AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Sunday, 26 November 2017

చరిత్రలో ఈ నెల ఆగష్టు 2017

చరిత్రలో ఈ నెల ఆగష్టు 2017 
అంతర్జాతీయంభారత్‌పై అణుదాడి చేద్దామనుకున్నా : ముషార్రఫ్ 2002 ఏడాదిలో భారత్‌పై అణ్వస్త్రాలను ప్రయోగించాలా వద్దా అన్నదానిపై తాను తీవ్రంగా ఆలోచించినట్లు పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ ఇటీవల తెలిపారు. 2001లో భారత పార్లమెంటుపై ఉగ్రవాదులు దాడి చేసిన అనంతరం ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ సమయంలో తనకు అణ్వాయుధాలను ప్రయోగించాలన్న ఆలోచన వచ్చిందనీ, కానీ భారత్ వైపు నుంచి ప్రతిదాడులు జరుగుతాయన్న భయంతో ఆగిపోయానని ముషార్రఫ్ ఓ జపాన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ ఆలోచనలతో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని ఆయన గుర్తుచేసుకున్నారు. 
1999 అక్టోబరులో నాటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను ఆర్మీ తిరుగుబాటు ద్వారా కూలదోసి 2001 నుంచి 2008 వరకు ముషార్రఫ్ అధ్యక్షుడిగా ఉన్నారు. పాక్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఆయన.. వైద్య చికిత్సల నెపంతో పాకిస్తాన్ విడిచి వచ్చి ప్రస్తుతం దుబాయ్‌లో ఉంటున్నారు. 

బిల్‌గేట్స్‌ను అధిగమించిన బెజోస్ఆన్‌లైన్ రిటైలింగ్ దిగ్గజం అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్.. ప్రపంచ కుబేరుల జాబితాలో అగ్రస్థానానికి చేరారు. ఈ క్రమంలో ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌ను కూడా దాటేశారు. ఆర్థిక ఫలితాల వెల్లడికి ముందు జూలై 27న అమెజాన్ షేరు ధర ఒక్కసారిగా దూసుకుపోవడంతో... బెజోస్ సంపద నికర విలువ ఏకంగా 90.9 బిలియన్ డాలర్లకు ఎగిసింది. ప్రస్తుతం బిల్ గేట్స్ సంపద అంతకన్నా కాస్త తక్కువగా 90.7 బిలియన్ డాలర్లుగా ఉంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ప్రపంచ కుబేరులలో తొలి స్థానానికి అమెజాన్ వ్యవస్థాపకుడు
ఎప్పుడు : జూలై 27
ఎవరు : జెఫ్ బెజోస్ 
ఎందుకు : బిల్ గేట్స్‌ను అధిగమించిన బెజోస్

అమెరికా-మెక్సికో గోడకు 1.6 బిలియన్ డాలర్లు అమెరికా-మెక్సికో గోడ నిర్మాణానికి 1.6 బిలియన్ డాలర్లు సహా 827 బిలియన్ డాలర్ల ప్యాకేజీకి అమెరికా ప్రతినిధుల సభ జూలై 28న ఆమోదముద్ర వేసింది. ఈ బిల్లు 235-192 ఓట్లతో పాసయింది. ప్రతిపక్ష డెమోక్రాట్ల బలం ఉన్న సెనేట్‌లోనూ ఈ బిల్లు ఆమోదం పొందాలి.
మాదకద్రవ్యాల ప్రవాహం, అక్రమ వలసలను అరికట్టేందుకు మెక్సికో సరిహద్దులో గోడ నిర్మిస్తానని ఎన్నికల సమయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హామీ ఇచ్చారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : అమెరికా-మెక్సికో గోడ నిర్మాణ బిల్లుకి ఆమోదం
ఎప్పుడు : జూలై 28
ఎవరు : అమెరికా ప్రతినిధుల సభ
ఎక్కడ : అమెరికా 

స్విట్జర్లాండ్‌లో ప్రపంచంలోనే అతిపొడవైన వేలాడే వంతెన స్విట్జర్లాండ్‌లోని ఆల్ఫ్స్ పర్వత ప్రాంతంలో జెర్మట్ మ్యాటర్‌హార్న్‌లోని స్విస్ అల్ఫీన్ రిసార్ట్‌లో ప్రపంచంలోనే అతి పొడవైన వేలాడే వంతెనను నిర్మించారు. కేవలం పాదాచారుల కోసమే ఉద్దేశించిన ఈ వంతెన భూ ఉపరితలానికి 85 మీటర్ల ఎత్తులో, 494 మీటర్ల పొడవుతో ఉంది. కేవలం పది వారాల్లోనే నిర్మించిన ఈ వంతెనకు ఛార్లెస్ కువోనెన్ అని పేరు పెట్టారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ప్రపంచంలోనే అతిపొడవైన వేలాడే వంతెన 
ఎప్పుడు : ఆగస్టు 1
ఎక్కడ : స్విస్ అల్ఫీన్ రిసార్ట్, స్విట్జర్లాండ్

చైనాలో బ్రిక్స్ దేశాల కార్మిక మంత్రుల సమావేశంరెండు రోజుల పాటు జరిగిన బ్రిక్స్ దేశాల కార్మిక మంత్రుల సమావేశాలు చైనాలోని చాంగ్‌కింగ్‌లో జూలై 26న ముగిశాయి. ఈ సమావేశాల్లో మన కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ పాల్గొన్నారు. సమావేశంలో ప్రసంగించిన ఆయన బ్రిక్స్ దేశాల కార్మిక సంస్థల మధ్య సమాచార మార్పిడి వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా పరస్పర సహకారాన్ని పెంచుకోవచ్చన్నారు. సుస్థిర ఉద్యోగ కల్పన, జీవన ప్రమాణాల నాణ్యతను పెంచేందుకు పరస్పర సహకారంతో పనిచేస్తామని సమావేశాల ముగింపు సందర్భంగా బ్రిక్స్ దేశాలు సంయుక్త ప్రకటన చేశాయి. సెప్టెంబర్ మొదటి వారంలో చైనాలోని షియామెన్‌లో బ్రిక్స్ సదస్సు జరగనున్న నేపథ్యంలో ఈ సమావేశం నిర్వహించారు.

రష్యా, ఇరాన్, ఉత్తర కొరియాపై అమెరికా ఆంక్షలురష్యా, ఇరాన్, ఉత్తర కొరియాలపై ఆర్థిక ఆంక్షలు విధించే బిల్లును జూలై 25న అమెరికా దిగువసభ (ప్రతినిధుల సభ) భారీ మెజారిటీతో ఆమోదించింది. ఈ తీర్మానానికి అనుకూలంగా 419 మంది, వ్యతిరేకంగా ముగ్గురు ఓటు వేశారు. అమెరికా, దాని మిత్ర దేశాలను చిన్నచూపు చూస్తూ వాటికి వ్యతిరేకంగా ఈ మూడు దేశాలు ప్రమాదకర, యుద్ధోన్మాద కార్యకలాపాలు చేపడుతున్నాయని ఆరోపిస్తూ ఈ చర్య తీసుకుంది. దిగువ సభ ఆమోదంతో బిల్లు సెనేట్(ఎగువ సభ) పరిశీలనకు వెళ్లనుంది. బిల్లును రూపొందించిన ప్రతినిధుల సభ విదేశీ వ్యవహారాల కమిటీ చైర్మన్ ఎడ్ రాయిస్స్ మాట్లాడుతూ ఈ మూడు దేశాలు అమెరికా ప్రయోజనాలకు భంగం కలిగించడంతోపాటు పొరుగు దేశాల్లో అస్థిరత సృష్టిస్తున్నాయని ఆరోపించారు.

2040 నుంచి బ్రిటన్‌లో పెట్రోల్, డీజిల్ వాహనాలు నిషేధండీజిల్, పెట్రోల్‌తో నడిచే కార్లు, వ్యాన్ల అమ్మకాలను 2040 నుంచి నిషేధిస్తున్నట్లు యూకే పర్యావరణ సెక్రటరీ మైఖేల్ గోవ్ ప్రకటించారు. ఈ మేరకు ‘ఎయిర్ క్వాలిటీ ప్లాన్’ను జూలై 26న బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది. 2040 నుంచి అన్ని వాహనాలు పూర్తిగా విద్యుత్‌తో నడిచేలా చర్యలు తీసుకోనుంది. ఈ మేరకు హైబ్రిడ్ వెహికల్స్‌తో సహా ఇతర అన్ని రకాల ఇంజిన్లతో నడిచే వాహనాలపై నిషేధం విధించనుంది. 2040 నుంచి జీరో ఉద్గార వాహనాలే రోడ్లపై నడిచేలా చూడాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం బ్రిటన్ మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు 1 శాతం కంటే తక్కువగా ఉన్నాయి. 2040 తర్వాత ఉద్గార రహిత వాహనాలనే అమ్మాలని 2011లో బ్రిటన్ ప్రభుత్వం కార్బన్ ప్లాన్‌ను తీసుకొచ్చింది.

చైనా ఆర్మీ 90వ వార్షికోత్సంలో ఆయుధాల ప్రదర్శనచైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్‌ఏ) 90వ వార్షికోత్సవం సందర్భంగా జూలై 30న ఇన్నర్ మంగోలియాలోని ఝరిహెలో భారీ పరేడ్, ఆయుధాల ప్రదర్శన నిర్వహించారు. దీనికి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ హాజరయ్యారు. ఇందులో 12 వేల దళాలు పాల్గొన్నాయి. 100కు పైగా యుద్ధవిమానాలు, 600 రకాల ఆయుధాలను ప్రదర్శించారు. వీటిలో సగం ఆయుధాలు కొత్తగా రూపొందించినవే. 1927, ఆగస్టు 1న మావో జెడాంగ్ నేతృత్వం లోని చైనా కమ్యూనిస్టు పార్టీ పీఎల్‌ఏను స్థాపించింది.

జాతీయంబిహార్‌లో జేడీయూ-బీజేపీ ప్రభుత్వం  లాలు ప్రసాద్ యాదవ్ కుటుంబంపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో.. సీఎం నితీశ్ కుమార్(జేడీయూ) ఆర్జేడీతో తెగతెంపులు చేసుకున్నారు. ఈ మేరకు ఆయన జూలై 26న ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అనంతరం.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుశీల్ మోదీ.. నితీశ్‌కు మద్దతు తెలుపుతూ గవర్నర్‌కు లేఖనందించారు. దీంతో జూలై 27న బిహార్ సీఎంగా జేడీయూ నేత నితీశ్ ప్రమాణం చేశారు. 
2015 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్ మహాకూటమిగా ఏర్పడ్డాయి. 243 అసెంబ్లీ స్థానాల్లో ఏకంగా 178 స్థానాలు గెలిచాయి. జేడీయూ నేత నితీశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. లాలూ ఇద్దరు కుమారుల్లో ఒకరు ఉపముఖ్యమంత్రి పదవి చేపట్టగా మరొకరికి మంత్రి పదవి దక్కింది. అనంతరం.. లాలూ కుటుంబంపై అవినీతి ఆరోపణలతో సీబీఐ, ఈడీ దాడుల నేపథ్యంలో.. ప్రజలకు వివరణ ఇవ్వాలని లాలూ కుమారులను నితీశ్ కొంతకాలం క్రితమే కోరారు. దీన్ని లాలూ కుటుంబం బాహాటంగానే ఖండించింది. జూలై 26న ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ మీడియా సమావేశం ఏర్పాటుచేసి మరీ తన కుమారులు రాజీనామా చేసే ప్రసక్తే లేదని ఘంటాపథంగా చెప్పారు. దీంతో ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని నడపటం కష్టమని భావించిన నితీశ్ కుమార్.. కూటమితో తెగతెంపులు చేసుకుంటున్నట్లు ప్రకటించారు. 
అసెంబ్లీలో బలాబలాలు

పార్టీ
సీట్లు
ఆర్‌జేడీ
80
జేడీ(యూ)
71
కాంగ్రెస్
27
బీజేపీ
53
ఇతరులు
12
క్విక్ రివ్యూ:ఏమిటి : కొలువుదీరిన జేడీయూ-బీజేపీ ప్రభుత్వం 
ఎప్పుడు : జూలై 27
ఎవరు : సీఎం నితీశ్ కుమార్ 
ఎక్కడ : బిహార్‌లో 
ఎందుకు : ఆర్జేడీతో జేడీయూ తెగతెంపుల నేపథ్యంలో 

కనీస వేతన బిల్లుకు కేబినెట్ ఆమోదంఅన్ని రంగాల్లోనూ కార్మికులకు కనీస వేతనం అమలు చేయడమే లక్ష్యంగా రూపొందించిన నూతన కనీస వేతన బిల్లుకు కేంద్ర కేబినెట్ జూలై 27న ఆమోద ముద్ర వేసింది. నాలుగు కార్మిక చట్టాలను విలీనం చేసి ఈ బిల్లును తీసుకొచ్చారు. ఇది చట్టరూపం దాల్చితే దేశవ్యాప్తంగా సుమారు 4 కోట్ల మంది ఉద్యోగులకు ప్రయోజనం కలుగుతుంది. 
కనీస వేతనాల చట్టం-1948, వేతనాల చెల్లింపు చట్టం-1936, బోనస్ చెల్లింపు చట్టం-1965, సమాన వేతనాల చట్టం-1976లు ఇందులో భాగం కానున్నాయి. బిల్లు ప్రకారం కేంద్రం నిర్దేశించే కనీస వేతనాలను రాష్ట్రాలు కూడా అమలుచేయాల్సి ఉంటుంది. అంతకుమించి కనీస వేతనాలను ఇచ్చే వెసులుబాటును రాష్ట్రాలకు కల్పించారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : కనీస వేతన బిల్లుకు ఆమోదం 
ఎప్పుడు : జూలై 26
ఎవరు : కేంద్ర కేబినెట్ 
ఎందుకు : అన్ని రంగాల్లోనూ కార్మికులకు కనీస వేతనం అమలు చేయడమే లక్ష్యంగా 

గోప్యత హక్కుకి కొన్ని పరిమితులు ఉండాలి : కేంద్రంరాజ్యాంగం ప్రకారం గోప్యతను ప్రాథమిక హక్కుగా పరిగణించవచ్చని, అయితే దానికి కొన్ని పరిమితులు ఉండాలని కేంద్రం జూలై 26న సుప్రీం కోర్టుకు తెలిపింది. ఈ మేరకు గోప్యతకు సంబంధించిన ప్రతి అంశాన్నీ ప్రాథమిక హక్కుగా పరిగణించకూడదని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్.. చీఫ్ జస్టిస్ జేఎస్ ఖేహర్ నేతృత్వంలోని జస్టిస్ జె.చలమేశ్వర్, జస్టిస్ అబ్దుల్ నజీర్ తదితర 9 మంది సభ్యుల ధర్మాసనానికి నివేదించారు. ప్రైవసీకి సంబంధించిన చాలా అంశాలను ప్రాథమిక హక్కుల పరిధిలోకి తీసుకురాకూడదని పేర్కొన్నారు. 
పశ్చిమ బెంగాల్, పంజాబ్, పుదుచ్చేరి, పంజాబ్‌ల తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదిస్తూ.. ప్రస్తుత ఆధునిక సాంకేతిక యుగంలో గోప్యతను ప్రాథమిక హక్కుగా ప్రకటించాల్సిన అవసరముందన్నారు.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : గోప్యత హక్కుకి కొన్ని పరిమితులు ఉండాలన్న కేంద్రం 
ఎప్పుడు : జూలై 26
ఎవరు : సుప్రీంకోర్టు 

బస్సులకు డిజైన్ కోడ్ప్రయాణికులు, డ్రైవర్లకు సౌకర్యవంతంగా ఉండేలా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏఐఎస్-052 కోడ్ పేరిట బస్ బాడీ కోడ్‌ను అమల్లోకి తేనుంది. 2017 అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్న ఈ విధానంతో ఇక దేశవ్యాప్తంగా బస్సులన్నీ కేటగిరీల వారీగా ఒకే తరహాలో ఉండనున్నాయి. ప్రమాదాలను నివారించేలా, ఒకవేళ ప్రమాదాలు జరిగితే సులువుగా బయటపడేలా బస్‌బాడీ నిర్మాణం, ప్రయాణికులకు వీలైనంత ఎక్కువ సౌకర్యవంతమైన సీట్లు, డ్రైవర్ క్యాబిన్ విషయంలో ప్రత్యేక నిబంధనలను ఇందులో పొందుపరిచారు. ఈ విషయమై ఇప్పటికే బస్‌బాడీ నిర్మాణ సంస్థలకు మార్గదర్శకాలు జారీ చేశారు. వీటిపై అవగాహన కల్పించేందుకు పుణెలోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రోడ్ ట్రాన్‌‌సపోర్టు ప్రతినిధులు దేశవ్యాప్తంగా ప్రత్యేక వర్క్‌షాపులు నిర్వహిస్తున్నారు. 
క్విక్ రివ్యూ:ఏమిటి : బస్సులకు ప్రత్యేకంగా ఏఐఎస్-052 కోడ్ 
ఎప్పుడు : జూలై 28
ఎవరు : కేంద్ర ప్రభుత్వం 
ఎక్కడ : దేశవ్యాప్తంగా 
ఎందుకు : ప్రయాణికులు, డ్రైవర్లకు సౌకర్యవంతంగా ఉండేందుకు

ఐఐఎం బిల్లు - 2017కు లోక్‌సభ ఆమోదం దేశంలోని 20 అత్యుత్తమ ఐఐఎం(ఇండియన్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్)లకు స్వయం ప్రతిపత్తి కల్పించేందుకు ఉద్దేశించిన ఐఐఎం బిల్లు - 2017ను లోక్‌సభ జూలై 29న ఆమోదించింది. విద్యా, పరిశోధన రంగాల్లో ఐఐఎంలు ప్రపంచ ప్రమాణాలను అందుకునేందుకు ఈ బిల్లు దోహదపడుతుందని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు. ఈ విద్యా సంస్థల నిర్వహణలో ప్రభుత్వ జోక్యం ఉండదని చెప్పారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఐఐఎం బిల్లు - 2017కు ఆమోదం 
ఎప్పుడు : జూలై 28
ఎవరు : లోక్‌సభ 
ఎందుకు : దేశంలోని 20 అత్యుత్తమ ఐఐఎంలకు స్వయం ప్రతిపత్తి కల్పించేందుకు 

భూకంపాల జోన్‌లో 29 నగరాలు దేశంలో 29 నగరాలు భూకంపాల జోన్‌లో ఉన్నాయని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ (ఎన్‌సీఎస్) నివేదిక వెల్లడించింది. వాటిలో దేశ రాజధాని ఢిల్లీతో పాటు తొమ్మిది రాష్ట్రాల రాజధానులున్నాయి. ఇవి ఎక్కువగా హిమాలయాల పరిధిలో ఉన్నాయి. దీనికి ప్రపంచంలోనే ఎక్కువ భూకంపాలు సంభవించే ప్రాంతంగా గుర్తింపు ఉంది. 
ఢిల్లీ, పట్నా, శ్రీనగర్, కొహిమా, పుదుచ్చేరి, గువాహటి, గ్యాంగ్‌టక్, సిమ్లా, డెహ్రాడూన్, ఇంఫాల్, చండీగఢ్‌లు భూకంపం సంభవించే ప్రాంతాలలో మొదటి, నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నాయి. ది బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ దేశంలో భూకంపం సంభవించే ప్రాంతాలను ఐదు జోన్లుగా వర్గీకరించింది. ఐదో జోన్ అత్యంత తీవ్రత కలిగిన ప్రాంతం. ఈ జోన్‌లో ఈశాన్య ప్రాంతమైన జమ్మూకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, గుజరాత్‌లోని కచ్, ఉత్తర బిహార్‌లోని కొన్ని ప్రాంతాలు, అండమాన్ నికోబార్ దీవులున్నాయి. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : భూకంపాల జోన్‌లో 29 నగరాలు 
ఎప్పుడు : జూలై 30
ఎవరు : నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ
ఎక్కడ : దేశవ్యాప్తంగా 

2022 నాటికి నవభారత నిర్మాణం : ప్రధాని మోదీ 2022 నాటికి(దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా) దేశంలోని కుల, మతతత్వాలతోపాటుగా పేదరికం, అవినీతి, ఉగ్రవాదం, చెత్తలను పారద్రోలేందుకు క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో పనిచేయాలని దేశ ప్రజలకు నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. జూలై 30న మాసాంతపు ‘మన్‌కీ బాత్’లో దేశప్రజలనుద్దేశించి మాట్లాడిన ప్రధాని.. జీఎస్టీని చారిత్రక ఘట్టంగా పేర్కొన్నారు. 
దేశానికి ప్రధాన సమస్యలుగా మారిన మతతత్వం, కుల వ్యవస్థ, అవినీతి, ఉగ్రవాదం, పేదరికాన్ని 2022 నాటికి దేశం నుంచి నిర్మూలించేలా ప్రతి భారతీయుడు కృషిచేయాలని.. ఈ దిశగా ప్రతిజ్ఞ చేయాలని మోదీ పిలుపునిచ్చారు. దీని ద్వారానే దేశ స్వాతంత్య్రానికి 75 ఏళ్లు పూర్తయ్యేలోపు నవభారత నిర్మాణం జరుగుతుందన్నారు. 1942, ఆగస్టు 9న మహాత్ముడు ప్రారంభించిన క్విట్ ఇండియా ఉద్యమం కారణంగానే.. 1947లో బ్రిటిషర్లు దేశాన్ని వదిలిపెట్టి వెళ్లారని గుర్తుచేసిన మోదీ.. 2017లో నవభారత నిర్మాణానికి ప్రతి భారతీయుడు ప్రతినబూనటం ద్వారా 2022 కల్లా ఫలితాలు సాధించగలమన్నారు. 

జాతీయ బీసీ కమిషన్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్కు రాజ్యాంగ హోదా కల్పించేందుకు ఉద్దేశించిన 123వ రాజ్యాంగ సవరణ బిల్లు-2017 జూలై 31న రాజ్యసభ ఆమోదం పొందింది. విపక్షాలు సూచించిన విధంగా బిల్లుకు కొన్ని సవరణలు ప్రతిపాదించి అమోదించారు. ఈ బిల్లును లోక్‌సభ ఏప్రిల్‌లో ఆమోదించి రాజ్యసభకు పంపింది.
క్విక్ రివ్యూ:ఏమిటి : జాతీయ బీసీ కమిషన్ బిల్లుకు ఆమోదం 
ఎప్పుడు : జూలై 31
ఎవరు : రాజ్యసభ
ఎందుకు : బీసీ కమీషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించేందుకు

టపాసులలో 5 లోహాల వినియోగంపై నిషేధం వాతావరణ కాలుష్యానికి కారణం అవుతున్న 5 హానికర లోహాలను టపాసులలో వినియోగించడాన్ని సుప్రీంకోర్టు నిషేధించింది. జస్టిస్ మదన్ బి లోకూర్ నేతృత్వంలోని ధ ర్మాసనం ఈ మేరకు జూలై 31న ఆదేశాలు జారీ చేసింది. టపాసుల తయారీలో లిథియం, మెర్క్యురీ, ఆర్సెనిక్, ఆంటిమోని, లెడ్ లోహాలను వాడరాదని పేర్కొంది. పెట్రోలియం అండ్ ఎక్స్‌ప్లోజివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ (పీఈఎస్‌ఓ) ఈ ఆదేశాలు అమలయ్యేలా చూడాలని అత్యున్నత న్యాయస్థానం సూచించింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : టపాసులలో వినియోగించే 5 లోహాలపై నిషేధం 
ఎప్పుడు : జూలై 31
ఎవరు : సుప్రీంకోర్టు 
ఎందుకు : పర్యావరణ పరిరక్షణ చర్యల్లో భాగంగా

ఈశాన్య రాష్ట్రాలకు 2,350 కోట్ల వరద సహాయం ఈశాన్య రాష్ట్రాలకు వరద సాయంగా రూ.2,350 కోట్ల ప్రత్యేక ప్యాకేజీని ప్రధాని మోదీ ఆగస్టు 1న ప్రకటించారు. అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, నాగాలాండ్, అసోం రాష్ట్రాల్లోని వరదలపై తాజా పరిస్థితిని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులు, మంత్రులతో సమీక్షించిన మోదీ.. అసోం రాష్ట్రానికి తక్షణసాయంగా రూ. 250 కోట్ల నిధులను విడుదల చేశారు.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఈశాన్య రాష్ట్రాలకు రూ.2,350 కోట్లు
ఎప్పుడు : ఆగస్టు 1
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ 
ఎక్కడ : అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, నాగాలండ్, అసోం 
ఎందుకు : వరద సహాయంగా 

ఐసిస్, చైనాలతోనే భారత్‌కు ముప్పుఐసిస్, వాతావరణ మార్పులు, చైనా దుందుడుకుతనం.. ఈ మూడు భారత్‌కు పొంచి ఉన్న ప్రధాన ముప్పులని అత్యధిక శాతం మంది భారతీయులు భావిస్తున్నారు. ప్రముఖ పరిశోధనా సంస్థ ‘ప్యూ’ చేసిన తాజా సర్వేలో ఈ విషయం వెల్లడైంది. భారత్ నుంచి సర్వేలో పాల్గొన్న వారిలో 66 శాతం మంది ఐసిస్ వల్ల భారత్‌కు ముప్పు ఉందనే అభిప్రాయాన్ని వెల్లడించారు. వాతావరణంలో మార్పుల వల్ల ఇబ్బందులు తప్పవని 47 శాతం మంది చెప్పారు. 44 శాతం మంది భారత్‌కు ఉన్న అతిపెద్ద ముప్పు చైనాయేనని పేర్కొన్నారు. మరో 43 శాతం మంది సైబర్ దాడులే అత్యంత ప్రమాదకరంగా మారాయన్నారు. అమెరికాతోపాటు ఐరోపా, ఆసియా ఖండాల్లోని 18 దేశాల్లో సర్వే చేసిన ప్యూ.. ఆ నివేదికలను ఆగస్టు 1న విడుదల చేసింది. చైనా, రష్యా, అమెరికాల్లో ఏది అత్యంత ప్రమాదకర దేశమని అడగ్గా, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల ప్రజలు చైనాయేనని చెప్పారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : 18 దేశాలకు పొంచి ఉన్న ముప్పుపై సర్వే 
ఎప్పుడు : ఆగస్టు 1
ఎవరు : ప్యూ సంస్థ 

రాష్ట్రీయంమిథాలీ రాజ్‌కు టీఎస్ ప్రభుత్వం కోటి నజరానా మహిళల వన్డే క్రికెట్ ప్రపంచకప్‌లో భారత జట్టును ఫైనల్‌కు చేర్చినందుకు, వ్యక్తిగతంగా అత్యధిక పరుగుల రికార్డు సృష్టించినందుకు కెప్టెన్ మిథాలీ రాజ్‌ను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అభినందించారు. మిథాలీకి ప్రభుత్వం తరఫున రూ.కోటి నగదు ప్రోత్సాహం ప్రకటించారు. అలాగే హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో 600 గజాలకు తక్కువ కాకుండా నివాస స్థలాన్ని ఇవ్వనున్నట్లు తెలిపారు. మిథాలీ కోచ్ మూర్తికి రూ.25 లక్షల నగదు ప్రోత్సాహం అందిస్తామని చెప్పారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : మిథాలీరాజ్‌కు రూ.కోటి నగదు ప్రోత్సాహం 
ఎప్పుడు : జూలై 28
ఎవరు : తెలంగాణ ప్రభుత్వం 
ఎందుకు : మహిళల వన్డే ప్రపంచకప్‌లో ఫైనల్స్‌కు చేరినందుకు

మంగళగిరిలో '' పై డేటా సెంటర్'' ప్రారంభంఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరిలో రూ.600 కోట్లతో ఏర్పాటు చేసిన పై డేటా సెంటర్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు జూలై 28న ప్రారంభించారు. పై డేటా సెంటర్స్ సంస్థ దీన్ని ఏర్పాటు చేసింది. 
రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన పలు శాఖల డేటాను కూడా పై డేటా సెంటర్‌లో నిల్వ చేయనున్నారు.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : పై డేటా సెంటర్ ప్రారంభం
ఎప్పుడు : జూలై 28
ఎవరు : సీఎం చంద్రబాబు
ఎక్కడ : మంగళగిరి, ఆంధ్రప్రదేశ్ 

హైరేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో తెలంగాణ బోనంహైదరాబాద్‌లోని సరూర్‌నగర్ ఇండోర్ స్డేడియంలో 2,650 మందితో ‘‘బోనం-తెలంగాణ ప్రాణం’’ పేరుతో నిర్వహించిన కార్యక్రమం హైరేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం పొందింది. నెహ్రూ యువ కేంద్ర సంఘటన్, తనిష్ నీలిమ డ్యాన్‌‌స అకాడమీ, వాసవి మహిళా సమాఖ్య, తెలంగాణ కలల వేదిక, కై రా ఫౌండేషన్, మయూరి రూరల్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ సంయుక్తంగా ఈ వేడుకను నిర్వహించాయి. బోనాల వైభవాన్ని ప్రపంచానికి తెలియజేయడానికి ఈ కార్యక్రమం చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : హైరేంజ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో బోనం - తెలంగాణ ప్రాణం 
ఎప్పుడు : జూలై 30 
ఎక్కడ : సరూర్‌నగర్, హైదరాబాద్ 

ఎల్బ్రూస్ పర్వతాన్ని అధిరోహించిన గురుకుల విద్యార్థులు తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు మరో సాహసాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. రెండేళ్ల క్రితం ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన మాలావత్ పూర్ణ తాజాగా రష్యాలోని ఎల్బ్రూస్ పర్వతాన్ని అధిరోహించారు. పర్వతారోహణలో పూర్ణతో పాటు ఆలేరు గురుకుల పాఠశాలకు చెందిన శ్రీవిద్య కూడా ఉన్నారు.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఎల్ప్రూస్ పర్వతారోహణ 
ఎప్పుడు : జూలై 27
ఎవరు : టీఎస్ గురుకుల విద్యార్థులు పూర్ణ, శ్రీవిద్య 
ఎక్కడ : రష్యా

ఏపీ, తెలంగాణలో ఎలక్ట్రానిక్ క్లస్టర్లకు కేంద్రం ఓకేతెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్ట్రానిక్స్ తయారీ క్లస్టర్ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ అదనపు సెక్రటరీ అజయ్‌కుమార్ ఈ మేరకు జూలై 31న ట్వీట్ చేశారు. 
ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరులో ఏపీఐఐసీ 500 ఎకరాల్లో ఏర్పాటు చేయతలపెట్టిన క్లస్టర్‌కు అనుమతి లభించింది. ఈ ప్రాజెక్టు వ్యయం రూ.340 కోట్లు. 
తెలంగాణ ప్రభుత్వం రెండు క్లస్టర్ల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకోగా.. వీటిలో హైదరాబాద్ సమీపంలో రావిర్యాల వద్ద టీఎస్‌ఐఐసీ 600 ఎకరాల్లో నెల కొల్పనున్న ప్రాజెక్టుకు క్లియరెన్సు వచ్చింది. ప్రాజెక్టు వ్యయం రూ.667 కోట్లు. ఇందులో కేంద్రం రూ.240 కోట్లను గ్రాంటు రూపంలో సమకూర్చనుంది. శంషాబాద్ సమీపంలోని మహేశ్వరం వద్ద మహేశ్వరం సైన్‌‌స పార్క్ ఏర్పాటుకు సైతం ప్రతిపాదనలు పంపింది. దీనికి అనుమతి రావాల్సి ఉంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఎలక్ట్రానిక్ క్లస్టర్ల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ 
ఎప్పుడు : జూలై 31
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎక్కడ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో 
ఎందుకు : దేశీయంగా ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను పెంచేందుకు 

ఆర్థికంగ్యాస్‌పై నెలకు రూ.4 పెంపు : కేంద్రం సబ్సిడీపై అందించే వంట గ్యాస్ (ఎల్‌పీజీ) సిలిండర్ల ధరలను ఇక నుంచి ప్రతి నెలా పెంచనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు నెలకు రూ.4 చొప్పున పెంచాలని ఆయిల్ కంపెనీలను ఆదేశించినట్లు వెల్లడించింది. 2018 మార్చి కల్లా ఎల్‌పీజీపై అన్ని సబ్సిడీలను తొలగించే ప్రక్రియలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ జూలై 31న లోక్‌సభలో లిఖితపూర్వకంగా వెల్లడించారు. సబ్సిడీ పూర్తిగా తొలగిపోయే వరకు లేదా మార్చి 2018 వరకు లేదా ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు గ్యాస్ సిలిండర్లపై ప్రతినెలా రూ.4 పెంపు కొనసాగుతుందని స్పష్టం చేశారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : రాయితీ గ్యాస్‌పై ప్రతి నెల రూ. 4 పెంపు 
ఎప్పుడు : జూలై 31
ఎవరు : కేంద్ర ప్రభుత్వం 
ఎక్కడ : దేశవ్యాప్తంగా 
ఎందుకు : ఎల్పీజీపై అన్ని రాయితీలను తొలగించే చర్యల్లో భాగంగా 

బ్యాంకు ఖాతా నంబరు పోర్టబిలిటీకి ఆర్‌బీఐ సూచన మొబైల్ నంబరు పోర్టబిలిటీ తరహాలోనే బ్యాంకు అకౌంటు నంబరు పోర్టబిలిటీ అమలు చేసే దిశగా బ్యాంకులు కసరత్తు చేయాలని రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ ఎస్‌ఎస్ ముంద్రా సూచించారు. మరింత పోటీతత్వంతో పనిచేసేందుకు, ఖాతాదారులకు మెరుగైన సర్వీసులు అందించేందుకు ఇది తోడ్పడుతుందని పేర్కొన్నారు. బ్యాంకింగ్ అంబుడ్‌‌సమన్ వార్షిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా ముంద్రా చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ ఆర్‌బీఐ జూలై 31న ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : బ్యాంకు ఖాతా నంబర్ పోర్టబిలిటీపై బ్యాంకులకు సూచన 
ఎప్పుడు : జూలై 31 
ఎవరు : ఆర్‌బీఐ 
ఎందుకు : ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించేందుకు 

వ్యవసాయోత్పత్తుల అమ్మకాలకు ‘ఈ-రకం’వ్యవసాయ ఉత్పత్తులను రైతులు ఆన్‌లైన్‌లో అమ్మేందుకు ఉపకరించే ఈ-రకం అనే పోర్టల్‌ను కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 1న ప్రారంభించింది. ప్రభుత్వ వేలందారు ఎంఎస్‌టీసీ, కేంద్ర గిడ్డంగుల సంస్థకు చెందిన సీఆర్‌డబ్ల్యూసీలు సంయుక్తంగా ఈ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చాయి. ఉక్కు శాఖ మంత్రి చౌదరీ బీరేంద్ర సింగ్‌తో కలసి వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి రాం విలాస్ పాశ్వాన్ ఈ పోర్టల్‌ను ఆవిష్కరించారు.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : వ్యవసాయోత్పత్తుల అమ్మకాలకు ‘ఈ-రకం’ పోర్టల్ 
ఎప్పుడు : ఆగస్టు 1
ఎవరు : కేంద్ర ప్రభుత్వం 
ఎందుకు: వ్యవసాయ ఉత్పత్తులను రైతులు ఆన్‌లైన్‌లో అమ్మేందుకు

సైన్స్ అండ్ టెక్నాలజీతొలి రిమోట్ యుద్ధట్యాంక్ ‘మంత్ర’ స్వదేశీ పరిజ్ఞానంతో రిమోట్ సాయంతో నడిచే తొలి మానవరహిత ‘యుద్ధ’ ట్యాంకులను రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ ( డీఆర్‌డీవో) అభివృద్ధి చేసింది. రిమోట్ ఆదేశాలతో పనిచేసే మూడు ‘మంత్ర’ సిరీస్ ట్యాంకులు.. నిఘా, మందుపాతరల గుర్తింపు, అణుధార్మికత, జీవ ఆయుధాల ప్రమాదమున్న ప్రాంతాల జాడ తెలుసుకునేందుకు ఉపయోగపడతాయి. 
నిఘా కోసం మంత్ర-ఎస్, బాంబుల గుర్తింపు కోసం మంత్ర-ఎం అలాగే అణు ధార్మికత, జీవాయుధాల ప్రమాదమున్నప్రాంతాలను గుర్తించేందుకు మంత్ర- ఎన్ రకాన్ని అవడిలోని ఆర్మీకి చెందిన కంబాట్ వెహికల్స్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (సీవీఆర్‌డీఈ)లో తయారు చేశారు. సీవీఆర్‌డీఈలో మాజీ రాష్ట్రపతి కలాంకు నివాళిగా ఏర్పాటుచేసిన ప్రదర్శనలో కొత్తగా తయారుచేసిన రెండు మంత్ర సిరీస్ ట్యాంకులను ప్రదర్శించారు. 52 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండే ఎడారి ప్రాంతమైన రాజస్తాన్‌లోని మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్‌లో వీటిని పరీక్షించారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : దేశంలో తొలి రిమోట్ యుద్ధ ట్యాంకులు మంత్ర
ఎప్పుడు : జూలై 30
ఎవరు : డీఆర్‌డీవో 
ఎక్కడ : భారత్‌లో 

ఖండాంతర క్షిపణిని పరీక్షించిన ఉత్తరకొరియా అమెరికా సహా ప్రపంచ దేశాల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఉత్తర కొరియా జూలై 29న మరోసారి ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి (ఐసీబీఎం)ని ప్రయోగించింది. జూలైలో ఐసీబీఎం ప్రయోగాన్ని రెండోమారు జరిపిన ఉత్తర కొరియా.. తాజా క్షిపణితో అమెరికాలోని ఏ ప్రాంతంలోనైనా దాడులు చేయగలమని స్పష్టం చేసింది. అమెరికాకు గట్టి హెచ్చరికలు పంపేందుకే ఈ పరీక్ష జరిపినట్లు దేశాధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ చెప్పారు. జూలై 4న ప్రయోగించిన క్షిపణి కంటే తాజా క్షిపణి అత్యంత శక్తిమంతమైనదని, దాని పరిధి 10 వేల కిలోమీటర్ల వరకు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. న్యూయార్క్, వాషింగ్టన్ వంటి నగరాలు ఆ క్షిపణి పరిధిలోకి వస్తాయని హెచ్చరిస్తున్నారు.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఖండాంతర క్షిపణి పరీక్ష
ఎప్పుడు : జూలై 29
ఎవరు : ఉత్తర కొరియా 

స్కాట్‌లాండ్‌లో నీటిపై పవన విద్యుదుత్పత్తి ప్రపంచంలోనే తొలిసారిగా పవన విద్యుత్ ఉత్పత్తి కోసం సముద్రంలో తేలియాడే గాలిమరలను స్కాట్‌లాండ్ జలభాగంలో లండన్ శాస్త్రవేత్తలు ఏర్పాటు చేశారు. లండన్‌లోని బిగ్ బెన్ గడియారం కంటే ఎక్కువ ఎత్తులో ఏర్పాటు చేసిన ఈ గాలి మరలతో ఏకంగా 20,000 గృహాలకు విద్యుత్‌ను సరఫరా చేయవచ్చు. నీళ్లపై ఈ భారీ స్తంభాలు నిలబడేందుకు స్టాటాయిల్ అనే సంస్థ ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసింది. దీనికి హైవిండ్ ప్రాజెక్టుగా నామకరణం చేశారు.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : నీటిపై పవన విద్యుత్ ఉత్పత్తి 
ఎప్పుడు : జూలై 28
ఎవరు : లండన్ శాస్త్రవేత్తలు
ఎక్కడ : స్కాట్లాండ్ సముద్ర జలాల్లో 

ఆగస్టు 12న భారీ ఉల్కాపాతంమానవ చరిత్రలోనే అత్యంత భారీ ఉల్కా పాతం ఆగస్టు 12 రాత్రి కనువిందు చేయనుందని ఖగోళ శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. ఆ రోజు రాత్రి కూడా పగలు వలె కనిపిస్తుందని పేర్కొన్నారు. దాదాపుగా గంటకు 100 వరకు ఉల్కలు నేలరాలతాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. జీవితంలో ఒక్కసారి మాత్రమే ఇలాంటి దృశ్యాలను చూడగలమని అంటున్నారు. 109పీ / స్విఫ్ట్-టట్టెల్ అనే తోకచుక్క నుంచి ఈ ఉల్కలు రాలుతాయని చెప్పారు. ప్రతి ఏడాది జూలై మధ్య నుంచి ఆగస్టు చివరి వరకు ఉల్కలు రాలుతాయనీ, ఆగస్టు మధ్యలో ఓ రెండ్రోజులు ఎక్కువ సంఖ్యలో ఉల్కలు భూ వాతావరణంలోకి ప్రవేశిస్తాయని వివరించారు. భూ వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు ఉల్కల వేగం గంటకు లక్షా ముప్పైవేల మైళ్లు ఉంటుంది. వెంటనే అవి వాతావరణంలోనే మండిపోతాయి కాబట్టి మానవులకు ఏ ప్రమాదమూ ఉండదు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : మానవ చరిత్రలోనే భారీ ఉల్కాపాతం 
ఎప్పుడు : ఆగస్టు 12
ఎందుకు : 109పీ/స్విఫ్ట్-టట్టెల్ అనే తోకచుక్క నుంచి రాలనున్న ఉల్కలు 

క్రీడలుజోర్డాన్ ఓపెన్ చాంప్ స్నేహిత్ అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్) జూనియర్ సర్క్యూట్ జోర్డాన్ ఓపెన్ టీటీ టోర్నమెంట్‌లో హైదరాబాద్ ప్లేయర్ సురవజ్జుల ఫిడేల్ రఫీక్ స్నేహిత్ విజేతగా నిలిచాడు. జోర్డాన్ రాజధాని అమ్మాన్‌లో జూలై 27న జరిగిన బాలుర సింగిల్స్ ఫైనల్లో స్నేహిత్ 4-1 (12-10, 7-11, 11-9, 11-4, 11-6)తో జీత్ చంద్ర (భారత్)పై గెలుపొందాడు. డబుల్స్‌లో భారత్‌కే చెందిన అనుక్రమ్ జైన్‌తో కలిసి రజతాన్ని గెలిచిన స్నేహిత్ ఒకరోజు వ్యవధిలోనే సింగిల్స్‌లో స్వర్ణాన్ని కై వసం చేసుకున్నాడు. కాగా స్నేహిత్ కెరీర్‌లో ఇదే తొలి అంతర్జాతీయ సింగిల్స్ టైటిల్.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : జోర్డాన్ ఓపెన్ జూనియర్ చాంపియన్‌షిప్ 
ఎప్పుడు : జూలై 27
ఎవరు : విజేత సురవజ్జుల ఫిడేల్ రఫీక్ 
ఎక్కడ : అమ్మాన్, జోర్డాన్ 

ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌కు ద్యుతీచంద్అర్హత ప్రమాణ సమయం (11.26 సెకన్లు) అందుకోలేకపోయినా... ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు రావాలని భారత మహిళా స్ప్రింటర్ ద్యుతీచంద్‌కు ఆహ్వానం లభించింది. మహిళల 100 మీటర్ల విభాగంలో నిర్ణీత ఎంట్రీల సంఖ్య 56కు చేరుకోకపోవడంతో అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య ఈ సీజన్‌లో మెరుగైన ప్రదర్శన చేసిన వారిని ఆహ్వానించాలని నిర్ణయించింది. దాంతో ద్యుతీచంద్‌కు ఈ అవకాశం దక్కింది. ఈ సీజన్‌లో ద్యుతీచంద్ అత్యుత్తమ సమయం 11.30 సెకన్లు. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ ఆగస్టు 4 నుంచి 13 వరకు లండన్‌లో జరుగుతుంది. ఒడిషాకు చెందిన ద్యుతీచంద్‌కు కోచ్‌గా తెలంగాణకు చెందిన నాగపురి రమేశ్ వ్యవహరిస్తున్నారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ప్రపంచ అథ్లెటిక్ చాంపియన్‌షిప్‌కు అర్హత
ఎప్పుడు : ఆగస్టు 4 - 13, 2017
ఎవరు : ద్యుతీచంద్ 
ఎక్కడ : లండన్ 

పారిస్‌లో 2024 ఒలింపిక్స్2024, 2028లలో జరిగే ఒలింపిక్స్ క్రీడల వేదికలను అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) జూలై 31న ప్రకటించింది. 2024లో ఈ క్రీడలకు పారిస్ (ఫ్రాన్‌‌స), 2028లో లాస్ ఏంజిల్స్ (అమెరికా) నగరాలు ఆతిథ్యమిస్తాయి. గతంలో పారిస్‌లో రెండుసార్లు (1900, 1924)లో ఒలింపిక్స్ జరిగాయి. సరిగ్గా వందేళ్ల తర్వాత ఈ ‘సిటీ ఆఫ్ లవ్’ మళ్లీ ఒలింపిక్స్ కోసం సిద్ధం కానుంది. లాస్ ఏంజిల్స్ (1932, 1984) కూడా ఇప్పటికే రెండుసార్లు ఒలింపిక్స్‌ను నిర్వహించింది. 2020లో జపాన్ రాజధాని టోక్యోలో ఒలింపిక్స్ పోటీలు జరగనున్నాయి. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : 2024, 2028 ఒలింపిక్స్ వేదికలు ఖరారు
ఎప్పుడు : జూలై 31
ఎవరు : అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ 
ఎక్కడ : పారిస్, లాస్ ఎంజిల్స్

ఒకే రోజు 3 స్వర్ణాలు సాధించిన అమెరికా స్విమ్మర్ అమెరికా స్విమ్మర్ సెలెబ్ డ్రెస్సెల్ ఒకే రోజు 3 స్వర్ణాలు సాధించి అరుదైన రికార్డు నెలకొల్పాడు. హంగేరీలోని బుడాపెస్ట్‌లో జరిగిన ఫినా వరల్డ్ అక్వాటిక్స్ చాంపియన్‌షిప్ - 2017లో భాగంగా జూలై 31న జరిగిన 50 మీటర్ల ఫ్రీ స్టయిల్, 100 మీటర్ల బటర్‌ఫ్లై, 4 × 100 మీటర్ మిక్స్‌డ్ ఫ్రీ స్టయిల్ ఈవెంట్లలో తొలి స్థానంలో నిలిచాడు. తద్వారా 3 స్వర్ణాలు గెలిచి అంతర్జాతీయ పోటీల్లో ఈ తరహా రికార్డును నెలకొల్పిన తొలి ఆటగాడిగా డ్రెస్సెల్ గుర్తింపు పొందాడు.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : అంతర్జాతీయ స్విమ్మింగ్ పోటీల్లో ఒకే రోజు 3 స్వర్ణాలు సాధించిన అథ్లెట్ 
ఎప్పుడు : జూలై 31
ఎవరు : సెలెబ్ డ్రెస్సెల్ 
ఎక్కడ : హంగేరి 

వెటెల్‌కు హంగేరీ గ్రాండ్ ప్రి టైటిల్ఫార్ములావన్ రేసులో హంగేరీ గ్రాండ్ ప్రి టైటిల్‌ను ఫెరారీ జట్టు డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ గెలుచుకున్నాడు. బుడాపెస్ట్‌లో జూలై 30న జరిగిన రేసులో వెటెల్ మొదటి స్థానంలో నిలవగా, రైకోనెన్‌కు రెండో స్థానం లభించింది.

అవార్డులుబుకర్ ప్రైజ్ జాబితాలో అరుంధతీ రాయ్ ప్రముఖ రచయిత్రి అరుంధతీ రాయ్ రాసిన ‘ద మినిస్ట్రీ ఆఫ్ అట్‌మోస్ట్ హ్యాపీనెస్’ పుస్తకం మ్యాన్ బుకర్ ప్రైజ్ జాబితాలో చోటు సంపాదించింది. 2016 అక్టోబర్ 1 నుంచి ప్రచురితమైన వాటిలో 13 పుస్తకాలు ఈ జాబితాకు ఎంపికయ్యాయి. ఐదుగురు జడ్జీలతో కూడిన ప్యానెల్ 144 పుస్తకాల నుంచి వీటిని ఎంపిక చేసింది. వీటిలో తుది జాబితాకు ఎంపికైన ఆరు పుస్తకాల వివరాలను సెప్టెంబర్ 13న వెల్లడిస్తుంది. బుకర్ ప్రైజ్ విజేతను అక్టోబర్ 17న ప్రకటిస్తుంది. విజేతకు రూ.41.5 లక్షల(50 వేల పౌండ్ల) మొత్తాన్ని బహుమతిగా అందిస్తుంది.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : 13 మందితో బుకర్ ప్రైజ్ జాబితా 
ఎప్పుడు : జూలై 27
ఎవరు : రెండో సారి స్థానం పొందిన అరుంధతి రాయ్ 
ఎందుకు : ‘ద మినిస్ట్రీ ఆఫ్ అట్‌మోస్ట్ హ్యాపీనెస్’ పుస్తకానికి గాను 

రామన్ మెగసెసె అవార్డు - 2017సమాజ సేవ, పర్యావరణ-సాంస్కృతిక పరిరక్షణ తదితర రంగాల్లో విశేష కృషి చేస్తున్న ఐదుగురు 2017 సంవత్సరానికి గాను రామన్ మెగసెసే అవార్డుకు ఎంపికయ్యారు. అలాగే కళలతో సమాజంలో మార్పు కోసం కృషి చేస్తున్న ఫిలిప్పీన్స్ ఎడ్యుకేషనల్ థియేటర్ ట్రస్ట్ కూడా ఈ అవార్డుకు ఎంపికైంది. ఆగస్టు 31న మనీలాలో జరిగే కార్యక్రమంలో వీరికి అవార్డును అందజేస్తారు. రామన్ మెగసెసే అవార్డు ఆసియాన్ నోబెల్‌గా ప్రసిద్ధి చెందింది. 
ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు రామన్ మెగసెసే గౌరవార్థం ఈ అవార్డుని 1957లో ప్రారంభించారు. 
2017 అవార్డు గ్రహీతలు 
  1. యోషియాకి ఇషిజవా - జపాన్
  2. గెత్సీ షన్ముగమ్ - శ్రీలంక
  3. అబ్డాన్ నబాన్ - ఇండోనేషియా
  4. టోని టాయ్ - సింగపూర్
  5. లిలియా డీ లిమా - ఫిలిప్పీన్స్
  6. ఫిలిప్పీన్స్ ఎడ్యుకేషనల్ థియేటర్ ట్రస్ట్ - ఫిలిప్పీన్స్
క్విక్ రివ్యూ: 
ఏమిటి : రామన్ మెగసెసె అవార్డు 2017 ప్రకటన 
ఎప్పుడు : జూలై 31
ఎవరు : వివిధ దేశాలకు చెందిన ఆరుగురు అవార్డుకు ఎంపిక
ఎందుకు : వివిధ రంగాల్లో చేసిన విశేష కృషికి

వార్తల్లో వ్యక్తులురామేశ్వరంలో కలాం స్మారకం ప్రారంభం తమిళనాడులోని రామేశ్వరం సమీపంలోని పేయికరుంబూరులో నిర్మించిన భారతరత్న, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం స్మారక మండపాన్ని ప్రధాని నరేంద్ర మోదీ జూలై 27న జాతికి అంకితం చేశారు. కలాం వీణ వాయించే విగ్రహాన్ని ఆవిష్కరించిన మోదీ.. కలాం సమాధి వద్ద పుష్పగుచ్ఛాన్ని ఉంచి నివాళులర్పించారు. 
రూ.15 కోట్లతో నిర్మించిన ఈ స్మారకానికి కలాం తన జీవితకాలంలో ఎక్కువ శాతం గడిపిన డీఆర్‌డీవోనే రూపకల్పన చేసింది. కలాం శాస్త్రవేత్తగా ఉన్న సమయంలో రూపొందించిన మిస్సైళ్లు, రాకెట్ల నమూనాలను ఇందులో ఏర్పాటు చేశారు.కలాంకు చెందిన 900 పెయింటింగ్‌లు, 200 అరుదైన ఛాయాచిత్రాలను ఉంచారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : అబ్దుల్ కలాం స్మారక కేంద్రం ప్రారంభం 
ఎప్పుడు : జూలై 27
ఎవరు : ప్రధాని నరేంద్రమోదీ
ఎక్కడ : పేయికరుంబూరు, రామేశ్వరం, తమిళనాడు

వీలర్ ఐలాండ్‌కు అబ్దుల్ కలాం పేరుఒడిశా తీరంలోని వీలర్ దీవికి (ఐలాండ్) ఆ రాష్ట్ర ప్రభుత్వం మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పేరు పెట్టింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర సీఎం నవీన్ పట్నాయక్ జూలై 27న అధికారికంగా ప్రకటించారు. అబ్దుల్ కలాం క్షిపణి శాస్త్రవేత్తగా ఉన్న సమయంలో ఒడిశాలోని భద్రక్ జిల్లా ఛాంద్‌బలిలోని క్షిపణి ప్రయోగశాలను పలుమార్లు సందర్శించారు. ఆ సమయంలో బంగాళాఖాతంలోని వీలర్ దీవిని గుర్తించి..క్షిపణి ప్రయోగాలకు అనుకూలంగా ఉంటుందని సూచించారు. అనంతరం ఇక్కడ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ మిస్సైల్ కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేసి క్షిపణి ప్రయోగాలు నిర్వహిస్తున్నారు.

డిప్యూటీ కలెక్టరుగా పీవీ సింధుప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుని డిప్యూటీ కలెక్టరుగా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ (ఏపీ) ప్రభుత్వం జూలై 27న ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన నియామక పత్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు సింధుకు అందజేశారు. 
రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన సింధును డిప్యూటీ కలెక్టరుగా నియమించాలని రాష్ట్ర మంత్రివర్గం తీర్మానం చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రత్యేకంగా నిబంధనలు సడలించింది. దీంతో సింధును డిప్యూటీ కలెక్టరుగా నియమిస్తూ రెవెన్యూ శాఖ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ట్రైనింగ్ పోస్టింగ్ కోసం 30 రోజుల్లోగా రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనర్‌కు ఆమె రిపోర్టు చేయాల్సి ఉంటుందని పేర్కొంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : డిప్యూటీ కలెక్టర్‌గా పీవీ సింధు 
ఎప్పుడు : జూలై 27 
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్ 
ఎందుకు : రియో ఒలింపిక్స్‌లో పతకం సాధించినందుకు 

విశ్వాస పరీక్ష నెగ్గిన నితీశ్ ఆరోసారి బిహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన నితీశ్ కుమార్ జూలై 28న ఆ రాష్ట్ర అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో విజయం సాధించారు. కీలకమైన పరీక్షలో 131-108 ఓట్ల తేడాతో గెలుపొందారు. సభలో 131 మంది (జేడీయూ 70, బీజేపీ 52, హెచ్‌ఏఎమ్ 1, ఆర్‌ఎల్‌ఎస్‌పీ 2, ఎల్‌జేపీ 2, స్వతంత్రులు 4, స్పీకర్ ఓటు వేయలేరు) నితీశ్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. విపక్షాల సభ్యులు (ఆర్జేడీ 79, కాంగ్రెస్ 26, సీపీఐ-ఎమ్‌ఎల్ 3) 108 మంది వ్యతిరేకంగా ఓటేశారు. దీంతో బిహార్‌లో మూడేళ్లపాటు ఎన్డీయే ప్రభుత్వం కొనసాగేందుకు మార్గం సుగమమైంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : విశ్వాస పరీక్ష నెగ్గిన సీఎం నితీశ్ కుమార్ 
ఎప్పుడు : జూలై 28
ఎక్కడ : బిహార్ 
ఎందుకు : ముఖ్యమంత్రిగా తిరిగి ప్రమాణం చేసినందుకు

సుప్రీంకోర్టు తదుపరి సీజేగా జస్టిస్ దీపక్ మిశ్రాసుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా తదుపరి(45వ) భారత ప్రధాన న్యాయమూర్తి(సీజే) కానున్నారు. ఈ మేరకు తన వారసుడిగా సీజే పదవికి జస్టిస్ దీపక్ మిశ్రా పేరుని ప్రస్తుత సీజే జగదీశ్ సింగ్ ఖేహర్ సిఫార్సు చేశారు. జస్టిస్ ఖేహర్ ఆగస్టు 27న పదవీ విరమణ చేయనున్నారు. 
సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తి సీజేగా బాధ్యతలు చేపడతారు. ప్రస్తుతం సీజేగా ఉన్న ఖేహర్ తర్వాత సీనియర్ దీపక్ మిశ్రానే కావడంతో ఆయన పేరుని సిఫార్సు చేశారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : 45వ భారత ప్రధాన న్యాయమూర్తి
ఎప్పుడు : ఆగస్టు 2017
ఎవరు : జస్టిస్ దీపక్ మిశ్రా 
ఎందుకు : ఆగస్టు 27న పదవీ విరమణ చేయనున్న జస్టిస్ జేఎస్ ఖేహర్

డ్రగ్స్ కేసులో ‘ఫిలిప్పీన్‌‌స’ మేయర్ హతంమాదక ద్రవ్యాల కేసులతో సంబంధం ఉన్న మీండానోవ్ ద్వీపంలోని ఒజమిజ్ నగర మేయర్ రెనాల్డో పరోజి నోగ్‌ను ఫిలిప్పీన్‌‌స పోలీసులు జూలై 30న కాల్చిచంపారు. రెనాల్డో, ఆయన భార్య, సోదరుడు సహా మొత్తం 13 మంది పోలీసుల కాల్పుల్లో మరణించారు. మాదకద్రవ్యాల వ్యాపారులపై ఫిలిప్పీన్స్ పోలీసులు జరిపిన భారీ దాడుల్లో ఇది ఒకటి. మేయర్‌కు డ్రగ్స్ తో సంబంధం ఉందని ఫిలిప్పీన్‌‌స అధ్యక్షుడు రొడ్రిగో దుతర్తే 2016లో బహిరంగంగానే ప్రకటించారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఒజమిజ్ నగర మేయర్ రెనాల్డో పరోజి హతం
ఎప్పుడు : జూలై 30
ఎవరు : ఫిలిప్పీన్స్ పోలీసులు 
ఎందుకు : మాదక ద్రవ్యాల కేసులో

పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌పై వేటుతప్పుడు వివరాలతో రాజ్యాంగాన్ని మోసగించిన పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ (పీఎంల్-ఎన్ పార్టీ).. ఆర్టికల్ 62, 63 ప్రకారం ఎంపీగా అనర్హుడని ఆ దేశ సుప్రీంకోర్టు నిర్ధారించింది. ఈ మేరకు షరీఫ్‌ను అనర్హుడిగా పేర్కొంటూ ఐదుగురు న్యాయమూర్తుల సుప్రీం ధర్మాసనం జూలై 28న ఏకగ్రీవ తీర్పును వెలువరించింది. ప్రమాణం కింద తప్పుడు వివరాల్ని సమర్పించారని, అందువల్ల రాజ్యాంగం ప్రకారం షరీఫ్ నిజాయితీపరుడు కాడని కోర్టు పేర్కొంది. దీంతో ఆయన ప్రధాని పదవికి అనర్హుడయ్యారు. ప్రధానిగా కొనసాగాలంటే పాక్ జాతీయ అసెంబ్లీలో సభ్యుడిగా ఉండడం తప్పనిసరి. 
పనామా పేపర్స్ కుంభకోణం..1990లో షరీఫ్ ప్రధానిగా ఉండగా మనీల్యాండరింగ్‌కు పాల్పడ్డారు. భారీ ఎత్తున డబ్బును విదేశాలకు తరలించి లండన్‌లో ఆస్తులు కొనుగోలు చేశారు. 2016లో పనామా పేపర్స్ లీకేజీ సందర్భంగా ఈ వివరాలు వెలుగుచూశాయి. ఆరోపణలపై విచారణకు 2017 మేలో ఆరుగురు సభ్యులతో జాయింట్ ఇన్వెస్టిగేషన్ టీం(జిట్)ను సుప్రీంకోర్టు నియమించింది. జులై 10న సుప్రీంకోర్టుకు జిట్ నివేదిక సమర్పించింది. దీని ఆధారంగా సుప్రీం తీర్పునిచ్చింది. షరీఫ్, అతని కుమారులు హుస్సేన్, హసన్, కుమార్తె మర్యంపై అవినీతి కేసులు నమోదు చేయాలని నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరోను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆరు వారాల్లోగా కేసులు నమోదు చేసి.. ఆరు నెలల్లోపు విచారణ పూర్తి చేయాలని సూచించింది. షరీఫ్‌కు అత్యంత విధేయుడు, పాక్ ఆర్థిక శాఖ మంత్రి ఇషాక్ దార్, షరీఫ్ అల్లుడు, పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ సభ్యుడు కెప్టెన్ ముమహ్మర్ సఫ్దర్‌లను కూడా సుప్రీంకోర్టు అనర్హులుగా ప్రకటించింది. 
తదుపరి ప్రధానిగా షరీఫ్ సోదరుడుప్రధానిగా షరీఫ్ అనర్హుడవడంతో ఆయన సోదరుడు, పంజాబ్ సీఎం షెహ్‌బాజ్ షరీఫ్ తర్వాతి ప్రధాని కావచ్చు. ఆయన పాక్ జాతీయ అసెంబ్లీ సభ్యుడు కానందున ఇప్పటికిప్పుడే ప్రధాని అవలేరు. ఈ నేపథ్యంలో తాత్కాలిక ప్రధానిగా షరీఫ్ విధేయుల్లో ఒకరిని ఎంపిక చేస్తారని సమాచారం. షెహ్‌బాజ్ ఎంపీగా గెలిచాక ఆయన ప్రధాని బాధ్యతలు చేపడతారని పీఎంల్-ఎన్ పేర్కొంది.
మూడుసార్లు అర్ధంతరంగానే.. పంజాబ్ సింహంగా పేరుపడ్డ షరీఫ్ ప్రధానిగా మూడోసారి కూడా పదవీకాలం పూర్తి చేసుకోలేదు. 1990లో మొదటిసారి ప్రధాని అయ్యాక 1993లో అర్ధంతరంగా వైదొలి గారు. రెండోసారి 1997లో మళ్లీ ప్రధాని కాగా.. 1999లో అప్పటి ఆర్మీ చీఫ్ ముషర్రఫ్ సైనిక కుట్రతో పదవీచ్యుతుడ య్యారు. పాకిస్తాన్ చరిత్రలో పదవిలో కొనసాగుతున్న ప్రధానిని అనర్హుడిగా ప్రకటించడం ఇది రెండో సారి.. 2012లో అప్పటి ప్రధాని యూసఫ్ రజా గిలానీని కోర్టు ధిక్కార నేరంపై సుప్రీంకోర్టు అనర్హుడిగా ప్రకటించింది.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌పై వేటు
ఎప్పుడు : జూలై 28
ఎవరు : పాకిస్తాన్ సుప్రీంకోర్టు 
ఎక్కడ : పాకిస్తాన్ 
ఎందుకు : పనామా పేపర్స్‌లో వచ్చిన మనీ లాండరింగ్ ఆరోపణల కారణంగా 

పాక్ తాత్కాలిక ప్రధానిగా అబ్బాసీపాకిస్తాన్ తాత్కాలిక ప్రధాన మంత్రిగా పీఎంఎల్-ఎన్ (పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్) సీనియర్ నేత, మాజీ పెట్రోలియం శాఖ మంత్రి షాహిద్ ఖక్కన్ అబ్బాసీ బాధ్యతలు స్వీకరించనున్నారు. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ తమ్ముడు షహబాజ్ షరీఫ్ జాతీయ అసెంబ్లీ సభ్యుడిగా ఎన్నికయ్యే వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. ఈ మేరకు నవాజ్ షరీఫ్ నేతృత్వంలో జూలై 29న సమావేశమైన పీఎంఎల్-ఎన్ పార్టీ నిర్ణయం తీసుకుంది. 
పనామా పత్రాల కుంభకోణానికి సంబంధించి నవాజ్ షరీఫ్ ఎన్నికల సంఘానికి తప్పుడు వివరాలు సమర్పించారంటూ పాక్ సుప్రీంకోర్టు జూలై 28న ఆయనను పార్లమెంటు సభ్యుడిగా కొనసాగేందుకు అనర్హుడిగా ప్రకటించగా, ఆయన ప్రధాని పదవిని కోల్పోయారు. 
పాక్ రాజ్యాంగం ప్రకారం ఎవరైనా ప్రధాని పదవి చేపట్టాలంటే ముందుగా వారు జాతీయ అసెంబ్లీలో సభ్యులై ఉండాలి. అయితే ప్రస్తుతం పాక్‌లోని పంజాబ్‌కు ముఖ్యమంత్రిగా ఉన్న షహబాజ్ పార్లమెంటు సభ్యుడు కాదు. ఈ నేపథ్యంలో షహబాజ్ జాతీయ అసెంబ్లీకి ఎన్నికయ్యే వరకు తాత్కాలిక ప్రధానిగా షాహిద్ అబ్బాసీని నియమించాలని పార్టీ నేతలు నిర్ణయం తీసుకున్నారు. షహబాజ్ ఎన్నిక కాగానే అబ్బాసీ రాజీనామా చేస్తారు. దాదాపు 45 రోజులపాటు అబ్బాసీ పదవిలో ఉండే అవకాశం ఉంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : పాకిస్తాన్ తాత్కాలిక ప్రధానమంత్రి 
ఎప్పుడు : జూలై 30 
ఎవరు : షాహిద్ ఖక్కన్ అబ్బాసీ
ఎక్కడ : పాకిస్తాన్ 
ఎందుకు : నవాజ్ షరీఫ్‌పై సుప్రీంకోర్టు అనర్హత వేటుతో 

పాక్ ప్రధానిగా అబ్బాసీ ప్రమాణంపాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్) నేత షాయీద్ కఖాన్ అబ్బాసీని దేశ ప్రధానిగా పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ ఆగస్టు 1న ఎన్నుకుంది. నవాజ్ షరీఫ్‌ను సుప్రీంకోర్టు అనర్హుడిగా ప్రకటించిన నేపథ్యంలో ఈ ఎన్నిక అనివార్యమైంది. సభలో మొత్తం 321 ఓట్లకు గాను అబ్బాసీకి 221 ఓట్లు వచ్చాయి. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ)కి చెందిన నవీద్‌కు 47 ఓట్లు, తెహ్రికీ ఇన్సాఫ్ నేత రషీద్ అహ్మద్‌కు 33 ఓట్లు, జామాత్ ఈ ఇస్లామీ నేత తరీఖుల్లాకు నాలుగు ఓట్లు పోలయ్యాయి. అనంతరం అధ్యక్షుడి భవనంలో జరిగిన కార్యక్రమంలో అబ్బాసీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : పాక్ తాత్కాలిక ప్రధాని ప్రమాణ స్వీకారం 
ఎప్పుడు : ఆగస్టు 1
ఎవరు : షాయీద్ కఖాన్ అబ్బాసీ
ఎక్కడ : పాకిస్తాన్ 
ఎందుకు : నవాజ్ షరీఫ్‌ను సుప్రీంకోర్టు అనర్హుడిగా ప్రకటించిన నేపథ్యంలో

నీతి ఆయోగ్ పదవి నుంచి వైదొలగనున్న పనగడియా నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ పదవి నుంచి వైదొలగనున్నట్లు అరవింద్ పనగడియా ప్రకటించారు. ఆగస్ట్ 31న బాధ్యతల నుంచి తప్పుకొని తిరిగి కొలంబియా యూనివర్సిటీకి వెళ్లనున్నట్లు తెలిపారు. ఇండో-అమెరికన్ అయిన అరవింద్ పనగడియా 2015 జనవరిలో నీతి ఆయోగ్ తొలి వైస్ చైర్మన్‌గా నియమితులయ్యారు. 
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ తర్వాత భారత్‌లో ఒక ఉన్నత స్థాయి పదవిని వదులుకొని మళ్లీ టీచింగ్ ప్రొఫెషన్‌కు వెళుతున్న ఆర్థిక వేత్త పనగడియానే. కొలంబియా యూనివర్సిటీలో ఇండియన్ పొలిటికల్ ఎకానమీ ప్రొఫెసర్ అయిన ఈయనకు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్‌గా నిర్ణీత పదవీ కాలం అంటూ ఏమీ లేదు. యూనివర్సిటీ వారు సెలవె పొడిగింపు ఇవ్వలేదని.. అందుకే ఆగస్ట్ 31న నీతి ఆయోగ్‌ను వదిలి వెళ్లాలనుకున్న విషయాన్ని రెండు నెలల ముందే ప్రధాని మోదీకి తెలియజేశానని పనగడియా తెలిపారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : పదవి నుంచి వైదొలగనున్న నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ 
ఎప్పుడు : ఆగస్టు 31
ఎవరు : అరవింద్ పనగడియా 
ఎందుకు : కొలంబియా యూనివర్సిటీ సెలవు పొడిగించనందుకు 

ప్రొఫెసర్ పీఎం భార్గవ కన్నుమూతప్రఖ్యాత శాస్త్రవేత్త, సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ (సీసీఎంబీ) వ్యవస్థాపక డెరైక్టర్ ప్రొఫెసర్ పుష్పమిత్ర భార్గవ (89) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. వయోభారం, తీవ్ర అనారోగ్యంతో ఆగస్టు 1న హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. ఆయన కొడుకు మోహిత్ భార్గవ కెనడాలో ఉంటున్నారు. కూతురు వినీత గుంటూరులో ఒక స్వచ్ఛంద సంస్థలో పని చేస్తున్నారు. 
‘హెడిల్‌బర్గర్’ వ్యవస్థాపకుల్లో ఒకరు..1928 ఫిబ్రవరి 22న రాజస్తాన్‌లోని అజ్మీర్‌లో భార్గవ జన్మించారు. ఆయన తండ్రి రామచంద్ర భార్గవ, తల్లి గాయత్రీ భార్గవ. వారణాసి బీసెంట్ థియోసాఫికల్ స్కూల్‌లో ప్రాథమిక విద్య అభ్యసించిన భార్గవ.. లక్నో విశ్వవిద్యాలయం నుంచి 1946లో ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఎమ్మెస్సీ పట్టా పొందారు. 21వ ఏటనే సింథటిక్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అంశంపై పీహెచ్‌డీ పరిశోధన చేశారు. 1950 నుంచి 1953 వరకు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ)లో, అదే సమయంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం కెమిస్ట్రీ విభాగంలో లెక్చరర్‌గా విధులు నిర్వహించారు. 1953 నుంచి 1956 వరకు అమెరికాలోని విస్కాన్సన్ వర్సిటీలో పని చేశారు. అక్కడే హెడిల్‌బర్గర్ లేబొరేటరీ వ్యవస్థాపకుల్లో ఒకరుగా నిలిచారు. 
జ్యోతిష్య శాస్త్రం కోర్సుపై సుప్రీంకు..ఆధునిక జీవశాస్త్రానికి ఆర్కిటెక్ట్‌గా ప్రశంసలందుకున్న భార్గవ.. సీసీఎంబీ వ్యవస్థాపక డెరైక్టర్‌గా 13 ఏళ్ల పాటు విశేష సేవలందిం చారు. 2006లో అప్పటి ఎన్డీఏ ప్రభుత్వం 220 విశ్వవిద్యాలయాల్లో జ్యోతిష్య శాస్త్రాన్ని కోర్సుగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేసినప్పుడు నిర్ద్వంద్వంగా వ్యతిరేకించి సుప్రీంకోర్టు వరకు వెళ్లారు. మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు, సైన్స్ టెంపర్ పెంచేందుకు 500కు పైగా వ్యాసాలు రాశారు. నేషనల్ నాలెడ్‌‌జ సెంటర్ వైస్ చైర్మన్‌గా పని చేశారు. 
చేప మందుకు వ్యతిరేకంగా..హైదరాబాద్‌లో బత్తిన సోదరులు పంపిణీ చేసే చేప మందు శాస్త్రీయతను సవాల్ చేస్తూ 2008 నుంచి జన విజ్ఞాన వేదిక చేపట్టిన అన్ని ఆందోళన కార్యక్రమాల్లో భార్గవ పాల్గొన్నారు. హైకోర్టుకు వెళ్లారు. చివరకు దాన్ని చేప మందుగా పరిగణించరాదని, చేప ప్రసాదంగానే భావించాలని కోర్టు పేర్కొంది. చేప మందే కాకుండా హోమియో వైద్యమూ మూఢ నమ్మకమేనని భార్గవ కొట్టిపారేశారు. శాస్త్రవేత్తగా ఆయన కృషికి 1986లో ప్రభుత్వం పద్మభూషణ్‌తో సత్కరించింది. కానీ 2016లో దేశవ్యాప్తంగా రచయితలు, మేధావి వర్గంపై జరిగిన దాడులు, అసహనానికి వ్యతిరేకంగా అవార్డు తిరిగిచ్చేశారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ప్రొఫెసర్ పీఎం భార్గవ కన్నుమూత 
ఎప్పుడు : ఆగస్టు 1
ఎవరు : సీసీఎంబీ వ్యవస్థాపక డెరైక్టర్ 
ఎక్కడ : హైదరాబాద్‌లో


అంతర్జాతీయం
రైజ్ బిల్లుకి ట్రంప్ ఆమోదం 
అమెరికాలో శాశ్వత నివాస హోదా(గ్రీన్‌కార్డు) జారీకి అనుసరించిన లాటరీ విధానానికి డొనాల్డ్ ట్రంప్ సర్కారు స్వస్తి పలకనుంది. ఆంగ్ల భాషా నైపుణ్యం, ఉన్నత విద్య, అధిక వేతనం, వయసు ప్రాతిపదికగా ఇకపై కార్డులు జారీ చేయనున్నారు. ఈ మేరకు గ్రీన్‌కార్డుల సంఖ్యను గణనీయంగా తగ్గించే లక్ష్యంతో ‘రైజ్’(రిఫార్మింగ్ అమెరికన్ ఇమిగ్రేషన్ ఫర్ స్ట్రాంగ్ ఎంప్లాయ్‌మెంట్) బిల్లును రూపొందించారు. ప్రతిభ ప్రాతిపదికన గ్రీన్‌కార్డులు జారీ చేయాలంటూ సెనెటర్లు టామ్ కాటన్, డేవిడ్ పెర్‌డ్యూ రూపొందించిన ఈ బిల్లుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమోదం తెలిపారు. వలసల్ని తగ్గించడమే బిల్లు ఉద్దేశమైనా బిల్లులో ప్రతిపాదించిన అంశాల ప్రకారం భారత్ వంటి దేశాల నుంచి వచ్చే ఉన్నత విద్యావంతులు, ఐటీ ఉద్యోగులకు ఈ బిల్లు మేలు చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు.
అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ, 26-30 ఏళ్ల మధ్య వయసు, ఆంగ్లంలో మంచి ప్రావీణ్యం, మంచి వేతనం ఉంటే గ్రీన్‌కార్డులు పొందడం తేలిక కానుంది. ప్రస్తుతం అమెరికా ఏడాదికి 10 లక్షల గ్రీన్‌కార్డులు జారీ చేస్తుండగా.. పదేళ్లలో సగానికి తగ్గించేలా ఈ బిల్లును రూపొందించారు.
క్విక్ రివ్యూ: ఏమిటి : రైజ్ బిల్లుకి ఆమోదం 
ఎప్పుడు : ఆగస్టు 1
ఎవరు : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 
ఎక్కడ : అమెరికా 
ఎందుకు : అమెరికాలో శాశ్వత నివాస హోదా(గ్రీన్‌కార్డు) జారీకి

కాలగర్భంలో 4000భాషలు
ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతమున్న మూడింట రెండొంతుల భాషలు ప్రమాదంలో పడ్డాయి. ప్రపంచంలో మొత్తంగా 6000 భాషలున్నట్లు అంచనా. వాటిలో 2050 ఏడాదికల్లా 4000 భాషలు క్రమేపీ మూగబోయే ప్రమాదం ఉందని పీపుల్స్ లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా (పీఎల్‌ఎస్‌ఐ) తెలిపింది. 27 రాష్ట్రాల్లోని 780 భాషలపై 3000 మందితో అధ్యయనం నిర్వహించిన ఈ సంస్థ.. భారత్‌లో సుమారు 400 భాషలు కనుమరుగు కానున్నాయని తెలిపింది.
ఈ నివేదిక ప్రకారం తీరప్రాంతాల్లో మాట్లాడుతున్న భాషలే ఎక్కువ ప్రమాదంలో ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో స్థిరమైన జీవనోపాధి దొరకక సంప్రదాయ మత్స్యకార వర్గాలు తీరానికి దూరమవుతున్నాయి. కాగా ఎక్కువ సంఖ్యలో ప్రజలు మాట్లాడుతున్న హిందీ, బెంగాలీ, తెలుగు, మరాఠి, కన్నడ, మలయాళం, గుజరాతి, పంజాబీ భాషలకు కనుమరుగయ్యే ప్రమాదం లేదని, ఈ భాషలకు వేలాది ఏళ్ల చరిత్ర ఉండడంతో ఈ జాబితాలోకి రావని వెల్లడించారు. 
క్విక్ రివ్యూ: ఏమిటి : కనుమరుగు కానున్న 400 భాషలు 
ఎప్పుడు : 2050 నాటికి
ఎవరు : పీపుల్స్ లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా
ఎక్కడ : భారతదేశంలో

భారత్, చైనాలో యువ ఇంటర్నెట్ యూజర్స్ అధికం 
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 830 మిలియన్‌ల(83 కోట్ల) యువ ఇంటర్నెట్ వినియోగదారుల్లో 39 శాతం (320 మిలియన్) మంది భారత్, చైనాలోనే ఉన్నారు. ఐరాస అనుబంధ సంస్థ అంతర్జాతీయ టెలీకమ్యూనికేషన్ యూనియన్(ఐటీయూ) ఇటీవల విడుదల చేసిన నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. 
క్విక్ రివ్యూ: ఏమిటి : ప్రపంచంలో యువ ఇంటర్నెట్ యూజర్స్ 
ఎప్పుడు : ఆగస్టు 1
ఎవరు : ఐటీయూ, ఐరాస
ఎక్కడ : భారత్, చైనాలో 39 శాతం మంది 

టిబెట్ పీఠభూమిపై ఎక్స్‌ప్రెస్ హైవేప్రపంచంలోనే ఎత్తయిన టిబెట్ పీఠభూమిపై చైనా ఎక్స్‌ప్రెస్ హైవేను ప్రారంభించింది. కింఘై ఫ్రావిన్స్‌లోని గాంగ్హె కౌంటీని వుషు నగరంతో కలుపుతూ దీన్ని నిర్మించారు. 634.8 కిలోమీటర్ల పొడవైన ఈ రహదారి నిర్మాణానికి చైనా వేల కోట్లను ఖర్చు చేసింది. దీన్ని సగటున 4 వేల మీటర్ల ఎత్తులో నిర్మించారు. రహదారిలో 36 శాతం పెర్మాఫ్రాస్ట్(మంచు)నేలపై ఉంటుంది. వాహనాల వల్ల ఏర్పడే ఉష్ణోగ్రత మార్పుల కారణంగా నేల కరిగిపోకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నేలను స్థిరంగా ఉంచి నిర్మాణం చేపట్టారు.

మనీలాలో ఆసియాన్-భారత్ విదేశాంగ మంత్రుల సదస్సు15వ ఆసియాన్-భారత్ విదేశాంగ మంత్రుల సదస్సు ఆగస్టు 6న మనీలాలో ముగిసింది. ఇందులో భారత విదేశాంగ సహాయ మంత్రి వి.కె.సింగ్ పాల్గొన్నారు. దక్షిణ చైనా సముద్ర వ్యవహారాలపై సదస్సు ఉమ్మడి ప్రకటన చేసింది.

2050 నాటికి 15 కోట్ల మందికి పౌష్టికాహార లోపంవాతావరణంలోకి విడుదలయ్యే కర్బన ఉద్గారాలు పెరగడం వల్ల భూతాపోన్నతి పెరగడంతోపాటు వరి, గోధుమ వంటి పంటల్లో ప్రొటీన్ వంటి పౌష్టికాహార పదార్థాలు లుప్తమవుతాయని శాస్త్రవేత్తలు ఆగస్టు 2న హెచ్చరించారు. పర్యవసానంగా 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా 15 కోట్ల మంది పౌష్టికాహార లోపానికి గురై అకాల మృత్యువాత పడతారని హార్వర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు హెచ్చరించారు.

జాతీయంగోప్యత పరిరక్షణ ఓ విఫల యుద్ధం: సుప్రీంకోర్టు
వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం అవుతుండటం పట్ల సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. నేటి సాంకేతిక యుగంలో గోప్యత అనే భావనను పరిరక్షించడం కష్టసాధ్యమవుతోందని పేర్కొంది. గోప్యత పరిరక్షణ ఒక విఫల యుద్ధమని అభివర్ణించింది. గోప్యత హక్కును ప్రాథమిక హక్కుల జాబితాలో చేర్చాలా? లేదా? అన్న అంశంపై మూడు వారాలు విచారణ జరిపిన సర్వోన్నత ధర్మాసనం ఆగస్టు 2న తన తీర్పును రిజర్వులో ఉంచింది. ఈ బెంచ్‌కు నేతృత్వం వహించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్ పదవీ విరమణ చేయనున్న ఆగస్టు 27న లేదా అంతకు ముందు తీర్పును ప్రకటించొచ్చు. 
మన జీవితం ప్రతి అంగుళంలోకి చొచ్చుకొచ్చిన సాంకేతికత కారణంగా గోప్యత అనే భావన ప్రాభవం కోల్పోతోందని, గోప్యత మౌలిక లక్షణాలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని బెంచ్ అభిప్రాయపడింది. భారత్‌లో ప్రైవసీ పదాన్ని నిర్వచించాల్సిన అవసరం ఉందని, సుమారు 130 కోట్ల మంది సమాచారం ప్రజాక్షేత్రంలో ఉందని పేర్కొంది. గోప్యత హక్కును ప్రాథమిక హక్కుగా గుర్తించినట్లయితే, దాని కిందికి ఏమేం వస్తాయో కూడా తామే చెప్పాల్సి ఉందని వెల్లడించింది. 
క్విక్ రివ్యూ: ఏమిటి : గోప్యత హక్కుపై విచారణ 
ఎప్పుడు : ఆగస్టు 2
ఎవరు : సుప్రీంకోర్టు 
ఎందుకు : తీర్పుని రిజర్వులో ఉంచిన సర్వోన్నత న్యాయస్థానం 

రత్లే, క్రిష్ణగంగ ప్రాజెక్టులకు ప్రపంచబ్యాంకు అనుమతి
జమ్మూ కశ్మీర్‌లో భారత్ నిర్మిస్తున్న క్రిష్ణగంగ, రత్లే జల విద్యుదుత్పత్తి ప్రాజెక్టులను కొనసాగించుకోవచ్చని ప్రపంచ బ్యాంకు స్పష్టం చేసింది. అయితే 1960నాటి సింధు జలాల ఒప్పందాన్ని అనుసరించి కొన్ని పరిమితులకు లోబడి ఆనకట్టల నిర్మాణాలు ఉండాలంది. పాకిస్తాన్, భారత్ నుంచి కార్యదర్శి స్థాయి అధికారులు తన వద్ద చర్చలు జరిపిన అనంతరం ఓ ప్రకటనను ప్రపంచ బ్యాంకు ఆగస్టు 1న విడుదల చేసింది. 
సింధు జలాల ఒప్పందం ప్రకారం భారత్ నుంచి పాక్‌కు ప్రవహిస్తున్న పశ్చిమ నదులపై ప్రాజెక్టుల నిర్మాణం కోసం భారత్... ఈ వ్యవహారంతో సంబంధంలేని ఇతర వ్యక్తి/సంస్థ నుంచి అనుమతి తీసుకోవాల్సిన అవసరమే లేదు. సింధునది ఉపనదులైన జీలం, చీనాబ్‌లపై భారత్ 330 మెగావాట్ల సామర్థ్యంగల క్రిష్ణగంగ, 850 మెగావాట్ల సామర్థ్యం కలిగిన రత్లే జల విద్యుదుత్పత్తి ప్రాజెక్టు నిర్మాణాలను ఇప్పటికే ప్రారంభించగా, వీటిపై పాకిస్తాన్ అభ్యంతరాలు తెలుపుతూ వస్తోంది. ఈ ప్రాజెక్టుల ఆకృతులు సాంకేతికంగా సింధు జలాల ఒప్పందాన్ని ఉల్లం ఘిస్తున్నాయని పాక్ వాదిస్తోంది. వివాదాన్ని పరిష్కరించాలంటూ పాక్ ప్రపంచ బ్యాంకును ఆశ్రయించింది. తాజాగా పాక్, భారత్ కార్యదర్శి స్థాయి అధికారులు ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంలో ఈ వారంలో భేటీ అయ్యారు. తదుపరి దఫా చర్చలు సెప్టెంబరులో జరగనున్నాయి. 
క్విక్ రివ్యూ: ఏమిటి : రత్లే, క్రిష్ణగంగ ప్రాజెక్టులకు అనుమతి 
ఎప్పుడు : ఆగస్టు 1
ఎవరు : ప్రపంచ బ్యాంకు 
ఎక్కడ : జమ్ముకాశ్మీర్

అన్ని రంగాల్లోనూ అవినీతి జాఢ్యం: సుప్రీందేశవ్యాప్తంగా అన్ని కీలక రంగాల్లోనూ అవినీతి వేళ్లూనుకుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. దేశాభివృద్ధికి, పెట్టుబడుల రాకకు ఇది తీవ్ర అవరోధంగా మారిందని జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ ఆర్.భానుమతిల ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. విధులను సక్రమంగా నిర్వహిస్తూ, ప్రజా హక్కుల పరిరక్షణ కోసమే తాము పనిచేస్తున్నామన్న సృ్పహ అధికారుల్లో ఉన్నప్పుడే అవినీతిని అరికట్టగలమని కోర్టు అభిప్రాయపడింది. 
20 ఏళ్ల క్రితం నిబంధనలకు విరుద్ధంగా భూమిని కేటాయించిన కేసులో ఉత్తరప్రదేశ్ మాజీ సీఎస్ నీరా యాదవ్, ఐఏఎస్ అధికారి రాజీవ్ కుమార్‌లకు విధించిన శిక్షను సమర్థించిన ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యానించింది. ప్రజలు లంచగొండితనం, అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమించనంతవరకు ఈ జాఢ్యం నుంచి సమాజం విముక్తి పొందలేదని అభిప్రాయపడింది. అంతేకాకుండా బంధుప్రీతితో అనర్హులకు లబ్ధి చేకూర్చడంపైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. 
క్విక్ రివ్యూ: ఏమిటి : అన్ని రంగాల్లో అవినీతి జాఢ్యం ఉందని వ్యాఖ్య
ఎప్పుడు : ఆగస్టు 2
ఎవరు : సుప్రీంకోర్టు 

రహదారులపై 50 కి.మీ.కు ఓ వసతి కేంద్రం
జాతీయ రహదారులపై ప్రతి 50 కి.మీ.కు ఒక వసతి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని రోడ్డు రవాణా, రహదారులు, నౌకాయాన శాఖల మంత్రి నితిన్ గడ్కారీ ఆగస్టు 3న చెప్పారు. ఆ వసతి కేంద్రాల్లో ఆహార శాలలు, విశ్రాంతి గదులు, స్థానిక ఉత్పత్తుల విక్రయాలు తదితర సౌకర్యాలు ఉండనున్నాయి. జాతీయ రహదారుల గుండా వెళ్లే ప్రయాణికులు, డ్రైవర్లు సేద తీరేందుకు వసతి కేంద్రాలు ఉపయోగపడటంతోపాటు, స్థానిక ఉత్పత్తుల విక్రయాల ద్వారా ఆయా ప్రాంతాల్లో నిరుద్యోగాన్ని రూపుమాపేందుకు కూడా ఉపకరిస్తాయని గడ్కారీ వివరించారు.
క్విక్ రివ్యూ: ఏమిటి : రహదారులపై 50 కి.మీ.కు ఓ వసతి కేంద్రం 
ఎప్పుడు : ఆగస్టు 3
ఎవరు : కేంద్ర ప్రభుత్వం 
ఎందుకు : ప్రయాణికులు, డ్రైవర్లు సేద తీరేందుకు 

విశాఖ పెట్రో వర్సిటీ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ(ఐఐపీఈ) బిల్లు- 2017ను లోక్‌సభ ఆగస్టు 4న ఆమోదించింది. ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన హామీ మేరకు ఇప్పటికే విశాఖలోని తాత్కాలిక క్యాంపస్‌లో ప్రారంభమైన ఐఐపీఈకి జాతీయ ప్రాధాన్య, స్వతంత్ర సంస్థగా గుర్తింపునిస్తూ వర్సిటీని ఇన్‌కార్పొరేట్ చేసేందుకు గానూ కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంధ్ర ప్రదాన్ సభలో బిల్లు ప్రవేశపెట్టారు. రూ.600 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటు చేయనున్న ఈ వర్సిటీ కోసం ఏపీ ప్రభుత్వం 200 ఎకరాల స్థలం కేటాయించింది.
క్విక్ రివ్యూ: 
ఏమిటి :
 ఐఐపీఈ బిల్లు - 2017కు ఆమోదం
ఎప్పుడు : ఆగస్టు 4
ఎవరు : లోక్‌సభ 
ఎందుకు : ఐపీఈకి జాతీయ ప్రాధాన్య, స్వతంత్ర సంస్థగా గుర్తింపునిచ్చేందుకు 

హెలీ ట్యాక్సీ సేవలని ప్రారంభించిన బీఐఏఎల్ 
దేశంలో తొలిసారిగా హెలీ ట్యాక్సీ సేవల్ని బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (బీఐఏఎల్) అందుబాటులోకి తెచ్చింది. పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా ఆగస్టు 4న ఈ సేవల్ని లాంఛనంగా ప్రారంభించారు. బెంగళూరులోని పీణ్య, ఎలక్ట్రానిక్ సిటీతోపాటు ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాలనుంచి ఎయిర్‌పోర్టుకు చేరాలంటే కనీసం రెండు గంటల సమయం పడుతుంది. దీంతో తుంబీ ఏవియేషన్స్‌ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో బీఐఏఎల్ హెలీట్యాక్సీ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఒక హెలికాప్టర్‌లో ఐదుగురు, మరో హెలికాప్టర్‌లో 13 మంది ప్రయాణించవచ్చు.
క్విక్ రివ్యూ: 
ఏమిటి :
 దేశంలో తొలి హెలీ ట్యాక్సీ సేవలు ప్రారంభం 
ఎప్పుడు : ఆగస్టు 4 
ఎవరు : బీఐఏఎల్
ఎక్కడ : బెంగళూరు 

మరణ ధ్రువీకరణకు ఆధార్ తప్పనిసరి
దేశవ్యాప్తంగా మరణ ధ్రువీకరణ పత్రాల జారీకి 2017 అక్టోబర్ 1 నుంచి ఆధార్‌ను తప్పనిసరి చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. వ్యక్తుల గుర్తింపులో మోసాలను నివారించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర హోంశాఖ ఆగస్టు 4న నోటిఫికేషన్ విడుదల చేసింది. జమ్మూకశ్మీర్, అస్సాం, మేఘాలయ రాష్ట్రాలు మినహా దేశమంతటా ఇది వర్తించనుంది. ఆధార్‌ను తప్పనిసరి చేయడం ద్వారా మరణ ధ్రువీకరణ పత్రం కోసం ఇకపై రకరకాల డాక్యుమెంట్లను సమర్పించాల్సిన అవసరం ఉండదు. ఈ విషయమై తమ అభిప్రాయాలను అక్టోబర్ 1 కల్లా తెలియజేయాల్సిందిగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్రం కోరింది. 
క్విక్ రివ్యూ: ఏమిటి : మరణ ధృవీకరణకు ఆధార్ తప్పనిసరి
ఎప్పుడు : 2017 అక్టోబర్ 1 నుంచి
ఎవరు : కేంద్ర ప్రభుత్వం 

‘అయోధ్య’ పిటిషన్ల విచారణకు బెంచ్అయోధ్య-బాబ్రీ మసీదు వివాదంలో 2010లో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలుచేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించడానికి ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్‌ను సుప్రీం కోర్టు నియమించింది. జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలో జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ అబ్దుల్ నజీర్‌ల బెంచ్ ఆగస్టు 11 నుంచి పిటిషన్ల విచారణ ప్రారంభిస్తుంది. 
అయోధ్యలోని వివాదాస్పద 2.77 ఎకరాల భూమిని సున్నీ వక్ఫ్ బోర్డు, నిర్మోహీ అఖరా, రామ్‌లల్లాలకు సమానంగా పంచాలని గతంలో అలహాబాద్ హైకోర్టు 2:1 మెజారిటీతో తీర్పునిచ్చింది. 
క్విక్ రివ్యూ: ఏమిటి : ఆయోధ్య-బాబ్రీ పిటిషన్లపై విచారణకు బెంచ్ 
ఎప్పుడు : ఆగస్టు 7
ఎవరు : సుప్రీంకోర్టు 
ఎందుకు : అయోధ్య-బాబ్రీ మసీదు వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించేందుకు 

‘సంకల్ప్ పర్వం’గా ఆగస్టు 15స్వాతంత్య్ర దినోత్సవం ఆగస్టు 15న దేశప్రజలు ‘సంకల్ప్ పర్వం’ జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. సమాజంలోని రుగ్మతల నిర్మూలనకు కృషిచేస్తామని పౌరులు ఆ రోజున సంకల్పించుకోవాలని సూచించింది. 70వ స్వాతంత్య్ర దినోత్సవమైన ఈ ఏడాది ఆగస్టు 15న ‘సంకల్ప్ పర్వం’ నిర్వహించుకోవాలని సిబ్బంది శిక్షణ శాఖ తాజా ఉత్తర్వులో పేర్కొంది. 
క్విక్ రివ్యూ: ఏమిటి : సంకల్ప్ పర్వ్ దినోత్సవం 
ఎప్పుడు : ఆగస్టు 15
ఎవరు : కేంద్ర ప్రభుత్వం 
ఎక్కడ : దేశవ్యాప్తంగా 
ఎందుకు : 70వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా 

మసీదు నిర్మాణంపై షియా వక్భ్‌బోర్డు అఫిడవిట్ అయోధ్యలో రామ మందిరం-బాబ్రీ మసీదు సమస్యకు పరిష్కారంగా వివాదాస్పద స్థలానికి కొంచెం దూరంలో మసీదును నిర్మించవచ్చని ఉత్తరప్రదేశ్ షియా కేంద్ర వక్ఫ్‌బోర్డు ఆగస్టు 8న సుప్రీంకోర్టుకు తెలిపింది. అలాగే బాబ్రీ మసీదు స్థలాన్ని సున్నీ వక్ఫ్‌బోర్డు తమదని చెప్పుకుంటుండటాన్ని షియా వక్ఫ్‌బోర్డు వ్యతిరేకించింది. సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో దీనిని ప్రస్తావిస్తూ మసీదు స్థలం తమదేననీ, వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకునేందుకు చర్చలు జరిపే హక్కు తమకే ఉందని షియా వక్ఫ్‌బోర్డు పేర్కొంది. కొత్తగా నిర్మించే మసీదు, ఆలయం తగినంత దూరంలో ఉండాలనీ, ప్రార్థనా స్థలాల్లో ఒకమతం వారు వాడే లౌడ్ స్పీకర్ల వల్ల మరో మతం వారికి ఇబ్బంది ఉండకూడదని వక్ఫ్‌బోర్టు కోర్టుకు విన్నవించింది. 
రామ జన్మభూమి-బాబ్రీ మసీదు కేసులో వివాదాస్పద 2.77 ఎకరాల స్థలాన్ని మూడు భాగాలుగా సున్నీ వక్ఫ్ బోర్డు, నిర్మోహి అఖారా, రామ మందిరాలకు పంచుతూ అలహాబాద్ హైకోర్టు 2010లో తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఏళ్ల నుంచి అపరిష్కృతంగా ఉన్న ఈ పిటిషన్లను త్వరగా విచారించాలని బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టును గతంలో కోరారు. దీంతో పిటిషన్లపై విచారించేందుకు జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్‌ఏ నజీర్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్ నియమించారు. 

పశువులకు ఆరోగ్య కార్డులు పశువుల సంఖ్య, ఆరోగ్య వివరాల సేకరణ కోసం కేంద్రం చేపట్టిన ‘యానిమల్ హెల్త్ కార్డ్’ కార్యక్రమాన్ని ఆగస్టు 8న తమిళనాడులోని కోయంబత్తూరులో ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. కేంద్ర పశుసంవర్ధకశాఖ ఆదేశాల మేరకు తమిళనాడులో వెటర్నరీ ఆస్పత్రులు, డిస్పెన్సరీలు తదితర 105 కేంద్రాల ద్వారా వీటిని పంపిణీ చేయనున్నారు. తొలి దశలో ప్రయోగాత్మకంగా కోవై, సేలం, వేలూరు, విల్లుపురం, మదురై సహా ఏడు జిల్లాల్లో వీటిని అందజేస్తారు. 
మూడు రంగుల్లో కార్డులు 
పశువుల ఆరోగ్యాన్ని పరిశీలించడం, వాటి సంఖ్య, సంతానోత్పత్తి, వ్యాధులు తదితర వివరాలను సేకరించి ప్రతి పశువుకు 12 అంకెలు గల సిరీస్‌తో కార్డులో నమోదు చేస్తారు. సంకరజాతి, నాటు పశువు, బర్రె అని మూడు రకాలతో వేర్వేరు రంగుల్లో ఈ కార్డులను అందిస్తారు. పశువుల యజమానుల వద్ద పశువు ఫోటో, గుర్తులు, వయసు, గుర్తింపు నంబర్, పశువులకు వేసిన ఇంజెక్షన్ల వివరాలన్నీ ఉంటాయి. ఈ వివరాలన్నీ పశు సంరక్షణ విభాగ వెబ్‌సైట్‌లో నమోదు చేస్తారు. పశువులకు ప్రత్యేక కార్డులు ఇవ్వడం ద్వారా చోరీ సంఘటనలు, మాంసం కోసం అక్రమంగా తరలించడం వంటివి అడ్డుకోవచ్చునని పశు సంరక్షణ విభాగ అధికారులు తెలిపారు.
క్విక్ రివ్యూ: ఏమిటి : యానిమల్ హెల్త్ కార్డ్ కార్యక్రమం 
ఎప్పుడు : ఆగస్టు 8
ఎవరు : కేంద్ర పశు సంవర్ధక శాఖ 
ఎక్కడ : కోయంబత్తూరు, తమిళనాడు 
ఎందుకు : పశువుల సమగ్ర వివరాలతో 12 అంకెల గుర్తింపు కార్డుల జారీకి 

ఆక్రమణలో 33 లక్షల ఎకరాల అటవీ భూమిదేశంలో 33.21 లక్షల ఎకరాల అటవీ భూమి ఆక్రమణకు గురైందని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్థన్ ఆగస్టు 1న లోక్‌సభకు తెలిపారు. గోవా, లక్షద్వీప్, పుదుచ్చేరి మినహా దేశంలోని అన్ని ప్రాంతాల్లో అటవీ భూములు ఆక్రమణకు గురయ్యాయన్నారు. తెలంగాణలో 7,551 ఎకరాలు, ఏపీలో 4,177 ఎకరాలు ఆక్రమణలో ఉన్నట్లు వెల్లడించారు. అత్యధికంగా మధ్యప్రదేశ్‌లో 13 లక్షల ఎకరాలు, అసోంలో 7 లక్షల ఎకరాలు ఆక్రమణకు గురైందన్నారు.

భారత్‌లో వ్యవసాయం ప్రమాదకరంభారతదేశంలో ప్రస్తుతం వ్యవసాయం చేయడం ప్రమాదకరంగా పరిణమించిందని అమెరికాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ఒక నివేదికలో పేర్కొంది. పంట ఎదిగే కాలంలో 20 డిగ్రీల సెల్సియస్‌కు మించి పెరిగే ప్రతి డిగ్రీకి 67 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆగస్టు 1న ప్రచురితమైన ప్రొసీడింగ్స్ ఆఫ్ నేషనల్ అకాడమీ ఆఫ్ సెన్సైస్‌కు చెందిన జర్నల్‌లో వెల్లడించింది. 2050 నాటికి దేశంలో భూతాపోన్నతి మరో మూడు డిగ్రీలు పెరుగుతుందని, అప్పుడు రైతుల పరిస్థితి మరెంత దారుణంగా ఉంటుందోనని ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో 130 కోట్ల జనాభా ఉండగా.. వారిలో 58 శాతం మంది రైతులు ఉన్నారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించక, పంటలు దెబ్బతిని ఏటా లక్షా 30 వేల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. 

రాష్ట్రీయం
ఏపీలో మహిళల రక్షణకు ‘అభయ’
ఆంధ్రప్రదేశ్‌లో మహిళల రక్షణకు ‘అభయ’ పేరుతో మొబైల్ యాప్ (ప్రాజెక్టు) ను కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. ఏ సమయంలోనైనా మహిళలు స్వేచ్ఛగా ప్రయాణించేలా చేయడమే దీని లక్ష్యం. ఇందుకోసం తొలివిడతగా ఏపీకి రూ.56 కోట్లు కేటాయించింది. 
క్యాబ్‌లు, ట్యాక్సీలు, ఆటోల్లో ప్రయాణించే మహిళలకు ఏదైనా అవాంఛనీయ సంఘటనలు ఎదురైతే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్‌‌స(ఐఓటీ) ఆధారంగా పోలీస్, రవాణా శాఖలకు సమాచారం చేరవేసేలా ‘అభయ’ ప్రాజెక్టును రూపొందించారు. ‘అభయ’ ప్రాజెక్టు అమల్లోకి వస్తే క్యాబ్‌లు, ఆటోలతో పాటు ప్రయాణికుల్ని చేరవేసే వాహనాలన్నింటికి జీపీఎస్ అమర్చుకోవాల్సి ఉంటుంది. రవాణా, పోలీసుశాఖ సిబ్బంది కాల్‌సెంటర్లు, కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తారు. అభయ ప్రాజెక్టును విశాఖ, విజయవాడల్లో మొదట ప్రయోగాత్మకంగా అమలు చేస్తారు.
క్విక్ రివ్యూ: ఏమిటి : ‘అభయ’ అనే ప్రాజెక్టుకు ఆమోదం
ఎప్పుడు : ఆగస్టు 3
ఎవరు : కేంద్ర ప్రభుత్వం 
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్‌లో 
ఎందుకు : మహిళలకు రక్షణ కల్పించేందుకు 

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎక్స్‌ప్రెస్ భద్రత తనిఖీశంషాబాద్ విమానాశ్రయంలో ఎక్స్‌ప్రెస్ సెక్యూరిటీ(భద్రత) తనిఖీ విధానాన్ని ఆగస్టు 4న ప్రారంభించారు. దీని కింద దేశీయ ప్రయాణికులతో పాటు బ్యాగేజీ తనిఖీ ఉంటుంది. దేశంలోనే తొలిసారి ఈ బోర్డింగ్‌ను ప్రవేశపెట్టిన జీఎంఆర్ ఎయిర్‌పోర్టు.. తనిఖీని వేగవంతం చేసే చర్యలో భాగంగా దీనిని ఏర్పాటు చేసింది. 
క్విక్ రివ్యూ: ఏమిటి : ఎక్స్‌ప్రెస్ భద్రత తనిఖీ ప్రారంభం 
ఎప్పుడు : ఆగస్టు 4
ఎక్కడ : జీఎంఆర్ హైదరాబాద్ విమానాశ్రయం 

తెలంగాణలో రెరా నిబంధనలు ఖరారు
తెలంగాణలో రెరా (రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అండ్ డెవలప్‌మెంట్ యాక్ట్-2016) చట్టం నిబంధనలు ఖరారయ్యాయి. ఈ మేరకు జూలై 31న జారీ చేసిన ఈ ఉత్తర్వులను ప్రభుత్వం ఆగస్టు 3న బహిర్గతం చేసింది. 2017 జనవరి 1, ఆ తర్వాత అనుమతులు పొందిన రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు ఈ చట్టం వర్తించనుంది. జనవరి 1 కన్నా ముందు అనుమతులు పొందిన ప్రాజెక్టులు ఇంకా నిర్మాణంలో ఉండి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ / కంప్లీషన్ సర్టిఫికెట్‌ను ఇంకా పొందని ప్రాజెక్టులకు ఈ చట్టం వర్తించదని స్పష్టం చేసింది. కొనుగోలుదారులు, ప్రమోటర్ల మధ్య వివాదాలను కొత్తగా ఏర్పాటు చేయబోయే తెలంగాణ స్టేట్ రియల్ ఎస్టేట్ అప్పీలేట్ ట్రిబ్యునల్ పరిష్కరించనుంది.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : రెరా చట్టం - 2017 నిబంధనలు ఖరారు 
ఎప్పుడు : జూలై 31 
ఎవరు : తెలంగాణ ప్రభుత్వం 
ఎక్కడ : తెలంగాణలో 

ఆరోగ్య పరీక్షలకు మైక్రోసాఫ్ట్‌తో ఒప్పందం
బాలబాలికలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించేందుకు మైక్రోసాఫ్ట్‌తో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. క్లౌడ్ బేస్డ్ అనలిటిక్స్ సాఫ్ట్‌వేర్ ప్రోగ్రాం సహాయంతో ఈ మేరకు ఆరోగ్య పరీక్షలను మైక్రోసాఫ్ట్ నిర్వహించనుంది. దీంతోపాటు బాలల్లో అంధత్వాన్ని నివారించేందుకు మైక్రోసాఫ్ట్ ఇంటెలిజెన్స్‌ నెట్‌వర్క్ ఫర్ ఐ కేర్ (మైన్) కార్యక్రమాన్ని సైతం రాష్ట్రంలో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మైక్రోసాఫ్ట్ ప్రతినిధులతో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ ఆగస్టు 4న ఒప్పందం కుదుర్చుకున్నారు. 
క్విక్ రివ్యూ: ఏమిటి : ఆరోగ్య పరీక్షలకు మైక్రోసాఫ్ట్‌తో ఒప్పందం 
ఎప్పుడు : ఆగస్టు 3
ఎవరు : తెలంగాణ ప్రభుత్వం 
ఎందుకు : రాష్ట్రంలోని బాలబాలికలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించేందుకు

అమెజాన్‌తో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం తెలంగాణలోని చేనేత, హస్త కళల ఉత్పత్తులకు తమ ఆన్‌లైన్ స్టోర్ ద్వారా మార్కెటింగ్ కల్పించేందుకు ప్రముఖ ఈ కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్ ముందుకొచ్చింది. ఈ మేరకు రాష్ట్ర చేనేత, జౌళి మంత్రిత్వ శాఖ, అమెజాన్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం చేనేత, హస్తకళల ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో విక్రయించేందుకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, ఉత్పత్తులను లిస్ట్ చేయడం వంటి అంశాల్లో నేత కార్మికులు, హస్త కళల నిపుణులకు అమెజాన్ శిక్షణ ఇస్తుంది.
క్విక్ రివ్యూ: ఏమిటి : అమెజాన్‌తో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం 
ఎప్పుడు : ఆగస్టు 8
ఎందుకు : చేనేత, హస్తకళల ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించేందుకు 

ఆర్థికంరెపో రేటు పావు శాతం తగ్గించిన ఆర్‌బీఐ
ఆర్‌బీఐ పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) బ్యాంకులకు తానిచ్చే రుణాలపై తీసుకునే వడ్డీరేటు - రెపోను పావుశాతం తగ్గించింది. దీనితో ఈ రేటు 6 శాతానికి దిగివచ్చింది. ఇది ఆరేళ్ల కనిష్ట స్థాయి. అదే విధంగా బ్యాంకులు తమ వద్ద స్వల్పకాలికంగా ఉంచే అదనపు నిధులకు సంబంధించి చెల్లించే రేటు- రివర్స్ రెపోను కూడా పావు శాతం తగ్గించింది. దీనితో ఈ రేటు 5.75 శాతానికి తగ్గింది. దాదాపు పది నెలల నుంచీ ద్రవ్యోల్బణం పెరుగుదల భయాలతో రెపో రేటును యథాతథంగా కొనసాగిస్తూ వచ్చిన ఆర్‌బీఐ, ప్రస్తుతం ఈ భయాలు తగ్గడంతో రెపో రేటు పావుశాతం తగ్గించినట్లుగా వివరించింది. వృద్ధికి ఇది భరోసా కల్పిస్తున్న అంశంగా పేర్కొంది. 
తగ్గనున్న ఈఎంఐ భారం రెపో తగ్గింపు ద్వారా లభిస్తున్న ప్రయోజనాన్ని బ్యాంకులు కస్టమర్లకు బదలాయించాలని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. తాజా నిర్ణయం వల్ల గృహ, ఆటో, కార్పొరేట్ల నెలవారీ రుణ పునః చెల్లింపుల (ఈఎంఐ) భారం కొంత తగ్గుతుంది. 
మరిన్ని ముఖ్యాంశాలు.. 

  • ప్రస్తుత ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు అంచనాలను యథాతథంగా 7.3 శాతంగా కొనసాగింపు.
  • బ్యాంకులు ఆర్‌బీఐ వద్ద తప్పనిసరిగా ఉంచాల్సిన మొత్తం- 4 శాతం నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్‌ఆర్)లో ఎటువంటి మార్పు లేదు.
  • 6.25 శాతానికి దిగివచ్చిన మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (ఎంఎస్‌ఎఫ్), బ్యాంక్ రేటు.
  • ప్ల్లస్ 2 లేదా మైనస్ 2 శ్రేణితో 4 శాతం వద్ద ద్రవ్యోల్బణం లక్ష్యాలను కొనసాగించడంపై దృష్టి.
  • 2017 జూలై 28కి 392.9 బిలియన్ డాలర్లకు చేరిన భారత్ విదేశీ మారకద్రవ్య నిల్వలు.
  • ఆర్‌బీఐ తదుపరి పరపతి విధాన సమీక్ష 2017 అక్టోబర్ 3, 4 తేదీల్లో (ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాల్గవ ద్వైమాసిక సమావేశం) జరుగుతుంది.
క్విక్ రివ్యూ: ఏమిటి : రెపో రేటు పావు శాతం తగ్గింపు
ఎప్పుడు : ఆగస్టు 2
ఎవరు : రిజర్వు బ్యాంకు 
ఎక్కడ : ఆర్‌బీఐ పరపతి విధాన సమీక్షలో 

కేంద్రం నుంచి కొత్త ఈటీఎఫ్ ‘భారత్-22’‘భారత్-22’ పేరుతో కొత్త ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్ (ఈటీఎఫ్)ను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఇంధనం, ఎఫ్‌ఎంసీజీ, ఫైనాన్స్‌, బేస్ మెటల్స్, ఇండస్ట్రియల్, యుటిలిటీస్ రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న షేర్లతో భారత్-22ను నెలకొల్పినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆగస్టు 4న ప్రకటించారు. ఈ 22 షేర్లలో ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రభుత్వానికి వ్యూహాత్మక వాటా కలిగిన ప్రైవేటు కంపెనీలు వున్నాయి. ఎస్‌యూయూటీఐ (గతంలో యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాకు చెందిన విభాగం) ద్వారా ప్రభుత్వానికి ఎల్&టీ, యాక్సిస్ బ్యాంక్, ఐటీసీల్లో వ్యూహాత్మక వాటా వుంది. ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థలతో కూడిన సీపీఎస్‌ఈ ఈటీఎఫ్‌ను ఏర్పాటు చేసి, మూడు విడతలుగా ఆ యూనిట్లను విక్రయించడం ద్వారా రూ. 8,500 కోట్లను ప్రభుత్వం సమీకరించింది. 
భారత్-22 జాబితాలో ప్రభుత్వ రంగ బ్యాంకులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడాలు ఉన్నాయి. ప్రభుత్వ విధానానికి అనుగుణంగా పీఎస్‌యూ బ్యాంకుల్ని భారత్-22లో చేర్చారు. 
మ్యూచువల్ ఫండ్ యూనిట్లలో ఇన్వెస్టర్లు పెట్టుబడి చేసినట్లే.. ఈటీఎఫ్ యూనిట్లను కొనుగోలు చేయవచ్చు. ఈ యూనిట్లను కొనుగోలుచేయడం ద్వారా 22 బ్లూచిప్ కంపెనీల్లో ఏకమొత్తంగా ఇన్వెస్ట్ చేసినట్లవుతుంది. ప్రభుత్వం తొలుత ప్రవేశపెట్టిన సీపీఎస్‌ఈ ఈటీఎఫ్ ద్వారా ఇదే తరహాలో ఇన్వెస్టర్ల నుంచి 3 దశలుగా రూ. 8,506 కోట్లు సమీకరించింది. 
క్విక్ రివ్యూ: ఏమిటి : కొత్త ఈటీఎఫ్ భారత్ - 22
ఎప్పుడు : ఆగస్టు 4 
ఎవరు : కేంద్ర ప్రభుత్వం 

11.4 లక్షల పాన్‌కార్డులు డీయాక్టివేట్ దేశవాప్తంగా 11.4 లక్షల పాన్ కార్డులను కేంద్ర ప్రభుత్వం క్రియారహితం (డీయాక్టివేట్) చేసింది. అందులో కొన్నింటిని రద్దు కూడా చేసింది. ఆగస్టు 31లోపు ప్రతి పౌరుడు ఆధార్ కార్డుతో పాన్‌కార్డును అనుసంధానం చేసుకోవాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ సూచించిన విషయం తెలిసిందే. ఆలోపు ఆధార్ నంబరుతో అనుససంధానం చేయని పాన్‌కార్డులు చెల్లవని ఆర్థికమంత్రిత్వ శాఖ గతంలోనే సూచించింది. 
డీయాక్టివ్ అయిన పాన్‌కార్డుల్లో మీకార్డు ఉందో లేదో తెలుసుకోవాలంటే ఐటీ విభాగం ఇ- ఫిల్లింగ్ వెబ్‌సైట్‌ని సందర్శించండి. అందులో ’Know Your Pan’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే ఓ పేజీ వస్తుంది. అందులో నక్షత్రం గుర్తు ఉన్న ఖాళీలు అన్నీ జాగ్రత్తగా పూర్తిచేసి సబ్‌మిట్ చేయాలి. అప్పుడు మీ ఫోన్ నెంబర్ కి వన్ టైమ్ పాస్ వర్డ్ వస్తుంది. దానిని ఎంటర్ చేసి వాలిడేట్ బటన్ పై క్లిక్ చేయండి. అనంతరం మీ పాన్ కనుక డీ యాక్టివేట్ కాకపోయి ఉంటే ‘యాక్టివ్’ అని కనిపిస్తుంది. 
క్విక్ రివ్యూ: ఏమిటి : 11.4 లక్షల పాన్‌కార్డులు డియాక్టివేట్ 
ఎప్పుడు : ఆగస్టు 6
ఎవరు : కేంద్ర ప్రభుత్వం 
ఎందుకు : పాన్‌కార్డుల సమాచారం వడపోతలో భాగంగా 

ఐటీ రిటర్నుల్లో 25 శాతం వృద్ధిపెద్ద నోట్ల రద్దు (డీమోనిటైజేషన్) పరిణామాల అనంతరం ఆదాయ పన్ను రిటర్నులు (ఐటీఆర్) దాఖలు చేసే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. 2016-17 సంవత్సరానికి గాను 2.82 కోట్ల రిటర్నులు వచ్చినట్లు ఆదాయ పన్ను విభాగం తెలిపింది. ఇది అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో దాఖలైన 2.22 కోట్ల ఐటీఆర్‌లతో పోలిస్తే 25.3 శాతం అధికమని వివరించింది. ఆగస్టు 5 దాకా మొత్తం 2.82 కోట్ల రిటర్నులు దాఖలైనట్లు ఆదాయ పన్ను విభాగం పేర్కొంది. వాస్తవానికి ఐటీఆర్‌ల దాఖలుకు జూలై 31 ఆఖరు తేదీ అయినప్పటికీ.. కొన్ని వర్గాల కోసం ఆగస్టు 5 దాకా ప్రభుత్వం పొడిగించింది. 
వ్యక్తిగత ఆదాయ పన్నుకు సంబంధించి (కార్పొరేట్ ట్యాక్స్ కాకుండా) అడ్వాన్స్‌ ట్యాక్స్ వసూళ్లు ఆగస్టు 5 నాటికి 41.79 శాతం వృద్ధి నమోదు చేశాయి. 
క్విక్ రివ్యూ: ఏమిటి : ఐటీ రిటర్నుల్లో 25 శాతం వృద్ధి 
ఎప్పుడు : 2016-17లో 
ఎవరు : కేంద్ర ఆదాయ పన్నుల విభాగం 
ఎందుకు : పెద్ద నోట్ల రద్దు అనంతర పరిణామాలతో 

సైన్స్ అండ్ టెక్నాలజీ
తీర ప్రాంత అప్రమత్తతకు "సాగర్ వాణి" ప్రారంభం 
సముద్రంలోని వాతావరణ పరిస్థితులపై మత్స్యకారులు, తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం జూలై 29న సాగర్‌వాణి అనే వ్యవస్థను ప్రారంభించింది. The Integrated Information Dissemination System (IDS) వ్యవస్థతో దేశంలో తొలిసారి ప్రారంభించిన ఈ విధానం ద్వారా మత్య్స వృత్తిపై ఆధారపడిన 9.27 లక్షల మందికి సముద్ర రక్షణకు సంబంధించిన సమాచారం పంపుతారు. రేడియా, టీవీ, వాయిస్ కాలింగ్, సంక్షిప్త సందేశాలు, సామాజిక మాధ్యమాలు, మొబైల్ ఆప్స్ ద్వారా ప్రాంతీయ భాషల్లో సమాచారాన్ని చేరవేస్తారు. Indian National Centre for Ocean Information Services (INCOIS) ఈ వ్యవస్థను అభివృద్ధి చేసింది. 
క్విక్ రివ్యూ: ఏమిటి : సాగర్‌వాణి ప్రారంభం 
ఎప్పుడు : ఆగస్టు 1
ఎవరు : కేంద్ర ప్రభుత్వం 
ఎక్కడ : దేశవ్యాప్తంగా 
ఎందుకు : తీరప్రాంత ప్రజలకు సముద్ర రక్షణ సంబంధిత సమాచారం చేరవేసేందుకు

క్రీడలు
ఉసేన్ బోల్ట్ ఆఖరి పరుగుకు ప్రత్యేక బూట్లు
లండన్ ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ తర్వాత తాను రిటైరవుతున్నట్లు ప్రకటించిన జమైకన్ దిగ్గజ అథ్లెట్ ఉసేన్ బోల్ట్ ఆఖరి రేసుకు ప్రత్యేక బూట్లు సిద్ధమయ్యాయి. ప్రఖ్యాత షూ కంపెనీ ‘ప్యుమా’ బోల్ట్ వేగాన్ని, తేజాన్ని ఆవిష్కరించే విధంగా ఈ బూట్లను తయారు చేసింది. ఈ మేరకు ఆగస్టు 1న బోల్ట్ తల్లిదండ్రులు వెల్లెస్లీ, జెన్నిఫర్ బోల్ట్ ఈ బూట్లను అతనికి అందజేశారు. 
ఈ రెండు బూట్లు విభిన్న రంగుల్లో ఉన్నాయి. ఒక బూటు పర్పుల్ కలర్‌లో ఉంది. ఇది బోల్ట్ ఓనమాలు నేర్చుకున్న ‘విలియం నిబ్ హైస్కూల్’కు సంబంధించిన కలర్ కాగా... దీనిపై ఫరెవర్ (ఎప్పటికీ) అని రాసివుంది. మరో బూటుపై ఫాస్టెస్ట్ (వేగం) అని ఒమెగా సింబల్‌తో ఉంది. ఇది ముగింపునకు నిదర్శనమని ‘ప్యుమా’ సంస్థ తెలిపింది. ఈ రెండు షూలపై ప్రత్యేక రాతలు, గీతలు అతని కెరీర్ హైలైట్స్‌ను సూచిస్తాయి. రెండు సాక్స్ అతని ఘనతల్ని తెలిపేలా ప్రత్యేకంగా ఉన్నాయి. 
లండన్ ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భాగంగా ఆగస్టు 4న జరగనున్న రేసు బోల్ట్ కెరీర్‌లో చివరి పరుగుపందెం. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి
 : ఉసేన్ బోల్ట్ ఆఖరి రేసుకి ప్రత్యేక బూట్లు 
ఎప్పుడు : ఆగస్టు 4
ఎక్కడ : ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్, లండన్

నెమార్ కోసం 1,661 కోట్లు చెల్లించిన పీఎస్‌జీబ్రెజిల్ జట్టు కెప్టెన్, స్టార్ ప్లేయర్ నెమార్ జూనియర్ కోసం ఫ్రాన్స్‌కు చెందిన పారిస్ సెయింట్-జెర్మయిన్ (పీఎస్‌జీ) క్లబ్ జట్టు భారీ మొత్తం చెల్లించింది. ప్రొఫెషనల్ లీగ్‌‌సలో ప్రస్తుతం స్పెయిన్‌కు చెందిన బార్సిలోనా క్లబ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న నెమార్ ఇక నుంచి పీఎస్‌జీ జట్టుకు ఆడనున్నాడు. 2013లో బార్సిలోనా జట్టుతో చేరిన నెమార్ 2018 జూన్ వరకు బార్సిలోనాకు ఆడాల్సి ఉంది. అయితే నెమార్‌ను ఒప్పందం గడువు పూర్తికాకముందే బదిలీ చేయాలంటే తమకు 22 కోట్ల 20 లక్షల యూరోలు (రూ.1,661 కోట్లు) చెల్లించాలని పీఎస్‌జీ జట్టుకు బార్సిలోనా షరతు విధించింది. దీనికి అంగీకరించిన పీఎస్‌జీ జట్టు ఈ మొత్తాన్ని బార్సిలోనాకు చెల్లించి నెమార్‌ను కొనుగోలు చేసింది. 2022 వరకు పీఎస్‌జీ జట్టుకు ఆడనున్న నెమార్‌కు ఆ క్లబ్ ఏడాదికి 4 కోట్ల 50 లక్షల యూరోలు (రూ. 336 కోట్లు) వేతనంగా చెల్లించనుంది. దీంతో ఇది ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలో ఖరీదైన బదిలీగా నిలిచింది. 
క్విక్ రివ్యూ: ఏమిటి : ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలో ఖరీదైన బదిలీ 
ఎప్పుడు : ఆగస్టు 4
ఎవరు : నెమార్ కోసం రూ.1,661 కోట్లు చెల్లించిన పీఎస్‌జీ 
ఎందుకు : బార్సిలోనా నుంచి పారిస్ సెయింట్-జెర్మయిన్ జట్టుకి బదిలీ కోసం 

ఆసియా షాట్‌గన్ షూటింగ్‌లో అంకుర్‌కు స్వర్ణం 

ఆసియా షాట్‌గన్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్ అంకుర్ మిట్టల్ స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నాడు. కజకిస్తాన్‌లోని అస్తానాలో జరిగిన ఈ టోర్నీలో భాగంగా ఆగస్టు 5న జరిగిన పురుషుల డబుల్ ట్రాప్ ఈవెంట్‌లో అంకుర్ వ్యక్తిగత విభాగంతోపాటు, టీమ్ విభాగంలోనూ భారత్‌కు పసిడి పతకాన్ని అందించాడు. ఆరుగురు పాల్గొన్న వ్యక్తిగత విభాగం ఫైనల్లో అంకుర్ 71 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలిచాడు. ఖాలిద్ అల్కాబి (యూఏఈ-70 పాయింట్లు) రజతం, సైఫ్ అల్‌షమ్సీ (యూఏఈ-53 పాయింట్లు) కాంస్యం సాధించారు. అంకుర్, సంగ్రామ్ దహియా, మొహమ్మద్ అసబ్‌లతో కూడిన భారత బృందానికి స్వర్ణం దక్కింది. ఈ ఏడాది మెక్సికో, న్యూఢిల్లీలలో జరిగిన ప్రపంచకప్‌లలో అంకుర్ స్వర్ణ, రజత పతకాలు గెలిచాడు. 
క్విక్ రివ్యూ: ఏమిటి : ఆసియా షాట్‌గన్ షూటింగ్ చాంపియన్‌షిప్ 
ఎప్పుడు : ఆగస్టు 5 
ఎవరు : పురుషుల డబుల్ ట్రాప్ ఈవెంట్‌లో అంకుర్ మిట్టల్‌కు స్వర్ణం 
ఎక్కడ : ఆస్తానా, కజకిస్తాన్ 

ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఫరాకు స్వర్ణం 
లండన్‌లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో బ్రిటిష్ అథ్లెటిక్స్ దిగ్గజం మొహమ్మద్ ఫరా స్వర్ణం సాధించాడు. ఆగస్టు 5న జరిగిన పురుషుల 10 వేల మీటర్ల ఫైనల్ రేసులో 34 ఏళ్ల ఫరా 26 నిమిషాల 49.51 సెకన్లలో గమ్యానికి చేరి విజేతగా నిలిచాడు. తద్వారా ప్రపంచ చాంపియన్‌షిప్ చరిత్రలో 10 వేల మీటర్ల విభాగంలో వరుసగా మూడో స్వర్ణాన్ని సొంతం చేసుకున్నాడు. 
క్విక్ రివ్యూ: ఏమిటి : ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ 
ఎప్పుడు : ఆగస్టు 5
ఎవరు : పురుషుల 10 వేల మీటర్ల రేసులో మొహమ్మాద్ ఫరాకు స్వర్ణం 
ఎక్కడ : లండన్ 

డబ్ల్యూబీవో ‘డబుల్’ టైటిల్ విజేత విజేందర్భారత ప్రొఫెషనల్ బాక్సర్ విజేందర్ సింగ్.. చైనా ప్రత్యర్థి జుల్పికర్ మైమైటియాలితో ఆగస్టు 5న జరిగిన బౌట్‌లో 3-0తో విజయం సాధించాడు. దీంతో డబ్ల్యూబీవో ఆసియా పసిఫిక్ సూపర్ మిడిల్ వెయిట్ టైటిల్‌తో పాటు ప్రత్యర్థికి చెందిన ఓరియంటల్ సూపర్ మిడిల్ వెయిట్ టైటిల్‌ను విజేందర్ తన ఖాతాలో వేసుకున్నాడు. 31 ఏళ్ల విజేందర్‌కు ఇది వరుసగా తొమ్మిదో విజయం. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి :
 డబ్ల్యూబీవో టైటిల్ పోరు 
ఎప్పుడు : ఆగస్టు 6
ఎవరు : విజేత విజేందర్ సింగ్ 
ఎందుకు : చైనా బాక్సర్ జుల్పికర్ మైమైటియాలిని ఓడించిన విజేందర్(3-0 తేడాతో). 

చివరి 100 మీటర్ల రేసులో బోల్ట్‌కు కాంస్యం 
జమైకా దిగ్గజం ఉసేన్ బోల్డ్ తన చివరి 100 మీటర్ల రేసులో కాంస్య పతకంతో సరిపెట్టుకున్నాడు. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భాగంగా ఆగస్టు 5న జరిగిన పురుషుల 100 మీటర్ల ఫైనల్ రేసులో ఉసేన్ బోల్డ్ 9.95 సెకన్లతో మూడో స్థానంలో నిలిచాడు. గాట్లిన్ 9.92 సెకన్లలో గమ్యానికి చేరుకొని విజేతగా నిలువగా... క్రిస్టియన్ కోల్మన్ 9.94 సెకన్లతో రెండో స్థానంలో నిలిచాడు. 
బోల్ట్ రికార్డులు 
ఒలింపిక్స్ (2008, 2012, 2016): 8 స్వర్ణాలు 
ప్రపంచ చాంపియన్‌షిప్ (2007, 2009, 2011, 2013, 2015, 2017): 11 స్వర్ణాలు, 2 రజతాలు, 1 కాంస్యం 
ఇతర అంతర్జాతీయ పతకాలు: 4 స్వర్ణాలు, 3 రజతాలు 
బోల్ట్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డులు
100 మీ. పరుగు: 9.58 సెకన్లు
200 మీ. పరుగు: 19.19 సెకన్లు
4×100 మీ. రిలే: 36.84 సెకన్లు (జమైకా జట్టులో సభ్యుడు) 
క్విక్ రివ్యూ: ఏమిటి : ఉసేన్ బోల్డ్ చివరి 100 మీటర్ల రేసు 
ఎప్పుడు : ఆగస్టు 5
ఎక్కడ : ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్, లండన్

ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో టోరి బోవికి స్వర్ణం ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో అమెరికాకు చెందిన అథ్లెట్ టోరి బోవీ స్వర్ణం సాధించింది. ఆగస్టు 7న జరిగిన మహిళల 100 మీటర్ల రేసులో ఆమె 10.85 సెకన్లలో లక్ష్యాన్ని చేరి విజేతగా నిలిచింది. ఒలింపిక్ స్వర్ణ పతక విజేత, ఫేవరేట్ ఎలైన్ థాంప్సన్ (జమైకా) 5వ స్థానంలో నిలిచింది. ఐవరీ కోస్ట్‌కు చెందిన మారి జోన్ రజతం, నెదర్లాండ్స్‌కు చెందిన షిప్పర్స్ కాంస్య పతకాలు గెలుచుకున్నారు. 
పురుషుల షాట్‌పుట్‌లో న్యూజిలాండ్‌కు చెందిన థామస్ వాల్ష్ గుండును 22.02 మీటర్ల దూరం విసిరి స్వర్ణం గెలుచుకున్నాడు.
క్విక్ రివ్యూ: ఏమిటి : ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ మహిళల 100 మీటర్ల విజేత 
ఎప్పుడు : ఆగస్టు 7
ఎవరు : టోరి బోవి (అమెరికా)
ఎక్కడ : లండన్ 

ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో రోజస్‌కు స్వర్ణంప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో తొలిసారి వెనిజులా ఖాతాలో స్వర్ణ పతకం చేరింది. మహిళల ట్రిపుల్ జంప్ ఈవెంట్‌లో వెనిజులా క్రీడాకారిణి యులీమార్ రోజస్ పసిడి పతకాన్ని దక్కించుకొని కొత్త చరిత్ర సృష్టించింది. రోజస్ 14.91 మీటర్ల దూరం దూకి విజేతగా నిలిచింది. కాటరీన్ ఇబార్‌గుయెన్ (కొలంబియా-14.89 మీటర్లు) రజతం, ఓల్గా రిపకోవా (కజకిస్తాన్-14.77 మీటర్లు) కాంస్యం గెల్చుకున్నారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి :
 ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ చరిత్రలో వెనిజులాకు తొలి స్వర్ణం 
ఎప్పుడు : ఆగస్టు 8 
ఎవరు : ట్రిపుల్ జంప్‌లో యులీమార్ రోజస్‌కు స్వర్ణం 
ఎక్కడ : లండన్ 

టెస్టుల్లో ఆల్‌రౌండర్ గా జడేజా
ఆగస్టు 8న విడుదల చేసిన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టెస్టు ర్యాంకింగ్‌‌స ఆల్‌రౌండర్ల విభాగంలో జడేజా అగ్రస్థానం అందుకున్నాడు. జడేజా 438 పాయింట్లతో తొలిస్థానం కైవసం చేసుకోగా ఇప్పటిదాకా ఈ స్థానంలో ఉన్న షకీబ్ ఉల్ హసన్ (బంగ్లాదేశ్) 431 పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయాడు. బౌలర్ల ర్యాంకింగ్‌‌సలోనూ జడేజా టాప్ ర్యాంక్‌లో ఉన్నాడు. 
బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్‌‌సలో పుజారా (888 పాయింట్లు) మూడో స్థానంలో, విరాట్ కోహ్లి (813 పాయింట్లు) ఐదో స్థానంలో, రహానే (776 పాయింట్లు) ఆరో స్థానంలో ఉన్నారు. స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా), జో రూట్ (ఇంగ్లండ్) వరుసగా తొలి రెండు ర్యాంక్‌ల్లో ఉన్నారు. 
క్విక్ రివ్యూ: ఏమిటి : ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్
ఎప్పుడు : ఆగస్ట్ 8 
ఎవరు : ఆల్‌రౌండర్ల విభాగంలో అగ్రస్థానంలో జడేజా 

వార్తల్లో వ్యక్తులు
ఢిల్లీ రేడియా కేంద్రం డెరైక్టర్‌గా శైలజ
ఢిల్లీ రేడియో (ఆకాశవాణి) కేంద్రం తొలి మహిళా డెరైక్టర్‌గా శైలజా సుమన్ నియమితులయ్యారు. శైలజ 35 ఏళ్లుగా ఆకాశవాణి, దూరదర్శన్‌లో వివిధ హోదాల్లో పనిచేశారు. శైలజ ఆధ్వర్యంలో రూపొందించిన పలు కార్యక్రమాలకు ప్రతిష్టాత్మక అవార్డులు వచ్చాయి. విజయవాడలో దూరదర్శన్ సప్తగిరి కేంద్రం పూర్తి స్థాయిలో ఏర్పడేందుకు ఆమె విశేష కృషి చేశారు.
క్విక్ రివ్యూ: 
ఏమిటి :
 ఢిల్లీ రేడియో కేంద్రం తొలి మహిళా డెరైక్టర్ 
ఎప్పుడు : ఆగస్టు 2
ఎవరు : శైలజా సుమన్
ఎక్కడ : ఢిల్లీ 

ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన వెంకయ్యనాయుడు ఎన్డీయే అభ్యర్థి ముప్పవరపు వెంకయ్యనాయుడు (68) భారత 14వ ఉప రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. ఆగస్టు 5న జరిగిన ఎన్నికలో విజయానికి 381 ఓట్లు అవసరమవగా.. 516 ఓట్లతో (68 శాతం) ఆయన ఘన విజయం సాధించారు. విపక్షాల అభ్యర్థిగా బరిలో దిగిన గోపాలకృష్ణ గాంధీకి 244 ఓట్లు దక్కాయి. మొత్తం 771 ఓట్లు పోలవగా 11 ఓట్లు చెల్లనివిగా తేలాయి. విజయం అనంతరం మాట్లాడిన వెంకయ్య.. ప్రజాస్వామ్య విలువలు కాపాడటంలో, రాజ్యసభ ఔన్నత్యాన్ని పెంచటంలో చిత్తశుద్ధితో పనిచేస్తానని అన్నారు.

నీతి ఆయోగ్ వైస్ చైర్మన్‌గా రాజీవ్ నీతి ఆయోగ్ కొత్త ఉపాధ్యక్షుడిగా ప్రముఖ ఆర్థికవేత్త డాక్టర్ రాజీవ్ కుమార్‌ను ప్రభుత్వం ఆగస్టు 5న నియమించింది. ప్రస్తుత ఉపాధ్యక్షుడు అరవింద్ పనగడియా ఈ పదవి నుంచి వైదొలగి, తాను అధ్యాపకుడిగా పనిచేసిన కొలంబియా వర్సిటీకి తిరిగి వెళ్లిపోతానని ఆగస్టు 1న ప్రకటించడంతో.. కొత్త ఉపాధ్యక్షుడిని నియమించారు. పనగడియా ఆగస్టు 31వరకు నీతి వైస్ చైర్మన్‌గా ఉంటారు. ఆ తర్వాత రాజీవ్ బాధ్యతలు చేపడతారు. 
నీతి వైస్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్న రాజీవ్ ఆర్థిక శాస్త్రంలో ఆక్స్‌ఫర్డ్ వర్సిటీ, లక్నో వర్సిటీల నుంచి పీహెచ్‌డీ పట్టాలు పుచ్చుకున్నారు. ప్రస్తుతం సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్(సీపీఆర్)లో సీనియర్ ఫెలోగా ఉన్నారు. ఆయన ఇదివరకు భారత వాణిజ్య, పరిశ్రమల సమాఖ్య(ఫిక్కీ) ప్రధాన కార్యదర్శిగా, ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనమిక్ రిలేషన్స్‌(ఐసీఆర్‌ఐఈఆర్) డెరైక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు. 2006-2008 మధ్య నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డు సభ్యుడిగా ఉన్నారు. భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ)లో ప్రధాన ఆర్థికవేత్తగానూ పనిచేసిన రాజీవ్ ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్, భారత పరిశ్రమల, ఆర్థిక మంత్రిత్వ శాఖల్లో ఉన్నత పదవులు నిర్వహించారు. రియాద్‌లోని కింగ్ అబ్దుల్లా పెట్రోలియం స్టడీస్ అండ్ రీసెర్చ్ సెంటర్, జకార్తాలోని ఎకనమిక్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఆసియాన్ అండ్ ఆసియా, స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ తదితర జాతీయ, అంతర్జాతీయ సంస్థల బోర్డులలో ప్రస్తుతం సభ్యుడిగా ఉన్నారు.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ 
ఎప్పుడు : ఆగస్టు 5 
ఎవరు : డాక్టర్ రాజీవ్ కుమార్
ఎందుకు : ఆగస్టు 31న అరవింద్ పనగడియా కొలంబియా యూనివర్సిటీకి తిరిగి వెళ్లిపోతున్న నేపథ్యంలో 

ఏపీ ప్రభుత్వ సలహాదారు పదవికి శ్రీధరన్ రాజీనామా మెట్రో రైలు ప్రాజెక్టుల పితామహుడు శ్రీధరన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా చేశారు. విజయవాడలో లైట్ మెట్రో నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపడుతున్న నేపథ్యంలో జూలై 5వ తేదీన శ్రీధరన్ ముఖ్యమంత్రికి లేఖ రాస్తూ లైట్ మెట్రో రైలు (ఎల్‌ఆర్‌టీ) విజయవాడకు సరిపోదని, ఇప్పుడున్న స్థితిలో మెట్రోయే సరైనదని పేర్కొన్నారు. అయినా పట్టించుకోని ముఖ్యమంత్రి ఎల్‌ఆర్‌టీ కోసం కేఎఫ్‌డబ్ల్యూతో సర్వే చేయిస్తుండడంతో మనస్తాపం చెందిన శ్రీధరన్ జూలై 12న ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా చేస్తూ లేఖ పంపారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : 
ఏపీ ప్రభుత్వ సలహాదారు పదవికి శ్రీధరన్ రాజీనామా
ఎప్పుడు : జూలై 12 
ఎవరు : మెట్రో రైలు ప్రాజెక్టుల పితామహుడు

ప్రపంచ బ్యాంకు ఈడీగా ఐఏఎస్ అధికారిణి అపర్ణ
గుజరాత్ కేడర్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారిణి ఎస్.అపర్ణ ప్రపంచ బ్యాంకులో కార్యనిర్వాహక సంచాలకులు(ఈడీ)గా ఆగస్టు 5న నియమితులయ్యారు. ఆమె ప్రస్తుతం గుజరాత్ సీఎంకు ముఖ్యకార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈడీ హోదాలో భారత్, బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంకలకు ప్రపంచ బ్యాంకులో ప్రాతినిథ్యం వహిస్తారు.

పేసర్ శ్రీశాంత్‌పై నిషేధం ఎత్తివేత 
స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో పేస్‌బౌలర్ శ్రీశాంత్‌పై బీసీసీఐ విధించిన జీవితకాల నిషేధాన్ని కేరళ హైకోర్టు ఎత్తివేసింది. అలాగే శ్రీశాంత్‌కి వ్యతిరేకంగా బీసీసీఐ తీసుకున్న చర్యలన్నీ జస్టిస్ మొహమ్మద్ ముష్తాక్ రద్దు చేశారు. 2013 ఐపీఎల్ ఆరో సీజన్‌లో ఉద్దేశపూర్వకంగా ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడనే కారణంతో క్రికెట్ బోర్డు శ్రీశాంత్‌పై జీవితకాల నిషేధం విధించింది. అయితే ఈ విషయంలో తనను ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు నిర్దోషిగా పేర్కొన్నప్పటికీ బోర్డు మాత్రం తన వైఖరి మార్చుకోలేదని గతేడాది శ్రీశాంత్ కేరళ కోర్టులో కేసు వేశాడు. దీంతో బీసీసీఐ కూడా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. సెషన్స్‌ కోర్టు ఇచ్చిన తీర్పు... తమ అంతర్గత క్రమశిక్షణ కమిటీ నిర్ణయాన్ని ప్రభావితం చేయలేదని పేర్కొంది. తమ విచారణలో అతడు దోషిగానే తేలాడని స్పష్టం చేసింది. 
క్విక్ రివ్యూ: ఏమిటి : శ్రీశాంత్‌పై జీవితకాల నిషేధం ఎత్తివేత
ఎప్పుడు : ఆగస్టు 7
ఎవరు : కేరళ హైకోర్టు 
ఎందుకు : బీసీసీఐ విధించిన నిషేధాన్ని ఎత్తివేసిన కోర్టు 

45వ సీజేఐగా జస్టిస్ దీపక్ మిశ్రా45వ భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా జస్టిస్ దీపక్ మిశ్రా (63)ను నియమిస్తూ న్యాయమంత్రిత్వ శాఖ ఆగస్టు 8న ఉత్తర్వులు జారీ చేసింది. ఆగస్టు 28న పదవీ విరమణ చేయనున్న జస్టిస్ జేఎస్ ఖేహర్ జస్టిస్ దీపక్ మిశ్రాను తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా నియమించాల్సిందిగా జూలైలో న్యాయ మంత్రిత్వ శాఖకు సిఫారసు చేశారు. ఆయన 13 నెలలపాటు ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగుతారు. 
సీజేఐ పదవిని చేపట్టనున్న మూడో ఒడిశా వ్యక్తి జస్టిస్ దీపక్ మిశ్రా. గతంలో ఒడిశాకు చెందిన జస్టిస్ రంగనాథ్ మిశ్రా, జస్టిస్ గోపాల వల్లభ పట్నాయక్‌లు సీజేఐలుగా పనిచేశారు. 
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మిశ్రా ఇచ్చిన కీలక తీర్పులు..

  • 1993 నాటి ముంబై పేలుళ్ల కేసులో దోషి ఉగ్రవాది యాకుబ్ మెమన్‌కు ఉరిశిక్ష అమలు విషయంలో అర్ధరాత్రి ఒంటిగంటకు సుప్రీంకోర్టులో విచారణ జరిపిన ధర్మాసనానికి జస్టిస్ మిశ్రా నేతృత్వం వహించారు.
  • దేశాన్ని కుదిపేసిన 2012 డిసెంబరు 16 నాటి ఢిల్లీలో నిర్భయపై క్రూరమైన అత్యాచారం కేసులో నలుగురు దోషులకు ఢిల్లీ హైకోర్టు విధించిన మరణశిక్షను సమర్థించారు.
  • సినిమా ప్రదర్శనకు ముందు థియేటర్లలో జాతీయగీతం ప్రదర్శించాలని తీర్పునిచ్చింది జస్టిస్ మిశ్రానే.
  • ప్రాథమిక సమాచార నివేదిక (ఎఫ్‌ఐఆర్) నమోదైన 24 గంటల్లోపు వాటిని వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచాలని జస్టిస్ దీపక్ మిశ్రా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించారు. 1993 నాటి ముంబై పేలుళ్ల కేసులో దోషి ఉగ్రవాది యాకుబ్ మెమన్‌కు ఉరిశిక్ష అమలు విషయంలో అర్ధరాత్రి ఒంటిగంటకు సుప్రీంకోర్టులో విచారణ జరిపిన ధర్మాసనానికి జస్టిస్ మిశ్రా నేతృత్వం వహించారు.
  • దేశాన్ని కుదిపేసిన 2012 డిసెంబరు 16 నాటి ఢిల్లీలో నిర్భయపై క్రూరమైన అత్యాచారం కేసులో నలుగురు దోషులకు ఢిల్లీ హైకోర్టు విధించిన మరణశిక్షను సమర్థించారు.
  • సినిమా ప్రదర్శనకు ముందు థియేటర్లలో జాతీయగీతం ప్రదర్శించాలని తీర్పునిచ్చింది జస్టిస్ మిశ్రానే.
  • ప్రాథమిక సమాచార నివేదిక (ఎఫ్‌ఐఆర్) నమోదైన 24 గంటల్లోపు వాటిని వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచాలని జస్టిస్ దీపక్ మిశ్రా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించారు.
క్విక్ రివ్యూ: ఏమిటి : 45వ భారత ప్రధాన న్యాయమూర్తి నియామకం
ఎప్పుడు : ఆగస్టు 8
ఎవరు : జస్టిస్ దీపక్ మిశ్రా 
ఎందుకు : ప్రస్తుత సీజేఐ జస్టిస్ ఖేహర్ పదవీ విరమణ సందర్భంగా

అవార్డులుదేవేంద్ర జఝరియాకు రాజీవ్ ఖేల్త్న్ర భారత పారా అథ్లెట్ దేవేంద్ర జఝరియా భారత అత్యున్నత క్రీడాపురస్కారం ‘రాజీవ్ ఖేల్త్న్ర’ అందుకోనున్నాడు. ఈ అవార్డు చరిత్రలో ఓ పారాలింపియన్ ఎంపికవడం ఇదే తొలిసారి. అవార్డుల కమిటీ ఇతనితో పాటు భారత హాకీ మాజీ కెప్టెన్ సర్దార్ సింగ్‌ను ఖేల్త్న్ర కోసం సిఫార్సు చేసింది. దేవేంద్ర జఝరియా పారాలింపిక్స్ క్రీడల్లో రెండు స్వర్ణ పతకాలు(2004, 2016) గెలుపొందాడు. ఈ మేరకు రిటైర్డ్ జస్టిస్ సీకే ఠక్కర్ నేతృత్వంలోని అవార్డుల కమిటీ జావెలిన్ త్రోయర్ జఝరియాకు ఖేల్త్న్రలో తొలి ప్రాధాన్యమిచ్చింది. మరో 17 మందిని ‘అర్జున’ అవార్డుకు నామినేట్ చేసింది. తెలుగు క్రీడాకారులు సాకేత్ మైనేని, వెన్నం జ్యోతి సురేఖ ఈ జాబితాలో ఉన్నారు. మహిళల వన్డే ప్రపంచకప్‌లో చెలరేగిన హర్మన్‌ప్రీత్ కౌర్, టెస్టు క్రికెటర్ చతేశ్వర్ పుజారాలు ‘అర్జున’కు నామినేట్ అయ్యారు. త్వరలోనే కేంద్ర క్రీడాశాఖ ఈ జాబితాకు ఆమోదం తెలపగానే జాతీయ క్రీడా దినోత్సవమైన మేజర్ ధ్యాన్‌చంద్ జయంతి (ఆగస్టు 29) రోజు అవార్డులను ప్రదానం చేస్తారు.
అర్జున అవార్డు నామినీల జాబితా

జ్యోతి సురేఖ (ఆర్చరీ)చౌరాసియా (గోల్ఫ్)
సాకేత్ మైనేని (టెన్నిస్)పుజారా (క్రికెట్)
ఖుష్బీర్ కౌర్ (అథ్లెటిక్స్)హర్మన్‌ప్రీత్ కౌర్ (క్రికెట్)
అరోకిన్ రాజీవ్ (అథ్లెటిక్స్)ప్రశాంతి సింగ్ (బాస్కెట్‌బాల్)
దేవేంద్రో సింగ్ (బాక్సింగ్)ఓయినమ్ బెంబెం దేవి (ఫుట్‌బాల్)
ఎస్వీ సునీల్ (హాకీ)జస్వీర్‌సింగ్ (కబడ్డీ)
ప్రకాశ్ (షూటింగ్)అమల్‌రాజ్ (టేబుల్ టెన్నిస్)
సత్యవర్త్ కడియన్ (రెజ్లింగ్)వరుణ్ భటి (పారా అథ్లెటిక్స్)
మరియప్పన్ తంగవేలు(పారా అథ్లెటిక్స్)

ఢిల్లీ మెట్రోకు హరిత మెట్రో అవార్డు భారత్‌లో తొలి హరిత మెట్రో అవార్డుని ఢిల్లీ మెట్రో కైవసం చేసుకుంది. ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన జాతీయ గ్రీన్ మెట్రో సిస్టమ్స్ సమావేశంలో ఇండియన్ గ్రీన్ బిల్డంగ్ కౌన్సిల్(ఐజీబీసీ) ఈ అవార్డుని ఢిల్లీ మెట్రోకి ప్రకటించింది. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) ఫేస్ - 3లో స్టేషన్లు, డిపోలు, సబ్ స్టేషన్‌లను హరిత ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించినందుకు గాను ఈ అవార్డు ఇస్తున్నట్లు పేర్కొంది.
క్విక్ రివ్యూ: ఏమిటి : ఢిల్లీ మెట్రోకు హరిత మెట్రో అవార్డు 
ఎప్పుడు : ఆగస్టు 2
ఎవరు : ఐజీబీసీ
ఎక్కడ : న్యూఢిల్లీ 
ఎందుకు : హరిత ప్రమాణాలు పాటించినందుకు గాను 

ట్రిపుల్ ఐటీ హెచ్‌వోడీకి భారత్ విద్యారత్న అవార్డుబాసరలోని ట్రిపుల్ ఐటీలో రసాయన శాస్త్ర విభాగం హెచ్‌వోడీ డాక్టర్ రవి వరాల అత్యున్నత భారత్ విద్యారత్న అవార్డుకు ఎంపికయ్యారు. ఢిల్లీలో ఆగస్టు 5న జరిగిన ఓ కార్యక్రమంలో రవి వరాల ఇంటర్‌నేషనల్ బిజినెస్ కౌన్సెల్ ఆధ్వర్యంలో అవార్డు అందుకున్నారు. విద్యాబోధన క్షేత్రంలో తనదైన నైపుణ్యం ప్రదర్శించిన వారికి ఈ అవార్డు అందజేస్తారు. 
క్విక్ రివ్యూ: ఏమిటి : భారత్ విద్యారత్న అవార్డు
ఎప్పుడు : ఆగస్టు 5 
ఎవరు : డాక్టర్ రవి వరాల
ఎక్కడ : న్యూఢిల్లీలో 

గోరటి, సుద్దాలకు జాలాది పురస్కారం
సినీ కవి డాక్టర్ జాలాది పేరిట ఏటా ప్రదానం చేస్తున్న జాతీయ ప్రతిభా పురస్కారాలకు.. ఈ ఏడాది సుప్రసిద్ధ ప్రజాకవి, గాయకుడు గోరటి వెంకన్న, ప్రముఖ సినీ గేయ రచయిత డాక్టర్ సుద్దాల అశోక్‌తేజను ఎంపిక చేసినట్లు ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఆగస్టు 9న విశాఖలోని సిరిపురం ‘వుడా చిల్డ్రన్ ఎరీనా’లో నిర్వహించే జాలాది జయంతి ఉత్సవాల్లో ఈ అవార్డులు ప్రదానం చేస్తారు.
క్విక్ రివ్యూ: ఏమిటి : జాలాది జాతీయ ప్రతిభా పురస్కారాలు 
ఎప్పుడు : ఆగస్టు 6 
ఎవరు : గోరటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ 
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్ 

ధ్యాన్‌చంద్ పురస్కారానికి సిఫార్సైన హకీమ్ భారత ఫుట్‌బాల్ దిగ్గజాలలో ఒకరిగా పేరు తెచ్చుకున్న హైదరాబాదీ సయ్యద్ షాహిద్ హకీమ్‌కు ప్రతిష్టాత్మక ‘ధ్యాన్‌చంద్’ పురస్కారం లభించనుంది. పుల్లెల గోపీచంద్ నేతృత్వంలోని కమిటీ ఆయన పేరును ఈ అవార్డుకు నామినేట్ చేసింది. ఆటగాడిగా, కోచ్‌గా, పరిపాలకుడిగా వివిధ దశల్లో హకీమ్ చేసిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు దక్కనుంది. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరుకు చెందిన సీనియర్ బ్యాడ్మింటన్ కోచ్ గంగుల వెంకట ప్రసాద్ కూడా జీవితకాల సాఫల్య పురస్కారం (కోచింగ్) అందుకోనున్నారు. అవార్డుల కమిటీ మొత్తం ముగ్గురి పేర్లను ‘ద్రోణాచార్య’ అవార్డుకు, ఐదుగురి పేర్లను లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ (కోచింగ్) అవార్డుకు, మరో ముగ్గురి పేర్లను ధ్యాన్‌చంద్ అవార్డుకు సిఫారసు చేసింది. కేంద్ర క్రీడా శాఖ అధికారిక ఆమోద ముద్ర వేసిన తర్వాత ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా వీటిని అందజేస్తారు. 

దేవ్‌పటేల్‌కు గేమ్ చేంజర్స్ అవార్డుస్లమ్‌డాగ్ మిలియనీర్ చిత్రం ద్వారా ప్రత్యేక గుర్తింపు సాధించిన దేవ్ పటేల్ ప్రతిష్టాత్మక ఆసియా సొసైటీ గేమ్ చేంజర్స్ అవార్డుకు ఎంపికయ్యాడు. 2017 సంవత్సరానికి గాను మరో తొమ్మిది మందితో కలిసి ఆయన ఈ అవార్డు అందుకోనున్నాడు. 2017 నవంబర్‌లో ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో అవార్డుల ప్రదానోత్సవం జరగుతుంది. 
కేవలం ఐదారేళ్ల వ్యవధిలోనే దేవ్ పటేల్ ఓ గొప్ప స్టార్‌గా అవతరించాడని, సినిమాలతోపాటు టీవీ షోలలో కూడా తనదైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడని, కేవలం కథానాయకుడిగానేకాదు.. భారత ప్రేక్షకులకు, పాశ్చాత్య దేశాల ప్రేక్షకులకు మధ్య వారధిని నిర్మించాడని పురస్కార గ్రహీతల ఎంపిక కమిటీ వ్యాఖ్యానించింది. ఇక సేవా కార్యక్రమాల కోసం దేవ్‌పటేల్ చేస్తున్న ఖర్చు కూడా చాలా ఎక్కువేనని, అనాథ పిల్లలను ఆదుకునేందుకు ఇప్పటిదాకా 2,50,000 డాలర్లను దేవ్ ఖర్చుచేయడం తమను ఎంతగానో ఆకర్షించిందని జ్యూరీ వ్యాఖ్యానించింది. 
క్విక్ రివ్యూ: ఏమిటి : దేవ్‌పటేల్‌కు ఆసియా సొసైటీ గేమ్ చేంజర్స్ అవార్డు
ఎప్పుడు : ఆగస్టు 8
ఎవరు : ఆసియా సొసైటీ 

భారత వ్యాపారవేత్తకు యూఏఈ పురస్కారంజైళ్లలో మగ్గుతున్న ఖైదీలను విడిపించడంలో ప్రత్యేక చొరవ చూపిన భారత వ్యాపారవేత్త ఫిరోజ్ మర్చెంట్‌కు యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కు చెందిన ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది. ఆయన ఇటీవల యూఏఈ ఉపప్రధాని హెచ్‌హెచ్ షేఖ్ నుంచి కమ్యూనిటీ సర్వీస్ మెడల్‌ను స్వీకరించారు.


అంతర్జాతీయంఅమెరికాపై క్షిపణి దాడి చేస్తాం: ఉత్తర కొరియా  పసిఫిక్ మహాసముద్రంలో అమెరికా వ్యూహాత్మక సైనిక స్థావరమైన గ్వామ్ ద్వీపం సమీపంలో క్షిపణి దాడి చేస్తామని ఉత్తర కొరియా హెచ్చరించింది. తమ క్షిపణి అభివృద్ధి కార్యక్రమంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఉత్తర కొరియా తీవ్రంగా ప్రతిస్పందించింది. గ్వామ్ ద్వీపంపై మధ్యశ్రేణి ఖండాంతర క్షిపణి హ్వాసంగ్-12తో దాడికి ప్రణాళికలు రచిస్తున్నట్లు ఓ సైనికాధికారిని ఉటంకిస్తూ ఉత్తర కొరియా అధికారిక వార్తాసంస్థ కేసీఎన్‌ఏ పేర్కొంది. తమ అధినేత కిమ్ జాంగ్ ఉన్ ఆదేశాలు ఇచ్చిన మరుక్షణం అన్ని వైపుల నుంచి గ్వామ్‌పై విరుచుకుపడతామని తెలిపింది. 
మరోవైపు ఉత్తర కొరియా హెచ్చరికలపై ట్రంప్ దీటుగా స్పందించారు. అణ్వాయుధాలను ఆధునికీకరించే ఫైలుపైనే అధ్యక్షుడిగా తొలి సంతకాన్ని పెట్టానని.. ప్రస్తుతం అణ్వాయుధాల విభాగంలో అమెరికా ఎన్నడూ లేనంత శక్తిమంతంగా, బలంగా ఉందని ఆయన ట్వీట్ చేశారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : అమెరికాపై క్షిపణి దాడి చేస్తామని హెచ్చరిక 
ఎప్పుడు : ఆగస్టు 9
ఎవరు : ఉత్తర కొరియా 

భారత్‌లో సన్‌రైజ్ ప్రాజెక్టుకు బ్రిటన్ సాయంభారత్‌లోని మూరుమూల గ్రామాల్లో ఐదు స్వయం సమృద్ధి సౌర విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు మొత్తం 12 బ్రిటిష్, భారత విశ్వవిద్యాలయాలకు 7 మిలియన్ పౌండ్ల (రూ.58.09 కోట్లు)ను బ్రిటన్ ప్రభుత్వం గ్రాంటుగా అందజేసింది. ఇందులో భాగంగా భారత్‌లో సౌరశక్తి పరికరాల కోసం కొత్త తయారీ విధానాన్ని అభివృద్ధి చేస్తారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : భారత్‌లో సన్‌రైజ్ ప్రాజెక్టుకు 7 మిలియన్ పౌండ్ల సాయం 
ఎప్పుడు : ఆగస్టు 9
ఎవరు : బ్రిటన్ 
ఎందుకు : 5 స్వయం సమృద్ధి సౌర విద్యుత్ కేంద్రాల ఏర్పాటు 

80 దేశాలకు ఖతర్ వీసాఫ్రీ ఆఫర్భారత్ సహా 80 దేశాల నుంచి ఖతర్‌కు వచ్చే పర్యాటకులకు వీసాలు అవసరం లేదని ఆ దేశ ప్రభుత్వం ఆగస్టు 9న ప్రకటించింది. నాలుగు అరబ్బు దేశాల నుంచి నిషేధాన్ని ఎదుర్కొంటుండటం, 2022లో ఫుట్‌బాల్ ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచుకునేందుకు ఖతర్ ఈ నిర్ణయం తీసుకుంది. 
కొత్త వీసా విధానం ప్రకారం 33 దేశాల (వీటిలో ఎక్కువగా యూరప్ దేశాలు ఉన్నాయి) పర్యాటకులు ఖతర్‌కు వచ్చి 90 రోజులు ఉండొచ్చు. మరో 47 దేశాల ప్రజలు 30 రోజుల వరకు వీసా లేకుండా ఖతర్‌లో ఉండొచ్చు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : 80 దేశాలకు ఉచిత వీసా 
ఎప్పుడు : ఆగస్టు 9
ఎవరు : ఖతర్ 
ఎందుకు : ఆర్థిక వ్యవస్థను మెరుగు పరుచుకునేందుకు 

కాట్మాండులో 15వ బిమ్‌స్టెక్ మంత్రుల సమావేశం 15వ బిమ్‌స్టెక్ (Bay of Bengal Initiative for Multi-Sectoral Technical and Economic Cooperation-BIMSTEC) మంత్రుల సమావేశం నేపాల్ రాజధాని ఖాట్మండులో జరిగింది. ఆగస్టు 10, 11 తేదీల్లో జరిగిన ఈ సమావేశాన్ని నేపాల ప్రధానమంత్రి షేర్ బహదూర్ దుబా ప్రారంభించారు. ఈ సమావేశంలో వాణిజ్యం, తీవ్రవాదం, దౌత్య సంబంధాలపై చర్చించిన నేతలు.. 2016లో జరిగిన గోవా రిట్రీట్ తీర్మానాల అమలుకు మరింత సమర్థంగా కృషి చేయాలని నిర్ణయించారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : 15వ బిమ్‌స్టెక్ మంత్రుల సమావేశం 
ఎప్పుడు : ఆగస్టు 10, 11
ఎక్కడ : ఖాట్మండు, నేపాల్ 

గ్లోబల్ ట్యాంక్ రేసు నుంచి భారత్ ఔట్రష్యాలో జరిగిన అంతర్జాతీయ ‘ట్యాంక్ బైథ్లాన్’ పోటీల తదుపరి దశ నుంచి భారత ఆర్మీ జట్టు వైదొలిగింది. భారత ప్రధాన యుద్ధ ట్యాంకు టీ-90లో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. 
అంతర్జాతీయ ఆర్మీ గేమ్స్‌లో భాగంగా రష్యాలోని అలాబినో పర్వత ప్రాంతంలో జూలై 29న ప్రారంభమైన ఈ పోటీల్లో (28 ఈవెంట్లు ఉంటాయి) భారత్, చైనా, రష్యా సహా 19 దేశాలు పాల్గొన్నాయి. ఇందులో టాప్-12 జట్లు రెండో దశ రిలే రేసుకు ఎంపికయ్యాయి. భారత్ గత మూడేళ్లుగా ఈ పోటీల్లో పాల్గొంటోంది. ఈసారి పోటీల్లో భారత్ తొలిసారిగా టీ-90 ట్యాంకులతో బరిలో దిగింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ట్యాంకు బైథ్లాన్ 2017
ఎవరు : 19 దేశాలు
ఎక్కడ : రష్యాలో 

అంటార్కిటికాలో 100 అగ్నిపర్వతాల గుర్తింపు అంటార్కిటికాలో 100కు పైగా అగ్నిపర్వతాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. అంటార్కిటికా మంచు ఫలకానికి 2 కిలోమీటర్ల దిగువన ఈ పర్వతాలు ఉన్నాయని యూకేలోని ఎడిన్‌బర్గ్ విశ్వవిద్యాలయం పరిశోధకులు వెల్లడించారు. భూమిపై అతి ఎక్కువ అగ్నిపర్వతాలు గల ప్రాంతం ఇదేనని పేర్కొన్నారు. ఇవి 100 మీటర్ల నుంచి 3,850 మీటర్ల ఎత్తు ఉన్నాయని.. అన్ని పర్వతాలు దట్టమైన మంచు పొరలతో కప్పిఉన్నాయని తెలిపారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : అంటార్కిటికాలో 100కుపైగా అగ్నిపర్వతాల గుర్తింపు 
ఎప్పుడు : ఆగస్టు 13
ఎవరు : ఎడిన్‌బర్గ్ విశ్వవిద్యాలయం పరిశోధకులు
ఎక్కడ : యూకే 

ఉత్తర కొరియా దిగుమతులను నిలిపేసిన చైనాఐక్యరాజ్యసమితి కొత్త ఆంక్షల నేపథ్యంలో.. మిత్రదేశం ఉత్తరకొరియా నుంచి దిగుమతులను తాత్కాలికంగా నిషేధిస్తున్నట్లు చైనా ప్రకటించింది. బొగ్గు, ఇనుము, ముడి ఇనుము, సముద్ర ఆహార ఉత్పత్తుల దిగుమతులను ఆగస్టు 15 నుంచి నిషేధిస్తున్నామని వెల్లడించింది. గత ఫిబ్రవరి నుంచే బొగ్గు దిగుమతిని నిలిపివేయగా.. తాజాగా ఇనుము తదితరాలను నిలిపి వేస్తున్నామని చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ తమ వెబ్‌సైట్‌లో పేర్కొంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మధ్య మాటల యుద్ధం తీవ్రమైన నేపథ్యంలో చైనా ఈ నిర్ణయం తీసుకుంది. తాజా ఆంక్షలను అమలు చేయడం వల్ల చైనాకు సుమారు రూ.6,500 కోట్ల రెవెన్యూ నష్టం వాటిల్లనుందని అంచనా. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఉత్తర కొరియా దిగుమతుల నిలిపివేత 
ఎప్పుడు : ఆగస్టు 15
ఎవరు : చైనా 
ఎందుకు : ఐరాస ఆంక్షల నేపథ్యంలో 

పోలియో రహిత దేశంగా సోమాలియా సోమాలియాను పోలియో రహిత దేశంగా ఐక్యరాజ్య సమితి ఆగస్టు 14న ప్రకటించింది. గత మూడేళ్లుగా ఆ దేశంలో ఎలాంటి పోలియో కేసులు నమోదు కానందున.. ఐరాస ఈ మేరకు ప్రకటన చేసింది. ఆఫ్గనిస్తాన్, నైజీరియా, పాకిస్తాన్ దేశాల్లో మాత్రం ఇంకా పోలియో కేసులు నమోదు అవుతున్నాయని వెల్లడించింది.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : పోలియో రహిత దేశంగా సోమాలియా 
ఎప్పుడు : ఆగస్టు 14
ఎవరు : ఐక్యరాజ్య సమితి 
ఎందుకు : 3 ఏళ్లుగా నమోదు కాని పోలియో కేసులు 

ఉద్గారాల తగ్గింపుపై ఐరాసకు భారత్ హామీ కర్బన ఉద్గారాల తగ్గింపుపై క్యోటో ప్రోటోకాల్‌కు అనుగుణంగా 2020 నాటికి నిర్దేశించిన లక్ష్యాల సాధనకు కట్టుబడిఉన్నట్లు ఐక్యరాజ్యసమితికి ఆగస్టు 8న భారత్ హామీ పత్రం సమర్పించింది. 1997 డిసెంబర్‌లో కుదిరిన క్యోటో ప్రోటోకాల్ 2005 ఫిబ్రవరిలో అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం కర్బన ఉద్గారాల తగ్గింపు లక్ష్యాల సాధనకు ఆయా దేశాలు కట్టుబడాల్సిన తొలి కాలవ్యవధి 2008-2012. 
ఖతార్‌లోని దోహాలో 2012లో జరిగిన వాతావరణ సదస్సులో ఈ ఒప్పందానికి సవరణ తీసుకొచ్చారు. దీన్ని దోహా సవరణగా పిలుస్తారు. 2013 జనవరి నుంచి 2020 డిసెంబర్ వరకు సాధించాల్సిన లక్ష్యాలు, ఇతర అంశాలు ఇందులో ఉన్నాయి.

ఆసియాన్ 50వ వార్షికోత్సవ ప్రకటనఆగ్నేసియా దేశాల సమాఖ్య (ఆసియాన్) 50వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 8న సమాఖ్య నేతలు ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటన ఆసియాన్ 50వ వార్షికోత్సవాన్ని ఒక చారిత్రాత్మక సంఘటనగా, ఆసియాన్ సమాజ నిర్మాణం సాధించిన విజయంగా పేర్కొంది. 

జాతీయంబెంగళూరులో ఇండియన్ టెక్నాలజీ కాంగ్రెస్ - 2017  భారత్‌ను అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించడమే లక్ష్యంగా ఆగస్టు 9, 10 తేదీల్లో బెంగళూరులో భారత సాంకేతిక సదస్సు జరిగింది. ప్రపంచ దేశాలు నాలుగో పారిశ్రామిక విప్లవంవైపు దృష్టి సారించిన నేపథ్యంలో ఈ ఏడాది ‘పారిశ్రామిక విప్లవం 4.0’ పేరుతో సదస్సు నిర్వహించారు.భారత్ పారిశ్రామిక రంగంలో దూసుకెళ్లేందుకు 10 అంశాలు కీలకమని భావించిన నిర్వాహకులు కృత్రిమ మేధస్సు, ఇంటర్నెట్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, సిస్టమ్ ఇంజనీరింగ్ తదితర అంశాలపై చర్చలు జరిపారు. 
సదస్సులో భాగంగా వ్యవసాయంపై 200 మందితో వర్క్‌షాపు నిర్వహించారు. ఇక్రిశాట్, నాబార్డ్ ప్రతినిధులు పాల్గొన్న ఈ వర్క్‌షాపులో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, వ్యవసాయ ఉత్పత్తులు, కూలీలు, సాగులో జాగ్రత్తలపై చర్చలు జరిపారు.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఇండియన్ టెక్నాలజీ కాంగ్రెస్ - 2017
ఎప్పుడు : ఆగస్టు 9, 10 
ఎక్కడ : బెంగళూరు
ఎందుకు : సాంకేతికతతో పారిశ్రామిక, వ్యవసాయ ప్రగతిపై చర్చించేందుకు 

రిజర్వేషన్ల కోసం మరాఠాల భారీ ర్యాలీవిద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు సహా పలు డిమాండ్లతో మహారాష్ట్ర రాజధాని ముంబైలో మరాఠాలు ఆగస్టు 9న భారీ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 3 లక్షల మంది మరాఠా ప్రజలు కాషాయ టోపీలు, జెండాలతో ముంబైలో ‘మరాఠా క్రాంతి మోర్చా’ పేరుతో మౌన ప్రదర్శన నిర్వహించారు. 12 కోట్ల జనాభా కలిగిన మహారాష్ట్రలో మరాఠాలు 30 శాతం ఉన్నారు. 
ర్యాలీతో వెంటనే స్పందించిన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ప్రస్తుతం ఓబీసీలకు 605 కోర్సుల్లో ఇస్తున్న ఉపకారవేతనాలు, సౌకర్యాలను మరాఠా విద్యార్థులకు కూడా వర్తింపజేస్తున్నట్లు ప్రకటించారు. ఎస్సీ, బీసీలకు మాదిరిగానే మరాఠా విద్యార్థులకు హాస్టళ్లు నిర్మిస్తామన్నారు. మరాఠాలకు 16% రిజర్వేషన్లు కల్పించడాన్ని 2014లోనే బాంబే హైకోర్టు తిరస్కరించింది. 2003-04లోనూ మరాఠాలను ఓబీసీల్లో చేర్చాలన్న ప్రతిపాదనను వెనుకబడిన వర్గాల జాతీయ కమిషన్ తిరస్కరించింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : మరాఠా క్రాంతి మోర్చా ర్యాలీ 
ఎప్పుడు : ఆగస్టు 9
ఎవరు : మరాఠాలు 
ఎక్కడ : ముంబై, మహారాష్ట్ర
ఎందుకు : విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం 

ఐటీఐలకు బోర్డు ఏర్పాటు చేస్తాం: కేంద్రంసీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ తరహాలో పారిశ్రామిక శిక్షణ సంస్థల(ఐటీఐ)కు జాతీయ స్థాయిలో ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం తెలిపింది. ఈ మేరకు తాము పంపిన ప్రతిపాదనలకు మానవవనరుల మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపిందని కేంద్ర నైపుణ్యాభివృద్ధి, ఎంట్రప్రెన్యూర్‌షిప్ మంత్రి రాజీవ్ ప్రతాప్ రూఢీ ఆగస్టు 9న వెల్లడించారు. ఐటీఐల్లో ప్రాక్టికల్‌కు 70 శాతం, ఎంచుకున్న సబ్జెక్టుల్లో 30 శాతం మార్కులు ఉండేలా జాతీయస్థాయిలో ఉమ్మడి పరీక్ష నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ నిర్ణయం వల్ల ఏటా 23 లక్షల మంది విద్యార్థులకు సీబీఎస్‌ఈ బోర్డు తరహాలో సర్టిఫికెట్లు జారీచేయడం వీలవుతుంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఐటీఐలకు జాతీయ బోర్డు 
ఎప్పుడు : ఆగస్టు 9
ఎవరు : కేంద్ర ప్రభుత్వం 
ఎందుకు : సీబీఎస్‌ఈ తరహాలో ఐటీఐ విద్యార్థులకు సర్టిఫికెట్లు జారీ చేసేందుకు 

సైగలతో జాతీయ గీతాలాపనసైగలతో జాతీయ గీతం ఆలపిస్తున్న వీడియోను కేంద్ర మానవ వనరుల శాఖ సహాయ మంత్రి మహేంద్ర నాథ్ పాండే ఆగస్టు 10న విడుదల చేశారు. దివ్యాంగులు, ఇతరుల మధ్య తేడా చూపకూడదనే లక్ష్యంతోనే ఈ ప్రయత్నం చేశామని ఆయన తెలిపారు. జాతీయ గీతాన్ని సైగల భాషలో రూపొందించినందుకు మనమంతా గర్వించాలని.. మన దేశంలో సైగలను చాలా పురాతన కాలం నుంచే వాడుతున్నామని మంత్రి అన్నారు. 
గోవింద్ నిహలానీ దర్శకత్వం వహించిన 3.35 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో ఎర్రకోట ముందు బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ కొందరు దివ్యాంగులతో కలసి జాతీయగీతాన్ని సైగలతో ఆలపిస్తున్నట్లు కనిపిస్తుంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : సైగలతో జాతీయ గీలాపన వీడియో 
ఎప్పుడు : ఆగస్టు 10
ఎవరు : కేంద్ర ప్రభుత్వం 
ఎందుకు : దివ్యాంగులు, ఇతరుల మధ్య తేడా చూపకూడదనే లక్ష్యంతో

మదర్సాలు ‘పంద్రాగస్టు’ను చిత్రీకరించాలి: యూపీ ప్రభుత్వం ఆగస్టు 15న ఉత్తరప్రదేశ్‌లోని మదర్సాలు స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహించడమేకాక, కార్యక్రమాన్ని ఫొటోలు తీసి, వీడియోలో చిత్రీకరించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. జాతీయ సమైక్యతపై సాంస్కృతిక కార్యక్రమాలూ నిర్వహించాలని పేర్కొంది. ఆదేశాల్ని పాటించని మదర్సాలపై చర్యలు తీసుకుంటామని మైనారిటీ సంక్షేమ సహాయ మంత్రి బల్‌దేవ్ హెచ్చరించారు. 

వితంతువుల పరిస్థితుల అధ్యయనానికి కమిటీ ఆవాస కేంద్రాల్లోని నిరుపేద వితంతువులకు తగిన గౌరవం దక్కడంలేదని సుప్రీం కోర్టు ఆగస్టు 11న ఆవేదన వ్యక్తం చేసింది. అసలు వారికి సమాజంలో గౌరవంగా జీవించే హక్కు రద్దయిపోయినట్లు మనం ప్రవర్తిస్తున్నామని విస్మయం వ్యక్తం చేసింది. వితంతు పునర్వివాహం ఓ ఆశాకిరణంలా కనిపిస్తోందని జస్టిస్ మదన్ బి.లోకూర్, జస్టిస్ దీపక్ మిశ్రాల బెంచ్ అభిప్రాయపడింది. వితంతువులపై మూస ఆలోచనా ధోరణులకు వారి పునర్వివాహాలతో అడ్డుకట్ట వేయొచ్చంది. వితంతువుల పరిస్థితిపై కోర్టుకు చేరిన పలు నివేదికలను అధ్యయనం చేసి, ఒక ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక సూచించాలని ఆదేశిస్తూ ఆరుగురు సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : వితంతువుల పరిస్థితుల అధ్యయనానికి కమిటీ 
ఎప్పుడు : ఆగస్టు 11
ఎవరు : సుప్రీంకోర్టు 

10 ప్రాజెక్టులకు క్లీన్ గంగా మిషన్ ఆమోదం బిహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో రూ.2 వేల కోట్లతో చేపట్టే 10 ప్రాజెక్టులకు నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా ఆమోదం తెలిపింది. వీటిలో 8 ప్రాజెక్టులు మురుగు నీటి వ్యవస్థల ఏర్పాటుకు సంబంధించినవి. మిగతా రెండు.. ఘాట్ల అభివృద్ధి, గంగా జ్ఞాన కేంద్రానికి సంబంధించినవి. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : గంగా నది శుద్ధికి 10 ప్రాజెక్టులు ఆమోదం 
ఎప్పుడు : ఆగస్టు 10
ఎవరు : నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా 
ఎక్కడ : బిహార్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ 

బ్యాంకింగ్ నియంత్రణ సవరణ బిల్లుకు ఆమోదం బ్యాంకింగ్ నియంత్రణ సవరణ బిల్లు - 2017కు రాజ్యసభ ఆగస్టు 10న ఆమోదం తెలిపింది. లోక్‌సభ ఇంతకముందే ఈ బిల్లుని ఆమోదించింది. రుణ ఎగవేతదారులపై చట్ట పరంగా చర్యలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్‌లో కొన్ని మార్పులు చేస్తూ సవరణ బిల్లు తీసుకొచ్చింది. 
దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో నిరర్థక ఆస్తుల(ఎన్‌పీఏ) విలువ రూ.6.41 లక్షల కోట్లు కాగా మొత్తం అన్ని బ్యాంకుల్లో కలిపి ఈ మొత్తం రూ. 8.02 లక్షల కోట్లుగా ఉంది.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : బ్యాంకింగ్ నియంత్రణ సవరణ బిల్లు - 2017కు ఆమోదం 
ఎప్పుడు : ఆగస్టు 10
ఎవరు : రాజ్యసభ
ఎందుకు : రుణ ఎగవేతదారులపై చట్ట పరంగా చర్యలు తీసుకునేందుకు 

2022 నాటికి 60 గిగావాట్ల పవన విద్యుదుత్పత్తి కేంద్ర ప్రభుత్వం 2022 నాటికి దేశవ్యాప్తంగా 60 మెగావాట్ల పవన విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుందని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయుష్ గోయల్ ఆగస్టు 10న వెల్లడించారు. ఈ లక్ష్యాన్ని చేరాలంటే ఏటా 5,500 మెగావాట్ల పవన విద్యుత్ ఉత్పత్తి వ్యవస్థలను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని వివరించారు. ప్రస్తుతం దేశంలో 32.5 గిగావాట్ల పవన విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. 
క్విక్ రివ్యూ:ఏమిటి : 2022 నాటికి 60 గిగావాట్ల పవన్ విద్యుత్ ఉత్పత్తి 
ఎప్పుడు : ఆగస్టు 10
ఎవరు : కేంద్ర విద్యుత్ శాఖ 
ఎక్కడ : దేశవ్యాప్తంగా 

ఓడీఎఫ్ ఆవాసాలుగా గంగా నది తీరంలోని గ్రామాలు ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బిహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో గంగా నది తీరం వెంట ఉన్న 4,480 గ్రామాలను బహిరంగ మల విసర్జన రహిత ఆవాసాలుగా(ఓడీఎఫ్) కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆగస్టు 12న ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌లో నిర్వహించిన "గంగా గ్రామ్ సమ్మేళన్" లో పాల్గొన్న కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్.. ఈ మేరకు ప్రకటన చేశారు. నమామి గంగా కార్యక్రమంలో భాగంగా ఈ గ్రామాలన్నింటిలో మరుగుదొడ్లు నిర్మించామని తెలిపారు. అలాగే... గంగా నది తీర ప్రాంతాల్లో పారిశుద్ధ్యం, వ్యర్థాల నిర్వహణ, నీటి వనరుల పరిరక్షణ-పునరుజ్జీవం, సేంద్రీయ వ్యవసాయం వంటి కోసం "గంగా గ్రామ్" అనే కార్యక్రమాన్ని తోమర్ ప్రారంభించారు. తొలి దశలో 24 గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఓడీఎఫ్ ఆవాసాలుగా గంగా నది తీరంలోని 4,480 గ్రామాలు 
ఎప్పుడు : ఆగస్టు 12
ఎవరు : కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ
ఎక్కడ : బిహార్, పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ 

ఏనుగుల రక్షణకు గజ్ యాత్ర ప్రారంభం ప్రపంచ ఏనుగుల దినోత్సవం (ఆగస్టు 12న) సందర్భంగా దేశంలో ఏనుగుల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ''గజ్ యాత్ర'' అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఏనుగుల సంఖ్య అధికంగా ఉన్న 12 రాష్ట్రాల మీదుగా ఈ యాత్ర సాగుతుంది. వేటగాళ్ల బారి నుంచి ఏనుగులను రక్షించడం, అడవిలో నిఘా వ్యవస్థలను మరింత మెరుగుపరచడం వంటి కార్యక్రమాలను సమర్థంగా అమలు చేసేందుకు ఏటా ఏనుగుల దినోత్సవాన్ని నిర్వహిస్తారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : గజ్ యాత్ర ప్రారంభం 
ఎప్పుడు : ఆగస్టు 12
ఎవరు : కేంద్ర ప్రభుత్వం 
ఎక్కడ : 12 రాష్ట్రాల మీదుగా 
ఎందుకు : ఏనుగుల సంరక్షణ కోసం 

గోరఖ్‌పూర్‌లో ప్రాంతీయ వైద్య పరిశోధన కేంద్రం ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ప్రాంతీయ వైద్య పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 13న ప్రకటించింది. ఇందుకోసం రూ.85 కోట్లు వెంటనే విడుదల చేస్తున్నామని కేంద్ర వైద్య శాఖ మంత్రి జేపీ నడ్డా ప్రకటించారు. గోరఖ్‌పూర్‌లోని బీఆర్‌డీ వైద్య కళాశాలలో వారం రోజుల వ్యవధిలో 60కిపైగా చిన్నారులు చనిపోవడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : గోరఖ్‌పూర్‌లో ప్రాంతీయ వైద్య పరిశోధన కేంద్రం 
ఎప్పుడు : ఆగస్టు 13
ఎవరు : కేంద్ర ప్రభుత్వం 
ఎక్కడ : ఉత్తరప్రదేశ్ 
ఎందుకు : బీఆర్‌డీ వైద్య కళాశాలలో చిన్నారుల మరణాల నేపథ్యంలో 

రాజ్యాంగ ధర్మాసనానికి ఆర్టికల్ 35ఏ జమ్మూ కశ్మీర్ పౌరులకు ప్రత్యేక హక్కులు కల్పించే ఆర్టికల్ ‘35ఏ’ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను రాజ్యాంగ ధర్మాసనం విచారించాల్సిన అవసరముందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ ఆర్టికల్ లింగ వివక్షకు అనుకూలంగా ఉందా? రాజ్యాంగ ప్రాథమిక స్వరూపాన్ని ఉల్లంఘిస్తుందా? అన్న అంశాల్ని ఆ ధర్మాసనం పరిశీలించవచ్చని జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్ ధర్మాసనం పేర్కొంది. ఆర్టికల్ 35ఏ ను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను.. అదే తరహా పెండింగ్ పిటిషన్‌లకు జతచేస్తూ వాటన్నింటిని ముగ్గురు సభ్యుల ధర్మాసనానికి సిఫార్సు చేసింది. 1954లో రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా ఆర్టికల్ 35ఏను రాజ్యాంగంలో చేర్చారు.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : రాజ్యాంగ ధర్మాసనానికి ఆర్టికల్ 35ఏ 
ఎప్పుడు : ఆగస్టు 14 
ఎవరు : సుప్రీంకోర్టు 

"భారత్ కే వీర్" పై లైవ్ ట్వీటర్ వాల్ భారత 71వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా "భారత్ కే వీర్" (Bharat Ke Veer) పోర్టల్‌ను ప్రచారం చేసేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లైవ్ ట్వీటర్ వాల్‌ను ఆవిష్కరించారు. ఇందుకోసం న్యూఢిల్లీలోని మూడు ప్రాంతాల్లో భారీ ఎల్‌ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. దేశ రక్షణలో అమరులైన సైనికులకు వందనాలు సమర్పిస్తూ hashtag Bharat Ke Veerతో చేసే ట్వీట్లు ఈ ఎల్‌ఈడీ తెరలపై ప్రదర్శితమవుతాయి. 
దేశం కోసం ప్రాణాలు అర్పించిన సీఏపీఎఫ్ అమరుల కుటుంబాలకు సహాయం చేసేందుకు 2017 ఏప్రిల్‌లో Bharat Ke Veer పోర్టల్‌ను ప్రారంభించారు. ఈ పోర్టల్ ద్వారా విరాళాలు సమీకరిస్తారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : భారత్ కే వీర్‌పై లైవ్ ట్వీటర్ వాల్ 
ఎప్పుడు : ఆగస్టు 15
ఎవరు : హోంశాఖమంత్రి రాజ్‌నాథ్ సింగ్ 
ఎందుకు : భారత్ కే వీర్ పోర్టల్ ప్రమోషన్ కోసం 

ప్రధాని మోదీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం కల్లోల కశ్మీర్‌ను మరొకసారి భూలోక స్వర్గంగా మార్చేందుకు ప్రతిజ్ఞ చేద్దామంటూ దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. కశ్మీర్ సమస్య దూషణలతోనో, తూటాలతోనో పరిష్కారం కాదని.. అందుకు కశ్మీరీలను ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని, వారితో మమేకం కావడమే ఏకైక మార్గమని స్పష్టం చేశారు. సంప్రదాయ కుర్తా, పైజామా, రాజస్తానీ తలపాగాతో స్వాతంత్య్ర వేడుకలకు హాజరైన ప్రధాని ఆగస్టు 15న ఉదయం ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం ప్రధానిగా నాలుగోసారి ఎర్రకోట నుంచి ప్రసంగించిన మోదీ.. గత మూడేళ్లలో ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన విజయాలు, కీలక నిర్ణయాల్ని ప్రస్తావించారు. ముఖ్యంగా నోట్ల రద్దు, జీఎస్టీ అమలు సాహసోపేత నిర్ణయాలని అభివర్ణించారు. చైనాతో డోక్లాం వివాదాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ.. సముద్రం, సరిహద్దులు ఎక్కడైనా సరే, ఎలాంటి భద్రతా సవాలునైనా ఎదుర్కొనే సత్తా భారత్‌కు ఉందన్నారు. విశ్వాసాల పేరిట జరిగే హింస ఆమోదయోగ్యం కాదని, మతవాదం, కులతత్వం విషంతో సమానమని పేర్కొన్నారు. దేశం ఎదుర్కొన్న ప్రకృతి విపత్తులను, యూపీ ఆస్పత్రిలో ఇటీవలి చిన్నారుల మరణాలను ప్రత్యేకంగా ప్రస్తావించిన ప్రధాని.. వారికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరిచారు. 

‘బ్లూవేల్’ లింక్‌లను తొలగించాలని కేంద్రం ఆదేశం ప్రమాదకర ‘బ్లూవేల్ చాలెంజ్’ గేమ్, ఆ తరహా ఆన్‌లైన్ ఆటలకు సంబంధించిన అన్ని లింక్‌లను తక్షణం తొలగించాలని కేంద్రం ఇంటర్నెట్ దిగ్గజ సంస్థలను ఆదేశించింది. ఈ మేరకు ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ ఆగస్టు 11న గూగుల్, యాహూ, ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, మైక్రోసాఫ్ట్‌లకు ఓ లేఖ రాసింది. 50 రోజులపాటు సాగే బ్లూవేల్ ఆన్‌లైన్ గేమ్‌లో చివరి టాస్క్ ఆత్మహత్య చేసుకోవడం. ఈ గేమ్‌లో లీనమై ఇటీవల మహారాష్ట్రలో ఒకరు, పశ్చిమబెంగాల్‌లో ఒకరు పాఠశాల విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఆన్‌లైన్ గేమ్ బ్లూవేల్ లింకుల తొలగింపునకు ఆదేశం 
ఎప్పుడు : ఆగస్టు 11
ఎవరు : కేంద్ర ప్రభుత్వం 
ఎక్కడ : భారత్‌లో 
ఎందుకు : విద్యార్థులు, యువతను ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నందున 

75 ఏళ్ల ‘క్విట్ ఇండియా’పై తీర్మానంక్విట్ ఇండియా ఉద్యమానికి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆగస్టు 9న లోక్‌సభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ..స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను గుర్తుచేశారు. సభ్యుల ప్రసంగాల అనంతరం ఉభయసభల్లో సంబంధిత తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు.

కేరళ, హరియాణాలో 100 శాతం పారిశుద్ధ్యంకేంద్రం నిర్వహించిన గ్రామీణ పారిశుద్ధ్య సర్వేలో కేరళ, హరియాణా ముందుండగా బిహార్ చివరి స్థానంలో నిలిచింది. సర్వే వివరాలను తాగునీటి, పారిశుద్ధ్య మంత్రిత్వ శాఖ ఆగస్టు 8న విడుదల చేసింది. సర్వేలో భాగంగా క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 2016 మే-జూన్ మధ్యన దేశవ్యాప్తంగా 4,626 గ్రామాల్లోని 1.4 లక్షల గ్రామీణ గృహాలను పరిశీలించింది. కేరళ, హరియాణాల్లో దాదాపు అన్ని గ్రామీణ గృహాలకు మరుగుదొడ్డి సౌకర్యం ఉంది. బిహార్‌లో 30 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 37 శాతం ఇళ్లలోనూ, దేశంలో 62.45 శాతం ఇళ్లలో మరుగుదొడ్డి సౌకర్యం ఉంది.

రాష్ట్రీయంఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకానికి శంకుస్థాపన  నిజామాబాద్ జిల్లా పోచంపాడు వద్ద శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పునరుజ్జీవ పథకం పనులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆగస్టు 10న శంకుస్థాపన చేశారు. ప్రాజెక్టు వరద కాలువ జీరో పాయింట్ వద్ద నిర్మించిన పైలాన్‌ను ఆవిష్కరించారు. 2018 ఆగస్టు నాటికి కాళేశ్వరం నీటితో శ్రీరాంసాగర్‌ను నింపుతామని చెప్పారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం పూర్తయితే ఏటా ఫిబ్రవరి, మార్చిలోగా 90 టీఎంసీల నీళ్లు ఈ ప్రాజెక్టులోకి వస్తాయని పేర్కొన్నారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఎస్సారెస్పీ పున రుజ్జీవ పథకానికి శంకుస్థాపన 
ఎప్పుడు : ఆగస్టు 10
ఎవరు : ముఖ్యమంత్రి కేసీఆర్ 
ఎక్కడ : పోచంపాడు, నిజామాబాద్ జిల్లా 

నంది, ఎన్టీఆర్ అవార్డుల ఎంపికకు కమిటీలునంది, ఎన్టీఆర్ జాతీయ చలనచిత్ర అవార్డులతో పాటు ఇతర చలనచిత్ర అవార్డుల ఎంపిక కోసం కమిటీలను ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు 10న ఉత్తర్వులిచ్చింది. ఈ మేరకు 2014 సంవత్సరానికి నంది ఫిల్మ్ అవార్డుల ఎంపిక కోసం నటుడు గిరిబాబు అధ్యక్షతన, 2015 సంవత్సరానికి జీవిత రాజశేఖర్, 2016 సంవత్సరానికి పోకూరి బాబూరావు అధ్యక్షతన కమిటీలను ఏర్పాటు చేసింది. 2014, 2015, 2016 సంవత్సరాలకు ఎన్టీఆర్ జాతీయ ఫిల్మ్ అవార్డులతో పాటు బీ.ఎన్.రెడ్డి, నాగిరెడ్డి మరియు చక్రపాణి జాతీయ ఫిల్మ్ అవార్డులు, రఘుపతి వెంకయ్య ఫిల్మ్ అవార్డుల ఎంపిక కోసం నందమూరి బాలకృష్ణ అధ్యక్షతన కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : నంది, ఎన్టీఆర్ అవార్డుల ఎంపికకు కమిటీలు 
ఎప్పుడు : ఆగస్టు 10
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 
ఎందుకు : 2014, 2015, 2016 సంవత్సరాలకు అవార్డుల ఎంపిక కోసం 

హైదరాబాద్‌లో ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు 2017 నవంబర్ 28-30 వరకు హైదరాబాద్‌లో జరగనుంది. భారత్, అమెరికా సంయుక్త ఆధ్వర్యంలో జరిగే ఈ సదస్సుకి ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ హాజరకానున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారిశ్రామిక వ్యవస్థాపకులు ఈ సదస్సులో పాల్గొననున్నారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ప్రపంచ పెట్టుబడిదారుల సద స్సు 
ఎప్పుడు : నవంబర్ 28-30
ఎక్కడ : హైదరాబాద్
ఎవరు : భారత్, అమెరికా 

ఏపీఎస్‌ఆర్టీసీకి జాతీయ రవాణా ప్రతిభా పురస్కారం ఏపీఏస్‌ఆర్టీసీకి జాతీయ స్థాయి రవాణా ప్రతిభ పురస్కారం దక్కింది. ప్రజా రవాణా వ్యవస్థలో నూతన ఆవిష్కరణలు అనే అంశంపై ఆల్ ఇండియా స్టేట్ రోడ్ ట్రాన్‌‌సపోర్ట్ అండర్ టేకింగ్‌‌స (ఏఎస్‌ఆర్‌టీయూ) అంతర్జాతీయ సదస్సు నిర్వహించింది. ఆగస్టు 10, 11 తేదీల్లో ఢిల్లీలో జరిగిన సదస్సులో వాహన తయారీదారులు, వాహన విడి భాగాల తయారీ దారులు పాల్గొన్నారు. జాతీయ, అంతర్జాతీయ రవాణా రంగంలో వివిధ అంశాలపై నివేదికలు సమర్పించారు. ‘టెస్ట్ బ్రాండింగ్’, మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్‌‌స విభాగంలో నూతన అల్ట్రా డీలక్స్ బ్రాండ్‌ను ఏపీఎస్‌ఆర్టీసీ ప్రవేశపెట్టినందుకుగాను ఈ పురస్కారం దక్కింది. పురస్కారం కింద ట్రోఫీ, ప్రశంసా పత్రం, రూ.2.50 లక్షల నగదు బహుమతి, ఏపీఎస్‌ఆర్టీసీకి దక్కాయి. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఏపీఎస్‌ఆర్టీసీకి జాతీయ రవాణా ప్రతిభా పురస్కారం 
ఎప్పుడు : ఆగస్టు 12
ఎవరు : ఆల్ ఇండియా స్టేట్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ అండర్ టేకింగ్స్
ఎక్కడ : న్యూఢిల్లీలో

తెలంగాణ ప్రభుత్వ అధికారులకు ఉత్తమ సేవ అవార్డులు వివిధ రంగాల్లో ఉత్తమ సేవలు అందించినవారికి స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం అవార్డులు ప్రకటించింది. పోలీసు ఉన్నతాధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు, సాహితీవేత్తలు, స్వచ్ఛంద సేవకుల (సోషల్ వర్కర్లకు)కు ఈ అవార్డులు ప్రకటించింది. ఆగస్టు 15న గోల్కొండ కోటలో జరిగిన 71వ పంద్రాగస్టు వేడుకల్లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వీరికి అవార్డులు అందజేశారు. 
అవార్డు గ్రహీతలు..పొలీసు శాఖ
అంజనీకుమార్ ఐపీఎస్, రాజీవ్ రత్న ఐపీఎస్, ఎన్.సూర్యనారాయణ ఐపీఎస్, ఎం.శివకుమార్ ఐపీఎస్ 

సాంస్కృతిక శాఖ 
సుద్దాల అశోక్ తేజ (తెలుగు పాటలు), జయరాజు (తెలుగు పాటలు), భాష్యం విజయసారధి(తెలుగు, సంస్కృత పండితుడు)

తెలంగాణ స్టేట్ ఇన్‌సెంటివ్ అవార్డు
డాక్టర్ జే రమేష్, డిప్యూటీ డీఎంఅండ్ హెచ్‌వో ఆర్మూర్

హరిత మిత్ర
వై.శేఖర్‌రెడ్డి(ప్రజా ప్రతినిధి, వరంగల్ రూరల్), పెద్ది సుదర్శన్‌రెడ్డి (ప్రజా ప్రతినిధి, వరంగల్ రూరల్), సి. శ్రీధర్‌రావు (డీఎఫ్‌వో, సిద్దిపేట), ఎంపీపీఎస్, మురపల్లి, జగిత్యాల. జనరల్ మేనేజర్, ఫారెస్టు, ఎస్‌సీసీఎల్ రామగుండం-1, పెద్దపల్లి.

ఏపీ ఉద్యోగులకు ప్రోత్సాహక పురస్కారాలువిధి నిర్వహణలో విశేష సేవలందించిన 22 మంది ప్రభుత్వ ఉద్యోగులకు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రోత్సాహక పురస్కారాలను ప్రకటించింది. ఆగస్టు 15న తిరుపతిలో జరిగిన రాష్ట్రస్థాయి జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వీటిని ప్రదానం చేశారు. పురస్కారానికి ఎంపికై న వారికి రూ.20 వేల చొప్పున నగదు బహుమతి అందజేశారు. 
పురస్కార గ్రహీతలు 
ఏపీఎస్పీఎఫ్ డెరైక్టర్ జనరల్ కార్యాలయంలో ఎస్సైగా పనిచేస్తున్న కె.రమేష్, స్కూల్ ఎడ్యుకేషన్ శాఖలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పీ రవికుమార్, బీసీ వెల్ఫేర్‌లో డిప్యూటీ సెక్రెటరీ జీ రాజపుష్ఫ, ఏసీబీ డీఎస్పీలు ఏ. రమాదేవి, ఎస్‌వీవీ ప్రసాదరావు, ఏసీబీలో అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ ఏ.రవిశంకర్, ఏసీబీ ఇన్‌‌సపెక్టర్ డీ. సుదర్శన్‌రెడ్డి, శ్రీకాకుళం రీజినల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీఈఈ ఆర్‌ఆర్ విద్యాసాగర్, కర్నూలు ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం ఏడీ ఎస్. వెంకటేశ్వర్లు, సీసీఎల్‌ఏ మాజీ ప్రాజెక్టు డెరైక్టర్ పీ రంజిత్‌బాషా, జీఏడీ విభాగంలో పనిచేసే ఏఎస్‌వో పీ రామకృష్ణబాబు, సెక్షన్ ఆఫీసర్ ఎస్‌ఏ రషీద్, హోం శాఖలో పనిచేసే ఏఎస్‌వో వీ. బంగారం, వై.లీలా సరస్వతి, ఆర్థిక శాఖ డీఎఫ్‌ఏ మహ్మద్ ఇంతియాజ్, ఏఎస్‌వో ఎంఎస్ రంగశాయి శేషు, సీనియర్ అకౌంటెంట్ రంగా నాయక్, సెక్రెటేరియట్ సీనియర్ ఆడిటర్ వై. వరలక్ష్మి, పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ జాయింట్ కమిషనర్లు జీ. బాలసుబ్రహ్మణ్యం, ఎం. శివప్రసాద్, ప్రాజెక్టు డెరైక్టర్ ఏ. కల్యాణ చక్రవర్తి, సీఎం స్పెషల్ సెక్రెటరీ పీఏ కె. వరప్రసాద్‌లు పోత్సాహక నగదు పురస్కారాన్ని అందుకున్నారు. 

కిలిమంజారోను అధిరోహించిన ఏపీ, తెలంగాణ విద్యార్థులుతెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 9 మంది విద్యార్థులు ఆఫ్రికాలోకెల్లా అత్యంత ఎత్తయిన కిలిమంజారో (5,895 మీటర్లు) పర్వత శిఖరాన్ని ఆగస్టు 14న అధిరోహించారు. శిఖరాగ్రాన 100 అడుగుల జాతీయ పతాకాన్ని ఎగురవేసి స్వాతంత్య్ర దిన సంబురాలను ఘనంగా జరుపుకున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్, గిరిజన వీరుడు కుమ్రం భీంల చిత్రపటాలను ప్రదర్శించారు. 
తెలంగాణ నుంచి సబావత్ సునీత(10వ తరగతి), నాయిని మల్లేశ్ (ఆసిఫాబాద్ గిరిజన ఆశ్రమ పాఠశాల), ఆనంద్‌కుమార్, శ్రీకుమార్, అరుణ్ కుమార్ (నల్లగొండ), చరణ్‌రాజ్ (డిగ్రీ విద్యార్థి), రాఘవేంద్ర (మహబూబ్‌నగర్) బృందంలో ఉన్నారు. ఏపీ నుంచి సత్యారావు (డిగ్రీ విద్యార్థి, బంగారుపాళెం, విశాఖపట్నం), రఘునీథ్ (మౌంటెనీరింగ్ గైడ్, తాడేపల్లి, గుంటూరు) ఈ బృందంలో ఉన్నారు. తమిళనాడు నుంచి నలుగురు, పశ్చిమ బంగ, మహారాష్ట్రల నుంచి ఒక్కొ క్కరు కూడా బృందంలో ఉన్నారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : కిలిమంజారోను అధిరోహించిన భారత విద్యార్థుల బృందం
ఎప్పుడు : ఆగస్టు 14
ఎవరు : తెలంగాణ, ఏపీ నుంచి 9 మంది విద్యార్థులు 
ఎక్కడ : ఆఫ్రికా

హైదరాబాద్‌లో ప్రపంచ ఆప్టోమెట్రీ కాంగ్రెస్ 2వ ప్రపంచ ఆప్టోమెట్రీ కాంగ్రెస్ హైదరాబాద్‌లో జరగనుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 11 నుంచి 13 వరకు జరగనున్న ఈ సదస్సులో కంటి వైద్య చికిత్సలో నూతన విధానాలు, అధునాత సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై చర్చించనున్నారు. 1500 మంది ప్రతినిధులు సదస్సులో పాల్గొంటారు. వరల్డ్ కౌన్సిల్ ఆఫ్ ఆప్టోమెట్రీ, ది ఆసియా పసిఫిక్ కౌన్సిల్ ఆఫ్ ఆప్టోమెట్రీ, ఇండియన్ విజన్ ఇనిస్టిట్యూట్ సంయుక్తంగా ఈ సమావేశాలను నిర్వహిస్తున్నాయి.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : 2వ ప్రపంచ ఆప్టోమెట్రో కాంగ్రెస్ 
ఎప్పుడు : సెప్టెంబర్ 11-13, 2017
ఎక్కడ : హైదరాబాద్ 
ఎవరు : వరల్డ్ కౌన్సిల్ ఆఫ్ ఆప్టోమెట్రీ, ది ఆసియా పసిఫిక్ కౌన్సిల్ ఆఫ్ ఆప్టోమెట్రీ, ఇండియన్ విజన్ ఇనిస్టిట్యూట్

ఏపీ ఉపాధ్యాయుడు కంభం వెంకటేశ్‌కు రాష్ట్రపతి అవార్డుకమ్యూనికేషన్ టెక్నాలజీ ద్వారా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు వినూత్నంగా బోధిస్తున్న వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు మండలం దొరసానిపల్లె హైస్కూల్‌కు చెందిన గణిత ఉపాధ్యాయుడు కంభం వెంకటేశు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 5న రాష్ట్రపతి కోవింద్ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డు అందుకోనున్నారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ, పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ద్వారా ఎంపిక చేసే జాతీయ అవార్డుకు తెలుగు రాష్ట్రాల నుంచి ఈయన ఒక్కరే ఎంపికయ్యారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డు 
ఎప్పుడు : ఆగస్టు 15
ఎవరు : కంభం వెంక టేశ్ 
ఎక్కడ : వైఎస్సార్ జిల్లా, ఆంధ్రప్రదేశ్ 

సుబ్బలక్ష్మికి మాలతీ చందూర్ పురస్కారం ప్రముఖ కథ, నవలా రచయిత్రి, చిత్రకారిణి శివరాజు సుబ్బలక్ష్మికి 2017 సంవత్సరానికి మాలతీ చందూర్ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నట్లు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తెలిపారు. ఆగస్టు 21న హైదరాబాద్ శ్రీ పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలోని ఎన్టీ రామారావు కల్యాణ మండపంలో సుబ్బలక్ష్మికి అవార్డును ప్రదానం చేస్తామన్నారు.
మాలతీ చందూర్ మరణం తర్వాత ఆమె పేరిట కుటుంబ సభ్యులు పురస్కారాన్ని నెలకొల్పారు. 2014 నుంచి ఏటా ఈ అవార్డును ప్రదానం చేస్తున్నారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : మాలతీ చందూర్ పురస్కారం - 2017
ఎప్పుడు : ఆగస్టు 14
ఎవరు : శివరాజు సుబ్బలక్ష్మి
ఎందుకు : సౌహిత్య రంగంలో చేసిన సేవలకు గాను 

ఆర్థికంఫోర్బ్స్ సృజనాత్మక కంపెనీల్లో మూడు దేశీ సంస్థలు
 నూతన ఆవిష్కరణలకు సంబంధించి ప్రపంచంలోనే 100 అత్యుత్తమ సృజనాత్మక కంపెనీల జాబితాలో మూడు భారతీయ సంస్థలు చోటు దక్కించుకున్నాయి. ఫోర్బ్స్ మ్యాగజైన్ రూపొందించిన ఈ లిస్టులో హిందుస్తాన్ లీవర్ (హెచ్‌యూఎల్), ఏషియన్ పెయింట్స్, భారతీ ఎయిర్‌టెల్ ఉన్నాయి. హెచ్‌యూఎల్ క్రితం సారి 31వ స్థానంలో ఉండగా ఈసారి ఏడో స్థానానికి, ఏషియన్ పెయింట్స్ 18వ స్థానం నుంచి ఎనిమిదో స్థానానికి ఎగబాకాయి. ఎయిర్‌టెల్ కొత్తగా 78వ ర్యాంకుతో జాబితాలో చోటు దక్కించుకుంది. టీసీఎస్, సన్ ఫార్మా, లార్సన్ అండ్ టూబ్రో గతేడాది జాబితాలో ఉన్నప్పటికీ ఈసారి స్థానం లభించలేదు. దీంతో లిస్టులో భారతీయ సంస్థల సంఖ్య అయిదు నుంచి మూడుకి తగ్గింది. 
2017 జాబితాలో తొలిస్థానంలో సేల్స్‌ఫోర్స్‌డాట్‌కామ్, రెండో స్థానంలో టెస్లా మోటర్స్, మూడో స్థానంలో అమెజాన్‌డాట్‌కామ్ ఉన్నాయి. కనీసం 10 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్ గల సంస్థలకు ఇందులో చోటు ఉంటుంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : 100 ఇన్నోవెటివ్ కంపెనీస్ - 2017
ఎప్పుడు : ఆగస్టు 9
ఎవరు : ఫోర్బ్స్ 
ఎక్కడ : ప్రపంచవ్యాప్తంగా 

2017-18 ఆర్థిక సర్వే రెండో ఎడిషన్ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అంచనాల మేరకు గరిష్ట వృద్ధి రేటు నమోదు కష్టమేనని కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఆర్థిక రంగంలో అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ఈ అభిప్రాయానికి వచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ రూపొందించిన ఆర్థిక సర్వే రెండో ఎడిషన్‌ను ఆగస్టు 11న పార్లమెంటులో ప్రవేశపెట్టింది. 
2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి దేశ జీడీపీ వృద్ధి రేటు 6.75 నుంచి 7.5 శాతం మధ్య నమోదవుతుందని ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో ఆవిష్కరించిన ఆర్థిక సర్వేలో అంచనా వేసింది. మారిన పరిస్థితుల నేపథ్యంలో 7.5 శాతం వృద్ధి రేటు అసాధ్యమేనని పేర్కొంది. ఆర్థిక రంగం పుంజుకునేందుకు మరిన్ని రేట్ల కోతలు అవసరమని అభిప్రాయపడింది. ఆర్బీఐ మధ్య కాలిక లక్ష్యమైన 4 శాతంలోపే ద్రవ్యోల్బణం ఉంటుందని అంచనా వేసింది. డాలర్‌తో రూపాయి విలువ బలపడడం, రైతుల రుణాల మాఫీ, విద్యుత్, టెలికం రంగ కంపెనీలు ఎదుర్కొంటున్న ఒత్తిళ్లు, కొత్త పన్ను వ్యవస్థ జీఎస్టీకి మారడం వంటి అంశాలను సవాళ్లుగా ప్రభుత్వం పేర్కొంది. ఒక్క రైతుల రుణ మాఫీయే జీడీపీ వృద్ధిని 0.7 శాతం వరకు తగ్గించేస్తుందని అంచనా వేసింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలూ ఇదే బాట అనుసరిస్తే మొత్తం భారం రూ.2.7 లక్షల కోట్లుగా ఉంటుందని, ఇది ఆర్థిక వృద్ధిని వెనక్కి లాగేస్తుందని తెలిపింది. ఈ ఏడాది ఉత్తరప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, పంజాబ్, తమిళనాడు ప్రభుత్వాలు రైతుల రుణాలను రద్దు చేశాయి. 
ఆర్థిక సర్వే ప్రధానాంశాలు
  • 2017-18లో జీడీపీలో ద్రవ్యలోటు 3.2 శాతానికి దిగొస్తుంది. 2016-17లో 3.5%.
  • రిటైల్ ద్రవ్యోల్బణం మార్చి వరకు 4 శాతంలోపే ఉండొచ్చు.
  • పాలసీ రేట్లను 25-75 బేసిస్ పాయింట్లు తగ్గించేందుకు అవకాశాలు.
  • డీమోనిటైజేషన్ తర్వాత కొత్తగా 5.4 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు తోడయ్యారు.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : 2017-18 ఆర్థిక సర్వే రెండో ఎడిషన్ 
ఎప్పుడు : ఆగస్టు 11
ఎవరు : కేంద్ర ప్రభుత్వం 

నదుల్లో 15-20% మధ్య ప్రవాహాలు తప్పనిసరిదేశవ్యాప్తంగా నదుల్లో 15 నుంచి 20 శాతం మధ్య నీటి ప్రవాహాలు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. జీవనోపాధికి, పర్యావరణ పరిరక్షణ చర్యల నిమిత్తం నదుల్లో కొంత లోతు మేర స్వచ్ఛమైన నీటిని లభ్యమయ్యేలా 15 నుంచి 20 శాతం నదుల ప్రవాహాలు ఉండేలా చూసుకోవాలని అన్ని రాష్ట్రాలకు ఎన్జీటీ చైర్‌పర్సన్ జస్టిస్ స్వతంతర్ కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిబంధనలకు ఏ రాష్ట్రమైనా కట్టుబడి ఉండటం సాధ్యం కాకపోతే ఆ రాష్ట్రం కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖను కలవొచ్చని సూచించింది.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : నదుల్లో 15 నుంచి 20 శాతం ప్రవాహాలు తప్పనిసరి 
ఎప్పుడు : ఆగస్టు 14 
ఎవరు : జాతీయ హరిత ట్రిబ్యునల్ 
ఎక్కడ : దేశవ్యాప్తంగా 
ఎందుకు : జీవనోపాధి, పర్యావరణ పరిరక్షణకు 

2022-23 నాటికి వ్యవసాయ కుటుంబ ఆదాయం రెట్టింపు2022-23 నాటికి వ్యవసాయ కుటుంబ ఆదాయం రెట్టింపు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యం నెరవారాలంటే.. వ్యవసాయ, అనుబంధ రంగాల్లో రూ.6.4 లక్షల కోట్ల పెట్టుబడులు అవసరమని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ అభిప్రాయడింది. ఈ మేరకు ఆగస్టు 14న ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. 
2015-16 గణాంకాల ప్రకారం దేశంలో వ్యవసాయ కుటుంబ ఆదాయం రూ.96,703గా ఉంది. దీన్ని 2022-23 నాటికి రూ.2,19,724లకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. 

సైన్స్ అండ్ టెక్నాలజీతెలుగులోనూ గూగుల్ సెర్చ్ టెక్నాలజీ దిగ్గజ కంపెనీ ‘గూగుల్’ తాజాగా తన వాయిస్ సెర్చ్ ఫీచర్‌కు తెలుగు భాషను యాడ్ చేసింది. దీంతో ఇక తెలుగులో చెబుతూనే గూగుల్‌లో కంటెంట్‌ను సెర్చ్ చేయవచ్చు. తెలుగుతోపాటు ఇకనుంచి తమిళ్, మలయాళం, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మరాఠీ, ఉర్దూ భాషల్లోనూ గూగుల్ సెర్చ్ చేయొచ్చు. ఇదివరకు కేవలం ఆంగ్లం, హిందీలో మాత్రమే గూగుల్ వాయిస్ సెర్చ్ అందుబాటులో ఉండేది. స్మార్ట్‌ఫోన్ యూజర్లు తెలుగులో చెబుతూ గూగుల్ సెర్చ్ చేయాలనుకుంటే.. గూగుల్ యాప్‌లోకి వెళ్లి సెట్టింగ్‌‌సలో ఉన్న ‘సెర్చ్ లాంగ్వేజ్’ ఆప్షన్‌లో ఆంగ్లం బదులుగా తెలుగును ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : తెలుగులో గూగుల్ సెర్చ్ 
ఎప్పుడు : ఆగస్టు 14
ఎవరు : గూగుల్ సంస్థ 

క్రీడలుప్రపంచ అథ్లెటిక్స్‌లో బార్బరా స్పొటకోవాకు స్వర్ణం 
 ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో చెక్ రిపబ్లిక్ జావెలిన్ త్రోయర్ బార్బరా స్పొటకోవా స్వర్ణం గెలుచుకుంది. ఆగస్టు 9న జరిగిన మహిళల జావెలిన్ త్రో ఫైనల్స్‌లో 36 ఏళ్ల స్పొటకోవా ఈటెను 66.76 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానాన్ని సంపాదించింది. తద్వారా 2007 ఒసాకా ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పసిడి పతకం గెలిచిన స్పొటకోవా పదేళ్ల తర్వాత మళ్లీ విశ్వవిజేతగా నిలిచింది. 2008 బీజింగ్, 2012 లండన్ ఒలింపిక్స్‌లో స్వర్ణాలు గెలిచిన ఆమె, 2016 రియో ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించింది. 
పురుషుల 400 మీటర్ల విభాగంలో ప్రపంచ, ఒలింపిక్ చాంపియన్ వేడ్ వాన్ నికెర్క్ టైటిల్‌ను నిలబెట్టుకున్నాడు. 43.98 సెకన్లలో గమ్యానికి చేరి స్వర్ణ పతకాన్ని దక్కించుకున్నాడు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ - 2017
ఎప్పుడు : ఆగస్టు 9 
ఎవరు : మహిళల జావెలిన్ త్రోలో బార్బరా స్పొటకోవాకు స్వర్ణం 
ఎక్కడ : లండన్ 

పారా అథ్లెట్ సువర్ణారాజ్‌కు ఎన్‌సీపీఈడీపీ పురస్కారం ప్రముఖ పారా అథ్లెట్ సువర్ణారాజ్ ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపికయ్యారు. వికలాంగుల సంక్షేమానికి విశేషంగా కృషి చేస్తున్నందుగు గుర్తింపుగా National Centre for Promotion of Employment for Disabled People(NCPEDP) అందజేసే Mphasis Universal Design Award for 2017 పురస్కారానికి ఎంపికయ్యారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : పారా అథ్లెట్ సువర్ణరాజ్‌కు Mphasis Universal Design అవార్డు 
ఎప్పుడు : ఆగస్టు 9
ఎవరు : ఎన్‌సీపీఈడీపీ
ఎందుకు : వికలాంగుల సంక్షేమానికి కృషి చేసినందుకు గాను 

కెరీర్ చివరి రేసులో విఫలమైన ఉసేన్ బోల్డ్ జమైకా స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ ఆఖరి రేసుని పూర్తి చేయకుండానే కెరీర్ ముగించాడు. లండన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భాగంగా ఆగస్టు 12న జరిగిన 4 × 100 మీటర్ల రిలేలో తొడ కండరాలు పట్టేయడంతో బోల్ట్ రేసుని ముగించలేకపోయాడు.
ఈ రేసులో చిజిండు ఉజా, అడమ్ జెమిలి, డానియెల్ టాల్‌బోట్, నెథనీల్ మిచెల్ బ్లేక్‌లతో కూడిన బ్రిటన్ (37.47 సెకన్లు) జట్టు బంగారు పతకం గెలుపొందింది. రోడ్జర్స్, గాట్లిన్, బాకన్, కోల్మన్‌లతో కూడిన అమెరికా (37.52 సెకన్లు) జట్టు రజతం, జపాన్ (38.04 సెకన్లు) బృందం కాంస్యం చేజిక్కించుకున్నాయి. 
అన్నీ స్వర్ణాలే... బోల్ట్ ఒలింపిక్స్‌లో 8 స్వర్ణాలు, ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 11 పసిడి పతకాలు గెలిచాడు. లండన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం (100 మీ.) నెగ్గాడు. ఒసాకా ప్రపంచ చాంపియన్‌షిప్ (2007)లో రజతాలు (200 మీ., 4×100 మీ. రిలే) గెలిచాడు. మొత్తం మీద 22 పతకాల్లో 19 బంగారు పతకాలున్నాయి. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ముగిసిన ఉసేన్ బోల్ట్ కెరీర్ 
ఎప్పుడు : ఆగస్టు 12
ఎక్కడ : ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్, లండన్ 

ఆసియా షాట్‌గన్ పోటీల్లో రష్మీ జంటకు స్వర్ణంఆసియా షాట్‌గన్ షూటింగ్ చాంపియన్‌షిప్ చివరి రోజైన ఆగస్టు 13న భారత్ స్వర్ణ పతకం గెలుచుకుంది. హైదరాబాద్ షూటర్ రష్మీ రాథోడ్ తన భాగస్వామి మేరాజ్ అహ్మద్ ఖాన్‌తో కలిసి భారత్‌కు స్కీట్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో పసిడి పతకాన్ని అందించింది. ఫైనల్లో రష్మీ-మేరాజ్ ద్వయం 28-27తో లియూ జియాంగ్‌చి-గావో జియాన్‌మీ (చైనా) జోడీపై విజయం సాధించింది. ఈ పోటీల్లో ఓవరాల్‌గా భారత్ ఎనిమిది పతకాలు సాధించింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఆసియా షాట్‌గన్ చాంపియన్‌షిప్
ఎప్పుడు : ఆగస్టు 13
ఎవరు : స్కీట్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో భారత్‌కు స్వర్ణం 
ఎక్కడ : ఆస్తానా 

జావెలిన్ త్రో ఫైనల్లో దవీందర్‌కు 12వ స్థానంప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ జావెలిన్ త్రో విభాగంలో ఫైనల్‌కు చేరిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించిన దవీందర్ సింగ్.. ఫైనల్లో 12వ స్థానంలో నిలిచాడు. అతను ఈటెను 80.02 మీటర్ల దూరం విసిరాడు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ జావెలిన్ త్రో ఫైనల్
ఎప్పుడు : ఆగస్టు 13
ఎవరు : 12వ స్థానంలో నిలిచిన దవీందర్ సింగ్ 
ఎక్కడ : లండన్ 

విదేశీగడ్డపై తొలిసారి టెస్ట్ సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన భారత్ శ్రీలంకతో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను భారత్ 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. ఆగస్టు 14న ముగిసిన మూడో టెస్టులో 171 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత్ ఈ ఘనతను నమోదు చేసింది. తద్వారా విదే శాల్లో తొలిసారి టెస్ట్ సిరీస్ క్లీన్ స్వీప్ చేసింది. విదేశాల్లో భారత్‌కు ఇటువంటి విజయాన్ని అందించిన తొలి కెప్టెన్‌గా విరాట్ కోహ్లి నిలిచాడు. గతంలో న్యూజిలాండ్‌పై భారత్ నాలుగు టెస్టుల సిరీస్‌ను 3-1తో నెగ్గింది. మూడో టెస్టులో రాణించిన హార్దిక్ పాండ్యాకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’.. సిరీస్‌లో రెండు సెంచరీలు చేసిన శిఖర్ ధావన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : విదేశీగడ్డపై తొలిసారి టెస్ట్ సిరీస్ 3-0 తేడాతో క్లీన్ స్వీప్ 
ఎప్పుడు : ఆగస్టు 14
ఎవరు : భారత్ 
ఎక్కడ : శ్రీలంకలో 
ఎందుకు : శ్రీలంకను 3-0 తేడాతో ఓడించిన భారత్ 

టెస్టుల్లో ధోని రికార్డుని అధిగమించిన కోహ్లి విదేశాల్లో అత్యధిక టెస్టు విజయాలు సాధించిన రెండో భారత కెప్టెన్‌గా విరాట్ కోహ్లి నిలిచాడు. శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయడం ద్వారా ఈ ఘనతను నమోదు చేశాడు. గతంలో ధోని ఆరు విదేశీ టెస్టు విజయాల్ని సాధించగా శ్రీలంకపై విజయం కోహ్లీకి ఏడోది. విదేశాల్లో అత్యధిక టెస్టు విజయాలు సాధించిన రికార్డు సౌరవ్ గంగూలీ పేరిట ఉంది. గంగూలీ తన కెరీర్‌లో 11 విదేశీ టెస్టు విజయాల్ని సాధించాడు. భారత కెప్టెన్ గా గంగూలీ 49 టెస్టులకు సారథ్యం వహించగా, ధోని 60 టెస్టులకు, కోహ్లి 29 టెస్టులకు సారథిగా పనిచేశాడు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : విదేశాల్లో అత్యధిక టెస్టు విజయాలు సాధించిన రెండో భారత కెప్టెన్ 
ఎప్పుడు : ఆగస్టు 14
ఎవరు : విరాట్ కోహ్లీ
ఎందుకు : శ్రీలంకపై విజయం ద్వారా ఏడో టెస్టు విజయాన్ని సాధించిన కోహ్లీ

అలెగ్జాండర్ జ్వెరెవ్‌కు రోజర్స్ కప్ఏటీపీ మాస్టర్స్ సిరీస్ రోజర్స్ కప్ టోర్నమెంట్‌లో పురుషుల సింగిల్స్ టైటిల్‌ను అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) గెలుచుకున్నాడు. మాంట్రియల్ (కెనడా)లో ఆగస్టు 15న జరిగిన ఫైనల్లో రోజర్ ఫెదరర్(స్విట్జర్లాండ్)ను అలెగ్జాండర్ జ్వెరెవ్ ఓడించాడు. పురుషుల డబుల్స్ టైటిల్‌ను హెర్బర్ట్, మహుట్ (ఫ్రాన్స్) జోడీ గెలుచుకుంది.

అవార్డులుఐదుగురికి కీర్తిచక్ర, 17 మందికి శౌర్య పురస్కారాలు  ఉగ్రవాదులపై పోరులో అమరులైన ఇద్దరు సైనికులతో పాటు ఐదుగురు భద్రతా దళాల సిబ్బందిని దేశ రెండో అత్యున్నత గాలంట్రీ అవార్డు అయిన కీర్తిచక్రకు ఎంపికచేశారు. 71వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మొత్తం 112 శౌర్య పురస్కారాలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆగస్టు 14న ఆమోదం తెలిపారు. వీటిలో ఐదు కీర్తి చక్ర, 17 శౌర్యచక్ర, 85 సేనా మెడల్స్, మూడు నౌకాదళ సేనా మెడల్స్, రెండు వాయుసేన మెడల్స్ ఉన్నాయి. హవిల్దార్ గిరిస్ గురుంగ్ (గూర్ఖా రైఫిల్స్), మేజర్ డేవిడ్ మన్‌లన్(నాగా రెజిమెంట్), ప్రమోద్ కుమార్ (సీఆర్‌పీఎఫ్ 49 బెటాలియన్ కమాండెంట్)లు మరణానంతరం కీర్తిచక్రకు ఎంపికయ్యారు. మేజర్ ప్రీతం సింగ్ కున్వర్ (గర్వాల్ రైఫిల్), చేతన్ కుమార్ చీతా (సీఆర్‌పీఎఫ్ సీనియర్ అధికారి)లు కూడా ఈ పురస్కారాలకు ఎంపికయ్యారు. దేశ అత్యున్నత శౌర్య పురస్కారమైన అశోక చక్రకు ఎవరినీ ఎంపిక చేయలేదు. 
మే 20న జమ్మూ కశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో ఉగ్రవాద వ్యతిరేక పోరులో హవిల్దార్ గురుంగ్ అమరుడయ్యారు. తీవ్రంగా గాయపడ్డా.. ధైర్య సాహసాల్ని ప్రదర్శిస్తూ ఉగ్రవాది వైపుకు దూసుకెళ్లి కాల్పులు జరిపారు. జూన్ 6న నాగాలాండ్‌లో తీవ్రవాదులతో ఎదురుకాల్పుల్లో మేజర్ మన్‌లన్ ప్రాణాలు కోల్పోయారు. మే 25న కశ్మీర్‌లో ఉగ్రవాదులతో పోరులో చూపిన తెగువకు మేజర్ కున్వర్ కీర్తిచక్రకు ఎంపికయ్యారు. సాహస పతకాలకు హోం శాఖ 190 మందిని ఎంపిక చేయగా.. వీరిలో ఛత్తీస్‌గఢ్‌లో మావోల దాడిలో అమరులైన 53 మంది సీఆర్‌పీఎఫ్ సిబ్బంది ఉన్నారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఐదుగురు సైనికులకు కీర్తి చక్ర పురస్కారం 
ఎప్పుడు : ఆగస్టు 14 
ఎవరు : కేంద్ర ప్రభుత్వం 

ఏపీ, తెలంగాణకు సేవా పతకాలు విధి నిర్వహణలో అత్యుత్తమ సేవలందించిన పోలీసు అధికారులకు ఏటా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించే అత్యుత్తమ సేవా పతకాలను కేంద్రం ఆగస్టు 14న ప్రకటించింది. దేశవ్యాప్తంగా 190 మందికి పోలీసు శౌర్య పతకాలు, 93 మందికి రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు, 706 మందికి అత్యుత్తమ సేవా పతకాలు కలుపుకొని మొత్తం 990 పతకాలను ప్రకటించింది.
తెలంగాణకు 13 పతకాలు ఈ సారి తెలంగాణ రాష్ట్రం నుంచి 13 మంది పోలీసు అధికారులు ఈ పతకాలకు ఎంపికయ్యారు. పౌర సరఫరాల శాఖ కమిషనర్, సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్, మెట్రో రైల్ విభాగంలో పని చేస్తున్న అదనపు డీసీపీ ఎ.బాలకృష్ణలకు రాష్ట్రపతి పోలీసు పతకాలు (పీపీఎం) దక్కాయి. కేంద్ర హోం శాఖ ఆగస్టు 14న ఈ మేరకు ప్రకటించింది. మరో 11 మంది పోలీసు అధికారులకు ఇండియన్ పోలీస్ మెడల్స్ దక్కాయి. ప్రత్యేక మహిళా కారాగారం చీఫ్ హెడ్‌వార్డర్ ఎ.ప్రమీలా బాయికి రాష్ట్రపతి కరెక్షనల్ సర్వీస్ మెడల్ దక్కింది.
ఏపీకి 67 పతకాలు రాష్ట్రం నుంచి 67 మంది పోలీసు అధికారులు సేవా పతకాలకు ఎంపికయ్యారు. ఇందులో 52 పోలీసు శౌర్య, 3 రాష్ట్రపతి విశిష్ట సేవ, 12 అత్యుత్తమ సేవా పతకాలు ఉన్నాయి. 
రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు ఈ ఏడాది కిగాను ఏపీలోని విజయవాడ ఏసీబీ జాయింట్ డెరైక్టర్ కేవీ లక్ష్మీనాయక్, కర్నూలు ఆర్‌ఐవో ఏఎస్పీ దొడ్లా నరహరి, విజయనగరం ఏఎస్‌ఐ కొటారి ప్రసాద్ రావులకు దక్కాయి. రాష్ట్రపతి శౌర్య పతకం ఈ ఏడాది ఒక్కరికే ప్రకటించగా.. అది ఛత్తీస్‌గఢ్‌కు చెందిన దివంగత ప్లటూన్ కమాండర్ శంకర్‌రావుకు దక్కింది. 

భారతీయ అమెరికన్ ప్రొఫెసర్‌కు జీవనసాఫల్య పురస్కారంమోడ్రన్ కమ్యూనికేషన్‌‌స రంగంలో విశిష్ట సేవలు అందించిన భారతీయ అమెరికన్ ప్రొఫెసర్ థామస్ కైలత్‌కు అమెరికా కేంద్రంగా పనిచేసే మార్కోనీ సొసైటీ జీవనసాఫల్య పురస్కారాన్ని అందజేసింది. కమ్యూనికేషన్ టెక్నాలజీ రంగం అభివృద్ధికి అమూల్యమైన సేవలు అందించడంతో కైలత్‌ను భారత ప్రభుత్వం 2009లో పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. 
రేడియోను కనుగొన్న నోబెల్ గ్రహీత గుగ్లిల్మో మార్కోనీ పేరు మీద ఈ సొసైటీని 1975లో స్థాపించారు. మానవులకు సృజనాత్మక సేవలు అందించిన వారికి ఇది జీవన సాఫల్య పురస్కారం అందజేస్తుంది. కై లత్ 1935లో పుణేలో జన్మించారు. స్వదేశంలో ఇంజనీరింగ్ చదివాక 1957లో అమెరికా వెళ్లి ఉన్నత విద్యాభ్యాసం చేశారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : మార్కోని సొసైటీ జీవన సాఫల్య పురస్కారం - 2017
ఎప్పుడు : ఆగస్టు 14
ఎవరు : భారతీయ అమెరికన్ ప్రొఫెసర్ థామస్ కైలత్
ఎందుకు : మోడ్రన్ కమ్యూనికేషన్‌‌స రంగంలో విశిష్ట సేవలు అందించినందుకు గాను

వార్తల్లో వ్యక్తులుఉపరాష్ట్రపతిగా వెంక య్య ప్రమాణ స్వీకారం 
 ముప్పవరపు వెంకయ్యనాయుడు భారత 13వ ఉపరాష్ట్రపతిగా ఆగస్టు 11న ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వెంకయ్యతో ప్రమాణం చేయించారు. అనంతరం రాజ్యసభ చైర్మన్‌గా కూడా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ప్రధాని నరేంద్రమోదీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, అధికార, విపక్ష పార్టీల నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 
అన్సారీకి రాజ్యసభ వీడ్కోలురాజ్యసభ చైర్మన్‌గా చివరి రోజైన ఆగస్టు 10న హమీద్ అన్సారీకి పార్టీలకతీతంగా ఘనంగా వీడ్కోలు పలికారు. రాజ్యాంగ ధర్మాన్ని పరిరక్షించడంలో అన్సారీ తన వంతు న్యాయం చేశారని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. రాజ్యసభను సజావుగా నడపడంలో అన్సారీ పాత్రను సభ్యులు గుర్తు చేసుకున్నారు. రెండు సార్లు (2007, 2012) ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన అన్సారీ.. పదేళ్ల పాటు రాజ్యసభ చైర్మన్‌గా వ్యవహరించారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : భారత 13వ ఉపరాష్ట్రపతి 
ఎప్పుడు : ఆగస్టు 11
ఎవరు : ఎం. వెంకయ్యనాయుడు 
ఎక్కడ : దర్బార్ హాల్, రాష్ట్రపతి భవన్ 

సీబీఎఫ్‌సీ ఛైర్మన్‌గా ప్రసూన్ జోషి జాతీయ సెన్సార్ బోర్డు(సీబీఎఫ్‌సీ) చైర్మన్ పదవి నుంచి పహ్లాజ్ నిహలానీని కేంద్ర ప్రభుత్వం తొలగించింది. ఈయన స్థానంలో బాలీవుడ్ గీత రచయిత ప్రసూన్ జోషిని నియమించింది. సినీనటి విద్యాబాలన్‌కు కూడా కొత్త కమిటీలో చోటు కల్పించింది. 
బ్లాక్, తారే జమీన్‌పర్, భాగ్ మిల్కా భాగ్, రంగ్ దే బసంతి, ఢిల్లీ-6, నీర్జా చిత్రాలకు జోషి పాటలు రాశారు. పద్మశ్రీ, ఉత్తమ గీత రచయితగా జాతీయ అవార్డు అందుకున్న జోషి.. స్వచ్ఛ్ భారత్ అభియాన్‌తో పాటుగా పలు పథకాల ప్రచార గీతాలను రచించారు. జోషి నేతృత్వంలోని కమిటీలో విద్యాబాలన్‌తోపాటు గౌతమీ తాడిమల్ల, జీవితా రాజశేఖర్ తదితరులు సభ్యులుగా ఉన్నారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : సీబీఎఫ్‌సీ కొత్త చైర్మన్‌గా ప్రసూన్ జోషి 
ఎప్పుడు : ఆగస్టు 11
ఎవరు : కేంద్ర ప్రభుత్వం 

డబ్ల్యూహెచ్‌వో రాయబారిగా మిల్కాసింగ్ఫ్లయింగ్ సిఖ్ మిల్కా సింగ్ ప్రపంచ ఆరోగ్య సంస్థకు సౌహార్ధ రాయబారిగా ఎంపికయ్యారు. ఆయన సౌత్ ఈస్ట్ ఆసియా రీజియన్ (ఎస్‌ఈఏఆర్) ప్రాంతానికి వ్యాయామ రాయబారిగా ఎంపికై నట్లు ఆగస్టు 11న డబ్ల్యూహెచ్‌వో ప్రకటించింది. మిల్కా సింగ్ ఎస్‌ఈఏఆర్ పరిధిలో వివిధ రకాల వ్యాధులపై అవగాహన కల్పించనున్నారు. ముఖ్యంగా శారీరక వ్యాయామం ద్వారా 10 శాతం వ్యాధులు నయమవుతాయని ఆయన ప్రచారం చేయనున్నారు. తద్వారా 2025 నాటికి నాన్ కమ్యూనికబుల్ వ్యాధులను 25 శాతం తగ్గించాలని నిర్ణయించినట్లుగా ఎస్‌ఈఏఆర్ ప్రాంతీయ డెరైక్టర్ పూనమ్ కెట్రాపాల్ సింగ్ వెల్లడించారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఎస్‌ఈఏఆర్ వ్యాయామ రాయబారిగా మిల్కాసింగ్ 
ఎప్పుడు : ఆగస్టు 11
ఎవరు : డబ్ల్యూహెచ్‌ఓ 
ఎందుకు : వ్యాయామంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు 

కెన్యా అధ్యక్షుడిగా ఎన్నికైన ఉహురు కెన్యట్టా కెన్యా అధ్యక్షుడిగా ఉహురు కెన్యట్టా మరోసారి ఎన్నికయ్యారు. ఆగస్టు 11న వెలువడిన ఎన్నికల ఫలితాల్లో కెన్యట్టా 54.27 శాతం సాధించారు. ఆయన ప్రత్యర్థి రైలా ఒడింగాకు 44.74 శాతం ఓట్ల వచ్చాయి. ఉహురు కెన్యట్టా 2013లో కెన్యా 4వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : కెన్యా అధ్యక్ష ఎన్నికలు 2017
ఎప్పుడు : ఆగస్టు 11
ఎవరు : విజయం సాధించిన ఉహురు కెన్యట్టా 
ఎక్కడ : కెన్యా 

అంతరిక్షం నుంచి కనిపించేలా ‘మండేలా’జాతివివక్ష వ్యతిరేకోద్యమ నేత నెల్సన్ మండేలా శతజయంతి సందర్భంగా దక్షిణాఫ్రికా జైళ్లలోని వందలాది మంది ఖైదీలు ప్రపంచంలోనే అతిపెద్ద ముఖచిత్ర దుప్పటితో(4,500 చదరపు మీటర్లు) నివాళి అర్పించనున్నారు. ఈ మేరకు బ్లాంకెట్స్ ఫర్ మండేలా అనే సంస్థ ‘మాసివ్ మండేలా మాస్టర్‌పీస్’ పేరుతో ఈ ప్రాజెక్టును ఆగస్టు 12న జోండర్‌వాటర్ జైల్లో ప్రారంభించింది. ఈ చిత్రాన్ని ఊలు దారాలతో అల్లుతారు. వచ్చే ఏడాది జూలై 18 (మండేలా శతజయంతి) కోసం చిన్న చిన్న ఊలు దుప్పట్లను కలిపికుట్టి ఈ భారీ దుప్పటిని తయారుచేస్తారు. దీన్ని అంతరిక్షం నుంచి కూడా చూడొచ్చు. దుప్పట్లకు అవసరమయ్యే ఊలు ఖర్చు రూ. 6.6 కోట్లను ఓ అజ్ఞాత వ్యాపారి అందచేయనున్నారు. 

దేశప్రజలను ఉద్దేశించి రాష్ట్రపతి కోవింద్ తొలి ప్రసంగం 2022 నాటికల్లా నవభారత నిర్మాణం సాధించాలంటే.. ప్రజలు, ప్రభుత్వ భాగస్వామ్యం చాలా ముఖ్యమని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పేర్కొన్నారు. భారత డీఎన్‌ఏలో ఉండే మానవతావాదంతో కూడిన సుహృద్భావ సమాజనిర్మాణమే నవభారతమని ఆయన అన్నారు. భారత 71వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 14న దేశప్రజలనుద్దేశించి తొలిసారి రాష్ట్రపతి హోదాలో ప్రసంగించిన కోవింద్.. బ్రిటిషర్లనుంచి దేశానికి విముక్తి కల్పించటంలో పోరాడిన యోధులందరనీ గుర్తుచేసుకున్నారు. నాటి వీరుల పోరాట స్ఫూర్తితో జాతినిర్మాణంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని కోరారు. ప్రజలు-ప్రభుత్వం, వ్యక్తి-సమాజం, కుటుంబం-సంఘం సంబంధాల మధ్యే దేశం నిర్మితమైందన్నారు. 

పాకిస్థాన్ మదర్ థెరిసా రూత్ పఫావూ మృతిపాకిస్థాన్ మదర్ థెరిసాగా పేరుగాంచిన రూత్ పఫావూ(87) కరాచీలో ఆగస్టు 10న మరణించారు. జర్మనీకి చెందిన ఆమె పాకిస్థాన్‌లో కుష్టు వ్యాధి నిర్మాలనకు తన జీవితాన్ని అంకితం చేశారు. దీంతో ఆమెను పాకిస్థాన్ మదర్ థెరిసాగా అక్కడి ప్రజలు కొనియాడతారు.


అంతర్జాతీయంఅత్యంత నివాసయోగ్య నగరంగా మెల్‌బోర్న్ ప్రపంచంలోనే నివసించడానికి అత్యంత యోగ్యమైన నగరంగా ఆస్ట్రేలి యాలోని మెల్‌బోర్న్ నిలిచింది. ఎకనమిస్ట్ ఇంటెలిజెన్‌‌స యూనిట్ (ఈఐయూ) తాజాగా నిర్వహించిన ప్రపంచ నివాసయోగ్య నగరాల సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 140 నగరాలపై స్థిరత్వం, ఆరోగ్య సేవలు, సంస్కృతి, పర్యావరణం, విద్య, మౌలిక వసతులు తదితర 30 అంశాలను ఆధారంగా చేసుకుని ఈఐయూ ఈ సర్వే చేసింది. మొదటి లేదా చివరి పది నగరాల్లో ఏ భారత నగరానికీ చోటు దక్కలేదు. ఆస్ట్రియా రాజధాని వియన్నా, కెనడాలోని వాంకోవర్, టొరంటో, కల్గరీ వరుసగా రెండు, మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నాయి.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : అత్యంత నివాసయోగ్య నగరంగా మెల్‌బోర్న్ 
ఎప్పుడు : ఆగస్టు 16
ఎవరు : ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ 
ఎక్కడ : ప్రపంచవ్యాప్తంగా 

షాంఘై ర్యాంకింగ్స్ లో హార్వర్డ్‌కు అగ్రస్థానం షాంఘై ర్యాంకింగ్ కన్సల్టెన్సీ విడుదల చేసిన ‘అకడమిక్ ర్యాంకింగ్స్ ఆఫ్ వరల్డ్ యూనివర్సిటీస్’లో అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయం మొదటి ర్యాంకు సాధించింది. స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ రెండో ర్యాంకు, మసాచుసెట్స్ టెక్నాలజీ వర్సిటీ మూడో ర్యాంకు, కాలిఫోర్నియా వర్సిటీ నాల్గో ర్యాంకు సాధించాయి. ప్రిన్‌‌సటన్, ఆక్స్‌ఫర్డ్, కొలంబియా, కాలిఫోర్నియా టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్, షికాగో వర్సిటీలు తొలి 10 జాబితాలో స్థానం పొందాయి. చైనాలోని ప్రతిష్టాత్మకమైన సింగువా వర్సిటీ తొలిసారిగా టాప్ 50లో చోటు దక్కించుకుంది. ఆసియా నుంచి మెరుగైన ర్యాంకు పొందిన వాటిలో టోక్యో యూనివర్సిటీ(24) ఉంది. యూరప్ నుంచి స్విస్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్ ఉత్తమ ర్యాంకు పొందింది. 2003 నుంచి షాంఘై సంస్థ ప్రపంచంలోని అత్యుత్తమమైన తొలి 500 విద్యాసంస్థలకు ర్యాంకులు ప్రకటిస్తోంది.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : షాంఘై యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 
ఎప్పుడు : ఆగస్టు 15
ఎవరు : మొదటి స్థానంలో హార్వర్డ్ యూనివర్సిటీ 
ఎక్కడ : అమెరికా 

ఖతార్ సరిహద్దు తెరిచిన సౌదీహజ్ యాత్ర సందర్భంగా సౌదీ అరేబియా-ఖతార్ మధ్య దౌత్య సంబంధాల పునరుద్ధరణకు ముందడుగు పడింది. హజ్ యాత్రికుల కోసం ఖతార్ సరిహద్దును తిరిగి తెరవాలని సౌదీ అరేబియా నిర్ణయం తీసుకుంది. దీనివల్ల రియాద్‌వాసులు హజ్ యాత్రకు రావడానికి మార్గం సుగమమైంది. ఖతార్ రాజ కుటుంబ సభ్యుడైన షేక్ అబ్దుల్లా అల్ తానీతో జెడ్డాలో ప్రత్యేకంగా సమావేశమైన సౌదీ రాజు మహమ్మద్ బిన్ సల్మాన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అలాగే హజ్ యాత్రికుల కోసం ప్రత్యేక జెట్ విమానాలను సౌదీలోని జెడ్డా నుంచి ఖతార్ రాజధాని దోహాకు పంపించనున్నట్లు సౌదీ మీడియా తెలిపింది. దీనికయ్యే ఖర్చంతా సౌదీ రాజు భరిస్తారంది. ఉగ్రవాదానికి మద్దతిస్తోందంటూ సౌదీ, ఈజిప్టు, బహ్రెయిన్, యూఏఈ.. ఇటీవల ఖతార్‌తో దౌత్య సంబంధాలు తెంచుకున్నాయి.

చైనాలో తొలి సైబర్ కోర్టు ప్రారంభం 
ఇంటర్నెట్‌కు సంబంధించిన ఫిర్యాదులను పరిష్కరించడానికి తొలి సైబర్ కోర్టును చైనా ప్రారంభించింది. జెజియాంగ్ ప్రావిన్‌‌సలో ఈ-కామర్స్ సంస్థలకు కేంద్రమైన హాంగ్జూ నగరంలో ఈ కోర్టును ఏర్పాటు చేశారు. ఆన్‌లైన్‌లో వాణిజ్య వివాదాలతో పాటు కాపీరైట్ చట్టం ఉల్లంఘనలను ఈ న్యాయస్థానం విచారిస్తుంది. ఈ కోర్టులో విచారణ ప్రక్రియ మొత్తం ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది. 2017 ఏడాది జూన్ నాటికి చైనాలో ఇంటర్నెట్‌ను వినియోగించేవారి సంఖ్య 751 మిలియన్లకు చేరుకుంది.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : చైనాలో ప్రపంచ తొలి సైబర్ కోర్టు ప్రారంభం 
ఎప్పుడు : ఆగస్టు 17 
ఎక్కడ : హాంగ్జూ, చైనా 
ఎందుకు : ఆన్‌లైన్ వాణిజ్య వివాదాల పరిష్కారానికి 

అమెరికా, దక్షిణ కొరియా సంయుక్త సైనిక విన్యాసాలు అమెరికా, దక్షిణ కొరియా సంయుక్త వార్షిక సైనిక విన్యాసాలు ఆగస్టు 21న ప్రారంభమయ్యాయి. తమ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరుగుతాయన్న ఉత్తర కొరియా అభ్యంతరాల మధ్యే ఈ విన్యాసాలు జరగడం గమనార్హం. వేలాది మంది సైనికులు ఈ ఉల్చి-ఫ్రీడం గార్డియన్ సంయుక్త సైనిక కసరత్తు నిర్వహించారు. దక్షిణ కొరియాలో రెండు వారాల పాటు సాగే ఈ విన్యాసాల్లో క్షేత్ర స్థాయిలో కాల్పులు, యుద్ధ ట్యాంకుల విన్యాసాలు వంటివేవీ లేకుండా కంప్యూటర్ల ఆధారంగా సాధన జరుగుతుంది. వీటిలో సుమారు 17,500 మంది అమెరికా సైనికులు, 50 వేల మంది దక్షిణ కొరియా సైనికులు పాల్గొంటారు. కాగా ఇవి రక్షణాత్మక విన్యాసాలేనని, ద్వీపకల్పంలో ఉద్రిక్తతల్ని రెచ్చగొట్టేవి కాదని దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జేఇన్ పేర్కొన్నారు.

స్పెయిన్ ఉగ్రదాడిలో 13 మంది మృతి స్పెయిన్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం బార్సిలోనాలోని లాస్ రాంబ్లాస్‌లో ఆగస్టు 17న ఓ వ్యాను పర్యాటకులపైకి దూసుకుపోవడంతో 13 మంది మరణించారు. 50 మందికిపైగా గాయపడ్డారు. ఇది ఉగ్రవాదుల దాడి అని పోలీసులు ధ్రువీకరించారు.

జాతీయంకృత్రిమ మోకాలి చిప్పల ధర తగ్గింపు 
 మోకాలి మార్పిడి శస్త్రచికిత్సల్లో ఉపయోగించే కృత్రిమ మోకాలి చిప్పల ధరలను ప్రభుత్వం గణనీయంగా తగ్గించింది. ప్రైవేటు వైద్యశాలలు వాస్తవ వెల కన్నా లక్ష రూపాయకుల పైగా అధిక ధరలు వసూలు చేస్తుండటంతో వీటి ధరలపై ప్రభుత్వం గరిష్ట పరిమితిని విధించింది. కేంద్రం తాజా ఉత్తర్వులతో కృత్రిమ మోకాలి చిప్పలు 70% తగ్గి... రకాన్ని బట్టి రూ.54 వేల నుంచి గరిష్టంగా రూ.1.14 లక్షల వరకు ఉండనున్నాయి. 
ప్రభుత్వ లెక్కల ప్రకారం దేశంలో మోకాలి మార్పిడి చికిత్సలు అవసరమైనవారు దాదాపు 2 కోట్ల మంది ఉండగా, వారిలో ఏడాదికి దాదాపు ఒకటిన్నర లక్ష మంది శస్త్రచికిత్సలు చేయించుకుంటున్నారు. కొత్త ధరల ప్రకారం ప్రస్తుతం విసృ్తతంగా వాడే కోబాల్ట్-క్రోమియం కృత్రిమ మెకాలి చిప్ప ధర రూ.54,720. ఇప్పటి వరకు ఆసుపత్రులు దీనికి రూ.1.6 లక్షల వరకు వసూలు చేస్తుండేవి. 80% శస్త్రచికిత్సల్లో ఈ రకం మోకాలి చిప్పలనే వాడుతున్నారు. క్యాన్సర్, కణతిలతో బాధపడుతున్న రోగులకు వాడే ప్రత్యేక మోకాలి చిప్పల ధరను ప్రభుత్వం రూ.1,13,950గా నిర్ణయించింది. ఇంతకుముందు దీనికి ఆసుపత్రులు గరిష్టంగా దాదాపు 9 లక్షల వరకు వసూలు చేసేవి.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : కృత్రిమ మోకాలి చిప్పల ధరల తగ్గింపు 
ఎప్పుడు : ఆగస్టు 16
ఎవరు : కేంద్రప్రభుత్వం 
ఎక్కడ : దేశవ్యాప్తంగా 
ఎందుకు : ఆస్పత్రుల దోపిడీని అడ్డుకునేందుకు 

యూపీలో ఆన్‌లైన్‌లో మదరసాల నమోదు ఇస్లాం విద్యా సంస్థలు మదరసాల్లో అక్రమాలు నిరోధించేందుకు, వాటిని ఆన్‌లైన్‌లో నమోదుచేసేలా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఒక పోర్టల్‌ను ప్రారంభించింది. మదరసాల్లో అక్రమాలపై చాలా ఫిర్యాదులు వచ్చాయని, వాటి నమోదును ఆన్‌లైన్ చేయడం వల్ల మదరసాల నిర్వహణ, ఉపాధ్యాయులు తదితర వివరాలు అందుబాటులో ఉంటాయని వక్ఫ్ మంత్రి మోహసిన్ రాజా చెప్పారు. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తున్న డిజిటల్ విధానంలో ఈ చర్య ఓ భాగం.

మధ్యప్రదేశ్‌లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ మధ్యప్రదేశ్‌లో వివిధ ప్రభుత్వ విభాగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇవ్వనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రకటించారు. అయితే.. అటవీ శాఖకు మాత్రం ఈ రిజర్వేషన్ల నుంచి మినహాయింపు ఇవ్వనున్నారు. 12వ తరగతిలో 75 శాతం లేదా, సీబీఎస్‌ఈలో 85 శాతం పొందిన విద్యార్థులకు ఇంజనీరింగ్, మెడిసిన్ విద్య ఖర్చును బీజేపీ భరిస్తుందని చౌహాన్ ప్రకటించారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : మధ్యప్రదేశ్‌లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు 
ఎప్పుడు : ఆగస్టు 20
ఎవరు : ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ 
ఎందుకు : వివిధ ప్రభుత్వ విభాగాల్లో అమలు

తమిళనాడులో ఒక్కటైన ఈపీఎస్, ఓపీఎస్ వర్గాలు ఆర్నెల్ల విభేదాల అనంతరం ఏఐఏడీఎంకే లోని పన్నీర్‌సెల్వం, పళనిస్వామి వర్గాలు విలీనమయ్యాయి. అధికార మార్పిడి విషయంలో రెండు వర్గాలు పరస్పర అంగీకారానికి వచ్చాయి. దీని ప్రకారం పార్టీ పగ్గాలు పన్నీర్ సెల్వం, ప్రభుత్వ బాధ్యతలు పళని స్వామి నిర్వర్తించాలని నిర్ణయించారు. దీంతోపాటుగా పన్నీరు సెల్వానికి ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖలతోపాటు మరికొన్ని శాఖలను పన్నీర్ వర్గానికి ఇచ్చేందుకు కూడా సీఎం పళనిస్వామి అంగీకరించారు. ఇకపై పన్నీర్ సెల్వం అన్నాడీఏంకే సమన్వయకర్తగా, పళనిస్వామి ఉప సమన్వయకర్తగా వ్యవహరిస్తారు. 
డిప్యూటీగా పన్నీర్ ప్రమాణం 
అనంతరం గవర్నర్ విద్యాసాగర్‌రావు పన్నీర్‌సెల్వంతో ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ చేయించారు. డిప్యూటీ సీఎం హోదాలో పన్నీర్ సెల్వం.. ఆర్థిక, గృహ, గ్రామీణ గృహ నిర్మాణం, మురికివాడల నిర్మూలన, పట్టణాభివృద్ధి, చెన్నై మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ శాఖలను నిర్వహిస్తారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : విలీనమైన పన్నీర్ సెల్వం, పళనిస్వామి వర్గాలు 
ఎప్పుడు : ఆగస్టు 21
ఎవరు : ఏఐఏడీఎంకే లోని రెండు వర్గాలు 
ఎక్కడ : తమిళనాడు 

2018 నాటికి ఆన్‌లైన్‌లోనే పాస్‌పోర్ట్ వెరిఫికేషన్2018 మార్చి నాటికి పాస్‌పోర్టుల జారీ కోసం పోలీసులు భౌతికంగా వెళ్లి వెరిఫికేషన్ చేయాల్సిన అవసరం ఉండదని హోంశాఖ కార్యదర్శి రాజీవ్ మహర్షి తెలిపారు. ఇందుకోసం క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ అండ్ సిస్టమ్స్ ప్రాజెక్టు(సీసీటీఎన్‌ఎస్)ను విదేశాంగ శాఖ నేతృత్వంలోని పాస్‌పోర్టు సేవలకు అనుసంధానం చేస్తున్నట్లు తెలిపారు. దీనివల్ల పోలీసులు భౌతికంగా వెరిఫికేషన్‌కు వెళ్లకుండా ఆన్‌లైన్‌లోనే వ్యక్తుల వివరాలు (గతంలో నేరచరిత్ర ఏమైనా ఉంటే) తెలుసుకునే అవకాశం ఉందన్నారు. సీసీటీఎన్‌ఎస్ ప్రాజెక్టులో భాగంగా హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆగస్టు 21న న్యూఢిల్లీలో డిజిటల్ పోలీస్ పోర్టల్‌ను ఆవిష్కరించారు. 
దేశంలోని మొత్తం 15,398 పోలీస్ స్టేషన్లలో 13,775 స్టేషన్లను సీసీటీఎన్‌ఎస్ పరిధిలోకి తీసుకొచ్చారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఆన్‌లైన్‌లో పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ 
ఎప్పుడు : 2018 నాటికి 
ఎవరు : కేంద్ర ప్రభుత్వం 
ఎక్కడ : దేశవ్యాప్తంగా 
ఎందుకు : పాస్‌పోర్ట్ వెరిఫికేషన్‌లో జాప్యాన్ని నివారించేందుకు 

రవాణా సేవలకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి తెలంగాణలో రవాణా శాఖ పరిధిలోని అన్ని సేవలను ఆధార్‌తో అనుసంధానిస్తూ రవాణాశాఖ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 23 నుంచే ఇది అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం రాష్ట్రంలో వాహనాల రిజిస్ట్రేషన్, లెసైన్సుల జారీ, యాజమాన్య హక్కు బదలాయింపు, పన్నుల చెల్లింపు, పర్మిట్ల జారీ తదితర సేవలకు ఆధార్‌ను తప్పనిసరిగా జత చేయాల్సి ఉంటుంది. 

ట్రిపుల్ తలాక్ చెల్లదు : సుప్రీంకోర్టు ముస్లింలు అప్పటికప్పుడు ట్రిపుల్ తలాక్ ద్వారా భార్యలకు విడాకులు ఇవ్వడం కుదరదని సుప్రీంకోర్టు ఆగస్టు 22న తేల్చిచెప్పింది. ట్రిపుల్ తలాక్ చెల్లదనీ, ఇది చట్ట, రాజ్యాంగ విరుద్ధమని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 3:2 మెజారిటీతో తీర్పు చెప్పింది. పునరాలోచన చేసుకునేందుకు ఆస్కారం లేని, క్షణాల్లో ఇచ్చేసే ట్రిపుల్ తలాక్ ఖురాన్ సూక్తులకు వ్యతిరేకమనీ, అంగీకారయోగ్యం కాదని జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ ఆర్.ఎఫ్.నారిమన్, జస్టిస్ యు.యు.లలిత్‌లు ఇచ్చిన మెజారిటీ తీర్పు అభిప్రాయపడింది. ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధమని తేలుస్తూ జస్టిస్ జోసెఫ్, జస్టిస్ నారిమన్ విడివిడిగా తీర్పులివ్వగా... జస్టిస్ లలిత్ మాత్రం నారిమన్ తీర్పుతో ఏకీభవించారు. అలా వీరిది మెజారిటీ తీర్పు అయి్యంది. కాగా మైనారిటీ తీర్పునిచ్చిన జస్టిస్ ఖేహర్, జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్‌లు మాత్రం విరుద్ధ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ట్రిపుల్ తలాక్ దీర్ఘకాలంగా వాడుకలో ఉన్నదనే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని... షరియా చట్టాలు కూడా ఆమోదిస్తున్నందున అది మతాన్ని ఆచరించే స్వేచ్ఛను ప్రసాదిస్తున్న ఆర్టికల్-25 కిందకు వస్తుందన్నారు. ట్రిపుల్ తలాక్‌పై ఆర్నెల్ల నిషేధం విధించాలనీ, ఆలోగా రాజకీయ పార్టీలన్నీ విభేదాలను పక్కనబెట్టి ఈ అంశంలో చట్టం చేయడానికి ఏకతాటిపైకి రావాలని కోరారు. 
సుప్రీంకోర్టు 2015 అక్టోబర్ 16న సుమోటోగా ఓ పిల్‌ను చేపట్టింది. సుప్రీం పిల్‌కు షాయరా భానోతోపాటు మరో నలుగురు బాధిత మహిళల పిటిషన్లూ తోడయ్యాయి. మరో రెండు పిటిషన్లను ఇతర సంస్థలు వేశాయి. మొత్తం ఈ ఏడు పిటిషన్లను సుమోటో పిల్‌తో కలిపి ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారించి ఈ తీర్పునిచ్చింది. 
‘ఇన్‌స్టంట్’కే నో
సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది... ఉన్నపళంగా మూడుసార్లు తలాక్ చెప్పి విడాకులు తీసుకోవడం (ఇన్‌స్టంట్) చెల్లదని మాత్రమే. అంతేకాని మొత్తం ట్రిపుల్ తలాక్ విధానాన్ని నిషేధించలేదు. ముస్లిం పర్సనల్ లా ప్రకారం విడాకులు మూడురకాలు.
తలాక్-ఎ-అహ్‌సాన్: ముస్లిం దంపతులు విడాకులు తీసుకోవడానికి సరైన మార్గంగా దీన్ని పరిగణిస్తారు. అహ్‌సాన్ అనే పదానికి అర్థం... అత్యుత్తమ లేదా సరైన. దీని ప్రకారం... భార్య రుతుక్రమంలో లేనప్పుడు... భర్త ఏకవాక్యంలో విడాకులు ఇస్తున్నట్లు చెప్పాలి. తర్వాత భార్య నిర్దేశిత కాలంపాటు నిరీక్షించాలి. ఈ కాలాన్ని ఇద్దత్ అంటారు. మూడు నెలసరులు ‘ఇద్దత్’గా ఉంటుంది. ఒకవేళ భార్య గర్భంతో ఉంటే శిశువు జన్మించేదాకా ఇద్దత్ కాలం ఉంటుంది. ఈ సమయంలోపు భర్త మనసు మార్చుకుంటే... తలాక్‌ను వెనక్కితీసుకోవచ్చు. ఇద్దత్ కాలం ముగిస్తే మాత్రం విడాకులు మంజూరైనట్లే. 
తలాక్-ఎ-హసన్: పునరాలోచనకు తగినంత సమయం ఉంటుంది కాబట్టి దీన్ని కూడా కొంతవరకు మంచి పద్ధతిగానే పరిగణిస్తారు. ఈ విధానంలో మూడునెలల వ్యవధిలో నెలకోమారు చొప్పున భర్త మూడుసార్లు భార్యకు తలాక్ చెబుతాడు. తర్వాత విడాకులు మంజూరవుతాయి. ఒకవేళ ఆలోపు మనసు మార్చుకుంటే... వైవాహిక బంధాన్ని కొనసాగించవచ్చు. 
తలాక్-ఎ-బిద్దత్: ‘తలాక్... తలాక్... తలాక్’ అని వరుసగా మూడుసార్లు చెప్పేసి విడాకులు తీసుకోవడమే తలాక్-ఎ-బిద్దత్. షరియా చట్టం ప్రకారం ఇది చెల్లుబాటవుతోంది. ఒమేయద్ రాజులు విడాకులకు సులభమార్గంగా దీన్ని పరిచయం చేశారు. ఒక్కసారిగా మూడు పర్యాయాలు భర్త తలాక్ చెప్పాడంటే ఇక అంతే. విడాకులే. నిర్ణయాన్ని మార్చుకోవడానికి అవకాశం ఉండదు. 
క్షణికావేశంలో, అనాలోచితంగా నిర్ణయం తీసుకుని జీవిత భాగస్వామిని తీవ్ర మనోవేదనకు గురిచేస్తూ... క్షణాల్లో విడాకులిచ్చేయడం సరికాదని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. తలాక్‌ను 22 ముస్లిం మెజారిటీ దేశాలు నిషేధించడం గమనార్హం. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ట్రిపుల్ తలాక్ చెల్లదు 
ఎప్పుడు : ఆగస్టు 22
ఎవరు : సుప్రీంకోర్టు 

డిజిటల్ పోలీస్ పోర్టల్సేవలు ప్రారంభండిజిటల్ పోలీస్ పోర్టల్(డీపీపీ)ని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఆగస్టు 21న ప్రారంభించారు. నేరాలు, నేరస్థులపై నిఘా నెట్‌వర్క్ వ్యవస్థలు (సీసీటీఎన్‌ఎస్) అనే ప్రాజెక్టులో భాగంగా దీన్ని రూపొందించారు. నేరాలు, నేరస్థుల వివరాలతో జాతీయ సమాచార నిధి ఏర్పాటే సీసీటీఎన్‌ఎస్ లక్ష్యం. ఈ పోర్టల్ ద్వారా దేశవ్యాప్తంగా ఆన్‌లైన్‌లో ఫిర్యాదుల నమోదు, వివరాల ధ్రువీకరణ, అభ్యర్థనలు తదితర సేవలు అందుబాటులో ఉంటాయి. వీటితోపాటు 11 శోధన సదుపాయాలను, 46 నివేదికలను రాష్ట్ర పోలీస్ విభాగాలు, కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు, పరిశోధన సంస్థలు పొందొచ్చు. సీసీటీఎన్‌ఎస్ సమాచార నిధిలో ఇప్పటివరకు ఏడు కోట్ల నేరాలకు సంబంధించిన వివరాలను పొందుపరిచారు. 

ఉత్కళ్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంలో22 మంది మృతిఉత్కళ్ ఎక్స్‌ప్రెస్ రైలు ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లా ఖత్‌లి వద్ద ఆగస్టు 19న పట్టాలు తప్పడంతో 22 మంది మరణించారు. 156 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదానికి మానవ తప్పిదమే కారణమని ఆ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. 

బిహార్ వరదల్లో 98 మంది మృతి బిహార్‌లో వరదల వల్ల ఆగస్టు 18 నాటికి 98 మంది ప్రాణాలు కోల్పోయారు. 15 జిల్లాలకు చెందిన 93 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. 2.13 లక్షల మంది 504 సహాయక శిబిరాల్లో తలదాచుకున్నారు. జాతీయ రహదారులతోపాటు 124 రోడ్లు ధ్వంసమయ్యాయి. 70 మంది ఆర్మీ సిబ్బంది, 114 ఎన్‌డీఆర్‌ఎఫ్, 92 ఎస్‌డీఆర్‌ఎఫ్ బోట్ల సాయంతో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. 

రాష్ట్రీయంతెలంగాణలో స్వచ్ఛ భారత్ హ్యాకథాన్ 1.0 తెలంగాణ స్వచ్ఛ భారత్ మిషన్ ఆధ్వర్యంలో స్వచ్చ భారత్ హ్యాకథాన్ 1.0 ను ఆగస్టు 16న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ ప్రారంభించారు. సాంకేతిక కళాశాలల అధ్యాపకులు, విద్యార్థులు, రాష్ట్రంలోని ఎంపిక చేసిన జిల్లాల నుంచి డీఆర్‌డీఓలు సహా యూనిసెఫ్ బృందం ఇందులో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ సింగ్ స్వచ్ఛభారత్ మిషన్ అమలు విషయంలో తెలంగాణ రాష్ట్రం గత సంవత్సరకాలంగా మంచి ప్రగతి కనబర్చిందని తెలిపారు. స్వచ్ఛభారత్ మిషన్ డెరైక్టర్ నీతూ ప్రసాద్ తెలంగాణలో ఇప్పటికే 53% వ్యక్తిగత మరుగుదొడ్లు ఉన్నాయన్నారు. కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, మేడ్చల్ జిల్లాలు బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాలుగా ప్రకటించుకున్నాయని చెప్పారు.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : స్వచ్ఛ భారత్ హ్యాక్‌థాన్ 1.0
ఎప్పుడు : ఆగస్టు 16
ఎవరు : తెలంగాణ ప్రభుత్వం 
ఎక్కడ : హైదరాబాద్‌లో 
ఎందుకు : పరిసరాల పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు

ఏపీకి ‘జాతీయ స్వచ్ఛ విద్యాలయ’ పురస్కారంజాతీయ స్వచ్ఛ విద్యాలయ పురస్కారానికి ఆంధ్రప్రదేశ్ ఎంపికైంది. ప్రభుత్వ పాఠశాలల్లో పరిశుభ్రత, ఆరోగ్య ప్రమాణాలను మెరుగ్గా పాటిస్తున్న రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారాన్ని అందజేస్తుంది. ఒక్కో రాష్ట్రంలోని 40 పాఠశాలల నుంచి ఎంట్రీలను ఆహ్వానించగా, మొత్తం 24 రాష్ట్రాలు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన మొత్తం 960 ఎంట్రీల్లో 172 ను ఎంపిక చేసి ఉత్తమ ప్రమాణాలున్న పాఠశాలలకు ఈ పురస్కారాలను ప్రకటించారు. తమిళనాడు నుంచి అత్యధికంగా 25 పాఠశాలలు అత్యుత్తమ ప్రమాణాలున్నవిగా ఎంపిక కాగా, ఏపీ నుంచి 21 పాఠశాలలు ఎంపికయ్యాయి. అలాగే రాజస్తాన్ నుంచి 15 పాఠశాలలు అత్యుత్తమమైనవిగా ఎంపికయ్యాయి. మొదటి మూడు స్థానాల్లో నిలిచిన రాష్ట్రాలకు ‘‘జాతీయ స్వచ్ఛ విద్యాలయ పురస్కారాలను’ సెప్టెంబరు 1న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో బహుకరిస్తారు. అలాగే అత్యుత్తమ ఆరోగ్య, పరిశుభ్రత ప్రమాణాలు పాటిస్తున్న ఒక్కో పాఠశాలకు రూ. 50 వేల చొప్పున నగదును అందజేస్తారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఆంధ్రప్రదేశ్‌కు జాతీయ స్వచ్ఛ విద్యాలయ పురస్కారం 
ఎప్పుడు : ఆగస్టు 17
ఎవరు : కేంద్ర ప్రభుత్వం 
ఎందుకు : పాఠశాలల్లో పరిశుభ్రత, ఆరోగ్య ప్రమాణాలను మెరుగ్గా పాటిస్తున్నందుకు 

తెలంగాణలో తొలి స్మార్ట్ పోలీసు స్టేషన్ ప్రారంభం కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఏర్పాటు చేసిన తొలి స్మార్ట్ పోలీస్ స్టేషన్‌ను ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ఆగస్టు 18న ప్రారంభించారు. ఈ స్టేషన్ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు వీలుంటుందని తెలిపారు. 13 జిల్లాల్లో నూతనంగా ఎస్పీ కార్యాలయాలతోపాటు మూడు కమిషనరేట్ కార్యాలయాల నిర్మాణానికి రూ.375 కోట్లు కేటాయించినట్లు వివరించారు.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : తెలంగాణలో తొలి స్మార్ట్ పోలీస్ స్టేషన్ 
ఎప్పుడు : ఆగస్టు 18
ఎవరు : ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ 
ఎక్కడ : జమ్మికుంట, కరీంనగర్ 

తెలంగాణలో మహిళల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ నెంబర్ 181ను ఏర్పాటు చేసింది. ఆగస్టు 19న రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హెల్ప్‌లైన్‌ను లాంఛనంగా ప్రారంభించారు. వేధింపులు, దాడులకు గురైన మహిళలు 24 గంటలూ పనిచేసే హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ప్రత్యేక హెల్ప్‌లైన్-181 ప్రారంభం 
ఎప్పుడు : ఆగస్టు 19
ఎవరు : తెలంగాణ ప్రభుత్వం 
ఎందుకు : మహిళలపై వేధింపులను అరికట్టడానికి 

కేసీఆర్‌కు వ్యవసాయ నాయకత్వ పురస్కారం ప్రతిష్టాత్మక అగ్రికల్చర్ లీడర్‌షిప్-2017 పురస్కారానికి పాలసీ లీడర్‌షిప్ విభాగం కింద తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఎంపికయ్యారు. లక్షలాది మంది వ్యవసాయదారుల జీవితాల్లో మార్పు కోసం కృషి చేస్తున్నందుకుగాను ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఈ ఏడాది పురస్కారాన్ని ప్రకటించారు. ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్.స్వామినాథన్ ఆధ్వర్యంలోని కమిటీ కేసీఆర్‌ను ఈ పురస్కారానికి సిఫారసు చేసింది. సెప్టెంబర్ 5న ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్ హోటల్‌లో పురస్కార ప్రదానం జరగనుంది. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి రంగాల్లో విశేష కృషి చేస్తున్న వారికి 2008 నుంచి భారత ఆహార, వ్యవసాయ మండలి (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్) ఈ పురస్కారాలను అందజేస్తోంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : కేసీఆర్‌కు అగ్రికల్చర్ లీడర్‌షిప్ - 2017 పురస్కారం 
ఎప్పుడు : ఆగస్టు 19
ఎవరు : భారత ఆహార, వ్యవసాయ మండలి 
ఎందుకు : రైతుల జీవితాల్లో మార్పునకు కృషి చేస్తున్నందుకు గాను 

సీఎస్‌సీ నిర్వహణలో దేశంలోనే మొదటి స్థానంలో సింగోటం కేంద్ర ప్రభుత్వం డిజిటల్ ఇండియాలో భాగంగా దేశవ్యాప్తంగా సామాన్య జనాలకు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేసిన కామన్ సర్వీస్ సెంటర్ల నిర్వహణలో నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండల పరిధిలోని సింగోటం గ్రామం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఈ కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా ఐదు నెలల్లో రూ.4 కోట్ల వరకు లావాదేవీలు జరిగాయి. ఈ మేరకు ఢిల్లీలో ఆగస్టు 22న జరిగిన నేషనల్ కాన్ఫరెన్‌‌స ఆన్ ఎమర్జింగ్ ఆపర్చునిటీస్ త్రూ సీఎస్‌సీఎస్ కార్యక్రమంలో సింగోటంలోని కామన్ సర్వీస్ సెంటర్ నిర్వాహకురాలు బి.పద్మ పురస్కారం అందుకున్నారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : కామన్ సర్వీస్ సెంటర్ల నిర్వహణ అవార్డులు 
ఎప్పుడు : ఆగస్టు 22 
ఎవరు : కేంద్ర ప్రభుత్వం 
ఎక్కడ : దేశంలోనే మొదటి స్థానంలో సింగోటం గ్రామం

ఆర్థికం2016-17లో ఆహార ధాన్యాల ఉత్పత్తి 27.56 కోట్ల టన్నులు
 
2016-17లో దేశంలో రికార్డు స్థాయిలో ఆహార ధాన్యాలు పండినట్లు కేంద్ర వ్యవసాయశాఖ వెల్లడించింది. ఈ మేరకు ఆగస్టు 16న విడుదల చేసిన నాలుగో అంచనాల నివేదిక మొత్తం 27.56 కోట్ల టన్నుల ఆహారధాన్యాల ఉత్పత్తి జరిగినట్లు తెలిపింది. అందులో 11.01 కోట్ల టన్నుల వరి పండింది. ఇక పప్పుధాన్యాలు 2.29 కోట్ల టన్నులు, పత్తి 2.29 కోట్ల టన్నులు ఉత్పత్తి అయింది. 2015-16లో ఆహారధాన్యాల ఉత్పత్తి 27.01 కోట్ల టన్నులు కాగా, ఈసారి 55 లక్షల టన్నులు అధికంగా ఉత్పత్తి అయినట్లు వెల్లడించింది. వరి ఈసారి 61 లక్షల టన్నులు అధిక ఉత్పత్తి జరిగింది. ఇక పత్తి 2015-16లో 1.63 కోట్ల టన్నులు ఉత్పత్తి కాగా, 2016-17లో అదనంగా 66 లక్షల టన్నులు అధికంగా ఉత్పత్తి అయింది.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఆహార ధాన్యాల ఉత్పత్తి 27.56 కోట్ల టన్నులు 
ఎప్పుడు : 2016-17లో 
ఎవరు : కేంద్ర ప్రభుత్వం 
ఎక్కడ : దేశవ్యాప్తంగా 

మెట్రో రైలు పాలసీ - 2017దేశవ్యాప్తంగా మెట్రో రైలు నెట్‌వర్క్‌ను మరింత విస్తృతం చేయడానికి కేంద్రం నూతన మెట్రో రైలు విధానం 2017 ని ఆమోదించింది. ప్రైవేట్ రంగంతో పాటు ఇతర మార్గాలైన వాల్యూ క్యాప్చర్ ఫైనాన్సింగ్ (VCF), బాండ్ల జారీతో నిధులు సేకరించేందుకు ఇందులో చర్యలు ప్రకటించింది. ఈ మేరకు ఆగస్టు 16న ప్రధాని మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర కేబినెట్ నిర్ణయాలు తీసుకుంది. దీని ప్రకారం తాము చేపట్టబోయే మెట్రో రైలు ప్రాజెక్టులకు కేంద్రం నుంచి ఆర్థిక సాయం పొందాలంటే రాష్ట్రాలు ప్రైవేట్ సంస్థలతో జట్టుకట్టడం తప్పనిసరి చేశారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా పట్టణాల అభివృద్ధి, వ్యయం తగ్గింపునకు ఈ విధానంలో ప్రాధాన్యమిచ్చారు. మెట్రో ప్రాజెక్టుల అమలుకు ఏకీకృత నిబంధనలను రూపొందించడంతో పాటు, నిధుల సేకరణకు సమగ్ర వ్యవస్థను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. 
మెట్రో రైలు పాలసీ-2017 ముఖ్యాంశాలు
  • నిధుల డిమాండ్‌ను తట్టుకోవాలంటే ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం తప్పనిసరి.
  • మొత్తం ప్రాజెక్టులో లేదా అనుబంధ విభాగాలైన చార్జీల వసూలు, నిర్వహణలో ప్రైవేట్ సంస్థ పాలుపంచుకోవాలి.
  • ప్రైవేట్ రంగంలోని వనరులు, నిపుణత, ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ను సద్వినియోగం చేసుకోవడానికే ఈ నిర్ణయం.
  • స్టేషన్‌లో వాణిజ్య ఆస్తుల అభివృద్ధి, స్థలాల లీజులు, వాణిజ్య ప్రకటనల ద్వారా లభించే ఆదాయానికి సంబంధించి తీసుకునే చర్యలను రాష్ట్రాలు తమ ప్రాజెక్టు రిపోర్టులో సవివరంగా తెలియజేయాలి.
  • సమయానుగుణంగా చార్జీలను సవరించేలా నిబంధనల మార్పునకు, ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసుకోవడానికి రాష్ట్రాలకు అధికారం కల్పించారు.
కేంద్రం నుంచి నిధులు పొందే మార్గాలు: వయబిలిటీ గ్యాప్ ఫండ్, కేంద్ర గ్రాంట్లు (ప్రాజెక్టు వ్యయంలో 10 శాతం), 50:50 నిష్పత్తిలో కేంద్రం, రాష్ట్రాల మధ్య ఈక్విటీ షేరింగ్. 
విద్యా సెస్‌తో నిధి: సెకండరీ, ఉన్నత విద్య ద్వారా సమకూరే సెస్ నిధులతో కార్పస్ ఫండ్‌ను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ‘మాధ్యమిక్ అండ్ ఉచ్చతర్ శిక్షా కోశ్’(ముస్క్)గా పిలిచే ఈ నిధి మానవ వనరుల శాఖ నిర్వహణలో కొనసాగుతుంది. ముస్క్ నిధులను మాధ్యమిక, ఉన్నత విద్య పథకాలకు వెచ్చిస్తారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : మెట్రో రైలు పాలసీ - 2017
ఎప్పుడు : ఆగస్టు 16
ఎవరు : కేంద్ర ప్రభుత్వం 
ఎందుకు : మెట్రో రైలు నెట్‌వర్క్‌ను మరింత విస్తృతం చేసేందుకు 

ప్రత్యేక హోదా రాష్ట్రాలకు ‘జీఎస్టీ’ మద్దతు ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలు, ఇతర ఈశాన్య రాష్ట్రాల్లో పారిశ్రామికాభివృద్ధికోసం పదేళ్లపాటు రూ.27,413 కోట్లు ఇవ్వనున్నట్లు కేంద్రం ప్రకటించింది. జీఎస్టీ కన్నా ముందు ఆయా రాష్ట్రాలకు సెంట్రల్ ఎకై ్సజ్ పన్ను మినహాయింపు ఉండేది. ఇప్పుడు జీఎస్టీ అమల్లోకి వచ్చిన కారణంగా.. ఆ రాష్ట్రాల్లోని పరిశ్రమలకు ఆ మొత్తాన్ని ఆర్థిక సాయంగా అందించాలని ప్రధాని మోదీ నేతృత్వంలో ఆగస్టు 16న సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ నిర్ణయించింది. జూలై 1, 2017 నుంచి మార్చి 31, 2027 వరకు ఇది వర్తిస్తుంది. ఈశాన్య రాష్ట్రాల్లో పారిశ్రామిక, పెట్టుబడుల ప్రోత్సాహక పాలసీ-2007ను సిక్కింతో పాటు ప్రత్యేక హోదా పొందుతున్న జమ్మూకశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లలోనూ కేంద్రం అమలు చేస్తోంది. ఈ పాలసీ ప్రకారం ప్రత్యేక హోదా పొందుతున్న రాష్ట్రాల్లో పరిశ్రమల్లో వాణిజ్య ఉత్పత్తి ప్రారంభమైన తొలి పదేళ్ల పాటు ఎకై ్సజ్ పన్ను మినహాయింపు ఉంటుంది. కేంద్రం తీసుకున్న నిర్ణయం ద్వారా 4,284 పరిశ్రమలకు ప్రత్యక్ష నగదు సరఫరా ద్వారా రీఫండ్ జరుగుతుందని ప్రభుత్వం వెల్లడించింది.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ప్రత్యేక హోదా రాష్ట్రాలకు పదేళ్లపాటు రూ.27, 413 కోట్లు 
ఎప్పుడు : ఆగస్టు 16
ఎవరు : కేంద్ర ప్రభుత్వం 
ఎందుకు : జీఎస్టీ అమల్లో భాగంగా

22 క్యారెట్లకు పైబడిన బంగారం ఎగుమతులపై నిషేధం22 క్యారెట్లకుపైన స్వచ్ఛత గల బంగారం ఉత్పత్తుల ఎగుమతులను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. బంగారం ఉత్పత్తుల రౌండ్ ట్రిప్పింగ్‌ను అడ్డుకునేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 8 క్యారెట్ల నుంచి 22 క్యారెట్ల వరకు స్వచ్ఛత గల బంగారం ఎగుమతులకు మాత్రమే అనుమతులున్నాయని డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్‌టీ) ఒక ప్రకటనలో తెలిపింది. 22 క్యారెట్లలోపు స్వచ్ఛత గల బంగారం ఉత్పత్తులను ఎగుమతి చేసే వారికే ప్రోత్సాహకాలు లభిస్తాయని పేర్కొంది. కొందరు ఎగుమతిదారులు 22 క్యారెట్లకుపైన స్వచ్ఛతగల బంగారం ఉత్పత్తులకు కొంత విలువను జోడించి ఎగుమతి చేయడం ద్వారా ప్రోత్సాహకాలు పొందుతున్నారని జెమ్స్ అండ్ జువెలరీ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (జీజేఈపీసీ) తెలిపింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : 22 క్యారెట్లు పైబడిన స్వచ్ఛత బంగారం ఎగుమతిపై నిషేధం 
ఎప్పుడు : ఆగస్టు 16
ఎవరు : కేంద్ర ప్రభుత్వం 
ఎందుకు : బంగారం ఉత్పత్తుల రౌండ్ ట్రిప్పింగ్‌ను అడ్డుకునేందుకు

వ్యవసాయ రుణాలకు ఆధార్ తప్పనిసరి 2017-18లో కేంద్ర ప్రభుత్వ వడ్డీ రాయితీతో స్వల్ప కాలిక వ్యవసాయ రుణాలు పొందేందుకు ఆధార్‌ను తప్పనిసరి చేస్తూ భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్బీఐ) ఆగస్టు 16న నిర్ణయం తీసుకుంది. 
ప్రస్తుత నిబంధనల ప్రకారం ఈ పథకం కింద రైతులు బ్యాంకుల నుంచి రూ. 3 లక్షల వరకు రుణం తీసుకోవచ్చు. ఈ మొత్తాన్ని వడ్డీతో సహా ఏడాదిలోగా తిరిగి చెల్లించాలి. ఈ రుణంపై బ్యాంకులు 7 శాతం వడ్డీ విధిస్తుండగా.. ఇందులో 2 శాతం వడ్డీని కేంద్రం చెల్లిస్తుంది. వాయిదా చెల్లింపులు క్రమంగా తప్పకుండా చెల్లించే వారికి 3 శాతం వడ్డీ రాయితీ లభిస్తుంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : కేంద్ర ప్రభుత్వ వడ్డీ రాయితీ వ్యవసాయ రుణాలకు ఆధార్ తప్పనిసరి 
ఎప్పుడు : ఆగస్టు 16 
ఎవరు : భారతీయ రిజర్వు బ్యాంకు 

త్వరలో కొత్త 50 రూపాయల నోట్లుఆర్‌బీఐ త్వరలో మహాత్మా గాంధీ నూతన సిరీస్‌లో కొత్త రూ.50 నోట్లను చెలామణిలోకి తీసుకురానుంది. ఇవి నీలి రంగులో (ఫ్లోరోసెంట్ బ్లూ) ఉంటాయి. వీటిపై ఒకవైపు భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా హంపీ రథం, స్వచ్ఛ్ భారత్ లోగో.. మరొకవైపు మహాత్మా గాంధీ ఫోటో, అశోక స్తంభం చిహ్నం ఉంటాయి. కొత్త నోట్లు మార్కెట్‌లోకి వచ్చినా పాత రూ.50 నోట్లు చెల్లుబాటు అవుతాయని ఆర్‌బీఐ తెలిపింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : త్వరలో కొత్త 50 రూపాయల నోటు 
ఎవరు : రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా 
ఎందుకు : భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా 

అమెరికా నుంచి తొలిసారిగా ముడి చమురు దిగుమతిప్రపంచంలో మూడో అతి పెద్ద ముడి చమురు దిగుమతిదారు అయిన భారత్ తొలిసారిగా అమెరికా నుంచి ముడి చమురును దిగుమతి చేసుకుంటోంది. మొదటి దఫా రవాణా ఆగస్టు 8-14 మధ్య మొదలైంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) కొనుగోలు చేసిన ఈ చమురు సెప్టెంబర్‌లో భారత్‌కు చేరనుంది. ప్రధాని నరేంద్ర మోదీ జూన్‌లో అమెరికాలో పర్యటించినప్పుడు ఇరు దేశాలు ఇంధన రంగంలో సహకరించుకోవాలని నిర్ణయించడంతో చమురు కొనుగోలు మొదలైంది. ఇందులో భాగంగా ఐఓసీ అమెరికా నుంచి 1.6 మిలియన్ బ్యారెళ్ల చమురును కొనుగోలు చేసింది. దీంతో అగ్ర రాజ్యం నుంచి చమురును దిగుమతి చేసుకుంటున్న దేశాల జాబితాలో ఇప్పుడు భారత్ కూడా చేరింది. దక్షిణ కొరియా, జపాన్, చైనా, థాయ్‌లాండ్, ఆస్ట్రేలియా, తైవాన్ ఇప్పటికే అమెరికా నుంచి ముడి చమురును దిగుమతి చేసుకుంటున్నాయి. పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ(ఒపెక్).. ముడి చమురు ఉత్పత్తిలో కోత విధించడంతో ధరలు పెరిగాయి. దీంతో మధ్య ప్రాచ్య దేశాల నుంచి చమురును దిగుమతి చేసుకుంటున్న దేశాలు ఇతర ప్రాంతాల నుంచి చమురు కొనుగోలును ప్రారంభించాయి.

సైన్స్ అండ్ టెక్నాలజీసైన్యానికి బోయింగ్ అపాచీ హెలికాప్టర్లు భారత సైన్యం కోసం అమెరికా దిగ్గజ సంస్థ బోయింగ్ నుంచి ఆరు అపాచీ హెలికాప్టర్ల కొనుగోలుకు కేంద్రం ఆమోదం తెలిపింది. రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన ఆగస్టు 17న సమావేశమైన రక్షణ సామాగ్రి సేకరణ మండలి (డీఏసీ) రూ.4,168 కోట్ల విలువైన ఈ ఒప్పందానికి ఆమోదముద్ర వేసింది. మరో మూడేళ్లలో వీటిని భారత సైన్యానికి అప్పగించనున్నారు. 
ఒప్పందంలో భాగంగా బోయింగ్ సంస్థ దాడికి ఉపయోగించే ఆరు అపాచీ హెలికాప్టర్లతో పాటు ఆయుధ వ్యవస్థ, మందుగుండు, విడిభాగాలు, శిక్షణ అందించనుంది. 2015, సెప్టెంబర్‌లో భారత వైమానిక దళం(ఐఏఎఫ్) కోసం ఆర్డర్ ఇచ్చిన 22 అపాచీ, 15 చినూక్ హెలికాప్టర్లకు అదనంగా ఇవి భారత అమ్ములపొదిలో చేరనున్నాయి. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఆరు అపాచీ హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందానికి ఆమోదం 
ఎప్పుడు : ఆగస్టు 17
ఎవరు : రక్షణ సామాగ్రి సేకరణ మండలి 
ఎక్కడ : అమెరికా దిగ్గజ సంస్థ బోయింగ్ నుంచి 

కేరళలో రెండు కొత్త వానపాము జాతుల గుర్తింపు కేరళలోని పశ్చిమ కనుమల్లో శాస్త్రవేత్తలు రెండు కొత్తరకం వానపాము జాతులను గుర్తించారు. వీటికి ద్రవిడ డైవర్టిక్యులట, ద్రవిడ తోమసిగా నామకరణం చేశారు. అయితే కొత్తగా గుర్తించిన ఈ రెండు జాతుల మధ్య కూడా చాలా తేడాలున్నాయని కేరళలలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ, హిమాచల్ ప్రదేశ్‌లోని స్కూలిని యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు.
ద్రవిడ డైవర్టిక్యులేట ఒంటిపై పదుల సంఖ్యలో ఖండికలుండగా కీలక అవయవాలన్నీ శరీరానికి ముందు భాగంలో ఉన్నాయి. మున్నార్ ప్రాంతంలోని షోలా గడ్డి భూములు, ఎరావికుళం నేషనల్ పార్క్‌లో వీటి సంఖ్య ఎక్కువగా ఉంది.
ఇక ద్రవిడ తోమసిగా నామకరణం చేసిన మరో జాతిని కొజిప్పారా జలపాతం సమీపంలోని భూముల్లో గుర్తించారు. ఈ రెండు వానపాములు కూడా మోనిలిగాస్ట్రిడే జాతికి చెందిన జీవులు.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : రెండు కొత్త వానపాము జాతుల గుర్తింపు 
ఎప్పుడు : ఆగస్టు 18
ఎవరు : మహాత్మాగాంధీ యూనివర్సిటీ, స్కూలిని యూనివర్సిటీ పరిశోధకులు
ఎక్కడ : కేరళలో 

ఇస్రో, నాసా ఆధ్వర్యంలో నిసార్ ప్రాజెక్టు భూమిపై వాతావరణ మార్పులు, సముద్ర మట్టాలు, నేలల పరిశీలన కోసం ఇస్రో, నాసా సంస్థలు నిసార్ ప్రాజెక్టును చేపట్టనున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా అంతరిక్షంలో నిఘా సెన్సార్లను ఏర్పాటు చేయనున్నాయని.. అహ్మదాబాద్‌లోని స్పేస్ అప్లికేషన్ సెంటర్ డెరైక్టర్ తపన్ మిశ్రా ఆగస్టు 20న వెల్లడించారు. అత్యయిక పరిస్థితులలో వీలైనంత వేగంగా స్పందించి సహాయ సహకారాలు అందించేందుకు ఈ సెన్సార్లు ఉపయోగపడతాయి.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : భూమి పరిశీలన కోసం నిసార్ ప్రాజెక్టు 
ఎవరు : ఇస్రో, నాసా 
ఎందుకు : సెన్సార్ల ద్వారా వాతారవరణ మార్పులు, సముద్ర మట్టాలు, నేలల పరిశీలన కోసం 

అమెరికాలో 99 ఏళ్ల తర్వాత సంపూర్ణ సూర్యగ్రహణం అమెరికాలో ఆగస్టు 21న సంపూర్ణ సూర్యగ్రహణం కనువిందు చేసింది. పశ్చిమ తీరంలో ఒరెగాన్‌లోని లింకన్ బీచ్‌లో మొదలైన ఈ అద్భుతం 14 రాష్ట్రాల గుండా సాగింది. గ్రహణంతో అమెరికాలో 14 రాష్ట్రాల మీదుగా 70.కి.మీ వెడల్పు ప్రాంతం చీకటిమయమైంది. ఒరెగాన్ రాష్ట్రంలో మొదలై తూర్పు తీరమైన దక్షిణ కరోలినా రాష్ట్రంలో ముగిసింది. సంపూర్ణ సూర్యగ్రహణం మాత్రం 90 నిమిషాలు కొనసాగింది. ఈ సూర్యగ్రహణాన్ని వీక్షించేందుకు ప్రపంచ నలుమూలల నుంచి వందల మంది ఖగోళ శాస్త్రవేత్తలు తరలివచ్చారు. దాదాపు 99 ఏళ్ల తర్వాత అమెరికాలో ఏర్పడిన సంపూర్ణ సూర్య గ్రహణాన్ని నాసా ప్రత్యక్ష ప్రసారం చేసింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : సంపూర్ణ సూర్యగ్రహణం 
ఎప్పుడు : ఆగస్టు 21 
ఎక్కడ : అమెరికాలో 
ఎందుకు : 14 రాష్ట్రాల మీదుగా సాగిన సూర్యగ్రహం 

రోదసీలోకి చేరిన తొలి సూపర్ కంప్యూటర్మొట్టమొదటి సూపర్ కంప్యూటర్ (స్పేస్ బర్నో కంప్యూటర్) ఆగస్టు 16న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరింది. ఈ ప్రయోగాన్ని ఆగస్టు 7న ఫ్లోరిడాలోని కేప్‌కెనవారాల్‌లో నిర్వహించారు. స్పేస్ ఎక్స్ సంస్థకు చెందిన 2,900 కిలోల మానవ రహిత రవాణా వ్యోమ నౌక డ్రాగన్ ఈ సూపర్ కంప్యూటర్‌ను మోసుకెళ్లింది. ఇప్పటికే రోదసీలో ఉన్న వ్యోమగాములకు ఈ నౌక ఆహారం, ప్రత్యేక దుస్తులను కూడా తీసుకెళ్లినట్లు నాసా పేర్కొంది. సూపర్ కంప్యూటర్‌ను హ్యూలెట్ ఎయాకార్డ్ సంస్థ రూపొందించింది. ఇది స్పేస్ ఎక్స్‌కు సంబంధించి 12వ అంతరిక్ష ప్రయోగం. ఈ సూపర్ కంప్యూటర్ అంతరిక్షంలోని ప్రతికూల వాతావరణంలో పనిచేయగలదా లేదా అనే అంశాన్ని పరిశోధకులు పరీక్షించనున్నారు.

నౌకాదళంలోకి ఉభయచర యుద్ధనౌక నేల పైన, సముద్రంలోనూ పోరాడగల ఉభయచర యుద్ధనౌక ఆగస్టు 21న భారత నౌకాదళంలో చేరింది. ఈ అధునాతన ల్యాండింగ్ క్రాఫ్ట్ యుటిలిటీ (ఎల్‌సీయూ) ద్వారా యుద్ధ ట్యాంకులను, ఇతర భారీ ఆయుధ వ్యవస్థలను, సైనిక బలగాలను యుద్ధ రంగానికి రవాణా చేయొచ్చు. దీన్ని కోల్‌కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ సంస్థ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించింది. ఈ యుద్ధ నౌక అండమాన్ దీవుల్లో విధులు నిర్వర్తిస్తుంది. ఈ శ్రేణికి చెందిన మరో ఆరు నౌకలు నిర్మాణంలో ఉన్నాయి. ఇవి వచ్చే రెండేళ్లలో నౌకాదశంలో చేరనున్నాయి.

క్రీడలుబీసీసీఐ ఆఫీస్ బేరర్లను తొలగించండి : సీఓఏ 
 జస్టిస్ ఆర్‌ఎం లోధా ప్యానెల్ సూచించిన సంస్కరణల అమలు తీరుపై పరిపాలక కమిటీ (సీఓఏ) తీవ్ర అసంతృప్తితో ఉంది. ఈ విషయంలో ఏమాత్రం సహకారం అందించడం లేదని, బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా, కోశాధికారి అనిరుధ్ చౌదరి, కార్యదర్శి అమితాబ్ చౌదరి సహా ఆఫీస్ బేరర్లను తొలగించాలని సుప్రీం కోర్టును కోరింది. ఈ మేరకు తమ ఐదో స్టేటస్ రిపోర్టును కోర్టుకు అందించింది. ఈ 26 పేజీల నివేదికలో బోర్డు పనితీరుపై ఘాటుగా స్పందించింది.

బల్గేరియా ఓపెన్ సింగిల్స్ విజేత లక్ష్య సేన్ ప్రపంచ జూనియర్ నంబర్‌వన్, భారత యువ బ్యాడ్మింటన్ ఆటగాడు లక్ష్య సేన్ సీనియర్ స్థాయిలో బల్గేరియా ఓపెన్ సిరీస్ టోర్నమెంట్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఆగస్టు 17న పురుషుల సింగిల్స్ ఫైనల్లో 16 ఏళ్ల లక్ష్య సేన్ 18-21, 21-12, 21-17తో రెండో సీడ్ జ్వొనిమిర్ దుర్కిన్‌జాక్ (క్రొయేిషియా)పై గెలుపొందాడు. ఇటీవలే ఆల్ ఇంగ్లండ్ మాజీ చాంపియన్ పీటర్ గేడ్ (డెన్మార్క్) వద్ద పది రోజులపాటు శిక్షణ తీసుకున్న లక్ష్యసేన్ ఈ ఏడాది జాతీయ సీనియర్ చాంపియన్‌షిప్‌లో రన్నరప్‌గా కూడా నిలిచాడు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : బల్గేరియా ఓపెన్ - 2017
ఎప్పుడు : ఆగస్టు 17
ఎవరు : పురుషుల సింగిల్స్ విజేత లక్ష్యసేన్ 

ఆలిండియా ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నీ విజేత శివాని పుణే వేదికగా జరిగిన ఆలిండియా ర్యాంకింగ్ సీనియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో తెలంగాణ క్రీడా కారిణి గద్దె రుత్విక శివాని చాంపియన్‌గా నిలిచింది. ఆగస్టు 20న జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ఖమ్మం జిల్లాకు చెందిన రుత్విక శివాని 21-10, 21-13తో ఐదో సీడ్ అనురా ప్రభుదేశాయ్ (గోవా)పై విజయం సాధించింది. విజేతగా నిలిచే క్రమంలో ఆరు మ్యాచ్‌ల్లో నెగ్గిన రుత్విక శివాని తన ప్రత్యర్థులకు ఒక్క గేమ్ కూడా కోల్పోలేదు. అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగిన రుత్విక నలుగురు సీడెడ్ క్రీడాకారిణులను ఓడించింది.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఆలిండియా ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 
ఎప్పుడు : ఆగస్టు 20
ఎవరు : విజేత గద్దె రుత్విక శివాని
ఎక్కడ : పుణె 

హాకీ ఆసియాకప్ స్పాన్సరర్‌గా హీరో మోటోకార్ప్ బంగ్లాదేశ్‌లో అక్టోబర్ నుంచి జరిగే ఆసియాకప్ హాకీ టోర్నీకి హీరో మోటోకార్ప్ స్పాన్సరర్‌గా వ్యవహరించనుంది. దాదాపు 32 ఏళ్ల తర్వాత బంగ్లా నిర్వహిస్తోన్న ఈ టోర్నీ ఢాకాలోని మౌలానా భషానీ జాతీయ స్టేడియంలో ప్రారంభం కానుంది. ఇప్పటికే అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్)కి తాము భాగస్వామిగా వ్యవహరిస్తున్నామని, ప్రస్తుతం దీన్ని ఆసియా హాకీ సమాఖ్య (ఏహెచ్‌ఎఫ్)కు విస్తరిస్తున్నామని హీరో సంస్థ చీఫ్ పవన్ ముంజాల్ తెలిపారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : హాకీ ఆసియాకప్ - 2017
ఎప్పుడు : అక్టోబర్‌లో 
ఎవరు : స్పాన్సరర్‌గా హీరో మోటోకార్ప్ 
ఎక్కడ : ఢాకా, బంగ్లాదేశ్ 

ఏటీపీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నాదల్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ సంఘం (ఏటీపీ) ఆగస్టు 21న విడుదల చేసిన పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్‌‌సలో స్పెయిన్ ప్లేయర్ రఫెల్ నాదల్ అగ్రస్థానాన్ని తిరిగి దక్కించుకున్నాడు. 2014 జూలై తర్వాత నాదల్ అగ్రస్థానానికి చేరుకోవడం ఇదే తొలిసారి. దీంతో ఇప్పటివరకు టాప్ ర్యాంకులో ఉన్న ఆండీ ముర్రే (బ్రిటన్) రెండోస్థానానికి పడిపోయాడు. ఇటీవల జరిగిన సిన్సినాటీ టోర్నీలో నాదల్ క్వార్టర్‌ఫైనల్‌కు చేరగా.. గాయం కారణంగా ముర్రే టోర్నీకి దూరమయ్యాడు. దీంతో ర్యాంకింగ్‌‌సలో నాదల్ ఎగబాకాడు. 
తాజా ర్యాంకింగ్‌‌సలో నాదల్, ముర్రే , రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్), స్టాన్ వావ్రింకా (స్విట్జర్లాండ్), నోవాక్ జొకోవిచ్ (సెర్బియా), అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ), మారిన్ సిలిచ్ (క్రొయేషియా), డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా), దిమిత్రోవ్, కీ నిషికోరి (జపాన్) వరుసగా తొలి పది స్థానాల్లో నిలిచారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఏటీపీ ర్యాంకింగ్స్ 
ఎప్పుడు : ఆగస్టు 21
ఎవరు : పురుషుల సింగిల్స్‌లో నెంబర్ వన్‌గా రఫెల్ నాదల్ 

ఫిబా ఆసియా కప్ విజేత ఆస్ట్రేలియా ఫిబా ఆసియా బాస్కట్‌బాల్ కప్ (ఫిబా బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్)ను ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. లెబనాన్ రాజధాని బీరుట్‌లో ఆగస్టు 21న జరిగిన ఫైనల్లో ఆసీస్ 79-56తో ఇరాన్‌ను ఓడించి చాంపియన్‌గా నిలిచింది. రెండేళ్లకోసారి జరిగే ఈ టోర్నీని ఆస్ట్రేలియా గెలుచుకోవడం ఇదే తొలిసారి. చైనా అత్యధికంగా 16 సార్లు ఈ కప్‌ను కైవసం చేసుకుంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఫిబా ఆసియా బాస్కెట్‌బాల్ కప్ - 2017 
ఎప్పుడు : ఆగస్టు 21
ఎవరు : విజేత ఆస్ట్రేలియా 

‘సిన్సినాటి’ చాంపియన్స్ దిమిత్రోవ్, ముగురుజా యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ సన్నాహక టోర్నీల్లో భాగమైన సిన్సినాటి మాస్టర్స్ టెన్నిస్ టోర్నమెంట్‌లో పురుషుల సింగిల్స్‌లో గ్రిగోర్ దిమిత్రోవ్ (బల్గేరియా), మహిళల సింగిల్స్‌లో ముగురుజా (స్పెయిన్) టైటిల్స్‌ను సొంతం చేసుకున్నారు. ఫైనల్స్‌లో దిమిత్రోవ్ 6-3, 7-5తో నిక్ కిరియోస్ (ఆస్ట్రేలియా)పై... నాలుగో సీడ్ ముగురుజా 6-1, 6-0తో రెండో సీడ్ సిమోనా హలెప్ (రొమేనియా)పై విజయం సాధించారు. చాంపియన్‌‌సగా నిలిచిన దిమిత్రోవ్‌కు 9,54,225 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 6 కోట్ల 12 లక్షలు)తోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు... ముగురుజాకు 5,22,450 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 3 కోట్ల 35 లక్షలు)తోపాటు 900 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : సిన్సినాటి మాస్టర్స్ టోర్నమెంట్ - 2017
ఎప్పుడు : ఆగస్టు 21
ఎవరు : పురుషుల సింగిల్స్ విజేత దిమిత్రోవ్, మహిళల సింగిల్స్ విజేత ముగురుజా 

అవార్డులుక్రీడా పురస్కారాల కమిటీ ప్రతిపాదనలకు ఆమోదం క్రీడా పురస్కారాల కమిటీ ప్రతిపాదనలకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆగస్టు 19న ఆమోదం తెలిపింది. అయితే ఈ జాబితా నుంచి క్రిమినల్ కేసు ఎదుర్కొంటున్న పారా స్పోర్‌‌ట్స కోచ్ సత్యనారాయణను ద్రోణాచార్య నామినీ నుంచి తప్పించింది. రియో పారాలింపిక్స్ చాంపియన్, హైజంపర్ మరియప్పన్ తంగవేలు కోచ్ అయిన సత్యనారాయణ (కర్ణాటక) క్రిమినల్ పరువు నష్టం కేసు విచారణను ఎదుర్కొంటున్నారు. ఇదొక్కటి మినహా సీకే ఠక్కర్ నేతృత్వంలోని కమిటీ సిఫారసులన్నింటికీ కేంద్రం ఆమోదముద్ర వేసింది. 
అవార్డు గ్రహీతలురాజీవ్ ఖేల్త్న్ర: దేవేంద్ర జజారియా, సర్దార్ సింగ్. 
అర్జున: జ్యోతి సురేఖ (ఆర్చరీ), సాకేత్ మైనేని (టెన్నిస్), ఖుష్బీర్ కౌర్, రాజీవ్ (అథ్లెటిక్స్), ప్రశాంతి (బాస్కెట్‌బాల్), దేవేంద్రో సింగ్ (బాక్సింగ్), పుజారా, హర్మన్‌ప్రీత్ కౌర్ (క్రికెట్), ఓయినమ్ బెంబెం దేవి (ఫుట్‌బాల్), చౌరాసియా (గోల్ఫ్), సునీల్ (హాకీ), జస్వీర్ సింగ్ (కబడ్డీ), ప్రకాశ్ నంజప్ప (షూటింగ్), ఆంథోనీ అమల్ రాజ్ (టేబుల్ టెన్నిస్), మరియప్పన్ తంగవేలు, వరుణ్ భటి (పారా అథ్లెటిక్స్), సత్యవర్త్ కడియన్ (రెజ్లింగ్). 
ద్రోణాచార్య అవార్డు: డా.ఆర్ గాంధీ(అథ్లెటిక్స్), హీరానంద్ కటారియా(కబడ్డీ), జీఎస్‌వీ ప్రసాద్(బ్యాడ్మింటన్), బ్రిజ్ భూషన్ మహంతి(బాక్సింగ్), రోషన్ లాల్(రెజ్లింగ్),రాఫెల్,(హాకీ), సంజయ్ చక్రవర్తి(షూటింగ్)
ధ్యాన్‌చంద్ అవార్డు: భూపిందర్ సింగ్(అథ్లెటిక్స్),సయ్యద్ షాహీద్ హకీం (ఫుట్ బాల్), సుమరాయ్ టకే(హాకీ) 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : క్రీడా పురస్కారాల కమిటీ ప్రతిపాదనలకు ఆమోదం 
ఎప్పుడు : ఆగస్టు 19
ఎవరు : క్రీడల మంత్రిత్వశాఖ 
ఎందుకు : రాజీవ్ ఖేల్త్న్ర, అర్జున అవార్డుల ప్రదానం కోసం 

పద్మ అవార్డులకు ఎవరైనా నామినేట్ చేయవచ్చు వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వారికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పద్మ అవార్డులకు నామినేషన్లు ఎవరైనా ప్రతిపాదించవచ్చని కేంద్రం తెలిపింది. ఈ మేరకు 2018 ఏడాదికి పద్మ అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ కేంద్ర హోంశాఖ ఆగస్టు 18న ప్రకటన విడుదల చేసింది. కళలు, సాహిత్యం, విద్య, క్రీడలు, వైద్యం, సామాజిక సేవ, సైన్‌‌స, ఇంజనీరింగ్, వాణిజ్యం తదితర రంగాల్లో విశేష కృషి చేసిన వారికి ఈ అవార్డు అందజేస్తారు.
ప్రజలందరూ తమ ప్రతిపాదనలను అధికారిక వెబ్‌సైబ్ www.padmaawards.gov.in కు సెప్టెంబర్ 15లోగా పంపాలి. కేవలం ఆన్‌లైన్ ద్వారానే ప్రతిపాదనలు పంపాల్సి ఉంటుంది. పద్మ అవార్డుల కమిటీ అవార్డుల ప్రదానంపై తుది నిర్ణయం తీసుకుంటుంది. గతంలో రాజకీయ నేతలు, మంత్రులు సిఫార్సు చేసినవారికే పద్మ అవార్డులు అందేవి. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : పద్మ అవార్డుల ఎంపిక ప్రక్రియలో మార్పులు 
ఎప్పుడు : ఆగస్టు 18
ఎవరు : కేంద్ర ప్రభుత్వం 
ఎందుకు : అవార్డులకు ఎవరైనా నామినేషన్లు పంపే అవకాశం 

రాజమహేంద్రవరం ఓఎన్‌జీసీకి జాతీయ పురస్కారంతూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఓఎన్‌జీసీ అసెట్‌కు ప్రతిష్టాత్మకమైన జాతీయ భద్రతా పురస్కారం (మైన్‌‌స)-2013 లభించింది. సురక్షితమైన డ్రిల్లింగ్ (ఆ ప్రక్రియలో సిబ్బంది గాయపడిన సందర్భాలు అతి తక్కువగా ఉండడం)లో ఈ పురస్కారానికి ఎంపికైంది. అసెట్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్, మేనేజర్ డీఎంఆర్ శేఖర్ ఆగస్టు 17న న్యూఢిల్లీలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకున్నారు. అసెట్ 2011, 2012 సంవత్సరాల్లో కూడా జాతీయ భద్రతా పురస్కారాన్ని గెలుచుకుంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : రాజమహేంద్రవరం ఓఎన్‌జీసీ అసెట్‌కు జాతీయ భద్రతా పురస్కారం - 2013
ఎప్పుడు : ఆగస్టు 17
ఎవరు : కేంద్ర ప్రభుత్వం 
ఎందుకు : సురక్షితమైన డ్రిల్లింగ్ చేపడుతున్నందుకు 

‘బస్తర్’ పోలీసులకు అంతర్జాతీయ అవార్డు ఉత్తమ పోలీసు సేవలకుగాను చత్తీస్‌గఢ్‌లోని బస్తర్ పోలీసులకు ఈ ఏడాది ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఐఏసీపీ అవార్డు దక్కింది. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ‘ఆమ్‌ఛో బస్తర్, ఆమ్‌ఛో పోలీస్’ పేరుతో చేపట్టిన కార్యక్రమం విజయవంతం కావడంతో బస్తర్ పోలీసు విభాగాన్ని ఈ అవార్డుకు ఎంపిక చేశారు. జిల్లా సూపరింటెండెంట్ ఆప్ పోలీస్ ఆరిఫ్ షేక్ అమెరికాలో అక్టోబర్ 24న జరిగే ప్రదానోత్సవంలో ఈ అవార్డును అందుకోనున్నారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : బస్తర్ పోలీసులకు ఐఏసీపీ అవార్డు 
ఎప్పుడు : ఆగస్టు 18
ఎందుకు : నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ‘ఆమ్‌ఛో బస్తర్, ఆమ్‌ఛో పోలీస్’ కార్యక్రమాలను విజయవంతం చేసినందుకు 

వార్తల్లో వ్యక్తులుచాంపియన్‌‌స ఆఫ్ చేంజ్‌లో పాల్గొన్న ప్రధాని మోదీ  చాంపియన్స్ ఆఫ్ చేంజ్ కార్యక్రమం ఆగస్టు 17న న్యూఢిల్లీలో జరిగింది. నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ.. 200 మంది యువ స్టార్టప్ వాణిజ్యవేత్తలనుద్దేశించి ప్రసంగించారు. దేశంలో క్షేత్రస్థాయి వరకు వేళ్లూనుకుపోయిన అవినీతిని పెకిలించి వేసేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
స్టార్టప్‌ల ప్రెజెంటేషన్ 
యువ వ్యాపారవేత్తల్లో సృజనాత్మకత పెంచటం, ఎదురవుతున్న సమస్యలకు పరిష్కారాలను సూచించేందుకు ఈ ‘చాంపియన్‌‌స ఆఫ్ చేంజ్’ కార్యక్రమాన్ని ఏడాదికోసారి నిర్వహించాలని నిర్ణయించినట్లు మోదీ తెలిపారు. వ్యాపారవేత్తల్లోని వివిధ వర్గాలను ఆయా మంత్రిత్వ శాఖలకు శాశ్వత పద్ధతిలో జోడించామని తెలిపారు. సాఫ్ట్ పవర్, ఇంక్రెడిబుల్ ఇండియా 2.0, విద్య-నైపుణ్యాభివృద్ధి, ఆరోగ్యం-పౌష్టికాహారం, డిజిటల్ ఇండియా, 2022 కల్లా నవభారతం ఇతివృత్తాలతో వాణిజ్యవేత్తలు ప్రజెంటేషన్ ఇచ్చారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : చాంపియన్స్ ఆఫ్ చేంజ్ కార్యక్రమం 
ఎప్పుడు : ఆగస్టు 17
ఎక్కడ : న్యూఢిల్లీలో 
ఎందుకు : యువ స్టార్టప్ వాణిజ్యవేత్తలను ప్రోత్సహించేందుకు 

జయలలిత మరణంపై విచారణ కమిషన్అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంపై తమిళనాడు సీఎం ఎడపాడి పళనిస్వామి ఆగస్టు 17న న్యాయ విచారణకు ఆదేశించారు. మద్రాసు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో విచారణ కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జయ కన్నుమూసిన తరువాత ఆమె మరణంపై పలు అనుమానాలు వ్యక్తమవడంతో వాటి నివృత్తి కోసమే ఈ విచారణ కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు పళనిస్వామి చెప్పారు. అలాగే జయలలిత నివసించిన చెన్నై పోయెస్ గార్డెన్‌లోని వేద నిలయం ఇంటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని స్మారక మందిరంగా మార్చనున్నట్లు వెల్లడించారు. 
ముఖ్యమంత్రిగా ఉండగానే 2016 సెప్టెంబరు 22న అనారోగ్యంతో చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరిన జయలలిత... 75 రోజులు వైద్యశాలలోనే ఉండి డిసెంబరు 5న గుండెపోటుతో మరణించారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : జయలలిత మరణంపై విచారణ కమిషన్ ఏర్పాటు
ఎప్పుడు : ఆగస్టు 17
ఎవరు : తమిళనాడు ప్రభుత్వం 
ఎందుకు : జయలలిత మరణంపై అనుమానాల నివృత్తి కోసం 

ఫోర్బ్స్ జాబితాలో తొలి స్థానంలో ఎమ్మా స్టోన్ ప్రముఖ అంతర్జాతీయ మేగజైన్ ఫోర్బ్స్ 2017 ఏడాదికి గాను విడుదల చేసిన అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ల జాబితాలో హాలీవుడ్ నటి ఎమ్మా స్టోన్ తొలి స్థానంలో నిలిచింది. ఎమ్మా 26 మిలియన్ డాలర్ల పారితోషకంతో మొదటి స్థానంలో నిలిచిందని, ఈ జూన్ నాటికే అత్యధిక టాక్స్ కూడా చెల్లించేసిందని ఫోర్బ్స్ పేర్కొంది. రెండో స్థానంలో 48 ఏళ్ల నటి జెన్నిఫర్ అనిస్టోన్(25 మిలియన్ డాలర్లు) నిలిచింది. 
గతేడాది ఈ జాబితాలో స్థానం సంపాదించుకున్న బాలీవుడ్ నటి దీపికా పదుకొనే ఈసారి జాబితాలో నిలువలేదు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఫోర్బ్స్ అత్యధిక పారితోషకం పొందుతున్న హీరోయిన్ల జాబితా
ఎప్పుడు : ఆగస్టు 17
ఎవరు : తొలి స్థానంలో ఎమ్మాస్టోన్ 

మలాలాకు ఆక్స్‌ఫర్డ్‌లో అడ్మిషన్ పాకిస్తాన్‌కు చెందిన నొబెల్ బహుమతి గ్రహీత మలాలాకు అత్యంత ప్రతిష్టాత్మక ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటిలో అడ్మిషన్ లభించింది. ఆమె అక్కడ ఫిలాసఫీ, రాజనీతిశాస్త్రం, అర్థశాస్త్రం చదవనుంది. ఆడపిల్లలు చదువుకోవాలంటూ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమాలకు మలాలా ప్రచారకర్తగా కొనసాగుతున్నారు. 

అత్యుత్తమ ప్రధానిగా నరేంద్ర మోదీ స్వతంత్ర భారత చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన ప్రధానిగా నరేంద్ర మోదీకి భారతీయులు పట్టంగట్టారు. ఇండియా టుడే- కార్వీ ఇన్‌సైట్స్ సంయుక్తంగా నిర్వహించిన మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే ఈ విషయాన్ని వెల్లడించింది. పెద్దనోట్ల రద్దుతో ప్రజలు ఇబ్బందులు పడ్డా.. నల్లధనంపై మోదీ ప్రయోగించిన అస్త్రంగా ప్రజలు భావించారని పేర్కొంది. ఇప్పటికిప్పుడు దేశంలో ఎన్నికలు వస్తే ఎన్డీయేకు 349 సీట్లు వస్తాయని వెల్లడించింది. 
సర్వేలో పాల్గొన్న వారిలో ప్రథమ ప్రధాని నెహ్రూ, ఇందిరా గాంధీ, వాజ్‌పేయిల కన్నా మోదీపైనే ఎక్కువ మంది సానుకూలత వ్యక్తం చేశారు. ఐదు సార్లు దేశవ్యాప్తంగా ఈ సర్వే నిర్వహించారు. తాజా (జూలై 2017) ఫలితాల్లో 33 శాతంతో మోదీ ముందంజలో ఉన్నారు. ఇందిరా గాంధీ 17 శాతంతో రెండో స్థానంలో, వాజ్‌పేయి 9 శాతం, నెహ్రూ 8 శాతంతో మూడు నాలుగు స్థానాల్లో నిలిచారు. 
తొలిసారి ఆగస్టు 2015లో జరిగిన సర్వేలో ఇందిర 21 శాతంతో తొలిస్థానంలో ఉండగా.. మోదీ 20 శాతంతో రెండో స్థానం సంపాదించారు. దేశంలో పన్నుల సంస్కరణలు తీసుకొచ్చి జీఎస్టీని అమల్లోకి తేవటం ద్వారా లంచం, పన్ను ఎగవేతలకు మోదీ చెక్ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. 
నిరుద్యోగం ఓ హెచ్చరిక ఈ సర్వే ఎన్డీయేకు, బీజేపీకి సానుకూల పవనాలను చూపించటంతోపాటుగా ప్రజల్లో పలు అంశాలపై ఉన్న అసంతృప్తినీ గుర్తుచేసింది. ఉద్యోగకల్పనపై ప్రజల్లో ఆందోళన ప్రభుత్వానికి హెచ్చరికగా పేర్కొంది. ఆగస్టు 2015లో సర్వే మొదలైనప్పటినుంచీ తాజా సర్వే (జూలై 2017) వరకు ఉద్యోగ కల్పనకు ప్రభుత్వం పెద్దగా చేసిందేమీ లేదనే అభిప్రాయం వ్యక్తమైంది. ప్రధాని కూడా యువకులు ఉద్యోగం కోసం వెతకటం కన్నా స్వయం ఉపాధితోపాటుగా ఉద్యోగాలు సృష్టించే ఆలోచన చేయాలని చెబుతూ వస్తున్నారు. ఇందుకోసం పలు పథకాలనూ ఆయన ప్రారంభించారు. వీటి ఫలితం వచ్చే ఎన్నికల వరకు కనబడితే యువతలో అసంతృప్తి దూరం అవుతుందని సర్వే పేర్కొంది. అటు 2014 ప్రచారంలో మోదీ చెప్పిన అచ్ఛేదిన్‌పై 39 శాతం మంది సానుకూలత, 34 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : భారత్‌లో అత్యుత్తమ ప్రధానిగా నరేంద్ర మోదీ 
ఎప్పుడు : ఆగస్తు 18
ఎవరు : ఇండియా టుడే- కార్వీ ఇన్‌సైట్స్ మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే
ఎందుకు : 33 శాతంతో ముందంజలో ఉన్న మోదీ 

ఇన్ఫోసిస్ సీఈఓ, ఎండీ పదవికి విశాల్ సిక్కా రాజీనామా ఇన్ఫోసిస్ సీఈఓ, ఎండీ పదవికి విశాల్ సిక్కా ఆగస్టు 18న రాజీనామా చేశారు. పదేపదే వ్యక్తిగతంగా మాటల దాడి చేయడంతోపాటు నిరాధార ఆరోపణలు గుప్పించడంతో తీవ్ర మనస్థాపానికి గురై రాజీనామా చేశానంటూ పేర్కొన్నారు. 
సిక్కా రాజీనామాను ఆమోదించామని.. ఆయన స్థానంలో తాత్కాలిక సీఈఓ, ఎండీగా ప్రస్తుత చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీఎఫ్‌ఓ) యూబీ ప్రవీణ్‌రావుకు తక్షణం బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ఇన్ఫీ బోర్డు ప్రకటించింది. ఇక పూర్తి స్థాయి సీఈఓ-ఎండీని నియమించేందుకు 2018, మార్చి 31ని బోర్డు డెడ్‌లైన్‌గా నిర్ణయించారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : పదవికి రాజీనామా చేసిన ఇన్ఫోసిస్ సీఈవో, ఎండీ 
ఎప్పుడు : ఆగస్టు 18 
ఎవరు : విశాల్ సిక్కా
ఎందుకు : వ్యక్తిగత, నిరాధార ఆరోపణల నేపథ్యంలో 

యూకే ‘ఆర్థిక ఆంక్షల’ జాబితాలో దావూద్యూకే ఇటీవల విడుదల చేసిన ఆర్థిక ఆంక్షల జాబితాలో భారత్‌కు మోస్ట్ వాంటెడ్ టైస్ట్ అయిన దావూద్ ఇబ్రహీం ఉన్నాడు. దావూద్ 21 మారు పేర్లను కూడా ఇందులో ప్రస్తావించారు. యూకే కోశాగార విభాగం సోమవారం సవరించిన ‘కన్సాలిడేటెడ్ లిస్ట్ ఆఫ్ ఫైనాన్సియల్ సాంక్షన్‌‌స టార్గెట్స్ ఇన్ యూకే’లో దావూద్‌కు పాకిస్తాన్‌లో మూడు అధికారిక చిరునామాలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఆ మూడూ కరాచీలోనే ఉన్నట్లు వెల్లడించారు. దావూద్ మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా ఖేర్‌లో జన్మించాడని, ఆయన భారత పౌరసత్వం కలిగి ఉన్నట్లు రికార్డుల్లో ఉంది. అయితే భారత్ తన పాస్‌పోర్టును రద్దుచేసిన తరువాత దావూద్ భారత్, పాక్ నుంచి ఇతరుల పేరిట పాస్‌పోర్టులు సేకరించి దుర్వినియోగం చేశాడని జాబితాలో పేర్కొన్నారు. ఈ జాబితాలో ఉన్న వ్యక్తులు, సంస్థలు ఇతరులతో ఆర్థికపర లావాదేవీలు జరపకుండా నిషేధం విధిస్తారు. అలాగే వారి ఆస్తులను స్తంభింపజేస్తారు. 

‘బాల మేధావి’ రాహుల్ దోశిబ్రిటన్‌లోని టీవీ చానల్ 4 నిర్వహించిన చైల్డ్ జీనియస్ క్విజ్ పోటీల్లో భారత సంతతికి చెందిన రాహుల్ దోశి విజేతగా నిలిచాడు. ఆగస్టు 19న నిర్వహించిన ఈ పోటీలో రాహుల్ 162 ఐక్యూ (ఇంటలిజెంట్ కోయిషెంట్) స్కోర్ సాధించాడు. ఇది అల్బర్ట్ ఐన్‌స్టీన్, స్టీఫెన్ హాకింగ్ ఐక్యూల కన్నా ఎక్కువ.


అంతర్జాతీయంభారత్ అమెరికాకు కీలక భాగస్వామి: ట్రంప్
అమెరికా ప్రవేశపెట్టిన కొత్త ‘దక్షిణాసియా విధానం’ భారత్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలపరుస్తుందని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. వర్జీనియా రాష్ట్రం అర్లింగ్టన్‌లోని ఫోర్ట్ మేయర్‌లో తన పాలనా యంత్రాంగంలోని ముఖ్య అధికారులు సహా సుమారు 2 వేల మందిని ఉద్దేశించి ఆగస్టు 22న ట్రంప్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ భద్రత, ఆర్థిక రంగాల్లో అమెరికాకు కీలక భాగస్వావి అన్నారు.
ఉగ్రవాదులకు పాక్ స్వర్గధామంగా మారిందని పేర్కొన్న ట్రంప్ శాంతి నెలకొల్పేందుకు భారత్‌తో కలసి పనిచేయాలని సూచించారు. అఫ్గాన్‌లోని తమ సైనికులను వెనక్కి రప్పించే విషయంలో ఎలాంటి కాలపరిమితి లేదని, అక్కడ శాంతి, స్థిరత్వం తీసుకొచ్చేందుకు భారత్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ప్రస్తుతం 8,500 దళాలు అఫ్గాన్‌లో ఉండగా మరో 4 వేల దళాలను అక్కడికి పంపనున్నట్లు సమాచారం. 

ఐఎస్‌ఏకు త్వరలో ఐరాస అనుబంధ గుర్తింపు 
పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల అభివృద్ధి కోసం ప్రారంభించిన అంతర్జాతీయ సోలార్ అలయెన్స్ (ఐఎస్‌ఏ)కు 2017 డిసెంబర్ నాటికి ఐరాస అనుబంధ గుర్తింపు లభించనుందని కేంద్ర ఇంధన శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఆగస్టు 23న వెల్లడించారు. 121 దేశాల్లో అతి తక్కువ వ్యయంతో సౌర విద్యుత్ వ్యవస్థల ఏర్పాటు, ప్రాజెక్టులపై పరిశోధన కోసం ఐఎస్‌ఏ పనిచేస్తుంది. ఇందుకోసం 10 ఏళ్లలో 300 బిలియన్ డాలర్ల నిధులను సమీకరించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. 
2015 నవంబర్ 30న పారిస్‌లో జరిగిన వాతావరణ మార్పుల సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ, అప్పటి ఫ్రాన్స్ అధ్యక్షుడు ప్రాంకోయిస్ హోలాండే అంతర్జాతీయ సోలార్ అలయెన్స్‌ను ప్రారంభించారు.
క్విక్ రివ్యూ: ఏమిటి : అంతర్జాతీయ సోలార్ అలయెన్స్‌కు ఐరాస అనుబంధ గుర్తింపు
ఎప్పుడు : 2017 డిసెంబర్ నాటికి 
ఎందుకు : పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల అభివృద్ధి కోసం

చైనాలో బ్రిక్స్ పరిపాలనా సెమినార్ 
బ్రిక్స్ పరిపాలనా సెమినార్ ఆగస్టు 17, 18 తేదీల్లో దక్షిణ చైనాలో జరిగింది. బ్రిక్స్ సభ్య దేశాల (బ్రెజిల్, రష్యా, భారత్, దక్షిణా ఆఫ్రికా)తో పాటు అభివృద్ధి చెందిన దేశాల నుంచి 160కిపైగా ప్రతినిధులు ఈ సెమినార్‌కు హాజరయ్యారు. “Openness, Inclusiveness, Mutual Benefits and Win-Win: Working Together to Build a Community of Shared Future for Mankind” అనే థీమ్‌తో నిర్వహించిన ఈ సమావేశాల్లో.. బ్రిక్స్ దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని తీర్మానించారు.
9వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాలు ఈ ఏడాది సెప్టెంబర్‌లో చైనాలోని జియామెన్ నగరంలో జరుగుతాయి. 
క్విక్ రివ్యూ: ఏమిటి : బ్రిక్స్ పరిపాలనా సెమినార్ 
ఎప్పుడు : ఆగస్టు 17, 18
ఎవరు : బ్రిక్స్ కూటమి 
ఎక్కడ : చైనా 

డోక్లాం వివాదం పరిష్కారం: భారత్ భారత్, చైనాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైన డోక్లాం సరిహద్దు వివాదం పరిష్కారమైందని ఆగస్టు 28న భారత్ ప్రకటించింది. వివాదాస్పద ప్రాంతం నుంచి బలగాల ఉపసంహరణకు ఇరు దేశాల మధ్య అంగీకారం కుదరడంతో 70 రోజుల నుంచి సాగుతున్న ప్రతిష్టంభనకు తెరపడిందని తెలిపింది. ఈ మేరకు వీలైనంత త్వరగా డోక్లాం నుంచి సరిహద్దు బలగాల్ని వెనక్కి తీసుకునేందుకు భారత్, చైనా అంగీకరించాయని విదేశాంగ శాఖ ప్రకటించింది. మరోవైపు తమ బలగాల్ని ఉపసంహరించలేదని, పరిస్థితుల మేరకు మార్పులు ఉంటాయని చైనా పేర్కొంది. 
వివాదానికి కారణం
భారత్, చైనా, భూటాన్ సరిహద్దుల్లోని భూభాగమే డోక్లాం. సిక్కిం వైపున ఉన్న ఈ ప్రాంతం వ్యూహాత్మకంగా భారత్‌కు ఎంతో కీలకం. భూటాన్ అధీనంలో ఉన్న ప్రాంతంలో యుద్ధట్యాంకులు, పరికరాల్ని మోసుకెళ్లేలా రోడ్డు నిర్మాణానికి చైనా జూన్‌లో ప్రయత్నాలు మొదలుపెట్టింది. రోడ్డు పూర్తయితే ఈశాన్య రాష్ట్రాలతో మిగతా దేశాన్ని కలిపే బెంగాల్లోని సన్నని కోడి మెడ ప్రాంతం (చికెన్ నెక్) చేరుకునేందుకు చైనాకు వీలవుతుంది. దేశ భద్రత పరంగా ఈ నిర్మాణాన్ని ముప్పుగా భావించిన భారత్ భూటాన్‌కు మద్దతుగా తన సైన్యాన్ని మోహరించి దాన్ని అడ్డుకుంది. దీంతో భారత బంకర్లను చైనా ధ్వంసం చేసింది.

ప్రపంచంలో తొలి డైమండ్ ఫ్యూచర్స్ ప్రారంభం 
అనిల్ అంబానీ గ్రూప్‌నకు చెందిన ఇండియన్ కమోడిటీ ఎక్స్చేంజ్ (ఐసీఈఎక్స్) డైమండ్ ఫ్యూచర్స్ ట్రేడింగ్‌ను ఆగస్టు 28న ప్రారంభించింది. తద్వారా ప్రపంచంలోనే డైమండ్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్‌ను ప్రారంభించిన మొట్టమొదటి డెరివేటివ్‌‌స ఎక్స్చేంజ్‌గా నిలిచింది. తొలి దశలో కంపల్సరీ డెలివరీతో 1 క్యారెట్ పరిమాణంలో కాంట్రాక్ట్స్‌ను ప్రారంభించామని.. డైమండ్ లావాదేవీలు నిర్వహించేవారికి ఇది పూర్తి పారదర్శకమైన కొత్త మార్కెట్‌ను సృష్టిస్తుందని ఐసీఈఎక్స్ మేనేజింగ్ డెరైక్టర్ సంజిత్ ప్రసాద్ తెలిపారు. ట్రేడింగ్ పరిమాణం రోజుకు దాదాపు రూ.5,000 కోట్ల మేర ఉండే వీలుంది. 
క్విక్ రివ్యూ: ఏమిటి : ప్రపంచ తొలి డైమండ్ ఫ్యూచర్స్ ప్రారంభం 
ఎప్పుడు : ఆగస్టు 28
ఎవరు : ఇండియన్ కమోడిటీ ఎక్స్చేంజ్
ఎక్కడ : ముంబై

జాతీయంప్రధానికి సలహాలు ఇవ్వనున్న సీఈవో గ్రూప్‌లు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వివిధ అంశాల్లో సలహాలు, సూచనలు ఇచ్చేందుకు నీతి ఆయోగ్ సీఈవో బృందాలను ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఆరు బృందాలుగా ఏర్పడిన 200 మంది సీఈవోలు.. ఉపాధి కల్పన, ఆదాయ వృద్ధి, సాంకేతిక పరిజ్ఞానం, సరళ వ్యాపారం, పరిపాలన తదితర అంశాల్లో ప్రధాని, కేంద్ర మంత్రివర్గానికి సూచనలు, సలహాలు ఇవ్వనున్నారు. 2022 నాటికి సరికొత్త భారత్, మేక్ ఇన్ ఇండియా, రేపటి నగరాలు, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, రైతుల ఆదాయం రెట్టింపు అంశాలపై ఈ ఆరు బృందాలు పనిచేస్తాయి. 
క్విక్ రివ్యూ: ఏమిటి : ఆరు సీఈవో బృందాల ఏర్పాటు 
ఎప్పుడు : ఆగస్టు 21 
ఎవరు : నీతిఆయోగ్ 
ఎందుకు : అభివృద్ధి కార్యక్రమాలపై ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇచ్చేందుకు

మెంటార్ ఇండియా క్యాంపెయిన్ ప్రారంభం దేశవ్యాప్తంగా 900కుపైగా ఉన్న అటల్ టింకరింగ్ ల్యాబ్స్‌లోని విద్యార్థులకు మార్గనిర్దేశం చేసేందుకు ఉద్దేశించిన మెంటార్ ఇండియా క్యాంపెయిన్‌ను నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ ఆగస్టు 23న ప్రారంభించారు. ఇందులో భాగంగా నీతిఆయోగ్ ఎంపిక చేసిన వివిధ రంగాల్లోని నాయకులు(లీడర్స్) వారంలో రెండు గంటల పాటు విద్యార్థులతో సమావేశమవుతారు. తద్వారా విద్యార్థుల్లో డిజైన్, కంప్యూటేషనల్ నైపుణ్యాలు పెంపొందిస్తారు. 
అటల్ ఇన్నోవేషన్ మిషన్ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా అటల్ టింకరింగ్ ల్యాబ్స్‌ను ఏర్పాటు చేశారు. 6 నుంచి 12వ తరగతి విద్యార్థుల కోసం ఉద్దేశించిన ఈ కేంద్రాల్లో విద్యార్థులు ఇన్నోవేషన్ స్కిల్స్ నేర్చుకోవడంతో పాటు దేశాభివృద్ధికి దోహదపడే ఆలోచనలకు రూపు ఇస్తారు. 
క్విక్ రివ్యూ: ఏమిటి : మెంటార్ ఇండియా కార్యక్రమం ప్రారంభం 
ఎప్పుడు : ఆగస్టు 23
ఎవరు : నీతిఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ 
ఎక్కడ : దేశవ్యాప్తంగా 

సివిల్స్ అధికారుల కేటాయింపునకు జోనల్ విధానం సివిల్ సర్వీసెస్ అధికారులకు కేడర్ల కేటాయింపులో నూతన విధానాన్ని కేంద్రం ఖరారు చేసింది. ఇందులో భాగంగా ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్), ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్), ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్(ఐఎఫ్‌ఓఎస్) అధికారులు ఇకపై రాష్ట్రాలకు బదులుగా జోన్ల కేడర్లను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. సివిల్ సర్వీసెస్ అధికారుల్లో జాతీయ సమగ్రత భావనను పెంపొందించేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. 
నూతన విధానం ప్రకారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న 26 కేడర్లను 5 జోన్లుగా విభజించారు. కేంద్రం ప్రవేశపెట్టిన నూతన విధానం ప్రకారం అభ్యర్థి ప్రతి జోన్‌లోనూ ఒక రాష్ట్రాన్ని మాత్రమే ఎంపిక చేసుకోవాలి. దీనివల్ల ఇకపై ఒకే జోన్‌లో రెండు రాష్ట్రాలకు ఆప్షన్లు ఇవ్వడం కుదరదు.
ఏ జోన్లో ఏ రాష్ట్రాలు... జోన్-1: అరుణాచల్‌ప్రదేశ్, గోవా, మిజోరాం, జమ్మూకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, రాజస్తాన్, హరియాణా, కేంద్రపాలిత ప్రాంతాలు 
జోన్-2: ఉత్తరప్రదేశ్, బిహార్, జార్ఖండ్, ఒడిశా
జోన్-3: గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ 
జోన్-4: పశ్చిమబెంగాల్, సిక్కిం, అస్సాం, మేఘాలయ, మణిపూర్, త్రిపుర, నాగాలాండ్ 
జోన్-5: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ 

ఓబీసీ వర్గీకరణ కోసం ప్రత్యేక కమిషన్ రిజర్వేషన్ ఫలాలను ఓబీసీలకు మరింత సమర్థవంతంగా అందేలా ఓబీసీ వర్గీకరణ చేపట్టేందుకు ఓ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ఈ కమిషన్ ఓబీసీ కేటగిరీల్లో (కేంద్ర జాబితాలోని)ని కులాలు, వర్గాలకు అందుతున్న రిజర్వేషన్లను పరిశీలించి 12 వారాల్లో వర్గీకరణకు అనుసరించాల్సిన విధివిధానాలు, నిబంధనలను ఖరారు చేస్తుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పుదుచ్చేరి, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, హరియాణా, జార్ఖండ్, జమ్మూకశ్మీర్, పశ్చిమబెంగాల్, బిహార్ రాష్ట్రాల్లో ఓబీసీల వర్గీకరణ జరిగింది.
క్విక్ రివ్యూ: ఏమిటి : ఓబీసీ వర్గీకరణకు ప్రత్యేక కమిషన్ 
ఎప్పుడు : ఆగస్టు 23
ఎవరు : కేంద్ర ప్రభుత్వం 
ఎందుకు : ఓబీసీలకు మరింత సమర్థవంతంగా రిజర్వేషన్లను అందించేందుకు 

వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కే 
 వ్యక్తిగత గోప్యతపై దేశ అత్యున్నత ధర్మాసనం చారిత్రాత్మక తీర్పునిచ్చింది. రాజ్యాంగంలోని 21వ నిబంధన ప్రకారం ‘రైట్ టు ప్రైవసీ’ ప్రాథమిక హక్కు కిందకే వస్తుందని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఈ మేరకు తొమ్మిది మంది న్యాయమూర్తులతో కూడిన విసృ్తత ధర్మాసనం ఆగస్టు 24న ఏకగ్రీవంగా తీర్పు వెలువరించింది. ఈ అంశంపై గతంలో ఇచ్చిన రెండు తీర్పులను న్యాయస్థానం కొట్టివేసింది. అలాగే.. ఆధార్‌పై ప్రత్యేక భద్రతావ్యవస్థను ఏర్పాటు చేయాలని కేంద్రానికి సూచించింది. 
ఉల్లంఘనే అంటూ పిటిషన్లు..కేంద్ర ప్రభుత్వ పథకాలకు, సంక్షేమ పథకాలకు ఆధార్ కార్డు అనుసంధానాన్ని తప్పనిసరి చేస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆధార్ అనుసంధానించడం వ్యక్తిగత హక్కును ఉల్లంఘించడమేనని ఆందోళన వ్యక్తంచేస్తూ 2015లో సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. దీంతో ఆధార్‌పై విచారించేందుకు ఏర్పాటు చేసిన ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం.. ఈ విషయంలో ముందుగా వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కా, కాదా అన్న అంశంపై చర్చ జరగాలని తేల్చింది. ఈ విషయంపై చర్చించేందుకు తొమ్మిది మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేస్తున్నట్లు జులై 18న సుప్రీంకోర్టు తెలిపింది. రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల్లో ఈ హక్కు ఉందా, లేదా అనే దానిపై చర్చించాలని, వీటిపై స్పష్టత వచ్చాకే ఆధార్ పథకాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాల విచారణను చేపడుతామని న్యాయస్థానం స్పష్టం చేసింది.
ఇప్పుడే తొలిసారి కాదు..వ్యక్తిగత గోప్యతపై సుప్రీంకోర్టులో చర్చ జరగడం ఇదే తొలిసారి కాదు. 1954లో ఎంపీ శర్మ కేసులో భాగంగా వ్యక్తిగత గోప్యతపై చర్చ జరిగింది. ఆ తర్వాత 1963లో మరోసారి ఈ అంశం చర్చకు వచ్చింది. ఈ రెండు కేసుల్లో కూడా వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కు కాదని ధర్మాసనం తేల్చింది. ఆ తర్వాత 1970, 80లలో సుప్రీంకోర్టులో వివిధ బెంచ్‌లు ప్రాథమిక హక్కేనని తీర్పునిచ్చినా.. సంఖ్యాపరంగా అవి చిన్న ధర్మాసనాలు కావడంతో.. 1954, 63లో ఇచ్చిన తీర్పునే కొనసాగిస్తూ వస్తున్నారు. తాజాగా ఆధార్ అనుసంధానం చేయడంతో మరోసారి ఈ ప్రశ్న తలెత్తింది. అయితే గతంలో పరస్పర విరుద్ధ తీర్పులు వచ్చిన నేపథ్యంలో ఈ అంశాన్ని విసృ్తతమైన రాజ్యాంగ ధర్మాసనం నిర్ణయించాల్సిన అవసరం ఉందని ఇంతకుముందు అటార్నీ జనరల్‌గా ఉన్న ముకుల్ రోహత్గీ కోర్టుకు నివేదించారు. దీంతో తొమ్మిది మంది న్యాయమూర్తులతో విస్త్రత రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టి.. గతంలో ఇచ్చిన రెండు తీర్పులను కొట్టివేసింది. వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కేనని ఏకగ్రీవంగా తేల్చింది.

తదుపరి తీర్పే కీలకం.. ఆధార్ కార్డునే అన్నింటికీ ఆధారం చేస్తున్న క్రమంలో వ్యక్తిగత గోప్యతపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చర్చనీయాంశంగా మారింది. బ్యాంకు ఖాతాలు, పాన్ కార్డులకు, మొబైల్ కంపెనీ సిమ్‌లకు ఆధార్ కార్డును అనుసంధానించడంపై సందిగ్ధత ఏర్పడింది. వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కేనని పేర్కొన్న సుప్రీంకోర్టు, ఆధార్‌పై అభ్యంతరాలను ప్రస్తావించలేదు. బ్యాంకు ఖాతాలు, ప్రభుత్వ పథకాలు వంటి వాటికి తప్పనిసరి చేస్తున్న ఆధార్ కార్డు వివరాలు, వ్యక్తిగత గోప్యత కిందకే వస్తాయని పలువురు న్యాయవాదులంటున్నారు. అయితే ఇప్పటికే ఆధార్ అనుసంధానం ప్రక్రియ 80 శాతం పూర్తయిన నేపథ్యంలో ఇప్పుడేం చేస్తారనే విషయమై గందరగోళం నెలకొంది. ప్రభుత్వ అనుసంధాన ప్రక్రియ వ్యక్తిగత గోప్యత కిందకు వస్తుందా? వస్తే ప్రభుత్వం తప్పనిసరి చేస్తున్న ఆధార్ కార్డు వివరాలు మనం ఇవ్వకపోయినా పర్వాలేదా? అనేది ఇప్పుడు తేలాల్సి ఉంది. ఈ పీటముడిపై ఏర్పడిన సందిగ్థతను తొలగించేందుకు ఐదుగురు జడ్జిలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ‘గోప్యత’ అనే ప్రాథమిక హక్కును ఆధార్ కార్డు ఉల్లంఘిస్తుందా? లేదా అనే దానిపై తీర్పు చెప్పనుంది.

గోప్యత అంటే! వ్యక్తిగత అన్యోన్యత, కుటుంబ జీవితం, వివాహం, సంతానం, ఇల్లు, లింగ నేపథ్యం వంటి అంశాలన్నీ గోప్యత కిందకే వస్తాయని స్పష్టం చేసింది. ‘తన జీవితం ఎలా ఉండాలో కోరుకోవటం గోప్యత అవుతుంది. భిన్నత్వాన్ని కాపాడుతూ.. మన సంస్కృతిలోని బహుళత్వాన్ని, వైవిధ్యాన్ని గోప్యత సూచిస్తుంది. గోప్యతపై న్యాయపరమైన అంచనాలు సన్నిహితం నుంచి వ్యక్తిగతంలో, వ్యక్తిగతం నుంచి బహిరంగ అంశాల్లో వేర్వేరుగా ఉంటాయి. అయితే బహిరంగ వేదికపై వ్యక్తిగత స్వేచ్ఛను కోల్పోకుండా చేయటం చాలా ముఖ్యం’ అని తీర్పులో సుప్రీంకోర్టు పేర్కొంది.

సముద్ర గర్భ మిషన్‌ను ప్రారంభించనున్న భారత్ సముద్రం అడుగన ఉన్న సహజ వనరులను సరైన రీతిలో వినియోగించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సముద్ర గర్భ మిషన్ (డీప్ ఓషన్ మిషన్)ను చేపట్టనుంది. కేంద్ర భూ శాస్త్ర మంత్రిత్వశాఖ (Ministry of Earth Sciences) ఆధ్వర్యంలో చేపట్టనున్న ఈ ప్రాజెక్టును 2018 జనవరిలో ప్రారంభించనున్నారు. 
భారత్‌కు 7,500 కి.మీ. తీర ప్రాంతం.. 2.4 మిలియన్ చదరపు కి.మీ. ప్రత్యేక ఆర్థిక మండలి (ఈఈజెడ్) ఉంది. భారత్‌కు చెందిన సముద్ర జలాల్లో అపారమైన శక్తి, ఆహారం, ఔషధ వనరులు ఉన్నాయి.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : డీప్ ఓషన్ మిషన్ 
ఎప్పుడు : 2018 జనవరి 
ఎవరు : భారత ప్రభుత్వం 
ఎక్కడ : భారత సముద్ర జలాల్లో 
ఎందుకు : సహజ వనరులను వెలికితీసేందుకు 

కేసుల సత్వర పరిష్కారానికి పనితీరు సూచీ: నీతిఆయోగ్ న్యాయ వ్యవస్థ పనితీరు సూచీను ఏర్పాటు చేయడం ద్వారా కింది కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను సత్వరం పరిష్కరించవచ్చని నీతి ఆయోగ్ కేంద్రానికి సూచించింది. దీంతో పాటు ఆన్‌లైన్ వ్యవస్థ ద్వారానే న్యాయవ్యవస్థలో నియామకాలను చేయాలని ప్రతిపాదించింది. కోర్టు పనితీరులో ప్రపంచశ్రేణి ప్రమాణాలను పాటించేందుకు ఆస్ట్రేలియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జ్యుడీషియల్ అడ్మినిస్ట్రేషన్, ది ఫెడరల్ జ్యుడీషియల్ సెంటర్ (యూఎస్), ది నేషనల్ ఆఫ్ కోర్ట్్స (యూఎస్), సింగపూర్‌లోని సబా ర్డినేట్ కోర్టులను అధ్యయనం చేయాలని సూచించింది.

ఒకేసారి ఎన్నికలకు నీతి ఆయోగ్ సిఫార్సు 
 దేశంలో 2024 నాటికల్లా లోక్‌సభతోపాటు అన్ని శాసనసభలకు కలిపి ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని నీతి ఆయోగ్ సిఫార్సు చేసింది. ఇందుకోసం కొన్ని రాష్ట్రాల శాసనసభల కాలాన్ని పొడిగించడమో, తగ్గించడమో చేయాల్సి ఉంటుందని అభిప్రాయపడింది. 2017-18 నుంచి 2019-20 కోసం రూపొందించిన త్రైవార్షిక ప్రణాళికలో ఈ విషయాలను ప్రస్తావించింది. అలాగే దేశంలో నిరుద్యోగం ప్రధాన సమస్య కాదని, అర్హతలు, నైపుణ్యాలు ఉన్న వారికి ప్రతిభకు తగ్గ ఉద్యోగాలు, వేతనాలు లభించకపోవడమే తీవ్ర సమస్యని నీతి ఆయోగ్ అభిప్రాయపడింది. తీరప్రాంత ఉపాధి మండళ్ల (సీఈజడ్)ను ఏర్పాటు చేస్తే కొన్ని బహుళజాతి కంపెనీలు చైనా నుంచి భారత్‌కు తరలి వచ్చే అవకాశం ఉందని పేర్కొంది.
క్విక్ రివ్యూ: ఏమిటి : దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలకు సిఫార్సు
ఎప్పుడు : 2024 నాటికి
ఎవరు : నీతి ఆయోగ్ 
ఎందుకు : ఎన్నికల వ్యయాన్ని తగ్గించేందుకు 

వైవాహిక అత్యాచారం నేరం కాదు : కేంద్రం 
భార్య అంగీకారం లేకుండా భర్త ఆమెతో శృంగారంలో పాల్గొనడాన్ని నేరంగా పరిగణించలేమని, అలా చేస్తే వివాహ వ్యవస్థ అస్థిరమవుతుందని ఢిల్లీ హైకోర్టుకు కేంద్రం తెలిపింది. భర్తలను వేధింపులకు గురిచేయడానికి భార్యలకు అది ఒక సులభమైన ఆయుధంగా మారే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేసింది. వైవాహిక అత్యాచారాన్ని (మారిటల్ రేప్)ను నేరంగా చూడాలని కోరుతూ దాఖలైన పిటిషన్లకు స్పందనగా కేంద్రం ఆగస్టు 29న అఫిడవిట్ సమర్పించింది. ఐపీసీ సెక్షన్ 498 ఏ (గృహ హింస వ్యతిరేక చట్టం) దుర్వినియోగమవుతున్న సంగతి సుప్రీంకోర్టు, పలు హైకోర్టుల దృష్టికి వచ్చిందని గుర్తుచేసింది. 
క్విక్ రివ్యూ: ఏమిటి : వైవాహిక అత్యాచారం నేరం కాదు 
ఎప్పుడు : ఆగస్టు 29
ఎవరు : కేంద్ర ప్రభుత్వం 
ఎక్కడ : ఢిల్లీ హైకోర్టులో అఫిడవిట్ 

దక్షిణాది రాష్ట్రాల మధ్య ‘విద్యుత్’ సహకారందక్షిణాది రాష్ట్రాలు విద్యుత్‌ను పరస్పరం ఇచ్చి పుచ్చుకునేందుకు అంగీకరించాయి. దక్షిణాది రాష్ట్రాల విద్యుత్ కమిటీ(ఎస్‌ఆర్‌పీసీ) అధ్యక్షుడు, తెలంగాణ ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు అధ్యక్షతన కేరళ రాజధాని తిరువనంతపురంలో ఆగస్టు 22న ముగిసిన సమావేశంలో ఈ మేరకు అంగీకారం కుదిరింది.

ఛత్తీస్‌గఢ్‌లో ఉచితంగా స్మార్ట్ ఫోన్లు ఛత్తీస్‌గఢ్‌లో 55 లక్షల స్మార్ట్ ఫోన్లను ఉచితంగా పంపిణీ చేయాలని ఆ రాష్ర్ట ప్రభుత్వం ఆగస్టు 23న నిర్ణయించింది. ఈ పథకానికి సంచార్ క్రాంతి యోజన అని పేరు పెట్టారు. 

దేశంలోనే తొలి విదేశ్ భవన్ ప్రారంభంముంబైలో ఏర్పాటుచేసిన విదేశ్ భవన్‌ను విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ఆగస్టు 27న ప్రారంభించారు. దేశంలో ఈ తరహా కార్యాలయం ఏర్పాటుకావడం ఇదే ప్రథమం. విదేశీ వ్యవహారాల శాఖకు సంబంధించి మహారాష్ర్టలో ఉన్న అన్ని కీలక కార్యాలయాలు విదేశ్ భవన్‌లో ఉంటాయి.

రాష్ట్రీయంతెలంగాణలో భూముల సర్వే, రికార్డుల ప్రక్షాళన
భూవివాదాల శాశ్వత పరిష్కారం కోసం రాష్ట్రంలో రికార్డులను ప్రక్షాళన చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. సెప్టెంబర్ 15 నుంచి డిసెంబర్ వరకు మూడు నెలల వ్యవధిలో అన్ని గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టేందుకు తేదీలను ఖరారు చేశారు. ప్రక్షాళన చేసిన రికార్డుల ఆధారంగానే రైతులకు వ్యవసాయ పెట్టుబడి పథకం అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఇందుకోసం సెప్టెంబర్ 1 నుంచి రైతు సంఘాలను ఏర్పాటు చేయనున్నారు. 
ఇదీ కార్యాచరణ..

  • సెప్టెంబర్ 1 నుంచి 9 వరకు
  • గ్రామ రైతు సంఘాల సమన్వయ సమితి ఏర్పాటు. గ్రామంలో వ్యవసాయ భూమి ఉన్నవారంతా రైతు సంఘంలో సభ్యులుగా ఉంటారు. 11 మందితో సమన్వయ సమితులు ఏర్పాటవుతాయి.
  • సెప్టెంబర్ 10 నుంచి 15 వరకు - మండల స్థాయిలో సమితుల సదస్సుల నిర్వహణ
  • సెప్టెంబర్ 15న రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండలాల్లో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది.
  • సెప్టెంబర్ 15 నుంచి డిసెంబర్ నెలాఖరు వరకు రెవెన్యూ గ్రామం యూనిట్‌గా రికార్డుల ప్రక్షాళన.
క్విక్ రివ్యూ: ఏమిటి : భూముల సర్వే, రికార్డుల ప్రక్షాళన
ఎప్పుడు : సెప్టెంబర్ 1 నుంచి డిసెంబర్ వరకు 
ఎవరు : తెలంగాణ ప్రభుత్వం 
ఎక్కడ : తెలంగాణలో 
ఎందుకు : భూవివాదాల శాశ్వత పరిష్కారం కోసం

పెట్టుబడి పథకం అమలుకు రైతు సమన్వయ సమితులు
రైతు పెట్టుబడి పథకాన్ని అమలు చేయడం సహా ఇతరత్రా అనేక కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు సెప్టెంబర్ 9 నాటికి గ్రామ, మండల, జిల్లాస్థాయి రైతు సమన్వయ సమితుల ఏర్పాటును పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు సమన్వయ సమితులు, వాటి సమన్వయకర్తలను నియమించే (నామినేట్) బాధ్యతను మంత్రులకు అప్పగించింది. రాష్ట్రస్థాయి సమన్వయ సమితిని సీఎం నియమిస్తారు.

ఒక్కో రెవెన్యూ గ్రామానికి ఒక గ్రామ రైతు సమన్వయ సమితిని ఏర్పాటు చేసి దానిలో 15 మంది సభ్యులను నియమిస్తారు. ఇదేవిధంగా మండల, జిల్లా రైతు సమన్వయ సమితిలో 24 మంది సభ్యులు, రాష్ట్ర రైతు సమన్వయ సమితిలో 42 మంది సభ్యులు ఉంటారు. ప్రతీ సమితిలో మూడో వంతు మహిళలు ఉంటారు. ఆ ప్రకారం గ్రామ సమన్వయ సమితిలో ఐదుగురు, జిల్లా, మండల రైతు సమన్వయ సమితిలో 8 మంది, రాష్ట్ర రైతు సమన్వయ సమితిలో 14 మంది చొప్పున మహిళలు ఉంటారు. 
రాష్ట్రస్థాయిలో ప్రభుత్వం నామినేట్ చేసే రాష్ట్ర రైతు సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో రూ.500 రివాల్వింగ్ ఫండ్‌ను ఏర్పాటు చేస్తారు. రైతులకు కనీస మద్దతు ధర లభించేలా, పండించిన పంట ఉత్పత్తులకు గ్రామాలు, మండలాల్లో వ్యాపారులతో బేరమాడేందుకు ఈ రివాల్వింగ్ ఫండ్ ఉపయోగపడనుంది.
రాష్ట్రంలో 10,434 రెవెన్యూ గ్రామాలున్నాయి. దీని ప్రకారం మొత్తం గ్రామ రైతు సమన్వయ సభ్యుల సంఖ్య 1,56,510. అందులో మహిళా సభ్యులు 52,170.

మంగల్‌పల్లి అంగన్‌వాడీ టీచర్‌కు జాతీయ పురస్కారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మంగల్‌పల్లి అంగన్‌వాడీ టీచర్ మల్లమ్మకు జాతీయ పురస్కారం లభించింది. మహిళాశిశు సంక్షేమ శాఖ జాతీయ స్థాయిలో 2016-17 సంవత్సరానికి గాను ఉత్తమ అంగన్‌వాడీ కార్యకర్త జాతీయ పురస్కారానికి ఆమెను ఎంపిక చేసింది. ఆగస్టు 31న ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగే కార్యక్రమంలో కేంద్ర మహిళాశిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకాగాంధీ చేతుల మీదుగా ఆమె ఈ పురస్కారం అందుకుంటారు. పురస్కారం కింద రూ.25 వేల నగదు, ప్రశంసాపత్రం, జ్ఞాపిక ఇవ్వనున్నారు. 
క్విక్ రివ్యూ: ఏమిటి : జాతీయ ఉత్తమ అంగన్‌వాడీ కార్యకర్త అవార్డు 
ఎప్పుడు : ఆగస్టు 28 
ఎవరు : మల్లమ్మ 
ఎక్కడ : మంగల్‌పల్లి, ఇబ్రహీంపట్నం, రంగారెడ్డి జిల్లా 

డాక్టర్ ఏబీఎన్ రావు కన్నుమూత సుప్రసిద్ధ ఈఎన్‌టీ వైద్య నిపుణుడు, కోఠి ఈఎన్‌టీ ఆసుపత్రి వ్యవస్థాపక సూపరింటెండెంట్ ప్రొఫెసర్ అక్కినేపల్లి బద్రి నారాయణరావు(94) ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్‌లో ఆగస్టు 28న కన్నుమూశారు. రావు స్వస్థలం నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం అడ్లూరు. 
డాక్టర్ మర్రి చెన్నారెడ్డి, డాక్టర్ రాజ్ బహదూర్‌గౌర్‌లతో కలసి చదువుకున్న ఏబీఎన్ రావు.. నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్‌కు సన్నిహితుడు. కోఠి ఈఎన్‌టీ వ్యవస్థాపకుడిగా, మొట్టమొదటి సూపరింటెండెంట్‌గా పని చేశారు. వైద్య రంగంలో సేవలకు గాను బ్రిటన్ నుంచి సీనియర్ స్పెషలిసు అవార్డు అందుకున్నారు. ఆస్ట్రేలియాలోని రాయల్ డార్విన్ ఆస్పత్రి 1996లో ఆయనకు ‘డార్విన్ సిటిజన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును అందజేసింది. 
క్విక్ రివ్యూ: ఏమిటి : డాక్టర్ ఏబీఎన్ రావు కన్నుమూత
ఎప్పుడు : ఆగస్టు 28
ఎవరు : కోఠి ఈఎన్‌టీ ఆస్పత్రి వ్యవస్థాపకులు

పోలవరం అథారిటీ సభ్యకార్యదర్శిగా శ్రీవాత్సవకృష్ణా బోర్డు చైర్మన్ ఎస్.కె. శ్రీవాత్సవను ఆంధ్రప్రదేశ్ పరిధిలోని పోలవరం ప్రాజెక్టు అథారిటీ సభ్య కార్యదర్శిగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 28న ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం పోలవరం, పట్టిసీమ వాటాలపై న్యాయం కోసం బోర్డు ముందు వాదోపవాదాలు జరుగుతున్న సమయంలో తటస్థంగా ఉంచాల్సిన బోర్డు చైర్మన్‌ను, ఏపీ ప్రాజెక్టుకు సభ్య కార్యదర్శిగా నియమించడంపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. 
క్విక్ రివ్యూ: ఏమిటి : పోలవరం అథారిటీ సభ్య కార్యదర్శిగా శ్రీవాత్సవ 
ఎప్పుడు : ఆగస్టు 28
ఎవరు : కేంద్ర ప్రభుత్వం 

ఏపీలో జలసిరికి హారతి కార్యక్రమంరాష్ట్రవ్యాప్తంగా సెప్టెంబర్ 6 - 8 వరకు ‘‘జలసిరికి హారతి’’ కార్యక్రమం చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. నదుల నుంచి చెరువుల వరకు రాష్ట్రంలోని అన్ని జలవనరులను ఆ మూడు రోజులు పూజించుకునేలా, ఇందులో ప్రజలు భాగస్వామ్యులు అయ్యేలా చూడాలని సూచించారు. 
క్విక్ రివ్యూ: ఏమిటి : జలసిరికి హారతి కార్యక్రమం 
ఎప్పుడు : సెప్టెంబర్ 6 - 8 
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్‌లో 
ఎందుకు : జలవనరులను పూజించేందుకు

వారసత్వ సంపద పరిరక్షణకు 7 అకాడమీలు తెలుగు భాషా, సంస్కృతి, సంప్రదాయాల వారసత్వ సంపదను కాపాడేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏడు అకాడమీలను ఏర్పాటు చేసింది. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆగస్టు 29న జరిగిన తెలుగు భాషా దినోత్సవంలో సాహిత్య, సంగీత, నృత్య, నాటక, దృశ్య కావ్య, జానపదకళలు, సైన్స్‌ అండ్ టెక్నాలజీ అకాడమీల ఏర్పాటుకు సంబంధించిన జీవోను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు. గతంలో ఉన్న అధికార భాషాచట్టం స్థానంలో తెలుగు భాషాభివృద్ధి ప్రాధికార సంస్థను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. 
క్విక్ రివ్యూ: ఏమిటి : సాహిత్య, సంగీత, నృత్య, నాటక, దృశ్య కావ్య, జానపదకళలు, సైన్స్ అండ్ టెక్నాలజీ అకడామీల ఏర్పాటు 
ఎప్పుడు : ఆగస్టు 29
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్‌లో 
ఎందుకు : వారసత్వ సంపద పరిరక్షిణకు 

ఏపీకి మరో 1.20 లక్షల ‘పీఎంఏవై’ ఇళ్ల మంజూరు 
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) కింద ఆంధ్రప్రదేశ్‌కు 1,20,894 ఇళ్లను కేంద్రం మంజూరు చేసింది. ఈ మేరకు ఏపీ సహా ఆరు రాష్ట్రాలకు మొత్తం 2,17,900 ఇళ్లను మంజూరు చేస్తున్నట్లు కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ ఆగస్టు 29న ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 26 లక్షలకు పైగా ఇళ్లు మంజూరు చేయగా ఇందులో ఏపీ వాటా 20.71 శాతం. అలాగే రాష్ట్రానికి ఇప్పటి వరకు మొత్తం 5,41,300 ఇళ్లు మంజూరు కాగా వీటికి రూ.31,056 కోట్ల మేర పెట్టుబడి ప్రతిపాదనలను కేంద్రం ఆమోదించింది. దీనికి సంబంధించి రూ.8,138 కోట్ల మేర కేంద్రం సాయంగా అందనుంది. 
క్విక్ రివ్యూ: ఏమిటి : పీఎంఏవై కింద ఏపీకి 1.20 లక్షల ఇళ్లు మంజూరు 
ఎప్పుడు : ఆగస్టు 29
ఎవరు : కేంద్ర గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ 

ఆర్థికంచైనా టాంపర్డ్ గ్లాస్‌లపై దిగుమతి నిరోధక సుంకంచైనా నుంచి దిగుమతి అయ్యే టాంపర్డ్ గ్లాస్‌ల (మొబైల్ స్క్రీన్ సేవర్) పై భారత ప్రభుత్వం 5 ఏళ్ల పాటు దిగుమతి నిరోధక సుంకం (యాంటీ డంపింగ్ డ్యూటీ) విధించింది. టన్ను టాంపర్డ్ గ్లాస్‌లపై 52.85 డాలర్ల నుంచి 136.21 డాలర్ల వరకు పన్ను విధింపు వర్తిస్తుందని కేంద్ర రెవెన్యూ శాఖ ఆగస్టు 21న నోటిఫికేషన్ జారీ చేసింది. దేశీయ పరిశ్రమలను ప్రోత్సహించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. 
క్విక్ రివ్యూ: ఏమిటి : చైనా టాంపర్డ్ గ్లాస్‌లపై 5 ఏళ్లపాటు దిగుమతి నిరోధక సుంకం
ఎప్పుడు : ఆగస్టు 21
ఎవరు : కేంద్ర ప్రభుత్వం 
ఎందుకు : దేశీయ పరిశ్రమలను ప్రోత్సహించేందుకు 

త్వరలో చెలామణిలోకి రూ.200 నోట్లు మొదటిసారిగా రూ.200 నోట్ల జారీకి కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. చిన్నపాటి లావాదేవీలకు ప్రస్తుతం ఎదురవుతున్న ఇబ్బందులు అధిగమించేందుకు వీలైనంత త్వరగా వీటిని వాడుకలోకి తీసుకురావాలని రిజర్వుబ్యాంకును ఆదేశించింది. పెద్దనోట్ల రద్దు తర్వాత కొత్త నోట్లకు తీవ్ర కొరత ఏర్పడింది. రూ.2000 నోట్లు కూడా ఆశించిన స్థాయిలో తిరిగి బ్యాంకులకు చేరకపోవడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులకు గురైనట్టు ఆర్బీఐ గుర్తించింది.
క్విక్ రివ్యూ: ఏమిటి : త్వరలో రూ.200 నోట్లు 
ఎవరు : రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా 
ఎక్కడ : దేశవ్యాప్తంగా 
ఎందుకు : చిన్న నోట్ల కొరత తీర్చేందుకు 

ఎయిరిండియా ఆస్తుల విక్రయం ప్రారంభం ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా... దేశవ్యాప్తంగా తనకున్న ఆస్తుల్లో కొన్నింటిని అమ్మకానికి పెట్టింది. ఎయిరిండియాకు దేశమంతటా ఆస్తులున్న నేపథ్యంలో... వాటిని విక్రయించి సంస్థకున్న అప్పుల్లో కొన్నిటిని తీర్చాలని ప్రభుత్వం గతంలో నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పుణె, అహ్మదాబాద్, ముంబై, బెంగళూరు, కోల్‌కతా, చెన్నై, తిరువనంతపురం, గోవా, లక్నో, గ్వాలియర్, గుర్గావ్, భుజ్ ప్రాంతాల్లో సంస్థకు ఉన్న 27 రెసిడెన్షియల్ ఫ్లాట్లు, విల్లాలు, కమర్షియల్ ప్లాట్లు, స్థలాలు, ఆఫీసు భవంతులను అమ్మకానికి పెట్టారు. ఈ విక్రయం ద్వారా కనీసం రూ. 500 కోట్లు సమకూరుతాయని సంస్థ భావిస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్‌టీసీ ఈ ఆస్తులకు ఈ-వేలం నిర్వహించనుండగా.. బిడ్ల దాఖలుకు చివరి తేదీని సెప్టెంబర్ 6గా నిర్ణయించారు. 
2017 మార్చి ఆఖరుకి ఎయిరిండియా మొత్తం రుణభారం రూ.48,879 కోట్లు. గతేడాది కంపెనీ నికర నష్టం రూ. 3,643 కోట్లకు తగ్గగా.. నిర్వహణ లాభం రూ. 300 కోట్లుగా నమోదైంది. 
క్విక్ రివ్యూ: ఏమిటి : ఎయిరిండియా ఆస్తుల విక్రయం ప్రారంభం 
ఎప్పుడు : ఆగస్టు 24 
ఎవరు : కేంద్ర పౌరవిమానయాన శాఖ 
ఎందుకు : సంస్థకున్న అప్పుల్లో కొన్నిటిని తీర్చాలని 

నీతి ఆయోగ్ 3 ఏళ్ల సమగ్ర ప్రణాళిక భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు వచ్చే రెండు మూడేళ్లలో 8 శాతానికి పైగా నమోదవడానికి పుష్కలంగా అవకాశాలున్నట్లు నీతి ఆయోగ్ పేర్కొంది. అలాగే ఆర్థిక సంస్కరణల ఫలాలు దేశంలోని మొత్తం 125 కోట్ల మంది ప్రజలకు ప్రయోజనాలు సమకూర్చేలా ఉండాలని సూచించింది. ఆర్థిక, న్యాయ, నియంత్రణ వ్యవస్థలతోపాటు సామాజిక రంగాల్లో చేపట్టాల్సిన సంస్కరణలకు సంబంధించి ‘మూడేళ్ల సమగ్ర ప్రణాళిక- 2017-18 నుంచి 2019-20’ని ఆగస్టు 24న ఆవిష్కరించింది. నల్లధనం, అవినీతి నిరోధం, పన్ను పరిధి పెంపు, సివిల్ సర్వీసులు, ఎన్నికల ప్రక్రియలో సంస్కరణ వంటి కీలక అంశాలపై సూచనలు ఇందులో ఉన్నాయి. 
ప్రణాళికలోని ముఖ్యాంశాలు
- వచ్చే రెండు మూడేళ్లలో 8 శాతం వృద్ధికి చక్కటి అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనితో వచ్చే దశాబ్ద కాలంలో పేదరిక నిర్మూలన భారీగా జరిగే వీలుంది. 
-కేంద్ర ప్రభుత్వ వ్యయాల విషయంలో భవిష్యత్ ప్రాధాన్యతపై దృష్టి ఉండాలి. అధిక ప్రాధాన్యతా రంగాలకు అదనపు కేటాయింపులు జరగాలి. ఇది వృద్ధి ప్రోత్సాహానికి దారితీస్తుంది. 
-2019-20 నాటికి అధిక నిధులను విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, రక్షణ, రైల్వేలు, రోడ్లు అభివృద్ధికి కేటాయించాలి. 
- సామాజిక రంగం విషయంలో విద్య, వైద్య రంగాలు మెరుగుపడాలి. మానవ వనరుల నైపుణ్యతలో పురోగతి ఉండాలి. ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాలు, తెగలు, మహిళల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలి. 
క్విక్ రివ్యూ: ఏమిటి : 3 ఏళ్ల సమగ్ర ప్రణాళిక 
ఎప్పుడు : ఆగస్టు 24
ఎవరు : నీతి ఆయోగ్ 
ఎందుకు : ఆర్థిక, న్యాయ, నియంత్రణ వ్యవస్థలతోపాటు సామాజిక రంగాల్లో చేపట్టాల్సిన సంస్కరణలకు సంబంధించి

లక్ష్యాన్ని దాటిన తొలి జీఎస్‌టీ వసూళ్లు
వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు తొలి నెల జూలైలో లక్ష్యాలను అధిగమించాయి. ఈ వసూళ్ల మొత్తం రూ.92,283 కోట్లని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆగస్టు 29న వెల్లడించారు. అలాగే.. 59.57 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు జీఎస్‌టీ విధానం కింద రిజిస్టర్ కాగా వీరిలో ఇప్పటివరకూ 64.4 శాతం మంది నుంచి మాత్రమే పన్ను వసూళ్లు జరిగాయి. 
జూలైలో జీఎస్‌టీ ద్వారా మొత్తం రూ.91,000 కోట్లు మాత్రమే లభిస్తాయని వార్షిక బడ్జెట్ అంచనా వేసింది. 
క్విక్ రివ్యూ: ఏమిటి : జీఎస్‌టీ జూలై నెల వసూళ్లు రూ.92,283 కోట్లు 
ఎప్పుడు : ఆగస్టు 29
ఎవరు : ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ 

సైన్స్ అండ్ టెక్నాలజీ
హ్యాష్‌ట్యాగ్‌కు పదేళ్లు పూర్తి 
సామాజిక మాధ్యమాల్లో కీలకంగా వాడే హ్యాష్‌ట్యాగ్ (#)కు ఆగస్టు 23తో పదేళ్లు పూర్తయ్యాయి. అమెరికాకు చెందిన క్రిస్ మెస్సినా అనే సామాజిక మాధ్యమ నిపుణుడు హ్యాష్‌ట్యాగ్ విధానాన్ని రూపొందించి, తొలిసారిగా 2007 ఆగస్టు 23న ఓ ట్వీట్‌లో ‘#barcamp’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను వాడారు. అప్పటి నుంచి ఇది ప్రచారంలోకి వచ్చింది. 
క్విక్ రివ్యూ: ఏమిటి : హ్యాష్‌ట్యాగ్‌కు పదేళ్లు పూర్తి 
ఎప్పుడు : ఆగస్టు 23
ఎవరు : క్రిస్ మెస్సినా 

ఎల్‌ఆర్ సామ్ క్షిపణిని నేవీకి అప్పగించిన జైట్లీ హైదరాబాద్‌లోని కంచన్‌బాగ్ బీడీఎల్‌లో ఆగస్టు 28న జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న రక్షణ శాఖమంత్రి అరుణ్ జైట్లీ.. సామ్ క్షిపణిని నావికాదళానికి అప్పగించారు. అలాగే.. బార్‌కోడ్‌తో రూపొందించిన బీఎంపీ-2 వాహనాలను రక్షణ శాఖకు అంకితమిచ్చారు. అధునాతన ఎల్‌ఆర్ సామ్ క్షిపణిని బీడీఎల్, మిథాని సంయుక్తంగా రూపొందించాయి. పటాన్‌చెరులోని బీడీఎల్ పరిశ్రమలో అస్త్ర క్షిపణుల తయారీ ప్రాజెక్టు కార్యాలయాన్ని, కొత్తగా ఏర్పాటు చేసిన 5 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్‌ను జైట్లీ ప్రారంభించారు. 
క్విక్ రివ్యూ: ఏమిటి : ఎల్‌ఆర్ సామ్ క్షిపణి నేవీకి అప్పగింత 
ఎప్పుడు : ఆగస్టు 28
ఎవరు : రక్షణశాఖ మంత్రి అరుణ్ జైట్లీ 
ఎక్కడ : హైదరాబాద్‌లో 

జపాన్ మీదుగా ఉత్తర కొరియా క్షిపణి
వరుసగా క్షిపణి ప్రయోగాలు చేపడుతూ ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు రేకెత్తిస్తున్న ఉత్తర కొరియా ఆగస్టు 29న జపాన్ మీదుగా బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. ఉత్తర కొరియాలోని సునన్ ప్రాంతం నుంచి ప్రయోగించిన ఈ క్షిపణి జపాన్ మీదుగా ప్రయాణించి ఉత్తర పసిఫిక్ మహాసముద్రంలో పడింది. 2,700 కిలోమీటర్లు ప్రయాణించిన ఈ క్షిపణి గరిష్టంగా 550 కిలోమీటర్ల ఎత్తులోని లక్ష్యాలను ఛేదించగలదు. దీనిపై జపాన్ ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
తాజా క్షిపణి ప్రయోగంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నందున.. ఉత్తర కొరియాపై ఒత్తిడిని తీవ్రతరం చేసేలా అమెరికా, జపాన్‌లు ఓ నిర్ణయానికి వచ్చాయి. ఈ అంశంపై చర్చించేందుకు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ఐక్యరాజ్యసమితిని కోరాయి. 
క్విక్ రివ్యూ: ఏమిటి : జపాన్ మీదుగా ఉత్తర కొరియా క్షిపణి 
ఎప్పుడు : ఆగస్టు 29
ఎవరు : ఉత్తర కొరియా 

క్రీడలుప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో సింధుకు రజతం
ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు రజతం దక్కించుకుంది. ఆగస్టు 27న గ్లాస్గోలో జరిగిన ఫైనల్లో జపాన్‌కు చెందిన ఏడో సీడ్ నోజోమి ఒకుహారా సింధును ఓడించి స్వర్ణం గెలుచుకుంది. 2013, 2014లలోను సింధు సెమీఫైనల్లో ఓడి కాంస్య పతకాలు సాధించింది. తాజాగా రజతం గెలవడం ద్వారా ఈ టోర్నమెంట్‌లో భారత్ తరఫున అత్యధికంగా మూడు పతకాలు నెగ్గిన క్రీడాకారిణిగా సింధు గుర్తింపు పొందింది.
ఇదే టోర్నీ సెమీస్‌లో ఓడిన సైనా నెహ్వాల్‌కు కాంస్యం దక్కింది. మొత్తంగా ప్రపంచ చాంపియన్‌షిప్ చరిత్రలో ఏకకాలంలో భారత్‌కు రజతం, కాంస్యం లభించడం ఇదే తొలిసారి. నాలుగు దశాబ్దాల ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీల్లో భారత్ గెలుపొందిన మొత్తం పథకాలు 7.
క్విక్ రివ్యూ: ఏమిటి : ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్-2017
ఎప్పుడు : ఆగస్టు 28
ఎవరు : పీవీ సింధుకు రజతం, సైనా నెహ్వాల్‌కు కాంస్యం 
ఎక్కడ : గ్లాస్గో

జాతీయ స్క్వాష్ చాంప్ జోష్నా, సౌరవ్ జాతీయ స్క్వాష్ చాంపియన్‌షిప్ మహిళల సింగిల్స్‌లో జోష్నా చినప్ప (తమిళనాడు) 15వ సారి, పురుషుల సింగిల్స్‌లో సౌరవ్ గోషాల్ (తమిళనాడు) 12వ సారి చాంపియన్స్‌గా నిలిచారు. ఫైనల్స్‌లో జోష్నా 3-1తో లక్ష్య (తమిళనాడు)పై, సౌరవ్ 3-1తో మహేశ్ (మహారాష్ట్ర)పై గెలిచారు. 
క్విక్ రివ్యూ: ఏమిటి : జాతీయ స్క్వాష్ చాంపియన్‌షిప్-2017
ఎప్పుడు : ఆగస్టు 27
ఎవరు : విజేతలు జోష్నా చినప్ప (మహిళలు), సౌరవ్ గోషాల్ (పురుషులు)

బెల్జియం గ్రాండ్‌ప్రి టైటిల్ విజేత హామిల్టన్మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ బెల్జియం గ్రాండ్‌ప్రి టైటిల్ గెలుచుకున్నాడు. ఆగస్టు 28న జరిగిన రేసులో గంటా 24 నిమిషాల 42.820 సెకన్లలో గమ్యాన్ని చేరుకొని విజేతగా నిలిచాడు. హామిల్టన్‌కు ఈ ఏడాది ఇది ఐదో టైటిల్ కాగా కెరీర్‌లో 200వది. 
క్విక్ రివ్యూ: ఏమిటి : బెల్జియం గ్రాండ్‌ప్రీ - 2017 విజేత
ఎప్పుడు : ఆగస్టు 28
ఎవరు : లూయిస్ హామిల్టన్ 

ప్రొఫెషనల్ కెరీర్‌లో మేవెదర్‌కు 50వ విజయం అమెరికా స్టార్ బాక్సర్ ఫ్లాయిడ్ మేవెదర్ జూనియర్ ప్రొఫెషనల్ బాక్సింగ్‌లో వరుసగా 50వ విజయాన్ని నమోదు చేశాడు. ఆగస్టు 28న జరిగిన ‘సూపర్ ఫైట్’ బౌట్‌లో 40 ఏళ్ల మేవెదర్ కానర్ మెక్‌గ్రెగోర్ (ఐర్లాండ్)పై టెక్నికల్ నాకౌట్ పద్ధతిలో విజయం సాధించాడు. తద్వారా పోటీపడిన 50 బౌట్‌లలోను విజేతగా నిలిచిన మేవెదర్, 49 వరుస విజయాలతో అమెరికా హెవీవెయిట్ ప్రొఫెషనల్ బాక్సర్ రాకీ మర్సియానో పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు. ప్రొఫెషనల్ బాక్సింగ్ చరిత్రలో ఖరీదైన బౌట్‌లలో ఒకటిగా గుర్తింపు పొందిన ఈ పోటీ ద్వారా మేవెదర్ సుమారు 20 కోట్ల డాలర్లు (రూ.1,277 కోట్లు)... మెక్‌గ్రెగోర్ సుమారు 10 కోట్ల డాలర్లు (రూ. 638 కోట్లు) ఆర్జించారు.
2015లో మ్యానీ పకియావ్ (ఫిలిప్పీన్స్‌)తో జరిగిన బౌట్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించిన మేవెదర్ కెరీర్‌లో 50వ విజయం సాధించాలనే ఉద్దేశంతో రిటైర్మెంట్‌ను ఉపసంహరించుకున్నాడు.
క్విక్ రివ్యూ: ఏమిటి : ప్రొఫెషనల్ బాక్సింగ్‌లో వరుసగా 50వ విజయం 
ఎప్పుడు : ఆగస్టు 28
ఎవరు : ఫ్లాయిడ్ మేవెదర్ జూనియర్

క్రీడల్లో ప్రతిభాన్వేషణ కోసం ప్రత్యేక పోర్టల్ క్షేత్ర స్థాయి నుంచి క్రీడల్లో విశేష ప్రతిభ ఉన్న వారిని గుర్తించేందుకు కేంద్ర క్రీడా శాఖ రూపొందించిన ‘జాతీయ క్రీడా ప్రతిభాన్వేషణ’ పోర్టల్‌ను ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆగస్టు 28న ఆవిష్కరించారు. ఎనిమిదేళ్లకు పైబడి వయస్సు కలిగిన వారు ఏదైనా క్రీడల్లో నైపుణ్యం ఉంటే www.nationalsportstalenthunt.com పోర్టల్‌లో తమ బయోడేటా లేక వీడియోలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇందులో నుంచి క్రీడా శాఖ తగినవారిని ఎంపిక చేసి తమ ‘సాయ్’ కేంద్రాల్లో శిక్షణ ఇస్తుంది. అలాగే ఎనిమిదేళ్లపాటు రూ.5 లక్షల చొప్పున వెయి్య స్కాలర్‌షిప్‌లను అందిస్తారు. 
క్విక్ రివ్యూ: ఏమిటి : జాతీయ క్రీడా ప్రతిభాన్వేషణ పోర్టల్ ప్రారంభం 
ఎప్పుడు : ఆగస్టు 28
ఎవరు : ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
ఎందుకు : ప్రతిభ ఉన్న క్రీడాకారులను గుర్తించేందుకు

వార్తల్లో వ్యక్తులువిశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీఆర్‌కే ప్రసాద్ కన్నుమూత
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పాటు కేంద్ర సర్వీసుల్లో వివిధ హోదాల్లో పనిచేసిన విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీఆర్‌కే ప్రసాద్ (77) ఆగస్టు 21న హైదరాబాద్‌లో కన్నుమూశారు. దివంగత ప్రధాని పీవీ నర్సింహారావు సమాచార సలహాదారుగా ప్రసాద్ పనిచేశారు. టీటీడీ ఈవోగా తిరుమల విశిష్టతపై పలు రచనలు చేశారు.

‘లింక్‌డ్ ఇన్ ప్రొఫైల్స్’లో మోదీ, ప్రియాంకప్రముఖ సామాజిక మాధ్యమం లింక్‌డ్ ఇన్ అత్యంత శక్తిమంతమైన ప్రొఫైల్స్ జాబితాలో ప్రధాని నరేంద్రమోదీ, నటి ప్రియాంక చోప్రాలు చోటు సంపాదించారు. 2017 సంవత్సరానికి గాను భారత్‌కు సంబంధించి అత్యంత శక్తిమంతమైన ప్రొఫైల్స్, ఎక్కువమంది చూసిన ప్రొఫైల్స్ జాబితాను లింక్‌డ్ ఇన్ సంస్థ ఆగస్టు 23న విడుదల చేసింది. ఈ జాబితాలో మోదీ వరుసగా మూడో సారి చోటు సంపాదించారు. లింక్‌డ్ ఇన్‌లో ఆయనను 22 లక్షలు మంది అనుసరిస్తున్నారు. జాబితాలో మొత్తం 50 మంది చోటు సంపాదించగా, వారిలో నోబెల్ అవార్డు గ్రహీత కైలాష్ సత్యార్థి , కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్, సిప్లా సీపీఓ ప్రబీర్ ఝా, షయోమీ టెక్నాలజీ వైస్ ప్రెసిడెంట్, ఎండీ మను కుమార్ జైన్ తదితరులు ఉన్నారు. 

రైల్వే బోర్డు చైర్మన్‌గా అశ్వని లోహని రైల్వే బోర్డు నూతన చైర్మన్‌గా అశ్వని లోహని ఆగస్టు 23న నియమితులయ్యారు. ప్రస్తుత రైల్వే బోర్డు చైర్మన్ ఏకే మిట్టల్ ముజఫర్‌నగర్ రైలు ప్రమాదానికి బాధ్యత వహిస్తూ పదవికి రాజీనామా చేయడంతో.. ఆయన స్థానంలో లోహాని ఆగస్టు 23న నియమితులయ్యారు. ప్రస్తుతం ఈయన ఎయిర్ ఇండియా చైర్మన్, మేనేజింగ్ డైరక్టర్‌గా ఉన్నారు. ఇండియన్ రైల్వే సర్వీస్ ఆఫ్ మెకానికల్ ఇంజినీర్స్ (ఐఆర్‌ఎస్‌ఎంఈ) ఉన్నతాధికారి అయిన అశ్వని లోహని గతంలో న్యూఢిల్లీలోని నేషనల్ రైల్ మ్యూజియం డైరక్టర్‌గా పనిచేశారు.
క్విక్ రివ్యూ: ఏమిటి : రైల్వే బోర్డు కొత్త చైర్మన్ 
ఎప్పుడు : ఆగస్టు 23
ఎవరు : అశ్వని లోహని 
ఎందుకు : ముజఫర్‌నగర్ రైలు ప్రమాదానికి బాధ్యత వహిస్తు ఏకే మిట్టల్ బోర్డు చైర్మన్ పదవికి రాజీనామా చేయడంతో

ఇన్ఫోసిస్ చైర్మన్‌గా నందన్ నీలేకని ఇన్ఫోసిస్‌లో నెలకొన్న సంక్షోభ పరిస్థితులకు తెరదించుతూ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టేందుకు అంగీకరించారు. ఇప్పటిదాకా చైర్మన్‌గా ఉన్న ఆర్.శేషసాయి స్థానంలో ఆయన బాధ్యతలు చేపడతారు. నాన్ ఎగ్జిక్యూటివ్, నాన్ ఇండిపెండెంట్ డెరైక్టరుగా కూడా వ్యవహరిస్తారు. ఈ మేరకు ఆగస్టు 24న బోర్డు సమావేశం అనంతరం ఇన్ఫోసిస్ పలు కీలక నిర్ణయాలు ప్రకటించింది. 
రవి వెంకటేశన్ సహ-చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ఆయన ఇకపై స్వతంత్ర డెరైక్టర్‌గా కొనసాగుతారు. ఇటీవల సీఈవో పదవికి రాజీనామా చేసినా.. వారసుడి ఎంపిక దాకా వైస్-చైర్మన్‌గా కొనసాగుతున్న విశాల్ సిక్కా.. బోర్డు నుంచి కూడా తప్పుకున్నారు. మరో ఇద్దరు స్వతంత్ర డెరైక్టర్లు జెఫ్రీ ఎస్ లేమాన్, జాన్ ఎచ్‌మెండీ కూడా బోర్డు నుంచి వైదొలిగారు. 
క్విక్ రివ్యూ: ఏమిటి : ఇన్ఫోసిస్ కొత్త చైర్మన్ 
ఎప్పుడు : ఆగస్టు 24 
ఎవరు : నందన్ నీలేకని 

45వ సీజేఐగా జస్టిస్ దీపక్ మిశ్రా45వ భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా జస్టిస్ దీపక్ మిశ్రా(64) ఆగస్టు 28న ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ జేఎస్ ఖేహర్ స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జస్టిస్ మిశ్రా చేత ప్రమాణం చేయించారు. ఆయన 2018 అక్టోబర్ 2 వరకు సీజేఐగా కొనసాగుతారు. 
జస్టిస్ మిశ్రా ప్రస్తుతం కీలకమైన కావేరీ, కృష్ణా జలాల వివాదాలు, బీసీసీఐ సంస్కరణలు, సహారా తదితర కేసులకు సంబంధించి వాదనలు వింటున్న ధర్మాసనాల్లో సభ్యునిగా ఉన్నారు. సినిమా హాళ్లలో జాతీయ గీతాన్ని పాడాలని తీర్పునిచ్చిన ధర్మాసనానికి జస్టిస్ మిశ్రా నేతృత్వం వహించారు. అలాగే నిర్భయ కేసులో నిందితులకు మరణశిక్ష విధించిన ధర్మాసనం లోనూ ఆయన సభ్యునిగా ఉన్నారు. 
క్విక్ రివ్యూ: ఏమిటి : ప్రమాణ స్వీకారం చేసిన 45వ సీజేఐ 
ఎప్పుడు : ఆగస్టు 28 
ఎవరు : జస్టిస్ దీపక్ మిశ్రా

మిస్ ఇండియా ఏసియా పసిఫిక్‌గా మానస ‘మిస్ ఇండియా ఏసియా పసిఫిక్-2017’ టైటిల్‌ను గీతం యూనివర్సిటీకి చెందిన జొన్నలగడ్డ మానస సొంతం చేసుకుంది. ఈ మేరకు థాయ్‌లాండ్‌లోని పట్టాయలో జరిగిన పోటీల్లో ఆమె విజేతగా నిలిచింది. పటాన్‌చెరు మండలంలోని రుద్రారం గ్రామంలో ఉన్న గీతం హైదరాబాద్ క్యాంపస్‌లో ఆమె ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్‌ ఇంజనీరింగ్ చదువుతోంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : మిస్ ఇండియా ఏసియా పసిఫిక్ - 2017 
ఎప్పుడు : ఆగస్టు 28
ఎవరు : జొన్నలగడ్డ మానస 

అవార్డులుఎంపీ కవితకు నారీ ప్రతిభా పురస్కారం
ప్రతిష్టాత్మక నారీ ప్రతిభా పురస్కారాన్ని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అందుకున్నారు. యువత, మహిళా సాధికారత కోసం కృషి చేసినందుకుగాను కేంద్ర మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్‌ప్రెజైస్ (ఎంఎస్‌ఎంఈ) మంత్రిత్వశాఖ, విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ అసోసియేషన్ సంయుక్తంగా ఆమెను ఈ పురస్కారానికి ఎంపిక చేశాయి. ఈ మేరకు విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ అసోసియేషన్ ఇండియా చైర్‌పర్సన్ డాక్టర్ టి.వసంతలక్ష్మి కవితకు ఆగస్టు 24న హైదరాబాద్‌లో అవార్డుతోపాటు ప్రశంసాపత్రాన్ని అందజేశారు. 
మొదటిసారి ప్రవేశపెట్టిన నారీ ప్రతిభా పురస్కార్-2017ను ఎంపీ కవితతోపాటు వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన కల్పకం ఏచూరి, ఆషా ప్రకాశ, స్మృతి నాగపాల్, ప్రియా భార్గవ, షిర్లే అబ్రహం అందుకున్నారు. వీరితోపాటు తెలంగాణ ‘షీ’టీమ్స్ బాధ్యతలు చూస్తున్న ఐపీఎస్ అధికారి స్వాతి లక్రా కూడా అవార్డు అందుకున్నారు. 
క్విక్ రివ్యూ: ఏమిటి : నారీ ప్రతిభా పూరస్కారం 
ఎప్పుడు : ఆగస్టు 24
ఎవరు : ఎంపీ కవిత 
ఎందుకు : యువత, మహిళా సాధికారత కోసం కృషి చేసినందుకుగాను

జాతీయ క్రీడా పురస్కారాలు - 2017ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని.. 2017 జాతీయ క్రీడా అవార్డుల ప్రదానోత్సవం న్యూఢిల్లీలో జరిగింది. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ వేడుకల్లో అత్యున్నత అవార్డు రాజీవ్‌గాంధీ ఖేల్త్న్రను పారాలింపియన్ దేవేంద్ర జజరియాతో పాటు హాకీ సీనియర్ ఆటగాడు సర్దార్ సింగ్... రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా అందుకున్నారు. వీరికి జ్ఞాపికతో పాటు రూ.7.5 లక్షల చొప్పున చెక్‌ను అందించారు. 
మొత్తంగా 17 మంది క్రీడాకారులు అర్జున అవార్డు దక్కించుకోగా.. ముగ్గురికి ధ్యాన్‌చంద్, ఏడుగురికి ద్రోణాచార్య అవార్డులు అందాయి. హాకీ దిగ్గజం ధ్యాన్‌చంద్ జయంతి సందర్భంగా ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవం నిర్వహిస్తారు. 
అవార్డు గ్రహీతలు ఖేల్త్న్ర: దేవేంద్ర జజరియా(పారాథ్లెట్, జావెలిన్ త్రో), సర్దార్‌సింగ్ (హాకీ). అర్జున: సాకేత్ మైనేని (టెన్నిస్), జ్యోతి సురేఖ (ఆర్చరీ), హర్మన్‌ప్రీత్ కౌర్ (క్రికెట్), ఖుష్బీర్ కౌర్, రాజీవ్ (అథ్లెటిక్స్), ప్రశాంతి సింగ్ (బాస్కెట్‌బాల్), దేవేంద్రో సింగ్ (బాక్సింగ్), బెంబేమ్ దేవి (ఫుట్‌బాల్), ఎస్‌ఎస్‌పీ చౌరాసియా (గోల్ఫ్), ఎస్‌వీ సునీల్ (హాకీ), జస్వీర్ సింగ్ (కబడ్డీ), ప్రకాష్ నంజప్ప (షూటింగ్), ఆంథోనీ అమల్‌రాజ్ (టీటీ), సత్యవర్త్ కడియాన్ (రెజ్లింగ్), తంగవేలు, వరుణ్ భటి (పారా అథ్లెట్స్). పుజారా (క్రికెట్). 
ద్రోణాచార్య: దివంగత డాక్టర్ ఆర్.గాంధీ (అథ్లెటిక్స్), జీఎస్‌ఎస్‌వీ ప్రసాద్ (బ్యాడ్మింటన్), బీబీ మహంతి (బాక్సింగ్), హీరానంద్ (కబడ్డీ), రాఫెల్ (హాకీ), సంజయ్ చక్రవర్తి (షూటింగ్), రోషన్ లాల్ (రెజ్లింగ్). 
ద్యాన్‌చంద్: భూపిందర్ సింగ్ (అథ్లెటిక్స్), సయ్యద్ షాహిద్ హకీమ్ (ఫుట్‌బాల్), సుమరాయ్ టెటే (హాకీ).


No comments:

Post a Comment