AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Sunday, 26 November 2017

వార్తల్లో వ్యక్తులు నవంబరు 2014

వార్తల్లో వ్యక్తులు నవంబరు 2014
ఐరాస దక్షిణాసియా మహిళా ప్రచారకర్తగా సానియా 
ఐక్యరాజ్యసమితి దక్షిణాసియా మహిళా విభాగం గుడ్‌విల్ అంబాసిడర్ (సౌహార్ధ్ర రాయబారి)గా భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియామీర్జా నవంబరు 25న నియమితులయ్యారు. దక్షిణాసియా నుంచి ఈ గౌరవం పొందిన తొలి మహిళ సానియా. 
ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్‌గా సి.కె.ప్రసాద్
ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి చంద్రమౌళి కుమార్ ప్రసాద్‌ను ఉపరాష్ట్రపతి నేతృత్వంలోని కమిటీ నవంబరు 25న ఎంపిక చేసింది. ప్రస్తుత చైర్మన్‌గా ఉన్న మార్కండేయ మూడేళ్ల పదవీకాలం అక్టోబరు 11న ముగిసింది. దీంతో ఆ స్థానంలో సి.కె. ప్రసాద్ నియమితులయ్యారు. 
తపన్‌రాయ్ చౌదురీ మృతి
చరిత్రకారుడు తపన్ రాయ్ చౌదురీ (90) నవంబరు 26న మృతి చెందారు. ఆయన 1973 నుంచి 1992 వరకు ఆక్స్‌ఫర్డ్‌లోని సెంట్ ఆంటోనీ కాలేజీలో ఆధునిక దక్షిణాసియా విభాగంలో రీడర్‌గా పనిచేశారు. అందులోనే భారత చరిత్ర, నాగరికత పీఠంలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. బెంగాల్ అండర్ అక్బర్ అండ్ జహంగీర్ అనే పుస్తకంతో పాటు తన జ్ఞాపకాలపై బెంగాల్ నామా అనే పుస్తకాన్ని బెంగాలీ భాషలో రాశారు. 
కథక్ నర్తకి సితారాదేవి మృతి 
ప్రముఖ కథక్ నర్తకి సితారాదేవి (96) నవంబరు 25న ముంబైలో మరణించారు. ఆమె 1969లో సంగీత్ నాటక అకాడమీ అవార్డు, 1973లో పద్మశ్రీ, 1995లో కాళిదాస్ సమ్మాన్ పురస్కారం పొందారు.

ఇద్దరు భారతీయులకు సెయింట్‌హుడ్ హోదా
పోప్ ఫ్రాన్సిస్ భారత్‌కు చెందిన ఇద్దరికి నవంబరు 23న వాటికన్‌లో సెయింట్‌హుడ్ హోదా ప్రకటించా రు. వీరితో పాటు ఇటలీకి చెందిన మరో నలుగురికి ఈ గౌరవం లభించింది. కేరళకు చెందిన ఫాదర్ కురియకోస్ ఇలియాస్ ఛవారా (1805-1871), సిస్టర్ యూఫ్రేసియా (1877-1952)లు సెయింట్ హుడ్ పొందారు. వీరిని మహిమాన్వితులుగా , బాధితులకు సాంత్వన కలిగించే ఆరాధ్యదైవాలుగా పోప్ ప్రకటించారు. 
గణతంత్ర వేడుకల అతిథిగా ఒబామా
2015లో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా హాజరుకానున్నారు. ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు ఒబామా భారత్‌లో పర్యటిస్తారని శ్వేత సౌధం ప్రకటించింది. ఒబామా హాజరైతే గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా అమెరికా అధ్యక్షుడు రావడం ఇదే తొలిసారి అవుతుంది. 
యూపీఎస్సీ సారథిగా దీపక్ గుప్తా 
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) చైర్మన్‌గా జార్ఖండ్ క్యాడర్ మాజీ ఐఏఎస్ అధికారి దీపక్‌గుప్తా నియమితులయ్యారు. ఆనవాయితీ ప్రకారం యూపీఎస్సీ సభ్యులే ఈ హోదాను అలంకరిస్తారు. అయితే ఈసారి యూపీఎస్సీ వెలుపలి వ్యక్తిని నియమించారు. ఇలా జరగడం ఇది మొదటి సారి.

ఫార్చూన్ సీఈవోల్లో సత్య నాదెళ్ల
ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ సీఈవోల జాబితాలో ప్రవాస భారతీయులు ముగ్గురు చోటు దక్కిం చుకున్నారు. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, మాస్టర్‌కార్డ్ సీఈవో అజయ్ బంగా, హర్మన్ ఇంటర్నేషనల్ చైర్మన్ దినేష్ పాలివాల్ ఈ జాబితాలో ఉన్నారు. 50 మంది కార్పొరేట్ దిగ్గజాలతో ఫార్చూన్ మ్యాగజైన్ ‘బిజినెస్‌పర్సన్ ఆఫ్ ది ఇయర్’ పేరిట రూపొందించిన లిస్టులో గూగుల్ సీఈవో ల్యారీ పేజ్ అగ్రస్థానంలో, యాపిల్ సీఈవో టిమ్ కుక్ రెండో స్థానంలో నిల్చారు. బంగా 28వ స్థానంలో, నాదెళ్ల 38వ స్థానంలో, పాలివాల్ 42వ స్థానంలో ఉన్నారు.
జీనియస్ బుక్‌లోకి సూక్ష్మ నమూనాల సృష్టికర్త
నెల్లూరుకు చెందిన సూక్ష్మ నమూనాల సృష్టికర్త షేక్ ముసవ్వీర్ అంతర్జాతీయ జీనియస్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానాన్ని సాధించాడు. 1.3 గ్రాముల బంగారు తీగతో తెలుగులో జాతీయ గీతంతోపాటు తెలుగుతల్లి, ప్రపంచ తెలుగు మహాసభల లోగో సూక్ష్మ నమూనాను రూపొందించినందుకు ఈ గుర్తింపు లభించింది. 
గోల్డ్ మాన్ శాక్స్‌లో భారత సంతతి యువకునికి భాగస్వామ్యం
భారత సంతతికి చెందిన కునాల్ షా (32) అనే యువకుడు అమెరికాలోని ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ దిగ్గజం గోల్డ్ మాన్ శాక్స్‌లో భాగస్వామిగా చేరాడు. దీం తో అతిపిన్న వయుసులో ఈ ఉన్నతి పొందిన వ్యక్తిగా నిలిచాడు. గోల్డ్ మాన్ శాక్స్‌లో భాగస్వామికి 9 లక్షల డాలర్ల (సుమారు రూ. 5.4 కోట్ల) వేతనం ఉంటుంది. 
ఇంటర్‌పోల్ ఫౌండేషన్ బోర్డులో రతన్‌టాటా
టాటా గ్రూప్ గౌరవ ఛైర్మన్ రతన్‌టాటా ఇంటర్‌పోల్ ఫౌండేషన్ బోర్డు సభ్యునిగా నవంబరు 14న నియమితులయ్యారు. తీవ్రవాద కార్యకలాపాలకు వ్యతిరేకంగా ఈ బోర్డు పనిచేస్తుంది. 
ఐరాస మహిళా సౌహార్ధ్ర రాయబారిగా ఫర్హాన్ అక్తర్ 
ఐక్యరాజ్యసమితి చేపట్టిన ‘హి ఫర్ షి’ అనే కార్యక్రమానికి దక్షిణాసియా ప్రాంత మహిళా సౌహార్ధ్ర రాయబారిగా బాలీవుడ్ నటుడు ఫర్హాన్ అక్తర్ నవంబరు 14న నియమితులయ్యారు. దీంతో మహిళా సౌహార్ధ్ర రాయబారిగా ఎంపికైన తొలి పురుషుడుగా ఆయన గుర్తింపు పొందాడు. ఈ హోదాలో లింగ సమానత్వం, మహిళా స్వయం శక్తి అంశాలపై ఫర్హాన్ ప్రచారం నిర్వహిస్తాడు. అక్తర్‌తోపాటు బ్రిటిష్ నటి ఎమ్మా వాట్సన్, అకాడమీ అవార్డు గ్రహీత నికోల్ కిడ్‌మన్, థాయ్‌లాండ్ యువరాణి బజ్రకితియాబా మహిదోల్ నియమితులయ్యారు.
తమిళనాడు హెచ్‌ఆర్‌సీ చైర్ పర్సన్‌గా జస్టిస్ మీనాకుమారి
తమిళనాడు రాష్ట్ర మానవ హక్కుల సంఘం (హెచ్‌ఆర్‌సీ) చైర్ పర్సన్‌గా జస్టిస్ మీనాకుమారి నియమితులయ్యారు. గవర్నర్ రోశయ్య ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నియామక ఉత్తర్వులు జారీ చేశారు. జస్టిస్ మీనాకుమారి గతంలో మేఘాలయ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు.

సీబీడీటీ చైర్‌పర్సన్‌గా అనితా కపూర్ 
ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు (సీబీడీటీ) కొత్త చైర్‌పర్సన్‌గా అనితాకపూర్ నవంబరు 5న నియమితులయ్యారు. ఆమె 1978 బ్యాచ్‌కు చెందిన ఐఆర్‌ఎస్ అధికారిణి. అక్టోబరు 31న ఉద్యోగ విరమణ చేసిన కె.వి.చౌదరి స్థానంలో అనితాకపూర్ బాధ్యతలు చేపట్టారు. 2015 నవంబరు వరకు ఈ హోదాలో కొనసాగుతారు. 
దక్షిణ కరోలినా గవర్నర్‌గా నిక్కీ హేలీ 
అమెరికాలోని దక్షిణ కరోలినా గవర్నర్‌గా భారతీయ సంతతికి చెందిన అమెరికన్ నిక్కీ హేలీ రిపబ్లిక్ పార్టీ తరపున నవంబరు 4న రెండోసారి ఎన్నికయ్యారు. ఆమె 57.8 శాతం ఓట్ల తేడాతో ప్రత్యర్థి విన్సెంట్‌పై విజయం సాధించారు. దక్షిణ కరోలినా ప్రప్రథమ మహిళా గవర్నర్‌గానూ, అమెరికాలో మొట్టమొదటి శ్వేత, జాతేతర గవర్నర్‌గా నిక్కీ చరిత్ర సృష్టించారు. 
గోవా ముఖ్యమంత్రిగా లక్ష్మీకాంత్ పర్సేకర్
గోవా నూతన ముఖ్యమంత్రిగా లక్ష్మీకాంత్ పర్సేకర్ (58) నవంబరు 8న బాధ్యతలు చేపట్టారు. 2012 నుంచి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న మనోహర్ పారికర్ కేంద్రమంత్రివర్గంలో చేరడంతో ఆ స్థానంలో పర్సేకర్ నియమితులయ్యారు. 
ఫోర్బ్స్ జాబితాలో మోదీకి 15వ స్థానం
ఫోర్బ్స్ పత్రిక నవంబరు 5న విడుదల చేసిన ప్రపంచ శక్తిమంతుల జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ 15వ స్థానంలో నిలిచారు. మొత్తం 72 మందితో కూడిన ఈ జాబితాలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మొదటి స్థానం, అమెరికా అధ్యక్షుడు ఒబామా రెండో స్థానం, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ మూడో స్థానంలో ఉన్నారు. 
అత్యంత శక్తిమంతమైన మహిళగా అరుంధతీ భట్టాచార్య
భారత్‌లో అత్యంత శక్తిమంతులైన 50 మంది మహిళా వ్యాపారవేత్తల జాబితాను ఫోర్బ్స్ నవంబరు 9న విడుదల చేసింది. ప్రథమ స్థానంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య నిలిచారు. ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ, సీఈఓ చందాకొచ్చర్‌కు రెండో స్థానం, యాక్సిస్ బ్యాంక్ ఎండీ,సీఈఓ శిఖాశర్మ కు మూడో స్థానం దక్కింది. అపోలో హాస్పిటల్ ఎంటర్ ప్రైజెస్ ఎండీ ప్రీతారెడ్డి ఏడో స్థానంలో నిలిచారు. 
గుల్జార్‌కు హెచ్‌సీయూ గౌరవ డాక్టరేట్
కవి, సినీ దర్శకుడు సంపూర న్ సింగ్ కల్రా (గుల్జార్)కు హైదరాబాద్ కేంద్ర విశ్వ విద్యాలయం (హెచ్‌సీయూ) గౌరవ డాక్టరేట్‌ను నవంబరు 6న అందించింది. సాహిత్య రంగంలో విశేష కృషిని గుర్తిస్తూ వర్సిటీ కులపతి సీహెచ్. హనుమంతరావు గుల్జార్‌కు డాక్టరేట్‌ను ప్రదానం చేశారు.

ప్రసార భారతి చైర్మన్‌గా ఎ. సూర్య ప్రకాశ్
ప్రసార భారతి బోర్డు చైర్మన్‌గా సీనియర్ పాత్రికేయుడు, పయనీర్ పత్రిక కన్సల్టింగ్ ఎడిటర్ ఎ. సూర్య ప్రకాశ్ అక్టోబరు 28న ఎంపికయ్యారు. ఆయన ఈ హోదాలో మూడేళ్లు కొనసాగుతారు. 

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్మహారాష్ట్ర 18వ ముఖ్యమంత్రిగా దేవేంద్ర గంగాధర్ ఫడ్నవీస్ (44) అక్టోబరు 31న ముంబయిలో ప్రమాణ స్వీకారం చేశారు. 

ఐసీసీఆర్ అధ్యక్షునిగా లోకేశ్‌చంద్రసాంస్కృతిక సంబంధాల భారతీయ మండలి (ఇండియా కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్) చైర్మన్‌గా లోకేశ్‌చంద్రను రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ అక్టోబరు 27న నియమించారు. ఆయన పదవీకాలం ముడేళ్లు. 

ఐరాస శాంతి పరిరక్షణ కమిటీలో భారతీయుడుఐక్యరాజ్య సమితి అత్యున్నత శాంతి పరిరక్షణ కమిటీలో భారత విశ్రాంత సైన్యాధికారి లెఫ్టినెంట్ జనరల్ అభిజిత్ గుహా నియమితులయ్యారు. 14 మంది సభ్యులతో కూడిన ఈ కమిటీలో ఆయనను సమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ నియమించారు.

No comments:

Post a Comment