AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Sunday 26 November 2017

క్రీడలు అక్టోబరు 2015

క్రీడలు అక్టోబరు 2015
ఫిబ్రవరి 6 నుంచి దక్షిణాసియా క్రీడలు దక్షిణాసియా క్రీడలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 6-16 వరకు మేఘాలయలోని గువహటి, షిల్లాంగ్‌లలో జరగనున్నాయి. మొత్తం 25 క్రీడాంశాల్లో పోటీలు జరుగుతాయని, 4 వేల మంది అథ్లెట్లు పాల్గొంటారని అక్టోబరు 25న అసోం ముఖ్యమంత్రి తరుణ్ గొగొయ్ వెల్లడించారు. ఈ సారి టెన్నిస్‌కు కూడా దక్షిణాసియా క్రీడల్లో అవకాశం కల్పించనున్నారు. భారత్‌తోపాటు ఆఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, మాల్దీవులు, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక దేశాలు పోటీల్లో పాల్గొంటాయి. 

ఆర్చరీ వరల్డ్ కప్ ఫైనల్స్‌లో అభిషేక్ వర్మకు రజతం భారత ఆర్చర్ అభిషేక్ వర్మ వరల్డ్ కప్‌లో కాంపౌండ్ విభాగంలో రజతం సాధించిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. అక్టోబరు 25న జరిగిన ఫైనల్లో అభిషేక్ 143-145 పాయింట్ల తేడాతో దెమిర్ ఎల్‌మాగ్ స్లీ(టర్కీ) చేతిలో ఓడిపోయాడు. భారత అగ్రశ్రేణి ఆర్చర్ దీపికా కుమారి మరోసారి రజతం సాధించింది. అక్టోబరు 25న జరిగిన ఫైనల్లో దక్షిణ కొరియాకు చెందిన ప్రపంచ నంబర్‌వన్ ఆర్చర్ చోయి మినున్ చేతిలో ఓడిపోయింది. 

అభిజిత్ గుప్తాకు చెస్ టైటిల్ భారత గ్రాండ్ మాస్టర్ అభిజిత్ గుప్తా హూగెవీన్ (నెదర్లాండ్స్) అంతర్జాతీయ ఓపెన్ చెస్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ టోర్నీలో అభిజిత్ ఏడు పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. చివరిదైన తొమ్మిదో రౌండ్‌లో అభిజిత్ కేవలం 20 ఎత్తుల్లో భారత్‌కే చెందిన నీలోత్పల్ దాస్‌ను ఓడించాడు. మరో భారత ఆటగాడు దీప్‌సేన్ గుప్తా 6.5పాయింట్లతో రన్నరప్‌గా నిలిచాడు. 

అంతర్జాతీయ క్రికెట్‌కు సెహ్వాగ్ వీడ్కోలు అంతర్జాతీయ క్రికెట్‌తోపాటు ఐపీఎల్ నుంచి కూడా రిటైర్ అవుతున్నట్లు భారత డాషింగ్ బ్యాట్స్‌మెన్ వీరేంద్ర సెహ్వాగ్ అక్టోబర్ 20న ప్రకటించాడు. అయితే హర్యానా క్రికెట్ సంఘంతో తాను చేసుకున్న ఒప్పందం ప్రకారం ఈ సీజన్‌లో మాత్రమే రంజీల్లో పాల్గొంటాడు. అలాగే మాజీ క్రికెటర్లు ఆడే మాస్టర్ చాంపియన్స్ లీగ్‌లోనూ ఆడతాడు.

మూడోసారి ప్రపంచ చాంపియన్‌గా హామిల్టన్ మెర్సిడెస్ డ్రైవర్ జట్టు లూయిస్ హామిల్టన్ మూడోసారి ఫార్ములావన్ ప్రపంచ చాంపియన్‌షిప్ కైవసం చేసుకుని చరిత్ర కెక్కాడు. అక్టోబరు 25న జరిగిన యూఎస్ గ్రాండ్ ప్రీలో హామిల్టన్ గంటా 50 నిమిషాల 52.703 సెకన్లలో రేసును ముగించి అగ్రస్థానంలో నిలిచాడు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకూ జరిగిన 16 రేసుల్లో తనకు ఇది పదో టైటిల్.

వన్డే సిరీస్ విజేత దక్షిణాఫ్రికాభారత్‌తో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌ను దక్షిణాఫ్రికా 3-2 తేడాతో కైవసం చేసుకుంది. 2-2తో సిరీస్ సమం కావడంతో ఇరు జట్ల మధ్య అక్టోబర్ 25న ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన నిర్ణయాత్మక ఆఖరి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 214 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 438 పరుగులు చేసింది. భారత్ 224 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో పలు రికార్డులు నమోదయ్యాయి.
  • దక్షిణాఫ్రికా నుంచి ముగ్గురు బ్యాట్స్‌మెన్ (డీకాక్, డుప్లెసి, డివిలయర్స్) సెంచరీలు నమోదు చేశారు.
  • ఒకే ఇన్నింగ్స్‌లో ముగ్గురు బ్యాట్స్‌మెన్ సెంచరీలు చేయడం ఇది రెండో సారి. 2015లోనే వెస్టిండీస్‌పై డివిలియర్స్, ఆమ్లా, రోసో ఆ ఘనత సాధించారు.
  • భారత గడ్డపైనే కాకుండా భారత్‌పై కూడా ఏ జట్టుకైనా ఇదే అత్యధిక స్కోరు (438). గతంలో భారత్, వెస్టిండీస్‌పై ఇండోర్‌లో 418 పరుగులు చేయగా... శ్రీలంక, భారత్‌పై రాజ్‌కోట్‌లో 411 పరుగులు చేసింది.
  • దక్షిణాఫ్రికా 400కు పైగా పరుగులు చేయడం ఇది ఆరోసారి. భారత్ ఐదు సార్లు చేసింది.
  • వన్డేల్లో 6 వేల పరుగులు పూర్తి చేసుకునేందుకు ఆమ్లా ఆడిన ఇన్నింగ్స్‌ల సంఖ్య 123. ఈ క్రమంలో కోహ్లి (136) రికార్డును సవరించాడు.

కామన్వెల్త్‌లో భారత లిఫ్టర్ల పతకాల పంట కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో 10 స్వర్ణాలు, 3 రజతాలు, 1 కాంస్య పతకాలు భారత వెయిట్‌లిఫ్టర్లు సాధించారు.
  • బంగారం: సతీశ్ కుమార్, లాలూ టకూ, నుంగ్ షిటాన్, కోజుమ్ తాబా, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జూనియర్ లిఫ్టర్ రాగాల వెంకట్; జూనియర్, సీనియర్ మహిళల విభాగంలో పూనమ్ యాదవ్ రెండు స్వర్ణాలు; వికాస్ ఠాకూర్,స్వప్నప్రియ బారువా
  • రజతం: జూనియర్ విభాగంలో అజయ్ సింగ్, సీనియర్ విభాగంలో రాగాల వెంకట్, యూత్ మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జి.లలిత
  • కాంస్యం: సీనియర్ మహిళల విభాగంలో మినాతి 

డెన్మార్క్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీ 
డెన్మార్క్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలో తొలి ప్రయత్నంలోనే ఫైనల్‌కు చేరుకున్న బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సింధు అక్టోబరు 18న జరిగిన ఫైనల్లో ఒలింపిక్ చాంపియన్ లీ జురుయ్(చైనా) చేతిలో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది. సింధూకు రూ.16 లక్షల ప్రైజ్‌మనీ, 9,350 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.

అంతర్జాతీయ క్రికెట్‌కు జహీర్ ఖాన్ వీడ్కోలు 2011 వరల్డ్‌కప్‌లో 21 వికెట్లు తీసి భారత్ విజయంలో కీలకపాత్ర పోషించిన జహీర్ ఖాన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. టెస్టుల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు(311) తీసిన నాలుగో బౌలర్ జహీర్‌ఖాన్. కుంబ్లే(619), కపిల్‌దేవ్(434), హర్భజన్ సింగ్ (417) మొదటి మూడు స్థానాల్లో ఉన్నారు. 37 ఏళ్ల జహీర్ టెస్ట్‌ల్లో 311 వికెట్లు, వన్డేల్లో 282 వికెట్లు పడగొట్టాడు.

ఐపీఎల్, అంతర్జాతీయ క్రికెట్‌కు వీరేంద్ర సెహ్వాగ్ గుడ్ బై ప్రపంచ క్రికెట్ చరిత్రలో విధ్వంసకర బ్యాట్స్‌మన్‌లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న వీరేంద్ర సెహ్వాగ్ అంతర్జాతీయ క్రికెట్, ఐపీఎల్‌కు వీడ్కోలు పలికాడు. అక్టోబర్ 20న 37 ఏళ్లు పూర్తిచేసుకోనున్న సెహ్వాగ్ దుబాయ్‌లో తన రిటైర్‌మెంట్‌ను ప్రకటించాడు. 2013 మార్చిలో తన ఆఖరి టెస్టు ఆడిన సెహ్వాగ్, అదే ఏడాది జనవరిలో చివరిసారిగా వన్డేల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. టెస్టు క్రికెట్‌లో రెండు ‘ట్రిపుల్ సెంచరీలు’ చేసిన ఏకైక భారత ఆటగాడైన సెహ్వాగ్, వన్డేల్లో ‘డబుల్ సెంచరీ’ సాధించిన ఐదుగురు ఆటగాళ్లలో ఒకడు.
104 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన సెహ్వాగ్ 49.34 సగటుతో 8,586 పరుగులు చేశాడు. వీటిలో 23 సెంచరీలు ఉన్నాయి. అలాగే 251 వన్డేలు ఆడి 35.05 సగటుతో 8,273 పరుగులు సాధించాడు. 19 టీ20 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన సెహ్వాగ్ 21.88 సగటుతో 394 పరుగులు చేశాడు.
తొలి టెస్టు: నవంబర్ 3-6, 2001 దక్షిణాఫ్రికాతో (బ్లూమ్‌ఫాంటెయిన్‌లో)
చివరి టెస్టు: మార్చి 2-5, 2013 ఆస్ట్రేలియాతో (హైదరాబాద్‌లో)
తొలి వన్డే: ఏప్రిల్ 1, 1999 పాకిస్తాన్‌తో (మొహాలీలో)
చివరి వన్డే: జనవరి 3, 2013 పాకిస్తాన్‌తో (కోల్‌కతాలో)
తొలి టీ20: డిసెంబర్ 1, 2006 దక్షిణాఫ్రికాతో (జోహెన్నస్‌బర్గ్‌లో)
చివరి టీ20: అక్టోబర్ 2, 2012 దక్షిణాఫ్రికాతో (కొలంబోలో)
తొలి ఫస్ట్ క్లాస్ మ్యాచ్: 1997-98 సీజన్‌లో..
చివరిది: అక్టోబర్ 15-18 2015 హర్యానా తరఫున ఢిల్లీతో

కర్జాకిన్‌కు ప్రపంచకప్ చెస్ ఛాంపియన్‌షిప్
ప్రపంచకప్ చెస్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను గ్రాండ్ మాస్టర్ సెర్గీ కర్జాకిన్ (రష్యా) గెలుచుకున్నాడు. బాకు (అజర్‌బైజాన్)లో అక్టోబరు 6న జరిగిన ఫైనల్లో పీటర్ స్విద్లెర్ (రష్యా)పై కర్జాకిన్ విజయం సాధించాడు.
టి20 సిరీస్ విజేత దక్షిణాఫ్రికాభారత్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను దక్షిణాఫ్రికా 2-0తో కైవసం చేసుకుంది. ధర్మశాల, కటక్‌లో జరిగిన మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా విజయం సాధించగా.. అక్టోబర్ 8న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్‌లో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. జేపీ డుమినికి ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కింది. సిరీస్ కోల్పోయి ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారత్ నాలుగునుంచి ఆరో స్థానానికి పడిపోగా, దక్షిణాఫ్రికా ఐదో స్థానానికి చేరింది. 
డచ్ ఓపెన్ విజేత జయరామ్అజయ్ జయరామ్ డచ్ ఓపెన్ గ్రాండ్ ప్రి టోర్నమెంట్ విజేతగా నిలిచాడు. అక్టోబరు 11న జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో రౌల్ మస్త్ (ఎస్తోనియా) పై విజయం సాధించాడు. ఈ చాంపియన్‌షిప్‌ను గతేడాది కూడా జయరామ్ దక్కించుకున్నాడు. పురుషుల డబుల్స్‌లో హైదరాబాద్ ప్లేయర్ సుమీత్ రెడ్డి తన భాగస్వామి మనూ అత్రి జోడీ ఫైనల్లో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది.
పోకెర్‌స్టార్స్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ పోకెర్‌స్టార్స్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచాడు. బ్రిటన్‌లోని ఐల్ ఆఫ్ మ్యాన్ ద్వీపంలో అక్టోబర్ 11న జరిగిన టోర్నమెంట్‌లో నైజల్ షార్ట్ (ఇంగ్లండ్)ను తొమ్మిదో రౌండ్‌లో 50 ఎత్తుల్లో డ్రాగా ముగించి టైటిల్‌ను సాధించాడు. లారెంట్, గాబ్రియెల్‌లకు వరుసగా రెండు, మూడో స్థానాల్లో నిలిచారు.
చైనా ఓపెన్ విజేత సానియా-హింగిస్ జోడిఅక్టోబర్ 10న జరిగిన చైనా ఓపెన్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టోర్నమెంట్ ఫైనల్లో టాప్ సీడ్ సానియా మీర్జా-మార్టినా హింగిస్ జంట విజయం సాధించింది. వీరు హావో చింగ్ చాన్-యుంగ్ జాన్ చాన్ (చైనీస్ తైపీ)జోడీని ఓడించి టైటిల్ సాధించింది. 
ఫిఫా చీఫ్ బ్లాటర్‌పై వేటుఫిఫా అధ్యక్షుడు సెప్ బ్లాటర్, ప్రధాన కార్యదర్శి జెరోమ్ వాల్కేతో పాటు యూఈఎఫ్‌ఏ అధ్యక్షుడు మైకేల్ ప్లాటినిలపై 90 రోజుల తాత్కాలిక నిషేధం విధించారు. వీరిపై క్రిమినల్ విచారణలో భాగంగా ఫిఫాకు చెందిన స్వతంత్ర ఎథిక్ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ప్లాటినికి గట్టిపోటీదారుగా భావిస్తున్న కొరియా బిలియనీర్ చుంగ్ మోంగ్ జూన్‌పై కూడా ఆరేళ్ల నిషేధంతో పాటు లక్షా 3 వేల డాలర్ల జరిమానా పడింది. దీంతో ఈ నలుగురు ఏరకమైన ఫుట్‌బాల్ కార్యకలాపాలను నిర్వహించడానికి వీల్లేదు.
ప్రొఫెషనల్ కెరీర్‌లో విజేందర్ తొలి గెలుపుఅమెచ్యూర్ బాక్సింగ్‌ను వదిలి ప్రొఫెషనల్ కెరీర్‌లో అడుగుపెట్టిన భారత స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్ తొలి విజయాన్ని నమోదు చేశాడు. తన ప్రొఫెషనల్ కెరీర్‌లో బరిలోకి దిగిన తొలి బౌట్‌లోనే ఈ హరియానా బాక్సర్ విజయం సాధించాడు. బ్రిటన్ బాక్సర్ సన్నీ వైటింగ్‌తో అక్టోబర్ 10న జరిగిన మిడిల్‌వెయిట్ బౌట్‌లో విజేందర్ ‘టెక్నికల్ నాకౌట్’ పద్ధతిలో జయభేరి మోగించాడు.
రష్యా గ్రాండ్ ప్రి టైటిల్ విజేత హామిల్టన్రష్యా గ్రాండ్ ప్రి ఫార్ములావన్ రేసులో మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ విజేతగా నిలిచాడు. 2015 సీజన్‌లో హామిల్టన్‌కిది తొమ్మిదో టైటిల్. మొత్తంగా హామిల్టన్ కెరీర్‌లో ఇది 42వ టైటిల్. సెబాస్టియన్ వెటెల్ (ఫెరారీ) రెండో స్థానాన్ని దక్కించుకోగా... భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’ జట్టు డ్రైవర్ సెర్గియో పెరెజ్ మూడో స్థానంలో నిలిచాడు.
భారత బాడీబిల్డర్ శ్వేత కొత్త చరిత్రఆసియా బాడీబిల్డింగ్ చాంపియన్‌షిప్‌లో పతకం సాధించిన తొలి భారతీయ మహిళా బాడీబిల్డర్‌గా శ్వేతా రాథోడ్ చరిత్ర సృష్టించింది. ముంబైకి చెందిన 25 ఏళ్ల శ్వేత ఉజ్బెకిస్తాన్‌లో జరిగిన ఈ పోటీల్లో ఫిట్‌నెస్ ఫిజిక్ విభాగంలో రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని దక్కించుకుంది. తద్వారా వచ్చే నెలలో థాయ్‌లాండ్‌లో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్‌కు అర్హత సాధించింది. ఇంజినీరింగ్ చదివిన శ్వేత ముంబైలో ఫిట్‌నెస్ ఫరెవర్ పేరుతో అకాడమీని నిర్వహిస్తోంది. 2015లో ముంబైలోనే జరిగిన ప్రపంచ బాడీబిల్డింగ్ ఫిజిక్ చాంపియన్‌షిప్‌లో శ్వేతకు కాంస్య పతకం లభించింది. 
ర్యాపిడ్ చెస్ చాంపియన్ కార్ల్‌సన్ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్ విజేతగా డిఫెండింగ్ చాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్ (నార్వే) నిలిచాడు. బెర్లిన్‌లో జరిగిన ఈ మెగా ఈవెంట్‌లో కార్ల్‌సన్ 11.5 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. గతేడాది దుబాయ్‌లో జరిగిన ప్రపంచ ర్యాపిడ్ చాంపియన్‌షిప్‌లో కూడా కార్ల్‌సన్ విజేతగా నిలిచాడు. 10.5 పాయింట్లతో ఇయాన్ నెపోమ్‌నియాచి (రష్యా), తెమౌర్ రద్జబోవ్ (అజర్‌బైజాన్) వరుసగా రజత, కాంస్య పతకాలు సాధించారు.
రొనాల్డోకు నాలుగోసారి ‘గోల్డెన్ బూట్’యూరోప్‌లో జరిగే దేశవాళీ ఫుట్‌బాల్ లీగ్‌లలో టాప్ గోల్ స్కోరర్‌గా నిలిచినందుకు... రియల్ మాడ్రిడ్ జట్టు స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో రికార్డుస్థాయిలో నాలుగోసారి ‘గోల్డెన్ బూట్’ అవార్డును అందుకున్నాడు. పోర్చుగల్ కెప్టెన్ అయిన రొనాల్డో 2014-15 స్పానిష్ లీగ్‌లో 35 మ్యాచ్‌లు ఆడి 48 గోల్స్ చేశాడు. 2007-08 సీజన్‌లో మాంచెస్టర్ యునెటైడ్ తరఫున తొలిసారి ఈ అవార్డు నెగ్గిన రొనాల్డో మిగతా మూడుసార్లు రియల్ మాడ్రిడ్ తరఫున సాధించాడు.

సానియా-హింగిస్‌లకు వుహాన్ ఓపెన్ టైటిల్సానియా మీర్జా-మార్టినా హింగిస్‌ల జోడీ వుహాన్ ఓపెన్ టైటిల్‌ను గెలుచుకుంది. ఈ జోడీ వుహాన్ (చైనా)లో అక్టోబరు 3న జరిగిన ఫైనల్లో ఇరీనా కామెలియా బెగూ-మోనికా నికెలెస్కూలను ఓడించి టైటిల్‌ను గెలుచుకుంది. వీరికి ఈ ఏడాది ఇది ఏడో టైటిల్. మహిళల సింగిల్స్ టైటిల్‌ను వీనస్ విలియమ్స్ (అమెరికా) గెలుచుకుంది.

బీసీసీఐ అధ్యక్షుడిగా శశాంక్ మనోహర్భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడిగా శశాంక్ మనోహర్ ఎన్నికయ్యారు. అక్టోబరు 5న ముంబైలో సమావేశమైన బీసీసీఐ సర్వసభ్య సమావేశం ఆయన్ను ఏకగ్రీవంగా ఎన్నుకుంది. శశాంక్ ఈ పదవిలో 2017 వరకు కొనసాగనున్నారు. గతంలో ఆయన 2008-11 మధ్య బీసీసీఐ అధ్యక్ష బాధ్యతలను నిర్వహించారు.

రోహిత్, కోహ్లి సరికొత్త రికార్డులు టి20ల్లో భారత్ తరఫున అత్యధిక స్కోర్(106 పరుగులు) చేసిన ఆటగాడిగా రోహిత్ శర్మ నిలిచాడు. అక్టోబర్ 2న హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో దక్షిణాఫ్రికాతో జరిగిన టి20 మ్యాచ్‌లో రోహిత్ ఈ ఘనత సాధించాడు. టి20ల్లో భారత్ తరఫున సెంచరీ నమోదు చేసిన రెండో ఆటగాడు రోహిత్. గతంలో రైనా (101) కూడా దక్షిణాఫ్రికాపైనే సెంచరీ చేశాడు. ఈ మ్యాచ్‌తో రోహిత్ మూడు ఫార్మాట్‌లలోనూ సెంచరీ చేసిన ఆటగాడయ్యాడు. ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన తొమ్మిదో బ్యాట్స్‌మన్. ఈ ఇన్నింగ్స్‌తో వన్డేలు, టి20ల్లోనూ అతను భారత టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. మరోవైపు టి20ల్లో 1000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి భారత ఆటగాడిగా విరాట్ కోహ్లి రికార్డులకెక్కాడు. ప్రపంచ క్రికెట్‌లో అందరికంటే తక్కువ ఇన్నింగ్స్‌లలో (27) అతను ఈ ఘనత సాధించాడు. ధర్మశాలలో జరిగిన మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో 50 టి20 మ్యాచ్‌లకు సారథ్యం వహించిన తొలి కెప్టెన్‌గా ధోనిగా నిలిచాడు.

భారత సైక్లిస్ట్ దెబోరా రికార్డు ప్రదర్శనభారత సైక్లిస్ట్ దెబోరా.. తైవాన్ కప్ ట్రాక్ ఇంటర్నేషనల్ క్లాసిక్ ఈవెంట్‌లో ఐదు పతకాలతో రికార్డు ప్రదర్శన చేసింది. మహిళల ఎలైట్ విభాగంలో స్వర్ణం, మూడు రజతాలు, ఓ కాంస్య పతకాన్ని సాధించి కొత్త చరిత్ర సృష్టించింది. దీంతో ఐదు పతకాలు సాధిం చిన తొలి భారత సైక్లిస్ట్‌గా రికార్డులకెక్కింది. మహిళల ఎలైట్ స్ప్రింట్ ఫైనల్లో దెబోరా... మలేసియా టాప్ రైడర్‌ను ఓడించి తొలి స్వర్ణాన్ని సాధించింది. కైరిన్ విభాగం, ఫొటో ఫినిష్ కాంటెస్ట్‌లో మిగిలిన పతకాలు గెలుచుకుంది.
 

No comments:

Post a Comment