వార్తల్లో వ్యక్తులు నవంబరు 2015
ఏడీబీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా స్వాతి దండేకర్
ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ) ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా భారతీయ అమెరికన్, రాజకీయవేత్త స్వాతి దండేకర్‌ను అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నవంబర్ 19న నియమించారు.
ప్రపంచ జలమండలి గవర్నర్‌గా పృథ్వీరాజ్ సింగ్
రాజస్థాన్‌లోని ‘జల్ భగీరథి’ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు పృథ్వీరాజ్ సింగ్ ప్రపంచ జల మండలి గవర్నరుగా నవంబర్ 16న ఎంపికయ్యారు. ఫ్రాన్స్‌లో జరిగిన మండలి సమావేశంలో 160 దేశాలకు చెందిన ప్రతినిధులు ఆయనను ఎన్నుకున్నారు.
ఏపీపీఎస్సీ చైర్మన్‌గా ప్రొ.ఉదయ భాస్కర్
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) చైర్మన్‌గా జేఎన్‌టీయూకే ప్రొఫెసర్, మూల్యాంకన విభాగం డెరైక్టర్ పి.ఉదయభాస్కర్ నియమితులయ్యారు. గతంలో ఆయన విజయనగరం, కాకినాడ జేఎన్‌టీయూ ఇంజనీరింగ్ కాలేజీల ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వర్తించారు. కాకినాడ జేఎన్‌టీయూను మొట్టమొదటి ఎన్‌బీఏ అక్రిడిటేషన్ కాలేజీగా తీర్చిదిద్దారు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్, అసోసియేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ మేనేజ్‌మెంట్ జీవితకాల సభ్యుడిగా, ఏపీపీఎస్సీ, యూపీఎస్సీ సభ్యుడిగా, ఏఐసీటీఈ ఇన్‌స్పెక్షన్ కమిటీ సభ్యుడిగా పనిచేశారు.
హిమాచల్ సీఎంపై ఈడీ కేసు
హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. సెప్టెంబర్‌లో సీబీఐ దాఖలు చేసిన నేర ఫిర్యాదును పరిగణనలోకి తీసుకొని దీన్ని నమోదుచేసింది. వీరభద్ర 2009-11 మధ్య కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఆదాయానికి మించి రూ. 6 కోట్లు సంపాదించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఎన్‌సీఈఆర్‌టీ డెరైక్టర్‌గా హృషికేశ్ సేనాపతి
నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్(ఎన్‌సీఈఆర్‌టీ) నూతన డెరైక్టర్‌గా హృషికేశ్ సేనాపతి నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ నవంబర్ 16న ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతకుముందు సేనాపతి భోపాల్‌లోని రీజినల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్(ఆర్‌ఐఈ)కు అధిపతిగా ఉన్నారు. ఎన్‌సీఈఆర్‌టీ విభాగమైన ఆర్‌ఐఈలో 1997లో ఆయన అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరారు.
ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధిగా సయ్యద్ అక్బరుద్దీన్
విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ ఐక్యరాజ్యసమితి(ఐరాస)లో భారత శాశ్వత ప్రతినిధిగా నియమితులయ్యారు. ఆయన 1985వ బ్యాచ్ ఐఎఫ్‌ఎస్ అధికారి. విదేశాంగ శాఖలో ప్రస్తుతం అదనపు కార్యదర్శిగా పనిచేస్తున్న ఆయనను ఐక్యరాజ్యసమితిలో భారత తదుపరి శాశ్వత ప్రతినిధిగా నియమిస్తున్నట్లు ప్రభుత్వం నవంబర్ 16న ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం శాశ్వత ప్రతినిధిగా ఉన్న అశోక్ కుమార్ ముఖర్జీ త్వరలో రిటైర్ కానున్నారు. అనంతరం అక్బరుద్దీన్ ఆయన నుంచి బాధ్యతలు స్వీకరిస్తారు. గత నెలలో న్యూఢిల్లీలో జరిగిన ఇండియా-ఆఫ్రికా ఫోరం సదస్సుకు అక్బరుద్దీన్ చీఫ్ కోఆర్డినేటర్‌గా వ్యవహరించారు.
బాలీవుడ్ నటుడు సయ్యద్ జాఫ్రీ కన్నుమూత
బాలీవుడ్ సీనియర్ నటుడు సయ్యద్ జాఫ్రీ (86) నవంబర్ 16న తుదిశ్వాస విడిచారు. పంజాబ్ రాష్ట్రం మలేర్‌కోట్లాలో జన్మించిన ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. పలు భారతీయ, బ్రిటిష్ సినిమాల్లో నటించి అంతర్జాతీయ అవార్డులను సైతం అందుకున్నారు. అమితాబ్, రిషికపూర్ వంటి నటులతో కూడా కలసి పనిచేశారు. గాంధీ, మాసూమ్, పెన్నా, రామ్ తేరా గంగా మైలీ, ఛష్మే బద్దూర్, కైసే నా కెహనా, జుదాయి, అజుబా వంటి ప్రముఖ చిత్రాల్లో నటించారు.
వీహెచ్‌పీ నేత అశోక్ సింఘాల్ కన్నుమూత
విశ్వ హిందూ పరిషత్(వీహెచ్‌పీ) సీనియర్ నేత, రామజన్మభూమి ఉద్యమ సారథి అశోక్ సింఘాల్ కన్నుమూశారు. కొన్నాళ్లుగా అస్వస్థతతో బాధపడుతున్న సింఘాల్(89) నవంబర్ 17న గుర్గావ్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో తుదిశ్వాస విడిచారు. 1980 దశకం చివర్లలో ప్రారంభమైన రామజన్మభూమి ఉద్యమాన్ని దేశ, విదేశాల్లో విస్తృతం చేయడంలో అశోక్ సింఘాల్‌ది కీలక పాత్ర. అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం ‘కరసేవ’ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఒక ఉద్యమంలా నిర్వహించారు. ఆ నేపథ్యంలోనే 1992 డిసెంబర్‌లో బాబ్రీ మసీదు విధ్వంస ఘటన చోటు చేసుకుంది. రామజన్మభూమి కోసం వీహెచ్‌పీ చేపట్టిన ప్రచారం కోసం విదేశాల నుంచి పెద్ద ఎత్తున నిధులు సేకరించడంలో సింఘాల్ కృషి గణనీయమైనది.
సీజేఐగా జస్టిస్ టీఎస్ ఠాకూర్ నియామకం
భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)గా జస్టిస్ టీఎస్ ఠాకూర్(63)ను నియమిస్తూ నవంబర్ 18న కేంద్ర న్యాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సీజేఐ జస్టిస్ హెచ్‌ఎల్ దత్తు పదవీకాలం డిసెంబర్ 2న ముగియనుండటంతో.. డిసెంబర్ 3న జస్టిస్ ఠాకూర్ నూతన సీజేఐగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఠాకూర్ గతంలో జమ్మూ కశ్మీర్ హైకోర్టుకు అదనపు న్యాయమూర్తిగా, కర్ణాటక హైకోర్టుకు పర్మనెంట్ జడ్డిగా, ఢిల్లీ హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్‌గా, పంజాబ్, హరియాణా హైకోర్టుకు చీఫ్ జస్టిస్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 2009 నవంబర్ 17న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో తీర్పు వెలువరించిన ధర్మాసనానికి జస్టిస్ ఠాకూర్ నేతృత్వం వహించారు.
సుప్రీంకోర్టు కొత్త సీజేఐగా జస్టిస్ ఠాకూర్
భారత సుప్రీంకోర్టు 43వ ప్రధాన న్యాయమూర్తి (సీజీఐ)గా జస్టిస్ టి.ఎస్.ఠాకూర్ (63) నియమితులయ్యారు. డిసెంబరు 2న ప్రస్తుత సీజేఐ జస్టిస్ హెచ్‌ఎల్ దత్తు పదవీ విరమణ చేస్తారు. ఆయన స్థానంలో జస్టిస్ ఠాకూర్ బాధ్యతలు చేపడతారు. 2017, జనవరి 4 వరకు ఆయన పదవిలో కొనసాగుతారు. 2009, నవంబరు 17 నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ ఠాకూర్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
శక్తిమంతుల జాబితాలో మోదీకి 9వ స్థానం
ఫోర్బ్స్ పత్రిక 2015కు సంబంధించి నవంబరు 4న విడుదల చేసిన ప్రపంచ అత్యంత శక్తిమంతుల జాబితాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 9వ స్థానంలో నిలిచారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ జాబితాలో మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నారు. రెండో స్థానంలో జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్, మూడో స్థానంలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నిలిచారు. జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేశ్ అంబానీ 36వ స్థానం సాధించారు.
ఐసీసీ చైర్మన్‌గా శశాంక్ మనోహర్
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్‌గా ఉన్న ఎన్.శ్రీనివాసన్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నవంబరు 9న తొలగించింది. ఆయన స్థానంలో బీసీసీఐ చైర్మన్‌గా ఉన్న శశాంక్ మనోహర్ బాధ్యతలు నిర్వర్తిస్తారు. మనోహర్ 2016, జూన్ వరకు పదవిలో కొనసాగుతారు. బీసీసీఐ అధ్యక్షుడిగా ఉంటేనే ఐసీసీ చైర్మన్‌గా కొనసాగుతారు.
జాతీయ అవార్డులు తిరిగిచ్చిన 24 మంది ఫిల్మ్ మేకర్లు
దేశంలో అసహన పరిస్థితుల పెరిగిపోతున్నాయని నిరసన తెలుపుతూ నవంబర్ 5న 24 మంది ఫిల్మ్ మేకర్లు వారికి లభించిన జాతీయ అవార్డులను వెనక్కిస్తున్నట్లు ప్రకటించారు. ఈ జాబితాలో ప్రముఖ దర్శక రచయిత కుందన్ షా, దర్శకుడు సయీద్ మిర్జా, రచయిత్రి, బుకర్‌ప్రైజ్ విజేత అరుంధతీ రాయ్, అన్వర్ జమల్, వీకేంద్ర సైనీ, ప్రదీప్ కృష్ణన్, మనోజ్ లోబో, సుధాకర్‌రెడ్డి యెక్కంటి తదితరులున్నారు. వీరితో కలిపి జాతీయ లేదా సాహిత్య అవార్డులు తిరిగిస్తున్నట్లు ప్రకటించిన మేధావుల సంఖ్య 75కు చేరింది. భావప్రకటనా స్వేచ్ఛపై జరుగుతున్న దాడులతోపాటు ముగ్గురు మేధావుల హత్యకు నిరసనగా వీరంతా గళమెత్తుతున్నారు. సైద్ధాంతిక క్రూరత్వానికి నిరసనగా 1989లో ‘ఇన్ విచ్ యానీ గివ్స్ ఇట్ టు దోజ్ వన్స్’ చిత్రానికి స్క్రీన్‌ప్లే విభాగంలో అందుకున్న జాతీయ అవార్డును తిరిగిస్తున్నట్లు అరుంధతీ రాయ్ ప్రకటించారు. ఎఫ్‌ఈఐఐ చైర్మన్‌గా బీజేపీకి చెందినగజేంద్ర చౌహాన్‌ను నియామకానికి నిరసనగా జాతీయ అవార్డును వెనక్కిస్తున్నట్లు కుందన్ చెప్పారు.
‘గ్లోబల్ డైవర్సిటీ లిస్ట్’లో బిందేశ్వర్ పాఠక్‌కు చోటు
ప్రముఖ మేగజైన్ ‘ది ఎకనమిస్ట్’ ప్రపంచవ్యాప్తంగా 50 మంది ప్రముఖులతో రూపొందించిన ‘విశ్వ వైవిధ్య జాబితా (గ్లోబల్ డైవర్సిటీ లిస్ట్)’లో భారత్‌కు చెందిన సాంఘిక సంస్కర్త, సులభ్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు బిందేశ్వర్ పాఠక్‌కు చోటు దక్కింది. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్‌గేట్స్, బౌద్ధ గురువు దలైలామా, నోబెల్ గ్రహీత మలాలా యూసఫ్ జాయ్ తదితరులు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. మానవతావాది, డైవర్సిటీ చాంఫియన్‌గా పాఠక్‌ను ‘ది ఎకనమిస్ట్’ కొనియాడింది. పారిశుద్ధ్యం మెరుగుపరిచేందుకు, బయోగ్యాస్ ఉత్పత్తికి కృషి చేయడం ద్వారా పేదల ఆర్థిక, ఆరోగ్య స్థితిగతులలో ఆయన విశేష మార్పును తీసుకురాగలిగారని ప్రశంసించింది. భారత్‌కు చెందిన పూర్ణిమా మెహతాకు కూడా ఈ జాబితాలో చోటు లభించింది.
కెనడా కేబినెట్‌లో నలుగురు భారతీయులు
కెనడా నూతన ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో తన మంత్రివర్గంలో నలుగురు భారత సంతతి వ్యక్తులకు చోటు కల్పించారు. అశేష జనవాహిని మధ్య ప్రధాని ట్రూడో, 30 మందితో కూడిన ఆయన మంత్రి వర్గం నవంబర్ 5న ప్రమాణ స్వీకారం చేశారు. భారత సంతతికి చెందిన హర్జిత్ సజ్జన్, బర్దిశ్ చాగర్, అమర్‌జీత్ సోహి, నవదీప్ బైన్స్‌లకు మంత్రివర్గంలో చోటు దక్కింది. కెనడా ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్‌గా పనిచేసిన సజ్జన్‌కు రక్షణ శాఖ కేటాయించారు. చాగర్‌కు పర్యాటక శాఖ లభించగా, సోహికి నిర్మాణ శాఖ దక్కింది. నవదీప్ ఇన్నోవేషన్, సైన్స్ అండ్ ఎకనమిక్ డెవలప్‌మెంట్ మంత్రిగా నియమితులయ్యారు.
ఆక్స్‌ఫర్డ్ ప్రెస్ ఎండీగా వి.శివరామకృష్ణన్
న్యూఢిల్లీలోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ ఇండియా(ఓయూపీఐ) నూతన మేనేజింగ్ డెరైక్టర్‌గా వి.శివరామకృష్ణన్ నియమితులయ్యారు. దీంతో పాటు బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్ దేశాలలోని ఓయూపీ బాధ్యతలను కూడా ఆయన పర్యవేక్షిస్తారు. ప్రస్తుతం మేనేజింగ్ డెరైక్టర్‌గా ఉన్న రంజన్ కౌల్ నవంబర్ నెలాఖరులో పదవీ విరమణ చేయనున్నారు. అనంతరం ఆయన స్థానంలో వి.శివరామకృష్ణన్ బాధ్యతలు స్వీకరిస్తారు. ఉన్నత విద్య, శిక్షణ రంగాల్లో సేవలందిస్తున్న ప్రముఖ ప్రైవేట్ రంగ సంస్థ ‘మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్’లో శివరామకృష్ణన్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్‌గా అనంతరం ఎడ్యుకేషన్ సర్వీసెస్‌కు ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు.
భారతీయ అమెరికన్‌కు కీలక పదవి
అమెరికాలోని ఉత్తర టెక్సాస్ విశ్వవిద్యాలయం బోర్డు ఆఫ్ రిజెంట్స్‌లో సభ్యునిగా భారతీయ అమెరికన్ అశోక్ మాగో నియమితులయ్యారు. ఆరేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. ఈ మేరకు టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం యూఎస్-ఇండియా చాంబర్‌గా పిలుస్తున్న గ్రేటర్ డల్లాస్ ఇండో అమెరికన్ చాంబర్ వ్యవస్థాపక చైర్మన్‌గా అశోక్ వ్యవహరించారు. అలాగే నార్త్ టెక్సాస్‌ప్రైమరీ కేర్ క్లినిక్, బీబీవీఏ కాంపాస్ బ్యాంక్‌లలో బోర్డు సభ్యునిగా పనిచేశారు. డల్లాస్ ప్రాంతీయ చాంబర్ బోర్డు, సాల్వేషన్ ఆర్మీ అడ్వైజరీ బోర్డు తదితర సంస్థలలో అశోక్ సభ్యునిగా ఉన్నారు. భారత ప్రభుత్వం 2014లో అశోక్‌ను ‘పద్మశ్రీ’తో సత్కరించింది.
కేరళ మంత్రి మణి రాజీనామా
బార్ల లంచాల కుంభకోణంలో కేరళ ఆర్థికమంత్రి కె.ఎం.మణికి వ్యతిరేకంగా కేరళ హైకోర్టు వ్యాఖ్యలు చేయడంతో ఆయన తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు నవంబర్ 9న ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా 400 బార్ల లెసైన్సులను రెన్యువల్ చేయడానికి మంత్రి రూ. ఐదు కోట్ల లంచం అడిగారని, మొదట రూ.కోటి తీసుకున్నారని కేసు నమోదయింది. దీనిపై తదుపరి విచారణ నిర్వహించాలన్న విజిలెన్సు కోర్టు వ్యాఖ్యలను హైకోర్టు సమర్థించింది. దీంతో మణి తన పదవికి రాజీనామా చేశారు.
ఐఎంఎఫ్ ఈడీగా సుబీర్ గోకర్ణ్
ఆర్‌బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ సుబీర్ గోకర్ణ్ తాజాగా అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆ స్థానంలో ఉన్న రాకేశ్ మోహన్ పదవీ కాలం నవంబర్‌తో ముగియనుంది. రాకేశ్ పదవీ విరమణ చేయగానే సుబీర్ గోకర్ణ్ పదవీ బాధ్యతలు చేపడతారు. సుబీర్ గోకర్ణ్ ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ బోర్డులో భారత్, బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్‌లకు ప్రాతినిధ్యం వ్యవహరించనున్నారు. సుబీర్ గోకర్ణ్ గతంలో గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ స్టాండర్డ్ అండ్ పూర్ చీఫ్ ఎకనమిస్ట్‌గా, క్రిసిల్ రీసెర్చ్ అండ్ ఇన్‌ఫర్మేషన్ బిజినెస్ హెడ్‌గా, ఎస్‌బీఐ బోర్డు సభ్యుడిగా బాధ్యతలు నిర్వహించారు. మూడేళ్ల కాలపరిమితితో 2009లో ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌గా నియమితులయ్యారు.
హీరో సంస్థ వ్యవస్థాపకుడు ముంజాల్ మృతిద్విచక్రవాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ వ్యవస్థాపకుడు మోహన్‌లాల్ ముంజాల్(92) ఢిల్లీలో నవంబరు 1న మృతి చెందారు. లూథియానాలో సైకిల్ విడిభాగాల తయారీని ఆయన తొలుత ప్రారంభించారు. 1956లో హీరో సంస్థను ఏర్పాటు చేశారు.

‘ఏషియా సీఈఓ ఆఫ్ ది ఇయర్’గా హెచ్‌పీసీఎల్ సీఎండీ వాసుదేవ హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) సీఎండీ నిషి వాసుదేవకు ఏషియా సీఈఓ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కింది. ఇంగ్లండ్‌కు చెందిన ‘ప్లాట్స్’ అనే వ్యాపారసంస్థ ఈ అవార్డును అందజేస్తుంది. ఈ అవార్డు ఏషియా పసిఫిక్ రీజియన్‌లో భారతీయ మహిళకు దక్కడం ఇదే మొదటిసారి. నిషి వాసుదేవ 1974 నుంచి హెచ్‌పీసీఎల్‌లో పనిచేస్తున్నారు. 2014 నుంచి సీఎండీగా విధులు నిర్వహిస్తున్నారు.
బ్రిటన్‌లో హైకమిషనర్‌గా నవతేజ్‌సింగ్ బ్రిటన్‌లో భారత కొత్త హైకమిషనర్‌గా దౌత్యవేత్త నవతేజ్ సింగ్ సర్న అక్టోబరు 31న నియమితులయ్యారు. ఆయన 1980వ బ్యాచ్ ఐఎఫ్‌ఎస్ అధికారి. ప్రస్తుతం విదేశీ వ్యవహారాల శాఖలో కార్యదర్శిగా కొనసాగుతున్నారు.
అత్యంత గౌరవనీయ వ్యక్తుల్లో మండేలాకు మొదటి స్థానం ప్రపంచవ్యాప్తంగా రూపొందించిన అత్యంత గౌరవనీయ వ్యక్తుల జాబితాలో దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా మొదటిస్థానంలో నిలిచారు. ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) ఈ జాబితాను అక్టోబరు 28న విడుదల చేసింది. 2015 సంవత్సరానికి నిర్వహించిన సర్వేలో పోప్ ఫ్రాన్సిన్ రెండో స్థానంలో, టెస్లా మోటార్స్ సీఈఓ ఎలాన్ ముస్క్ మూడోస్థానంలో ఉన్నారు. మహాత్మాగాంధీకి నాలుగోస్థానం దక్కింది. ప్రధాని నరేంద్ర మోదీ పదోస్థానంలో నిలిచారు.
హాస్య నటుడు కొండవలస మృతిప్రముఖ హాస్య నటుడు కొండవలస లక్ష్మణరావు(69) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నవంబర్ 2న తుది శ్వాస విడిచారు. 1946, ఆగస్టు 10న శ్రీకాకుళం జిల్లా కొండవలస గ్రామంలో జన్మించిన ఆయన.. విశాఖపోర్టు ట్రస్ట్‌లో పని చేశారు. వంశీ దర్శకత్వంలో వచ్చిన ‘ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. 250కు పైగా సినిమాలో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. దాదాపు రెండువేల నాటకాల్లో కొండవలస నటించారు. నాటక రంగంలో 378 అవార్డులు పొందారు. రెండు నంది అవార్డులను గెలుచుకున్నారు.
ఆంధ్రాబ్యాంక్ ఎండీగా సురేష్ పటేల్ప్రభుత్వ రంగ ఆంధ్రా బ్యాంక్ మేనేజింగ్ డెరైక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా సురేష్ ఎన్ పటేల్ నియమితులయ్యారు. నవంబర్ 2న ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ పదవిలో చేరకముందు పటేల్ ఓరియంటల్ బ్యాంక్(ఓబీసీ)లో ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా వ్యవహరించారు. దేనా బ్యాంక్‌లో కెరీర్‌ను ప్రారంభించిన సురేష్ పటేల్‌కు 30 ఏళ్లకు పైగా వివిధ హోదాల్లో పనిచేసిన అనుభవం ఉంది. అంతేకాకుండా నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆ రాష్ట్ర ఎస్‌ఎల్‌బీసీ కన్వీనర్‌గా కూడా ఈయన వ్యవహరించారు.
‘టాటా’ అంబాసిడర్‌గా మెస్సీ భారత్‌కు చెందిన ప్రముఖ సంస్థ టాటా మోటార్స్‌కు ఫుట్‌బాల్ సూపర్ స్టార్ లియోనెల్ మెస్సీ గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులయ్యాడు. అర్జెంటీనాకు చెందిన మెస్సీ ఓ భారత కంపెనీతో కలిసి పని చేయడం ఇదే తొలిసారి.
నిరాహార దీక్ష చేస్తున్న మాజీ ఎమ్మెల్యే మృతిరాజస్థాన్‌లో మద్యనిషేధం విధించడంతోపాటు లోకాయుక్తను బలోపేతం చేయాలనే డిమాండ్‌తో అక్టోబర్ 2 నుంచి నిరాహార దీక్ష చేస్తున్న ఆ రాష్ట్రానికి చెందిన మాజీ ఎమ్మెల్యే గురుచరణ్ ఛాబ్రా నవంబర్ 3న మరణించారు. కొన్ని రోజులుగా క్రితం కోమాలోకి వెళ్లిపోయిన ఛాబ్రా చికిత్స పొందుతూ మృతిచెందారు.
సుప్రీంకోర్టు సీజేఐగా టీఎస్ ఠాకూర్సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ టీఎస్ ఠాకూర్ నియమితులు కానున్నారు. ప్రస్తుతం ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ హెచ్‌ఎల్ దత్తు డిసెంబర్ 2న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సుప్రీంలో అత్యంత సీనియర్ అయిన జస్టిస్ ఠాకూర్‌ను చీఫ్ జస్టిస్‌గా నియమించాలని జస్టిస్ హెచ్‌ఎల్ దత్తు కేంద్ర ప్రభుత్వానికి సూచించారు.
టాప్-10 ప్రపంచ శక్తిమంతుల్లో మోదీప్రపంచంలోని అత్యంత శక్తిమంతుల జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ టాప్-10లో నిలిచారు. ప్రఖ్యాత ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన ఈ జాబితాలో మోదీకి తొమ్మిదో స్థానం దక్కింది. గతేడాది ఇదే జాబితాలో ఆయన 14వ స్థానంలో నిలిచారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ తొలిస్థానంలో ఉన్న 2015 జాబితాలో జర్మన్ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్, యూఎస్ అధ్యక్షుడు బరాక్ ఒబామా, పోప్ ఫ్రాన్సిస్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌లు వరుసగా తరవాత స్థానాల్లో నిలిచారు.

No comments:
Post a Comment