AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Sunday 26 November 2017

వార్తల్లో వ్యక్తులు డిసెంబరు 2012

వార్తల్లో వ్యక్తులు డిసెంబరు 2012
గుజరాత్ సీఎంగా మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ (బీజేపీ) 2012, డిసెంబర్ 26న ప్రమాణస్వీకారం చేశారు. ఈయన వరుసగా నాలుగోసారి ఈ పదవీ బాధ్యతలు చేపట్టారు. 2001లో కేశూభాయ్ పటేల్ స్థానంలో తొలిసారి మోడీ ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. 

బీఎస్‌ఎఫ్ చీఫ్‌గా సుభాష్‌జోషీసరిహద్దు భద్రతాదళం (బీఎస్‌ఎఫ్) కొత్త చీఫ్‌గా సుభాష్ జోషీ 2012, డిసెంబర్ 25న నియమితులయ్యారు. ఇప్పటి వరకూ ఆయన జాతీయ భద్రతా దళం (ఎన్‌ఎస్‌జీ) డెరైక్టర్ జనరల్‌గా వ్యవహరిస్తున్నారు. జోషీ ఉత్తరాఖండ్ కేడర్‌కు చెందిన 1976 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. 2014లో ఆయన పదవీ విరమణ చేయనున్నారు.

హిమాచల్ సీఎంగా వీరభద్రసింగ్హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రిగా వీరభద్ర సింగ్ (కాంగ్రెస్) 2012, డిసెంబర్ 25న ప్రమాణస్వీకారం చేశారు. వీరభద్రసింగ్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టడం ఇది ఆరోసారి. ఈయన తొలిసారి 1983 ఏప్రిల్‌లో సీఎంగా బాధ్యతలు చేపట్టారు.

ఏపీపీఎస్సీ చైర్మన్‌గా బిస్వాల్ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) చైర్మన్‌గా రేచల్ ఛటర్జీ స్థానంలో మాజీ ఐఏఎస్ అధికారి చిత్తరంజన్ బిస్వాల్ నియమితులయ్యారు. డిసెంబర్ 29, 2012న బాధ్యతలు స్వీకరించారు. తుది శ్వాస విడిచిన పండిట్ రవి శంకర్ప్రముఖ సితార్ విద్వాంసుడు పండిట్ రవిశంకర్ (92) అమెరికాలోని శాండియోగోలో డిసెంబర్ 12న అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. భారతీయ శాస్త్రీయ సంగీతానికి పాశ్చాత్య దేశాల్లో ప్రాచుర్యం కల్పించిన దిగ్గజ కళాకారుల్లో రవి శంకర్ ఒకరు. ఈయన 1920, ఏప్రిల్ 7న వారణాసిలో జన్మించారు. ఉస్తాద్ అల్లావుద్దీన్ ఖాన్ వద్ద శిక్షణ పొందారు. ‘వెస్ట్ మీట్స్ ఈస్ట్’ ఆల్బమ్‌కుగాను 1967లో తొలిసారి గ్రామీ పురస్కారాన్ని అందుకున్నారు. 1967లో పద్మభూషణ్, 1981లో పద్మ విభూషణ్ పురస్కారాలు ఆయనను వరించాయి. 1986లో రాజ్యసభ సభ్యుడిగా పని చేశారు. రవిశంకర్‌ను 1999లో ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’తో సత్కరించింది.

బార్‌కోడ్ సష్టికర్త ఉడ్‌ల్యాండ్ మృతిబార్‌కోడ్ సష్టికర్త జోసెఫ్ ఉడ్‌ల్యాండ్(91) న్యూయార్క్‌లో డిసెంబర్ 9న మరణించారు. తన సహ విద్యార్థి బెర్నాడ్ సిల్వర్‌తో కలిసి బార్‌కోడ్‌ను రూపొందించారు. 1940లో మేధా సంపత్తి హక్కులు పొందారు.

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఘోష్ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ పినాకి చంద్రఘోష్ డిసెంబర్ 12న ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఇప్పటి వరకు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు.

ఐరాస ఆడిటర్ల ప్యానెల్ చైర్మన్‌గా రాయ్ఐక్యరాజ్యసమితి ఎక్స్‌టర్నల్ ఆడిటర్స్ ప్యానల్‌కు చైర్మన్‌గా వ్యవహరిస్తున్న భారత కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) వినోద్ రాయ్, 2013వ సంవత్సరానికి కూడా ఆ పదవికి తిరిగి ఎన్నికయ్యారు. ఐరాస కార్యకలాపాల్లో భారీ మార్పు చేర్పులను రాయ్ నేతత్వంలోని ప్యానల్ ప్రస్తుతం చర్చిస్తోంది. వైస్ చైర్మన్‌గా ఇంగ్లండ్ కాగ్ అమ్యాస్ మోర్స్ ఎన్నికయ్యారు. ఘనా అధ్యక్షుడిగా మహామా
ఘనా అధ్యక్షుడిగా జాన్ డ్రమని మహామా తిరిగి ఎన్నికయ్యారు. డిసెంబర్ 10న ప్రకటించిన అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో మహామాకు 50.7 శాతం ఓట్లు దక్కాయి. ఈ ఎన్నికలకు పరిశీలకులుగా కామన్వెల్త్, ఎకోవాస్, ఆఫ్రికన్ యూనియన్ ప్రతినిధులు వ్యవహారించారు. పశ్చిమ ఆఫ్రికాలో సంప్రదాయ ప్రజాస్వామ్యం సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న దేశాల్లో ఘనా ఒకటి.

ఐరాస విద్యా సలహాదారుగా మలాలా తండ్రితాలిబన్ల కాల్పుల్లో గాయపడిన పాక్ మానవ హక్కుల కార్యకర్త మలాలా యూసఫ్‌జాయ్ (15) తండ్రి, ప్రధానోపాధ్యాయుడు జియావుద్దీన్ యూసఫ్‌జాయ్ ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ విద్య (గ్లోబల్ ఎడ్యుకేషన్) ప్రత్యేక సలహాదారుగా నియమితులయ్యారు. ఈ పథకం ప్రత్యేక రాయబారి, బ్రిటన్ మాజీ ప్రధాని గార్డన్ బ్రౌన్ డిసెంబర్ 10న ఈ విషయం వెల్లడించారు.
 
కిడ్నీ మార్పిడి ఆద్యుడు ముర్రే మరణంప్రపంచంలో తొలిసారి మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి వైద్య రంగంలో మరో అధ్యాయానికి నాంది పలికిన ప్రఖ్యాత వైద్యుడు, నోబెల్ బహుమతి గ్రహీత జోసెఫ్ ముర్రే (93) నవంబర్ 26న అమెరికాలోని బోస్టన్‌లో కన్నుమూశారు. డాక్టర్ ముర్రే బృందం 1954లో రిచర్డ్ అనే వ్యక్తికి అతని కవల సోదరుడు రొనాల్డ్ నుంచి కిడ్నీ సేకరించి విజయవంతంగా మార్పిడి చేసింది. దీంతో వైద్య రంగంలో సరికొత్త శకం మొదలైంది. శరీరంలో ఇతర కణజాలాన్ని ప్రవేశ పెట్టిన సమయంలో రోగ నిరోధక వ్యవస్థ దాన్ని వ్యతిరేకించకుండా చేసేందుకు ముర్రే పరిశోధన సాగించారు. వైద్యరంగంలో పరిశోధనకుగాను 1990లో ముర్రే, డొనాల్డ్ థామస్‌లకు సంయుక్తంగా నోబెల్ పురస్కారం లభించింది.

No comments:

Post a Comment