క్రీడలు ఏప్రిల్ 2017
రెక్జావిక్ ఓపెన్ మహిళల చెస్ చాంపియన్ హారిక రెక్జావిక్ ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక మహిళల విభాగంలో విజేతగా నిలిచింది. ఈ మేరకు ఐస్‌లాండ్‌లోని రెక్జావిక్ పట్టణంలో ఏప్రిల్ 28న ముగిసిన ఈ టోర్నీలో హారిక మొత్తం ఏడు పాయింట్లు సాధించింది టైటిల్ గెలుచుకుంది. ఓవరాల్‌గా ఈ టోర్నీలో హారిక ఆరు గేముల్లో గెలిచి, రెండింటిలో ఓడి, మరో రెండింటిని ‘డ్రా’గా ముగించింది. ఇదే టోర్నీ అండర్-12 విభాగంలో భారత్‌కే చెందిన ప్రజ్ఞానంద టైటిల్ సాధించాడు.
క్విక్ రివ్యూ:ఏమిటి : రెక్జావిక్ ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్ - 2017
ఎప్పుడు : ఏప్రిల్ 28
ఎవరు : మహిళల విజేత ద్రోణవల్లి హారిక
ఎక్కడ : ఐస్‌లాండ్
పేస్ - స్కాట్ లిప్‌స్కీ కు తల్హాసీ ఓపెన్ టైటిల్భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ తల్హాసీ ఓపెన్ పురుషుల డబుల్స్ టైటిల్ దక్కించుకున్నాడు. ఈ మేరకు ఏప్రిల్ 29న జరిగిన ఫైనల్లో పేస్-స్కాట్ లిప్‌స్కీ (అమెరికా) జంట 4-6, 7-6 (7/5), 10-7తో సూపర్ టైబ్రేక్‌లో గొంజాలెజ్-మాయెర్ (అర్జెంటీనా) జోడీపై గెలిచింది.
2017 ఏటీపీ చాలెంజర్ డబుల్స్ టోర్నమెంట్‌లో పేస్‌కు ఇది రెండో టైటిల్ కాగా మొదటిది లియోన్ చాలెంజర్ డబుల్స్ టైటిల్.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తల్హాసీ ఓపెన్ - 2017
ఎప్పుడు : ఏప్రిల్ 29
ఎవరు : పురుషుల డబుల్స్ విజేత పేస్-స్కాట్ లిప్‌స్కీ
ఎక్కడ : ఫ్లోరిడా
బార్సిలోనా ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేత నాదల్ బార్సిలోనా ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను స్పెయిన్ టెన్నిస్ దిగ్గజం రాఫెల్ నాదల్ సొంతం చేసుకున్నాడు. ఈ మేరకు ఏప్రిల్ 30న జరిగిన ఫైనల్లో థీమ్ (ఆస్ట్రియా)పై విజయం సాధించి పదోసారి బార్సిలోనా టైటిల్‌ను దక్కించుకున్నాడు. తద్వారా రెండు టోర్నమెంట్‌లను 10 సార్లు చొప్పున గెలిచిన ఏకైక క్రీడాకారుడిగా నాదల్ చరిత్ర సృష్టించాడు. ఏప్రిల్‌లోనే జరిగిన మోంటెకార్లో మాస్టర్స్ సిరీస్ టోర్నీ టైటిల్‌ను కూడా నాదల్ పదోసారి దక్కించుకున్నాడు. మొత్తంగా క్లే కోర్టులపై నాదల్‌కిది 51వ టైటిల్‌కాగా.. ఓవరాల్‌గా 71వ టైటిల్.
క్విక్ రివ్యూ:ఏమిటి : బార్సిలోనా ఓపెన్ - 2017
ఎప్పుడు : ఏప్రిల్ 30
ఎవరు : పురుషుల సింగిల్స్ విజేత నాదల్
ఎక్కడ : స్పెయిన్
రష్యా గ్రాండ్‌ప్రీ టైటిల్ విజేత బొటాస్
రష్యా గ్రాండ్ ప్రీ రేసులో మెర్సెడీస్ జట్టు డ్రైవర్ వాల్తెరి బొటాస్ విజేతగా నిలిచాడు. ఈ మేరకు ఏప్రిల్ 30న జరిగిన 52 ల్యాప్‌ల రేసుని ఈ ఫిన్‌లాండ్ డ్రైవర్ గంటా 28 నిమిషాల 08.743 సెకన్లలో ముగించి తన కెరీర్‌లో తొలి టైటిల్‌ను కై వసం చేసుకున్నాడు.
ఈ రేసులో భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా జట్టు డ్రైవర్లు పెరెజ్, ఒకాన్ వరుసగా ఆరు, ఏడు స్థానాల్లో నిలిచారు.
క్విక్ రివ్యూ:ఏమిటి : రష్యా గ్రాండ్ ప్రీ - 2017
ఎప్పుడు : ఏప్రిల్ 30
ఎవరు : విజేత వాల్తెరి బొటాస్
ఎక్కడ : రష్యాలో
జోష్నాకు ఆసియా స్క్వాష్ సింగిల్స్ టైటిల్ఆసియా స్క్వాష్ చాంపియన్‌షిప్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను జోష్నా చిన్నప్ప దక్కించుకుంది. ఏప్రిల్ 30న చైన్నైలో జరిగిన ఫైనల్లో భారత్‌కు చెందిన మరో స్టార్ క్రీడాకారిణి దీపిక పళ్లికల్‌ను ఓడించి జోష్నా టైటిల్ విజేతగా నిలిచింది. తద్వారా ఆసియా చాంపియన్‌షిప్‌లో టైటిల్ గెలిచిన తొలి భారతీయ ప్లేయర్‌గా రికార్డు సృష్టించింది.
క్విక్ రివ్యూ:ఏమిటి : ఆసియా స్క్వాష్ చాంపియన్‌షిప్ - 2017
ఎప్పుడు : ఏప్రిల్ 30
ఎవరు : మహిళల సింగిల్స్ విజేత జోష్నా
ఎక్కడ : చెన్నైలో
ఆసియా గ్రాండ్ ప్రీలో భారత్‌కు 2 స్వర్ణాలు
ఆసియా గ్రాండ్ ప్రి అథ్లెటిక్స్ మూడో అంచె మీట్‌లో భారత అథ్లెట్స్ రెండు స్వర్ణాలు, నాలుగు రజతాలు, రెండు కాంస్యాలతో కలిపి మొత్తం ఎనిమిది పతకాలను సొంతం చేసుకున్నారు. ఈ మేరకు చైనాలోని తైపీలో ఏప్రిల్ 30న జరిగిన పోటీల్లో పురుషుల 400 మీటర్ల విభాగంలో కేరళకు చెందిన మొహమ్మద్ అనస్ యాహియా, పురుషుల షాట్‌పుట్‌లో హరియాణా క్రీడాకారుడు ఓంప్రకాశ్ సింగ్ కర్హానా పసిడి పతకాలను గెల్చుకున్నారు. ఇంతకుముందు ఆసియా గ్రాండ్‌ప్రి తొలి అంచెలో భారత అథ్లెట్స్ ఏడు పతకాలు, రెండో అంచెలో ఆరు పతకాలు సాధించారు.
క్విక్ రివ్యూ:ఏమిటి : ఆసియా గ్రాండ్ ప్రీ 3వ అంచె మీట్
ఎప్పుడు : ఏప్రిల్ 30
ఎవరు : భారత్‌కు 8 పతకాలు (రెండు స్వర్ణాలు)
ఎక్కడ : తైపీ, చైనా
హావో తియాన్‌కు ఆసియా స్నూకర్ చాంపియన్‌షిప్ టైటిల్ఆసియా స్నూకర్ (15 రెడ్ ఫార్మెట్) చాంపియన్‌షిప్ టైటిల్‌నుహావోతియాన్ (చైనా) గెలుచుకున్నాడు. దోహాలో ఏప్రిల్ 28న ముగిసిన చాంపియన్‌షిప్‌లో పంకజ్ అద్వానీ (భారత్)ను హావోతియాన్ ఓడించాడు.
2022 ఆసియా క్రీడల్లో వీడియో గేమ్స్ 2022 ఆసియా క్రీడల్లో వీడియో గేమింగ్‌ను మెడల్ ఈవెంట్‌గా ప్రవేశపెట్టనున్నారు. ఈ విషయాన్ని ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ (ఓసీఏ) ఏప్రిల్ 19న ప్రకటించింది. చైనాలోని హౌంగ్జులో 2022లో జరిగే ఆసియా క్రీడల్లో ఈ-స్పోర్‌ట్స (వీడియో గేమింగ్)ను అధికారికంగా నిర్వహించనున్నట్లు పేర్కొంది. దీనికి సన్నాహకంగా వచ్చే ఏడాది ఇండోనేసియాలో జరగనున్న ఆసియా క్రీడల్లో వీడియో గేమింగ్‌ను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు చైనాలోని ప్రముఖ ఈ-స్పోర్‌ట్స కంపెనీ అలీబాబా గ్రూప్‌కు చెందిన అలీస్పోర్‌ట్సతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సంస్థ 11 ఏళ్ల పాటు ఈ-స్పోర్‌ట్సకు స్పాన్సర్‌గా వ్యవహరించనుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 2022 ఆసియా క్రీడల్లో వీడియో గేమ్స్
ఎప్పుడు : ఏప్రిల్ 19
ఎవరు : ఆసియా ఒలింపిక్ కౌన్సిల్
ఎందుకు : వీడియో గేమ్స్ పోటీలనూ అధికారికంగా నిర్వహించేందుకు
ఒలింపిక్ హర్డిల్స్ చాంపియన్ రోలిన్‌సపై నిషేధం2016 రియో ఒలింపిక్స్‌లో మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో స్వర్ణ పతకం గెలిచిన అమెరికా అథ్లెట్ బ్రియానా రోలిన్‌సపై అమెరికా డోపింగ్ ఏజెన్సీ ఏడాదిపాటు నిషేధం విధించింది. డోపింగ్ నిబంధనలు ఉల్లంఘించి పోటీలు లేని సమయంలో తన ఆచూకీ వివరాలు వెల్లడించనందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏప్రిల్ 21న వెల్లడించింది. ఈ నిర్ణయంతో రోలిన్‌స 2016 సెప్టెంబరు 27 నుంచి సాధించిన ఫలితాలు చెల్లుబాటుకావు. అలాగే 2017 ఆగస్టులో లండన్‌లో జరిగే ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే అర్హత కోల్పోయింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అథ్లెట్ బ్రియానా రోలిన్‌సపై ఏడాది నిషేధం
ఎప్పుడు : ఏప్రిల్ 21
ఎవరు : అమెరికా డోపింగ్ ఏజెన్సీ
ఎందుకు : డోపింగ్ నిబంధనలు ఉల్లంఘించినందుకు
బోపన్నకు మోంటెకార్లో మాస్టర్స్ టోర్నీ డబుల్స్ టైటిల్ మోంటెకార్లో మాస్టర్స్ సిరీస్ టోర్నీ డబుల్స్ టైటిల్‌ను రోహన్ బోపన్న సొంతం చేసుకున్నాడు. ఈ మేరకు ఏప్రిల్ 23న జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో తన భాగస్వామి పాబ్లో క్యువాస్ (ఉరుగ్వే)తో కలిసి లోపెజ్-మార్క్ లోపెజ్ (స్పెయిన్) జంటను ఓడించాడు. టైటిల్ దక్కించుకున్న బోపన్న-క్యువాస్ జోడీకి 2,53,950 యూరోల ప్రైజ్‌మనీతోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. గతంలో మహేశ్ భూపతి (2003లో), లియాండర్ పేస్ (2005లో) ఈ టైటిల్ గెలిచారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మోంటెకార్లో మాస్టర్స్ టోర్నమెంట్ - 2017
ఎప్పుడు : ఏప్రిల్ 23
ఎవరు : డబుల్స్ విజేత బోపన్న - పాబ్లో క్యువాస్
ఎక్కడ : మొరాకో
మోంటెకార్లో మాస్టర్స్ పురుషుల సింగిల్స్ విజేత నాదల్ మోంటెకార్లో మాస్టర్స్ సిరీస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను రఫెల్ నాదల్ దక్కించుకున్నాడు. ఈ మేరకు ఏప్రిల్ 23న జరిగిన ఫైనల్లో అల్బెర్టో రామోస్ (స్పెయిన్)ను ఓడించి టైటిల్‌ను గెలుచుకున్నాడు. తద్వారా ఓపెన్ శకంలో (1968 నుంచి) ఒకే టోర్నమెంట్‌ను అత్యధికంగా 10 సార్లు గెలిచిన ఏకై క ప్లేయర్‌గా నాదల్ కొత్త చరిత్ర సృష్టించాడు. అలాగే క్లే కోర్టులపై అత్యధికంగా 50 సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన క్రీడాకారుడిగా గుర్తింపు పొందాడు. ఇప్పటిదాకా 49 టైటిల్స్‌తో గిలెర్మో విలాస్ (అర్జెంటీనా) పేరిట ఈ రికార్డు ఉంది.

ఎవరు : పురుషుల సింగిల్స్ విజేత రఫెల్ నాదల్
ఎక్కడ : మొరాకో
టెస్టుల్లో యూనిస్‌ఖాన్ పదివేల పరుగుల రికార్డుపాకిస్తాన్ తరపున టెస్టుల్లో పది వేల పరుగుల మైలు రాయిని దాటిన తొలి క్రికెటర్‌గా యూనిస్ ఖాన్ రికార్డు సృష్టించాడు. ఈ మేరకు కింగ్‌స్టన్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో యూనిస్ ఈ రికార్డు నమోదు చేశాడు. కెరీర్‌లో 11 దేశాల్లో సెంచరీ చేసిన ఏకైక క్రికెటర్ రికార్డు కూడా యూనిస్ పేరిటే ఉంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : టైస్టు క్రికెట్‌లో పదివేల పరుగులు చేసిన తొలి పాక్ క్రికెటర్
ఎప్పుడు : ఏప్రిల్ 24
ఎవరు : యూనిస్ ఖాన్
ఎక్కడ : కింగ్‌స్ట్టన్, వెస్టిండీస్
ప్రపంచ మాస్టర్స్‌లో 101 ఏళ్ల మన్‌కౌర్‌కు స్వర్ణంఛండీగఢ్‌కు చెందిన 101 ఏళ్ల మన్ కౌర్ ఆక్లాండ్‌లో జరిగిన ప్రపంచ మాస్టర్స్ అథ్లెటిక్స్ క్రీడల్లో స్వర్ణం సాధించి రికార్డు సృష్టించారు. ఈ మేరకు ఏప్రిల్ 24న జరిగిన 100 మీటర్ల రేసుని ఆమె ఒక నిమిషం 14 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలిచారు. అయితే 100 ప్లస్ వయో విభాగం కేటగిరీలో మన్ కౌర్ తప్ప మరెవరూ పోటీ పడలేదు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రపంచ మాస్టర్స్ టోర్నమెంట్ - 2017
ఎప్పుడు : ఏప్రిల్ 24
ఎవరు : మన్ కౌర్‌కు స్వర్ణం
ఎక్కడ : ఆక్లాండ్‌లో
ఎందుకు : 100 ప్లస్ వయో విభాగంలో
ఆసియా గ్రాండ్‌ప్రీ అథ్లెటిక్స్ మీట్‌లో మన్‌ప్రీత్‌కు స్వర్ణం ఆసియా గ్రాండ్‌ప్రీ అథ్లెటిక్స్ మీట్‌లో భారత క్రీడాకారిణి మన్‌ప్రీత్ స్వర్ణం సాధించింది. ఈ మేరకు చైనాలోని జిన్‌హువాలో ఏప్రిల్ 24న జరిగిన మహిళల షాట్‌పుట్‌లో ఆమె ఇనుప గుండును 18.86 మీటర్ల దూరం విసిరి కొత్త జాతీయ రికార్డు సృష్టించడంతో పాటు స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆసియా గ్రాండ్‌ప్రీ అథ్లెటిక్స్ మీట్ - 2017
ఎప్పుడు : ఏప్రిల్ 24
ఎవరు : షాట్‌పుట్‌లో మన్‌ప్రీత్‌కు స్వర్ణం
ఎక్కడ : చైనా
ఆసియా బిలియర్డ్స్ టోర్నీ విజేత అద్వానీ ఆసియా బిలియర్డ్స్ చాంపియన్‌షిప్‌లో భారత క్యూ స్పోర్ట్స్ (బిలియర్డ్స్, స్నూకర్) స్టార్ ప్లేయర్ పంకజ్ అద్వానీ విజేతగా నిలిచాడు. ఈ మేరకు చండీగఢ్‌లో ఏప్రిల్ 14న జరిగిన ఫైనల్లో భారత్‌కే చెందిన సౌరవ్ కొఠారిని ఓడించి అద్వానీ టైటిల్ సొంతం చేసుకున్నాడు. అద్వానీ కెరీర్‌లో ఓవరాల్‌గా ఇది ఏడో ఆసియా టైటిల్.
క్విక్ రివ్యూ:ఏమిటి : ఆసియా బిలియర్డ్ చాంపియన్‌షిప్ - 2017
ఎప్పుడు : ఏప్రిల్ 14
ఎవరు : పంకజ్ అద్వానీ
ఎక్కడ : చండీగఢ్
బహ్రెయిన్ గ్రాండ్‌ప్రి విజేత వెటెల్బహ్రెయిన్ గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ రేసులో ఫెరారీ డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ విజేతగా నిలిచాడు. ఏప్రిల్ 16న జరిగిన 57 ల్యాప్‌ల ఈ రేసును వెటెల్ గంటా 33 నిమిషాల 53.373 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని సంపాదించాడు. మొత్తంగా వెటెల్ కెరీర్‌లో ఇది 44వ టైటిల్.
క్విక్ రివ్యూ:ఏమిటి : బహ్రెయిన్ గ్రాండ్ ప్రి - 2017
ఎప్పుడు : ఏప్రిల్ 16
ఎవరు : విజేత సెబాస్టియన్ వెటెల్
ఎక్కడ : బహ్రెయిన్
సాయి ప్రణీత్‌కు సింగపూర్ ఓపెన్ టైటిల్సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను తెలుగు బ్యాడ్మింటిన్ క్రీడాకారుడు సాయి ప్రణీత్ దక్కించుకున్నాడు. ఈ మేరకు ఏప్రిల్ 16న జరిగిన ఫైనల్లో తెలుగు ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్‌ను ఓడించి సాయి ప్రణీత్ టైటిల్ సొంతం చేసుకున్నాడు. సాయి కెరీర్‌లో ఇది తొలి సూపర్ సిరీస్ టైటిల్ కాగా అంతర్జాతీయ బ్యాడ్మింటన్ చరిత్రలో ఓ సూపర్ సిరీస్ ఫైనల్ ఇద్దరు భారత ఆటగాళ్ల మధ్య జరగడం ఇదే తొలిసారి.
క్విక్ రివ్యూ:ఏమిటి : సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్ - 2017
ఎప్పుడు : ఏప్రిల్ 16
ఎవరు : పురుషుల సింగిల్స్ విజేత సాయి ప్రణీత్
ఎక్కడ : సింగపూర్
చైనా గ్రాండ్ ప్రీ టైటిల్ విజేత హామిల్టన్ చైనా గ్రాండ్‌ప్రీ ఫార్ములావన్ రేసులో బ్రిటన్‌కు చెందిన లూయిస్ హామిల్టన్ ( మెర్సిడెస్ డ్రైవర్) విజేతగా నిలిచాడు. షాంఘైలో ఏప్రిల్ 9న జరిగిన 56 ల్యాప్‌ల రేసుని గంటా 37 నిమిషాల 36.160 సెకన్లలో ముగించి టైటిల్ దక్కించుకున్నాడు. మొత్తంగా హామిల్టన్ కె రీర్‌లో ఇది 54వ టైటిల్.
క్విక్ రివ్యూ:
ఏమిటి : చైనా గ్రాండ్ ప్రీ - 2017
ఎప్పుడు : ఏప్రిల్ 9
ఎవరు : లూయిస్ హామిల్టన్
ఎక్కడ : షాంఘై, చైనా
ఆసియా బ్లిట్జ్ చెస్ చాంపియన్ జిషితఆంధ్రప్రదేశ్ చెస్ క్రీడాకారిణి డి.జిషిత ఆసియా యూత్ చెస్ చాంపియన్‌షిప్‌లో రెండో స్వర్ణం సాధించింది. ఉజ్బెకిస్తాన్‌లోని తాష్కెంట్ నగరంలో ఏప్రిల్ 9న ముగిసిన ఈ టోర్నీలో జిషిత అండర్-14 బాలికల బ్లిట్జ్ విభాగంలో విజేతగా నిలిచింది. నిర్ణీత తొమ్మిది రౌండ్‌లు పూర్తయ్యాక జిషిత 7.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవడం ద్వారా టైటిల్ సొంతం చేసుకుంది. ఏప్రిల్ 8న జరిగిన స్టాండర్డ్ విభాగంలోనూ జిషిత విజేతగా నిలిచి స్వర్ణం గెలుచుకుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆసియా బ్లిట్జ్ చెస్ చాంపియన్
ఎప్పుడు : ఏప్రిల్ 9
ఎవరు : డి. జిషిత
ఎక్కడ : ఉజ్బెకిస్తాన్
లిన్ డాన్, తై జు యింగ్‌లకు మలేసియా ఓపెన్ టైటిల్స్ మలేసియా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను చైనా ఆటగాడు లిన్ డాన్ కైవసం చేసుకున్నాడు. ఈ మేరకు ఏప్రిల్ 9న జరిగిన ఫైనల్లో లీ చోంగ్ వీ (మలేసియా)పై నెగ్గి తొలిసారి ఈ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు.
మహిళల సింగిల్స్ ఫైనల్లో కరోలినా మారిన్ (స్పెయిన్)ను ఓడించి తైజుయింగ్ (చైనీస్‌తైపీ) టైటిల్ సొంతం చేసుకుంది.
క్విక్ రివ్యూ:ఏమిటి : మలేసియా ఓపెన్ సూపర్ సిరీస్ - 2017
ఎప్పుడు : ఏప్రిల్ 9
ఎవరు : లిన్ డాన్, తైజుయింగ్
ఎక్కడ : మలేసియా
మహిళల హాకీ వరల్డ్ లీగ్ రౌండ్-2 టోర్నీ విజేత భారత్ మహిళల హాకీ వరల్డ్ లీగ్ రౌండ్-2 టోర్నమెంట్‌లో భారత్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఈ మేరకు కెనడాలోని వెస్ట్ వాంకోవర్‌లో ఏప్రిల్ 10న జరిగిన ఫైనల్లో 3-1 తేడాతో చిలీ జట్టుని ఓడించి విజేతగా నిలిచింది. టోర్నీలో నిలకడగా రాణించిన సవిత ‘బెస్ట్ గోల్‌కీపర్’ పురస్కారం దక్కించుకుంది. టోర్నమెంట్‌లో ఫైనల్‌కు చేరడం ద్వారా భారత్ వరల్డ్ లీగ్ సెమీఫైనల్ దశకు అర్హత సాధించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మహిళల హాకీ వరల్డ్ లీగ్ రౌండ్-2 టోర్నమెంట్
ఎప్పుడు : ఏప్రిల్ 10
ఎవరు : విజేత భారత్
ఎక్కడ : కెనడా
ప్రపంచ నంబర్ 2గా సింధురియో ఒలింపిక్స్ రజత పతక విజేత, హైదరాబాదీ షట్లర్ పీవీ సింధు కెరీర్‌లో అత్యుత్తమ ర్యాంక్‌కు చేరుకుంది. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) ఏప్రిల్ 6న విడుదల చేసిన మహిళల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో సింధు రెండో ర్యాంక్ పొందింది. తద్వారా సైనా తర్వాత భారత్ తరఫున టాప్-3లో నిలిచిన రెండో క్రీడాకారిణిగా గుర్తింపు సాధించింది. కాగా టాప్ ర్యాంక్‌లో తై జు యింగ్ (చైనీస్ తైపీ) కొనసాగుతోంది.
ఆసియా టీటీలో భారత్‌కు టైటిల్ఆసియా టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్‌లో భారత జట్టు డివిజన్-1 ఈవెంట్‌లో విజేతగా నిలిచింది. ఈ మేరకు ఏప్రిల్ 11న ఉత్తర కొరియాతో జరిగిన డివిజన్-1 టైటిల్ పోరులో భారత్ 3-2తో టైటిల్ దక్కించుకుంది. మరోవైపు చాంపియన్‌స డివిజన్ క్వార్టర్ ఫైనల్లో భారత్ 2-3తో జపాన్ చేతిలో ఓడిపోయింది.
క్విక్ రివ్యూ:ఏమిటి : ఆసియా టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్
ఎప్పుడు : ఏప్రిల్ 11
ఎవరు : డివిజన్ - 1 విజేత భారత్
ఎక్కడ : చైనా
మయామి పురుషుల సింగిల్స్ విజేత ఫెడరర్ అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన మయామి ఓపెన్ ఏటీపీ మాస్టర్ సిరీస్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ కైవలం చేసుకున్నాడు. ఏప్రిల్ 3న జరిగిన ఫైనల్స్‌లో రాఫెల్ నాదల్ (స్పెయిన్) ను ఓడించి కేరీర్‌లో 26వ మాస్టర్స్ సిరీస్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఓవరాల్‌గా ఫెడరర్ ఖాతాలో ఇది 91వ సింగిల్స్ టైటిల్.
క్విక్ రివ్యూ:ఏమిటి : మయామి ఓపెన్ ఏటీపీ మాస్టర్ సిరీస్ -2017
ఎప్పుడు : ఏప్రిల్ 3
ఎవరు : పురుషుల సింగిల్స్ విజేత రోజర్ ఫెడరర్
షార్జా మాస్టర్స్ టోర్నీలో హారికకు అగ్రస్థానంషార్జాలో జరిగిన మాస్టర్స్ టోర్నీలో గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారిక మహిళల విభాగంలో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఈ మేరకు మార్చి 31న ముగిసిన టోర్నీలో హారిక నిర్ణీత తొమ్మిది రౌండ్‌ల తర్వాత ఆరు పాయింట్లతో తొలి స్థానాన్ని సొంతం చేసుకుంది.
ఇదే టోర్నీ ఓపెన్ విభాగంలో భారత గ్రాండ్‌మాస్టర్ ఆదిబన్ రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు.
క్విక్ రివ్యూ:ఏమిటి : షార్జా మాస్టర్స్ టోర్నీ
ఎప్పుడు : మార్చి 31
ఎవరు : అగ్రస్థానంలో హారిక
ఎక్కడ : షారా్జ
దేవధర్ ట్రోఫీ విజేత తమిళనాడు 2017 దేవధర్ ట్రోఫీని తమిళనాడు సొంతం చేసుకుంది. ఈ మేరకు విశాఖపట్నంలో మార్చి 29న భారత్ బి జట్టుతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో తమిళనాడు 42 పరుగుల తేడాతో విజయం సాధించి కప్‌ను కైవసం చేసుకుంది. ఈ ఏడాది దేశవాళీ పరిమిత ఓవర్ల విజయ్ హజారే టైటిల్ కూడా తమిళనాడుకే దక్కింది.
క్విక్ రివ్యూ:ఏమిటి : దేవధర్ ట్రోఫీ-2017
ఎప్పుడు : మార్చి 29
ఎవరు : విజేత తమిళనాడు
ఇండియా ఓపెన్ సిరీస్ టైటిల్ విజేత పీవీ సింధు భారత బ్యాడ్మింటిన్ క్రీడాకారిణి పీవీ సింధు ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఈ మేరకు ఏప్రిల్ 2న ఢిల్లీలో జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్ల్లో 21-19, 21-16తో కరోలినా మారిన్ (స్పెయిన్)పై విజయం సాధించింది. తద్వారా కెరీర్‌లో తొలిసారి ఇండియా ఓపెన్ టైటిల్ సొంతం చేసుకున్న సింధు రూ.15 లక్షల నగదు బహుమతి అందుకుంది. మొత్తంగా సింధు కెరీర్‌లో ఇది రెండో సూపర్ సీరీస్ టైటిల్.
పురుషుల సింగిల్స్ ఫైనల్లో తియెన్ చెన్ చౌ (చైనీస్ తైపీ)ని ఓడించి విక్టర్ అక్సెల్‌సన్ (డెన్మార్క్) టైటిల్ గెలుచుకున్నాడు.
క్విక్ రివ్యూ:ఏమిటి : ఇండియా ఓపెన్ సీరీస్ - 2017
ఎప్పుడు : ఏప్రిల్ 2
ఎవరు : పీవీ సింధు
ఎక్కడ : ఢిల్లీ
లియోన్ చాలెంజర్ డబుల్స్ టైటిల్ విజేత పేస్ మెక్సికోలో జరిగిన లియోన్ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల డబుల్స్ టైటిల్‌ను లియాండర్ పేస్ చేజిక్కించుకున్నాడు. ఈ మేరకు ఏప్రిల్ 2న జరిగిన ఫైనల్లో పేస్-ఆదిల్ షమస్దీన్ (కెనడా) జోడీ 6-1, 6-4తో ల్యూకా మార్గరోలి (స్విట్జర్లాండ్)-కారో జంపీరీ (బ్రెజిల్) జంటపై విజయం సాధించింది. మొత్తంగా పేస్ కెరీర్‌లో ఇది 20వ ఏటీపీ చాలెంజర్ టోర్నీ టైటిల్ కాగా ఈ సీజన్‌లో మొదటిది.
క్విక్ రివ్యూ:ఏమిటి : లియోన్ చాలెంజర్ డబుల్స్ - 2017
ఎప్పుడు : ఏప్రిల్ 2
ఎవరు : పేస్ - ఆదిల్ షమస్దీన్
ఎక్కడ : మెక్సికో
మయామి ఓపెన్ మహిళల సింగిల్స్ విజేత జోహానా అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన మయామి ఓపెన్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టెన్నిస్ టోర్నమెంట్‌లో బ్రిటన్ క్రీడాకారిణి జొహానా కోంటా మహిళల సింగిల్స్ చాంపియన్‌గా నిలిచింది. ఈ మేరకు ఏప్రిల్ 2న జరిగిన ఫైనల్లో ప్రపంచ మాజీ నంబర్‌వన్ కరోలైన్ వొజ్నియాకి (డెన్మార్క్)పై విజయం సాధించిన కోంటా తద్వారా వర్జినియా వేడ్ (1977లో వింబుల్డన్ టైటిల్) తర్వాత ఓ ప్రతిష్టాత్మక టోర్నీలో టైటిల్ సాధించిన తొలి బ్రిటన్ క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది.
క్విక్ రివ్యూ:ఏమిటి : మయామి ఓపెన్ - 2017
ఎప్పుడు : ఏప్రిల్ 2
ఎవరు : జొహానా కోంటా
ఎక్కడ : ఫ్లోరిడా, అమెరికా

No comments:
Post a Comment