వార్తల్లో వ్యక్తులు డిసెంబరు 2016
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ రాజీనామాఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ డిసెంబర్ 22న తన పదవికి రాజీనామా చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వంతో నిరంతరం వివాదాల్లో నలుగుతున్న ఆయన నాటకీయ పరిణామాల మధ్య రాజీనామా చేశారు. నాకు ఇష్టమైన విద్యారంగం వైపు వెళ్లాలనుకుంటున్నాను. అందుకే రాజీనామా సమర్పించానని అని నజీబ్ జంగ్ తెలిపారు.
1973లో ఐఏఎస్‌గా ఎంపికై న నజీబ్ జంగ్ మధ్యప్రదేశ్, కేంద్ర ప్రభుత్వంలో పలు హోదాల్లో పని చేశారు. 2013 జూలైలో జామియా మిలియా యూనివర్సిటీ వీసీగా పని చేస్తున్నప్పుడు ఢిల్లీకి 19వ ఎల్జీగా నియమితులయ్యారు.
జాతీయ చిహ్నం రూపకర్త భార్గవ మృతిజాతీయ చిహ్నం రూపొందించిన బృందంలో సభ్యుడైన దిననాథ్ భార్గవ (89) డిసెంబర్ 24న మరణించారు. భార్గవ మధ్యప్రదేశ్‌లోని ముల్తాయ్‌లో నవంబరు 1, 1927లో జన్మించారు. అశోకుడు నెలకొల్పిన సాంచి స్థూపంపై చెక్కిన నాలుగు సింహాలను స్ఫూర్తిగా తీసుకొని దిననాథ్ భారత జాతీయ చిహ్నాన్ని డిజైన్ చేశారు. ఫైన్ ఆర్‌ట్సలో మూడేళ్ల డిప్లోమా కోర్సును పూర్తిచేసిన భార్గవ జాతీయ చిహ్నం, భారత రాజ్యాంగం మనుప్రతి రూపకర్తగా గుర్తింపు పొందారు.
ఫోర్బ్స్ సెలబ్రిటీలో జాబితాలో సల్మాన్‌కు అగ్రస్థానంబాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ సినిమా, స్పోర్‌ట్స పర్సనాలిటీల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. ఫోర్బ్స్ మ్యాగజీన్ డిసెంబర్ 23న విడుదల చేసిన టాప్-100 భారతీయ ప్రముఖుల జాబితా - 2016 ఈ వివరాలు వెల్లడించింది. గతేడాది టాప్‌లో ఉన్న షారుఖ్ ఖాన్ ఈసారి రెండోస్థానంలో నిలవగా క్రికెటర్ విరాట్ కోహ్లి మూడోస్థానంలో నిలిచాడు.
జాబితాలో టాప్- 10 ప్రముఖులు
రాజ్యసభ సభ్యత్వానికి మిథున్ రాజీనామాసినీ నటుడు మిథున్ చక్రవర్తి అనారోగ్య కారణాల వల్ల తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా పత్రాన్ని రాజ్యసభ చైర్మన్‌కు సమర్పించారు. మిథున్ 2014లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆయన రెండేళ్లలో కేవలం మూడు రోజుల పాటే రాజ్యసభ సమావేశాలకు హాజరయ్యారు.
ఎన్‌సీసీ డీజీగా లెఫ్టినెంట్ జనరల్ వినోద్ నేషనల్ క్యాడెట్ కార్ప్స్(ఎస్‌సీసీ) నూతన డెరైక్టర్ జనరల్‌గా లెఫ్టినెంట్ జనరల్ వినోద్ వశిష్ట్ బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఆయన గయలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో కమాండెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. డిఫెన్‌స సర్వీసెస్ స్టాఫ్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన వినోద్ ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఐఏఎస్ ప్రొఫెషనల్ కోర్సు, ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ కోర్సు చేశారు.
భారత ఒలింపిక్ సంఘం జీవితకాల అధ్యక్షుడిగా కల్మాడీభారత ఒలింపిక్ సంఘం సురేష్ కల్మాడీని జీవితకాల అధ్యక్షుడిగా నియమిస్తున్నట్లు డిసెంబర్ 27న జరిగిన ఐఓఏ వార్షిక సమావేశంలో ప్రకటించింది. గతంలో రద్దయిన భారత అమెచ్యూర్ బాక్సింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు అభయ్ సింగ్ చౌతాలాను కూడా అదే హోదాలో నియమించారు.
2010లో ఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ క్రీడల నిర్వహణ కుంభకోణంలో కల్మాడీ ప్రధాన నిందితుడు. ఆయన అవినీతికి పాల్పడ్డట్టూ ప్రాథమికంగా రుజువు కావడంతో పది నెలలు జైలులో ఉన్నాడు. తాజాగా ఐఓఏ వార్షిక సర్వసభ్య సమావేశంలో కుంభకోణంలో ప్రధాన నిందితుడు అయిన కల్మాడీనే జీవితకాల అధ్యక్షుడిగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ర్యాంక్
|
పేరు
|
సంపాదన (రూ.కోట్లలో)
|
1
|
Salman Khan
|
270.33
|
2
|
Shah Rukh Khan
|
221.75
|
3
|
Virat Kohli
|
134.44
|
4
|
Akshay Kumar
|
203.03
|
5
|
Mahendra Singh Dhoni
|
122.48
|
6
|
Deepika Padukone
|
69.75
|
7
|
Sachin Tendulkar
|
58
|
8
|
Priyanka Chopra
|
76
|
9
|
Amitabh Bachchan
|
32.62
|
10
|
Hrithik Roshan
|
90.25
|
రాజ్యసభ సభ్యత్వానికి మిథున్ రాజీనామాసినీ నటుడు మిథున్ చక్రవర్తి అనారోగ్య కారణాల వల్ల తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా పత్రాన్ని రాజ్యసభ చైర్మన్‌కు సమర్పించారు. మిథున్ 2014లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆయన రెండేళ్లలో కేవలం మూడు రోజుల పాటే రాజ్యసభ సమావేశాలకు హాజరయ్యారు.
ఎన్‌సీసీ డీజీగా లెఫ్టినెంట్ జనరల్ వినోద్ నేషనల్ క్యాడెట్ కార్ప్స్(ఎస్‌సీసీ) నూతన డెరైక్టర్ జనరల్‌గా లెఫ్టినెంట్ జనరల్ వినోద్ వశిష్ట్ బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఆయన గయలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో కమాండెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. డిఫెన్‌స సర్వీసెస్ స్టాఫ్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన వినోద్ ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఐఏఎస్ ప్రొఫెషనల్ కోర్సు, ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ కోర్సు చేశారు.
భారత ఒలింపిక్ సంఘం జీవితకాల అధ్యక్షుడిగా కల్మాడీభారత ఒలింపిక్ సంఘం సురేష్ కల్మాడీని జీవితకాల అధ్యక్షుడిగా నియమిస్తున్నట్లు డిసెంబర్ 27న జరిగిన ఐఓఏ వార్షిక సమావేశంలో ప్రకటించింది. గతంలో రద్దయిన భారత అమెచ్యూర్ బాక్సింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు అభయ్ సింగ్ చౌతాలాను కూడా అదే హోదాలో నియమించారు.
2010లో ఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ క్రీడల నిర్వహణ కుంభకోణంలో కల్మాడీ ప్రధాన నిందితుడు. ఆయన అవినీతికి పాల్పడ్డట్టూ ప్రాథమికంగా రుజువు కావడంతో పది నెలలు జైలులో ఉన్నాడు. తాజాగా ఐఓఏ వార్షిక సర్వసభ్య సమావేశంలో కుంభకోణంలో ప్రధాన నిందితుడు అయిన కల్మాడీనే జీవితకాల అధ్యక్షుడిగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ లకు కొత్త అధిపతులు
ఆర్మీ, వాయుసేనకు ప్రభుత్వం డిసెంబర్ 17న కొత్త అధిపతులను నియమించింది. ఈ మేరకు లెఫ్టినెంట్ జనరల్ బిపిన్ రావత్‌ను ఆర్మీ చీఫ్‌గా, ఎరుుర్ మార్షల్ బీఎస్ ధనోవాను ఐఏఎఫ్ చీఫ్‌గా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత అధిపతులు జనరల్ దల్బీర్ సింగ్, అరూప్ రాహాలు డిసెంబర్ 31న పదవీ విరమణ చేయనున్నారు. రావత్ 30 ఏళ్లుగా భారత సైన్యంలో వివిధ హోదాల్లో, యుద్ధ ప్రాంతాల్లో విధులు నిర్వర్తించారు.
ఐబీ, రా లకు కొత్త అధిపతులు
జాతీయ నిఘా సంస్థలు ఇంటెల్లిజెన్స్ బ్యూరో (IB), రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (RAW) లకు ప్రభుత్వం కొత్త ఛీఫ్‌లను నియమించింది. జార్ఖండ్ కేడర్ సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీవ్ జైన్‌ను ఇంటెలిజెన్‌స బ్యూరో(ఐబీ)కి, అనిల్ ధస్మానాను రా(రీసెర్చీ అండ్ అనాలిసిస్ వింగ్)కు అధిపతులుగా నియమిస్తూ డిసెంబర్ 17న ఉత్తర్వులు జారీ చేసింది. వీరు జనవరి 1న బాధ్యతలు స్వీకరించి రెండేళ్లు పదవిలో కొనసాగుతారు.
1980 ఐపీఎస్ కేడర్‌కు చెందిన జైన్ రాష్ట్రపతి పోలీసు మెడల్ గెల్చుకున్నారు. అనిల్ 1981 ఐపీఎస్ బ్యాచ్ మధ్యప్రదేశ్ కేడర్ అధికారి. గత 23 ఏళ్లుగా ‘రా’లో పాకిస్తాన్ డెస్కు సహా పలు కీలక విభాగాల్లో పనిచేశారు.
ఎల్‌ఐసీ కొత్త చైర్మన్ వి.కె.శర్మ
లైఫ్ ఇన్సూరెన్‌స కార్పొరేషన్ (ఎల్‌ఐసీ) చైర్మన్‌గా వి.కె.శర్మ డిసెంబర్ 14న నియమితులయ్యారు. ప్రస్తుతం ఎల్‌ఐసీ మేనేజింగ్ డెరైక్టర్, తాత్కాలిక చైర్మన్‌గా వ్యవహరిస్తున్న వి.కె. శర్మ ఐదేళ్ల పూర్తికాలానికి బాధ్యతలు స్వీకరించారు. శర్మ 2013 నవంబర్ నుంచి ఎల్‌ఐసీ ఎండీగా కొనసాగుతున్నారు. ఎల్‌ఐసీ చైర్మన్ పదవి నుంచి ఎస్.కె.రాయ్ 2016 జూన్‌లో వైదొలగారు.
కాలిఫోర్నియా సిటీ మేయర్‌గా భారత సంతతి మహిళ
అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలోగల క్యుపర్టినో పట్టణ మేయర్‌గా భారత సంతతి మహిళ సవితా వైద్యనాథన్ ఎన్నికయ్యారు. సవితా వైద్యనాథన్ గత 19 సంవత్సరాలుగా క్యుపర్టినో పట్టణంలోనే నివసిస్తున్నారు. ఎంబీఏ చదివిన ఆమె హైస్కూల్ మ్యాథ్స్ టీచర్‌గా, కమర్షియల్ బ్యాంకులో అధికారిగా పనిచేశారు.
ప్రపంచ సుందరిగా స్టీఫెనీ డీ వాలే
2016 ప్రపంచ సుందరి(మిస్ వరల్డ్) కిరీటాన్ని ప్యూర్టొరికో కు చెందిన స్టీఫెనీ డీ వాలే(19) కై వసం చేసుకుంది. అమెరికాలో డిసెంబర్ 18న జరిగిన మిస్ వరల్డ్ పోటీల్లో 116 మంది అందగత్తెలు పాల్గొన్నారు. మొదటి రన్నరప్‌గా డొమినికన్ రిపబ్లిక్‌కు చెందిన యరిట్జా మిగులేనా రేయిస్ రమిరెజ్, రెండో రన్నరప్‌గా ఇండోనేసియాకు చెందిన టాషా మాన్యుయెల్లా నిలిచారు.
మిస్ ఇండియా యూఎస్‌గా మధువల్లి
2016 కు గాను ‘మిస్ ఇండియా యూఎస్’గా 19 ఏళ్ల వర్జీనియా నివాసి మధువల్లి ఎంపికైంది. కాగా టెక్సస్ నివాసి సరితా పట్నాయక్ మిసెస్ ఇండియా యూఎస్‌ఏగా ఎంపికయ్యారు. మిస్ టీన్ యూఎస్‌ఏగా రియా మంజ్రేకర్ గెలుపొందింది. రోడ్లపైనే జీవితాలు వెళ్లదీసే చిన్నారుల కోసం ఈమె గత రెండేళ్లలో 50 వేల డాలర్ల విరాళాలు సేకరించింది.
అసోం బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రియాంక
బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా అసోం పర్యాటక శాఖకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికయ్యారు. ఆమె రెండేళ్ల పాటు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తారు. ఈ ఎంపికలో పర్యాటక శాఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌ను సంప్రదించినప్పటికీ ఆయన దీనికి నిరాకరించారు.
నూతన సీజేఐగా జస్టిస్ జగదీష్‌సింగ్ ఖేహర్
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) గా జస్టిస్ జగదీష్‌సింగ్ ఖేహర్ బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ పదవీకాలం 2017, జనవరి 3తో ముగియనుంది. 2017, జనవరి 4నజస్టిస్ ఖేహర్ 44వ సీజేఐగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయన ఈ పదవిలో దాదాపు 8 నెలల పాటు (ఆగస్టు 27, 2017 వరకు) కొనసాగుతారు. సీజేఐగా బాధ్యతలు చేపట్టనున్న తొలి సిక్కు వ్యక్తి జస్టిస్ ఖేహర్.
రాజకీయ విశ్లేషకుడు చో రామస్వామి కన్నుమూత
తమిళనాడు రాజకీయ విశ్లేషకుడు, సీనియర్ నటుడు, శ్రీనివాస అయ్యర్ రామస్వామి (చో రామస్వామి) కన్నుమూశారు. గత కొద్ది కాలంగా శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ డిసెంబర్ 7న మరణించారు.
రామస్వామి1934 అక్టోబర్ 5న చెన్నైలోని మైలాపూర్‌లో జన్మించారు. మద్రాస్ విశ్వవిద్యాలయం నుంచి న్యాయవిద్యనభ్యసించిన ఆయన మొదట న్యాయవాదిగా పని చేశారు. అనంతరం సినిమాల్లో నటించారు. తర్వాత 1970లో తుగ్లక్ అనే పత్రికను స్థాపించి దానికి ఎడిటర్‌గా కొనసాగారు. 2005 నుంచి 2009 వరకు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు.
ఫ్రాన్స్ నూతన ప్రధానిగా బెర్నార్డ్ కజెనెవ్
ఫ్రాన్స్ నూతన ప్రధానిగా ఆ దేశ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి బెర్నార్డ్ కజెనెవ్ నియమితులయ్యారు. ప్రస్తుత ప్రధాని మాన్యుయెల్ వాల్స్ రాజీనామా చేయడంతో.. బెర్నార్డ్‌ను ఆ పదవిలో నియమిస్తున్నట్లు దేశాధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలండ్ డిసెంబర్ 6న ప్రకటించారు. రెండున్నరేళ్లపాటు ఫ్రాన్స్ ప్రధానిగా కొనసాగిన వాల్స్.. వచ్చే ఏడాది సోషలిస్ట్ పార్టీ తరఫున దేశాధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నారు.
టైమ్ ‘పర్సన్ ఆఫ్ ది ఇయర్’డొనాల్డ్ ట్రంప్
అమెరికాకు నూతన అధ్యక్షుడిగా ఎన్నికై న డొనాల్డ్ ట్రంప్‌ను టైమ్ మేగజీన్ 2016 ఏడాదికి ‘పర్సన్ ఆఫ్ ది ఇయర్’గా ప్రకటించింది. ఈ జాబితాలో తొలి రన్నపరప్‌గా హిల్లరీ క్లింటన్, రెండో రన్నరప్‌గా ఆన్‌లైన్ హ్యాకర్లు నిలిచారు. ప్రపంచ వ్యాప్తంగా వార్తల్లో ఎక్కువగా నిలిచిన నాయకులు, కళాకారులు, వ్యాపారవేత్తలు, సంస్థల నుంచి టైమ్ ఎడిటర్‌లు ‘పర్సన్ ఆఫ్ ది ఇయర్’ ను ఎంపిక చేస్తారు.
ఇటలీ ప్రధానిగా జెంటిలోని
డెమోక్రటిక్ పార్టీ నేత పాలో జెంటిలోని నేతృత్వంలో డిసెంబర్ 11న ఇటలీలో నూతన మంత్రివర్గం ఏర్పాటైంది. ప్రధాని పదవికి మతియో రెంజి రాజీనామా చేయడంతో జెంటిలోని కొత్త ప్రధానిగా ఎంపికయ్యారు.
న్యూజిలాండ్ కొత్త ప్రధానిగా బిల్ ఇంగ్లిష్
న్యూజిలాండ్ కొత్త ప్రధానిగా బిల్ ఇంగ్లిష్ డిసెంబర్ 12న వెల్లింగ్టన్‌లో ప్రమాణస్వీకారం చేశారు. అంతకుముందు ప్రధానిగా ఉన్న జాన్ కీ రాజీనామా చేయడంతో బిల్ ప్రధానిగా ఎన్నికయ్యారు.
అమెరికా వ్యోమగామి జాన్ గ్లెన్ మృతి
భూకక్ష్యలోకి ప్రవేశించిన మొట్టమొదటి అమెరికన్, రెండు సార్లు అంతరిక్షయానం చేసిన తొలి సీనియర్ సిటిజన్‌గా రికార్డు సృష్టించిన జాన్‌గ్లెన్ (95) డిసెంబర్ 8న కన్నుమూశారు. 1962లో గ్లెన్ తొలిసారి అంతరిక్షయాత్ర చేశారు. 77 ఏళ్ల వయసులో మరో సారి కక్ష్యలోకి వెళ్లి అత్యంత వయోవృద్ధుడైన వ్యోమాగామిగా రికార్డు సృష్టించాడు. సెనేటర్‌గా కూడా పనిచేసిన గ్లెన్... 2012లో ఆ దేశ అత్యున్నత గౌరవమైన ‘ఫ్రీడమ్’ అవార్డును అందుకున్నారు.
అగస్టా కేసులో ఎయిర్ ఫోర్సు మాజీ చీఫ్ అరెస్టు
యూపీఏ-2 హయాంలో జరిగిన అగస్టా హెలికాప్టర్ల కుంభకోణంలో ఎయిర్ ఫోర్సు మాజీ చీఫ్ ఎస్పీ త్యాగిని సీబీఐ డిసెంబర్ 9న అరెస్టు చేసింది. 12 వీవీఐపీ హెలికాప్టర్ల కొనుగోలుకు సంబంధించి రూ.450 కోట్ల లంచం తీసుకున్న కేసులో త్యాగితోపాటు అతని సోదరుడు సంజయ్, లాయర్ గౌతమ్ ఖైతాన్‌ను అరెస్టు చేశారు. వీవీఐపీ హెలికాప్టర్లు ఎగరాల్సిన ఎత్తును 6 వేల అడుగుల నుంచి తగ్గించేలా నిబంధనలు మార్చేందుకు త్యాగి అంగీకరించి అధికారులను ప్రభావితం చేశారని సీబీఐ తెలిపింది.
ఐరాస సెక్రటరీ జనరల్‌గా గ్యుటెరస్ ప్రమాణస్వీకారం
ఐక్యరాజ్యసమితి నూతన సెక్రటరీ జనరల్‌గా పోర్చుగల్ మాజీ ప్రధాని ఆంటోనియో గ్యుటెరస్ డిసెంబర్ 12న ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుత సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ పదవీ కాలం డిసెంబర్ 31తో ముగియనుంది.
పీవీ కుమారుడు రాజేశ్వరరావు కన్నుమూత
మాజీ ప్రధానమంత్రి పీవీ నర్సింహారావు కుమారుడు, లోక్‌సభ మాజీ సభ్యుడు పీవీ రాజేశ్వరరావు (70) డిసెంబర్ 12న కన్నుమూశారు. రాజేశ్వరరావు 1996లో జరిగిన లోక్‌సభ మధ్యంతర ఎన్నికల్లో సికింద్రాబాద్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి బీజేపీ అభ్యర్థి బండారు దత్తాత్రేయపై 2,14,358 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
ఐఎస్‌ఐ కొత్త చీఫ్ నవీద్ ముఖ్తార్
పాకిస్తాన్ గూఢచర్య సంస్థ ఐఎస్‌ఐ (ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్‌స) చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ నవీద్ ముఖ్తార్ నియమితులయ్యారు. లెఫ్టినెంట్ జనరల్ రిజ్వాన్ అఖ్తర్ స్థానంలో ఐఎస్‌ఐ చీఫ్‌గా నవీద్‌ను నియమించినట్టు పాక్ ఆర్మీ డిసెంబర్ 13న తెలిపింది. నవీద్ నిఘా సంస్థలోని ఉగ్రనిరోధక విభాగానికి చీఫ్‌గా, ఆర్మర్డ్ కార్ప్స్ రెజిమెంట్‌కు కమిషనర్‌గా పనిచేశారు.
సీనియర్ జర్నలిస్టు హనుమంతరావు కన్నుమూత
తెలుగు సీనియర్ జర్నలిస్టు, డీఎన్‌ఎఫ్ న్యూస్ ఏజెన్సీ వ్యవస్థాపకుడు వి.హనుమంతరావు(91) డిసెంబర్ 13న కన్ను మూశారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో పుట్టిన హనుమంతరావు కమ్యూనిస్టు నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య వద్ద స్టెనోగా పనిచేసి అనంతరం జర్నలిస్టుగా మారారు.
యునిసెఫ్ అంబాసిడర్‌గా ప్రియాంక
యునిసెఫ్ గ్లోబల్ గుడ్‌విల్ కొత్త ప్రచారకురాలిగా బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా నియమితులయ్యారు. ఫుట్‌బాల్ క్రీడాకారుడు డేవిడ్ బెక్‌హామ్, బ్రిటిష్ బాలనటి మిల్లీ బాబీ బ్రౌన్‌లు కలసి సంయుక్తంగా ప్రియాంక నియామకాన్ని ప్రకటించారు.
ప్రపంచ మేధావుల జాబితాలో సుష్మ
‘ది ఫారిన్ పాలసీ’ పత్రిక 2016 ఏడాదికి ప్రకటించిన 100 మంది ప్రపంచ ఆలోచనాపరుల జాబితాలో భారత్ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌కు చోటు దక్కింది. ఈమెతో పాటు హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ మాజీ సీఈఓ, దాత వినీత్ నాయర్-అనుపమ దంపతులకు కూడా ఈ జాబితాలో ఉన్నారు. ‘విధాన రూపకర్త’ల విభాగంలో ఎంపికైన సుష్మ ‘కామన్ ట్వీపుల్స్(ట్విటర్) నాయకురాల’ని పత్రిక పేర్కొంది.
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కన్నుమూతతమిళనాడు ముఖ్యమంత్రి జయరాం జయలలిత(68) డిసెంబర్ 5న కన్నుమూశారు. సెప్టెంబర్ 22న చెన్నై అపోలో ఆసుపత్రిలో చేరిన ఆమె 74 రోజుల పాటు చికిత్స పొందుతూ మరణించింది. డిసెంబర్ 6న మెరీనా బీచ్‌లో ఆమె అంత్యక్రియలు జరిగాయి. జయలలితకు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన లండన్ వైద్యుడు డాక్టర్ రిచర్డ్ నేతృత్వంలో చికిత్స అందించారు.
పురుచ్చి తలైవి (విప్లవ నాయకి) గా పేరు పొందిన జయలలిత అమ్మగా తమిళ ప్రజలకు సుపరిచితురాలు. ఆమె ప్రవేశ పెట్టిన అమ్మ పథకాలు దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయి. తమిళనాడుకు జయలలిత 4 పర్యాయాలు (1991, 2001, 2011, 2016) ముఖ్యమంత్రిగా పనిచేశారు.
జయలలిత ప్రస్థానం
1948 ఫిబ్రవరి 24న అప్పటి మైసూరు రాష్ట్రంలోని మేల్కొటే జన్మించారు.
1961లో కన్నడ సినిమా ‘శ్రీశైల మహాత్మే’తో బాలనటిగా వెండితెరపై అరంగేట్రం
1964లో హీరోయిన్‌గా నటించిన తొలి కన్నడ సినిమా ‘చిన్నాడ గోంబే’
1965లో తెలుగు, తమిళ భాషల్లో కథనాయికగా అరంగేట్రం
1974లో నటిగా 100 సినిమాలు పూర్తి
1980లో సినిమాలకు స్వస్తి చెప్పారు. కథానాయికగా ఆఖరి సినిమా విడుదల
1982లో అన్నా డీఎంకే వ్యవస్థాపకుడు ఎం.జి.రామచంద్రన్ ఆహ్వానం మేరకు పార్టీ సభ్యురాలిగా రాజకీయ రంగ ప్రవేశం
1984లో రాజ్యసభ సభ్యత్వం
1987లో ఎంజీఆర్ మరణం. రాష్ట్రపతి పాలన
1987లో తొలి మహిళా ప్రతిపక్ష నేతగా ఎంపిక
1991లో అన్నాడీఎంకే విజయంతో తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం
1996 అసెంబ్లీ ఎన్నికల్లో జయలలిత, పార్టీ పరాజయం. అవినీతి ఆరోపణలపై అరెస్టు
2001లో అన్నాడీఎంకే విజయంతో రెండోసారి సీఎంగా ప్రమాణం. కేసుల కారణంగా ఆమె ఎన్నిక చెల్లదని సుప్రీం తీర్పు. పన్నీరుసెల్వానికి బాధ్యతల అప్పగింత
2003లో టాన్సీ భూములు, ప్లెజెంట్ స్టే హోటల్ కేసుల కొట్టివేతను సమర్థించిన సుప్రీంకోర్డు. తిరిగి ముఖ్యమంత్రిగా జయలలిత
2006 శాసనసభ ఎన్నికల్లో ఓటమి
2011 శాసనసభ ఎన్నికల్లో గెలుపు, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం
2014లో ఆస్తుల కేసులో జయలలితను దోషిగా పేర్కొంటూ బెంగళూరులోని ప్రత్యేక కోర్టు తీర్పు. నాలుగేళ్ల జైలుశిక్ష, రూ.100 కోట్ల జరిమానా. మళ్లీ జైలుకు జయలలిత. సీఎంగా పన్నీరుసెల్వం.
2015లో జయలలితపై ఆరోపణలను కొట్టివేసిన కర్ణాటక హైకోర్టు ప్రత్యేక ధర్మాసనం. మళ్లీ ముఖ్యమంత్రిగా జయలలిత
2016 మే లో అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే గెలుపుతో ముఖ్యమంత్రిగా ప్రమాణం. ఎంజీఆర్ అనంతరం వరుసగా రెండు సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొంది రికార్డు.
2016 డిసెంబర్ 5: మరణం
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వంపురుచ్చి తలైవి జయలలిత మృతి చెందడంతో తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి గా పన్నీర్ సెల్వం నియమితులయ్యారు. పన్నీర్ సెల్వం 2001లో ఆపద్ధర్మ సీఎంగా, 2015లో జయలలిత జైలుకు వెళ్లినప్పుడు, 2016 సెప్టెంబర్ 22 నుంచి ఆపద్ధర్మ సీఎంగా పని చేస్తున్నారు.
ఇటలీ ప్రధాని రెంజీ రాజీనామాపార్లమెంటరీ సంస్కరణలతోపాటు కొన్ని ప్రాంతీయ అధికారాలను జాతీయ ప్రభుత్వానికి బదలాయించేందుకు ఉద్దేశించిన రాజ్యాంగ సవరణపై జరిగిన రెఫరెండంలో ఓడిపోవడంతో పదవి నుంచి దిగిపోతున్నట్లు ఇటలీ ప్రధాని మేటూ రెంజీ ప్రకటించారు. డిసెంబర్ 4న జరిగిన రెఫరెండంలో దాదాపు 70 శాతం మంది ఓటు వేయంగా 59.5 శాతం మంది రెఫరెండంకు వ్యతిరేకంగా ఓటు వేశారు.
న్యూజిలాండ్ ప్రధాని రాజీనామాన్యూజిలాండ్ ప్రధాని జాన్ కీ తన పదవికి డిసెంబర్ 5న రాజీనామా చేశారు. 2002లో పార్లమెంటులో తొలిసారి అడుగు పెట్టిన జాన్‌కీ నాలుగేళ్ల తర్వాత నేషనల్ పార్టీ నాయకత్వ బాధ్యతలు స్వీకరించారు. తర్వాత 2008లో లేబర్ పార్టీపై గెలుపొంది ప్రధాని అయ్యారు.
ఏషియన్ ఆఫ్ ద ఇయర్‌గా ఫ్లిప్‌కార్ట్ వ్యవస్థాపకులుఈ కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ వ్యవస్థాపకులు సచిన్ భన్సల్, బిన్నీ భన్సల్ ఏషియన్ ఆఫ్ ద ఇయర్‌గా ఎంపికయ్యారని సింగపూర్ టైమ్స్ పత్రిక ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా భారత్‌లో ఈ కామర్స్ విప్లవానికి నాంది పలికినందుకు వారికి ఈ అవార్డు లభించింది. 2015లో ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలురైన 100 మంది జాబితాలో వీరిద్దరికి చోటు దక్కింది. ఏసియన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు 2014లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి దక్కగా 2015లో సింగపూర్‌కు చెందిన లీ కున్‌కు దక్కింది.
సీబీఐ తాత్కాలిక డెరైక్టర్‌గా అస్తానాసీబీఐ తాత్కాలిక డెరైక్టర్‌గా రాకేష్ అస్తానా నియమితులయ్యారు. ప్రస్తుత సీబీఐ డెరైక్టర్ అనిల్ కుమార్ సిన్హా డిసెంబర్ 2న పదవీ విరమణ చేయడంతో అసిస్టెంట్ డెరైక్టర్ అస్తానాకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆస్తానా గుజరాత్ కేడర్ 1984 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి.
ఎన్‌ఎస్‌ఈ సీఈఓ పదవికి చిత్ర రామకృష్ణ రాజీనామానేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (NSE) ఎండీ, సీఈఓ పదవికి చిత్ర రామకృష్ణ రాజీనామా చేశారు. 1992లో ఎన్‌ఎస్‌ఈ ఏర్పడినప్పటి నుంచి ఆమె వివిధ హోదాల్లో పనిచేశారు. 2013 ఏప్రిల్‌లో ఎన్‌ఎస్‌ఈ ఎండీ, సీఈఓగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. నవంబర్ 2016లో వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ఎక్సేంజేస్‌కు చైర్‌పర్సన్‌గా కూడా ఎన్నికయ్యారు. షెడ్యూల్ ప్రకారం ఆమె పదవీ కాలం 2018 మార్చితో ముగియనుంది. చిత్ర రాజీనామా నేపథ్యంలో ఎన్‌ఎస్‌ఈ తాత్కాలిక సీఈఓగా సీనియర్ ఎగ్జిక్యూటివ్ రవిచంద్రన్ వ్యవహరిస్తారు.
మాజీ ఒలింపియన్ సలామ్ కన్నుమూతహైదరాబాద్‌కు చెందిన మాజీ ఫుట్‌బాల్ క్రీడాకారుడు ఎస్.ఎ.సలామ్(77) డిసెంబర్ 3న కన్నుమూశారు. 1956 మెల్‌బోర్న్ ఒలింపిక్స్‌లో నాలుగో స్థానంలో నిలిచిన భారత జట్టులో ఆయన సభ్యుడిగా ఉన్నారు. రిటైరయ్యాక సలామ్ కోచ్‌గా మారారు. ఆంధ్రప్రదేశ్ స్పోర్‌ట్స అథారిటీ (శాప్)లో డిప్యూటీ డెరైక్టర్‌గా కూడా విధులు నిర్వర్తించారు. సలామ్ శిక్షణలో భారత అండర్-19 జట్టు 1974లో ఆసియా చాంపియన్‌షిప్‌లో సంయుక్త విజేతగా నిలిచింది.
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఖేహర్ సుప్రీంకోర్టు 44వ ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా జస్టిస్ జగదీష్‌సింగ్ ఖేహర్ నియమితులు కానున్నారు. ఈ మేరకు సీనియర్ అయిన జస్టిస్ ఖేహర్‌ను ఆ పదవిలో నియమించాలంటూ ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ డిసెంబర్ 6న కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. జస్టిస్ ఠాకూర్ పదవీకాలం జనవరి 3తో ముగియనుంది. ఖేహర్ 2017 ఆగస్టు 27 వరకు పదవిలో కొనసాగుతారు. దేశ చరిత్రలో సిక్కువర్గానికి చెందిన తొలి ప్రధాన న్యాయమూర్తి ఖేహర్.
ఆగస్టు 28, 1952న జన్మించిన ఖేహర్ పంజాబ్ వర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌ఎం పట్టా పొందాడు. 1999లో పంజాబ్-హరియాణా హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. కర్ణాటక, ఉత్తరాఖండ్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా పనిచేసిన ఆయన 2011లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.
న్యాయమూర్తుల నియామకం కోసం తెచ్చిన వివాదాస్పద జాతీయ న్యాయ నియామకాల కమిషన్ (ఎన్‌జేఏసీ) చట్టాన్ని కొట్టివేస్తూ తీర్పు ఇచ్చిన ఐదుగురు జడ్జిల రాజ్యాంగ ధర్మాసనానికి ఆయన నేతృత్వం వహించారు. అరుణాచల్‌ప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలనను రద్దుచేసిన ధర్మాసనం, ఒకేరకమైన పనికి ఒకే వేతనం ఉండాలంటూ కాంట్రాక్టు ఉద్యోగుల కేసులో కీలక తీర్పిచ్చిన ధర్మాసనాలకు కూడా నేతృత్వం వహించారు.
ఫ్రాన్స్ కొత్త ప్రధానిగా బెర్నార్డ్ఫ్రాన్స్ కొత్త ప్రధాన మంత్రిగా ప్రస్తుత హోం మంత్రి బెర్నార్డ్ కేజెనేవ్ డిసెంబర్ 6న నియమితులయ్యారు. త్వరలో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం కోసం ప్రస్తుత ప్రధాని మానుయేల్ వాల్స్ రాజీనామా చేశారు. దీంతో వాల్స్ రాజీనామాను ఆమోదించిన అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలండ్ కేజెనేవ్‌ను కొత్త ప్రధానిగా నియమించారు.

No comments:
Post a Comment