్ కొత్త డిప్యూటీ గవర్నర్‌గా నియమితులయ్యారు. న్యూయార్క్ యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆచార్యను డిప్యూటీ గవర్నర్‌గా నియమిస్తూ క్యాబినెట్ అపాయింట్‌మెంట్స్ కమిటీ డిసెంబర్ 28న ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన మూడేళ్ల పాటు పదవిలో కొనసాగుతారు. ప్రస్తుతం ఆర్‌బీఐలో ముగ్గురు డిప్యూటీ గవర్నర్లు ఎస్‌ఎస్ ముంద్రా, ఎన్‌ఎస్ విశ్వనాథన్, ఆర్ గాంధీలు ఉన్నారు.
ముంబై ఐఐటీ విద్యార్థి అయిన ఆచార్య 1995లో బ్యాచ్‌లర్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ కంప్యూటర్ సైన్స్ చదివారు. 2001లో ఎన్‌వైయూ-స్టెర్న్ నుంచి ఫైనాన్‌‌సలో పీహెచ్‌డీ పట్టా అందుకున్నారు. 2001-08 మధ్య కాలంలో లండన్ బిజినెస్ స్కూల్‌లో వివిధ హోదాల్లో విధులు నిర్వర్తించారు.

యూపీఎస్సీ చైర్మన్‌గా డేవిడ్
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) కొత్త చైర్మన్‌గా ప్రొఫెసర్ డేవిడ్ ఆర్.సైమల్లే నియమితులయ్యారు. ఈ మేరకు జనవరి 2న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉత్తర్వులు జారీ చేశారు. 4న పదవీ బాధ్యతలు స్వీకరించనున్న డేవిడ్ 2018 జనవరి 21 వరకు ఈ పదవిలో కొనసాగుతారు. మేఘాలయ రాష్ట్రానికి చెందిన డేవిడ్(63) 2012 నుంచి యూపీఎస్సీలో సభ్యుడు.

కిర్గిస్తాన్ మేజర్ జనరల్‌గా భారత సంతతి వ్యక్తి
సౌదీలో నివసిస్తున్న భారత సంతతికి చెందిన వ్యక్తి షేక్ రఫిక్ మహమ్మద్ కిర్గిస్తాన్ మేజర్ జనరల్‌గా జనవరి 1న నియమితులయ్యారు. ఒక విదేశీ వ్యక్తికి కిర్గిస్తాన్‌లో స్థాయి హోదా దక్కడం ఇదే తొలిసారి. కేరళకు చెందిన రఫిక్ ఇరాన్, సౌదీ అరేబియా, కిర్గిస్తాన్ దేశాల్లో పలు వ్యాపారాలు నిర్వహించాడు. మొదట్లో కిర్గిస్తాన్ మాజీ అధ్యక్షుడు కుర్మన్‌బెక్ సలహాదారుడిగా పనిచేసిన రఫిక్ తాజాగా ఆ దేశ మేజర్ జనరల్‌గా నియమితులయ్యాడు.

బాధ్యతలు చేపట్టిన ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ అధిపతులు
భారత 27వ సైన్యాధిపతిగా లెఫ్టినెంట్ జనరల్ బిపిన్ రావత్ జనరల్ దల్బీర్ సింగ్ సుహాగ్ స్థానంలో డిసెంబర్ 31న పదవీ బాధ్యతలు స్వీకరించారు. అలాగే అనూప్ రాహా స్థానంలో వైమానిక దళాధిపతిగా ఎయిర్ మార్షల్ బిరేందర్ సింగ్ ధనోవా బాధ్యతలు స్వీకరించారు.

No comments:

Post a Comment