వార్తల్లో వ్యక్తులు జనవరి 2014
అక్కినేని అస్తమయంప్రముఖ చలనచిత్ర నటుడు అక్కినేని నాగేశ్వరరావు (91) హైదరాబాద్‌లో జనవరి 22న మరణించారు. దాదాపు ఏడున్నర దశాబ్దాల పాటు సాగిన ఆయన సినీరంగ జీవితంలో 256 చిత్రాల్లో నటించారు. అక్కినేని 1924 సెప్టెంబర్ 20న కృష్ణా జిల్లా గుడివాడలో జన్మించారు. కళారంగంలో చేసిన కృషికిగాను 1968లో పద్మశ్రీ, 1988లో పద్మభూషణ్, 2011లో పద్మవిభూషణ్‌లతో కేంద్ర ప్రభుత్వం అక్కినేనిని సత్కరించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1989లో రఘుపతి వెంకయ్య అవార్డును ప్రదానం చేసింది. 1991లో దాదాసాహెబ్‌ఫాల్కే పురస్కారం ఆయనకు దక్కింది. 1996లో ఎన్‌టీరామారావు పేరిట ఏర్పాటు చేసిన అవార్డు మొదట నాగేశ్వరరావుకే ప్రదానం చేశారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం కాళిదాస్ సమ్మాన్, తమిళనాడు ప్రభుత్వం నుంచి అన్నా, కలైమామిణి పురస్కారాలు అందుకున్నారు. తన పేరుమీద 2005లో జాతీయ స్థాయి అవార్డును ఏర్పాటు చేశారు.
ఫెడరల్ రిజర్వ్ చైర్ పర్సన్‌గా యెలెన్
అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్ పర్సన్ గా జానెట్ యెలెన్ (67) నియామకానికి సెనెట్ జనవరి 7న ఆమోదం తెలిపింది. వందేళ్ల చరిత్ర కలిగి ప్రపంచంలోనే అతి శక్తిమంతమైన సెంట్రల్ బ్యాంక్‌కు అధిపతిగా నియమితులైన తొలి మహిళ యెలెన్. ఈమె ప్రస్తుతం ఫెడరల్ రిజర్వ్ ఉపాధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. ఫెడరల్ చైర్మన్‌గా ఉన్న బెన్‌బెర్నాంకీ జనవరి 31న పదవీ విరమణ అనంతరం యెలెన్ ఆస్థానంలో బాధ్యతలు చేపట్టనున్నారు.
అంజలీదేవి మృతి అలనాటి సినీనటి అంజలీదేవి (86) జనవరి 13న చెన్నైలో కన్ను ముశారు. 1927 ఆగస్టు 24న తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో జన్మించారు. తెలుగులో 350కి పైగా చిత్రాల్లో నటించారు. లవకుశ, అనార్కలి, సువర్ణసుందరి చిత్రాలు ఆమెకు మంచి గుర్తింపు తెచ్చాయి.
షెరాన్ కన్నుమూతఇజ్రాయెల్ మాజీ ప్రధాని ఎరియల్ షెరాన్ (85) జనవరి 11న మరణించారు. ఈయన 2001లో ఇజ్రాయెల్ ప్రధానిగా ఎన్నికైయ్యారు. వివాదాస్పద విధానాలతో ‘ది బుల్డోజర్’గా చరిత్రకెక్కాడు. ఇజ్రాయిలీలు ఈయన్ను ‘మిస్టర్ సెక్యూరిటీ’గా పిలుస్తారు. భారత్‌ను సందర్శించిన తొలి ఇజ్రాయెల్ ప్రధాని షెరాన్. ఈయన 2003 లో భారత పర్యటనకు వచ్చారు.
ప్రపంచ ప్రశంసనీయుడు బిల్‌గేట్స్మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు ప్రపంచంలోనే అత్యంత ప్రశంసనీయ వ్యక్తిగా నిలిచారు. భారత్ సహా 13 దేశాల్లో సర్వే జరిపి 30 మందితో రూపొందించిన ఈ జాబితాలో బిల్ గేట్స్ మొదటి స్థానంలో నిలిచారు. కాగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా రెండోస్థానం, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఐదోస్థానం, నరేంద్రమోడీ ఏడో స్థానం, అమితాబ్‌బచ్చన్ తొమ్మిది, అబ్దుల్‌కలామ్ పది, అన్నాహజారే 14వ, కేజ్రీవాల్ 18వ, రతన్‌టాటా 30వ స్థానం పొందారు. ఈ మేరకు ద టైమ్స్ కోసం ‘యుగోవ్’ అనే సంస్థ ప్రపంచంలోనే అత్యంత ఆరాధనీయ వ్యక్తుల జాబితా రూపొందించింది.
వైమానిక దళాధిపతిగా అరూప్ రహా
భారతై వెమానికదళం 24వ అధిపతిగా ఎయిర్‌చీఫ్ మార్షల్ అరూప్ రహ (59) 2013 డిసెంబర్ 31న బాధ్యతలు చేపట్టారు. ఏకే బ్రౌన్ స్థానంలో బాధ్యతలు చేపట్టిన అరూప్ రహ మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు.
జస్టిస్ గంగూలీ రాజీనామాలైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఏకే గంగూలీ జనవరి 6న పశ్చిమబెంగాల్ మానవ హక్కుల కమిషన్ (డబ్ల్యూ హెచ్‌ఆర్‌సీ) ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు.
నాస్కామ్ అధ్యక్షునిగా చంద్రశేఖర్నాస్కామ్ అధ్యక్షునిగా మాజీ టెలికమ్ కార్యదర్శి రెంటాల చంద్రశేఖర్ జనవరి 5న బాధ్యతలు చేపట్టారు. ఈయన 1975వ బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ కేడర్ ఐఏఎస్ అధికారి.

No comments:
Post a Comment