AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Sunday, 26 November 2017

వార్తల్లో వ్యక్తులు మార్చి 2012

వార్తల్లో వ్యక్తులు మార్చి 2012
08-14 మార్చి 2012
 అత్యంత ధనవంతుడిగా కార్లోస్ స్లిమ్2012కు ప్రపంచ సంపన్నుల జాబితాలో మెక్సికోకు చెందిన టెలికాం వ్యాపారవేత్త కార్లోస్ స్లిమ్ మొదటి స్థానంలో నిలిచాడు. ఆయన సంపద విలువ 6900 కోట్ల డాలర్లు. రెండో స్థానంలో మైక్రోసాఫ్ట్‌కు చెందిన బిల్‌గేట్స్ (5600 కోట్ల డాలర్లు), మూడో స్థానంలో బెర్‌‌కషైర్ హాత్‌వే సంస్థకు చెందిన వారెన్ బఫెట్ (4400 కోట్ల డాలర్లు) ఉన్నారు. భారతీయుల్లో అత్యంత సంపన్నుడిగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ నిలిచారు. ప్రపంచ జాబితాలో 2230 కోట్ల డాలర్లతో 19వ స్థానంలో ఉన్నాడు. 2012కు ఫోర్బ్స్ పత్రిక రూపొందించిన 58 దేశాలకు చెందిన 1226 మంది సంపన్నుల జాబితాలో 48 మంది భారతీయులున్నారు. వీరిలో 9 మంది భారత సంతతికి చెందినవారున్నారు.

సంగీత దర్శకుడు బాంబే రవి మృతి
హిందీ చిత్ర సంగీత దర్శకుడు, గాయకుడు బాంబే రవి(86) మార్చి 7న ముంబైలో మరణించారు. ఆయన పూర్తి పేరు రవిశంకర్ శర్మ. వక్త్, గుమ్‌రాహ్, నీల్‌కమల్, ఏక్ ఫూల్ దో మాలి వంటి అనేక ప్రఖ్యాత చిత్రాలకు బాంబే రవి దర్శకత్వం వహించారు.


హిందీ చిత్ర నటుడు జాయ్ ముఖర్జీ మృతిఒకనాటి హిందీ చిత్ర కథానాయకుడు, దర్శకుడు జాయ్ ముఖర్జీ (73) మార్చి 9న ముంై బెలో మరణించారు. ఆయన 1960లో ‘లవ్ ఇన్   సిమ్లా’ చిత్రం ద్వారా చిత్ర ప్రవేశం చేశారు.

No comments:

Post a Comment