AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Sunday, 26 November 2017

వార్తల్లో వ్యక్తులు జూలై 2013

వార్తల్లో వ్యక్తులు జూలై 2013
గ్రేటెస్ట్ బాలీవుడ్ స్టార్ అమితాబ్బాలీవుడ్ సూపర్స్టార్ అమితాబ్బచ్చన్కు గ్రేటెస్ట్ బాలీవుడ్ స్టార్ కిరీటం దక్కింది. భారతీయ సినిమా వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బ్రిటన్కు చెందిన ఈస్టర్న్ ఐ వార పత్రిక ఒక సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో బిగ్ బీ అమితాబ్ మొదటిస్థానంలో నిలవగా, మరో నటుడు దిలీప్కుమార్ రెండో స్థానంలో, షారుఖ్ఖాన్ మూడో స్థానంలో నిలిచారు. హీరోయిన్లలో మాధురీదీక్షిత్ తొలి స్థానంలో నిలిచింది.

జీవ శాస్త్రవేత్త ఒబాయిద్ సిద్ధిఖీ మృతిప్రముఖ జీవశాస్త్రవేత్త, పద్మ విభూషణ్ ఒబాయిద్ సిద్ధిఖీ (81) జూలై 26న బెంగళూరులో మరణించారు. ఆయన టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ జాతీయ జీవశాస్త్రాల కేంద్రంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ఆయన జన్యు శాస్త్రానికి సంబంధించి గొప్ప పరిశోధనలు చేశారు.

సినీ నటి మంజుల కన్నుమూతఅలనాటి అందాల నటి మంజుల (59) అనారోగ్యంతో జూలై 23న చెన్నైలో కన్నుమూశారు. 1969లో జెమినీ గణేశన్ హీరోగా రూపొందిన శాంతినిలయం మంజుల తొలిచిత్రం. తెలుగులో హీరోయిన్గా తొలి చిత్రం జై జవాన్. తెలుగు, తమిళం, కన్నడం, హిందీ తదితర భాషల్లో మొత్తం వందకుపైగా చిత్రాల్లో నటించారు. ఆమె ప్రముఖ నటుడు విజయ్కుమార్ను పెళ్లి చేసుకున్నారు. వీరి కుమార్తెలే ప్రముఖ నటీమణులు ప్రీతి, శ్రీదేవి.కమ్యూనిస్టు నేత సమర్ ముఖర్జీ మృతిప్రముఖ కమ్యూనిస్ట్ నేత, స్వాతంత్య్ర సమరయోధుడు సమర్ ముఖర్జీ(100) కోల్కతాలో జూలై 18న మరణించారు. ఆయన కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా(మార్కిస్ట్) లో అత్యంత ఎక్కువ వయసు గల సభ్యుడు. 1928లో సైమన్ కమిషన్ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నారు. 1940 లో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ)లో చేరిన ఆయన 1964లో సీపీఐ(ఎం)లో చేరారు. పశ్చిమ బెంగాల్ శాసనసభ్యుడిగా,మూడుసార్లు లోక్సభ(1971-84) సభ్యుడిగా, 1986లో రాజ్యసభ సభ్యుడిగా వ్యవహరించారు.

తమిళ సినీ గేయ రచయిత వాలి మృతిప్రముఖ తమిళ సినీ గేయ రచయిత వాలి (82) చెన్నైలో జూలై 18న మరణించారు. ఆయన తమిళంలో పది వేలకుపైగా పాటలు రాశారు. 2007లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో ఆయనను సత్కరించింది. వాలి రెండుసార్లు జాతీయ ఉత్తమ గేయ రచయితగా కూడా ఎంపికయ్యారు.

నాబార్డ్ వ్యవస్థాపక చైర్మన్ రామకృష్ణయ్య మృతిరాష్ట్రానికి చెందిన ప్రముఖ బ్యాంకింగ్ నిపుణుడు, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ) వ్యవస్థాపక చైర్మన్ ఎం.రామకృష్ణయ్య (93) జూలై 22న కన్నుమూశారు. రిటైర్డ ఐఏఎస్ అధికారి అయిన రామకృష్ణయ్య ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా కూడా సేవలందించారు. ఆయన 1920, ఫిబ్రవరి 2న నెల్లూరు జిల్లా కావలిలో జన్మించారు.

గిడుగు రాజేశ్వరరావు అస్తమయంప్రముఖ రచయిత గిడుగు రాజేశ్వరరావు (80) జూలై 21న గుండెపోటుతో కన్నుమూశారు. వ్యవహారిక భాషోద్యమ పితామహుడు గిడుగు రామ్మూర్తి మనవడైన రాజేశ్వరరావు కాల్పనిక సాహిత్యంలో కృషి చేశారు. కథలు, లలిత గీతాలు రాశారు. భావ వీచికలు, అమూల్య క్షణాలు, కాళిందిలో వెన్నెల, పిల్లలకు పిట్ట కథలు, పూలతేరు వంటి రచనలు ఆయనకు పేరు తెచ్చాయి.

ప్రముఖ జర్నలిస్టు హెలెన్ థామస్ మృతిఅమెరికాకు చెందిన ప్రముఖ జర్నలిస్టు హెలెన్ థామస్ (92) వాషింగ్టన్లో జూలై 20న మరణించారు. వైట్హౌస్ కరస్పాండెంట్గా ఆమె పదిమంది అమెరికా అధ్యక్షులను తన ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. 1943 నుంచి 2010 వరకు సాగిన వృత్తిలో ప్రముఖ జర్నలిస్టుగా పేరుపొందారు.

అసిస్టెంట్ సెక్రటరీగా నిషా దేశాయ్ బిస్వాల్భారత సంతతికి చెందిన నిషా దేశాయ్ బిస్వాల్ను దక్షిణాసియా వ్యవహారాల విభాగంలో అసిస్టెంట్ సెక్రటరీగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా జూలై 18న నామినేట్ చేశారు. ఆమె ప్రస్తుతం అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ (యూఎస్ఏఐడీ)లో ఆసియా విభాగానికి అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటర్గా ఉన్నారు. ఆమె భారత్, పాకిస్థాన్, బ ంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్, శ్రీలంక, నేపాల్, మాల్దీవులు, భూటాన్లలో అమెరికా వ్యవహారాలను పర్యవేక్షిస్తారు. వర్జీనియా వర్సిటీ నుంచి బీఏ డిగ్రీ పొందిన బిస్వాల్ యూఎస్ఏఐడీలో 2010 నుంచి అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటర్గా, 2005- 2010 వరకు అమెరికా ప్రతినిధుల సభకు చెందిన విదేశీ వ్యవహారాల సబ్కమిటీలో మెజారిటీ క్లర్క్గా పనిచేశారు. 2002-05 వరకు ఇంటరాక్షన్లో విధాన, సలహా డెరైక్టర్గా,1999 -2002 వరకు ప్రతినిధుల సభలో అంతర్జాతీయ సంబంధాల కమిటీలో, 1995-99 వరకు యూఎస్ఎఐడీలో పలు హోదాల్లో పనిచేశారు.

వాయుసేన అంబాసిడర్గా సచిన్ తొలగింపుభారత వాయుసేన (ఐఏఎఫ్) బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న సచిన్ టెండ్కూలర్ను వాయుసేన తొలగించింది. క్రికెట్లో సాధించిన ఘనతలకు గుర్తింపుగా 2011 లో సచిన్కు గ్రూప్ కెప్టెన్ హోదాను వాయుసేన కల్పించింది. సచిన్ వల్ల వాయుసేనలో పెద్ద ఎత్తున యువత చేరుతుందని భావించింది. అయితే యువత నుంచి సరైన స్పందన లేకపోవడంతో ఆయనను బ్రాండ్ అంబాసిడర్ హోదా నుంచి తొలగించింది. జుబిన్ మెహతాకు ఠాగూర్ పురస్కారంప్రపంచ ప్రఖ్యాత సంగీతకారుడు జుబిన్ మెహతా 2013 ఠాగూర్ సాంస్కృతిక సామరస్య పురస్కారానికి ఎంపికయ్యారు. పాశ్చాత్య సంప్రదాయ సంగీతంలో పేరుగాంచిన మెహతా 1936లో ముంబైలో జన్మించారు.

ఐరాసలో ‘మలాలా డే’తాలిబన్ల కాల్పుల్లో గాయపడి కోలుకున్న పాక్ బాలల హక్కుల కార్యకర్త మలాలా యూసఫ్జాయ్ 16వ జన్మదినం సందర్భంగా శుక్రవారం ఐక్యరాజ్యసమితిలో జూలై 12న ‘మలాలా డేయూత్ అసెంబ్లీ’ కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకల్లో బాలికల విద్య, మహిళల ఆత్మగౌరవం కోసం కృషి చేస్తున్నందుకుగాను ఏడుగురు యువతులకు ప్రత్యేక అవార్డులను బహూకరించారు. వీరిలో ఇద్దరు భారతీయులు ఉన్నారు. బెంగళూరుకు చెందిన అశ్వనీ, ఉత్తరప్రదేశ్లోని మీరట్కు చెందిన రజియాలను ‘ఐరాస ప్రత్యేక దూత-ప్రపంచ విద్య యువసాహస అవార్డు’లతో సత్కరించారు. మిగతా అవార్డుగ్రహీతల్లో మలాలాపై తాలిబన్లు జరిపిన కాల్పుల్లో గాయపడిన ఆమె సహ విద్యార్థిని షాజియా, బంగ్లాదేశ్కు చెందిన కేశోబ్, నేపాల్ యువతి ఊర్మిళ, మొరాకోకు చెందిన రూయియా, సియెర్రా లియోన్ యువతి అమినాతా ఉన్నారు.

కత్రోకీ మరణంబోఫోర్స్ కుంభకోణంలో కీలక పాత్రధారి అయిన ఇటాలియన్ వ్యాపారి ఒట్టావియో కత్రోకీ (74) ఇటలీలోని మిలాన్ నగరంలో జూలై 12న గుండెపోటుతో మరణించాడు. దేశాన్ని కుదిపేసిన బోఫోర్స్ కుంభకోణంపై సీబీఐ 1999లో కోర్టుకు సమర్పించిన చార్జిషీట్లో కత్రోకీపై అభియోగాలు మోపింది. స్వీడన్కు చెందిన హోవిట్జర్ తుపాకులను భారత సైన్యానికి సరఫరా చేసేందుకు 1986లో కుదుర్చుకున్న రూ.1600 కోట్ల ఒప్పందంలో రూ.64 కోట్ల ముడుపులు చేతులు మారినట్లు అభియోగాలు ఉన్నాయి. అయితే, ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టు 2011 మార్చి 4న ఈ కేసు నుంచి కత్రోకీకి విముక్తి కల్పించింది.బోఫోర్స్ కుంభకోణం 1987లో స్వీడిష్ రేడియో కేంద్రం ప్రసారం చేసిన కథనంతో వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంలో కత్రోకీకి రూ.64 కోట్లు ముడుపులు ముట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. 

రైనాకు జర్మనీ అవార్డుఅరుణాచల్ప్రదేశ్ జర్నలిస్టు తోంగమ్ రైనా ఈ ఏడాది జర్మనీకి చెందిన మీడియా ఫౌండేషన్ ఇచ్చే ‘ప్రైజ్ ఫర్ ది ఫ్రీడమ్ అండ్ ఫ్యూచర్ ఆఫ్ ది మీడియా’ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికయ్యారు. రైనాతోపాటు ఇద్దరు జర్మన్లు, డెన్మార్క్, బెల్జియంకు చెందిన మరో ఇద్దరు జర్నలిస్టులు ఈ ఏడాది అవార్డుకు ఎంపికయ్యారని ఈ మేరకు మీడియా ఫౌండేషన్ తెలిపింది.

ప్రాణ్ మృతిప్రముఖ బాలీవుడ్ నటుడు ప్రాణ్ జూలై 12న అనారోగ్యంతో ముంబైలో మరణించారు. ఆయన దాదాపు 400కు పైగా చిత్రాల్లో నటించారు. దేశంలో చలన చిత్ర రంగంలో అత్యున్నత పురస్కారమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు 2012 సంవత్సరానికిగాను ప్రాణ్కు లభించింది. ఢిల్లీలో 1920 ఫిబ్రవరి 12న జన్మించిన ప్రాణ్ అసలు పేరు ప్రాణ్ కేవల్ సికంద్. ‘యమ్లా జాట్’ అనే పంజాబీ చిత్రం ద్వారా 1940లో ఆయన హీరోగా వెండితెరకు పరిచయమయ్యారు. ‘అండ్ ప్రాణ్’ పేరిట ఆయన రాసిన ఆత్మకథకు అమితాబ్ బచ్చన్ ముందుమాట రాశారు.

బోస్ కన్నుమూతఆడియో సిస్టమ్స్ రంగ పదనిర్దేశకుడు, బోస్ కార్పొరేషన్ అధినేత అమర్ జి బోస్ (83) జూలై 12న కన్నుమూశారు. అమర్బోస్ 50 ఏళ్ల క్రితం బోస్ కార్పొరేషన్ను స్థాపించారు. 1929, నవంబర్ 2న ఫిలడెల్ఫియాలో అమర్ బోస్ జన్మించారు. 1968లో ఆయన అత్యంత ప్రాచుర్యం పొందిన బోస్ 901 డెరైక్ట్ రిఫ్లెక్టింగ్ స్పీకర్ సిస్టమ్ను ఆవిష్కరించారు.

శాలినీ సింగ్కు భాటియా అవార్డుప్రముఖ ఆంగ్ల దినపత్రిక ‘ది హిందూ’ డిప్యూటీ ఎడిటర్ శాలినీ సింగ్ 2013 ప్రేమ్ భాటియా పురస్కారానికి ఎంపికయ్యారు. పొలిటికల్ విభాగంలో అమెకు ఈ అవార్డు దక్కింది. గతంలో ఈ పురస్కారం హారీష్ ఖేర్, పి.సాయినాథ్, నిరుపమా సుబ్రమణిమన్లకు లభించింది.

సంగీత విద్వాంసుడు నూకల చిన సత్యనారాయణ మృతిప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుడు డాక్టర్ నూకల చిన సత్యనారాయణ (90) జూలై 11న సికింద్రాబాద్లో కన్నుమూశారు. కర్ణాటక సంగీతంలో అసమాన ప్రతిభావంతుడైన నూకల చిన సత్యనారాయణ 1923 ఆగస్టు 4న విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో జన్మించారు. ‘మహామహోపాధ్యాయ’ సహా పలు బిరుదులు, సత్కారాలను అందుకున్న ఆయనను కేంద్ర ప్రభుత్వం 2010లో పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. ఆంధ్రా యూనివర్సిటీ, శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ, మద్రాస్ మ్యూజిక్ అకాడమీ, సంగీత నాటక అకాడమీ, ఆలిండియా రేడియోల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం, కంచి కామకోటి పీఠాలకు ఆస్థాన విద్వాంసునిగా సేవలందించారు. సంగీత సుధ, శ్రీ త్యాగరాజ సారస్వత సర్వస్వం, రాగ లక్షణ సంగ్రహం వంటి సంగీత గ్రంథాలు రచించారు. విదేశాంగ కార్యదర్శిగా సుజాతాసింగ్ప్రపంచదేశాలతో సంబంధాలను నెరపడంలో అత్యంత కీలకమైన విదేశాంగశాఖ కార్యదర్శి పదవిని సుజాతా సింగ్ (59) చేపట్టనున్నారు. ఈ మేరకు ఆమె నియామకాన్ని ప్రధాని మన్మోహన్సింగ్ జూలై 2న ఖరారు చేశారు. 1976 ఐఎఫ్ఎస్ బ్యాచ్కు చెందిన సుజాతాసింగ్ ప్రస్తుతం జర్మనీలో భారత రాయబారిగా పనిచేస్తున్నారు. ప్రస్తుత విదేశాంగ కార్యదర్శి రంజన్ మతాయ్ జూలై 31న పదవీ విరమణ చేయనున్నారు. అదేరోజున సుజాత బాధ్యతలు స్వీకరిస్తారు. చోకిలా అయ్యర్, నిరుపమారావు తర్వాత అత్యంత కీలకమైన ఈ పదవిని చేపట్టిన మూడో మహిళ సుజాతాసింగ్. ఆమె తండ్రి టీవీ రాజేశ్వర్ కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్గా పనిచేశారు. సుజాతాసింగ్ భర్త సంజయ్ సింగ్ కూడా కేంద్రంలో కార్యదర్శి పదవిలో పనిచేసి ఇటీవలే పదవీ విరమణ చేశారు.

మౌస్ సృష్టికర్త ఎంగెల్బార్ట్ మృతిమౌస్ సృష్టికర్త డగ్లస్ ఎంగెల్బార్ట్(88) జూలై 2న మూత్రపిండాల వ్యాధితో కాలిఫోర్నియాలో కన్నుమూశారు. 1925, జనవరి 30న జన్మించిన ఎంగెల్బార్ట్.. 1963లో స్టాన్ఫోర్డ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ప్రస్తుతం ఎస్ఆర్ఐ ఇంటర్నేషనల్)లో పనిచేస్తున్నప్పుడు మౌస్ను కనిపెట్టారు. దీంతోపాటు ఇంటర్నెట్, పర్సనల్ కంప్యూటింగ్ రంగంలో కృషి చేశారు. డిస్ప్లే ఎడిటింగ్, ఆన్లైన్ ప్రాసెసింగ్, లింకింగ్, హైపర్ మీడియా వంటివాటిని ఆవిష్కరించారు. ఇంటర్నెట్, ఈమెయిల్ వంటివాటి రూపకల్పనకూ మార్గం వేశారు.

ఆర్మీలో తొలి మహిళా వ్యక్తిగత కార్యదర్శిభారత సైన్యంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తిగత కార్యదర్శి హోదా పొందిన తొలి వుహిళగా లెఫ్టినెం ట్ గనీవ్ లాల్జీ చరిత్ర సష్టించారు. 2011లో పుణేలో మిలటరీ ఇంటెలిజెన్స్ దళంలో చేరిన లాల్జీ అనతికాలంలోనే అనేక విజయలను సొంతం చేసుకున్నారు. సెంట్రల్ ఆర్మీ కవూండర్ లెఫ్టినెంట్ జనరల్ రజన్ భక్షీకి ఈమె సహాయకురాలిగా వ్యవహరిస్తారు. సాధారణంగా ఆర్మీ చీఫ్, ఆర్మీ కవూండర్లకు ఎయిడ్-డి-క్యాంప్స్(ఏడీసీ)లు సహాయుకులుగా ఉంటారు.

నాస్కామ్ అధ్యక్షుడిగా చంద్రశేఖర్సాఫ్ట్వేర్, సేవల కంపెనీల జాతీయ మండలి (నాస్కామ్) అధ్యక్షుడిగా టెలికం మాజీ కార్యదర్శి ఆర్.చంద్రశేఖర్ జూలై 5న ఎంపికయ్యారు. 2014 జనవరిలో ప్రస్తుత అధ్యక్షుడు సోమ్ మిట్టల్ పదవీకాలం ముగియగానే ఆయన స్థానంలో చంద్రశేఖర్ బాధ్యతలు చేపడతారు. ఆంధ్రప్రదేశ్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ను ఏర్పాటు చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. అంతేకాకుండా ఆ శాఖకు 1997 జూన్ నుంచి 1999 డిసెంబర్ వరకు కార్యదర్శిగా కూడా పనిచేశారు. టెలికం కమిషన్ చైర్మన్గా, సెక్రటరీగా గతేడాది మార్చి వరకు విధులు నిర్వహించారు.

No comments:

Post a Comment